For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Saturday, 8 November 2025
Tirumala Prayanam
[18/10, 9:23 AM] ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల దర్శనము 1
తిరుమల శ్రీవారి దర్శనము స్వామి ఆజ్ఞ లేనిదే మనుష్యులకు జరగదు!
మూడు నెలల ముందే అంతర్జాలంలో వీలున్న తేదిని ఎంచుకుని అర్జి పెట్టుకొని!
మూడు గంటల తరువాత గదిని తీసికొని మదిలో గోవిందునికి కృతజ్ఞతాస్తుతులు!
రెండు నెలల ముందుగానే ట్రైన్ బుక్ చేసుకుని, ఓపికగా ఎదురు చూడు భక్తులు!
రెండు రోజుల ముందే రసీదులన, బట్టలు సర్దుకుని సిద్ధం తిరుమల ప్రయాణము!
స్వస్థలం నుండి తిరుపతి చేరుకొని, కేటాయించిన గదిలో స్నానాదులు చేసుకుని!
వరాహస్వామిని దర్శించి వెంగమాంబలో నింపుకొని, వైకుంఠం కాంప్లెక్స్ కు చేరి!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష తిథి ద్వాదశి/త్రయోదశి.
[25/10, 8:16 AM]: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల దర్శనము 2
కొందరు చదువుతారు సహస్ర నామములు, అందరు ముచ్చటించుచుండ!
ఆకలిని గమనించిన స్వామి పంపుతాడు వేడి వేడి కదంబం!
ఆవురావురమని ఒకటికి నాలుగు దొన్నెల ప్రసాదం తీసికొని తింటారు!
రెండు మూడు తీసుకొన్న వాళ్ళు తిన్నా ఫరవాలేదు, ఎక్కువ చేసి పడేస్తారు!
సరే పిల్లలని క్షమిస్తాడో స్వామి, బుద్ధి చెప్తాడో తెలియదు మనకు!
పక్క కంపార్టమెంట్ తెరిచిన చప్పుడు విని, లేచి, పట్టుకొని పోయిన కాళ్లను విదిల్చి, మన దర్శనము కొరకు సన్నద్ధులౌతాము, ఎప్పుడు కరుణిస్తాడా అని ఎదురుచూస్తూ!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస శుక్ల పక్ష తిథి చవితి.
[01/11, 8:40 AM] : ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల 3
ఎట్టకేలకు ఓ అరగంటో గంట తరువాత మన కంపార్టమెంటు తెరుస్తారు!
కొందరు హుషారుగా తెరిచే ద్వారము వద్ద జయ విజయులు లా కూర్చుంటారు!
వీలుకాని, తెలియని అందరు పరుగెత్తి ముందుకు పోవడానికి ప్రయత్నిస్తారు!
మెల్ల మెల్లగా తోసుకుంటూ వెళ్లి తిరుమల నంబి ఆలయం దగ్గర వేచి చూస్తాము!
అక్కడ నుండి దేవాలయ ప్రహరి గోడకు చేసిన దేవుని బొమ్మలను చూస్తూ ఆలయ మహా ద్వారానికి చేరుకుంటాం!
అక్కడ చిన్నగా వచ్చు నీటిని కాళ్లు తడుపుకొని గడప దాటి హమ్మయ్య అనుకుంటాము!
గడప దాటగానే దేవుని చూచినట్టు కాదు, ముందుంది మొసళ్ళ పండుగ!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస శుక్ల పక్ష తిథి ఏకాదశి.
అందరికి ఉత్తానైకాదశి శుభాకాంక్షలు
[08/11, 8:16 AM] : ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల ప్రయాణము 4
కొళాయి తిప్పినప్పుడు నీరు పారునట్లుగా, జనం గడప దాటి ముందుకు పరుగెత్తుతారు!
మనం నడవకపోయినా, ప్రవాహంలో కొట్టుకు పోయినట్లుగా ముందుకు వెళ్ళి పోతాము!
వడి వడిగా మండపాలు దాటి, తులాభారం వామకంటితో చూసుకుంటూ వెళ్లాలి!
తాకలేని, పూర్తిగా చూడలేని ధ్వజస్తంభం మొక్కి, వెండి వాకిలి దగ్గర వంతు కోసం ఎదురు చూస్తూ!
గునపం చూసి అనంతాళ్వారు కష్టం ముందు మనదెంతలే అనుకుంటూ ముందుకు వెళ్తాము!
ఏ వరుసలో వెళ్లితే బాగా దర్శనమవుతుందని, చివరి వరుస ఎంచుకుంటారు కొందరు!
ఎలాగోలా జనుల వత్తిడి మధ్య కంగారుగా బంగారు వాకిలి చేరుకుంటాము!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస కృష్ణ పక్ష తిథి చవితి.
అందరికి సంకట హర చవితి శుభాకాంక్షలు.
[15/11, 9:11 AM]ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల ప్రయాణము 5
ఎంతో కష్టపడి అంతకు మించి నలిగి వచ్చిన మనలను గోవిందలు ముందుకు తోస్తారు!
స్వామివారిని ఉన్న ఏకాగ్రతనంతా పెట్టి వెళ్లుచూ వీక్షించాలి, కనులు మూయకుండ!
కొందరు భక్తులు గోవిందాయని చేయ్యెత్తి ఇతరుల వీక్షణలకు తెలియకే అడ్డుపడతారు!
శ్రీ వారి సేవకుల తోసిన కుదుపుకి జయ విజయులను దాటి లక్ష్మిదేవి బావి దగ్గరకు వస్తాము!
కొద్దిగా ఊపిరి తీసుకుని తీర్థ శఠగోపానికి యుద్ధం చేసి మండపంలో కూర్చోని వేచి!
పరకామణి లోని డబ్బుల లెక్కింపు చూసి, మనవే అన్నంత సంతోషపడి, కాదని వెళ్తాము!
గంధపు గదిని దాటి గోపురాన దేవ సమాన విమాన వేంకటేశ్వరుని దర్శించి హుండీకి!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కృష్ణ పక్ష తిథి ఏకాదశి.
అందరికి ఉత్పన్నైకాదశి శుభాకాంక్షలు.
22/11 05:44 AM ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల ప్రయాణము 6
వేదాలను పరిరక్షించు గోడలను తాకి, స్వామి తనువును తాకిన వస్త్ర పరిమళాలనూ తాకి!
రక్షకుడు లేని కూడలిలో హుండీకి వెళ్లేవారు, వచ్చేవారి కోపతాపాల గజిబిజి సంగమం!
యోగా నరసింహ స్వామిని స్మరించి శక్తి కూడగట్టుకుని స్వర్ణ తలుపులను మొక్కి వెండి వాకిలి దాటుము!
స్వామి ప్రసాదం తీసికొని ఊంజల్ మంటపంలో తిని భామల రాయలను దాటి ప్రధాన ద్వారం!
ముగిసెను తిరుమల ప్రయాణం, మిగుల కొస, లడ్డూలకై తీర్థకట్ట వీధి ఘుమఘుమల వెంట!
వర్చువల్ కళ్యాణం ఉంటే స్వామి వస్త్రములు గైకొని, మిత్ర బంధువుల లడ్డూలు తీసికొని!
ఓం నమో వేంకటేశ్వరా అని మొక్కి శీఘ్ర పునర్ దర్శన ప్రాప్తిని కోరుకొని తిరుగు ప్రయాణము!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష తిథి విదియ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment