For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Friday, 22 May 2026
Govindaraja Swamy
వేదఘోషల నడుమ వైభవంగా గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మే 23న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
నవదిన బ్రహ్మోత్సవాలకు తిరుపతి దివ్యక్షేత్రం ముస్తాబు
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వేదఘోషలు, మంగళవాయిద్యాలు, వైదిక మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం తదితర వైదిక కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. యాగశాలలో ప్రత్యేక పూజల అనంతరం అంకురార్పణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు :
శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆలయం పరిసరాలలో ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టారు.
మే 23న ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల తొలి రోజు అయిన మే 23న ఉదయం 07.35 గంటల నుండి 08.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, ఆలయ శుద్ధి, తోమాల సేవ, అర్చన సేవల అనంతరం ధ్వజస్తంభానికి తిరుమంజనం, పూజలు, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగనున్నాయి.
తదుపరి ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, శుద్ధి, సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
వాహనసేవల వివరాలు
24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం
26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం
28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment