For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Friday, 5 November 2021
Ayodhya Ramayanam - Preface
This is preface for Ramayanam. Convertion of Bukkadu to Valmiki; Curse for Vishnu and other related events. "రామ పలుకలే మరా మరాని" is makutam only. While reading without makutam one has to read, so that continuity will be clearly understood.
[17/10, 1] 908 ఆటవెలది
ఏడు సాములడిగిరే పాపములు పంచు
కొందురేమి సతియు కొడుకు బిడ్డ
కన్నవాళ్లు నీవు కనికరం లేకుండ
రామ పలుకలే మరా మరాని
[17/10, 2] 909 ఆటవెలది
నిర్భయముగ చేయు నిస్వార్థులందరి
దోపిడీ దగాల దోషమేను
బుక్కడు పరుగులిడె పూర్తిగా నొప్పక
రామ పలుకలే మరా మరాని
[17/10,3] 910 ఆటవెలది
ఎండు పుల్లలేరి వేడి నీళ్లను కాచి
పత్ని యింట వేచి పావనమయి
వండి రుచికరముగ వాంతులే చేస్కొంది
రామ పలుకలే మరా మరాని
[17/10, 4] 911 ఆటవెలది
సుఖములిచ్చెనంత సొగసు తోటి మరింక
పాపమెందుకింక పంచు కోదు
మీది మాట పచ్చి మేటి యబద్ధమే
రామ పలుకలే మరా మరాని
[17/10, 5] 912 ఆటవెలది
ఋజువు చేసెదను ఒ ఋషులార మీరంత
వోడి పోయి నాకు వూడిగములు
చేయవలెను యాలిచే పాపమొప్పించ
రామ పలుకలే మరా మరాని
[17/10, 6] 913 ఆటవెలది
మాట తీసికొని సమాన వూడిగములు
చేయ వోడినొళ్లు, చెంగునెల్లి
వచ్చెదనని, యుండవలెను మీరిక వేచి
రామ పలుకలే మరా మరాని
[17/10, 7] 914 ఆటవెలది
తండ్రి నొప్పలేదు తాను చేసిన పాప
ములను తిరిగి యిస్త ముక్క జేసి
యెంత మాత్రమొప్పుకుందువా బుక్కడు
రామ పలుకలే మరా మరాని
[17/10, 8] 915 ఆటవెలది
ఆశ తోటి చూసె యాలివంక తనైన
పంచుకుందునేమి పాపములిక
కొంత సేద తీర్చుకొన వచ్చును కదాని
రామ పలుకలే మరా మరాని
[17/10, 9] 916 ఆటవెలది
మైత్రి తోడ నువ్వు మను వాడి తెచ్చింది
సాకవలసినట్టి, సౌఖ్యమిచ్చు
బాధ్యతంత నీది భారమైనయు పాప
రామ పలుకలే మరా మరాని
[18/10, 10] 917 ఆటవెలది
తిరిగి వచ్చినాడు తీరని బాధతో
సాములోరి కాళ్లు సావధాన
ముగను పడి క్షమాపణ గనుల కన్నీళ్లు
రామ పలుకలే మరా మరాని
[18/10, 11] 918 ఆటవెలది
సప్త ఋషులు జలము చల్లిరి మంత్రంతొ
మేనులోన శక్తి మేటి గాను
కంట నీరు వచ్చె గత జన్మ గుర్తుకు
రామ పలుకలే మరా మరాని
[18/10, 12] : 919 ఆటవెలది
రుణము తీర్చ ఋషులు రుద్రాక్ష మాల క
మండలమును యోగ దండ నిచ్చి
దీవెనలు మహర్షి దివ్య మంత్రం రామ
రామ పలుకలే మరా మరాని
[18/10, 13] : 920 ఆటవెలది
రామ మంత్రమంటె రమ్మని శుభములు
హీన బుక్కడాయె హీర మెరుపు
ప్రతిన బూనమనిరి ప్రతిలోమమున చెప్పి
రామ పలుకలే మరా మరాని
[18/10, 14] : 921 ఆటవెలది
ధీర ఆత్మ శక్తి తిథి వార నక్షత్ర
పట్టుదలన మూర్ఖ పరమ బలము
మనిషికింక మంత్ర మనసులే సాధించ
రామ పలుకలే మరా మరాని
[18/10, 15] : 922 ఆటవెలది
నిత్య మనన చేయు నీ మంత్రమే రక్ష
మంత్ర శక్తి వల్ల మనసు లగ్న
మై వదలని పట్టు దేవతాంగనలింక
రామ పలుకలే మరా మరాని
[18/10, 16] : 923 ఆటవెలది
భగ్న పరచ చూడ బల ప్రయత్నమిఫల
మాయె, గాలి భుక్తి, మనసు నిగ్ర
హించి, తన తపస్సు, వంచి యింద్రియములే
రామ పలుకలే మరా మరాని
[18/10, 17] : 924 ఆటవెలది
సద్దు చేయకుండ సంవత్సరాలు గ
డిచెను బండ మీద కూచొనిక స
మాధిలోన పుట్ట పొదలు వెదురు మొల్చి
రామ పలుకలే మరా మరాని
[19/10, 18] : 925 ఆటవెలది
తీర్థయాత్రకెల్లి తిరిగి వచ్చిన మహ
ర్షులకు పుట్టలో మరా ల శబ్ద
ము విని అచ్చెరువున మును లింక మౌనులై
రామ పలుకలే మరా మరాని
[19/10, 19] : 926 ఆటవెలది
వరుణ ధ్యానములతొ వర్షము కురిపించి
పుట్ట కరిగి చిలుక పురుగు నుండి
వచ్చె, పిలిచిరంత వాల్మీకి తన్మయ
రామ పలుకలే మరా మరాని
[19/10, 20] : 927 ఆటవెలది
కల్మషంబు లోన కమలంబు పుట్టెనా
జాతి గర్వమొందె జన్మ సార్థ(క)
మట్టి నుండి తీసి(న) మాణిక్యమువలెనో
రామ పలుకలే మరా మరాని
[19/10, 21] : 928 ఆటవెలది
పాప ముక్తి పొంది పావనుడైనావు
బ్రహ్మ వచ్చి నీకు ప్రవచలిచ్చు
నామ రామ హరి, పునర్జన్మ వాల్మీకి
రామ పలుకలే మరా మరాని
[19/10, 22] : 929 ఆటవెలది
ఆశ మోహమీడి ఆశ్రమమేర్పర్చి
వచ్చి పోవు ఋషుల వసతి చూస్తు
సాత్వికముగ మారి సరయూనదీ తీర
రామ పలుకలే మరా మరాని
[19/10, 23] : 930 ఆటవెలది
పరమ పూజ్య విష్ణు ప్రత్యక్ష మాయెను
సంభ్రమమున మ్రొక్కి సాగిలపడి
వాగు కట్ట త్రుంచి వాల్మీకి చేరువై
రామ పలుకలే మరా మరాని
[19/10, 24] : 931 ఆటవెలది
నంత సంతసించి నారాయణుడు స్తుతి
బ్రహ్మ నింక పిలిచి పరమ వరము
లిచ్చి విద్య జ్ఞానమిచ్చి కోరి మరింత
రామ పలుకలే మరా మరాని
[20/10, 25 AM] : 932 ఆటవెలది
వరము కోరుమన్న వాల్మీకి, నామము
కన్న మిన్న ఏది కాన నామ
స్మరణ మారు మ్రోగు వరములివ్వుము స్వామి
రామ పలుకలే మరా మరాని
[20/10, 26] : 933 ఆటవెలది
గురువు స్థానముండి గుణగానములు చేయ
దివ్య జ్ఞాన విద్య ధీటుగాను
సాధనకు మహా ప్రసాదించు ధేనువై
రామ పలుకలే మరా మరాని
[20/10, 27] : 934 ఆటవెలది
నీవు కోరినట్లు నీకు వరములిస్త
యాగ ఫలముగాను యౌతకముల
రాజు దశరథునికి రాముడై జన్మించ
రామ పలుకలే మరా మరాని
[20/10, 28] : 935 ఆటవెలది
రచన చేయు నీవు రామాయణం రస
రమ్యమైన కావ్య గమ్యమింక
నీవు రాసి నట్లు నిజమౌను అవతార
రామ పలుకలే మరా మరాని
[20/10, 29] : 936 ఆటవెలది
సరళ దేవ భాష సకల జనామోద
లోన రాసెనింక లోక శ్లోక
భువన మెరిగి కాల భూత భవిష్యత్తు
రామ పలుకలే మరా మరాని
[20/10, 30] : 937 ఆటవెలది
శోకమాయెనింక శ్లోకమేను కిరాత
కుడొక బాణమేసి గుచ్చి చంప
రాసె శ్లోకమక్షరములు ముప్పై రెండు
రామ పలుకలే మరా మరాని
[20/10, 31] : 938 ఆటవెలది
రాజు దైవ సమము రాజాజ్ఞ బద్ధులై
వుండు వారు జనము గుండె లోన
ముద్ర వేసుకున్న మునులు నాటి ప్రజలు
రామ పలుకలే మరా మరాని
[20/10, 32] : 939 ఆటవెలది
కల్మషమెరగనిది కాకుత్స వంశపు
మూల పురుషుడింక మోక్ష సూర్య
రాముడంత రాజు రాడింక జగతిలో
రామ పలుకలే మరా మరాని
[21/10, 33] : 940 ఆటవెలది
ఆర్య మూల స్తంభ రాముడు తెచ్చెను
కీర్తి వైభవాన్ని కిటుకులేని
శ్రమతొ తెచ్చినట్టి సత్పురుషులు సూర్య
రామ పలుకలే మరా మరాని
[21/10, 34] : 941 ఆటవెలది
ఎంత మంది రాజ్య మేలినా, పాలన
రామ రాజ్యమేను ప్రజల పక్ష
మందు సాగె నింక మంగళకరమౌను
రామ పలుకలే మరా మరాని
[21/10, 35] : 942 ఆటవెలది
ఇన్ని వేల యేండ్లు ఇలవేల్పు లేడింక
గూడు కట్టి మనసు గుడి చెరగని
పచ్చబొట్టు గాను పదిలముగా నుండె
రామ పలుకలే మరా మరాని
[21/10, 36] : 943 ఆటవెలది
భజన పాటలెన్ని పాడించుకుంటున్న
నేటిమానవులకు మేటి, నిరుప
మానమైన త్యాగమందు దేవుడు సరా?
రామ పలుకలే మరా మరాని
[21/10, 37] : 944 ఆటవెలది
వాలివధను చేసి వానర సైన్యము
తోటి సేతువింక దూరమైన
సీత కోసమెంత చితికి పరితపించె
రామ పలుకలే మరా మరాని
[21/10, 38] : 945 ఆటవెలది
బ్రహ్మ హత్య చేసి ప్రాణ సఖిని పొంది
నట్టి సీతకెందుకట్టి శిక్ష
తాను వేసికొనెను ధర్మము కొరకేను
రామ పలుకలే మరా మరాని
[21/10, 39] : 946 ఆటవెలది
భారతీయ ప్రజల భావము కెందుకు
స్పందనిచ్చి మనసు నొంది వదల
ప్రజల స్పందనలకు ప్రభువు మర్యాదలా
రామ పలుకలే మరా మరాని
[21/10, 40] : 947 ఆటవెలది
ప్రజలను భయపెట్ట భగవంతుడెవరికి
శక్తి బలములున్న సార్వభౌమ
డెందుకు తలవంచి డీలాపడి వదల
రామ పలుకలే మరా మరాని
[21/10, 41] : 948 ఆటవెలది
స్థిత చరిత్ర ధీర చిత్తశుద్ధి గల పా
లకుడు కీర్తి విజయముకు సుగుణము
లకును మారుపేరు లాగను వాల్మీకి
రామ పలుకలే మరా మరాని
[22/10, 42] : 949 ఆటవెలది
ఆదరించుట మన అభినందనలు తెల్ప
దేవుడిచ్చె మనకు దివ్య తరుణ
రాసెనిక మహర్షి రమణీయ వాల్మీకి
రామ పలుకలే మరా మరాని
[22/10, 43] : 950 ఆటవెలది
కర్కతత్వమీడి కరుణవైపుకు జ్ఞాన
ధర్మ మార్గములను దానవులకు
చీకటినిక తరిమి చిగురించు వెలుగుకై
రామ పలుకలే మరా మరాని
[22/10, 44] : 951 ఆటవెలది
రామ భక్తి లోని రమణీయతత్వమం
దరు నెరగ గలరు ముదావహమున
నేటి యువతరం కని చవి చూపించరే
రామ పలుకలే మరా మరాని
[22/10, 45] : 952 ఆటవెలది
ఇంద్ర లోకమందు సిరి యవ్వనములార
చైత్ర మాస ఋతువు చర వసంత
సంధి సమయ మింక శ్రవణ సాయంకాల
రామ పలుకలే మరా మరాని
[22/10, 46] : 953 ఆటవెలది
ఊర్వశి రస రంభ ఉర్రూతలూగించు
మేనకలు దివిన సమీకృత పద
నాట్యమాడుచుండ నయన విచిలితమై
రామ పలుకలే మరా మరాని
[23/10, 47] : 954 ఆటవెలది
అప్సరసల నృత్య బ్రహ్మ మానస పుత్రు
లోకరుప్రచేతన ఋషికింక
రివ్వునస్కలించ రేతస్సు పుట్టెను
రామ పలుకలే మరా మరాని
[23/10, 48] : 955 ఆటవెలది
దైవమాయయో సతత నవ యువకుడు
ఇంద్ర సభన విస్మయంబు చెంది
గొల్లు మనిరి నవ్వి గోల చేసిరి గేలి
రామ పలుకలే మరా మరాని
[23/10, 49] : 956 ఆటవెలది
చేయ సిగ్గుతో ప్రచేతన కోపము
తెచ్చికొనెను తండ్రి దీన స్థితిన
యాకలన్న కొడుకు యాతన చెందగా
రామ పలుకలే మరా మరాని
[23/10, 50] : 957 ఆటవెలది
కోపమునవమాన గురిచేస్తివి కదరా
తిట్టి శాపమిచ్చి తినుటకింత
లేక దారిదొంగిలించి తిని బతుకు
రామ పలుకలే మరా మరాని
[23/10, 51] : 958 ఆటవెలది
ఏల తండ్రి నాకు యింతటి శాపము
కన్నబిడ్డకింత కడుపు నింప
మని నెవరిని యడుగ, కనికరమేదింక?
రామ పలుకలే మరా మరాని
[24/10, 52] : 959 ఆటవెలది
నాకు ఏల శాప నా తప్పులేమిటి
పక్షులు పశువులకు బాగు చూడ
తెలిసినంత ఓర్పు తెలియదా బిడ్డలన్
రామ పలుకలే మరా మరాని
[24/10, 53] : 960 ఆటవెలది
తాను చేసినట్టి తప్పు తెలిసినది
గేలిచేసి నట్టి తేలి స్వర్గ
వాసులంత కలత, వైఖరి మారెను
రామ పలుకలే మరా మరాని
[24/10, 54] : 961 ఆటవెలది
దుఃఖము వలదింక దోహదం విధి శాప
ఋషుల జ్ఞానబోధ, కృషికి నీవు
దివ్య జీవితమున దీవించి శాంతించ
రామ పలుకలే మరా మరాని
[24/10, 55] : 962 ఆటవెలది
నమ్ము నీవు పొందు నారాయణుని దర్శ
నము మహర్షివై మనస్సు శాంతి
తో జగత్తు లోన దూతవై దేవుని
రామ పలుకలే మరా మరాని
[25/10, 56] : 963 ఆటవెలది
నారదమునినడిగె నైతిక విలువలు,
ధర్మశాస్త్ర విద్య, ధైర్యశాలి
సర్వశక్తి వీరుడెవ్వరు, వాల్మీకి
రామ పలుకలే మరా మరాని
[25/10, 57] : 964 ఆటవెలది
నారదముని పలికె కారణ జన్ముడై
యవతరించినట్టి యా మహాను
భావుడు మరి రామ భద్రుడే సర్వము
రామ పలుకలే మరా మరాని
[25/10, 58] : 965 ఆటవెలది
రామ గుణగణాల రామాయణ కథను
తెలిపి నారదముని తిరిగి వెడలె
బ్రహ్మ లోకమునకు భావము నిండిన
రామ పలుకలే మరా మరాని
[25/10, 59] : 966 ఆటవెలది
లోకముకు విధాత శ్లోక విధాత వా
ల్మీకి వేద సమము లిఖితము రస
రమ్యమైన కావ్య రామాయణం కదా
రామ పలుకలే మరా మరాని
[25/10, 60] : 967 ఆటవెలది
క్రౌంచ పక్షుల నొక క్రౌర్యముగను చంపి
శోకమందు వచ్చె శ్లోకమే కి
రాతకుడునడిగెను రవ్వంతయు న జాలి
రామ పలుకలే మరా మరాని
[25/10, 61] : 968 ఆటవెలది
మానసిక స్థితి కని మాట్లాడె బ్రహ్మ వా
ల్మీకి రామ చరిత లిఖిత కావ్య
స్వర్గ పర్వత నది శాశ్వత కీర్తిలా
రామ పలుకలే మరా మరాని
[25/10, 62] : 969 ఆటవెలది
అంకురార్పణ తన యావత్తు శక్తిని
ప్రేరణొంది రాసె ప్రియముగాను
బ్రహ్మ వాక్కులు విని ప్రారంభపు రచన
రామ పలుకలే మరా మరాని
[26/10, 63] : 970 ఆటవెలది
బాహ్య మందు రామభద్ర సీతా కథ
రావణవధ లాగ రాచినయెడ
కనపడేను బ్రహ్మ కథ, మనస్సు విజయం
రామ పలుకలే మరా మరాని
[26/10, 64] : 971 ఆటవెలది
మర్మమెరిగి పఠన ధర్మ సాయుజ్యము
ధర్మ శీలురై యధర్మ మింక
తోటి మనుషలందు తోడు నీడగనుండు
రామ పలుకలే మరా మరాని
[26/10, 65] : 972 ఆటవెలది
మిత్ర భ్రాతృ ధర్మమే తాను పాటించి
పుత్ర శిష్య భర్తృ శత్రు ధర్మ
ములను చెప్పె లోకమునకు జీవితములో
రామ పలుకలే మరా మరాని
[26/10, 66] : 973 ఆటవెలది
కావ్య మగుటయేను కాదు ధర్మము తెల్పు
మంచి గ్రంథమేను మార్గదర్శి
స్త్రీ పురుషులకింక సీత రాముల కథ
రామ పలుకలే మరా మరాని
[26/10, 67] : 974 ఆటవెలది
ధర్మ అర్థ కామ్య ధర్మమే మూలము
ధర్మబద్ధమవని ధనము కామ
ములు అనర్థహేతువులు మానవాళికి
రామ పలుకలే మరా మరాని
[26/10, 68] : 975 ఆటవెలది
కార్య ధర్మమవని కైక రాజ్యము కోర్కె
నవ్వులగు భరతుడికివ్వ చూడ
కామ రావణుండు కాష్ఠమాయే లంక
రామ పలుకలే మరా మరాని
[27/10] :
సూర్య వంశంలో ఇక్ష్వాకు మహారాజు ప్రసిద్ధి
అందుకే ఇక్ష్వాకు వంశమనే పేరూ వచ్చినది
వివస్వంతుడు మూల పురుషుడు రెండవ
రాజు వైవస్వత మనువు పేరున మన యుగ
వైవస్వత పుత్రుడు ఇక్ష్వాకుడు కాక తొమ్మిది
పుత్రులున్నారు. ఇక్ష్వాకు నూరు పుత్రులు
ఇక్ష్వాకు పుత్రులలో నొకరు వికుక్షి, వశిష్ట ఋషి
అనుగ్రహము చే రాజ్యాధికారమన వచ్చింది
కుమారుడు అయోధునకు కకుస్థుడు జన్మించ
పుత్రుడు కువలాశ్వుని పుత్రులలో దృడాశ్వునికి
హర్యశ్వుడు, ఇతని మనుమడు సంహతాశ్వుడు
మనుమడే మాంధాత. ఈతనికి పురుకుత్సుడు
[28/10] :
పురుకుత్సునికి త్రయ్యారుణి పుత్రుడు,
సత్యవ్రతుడను పుత్రుడే త్కిశంకు
స్వర్గం సృష్టించెను నడుమ విశ్వామిత్రుడు
తన తపఃశక్తినంతా ధారపోసి నిలిచె
శంకు పుత్రుడు హరిశ్చంద్రుడు సత్య దీక్షకు
మారుపేరు, ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకంజ
వేయలేదు, ఎన్ని కఠిన పరీక్ష లనైనా వెరవలే
కుమారుడు లోహితుని పుత్రుడు బాహువు
బాహువు కుమారుడు సగరుడు ధర్మమును
నిలబెట్టినాడు, 66 వేలమంది పెద్ద భార్యకు
వంశోద్ధారకుడొక పుత్రుడు చిన్న భార్య
ఔర్య మహా మునిని కోరుకున్నది
యాగాశ్వం వెంట 66 వేల పుత్రులనంపెను
వారు అశ్వమును వెదుకుతూ పాతాళ లోకం
తవ్వుకుంటు చేరి కపిలముని శాప భస్మమైరి.
తవ్విన ఏర్పడిన సముద్రం సాగర మని ప్రసిద్ధి
పంచజనుడు చక్రవర్తి పుత్రుడు దిలీపునిపుత్ర
భగీరథడు గంగ మ్మను ఈశ్వరుడిని మెప్పించి
భువికి తెప్పించి. ఇప్పటికి గట్టి ప్రయత్నాన్ని
భగీరథ ప్రయత్నం. మునిమనువడంబరీషు
అంబరీషుని మునిమనవడు రఘువు ఇతని
పేరిట రఘువంశం, రఘువు కుమారుడు అజ
మహారాజు కుమారులు సురభ దశరథులు
పుత్రకామేష్టి యాగంవలన రామలక్ష్మణులు
భరత శతృఘ్నులు. రామ పుత్రులు లవకుశ
[28/10, 69] : 976 ఆటవెలది
ఆరువందలేళ్లు పరిపాలనను చేసి
నాడు రాముడు మరణము వరకును
ధర్మ మైన జీవితాన్ని రామోవిగ్ర
రామ పలుకలే మరా మరాని
[28/10, 70] : 977 ఆటవెలది
భారతీయ జనుల భావమై గుండెలో
నిలిచినాడు బ్రతికి నేటి కింక
వేల వత్సరాల కాలము గడిచినా
రామ పలుకలే మరా మరాని
[28/10, 71] : 978 ఆటవెలది
శిక్షణకిరువురు వశిష్ట విశ్వామిత్ర
ఋషుల దీక్ష గురువు కృషియు రామ
కులగురువొకరు, సమకూర్చు అస్త్రములొకర్
రామ పలుకలే మరా మరాని
[29/10, 72 AM] : 979 ఆటవెలది
భరతభూమినేల పాలించ రాజులెం
దరు చరిత్ర లోన, ధర్మ పక్ష
ప్రజల వ్యక్తి గాను ప్రభువు ప్రజా రాజు
రామ పలుకలే మరా మరాని
[29/10, 73] : 980 ఆటవెలది
న్యాయ మందిరమున నవ్య రీతిన పెద్ద
గంట కొట్టి, రాజు కడకు రాత్రి
వేళ లైన న్యాయము లభించు ప్రజలకు
రామ పలుకలే మరా మరాని
[29/10, 74] : 981 ఆటవెలది
రామ రాజ్యమందు రాదు కష్టాలు లే
వింక దొంగతనము, పీడ ప్రకృతి,
యాకలన్న పదము, యవినీతి యుండదు
రామ పలుకలే మరా మరాని
[29/10, 75] : 982 ఆటవెలది
ధర్మదేవతుంటు దారి తప్పించు యా
లోచన, పశు పక్షులు భయపడక
రామరాజ్యమంటె రావధర్మపు చింత
రామ పలుకలే మరా మరాని
[29/10, 76] : 983 ఆటవెలది
భయములేదు ప్రజలు బలవంతుల యెడల,
పన్ను లింక కట్టువారు జనులు,
ధనము కన్న భయము ధర్మానికొక్కటే
రామ పలుకలే మరా మరాని
[30/10, 77] : 984 ఆటవెలది
ప్రజల బాధ తీర్చ రాముని భాద్యత
కంటన తడి పెట్టె కమల రామ
ప్రజల కష్టము కని, పగలు రేయనకను
రామ పలుకలే మరా మరాని
[30/10, 78] : 985 ఆటవెలది
ఏడ్చిరి ప్రజలేల యెక్కువగా వారు
దలచిరింక రాజు తమకు స్వంత
వారిగా అయోధ్య వాసులు కన్నీరు
రామ పలుకలే మరా మరాని
[30/10, 79] : 986 ఆటవెలది
సీమయంత బాధ సీతా పరిత్యాగ
ము ప్రజల కొరకేను, మూడు పూట
లింక వెలగలేదు యింట పొయ్యి, తెలిసి
రామ పలుకలే మరా మరాని
[30/10, 80] : 987 ఆటవెలది
గూఢచారి భద్ర కుమిలి చెప్పిన మాట
లు విని కుప్పకూలిరి విపరీత
మైన బాధ నొంది మౌనులై శివశివా
రామ పలుకలే మరా మరాని
[30/10, 81] : 988 ఆటవెలది
తల్లడిల్లి పోయి తాను భార్య విమోహి
ముద్రపడు, దిలీప మున్నగు రఘు
సత్పురుష కకుత్స సత్కీర్తికే మచ్చ
రామ పలుకలే మరా మరాని
[30/10, 82] : 989 ఆటవెలది
తనయుడు చనిపోడు తండ్రుండగా యధ
ర్మములు జరుగుతుంది బ్రహ్మ హత్య
పాతకములు చుట్టు పాడె తెచ్చి యడుగా
రామ పలుకలే మరా మరాని
[30/10, 83] : 990 ఆటవెలది
ప్రాణ త్యాగమంటె పాపమే విప్రోత్త
మా మరణపు కారణము తెలుసుకు
ని బతికించెదనిక నేను ప్రాణము పోసి
రామ పలుకలే మరా మరాని
[02/11, 84] : 991 ఆటవెలది
తాను చెప్పలేదు తనను పూజింపుము
దేవుడనని కాని దివ్య కార్య
ములను చేసి రామ మూర్తిభవుండాయె
రామ పలుకలే మరా మరాని
[02/11, 85] : 992 ఆటవెలది
ప్రజలను సరి చూడు రాజు ప్రత్యక్ష దై
వమని సృతులు శాస్త్ర వాక్కు సుపరి
పాలనందజేయు ప్రభువు దేవుడవును
రామ పలుకలే మరా మరాని
[02/11, 86] : 993 ఆటవెలది
నీతి ధర్మ సత్య నిష్ఠ పరాయణ
త్యాగ దీక్ష కలడు తపము చేసి
శిష్ట రక్షణ మరి దుష్ట శిక్షణ జేసి
రామ పలుకలే మరా మరాని
[02/11, 87] : 994 ఆటవెలది
మనిషి రూపమందు మాధవుడే తీర్పు
కష్టము మరి దైవకార్యమంటు
ధనము కాక పోవు ధర్మ సహాయము
రామ పలుకలే మరా మరాని
[02/11, 88] : 995 ఆటవెలది
గ్రామమేది కాని రామ మందిరముండు
చిన్న పెద్దగ యని కన్న వార్ల
పేర్లు రామనామ ప్రేమ నిండిన మంత్ర
రామ పలుకలే మరా మరాని
[02/11, 89] : 996 ఆటవెలది
మగువలకును పేర్లు మగవాళ్ళకే కాదు
స్త్రీలు కూడి పెట్టు సేదదీరి
రాములమ్మ సీత రామక్క రామమ్మ
రామ పలుకలే మరా మరాని
[02/11, 90] : 997 ఆటవెలది
నాకు కావలెనని నారద పర్వతు
లిద్దరు కపిగాను లీల విష్ణు
శ్రీమతి మనువాడె శివ పురాణం చెప్పె
రామ పలుకలే మరా మరాని
[02/11, 91] : 998 ఆటవెలది
మోసపోయి కోపమున శాపమిచ్చిరి
విష్ణువు వశమైంది వేదన పడి
మానవాంశ యందు మదనపడు వియోగ
రామ పలుకలే మరా మరాని
[02/11, 92] : 999 ఆటవెలది
సహజ ప్రేమతోటి సానుకూలత చూపి
రాక్షసులకు చోటు రమ్మని దితి
విష్ణు తాకిడికిను విలవిలలాడించ
రామ పలుకలే మరా మరాని
[03/11, 93] : 1000 ఆటవెలది
దితిని చంపి విష్ణు దిక్కులెల్ల పరుగు
లిడిన రాక్షసులను లేశమైన
వదలక హతము సమవర్థిలా చెలరేగి
రామ పలుకలే మరా మరాని
[03/11, 94] : 1001 ఆటవెలది
దితి మరణము చూసి దీనమై నాశ్రమం
శాపమిచ్చె భృగువు కోప దుఃఖ
భావమనుభవించు భార్య వియోగం కు
రామ పలుకలే మరా మరాని
[03/11, 95] : 1002 ఆటవెలది
శంఖచూడుడు జయ మింక బ్రహ్మ వరము
వల్ల కష్టమాయె భార్య తులసి
దీక్ష కఠినమౌ పతివ్రతాధర్మము
రామ పలుకలే మరా మరాని
[03/11, 96] : 1003 ఆటవెలది
ఇంద్రుడోడి పోయి శివ కుమారస్వామి
తెలుసు కొనిరి బలము తులసి వ్రత మ
హాత్మ్యము వలనంత యజ్ఞము వలె శక్తి
రామ పలుకలే మరా మరాని
[03/11, 97] : 1004 ఆటవెలది
మారువేషమేసి మరులు గొల్చి రతిలో
పాల్గొనింక భంగపరచె విష్ణు
శంభుచేతనోడి శంఖచూడుడు హతం
రామ పలుకలే మరా మరాని
[03/11, 98] : 1005 ఆటవెలది
భర్త మరణవార్త భ్రాంతి చెంది తులసి
శాపమిచ్చె తాను సర్వ దుఃఖ
భరిత బాధ భార్య దూరము నీకునూ
రామ పలుకలే మరా మరాని
[04/11, 99] : 1006 ఆటవెలది
శివుడు తెలియ చెప్పె నీవు కోరిన విధం
గాను విష్ణువు పతిగా, తులసికి
శాపమింక రామ శాలవతారము
రామ పలుకలే మరా మరాని
[04/11, 100] : 1007 ఆటవెలది
ఇన్ని శాపములకు శ్రీరామ పరి త్యాగ
సీత మానవులకు జ్ఞాత ధర్మ
ము తెలియుట కొరకును ముక్కలాయె మనసు
రామ పలుకలే మరా మరాని
[4/11, 101] 1008 ఆటవెలది
రాక్షసులను చంప రాముడు దేవుడా?
మనిషి పుట్టుకలకు మన చరిత్ర
మనుగడ పెరుగు భవ మానవుడై పుట్టె
రామ పలుకలే మరా మరాని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment