Saturday, 10 October 2020

మల్లినాథసూరి కళాపీఠం YP 04-10-20 to 10102020

 04/10/20, 6:47 am - Anjali Indluri: *మల్లినాథసూరి* *కళాపీఠం ఏడుపాయల(YP)* 


    🌈 *సప్తవర్ణముల సింగిడి* 🌈


*అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో*.....


 *హృదయస్పందనలు* *కవులవర్ణనలు* 


  *04.10.2020 ఆదివారం* 


             *అంశం :*

      *" శిథిలాలయాలు"* 


 *నిర్వహణ : అంజలి* *ఇండ్లూరి* 


 *ఉరకలేసే ఉత్సాహంతో* *కవన* *క్రతువులో మీదైన* *కవనంతో  పాల్గొనండి* 


 ( *పద్యం/ వచనం/ గేయం)* *తమ రచనలతో*


 *రచనలకు గడువు*

💥💥💥💥💥💥💥

 *ఉదయం 6 గంటల నుండీ* *రాత్రి 9 గంటల* *వరకు స్పందించగలరు*

04/10/20, 6:55 am - +91 81062 04412: *మల్లినాథసూరికళాపీఠం* ఏడుపాయల(YP)* 

*సప్తవర్ణముల సింగిడి*

*అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో*..... *హృదయస్పందనలు-కవులవర్ణనలు* 

  *04.10.2020 ఆదివారం* 

*అంశం :శిథిలాలయాలు"* 

 *నిర్వహణ:అంజలిఇండ్లూరి గారు* 

 *ప్రక్రియ: వచన కవిత*  

*శీర్షిక:: నీవే కాపాడమ్మా...*

                  *****************

కళ్ళు లేని కబోదుల రాజ్యంలో....మాటు వేసిన గుంటనక్కలు తైతక్కలాడుతున్నాయి

అన్నెం పున్నెం తెలియని అమాయక మొగ్గల ఉసురు తీసుకుంటున్నాయి...  


మానవత్వం మంటలో మాడి మసై పోతుంటే

కులాల ఉమ్ములో తెగ తన్నుకు చస్తున్నాయి.

వంచనతో లేత పుష్పాల ఊపిరి తీసేస్తుంటే

మతాల మలంలోపడి తీరిగ్గా దొర్లుతున్నాయి


పసిమొగ్గల ఉసురుతీస్తూ కకావికాలం చేస్తుంటే...

రాజకీయరంకులలో రంజుగా బొంకుతున్నాయి

మానవ మృగాలు పట్టపగలే స్వైర విహారం చేస్తుంటే... 

వర్గాల మత్తులో జోరుగా ఊరేగుతున్నాయి... 


కమ్ముకున్న చీకటిలో గుడ్డి వాడిలా.... ముసురుకున్న మత్తులో మౌన మునిలా...

ఓట్ల లెక్కతో పబ్బం గడుస్తూ...

పల్లికిలించి తెల్లముఖం వేస్తున్నాయి...


మంచితనాన్ని మాయం చేసి... 

పసితనంతో ఆడుకుంటున్న నరరూప

రాక్షసుల పీకలు తెగ్గొట్టక... 

చేతకాని దద్దమ్మలా చోద్యం చూస్తున్నాయి...


ఓ.... నా అర్ధరాత్రి స్వతంత్రమా!!

మొద్దునిద్ర నటిస్తున్న సౌభాగ్యమా...

ఇకనైనా లేవమ్మా...కళ్ళు తెరిచి చూడమ్మా...

పొగరుపట్టిన మదగజాలకు ముకుతాడు వేయమ్మా....


కనిపించే ప్రతి పువ్వును నలిపేసే అందత్వం  తొలగించమ్మా...

దారితప్పిన దుష్ట మూక అంగం తెగ్గొట్టమ్మా...

రాలుతున్న పువ్వులకు అండనీవు ఉండమ్మా

భద్రత గుప్పిట తెరిచి జర భద్రం చూపమ్మా...


మనిషితనం విలువ తెలిపి మంచిగుణపు పరిమళాలు పెంపొందించమ్మా...

మనసులోని శిథిలాలయాల్ని మార్చివేసి మానవత్వపు సుగుణాలు నేర్పమ్మా...

****************************                                                  

*కాళంరాజు.వేణుగోపాల్  (మేఘమాల)*    

*మార్కాపురం. ప్రకాశం 8106204412*

04/10/20, 7:21 am - +91 96038 56152: కాళంరాజు వారూ.. 

ప్రశ్నలా..!!?  జవాబులా...!!?  సంజాయిషీ.. లేని అంతర్మథనాన్ని.. అక్షరీకరించి 

ఎక్కడెక్కడో చురకలు పెట్టి వాస్తవాన్ని.. 

నాగరికత పేరుతో మనల్ని మనం మరిచిపోతున్నాం.. మానవతను మంటగలిపేస్తున్నాం.. 

నేటి వాస్తవ సమాజరుగ్మతకు... 

సరైన న్యాయం జరగడంలేదు.. 

మార్పు ఎవర్నుంచోకాదు.. ప్రతిఒక్కరినుంచీ ఆశిద్దాం 

మీ రన్నట్టు 

*మనిషితనం విలువతెలిపి... 

మానవతాపరిమళాల్ని నింపుకొని... మనసులోని శిథిలాలయాల్ని  సమతా మమతల మందిరాలుగా మార్చేద్దాం.. 

సందేశాత్మకమైన మీకవనం 

అంశానికి ఆరంభం.. 

భళా.. వేణుగోపాలా.. 

భళా కవివరా... 

జయోస్తు 

అభినందనలు 💐💐💐🙏🙏🙏👏👏👏🌈✍️✍️

     *వి'త్రయ' శర్మ*

04/10/20, 8:27 am - +91 73493 92037: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగడి

4-10-2020

అంశం :శిథిలాలయాలు

నిర్వాహణ :దృశ్య చక్రవర్తి గారు,అంజలి  ఇండ్లూరి గారు

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

           మదిలో బాధ

         -----------------------

ఎందరో మహానుభావులు

అందరూ భరత భూమిని

కష్టించి రక్షించి సంరక్షించి

భారతమాతకు ప్రాణం పోస్తే

ఆహాహా....నేడు ఎందరో మరెందరో

కంస రావణాసుర తుగ్లక్కులై పుట్టుకొచ్చారు

స్వార్థంతో నికృష్టులై పిచ్చిపట్టి

భారతిని మూగబాధ కల్పిస్తున్నారు

దేశద వెన్నుముక రైతన్నను

వెన్ను విరిచి ఫుట్ బాలు ఆటలతో

ఆడించి ఏడిపించి అన్నదాతకు

అష్టకష్టాలు చేసి బలి కొంటున్నారు.

ఆ...గోడులు విని ఆదుకొని ఆదరించే

మరో గాంధీ లాల్ బహుదూరు పుట్టి

జ్ఞానద కాంతులు చిమ్మి సంస్కరించాలి

ప్రామాణికత్వం నిష్ఠ నిజాయతీ

అయ్యోఅయ్యో....రామరామ అడుగంటాయి

కష్ట కార్పణ్యాలు నేడు పెరిగి పోయేయి

మనిషిలో మానవత్వం ప్రేమ కరుణ కరువైనవి

డబ్బు...డబ్బు అహర్నిశలు గోలగోల

ఎన్ని గోనెసంచులు నింపుకున్నా తీరని దాహం

వంచన మోసపు సంచులు పెరిగి పెరిగేయి

బీదలకు బాధలు రోదనలు కన్నీరు మిగిలింది

కష్టాలు మోయలేక ఆత్మార్పణలు

సత్యం శివం సుందరం సూత్రాలు అర్ధం నేర్వండి

లేదా! అందరూ ఆనందించిలా....ఏలిక సాగించండి

అందమైన రామరాజ్యం మళ్ళీ కట్టండి

ఈ జగత్తు కలియుగంలో సాగరగర్భాన కలిసిపోకుండా

కాపాడండి 

బడాయి బకాసురులను బలి చక్రవర్తులై అణచి

ముందుకొచ్చి రక్త తిలకం తీర్చిదిద్దండి!

04/10/20, 8:27 am - Trivikrama Sharma: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

అంశం:  శిథిల ఆలయాలు

నిర్వహణ: అంజలి ఇండ్లూరు గారు

పేరు:.  త్రివిక్రమ శర్మ

ఊరు:  సిద్దిపేట

శీర్షిక:.  శిథిల దేవాలయం  పతన సంస్కృతి


"""""""""""""""""""""""""""""""""""""

పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మను స్వ,స్వరూపంలో పూజించేందుకు పరమ భక్తి భావనతో పరమోత్కృష్ట దీక్ష,దక్షలతో మనసే మంత్రపుష్పమై అకుంఠిత శ్రమ శిల్ప కళా చాతుర్యం

మూర్తిభవించినభక్తిభావనలతో రూపుదిద్దుకున్నాయి మహోన్నత మందిరాలు


అడుగుఅడుగునాపరమాత్మను దర్శించడానికి  అనేక అందమైన ఆలయాలు కొలువై ఉన్నాయి

నిత్యధూపదీపనైవేద్యాలతో అభిషేక అర్చనలతో మహోన్నతంగా వెలిగి జాతి చరిత్రను సుసంపన్నం చేసిన మహా మందిరాలు నేడు గతి తప్పిన మనిషి బుద్ధికి మౌన సాక్షీభూతమై నిలబడ్డాయి

వెర్రితలలువేసినమతమౌఢ్యం ప్రజల గుండెచప్పుడ యిన దేవాలయాలపై కరాళ నృత్యం చేసింది

అధర్మాన్నిఖండించాల్సిన

కరవాలాలుతేజోమూర్తులైన విగ్రహాలను సుందర శిల్పాలను.. ధ్యాన మందిరాలను... జాతి నిలువెత్తు సంస్కృతి కేంద్రాలను విచ్ఛిన్నం చేశాయి... వికృత రూపాలతోవివర్ణంచేశాయి.. కళా తోరణాలు పడగొట్టి  విషాదగుమ్మటాలువెలిశాయి

దైవాన్ని రాతి శిలలకే పరిమితం చేసిన మూర్ఖ పాలకులు. శిధిలమైన దేవాలయాల్లో తమ గెలుపుజెండానుఎగరవేశారు

వక్రీకరించిన చరిత్రను పుస్తకాల్లో రాసి ప్రజల మెదళ్లను మార్చేశారు


దేవాలయాలు రాతి కట్టడాలు కాదు నీ జాతి సంస్కృతి కేంద్రాలు. సాంప్రదాయపు సమున్నత శిఖరాలు

దేవాలయం శిథిలమై కూలిపోతే సంస్కృతి సంప్రదాయాలు పాతరే

యబడతాయి

నీపుట్టుకమూలాలుపూర్తిగా పాతాళానికిచేరకముందే

శిథిలమవుతున్న దేవాలయాలనుమళ్లీనిర్మించు

పతనమవుతుందని సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించు

లేదా చరిత్ర నిన్ను క్షమించదు


"""""""""""""""""""""""""""""""""""""


నా స్వీయ రచన

04/10/20, 8:51 am - Madugula Narayana Murthy: *మల్లినాథసూరి* *కళాపీఠం ఏడుపాయల(YP)* 


    🌈 *సప్తవర్ణముల సింగిడి* 🌈


*అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో*.....


 *హృదయస్పందనలు* *కవులవర్ణనలు* 


  *04.10.2020 ఆదివారం* 


             *అంశం :*

      *" శిథిలాలయాలు"* 


 *నిర్వహణ : అంజలి* *ఇండ్లూరి* 


 *మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా* 


 *పద్యం*


/ 1. *ఆటవెలది*

బెల్లమున్నచోట ప్రీతిగానీగలు

చుట్టు తిరుచుండు చుట్టమగుచు

సొమ్ములున్న గుడులజోకును ప్రభుతయే

శిథిలమైనయెడలచెలిమివీడు!!

2. *ఉత్పలమాల*

పూర్వపు రాజులే గుడుల పోషణ జేసిరిశ్రద్ధతోడుతన్

సర్వము సంస్కృతీ గరిమ జాతికి రక్షణయన్నభావమున్

గర్వముభక్తియుక్తులకుకామితసిద్ధికిమోక్షమార్గమై

పర్వము దేవళమ్ములనువైభవమై శిథిలాల గాచగన్!!

3. *ఆటవెలది*

శిల్ప కళల లోన చేతనమైచిత్ర

కారు లెంచి దిద్దె ఘనులు ఋషులు

శిథిలమైననేడు జీవన సంజ్ఞలై

తరతరాల కందె ధనము గాను!!

4. *శార్దూలము*

వ్యాపారమ్ముల చూడలేదునృపులున్వైవిధ్యమౌ రీతులన్

కాపాడంగను మాన్యముల్ ధనముగన్ కాన్కల్ విభూషల్బహున్

ధూపమ్ముల్ తగు నిత్య దీపముల సద్యోగమ్ము లందించుచున్

పాపమ్ముల్ పరిహారమొందువిధిగా భారమ్ముచేపట్టిరే


5. *తేటగీతి*

శిథిలదేవాలయాలలో జిలుగువెలుగు

పథముజూపును బాధ్యతల్ ప్రభుతకొరకు

కళలు ప్రభవించుశిల్పులకౌశలమ్ము

మనసులాధ్యాత్మచింతన మందిరాలు!!

04/10/20, 8:58 am - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

04-10-2020 ఆదివారం

పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

ఆదోని/హైదరాబాద్

అంశం: హృదయ స్పందనలు కవుల వర్ణనలు

శీర్షిక: శిథిలాయలాలు (53) 

నిర్వహణ : అంజలి ఇండ్లూరి


నల్గొండ దగ్గర ఛాయా సోమేశ్వర ఆలయము శిథిలమై ఆదరణకు నోచుకోని పరిస్థితి.

ఏ సమయంలో చూచినా ఎన్ని స్తంభాలు ఉన్న నీడ మాత్రము శివలింగం మీద పడదు. 

ఎంత సైంటిఫిక్ గా కట్టారో ఆనాడు

ప్రభుత్వం ఎందుకు పట్టించుకోకూడదు ఈనాడు. 

ఎన్నెన్నో శిథిలాయలాలు ఉన్న నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది

బాగా ఆదరణ ఉన్న గుడులు ధన  వర్షము కురిపిస్తున్న ఆలయాలు మంత్రాలయం లాంటివి ప్రభుత్వం తీసుకోవడానికి చూస్తుంది. 

పలికే ఆంజనేయ స్వామికి డబ్బు లేవు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఉరుకుంద ఈరణ్ణ స్వామి గుడిని ఎండోమెంట్ వశం, ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి.


హంపి శిథిలాయలాలు వెనుక ఎంత చరిత్ర దాగుందో రాయలకు మాత్రమే తెలుసు. 

రాయి రాయిలో చూడవచ్చు

కళలు వేసుకున్న అచ్చు

మచ్చుకైనా జాలి లేకుండా

శిల్పాలు ధ్వంసం రచ్చు

విలువ కట్టలేని ఆలయాలు ఎన్నో అప్పుడు దురాక్రమణకు గురై శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు పాలకుల నిరాధారణకు గురై శిథిలావస్థకు చేరాయి.

వేం*కుభే*రాణి

04/10/20, 9:09 am - +91 73493 92037: నల్గొండ దగ్గరున్న శిథిలాయల గురించి గుర్తుకు తెచ్చేరు.బాగుంది.

04/10/20, 9:12 am - +91 98497 72512: *హంపి శిథిలాలయాల వెనుక ఎంత చరిత్ర దాగిఉందో రాయలకు మాత్రమే తెలుసు* అంటూ బాగా రాసారండీ అభినందనలు

🌷👏👌👏🌷

యం.టి.స్వర్ణలత

04/10/20, 9:15 am - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : శిథిలాలయాలు 

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : అంజలి ఇడ్లూరి 


సర్వవ్యాప్తీమయుడు సర్వేశ్వరుడు 

నిత్యపూజలందుకొన నిలిచివుండు 

ఆగమశాస్త్ర పూజలుంటే దేవాలయం 

ఆత్మనివేదన మనోన్జలి అందుకుంటే హృదాయాలయం 


కల్మషమనస్సుల కలిజగత్తులో అంతా పాపభీతే 

ప్రాయశ్చిత్తంకోసం మదిలో దైవభక్తే 

తెలియక చేసినపాపం చెబితే పోతుందని ఆర్యోక్తి 

దైవానికే సరిపోతుందనే జనమనోక్తి 

పాపభీతులే పరిగెడుతుంటే ఆలయాలన్ని అవుతున్నాయి అపకీర్తి 


ఆలయాలన్నీ పవిత్ర క్షేత్రాలే 

నిత్యార్చనలేని ఆలయంలోను దైవం స్థిరమే 

అర్చనాభిషేకనైవేద్యాలందిస్తే వైభవాలయమే 

వేదభూమిలో అడుగడుగునా ఆలయం 

ఆపద్బాంధవుడి అభయహస్తం 

స్వార్థంలేని మనస్సు ప్రశాంతమైతే 

ఆలయంలో దివ్య దర్శనమే 

అలాంటి ఆలయం పుణ్యక్షేత్రమే 

నేటి కల్మషమనస్సుల పుడమిలో పుణ్యక్షేత్రాలకంటే శిథిలాలయాలెక్కువ


మానవహృదయమే దేవాలయం 

పరోపకారం ఇదం శరీరం 

కాలగర్భంలో కలిసిపోతున్న వేదవాక్కు 

అంతా స్వాకారమే తప్ప పరోపకారమేది 

అంతా నకారమే తప్ప మానవత్వమమకారమేది 

స్వచ్ఛతలేని హృదయాలయం 

అర్చనలేని శిథిలాలయమే 


మానవత్వపు కుసుమాలను పసిహృదయాలలో వికసింపచేస్తే 

ఆలయాల ప్రాశస్త్యాన్ని హృదయాంతరాలలో కుసుమింపచేస్తే 

విశ్వమంతా నిటాలాష్కుడి నిలయమే 

శిథిలాలయాలు శిరపూజితామే

అజ్ఞానతిమిరాలను తొలగించి నిష్కల్మష మనస్సులో జ్ఞానజ్యోతులు వెలిగిస్తే 

అంధకారబందురాలు తొలగి 

అంతా ఆనందానిలయమే 

ఆత్మానంద మోక్షమే


హామీ : నా స్వంత రచన

04/10/20, 9:24 am - Bakka Babu Rao: సప్త వర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం...శిథిలయాలాలు

నిర్వాహణ....ఇండ్లూరి అంజలి గారు

రచన.....బక్కబాబురావు

ప్రక్రియ...వచనకవిత



పంచభూతాలునిండిన ఈ దేహం

పరమాత్ముడు వసించే ఆలయం

పరిపూర్ణ చైతన్య దేవాలయం

రక్తమాంసాలు మానవదేహం


 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు

పంచ ప్రాణాలు  పంచ భూతాలు

పంచ విషయాల నిలయమై

అంతరంగమహాన్వితమై


దేహంలో ఉన్నజీవమే పరమాత్మ

దేవాలయం దేహం లాంటిది

మనోభావాలు అపరిశుభ్రమైతే

దేవుడు లేని గర్భ గుడి ఔతుంది


అహం నిండి  ఆత్మీయత కోల్పోతే

మదం ఆవహించి మమతలు మాయమై

స్వార్థం నిండిన దేహం దేవుడు లేని గుడి

అదే శిథిలాలయం మనదేహం


మానవత్వ విలువలతో మంచిని పెంచి

మమతానురాగాలను పంచితే

మానవుడే మహానీయుడు అవనిలో

మానవుడెమాధ వుడు ధరణిలో


స్వార్థ చింతన సమాధి చేయు

అహం భావం అంతమొందించు

మనదేహమే నిత్య పూజలందుకొను

మానవ దేవాలయం శిథిలం కాకుండా కాపాడు


బక్కబాబురావు

04/10/20, 9:41 am - Anjali Indluri: *కామవరం ఇల్లూరు* *వెంకటేష్ గారు* 🙏


హంపి శిథిలాలయాల వెనుక ఎంత చరిత్ర దాగుందో

కవితలో ఆసాంతం నిరాదరణకు గురైన ఆలయాలకు కారకులైన వారి నిర్లక్ష్యధోరణిని ఎండగట్టారు

అభినందనలు సార్

👏👏👏👏👏👏💐💐✍️🙏

04/10/20, 10:02 am - +91 98850 66235: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి..

అంశం: శిథిలాలయాలు

నిర్వహణ: అంజలి ఇండ్లూరి

రచయిత : కొప్పుల ప్రసాద్ నంద్యాల

శీర్షిక: కళల కాణాచి



కళలకు కాణాచి

ఆది కాలము నుంచి అద్భుత సంపద

వెయ్యి నోళ్ళ పొగడ తరము కాని శిలా సంపద

పవిత్ర స్థలాలు పరమాత్మ సన్నిధి

ప్రశాంత నిలయలు శిల కృతుల శిల్పాలు


పరదేశీయుల పరమార్థం

రత్నగర్భ దోచుకోవడం

సంస్కృతి సాంప్రదాయం నాశనం చేయడం

గుడిలోని ధనాన్ని అపహరించడం

దేవాలయాల పై దండయాత్ర చేయడం...


పచ్చని కల తోరణాలను

అద్భుత శిలా రాతి కట్టడాలను

ఆకాశాన్నంటే శిల్పకళ గోపురాలను

గర్భగుడిలోని మూలవిరాట్టుకు

విచ్చలవిడిగా నాశనం చేశారు...


వస్త్రాన్ని మార్చారు

కట్టుబొట్టు తుడిచారు

సంస్కృతిపై దాడి చేశారు

విదేశీ సంప్రదాయాలు ప్రవేశపెట్టారు

లేని ఆచారాలు తలపెట్టారు....


జ్ఞానాన్ని ప్రసాదించిన దేశం

నేడు విదేశాలకు వలస వెళుతుంది

కోహినూరు వజ్రలా

ప్రపంచానికి ఆదర్శమైన

ప్రకృతి సంపద

నెమలి సింహాసనంలా వెలవెలబోతోంది...!!


కొప్పుల ప్రసాద్

04/10/20, 10:07 am - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*03/10/2020*

*అంశం: శిథిలా లయాలు*

*నిర్వహణ:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


     *శిథిలా లయా లు*


*సమాజం*

సంస్కృతి సంప్రదాయాలు పాటించని మానవులు

మానవత్వం మంట గలుపుతున్న మాన వనైజం

నైతిక విలువలు నాశన మవుతున్న స్థితి

భద్రత లేని స్త్రీ,భారమవుతున్న

బ్రతుకులు

సామరస్యం,సమైక్యత సన్నగిల్లి

పోతుంది.


*సంస్కృతి*

మరిచిన సంస్కృతి ,ఆచారాలు

కట్టుబాట్లు

కరుడు గట్టిన ,కరుణ లేని వైనం

కనుమరుగవుతున్న గౌవర మర్యాదలు

విచక్షణ కోల్పోతున్న మనుషులు

సంస్కృతి మొత్తము సర్వనాశనం.


*ధర్మం*

ధర్మము ,న్యాయము, నీతి, నిజాయితీ

ధర్మ రక్షణ కొరవడి అధర్మము

విల యతాండవం చేస్తుంది

మనిషి జంతువు కంటే హానంగా తయారైయ్యాడు

ధర్మ బద్ధంగా జీవనము మరిచారు.


*హృదయము*

అటు ఓజోన్ పొరకు ,ఇటు హృదాయానికి చిల్లులు పడుతున్నాయి

విచిత్ర ప్రవర్తనతో మనుషులను

చిత్ర హింస కు గురి చేస్తున్నారు

అందుకే హృధ్రోగాలు పెరుగుతున్నాయి.

రాక్షస సమాజము రాజ్య మేలుతుంది.


*బంధాలు*

అసలు బంధాలు అనే పదం

కంటికి అగుపడకుండా పోయింది

తల్లి, చెల్లి, తండ్రి ,తాత, నానమ్మ

ఈ బంధాలు ఏమయ్యాయో

అర్థం కాని దుస్థితి

ఆడదాన్ని ఆట వస్తువు చేస్తున్న

ఘోరమైన సంఘటన లు, పవిత్ర భారత దేశం లో

ఇలాంటి కృత్యాలు , కరాలా నృత్యం చేస్తున్నాయి

కర్కశ మనుషుల మధ్య సంబంధాలను తుంచేస్తున్నారు.

04/10/20, 10:09 am - +91 98668 99622: సప్త వర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం : శిథిలాలయాలు

నిర్వహణ : ఇండ్లూరి అంజలి గారు

ప్రక్రియ : వచన కవిత

రచన: తౌట రామాంజనేయులు

""""""'"''''"""""""""""""""""""'""""""

ఈ పాంచభౌతిక దేవాలయంలో

మనిషి మానవవత్వం మరిచి

మృగంలా ప్రవర్తిస్తున్నాడు

విలువల వలువలు లేక

చిలువలు పలువలు మాట్లాడుతూ

సంస్కృతి హీనుడగుచున్నాడు


కన్నూ మిన్నూ గానక

కామంతో అభంశుభం

ఎరుగని అమాయకుల

ఆక్రందనలకు కారణమౌతున్నిడు


అవినీతి అన్యాయాలను

నిత్యకృత్యాలుగా మార్చి

సమాజాన్ని కకావికలం

చేస్తూ మదంతో విర్రవీగుతూ

వికటాట్టహాసం చేస్తున్నాడు



*హే భగవాన్ !*


అహంకారంతో ఊరేగుతున్న

ఈ మనిషిని మార్చి ద్వేషాన్ని, 

రోషాన్ని తొలగించి

ఈ శిథిలాలయాన్ని పునరుద్ధరించు

మానవత్వం తో నింపి

నిత్యమంగళకరమైన

దేవాలయంగా మార్చు

04/10/20, 10:23 am - +1 (737) 205-9936: *మల్లినాథసూరి* *కళాపీఠం ఏడుపాయల(YP)* 


    🌈 *సప్తవర్ణముల సింగిడి*


 *హృదయస్పందనలు* *కవులవర్ణనలు* 

*పేరు. డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*


  *04.10.2020 ఆదివారం* 


             *అంశం :*

      *" శిథిలాలయాలు"* 


 *నిర్వహణ : అంజలి* *ఇండ్లూరి* 

*శీర్షిక..ఛిద్రమౌతున్న బంధాలు*

-------------------------------


వేగంగా పరుగెత్తే కాలం

మారుతున్న జీవన చిత్రం

ఊపిరి సలుపనిపనుల్లో 

ఎవరికివారు 

మునకలేస్తున్నారు


పెరుగుతున్న ఆర్థిక బంధాలు

తరిగిపోతున్న హార్దిక బంధాలు

శిథిలమౌతున్న ఆప్యాయతలు

నీరుకారుతున్న సంబంధాలు!!


ఉరుకుపరుగుల జీవితాలు

బీటలు వారుతున్న అనుబంధాలు

కాల చట్రంలో బందీలు

మరుగున పడుతున్న రక్తబంధాలు!!


ఎవరికి వారే యమునాతీరే

ఎవరి బాధలు వారివే

పంచుకునే తీరికలేదు

తలచుకునే అవకాశం లేదు!!


ఉద్యోగాలు చదువులు

సముద్రాలు దాటి పయనం

కాలం చెరలో వాసం

యాంత్రిక జీవన విధానం!!


సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు

ఆధునికీకరణ మోజులో పడి

కట్టు బొట్టు జుట్టులో 

కట్టడిలేని స్వేచ్ఛ

విలువల వలువలూడుతున్న సంస్కృతి!!


సంస్కృతి సంప్రదాయాలు కాపాడుదాం

ప్రేమబాటలో 

పయనిద్దాం

కన్నవారిని కంటిరెప్పలా కాపాడుకుందాం

మానవత్వాన్ని 

నిలబెడదాం

అనురాగ గోపురం నిర్మిద్దాం!!

04/10/20, 10:27 am - venky HYD: ధన్యవాదములు

04/10/20, 10:27 am - venky HYD: ధన్యవాదములు

04/10/20, 10:28 am - venky HYD: ధన్యవాదములు

04/10/20, 10:37 am - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -శిథిలాలయాలు

నిర్వహణ శ్రీమతి అంజలి ఇండ్లూరి

రచన -చయనం అరుణా శర్మ

తేదీ -04-10-2020

శీర్షిక -మానవ హృదయాలు


మంచితనం మానవత్వం నాడు

దైవంగా నిలిపిన మనోమందిరాలు

సమభావనం సమాజహితం

నరనరాన నెలకొన్న అనురాగ

నిలయాలు

స్వార్ధమెరుగని ద్వేషం తెలియని

పసిపాప నవ్వులవంటి హృదయాలు

మల్లెలవంటి తెల్లని మనసులు

వెన్నెల కన్నా చల్లని మమతలు

పరోపకారం పరమావధిగా

విరబూసిన స్నేహసదనాలు

జీవనసరళిలో మంచి చెడు

వివక్షత తెలిసిన ప్రేమ పరిమళ

సుగంధాలు

నేడు మానవ హృదయాలు

శిధిలాలయాలు

అంతరించిపోయిన ఆత్మీయతలు

మృగ్యమైపోతున్న మానవతా

విలువలు

విరబూయని స్నేహసుమాలు

అనుభూతుల సంతకాలు చెరిగి

మమతలు విరిగి

అభిమానాలు నేలకొరిగి

విలవిలలాడుతున్న బాధాతప్త

హృదయాలు

మనో నందనాన మానవత్వం

పరిమళించేదెన్నడో

కన్నీటి వానలు ఆగేదెపుడో

అమాయక హృదయాల

వెన్నెల వెలుగులు విరిసేదెన్నడో

శిధిలమైన హృదయాన నవ

వసంతగీతాలు పలకరించేదెప్పుడో

04/10/20, 10:41 am - venky HYD: మీ కవితలన్ని ఈ బ్లాగులో భద్రపరచాను


https://venkyspoem.blogspot.com/2020/10/yp-27-09-20-to-03-10-2020.html

04/10/20, 10:46 am - Velide Prasad Sharma: అంశం:శిథిలాలయాలు

నిర్వహణ:అంజలి ఇండ్లూరి గారు

రచన:వెలిదె ప్రసాదశర్మ

ప్రక్రియ:పద్యం

మత్తకోకిల:

డబ్బులెన్నియు నున్న నేమిర డాబులెందుకు నీకికన్

మబ్బుమైకము క్రమ్ముకుండెనె మాన్య జీవిత మరయగన్

సబ్బు నీరపు పొంగువోలెను సర్వమంతయు వోవునే

దెబ్బతింటివి నీదుజీవిత దివ్రభిగ్యము లేకనే!


ఎందరున్నను ప్రేమ లేకనె యింపులేదిక గీమునన్

విందు పొందుల ముచ్చటంతయు వీగిపోవును చూడగన్

చిందులేయకు మింటిలోపల చింతదీర్చెడి భార్యపై

కందువై శుభ పల్కుతోడనె కాంతినిండును డెందమున్!


అమ్మనాన్నల కానకుంటివియంతదూరమె వెళ్ళుచున్

కమ్మదనమున్ పంచకుంటివి కర్కశంబగు కృత్యమై

సొమ్ము లెన్నియునున్ననేమిక సోకులెందుకు నీకికన్

చెమ్మగిల్లిన డెందమందున చింతలేమరి నిల్చెనే!

ఉ!

అందరు నొక్కచోటుననె యద్భుత ప్రేమను పంచు చుండగన్

గంధపు సద్గుణంబులనె కమ్మగ పంచుచు సాగు చుండగన్

రందియు లేదులేదిలను రమ్య గృహంబుయుశోభిలున్ వెసన్

మందర మానసంబుగల మానవుపాలిట శల్యమే యదిన్!

ఉ!

శాంతియు లేనిజాడలను శక్తియు శౌర్యములున్ననేమిరా

యింతికి పిల్లజెల్లలకునింపుగ ప్రేమను పంచలేనిచో

వంతుగ పెద్దవారలను వాసిగ చేరగ లేనిచో యికన్

చింతలె చేరునయ్యమరి జీర్ణమెయౌనుర గీము శల్యమై!

04/10/20, 10:46 am - +91 99639 15004: మల్లినాథ సూరి కళాపీఠం yp

సప్త వర్ణముల సింగిడి 

అంశము. శిధిలాలయం 

నిర్వహణ. అంజలి ఇండ్లూరి 

రచన ఆవలకొండ అన్నపూర్ణ 

ఊరు శ్రీకాళహస్తి చిత్తూరు 


మానవ ఏమున్నదిఈ జీవితం రక్తం మాంసముల తోలుతీత్తి రా ఈ నర జన్మ. 


దేహము ఫై భ్రాంతి ఎందుకు బ్రతుకుపై చింత ఎందుకు పాలు వెన్న, తేనలతో రంగరించి న దేహము ఒకనాటికి శిధిలం కాకతప్పదు. 


దేహములో జీవుడు లేనినాడు అది శిధిలాలయమే కదా. 

నాగరికతకు చిహ్నాలు శిధిల దేవాలయాలు, ఆ శిధిలాలలో నిలచిన చిరంజీవులు ఎందరు. 


యుగాలు మారిన, జగాలు మారిన మారనిది మానవతా ఒక్కటే, ఆ మానవతా గోపురాలు ఎన్నటికీ శిధిలాలు కానేకావు. 


రాజుల ఘనతకు ఆనవాళ్లు. శిధిలమైన వారి కోటలు. వారు కట్టించిన గుళ్ళు, వారేమి సిరి మూటగట్టుక పోయినారా, మనిషి మరణించిన నిలిచేది వారి మానవతా సౌరభాలే. 



నశించే దేహానికి ఫై పూతలెందుకు 

కుళ్ళు కుచ్ఛితాలు వంటి నిండా నింపుకొని, మానవుడు సాధించేదేమిటి, ఒకనాడు అంతమయ్యే కట్టే కోసం ఆరాటమెందుకు కాని మనిషి మరణించిన సుకవి కవిత ప్రజల నాలుకలపై నడయాడినప్పుడు అతడు ఎన్నటికీ శిధిలం కాని అజరామర గోపురమై నిలిచి పోతాడు 


శిధిలమైన జీవితాలు చిగిరించాలంటే. మాయమైన బ్రతుకులు మల్లి రావాలంటే. శిధిలాలు చూచి నేర్చుకోవాలి. వారు చేసిన తప్పులు సరి దిద్దుకోవాలి. మంచిని పెంచుకోవాలి అన్న సత్యాన్ని అందరు తెలుసుకోవాలి.

04/10/20, 10:52 am - +91 92471 70800: *శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

అంశం : *శిధిలాలయాలు*

నిర్వహణ : *అంజలి ఇండ్లూరి గారు* 

ప్రక్రియ : *వచనం*

రచన : *పేరిశెట్టి బాబు భద్రాచలం* 

శీర్షిక : *మిగిలి ఉన్న సంపదలు* 

---------------------


శిధిలాలయాలు కావవి.. 

పూర్వ వైభవాలకు గురుతులుగా మిగిలి ఉన్న ఆనవాళ్ళు.. 

మన సంస్కృతులకు 

అద్దం పట్టే మాసిన ప్రతిబింబాలు..


రాజ్యాలు రాజరికాలు..

వైభవాలు వైభోగాలు.. 

ఎన్నెన్నో చరిత్రలను

కాలసర్పం మింగేసినా..


చరిత్ర మిగిల్చిన సత్యాలన్నీ కథలుగా మారిపోయినా..

 

శతాబ్దాల వారసత్వ సంపదలుగా 

మిగిలే ఉన్నాయి ఈనాటికీ 

ఈ శిధిలాలయాలు..


అభివృద్ధి పేరుతో 

పరుగులు తీసే విజ్ఞానంతో..

దైవాన్ని ఎదిరిస్తూ.. దైవత్వాన్ని విస్మరిస్తూ..

 

మతాల మౌఢ్యంలో 

ఆచార వ్యవహారాలను సైతం మార్చుకుంటూ.. 

వారసత్వ సాంప్రదాయాలను 

భ్రష్టు పట్టించే దిశలో 

నడుస్తున్నారు కొంతమంది.. 


గతమే ఘనమని భుజకీర్తులు ధరించి

విహారయాత్రలు చేసే వారసులంతా ఇకనైనా.. 


మిగిలి ఉన్న ఆనాటి మన జాతి సంపదలను 

సంరక్షించుకుంటూ 

ముందు తరాలకు అందించుట మనందరి ముందు ఉన్న బాధ్యత.. 


*********************

 *పేరిశెట్టి బాబు భద్రాచలం*

04/10/20, 10:52 am - +91 98662 03795: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల🙏

🌈సప్తవర్ణాలసింగిడి🌈

అంశం- *శిధిలాలయాలు*

నిర్వహణ-అంజలి ఇండ్లూరి గారు

శీర్షిక-

రచన- *భరద్వాజరావినూతల*

స్వార్ధపు బావుటాలు 

మానవత మర్చి పోయిన గుండె లల్లోఎగురుతూ ఉంటే-

అవినీతి అక్రమాల గదులు కట్టుకుంటే-

హింసా ప్రవృత్తి నరనరాల్లో రక్తంలా ప్రవహిస్తుంటే-

 *మానవ* *శరీర* *దేవాలయం* *శిధిలాలయం* *కాక* *ఏముంది* --?

కులాల కుమ్ములాటలు

మతాల మారణ హోమాలు

రాజకీయ కుత్సిత కుతంత్రాలతో

అల్లాడిపోతున్న జనం ఆకలి దావానలానికి దహించుకు పోతుంటే-

 *మానవశరీరదేవాలయంశిధిలాలయంకాక* *ఏముంది* ,--?

విచ్చలవిడిగా నాగరికత నడి వీధుల్లో నాట్యమవుతుంటే-

ఆడపిల్లలపై అత్యాచారాలు నగరనడిబొడ్డున జరిపే స్థితికి ఎదిగితే-

అమానుషం.దౌర్జన్యం. హింస.అన్యాయం. స్వార్దం.కుట్ర.కుతంత్రాలు -

గుణం మార్చుకున్న ఏడురంగుల హరివిల్లు లా జనం గుండెలపై విరబూస్తుంటే-

భరతమాత బిడ్డలుండీ గొడ్రాలుగా మారుతుంటే-

 *మానవశరీరదేవాలయంశిధిలాయలుగా* *మారక* *ఏంచేస్తాయి* 

జనంతో మనం మనతో జనం

అన్న నానుడికి ఊపిరి పోసి స్వార్ధం చొక్కా‌వదిలి‌మానవత్వపు వస్ర్తం ధరించినపుడు

 *దేహమే‌కదా‌దేవాలయం* --!-

భరద్వాజ రావినూతల(RB)🖍️

04/10/20, 11:03 am - +91 97040 78022: శ్రీ మల్లినాధసూరి కళాపీఠం. ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి.  4/10/2020

అంశం -: హృదయ స్పందనలు. శిధిలాలయాలు

నిర్వహణ -: శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు

శీర్షిక-: మాతృస్వామ్యం మళ్ళీ రావాలి

రచన -: విజయ గోలి 

ప్రక్రియ-: వచన కవిత 


ఆదిమానవుడిగా అరణ్యంలో

మృగాలలో మృగంగా మృగనీతితో

చీకటి గుహలలో ..గుండెకు బండకు

తేడాతెలియని అజ్ఞాన స్థితి నుండి 

వెలుగు వెతుకుతూ బయటికి వచ్చాడు


అణువణువును చైతన్య పరుచుకుంటూ

వామనత్వం నుండి విశ్వరూపంగా విస్తరించాడు.

జన్మస్థానం తెలిసి మాతృమూర్తికి మనుగడిచ్చాడు

నవరసాల నాణ్యతతో బ్రతుకు నాట్యం నేర్చాడు


కాలచక్రం పరిక్రమ పునరావృతమవుతుంది

నేర్చుకున్న నెనరులతో మళ్ళీ మృగరాజ్యంలోకి..

మృగాలనే భీతిల్లచేస్తూ అడుగు పెట్టాడు

ఎదురులేదంటూ భీభత్సం చేస్తున్నాడు


ఆదరించిన జన్మస్థానం నేడు వాడికి ఆటస్థానం

ఆటమత్తులో అహం పెరిగి అమ్మని ఆడబొమ్మను చేశాడు.

కామంతో మూసుకు పోయిన కంటి చూపులో ...

అమ్మ ..ఆలి ...చెల్లి . పండు ముసలో..నెత్తుటి పిండమో

గోవైనా..మేకైనా నక్కైనా కుక్కైనా  ఆడదైతే చాలు..


ఆగడాలతో అశక్తుల ఆక్రందనలతో అర్ధరాత్రి తెల్లవారుతుంది

స్పందనలేని సామ్రాజ్యానికి కావలి వాడే..కంచె వాడే..

ఎన్ని లేగలు వాడి వేటకు ఒదిగి పోవాలి..ఎదురు తిరిగి..

ఎన్ని నాలుకలు తెగి పడాలి ..ఎన్నాళ్ళీ గొంతు దాటని వెక్కిళ్ళు


న్యాయస్థానం గంతవిప్పి గుంత లోతు తెలియాలి

మగసిరంటూ మిడిసిపడే వాడి అంగాన్నే..

ఖండ ఖండాలుగ నరికే..ఖడ్గమే కాంత కివ్వాలి..

ఆదిశక్తి అంశలన్నీ ఉద్యమిస్తే అర్ధరాత్రి స్వాతంత్ర్యం

అడుగులలో *మాతృస్వామ్యం *మళ్ళీ రావాలి *మళ్ళీ కావాలి!

04/10/20, 11:06 am - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

ఆదివారం 06.10.2020

అంశం:శిథిలాలయాలు

నిర్వహణ:అంజలి ఇండ్లూరి గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*

శీర్షిక:కోవెల వీడిన దైవం



కోవెలలో కొలువైన దైవాన్ని వదిలి

మాయాజగత్తు మోజులో పడి

రంగుల ప్రపంచమే రమణీయమనుకొని

ఆలయాల ఆనవాలు మరిచిపోతూ


మదిలోని మాధవుణ్ణి చూడక

మన్నులో కలిసే మేనుకి

మెరుపుల హంగులు అద్దుతూ

అసలు సిసలు అందాన్ని,

ఆత్మానందాన్ని కోల్పోతూ


స్వార్థం తో స్నేహం చేస్తూ

అహంకారమే అలంకారం గా

ప్రేమ, ఆప్యాయతలను,మానవత్వాన్ని

దూరంగా పెడుతూ

డబ్బే సర్వస్వమని తలుస్తూ

తనవారినే కాకుండా

చివరకు

తనను తానే కోల్పోయే

మానవ మదిమందిరాలన్నీ

పూజలకు నోచుకోని

శిథిలాలయాలే కదా.

04/10/20, 11:21 am - +91 98492 43908: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల

బి.సుధాకర్, సిద్దిపేట

అంశం..శిథిలాలయాలు

శీర్షిక... పగిలిన హృదయాలు

నిర్వాహణ..అంజలి గారు


వయసు పొంగులో ఉరకలు వేసిన యవ్వనం

బతుకు పయనంలో అలసిన శరీరం

ఎన్నో చేసి ఏమి కాని సమయం

ఎవరూ చూడని ఏకాంత జీవితం....


బంధాల కోటను పట్టించుకోకుండ

అందాల లోకంలో అద్దాల మేడంటు

విజ్ఞాన మెరుపులో విచిత్ర తరుణం

అంతస్తుల ఆశలో ఆవిరయ్యే జీవితం


ఏంతున్నా కొంతైనా వెంటరాదని తెలిసి

రాసుల సోమ్మైనా, రాజరికము బతుకైనా

ఆపలేవు ప్రాణం

అయినా అంతా నేనే అన్నీ నాకే అనే వ్యవహారం


బలమున్నప్పుడే బంధువులు, బలగము

బెల్లముంటేనే ఈగలు వాలునట్లే

మంచితో పెరిగే బంధం నీడై తోడుండు కలకాలం


అలసిన తనువుకు ఆసరా కరువై

పగిలిన హృదయాలు పరిపరి విలపిస్తు

చేసిన నేరం తెలిసిన ఏమి ఫలం

ఎవరు రాక ఏది పొందక ఏడుపే తోడవును


ఉన్నది ఒకటే జీవితం

ఉండ లేరు ఎవరు కలకాలం

మంచిని పెంచి ప్రేమను పంచి 

మదలో మమతల పూలు పూయిస్తే

పరిమళాలు వెదజల్లి వెతలు దూరమౌను

04/10/20, 11:28 am - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: శిధిలాలయాలు

ప్రక్రియ: వచన కవిత

శీర్షిక: దేహాలయ పరిరక్షణ

నిర్వహణ:  శ్రీమతి. ఇండ్లూరి అంజలి గారు

రచన: పేరం సంధ్యారాణి, నిజామాబాద్

తేదీ: 04 -10 - 2020

🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 సంస్కృతి సాంప్రదాయాలకు

తిలోదకాలిస్తూ 

మానవతకు అడ్డుకట్టవేస్తూ

నైతికతను పాతాళంలోకి తొక్కుతూ

బరువైపోతున్న బంధాలతో

ధర్మం మరచి, దయ కరిగి, 

దానవత్వం పెరిగి...

దారుణాలతో నిండిన ధరణిలోన

ధర్మరక్షణకు తావేది ...

ధర్మానికి విలువేది...

శిథిలమైపోతున్న గర్భాలయంలో

హృదయ బంధాలు చిగురించేల

మమతానురాగాలు పరిమళించేల

సనాతన సంస్కృతి పరిఢవించేల

దేహాలయాన్ని మానవతతో 

జీర్ణోద్ధరణ చేసి జీవుడే 

దేవుడై గుండె గుడిలో

మంచితనంతో అభిషేకిస్తూ

ఆరని దీపమై 

 అనురాగ మంత్ర పుష్పాలతో 

 అర్చన చేస్తూ....

జయ జయ ద్వానాల హారతితో 

జగతిన సుమధుర ప్రేమఫలాలను

 నైవేద్యంగా పంచుదాం

లోకా సమస్తా సుఖినోభవంతు 

యని కాంక్షిద్దాం🙏🙏

04/10/20, 11:31 am - Telugu Kavivara: <Media omitted>

04/10/20, 11:32 am - Telugu Kavivara: నా స్వరం వినండి

04/10/20, 11:37 am - +91 93984 24819: మల్లినాధసూరి కళాపీఠం 

ఏడుపాయల,

సప్తవర్ణాల సింగిడి,

తేదీ:04-10-2020,

కవుల కల్పనలు,హృదయ స్పందనలు,

అంశం:శిథిలాలయాలు,

పేరు:రాజుపేట రామబ్రహ్మం,

సెల్:9398424819,

ఊరు:మిర్యాలగూడ,

నిర్వాహకులు:శ్రీమతి.అంజలి

                     ఇండ్లూరి గారు.

                 --------------

జ్ఞాపకాలను వదలనీయని శాస్త్రీయ సౌధాలే

అనుభూతులు మిగిల్చిన అద్భుతకానుకలే

సంస్కృతి ని ప్రతిబింబించే సజీవ సాక్ష్యాలే

కళ్ళల్లో నిప్పులు పోసుకొని కూల్చిన కట్టడాలే

మతచాందసుల దౌర్జన్యాలకవి ఋజువులే

అంతాఒకటని చాటే వారికి ఆత్మ వంచనలే

సైన్స్ ను బోధించేటి నిలువెత్తు నిదర్శనాలే

నిత్య చైతన్యం కలిగికంచే నిశ్చల రూపాలే

ఆరాధించే కళ్ళల్లో చెదిరిన చిత్ర రాజసాలే

దేవుడున్నాడని రప్పించు సింహ ద్వారాలే

వందలయేళ్ళు వర్ధిల్లిన ఆధ్యాత్మిక భవనాలే

భక్తులగుండెల్లో భద్రంగున్న భక్తి సంపదలే

నిదురించే మదిని తట్టిలేపిన గుడి గంటలే

నిత్యపూజలతో శోభిల్లిన ఆనాటి చిహ్నాలే

అందాన్ని కోల్పోయిన అపురూప దృశ్యాలే

గడ్డాల చిక్కుల్లోపడి నలిగిన నవ్యరూపాలే

మొలతాడు లేనోళ్లు పూడ్చిన నాగరికతలే

వర్ణించ నలవిగాని కళాకౌశల నిర్మాణాలే

నేటికీ మనోరంజకమైనవి శిథిలాలయాలే.

                            ధన్యవాదములతో,

                                రామబ్రహ్మం.

04/10/20, 12:00 pm - +91 73969 55116: మల్లినాథ సూరి కళాపీఠం yp

డా. N. ch. సుధా మైథిలి

గుంటూరు

అంశం:శిథిలాలయాలు

నిర్వహణ:అంజలి ఇండ్లూరి గారు..

-----/////---------


శీర్షిక- భయమేస్తుంది  


భయమేస్తుంది..

స్వార్ధాలకొలిమిలో

తగలబడుతున్న బంధాలను  చూసి..

భయమేస్తుంది..

ఎడతెగని ధన దాహంలో

ఆవిరైపోతున్న అనురాగాలను  చూసి..

భయమేస్తుంది..

 అత్యాశల  వాహినిలో  

కొట్టుకొని  పోతున్న ఆత్మీయత లను చూసీ..

భయమేస్తుంది..

అమ్మ,  నాన్నలు దైవాలన్నమాట పోయి..

ఆస్తుల  కోసం

జన్మనిచ్చిన వారి ప్రాణాలు తీసే కసాయి  కిరాతకులున్న  

ఈ సమాజాన్ని  చూసి..

,భయమేస్తుంది..

అన్నదమ్ముల  బందాన్ని  

అర్థలాభంతో లెక్కేసే  అభాగ్యులను చూసి.. 

భయమేస్తుంది..

ధనోన్మాదమెక్కిన  ధన పిశాచులను  చూసి..

తోటి ప్రాణి  ఆపదలో ఉంటే

ప్రాణాలకు

తెగించి  కాపాడే  జంతువులన్నీ  అరణ్యాలలో  ..

డబ్బుకోసం  తోటి మనుషుల ప్రాణాలు తీసే మృగాలన్నీ  జనారణ్యం  లో...

కామ రోగాలు అంటుకున్న విషవృక్షాలతో.. 

స్వార్ధమే కానీ పరహితం ఆలోచించని పురుగులతో..

అవినీతి పులుముకున్న జంతువులతో..

బంధమంటే గిట్టని

కలుపుమొక్కలతో

సంచరించ వీలుకాని శిథిలాలయమే అయ్యిందిగా సమాజం..

ఎక్కడికెళుతుంది దేశం..

ఎటువైపు దీని పయనం...

-----------------------------

04/10/20, 12:16 pm - +91 98679 29589: *సప్తవర్ణముల సింగిడి*

 *మల్లినాధ సూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు : శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం : శిథిలాలయాలు*

*శీర్షిక : ఏడుస్తోంది దేశపు సంస్కృతి*

*ప్రక్రియ: వచన కవిత*

*నిర్వహణ:  శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు*

*తేదీ 04/10/2020 ఆదివారం*

*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట* 

         9867929589

shakiljafari@gmail.com

"""""''"""""''"""'""""''''''"""""""""""""""""""'"'''"""""""

శిథిలాలయము మానవ హృదయం 

ప్రపంచ వ్యాప్తం స్వార్థపు రాజ్యం

మనిషిలో చొచ్చిన రాక్షసత్వం,

శూన్యం ఇక్కడ నైతిక మూల్యం...


పసి పిల్లల పై బలత్కారం, 

నారుల పైన దురాచారం,

ఎక్కడ చూసిన రాక్షస రూపం

మానవ జాతికి పెద్ద కలంకం...


సత్యమహింసపు మాటలు వ్యర్థం

నీతి నిజాయితీ కపోల కథలు

ఆచరణలోన అసత్య వర్తన

ధర్మం - న్యాయం శాస్త్రాల్లోనే ...


స్వార్థం కోసం ఎన్నో హత్యలు

నీళ్లకు విలువ రక్తమే చౌక

శూన్యం ఇక్కడ ప్రాణపు విలువ 

కనపడదెక్కడ బుద్ధి, వివేకం... 


నాథులు అయ్యారిక్కడనాథులు

వృద్ధాశ్రములో చేరిన పెద్దలు

సంస్కారాలు లేని ఈ పిల్లలు

స్వార్ధం కోసం మారిన మనుసులు...


ఎక్కడ చూసినా అత్యాచారం

ధార్మిక తత్వమే మూర్ఖత్వం

నరాల్లో పారే రక్తం శిథిలం 

మరణ భీతితో మనజుల మౌనం...


సంకుచితపు విచార వైనం

జాతి, ధర్మ కుల, మత భేదం

ఏడుస్తోంది దేశపు సంస్కృతి

భారత మాతయు చేసే విలాపం...


*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

     *మంచర్, పూణే, మహారాష్ట*

04/10/20, 12:26 pm - +91 94904 19198: 04-10-2020: ఆదివారం:-

శ్రీమల్లినిథసూరికళాపీఠం.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి.శ్రీఅమర

కులదృశ్యచక్రవర్తిగారి సారథ్యాన:

అంశం:-శిథిలాలయాలు.

నిర్వహణ:-శ్రీమతి అంజలి ఇండ్లూరి

             ‌.   గారు.

రచన:ఈశ్వర్ బత్తుల

ప్రక్రియ:-వచనకవిత్వం.

శీర్షిక:-ఆలయాలజీర్ణవ్యవస్థ..!

#####################

శతాబ్ధాల కాలమునాటి భారత

సంస్కృతిసంప్రదాయాలకద్దంపట్టే తార్కాణాలుపురాతనాలయాలు.!

ఇపుడున్నాయి!శిథిలజీర్ణావస్థలో.!


మానవుడో...!మహనీయుడో.....!

దేవుడో..!లేక.!దైవదూతయో..!

నిర్మించారునవకాంతులీనునట్లుగ!

సాంప్రదాయసమహారసుందరంగా!

దేదీప్యమానంగా వెలిగెనానాడు..!


కాలగర్భానకఠినాత్ములకర్కషత్వం,

మతమౌఢ్యపిశాచదాష్ఠికత్వం,

రాజ్యకాంక్ష్యయరాచకత్వం,

ఆలయాలనిర్లక్ష్యపక్షపాతతత్వం,

ఆభివద్దిఅనాసక్తితత్వం,

వెరసిశల్యశిథిలమైనాయి గుళ్ళు.!


తురుష్కతుగ్లక్ దురహంకార శైలి

హిందూదేవాలయదర్భేద్యాలపై

దస్సాహసక్రీడ కిరాతమై

హిరణ్యకశ్యపకృత్యాలకాహుతై

హంపి,మహాబలిపురపుణ్యక్షేత్రాల

పురాతనశిల్పకళావైభవాన్నిచూచి భరింపజాలనిదురితవీక్షణంబుల

అందవిహీనముజేసిన శిల్పాలను

గాంచినగుండెతరుక్కుపోయేస్థితి.!

వినాశకరశక్తులునెదురుగనుండిన

చీల్చిచెండాడకయేమనసుండును.!


నాడుదురాక్రమణలదౌర్జన్యకాండ,

నేడురాజకీయనాయకులాధిపత్యం,

మతచాందసవాదులహంకారం,

ఆలయాలపూర్వవైభవము........!

అలలారునో...!లేదో...!

జనం.!మనం.!ఆలోచించాలిమరి..!


###ధన్యవాదాలు మేడం##

         ఈశ్వర్ బత్తుల

మదనపల్లి.చిత్తూరు.జిల్లా.


🙏🙏🙏🙏🙏🙏

04/10/20, 12:32 pm - +91 98679 29589: నమస్కారమండీ, 

*అప్పుడు దురాక్రమణకు గురై శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు పాలకుల నిరాధారణకు గురై శిథిలావస్థకు చేరాయి.* బాగా చెప్పారండీ🌺💐🌹🙏

04/10/20, 12:42 pm - venky HYD: ధన్యవాదములు

04/10/20, 12:45 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

అంశం...శిథిలాలయాలు

శీర్షిక...మార్పు అనివార్యం

పేరు...యం.టి.స్వర్ణలత

తేదీ..04.10.2020


అలనాడు సంస్కృతితో అలరారు 

ఆలయాలపైన...

శత్రువులు దండెత్తి దోచుకుని మార్చారు శిథిలాలయాలుగా


నేటి సమాజమందు...

స్వార్థం కుటిలత్వం అధికమై

కుల మత వర్గ విభేదాలతో

సమాజానికి తూట్లు పొడుస్తూ

మారుస్తున్నారు సమాజాన్ని శిథిలాలయంగా


విశ్వవ్యాప్తంగా వేనోళ్ళ కొనియాడబడిన

గొప్ప సజీవ సంస్కృతి మనది

నవనాగరికత సంతరించుకుని

పాశ్చాత్య పోకడలతో నేడు

ఆహారం ఆహార్యం జీవనశైలి యందు

చేస్తున్న మార్పులతో కలిగిస్తున్నారు

సంస్కృతి కి విఘాతం

ఆహ్వానిస్తున్నారు అంతమవని రోగాలను


ధర్మం ఒకప్పుడు నాలుగు పాదాలపై నడిచి

దేశ అభ్యున్నతికి సౌభాగ్యానికి కారణమైంది

నేడు ఒంటిపాదం సైతం కుంటిదై పోయి

దేశాన్ని అవినీతిన అగ్రస్థానంలో నిలిపింది


స్వచ్ఛమైన హృదయంతో  మానవత్వం కలిగి

పరోపకారమే పరమ ధర్మమని చాటువారు

నేడు నమ్మిన వారినే నట్టేట ముంచుతూ

మారుస్తున్నారు హృదయాన్ని శిథిలాలయంగా


బంధాలకు బంధీయై ఆనందం పొందువారు 

అలనాడు

బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలై ...

ధనవ్యామోహంతో వెలవెల బోతున్నాయి నేడు


అంతకంతకూ పెరుగుతున్న అత్యాశే మూలం

ఇకనైనా మేలుకోవాలి మార్పు అనివార్యం

హంగూ ఆర్భాటాలకు తిలోదకాలిచ్చి

అసలైన ఆనందం వెతుకులాడాలి

రెప్పపాటు జీవితాన్ని గొప్పగా మార్చాలి

పదుగురి గుండెల్లో చిరస్థాయిగా నిలవాలి

04/10/20, 12:52 pm - +91 96185 97139: మల్లి నాథ సూరి కళాపీఠము 

 ఏడుపాయల " సప్తవర్ణముల 

సింగిడి "

  పేరు : డిల్లి విజయకుమార్ శర్మ 

కుమురంభీంజిల్లా "ఆసిఫాబాదు. 

అంశం : హృదయ స్పందనలు

 కవుల వర్ణాలు

శీర్షిక : శిథిలాలయాలు"

*************************

పల్లవి "

ఆలయాలు "శిథిలాలయాలు "

ఇవి చరితకు" తారాక్కణాలు"

నాటి నిర్మాణ కౌసలానికి

మచ్చుతునకలు"

1. చరణం

నేటి "ఆధునిక శాస్రాని"సవాలు

గా నిలచినాయి. నేటి ఆధునిక"

తానాన్ని" వెక్కి రిస్తున్నాయి"

రాక్షస" గుడులని" రాత్రి రాత్రి

యే నిర్మాణం గావించి నారు

"కోడి" కూతతో" అచటి నుండి

 వెళ్లినారు "ఆ

2. చరణం

దానికి చిహ్ననాలే" నేటి శిథిలాలయాలు "జనగామా"

గుడులు" దీనిలోని"లింగము"

శ్రీ చక్ర" సహిత నిర్మాణము"

ఇది "మహిమాన్వితము"

అనియు "ఋషులు"మునులు"తెలినారు. నేటి "ఆధ్యాత్మిక "సాధువు"

లు ధృవపరచినారు"ఆ"

3.చరణం"

నాటి సంఘటనలకు ఇవి

తార్కణాలు"అదే"వాంకిడి"

లోని "శివాలయం" నాడు

యాదవరాజు"ను" రాణీ

రద్రమదేవి" సంహరించినాది"

విజయానికి "గుర్తుగా"

బోళాశంకరుని "ప్రతిష్టంచినాది"

ఆ"

4.చరణం

నేటి శిథిలాలయాలు "హంపీ"

ఖజురహో"రామప్ప" వేయి స్తంభాలగుడి" ఎన్నెన్నో "

ప్రాచీన ఆలయాలు "శిల్పి 

కళ" కు ఆవాసాలు"

శిల్పుల"నైపుణ్యానికి"నిలయాలు "ఆయువును పట్టుల"

వంటివి" ఆ"

5. చరణం

శిథిలాలయాలను బాగు పరచాలి.

నేటి వారలకు "వారసత్వంగా"

నిలుపాలి"

వీనిని చరితకు "నిఘంటువు

లుగా మలచాలి"

ఈ ఆలయాలు "మన భారతీయ సంస్కృతి కి

ఆయువు పట్టులు"

6.చరణం

నేడు ధనము గల "దేవాలయాలకు"

దేవాదాయ ధర్మదాయశాఖకు"

సొమ్మును "ధనమును సేకరించు" ధనాగారాలు"

వీటి వేరు వేరు మార్గాలకు"

మళ్లించు "ఊట చెరువులు"

"ఆల"

04/10/20, 1:08 pm - +91 93984 24819: అభినందన కానుకలిచ్చిన

బంగారు సమత గారికి,

రామశరాలంటూ రక్షణ కవచం

లాంటి అభినందన ఒసగిన

అంజలి ఇండ్లూరి గారికి,

ఉప్పొంగిన భావోద్వేగ మంటూ

త్రివిక్రముడు అందించిన

త్రిశూలం లాంటి అభినందన

సుమాల అభినందన వేసిన

పెద్దలు బాబూరావు గారికి

మనస్ఫూర్తిగా చెదరని అభివందనములు అందిస్తున్నాను

స్వీకరించండి...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

👋🏽👋🏽👋🏽👋🏽👋🏽💐💐💐💐💐రాజుపేట రామబ్రహ్మం.

04/10/20, 1:25 pm - +91 94412 07947: 9441207947

మల్లినాథసూరి కళా పీఠం YP 

ఆదివారం 04.10.2020

అంశం.శిథిలాలయాలు

నిర్వహణ.శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు 

=====================

సీ.    1

సామాజికములోన సారూప్యతలు తగ్గె

వన్నెల విలువలు వాసిపోయె

ఏవర్గమునుగన్న నేతీరు జూచిన

ఈర్ష్య భావములెల్ల నార్షమాయె

సంస్కృతి దరిదాపు చాదస్తమయ్యింది 

యనకరణమ్మును నలరుకుంది

ధర్మంబు ఎక్కడో తాదాగి పోయింది 

హృదయంబు బద్ధలై చెదరిపోయె

తే.గీ. 

ఆత్మ బంధాలు యెప్పుడో నాటకెక్కె

ప్రేమ బంధాలు నిత్యమై ప్రీతినొసగె

శిథిలమయ్యాయి యానాటి జీవితాలు

పావురమ్మేది గమనించ భారమయ్యె 

తే.గీ.  2

ధ్వంసమైనట్టి నాలయ ధ్వజము జూడు

శిథిలమైనట్టి శిల్పాలు చెక్కలాయె

గర్భ గుడియైన కనరాదు గబ్బిలములు

తిరుగ జీర్ణమై యుండనే దేవళములు

తే.గీ.  3

ముఖము మంటపం కనరాదు మొక్కరాదు 

అంతరాళము కనరాదు సాంతముగను

చుట్టు ప్రాదక్షిణము జేయు చోటుయేది?

వీథి యంతట శిథిలాలు విస్తరించె 

తే.గీ. 4

విమన భాగమ్ము శిఖరమ్ము పెచ్చలూడె

నిత్య కళ్యాణ మంటపం నీళ్ళు నిండె

హోమగుండము నానియు క్షామ మాయె

నిత్య నైవేద్య మెప్పుడు నీరజాక్ష !

తే.గీ. 5

స్నాన ఘట్టము కూలెనే వానలకును

పశుల పాకయు కూలెనే వర్షములకు

దేవ దేవుని దర్శింప స్థిరత లేదు

మనిషి మనిషి గా జీవించ మమత లేదు

తే.గీ.  6

దేహి దేహమ్ము నుండియు తేజమొంది

ఆత్మ పరమాత్మ భావన కాప్తుడయ్యి

దేహమే దేవుళంబని తృప్తి నొంద

శిథిల మటుమాయ మైపోవు చేతనునిగ

           @@@@@@@@@@

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

04/10/20, 1:26 pm - P Gireesh: *సప్తవర్ణముల సింగిడి*

 *మల్లినాధ సూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు : శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం : శిథిలాలయాలు*

*శీర్షిక : పాఠశాల*

*ప్రక్రియ: వచన కవిత*

*నిర్వహణ:  శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు*

*తేదీ 04/10/2020 ఆదివారం*

*రచన పొట్నూరు గిరీష్,*

*రావులవలస, శ్రీకాకుళం*


పాఠాలు బోధించే గురువులు దేవుళ్ళయి, వారి బోధనలు విని సన్మార్గంలో నడిచే పిల్లలు భక్తులై కొలువైయున్న పాఠశాల ఓ అందమైన దేవాలయం.


కరోనా కష్ట కాలంలో

కార్పొరేట్లు కాసులకి ఆశపడి

క్లాసుకో రేటు పెట్టి 

పిల్లాడికో రేటు పెట్టి

క్లాసురూములో పాఠాలు

జూములో చెప్పితే

నెట్టింటి సిగ్నల్స్ 

నట్టింట్లోకి రాక

పాఠాలు అర్ధం కాక


తల్లిదండ్రుల ఆర్థికభారంతో

పిల్లల భవిష్యత్ తో చెలగాటం

బడిగంట మ్రోగక

అంతర్జాల విద్య అందక

పిల్లలు బడికెళ్ళలేక

విద్య అందని ద్రాక్షగా పేదవారు పేదవారిగానే, నిరక్షరాస్యులుగానే మిగిలిపోయి విద్యరాక వింతపశువులైపోతారేమొనన్న భయమేస్తుంది.


అందమైన పాఠశాలలు శిధిలాలయలు అయిపోతాయేమోనన్న భయమేస్తుంది.

04/10/20, 2:11 pm - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 041, ది: 04.10.2020. ఆదివారం.

అంశం: శిథిలాలయాలు

శీర్షిక: కళతప్పెనెన్నెన్ని ఆలయాలు

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీమతి అంజలి ఇండ్లూరి  గార్లు.

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: ఆధునిక పద్యం 


సీసమాలిక

"""""""""""""""

కాకతీరాజులు కట్టించె గుడులెన్నొ

     శిల్పాలుగమలచె శిలలుయన్ని

కృష్ణరాయలవారి కృషికిఫలితమేను

     దేదీప్యముగవెల్గె దేవళాలు

ఏదిక్కుకెళ్ళినా యేమిచెప్పగలము

     పుణ్యదేవతలున్న పుణ్యభూమి

అందంగచెక్కిరి యజంతశిల్పాలు

     శిథిలమయ్యెనునేడు శిల్పకళలు

రాతికంభాలలో రాగాలుపలికించి   

     రామప్పదేవళం రమ్యముగను

రామదాస్ నిర్మించె రామాలయంబును

     భద్రాచలంబున భక్తితోడ

అగ్రహారంబులు యావిరయ్యెనునేడు

     దీపధూపాల్లేని దేవళాలు

కళకళలాడేటి కలియుగగుడులెల్ల

     వెలవెలబోయేను వెలితిగాను

గొప్పగాకట్టిన గోపురాలెన్నెన్నొ

     మట్టిలోకలసెను మమతలేక


తే.గీ.

ధర్మరక్షణ కవువైన ధరణిలోన

కొండకోనలమధ్యున్న కోవెలిపుడు

కాలగర్భానగలిసెను కట్టడాలు

శిథిలమయ్యెనాలయములు శిలలవలెను


👆ఈ పద్యకవిత నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

04/10/20, 2:17 pm - +91 94911 12108: మల్లినాధసూరికళాపీఠంYP

అమరకులదృశ్యకవిచక్రవర్తి గారు

అంశము... దృశ్యకవిత..

          శిధిలదేవాలయాలు

శీర్షిక.. శిధిలదేవళము

రచన...పల్లప్రోలు విజయరామిరెడ్డి

ప్రక్రియ... పద్యము


               సీసమాలిక

               **********

మానవమేధస్సు మాననీయంబైన

సమసమాజముగా సాగవచ్చు


నుత్తమసంస్కృతి మత్తేభమైచన

విశ్వమందునదియే విజయమందు


ధర్మముదప్పని  ధర్మవీరవరులు

దిరుగాడుభువినిల్చు స్థిరముగాను


యమలినహృదయులు సమరీతి మెలగిన

పరమాత్మముదమున పరవశించు


ప్రతిఫలమాశించు బంధుత్వముల్మాన

మనయనుభావము కొనసాగు


కాదనిమసలెడి కాయములెల్లను

శిధిలదేవళమౌను చిత్రమిదియె


పునరుద్ధరణజేసికొనుభాగ్యమందుము

కళకళలాడును  కాయమెపుడు



నరునియాశ్రయించి నడచుధర్మముచూడు

యసలునిజముదెలిసి యాచరించ

దేహమందునాత్మ దెలియగలముభువి

శిధిలమన్నదదియు చెదరిపోవు !!

                🙏🙏🙏

04/10/20, 2:19 pm - S Laxmi Rajaiah: మల్లినాథసూరి కళాపీఠం -YP

ఆదివారము: హృదయ స్పందనలు 

అంశము: శిథిలాలయాలు.    4/10 

నిర్వహణ: శ్రీమతి అంజలి ఇండ్లూరి 

               గేయకవిత 


            కొండలలో కోనలలో

            భీకరారణ్యాలలో 

            ఆలయాలు నిర్మించిరి 

            అలనాటి భూపతులు 


            వెలిగి వెలిగి కొన్నాళ్ళూ 

            విసుగెత్తిన వన్నట్లు 

            నిత్యారాధన లేక 

            శిథిలమై పడియున్నవి 


            మతవైషమ్యాలతో 

            ఈర్ష్యాద్వేషాలమధ్య 

            నలిగి పోయి శిథిలాలై 

            నిరీక్షిస్తు వస్తున్నవి 


            కొలిచే భక్తులు రాక 

            వెలిగే దీపాలు లేక 

            విలవిలమంటున్నట్లుగ 

            శిథిలాలయములు తోచు 


            శిల్ప సౌందర్యమును 

            కళాఖండములు చాటు 

            ఎండవానలకు నోర్చి 

            స్వాగతించు పర్యాటకుల 


            శిల్ప వైవిద్య శోభలు 

            చిందులేయగనేడు 

            పునరుద్ధరణ కొరకవి

            వేచియున్నవి చూడు 


            భక్తి భావనలు పొంగు 

            భాగ్యవంతుల లెవరో 

            నిర్మాణమును చేయు 

            నిర్మాత లెవరొ రారా?


            మానవ దేహమ్మది 

            క్షీణించి పోవు నట్లు 

            మందిర శోభలన్ని 

            మరుగునబడి పోయె 


           మన కళాత్మతను దెల్పు 

           శిథిలాల యమ్ములను 

           చిగురు తొడుగు నట్లుగా 

           చేయాలి మనమంత 


          శ్రీరామోజు లక్ష్మీరాజయ్య 

          సిరిపూర్ కాగజ్ నగర్.

04/10/20, 2:27 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం : శిధిలాలయాలు 

తేదీ : 04.10.2020 

నిర్వహణ : శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు  

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్ 

*************************************************************

"దేహో దేవాలయో ప్రోక్తహ జీవో దేవా స్సనాతనః 

త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్"

ఏ మహానుభావుల ఇష్టాపూర్తికి రూపాన్ని సంతరించుకున్నాయో

ఏ శిల్పి ఉలి చెక్కిన శిల్పాలకు నిలయంగా మారాయి 

ఆ కళానైపుణ్యం, ఆ సాంకేతికత నేటికీ అర్ధం కాని రహస్యాలే

ఎందరో ముష్కరుల ముష్టిఘాతాలకు తట్టుకుని 

నిలబడ్డ శిధిలాలయాలు మన ఆలయాలు 

ఆ వారసత్వ విలువలు ఎరుగని ఎందరో 

వాటిని శిధిలాలుగానే సమకట్టి నేలపాలు చేస్తున్నారు 

ఎన్నో సంస్కృతులకు, ఆనాటి జనజీవన స్రవంతికి 

ప్రత్యక్ష సాక్ష్యాలు ఈనాటి మన శిధిలాలయాలు 

రాతి గోడలనడుమ గర్భగుడిలో వెలిగే దైవం లానే 

పాంచభౌతిక పార్థివ శరీరంలో వెలిగేను పరంజ్యోతియై ప్రాణం 

దేవాలయం వలెనె దేహాలయాన్ని కాపాడుకుంటేనే 

భుక్తి, ముక్తికి అది సాధనమౌతుంది 


పుడక పుడక ముక్కుతో తెచ్చి గూడుకట్టుకున్న గువ్వల్లా 

కన్నవారు తాము పరిమళించి వారసత్వాన్ని వారసులకు అందిస్తే 

కనిపెంచిన వారిని వారి కలల పొదరింటినుంచి వీధులపాలు చేస్తున్నారు 

అందాల గృహాలయాన్ని స్మశానంగా మారుస్తున్నారు 

మనం ఇచ్చిందే మనకు తిరిగి వచ్చినట్లు 

మన స్థానం మారినప్పుడు ఆ వేదన మనల్ని కలచివేస్తోంది 

ఆలోచనలు మార్చుకుందాం అమ్మానాన్నలను గుండెల్లో దాచుకుందాం

 

విద్యకు క్షేత్రమై అక్షర బీజాలను నాటి 

జ్ఞాన సేద్యం చేస్తున్న విద్యాలయాలు  

చదువులు అమ్ముకునే అంగళ్లుగా మారుతున్నాయి 

లేనివాడికి చదువు అందని ద్రాక్షపండుగా మారుతోంది 

అర్ధం కాని చదువుల్లో సగం జీవితం గడిచిపోతోంది 

మానవ జీవిత పరమార్ధాన్ని చెప్పే చదువులెక్కడ 

రాంకుల పరుగుపందెంలో అలిసిపోతున్న పందెం కోళ్ళు నేటి విద్యార్థులు 

విద్యాలయాలు తిరిగి సరస్వతీ ఆలయాలుగా మారాలి 

*************************************************************

04/10/20, 2:35 pm - +91 97013 48693: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

నిర్వహణ:అంజలి ఇండ్లూరి

రచన:గదాధర్

శీర్షిక:శిధిలాలయాలు


ఆలయం శిధిలమౌతుందా....!

ఆధ్యాత్మికత దూరమౌతుందా....!

పరమాత్మనిలయానికి వన్నె తగ్గుతుందా..!

ముళ్ళచెట్లు పెరిగితే అపవిత్రమవుతుందా......!

కట్టడమా...శిధిలమయ్యింది కట్టుబాట్లా...!

ఈ బట్ట బుర్రకెప్పటికీ అర్ధం కాని ప్రశ్నలెన్నో


దేహం మట్టయ్యితే వ్యామోహమెందుకు....!

మట్టి మట్టిలో కలిసిపోతే శోకమెందుకు...!

శిల్పం శిధిలమయితే ఉలికి కన్నీరెందుకు...!

తను చెక్కిన రూపంలో జీవమున్నందుకా...!

శిలే పరమాత్మయి పూజలందుకున్నందుకా

ఈ చిట్టి బుర్రకెప్పటికీ అర్ధం కాని ప్రశ్నలెన్నో


విశ్వేశ్వరుడు విశ్వరేడయితే లేని చోటుందా

అలయం శిధిలమైతే దైవం ఉనికి ప్రశ్నవుతుందా 

శిలలవుతున్నాయా నేటి జన హృదయాలు

భారమవుతున్నాయా మేటి సంప్రదాయాలు

పతనమవడానికి దారితీస్తున్న పరిస్థితులు

దాటకూడదు కదా పవిత్ర పరిధి గీతలు...!

ఏమో ఈ మట్టి బుర్ర కన్నీ వింత వింతలే....!


భౌతికంగా మసకబారకుండా చూడలేమా...!

మనసే కోవెలగా మార్చలేమా .....!

హృదయాలయ మయినా దేవాలయమయినా

శిధిల మయ్యిందంటే తప్పెవ్వరిది ముప్పెవ్వరికి

అజ్ఞానానికి అర్ధం కాకున్నా విజ్ఞులకర్ధమయ్యే ఉంటుంది...!


🌻🌻🙏🙏🙏🙏🌻🌻

04/10/20, 2:41 pm - +91 97017 52618: ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో......

          సప్తవర్ణములసింగిడి

మల్లినాథసూరి కళాపీఠం yp

సప్తవర్ణాల సింగిడి

హృదయ స్పందనలు కవుల వర్ణనలు 

అంశం : *శిథిలాలయాలు*

నిర్వాహణ... కవయిత్రి శ్రీమతి ఇండ్లూరి అంజలి గారు  

**********************************************

*రచన     :   మంచికట్ల శ్రీనివాస్* 

*ప్రక్రియ  :   వచనము* 

అంశము :  నా హృదయం శిథిలమైంది

*****************************************

చిన్నప్పుడెప్పుడో నా హృదయం శిథిలమైంది

వినిపించే కనిపించే ప్రతిదీ కన్నీరొలికించే వేళ ఇంకా శిథిలమౌతూనే ఉంది!


విలువలు తరిగి వలువలు లేకుండా స్త్రీమూర్తిని చలన చిత్రాల్లో చిత్రంగా చూపినప్పుడే..!


కన్నవాళ్ళని కాదని కట్టుకున్నోళ్ళే నావారని జీవితాన్నిచ్చి ఏరుదాటించిన తెప్పలను వృద్ధాశ్రమాల్లో వదిలేసి కాటిలో తగిలేసినప్పుడే! 


నిధుల లేమితో నిందలు మోయలేక విధివిధానాలు మార్చుతూ ఘడియకో గమ్మత్తుతో సగటు జీవిని క్రమబద్ధీకరణల పేరుతో పీల్చి పిప్పి జేసి ఇటునుండి తీసుకుంటూ అటునుంచి ఇచ్చే ఛందము చూస్తున్నప్పుడే...! 


చదువుకి సాంకేతిక సొబగులద్ది ఆన్లైన్ బోధనతో ఆశలు పేర్చి అధికమొత్తాలు దండుకుంటున్న బడా బాబులను ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడే..!


ఫలితాల ప్రకటనల్లో తప్పిదాలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఆత్మహత్యల వైపు దారితీసినప్పుడే...!


జనావసరాలకు అద్భుత సాంకేతిక సొబగులద్ది తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి చూపిస్తూ ..అమలులో నిధులు అథోపాతాళమని తేల్చినప్పుడే...!


*ఈ కుభేరు* అంటూ ఇస్తామెప్పుడూ ఫస్టున   జీతాలంటూ ఇప్పుడు *భార* మంటున్న   బాధలను చూసినప్పుడే..!


ముష్కరుల దాడికి ముక్కు చెవులు కంఠాలు చేతులు బొజ్జలు పెచ్చులుగా ...ఊడి  భారతీయ కళలు సంస్కృతి తెగిపడిన అంగాలుగా చూసినప్పుడే..!


ఆరేళ్ళ పాప పై అరవై ఏళ్ళ మృగాలు 

*దిశ* ఘటనతో దశ తిరిగిన వ్యవస్థ అవస్థ 

*నిర్భయ* తో   నివురుగప్పిన నిజాలు కనీ విన్నప్పుడే..! 

నా హృదయం శిథిలమయిందప్పుడే..!


ఇప్పుడు నా శిథిల హృదయం శిథిల దేవాలయమే..! 

అందులో చీకటి సంఘటనలెన్నో చిత్రాలై నన్ను వెక్కిరిస్తున్నాయి. 

నీతి మాలిన భూతులెన్నో శిథిల గోడలను మరీ మరీ ఛిద్రం చేస్తున్నాయ్..

అయినా నా హృదయం వైపు కన్న తల్లి గుండె చప్పుడు వలె నా మనసెందుకో జాలిగా చూస్తోంది! 

దానికేదో *చికిత్స* ఉందనీ...!

04/10/20, 2:42 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీమతి అంజలి ఇండ్లూరు గారు

అంశం: శిథిలాలయాలు

శీర్షిక: దేహమే దేవాలయం

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 04.10.2020  


దేహమే దేవాలయం 

దేవాలయానికి మరి తూట్లు పడనీయరాదు 

మానవీయ విలువలు మరచి 

సంస్కృతిని సమాధి చేసి 

కులమత సంకుచిత భావనలో 

ఎవరికి వాళ్ళు తానే రాజు తానే మంత్రి 

అనే విధంగా విశ్వరూపం ధరించి 

నాగరికతను మరచి 

పెద్దలను విడచి 

త్రిగుణాలను మరచి 

కామ క్రోధ లోభ మోహమదమాత్సర్యాలు పెరిగి 

అష్టావక్రుడికి అష్ట భార్యల చందాన విర్రవీగుతూ 

తన దేహాన్ని పంచదార బోమ్మగా మార్చుకున్నాడు 

శిథిలావస్థలో ఉన్నవి గుళ్లు గోపురాలు కావు 

మానవ దేహాలు ఊబకాయాలు 

సకల రోగాలతో శిథిలమైన దేహాలు 

శారీరక శ్రమలేని బండరాళ్లు 

మానవత్వపు విలువలు తెలియని మట్టిముద్దలు 

స్వార్ధపూరితమైన రోగజీవులు 

దైవారాధనను మరచిన మరబొమ్మలు 

సంస్కృతిలోనే ఆరోగ్యం ఉందన్న విషయం మరచి 

కుసంస్కారమైన దద్దమ్మలు 

తాత ముత్తాతల చరిత్ర మరచిన వాజమ్మలు 

తరతరాలను భద్రపరచుకోవలసింది హృదయంలో 

వారి ఆచార వ్యవహారాలే మన ధైర్యము 

వారి ఆహారపు అలవాట్లే మన ఆరోగ్య సంపద 

శిథిలావస్థలో ఉన్న దేన్నైనా నిర్మించవచ్చు 

గతవైభవము తెచ్చుకోవచ్చు 

మనిషి దేహానికి తూట్లు పడితే మానుట కష్టం 

మనిషి ఆరోగ్యం పోతే సర్వం కోల్పోయినట్లే 

అందుకే యంత్ర శకటం శిథిలం కాకముందే 

గమ్యం చేరుకోవాలని అమ్మ చెప్పేది 

మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకొవాలని 

అనారోగ్యంతో ఉన్న ప్రతీ దేహము శిథిలాలయమే 

బంధాలు బంధుత్వాలను హృదయంలో పదిలపరచాలి 

ఇంటినే దేవాలయముగా మలచుకోవాలి 

పెద్దలు నడిచిన బాటలో పయనించాలి 

ప్రాణికోటి సర్వంలో దైవాన్ని ఉందని గ్రహించాలి

04/10/20, 2:55 pm - +91 98495 90087: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-శ్రీమతిఅంజలిగారు

అంశం:-శిథిలాలయాలు.

తేదీ:-04.10.2020

పేరు:-ఓ. రాంచందర్ రావు

ఊరు:-జనగామ జిల్లా

చరవాణి:-9849590087


విగ్రహంమనిషినిగ్రహంపెంపొందించే మార్గం. విగ్రహముఅది

ఒక రాతిబొమ్మకాదు. దేవుని

ప్రతిరూపంగా, ప్రాణప్రతిష్ఠ

చేసిఅదిమహిమాన్వితరూపంగాకొలిచే దైవం. భగవంతుడే

అర్చారూపంగా కలియుగంలో

పూజలందుకునే తత్వం. సత్ప్రవర్తన, సన్మార్గములో

నడవడానికి అదొక వేదిక. 

దేవాలయాలు ఒక ఆధ్యాత్మిక

కేంద్రాలు కాదు. అవి రాజరిక

వ్యవస్థలో పరిపాలనా కేంద్రాలు

రాజకీయ వ్యూహలు, విద్యా కేంద్రాలు, బాటసారులకు

ఆశ్రమాలు. దేవుని సేవచేసే

కొన్ని రకాల స్త్రీల తెగలకు

ఆవాసాలు. అతిపెద్ద కోశాగారం

ఇలా దేవాలయాలు బహుళార్ధ

సాదకాలుగా ఉండెడివి.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక , 

నిలయంలో. మొదటి నుండి, 

విదేశీయులకన్నుమనసంపన్న

భారతదేశంపై ఎన్నోరకాల దాడులకుపురికొల్పింది. మొదట వర్తకంనెపంపెట్టుకుని, 

వచ్చి మెల్లగాభారతీయఆథ్యా

త్మికతపై దెబ్బ కొట్టి, తరువాత

ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం,

విద్యను, సంపదనుకొల్లగొట్టి

తమతమదేశాలకుతరిలించారు. దేవాలయమువిద్వంసం

మన స్వతంత్ర భారత దేశంలో

కూడా జరగడం, చాలాబాధా

కరం. ఏమైనా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు, 

నెలవైనమనదేవాలయాలు

శిథిలావస్థకు చేరుకోవడం చాలా శోచనీయం. దేవాలయాలపునరుద్దణజరిగి, 

పూర్వ వైభవం రావాలని

ఆశిద్దాము.

04/10/20, 3:05 pm - +91 91779 95195: మల్లినాధా సూరి కళాపీఠం y p

సప్త ప్రక్రియల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి

గారి నేతృత్వo

అంశం: శిథిలాలయాలు

శీర్షిక: చెదిరిన శిల్పాలు

నిర్వహణ: శ్రీమతి అంజలి ఇండ్లూరి

పేరు:రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

*********************

భారతదేశంకళలకుకాణాచి

ఓ శిల్పి శ్రేష్టుడా!

సాక్షాత్తు నీవు బ్రహ్మవు!

నిన్ను చూసి  కొండలన్నీ

అందమైన ఆకృతిగా మలచుకునే.........

నీవు వాటిపై ఉలితో అమృతాన్ని చల్లి వాటికి ప్రాణం పోసావు.......

సాక్షాత్తు నీవు బ్రహ్మవు.....


ఇంత అందంగా చెక్కిన శిల్పాలను ఈరోజు శిధిలావస్థలో ఉన్నాయని తెలిసి, చూసి మనసు మూలుగుతుంది.......


చెదరి వీధినపడ్డ సింహ విగ్రహములు కానీ,

గజరాజుల తలలే కానీ

శిల్పాల యొక్క కాళ్లు చేతులు విరగ్గొట్టి నవే కానీ

తురుష్కులపాలనలో గాని

దండయాత్రలలో గాని

చక్కని శిల్పాలు చితికి చితికి శిథిలమై పోయాయి..


రఘునాథ వీరుడు కట్టించిన దేవాలయాలు ఈనాడు నిజాం రక్కసి చేతిలో పడి చెరసాల గా మారి వికారంగా కనబడుతున్నాయి నేడు.....


ఓరుగల్లు కోటను ముస్లిం పాలకులు కుక్కలు చింపిన విస్తరి చేసిరి..........

చెల్లాచెదురై పోయి

శిథిలమై పోయిన విగ్రహాల మధ్యన అక్కడ అక్కడ గుడ్లగూబ మూకలుఅరుపులు......


హంపి హలెబీడు ఎల్లోరా

రామప్ప మహాబలిపురం ఇంకా  చెదురుమదురుగా పడిన శిల్పాలే కనబడే నేడు......


దేవళం లోని ధనాన్ని అపహరించి,

రమణీయ విగ్రహాలను విరిచేస్తూ

గో పురములను కొల్లగొట్టుంచి

హిందువుల కట్టుబాట్లను తుడు చేస్తూ.......

మన దేశ సంస్కృతి సంప్రదాయాలను పాడుచేస్తూ.............

ముందు తరాల వారికి శిధిలాలను మిగిల్చారు...


ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ సంస్థవారు కళ్ళు తెరిచి

శిథిలమై పోయిన వాటికి

పునరుద్ధరణ చేయిస్తారని

ఆశతో..................

**********************

04/10/20, 3:19 pm - +91 93014 21243: మల్లినాధసూరి కళా పీఠం, ఏడుపాయల

అంశం - శిధిలాలయాలు

ప్రక్రియ - వచన కవిత

పేరు - తెలికిచర్ల విజయలక్ష్మి

నిర్వహణ - అంజలి ఇండ్లూరి

4-10-2020


ఆత్మీయత దూరమై, అనుబంధమే కరువై... తండ్రి బతికి ఉన్నప్పుడు శిధిలావస్థలో.... ఉన్న బంధమా! ఇప్పుడు పూర్తిగా సమాధి అయ్యావు.


అమ్మ వేసిన నిచ్చెన సాయం తో.... ఎక్కి, ఇంతింతై వటుడింతై అనే చందాన,  జీవితం లో అందుకొలేనంత ఎత్తుకు ఎదిగిన కొడుకుల కోసం ఇదిగో వస్తారు అదిగో వస్తారని ఎదురు చూస్తున్న అమ్మ....


కొడుకులు వస్తారని, వచ్చి తీసుకు వెళతారని...ఎదురు చూసిన అమ్మకు, కొడుకులు అయితే రాలేదు కానీ... మరణం మాత్రం తన దరిచేరింది.


పిల్లలు డాక్టర్ లు, ఇంజనీర్లు అవాలని కోరుకునే అమ్మ, 

వారి ఉన్నత స్థాయి గూర్చి కబుర్లు చెప్పుకుని మురిసే అమ్మ...నేను ఆఖరి ఘడియల  లో వున్నాను, ఒక్కసారి రండి అని పిలిచినప్పుడు వెళ్లలేని పిల్లల బంధాలు, శిధిలావస్థలో వున్నాయి అవి ఇంక కూలిపోయాయి.


ఎవరికి ఎవరు ఏమీ కారు, తల్లి గర్భాన పుట్టిన అయిదుగురు పిల్లలు, పాడె మొయ్యటాని కి నలుగురు, కుండ పట్టుకోవటానికి మరొకరు, అని సంతోషించిన తల్లి కరోనా కారణం తో...

ఆఖరు చూపు కి ఒక్కరూ కూడా రాక..

అనాధ శవంలా చితి మంటల లో చేరుతున్న అమ్మ.

04/10/20, 3:37 pm - +91 98499 29226: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల

ప్రక్రియ.     వచనం   

అంశం     శిధిలాలయాలు 

శీర్షిక      శిధిల మనుషుల కూలదోయు  యుగమెప్పుడో     

రచన.        దార. స్నేహలత

నిర్వహణ   శ్రీమతి అంజలి. ఇండ్లూరి  గారు 

తేదీ.          04.10.2020


మగువ మానవతాలయాల 

మనుజులలో బతికి ఉన్నాననుకొంటుంది

మానవరూపేనా రాక్షసులు 

 బొముకలెల్లను ఛిద్రం చేసే 

శిధిలాలయాలని ఊహించకున్నది 


జనారణ్యానా జాతిని మృగాలు సైతం 

కారుణ్యమున కాపాడుకొనును 

మానవమృగాల అసురత్వమును 

ఖండాలు చేసేడి ధీరులకై చూసి

వేసారి మూగరోదనతో  జీవిడిచినది


 ఆడబిడ్డలను రక్తమాంసపు ముద్దలుగా

 భావించెడి రాబందుల రాకాసి 

 దాస్టీకరాజ్యములో  ఆ తల్లి 

 యెరుగక  బిడ్డలకు జన్మనిచ్చి

 స్వతంత్ర దేశాన అబాసుపాలైనది 


ఆలయమంటి మాతృగర్భమున 

జన్మించిన స్త్రీ పురుషులిరువురు సమానమే 

ఆ భవిత మళ్ళీ మరో బిడ్డకు పుట్టుకనిస్తుంది కదా 

అంతటి స్త్రీ జన్మని అర్దాంతరంగా 

అంగాంగాల చిత్రవధల సంఘటనలు 

మచ్చుకు కొన్నే వెలుగుకి కానరానివి మరెన్నో 


అవమానం అమానుషం 

ఆక్రోశం అమానవీయం  ఆమెను 

అంగడిబొమ్మగా  బుగ్గిపాలు చేయకండి 

 పశువాంఛతో పెట్రేగే   కౄరులారా 

సహనాన్ని జూసి అచేతనమనుకుంటే 

ఆగ్రహిస్తే అంతముండదని  తెలుసుకోవాలి 

ఈ దుశ్చర్యల సంబరాలు అరాచకీయం 

అధికారం ధనం మాటున ఎన్నాళ్ళో  ఇంకెన్నాళ్లో

ఈ శిధిల  మనుషుల కూలదోయు 

యుగమెప్పుడో  అభయరూపిణిగా

 నడిరోడ్డుపై నడయాడునెన్నడో

04/10/20, 3:38 pm - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

అమరకుల దృశ్యకవి నేతృత్వంలో సప్తవర్ణాల సింగిడి

అంశం. శిథిలాలయాలు. నిర్వహణ.శ్రీ మతి అంజలీ ఇండ్లూరి గారు

పేరు. డానాయకంటి నరసింహ శర్మ


దేశ సంస్కృతి శోభదిగ్దిగంతాలకూ 

పరిఢవిల్లగ వెలిగెశిల్పావతంసాలు 

రమణీయ కమనీయ స్థవనీయ కవనీయ స్మరణీయ శ్రవణీయ

చైత్యాలు క్షేత్రాలు తీర్థాలు

 భావనాపటిమతో అధ్యాత్మగరిమతో

ప్రభవించె విభాసిల్లె విరాజిల్లె

నేడు శైథిల్యమయ్యెనా 

భావశైథిల్యాలు సంస్కృతి శిథిలతలు 

సిద్ధాంత శైథిల్యం స్వేచ్ఛా శైథిల్యం  పచరించె జాతిలో 

వేదఘోషలు మార్మోగినట్టి యీ భారతావనిలోన ఆక్రందనలు రేగె

సాహిత్య సురభిళం నివ్వటిల్లిన చోట

భాషలకు చ్యుతులూ మొదలాయె నేడు

అతిథి అభ్యాగతులకూ ఆలవాలము నాడు

అన్నమో రామచంద్రనుచు రోదననేడు

బాంధవ్య మధురిమలు నాట్యమాడిన నాట

నరహంతక దళాలు పెచ్చుమీరెను నేడు

సంగీత సరిగమలు శ్రావ్యమైనట్టి యీ 

ధాత్రిలో నీరవ స్వరములెల్లెడ పర్వె

గండుకోయిలలన్ని  గళ విహారం జేసె నాడు 

గండభేరుండాలు పొడవసాగెను నేడు

ఈరీతి నేలలో నైరాశ్య నిర్వీర్య శైథిల్య ధోరణులు సంక్షోభ వృక్షమై శాఖోపశాఖలుగ విస్తరించెను నేడు


డా నాయకంటి నరసింహ శర్మ

04/10/20, 3:40 pm - +91 98497 88108: మళ్లినాథ సూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి సారథ్యంలో

నిర్వహణ:శ్రీమతి అంజలి ఇండ్లూరూ గారు

అంశం:శిథిలాలయాలు

శీర్షిక:బతుకు చిత్రం

పేరు:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం


దేవాలయాలు రాతి కట్టడాలే కాదు

మన సంస్కృతి సంప్రాదాయలు

వాటి ఆలనా, పాలన గాలికి వొదిలేసి

విశ్వ నరుడను నేనే అంటూ

నాకు నేనే మేటి

లేదు పోటీ అనుకుంటూ

విర్రవీగే నరుడా

కొట్టాను వేల కోట్లు

నవరత్న రాశులు

ఒక్క సెకండ్ నీ ఉపిరిని ఆపలేవని మరువక

ఉన్నది ఒక్కటే జీవితం

వెయ్యి జన్మల పుణ్యఫలం

వచ్చే టప్పుడు ఎం కట్టుకురాలే

పోయేటప్పుడు ఎం పట్టుకుపోవు

ఈ రాకపోకల నడుమ అంతా అనల్పం

అహం,మొహాలను విడిచి

పాపం,పుణ్యం ఎరిగి

మానవీయ విలువలు గుర్తెరిగి

పరులసేవే పరమార్ధమని తలవాలి

నాది నదంటూ మురుస్తూ

జాలి,దయను మరుస్తూ

పెద్దల సేవ

పిల్లల ప్రేమలకు తావు లేని ఎద వ్యర్థం

శిథిలాలయాల్లో ఉన్న దేవాలయం


*******************

04/10/20, 3:48 pm - +91 96523 71742: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:శిథిలాలయాలు

నిర్వహణ:అంజలి ఇండ్లూరి గారు

రచన:దుడుగు నాగలత



దేవుడెక్కడో లేడు

మంచి,మానవత్వమున్న మనిషి హృదయంలో 

కొలువైఉంటాడు

మనిషి మానవత్వం మరచిననాడు

అతను బ్రతికిఉన్నా

శిథిలావస్థలోకి చేరిన కాయం

సత్ప్రవర్తన,సన్మార్గము కలిగి

సజ్జనులతో స్నేహం,సామరస్యముతో ఉన్న మనిషి

నిత్యపూజలందుకునే దేవుడు కాగలడు

తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావించిననాడు

పర స్త్రీలను అమ్మగా గౌరవించిననాడు

కల్మషమేలేని పసిపాపలలో

 పరమాత్మున్ని చూసిననాడు

మన సంస్కృతీ,సాంప్రదాయాలను

పద్ధతులను పాటించునాడు

సమాజపోకడలను అర్థంచేసుకున్ననాడు

భక్తులతో కళకళలాడే దేవాలయంలా

మన మనసు నిండుమానవత్వంతో

వెలిగిపోతుంది

ఇవేమీ పట్టనట్టుగా

స్వార్థం,అహం,ద్వేషం,పగలంటూ

మనిషిని మనిషే చంపుకుంటూ

మానవత్వాన్ని,సంస్కారాన్ని

మరచిపోతే

అప్పుడు మనం శిథిలావస్థలోకి వెళ్ళినట్టే

ప్రాణాలతో ఉన్నా చచ్చినశవంతో సమానమే.

04/10/20, 3:48 pm - +91 84668 50674: మల్లినాథసూరి కళాపీఠం (Yp)

🌈 సప్తవర్ణ సింగిడి 🌈

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం : శిథిలాలయాలు 

రచన : ఎడ్ల లక్ష్మి

శీర్షిక : ఎప్పుడు అనందనిలయమే

నిర్వహణ : అంజలి ఇండ్లూరి గారు

తేది : 4.10.2020

-------------------------------------------


అందమైన దేవాలయము ఆ గృహం

మాటే మంత్రం మనసే మందిరం

తీపి జ్ఞాపకాల ప్రేమానుబంధాలు

అందరి హృదయాల నిండా

చిన్న పెద్దలు ఉన్న మురిపాల కోట అది

విధి నిర్వహణలో వింతలెన్నెన్నో

బ్రతుకనే ఆటలో ప్రతీ ఒక్కరికీ ఇవే తోడు

నిన్న, నేడు, రేపు

నిన్న అనేది మనిషికి బాల్యం

నేడు అనేది మనిషికి యవ్వనం

రేపు అనేది మనిషికి వృద్ధాప్యం

ఈ మూడు దశల్లోబ్రతుకు పోరు ఊహించలేనిది

అందులో ఎన్నో ఆటు పోట్లతో

ఎన్నెన్నో మార్పులు, తీర్పులు

బాల్యం ఎంతో అమూల్యం అమ్మ నాన్న లతో

నేడు అనే కాలమేమొ చాలా ముఖ్యమైన ఘట్టం

తన చుట్టూ ఉన్న అనుబంధాలు, బాధ్యతలను

శిథిలం కానివ్వకుండా ముందుకు సాగే ఆ సమయం

సముద్ర యానం లో సాహస యాత్ర

మార్పు అనే యవ్వనం లో మనిషి నిజ శిల్పం 

శాంతి సందేశం తెలుపునతూ

గత జ్ఞాపకాలతో సహనంతో ముందుకు 

సాగిపోవడము మంచివారి లక్ష్యం

ఆ సమయంలోనే మంచి చెడుల మార్పులు

అందరి హృదయాలు గాయాలైనా మురళిలా 

సంతోషంతో మధుర గీతాలు పాడి నటుల

శిథిలావస్థలో నుండి బాగుపడే వారెందరో

అప్పుడే వెలిగే దీపాల కోవెల ఆ గృహం

ఎప్పుడు కూడా నొక్కు పోనీ శిలలా

శిథిలం కానీ జీవితాలతోఆ ఇల్లు ఆనంద నిలయం.


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

04/10/20, 3:51 pm - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP

నిర్వహణ:అంజలి ఇండ్లూరి. 

అంశము: శిథిలాలయాలు

శీర్షిక:మౌనరోదన

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292


మరుగున పడ్డ మానవీయ విలువలు

పేరుకు పోతున్న స్వార్థం

కనుమరుగైతున్నా బంధుత్వాలు

మనిషి మనిషి మధ్య

అసత్యపు గోడలు

దిగజారుతున్న ఆచారాలు

పెరుగుపోతున్న ఆకృత్యాలు

అంతరించి పోతున్న

సంస్కృతిక ఆధారాలు. 

పలకరింపు పలకుబడులు

మాతృభాష మాధుర్యాలు. 

మానవ మృగాల మధ్య నలిగి పోయే

ఆడ పిల్లల ఆత్మ ఘోషలు.

మత్తు మందు బానిసలై

మనిషికి లేని విలువ 

పరువు ప్రతిష్టలంటూ

కులమత విద్వేషాలతో

సంపాదనే ధ్యేయంగా

కుట్రలు కుతంత్ర ఆలోచనలతో

మననే పదం మరుగున పెట్టి

నేను నాకు అనే దానికి పట్టంగట్టి

కసాయి బిడ్డను కడుపులో దాచలేక

నడిరోడ్డున దిక్కులేక రోదిస్తున్న ముసలి జీవుల  ఆకలి కేకలు

మనిషి జీవించే సమాజం అణువణువునా శిథిలాలయాన్ని తలపిస్తుంది. 

మనసు మౌనముగా రోదిస్తుంది.

04/10/20, 4:00 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- శిధిలాలయాలు

నిర్వాహకులు:- శ్రీమతి అంజలి గారు 

రచన:- పండ్రువాడ సింగరాజు

 శర్మ

తేదీ :-04 /10/20   ఆదివారం

శీర్షిక:- కళావిహీన మైన శిల్పి కలల నిర్జీవ విగ్రహాలు

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- వచన కవిత

ఫోన్ నెంబర్9177833212

6305309093

**************************†***********************

కనిపించనవి  కానొచ్చినవి సకల జీవుల హృదయాం తరంగంలో కొలివి తీరిన  దేవుడు  శిధిలావస్థలో ఉన్నాడా?  లేక భూ ప్రపంచంలో నడయాడుతూ ఉన్నాడా?  కాన రాడే,... 


అలనాటి శిల్పి కల నైపుణ్యం చిత్ర కళాకారుని కళానైపుణ్యం 

కడు మహాపుణ్యం కాన రాదే 

మహా దృక్పథాలతో మహా సంకల్పాలతో నిర్మించిన ఆలయాలు  దేదీప్తిమానంగా వెలుగొందుతున్న ఆలయాలు


  జీవ కలల కలిగిన ఆలయాలు నిర్జీవమైన

ఆలయాలు   శిధిలావస్థలో అవస్థలు పడుతున్న ఆలయాల్లో బ్రతికిన జీవులు


దేహో దేవాలయ ప్రోకోః జీవో దేవా సనాతనః వేదము చెప్పిన రీతిగా జీవుడే దేవుడు జీవుడి నిర్మించిన దేవుడు చెరగని తరగని కరగని కనివిని యెరుగని దైవం వరమని  శిల్పి

 కళల నైపుణ్యం రాతి కళా శిల్పాలు దివ్యమైన దైవ రూపాలు  కాపాడుకుందాం భారతీయ సంస్కృతిని చాటి చెప్పుకుందాం. .... 


************************************************

04/10/20, 4:03 pm - +91 99595 11321: మల్లినాథ సూరి కళాపీఠం వారి సప్త వర్ణ సింగిడీ, 

అంశం. శిధిలాలయాలు, 

నిర్వహణ. అంజలి ఇండ్లూరి గారు, 


ధర్మకర్తలు లేని గుళ్లు కొన్నాళ్ళకి శిధిలాలయాలౌతాయి, అలాగే, 

నిత్య హారతి నైవేద్యాలు లేని  గుళ్లు, 

శిధిలాలయాలుగా మారి జీర్ణావస్థకోస్తాయి, 

అలాంటి ఆలయాల పునరుద్ధరణకై, 

పెద్దపెద్ద దేవస్థానాలు ముందుకు రావాలి, 

అటువంటి కార్యక్రమం మన తిరుమల తిరుపతి, 

దేవస్థానం చేపట్టింది... 


భగ్న ప్రేమికుల హృదయాలు శిధిలాలయాలు, 

అలాగే దెబ్బతిన్న జీవితాలూ శిధిలాలయాలే, 

స్పందన ఉండదు, కళా కాంతులు ఉండవు, 

బ్రతుకు పై ఆశ ఉండదు, చేసె పని పై శ్రద్ధ ఉండదు, 

నిరాశ, నిస్తేజం కారు మేఘాల్లా చుట్టుముట్టుతాయి. 


అటువంటి శిధిలాలయాలు శిధిల హృదయాల

జీర్ణోద్ధరణ కై ఎవరో ఒకరు ముందుకు రావాలి, 

అప్పుడు శిధిలాలయాలు ప్రభవిల్లుతాయి, 

శిధిల హృదయాలు పల్లవిస్తాయి.... 


ఇది నా స్వంత రచన, 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 9959511321

04/10/20, 4:03 pm - +91 80197 36254: 🚩మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల🚩 అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-శ్రీమతిఅంజలిగారు

అంశం:-శిథిలాలయాలు.

తేదీ:-04.10.2020

పేరు:-కె. శైలజా శ్రీనివాస్ 

ఊరు:-విజయవాడ 

శీర్షిక :కరగనిహృదయాలు 

***********************

ఆధునికతఅని పేరుతో కొత్త దారులు తొక్కుతూ 

చదివిన చదువులకు తిలోదకాలుయిచ్చి 

మంచి మర్యాదను దూరముగా వదిలి 

పెద్దలమాటలను వినకుండామారి 

వికృత చేష్టలకుఅలవాటు పడిపోతూ 

కిట్టీపార్టీలుఅంటూ మొదలు పెట్టి 

దయనుజాలిఅనే పదాలకు

 అర్ధం తెలియకుండా... 

చరవాణికి బానిసలై పోతూ 

అనవసరపు ఆర్భాటాలకు తావిస్తూ  

విచక్షనా రాహిత్యంగా నడుస్తూ... 

విలువలను పూర్తిగామర్చిపోయి 

మానవతకు మచ్చ తెస్తూ మృగాల్లా మారి 

సంస్కారంకు తిలోదకాలిచ్చి వళ్ళు పై

 తెలియక కుటుంబాలను బజారు పాలు చేస్తూ 

కన్నవారికి కడుపుకోత మిగిలిస్తూ.. 

తమ నూరేళ్ళ జీవితాలను బలి పీఠంకి 

ఎరవేస్తున్నారు... బంగారం లాంటి జీవితాలను 

ఉరికంబాలకు, జైలు గోడలకు ఆత్మహత్యలకు 

అంకితం యిస్తున్నారు.... వారు 

ప్రవర్తిస్తున్న తీరును బట్టి చూస్తే.... గుండెల్లో 

ఏదో గుబులు.. ఈ యువత ఎటు నడుస్తోంది 

వారిని ఎలా కాపాడుకోవాలి? వారు 

పెద్దలమనో నిబ్బరాన్ని, ఆత్మగౌరవాన్ని, 

కుటుంబసౌఖ్యాలను శిధిలం చేస్తున్నారు 

బంగారంలాంటి కుటుంబ సంబంధాలను 

మానవీయ విలువలను, సమాజాన్ని 

పాడుచేస్తూ, చీడపురుగుల్లా తయారగుతున్నారు. 

మళ్ళీగాoధీ పుట్టాలి రామరాజ్యం నిర్మిoచ 

సమసమాజం, నవసమాజం స్థాపించ... 

ఆరోజుఎప్పుడు వస్తుందో...? 

*************************

04/10/20, 4:04 pm - +91 91006 34635: మ ళ్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి,తఅమరకులగారు

అంశం, శిది లా ల యాలు

నిర్వహన, అంజలిఇండ్లూరీ గారు

శీర్షిక, మాసియపోనీకు మానవత్వం

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 4అక్టోబర్్2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------



నీ హృదయం శిధిలం చేసుకోకు

మానవత్వంతో మంచి చెడు తె ల్సిమసలుకో 


లేలేత మొలక నేలపై పుట్టు 

తనకో జీవితముందని తెల్సి

కంటికి కనిపించనినలుసైనా 

ఆశలు మొలిపించు కొనొచ్చుజీవిగా

తనజీవితం తనదై బతకడం ప్రతి ప్రాణీహక్కు


బుద్ధి జ్ఞానం తెలిసిన మనిషి 

తానుబతుకుతు

తోటివారికి సాయ పడాలి 

చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడని 


వారి జీవితాలు వారెరుగక

పక్క వాడి మీదేవీడి ధ్యాస

దురాశవల విసిరి అవసర

స్నేహ చుట్టరికాలు కలుపుకొని 

అనుబంధాలప్రేమ కలబోత లంటూ 

తీరినవసరం మొదలంట ము0చి 

ముప్పుతిప్పలు పెట్టి మూతి ముడ్చిదూరమవుతారు 




ఎందరో స్ఫూర్తి దాతలర్పనై

ప్రాణాలొడ్డి మంచిదారిచూపారు

పుట్టిన బుద్ధి పుడకలతోపోవునని

మనిషిలోనితెగులు మట్టి కప్పువరకుండు



ఒ కరి నొకరు చెరప కుండ

ఎవరికి వారు బతగలిగితే

శిదిలయాలేలాఅందరి

దేహం ఆలయమే

ఆత్మ వెలిగేదైవస్వరూపమే

04/10/20, 4:05 pm - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

4.10.2020

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

ఇండ్లూరి సుజాత గారి పర్యవేక్షణలో

అంశం:శిధిలాలయాలు

డా. సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880



శీర్షిక: చిద్రుపలు


ఇల్లు కోవెలగా పెద్దలు దైవాలుగా

వారి ప్రేమఆప్యాయతలు ప్రసాదాలుగా

అక్కడి వాతావరణముఅనన్యముగా

తరతరాల సంస్కృతి ఆచారాలు ఆస్తులుగా

పలకరింపుల్లో ప్రేమపులకరింతలతో

ప్రతి మనిషినీ ఆప్యాయతల్లో ముంచెత్తుతూ

అనుబంధాలతో  పెనవేసుకున్న

అచంచలమైన కూరిమితో కూడిన

ఆ పొదరిళ్ళేవి? ఎక్కడ?

దైవభీతి, పాపభీతి, మానవత్వం, మమకారం

కనిపించడం లేదేమిటి?

పాతాళములోకి అణగద్రొక్క బడిందా?

ఇలా పాశవికమైపోయాయేమిటి బంధాలు

సున్నితం, సౌకుమార్యం, సాన్నిహిత్యం

 ఏవీ ఈ పదాల అలికిడి లేదేమి?

 కరడు గట్టి పోయిందా సుకుమార హృది

మొద్దుబారిపోయిందా అనుభూతుల సడి

అటు మానవనిర్మిత దేవాలయాలు శిధిలమే

ఇటు దేవాలయమంటి మనిషి మనసూ

శిధిలమై...

అనుభూతులు,అపేక్షలు, ఆదరణలు కరువై

మనిషి కర్కశముగా మారాడెందుకు?

ఆస్తుల కొరకు, ఆనందము కొరకు

అధికారము కొరకు పైశాచికముగా

ఆక్రమణలెందుకు?

నిర్లక్ష్యముతో , నిర్దయతో దేవాలయాలు

శిధిలము ఒకపక్క

చదువు సంపద  అంటూ ఇంటినొదిలేసి

ఇంటితోపాటుపెద్దలను ,వారి మనోభావాలను

 శిధిలము మరో వైపు

చివరికి మిగిలేదేమిటి?

చిద్రుపలై మిగిలే చిత్తం

చితుకుల జేరే కాయం



ఇది నా స్వంత రచన

04/10/20, 4:06 pm - +91 94417 71955: మల్లినాథసూరి కళాపీఠం YP

అంశం... శిధిలాలయాలు 

శీర్షిక... దేశ వారసత్వ సంపద 

పేరు... ముడుంబై శేషఫణి 

ఊరు... వరంగల్ అర్బన్ 

సంఖ్య... 250

నిర్వహణ... అంజలి గారు

తేది.4-10-2020.

.................... 

శిలలపై చక్కని శిల్పాలతో 

భక్తి భావన ముప్పొంగ 

ఆధ్యాత్మిక నిలయములై భాసిల్లు 

భారతీయ దేవళములు 


ఆలయాలలో కొలువైన

మూలవిరాట్ మూర్తుల గని 

సేవించి తరించు మానవజన్మ 


మతోన్మాద శక్తులకు బలియై 

కాలగతిన శిథిలమై 

రూపురేఖలు మసకబారి 

శిధిలాలయాలుగా మారె ఆలయాలు 

నాటి ప్రాభవమ్ము కోల్పోయి 


ప్రాచీన చరిత్రకు చిహ్నమై 

వేదమంత్ర ఘోషతో 

సంస్కృతి సంప్రదాయ ప్రతిబింబమై 

చెరగని, తరగని శిల్పాలతో 

పర్యాటక ప్రియాలు ఆలయాలు 


పూర్వ వైభవ ప్రభలు వెలుగొంద 

దేశ వారసత్వ సంపదగ నిల్చి 

పునః నిర్మితమై 

శోభిల్లవలె శిధిలాలయాలు.

04/10/20, 4:07 pm - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 4-10- 2020

అంశం : శిథిలాలయాలు

శీర్షిక:  శిల్పం జెప్పిన కథలు

నిర్వహణ:అమరకుల దృశ్య కవిగారు

అంజలి ఇండ్లూరి గారు


హైందవ సంస్కృతికి ఆలవాలమై, ప్రాచీన సంస్కృతిని కళ్లముందు నిలిపే 

దేవాలయాలు కనుమరుగవుతున్న వేళ

జీర్ణోద్దరణకు, నోచుకోలేని 

శిథిలాలయములలో శిలలు జెప్పే

చిత్రమైన కథలు ఎన్నో!


ధూప దీప నైవేద్యాలకిచ్చే దేవుడి మాన్యాలను దగాజేసి దోచుకునే

దొరలు ఉన్న దేశంలో శిథిలాలయాల్లోని

శిల్పాలకు  నిత్య ఉపవాసాలే!

దేహమే దేవాలయం,జీవుడే సనాతన

ధర్మ మనే సంస్కృతినుండి 

బలవంతముగా దేహమునుండి జీవుడిని

వేరు చేసే సంస్కృతిలో దేవాలయాల

ఉనికి దేహంలో లేక జీవం లో లేక నిర్జీవమవుతున్నాయి!


గుప్త నిధుల కోసం గుళ్ళని గుల్లగా గునపాలతో తవ్వుతూ, 

కళల కాణచులను కన్నీళ్ల పర్యంతం 

చేస్తున్న వారిని క్షమిస్తున్నంత వరకు

ఆలయాల చరిత్ర అధఃపాతాళానికే

వెళ్ళిపోతాయి అంటూ శిలలు జెప్పే

వాస్తవ కథలు వింటే గుండె ద్రవించక మానదు!


ఈ కవిత నా స్వంతము.. ఈ సమూహము కొరకెవ్రాసి ఉన్నాను.

04/10/20, 4:14 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి.సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశం.శిథిలాలయాలు 

నిర్వహణ. ఇడ్లూరి అంజలి గారు. 

సీ

హృదయమేశిథిలమై హంగులే నిలువక 

              నిత్యసంతోషంబు నిలుపలేరు 

ముందుకు వెళ్లేటి భువనుల యడ్డంగ 

                నిలిచిన యేడ్పంచి నిందలేసి 

యాత్మనుజంపుతూ యాలోచనపరలై 

                  నోరుతెరవలేక నుండినారు. 

యాపదలగుదురు యాదుకోనిజనులు 

                   దూరంగకొట్టుతూ దుష్టులయిరి 

ఆ.

పాపపనులుచేయు పాపాత్ములున్నను 

మంచితనములేని మనసుయున్న 

విషపునాలుకయ్యి  పాముకంటేపాడు 

బుద్ధి గలిగి యున్న పుడమి లోన 

తే.

జన్మనిచ్చిన జగతికి జారులిడిచి 

తల్లి పేర్మినే నిలపక తగలబెట్టి 

కఠిన హృదయుడయ్యెవాడు కసితొనిల్చి 

మూర్ఖ మనుషుడువాడయి భువనిలోన 

ఆ.

ప్రేమలేక యున్న పేగుబందముయున్న 

తల్లి దండ్రి తోని తగవులాడి 

పైసతోనిపడిన పామరుడయ్యెను 

తపన తోని నిలిచి తల్లడిల్లె.

04/10/20, 4:14 pm - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ హృదయ స్పందనలుబెకావుల వర్ణనలు

అంశం శిథిలాలయాలు  

నిర్వహణ శ్రీ అంజలి ఇడ్లూరి గారు

శీర్షిక  పునరుద్ధరణ చేసుకోవాలి

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 04.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 51


నూట ఇరవై ఒక కోటి జనాభా ఉన్నాము

ముప్పయి మూడు కోట్ల దేవతలు ఉన్నారు

ఇందులో చాలా మంది తక్కువ దేవుళ్ళకు మాత్రమే దేవాలయాలు ఉన్నాయి

వాటిని కూడా సంరక్షించుకోలేని ధీనస్థితిలో మనము ఉన్నాము

అభివృద్ధి చెందిన దేవాలయాలను రక్షిస్తామంటూ ప్రభుత్వాలు భక్షిస్తున్నాయి

మిగిలినవన్నీ శిథిలాలయాలుగానే మిగిలిపోతున్నాయి

భక్తులకు తీరని మనో వ్యధను కలిగిస్తున్నాయి

దేవాలయాలు మన సంస్కృతికి , సాంప్రదాయాలకు ప్రతీకలు

ఒకప్పుడు గుడులే చదువు చెప్పే బడులయినాయి

ప్రాణము పోసే వైద్యశాలలు అయ్యాయి

నేడు మద్యము షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి

మంచిని పెంచే దేవాలయాలు కనుమరుగు అయిపోతున్నాయి

బార్ లు,రెస్టారెంట్లు రోజురోజుకీ కనులు మిరుమిట్లు గొలిపేలా తయారవుతున్నాయి

ఆధ్యాత్మికతను పెంచే దేవాలయాలు మాత్రం భూమిలో కలిసిపోతున్నాయి

ఈ రహస్యము ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకే తెలియాలి మరి

దేవాలయాలను శిథిలాలయాలు చేయడమంటే భక్తుల మనసులను శిథిలాలయాలు చేయటమే అని అర్ధం

అందుకే నేడు నైతిక విలువలు తగ్గిపోతున్నాయి

హత్యలు,అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి

మనుష్యుల మనసుల్లో  మంచికి బదులు కుళ్లు, కుతంత్రాలు ఎక్కువ అయిపోతున్నాయి

మానవత్వము చిన్నబోయి మూర్ఖత్వపు ఆలోచనలు పేట్రేగి పోతున్నాయి

ఓ మనిషి ఇకనైనా మేలుకో 

శిథిలమైన నీదేహాన్ని మనసును ముందు బాగుచేసుకో

శిథిలమైన దేవాలయాల్ని బాగు చేసే బాధ్యతని తీసుకో

మంచికి పట్టము కట్టి సాటి మనుష్యులకు దేవుడిలా సాయము చేయటం నేర్చుకో....

నీ బిడ్డల

04/10/20, 4:18 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణముల  🌈 సింగిడి

ఏడుపాయలు, 04-10-2020

రచన: ప్రొద్దుటూరి వనజారెడ్డి

ఊరు: చందానగర్

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో , హృదయ స్పందనలు

అంశం: శిథిలాలయాలు

             9866249789

నిర్వహణ: శ్రీమతి అంజలి 

                 ఇండ్లూరి

————————————

మన సంస్కృతి సంప్రదాయాలకి తిలోదకాలు

పాశ్చత్య పోకడల కొనసాగే

జీవనం

ఉమ్మడి కుటుంబాలే వ్యష్టి కుటుంబాలై

ఆత్మీయతానురాగాలే దూరమై స్వార్థ చింతనతోడ

కమ్మని పిలుపులే కరువాయె


బంధాలన్నీ బరువై వంటరైన

జీవితాలే “ఎవరికి వారే యమునా తీరైన చందంగా 

మారె


గర్భాన ఉండగానే

గాలి పీల్చుకోవడం దగ్గర నుంచి ఆహారం నడక

నడత నేర్పే తల్లిదండ్రులను 

వీడి పరదేశాలకి పయనమై

బంధం బలహీనపర్చిరి


జన్మకారక తల్లిదండ్రుల్ని

ఆ జన్మకు సార్థకం చేసే,

జ్ఞానాన్ని ప్రసాదించే గురువును మరిస్తే జాతి 

శిథిలమౌను


కన్నతల్లి, కన్న నేల స్వర్గము కన్న అధికమని రాముడు ఉఠంకిచ్చినది మరవద్దు


గోవులపెంపకం వాతావరణ హితమని జగమంతా స్థితి గతులు మారునని తెలుసుకో


పర్యావరణం

కాపాడుతూ

జీవించనీ ప్రతీ దాన్ని

ధర్మమార్గమే రాహదారని విజయం పొందుతూ 

జాతి శిథిలం కాకుండా కాపాడుకో 

————————————

ఈ రచన నా లివంతం

————————————

04/10/20, 4:21 pm - +91 83093 96951: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-శ్రీమతిఅంజలిగారు

అంశం:-శిథిలాలయాలు.

తేదీ:-04.10.2020

పేరు: దొంత రాజు విజయలక్ష్మి

ఊరు:-కరీంనగర్

చరవాణి:-8309396951

  

                        *నా మనసే*


చిన్నతనాన అమ్మ చూపే చందమామ చూసి

గోరుముద్దలు తిని సంబర పడ్డ వేళ నా  మనసు వికసించిన *కలువ* అయింది!!


పాఠశాలలో కష్టించి చదువుతున్న ఉన్న వేళ

ఆటల పరుగుపందెం పోటీలో గెలిచిన 

ఆనందానికి అవధులు లేని *ఆకాశం* అయింది!!


సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగి

అందమైన జీవితాన్ని ఆనందంగా మలుచుకున్న వేళ *వెన్నెల*అయింది!!


బాధ్యత బరువులతో ఆశయాల సాధన ల తో

పోరాటం సాగిస్తు విజయ కాంక్షతో సాగుతూ అలసిపోయిన వేళ *ఉరుము* అయ్యింది!!


అనారోగ్య సమస్యలు శరీరాన్ని

 చుట్టుముట్టిన వేళ అభద్రత భయంతో

మబ్బులతో అలుముకున్న *చీకటి* అయింది!!


అందమైన జీవితం చక్కని దేవాలయం  ఆశనిరాశల మధ్య సాగుతూ... జయాపజయాలను.. తలపిస్తూ

వయసు పైబడినా వృద్ధాప్యం మీదకు రాగానే

*శిధిలాలయం *గా మారింది...

 2020/10/04 16:14 

************************************

04/10/20, 4:27 pm - +91 79818 14784: సప్త వర్ణముల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం yp

అమరకుల దృశ్యకవి సారధ్యంలో

నిర్వహణ: అంజలి ఇండ్లూరి

అంశం: శిథిలాలయాలు

తేది: 4-10-2020

రచన: కట్టెకోల చిన నరసయ్య

ఊరు: బోదులబండ జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

శీర్షిక:  ఎగిసిపడుతున్న జ్ఞాపకాలు



నా బాల్యం పగిలిన అద్దం

బాల్యం జ్ఞాపకాలన్నీ బుల్లితెరపై

పరుగులు పెడుతున్న స్క్రోలింగులు

ఆలీబాబా 40 దొంగల కథ కోసం

పొలం పనులు మానేసి

అమ్మతో దెబ్బలు తిని

క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాడిని

కుమృద్దీన్ సారు ధ్వన్యనుకరణలో

గుర్రాల వెంట పరుగులు పెట్టే వాడిని

ఖుదా కా కసం!

కసంకా హుకుం! కుల్జా సిమ్ సిమ్!!

ఖుదా కా కసం!

కసంకా హుకుం! బంద్ కరో సిమ్ సిమ్!!

మూసుకున్న ద్వారం తెరిపించేందుకు

నరాలు తెగే ఉత్కంఠతతో

నా బాల్యాన్ని రోజూ బడికి రప్పించేవాడు

ఇంటర్వెల్ సమయంలో కాల్వ గట్లపై

రేగి పండ్లు కోసుకొని

ఒకరి వెనకాల ఒకరం

ఆలీబాబా గుర్రాల మాదిరిగా

స్వారీ చేసే వాళ్ళం

సలసల కాగుతున్న నూనెలో

ఒక్కొక్క దొంగను కప్పి పెట్టే ఆలోచనలతో

నా ప్రాథమిక విద్యనంతా గడిపాను

ముందు బెంచీలో కూర్చోకుండా

వెనక బెంచీలో కూర్చున్నందుకు

గోడకుర్చీ వేయించడంతో

పగలబడి నవ్విన తోటి విద్యార్థులను

ఒక్కొక్కడిని ఒంగోపెట్టి

ఒంగుడు దూకుడు ఆడాలన్నంత ఆగ్రహం

శిథిలాలయాలయిన చెదరని బాల్యం

సముద్రంలో లేచిన అలల మాదిరిగా

నా బాల్యం జ్ఞాపకాలు ఎగిసి పడుతున్నాయి

04/10/20, 4:30 pm - B Venkat Kavi: సప్తవర్ణముల सिंगिडि

4.10.2020, ఆదివారము

*నిర్వహణ : అంజలి ఇండ్లూరిగారు*


*రచన: బి. వెంకట్ కవి*


*శిథిలాలయాలు*

---------------------------


మనిషిలోని ప్రశాంతత లోపించినప్పుడు హృదయం వికలత అవుతుంది .

హృదయం శిథిలాలయం అవుతుంది.

రైతులోని, యువకునిలోని ఆత్మవిశ్వాసం సడలినప్పుడు హృదయం స్పందించి శిథిలాలయం అవుతుంది.

బిడ్డలు తల్లిదండ్రులను వదిలివేసినప్పుడు హృదయం చలించి వికలం అవుతుంది,

 అత్తారింటివాళ్ళు అమ్మాయిని పట్టి పీడించినప్పుడు హృదయం చలించి మనసు వికలము చెందుతుంది

 మనస్సు స్వాభావిక స్థితి కోల్పోయినప్పుడు ఆత్మ న్యూ నతాభావం కలుగుతుంది

 మనసును అన్నింటిపై లగ్నం చేసినప్పుడు కోరికలు నెరవేరకపోతే మనస్సు వికలము అవుతుంది 

కోరికలు కోటిరకాలుగా ఉంటాయి .చిన్న శిశువు మొదలు ముసలివాళ్ళదాకా అందరికి కోరికలు పుడుతూనే ఉంటాయి .

ఈ కోరికలు నెరవేరకపోతే హృదయం స్పందించి వికాలానికి దారి తీస్తుంది.

 కోరికలు నెరవేరక కోపానికి మనసు వెళ్ళిపోతుంది

 స్వార్ధం ఎక్కువై లోభానికి కారణం అవుతుంది 

స్త్రీమీద పదవిమీద ధనం మీద కీర్తి మీద కోరికలు పెరిగి మోహానికి కారణం అవుతుంది

 ఎవరిని లేక్కచేయకపోవటం మదం అవుతుంది 

ఇతరులు తనకన్నా బాగుంటే ఓర్వలేకపోవడం మాత్సర్యం అవుతుంది .

ఇవన్నియు హృదయమును స్పందింపజేస్తాయి

 ప్రపంచంలోని ఉగ్రవాదంతో అమాయకజనులను చంపుతుంటే హృదయం స్పందించి ఉక్రోషాన్ని రగిలిస్తుంది .

దేశాన్ని నాశనం జేసె అల్లరిమూకలను చూస్తుంటే హృదయం చలించిపోతుంది

 సొంత కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయి సమరం సాగిస్తుంటే మనసు వికలము అవుతుంది

 అక్కచెల్లెళ్లకు అనురాగాన్ని చెరిపివేస్తుంటే మనసు వికలమై హృదయ స్పందన కలుగుతుంది

 ఇవన్నియు శిథిలాలయాలే.

 శత్రువులను ఎదుర్కొనునప్పుడూ జవానుల హృదయం వికలమై సమరానికి కారణం కావచ్చు.

వారి హృదయం శిథిలాలయం కాకుండా ఉన్నప్పుడే సమరం జరుగుతుంది.

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యువతులపై లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఈ వార్తలు వింటుంటే హృదయం శిథిలాలయం అవుతుంది.

మన హృదయం శిథిలాలయం కాకుండా ఉండాలంటే మనము

ధైర్యాన్ని నింపుకోవాలి

ఆత్మశక్తిని కూడగట్టుకోవాలి

జనులపై, మనవారిపై ప్రేమను చూపించాలి.

అనురాగాన్ని కుమ్మరించాలి

మన హృదయం శిథిలం కాకుండా సమాజంలో మనం మమేకం కావాలి.

మనకంటూ ఒక శక్తిని  సమకూర్చుకోవాలి.


*బి. వెంకట్ కవి*

04/10/20, 4:34 pm - +91 98496 14898: శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

నేటి అంశం;శిధిలాలయాలు

నిర్వహణ; అంజలి ఇండ్లూరి.

తేదీ;04-10-2020(ఆదివారం)

రచన; యక్కంటి పద్మావతి, పొన్నూరు.

శీర్షిక;మానవతా పరిమళం.

చరవాణి;9849614898


ధర్మం నాలుగు పాదాల నడిచిన నేల.

అన్నపూర్ణ గా ప్రసిద్ది చెందిన నేల

ప్రాశ్చాత్య సంస్కృతీ మోజుతో  

మన వైభవోన్నతిని మరచి,

తీరు తెన్నులు మార్చుకుంటూ,పబ్బులూ,క్లబ్బులంటూ

కట్టుబాట్లను వదిలి,విపరీతపు పోకడలు పోతుంటే

నా మనసు కలుక్కుమంటుంది,

ఇల్లాలి మనసు నొప్పించే లా, మందుకు బానిసలై, 

 పరస్త్రీ పొందుతో విందులు  ఆ పైన చిందులతో

ఆన్లైన్ జూదంతో ఆస్తులు తగలబెడుతూ

అనైతిక వ్యవహారాల్లో మునిగి

న్యాయదేవతనే ధిక్కరిస్తుంటే

ఎవరు కాపాడగలరు? ఏమని చింతించగలరు?

ముసలివాళ్ళను వృద్ధాశ్రమాల్లో

కుక్కపిల్ల లను ఉచితాసనాలలో

ఏమైపోతుందీ మనం జీవన విధానం

సర్ధుబాటుదనం చేతగానితనం గా చిన్నబచ్చుతూ

కల్తీలుచేసి,కబ్జాలు చేసి కోట్లు కూడబెట్టటమా!

సత్యం వజ్రసదృశ్యం అనితెలిసినరోజు

నిజాయితీ కి పట్టంకట్టి,ఉన్నదానితో బ్రతకటంనేర్చుకొన్నరోజు

ఉన్నదాంట్లో కొంతైనా పొరుగు వారికి సాయపడ్డరోజు 

నిజమైన తృప్తిని పొందగలం

అధర్మ యోచన , ఈర్ష్యా ద్వేషాలు మన హృదిని బాధించే శిధిలపు ఆనవాళ్ళు

మానవతా పరిమళాలు వికసించిన నాడు

మనుషుల్లో దేవుళ్ళు,దేహమే దేవాలయం

వృత్తి ని దైవంగా భావించి, ఆ సేవలో పరమాత్ముని,దర్శిస్తే

ఆ దేవదేవుని కృపకు పాత్రులవుతాం.

04/10/20, 5:01 pm - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠంyp* 

            ఏడుపాయల

 శ్రీ అమరకులదృశ్యకవిచక్రవర్తులనేతృత్వాన......       


    🌈 *సప్తవర్ణముల సింగిడి*

 *హృదయస్పందనలు కవులవర్ణనలు*

  *04.10.2020 ఆదివారం* 

  *అంశం :*శిథిలాలయాలు"* 

  నిర్వహణ : శ్రీమతి అంజలి ఇండ్లూరిగారు 

రచన:జె.పద్మావతి 

మహబూబ్ నగర్ 

*శీర్షిక..కల్మషమైనకలి*

________________________________

అనురాగపు ఆలయాన కొలువైన దేవతలు అమ్మానాన్నలు

చేసే ప్రతిచర్యకూ వుంటాయి వారి ఆశీస్సులు 

పూజించకున్నా సత్ఫలితాలనే ఇచ్చే వేలుపులు

నాగరికతలో నాణ్యత లోపించెనేమో!

ఆలయాన్ని పట్టించుకునే నాథులే కరువైరి.

అర్చనలు లేక దీపనైవేద్యాలు లేక వేలుపులు వెలుపలికి వచ్చేస్తున్నారు.

విలువలు లేని పరసంస్కృతులకు పాకులాడే  ప్రజలు

వరాలవర్షాన తడిసెదరా!హాయిననుభవించెదరా!

లక్ష్మీసమానురాలైన లలనకు లాలిత్యం శూన్యం.

కన్యకాపరమేశ్వరి సమానురాలైన కుమారికి సౌకుమార్యత శూన్యం.

శబరిని తలపించే అవ్వను ఆదరించే రాముడేలేడు.

కుచేలుని తలపించే బడగు నేస్తాన్ని అక్కునజేర్చే కృష్ణుడేలేడు.

గురితో గురుదేవుని హృదయాలయాన కొలువుంచి

వినయవిధేయతలనర్చిస్తూ విద్యనేర్చే విద్యార్థి ఏకలవ్యుని సమానుడు కాలేడు.

అవనీతిరణరంగాన పురాణాలు పుక్కిటి పురాణాలే.

స్వార్థపు శస్త్రాల ప్రయోగాల పరంపరలో శాస్త్రాలు కనుమరుగే.

ఇతిహాసాలంటేనే వెకిలింపుల హాసాలు!

విజ్ఞానఖని ఈ భరతావనిలో అంతా నిర్వేదమే ఔతుంటే....

శిథిలమైన హృదయాలయాలు పునర్నిర్మాణానికి నోచుకునేదెన్నడో!

ధర్మదేవత నాలుగుపాదాలపై నడయాడేదెన్నడో!

కలియుగ ప్రత్యక్షదైవానికే ఎరుక!

04/10/20, 5:18 pm - +91 93941 71299: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల 

పేరు: యడవల్లి శైలజ కలంపేరు ప్రేమ్ 

ఊరు: పాండురంగాపురం, జిల్లా ఖమ్మం 

అంశం:శిధిలాలయాలు

నిర్వహణ: అమరకుల దృశ్యకవి చక్రవర్తి, శ్రీమతి అంజలి గార్లు


శిధిలాలయాలు  అవుతున్నాయి 

అరాచకానికి ఆవాసాలు 

లోపలున్న దేవుడికి కళ్ళు కట్టి

పసిపాప నోరును కుట్టి 

తమ కామవాంచ తీర్చుకుంటూ

ఎందరో మృగాలు దుర్మార్గులు.....

దైవత్వంను కూడా మాయచేసి

అధికారులు లంచం తీసుకొని 

మృగాలకి కొమ్ము కాస్తూ 

తమ బాధ్యతను మరుస్తూ 

దేశద్రోహం సంఘద్రోహం చేస్తూ.....

అందుకే మనమందరం 

సభ్యత మరువకుండా 

చేద్దాం శిథిలాలయాలని 

పుణ్య దామాలుగా....

04/10/20, 5:25 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ  శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు

అంశం  శిథిలాలయాలు

శీర్షిక  అనుబంధాలు శిథిలాలై

పేరు  పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు.  జిల్లా కరీంనగర్


మమతానురాగాల వల్లరిలో

ప్రేమమూర్తులైన పెద్దలందరితో

కుటుంబమే అనుబందాలతో అల్లుకున్నది

వేద కాలం నుండియే విరాజిల్లుతోంది


నేడు తోడబుట్టిన వారైన కూడ

మాయజాలంతో కల్లబొల్లి మాటలతో

కుటుంబంలో చిచ్చు రాజేస్తున్నారు

అనుబంధాలు శిథిలాలైనవి


నేడు మమతల ద్వారాలు మూసుకున్నాయి

అనురాగమే బీటలు వారినది

సంకుచిత భావాలే స్వతంత్ర భావాలై

కుటుంబమే విచ్చిన్నమైతే వినోధిస్తూ

అదే మోజని ఆనందిస్తున్నారు


అరాచకాలు అమానుషపు హత్యాచారాలు

కళ్ళముందే నడిరోడ్డున జరుగుతున్న

ఇదేమిటని ప్రశ్నించని వ్యవస్థలో

అనుబంధాలే నెత్తురోడుతున్నవి


నిలువెత్తు మంచితనం కూడ

చేతగానదై చేవలేనిదైనది

కళ్ళుండి గుడ్డిదైన ధర్మం

ఇదేమిటని ఎదురు తిరిగితే

జీవితమే లేదు జీవనమే లేదు


మౌనంగా రోదిస్తున్నది నా భారత మాత

కనులు దాటని కన్నీలతో

అనుబంధాల శిథిలాల వ్యవస్థలో


హామి పత్రం

ఇది నా సొంత రచన

🙏🙏🙏🙏

04/10/20, 5:27 pm - +91 94404 72254: మల్లినాధసూరి 

కళా పీఠం ఏడుపాయల

సప్తవర్ణాల 🌈సింగిడి

పేరు....వెంకటేశ్వర్లు లింగుట్ల

ఊరు...తిరుపతి

అంశం: శిథిలాలయాలు

శీర్షిక.... ఆఖరుమజిలీ

నిర్వహణ: శ్రీమతి అంజలి యిండ్లూరి

04.10.2020.


హృది శిథిలమై పోయిందెపుడో

నడిపేది నడిపించేదీ ఆ గుప్పెడు మనసే

దోబూచులాడుతూ దోచేస్తూ దాచేస్తూ

నమ్మేదెవరినో నమ్మించేదెవరినో

నమ్మకాన్ని పోగొట్టుకొని నానాయాగీ చేస్తూ

అనుక్షణమూ ఆరాటపడుతూ

అగచాట్లు పడుతూ ఆశలనెక్కి నిరాశతో

చతికిలబడిపోయి రాతిమదిలా మారి

అనుబంధాలన్నీ విపణివీధిలో

అమ్ముడుపోయి దిగజార్చిన విలువలను

వలువుల్లా వదిలేసి నగ్నంగా నాట్యం చేస్తూ

వికృతమై విపరీతమై సిగ్గు వదిలేసి

రెపరెపలాడే కాగితాలకై రొప్పుతూ జేబునింపి

విలాసాలకై తగలేస్తూ మత్తులో మునుగుతూ

ఆత్మీయత కుత్తుకలు తెగనరికి 

డొంకదారుల్లో దూరుతూ స్వార్థపుముసుగులో

ప్రతిదానికీ లెక్కిస్తూ బొక్కేస్తూ 

గుంటనక్కలా కాచుకుని నిలువెత్తు మానవతను

మంటగలిపి మమతల్ని నెట్టేసి 

అంతస్థులకు రెక్కలతో ఎగురుతూ

అందుకున్నా సంతృప్తి లేని బతుకులు వెలగబెట్టి

ఆరడుగుల మట్టిలో కలిసేలోపు

తెలియనితనమో తలవనితనమో అహంకరించి

రాద్ధాంతసిద్ధాంతాల బంధనాల్లో చిక్కి శల్యమే...

కరగని కాఠిన్యమే ఆఖరుమజిలీ వరకూ..


వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

04/10/20, 5:36 pm - +91 99596 94948: మల్లినాధ సూరి కళాపీఠం

నిర్వహణ : శ్రీమతి అంజలి గారు.

పేరు : మంచాల శ్రీలక్ష్మీ

ఊరు : రాజపూడి

అంశం : శుభ్రత జీవితానికి భద్రత.

...............................................

ఆశ్రద్దను ప్రోగుచేసుకుని

చెత్తను వృద్ధి చేసుకుంటే...

ఈగలు, దోమలు ముసిరే వేళ

మృత్యువు కోరలు చాచే వేళ

కొన ఊపిరులకు ఊపిరులూదలేక

భాద్యతలు మోయవలసిన బంధాలే

అనారోగ్యo పాలైతే

కుటుంబం నడిరోడ్డు పాలవుతుంది.

నలతల కలతల కలవరపు జీవితాలను

వైద్యాల పేరు తో వాయిద్యాల

మ్రోతలు మ్రోగించుకుంటూ

ధారాళంగా డబ్బుని వెచ్చిస్తే

అప్పులు నిప్పులు కురిపిస్తాయి.

ఉపయోగించవలసిన మరుగు దొడ్లు

మరుగున పరచి నడిరోడ్లను

బయలుకి వినియోగిస్తే

సమాజమే సిగ్గు పడుతుంది.

వ్యక్తిగత ,పరిసరాలపరిశుభ్రతను మాని

నిర్లక్ష్యానికి దారి ఇస్తే కొండంత 

అనార్ధాలకు దారితీస్తుంది.

కళకళలాడే గృహాలయాలు

శిథిలాలయాలై నిలుస్తాయి.

పొడిచెత్త, తడిచెత్త విభజించి

హరిత పరిరక్షకులకు అప్పగిస్తే

ఎరువుగా మార్చి వికసించు హరిత వనాలు.

అందుకే నేస్తం...

ఇంటింటి శుభ్రత జీవితాలకు భద్రత. 

కలుషితరహిత సమాజాన్ని నిర్మిద్దాం.

అంటురోగాల బారి నుండి రక్షిద్దాం.

స్వచ్ఛ సర్వేక్షణం ఆరోగ్య  లక్షణం

అనుక్షణం ఆనందాలకు నెలవు.

గ్రామాల పరిశుభ్రత.. దేశ ప్రగతికే పరిరక్షణ.

04/10/20, 5:37 pm - +91 99486 53223: మల్లినాథ సూరి కళా పీఠం , ఏడుపాయల.( వై పి) . సప్తవర్ణాల సింగిడి  .

అంశం :శిథిలాల యాలు.

 పేరు : మచ్చ అనురాధ .

ఊరు: సిద్దిపేట నిర్వహణ:శ్రీమతి ఇండ్లూరి  అంజలి  గారు.

 శ్రీ అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో శీర్షిక: దేహమేరా దేవాలయం  .


    సీసమాలిక


దేహమేరా మన 

 దేవాలయమనగ మంచిని పెంచుము మనసునందు ,


ప్రతి హృదిలో నను భక్తి భావము యున్న  

 పాప కర్మంబులు పారిపోవు ,


 గుండెలో దేవుణ్ణి గొప్పగా నిలిపియు

 కొలువ వలయు ముందు కూరిమి తోడ ,


 గుళ్లు గోపురములు గొప్పగా కట్టించి

 కీర్తిగోరిరినాడు గెలుపు కొరకు , 


 తాను బోయిన గాని తన పేరు మిగలాలి యనెదృష్టి యానాడు నందరికిని ,


 పుడమిపై నిలిపిరి పెద్ద కట్టడములు

 వారి పేరు నిలిచె వసుధ యందు ,

 శిధిలమవుచునుండెశిల్పాలు గుళ్లలో పునరుద్ధరణ జేయ పూనుకొనుము ,


 మనసులో భావాలు మంచివైన నుజాలు దేవుడు మెచ్చును దివ్యముగను.


     తేటగీతి


 దయగల హృది లో కొలువౌను దైవము, కను  ,

 పరుల బాధలు తెలిసిన పావనమ్ము ,

 స్వార్థ చింతన మాన్పగ సాధ్యమవును, దేహమందున జ్ఞానము దీప్తి జెందు.

 


🙏🙏

04/10/20, 5:38 pm - +91 93913 41029: మల్లినాథసూరి కళాపీఠం (Yp)

🌈 సప్తవర్ణ సింగిడి 🌈

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం : శిథిలాలయాలు 

రచన : సుజాత తిమ్మన 

శీర్షిక : శిథిలమవని దేవాలయం 

నిర్వహణ : అంజలి ఇండ్లూరి గారు

తేది : 4.10.2020


********


ఏటి ఒడ్డున ఇసుక కుప్పల్లో 

కాలుపెట్టి గోపురంలా గుడికట్టి 

గులరాయిని శుభ్రంచేసి లోనవుంచి 

గడ్డిపూలను, రంగురంగులతీగలను 

అలంకారంగా ఉంచి ...

చిట్టి చేతులతో చప్పట్లుకొడుతూ 

గోవిందా.గోవింద..అని చుట్టుా తిరిగిన 

స్వచ్ఛమైన పసిహృదయాల దేవాలయాలు 

గాలికి కొట్టుకుపోయినట్టే ...

జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు 

ఆ మానసిక ప్రశాంత దేవాలయాలు 

చిధ్రమై శిథిలమైపోతున్నవి ...


ఎన్నో వందల సంవత్సరాలనాటి 

ఎనలేని సంపదలకు నిలయమైన 

పురాతణ అద్భుతమయిన కట్టడాలు 

ఎందరో తురుష్కులు కొల్లగొట్టి 

దోచుకునిపోయినా ....

మన భారతదెశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 

దీటుగా నిలిచి ఉన్నాయి చరిత్రను చెపుతూ 


ఎన్ని అవరోధాలు వచ్చినా ..

మొక్కవోని ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ 

ఆశయసిద్ధి చేరుకొవాలి ..

కష్టాల కొలుములను కంటి చూపుల కాల్చేస్తూ 

శిథిలమవలేని దేవాలయంలా 

మలచుకోవాలి జీవితాన్ని  !!

******

సుజాత తిమ్మన. 

హైదరాబాదు.

04/10/20, 5:41 pm - +91 99595 24585: *సప్త వర్ణముల సింగిడి*

*మల్లినాథసూరి కళాపీఠం yp*

*అమరకుల దృశ్యకవి సారధ్యంలో*

*నిర్వహణ: అంజలి ఇండ్లూరి*

*అంశం: శిథిలాలయాలు*

*తేది: 4-10-2020*

*రచన: కోణం పర్శరాములు*

*సిద్దిపేట బాలసాహిత్య కవి*

*ఊరు: సిద్దిపేట*

*చరవాణి: 9959524585*

*శీర్షిక: శిల్ప సౌందర్యం*

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

ప్రాచీన దేవాలయాలు

శిల్ప సంపదకు ఆవాసాలు

శిల్పాల కళా చాతుర్యం

చిట్టి పడేటట్లుగా

పెద్ద పెద్ద బండ రాళ్ళను

ఆలయాలు నిర్మాణం

అద్భుతమైన గుడి గోపురాలు

గోపురాలు పై దేవుళ్ళ

విగ్రహాలు

పశువులు, పక్షుల ముచ్చట గొలిపే ప్రతిమలు

వివిధ నృత్య భంగిమలు

రకరకాలైన ఆయుధాలు

గుర్రపు రథాలు,పుష్పక

విమనాలు

ఒక్కో దేవతామూర్తుల వద్ద

కొలువుదీరిన పక్షులు,

జంతువుల జీవరాశులు

కాళీమాత మెడలో పుర్రెలు 

శివుడి మెడలో త్రాచుపాము ఆభరణాలు

బండారు పసుపు కుంకుమలు

నైవేద్యంగా సమర్పించే

ఫలహారాలు

ధూపదీప నైవేద్యాలు

దేవతల విగ్రహాలు చరిత్ర

కు ఆధారాలు

భక్తి భజనలచే నిత్యపూజలు

రకరకాల పూలు,పండ్లు

మంగళవాధ్యాలు,

శిల్ప సౌందర్యం ఉట్టి పడేలా ఉండేవి

నేడు శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు

శిల్పకళా చాతుర్యం తగ్గిన

ఆధునిక హంగులతొ

రంగులతో విరాజిల్లుతోంది

ఆర్టిఫిసియల్ కు అధిక

ప్రాధాన్యత

ప్రాచీన దేవాలయాలు

శిథిలావస్థలో చిక్కుకొని

ఉన్నవి

ప్రాచీన దేవాలయాలు పాడుబడి దిక్కుతోచని

స్థితి లో మొక్కుబడిగా

నిలదొక్కు కున్నవి

గుడి గోపురాలు ఎలా ఉన్న

దైవ చింతనలో కాస్తా

వెనుకబడినాము

పరిగెత్తే కాలంతో పాటు

మనము పరుగెత్తే స్థితి

ఆగమాగం మొక్కుబడులు

తీరిక దొరకని ఉద్యోగ ధర్మాలు

అప్పుడైనా ఇప్పుడైనా

దేవుడు ఉన్నాడనేది

జగమెరిగిన సత్యం

ఆయన లేకుంటే బ్రతుకంతా అయోమయం!


కోణం పర్శరాములు

సిద్దిపేట,9959524585

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

04/10/20, 5:47 pm - +91 99124 90552: *శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*04/10/2020 ఆదివారం*

*అంశం : శిధిలాలయాలు*

*నిర్వాహకులు : శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు*

*రచన : బంగారు కల్పగురి*

*ప్రక్రియ : వచనం*

*శీర్షిక :  అతివ హృదయం*


ఏముంది గర్వకారణం జబ్బలు చరచి చెప్పుకోవడానికి తప్ప జీవితాలనుద్దరించే మగతనం జాతికి కరువైనప్పుడు... 


అన్యోన్యమైన దాంపత్య జీవితానికి

అనురాగంతో పుట్టిన పసిదాని మనసుకి తప్ప మిగతా మగువల మనసు మంటలు కానవచ్చేదెవ్వరికి...


అమ్మానాన్నల పిమ్మట అంత లాలితో ప్రేమించే మరో జీవికై వెతుకులాటలో మరి కొన్ని జీవాలకు బొమ్మగా మిగిలే అమ్మవుతుంటే...


స్త్రీ అంటే సహనమని అతివంటే ఆకాశమని అర్థం కాని సాగరలోతని

కల్లబొల్లి మాటలతో కళ్ళకు గంతలు కట్టి... 


అనాదిగా తరతరాలుగా చదివినా సంపాదించినా చాకిరితప్పని ఇంటి దేవతని చేసి మొగుడు వెధవైనా పిల్లలు తిరుగుబోతులైనా... 


ఆడపెత్తనమంటూనే రీతిలేదని ఆడిపోసుకునే సమాజంలో అడకత్తెరలో పోకచెక్కై ముక్కలవుతున్న మగువ మది...


పుట్టీన్నుండి పుడకల్లోకి చేరేవరకు పుట్టగతులుంచని పాపిష్టి మనుజులలో

మగువకు హృదయం పేరున దాగున్నది శిథిలాలయమే కదా...

04/10/20, 5:53 pm - +91 91778 33212: 🙏🏻🌸🌸🌸💐🙏🏻🙏🏻🙏🏻


ఏముంది గర్వకారణం జబ్బలు చరచి చెప్పుకోవడానికి తప్ప జీవితాలనుద్దరించే మగతనం జాతికి కరువైనప్పుడు... 


అనాదిగా తరతరాలుగా చదివినా  పాపిష్టి మనుజులలో

మగువకు హృదయం పేరున దాగున్నది శిథిలాలయమే కదా...


🙏🏻🌸🌸💐💐 చక్కగా వర్ణించారు అభినందనలు

బంగారు కల్ప గురి

04/10/20, 6:11 pm - +91 98660 68240: మళ్లినాథ సూరి కళాపీఠము y p

సప్తసింగిడి

నిర్వహణ ఇండ్లూరి అంజలి గారు

4.10.2020

అంశం శిథిలాలయాలు

రచన  పేరు వై.నాగరంగయ్య

తాడిపత్రి


వచన కవిత


తుగ్లక్ కండకావర దాడులకు 

శిథిలమైన భారతదేశ సాంసృతిక 

అగమ శాస్త్ర ఆలయాలు ఆలయ శిల్పాలు

అంగాలు పోగొట్టుకొని కన్నీటితో 

జీవంలేని శరీరంలా ఎంతోకాలం ఏడ్చాయి


నేటికీ హంపి మున్నగు అనేక చోట్ల

అప్పటి నుంచి ఇప్పటి వరకు 

ఏడుస్తూనే ఉన్నాయి ఆ ఏడుపును

ఎవ్వరు పట్టించు కొను నాథుడు కనిపించ లేదు


దేహమే దేవాలయం ఇందులో ఉన్న

జీవుడే దేవుడు ఈ దేహము శిథిలము

కాకమునుపే ఇందులో ఉన్న జీవుడు

జీవబ్రాన్తి విడిచి పెట్టి జీవ బ్రహ్మైక్యమును

సాధించుటే శిథిలాలయ విమోచనం.


ధర్మాధర్మ పోరాటంలో

ధర్మమును క్రింద పడవేసి

శిథిలము చేయుటకు అధర్మము

ఎల్ల వేలలా ప్రయత్నిస్తూనే ఉంటుంది

ఒకానొక సమయంలో ధర్మం

క్రిందపడినా తిరిగి లేచి అధర్మమును

అతః పాతాళానికి తొక్కి వేయ బడుట

చేత ధర్మానికి శిథిలాలయ విమోచనం

జరుగును.

04/10/20, 6:14 pm - +91 98494 54340: మళ్లినాథ సూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి సారథ్యంలో

నిర్వహణ:శ్రీమతి అంజలి ఇండ్లూరూ గారు

అంశం:శిథిలాలయాలు

శీర్షిక:సత్సంప్రదాయాలు 

పేరు :జ్యోతిరాణి 

ఊరు:హుజురాబాద్ 

***********************************

శిథిల మవుతున్న బంధాలు అనుబంధాలు మెరుగు పడాలంటే 


కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, 

వాటితో పాటు పిల్లలకు..

 

బాధ్యత,మర్యాద,గౌరవం

కష్టం,నష్టం,ఓర్పు,సహనం,దాతృత్వం,ప్రేమ,అనురాగం,

సహాయం,సహకారం,  నాయకత్వం,మానసిక ద్రృఢత్వం ,కుటుంబ బంధాలు*

ఆనుబంధాలు


దేశ భక్తి భావనలు సంప్రదాయాలు 


కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు 

చేస్తూ


 ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి

నేర్పిస్తూ


పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...


మనం కూడా మమేకమవుదాం...


భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం..


🌹బ్రహ్మకలం 🌹

04/10/20, 6:19 pm - Balluri Uma Devi: <Media omitted>

04/10/20, 6:19 pm - Balluri Uma Devi: 04/10/20

మల్లినాథ సూరికళాపీఠం

నిర్వహణ: శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు

పేరు: డా. బల్లూరి ఉమాదేవి

శీర్షిక:: శిథిలాలయాలు

ప్రక్రియ: పద్యములు


ఆ.వె:ఆలయముల యందు అర్చనాదులు చేయు

      నర్చకులకు వసతు లన్ని కూర్చి

     మడులు మాన్య ములను మానుగా నొసగిరి

     భక్తి తోడ నాడు ప్రభువు లిలను.


ఆ.వె:రాతి కట్టడములు రమణీయముగ గట్టి

     విగ్రహముల నుంచి వేడ్కతోడ

     పూజలెల్ల చేసి పుణ్య మందు చునాడు

      రాజు లంది రిలను రహిని తాము


ఆ.వె: ఆలయములు కూల్చి అందులో ప్రతిమల

 నమ్ము కొనిరి కొంద రాశ చేత

నవియు గబ్బిలముల కావాసమై నేడు

నేరగాళ్లు దాగు నెలవు నయ్యె.


ఆ.వె: గుడులు వెలసె నాడు కువలయ మందున

       శిల్ప కళయు వృద్ధి చెందె నచట

       విజయ చిహ్నములుగ విగ్రహ ములనుంచి

      సలిపి రుత్స వములు జగతి యందు


ఆ.వె:సంప్రదాయ ములను చక్కగా పాటించి

  శ్రద్ధ తోడ పూజ జరుగుచుండ

  ధ్వంసమయ్యె నవియు దండయాత్రల  

   వల్ల కూల్చివేసి రెల్ల కోవెలలను.


ఆ.వె నేడు చూడ నివియు నేల మట్టమ్ములై

       పాడుబడియె నెన్నొ వసుధ యందు

      మరల  నుద్ధరించు మహనీయు లెవరని

     యెదురుచూచు చుండి రెల్ల జనులు.

04/10/20, 6:46 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 04.10.2020

అంశం : శిథిలాలయాలు!

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీమతి అంజలి గారు 

శీర్షిక : శిథిలాలయమని దిగులు చెంది! 


తే. గీ. 

మనిషి సృష్టించికొనె యెదన్ మాన్వితమగు

రూపమొక్కటి కొలువగన్ రూఢి చేసుకొనుచు

భవ్య నిర్మణములఁ జేసి పావనమగు

శిల్ప రాజమున్ కోవెలఁ సిద్ధపరచె!


తే.గీ

ఎంత నైపుణ్యముఁ గలిగి, యెంత శ్రమకు

నోర్చి రచియించిరో కదా!  యూరి చివరి

నల్ల రాతిలో కమనీయ నర్మ భరిత

చిన్మయపు విగ్రహాలను చేయఁ పూజ! 


తే. గీ. 

మనసు నందున యుండగఁ మన్ననేల

చేయక ఘన విశ్వాసముల్ చెదరగొట్టి

దేవళములను కూల్చిరి తీవ్ర మతపు

మౌఢ్యము పెరిగి ప్రభువులు మనసులేక! 


తే. గీ. 

శిథిలమగుదేవళములందు శివకేశ

వాది భగవంతులున్ననూ పావనమగు

మనదు హృదయములందున మానవత్వ

మనెడు మహనీయ గుణమున అల్లుకొనును! 


తే. గీ. 

నడిచు దేవాలయంబుగ నరుడు నడుచు

కొనిన పరమాత్మ మనసను కోవెలందు

కొలువగున్, ధర్మ, సత్య, సద్గుణములేవి

వీడక పవిత్ర యజ్ఞముల్ వ్రేల్చుమెపుడు! 


తే. గీ. 

బంధు మిత్ర బాంధవ్యముల్ వదిలి, మేటి

సుగుణముల నాచరించని శోభయేల? 

కపట హృదయము నందున గడపడెపుడు

దేవుడు శిథిలాలయమని దిగులు చెంది! 


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

04/10/20, 7:02 pm - +91 99599 31323: [4/10 18:37] M Kavitha: అక్షరాలతో ఆడుకుంటున్న .....

మానవత్వపు వెలుగు నీడల

అన్వేషణ లో...

కొత్త దారులు వెతుకుతున్న ....ఉదయించే భావాల సాహితీ దాహం లో...

ఎదురు చూస్తున్న ఎద తాకిన గాయాల లో ...

రెండు చుక్కల కన్నీటితో రాలే స్వప్నం నేనై.....

చీడ పురుగుల సమాజంలో..

చిల్లులు పడ్డ జీవనంలో....

చితికిన సంస్కృతి దేహాలు.....

బూజు పట్టిన ధర్మం లో.....

మాటరాని సత్యాలు....

గాజులాగా పగిలిన హృదయాలు.....

స్వార్థం రంగుల బంధాలు....

శిథిల మైన ప్రేమ కలల గోపురాలు....

కలవని దిక్కులు గెలిచేనా....

పిలవని కన్నులు చూసేనా.....

ఆశలు రాలిన పూరెక్కల పాన్పులో....

పూజకు వాడని పువ్వుల గంధం లో....

గాయాల వీణా అనురాగాల గీతం పలికించునా......

శిథిల మైన హృదయ ఆలయం లో





మల్లి నాథ సూరి కళా పీఠం ఏడుపాయల


శిథిల ఆలయాలు


దృశ్య కవి అమారకుల

4/10/2020


కవిత సీటీ పల్లీ

04/10/20, 7:07 pm - +91 81794 22421: <Media omitted>

04/10/20, 7:07 pm - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీమతి అంజలి గారు 

పేరు… ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :04-10-2020

అంశం : శిధిలాలయాలు 

శీర్షిక: విలయ మనసులు 

ప్రక్రియ : గీతం 


పల్లవి:

::::::::::

అడుగంటి పోయెనమ్మ మానవత 

అట్టడుగువరకూ ...

అల్లుకుపోయెనమ్మ అమానవీయత

చిట్టచివరివరకూ ...

చరణం :1

----------

ఇంటింటికి ,వీధివీధికి ,ఊరూరుకు,

సీమ సీమకూ ,దేశదేశానికీ....

మనసులు ముళ్ళమనుషులై 

మనుషులు ఇనుపగొలుసులై 

గొలుసులు మానవ బాంబులై


 //అడుగంటి పోయె //

చరణం2

--------

చరిత్ర లోన తరిగిపోనిదొకటే 

శిలాజాలం 

అది జాలి చూపులేలేని మదజలం 

మా'నవత'హారమున మిగిలిన దొకటే 

"నవత "

అది మనసంస్కృతి లో లేని విదేశీ "నవత"

స్నేహమాధారమున చిక్కిన దొకటే 

"దారం "

అది శిశుబాలికా బంధాలను విరులను త్రుంచే "దారం"


//అడుగంటి పోయె //

చరణం 3

---------

మానవ మృగములతో నిత్య సహవాసమున 

మనిషి మారెనమ్మ ఒక శిధిలాలయముగ 

మారణహోమమను శిధిలాలయముగ 


మత,మద,మొహ,దురహంకార,అసత్య,

అధర్మ ,అన్యాయమను సప్త సముద్రముల పై 

"మానవత్వమనునౌక లో "పయనించేదెన్నాళ్ళు ?ఎన్నేళ్ళూ ..??

"మంచితనమను చెలిమెను "దోసిళ్ళ తో 

తోడుకొని సేదదీరుడెన్నాళ్ళు ??ఎన్నాళ్ళూ ..?


//అడుగంటి పోయె //


హామీ పత్రం :ఇది నా స్వీయ గీతము.ఈ సమూహము కొరకే వ్రాసితిని

04/10/20, 7:08 pm - +91 6304 728 329: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి గారి సారథ్యంలో..

తేది: 04/10/2020

అంశం: శిథిలాలయాలు

నిర్వహణ: శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు 

శీర్షిక: శైథిల్యం కాని వాస్తవాలు


ధర్మము దారితప్పింది 

హిందూ వైభవాన్ని చూసి ఓర్వలేక

విదేశీ విషనాగు పడగ విప్పింది 

సనాతన హైందవ సంస్కృతిని

పురాతన సత్సంప్రదాయాలను

వినాశనం చేయుటకై

విదేశీ శక్తులు నడుంకట్టినయి

ఫ్రెంచ్, పోర్చుగీసు, డచ్

తురుష్కులు,మొఘలులు

ఒక్కరుకాదు వందలమందికి

నా చరిత్రను చూసి కన్నుకుట్టింది

అందమైన ఆధ్యాత్మిక నిలయాలు

పురాతన దేవాలయాలు

వేలాది శిల్పులు ,అహోరాత్రులు శ్రమించి 

రక్తాన్ని ధారపోసి

చెమటను చిందించి

రాళ్లు చెక్కి,శిల్పాలుగా తొలిచి

దేవతారూపాలుగా మలిచి

జీవకళ ఉట్టిపడేటట్లు ప్రాణంపోసినారు

అమరశిల్పులు,ఆ మహానుభావులు

మొఘలులవంటి విదేశీ ముష్కరులు

శిల్పుల శ్రమను ధ్వంసం చేసి

వారి కృషినె నశింపజేసి 

దేవాలయాలను,సంస్కృతీ వైభవాన్ని 

ధ్వంసంచేసి రాక్షసానందాన్ని పొందాయి

విధ్వంసం సృష్టించి,శైథిల్యం చేసినా

కాలగమనంలో.......

నా హైందవ ధర్మం,

సంస్కృతి, సంప్రదాయాలు 

పెను తుఫానుకు తట్టుకుని నిలిచిన

మహా వటవృక్షంవలె,సగర్వంగా నిలిచి

తలయెత్తుకుని లేచి నిలబడింది 

ప్రపంచానికే పాఠాలు నేర్పిస్తుంది. 

నా దేశము నా సంస్కృతి 

ప్రపంచానికి తలమానికమై నిలిచింది

ఇప్పుడు ప్రపంచం 

నా దేశంవైపు చూస్తున్నది 

కొన్ని  దుష్ట శక్తులు 

నా దేశ భౌతిక సంపదలను 

నాశనం చేయగలిగినవేమో

ఆధ్యాత్మిక సంపదనెవరూ నాశనం చేయలేరు

గంగా పునీతయైన నా భారతావని 

ప్రపంచానికే ఆదర్శం !

ఇది ఎప్పటికీ 

శిథిలం కాని వాస్తవం...!!

 

      మల్లెఖేడి రామోజీ 

      అచ్చంపేట 

      6304728329

04/10/20, 7:08 pm - +91 80745 36383: <Media omitted>

04/10/20, 7:08 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

అమరకుల సారథ్యం

నిర్వాహకులు.. అంజలి ఇండ్లూరి

3.10.2020 

అంశం..  శిథిలాలయాలు

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్

శీర్షిక ... ఆత్మీయ బంధాలు


పల్లవి...

శిథిలమై పోతున్నయమ్మా.....

హృదయాలు శిథిలమైపోతున్నయమ్మా

మమతానురాగాలు అటకెక్కి కూర్చునే

ఆత్మీయ బంధాలు బరువెక్కిపోయే//శిథి//


1.చరణం..

నీది నాదంటూ భేదాలు ఎందుకు

మనిషి మనిషిలోన మర్మాలు ఎందుకు

రాచిలకల గూడేమో రాబందుల పాలాయే

పాత నీళ్లేమో పక్కదారి మరలే 

కొత్త నీళ్ళేమో కొంగుబంగారమాయే 

                                                // శిథిల//

2.చరణం...

ఆనాటి హృదయాలు ఆనంద నిలయాలు

ఈనాటి హృదయాలు శిథిలాలయాలు

సంస్కృతులేమో సరసమాడుతుండే

సంప్రదాయ లేమో సల్లంగా కూర్చునే

కాలమేమో మారిపోయే మనసులేమో జారిపోయే......                 // శిథిలమై//


3.చరణం..

కాల యముడు నీకు కాచుకుని

వున్నాడు కనిపించని ముళ్ళు కత్తులై

వున్నాయి బాట పొంట పోతు భద్రంగా చూస్తూ అనువైన బాటనే ఎంచుకోవమ్మా

                                          //శిథిలమై//

4.చరణం..

మహానుభావుల త్యాగాలు మరువకు

అమ్మనాన్నల ప్రేమను అలుసుగా చూడకు 

బంధాలు బాధ్యతలను బరువుగా చూడకు

మనసును పదిలంగా దాచుకుని ఆనందనిలయంగా మార్చుకోవమ్మా 

                                            //శిథిలమై//


హామీ పత్రం.....ఇది నాస్వీయ రచన

04/10/20, 7:08 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశం:శిధిలాలయాలు

శీర్షిక;శిథిలమైన అలవాట్టు

నిర్వహణ:శ్రీమతి అంజలి గారు

ప్రక్రియ:పద్యాలు


తాతపెద్దనాన్న తనయులందరితోడ

కలిసిమెలిసి బ్రతికె కష్టసుఖము

లందుమమతపంచి ముద్దుమురిపములన్

శిధిలమాయెనేడు చిత్రముగను


పరులసొమ్ముకాశ పడకబ్రతిరినాడు

దొరికినంతలోన దాచుకొనుచు

పరులమేలుగోర పరమాత్మ మెచ్చని

శిధిలమాయెనేడు చిత్రముగను


ఇసుకకుప్పలాట నిలలోన కనరాదు

కోతికొమ్మలాట కుంటుడాట

గిల్లుడాట గాలి గిరుకలాటలునేడు

శిధిలమాయెనేడు చిత్రముగను


చెరువులందునీత చెలిమితో తెచ్చిరి

తాటిపండ్లు గాల్చి తనివితీర

తినగమధురమైన తీపిని చ్చెనుజూడ

శిధిలమాయెనేడు చిత్రముగను


బొమ్మరిల్లు గట్టి బొమ్మల పెండ్లి తొ

పెద్దమనిషిలాగ ప్రేమచూపి

స్వరముమార్చిమాట చక్కని మాటలు

శిధిలమాయెనేడు చిత్రముగను


బాల్యమందుపొలము బనులుజేయగపోయి

పడిసెలేసినిలవ ప్రేమతోడ

మదినచూసిమురిసె మమతతో మానాన్న

శిధిలమాయెనేడు చిత్రముగను


పెండ్లిపందిరేసి పెట్టిరి మామిడి

యాకులందు చూడ యందమిచ్చె

పచ్చనైననీత పందిళ్ళు తోడుగా

శిధిలమాయెనేడు చిత్రముగను


పంక్తిభోజనంబు బహుపందుగానుండె

నాకువేసిపెట్టె నన్నమందు

నియతితోడతిండి నియమాన్ని నేర్పెను

శిధిలమాయెనేడు చిత్రముగను


పెండ్లిపల్లకపుడు పెట్టిరి రంగుల

పూసలందు మెరిసె పుడమిలోన

కొత్తదంపతులకు కొలువైన పల్లకి

శిధిలమాయెనేడు చిత్రముగను


కన్నవారి మాట కడలిలో దాటక

నెదురుజెప్పకుండ నేర్పుతోడ

గౌరవంగబ్రతికె గడపదాటకనుండి

శిధిలమాయెనేడు చిత్రముగను


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

04/10/20, 7:27 pm - +91 94934 35649: మల్లి నాధ సూరి కళా పీఠం yp 

అంశం. శిధిలాలయాలు 

నిర్వహణ. అంజలి ఇండ్లూరి గారు. 


పేరు. సి. హెచ్. వెంకటలక్ష్మి 

విజయనగరం 

                     ****

శీర్షిక..  నిజమైన  బంధం ఏది? 



పేమతో అమ్మ  ఎట్టిన 

 సద్ది బువ్వ తిని బడికెళ్ళి 

సదువు కున్న రోజులు 

సాన బాగుండేవి... 


స్వార్థం తెలియని అయ్యోరులు 

అచ్చరము  రాలేదన్న ఆవేదనతో 

సితకకొట్టి  దిద్దించిన రోజులు 

సాన బాగుండేవి... 


సాయం సందేల బుడ్డి దీపం 

సుట్టూ దీపం పురుగుల్లా చేరి 

చదివిన చదువులెంతో బాగున్నాయి ... 


నలుగురకు వెన్నెల్లో కథలు సెబుతు

బామ్మ  కలిపి పెట్టిన ఆవకాయ

 అన్నం ముద్దలు గుండెల్లో 

యింకా  మధురం గా వున్నాయి.. 


నాన్న అర్థరేత్రి క్యాంపు నుండి 

వస్తూ తెచ్చే  కోవా కోసం 

చూసే ఎదురు చూపులు యింకా 

మా మదిలో తియ్యగా వున్నాయి.. 


టెన్త్ రిజల్ట్స్ చూసుకోవాలని 

పేపర్ కోసం విధుల్లో పరిగెత్తిన 

రోజుల అలసట ఎంతో బాగుంది 


రేడియోలో వచ్చే ఆదివారం 

సినిమ/నాటకం కోసం 

బుద్దిగా కూచుని వింటూ, 

అమ్మ చేసిన పకోడీ తింటూ 

సంతోష వెల్లువలో తేలిఆడిన 

ఆ రోజులు విలువే వేరు... 


శిధిలమైనవి ఎన్నో వేల వేల 

ఆలయాలు.. గతంలో కలసి 

వర్తమానం మిగలని తియ్యని 

కుటుంబ బంధాలు తిరిగి వస్తే 

ఎంతో బాగుండు... 


నేడు కాంక్రిటు జంగల్ లో 

ఆధునిక వసతులు,సౌకర్యాలు 

వున్నాయి కాని  సంతోషం, 

ఆరోగ్యం చిరునామా లేదు.. 

 

మనసు విప్పి ఒకరితో ఒకరు 

మాటలాడు కోలేని దుర్భర దుస్థితి... 


శిధిలమై మూసుకొని పోయిన

 ఈ దేవాలయాలు తెరుచుకొని 

మళ్ళీ మంచి నవ హృదయ  

నిర్మాణం జరిగేది ఎన్నడు?...

04/10/20, 7:29 pm - +91 93813 61384: 💐మల్లినాథసూరి కళాపీఠము💐

సప్తవర్ణముల సింగిడి

పేరు:చంద్రకళ. దీకొండ

ఊరు:మల్కాజిగిరి

అంశం:హృదయ స్పందనలు...శిథిలాలయాలు

ప్రక్రియ:వచనం

నిర్వహణ: అంజలి.ఇండ్లూరి గారు


శీర్షిక:మానవతా యాగం

🌷🌷🌷🌷🌷🌷


దారితప్పిపోతున్న యువతను సరైన గాడిలో పెట్టడానికి...

కూలిపోతున్న కుటుంబ బంధాలను కూడగట్టడానికి...


మృగ్యమౌతున్న నైతికవిలువలను పెంపొందించడానికి...

అబలలపై జరుగుతున్న అమానుష కాండను ఖండించడానికి...


ప్రకృతిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించడానికి...

అంతరించిపోతున్న జీవజాతుల ఉనికిని కాపాడడానికి...


అకాల వర్షాలతో,అనావృష్టి కరువుతో కడగండ్లపాలౌతున్న అన్నదాత మనోబలాన్ని కుదుటబరచడానికి...

సరిహద్దుల్లో చెలరేగుతున్న శత్రుమూకలను తరిమికొట్టే వీరసైనికులకు నూతనస్థైర్యమందించడానికి...


పేట్రేగిపోతున్న అవినీతిని అంతమొందించడానికి...


అంతుపట్టని రోగాలతో అస్తవ్యస్తమైన జనజీవితాన్ని చక్కదిద్దడానికి...

శిథిలమైపోతున్న దేహ దేవాలయంలోని  సున్నిత 

హృదయ స్పందనలను పునరుద్ధరించడానికి...


పూర్ణాహుతి లేని నిరాటంక,నిరంతరాయ, నిరంతర మానవతా యాగం చేస్తూ ఉండాల్సిందే...!!!!!!!!

*****************************

చంద్రకళ. దీకొండ

04/10/20, 7:30 pm - +91 95502 58262: మల్లి నాధసూరి కళాపీఠం yp

4-10-2020

అంశం:శిథిలాలయాలు

రచన: శైలజ రాంపల్లి

నిర్వహణ: అంజలి ఇడ్లూరి

     

మానవత్వం మంటగలుస్తుంది!

హింస పైశాచికత్వం రాజ్యమేలుతుంది!

బ్రూణ హత్యలు !

మాన భంగాలు మాములయ్యే !

ఆసుపత్రిలు దోచుకోవట్టే !

చదువు కొనుడాయే !

విలువలు మృగ్యమాయే !

నైతికత లేదు !

ఆకలి చావులు !

వృద్దాశ్రమాలు పెరుగవట్టే !

 ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యే !

మేకప్ మనుషులు!మనసులు 

స్వార్ధం,అసూయలతో 

శిధిలమౌతున్న హృదయాలు !

అంతరించిపోతున్న  సంస్కృతి !

పెరుగుతున్న ప్రాచ్యాత్య మోజు !

అడుగంటుతున్న మానవ సంబంధాలు ! 

శిథిలాల్లో శల్య మౌతున్న బ్రతుకులు రేపటి వెలుగుకై 

ఎదురు చూపు !

04/10/20, 7:32 pm - +91 94415 44806: వేలేటి శైలజ సిద్దిపేట


శిథిలాలయం



మనిషి తత్త్వం మాయమైతే


మనసు దైవత్వం విడనాడితే


తేనె మాటల చాటున

మృగత్వం దాగివుంటే


దేహమే శిథిలాలయం

హృదయమే నిశీథి నిలయం



**ఇది నా స్వంత రచన

04/10/20, 7:33 pm - +91 94941 62571: అంశం..శిథిలాలయాలు

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

కామారెడ్డి

నిర్వహణ.. అంజలి ఇండ్లూరి


హృదయమనే శిథిలాలయములో

మానసిక రుగ్మతలు చుట్టుముడతాయి

ఆలోచనలతో నీభావాలను శిథిలము చేస్తాయి

మానసిక ముగా నిన్ను కృంగదీస్తాయి

మానసికమైన వైషమ్యాలను సృష్టిస్తూ

మనసు ఆందోళనతో శిధిలమవుతుంది

మంచితనానికి ,మానవత్వానికి విలువలేకుండాపోయినపుడు మనసు శిథిలలాయమవుతుంది

అహంకారముతో ఎదుటు వాళ్ళు విర్రవీగినపుడు

మనసును సూటిపోటుమాటలతో

గాయము చేసినపుడు హృదయము శిథిలాలయముగా ముక్కలవుతుంది

ఆందోళనలతో కూడిన అంతర్గత సంఘర్షణలు మానసికముగా మనిషిని పాతాళానికి అణిచివేసినపుడు జీవితము శిధిలాలయముగా మిగులుతుంది

సంతోషముతో మనసు పులకించినపుడు మనసు మమతల ఆలయముగా మారుతుంది

జీవితము పరిమళాలసుమధురగీతమవుతుంది

04/10/20, 7:39 pm - +91 98499 52158: మల్లినాథ కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి yp

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో.

అంశం:శిథిలాయాలు

నిర్వహణ:అంజలి ఇండ్లురి గారు.

శీర్షిక:ఆపాత మధురాలు

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్.


ఆనాడు ఎంతో శ్రమా,ఓర్పు,నేర్పుతో ఎన్నో రోజులుగా వారి నైపుణ్యం తో

ఉపవాస దీక్షగా భక్తిగా చేసిన 

దేవతా మూర్తుల విగ్రహలు దేవాలయాలు నేడు చికటిననుభావిస్తున్నాయి.


ఎటుపోతున్నది కాలం అనుభవం,అనుబందాలు ఆపాత మధురాలను,ఆరాధిం చని,ఆస్వాదించని మనుషులను చూసి మార్చలేక అలసిపోయి

ఆ భూమాతే 

అద్భుతాలకు తన స్వచ్ఛమైన

ఎర్రని వర్ణపు కొంగుతో దాచుకుంటుంది.


ఉగ్గుపాలను త్రాగి ఆడిన ఊసులు మరిచి ఉనికి విడిచి

సాంకేతిక అంటూ పాచ్చత్య సంబరాలకు,పిలుపులకు సలామ్ కొట్టే వారు అల్ప సంతోషులే ...


స్థిర సంపద, ఆరోగ్య అనుబంధ సంపదలు మన పురాణాలు దేవాలయాలు వాటిని సంరక్షించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత. 

ఎంత విజ్ఞానం పెరిగిన పూజ్యసంస్కృతికి విలువ ఇవ్వనిది

పునాది లేని మేడ లా నిలవలేదు.

04/10/20, 7:54 pm - +91 99121 02888: 🌷మల్లినాథసూరి కళాపీఠం (Yp)🌷

🌈 సప్తవర్ణ సింగిడి 🌈

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం : శిథిలాలయాలు 

రచన :  మహమ్మద్ ఇక్బాల్ 

నిర్వహణ : అంజలి ఇండ్లూరి గారు

~~~~~~~~~~~~~~~~~~~

ఆయువు పోసుకొని అమ్మ వొడిలో నిద్రోతున్నప్పుడు మనిషి,మనుసు ఒక దేవాలయమే 

ఎదుగుతున్న కొద్దీ ఎదలో మొగ్గతొడుగుతున్న శిథిల భావాలెన్నో 

బాహ్య అందానికి అలంకరిస్తూ 

మనుసులో కుళ్ళును కుప్పలు తెప్పలుగా పోగేస్తూ శిథిలావస్తుగా మారుస్తున్నాం 

అందమైన కట్టడాలెన్నో వందల ఏళ్ళు  అందంగా దర్శనమిస్తాయి 

వందేళ్లు బ్రతకని మనిషి మాత్రం ఆలోచన,అసూయా పెరిగి  కొద్దీ  శిథిలావస్థ చీకట్లో మసకబారుతున్నాడు 

మనలోని మంచి పెరిగేకొద్దీ నిత్యా నూతనమే 

మనలో చేడు పెరిగేకొద్దీ శిథిలావస్థలో కూరుకొని కూలుటకు సిద్దమైనట్టే 

దేవాలయమైన,దేహమైన పరిశుద్దమైనవే 

పరిశుద్ధమైన పవిత్రమైన స్థలాలను శిథిలమవ్వనీకు

ఆధ్యాత్మికత,ఆదుకోనేగుణం వాడిపోని సూర్య ,చంద్రుల లాంటివి 

శిథిలమనే మాటనెరుగవు మనమున్న లేకున్నా ఆధ్యాత్మికత,ఆదుకోనేగుణం శిథిలమవ్వకుండా రక్షిద్దాం

04/10/20, 7:59 pm - +91 99597 71228: డా॥బండారి సుజాత

అంశం: శిథిలాలయాలు

నిర్వహణ: అంజలి ఇండ్లూరి గారు



వేదాలు, పురాణాలు వెలసిన వేదభూమి 

అన్నదమ్ముల ఐక్యతన చూపిన ఆనంద భూమి

 జీవితమంతా ఒక్కరికే అంకితమన్న ఆదర్శ భూమి మంచి చెడుల మర్మాలను మహికి చూపి మాటలతో చేతలలోనిలిచిన భరతభూమి


కలసి ఉంటే కలదు సుఖమన్న కర్మభూమి

 స్వార్దపు సామ్రాజ్యమే అభిమతమై 

నెనరు మాయమై నెర్రలు పారుతున్నదీ జన్మభూమి



స్త్రీలను గౌరవించాలని

 అమ్మే జగతికి మూలమన్న చరిత్రమాయమై

 ఆడపిల్లలను అగచాట్లకు  గురిచేస్తూ,

 మనసు, మమతను మరిచి అహంతో అలరారుతున్న భవిత భూమి


పాప పుణ్యాలనుపక్కన పెట్టి, బంధాలు అనుబంధాలకు విలువ నివ్వక

 స్వార్థ సంకుచితాలతో మానవత్వాన్ని మంట కలిపి

పశువాంఛల పంతంతో తమను తాను నిరూపించుకొంటున్న చీడపురగులనుకన్న శిథిలభూమి 


నైతిక విలువలను ఆచరించక పెద్దల మాటకు విలువ నివ్వక భోగం, భాగ్యపు జీవితమే పరమావధని ,

 కుళ్లు కుతంత్రాలతో మనసు లేని మనుషులుగా

సమాజాన్ని శిథిలాల నిశీధికి నెడుతున్నాడు

 మారుతున్న అన్ని జీవులలో వివేకవంతుడైన మానవుడు

04/10/20, 8:01 pm - +91 98482 90901: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

నిర్వహణ :- శ్రీ మతి అంజలీ ఇండ్లూరి గారు

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

అంశం :- శిథిలాలయాలు

కవి పేరు :- సిహెచ్.వి.శేషాచారి

కలం పేరు:- ధనిష్ట

శీర్షిక :- 

*దేవాలయ రక్షణ భారతీయ పరి రక్షణ*

౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪

భారతీయ సంస్కృతి సంప్రదాయ సిరి 

లలిత కళా పరివిశ్టిత విశ్వ వ్యాప విభవం

ఆసేతు హిమాచల పర్యంతం

సుందర శిల్ప కళా సంపదల

భాండాగారాలయి విలసిల్లిన

దేవళాలు 

ఎన్నోవృత్తులవ్యవసాయాభివృద్ధి

హేతువులై నిలిచాయి

చక్కని మంత్ర యంత్ర తంత్ర యజ్ఢ యాగాది క్రతువుల

అమంగళప్రతిహతహేతుభూత

పుణ్య క్షేత్ర ఆధ్యాత్మిక ఆర్ష ధర్మ

వెలుగు జిలుగుల ధర్మ క్షేత్రాలు

క్రొవ్విన యవనుల తురుష్కుల

దాష్టీకపు రాక్షసత్వంవెర్రితలలు

వేసి హిందు ధర్మాన్ని భారతీయ

సంస్కృతిని నాశనం జేయ

సమకట్టి అపర ధనరాశి కేంద్రాలుగా ఎంచి శిథిల పరచ యత్నించిరి

సోమనాథహంపీవిజయనగరం

కాకతీయ కళాత్మకతకు

శిల్పకళల కాణాచి

వేయిస్తంభాల రామప్ప

ఖిలావరంగల్ తంజావూర్

అజంతా ఎల్లోరా ఎన్నో

దేవాలయాలు 

తురుష్కుల దాష్టీకానికి ధ్వంసమైన అపార శిల్ప కళా సంపదల భాండాగారాలు

సంగీత సాహిత్య నృత్య చిత్ర శిల్ప కళా కేంద్రాలూగా

భారతీయ ఆత్మ గౌరవ ఆధ్యాత్మిక పవిత్ర పుణ్యతీర్థ

క్షేత్రాలుగా విరాజిల్లాయి

రామదాసు భక్తి పరాకాష్టకు

సజీవ వాస్తవ కథా సాక్షీభూతం

దైవము దేవాలయంలో

తద్వారా దేహాలయంలో

జీవుడి గుండె గుడిలో నిలిచుంటాడని నమ్మిన

పవిత్ర పుణ్యధామాలు

భద్రాచలం గోల్కొండ కోట

అపర శిల్ప కళా చమత్కృతి 

భాండాగారాలు కోణార్క్ పూరీ

భువనేశ్వర్ మధుర మధురైలు

జీవుడున్నంతవరకుదేవుడుంటాడు

ఎర్రకోట తాజ్మహల్ దౌల్తాబాద్

ఫతేపూర్ సిక్రీ కొలనుపాక

పెక్కు శిల్ప కళా విణ్ణాన సాక్షీభూతాలు

విదేశీయుల సైతం విస్మయ పరిచే పుణ్యతీర్థ క్షేత్ర స్థలాలు

ఎన్నో వృత్తుల వారు జీవనాధారం నందిన

క్షేత్ర కల్ప ద్రుమాలు

వాటిని పరి రక్షించి ధర్మ పరిరక్షణ చేసి భారతీయ

సంస్కృతి పరిశోభింపజేయుట

ప్రతి భారతీయుని కనీస ధర్మం

*ధర్మో రక్షతి రక్షితః*

                     *ధనిష్ఠ*

           *సిహెచ్.వి.శేషాచారి*

04/10/20, 8:14 pm - +91 94400 00427: *శుభసాయంతనము*💐💐


🚩 *శ్రీమల్లినాథసూరి కళాపీఠం- ఏడుపాయల*🚩

*సప్త వర్ణాల సింగిడి*

*తేదీ.04-10-2020, ఆదివారము*

*అంశము:- *శిథిలాలయాలు*

(ఈ అంశపై గేయం/కవిత/పద్యం ఏదో ఒక విభాగంలో  రచనలు)

*నిర్వహణ:-శ్రీమతి.అంజలి ఇండ్లూరి గారు*

                 -------***-------

            *(ప్రక్రియ:-పద్యము)*


గతమున నిర్మించినవౌ

యతిశయ రీతిని వరలిన యాలయములు నే-

డతి దీన స్థితిలో యప-

శృతు లాలాపించు చుండె శిథిలమగుటచే..1


పరమత రాజులు బూనుచు

భరతావని హిందువులను భ్రష్టుల జేయన్

దొరకొని కోవెల గూల్చిరి

మరువక దోచిరి గుడులను మాసె విభవమే..2


దేవాలయ మాన్యములను

సేవాభావమున నిడగ శ్రేష్ఠులు పూర్వం-

బేవిధముగనో యన్యులు

మావి యనుచు లాగు కొనిరి మాయల తోడన్..3


కోవెల దీపము వెలుగదు

కోవెలలో గంట మ్రోగు గుఱుతే కరువౌ

కోవెల శిథిలంబాయెను

బావురుమను దుఃఖమె యిక భక్తుల దడిమెన్..4


గుడియన పెద్ద వ్యవస్థయె

తడయక పెక్కుర కిడుగద స్థానము, తిండిన్

వడి బాయక గాచు ప్రజను;

కొడిగట్టిన దివ్వె జేసి కులికిరి దుష్టుల్...5


కాపాడగ పూర్వ కళల

యేపాటుల నైన బడుచు నిక గుడుల నరుల్

చేపట్టుచు నుద్యమముల

పాపుల దూరమున నుంచ వలె కోవెలకున్..6


నవ్వుచు నుండును దేవుడు

క్రొవ్విన కొందరు మనుజులు కోవెల దోచన్

దవ్వుల లేదుర నరకము

యెవ్వానికి తగిన శిక్ష యిక తప్పదురా..7


🌹🌹 శేషకుమార్ 🙏🙏

04/10/20, 8:18 pm - +91 73308 85931: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్త వర్ణముల సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

4-10-2020 ఆదివారం

అంశం: శిథిలాలయాలు

నిర్వహణ: అంజలి ఇండ్లూరి

ప్రక్రియ: వచనం

రచన పిడపర్తి అనితా గిరి

శీర్షిక: తీపి జ్ఞాపకాలు

********************

ఆదివారం వచ్చిందంటే

స్నేహితురాళ్లతో కలిసి 

బాయిల దగ్గరికి వెళ్లి మైదాకు, పరికిపండ్లు,రేగుపళ్ళు తెంపితినిసాయంత్రానికి 

ఇంటికి చేరుకొనె తీపి జ్ఞాపకాలు.పొలములో

మొలక అలికిన నాడు

అమ్మ అలుకుడు బోనం 

చేసి పచ్చటి ఆకులలో 

అన్నం వడ్డించేది 

అలా పచ్చటి 

పొలాల మధ్యన భోజనం 

చేయడం ఎంతో  ఆనందాన్నిచ్చేది 

తిన్నాకొద్ది ఇంకా 

తినాలనిపించేది 

ఆ పచ్చటి పొలాల మధ్య

తిన్న రోజులు,ఏమైనాయి 

ఆ రోజులు శిథిలావస్థకు

చేరిన గుడిలా మారెను 

అనిపిస్తే అప్పుడు..అప్పుడు బాధ వేస్తోంది ఎంతపెరిగిపెద్దవారమైయిన 

బాల్యం మరుపురాని 

మధుర స్మృతులు

 


పిడపర్తి అనితాగిరి 

సిద్ధిపేట

04/10/20, 8:32 pm - +91 89852 34741: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

4/10/20

అంశం.....శిధిలాలయాలు

శీర్షిక........శిధిలావస్థలో

ప్రక్రియ.....వచన కవిత

నిర్వహణ.... అంజలి ఇండ్లూరి గారు

రచన....కొండ్లె శ్రీనివాస్

ములుగు

""""""""""""""""""""""""""""""""""""

పురాతన ఆలయాలు,తర తరాల అనుబంధాలు

పవిత్ర బంధాలు, ప్రకృతి అందాలు...

పాత పాటలు, నాటి ఆటలు,

పాడి పంటలు,పిండివంటలు

కుల వృత్తులు, ప్రాచీన కళలు...

**అవ్యాజమైన దివ్య కాంతిని ప్రసాదించి ....**

**సన్మార్గం లో మనల నడిపించినా**

**ప్రశ్నార్థకమే ... పాశ్చాత్య మాయలో పడి**

**బేబీ కేర్ సెంటర్లు మొదలు కొని వృద్ధాశ్రమాల వరకు*

బాధ్యత లు బరువై

అకృత్యాలను.... భగవంతుడిచ్చిన అవకాశం లా  చూసి

తనలోని అసురశక్తిని సంహరించక...

కనబడిందల్లా విధ్వంసం చేస్తూ...

రాముడు ఆచరించి చూపిన బాట మరచి

అపసవ్యంగా నడుస్తూ....

**తనే దేవుడిలా ఏటేటా రావణ వధా ?**

*రేపటి తరానికి పనికి రానిది పదిలపరుస్తూ...**

తరిస్తూ జీవనం కొనసాగితే....

**విచక్షణ లేని నడవడికి విధి చేతిలో ఆలస్యంగా నైనా శిక్షలే**

**మూర్ఖత్వం, స్వార్థం వీడి తనను తాను తెలుసుకుని...**

**ఆలోచనలు మారి మనిషి ప్రవర్తనలో మార్పులతో వ్యవస్థ లో మార్పు....**

04/10/20, 8:35 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 4.10.2020

అంశం. శిథిలాలయాలు

శీర్షిక: ధ్వంసధ్వజం

నిర్వహణ.అంజలి‌గారు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.

04/10/20, 8:35 pm - K Padma Kumari: సహనం సౌభ్రాతృత్వం తంత్రీనాదాల్లో‌ నిర్లిప్తమై లుప్తమై

యుక్తం కానిప్రజాస్వామ్యంలో

వ్యక్తమైన‌అస్తవ్యస్తమైన పాలనా

విధానదెబ్బకు కూలిన రాజ్యాంగం

శిథిలాలయమే

వింతపొకడలతో ధ్వంసమైన భారత

సంప్రదాయశిఖరాల్లో మతమార్పిడి

గబ్బిలాలు వేలాడుతున్నాయి

అంతర్గతద్వేషాలతో అంతర్వేదాల

మనోరథాలు తగలడుతున్నాయ్

కలహాలతో‌సరిహద్దులు.హద్దులు,మీరి,విధ్వంసాలతో‌శాంతి‌శిధిలాయాల్లో సహనజఠాయువు.రెక్కతెగిపడి

విలవిలలాడె

మానవత్వం మనోలయాల్లోశిథిలమై

హృదయానికి కవాటాలు మూసింది

ప్రేమదయ లుప్తమై ఉపేక్షాభావనా

లోహపు ఘంటారవాలు 

ఆర్థికసంబంధాలుతోహార్థకసంబంధాల ధ్వజస్థంభం‌కూలింది

సమాజం యావత్తూ దైవం లేని

గర్భాలయమై వేదనామంత్రాలు

జపిస్తూ వివశత్వమై వెర్రి‌ప్రదక్షణ

చేస్తుంటే మేధస్సు.ఆశిథిలయాల

ఆరిన‌యజ్నగుండంలో నివురై

నిట్టూర్చింది

04/10/20, 8:36 pm - +91 80196 34764: మల్లినాధ సూరి కళాపీఠం

నిర్వహణ : శ్రీమతి అంజలి గారు.

పేరు : మరింగంటి పద్మావతి

ఊరు : భద్రాచలం

అంశం : శిధిలాలయాలు

........................................ 


భిన్న  సంస్కృతుల  మేళవింపు మన   భరతావని ..

నాగరికత కట్టుబాట్లకు విలువలకు ప్రాధాన్యం ఇచ్చే పుణ్యభూమి .. 

అలనాటి బాంధవ్యాలు కనుమరుగవుతున్న 

నేటి సమాజంలో

కనుచూపులకు కానరాని ఉమ్మడికుటుంబాలు.

తరిగిపోతున్న ప్రేమాభిమానాలు.. 

శిధిలమై పోతున్న విలువలు..

పురాతన దేవాలయాలకు 

కొత్తరూపుదిద్దినట్లు

నేటి సమాజ పరిస్థితులను సాన పట్టవలసిన సమయం

పురుషాధిక్యతను చేదించి మగువల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత నవసమాజ నిర్మాణంలో 

ఒక భాగం ..

లింగ వివక్షత లేకుండా పిల్లలను  తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత. 

శిథిలమవుతున్న నైతిక విలువలను శిశువు నుంచే అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే .

పెద్దల మర్యాద బంధుత్వాలు తెలియజేసి కాపాడుకోవలసిన బాధ్యత

సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉంది.. 

మంచి మర్యాదలు నిజాయితీలు శిథిలమై 

స్వార్థం అసూయ ద్వేషాలు. పెరుగుతున్న సమాజంలో 

ప్రేమ తత్వంతో వాటిని రూపుమాపాల్సిన బాధ్యత మన అందరిదే. .. 🙏💐

04/10/20, 8:37 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 4.10.2020

అంశం. శిథిలాలయాలు

శీర్షిక: ధ్వంసధ్వజం

నిర్వహణ.అంజలి‌గారు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.


సహనం సౌభ్రాతృత్వం తంత్రీనాదాల్లో‌ నిర్లిప్తమై లుప్తమై

యుక్తం కానిప్రజాస్వామ్యంలో

వ్యక్తమైన‌అస్తవ్యస్తమైన పాలనా

విధానదెబ్బకు కూలిన రాజ్యాంగం

శిథిలాలయమే

వింతపొకడలతో ధ్వంసమైన భారత

సంప్రదాయశిఖరాల్లో మతమార్పిడి

గబ్బిలాలు వేలాడుతున్నాయి

అంతర్గతద్వేషాలతో అంతర్వేదాల

మనోరథాలు తగలడుతున్నాయ్

కలహాలతో‌సరిహద్దులు.హద్దులు,మీరి,విధ్వంసాలతో‌శాంతి‌శిధిలాయాల్లో సహనజఠాయువు.రెక్కతెగిపడి

విలవిలలాడె

మానవత్వం మనోలయాల్లోశిథిలమై

హృదయానికి కవాటాలు మూసింది

ప్రేమదయ లుప్తమై ఉపేక్షాభావనా

లోహపు ఘంటారవాలు 

ఆర్థికసంబంధాలుతోహార్థకసంబంధాల ధ్వజస్థంభం‌కూలింది

సమాజం యావత్తూ దైవం లేని

గర్భాలయమై వేదనామంత్రాలు

జపిస్తూ వివశత్వమై వెర్రి‌ప్రదక్షణ

చేస్తుంటే మేధస్సు.ఆశిథిలయాల

ఆరిన‌యజ్నగుండంలో నివురై

నిట్టూర్చింది

04/10/20, 8:37 pm - +91 97049 83682: మల్లి నాథసూరికళాపీఠంYP

సప్తవర్ణాల సింగిడి

అంశం:హృదయ స్పందనలు,శిథిలాలయాలు

నిర్వాహణ:అంజలి ఇండ్లూరిగారు

రచన:వై.తిరుపతయ్య

శీర్షిక:పూర్వ వైభవం

తేదీ:4-10-2020


*************************

హైందవ భారతీయ సంస్కృతికి

నిలువుటద్దం మన సనాతన

కోవెళలు. బృందావనంలోని ఆపాల గోపాలుడు చిందులు వేసినట్టు,అద్భుతమైన కట్టడాలు, నందనవనబహు సుందరంగాసుమనోహరంగా,

ఎందరో రాజచక్రవర్తులు కట్టించిన చక్కటి కట్టడాలను

మత మౌఢ్యంతో ద్వంసానికి

పాల్పడిన చెక్కుచెరగని దివ్య

దర్శనీయమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి.అయినా దేశ విదేశాలనుండి యాత్రికులకు

ఆ పూర్వవైభవం యాత్రికులను

ఆకట్టుకుంటున్నాయి.ఎన్నో అర్థవంతమైన చిత్రలేఖనాలు,

ఎన్నో బహుచూడముచ్చట భంగిమలు,నాట్యమందిరాలు

కట్టడాల ఉనికిని చూడగానే

స్వర్గసీమలో భగవత్ దర్శనం

కల్గినంత ఆనందం. భారతావనిలో వెలకట్టలేని

సంపదలంటే ఏవోకావు

వేయిస్తంభాలగుడి,అలంపూర్ బాలబ్రహ్మశ్వరాలయాల వంటి  సుందర మందిరాలు తిరిగి పూర్వ వైభవానికి నడుంకట్టే వారులేరా....

దేవాలయాల ముంగిట కొనేరుల్లో దీప కాంతులతో

చూడాలన్నదే ఆశ.....సంకల్పం

04/10/20, 8:37 pm - +91 6305 884 791: శ్రీ మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల

సప్తవర్ణ సింగిడి

అమర కుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో 

అంశం: శిథిలాలయాలు

నిర్వాహకులు: అంజలి ఇంట్లూరి గారు

రచన: శ్రీదేవి చింతపట్ల

ప్రక్రియ: కవిత

శీర్షిక: మనో మందిరం.

      ************************

అనురాగం,ఆత్మీయత

అనుబంధం, ఆనందం

నాలుగుస్తంభాలతో 

నేత్రానందగా

నింగిని తాకిన మనో మందిరం

నిట్టనిలువున కుంగుతున్న ది.



గుడి ముందు ఆడిన బతుకమ్మ

గూగుల్లో దాగింది.

పచ్చిక బయళ్ళలో గంతులేసిన బాల్యం

గది నాలుగు గోడల మధ్య బంధీఅయింది.



తపాలా బంట్రోతు మేఘాలు

మోసుకొచ్చే ఉత్తర సందేశాలు

చరవాణి బాణాలకు కనుమరుగయ్యాయి



ఆరు బయట పండువెన్నె లాటలు 

పబ్జి కై పరిగెడుతున్నాయి.



గుమ్మంలో నాన్న కై ఆత్రంగా చూసే చిన్నినయనా లు

బిగ్ బాస్ కే పరిమితమయ్యాయి.



వావి వరుసల పిలుపుల పలకరింపులు

వా ట్సప్ లో కనపడుతున్నాయి.



ప్రభాత పిల్ల తెమ్మెరల పలకరింపులు

బారెడు పొద్దెక్కినా మడుచుకోని మంచాలను చేరకున్నాయి.



అమ్మలక్కల ఆప్యాయత పలకరింపులు

టీవీ సీరియళ్లకు రివ్యూ లై వినపడుతున్నాయి.



గుజ్జనగూళ్ళు, చిర్రగోనె,కోతి కొ మ్మ, అష్టాచెమ్మ లు,తొక్కుడు బిళ్లలు, చెడుగుడు ఆటల సామూహికానందాలు శిథిల స్వప్నాలయినాయి.



మాటలు చెవికి దగ్గరైనా..

మనసులు మాత్రం మరు భూములయినాయి.



ఓ యువతా! శిథిలమైంది, అవుతుంది నేను కాదు, నువ్వు.



ఇకనైనా నా చేయందుకో 

పునరుద్ధరించు నా మనో మందిరాన్ని

నేనూ నీకిస్తా మనోబలం, కండబలం, గుండె బలం.

🙏🙏🙏

04/10/20, 8:37 pm - +91 77807 62701: మల్లినాథసూరి కళాపీఠం*

*సప్తవర్ణముల సింగిడి*

*ఏడుపాయల*

ప్రక్రియ.వచనకవిత

శీర్షిక : శిధిలాలయాలు

రచన : వినీలదుర్గ

నిర్వహణ :అంజలి ఇండ్లూరి

తేదీ: 04/10/20


దేహమే దేవాలయం

ఆత్మపరమాత్మనే దేవదేవుడు

అంతర్గత శోధనల ప్రాకారాలు....!!


మానవత నింగిలో

కట్టడాలు లేని మనసు గోడలు

అహం తుఫానుతో కూలుతున్న

ఇటుకలే....!!


నేనెవరు అన్న ప్రశ్నలేక

వ్యామోహపు పూతలతో

మగ్గుతున్న ఆలయమే 

పౌరుషాల గొడుగుల కింద మసలుతున్న గోపురమేన జీవనం..

..!!


ఆద్యాత్మకత పూజ లేక

అంతరాత్మ పూజారి లేక

స్వార్ధపు తాళమేసి

శిధిలాయలాలే బంధాల మధ్య....!!


మేలుకో మేలుకో కరిగే కాలాన్ని

వృధాచేయక

సద్వినియోగమై వర్ధిల్లు ప్రతిక్షణం

అదే సద్గతికి మహోన్నత దారి....!!



                                🌹వినీల🌹

04/10/20, 8:39 pm - +91 94932 73114: 9493273114

మల్లినాథ సూరి కళా పీఠం పేరు. కొణిజేటి. రాధిక ఊరు...రాయదుర్గం

 అంశం శిథిలాలయం నిర్వహణ.. అంజలి గారు శీర్షిక... ధర్మం


ఏ త్రేతాయుగానికి వెళ్లాలేమో ధర్మదేవతను చూసేందుకు...

యుగాలు దాటి కాలంతోపాటు ప్రవహిస్తున్న ధర్మం కాలికి ఏ తొడుగు తొడగలేక 

 రెండు కాళ్లు నడవ లేక మంచం పట్టింది...

అవిటిదైంది...

 ఆరోగ్యంగా తిరిగే ధర్మదేవతకు తీవ్ర భయానక స్వార్థపు రోగం సోకిందేమో... 

అధర్మపు దండయాత్ర ధాటికి తట్టుకోలేక దాక్కుంటోంది..  ధనపుగుప్పిట్లో,

 కరెన్సీ నోట్లు అమ్ముడుపోయి కుబేరుల ఇంట్లో ఓ వస్తువు అయింది...

 ధర్మానికి గ్రహణపు ఛాయలు సోకాయేమో...

అధర్మాన్ని సింహాసనంపై కూర్చోబెట్టి, పట్టాభిషేకం చేస్తున్నారు జనం...

 స్వార్థంతో, ధర్మాన్ని వివస్త్రను చేసి ఇ అవమానించి తూలనా డుతుంటే, ధర్మం ఓడిపోతుంది...

 అన్యాయం బలం ముందు తలవంచి, తనను తాను స్వీయ గృహనిర్బంధంలో కెళ్ళింది..

 భయంగా, అప్పుడప్పుడు సమాజం వైపు తొంగి చూస్తూ, అతికష్టం మీద తన ఉనికిని చాటుకుంటోంది...

మనిషి మనసులో అస్సలు కనబడని ధర్మం,  మనః  శిథిలాలయంలో ధర్మదేవత కన్నీరు కారుస్తోంది...

ధర్మ దేవత కంటి తడి మాత్రం ఈ భూమికి విలయమో,ప్రళయమో.

04/10/20, 8:40 pm - +91 99087 41535: శ్రీ మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి 

నిర్వహణ: శ్రీ అమర కుల దృశ్య కవి గారు శ్రీమతి అంజలి గారు 

పేరు:M. భవాని శర్మ 

ఊరు: జమ్మికుంట 

అంశం: శిథిలాలయలు


🌹🌻🌿 దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం జీవుడే దేవుడు.

మన దేహానికి ఏ కొంచెం అవస్థ అయినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి మన బాధను వైద్యుడికి వివరించి చెప్తాము.

వైద్యుడు మన దేహ  బాధను పట్టి మాత్రలు ఇస్తారు అప్పుడు దేహం మన స్వాధీనం లోకి వస్తుంది.

ఆ దేవుడు ఇచ్చిన ఈ దేహం సద్వినియోగం చేయాలి. దుర్వినియోగం చేయకూడదు. అదే విగ్రహమూర్తులు శిధిలావస్థలో ఉంటే ఇంత నిర్లక్ష్యం ఇప్పటికైనా కళ్లు తెరవండి విగ్రహ మూర్తు లను పునరుద్ధరణ చేయండి.

జీవాత్మడు పరమాత్ముడిని చేరాలంటే హృదయం స్పందించాలి. 🙏🙏🙏

04/10/20, 8:46 pm - +91 79891 76526: మల్లినాథసూరి కళా పీఠం 

సప్తవర్ణముల సింగిడి

అంశం: శిధిలా లయలు

ప్రక్రియ: వచన కవిత

నిర్వహణ: అంజలి  గారు


తేది:4-10-2020

శీర్షిక: మధుర స్మృతులు


            *కవిత*


భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం

సంస్కృతి సంప్రదాయాలకు  నిలయాలు మనదేవాలయాలు


సుందర శిల్పకళా

భాండాగారాలు 

వేదాలకు పుట్టిల్లుమన భారతం

నలంద తక్షశిల విక్రమశిల వంటి మహా విశ్వవిద్యాలయాలు మనకే సొంతం

ఆర్ష ధర్మానికి కాణాచి

చతుషష్టి కళలు నిలయం

ఎన్నో విజ్ఞాన శాస్త్రాల సమాహారం

కాశ్మీర్ నుండి కన్యాకుమారి పర్యంతం

విభిన్న సంస్కృతి సంప్రదాయాల సంగమం

పాశ్చ్యాత్య సాంప్రదాయాలకు పలి కాము ఆహ్వానం

అవే మన సంస్కృతి సాంప్రదాయాల పాలిట మారణహోమం





రచన: 

తాడిగడప సుబ్బారావు

కలం పేరు: రసజ్ఞ వాగ్దేవి

పెద్దాపురం 

తూర్పుగోదావరి

జిల్లా


హామిపత్రం:

ఈ కవిత నా సృజన అని దేనికి అనుకరణ కాదని

ఈ కవిత ఏ సమూహానికి గాని ప్రచురణకుగాని  పంపలేదని తెలియజేస్తున్నాను

04/10/20, 9:00 pm - +91 91774 94235: శ్రీ మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల

సప్తవర్ణ సింగిడి

అమర కుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో 

అంశం: శిథిలాలయాలు

నిర్వాహకులు: అంజలి ఇంట్లూరి గారు

రచన;కాల్వ రాజయ్య 

ఊరు;బస్వాపూర్,సిద్దిపేట 


దేహమే దేవాలయంబూలే 

తెలిసిన వారికి దేహమందే దేవుడున్నడులే 

అని యోగులు చెబుతున్నట్టు


నాటి దేవాలయాలు నేడు శితిలాలయాలుగా మారాయి 

కాకతీయల నాటి వేయి స్తంభాల గూడి అపుడు చూడ ముచ్చటగా ఉండేది 

కాని నేడది శితిలావస్త స్థితిలో ఉంది. 

పాడయ్యింది గుడే కాని గుడిలోని దేవుడు కాదు

మనం చూసే దృష్టిలో ఉంటుంది.


     కరోన వచ్చి కలకలలాడే విద్యాలయాలన్ని 

వెలవెల బోతున్నాయి 

కాని కాలం వచ్చినపుడు ఆర్భాటంగా ఉన్న వ్యవస్థలన్ని 

హంస పాదులా తయారవుతున్నాయి .


శితిలాయాలన్ని  సద్భక్తితో చూడాలని నామనవి

04/10/20, 9:02 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

04/10/20, 9:16 pm - Telugu Kavivara: <Media omitted>

04/10/20, 9:17 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-159🌈💥*

                       *$$* 

*భువన సింహాసనం భూరుహమే-159*

                         *$$*

*అఖిల లోకాల్లో వృక్షమే సకల శుభకరం*

*కల్పవృక్షం పారిజాతం ఇహపరాలలోన*

*భూమిపై ఏల బుద్ధిపుటం పెట్టడీ నరుడే*

*నా గాయం నీ మరణం ఊపిరై బతుకు*

                          *@@*

            *అమరకుల ⚡ చమక్⚡*

04/10/20, 9:17 pm - B Venkat Kavi changed this group's settings to allow all participants to send messages to this group

04/10/20, 9:20 pm - +91 94947 23286: మల్లినాథసూరి కళాపీఠం yp

పేరు : కట్ల శ్రీనివాస్,

ఊరు : రాచర్ల తిమ్మాపూర్, రాజన్న సిరిసిల్ల.

వచన ప్రక్రియ

శీర్షిక : *శిధిలమైన జ్ఞాపకాలు*


మనసంతా ఆలోచనల పర్వతం కింద శిధిలమై చేరింది, 

జ్ఞాపకాల తుంపరులే అప్పుడప్పుడు చల్లుతున్నట్లుంది.

మానవత్వముతో మదిని గెలిచిన మరకలన్ని మనసులో కదులుతూ ఉంటే,

అవన్ని నిజమని నమ్మి సాగిన నేను, 

సమద్రపు అల ఎగసి వెనక్కు లాగినట్లు లోపలికి తీసుకుంది.

అవన్ని గురుతులన్ని మనసులో శిధిలాలై చెరిగిన గురుతులని జ్ఞాపకాలై గుండెలనిండా నిండుతాయి.

కపట నాటకపు నేటి సమాజమిది,

నమ్మించిన ప్రేమ నిను ముంచి శిధిలాలకింద దాచి నిను అందరికి గురుతై చూపెడుతుంది.

నమ్మకమున్న కోటను కట్టిన నీవు

బూటకపు నాటకమున మునిగి గాలిపటమై తేలగా దారం తెగిన గాలిపటం గిరగిరా తిరిగి భూమినితాకినట్లు,

నువ్వుకట్టిన కోట శిధిలమై చరిత్ర కోసము మాత్రమే తప్ప చరితను తిరగరాయడానిక్ కాదని తెలుసుకో.. !!

04/10/20, 9:25 pm - Telugu Kavivara: *మల్లినాథసూరి* *కళాపీఠం ఏడుపాయల(YP)* 


    🌈 *సప్తవర్ణముల సింగిడి* 🌈


  *04.10.2020 ఆదివారం* 


             *అంశం :*

      *" శిథిలాలయాలు"* 


 *నిర్వహణ : అంజలి* *ఇండ్లూరి* 


*నేటి అంశం ఫలితాల్లో...*


*-----------------------------*

*శ్రేష్ఠకవులు*


*-----------------------------*

పద్యప్రక్రియలో..


*వెలిదె ప్రసాదు శర్మగారు*


గేయప్రక్రియలో...


*నల్లెల మాలికగారు*


వచనప్రక్రియలో..


1 *గదాధర్ అరిగెల గారు*


*2. స్వర్ణసమతగారు*



*ఈ నలుగురు శ్రేష్ఠకవులకు*


*శుభాభినందనలు*

04/10/20, 10:05 pm - Anjali Indluri: అందరికీ వందనాలు


*మల్లినాథసూరి* *కళాపీఠం ఏడుపాయల* 


    🌈 *సప్తవర్ణముల సింగిడి* 🌈


 *అమరకుల దృశ్యకవి గారి* *నేతృత్వంలో* 


 *హృదయస్పందనలు* *కవులవర్ణనలు* 


  *04.10.2020 ఆదివారం* 


           *నేటి అంశం :*

      *" శిథిలాలయాలు"* 


 *నిర్వహణ : అంజలి* *ఇండ్లూరి* 


ఈనాటి అంశ విశ్లేషణా 

వ్యాఖ్యాతలుగా సర్వశ్రీ

శ్రీ  వెలిదె ప్రసాద శర్మ గారు 

శ్రీ డా.నాయకంటి నరసింహ శర్మ గారు

శ్రీ బక్క బాబూరావు గారు

శ్రీ మోతేరాజ్ కుమార్  చిట్టిరాణి గార్లకు

నా హృదయ పూర్వక నమస్సులు కృతజ్ఞతలు


🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

మహోత్తమ కవిశ్రేష్ఠులు

_______________________________

  పద్యము

--------------------------------------------------

శేష కుమార్ గారు

మాడుగుల నారాయణమూర్తి గారు

వెలిదె ప్రసాద శర్మ గారు

డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్ గారు

పల్లప్రోలు విజయరామిరెడ్డి గారు

డా.బల్లూరి ఉమాదేవి గారు

నరసింహమూర్తి చింతాడ గారు

తులసీ రామానుజాచార్యులు

మోతేరాజ్ కుమార్ చిట్టిరాణి గారు

వి సంధ్యారాణి గారు

మచ్చ అనురాధ గారు

---------------------------------------------------

గేయము

----------------------------------------------------

డిల్లి విజయ కుమార్ గారు

శ్రీ రామోజు లక్ష్మీ రాజయ్య గారు

ప్రియదర్శిని కాట్నపల్లి గారు

నల్లెల్ల మాలిక గారు


-----------------------------------------------------

వచనం

------------------------------------------------------

గదాధర్ అరిగెల గారు

మంచికట్ల శ్రీనివాస్ గారు

బి వెంకట్ కవి గారు

కాళంరాజు వేణుగోపాల్ గారు

డా. నాయకంటి నరసింహ శర్మ గారు

త్రివిక్రమశర్మ గారు

ప్రభాశాస్త్రి జోశ్యుల గారు

ఇల్లూరు వెంకటేష్ గారు

శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి గారు

బక్క బాబూరావు గారు

కొప్పుల ప్రసాద్ గారు

సమత గారు

తౌట రామాంజనేయులు గారు

డా. చీదెళ్ళ సీతాలక్ష్మి గారు

చయనం అరుణ శర్మ గారు

ఆవలకొండ అన్నపూర్ణ గారు

పేరిశెట్టి బాబు గారు

భరద్వాజ రావినూతల గారు

విజయ గోలి గారు

రావుల మాధవీలత గారు

బి.సుధాకర్ గారు

పేరం సంధ్యారాణి గారు

రాజుపేట రామబ్రహ్మం గారు

డా.Nch. సుధామైథిలీ గారు

మొహమ్మద్ షకీల్ జాఫరీ గారు

ఈశ్వర్ బత్తుల గారు

యం.టి స్వర్ణలత గారు

పొట్నూరు గిరీష్ గారు

సిరిపురపు శ్రీనివాసు గారు

గొల్తి పద్మావతి గారు

ఓ. రాంచందర్ రావు గారు

రుక్మిణి శేఖర్ గారు

తెలికిచర్ల విజయలక్ష్మి గారు

దార స్నేహలత గారు

గాజుల భారతి గారు

దుడుగు నాగలత గారు

ఎడ్ల లక్ష్మి గారు

బోర భారతీదేవి గారు

పండ్రువాడ సింగరాజు శర్మ గారు

గాంగేయ శాస్త్రి గారు

కె.శైలజా శ్రీనివాసన్ గారు

బందు విజయకుమారి గారు

డా.సూర్య దేవర రాధారాణి గారు

ముడుంబై శేషఫణి గారు

నీరజాదేవి గుడి గారు

ప్రొద్దుటూరి వనజారెడ్డి గారు

లలితా రెడ్డి గారు

దొంతరాజు విజయలక్ష్మి గారు

కట్టెకోల చిన నరసయ్య గారు

యక్కంటి పద్మావతి గారు

జె.పద్మావతి గారు

యడవల్లి శైలజ గారు

పబ్బ జ్యోతిలక్ష్మి గారు

వేంకటేశ్వర్లు లింగుట్ల గారు

మంచాల శ్రీ లక్ష్మి గారు

మచ్చ అనూరాధ గారు

సుజాత తిమ్మన గారు

కోణం పర్శరాములు గారు

బంగారు కల్పగురి గారు

వై.నాగ రంగయ్య గారు

జ్యోతి రాణి గారు

M.కవిత గారు

మల్లెఖేడి రామోజీ గారు

సి.హెచ్ వేంకటలక్ష్మి గారు

చంద్రకళ దీకొండ గారు

శైలజా రాంపల్లి గారు

వేలేటి శైలజ గారు

సానుబిల్లి తిరుమల తిరుపతిరావు గారు

యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు

మొహమ్మద్ ఇక్బాల్ గారు

డా. బండారి సుజాత గారు

సి.హెచ్.వి. శేషాచారి గారు

పిడపర్తి అనితాగిరి గారు

కొండ్లె శ్రీనివాస్ గారు

కల్వకొలను పద్మకుమారి గారు

మరింగంటి పద్మావతి గారు

వై.తిరుపతయ్య గారు

శ్రీ దేవి చింత పట్ల గారు

వినీల దుర్గ గారు

కొణిజేటి రాధిక గారు

యం భవానీ శర్మ గారు

తాడి గడప సుబ్బారావు గారు

కాల్వ రాజయ్య గారు

తాతోలు దుర్గాచారి గారు

కట్ల శ్రీనివాస్ గారు

గంగాధర్ చింతల గారు


సమాజం, సంస్కృతి, ధర్మం ,హ్రుదయం, బంధాలు ఇలా ఎన్నో అంశాలను వివిధ పార్శ్వాలలో స్పృశించి స్పష్టమైన హృదయ స్పందనలతో రమ్యమైన వర్ణనలతో 1️⃣0️⃣0️⃣       రచనలు 

అందించిన కవులు కవయిత్రులకు అభినందనలు 


ఈనాటి అంశనిర్వహణకు అవకాశమిచ్చిన అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు



అంజలి ఇండ్లూరి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

🌈💐🌈🌹💐🌈💐🌈💐🌈

04/10/20, 11:03 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

05/10/20, 5:12 am - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

05/10/20, 5:31 am - Telugu Kavivara added +91 94918 75276

05/10/20, 4:51 am - Telugu Kavivara: **💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 


*సప్తవర్ణముల 🌈సింగిడి*


*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩


  *అంశం: కలనైనా అనుకోలేదు*


$$$$$$$$$$$$$


*(ప్రక్రియ: కవన సకినం)*


*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*


*తేది 05-10-'20* 


    *పరిమిత పదాలతో ఎనిమిది సమాన పాదాలతో ఉభయ విభజనగా భావాన్ని మీ కవన మందు ఇమిడ్చి రచనని రక్తి కట్టించండి.*


*రెండవ వరసలోకి ఏ పాదమూ జారకుండా ఖచ్చితంగా నాలుగు +నాలుగు=8 పాదాలతో భావాన్ని హృద్యంగా ఆవిష్కరించాలి*


 

*అమరకుల దృశ్యకవి*

       *పర్యవేక్షణ*

 *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల..*

05/10/20, 6:07 am - B Venkat Kavi: ✒️✒️✒️✒️🔥✒️✒️✒️

💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 

*సప్తవర్ణముల 🌈సింగిడి*

*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩

  *అంశం: కలనైనా అనుకోలేదు*


*(ప్రక్రియ: కవన సకినం)*


*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*

*తేది 05-10-'20* 


*రచన: బి. వెంకట్ కవి*


*కలనైనా అనుకోలేదు*

-------------------------------------

కలకంఠకంఠికలకలం కలకాలం కలగొనె

కర్షకుడు కర్మిష్ఠుడు కర్తకర్మయై కర్మసచివుడె

కర్పూరం కర్మధారయమై కర్తవ్యకర్ణుడాయె

కరపత్రం కలువకరణివలెను కరదీపికయ్యె


కరాళిక కరవాళికతో కర్మల కార్యమయ్యె

కమలాక్షుడు కమలవనమై కమనీయుడయ్యె

కమలాప్తుడు కమలినియై కమ్మవిల్లుయయ్యె కమ్మనిమహిమలు కలనైనా అనుకోలేదు


*బి. వెంకట్ కవి*


 *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల..*


💥💥💥🌹💥💥💥

05/10/20, 6:23 am - Telugu Kavivara: *తెలుగు కవివరా జిల్లా స్థాయి105 రచనలపై అవార్డ్ ల ఫంక్షన్ వచ్చే డిశంబర్ 10వ తేదీ.11 వ తేదీ & 12 వ తేదీ లలో ఉంటుంది అని ప్రొథమిక అంచనా . కవుల కుంభమేళ గా నామకరణం చేయబడిన ఇ కవన క్రతువునకు కవులందరినీ సన్నద్ధం కావలసిందిగా సూచన... అనివార్య పరిస్థితంల వలన  అనుమతులు లేనట్లైతే మూడు రోజులు పరిమిత సంఖ్యలో రోజు వారి గా కొంతమంది కి పిలుపు అందుతుంది. ఆవిధంగా మూడు రోజులు లేదా ఒకే రోజు ఉండవచ్చునని గమనించాలి. 


      ఏడుపాయల లో బస చేయాలనుకునేవారు హోటల్ హరిత లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఉచితంగా ఉండడానికి హాల్ ఏర్పాటూ ఉంది. ప్రత్యేక వసతి కోసం హోటలే సానుకూలం.



త్రిశక్తి పీఠంగా వ్యవహరించే గరుడగంగ మంజీరా పరివాహక ప్రాంతం లో అతి భారీ ఆలయం చిట్కుల గ్రామంలో శ్రీ చాముండేశ్వరీ ఆలయం; మహాభారతం కాలంలో జనమేజయుడు జరిపిన సర్పయాగం ఘటనా స్థలి ఏడుపాయల వనదుర్గా ఆలయం. వ్యాసుడు ప్రతిష్టించిన శ్రీ బాసర సరస్వతీ ఆలయం.. వీటి సమీపములోనే తుంబురేశ్వర ఆలయం శ్రీ రామాలయం గల ఇతిహాస క్షేత్రం వేల్పుగొండ. రాయ్ బాగిన్ రాణీ శంకరమ్మ (బాహబలి సినిమా నేపథ్యం) చారిత్రాత్మక మంజీరా సామ్రాజ్యం(మాహిష్పతీ) ఘటనల శంకరం పేట పాపన్న పేట కోటలు. రాజా ప్రతాపరుద్రుడు ఏలిన రాచవీడు మెదక్ కోట;ఆసియాలో అతి పెద్దదైన మెదక్ చర్చ్; నిజాం నవాబ్ కట్టిన పోచారం జలాశయం అభయారణ్యం; దగ్గరనే గల నిజాం సాగరం; అటువైపు ననే గల బకాసురుడు తిన్న బొక్కల గుట్ట బోధన్... వంటి పలు చారిత్రక క్షేత్రాలని దర్శించుకొని కవుల సంగమం ఈ రీతిగా కూడా ఉంటుంది అనే రీతిగా అనుభూతులను పంచుకోవచ్చు....


   పై తేదీ‌లకు కవులను సిద్ధంగా ఉండవలసిందని సూచన.... ప్రముఖులు వేంచేసే ఈ క్రతువులో వైభవం ని తిలకించవచ్చని సూచించండి.


*మల్లినాథసూరి కళాపీఠం -YP*

*రాయ్ బాగిన్ రాణిశంకరమ్మ చారిత్రక చంపూకావ్య సమూహం*


*తెలుగు కవివరా-105*


*తెలుగు కవివరా-51*


*తెలుగు కవివరా కవన సకినం*


*మల్లినాథసూరి కథా కళాపీఠం*


                *&*

*మహామహోపాధ్యాయ KP వ్యాసం*



       సమూహంల తరపున


*టీం మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

05/10/20, 6:42 am - +91 94925 76895: ✒️✒️✒️✒️🔥✒️✒️✒️

💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 

*సప్తవర్ణముల 🌈సింగిడి*

*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩

  *అంశం: కలనైనా అనుకోలేదు*

*(ప్రక్రియ: కవన సకినం)*

*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*

*తేది 05-10-'20* 

*రచన: రాధేయ మామడూరు*

*కలనైనా అనుకోలేదు*

-------------------------------------

జన జగతి గతి మార్చి

 మన స్థితిని దిగ జార్చి

తన స్థాయిని రుచి చూపి

రణస్థలిని తలపించే

     దివి నున్న భగవంతుడు

భువి నున్న మానవుడ్ని

రక్షించగ రావాలయును

కరోనాను తరమవలెను

05/10/20, 6:53 am - +91 94415 44806: వేలేటి శైలజ సిద్దిపేట



కలలు అలలు అలలుగా ఎగసిపడుతుంటే

కలలు కలత నిదురగామారుతుంటే

కలలు కల్లలు కావని కళ్ళు చెబుతుంటే

కలలు కనమని మనసు పోరుతుంటే

 కలలు ఎదలోతులగాయాలై రగులుతుంటే

కలలు కలకాలం నిలవాలని కోరుతుంటే

కలలు నిజమవాలని వనదుర్గ వరములిస్తే

కలనైనాఅనుకోలేదు నా కలలు కన్నీళ్ళవు తాయని




*ఇది నా స్వీయరచన

05/10/20, 7:51 am - +91 98679 29589: *సప్తవర్ణముల సింగిడి*

 *మల్లినాధసూరి కళాపీఠం, ఏడుపాయల* 

 *వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం: కలనైనా అనుకోలేదు*

*శీర్షిక : నా దేశపు గౌరవాన్ని మట్టిలో కల్పిస్తాయని*

*నిర్వహణ: శ్రీమతి హరిరమణ గారు*

*ప్రక్రియ: కవన సకినము*

*తేదీ 05/10/2020 సోమవారం*

*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట* 

         9867929589

Email : shakiljafari@gmail.com

"""""''"""""''"""'""""''''''"""""""""""""""""""'"'''""""""""


భరతమాత కళ్ళలోనా కన్నీళ్లు తెస్తాయని

అవినీతి, అత్యాచారం ఇలా ఫలిస్తాయని 

తల్లి, అక్క, బిడ్డల్ని ఇలా ఏడుపిస్తాయని

నా దేశపు గౌరవాన్ని మట్టిలో కల్పిస్తాయని


భ్రష్టులు ధర్మం పేరుతో స్వార్థం సాధిస్తారని

నా దేశపు ఇతిహాసాన్ని ఇలా మర్పిస్తారని

రాక్షస కృత్యపు ఈ వార్తలు వినిపిస్తాయని

కలనైన అనుకోలేదు ఈరోజులు వస్తాయని


*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

    *మంచర్, పూణే, మహారాష్ట*

05/10/20, 8:03 am - Madugula Narayana Murthy: **💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 


*సప్తవర్ణముల 🌈సింగిడి*

అమరకుల దృశ్యకవి*

       *పర్యవేక్షణ


*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩


  *అంశం: కలనైనా అనుకోలేదు*

(ప్రక్రియ: కవన సకినం)*


*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*


*తేది 05-10-'20* 


    *మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా*


తలలోపలయోచనలేదిల

కలకలమునులేపుప్రాణుల

విలవిలగిలలలాడులీలలు

క్రిమిరూపమెకీడుచేయుట


పాడుకరోనప్రళయకారిగా

అతలాకుతలంచేస్తుందని

కలనైనా అనుకోలేదు

కాలమ్మిలవస్తుందని

05/10/20, 8:05 am - Telugu Kavivara: *💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 


*సప్తవర్ణముల 🌈సింగిడి*

*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩

  *అంశం: కలనైనా అనుకోలేదు*


*(ప్రక్రియ: కవన సకినం)*


*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*

*తేది 05-10-'20* 


*కవన సేత: అమరకుల దృశ్యకవి*


*కలనైనా అనుకోలేదు*

-------------------------------------

*అక్షరమై గరుడగంగ మంజీరయని*

*సర్పయాగ స్థలి కవన వేదిక ఔనని*

*సప్తవర్ణాల సింగిడై వర్ధిల్లు ననియు*

*ఉత్సాహపు వేదికయై ఉప్పతిల్లంగ*



*జనమేజయుడి సర్పాలే ఆంగ్లముగ*

*తెలుగు నేలపైన మరియొక యజ్ఞంగ*

*కవియాజ్ఞికులతోడ ఈ నేల తేజరిల్ల*

*ఏడుపాయల వనదుర్గ వరమగునని*


*🌈అమరకుల దృశ్యకవి*

💥💥💥🌹💥💥💥

05/10/20, 8:27 am - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

అంశం.కలలోనైనా అనుకోము

నిర్వహణ.శ్రీమతి

హరిరమణ గారు

రచన.డానాయకంటి నరసింహ శర్మ


కలలు నిజమై కనులను మాయచేస్తాయనీ

మూసినకనులకే అవి అంకితమౌతాయని

స్వర్గానికి నిచ్చెన వేసి దేవుని చూపిస్తాయని

కలలోనైనా కనుమూసైనా తెరిచీ అనుకోం


అనూహ్య వ్యక్తులతో చెలిమి చేయిస్తాయనీ

మదిలోన భావాలు రంగులతోనింపుతాయనీ

తెల్లారేసరికి మటుమాయం అవుతాయని

కలలోనైనా అనుకుంటే ఇక కలలెందుకు?


 డానాయకంటి నరసింహ శర్మ

05/10/20, 8:28 am - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ -కవనసకినం

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -కలనైనా అనుకోలేదు

రచన -చయనం అరుణా శర్మ

తేదీ -05-10-2020


తల్లి భారతికి తనయగా జన్మించితి

పుణ్యమగు కర్మభూమిలో విలసిల్లి

సదాచారములను స్వాగతింతునని

మునుపెన్నడునేను ఊహించనైతిని


త్యాగధనులనేలపై సంచరించెదనని

మతాతీతమైనట్టి ఖ్యాతి మనదేనని

శర్వాణిని అక్షరాలతో అర్చింతునని

మెలకువనైనా కలనైనా అనుకోలేదు

05/10/20, 8:31 am - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

05-10-2020 సోమవారం

పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

ఊరు: ఆదోని/హైదరాబాద్

అంశం:  కవన సకినం

శీర్షిక:  కలనైనా అనుకోలేదు (54) 

నిర్వహణ : హరి రమణ


కలలు సాకారము సాధించాలి కష్టం

ప్రతి ఒక్కరూ చేరాలి మంచి గమ్యం


అనుకోలేదు కలనైనా ఓ రోజు వస్తు

ఘోరాలు పాపాలు ఇలాగా చూస్తూ


గాంధీ కల అర్ధరాత్రి స్వతంత్ర వచ్చేనా

పగలైన మగవాడు స్వేచ్ఛగా తిరిగేనా


కలలు  కంటూ ఇక  నిదుర పోవద్దురా

హద్దులెరగని విజయము సాధించరా

వేం*కుభే*రాణి

05/10/20, 8:37 am - +91 94412 07947: అమరకుల గారు ఒక ఉపాధ్యాయుడు.రాణిశంకరమ్మ

వారసులు.వనదుర్గా దేవి భక్తుడై 250 మించిన కవులతో

మల్లినాథసూరి కళాపీఠాన్ని స్థాపించి సప్తవర్ణముల సింగిడిని

ఏర్పరచి దైనందిన దృశ్యకవి అగుతారని కలనైనా ఊహించ

లేదు. ఇదివాస్తవము. అమ్మ వారే వెనుకనుంచి ఆయనను

నడిపిస్తున్నారనేది సత్యం.ఆయన శ్రీమతి పేరు తెలియదు.

వారి సౌభాగ్య జీవితం కలకాలం వర్థిల్లాలని ----

డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

05/10/20, 8:43 am - +91 98499 52158: మల్లినాథ కళాపీఠం yp

సప్తవర్ణముల సింగిడి.

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో.

అంశం:కలనైనా అనుకోలేదు

ప్రక్రియ:కవన సకినం

నిర్వహణ:శ్రీమతి హరిరమణ గారు.

తేదీ:5/10/2020

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్


కలతల కలవరముగ కలిగిన కలలౌ

కడతెర కడవరకు కాయని కథలుగా

కగించును కాల్చును కారపు కోరలతో

కదిలించును కనురెప్పల క్రింది కాలువను.



కోయిల కాకికి కూడిన కూరిమి

కూలికి కూడుకు కుదరని కలౌ

కాకరను కార్జురను కలిపిన కమ్మదనమౌన 

కలనైనా కుదరని కొలతల  కొండలేగా...

05/10/20, 9:01 am - +91 94911 12108: **💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 


*సప్తవర్ణముల 🌈సింగిడి*

అమరకుల దృశ్యకవి*

       *పర్యవేక్షణ


*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩


  *అంశం: కలనైనా అనుకోలేదు*

(ప్రక్రియ: కవన సకినం)*


*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*


*తేది 05-10-'20* 

శీర్షిక... కలనైనాఅనుకోలేదు

రచన...పల్లప్రోలు విజయరామిరెడ్డి

ప్రక్రియ.. కవనసకినం


దుష్టద్రష్టలైవిశిష్టసంస్కృతినష్టకారకులౌతారని

మందిర శిల్పసౌందర్యముచూడలేని  అంధులని

చిత్రవిచిత్రచిత్తవికారులెఘనచరిత నష్టదాయకులని

దురహంకారదుష్టరాజనీతిదురహంకారులువారని


వర్తమాన నరరూపరక్కసులు కుటిలదౌష్ట్యకర్ములని

భారతీయాత్మనష్టకారకులుమేకవన్నెపులులని

మానవత్వమెరుగనిమానవమృగాలుచెలరేగుతాయని

కలిలో భరతావనిలో...నే కలనైనా అనుకోలేదు

05/10/20, 9:09 am - +91 91006 34635: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి అమరకుల గారు

అంశం: కలనైనా అనుకోలేదు

కవన సకీణం

నిర్వహన: బిహరి రమణగారు

శీర్షిక: మాసియపోనీక నా అదృష్ఠం

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 5 Oct 2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------

కలవరమే నా జీవన పర్యంతమా

కలనైనా అనుకోలేదు కకావికల మౌనా నిరీక్షణా

కలల అలలపై తేలియాడు జీవ నౌక



కన్నీరు మున్నీరు కాక ముందే వచ్చి

కలడు కలడను ఆ దేవ దేవుడు

కన్నులకు కన్పించి నను కాపాడితే

కరుణామూర్తికి సదానా కైమోడ్పులు

05/10/20, 9:10 am - L Gayatri: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

5/10/2020, సోమవారం

ప్రక్రియ : కవన సకినం

అంశం : కలనైనా అనుకోలేదు

నిర్వహణ : శ్రీమతి హరి రమణ

రచన : ల్యాదాల గాయత్రి


ప్రతీ ఆడపిల్ల ఆదిశక్తి అంశయేనని

రక్షణ కల్పించి గౌరవించి తీరాలని

స్త్రీలులేని ఇల్లన్నీ శిథిలమై తీరునని

అమ్మాయిని చూస్తే అమ్మే కనిపించాలని


కంచెచేను మేయకుండ కాపలా ఉండాలని 

మానవ మృగాలన్నీ గుర్తించుటే మేలని

హెచ్చరించు రోజొకటి యిలా వస్తుందని 

కలనైనా అనుకోలేదు కాలం కాటేస్తుందని..

05/10/20, 9:19 am - +91 73493 92037: మల్లినాథ కళా పీఠం ఏడుపాయలు

సప్తవర్ణాల సింగడి

అంశం :కవన సకినం

నిర్వాహణ : అమరకుల దృశ్యం కవిగారు,హరి రమణిగారు

5-10-2020

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.


కరోనా మహమ్మారితో వేలు వేలు ప్రజలు

కడతేరే కష్టనష్టాలు ఎదురవుతాయని

కలలో ఊహించలేదు భూమార్పుల చెడుని

కనీశపు జాగ్రత్తల ధ్యేయంగా నడవండి!


కమ్మనైన అమ్మప్రేమ జీవితానికి కావాలి

కలోగంజో త్రాగి ఆత్మీయత పంచుకోవాలి

కలిమిలేమి,శాశ్వతంకాదు సంతోమేకావాలి

కలిసిమెలిసి బ్రతికి జీవితం ధన్యమవ్వాలి!

05/10/20, 9:23 am - +91 93984 24819: మల్లినాథసూరి కళాపీఠం ఏ.పా.

సప్తవర్ణాల సింగిడి,

కవనసకినం-05-10-2020,

పర్యవేక్షణ:శ్రీ అమరకుల,

అంశం:కలనైనా అనుకోలేదు,

పేరు:రాజుపేట రామబ్రహ్మం,

సెల్:9398424819,

ఊరు:మిర్యాలగూడ,

నిర్వాహకులు:శ్రీమతి హరిరమణ.

                 ------------

డ్రాగన్ మదమిలా అణగుతుందని

పాక్ పడగిలా నేల వాలుతుందని

కశ్మీర్ కపోతమిలా ఎగురుతుందని

మనబలమిలా ఋజువవుతుందని


అయోధ్యపై సుప్రీంతీర్పు వస్తుందని

భారీ పటేల్ విగ్రహం నిలుస్తుందని

కరోనా కాటు దేశాన్ని వణికిస్తుందని

కలగనలేదు ప్రపంచం గుర్తిస్తుందని.

 

              ----------రామబ్రహ్మం.

05/10/20, 9:28 am - Bakka Babu Rao: సప్తవర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం ...కవన సకినం చిరుకవిత.  కలనైన అనుకోలేదు

నిర్వాహణ..హరిరమణ

రచన ..బక్కబాబురావు



ఉరుకుల పరుగుల జీవితం

ఒకరిని మించిఒకరి ఆరాటం

స్వార్థ పూరిత మైన పోరాటం

తెలుసు కుంటే ఉత్తమము


ఏది శాశ్వితం ఏది ఆశాశ్వితం

ఏమరపాటులో అంతా శూన్యం

జరిగేది జరగక మానదు

జరగబోయేది తెలియదు


బక్కబాబురావు

05/10/20, 9:28 am - +91 94904 19198: 05-0-10-2020:-సోమవారం:

శ్రీమల్లినాథసూరికళాపీఠం.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి.శ్రీఅమర

కులదృశ్యకవిచక్రవర్తిగారిసారథ్యం.

అంశం:-కవనసకినం

నిర్వహణ:-శ్రీమతిహరిరమణగారు.

రచన:-ఈశ్వర్ బత్తుల

శీర్షిక:-"కలనైనా అనుకోలేదు"

🍥🍥🍥🍥🍥🍥🍥🍥🍥

కలనైనాననుకోలేదెకరోనవస్తాదని.! తలరాతలమార్పునుతెస్తుందని .!

బలములేనిగతినినరులకిస్తుందని!

ఇలజనులనింతబాధపెడుతుందని!


జలజలరాలేమరణశాసనమిస్తాదని!

వలవలనేడ్చేరోదనమిగుల్స్తుందని!

అలవైకుంఠంరోగినిజేరుస్తుందని..!

కలనైనానూహించలేదుపోతుందని.!


🍥🙏 ధన్యవాదాలు సార్ 🍥🙏

           ఈశ్వర్ బత్తుల

మదనపల్లి.చిత్తూరు.జిల్లా.

🙏🙏🙏🙏🙏🙏🙏

05/10/20, 9:30 am - Telugu Kavivara: https://youtu.be/6gITyj-G5FE

05/10/20, 9:35 am - +1 (737) 205-9936: సప్తవర్ణాల🌈 సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం:కలనైన అనుకోలేదు

ప్రక్రియ: కవన సకినం.

నిర్వహణ:హరిరమణ

రచన: *డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*

-------------------------------

*కలనైనా అనుకోలేదు*

-------------------------------


కనులు మూసినా తెరచినా కలలే

కష్టంతో ముడివేసినవి కొన్ని

కలలుగానే మిగిలేవి కొన్ని

కన్న కలలు నెరవేరేవి కొందరికే!!


కనిపించని కరోనాతో పోరాటాలు

అందమైన మొహాలకు అడ్డంగా గుడ్డ

తలరాతలు తలకిందులు అవుతుందని

విశ్వం ఇలా అని కలనైనా అనుకోలేదు!!

05/10/20, 9:40 am - +91 94412 07947: 9441207947

మల్లినాథసూరి కళా పీఠం YP 

సోమవారం 05.10.2020

అంశం.కలనైనా అనుకోలేదు

నిర్వహణ.శ్రీమతి హరిరమణ గారు 

===================

భువనవిజయం వంటి యట్టి సభయుందని

దైనందినసాహిత్యచర్చ జరుగుతుంటుందని

యావత్ప్రపంచంనుంచి స్పందన వస్తుందని

తప్పొప్పులు సరిదిద్దే దార్శనికులుంటారని

పరిపృచ్ఛలు కనసాగే పర్వమొకటి ఉంటుందని

సత్కారమ్మొనరించే సౌశీల్యత ఉంటుందని

మల్లినాథుపీఠమ్మే మనవేదిక అగుచుందని

కలనైనా అనుకోలే అమరకులే మన ప్రభువని

               @@@@@@@@@@

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

05/10/20, 9:46 am - P Gireesh: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి అమరకుల గారు

అంశం: కలనైనా అనుకోలేదు

కవన సకినం

నిర్వహన: బి. హరి రమణగార

శీర్షిక: కలనైనా అనుకోలేదు

----------------------------     

పేరు: పొట్నూరు గిరీష్;

చరవాణి: 8500580848;

Date : 5 Oct 2020;

ఊరు: రావులవలస, శ్రీకాకుళం

--------------------------


కరోనా కాల మొకటుంటుదని 

సుదీర్ఘ సెలవు లొస్తాయని

కవినై భావ వ్యక్తీకరణ చేస్తానని

సాహితీవేత్తల పరిచయమౌతుందని


సాహిత్య సమూహాలలో చేరి

అక్షర మాలలు అల్లుతానని

మంజీరా చూసే అవకాశమొస్తుందని

వనదుర్గా మాత ఆశీస్సులుంటాయని

05/10/20, 9:53 am - +91 98850 66235: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి..

అంశం: కలలోనైనా అనుకోలేదే

కవన సకినం

నిర్వహణ: శ్రీమతి హరి రమణ గారు

రచన: కొప్పుల ప్రసాద్, నంద్యాల


కలలోనైనా అనుకోలేదు బతుకు చిత్రం

కరోనా గాలికి మనిషి రాలి పోతాడని

ప్రపంచమంతా విలయతాండవం చేస్తుందనీ

పేదవాడి బ్రతుకు రోడ్డుపై పడుతుందని


వ్యాక్సిన్ కొసం ఎదురుచూస్తున్నాం

ఆశలతో జీవన ప్రయాణం సాగిస్తూ

ఎడారిలో ఒయాసిస్సులా కోసం

ఎదురుచూస్తున్నట్లు ఉన్నది జీవితం

05/10/20, 10:00 am - Hari priya: 🌈🚩కలలు కనడం కాదు కలలను సాకారం చేసుకోవాలి


కలలు కంటూ నిద్రపో వద్దు రా అని హితబోధను అందిస్తున్న ని గుడార్థపు సకినం.బాగుందండి అభినందనలు వెంకటేష్ గారు🙏🏻🌈🚩

05/10/20, 10:01 am - +91 99595 24585: *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

*దృశ్య కవి అమరకుల గారు*

*అంశం: కరోనా వైరస్*

*కవన సకినం*

*నిర్వహన: బి. హరి రమణగార*

*శీర్షిక: కలనైనా అనుకోలేదు*

*కవి : కోణం పర్శరాములు*

*సిద్దిపేట బాలసాహిత్య కవి 9959524585*

*తేది : 05-10-2020*

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

కరోనా వైరస్ ఒకటి

కదిలించెను ప్రపంచాన్ని

పరిశుభ్రత పాటించమని

ప్రజలకు హితము చెప్పెను


ఊహాన్లో పుట్టి ఎదిగి

ఉర్వినంత చుట్టింది

ఊపిరితిత్తుల జొచ్చీ

ప్రజల ప్రాణాలు హరించెను


*కోణం పర్శరాములు*

*సిద్దిపేట,9959524585*

05/10/20, 10:11 am - +91 81062 04412: *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

*దృశ్య కవి అమరకుల గారు*

*అంశం: కరోనా వైరస్*

*కవన సకినం*

*నిర్వహన: బి. హరి రమణగారు*

*శీర్షిక: కలగనలేదు*

*తేది : 05-10-2020*

*************************

కలలో  కూడా కలగన  లేదే...

కరోనా రోగమై కాటేస్తుందని...

ఇలను పూర్తి స్తంభిస్తుందని...

ఇంట్లో మనల బంధిస్తుందని...


రణ నినాదం వాయిస్తుందని...

చావు ఘంటిక మోగిస్తుందని...

బతుకు నాశనం చేసేస్తుందని...

జీవిత  భయం కలిగిస్తుందని...

****************************                                                  

*కాళంరాజు.వేణుగోపాల్*

*మార్కాపురం. ప్రకాశం 8106204412*

05/10/20, 10:12 am - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీమతి అంజలి గారు 

పేరు… ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :05-10-2020

అంశం : కలలోనైనా అనుకోలేదు (కవన సకినం )


స్నేహితులే నలిపే కామాందులౌతారని 

ఆదరించే ముసుగులోకీచకులువారేనని 

ప్రేమగ పెంచిన జీవితాన్నే నలిపెదరని 

పరువుకై ప్రాకులాడే హత్యలుంటాయని 


సజీవమొక్కలకు ప్లాస్టిక్ పూలొస్తాయని 

నిర్జీవదేహాలపై సజీవవిరులుంటాయని 

కన్నీటికెరటాలకరోనాచావులుంటాయని 

అమ్మఒడి రక్షణే అంతటా ఉండదని 


హామీపత్రం :ఈ కవన సకినం నా స్వంతం

05/10/20, 10:28 am - Balluri Uma Devi: 5/10/20

 మల్లినాథ సూరికళాపీఠం

అంశం:కవన సకినం

నిర్వహణ: శ్రీమతి గీతాశ్రీ స్వర్గం గారు

పేరు: డా. బల్లూరి ఉమాదేవి

శీర్షిక:: కలలోనైనా అనుకోలేదు

ప్రక్రియ: వచనకవిత


పాడు కీటకము ప్రళయాన్ని సృష్టించి

 జగతిని అతులా కుతలం చేస్తుందని

సమస్త జనులను ముంచెత్తుతుందనీ

కలలోనైనా అనుకోలేదు సుమా

జరగవలసినది  జరిగి తీరుననికొని

గాలిలో దీపముంచి దిశలు చూడక

తగిన జాగ్రత్తలను అనుసరించుచును

సాగుచుండ వలె నిత్య జీవితయాత్ర.

05/10/20, 10:33 am - +91 79818 14784: సప్త వర్ణముల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠంyp

అమరకల దృశ్యకవి సారధ్యంలో

నిర్వహణ: హరి రమణ 5-10-2020

రచన: కట్టెకోల చిన నరసయ్య

ఊరు: బోదులబండ జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

అంశం: కవన సకినం,కలలోనైనా అనుకోలేదు

శీర్షిక: కానక పోతిని



విశ్వాన్ని జయించిన నరుడను నేను

చంద్రమండలముపై అడుగుపెట్టి ఆరాతీసిన నేను 

సముద్రాన్ని ఒడిసిపట్టి  వశము చేసుకున్న నేను

నింగిని నేలను ఏకంచేసిన వీరుడను నేను


సమస్త వన్యజాతిని బానిసలుగా చేసుకున్న నేను

సాంకేతికతతో సర్వసుఖాలను అనుభవించిన నేను

నదులకు అడ్డుగా నిలిచి శాసించిన నేను

కంటికే కనపడని పురుగుని కలలోనైనా కానక పోతిని

05/10/20, 10:55 am - +91 97040 78022: శ్రీ మల్లినాధసూరి కళాపీఠం. ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం

సప్తవర్ణాల సింగిడి  5/10/2020

అంశం-:కవన సకినం. కలనైనా అనుకోలేదు

నిర్వహణ-:శ్రీమతి గీతాశ్రీ స్వర్గం గారు

రచన-:విజయ గోలి


కలతల్లో కరుగుతున్న  కమనీయ బంధాల్ని

కన్నీటిలోన కదిలేటట్టి కన్నియల ప్రాణాల్ని

కల్లలుగ నిలుపుతున్న భవితలోని ఆశల్ని

సింహంగా మొరుగుతున్న శునకపు కేకల్ని


కరోనాయె కాలుడిగా కదంతొక్కి వస్తుందని

కాలానికి కళ్ళెమేసి గమనంనూ ఆపునని

కాలుష్యపు కారుచిచ్చై పడగెత్తే సర్పమని

కలనైన అనుకోలే కాలుతున్న భారతాన్ని

05/10/20, 10:55 am - +91 97013 48693: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త ప్రక్రియల సింగిడి

కవన సకినం

నిర్వహణ:శ్రీమతి హారి రమణ గారు

రచన:గదాధర్ 

శీర్షిక:కలలోనైనా అనుకోలేదు


కలగన్నానా నీ గుడివాకిట నడయాడనని

అనుకున్నానా ఇన్నాళ్ళు నీ అభిషేకం కాననని

నీ అలంకరణ కనులారా వీక్షించ కుండా

ఇన్ని నెలలు భయపడుతూ దాక్కుంటానని


ఏమి పరీక్ష ప్రభూ ఏ తప్పుకు నాకీ శిక్ష....!

నాలో ఉన్న నీ రూపం కానలేక గుడికొస్తా

నన్ను మరచి నీ నామార్చనలో తరిస్తా

మహమ్మారి నుండి మమ్మాదుకో మహదేవా

 

🌻🌻🙏🙏🙏🙏🌻

05/10/20, 10:59 am - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 5-10- 2020

అంశం : కవన సకినం కలలోనైనా అనుకోలేదు!

నిర్వహణ:అమరకుల దృశ్య కవిగారు

హరి రమణ గారు, 


నిత్యo  సాహితీ సంభాషణ జరిపే అదృష్టం 

కవన క్రతువు లో సమిదలా వెలిగే భాగ్యం

నిరంతరం ఇంద్రదనస్సులా విరిసే సాహిత్యం

దొరుకుతుందని కలలోనైనా అనుకోలేదు!


కష్ట తరమైన పద్యరచన పట్టుబడుతుందని

కమ్మని కవన సకినాలను చుట్ట గలుగుతానని

గజల్ల సవ్వడిలో కలం నాట్యమాడుతుందని

నాకల తీరుతుందని కలలోనైనా అనుకోలేదు


ఈ కవన సకినం నా స్వంతం..ఈ సమూహం కొరకే వ్రాసితిని.

05/10/20, 11:09 am - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*05/10/2020*

*అంశం:కలనైనా అనుకోలేదు*

*నిర్వహణ:శ్రీమతి హరి రమణ గారు*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


     *కలనైనా అనుకోలేదు*


కలనైనా కలగ న లేదు ఈ విపత్తు గురించి

కళ్ళ ముందు కరడు గట్టిన హృది గురించి

పుడమి లో రాక్షస కబంద హస్తాల గురించి

అవనిపై ఆడజన్మ ఘోరమైన దని భావించి.


జగము అతలాకుతల మౌతుందనీ తలంచి

వింత వ్యాధులతో విధి ఆడే ఆట గురించి

మానవ మేధకు ఎదురైన సమస్య గురించి

చితిప యనం లో ఒంటరైన ప్రాణి గురించి.

05/10/20, 11:33 am - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ కవన సకినం

అంశం కలనైనా అనుకోలేదు

నిర్వహణ శ్రీ బి.హరి రమణ గారు

శీర్షిక  కలా నిజమా ఇది

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 05.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 52



కలలోనైనా అనుకోలేదు ప్రియతమా

నీ కమ్మనైన హస్తము అభయమౌతుందని

కలలోనైనా అనుకోలేదు నీచిరుదరహాసం

నాకష్టాలను పారద్రోలే ఔషదమవుతుందని


కలలోనైనా అనుకోలేదు నీతోడెపుడు

నాకు జీవితములో వరమవుతుందని 

కలలోనైనా అనుకోలేదు అదృష్టమన్నది

నీ రూపములో నాకు ఇలా లభిస్తుందిని

05/10/20, 11:38 am - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP నిర్వహణ:హరి రమణ గారు

కవన సకినం

అంశము:కలలోనైనా కలగనలేదు

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292




కనిపించని మహమ్మారి కరోనా వస్తుందనీ

కళ్లముందే వేల ప్రాణాలు తీసుకుపోతుందనీ

మనిషి మనిషి తాకాలన్నా భయపడాలనీ

మూతి మాస్క్ లతో మనుషులంతా తిరగాలనీ. 



చేయిచేయి కలిపితే ప్రమాదంపొంచివుందనీ. 

బ్రతుకు తెరువు పోయి భారంగా నడపాలనీ

అంతిమ యాత్రలో 

ఒంటిగా పోవాల్సివస్తుందనీ

ఇలాంటి రోజు

కలలోనైన కలగనలేదు

05/10/20, 11:47 am - +91 99597 71228: డా॥బండారి సుజాత

అంశం: కలనైనా అనుకోలేదు

నిర్వహణ: హరి రమణ గారు

తేది: 05-10-2020


గత్తర గురించి విని

గందర గోళపడిన జనులం

వైద్య సదుపాయమందని కాలం

ఊడ్చుకుపోయింది ఊళ్ళననుకొంటి


శాస్త్రసాంకేతాల అభివృద్దిలో

 లెక్కకు మించిన జాగ్రత్తల బతుకులను

మిక్కుటమైన' కరోనా' కు ఔషదమేలేక

ప్రపంచాన్ని వణికిస్తుందని

కలనైనా అనుకోలేదు

05/10/20, 11:52 am - S Laxmi Rajaiah: మల్లినాథసూరి కళాపీఠం YP 

సోమవారం: కవన సకినం.     5/10 

అంశము: కలనైనా అనుకోలేదు 

నిర్వహణ: శ్రీమతి హరి రమణ గారు 

                  వచన కవిత 


కలనైనా అనుకోలేదు కరోనా వస్తుందని 

ప్రపంచం ప్రాకి ప్రాణాల్ హరిస్తుందని 

సకల దేశాలను పట్టి పీడిస్తుందని 

ఎవరూహించారు కంపింప జేస్తుందని 


దివ్యదృష్టిగల ఋషుల కోవలో లేము 

వక్రదృష్టి వంచనలతో మన జీవనం 

సదాచారుల జీవితం ప్రశాంతమగు

అక్రమ మార్గం మరచి అడుగులేద్దాం 


           శ్రీరామోజు లక్ష్మీరాజయ్య 

           సిర్పూర్ కాగజ్ నగర్.

05/10/20, 11:54 am - +91 91006 34635: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి అమరకుల గారు

అంశం: కలనైనా అనుకోలేదు

కవన సకీణం

నిర్వహన: బిహరి రమణగారు

శీర్షిక: మాసియపోనీక నా అదృష్ఠం

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 5 Oct 2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------

కలవరమే నా జీవన పర్యంతమా

కలనైనా అనుకోలేదు కకావికల మౌనని

కలతే ప్రతీక్షణంనాతల రాతనిరీక్షణా

కలల అలలపై తేలియాడు జీవననౌక



కన్నీరు మున్నీరు కాక ముందే వచ్చి

కలడు కలడను ఆ దేవ దేవుడు

కన్నులకు కన్పించి నను కాపాడితే

కరుణామూర్తికి సదానా కైమోడ్పులు

05/10/20, 11:56 am - +91 94417 71955: మల్లినాథసూరి కళాపీఠం YP

కవన సకినము అంశం... కలలోనైనా అనుకోలేదు 

పేరు... ముడుంబై శేషఫణి 

ఊరు... వరంగల్ అర్బన్ 

సంఖ్య... 251

నిర్వహణ... హరి రమణ గారు. 

తేది... 5-10-2020.

....................... 

మనసుకు చేరువైన మల్లినాథసూరి కళాపీఠంలో 

ఏడుపాయల వన దుర్గాదేవి ఆశీర్వాదం 

అమరకుల అన్నగారి నిరంతర ప్రోత్సాహంతో 

సాహితీక్షేత్రాన చిరుమొలకగా అంకురం 


తెలుగు కవివరా 105 వైవిధ్య అంశాలతో 

కవితారచన గావించు అదృష్టం 

దినమొక ప్రక్రియతో దేదీప్యమానంగా వెలిగే కవన సింధువులో 

నేనొక బిందువునౌతానని అనుకోలేదు కలలోనైనా.

05/10/20, 12:02 pm - +91 94404 72254: మల్లినాధసూరి 

కళా పీఠం ఏడుపాయల

సప్తవర్ణాల 🌈సింగిడి

అమరకులదృశ్యకవిగారి ఆధ్వర్యంలో..

పేరు....వెంకటేశ్వర్లు లింగుట్ల

ఊరు...తిరుపతి

అంశం: కలనైనా అనుకోలేదే

శీర్షిక.... కవనసకినం

నిర్వహణ: శ్రీమతి హరిరమణగారు

05.10.2020.



కనుమరుగై చింతనల మనసున నిలిచావే

కనులందు పాపలవై మెరుపులా మెరిసావే

కులుకుల వయ్యారమై వంపుల  నడిచావే

కనుసైగల  పిలుపుల ఆహ్వానం  పంపితివే!


కలనైనా అనుకోలేదు   దేవతలా  వచ్చితీవే

కవిత్వాన కావ్యకన్యవై మనసంతా పరిచావే

కనుకొలుకు  కొలనులో   కమలమై విరిసావే       కవ్వింతలతో దరిజేర  కౌగిలింతల కరిగిపోవే!


వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

05/10/20, 12:22 pm - +91 96523 71742: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:కలనైనా అనుకోలేదు

నిర్వహణ:శ్రీమతి హరిరమణగారు

రచన:దుడుగు నాగలత



కలంపట్టి కవితలురాయగలనని

పద్య రచనలెల్లసాధ్యమగునని

బాలగేయాలనందముగమలచగలనని

నేనొకరచయిత్రిగాపేరుపొందుతానని


మల్లినాథసూరికళాపీఠంమార్గదర్శకమవునని

విశిష్టకవులపరిచయంఆదర్శమగునని

గొప్పకవుల పరిచయభాగ్యంకలుగునని

సాహిత్యసేవలోచిన్నసమిధనుకాగలనని

05/10/20, 12:40 pm - +91 94907 32877: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ కవన సకినం

అంశం :కలనైనా అనుకోలేదు

నిర్వహణ శ్రీ బి.హరి రమణ గారు

శీర్షిక :ఆశయం

పేరు: ముత్యపు భాగ్యలక్ష్మి

జగిత్యాల

తేది 05.10.2020

ఫోన్ నెంబర్ :9490732877

***************†******     

నా ప్రాణవిభుడే కొండంత అండగా

నా నెచ్చెలి సహాయ సహకారాలే నాకలంబనై

సాగింది నా చదువు పెళ్లయ్యాక

కలలోనైనా కలగనలేదు ఆశయం నెరవేరునని


ఉపాధ్యాయురాలిగా ఎదిగిన నా జీవితం

ఎదుర్కొన్నా కన్నీటి సుడి గుండాలెన్నో నేనే

లక్ష్యం దృఢంగా ఉంటే సాధిస్తావేదైనా

అడ్డులేదు నీకు ఈ జగతిలోనా

05/10/20, 12:41 pm - +91 93014 21243: మల్లినాధసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి 

ప్రక్రియ - కవనసకినం

శ్రీ అమరకులదృశ్య కవి ఆధ్వర్యం లో

అంశము - కలనైనా అనుకోలేదు

రచన - తెలికిచర్ల విజయలక్ష్మి

తేదీ - 05-10-2020


ఇద్దరు ఆడ బిడ్డలకు తల్లినయిన నేను,

ఇసుమంత కినుక వహించిన భర్త,

కొడుకు పుట్టలేదని బాధ పడిన అత్త మామలను చూసి..

నా తల రాతయనుకొని కించ పడిన నేను...

కొడుకులు వున్న తల్లులను చూసి, అసూయ పడిన నేను...


ఆయాడు బిడ్డలే దేశ విదేశాల లో...

ఉన్నత పదవులని స్వీకరించి ..

మంచి గౌరవ మర్యాదల ను పొంది...

ఈ అమ్మ త్యాగ ఫలమే మా ఉన్నతి..అని కొనియాడ గలరని అనుకోలేదు నేను "కలలో నైనా ఇలలో నైనా!"

05/10/20, 12:44 pm - +91 98868 24003: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల, సప్త వర్ణముల సింగిడి,

తేదీ : *05-10-2020*

అంశం :  *కలనైనా అనుకోలేదు*

 (కవనసకినం)

పర్యవేక్షణ : శ్రీ అమరకుల కవి గారు

నిర్వహణ :  శ్రీమతి హరి రమణ

పేరు : ఆకొండి (ముద్దు) వెంకటలక్ష్మి

ఊరు : బెంగళూరు


కలనైనా అనుకోలేదెన్నడూ మనపై అమ్మ ప్రకృతి ఇంత కినుక వహియిస్తుందని ఇలాతలాన్ని 

ఇంతలా వణికిస్తుందని;


మనుజులలో మంచి మార్పు వస్తుందని, ఋతువులు నిజగతిని తిరిగి పొందుతాయని బతుకులు మధురమైపండుతాయని.

05/10/20, 12:54 pm - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి 🌈

రచనసంఖ్య: 042, ది: 05.10.2020, సోమవారం.

అంశం: కలనైనా అనుకోలేదు

శీర్షిక: కాంక్షించని కాంక్ష

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల, శ్రీమతి హరిరమణ గార్లు.

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: "కవనసకినం" 


వచనకవిత

""""""""""""""""

కవనక్రతువునందు నేనిలా పాల్గొంటానని

గొప్పకవులందరితో కవితలురాస్తానని

తెలుగుకవిరత్న బిరుదునుపొందుతానని

మల్లినాథునికళాపీఠాన్ని నేనుచూస్తానని


వనదుర్గమ్మనుకన్నులారా తిలకిస్తానని

మంజీరానదితీర్ధాన్ని గొంతుతోసేవిస్తానని

సర్పయాగస్థలిని కళ్ళతోచూడగలనని

కలలోనైనాఅనుకోలేదు ఇవిసాధ్యమని


👆ఈ వచనకవిత నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

05/10/20, 1:03 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

శ్రీ అమరకుల గారి సారథ్యంలో

సప్తవర్ణాల సింగిడి

అంశం : కవన సకినం.

నిర్వహణ : శ్రీమతి హరిరమణ గారు.

పేరు :తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.

శీర్షిక *మానవీయ సుగంధాలు*.

*************************

 బంధాలు,అనుబంధాలదారిలో

మానవీయసుగంధాలలహిరిలో

జనమంతా చేసేజీవనపోరాటం

జనులంతా సాగేజీవితప్రస్థానం


నిరంతర బతుకొక పోరాటంలో

నిత్యం ఆశానిరాశలఆరాటంలో

సాగించాలి మమతలమాటులో మానవీయ సుగంధాల తోటలో

*************************

ధన్యవాదాలు సార్ !!!🙏🙏

05/10/20, 1:05 pm - +91 98492 43908: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల

బి.సుధాకర్

అంశం..కలనైనా అనుకోలేదు


కాలం పరుగులొ మనిషి

వేగం పెంచెను తెలిసి

నవీన యుగమని మురిసి

పాడై పోయెను అలసి


అందని జాబిలి అనుచు

దూరం ఎంతో కనుచు

భారం పెంచుతు నడుచు

కాలం అందక ఏడ్చు

05/10/20, 1:11 pm - +91 98496 14898: శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి, కవనసకినం

నేటి అంశం; కలనైనా ఊహకురాలేదు(చిరు కవిత)

నిర్వహణ; శ్రీమతి హరిరమణగారు

రచన; యక్కంటి పద్మావతి,పొన్నూరు .


కలలోనైనా ఊహించమా!కరోనా కాలమని

ఆత్మీయ బంధాలు ఆంక్షలలోఒదుగుతాయని

, బ్రతుకు భారమవుతుందని,కల్లోలమగునని

నిశ్శబ్దంఇంత భయంగా ఉంటుందా యని


మనిషిని మనిషి తాకరాదని,కరోనాచక్రమని

చిరునవ్వులు కానలేమనిమాస్క్ బధ్రతయని

బడి,గుడిగంటల గణగణలుఆగుతాయని

గుంపులో కెళితే రక్షణ ఉండదని,ఇదిఔనని..

05/10/20, 1:13 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశము. కలనైనా అనుకోలేదు. 

శీర్షిక. భ్రమించిన మనసు 

నిర్వహణ. హరి రమణ 


కలనైన అనుకోక పోయి హృదిలో 

భ్రమలోపల తాను నిలిచిపోయే 

ఎదురు తాకిడిలో దెబ్బతగిలిన  

ఎప్పుడూ లేవలేని మదియాయే


కాలమే పరిభ్రమించిన మదిలో 

తెలవక యేదిశలో నడిచిన కల 

లాగ నిలిచిన బ్రతుకు గుగ్గవుట 

తప్ప జీవితమే పండలేక పోయె

05/10/20, 1:53 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ  శ్రీమతి హరి రమణ గారు

అంశం. కవన సకినం

శీర్షిక. కలనైనా అనుకోలేదు

పేరు  పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు   జిల్లా కరీంనగర్


కరోనా సెలవులు వస్తాయని

బహు సుదీర్ఘంగా ఉంటాయని

పాఠశాలలో గంట మోగలేదని

పిల్లలిలా దూరం అవుతారని



ఆన్ లైన్లో నే పాఠం వినాలని

ఎదురుగా విన్నట్టు ఉండదని

తికమకతో తల తిరుగునని

కలనైనా అనుకోలేదు ఏనాడు



హామి పత్రం

ఇ రచన నా సొంత రచన

మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని సవినయంగా మనవి చేసుకుంటున్నాను

🙏🙏🙏

05/10/20, 2:03 pm - +91 94911 12108: **💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP* 


*సప్తవర్ణముల 🌈సింగిడి*

అమరకుల దృశ్యకవి*

       *పర్యవేక్షణ


*ప్రక్రియ-కవన సకినం*  💥  🚩


  *అంశం: కలనైనా అనుకోలేదు*

(ప్రక్రియ: కవన సకినం)*


*నిర్వహణ: శ్రీమతి హరిరమణ*


*తేది 05-10-'20* 

శీర్షిక... కలనైనాఅనుకోలేదు

రచన...పల్లప్రోలు విజయరామిరెడ్డి

ప్రక్రియ.. కవనసకినం


దుష్టులైవిశిష్టసంస్కృతినష్టకారకులౌతారని

సుంద‌ర శిల్పసౌందర్యముచూడలేని  అంధులని

విచిత్రచిత్తవికారులెఘనచరిత నష్టదాయకులని

దుష్టరాజనీతిదురహంకారులెరవేస్తారని



వర్తమాన నరరూపరక్కసులు దౌష్ట్యకర్ములని

భారతీయాత్మనష్టకారకులుమేకవన్నెపులులని

మానవమృగాలుచెలరేగిమానప్రాణాల్హరిస్తాయని

కలిలో భరతావనిలో...నే కలనైనా అనుకోలేదు

                   🙏🙏🙏

05/10/20, 2:04 pm - +91 91821 30329: <Media omitted>

05/10/20, 2:12 pm - +91 70130 06795: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశ్: కలనైనా అనుకోలేదు

నిర్వహణ: హరి రమణ గారు

రచన: వసంతలక్ష్మణ్

నిజామాబాద్

~~~~~~~~~~~~~~~~~


ప్రకృతిని గుప్పెట బందించాలన్న 

పగటి కలే ఇపుడు

 నడినెత్తిన విపత్తై  మానవుని మనుగడను

అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న కాలమిది


బిక్కు బిక్కు మంటూ 

ఇదెక్కడి జీవితం క్షణం క్షణం ఉలికిపాటు

ఘడియ ఘడియ కు ఓడుతున్న

 ఓ మనిషి ఇదేనా నువు కోరుకున్న

జీవితం.

05/10/20, 2:51 pm - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

సోమవారం 05.10.2020

అంశం:కలనైనా అనుకోలేదు

ప్రక్రియ:కవనసకినం

నిర్వహణ:శ్రీమతి హరి రమణ గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*


కన్నులు గాంచని జీవి కలవపెడుతుందని

మానవ ప్రాణాలను మటుమాయం చేస్తుందని

కరచాలనం వీడి కరములు జోడించమని

భారతీయ పద్ధతి ప్రపంచంపాటించునని


ప్రకృతిలో ప్రతిప్రాణి పరమాత్మ రూపమని

ప్రాణాలు హరించుట సహించని నేరమని

దైవం కోవెలవీడి జీవుల కాచుట కోసమని

వైద్యుడై వస్తాడని కలనైనా అనుకోలేదు.

05/10/20, 2:56 pm - +91 80197 36254: 🚩మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.🚩

శ్రీ అమరకుల గారి సారథ్యంలో

సప్తవర్ణాల సింగిడి

అంశం : కవన సకినం.

నిర్వహణ : శ్రీమతి హరిరమణ గారు.

పేరు :కె. శైలజా శ్రీనివాస్ 

ఊరు : విజయవాడ 

శీర్షిక *అమృత మూర్తి నాన్న *

*************************

 కలలానానీవుకల్లోకివస్తావు 

కన్నీళ్లను యిట్టే తెప్పిస్తావు 

కలలో నైనా చూస్తాననేలోపు 

నీవు కనుమరుగుఅవుతావు 


కలలో నైనాఅనుకోలేదునాన్న 

నీవుఅప్పుడేదూరమవుతావని 

ఓజ్ఞాపకంలానీవుమిగులుతావని 

ఐనానాన్ననీవెప్పుడూ చిరంజీవివే 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

05/10/20, 6:27 pm - Telugu Kavivara added +91 90961 63962

05/10/20, 3:00 pm - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

సోమవారం 05.10.2020

అంశం:కలనైనా అనుకోలేదు

ప్రక్రియ:కవనసకినం

నిర్వహణ:శ్రీమతి హరి రమణ గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*


కన్నులు గాంచని జీవి కలవరపెడుతుందని

మానవ ప్రాణాలను మాయం చేస్తుందని

కరచాలనం వీడి కరములు జోడించమని

భారతీయ పద్ధతి ప్రపంచం పాటించునని


ప్రకృతిలో ప్రతిప్రాణి పరమాత్మ  అంశయని

ప్రాణాలు హరించుట సహించని నేరమని

దైవం కోవెలవీడి జీవుల కాచుట కోసమని

వైద్యుడై వస్తాడని కలనైనా అనుకోలేదు.

05/10/20, 3:02 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

అంశం...కవనసకినం

రచన..యం.టి.స్వర్ణలత

నిర్వాహణ..శ్రీమతి హరిరమణ గారు

తేదీ...05.10.2020




ఆశలు అడియాశలై ఊహలు తలకిందులై

సమస్యలు ఒక్కసారిగ ఉప్పెనై ముంచెత్తగ

జీవన సంద్రాన నిరంతరంగా ఎదురీదుతూ

జీవశ్చవమై బతుకీడుస్తున్న ఈదీనురాలిని


ఆత్మవిశ్వాసానివై వెన్నుతట్టి ధైర్యాన్నిస్తూ

పరోపకారివై జీవించమని దారిచూపుతూ

ఆత్మ సంతృప్తిని కలిగించిన ఓ నాదైవమా

కలనైనా అనుకోలేదు నీవు కరుణిస్తావని

05/10/20, 3:02 pm - +91 98668 99622: మల్లినాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో 

ప్రక్రియ : కవన సకినం

నిర్వహణ : శ్రీమతి హరి రమణ గారు


రచన : తౌట రామాంజనేయులు



కలనైనా అనుకోలేదు

దేవాలయాలు మూస్తారని

ఊహకైనా తట్టలేదు

బడులు బందు అవుతాయని 


కంటికి కనబడని క్రిమి

మంటలు రేపేస్తుందని

మానవాళి మనుగడ

ప్రశ్నార్థక మౌతుందని

05/10/20, 3:02 pm - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

5.10.2020

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

 శ్రీమతి హరి రమణ గారి పర్యవేక్షణలో

అంశం:కలలోనైనా అనుకోలేదు

డా. సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880

ప్రక్రియ : కవనసకినం

శీర్షిక: మరీచిక


అంతులేనివింతలోకములోఅన్నికోణాలస్పర్శ

గ్రహాలపైకి విహారయాత్ర సాకల్యమౌతుందని

భూమండలాన్ని ఒక్క రోజులోచుట్టిరాగలమని

అయినాప్రకృతిప్రకోపాలకిలాతలొంచేస్తామని


నిగూఢనిక్షిప్తాన్ని కూడా వెలికి తీయగలమని

ఆధునికతకుసంస్కృతిఆచారాలుతలొగ్గేనని

రేయిపగలుతేడాపోయిపనిగానుగలౌతామని

మమతమరీచికేనని కలలోకూడాఅనుకోలేదు



ఇది నా స్వంత రచన

05/10/20, 3:22 pm - +91 94934 35649: మల్లి నాధ సూరి కళా పీఠం yp

ప్రక్రియ. కవన సకినం 

అంశం.. కలనైనా అనుకోలేదు 

నిర్వహణ.. శ్రీమతి హరి రమణ గారు. 


పేరు. సి.హెచ్. వెంకట లక్ష్మి, విజయనగరం. 

          ***


శీర్షిక.. అద్భుత ఆవిష్కరణ. 



అల్లాడే ఊహలకు  ఊపిరిపోసి      

      ఆశయాల రెక్కలు తొడిగి


అవకాశాల నిచ్చెనపై నిలిపి 

ఎగరేసిన వేళ రెపరెప మని 


యెగిరి అవలీలగా పట్టుకొని

 ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తే 


అమ్మ గుండెల్లోపొంగేఆనంద 

వెల్లువని  ఆపేది ఎవరు...

05/10/20, 3:26 pm - +91 98495 90087: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి

కవనసకినము. 

నిర్వహణ:-శ్రీమతిహరిరమణ

                 గారు. 

అంశం:-కలలోనైనాఅనుకోలేదు

తేదీ:-05.10.2020

పేరు:-ఓ. రాంచందర్ రావు

ఊరు:-జనగామ జిల్లా

చరవాణి:-9849590087


చేసుకున్నబాసలుచెరిగిపోతాయని, 

చెప్పుకున్నవూసులుకలలుకల్లలైనాయని, 

కట్టుకున్నవారేకాలయములవుతారని, 

కలలోనైనాఅనుకోలేదుకాలంమారిందని. 


కరోనామహమ్మారికిఇలాకబలిస్దుందని, 

జనానందరుహాహాకారాలుచేస్తారని, 

ప్రజలందరుపిట్టల్లారాలిపోవుదురని, 

కలలోనైనాఅనుకోలేదుఉపద్రవంవస్తుందని.

05/10/20, 3:31 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

ఏడుపాయలు- 05-10-2020

సప్తవర్ణముల 🌈 సింగిడి

రచన: ప్రొద్దుటూరి వనజారెడ్డి/9866249789

ఊరు: చందానగర్

అంశం: కవన సకినం

శీర్షిక: కలలోనైనా అనుకోలేదు

నిర్వహణ: బి. హరిరమణ గారు 

————————————

కనిపించని కరోన ఏదో వస్తదని

లక్షల ప్రాణాలను హరిస్తుందని

మూతికిమాస్కొకటి వేయిస్తదని

ప్రాణాలతో చెలగాటం ఆడునని


బతుకు తెరువే భారము ఆయెనని

బడీ,గుడులు అన్నీ మూత పడేనని

ఆన్ లైన్ లోన 'ఈ'  పాఠం వినాలని

కలలో నైనా అనుకనలేదు ఏనాడూ

——————————

ఈ రత్న నా స్వంతం

05/10/20, 3:37 pm - +91 6304 728 329: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి గారి సారథ్యంలో 

తేది; 05/10/2020

కవనసకినం

నిర్వహణ: శ్రీమతి హరిరమణ గారు 



అనునిత్యం రుధిర ధారలను స్రవిస్తూ

సుందర కశ్మీరం ప్రతినిత్యం కల్లోలమౌతూ

భరతమాత హృదయంలో శోకం నింపిన

కశ్మీరం నేడు స్వేచ్ఛా వాయువు పీలుస్తుంది


ప్రపంచానికి మనం ఆదర్శంగా కావడం

మన సంస్కృతి వెన్నుదన్నుగా నిలవడం

మోదీజీ అందులకు సాక్షిగా నిలవడం

ఏనాడూ నేను కలనైనా అనుకోలేదు


      మల్లెఖేడి రామోజీ 

      అచ్చంపేట

      6304728329

05/10/20, 3:42 pm - +91 73969 55116: మల్లినాథ సూరి కళాపీఠం yp

సుధా మైథిలి N. ch

గుంటూరు

అంశం:కవన సకినం

నిర్వహణ:హరిరమణ గారు

శీర్షిక:కలగన్నామా!

*****************


అపర గంధర్వ గానమే నీ సొత్తు..

మచ్చలేని వ్యక్తిత్వమే నీ ఆస్తి..

మందస్మిత వదనమే నీ నైజం..

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే "బాలుడివి"..


కలవరపరిచే కరోనాగూర్చి చైతన్యపరిచావే

మధురమౌ గానంతో హెచ్చరించినావే..

కలనైనా కలగన్నామా కరోనాకే బలవుతావని..

 ప్రేమించు గుండెల్లో కన్నీరొలికిస్తావని..

05/10/20, 3:48 pm - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: కలనైనా అనుకోలేదు

ప్రక్రియ: కవనసకినం

నిర్వహణ:  శ్రీమతి. హరి రమణ గారు

రచన: పేరం సంధ్యారాణి, నిజామాబాద్

తేదీ: 05 -10 - 2020


వనదుర్గమ్మ నిండాశీస్సులందునని

మల్లినాథసూరి కళాపీఠమాదరించునని

అమరకులవారి అండదొరుకునని

నిర్వాహకుల ప్రశంసల జల్లుకురుయునని

నిత్యనూతనోత్సాహం నాలోకలుగునని

నిండైనబహుమతులు వరించునని

కలనైనా అనుకోలేదు కవినైతానని

 కలనైనా అనుకోలేదు కవిత రాస్తానని

05/10/20, 3:48 pm - +91 91779 95195: తెలుగు కవి వరా కవన సకినం -20

నిర్వహణ; శ్రీమతి హరి రమణ గారు

పేరు: రుక్మిణి శేఖర్

అంశం: కలలోనైన కలగనలేదు

శీర్షిక:కవిత యుగం

రచన సంఖ్య:37

**********************

కంటికి కనిపించని క్రిమి వస్తుందని

ఎవరికీ  చేయి చేయి కలపవద్దని

అందరు మాస్కులు  వేయాలని

ప్రాణసంకటంగా మారుతుందని


కలియుగం కాదు కవితా యుగమని

కవియిత్రులుఇన్ని కవితలురాస్తారనీ

గొప్పగొప్పగా బిరుదులు వస్తాయని

నేనెన్నడూ  కలలో  నైన కలగన లేదే

!**********************

ఇది నా సొంత రచన

**********************

05/10/20, 3:53 pm - +91 94404 74143: మల్లినాధసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ -కవనసకినం

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -కలనైనా అనుకోలేదు

రచన  చిల్క అరుంధతి

తేదీ -05-10-2020


కలనైనా కలగనలేదు

కళాపీఠం వారి కరుణకు

ప్రీతి పాత్రులమవుతామని

కళామతల్లికి గళహారమౌతామని


అమరకుల వారి ఆతిథ్యం పొందుతామని

అంతులేని ప్రేమకు పాత్రులమవుతామని

ఆదరణ ప్రవాహములో తడిసి

ఉబ్బితబ్బిబ్బౌతామని కలనైనా కలగనలేదు.

05/10/20, 3:58 pm - +91 99124 90552: *శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*05/10/2020 సోమవారం*

*అంశం : కలనైనా అనుకోలేదు (కవన సకినం)*

*నిర్వాహకులు : శ్రీమతి హరిరమణ గారు*

*రచన : బంగారు కల్పగురి*

*ప్రక్రియ : వచనం*

*శీర్షిక : పారదర్శకత వలదని*

ఆత్మీయులనుకున్నవారు కలికాలాన పరీక్షింతురని...

స్వార్థం పురివిప్పి తనవరకే ఆలోచింతురని...

కల్లబొల్లి కష్టాల ఏకరువు పెట్టుదురని...

లేశమాత్ర అనుమానం ఏనాడూ రానిదాన్నని..


గుండెనిండా నీవని గుండేయే నీదని...

కొమ్ముకాచ నమ్మించి వమ్ముపోటు పొడుతురని...

పొగిలిన కంటనీరు కల్మష నటనందురని...

కలనైనా అనుకోని నిష్కల్మష మనసుని...

05/10/20, 3:58 pm - +91 93014 21243: మల్లినాధ సూరి కళా పీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

ప్రక్రియ - కవనసకినం

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యం లో

అంశము - కలనైనా అనుకోలేదు

పేరు - తెలికిచర్ల విజయలక్ష్మి

తేదీ - 05-10-2020



ఆడ బిడ్డలకు తల్లినయి కినుక వహించి నేను

కొడుకు పుట్టలేదని బాధపడిన అత్త మామలను 

నా తల రాత యనుకొని కించ పడిన తల్లిని నేను

కొడుకులున్న తల్లులను జూసి అసూయ పడిన నేను


ఆ బిడ్డలే దేశ విదేశాలలో ఉన్నత పదవుల లో

మిక్కిలి గౌరవ మర్యాదలు పొంది న నా కన్న బిడ్డలు

ఈ అమ్మ త్యాగ ఫలమే మా పదోన్నతి కి కారణమని

కొనియాడగలరని నేను కలనైనా అనుకోలేదు

05/10/20, 4:01 pm - +91 95502 58262: మల్లి నాధసూరి కళాపీఠం yp

కవన సకినం:5-10-2020

నిర్వహణ:హరి రమణ గారు

రచన:శైలజ రాంపల్లి

అంశం: కలోలోనైన అనుకోలేదే

    

కలలో నైన అను కోలేదే 

కరోనా వైరస్ ఒకటుంటుందని

గుడులు బడులు ముస్తారని 

బస్సులు ట్రైన్లు బందయితాయని


విందులు వినోదాలు లేకుండా

బయటికి వెళ్తే భయపడుతూ

మనిషి మనిషికి దూరంగుండె 

ఇలాంటి రోజులు వస్తాయని

05/10/20, 4:08 pm - Trivikrama Sharma: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ: .    కవన సకిణం

నిర్వహణ:  శ్రీమతి హరి రమణ గారు

పేరు:.  త్రివిక్రమ శర్మ

ఊరు:. సిద్దిపేట


**********************

కాలమిoత కఠినంగా పగ పడుతుందని

కరోనా అన్న వ్యాదొకటి పుడుతుందని

దేన్నితాకినా మనకే చుట్టుకుంటుందని

నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సొస్తుందని


బంధాలన్నీఇంతలాబీటలుపారుతాయని

ఉపాధిలేక ఉపవాసముoడాల్సివస్త దని

చచ్చినశవాన్ని కాల్చలేని దుస్థితివస్తుందని

కాలంవిషమౌతదని కలనైనాఅనుకోలేదు

05/10/20, 4:20 pm - +91 98499 29226: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల

ప్రక్రియ.  కవనసకినం 

అంశం   కలనైనా అనుకోలేదు 

శీర్షిక       కుసుమ సుధ

రచన.        దార. స్నేహలత

నిర్వహణ   శ్రీమతి హరి రమణ గారు 

తేదీ.          05.10.2020


కలనైనా అనుకోలేదు కళాపీఠం 

సభ్యురాలిగా  నమోదవుతానని 

ఏడుపాయల శ్రీ మల్లినాథసూరిన

అక్షయ రచనలు శోభితమగునని 


సప్తవర్ణ సింగిడిన భిన్న ప్రక్రియల

కౌశల్యమున వాసిగ ఒడుపుగల 

కవనకావ్యము పరిణితి చెందగా 

సాహితీవనాన కుసుమసుధనని

05/10/20, 4:23 pm - +91 94907 32454: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణముల సింగిడి 


పేరు :సుభాషిణి వెగ్గలం 

ఊరు :కరీంనగర్ 

నిర్వాహకులు : శ్రీమతి హరిరమణ గారు 

ప్రక్రియ : కవన సకినం 

అంశం :కలనైనా అనుకోలేదు


ముట్టుకుంటే అంటుకునే జబ్బొస్తుందని

సానిటైజర్ సబ్బులు రాజ్యాలేలుతాయని

ఓ నూలు గుడ్డ ప్రాణ రక్షకవుతుందని 

కలనైనా తలవని కరోనా కాలం


అనుబంధాలను దూరం చేసి

బంధాల విలువ తెలియ జెప్పింది 

అందరినీ ఇళ్ళకే పరిమితం చేసి

పని విలువ తెలియ జెప్పింది


ఆదర్శ 

5 -10-2020

05/10/20, 4:30 pm - +91 80197 33775: సప్తవర్ణముల సింగిడి 

మల్లినాథ సూరి ఏడుపాయల 

శ్రీ అమరకుల దృశ్యకవి గారు 

అంశం: కలనైనా అనుకోలేదు 

పేరు : వేదవతి గార్లపాటి 

ఊరు: కరీంనగర్ 

నిర్వహణ: హరిరమన గారు 

        కలనైనా అనుకోలేదు 

ప్రకృతికి కోపం వచ్చి 

ప్రళయం అనే వరదలు , భూకంపాలతో 

మనుషులను మట్టిలో కలుపుకు పోతుందని .

     కలనైనా అనుకోలేదు 

జీవరాశులు కూడా ప్రకృతికి తోడై 

కరోనా అనే మహమ్మారి కంటికి కనిపించకుండా మనుషులలో ప్రవేశించి ....... మా సత్తా ఏమిటో చూపిస్తామని 

    ప్రపంచాన్నే గడగడ లాడిస్తు కన్నెర్ర చేస్తుంది.

ఖబర్దార్ మమ్ముల రక్షించుకోకుంటేనే 

    మీకు బ్రతుకులు అని మూకుమ్మడిగా  ప్రకృతి అంతా కట్టకట్టుకుని 

ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఈ 

         🌧☀️ప్రకృతి 🌴🌳🐙

05/10/20, 4:40 pm - +91 94929 88836: 05-0-10-2020:-సోమవారం:

శ్రీమల్లినాథసూరికళాపీఠం

.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి

శ్రీఅమర కులదృశ్యకవిచక్రవర్తిగారిసారథ్యం.

అంశం:-కవనసకినం

నిర్వహణ:-శ్రీమతిహరిరమణగారు.

రచన: జి.ఎల్.ఎన్. శాస్త్రి

శీర్షిక:-"కలనైనా అనుకోలేదు"

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


నలుసంత జీవి  ఆసురురాలై 

నరజాతిని నిర్దేశించి నిస్తేజంచేసి,

గొప్పవాడినని విర్రవీగిన మానవుడ్ని

నవ్వులపాలు చేస్తుందని.


చైతన్యమైన ప్రకృతి  నిశ్శబ్దమై,

భయం గుప్పిట్లో  విలవిలలాడి,,

గాలికూడా గరళమై ....

ఊపిరికూడా ఉసురు తీస్తుందని.


🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏

05/10/20, 4:46 pm - +91 99121 02888: 🌷మల్లి నాధసూరి కళాపీఠం  🌷

కవన సకినం:5-10-2020

నిర్వహణ:హరి రమణ గారు

రచన:యం .డి .ఇక్బాల్ 

అంశం: ఊహించని విపత్తు 

 ~~~~~~~~~~~~~~~

ఊహించని విపత్తు కరోనా కనికట్టు 

మూతికి ముసుగు రోజంతా విసుగు 

చేయి కలిపితే చేరిపోతుంది 

దగ్గినా తుమ్మినా తుంపిర్లతో వచ్చేస్తుంది 


రూపాయి షెపాయి లేకుండా చేసింది 

దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిద్రం చేసింది 

పండగ పబ్బం లేకుండాచేసింది 

అంతిమయాత్రను ఆగమాగం చేసింది

05/10/20, 4:49 pm - +91 93913 41029: 05-0-10-2020:-సోమవారం:

శ్రీమల్లినాథసూరికళాపీఠం

.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి

శ్రీఅమర కులదృశ్యకవిచక్రవర్తిగారిసారథ్యం.

అంశం:-కవనసకినం

నిర్వహణ:-శ్రీమతిహరిరమణగారు.

రచన: సుజాత తిమ్మన 

శీర్షిక:-"కలనైనా అనుకోలేదు"

********

అక్షరాల అల్లికలు కవితలై 

కవన దారలతో  మాలలై ...

వనదుర్గాదేవి పాద మంజీరాలై 

అంజలి ఘటిస్తాయని అనుకోలేదు..


హృదయస్పందలకు ఊపిరిపోస్తూ 

ప్రతిస్పందనల ప్రోత్సాహమిస్తూ 

మహామహుల పరిచయాలతో 

కళాపీఠం కలకాదు నిజమని తెలిపింది..!

****** 

సుజాత తిమ్మన.

హైదరాబాదు .

05/10/20, 4:53 pm - +91 84668 50674: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం : కలనైనా అనుకోలేద

రచన : ఎడ్ల లక్ష్మి

ప్రక్రియ : కవన సకినం

నిర్వహణ : శ్రీమతి హరి రమణ

తేది : 5.10.2020

***************************


కాలగమనంలో బ్రతుకు పయనం

ఆగని నడకతతొ తెలవని దూరం

ఎప్పుడు చేరగలమో ఆ గమ్యం

మనిషి జీవితమే ఆగమాగం


కలలో కూడూహించన యోగం

కళ్లకు కనబడని కరొన రోగం

అందరినుంచెనది దూరదూరం

తీయ బట్టె భువిపై మనిషి ప్రాణం


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

05/10/20, 4:53 pm - +91 94400 00427: *శుభసాయంతనము*💐💐


🚩 *శ్రీమల్లినాథసూరి కళాపీఠం - ఏడుపాయల* 🚩

       *సప్త వర్ణముల సింగిడి*

తేదీ.21-09-2020, సోమవారం

💥 *కవన సకినం-(ఓచిరుకవిత)* 💥

నేటి అంశం: *కలలోనైనా అనుకోలేదు*

( 8వరుసలలో రసవత్తర భావాల అమరిక)

నిర్వహణ:- శ్రీమతి హరి రమణ గారు

                    -------***-----


కలనైన అనుకోలేదు కవితా ప్రభంజనం..1

క్రమ్ముకుంటూ నన్ను కౌగిలిస్తుందని..2

కలవరింతల నా కలము హసిస్తుందని...3

అలతి పదముల కులుకు అనుభవిస్తుందని...4


ఘనులు సత్కవులతో కలసి సంతసించు...5

ఘడియ వస్తుందని కలనేను కనలేదు...6

జ్ఞానసుధల పంచు సద్బృందములందు...7

సభ్యుడేనగుదునను స్వప్నమే లేదందు...8


🌹🌹 శేషకుమార్ 🙏🙏

05/10/20, 4:59 pm - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : కవన సకినం

శీర్షిక : కలలోనైనా అనుకోలేదు

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : హరిరమణ 


ఎదో పొద్దుపోక రాసుకునే అక్షర కదలిక 

మనసుకు నచ్చిన పదం కోసం తపనెగా 

సమస్య కళ్ళలో పడితే భావోద్వేగమెగా 

రాసింది చదువుతే  మది తన్మయమెగా 


మల్లినాథాసూరి కళాపీఠంలో ప్రవేశమిక 

మాటే మంత్రమవుతూ కవితలు వచ్చేగా 

విభిన్న కోణాల్లో రాటు దేల్చుతున్న శీర్షిక 

కవిత రాస్తానని కలలోనుఅనుకోలేదుగా


హామీ : నా స్వంత రచన

05/10/20, 5:07 pm - Anjali Indluri: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి నేతృత్వంలో

05.10.2020 సోమవారం

కవన సకినం: కలలోనైన అనుకోలేదు

నిర్వహణ: శ్రీమతి హరి రమణ గారు 


 *రచన : అంజలి ఇండ్లూరి* 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


కలలోనైన అనుకోలేదు నేను కవిత రాస్తానని

శ్రీకారమది మల్లినాథసూరి కళాపీఠంలోనేనని

కలనైనాగనలేదే అమరకులవారి ఆదరణతో

కవుల హృదయస్పందనలకు స్పందనౌతానని


కలనైన అనుకోలేదు వనదుర్గమాత రూపును

కన్నులగాంచి తరించు రోజు ఒకటి వస్తుందని

కవుల కుంభమేళా కోసం  ఎదురు చూస్తానని

కవుల కులాన నేనూ ఒక కలాన్నై సాగుతానని


✍️అంజలి ఇండ్లూరి

     మదనపల్లె

    చిత్తూరు జిల్లా

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

05/10/20, 5:11 pm - +91 98851 60029: మల్లినాథ సూరికళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

05.10.2020 సోమవారం 

పేరు: వేంకట కృష్ణ ప్రగడ

ఊరు: విశాఖపట్నం 

ఫోన్ నెం: 9885160029

నిర్వహణ : శ్రీమతి హరి రమణి

అంశం : కవన సకిలం

శీర్షిక : "కలనైనా అనుకోలేదు"


మనసు మాటల మంచి గంధముందని

మస్తిష్కం ఆలోచనలు కైతలౌతాయని

కలం కదలికలు కధకళీ కథ కడతాయని 

కమ్మదనం కాఠిన్యం కవన తీగలౌతాయని


అ ఆ లు తెలియని అంతరంగం

క ఖ ల కలుగును కదిలిస్తుందని

య ర ల వలు యతి ప్రాసలౌతాయని

ఆహా అం అః నీ ఆటని కలనైననుకోలేదు 


                         ... ✍ "కృష్ణ"  కలం

05/10/20, 5:30 pm - +91 70130 06795: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశ్: కలనైనా అనుకోలేదు

నిర్వహణ: హరి రమణ గారు

రచన: వసంతలక్ష్మణ్

నిజామాబాద్

~~~~~~~~~~~~~~~~~


ప్రకృతిని గుప్పెట బందించాలన్న 

పగటి కలే ఇపుడు నడినెత్తిన

  విపత్తై  మానవుని మనుగడను

అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న కాలమిది


బిక్కు బిక్కు మంటూ 

ఇదెక్కడి  బ్రతుకు  కలనైనా అనుకోలేదు

 కదా ఇలా జరుగుతుందనీ

 ఓ మనిషి ఇదేనా నువు కోరుకున్న

జీవితం.

05/10/20, 5:32 pm - +91 94913 52126: మల్లి నాధ సూరి కళా పీఠం yp

ప్రక్రియ. కవన సకినం 

అంశం.. కలనైనా అనుకోలేదు 

నిర్వహణ.. శ్రీమతి హరి రమణ గారు. 

పేరు. డా.భారతి మీసాల


తెలుగుదేశంలో తెలుగుభాష మాధ్యమంని

నేడు ఒక విషయంగా తప్పనిసరి చేస్తారని

మాతృభాష ఐచ్చికమై ఎంపికవుతుందని

ఆంధ్రం బోధించే వారికే భాష  అవసరమని 


తరతరాలకు అందివ్వాల్సిన అమూల్యమైన 

భాషా సంస్కృతి సంప్రాదాయ సంపదలను 

కంకణం కట్టి కలుషితం చేసి కాలరాస్తారని  

కాలగర్భంలో తోస్తారని కలనైనా అనుకోలేదు

05/10/20, 5:35 pm - +91 98489 96559: మల్లి నాధ సూరి కళా పీఠం yp

ప్రక్రియ. కవన సకినం 

అంశం.. కలనైనా అనుకోలేదు 

నిర్వహణ.. శ్రీమతి హరి రమణ గారు. 

పేరు. అరాశ




బంధాలనెడబాపి బంధుత్వమును రోసి

అంధత్వమున డబ్బునంద పరుగులుదీసి

కుందనపుజీవితము కుదురుగా బలిచేసి

కందుకంబున పడెడి కలను కలగనలేదు


వెళ్ళిపోయెటినాడు వెంటరాదని తెలుసు

కుళ్ళు బాధని మాన్పి శాంతినిడదని తెలుసు

కొల్లగొట్టిన సుతులు కూర్మినిడరని తెలుసు

తెలిసి డబ్బునువదిలి నిలువ కలగనలేదు


                            అరాశ

05/10/20, 6:12 pm - P Gireesh: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశ్: కలనైనా అనుకోలేదు

నిర్వహణ: హరి రమణ గారు

రచన: వసంతలక్ష్మణ్

నిజామాబాద్

~~~~~~~~~~~~~~~~~


ప్రకృతిని గుప్పెట బందించాలన్న 

పగటి కలే ఇపుడు నడినెత్తిన

  విపత్తై  మానవుని మనుగడను

అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న కాలమిది


బిక్కు బిక్కు మంటూ ఇదెక్కడి  

బ్రతుకు  కలనైనా అనుకోలేదు

కదా ఇలా జరుగుతుందనీ 

మనిషీ ఇదేనా నువు కోర్కున్న జీవితం.

05/10/20, 6:21 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశం:కవన సకినం కలనైన అనుకోలేదు

శీర్షిక;మనసులోని మాట

నిర్వహణ:శ్రీమతి హరి రమణ గారు


అమ్మమాటల్లోనిఆప్యాయతమాధుర్యం

నాన్ననడకనేర్పినడిపించినట్టి నా ధైర్యం

గురువుచెప్పినరసరమ్యమైన భావం

చిరుగాలిచేయసవ్వడిసంగీత నాదం


కవనసకినం నందుకలిగినా యనుభూతి

పద్యగద్యగేయాలమల్లిపీఠమునందున

కవులతోకలిసికవితలురాస్తు ఉంటానని

కలలోనైనఅనుకోలేదునేనెప్పుడైన


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

05/10/20, 6:25 pm - +91 94906 73544: మల్లినాథ సూరి కళా పీఠం

 అంశం ::కవన సకినం 

 నిర్వహణ :: హరిరమణ గారు

 రచన ::యెల్లు.అనురాధ రాజేశ్వర్ రెడ్డి




 చిన్ననాటి  జ్ఞాపకాలు

మధురస్మృతులుమరువలేము 

స్నేహితులతో ఆట పాట

 జిలుగు వెలుగుల కేరింతలు



 పులకరించే ప్రకృతి అందం

 చేద గిరక చప్పుళ్ళు

 స్వచ్ఛమైన సంబరాలు

 మంచి మనసులు ఆత్మీయత

05/10/20, 6:26 pm - +91 97017 52618: *సప్తవర్ణములసింగిడి*

మల్లినాథసూరి కళాపీఠం yp

సప్తవర్ణాల సింగిడి

అంశం : *కలనైనా అనుకోలేదు*

నిర్వాహణ...  శ్రీమతి హరి రమణ గారు   

**********************************************

*రచన     :   మంచికట్ల శ్రీనివాస్* 

*ప్రక్రియ  :   కవన సకినము* 

అంశము :  ఇలా అవుతుందనీ 

*****************************************


కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుందనీ 

కలిసున్న కష్టమని విడిగుంటే సుఖమనీ

గేద పాలకై దూడ మూతికి మాసిక వేసా

ఆస్థితి నాకొస్తుందని దూడే గేదై నవ్వుననీ!


కట్టని ముట్టని దారి మార్చి నడిచానప్పుడు

కరోనా కథతో మనిషి దారిలో కొస్తాడిప్పుడనీ   

అంటరానితనం మానుషం మనిషి అవసరమనీ 

ఒక సూక్ష్మజీవి ఇంత నియంత అవుతుందనీ!

05/10/20, 6:27 pm - +91 98497 88108: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి సారథ్యంలో

అంశం:కలనైనా అనుకోలేదు

నిర్వహణ:శ్రీమతి హరిరమణ గారు

శీర్షిక:కనిపించని కరోన

పేరు:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం


జనజీవనం స్తంభించి

ఉప్పెనలా ముంచెత్తి

అతలాకుతలం చేసేనని

కలనైనా అనుకోలేదు కరోనాతో


మాస్కులనే ఆయుధాలుగా చేసుకొని

శానిటాయిజర్లు విల్లంబులుగా చేతబూని

కరోనా కట్టడికి నడుం బిగిద్దాం

అందరం ఆనందంగా జీవిద్దాం


****************

05/10/20, 6:34 pm - +91 94941 62571: అంశం..కలనైనా అనుకోలేదు

ప్రక్రియ.. కవనసకినం

నిర్వహణ.. హరిరమణగారు


కలనైనా అనుకోలేదు నేనుకూడా

ఊహలు నిజమౌతావని అనుకోలేదు

నన్నునేను నమ్మలేక పోయానుకదా

వింతగాను విడ్డూరముగాను ఉన్నది


ఎంతగానో ప్రేమించాను మనసారా

మదిలో దాచుకున్న మమతలపందిరి

నేడు పరిమళిస్తుంది నాహృదయములో

కలలో కాదు ఇలలో జరిగే నగ్నసత్యము


సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

కామారెడ్డి

05/10/20, 6:45 pm - +91 99639 15004: మల్లినాథసూరి కళాపీఠం yp

కవన సకినం 

నిర్వహణ. హరి రమణ గారు. 

అంశము. కలనైనా అనుకోలేదు 


రచన. ఆవలకొండ అన్నపూర్ణ 

ఊరు. శ్రీకాళహస్తి. చిత్తూరు 


నేను నీవు ఒకటేనని 

నీకు నాకు సాటి లేరని 

ఎగిరి ఎగిరి పడ్డాను 

కాలము కన్నెర్ర చేసింది. 


వంచన పరులుంటారని 

మంచి తనానికి విలువ 

లేదని తెలుసు కొన్నాను 

నా కలలు కల్లలాయెను.

05/10/20, 6:50 pm - +91 91779 95195: శ్రీ మల్లినాథ సూరి కళా పీఠం-y p

సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్య కవి గారి నేతృత్వంలో

నిర్వహణ; శ్రీమతి హరి రమణ గారు

పేరు: రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

అంశం: కలలోనైన కలగనలేదు

శీర్షిక:కవిత యుగం

**********************

కంటికి కనిపించని క్రిమి వస్తుందని

ఎవరికీ  చేయి చేయి కలపవద్దని

అందరు మాస్కులు  వేయాలని

ప్రాణసంకటంగా మారుతుందని


కలియుగం కాదు కవితా యుగమని

కవియిత్రులుఇన్ని కవితలురాస్తారనీ

గొప్పగొప్పగా బిరుదులు వస్తాయని

నేనెన్నడూ  కలలో  నైన కలగన లేదే

!**********************

ఇది నా సొంత రచన

**********************

05/10/20, 6:58 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 05.10.2020

అంశం : కలనైనా అనుకోలేదు! (కవనసకినం) 

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీమతి హరిరమణ గారు 


శీర్షిక : బంధాలు - విలువలు!


బంధాలు దూరమై అంతర్జాలమ్మే మధురమై,

రక్తసంబంధాల చట్రమ్ములోన మొగమువాసి,

పెదవులపై తీపినగవు  మనసెల్ల విషమే

సొంతదనములో శత్రుత్వమె నిజమౌనని...


అమాయకత్వాన్ని అంగడిబొమ్మగ కాగా, 

కంటబడని కపటపు మృగత్వము పెరిగి,

నరరూప రాక్షసత్వము అర్హులు చాచగా,

మానవత్వమే నశించునని కలగనలేదు!


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

05/10/20, 7:05 pm - Velide Prasad Sharma: అంశం:కలలోనైనా అనుకోలేదు

                  (కవనసకినం)

నిర్వహణ:హరి రమణ గారు

రచన:వెలిదె ప్రసాదశర్మ

 కనీసం ఇరవైరోజుల్లో పూర్తయ్యే శతకం

రెండుగంటల్లో నే  సాధ్యం అనుకున్నానా

అడపాదడపా రాసే నేను

నిత్యం విడువకుండా రాస్తాననుకున్నా

అల్లంత దూరాన అమరకుల కవివరులు

అత్యంత సమీపంలో నిలుస్తారనుకున్నానా

బిరుదులు సన్మానాల మాటెలా ఉన్నా

నమ్మకానికి నమ్మకం పెంచగలననుకున్నానా!

05/10/20, 7:08 pm - +91 93941 71299: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల 

పేరు: యడవల్లి శైలజ కలంపేరు ప్రేమ్

ఊరు: పాండురంగాపురం, జిల్లా ఖమ్మం 

అంశం:కవన సకినం (కలనైనా అనుకోలేదు)

నిర్వాహకులు: అమరకుల దృశ్యకవి చక్రవర్తి ,హరిరమణ గార్లు


గలగలమంటూ జలపాతం అందాలు 

జలజలమంటూ సెలయేటి నురగలు 

పచ్చని పచ్చికబీళ్ళపై చల్లనిగాలి

ఆకాశంలో జున్నుముక్కలాంటి మేఘాలు 


తీయనైన తెలుగు కవితలు 

చైతన్యాన్ని కలిగించే పాటలు 

పచ్చని ప్రకృతిని కూర్చుతానని

నేను కలలోనైన అనుకోలేదు

05/10/20, 7:16 pm - +91 80196 34764: మల్లినాధసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి

కవనసకినం

నిర్వహణ; శ్రీమతి హరి రమణ గారు

పేరు:మరింగంటి పద్మావతి (అమరవాది) 

అంశం: కలలోనైన కలగనలేదు



కలికాలం ముప్పు కరోనవిపత్తు

కలివిడితనం కలిపేచేయి వద్దు


నిత్యంకళకళలాడేఏడుకొండలు

నిర్వీర్యంగాబోసిపోయినకాలం


సందడితోవెలిగేవిద్యాలయాల

సంగతిమరచిచదివేచిన్నారులు


కంటికికనబడనిరాకాసిరాకతో

కలనైనఊహించనిపరిణామం

05/10/20, 7:18 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 5.10.2020

అంశం. కలనైనా అనుకోలేదు

శీర్షిక: భక్తి మహిమ

నిర్వహణ. అమరకుల.,హరిరమణగార్లు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.


అక్షరమెరగనికవికాళిదాసుని

విలక్షణకవితారమ్యతనింపెను

మాణిక్యవీరణాధారిణికరుణించె

ఎంతటి మమతయో‌మాతతమకు



కన్నప్పభక్తిమెచ్చిబ్రోచె శివుడు

శ్రీ కాళ  హస్తిలకు ముక్తినొసగెను

భవుడెంతభవ్యుడో చెప్పుతరమే

కలనైనా,అనుకోలే‌ మీ కరుణశివ

05/10/20, 7:42 pm - +91 70364 26008: మల్లినాథ సూరి కళా పీఠం

సప్తవర్ణాల సింగిడి

నిర్వహణ: శ్రీమతి హరి 

రమణ గారు

అంశం: కలలోనైన కలగనలేదే

రచన: జెగ్గారి నిర్మల

ప్రక్రియ: కవన సకినం



కరోనాతో జనులకు కష్టకాలం

పేద జీవులకు అయోమయం

ఉన్నవారికి అరుగక భయం

కాల మార్పుతో అల్లకల్లోలం


రేపటి ఆశలకు రూపు లేక

ఉన్న రోజులు మనవి కాక

బంధుమిత్రులతో కలవలేక

ప్రాణ భయంతో ప్రజాజీవనం

05/10/20, 7:45 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

అమరకుల సారథ్యం

నిర్వాహకులు.. హరిప్రియ గారు

5.10.2020 

అంశం..  కలలోనైనా అనుకోలేదు

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్

ప్రక్రియ.. కవన సకినం


కవన లోకములో అడిగిడితానని

ఆశల లోకములో పయనిస్తానని

ఆనంద లోకంలో విహరిస్తానని

అక్షర లోకములో ఉరేగుతానని


రంగుల లోకంలో సాగిపోతానని

కళల లోకములో తేలి పోతానని  

స్వేచ్ఛ తీరాలను అందుకుంటానని 

ఇలనైన కలలోనైనా అనుకోలేదు

05/10/20, 7:45 pm - +91 98494 54340: మల్లినాధసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి

కవనసకినం

నిర్వహణ; శ్రీమతి హరి రమణ గారు

పేరు:జ్యోతిరాణి 

అంశం: కలలోనైన కలగనలేదు 


*************************************

కలలో అనుకోలే మట్టి పరిమళం వీడి 

మానవాళి ప్లాస్టిక్ పంచన చేరునని 

పుణ్య పురుషుల వతరించి రిచటని

 భారతావనిన మానవాళి వెల్గునని


అమ్మై ఆదరణ పొందడమో భాగ్యమని

నేడు సకల అవనిన అమ్మ ఆదరణౌనని

ఏదో భాగ్యవశమ్మున అక్షరం ఔతానని

 కోయిల కవుల చేరి కవితలే రాస్తానని


🌹బ్రహ్మకలం 🌹

05/10/20, 7:45 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- గోపాలుడువిన్యాసం

నిర్వాహకులు:-  గారు పేరు:-పండ్రువాడసింగరాజు

 శర్మ

తేదీ :-05 /10/20 సోమవారం

శీర్షిక:- శ్రీకృష్ణలీల

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- కవన సకినం

ఫోన్ నెంబర్9177833212

6305309093

**************************************************

గోకులంలో గోపికల నడుమ గోపాలుడు వేణుగాన విశారదుడు కంససంహారకుడు

గీతా ప్రబోధకుడు జగదోద్ధార కుడు  చిలిపి కృష్ణుడు  కుచేల ప్రియ మిత్రుడు



  రాధామానస చోరి ఖాళీ మర్థన మురారి  బృందావన విహారి పాహిమాం హరి    నాట్యమయూరి పించము ధరించినసౌరీ చూపించు ముక్తి మార్గపు దారి... 

************************************************

05/10/20, 8:01 pm - +91 91774 94235: *సప్తవర్ణములసింగిడి*

మల్లినాథసూరి కళాపీఠం yp

సప్తవర్ణాల సింగిడి

అంశం : *కలనైనా అనుకోలేదు*

నిర్వాహణ...  శ్రీమతి హరిరమణ గారు 

రచన     :  కాల్వ రాజయ్య 

ఊరు;బస్వాపూర్,సిద్దిపేట 

*ప్రక్రియ  :   కవన సకినము* 

శీర్షిక.   ; కరోన 


ఈ కరోన అనే మహమ్మారి ఒకటుందని 

కలియుగానింతా కంగారు పెడుతుందని 

కలలో ఏనాడైన ఎవరైన అనుకున్నారా

ఏమిటిది విధి వైపరీత్యమా వినాశకాలమా


పట్టణ జనులంతా పరుగో పరుగని పల్లెకొచ్చే

కంపినీలన్ని మూతబడి కరువు కాలమొచ్చే

ఏడుకొండల స్వామెపుడైన మౌనంగున్నాడా

కంటికి కనిపించనిదిది కరిగిపోతేబాగుండు

05/10/20, 8:03 pm - +91 99595 11321: మల్లినాథసూరి కళాపీఠం వారి సప్త వర్ణ సింగిడీ, 

అంశం. కలనైనా అనుకోలేదు, 

అమరకుల దృశ్య కవిగారి పర్యవేక్షణలో, 


కలనైనా అనుకోలేదు నువ్వు వస్తావని, 

ఇదొక తెలుగు సినిమా పాట, 

కొన్ని ఊహించని సంఘటనలు జరిగి, 

మనిషి జీవితంలో సుఖసంతోషాలు నింపితే, 

అది ఆనందం, అదృష్టం 

అదే దుఃఖం కలిగిస్తే అది దురదృష్టం... 

ఆకస్మిక ప్రమాదాలు వీటికి ఉదాహరణ అయితే 

త్రుటి లో ఆపదలనుంచి తప్పించుకోగలిగితే అంతా సంతోషమే 


యాగరక్షణకై తమ్మునితో బయలు దేరిన శ్రీరాముడు తమకు కల్యాణ ఘడియలు వచ్చాయని కలనైనా 

ఊహించలేదు.

అలాగే జానకి కూడా మిథిలా నగర పురవీధుల్లో 

క్రితం రోజు తాను వీక్షించిన అందాల రాముడు 

స్వయంవరంలో గెలిచి తనను కళ్యాణమాడుతాడని తమ కళ్యాణం లోక కళ్యాణం అవుతుందని.... 


అలాగే ధర్మరాజు కూడా తాము జూదంలో సర్వస్వం 

కోల్పోయి అడవుల పాలవుతామని కలనైనా అనుకోలేదు, అదే విధి లిఖితం.... 


రచన. చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 

9959511321

05/10/20, 8:07 pm - +91 94932 73114: 9493273114

మల్లినాథ సూరి కళా పీఠం పేరు .కొణిజేటి .రాధిక 

ఊరు రాయదుర్గం 

అంశం కలనైనా అనుకోలేదు నిర్వహణ.. హరి రమణగారు


బంధాల నడుమ కార్చిచ్చు రేపీ

మానవత్వానికి మాయని మచ్చ తెచ్చి

మనసుల ఉనికే భయానకమై పోతుందని

ఎవరికి వారు ఏమీ కాకుండా


మానవ ఉనికికే ఉప్పెనై వచ్చి

ఉపద్రవాల్ని సృష్టించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న

కరోనాకు జనం పిట్టల్లా రాలిపోతారని

కలనైనా అనుకోలేదు ఆనందాల్ని హరిస్తుందని

05/10/20, 8:14 pm - +91 95536 34842: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

అంశం:- కలలోనైనా అనుకోలేదు

నిర్వహణ:-హరిప్రియగారు

రచన:- సుకన్య వేదం

ఊరు:- కర్నూలు


కలలోనైనా అనుకోలేదే...

ఇలాంటి రోజు వస్తుందని

మనుషులలో దాగిన క్రౌర్యం

ఇలా బయట పడుతుందని...


కల్మషమెరుగక మానవతను

ఎప్పటికైనా కనగలమా...?

మంచితనపు బావుటాను

తిరిగి ఎగురవేయగలమా...?

05/10/20, 8:17 pm - +91 98482 90901: సప్తవర్ణాల సింగిడి 

  మల్లినాథసూరి కళాపీఠం YP

 కళాపీఠ అధిపతులు శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారు

అంశం: కలనైనా అనుకోలేదు

శీర్షిక :-  

*ఇంత ఘోరమైతదనుకోలే*

నిర్వహణ:- శ్రీమతి హరీరమణ గారు

ప్రక్రియ : కవన సకినము

తేది :-05-10-2020 ఇంధు వాసరం

కవి పేరు :-సిహెచ్ వి.శేషాచారి

కలం పేరు :- ధనిష్ఠ

ఊరు :- హన్మకొండ,వరంగల్ అర్బన్ జిల్లా

౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧

నాదేశం సర్వ స్వతంత్రంగా

స్వేచ్ఛా ఫలాలను పొందుతుందనుకున్నాను

నానాటికీ దారిద్య్రం నిరుద్యోగిత

కులవివక్షత మతమత్సరాలకు

లోనవుతుందని కోలేదు


భారతీయ సంస్కృతి సంప్రదాయాలు

మంట గలుపుతారనుకోలే

గాంధీ కోరినఅర్థరాత్రిస్వతంత్రం

జాడ ఉండదనుకోలె

మాతృమృర్తులైన అతివలపై

అఘాయిత్యాలుహత్యాచారాలు 

జరుగుతాయనకోలే

                         *ధనిష్ఠ*

           *సిహెచ్.వి.శేషాచారి*

05/10/20, 8:24 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 05.10.2020

అంశం : కలనైనా అనుకోలేదు! (కవనసకినం) 

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీమతి హరిరమణ గారు 


శీర్షిక : బంధాలు - విలువలు!


బంధాలు దూరమై అంతర్జాలమ్మే మధురమై,

రక్తసంబంధాల చట్రమ్ములోన మొగమువాసి,

పెదవులపై తీపినగవు  మనసెల్ల విషమే

సొంతదనములో శత్రుత్వమె నిజమౌనని...


అమాయకత్వాన్ని అంగడిబొమ్మగ కాగా, 

కంటబడని కపటపు మృగత్వము పెరిగి,

నరరూప రాక్షసత్వము అర్హులు చాచగా,

మానవత్వమే నశించునని కలగనలేదు!


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

05/10/20, 8:24 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీ బి.హరి రమణ గారు

అంశం: కలనైన అనుకోలేదు

శీర్షిక: కరోనా కాలం

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 05.10.2020  


బడిగంట మోగదని కలనైనా అనుకోలేదు 

గుడిగంట మోగదని కలనైనా అనుకోలేదు 

ఇల్లేజైలు అవునని కలనైనా అనుకోలేదు 

కరోనా ఆగమమును కలనైనా అనుకోలేదు 


కులవృత్తి కరువని కలనైనా అనుకోలేదు 

పరీక్షలేని విజయం కలనైనా అనుకోలేదు 

మందులు లేని రోగము కలనైనా అనుకోలేదు 

వనదుర్గ దర్శనము కలనైనా అనుకోలేదు

05/10/20, 8:26 pm - +91 89852 34741: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

5/10/20

అంశం.....కలనైన అనుకోలేదు

ప్రక్రియ....కవన సకినం

నిర్వహణ.....హరి రమణ గారు

రచన....కొండ్లె శ్రీనివాస్

ములుగు

"""""""""""""""""""""""""""""""

కాలం కన్నా వేగంగా మనసులో ఆలోచనలు

నిత్య నడవడిలో కొన్ని కార్యరూపం దాల్చితే

కొన్ని కార్యభంగమై చిరాకు పరాకు శోకమే

కాలమే నిర్ణయించాలని కదలకుండా ఎలా?


భగవంతునిపై భారం వేసి నిరందిగాఉంటే

అసంకల్పిత విజయం ఆశించని పదవులు

ఊహించని ఘటనలతో పొందగల ఫలితం

కలనైనా అనుకోలేదేని... ఆశ్చర్యం మనకే

05/10/20, 8:28 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం : కవనసకినం - కలలోనైనా అనుకోలేదు

నిర్వహణ.. శ్రీమతి హరిరమణ గారు 

తేదీ :05.10.2020  

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్ 

************************************************

కలలోనైనా అనుకోలేదే ఇలా అవుతుందని 

మనిషితో మనిషి కలవలేని రోజు వస్తుందని

ముక్కుమూతికీ గుడ్డ కట్టుకోవాల్సివస్తుందని 

యధేచ్చగాతిరిగే స్వేచ్ఛకోల్పోవాల్సివస్తుందని 


కంటికి కనిపించని వైరస్ మన శత్రువవుతుందని 

శుచిశుభ్రతే దానిని తరిమే ఆయుధాలవుతాయని 

చిన్ని అజాగ్రత్తయినా ప్రాణాంతకమవుతుందని 

మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష అవుతుందని  

************************************************

05/10/20, 8:33 pm - +91 94417 11652: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

అంశం:- కలలోనైనా అనుకోలేదు

నిర్వహణ:-హరిప్రియగారు

రచన:- టి.కిరణ్మయి


కలనైనా..నే అనుకోలేదు

కరోనా రక్కసి వస్తదనీ

కలవరమే రేపుతదనీ

కల్లోలమే సృష్టిస్తూ ఉందనీ


మాయల మహామ్మారీ అయ్యిందీ

మనుషులలో భయం నిండింది

కష్టాల సుడులనే చుట్టు ఉంచింది.

ఇక..స్వైర విహారం చేస్తోంది.

05/10/20, 8:34 pm - +91 94407 10501: ✍️ *మల్లినాథ సూరి కళాపీఠం - 🌈 సప్త వర్ణముల సింగిడి 🌈*

పేరు       : తుమ్మ జనార్ధన్ (జాన్)

తేదీ        : 05-10-2020

అంశం     : కలనైనా అనుకోలేదు!

                (కవన సకినం - ఓ చిరుకవిత)

నిర్వహణ : శ్రీమతి గీతాశ్రీ స్వర్గం 

---------------------------------------------- 

*శీర్షిక     :  అసాధ్యాలు సాధ్యమైన వేళ*


అఖండ భారతావనిని ఓ యోగి నడిపిస్తాడని

కాశ్మీరం భారత కలికితురాయిగా వెలియునని

భవ్య రామ మందిరం సాకారం అవుతుందని

కరోనా నా దేశాన కరాళ నృత్యం చేస్తుందని.


మల్లినాథసూరి కళాపీఠంలో కలుస్తానని

కలం పేరుతో కవిగా రూపమెత్తుతానని

సప్తవర్ణ కవి సామ్రాజ్యంలో కదిలిపోతానని

అసాధ్యాలు సాధ్యమని కలనైనా అనుకోలేదు.

05/10/20, 8:45 pm - +91 99486 53223: మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల .( వై పి )

అమరకుల  దృశ్యకవి ఆధ్వర్యంలో

పేరు  :మచ్చ అనురాధ  

ఊరు :సిద్దిపేట

సప్తవర్ణాల సింగిడి కవన  సకినం

అంశం  :కలలోనైనా అనుకోలేదు   

నిర్వహణ : శ్రీమతి హరిరమణ  గారు.



 స్నేహము  పేరుతోవలవేసి   

సంపదనంతా కొల్లగొడుతారనీ

కలనైనా అనుకో లేదు 

కన్న కలలు కల్లల వుతాయనీ 


కన్న బిడ్డల  వృద్ధి కొరకు 

కన్నీటిని గుండెల్లో దాచుకొని

కాలముతో సాగించు ప్రయత్నం 

కడవరకు నిలవాలి స్థైర్యం.


🙏🙏

05/10/20, 8:50 pm - +91 99891 74413: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : రాగుల మల్లేశం 

తేదీ  : 05.10.2020

అంశం : కలలోనైనా అనుకోలేదు  ! (కవనసకినం) 

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీమతి హరిరమణ గారు 


~~~~~~~~~~~~~



కరోనా కాటుకు భారమైన బంధాలు 

బక్కచిక్కిన బతుకులు ఆర్థనాదాలు 

కన్నీటి రోదనలు కడు భారమైన జీ"వనం"

భావి పౌరుల భవిష్యత్ గాలిలో దీపం 


అయినా వారికి  దూరంగా

ఆఖరి చూపుకు నోచుకోకుండా  

గుండె తరుక్కుపోయే ఆటలెన్నో 

కరోనా నేర్పిన గుణపాఠాలెన్నో

05/10/20, 8:53 pm - +91 94410 66604: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి ఆధ్వర్యంలో

అమరకుల దృశ్య కవి గారి పర్యవేక్షణలో

అంశం:గుణపాఠం

శీర్షిక: మనిషి? అబద్దం....

మనసు???

************************

కన్నీళ్ళు చీకట్లో

కాగడపూలై కత్తులతో గుచ్చేస్తుంటే మనసు తనువు నాది కాదని గగనానికి ఎగిసే

కుదురుగా కూర్చోకా

కలయతిరిగి సమ్మెటపోట్లతో 

పుడమి చేరి శూన్యమై 

అంతరాంతరాలలో ఇసుమంతై 

ఒదిగిబరువైపోయే కనువిప్పై..

***********************

05/10/20, 8:53 pm - +91 6305 884 791: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల   

అంశం:  కలలోనైనఅనుకోలేదు 

నిర్వహణ: అమర కుల, హరి రమణ గార్లు                       

  పేరు: శ్రీదేవి చింతపట్ల           *************.      నా కల నిజం చేయ నన్నుదించే నా సోదరి

మహామహోపాధ్యాయ కళాపీఠమందు 


జంకు బొంకు వల దంటు వెన్నుతట్టి


అక్షరాలు దిద్దించిరి అమర కులవారు


నా స్వప్న లోకాన గొప్ప మలుపు

మహామహోపాధ్యాయ కళాపీఠం


కలం పట్టని నేను ఇంత మంది ఘన కవి వరే న్యుల నడుమ

పదాల కూర్పు కు శ్రీకారం చుడుతానని కలలోనైన అనుకోలేదు. 🙏

05/10/20, 8:54 pm - +91 99087 41535: 🚩శ్రీ మల్లి నాద సూరి కళాపీఠం ఏడుపాయల🚩

🌈సప్త వర్ణముల సింగిడి🌈


M.భవాని శర్మ 

అంశం: కలలోనైనా అనుకోలేదు

నిర్వహణ: శ్రీమతి హరి రమణగారు.


కలలోనైనా కలగనలేదు కరొనా అనే మహమ్మారి ఉహన్ అనే నగరంలో పుట్టి ఊహకు అందని ఈ వ్యాధి దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అన్నట్టు సూక్ష్మ అవతారమే కానీ ఈ కరోనా అవతారం ఎత్తి స్తుంది.

కలలోనైనా అనుకోలేదు బతుకు భారం చేస్తుంది

జీవితం క్షణం క్షణం భయం భయం.


         ___***___

05/10/20, 8:57 pm - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠం yp*

            ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో......

        *సప్తవర్ణములసింగిడి*

 తేది:05/10/2020,సోమవారం

            కవనసకినం 

*అంశం:కలనైనా అనుకోలేదు*

నిర్వహణ:శ్రీమతి హరిరమణగారు 

రచన:జె.పద్మావతి 

మహబూబ్ నగర్ 

శీర్షిక: *ఊహించని మలుపు*

__________________________________

సాహితీమాతనుసేవించే అనుంగుభక్తురాలనై

కవికుల శ్రేణిలో స్థానం పొందిన ఓ కవయిత్రినై

కవన కుసుమాలతో వికసించే నిండైన కొమ్మనై

విజ్ఞాన పరిమళాలను ఇముడ్నచుకున్నదాననై


ప్రతినిత్యం  కవనార్చన చేస్తానని అనుకోలేదు

ఫల మంత్రాక్షతలకు నోచుకుంటాననుకోలేదు

వనదుర్గామాతం వరం పొందుతాననుకోలేదు

ఉన్నతురాలనౌతానని కలనైనా అనుకోలేదు

05/10/20, 9:03 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

05/10/20, 9:13 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-160🌈💥*

                       *$$* 

*చినుకు తడుమ చిగురేస్తి160*

                         *$$*

*ఓర్చుకుంటునేర్చుకుంటు ఎదిగొచ్చా*

*నరాధముడై కాలమే నను కూల నరికెలే*

*కాలగతి కూటనీతి ఎరుగనైతి  బేలనైతి*

*నీదు పరామర్శ  చినుకై తాక మొలకనైతి*

                          *@@*

            *అమరకుల ⚡ చమక్⚡*

05/10/20, 9:13 pm - Telugu Kavivara: <Media omitted>

05/10/20, 10:26 pm - Hari priya: 🚩🌈 కరోనా కాటుకు ఎంతమంది కన్నీటి రోదనలు భావి పౌరులు....గాలిలోకలిస్తే ..

దూరం  దూరం అంటూ కరోనా నేర్పిన పాఠాలు ఎన్నో

తీరైన ఒక కవన సకినం బావుందండి అభినందనలు 🌹💐👏🏻

05/10/20, 10:58 pm - Telugu Kavivara: *💥🌹అదనపు సభాచారం*


🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?*


తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే  *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు..


*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం!  " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..


*మరి అసలైన " సామజవరగమన " ఎవరు ??*... 

అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..".  వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు  తన కీర్తనలో ' సామజవరగమన ' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు ..


చాలా మంది " సామజవరగమన " అంటూ పాడేస్తున్నారు .... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో తెలీదు ... వారికి చెప్పేందుకైనా " సామజవరగమన " కీర్తన , దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం ..


🛑 *సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥*

*సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥*

*వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।*

*స్వీకృత యాదవకులమురళీ !*

*గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥*


ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది .. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది ... కీర్తన అర్థం ... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో , మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరీ!  నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చే కొనియాడ బడతావు .. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది .. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే , గుణమునకు , దయకు ఉదాహరణ నీవే .. నన్ను కూడా నీవే నడిపించాలి!....


సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ .. గోవులని రక్షిస్తూ .. మురళి గానంతో  అందరిని ఆనంద పరుస్తూ ..ఈ త్యాగరాజ వందనములను అందుకో! ..


ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం!

06/10/20, 6:10 am - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

06/10/20, 4:38 am - +91 99891 91521: <Media omitted>

06/10/20, 6:12 am - B Venkat Kavi: *శ్రీ గురుభ్యో నమః*

 *అందరికి నమస్కారం*🌹

              *మల్లినాధసూరికళాపీఠం*

       *సప్తవర్ణాల సింగిడి*

           *ఏడు పాయల*

      🌸 *మంగళ వారం*🌸


               *06.10.2020*

              *దృశ్యకవిత*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  *గోడకు చెవులుంటే*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గోడకు చెవులుంటే గుస,గుసలు వినలేక  చెవులు మూయడానికి చేతులుండక అడ్డంగా పడిపోతుంది. భావం తీసుకొని ఎన్ని విధాలుగా అయిన కవిత్వాన్ని పండించవచ్చు.మీ కలాన్ని తీసి అందమైన భావాన్ని జోడించి సమూహంలోకి చేర్చండి*


మన మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం ఇస్తే...

దృశ్యాన్ని చూడగానే అక్షరాలు పుటపై పరుగులు పెడితే..అపుడే

కవనానికి రూపం వస్తుంది.

      

   *గోడకు చెవులుంటే* 💐


దృశ్యానికి తగిన విధంగా,దృశ్యం చూడకుండా చదివిన అర్థవంతంగా ఉండాలి.అక్షరదోషాలు లేకుండా పంపించాలి


*కవి శ్రేష్ఠులందరుమీ రచనలు పంపి మల్లినాథసూరి కళాపీఠం వారి ఆతిద్యానికి అర్హులు కండి.రాసిన వారి పేర్లు నమోదు అవుతాయని మరువకండి*


 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸


   🌷  *ఉదయం ఆరు గంటలనుండి  రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే* 🌷


                *నిర్వహణ*

                *శ్రీమతిసంధ్యారెడ్డి*


 *అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో*🙏🙏


   *మల్లినాథసూరి కళాపీఠం*

            *ఏడుపాయల*

🌸🖊️✒️🤝🌹✒️💐

06/10/20, 6:17 am - +91 80089 26969: ✍️మల్లినాథ సూరి కళాపీఠం yp

ప్రక్రియ:: వచనం

అంశం :: గోడకు చెవులుంటే

నిర్వహణ:: శ్రీమతి సంధ్యా రెడ్డి గారు.

రచన::  దాస్యం మాధవి.

తేదీ:: 6/10/2020


ఊసులన్ని బట్టబయలు

గోడకు చెవులుంటే

గాలికి నోరుంటే

గుట్టు గది దాటి వీధి కెక్కు

విషయాలు మలయమారుతమై  చెలరేగు

దూరదూరాల కోనలు దూరు

విశేషాలు మారువేషాన మారుమ్రోగు

కబుర్ల పందిట

ఊహాగానాలకు ఊరట 

వాస్తవాల వాకిట విశ్లేషణలకు అలుసట

ఆశనాతురనకు పుకార్ల అగ్రతాంబూలమందు...


ఉన్నది కాదు అన్నది మిన్నగును

విన్నది కాదు వినిపించినది నిజమగును

నమ్మకానికి అంగట్లో అవమానము

మానాభిమానాలు అందరిలో అమ్మకము...


సులువు కాబోదు సుకుమారము 

రుజువు కాబోదు వాస్తవము...

సమస్యలతో సంధికాలం సన్నబడును

అసాధారణ రీతిలో వ్యక్తిత్వాలను ఎన్నబడును.....


గోడలకే చెవులుంటే

గొడవలకే రెక్కలొచ్చును

ఆదరాభిమానాలను ఎగరేసుకుపోవును....



దాస్యం మాధవి...

06/10/20, 6:46 am - +91 99891 91521: *శ్రీ గురుభ్యో నమః*

 *అందరికి నమస్కారం*🌹

              *మల్లినాధసూరికళాపీఠం*

       *సప్తవర్ణాల సింగిడి*

           *ఏడు పాయల*

      🌸 *మంగళ వారం*🌸


               *06.10.2020*

              *దృశ్యకవిత*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  *గోడకు చెవులుంటే*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గోడకు చెవులుంటే గుస,గుసలు వినలేక  చెవులు మూయడానికి చేతులుండక అడ్డంగా పడిపోతుంది. భావం తీసుకొని ఎన్ని విధాలుగా అయిన కవిత్వాన్ని పండించవచ్చు.మీ కలాన్ని తీసి అందమైన భావాన్ని జోడించి సమూహంలోకి చేర్చండి*


మన మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం ఇస్తే...

దృశ్యాన్ని చూడగానే అక్షరాలు పుటపై పరుగులు పెడితే..అపుడే

కవనానికి రూపం వస్తుంది.

      

   *గోడకు చెవులుంటే* 💐


దృశ్యానికి తగిన విధంగా,దృశ్యం చూడకుండా చదివిన అర్థవంతంగా ఉండాలి.అక్షరదోషాలు లేకుండా పంపించాలి


*కవి శ్రేష్ఠులందరుమీ రచనలు పంపి మల్లినాథసూరి కళాపీఠం వారి ఆతిద్యానికి అర్హులు కండి.రాసిన వారి పేర్లు నమోదు అవుతాయని మరువకండి*


 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸


   🌷  *ఉదయం ఆరు గంటలనుండి  రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే* 🌷


                *నిర్వహణ*

                *శ్రీమతిసంధ్యారెడ్డి*


 *అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో*🙏🙏


   *మల్లినాథసూరి కళాపీఠం*

            *ఏడుపాయల*

🌸🖊️✒️🤝🌹✒️💐

06/10/20, 7:26 am - B Venkat Kavi: 🚩🚩🚩🚩🚩🚩🚩🚩         *మల్లినాధసూరికళాపీఠం*

       *సప్తవర్ణాల సింగిడి*

           *ఏడు పాయల*

      🌸 *మంగళ వారం*🌸

               *06.10.2020*

              *దృశ్యకవిత*


  *గోడకు చెవులుంటే*

--------------------------------------

                *నిర్వహణ*        *శ్రీమతిసంధ్యారెడ్డిగారు*

 *అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో* మల్లినాథసూరికళాపీఠంఏడుపాయల

రచన: *బి. వెంకట్ కవి*


*గోడకు చెవులుంటే*

-------------------------------------

1 తేటగీతి:


గొడవ జరుగునొ నేమియో యెందుకనియొ

మర్మమెట్లుండ నేమియో మందిలోన

జనుల మదిలోన గుప్తము దాగియుండ

గుసలు గసగాను మసలుట గుప్తమగునె


2 తేటగీతి:


విశ్వజనులందు హృదిలోన విశ్వదాగు

బంధుమిత్రులమర్మము భవితకెరుక

బాధబంధీలు రాగల మనిషిచూడ

కాలధర్మము సత్యము కర్తయగునె


3.తేటగీతి:


గుట్టు గోడకు చెవులుండ గుడ్డవలెను

గురిగి మట్టియె రంగుల గురుతగాంచ

గుమ్మ గుప్తము గుప్పించ గుబులుగాను

గుటక మ్రింగుచు గుటకలు గుప్తమగునె


4.తేటగీతి:


గుంపు గుమిగూడ గుప్తము గుసలుచేయ

గోడమీదినిపిల్లియు గోడచెవులె

జాతి నందునా గుండెలు జారిపోవ

విశ్వజనులకు చేటును విశదమౌనె


*బి. వెంకట్ కవి*

06/10/20, 7:43 am - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయలసప్తవర్ణాల సింగిడి

అంశం.గోడలకు చెవులుంటే 

నిర్వహణ.శ్రీ మతి సంధ్యారెడ్డిగారు

రచయిత. డా నాయకంటి నరసింహ శర్మ


గోడలకు చెవులే కాదు కళ్ళు ముక్కు చెవులూ ఉంటే తంటాయే

మనుషుల ఆటకట్టు

ఇప్పటికీ గోడకు చెవులు లేవా?

కొన్ని వేల చెవులు వినిపించనివీ వినిపించేవీ సభ్యత లేనివీ సంస్కారం అసలే లేనివీ

ప్రపంచ యుద్ధాలకూ పునాదులు గోడకుచెవులే

తిమ్మరుసు గుడ్లు పీకించిందీ

ఆంగ్లేయులు మనను అప్రతిహతంగా ఏలిందీ ఈ చెవులపుణ్యమే

ఆకాలంలో గోడకుచెవులూ 

నేడు ఫోన్ టాపింగ్

గూఢచారులు పాలకుల గోడచెవులేకదా

గోడచెవులేకదా రక్తపాతాలనూ అత్తాకోడళ్ళ సిగపట్లనూ అగ్నికి ఆజ్యం పోసేది ?

పార్టీల కోవర్టలూ నమ్మక ద్రోహులూ తిన్నయింటి వాసాలు లెక్కపెట్టేదీ ఈ గోడచెవులేకదా

విదేశీయులు మనదేశంలో తిష్టవేసి నిలువుదోపిడీచేసి రత్నగర్భలాంటి దేశాన్ని భిక్షాపాత్ర చేసింది ఈ గోడచెవులేకదా సత్యభామ రుక్మిణీ ల తగవూ నారదుని కలహభోజనోదంతాలకు నేపథ్యం ఈ గోడచెవులేకదా

తొలిరాతిరి నవవధువుతో సరసాలు సరదాల వినోదానికీ గోడలకు ఆకాశమంత చెవులు

ఇందుగలడందులేదని పోతనామాత్యుని మాటల్లో గోడచెవులు లేని చోటెక్కడ ?

శ్రీ శ్రీ అన్నట్లు రణసిక్తం కానిచోటు భూస్థలమంతా వెదికిన దొరకదన్నట్లుగా గోడచెవులు లేనిచోటేదీ ?

గగనంలో భువనంలో ..

పోతనగారు చెప్పినట్లు ఇంతింతై....

గోడచెవులు కవులకూ మినహాయింపు లేవు

అసలు గోడలుంటే చెవులుంటాయి తప్పకుండా

చెవులుంటే గోడలుండాల్సిందే

వాటికి అవినాభావమైన సంబంధం

నిప్పలేనిదే పొగరాదన్నట్లు గోడలులేనిదే చెవులులేవు 

చెవులులేనిదే గోడలులేవు

గోడచెవుల దాంపత్యం అమరప్రేమలు అనార్కలీ సలీంలలాగా లైలామజ్నూల లాగా పార్వతీదేవదాసుల లాగా ఆచంద్రార్కం వర్ధిల్లాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా ఆశీర్వదిస్తున్నాను.


డా నాయకంటి నరసింహ శర్మ

06/10/20, 8:06 am - +91 97040 78022: శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం    ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం

సప్తవర్ణాల సింగిడి 6/10/2020

అంశం-:దృశ్య కవిత. గోడలకే చెవులుంటే

నిర్వహణ-:శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

రచన-:విజయ గోలి


 గోడలకు చెవులున్నా

చెట్టుపుట్టకు నోరున్నా

చెరుపు మనిషి చేతకే

చింతలలో చిగురించదు 

గమనమంత గాలివాలు


గోడకున్న చెవులతో..

అడవి దాకా కదిలింది

రామాయణ కధనం

దశరధుడి మరణం


గోడలకే చెవులుంటే ..

ఊటబావి వూరింతలు

ఊరంతా ఘుమఘుమలు 

పుకారులే షికారులై

పూతరేకు పంచిపెట్టు


గోడ చెవులు మూసి పెట్టి

గుండె తలుపు తీసి పెట్టు

ఎదుటివాడి బ్రతుకంత 

ఎగతాళిగ చేయపోకు

చేయిదాటి పోయాక

చేయగలది ఏమిలేదు.

06/10/20, 8:12 am - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

06-10-2020 మంగళవారం

పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

ఊరు: ఆదోని/హైదరాబాద్

అంశం:  దృశ్య కవిత

శీర్షిక: గోడకు చెవులుంటే (55) 

నిర్వహణ : సంధ్యా రెడ్డి


ఇద్దరి మధ్యన సద్దుమణిగి 

ఉండాల్సిన విషయం 

ఊరు ఊరంతా పాకితే 

చెవులు గోడకు ఉన్నట్టేగా! 


గోడకు చెవులుంటే 

పేలిపోవును తప్పక ఈ 

చెడు వార్తలు విని ఆడ 

ముచ్చట్లు విని విని! 


గోడకు చెవులుంటే బాగుండును 

నాలుగు గోడలు మధ్య బంధీలై చిత్రవధ 

పడుతున్న అభాగ్యుల గోడు 

అందరికి తెలిసి స్వేచ్ఛ లభించేది! 


కోర్టు గోడలకు చెవులుంటే 

అబద్ధపు సాక్షుల నోటి

మాటలు విని విని 

గుండె బద్దలయ్యుండేది!

వేం*కుభే*రాణి

06/10/20, 8:15 am - +91 94413 57400: గోడకుచెవుల వల్ల మంచే జరుగుతుందా వేంకటేశ్ గారు?

డా  నాయకంటి నరసింహ శర్మ

06/10/20, 8:42 am - +91 99631 30856: *కామవరం ఇల్లూరు వెంకటేష్

గారికి వందనములు*

*చెడు వార్తలు విని ఆడ ముచ్చట్లు విని విని*

*అబద్ధపు సాక్షుల నోటి మాటలు విని విని*

👏💐👏💐👏💐👏💐

మీ భావ వ్యక్తీకరణ మీ భావ ప్రకటన మీ పద జాలము పద బంధము మీ అక్షర విన్యాసం మీ విశ్లేషణ వివరణ వర్ణన విపులంగా వివరించారు మీకు ప్రశంస నీయ అభినందనలు సర్🙏🙏

06/10/20, 8:47 am - +91 98679 29589: *సప్త వర్ణాల సింగిడి*

*మల్లినాధసూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం: దృశ్య  కవిత(గోడకు చెవులుంటే)*

*శీర్షిక : గోడచెవుల ఇతిహాసం*

*ప్రక్రియ: వచనం*

*నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు*

*తేదీ 06/10/2020 మంగళవారం*

*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ,* 

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట* 

Email : shakiljafari@gmail.com

           9867929589

""''""""""""""""""""'"""""""'""""""""""""""""'"""""""

నిజంగా గోడకు చెవులు లేకున్నా గోడచెవుల గాథ చాలా పెద్దది...


ఈ గోడచెవుల ఇతిహాసం రామాయణములో, ఈ గోడచెవుల ఇతిహాసం మహాభారతములో...


మదిలోని ప్రేమ గొంతును నొక్కి అన్న - తమ్ముళ్లలో శతృత్వపు బీజాన్ని నాటేవి 

ఈ గోడచెవులే...


అత్త కోడళ్లలో వైరాన్ని పెంచి ఒకరికొకరిని శత్రువులు చేసేవి ఈ గోడచెవులే...


వజ్రం లాంటి మిత్రత్వాన్ని ముక్కలు ముక్కలు చేసి, మిత్రుల్ని విడదీసేవి ఈ గోడ చెవులే...


స్వార్థం కోసం శత్రురాజ్యాలకు సహకరించి దేశద్రోహంలో దేశద్రోహులకు పనికొచ్చేవి ఈ గోడచెవులే...


కళ్ళకు కనబడని, అస్తిత్వంలో లేని ఉన్నట్టి గోడచెవుల ప్రతాపం ఇదైతే మరి నిజంగానే గోడకు చెవులుంటే ఏమయ్యేదో...


గోడకు చెవులుంటే మనం ఒకరొకరి చెవుల ఇంకా దగ్గర గుసగుసలాడే వాళ్లం లేదా గోడలు లేని స్థలాలే మనం వెదికే వాళ్ళం మాట్లాడేందుకు...


గోడకు చెవులుంటే గోడకు నోరు గూడా కావాలి,

చెవులున్నా నోరు లేదు గదా అని ఆలోచించే మహానుభావులు ఎక్కడాపుతారు ఊసులు...


నిజంగా గోడకు చెవులుంటే మనం అద్దమై పోతాం, అద్దంలా ముందున్న వాడి గురించే మాట్లాడుతాం, పర నిందపు పాపం నుండి ముక్తవుతాం... 


*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ,* 

   *మంచర్, పూణే, మహారాష్ట*

06/10/20, 8:49 am - venky HYD: ధన్యవాదములు

06/10/20, 8:49 am - venky HYD: ధన్యవాదములు

06/10/20, 8:54 am - +91 93984 24819: మల్లినాథసూరి కళాపీఠం YP,

సప్తవర్ణాల సింగిడి,

మంగళవారం,6-10-2020,

దృశ్యకవిత,

అంశం:గోడకు చెవులుంటే,

శీర్షిక:గోడతో గొడవ,

పేరు:రాజుపేట రామబ్రహ్మం,

సెల్ నం:9398424819,

ఊరు:మిర్యాలగూడ,

నిర్వాహణ:శ్రీమతి.సంధ్యా రెడ్డి 

                  గారు.

                 --------------

గోడకు చెవులుంటే గందరగోళమే

చెప్పలేక కడుపుబ్బి బాధపడటమే

రహస్యమైతే ఇక రచ్చ ప్రారంభమే

కొంపకొల్లేరు కావడం కొద్దిదూరమే

మరోచెవినపడితే వేరు కాపురమే

సి.సి.కన్నులకు కాసింత సౌలభ్యమే

చెవిటివారికి మరింత కష్ట కాలమే

గుసగుసల ధ్వనితో గొల్లుమనడమే

చెప్పలేక మింగలేక కక్కి చావడమే

ఎవరికీ చెప్పలేక దాచుకోవడమే

మనసు విప్పక మొగ్గగా రాలడమే

బహుకుటుంబాలకు బాధాకరమే

ఒంటరి జంటలకు ఇబ్బందికరమే

విరిగే మనసులకది ముహూర్తమే

నోటికిభయపడి మూసుకోవడమే

వాగేచెవులచూసి సిగ్గుపడటమే

ఛీ అనిపిస్తే ఇల్లు వదిలిపోవడమే

లేకుంటే బుద్ధిగా మసలుకోవడమే

నాలుగ్గోడలమధ్య నలిగిపోవడమే

నల్గురితో మంచిగ సాగిపోవడమే.

                  ధన్యవాదములతో,

                       రామబ్రహ్మం.

06/10/20, 9:06 am - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

06-10-2020

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

రచన -చయనం అరుణాశర్మ

అంశము -గోడకు చెవులుంటే

నిర్వహణ -శ్రీమతి సంధ్యారెడ్డిగారు


గోడకి చెవులుంటే

గుసగుసలకి రెక్కలు వచ్చి

గాలి సంగతులు గగనాలకెగురు

గుట్టు రట్టయి గుబులు పుట్టు

మదిలోని మాట గదిదాటి

బయలెల్లి 

తుమ్మెదల రొదలా కలవరం రేపు

అణుబాంబుల విస్ఫోటనాలే

మంచికి దోహదపడి

మాట నిలబెట్టు

దురాలోచనకి దారిలేక

రహస్య సమావేశాలకు అంతరాయమే

దమనకాండను ధ్వంసం చేయు

కొంత మంచి కొంత చెడు

మంచిని మిగిల్చి చెడును పారద్రోలు

చీకటిలో చెలరేగే స్వార్ధాన్ని

జరిగే అనర్ధాన్ని చిత్రీకరించి

గోప్యంగా ఉంచిన దుశ్చర్యలను

సమాధి చేయు

పాపపు చేష్ఠలకు పాముపడగలై

రహస్య మంతనాల రంగు బైటపెట్టి

రణాల నివారణకు కారణాలే

06/10/20, 9:23 am - +91 94415 44806: వేలేటి శైలజ సిద్దిపేట





ఎన్ని కబుర్లు ఎన్ని ముచ్చట్లు

మనుషులెంత మేధావులు

నన్ను అడ్డంపెట్టుకుని మనిషి ఎన్ని సంగతులు నేర్చాడో

నన్ను చాటు చేసుకుని ఎన్ని రంగులు మార్చాడో

నేను వినలేననుకుని ఎన్ని నాటకాలాడాడో

నాకు చెవులు న్నాయని నేను వింటున్నానని తెలిస్తే వీరు గోడమీద పిల్లులౌతారేమో

నేను లేకుండా వీరికి గూడే వుండదు

నా వినికిడి శక్తి తెలియక ఎన్ని  ఎదురుదెబ్బలు తింటున్నారో

నాకు చెవులున్నాయి కాని నోరేలేదు

గోడకు చెవులుంటాయి అని గొణుగుతూనే నాకు వినబడేలా మంతనాలు జరుపుతూనే ఉంటారు

ఐనా నాకో అనుమానం గోడకు చెవులుంటాయని వీరికి తెలుసా?తెలియదా?


*ఇది నా స్వీయరచన

06/10/20, 9:32 am - +91 98492 43908: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల

బి.సుధాకర్

అంశం..గోడకు చెవులుంటె

శీర్షిక.. శతృవే నీడైతె

నిర్వాహణ.. సంద్యారెడ్డి గారు.


మేడి పండును పోలిన మనసులున్నప్పుడు

మసలుకొనే మంత్ర మెరిగితే శాంతి ...., ప్రశాంతి

అంగరక్షకులే అపరాధమంటె 

ఆయువును కాపాడేదెవరు ఆసరా ఇచ్చేదెవరు


శతృవే నీడలా వెంటుంటె వెతలు తగ్గేదెలా

మనసున నిండిన బాధలు చెప్పే స్వేచ్చలేక

నిర్వేద జీవితాన్ని నిత్యం గడపలేక

నిలువెల్ల దహించుకు పోవలసిందే


బావిలో నీరు తోడితేనే ఊటకు బలమున్నట్లు 

మనసులోని అనుభూతులు అందరికి చెప్పనిదే

కొత్త ఆలోచనలకు శ్రీకారముండదు

ఎవరి ముందు చెప్పాలో సతమతమైతే

అంతరంగ మందు రణరంగమే


గోడకే చేవులుంటె చెప్పెదేముంది

ప్రపంచ యుద్దం ఇంటినుంచే మొదలవును

చెప్పుకొనే చోటు లేక చెప్పాల్సింది ఎక్కువై

మోయలేని భారమై బద్దలవును పిడికెడంత గుండె యపుడు


పంచు కుంటె తగ్గేవి బాధలు

ఉంచు కుంటె పెరిగేవి రోగాలు

కడలిలో అల్లకల్లోమై సునామి వచ్చినట్లే

అంతరంగంలో అలజడి మొదలై బద్దలవును 

బందాల కోటలన్ని

06/10/20, 9:40 am - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశము. గోడలకు చెవులుంటే 

శీర్షిక. పక్కవాడి పగ భగభగ 

నిర్వహణ. సంధ్యా రెడ్డి గారు 

       పాట 

🌸🌸🌸🌸🌸

       పల్లవి. 

🌸🌸🌸🌸🌸

తాన తందాన తందానానే తారానా (2)

గోడులకు చెవులంటాయమ్మా 

గోతినే తీస్తారు గుమ్మా. 

పక్కవాడి పాలిపగ అమ్మా 

జీవితాలే ముంచేస్తాయమ్మా (2)

వారిపోరు పడలేక మా నాన్న చచ్చెనో 

మా అమ్మ భాధను ఎవరుచూడగలరమ్మా!

        చరణం. 

🌸🌸🌸🌸🌸

నిదుర పట్టనీయక నిందలే వేస్తారు 

మంచిమాటలంటూ ముంచేస్తూఉంటారు 

ఆనంద పడితే తట్టువారయ్యి 

ఇంటి పక్కనున్నోన్ని ఈశ్వరుడే పసిగట్టడు. 

తాన తందాన తందానానే తారానా 

          చరణం 

🌸🌸🌸🌸🌸🌸

పాలిపగకన్నగూడ మించిన వారయ్యి 

ఈగోడ అవతల దాగియుండి వింటారు. 

వారెవ్వా ఎవడయ్యా వాడు. 

వాడి జుట్టు పీకుతాను నేను. 

కలిసి ఉంటే చూడలేని వాన్ని 

కళ్ళు పీకేస్తాను నేను.  

అబ్బబ్బ ఏం మాట లమ్మా 

నీతోడుంటే భయంలేదమ్మా. 

కళ్లిబిల్లి మాటజెప్పి నోప్ని 

మాటరానీయనేనూ

తాన తందాన తందానానే తారానా

06/10/20, 9:41 am - +91 95422 99500: <Media omitted>

06/10/20, 9:43 am - +91 81062 04412: *సప్త వర్ణాల సింగిడి*

*మల్లినాధసూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం: దృశ్య  కవిత(గోడకు చెవులుంటే)*

*శీర్షిక : లోకాన్ని మార్చేయదా*

*ప్రక్రియ: వచనం*

*నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు*

*తేదీ 06/10/2020 మంగళవారం*

      ********************* 


గోడలకే చెవులుంటే... 

ఆ చెవులకే చెప్పేటి మనసుంటే...

అన్నార్తుల ఆకలికేకలు వినబడవా...

అభాగ్యుల ఆక్రందనలు కళ్ళకు కట్టవా...

ఉన్నోడి దాస్టీకాలు బయటకు రావా...

లేనోడి కన్నీళ్లబాధలు ప్రపంచానికి తెలియవా

మందు మత్తులో ఉన్మాదులు చేసేటి దుశ్చర్యలు వెలుగులోకి రావా...

అభం శుభం ఎరుగని ఆడపిల్లలపై జరిగే అకృత్యాలకు అడ్డు కట్ట పడవా...

డబ్బు మాటున జరిగే అడ్డగోలు పనుల వివరం తెలియక పోవునా...

చీకట్లో జరిగే అమానుష కృత్యాలకు వెలుగు పొరలు పరచక పోవునా...


గోడలకే చెవులుంటే...

ఆ చెవులకే చెప్పేటి నోరు ఉంటే...

నిట్ట నిలువునా ముంచుతున్న 

రాజకీయ రంగుల్ని,వారు చేసే బొంకుల్ని 

బయట పెట్టక పోవునా....

అడ్డగోలుగా దేశాన్ని దోచుకుంటున్న గుంట నక్కల తాట తీయక పోవునా...

వారి బతుకు బజారున వెయ్యక పోవునా

నమ్మించి నట్టేట ముంచే దగాకోరుల

పీచమణచక పోవునా

చేసే దౌర్జన్యాలకు చరమగీతం పాడకపోవునా


ప్రేమ పేరుతో అమాయక ఆడపిల్ల విశ్వాసంపై

దెబ్బతీసే తోడేళ్ల మదం అణచక పోవునా...

వారి దొంగబుద్ధులు బయట పెట్టక పోవునా

నిత్య తాగుబోతుల ఇంటి మనసు తెరలకు అద్దం పట్టక పోవునా...

వారి కష్టాలు తీర్చే సలహా ఇవ్వకపోవునా

మాయమాటలతో కనికట్టు చేసే పోకిరీల

ఆట కట్టకపోవునా...

బుద్ధి వచ్చేలా దేహశుద్ధి చేయకపోవునా

దేశాన్ని అక్రమంగా దోచుకునే తెల్ల నేరస్తుల తోలు మందం కనిపెట్టకపోవునా...

వారి బండారం బయట పెట్టకపోవునా...


గోడలకే చెవులుంటే....

ఆ చెవులకే స్పందించే హృదయముంటే...

చిన్నారుల చిగురు మోముపై హరివిల్లులు  వికశించవా...

అమ్మాయిల లేత పెదవిపై ఆనందం

ఆర్నవమవదా...

మాసిన బతుకుల వెతలు తొలగి

మహదానందం తొంగి చూడదా...

అలసిన జీవితాల సొట్ట బుగ్గపై చిగురాశలు

తొణికి చూడదా...

సామాన్యుల  బతుకు చిత్రం ఆసాంతం మార్చి చూపదా...

అసామాన్యుల జీవన భాగోతం ప్రపంచానికి విప్పి చూపదా...


****************************                                                  

*కాళంరాజు.వేణుగోపాల్*

*మార్కాపురం. ప్రకాశం 8106204412*

06/10/20, 9:44 am - +91 98679 29589: నమస్కారమండీ,

మనఃపూర్వక కృతజ్ఞతలండీ🙏🙏🙏

06/10/20, 9:46 am - +91 98679 29589: నమస్కారమండీ,

*కోర్టు గోడలకు చెవులుంటే అబద్ధపు సాక్షుల నోటి మాటలు విని విని గుండె బద్దలయ్యుండేది!* చాలా బాగా వ్రాశారండీ🌹🌺💐🙏

06/10/20, 9:57 am - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

6.10.2020

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

 శ్రీమతి సంధ్యారెడ్డి గారి పర్యవేక్షణలో

అంశం:గోడకు చెవులుంటే(దృశ్యకవిత)

డా.సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880

ప్రక్రియ:అవకాశమేగా


కుడ్యానికి చెవులుండి వినగలిగితే

సాధ్యము కానిదేనా..ఊహ?

వినగలిగి చెప్పలేకపోతే

భిత్తిక బిత్తరపోతుంది అవాక్కవుతుంది

ఇవా మానవుల వింత వెక్కిరింతల విషపు

ఆలోచనలు అని

విని చెప్పగలిగే శక్తి ఉంటే

అప్పుడొస్తుందితంటా ఇంటింటా  లోకమంతా

ఇంటిగుట్టంతా గోలగోలే

వినిచెప్పగలదని తెలిస్తే..మౌనభాషదే రాజ్యం

భయంకర నిశ్శబ్దం భువిని దున్నేస్తుంది

భరించలేని అభాషణం పల్లవిస్తుంది

చక్షువు తోడైతే....

జుగుప్సాకర భీభత్స దృశ్యాలను చూడలేక

ఉద్ఘోషిస్తుంది....గీపెడుతుంది

స్పందించే మనసు కూడితే

ఛిత్రవధకు లోనై, కన్నీళ్ళు సెలయేళ్ళై పారి,

హృదికి చిల్లులు పడి వల అయి, 

ముక్కలుముక్కలై కరిగి కలిసి పోతుంది

కాళ్ళుంటే .... రెక్కలుంటే అనంత ఆలోచనలు


బుద్ధులుమారాలి కానీ ఇడుపులకు చెవులేల

అయినా కనిపించని చిత్ర యంత్రాలు,

వినికిడి వస్తువులు ఎప్పటినుండో రక్షణకు

భక్షణకు ఉండనే ఉన్నాయిగా!

అంతేనా మరో పార్శ్వం చూస్తే....

పంచలేని ఆప్యాయతల విలువ

పంచుకుంటున్న మమతల వెల్లువ

పొంగి పొర్లే మధురభావాలు

నలిగిపోతున్న అబలల జీవితాలు

దయనీయ సంఘటనలు...... ఎన్నైనా

తెలుసుకోవచ్చు... తెలివిగా ఉండొచ్చు

దేన్నైనా ఉపయోగించుకోవడములోనే ఉంది



ఇది నా స్వంత రచన

06/10/20, 10:01 am - Bakka Babu Rao: సప్తవర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం.   దృశ్య కవిత  గోడకే చెవులుంటే

నిర్వాహణ...సంధ్యా రెడ్డి గారు

రచన....బక్కబాబురావు

ప్రక్రియ....వచనకవిత



గోడకు చెవులుంటే  గొడవలు

గందరగోళ పరిస్థితులు

మాటలకు చెవులిక్కరించి

మాటు కాస్తాయి అదే పనిగా


అందుకే అన్నారు గోడకు చెవుంటాయని

పంచ లకు బల్లులవలె పాకులాడి

గుస గుసలుచెవులో నింపుకొని

.మైకు లేకుండా ప్రచారమే


నాలుగు గోడల రహష్యాలు

నలుగురిచేరవేయటంలో దిట్టలు

గుట్టును రట్టు చేసే నిపుణులు

దూరాలోచనే మది నిండగా


గోదానిండా చెవులిక్కరించి

గుంట నక్కలా కాచు కొని

మానవత్వం మరచిన మనిషి లో గుట్టు

తెలుసుకోలేదు ఆ పరమాత్మ


సి.సి కెమెరాళ్ళనిరంతరం కాచుకొని

రికార్డు చేస్తుంటాయి అదే పనిగా

నాడైన నీడైన

నిరంతరం సాగే తంతే

గోడకు చెవులేమిటి నిర్జీవమైనది


లోపమంత మన మస్తిష్కంలో

లోపభూయిష్టమైన ఆలోచనలు

మార్పు రావాలి మనలోనే

అదే జరిగితే గోడల్స్కు చెవులేమిటి


బక్కబాబురావు

06/10/20, 10:17 am - +91 98662 03795: 🚩మల్లినాథసూరికల పీఠం ఏడుపాయల🙏

🌈సప్తవర్ణాలసింగిడి 🌈

శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో 

మంగళవారం 

దృశ్యకవిత 06/10/20 

ప్రక్రియ- వచనం  

నిర్వహణ -శ్రీమతి సంధ్యారెడ్డి   గారు 

అంశం -గోడకు చెవులుంటే 

శీర్షిక-  పెదవిదాటితే పృధివిదాటుతుంది

పేరు -భరద్వాజ రావినూతల 

ప్రకాశంజిల్లా -

9866203795


మనిషికి దేవుడివ్వని శక్తీ -

అవతలివాడి మనసు తెలుసుకోవటం -

అదిలేదుకాబట్టే ప్రపంచం నడుస్తుంది ప్రశాంతం -

 ఎదుటివారి సంగతులు తెలుసు  ప్రతోడికి ఆశక్తి -

దానికోసం వాడుతుంటాడు  తన  శక్తీ -

అటుఇటు చెప్పి బ్రతకటం కొందరికి భుక్తి -

మర్మాన్ని వినే  చెవులు -

దాన్ని దాచుకోలేని మనసులు -

చెబుతాయి నోటికి పనులు -

తింటాయి చెప్పు  దెబ్బలు-

చెవులను నోటిని వంటిని అదుపులో ఉంచుకునే వాడు ధన్యుడు -

మట్టిగోడైనా సిమెంటు దైనా రహస్యాలకు  అడ్డురావు -

సభ్యతలేని ఈపని అనర్ధాల సవ్వడి  -

విన్నమాట నోటిలోనాని ఇంతలు పదింతలై వెళ్తుంది బయటకు -

ఒక గోడ చాటున విన్న మంధర మాట రామాయణానికి అయింది మూలం -

మరోగోడచాటున వచ్చిన మాట తెప్పించింది పారిజాతం -

గాలివూసులు చెప్పడం -

గోడకు చెవులుండటం -

పెదవిదాటితే  పృధివి దాటడం -

ఇవన్నీ నిత్యసత్యాలు అయినప్పటికీ -

అనుభవాల సారాలు -

పెద్దలిచ్చిన సూత్రాల వరాలు -

కుటుంబకలహాలు కు ఇదే మూలకారణం -

ఇదిగోపులి అదిగో తోక అన్నదాని రూపకల్పం -

గోడ ఒక జడ పదార్ధం ,కదలని స్వరూపం-

మనుషులమధ్య అడ్డుకోడలు లేనప్పుడు -

ఈచెవుల సమస్యలు  ఉండవుగా  -

చాడీల  మాటలు పొక్కవుగా -

మోయలేని భారం మనసుకు వచ్చినపుడు -

అవతల మనిషిపై కోపం పెళ్లు బికినప్పుడు -

సాటి మనిషి దగ్గర పొందే సానుభూతి పొందే సమయంలో -

చెప్పే మాటలు గోడలకు ఎగబాకితే -

వచ్చే కష్టాలనీ  జనం మరువని పరిస్థితి వస్తే -

ప్రపంచపు మనుగడ కష్టం అవుతున్నమాట నిజం -

 ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

06/10/20, 10:42 am - +91 98666 87134: మళ్లినాధ సూరి కళా పీఠం💐

పేరు.ఉదయశ్రీ ప్రభాకర్

అంశం.గోడకు చెవులుంటే..


 *మౌన సాక్షాలు* 


ఆవేదన ఆమెను చుట్టు ముట్టిందేమో..

వేదనలోంచి రోధన కట్టలు తెంచుకున్న నదిలా మారింది


అదంతా తన చెవులకు వినిపిస్తున్నా..

కన్నీరు తుడవని తన నిస్సహాయతను తిట్టుకుంటూ

ఓదార్చలేని తన మూగ బాధను చూసి తానే జాలిపడుతున్నాయి చుట్టూ సాక్షాలుగా నిలిచిన గోడలు..


గోడలు తమకు చెవులు వద్దంటూ

దైవాన్ని వేడుకుంటున్నాయి దయనీయంగా..

నిజాలు చెప్పలేని వేళ మాటాడే శక్తి ఎందుకని..?

ఓదార్పు ఇవ్వలేని వేళ ఈ వినగలిగే అదృష్టం ఎందుకని..

అన్నీ ఇచ్చి నిస్సహాయులైన మనుషుల్లా మము చేయొద్దంటూ..

పదే పదే ప్రార్ధిస్తున్నాయు..మౌన సాక్షాలెన్నో..


ఉదయశ్రీ ప్రభాకర్

06.10.20

06/10/20, 10:43 am - Telugu Kavivara: *మల్లినాధసూరికళాపీఠం YP*

       *సప్తవర్ణముల 🌈సింగిడి*

      *మంగళ వారం*

      *06.10.2020*

        *దృశ్యకవిత*

--------------------------------------

                *నిర్వహణ*        *శ్రీమతిసంధ్యారెడ్డిగారు* 


రచన: *అమరకుల దృశ్యకవి చక్రవర్తి*


*గోడకు చెవులు*

------------------------------------

*పునాదులై లేచిన భవంతికి ప్రాకారాలే ఆధారం*

*భవంతులై నిలిచిన స్వప్నాలకు చతురంగ బలమే ఆ గోడలు*

*ఘణత కైన బతుకు కైనా సురక్షణయే ఆ మృత్తికల సైన్యం పహరా*

*పంచ భూతాల నుండి నిలువ నీడ ప్రతీ గోడయూ కవచమే*


*గోడ మీద బల్లులూ గోడ దూకె పిల్లులూ ఉండవచ్చు ఐనా గుట్టు దాచవలెను*

*కొంప ఎవరి దైననూ కూల్చగోరే ఘనులు ఇంటి పెరడి తలుపుల్లా ఇనుము నైన కరగదీసె కొలిమిలా శత్రువుకే కాపు కాస్తారు*


*అలిమి బలిమి ఏదైన చెవులై గోడలకు అతుక్కు పోతారు. అరి(శత్రువు)తో అంటకాగేరు*

*ఫలికిన ప్రతి మాట తంత్రి లేని యంత్రంలా; కనరాని సిసి కెమెరాలా సమస్తం అటు పక్షం కి చేరవేయగ. తస్మాత్ జాగ్రత్త సుమా*


*మూసుకుని చూసుకుని మాటాడడం నేర్చుకో.మనుగడించడం అలవర్చుకో*

*ఇంటిగుట్టు ఆవలి గట్టుకు చేర్చే పరాయోళ్లుంటారని గుర్తుంచుకో. కనీసం శబ్దం లేని భాష నేర్చుకో*


*🌈అమరకుల దృశ్యకవి*

06/10/20, 10:44 am - +91 73493 92037: మళ్లినాథ్ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగడి

6/10/2020

అంశం :గోడలకే చెవులుంటే

నిర్వాహణ : దృశ్య కవి చక్రవర్తి,మరియు సంధ్యారెడ్డి గారు

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

       గోడ - గోల

     -----------------

గోడకు చెవులుండే గాథలు

గోలలు కోకొల్లలుగా పురాణాలు

కాలక్షేపం ప్రచారాలు

అవేకదా అక్షరాల బాటలై పరుగులు తీసి

మధనం చేసి కలానికి కవితలు

కాకమ్మ కబుర్లు కల్పిత కథలకు 

ఊపిరిపోయు సృష్టికర్తలు 

చాడీలు చాటి పొగలై నిప్పు గుండాలు

రహస్యాలను రచ్చకీడ్చి చెవులకు ఆడ మగ భేదాలు లేవు

అందరూ అటువంటివారే వినేది ఒకటి

నిజాన్ని కప్పిపెట్టి అబద్ధం చేయగల సమర్థులు 

నారాదముని పట్టాలు పొందగల మూర్తులు

కొంపలు కూల్చి రాల్చి బూడిదచేస్తారు

రామాయణ మహాభారతలలో పుక్కిటి

కథలకు నాంది రూపాలు ఎన్నెన్నో

మహాయుద్ధాలకు మార్గదర్శక మూలాలు

మానవులే గోడకు చెవులై స్నేహాలకు

సంసార అనురాగాలకు శత్రుత్వం రేపగల కుతంత్రులు

ఎదురింటి పక్కింటి కార్య కచేరీలలో

కల్పించుకొని శాంతిని అశాంతిని చేయగలరు

శక్తియుక్తి చెడ్డ స్ఫూర్తితో పాము లా కాటేస్తారు

గారడిచేసి గుండెను కోసే  ప్రాణహంతకులు

అలా,హాలహలాజ్వాలాలు రేపకండి

విన్నది విన్నచోట విడిచి ఉపకారం చేయండ

గోడలకు చెవులు అప్పజొప్పే అంటు జాడ్యాన్ని మీతోనే అంతం చెయ్యండి

భరత భూమికి చెవిపెట్టి ఆమె

బాధలు వినిపించుకొని

విముక్తి రహస్యాలు

కనివిని ఈ కలియుగాన మాతృదేశానికి 

సహాయం చేసి రక్షణ కల్పించండి అదే మేలు నేడు!

06/10/20, 11:01 am - +91 83740 84741: అమరకులదృశ్యకవి వర్యులకు

నమస్కారం 🙏


పంచభూతాలనుండి నిలువనీడ

ప్రతీ గోడయూ కవచమే 👌

ఇంటి పెరటి తలుపుల్లా ఇనుమునైన కరగదీసె

పలికిన ప్రతీ మాట తంత్రి లేని

యంత్రంలా

మనుగడించడం అలవర్చుకో

👌👌👌👏👏👏👍👍💐

ప్రతీ మాటా తూటాలా ప్రయోగించేరు

ఆద్యంతమూ అద్భతంగా

హితోపదేశంలా భావాత్మకంగా ఉంది

🙏🙏🙏 మీ రచన

06/10/20, 11:05 am - +91 99087 33389 left

06/10/20, 11:16 am - +91 93941 71299: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల 

సప్త వర్ణాల సింగిడి

 పేరు : యడవల్లి శైలజ కలంపేరు ప్రేమ్ 

ఊరు: పాండురంగాపురం ,జిల్లా ఖమ్మం 

అంశం: గోడలకు చెవులుంటాయమ్మా


గోడలకు చెవులుంటయి

పక్కవాళ్ళు ఎప్పుడు 

మనింటి వైపు ఓ చెవిపెట్టి 

ఏం జరుగుతుందోనని వింటారు....

వాళ్ళపనులు వాళ్ళు చేసుకోరు

ఎప్పుడు ఇతరుల ఇంటివైపు చూపే

డేగ కళ్ళులా చూపేసి .....

పనులు గమనిస్తూ

మాటలు వింటూ

సూటిపోటి మాటలంటూ

వాళ్ళ అసూయ వెళ్ళ కక్కుతూ....

గోడలకు చెవులేకాదు 

గోడలకు కళ్ళు కూడా ఉంటయి

ఎదుటివారి మంచి కోరుట మాని

వారి వినాశంను కోరుకుంటూ...

అవును గోడలకు చెవులుంటయి 

మన బాధలు వింటయి 

కన్నీళ్ళను పెడుతుంటయి

చెప్పలేని వ్యథతో .....


హమీ పత్రం 

ఈ కవిత నా స్వంత రచన దేనికి అనుకరణ అనువాదం కాదు.

06/10/20, 11:17 am - +91 99087 33389 joined using this group's invite link

06/10/20, 11:26 am - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*06/10/2020*

*అంశం:గోడకు చెవులుం టె*

*నిర్వహణ:శ్రీమతి సంధ్యా రెడ్డి గారు*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


 *గోడకు చెవులుం టె*


గోడకు ఉన్న చేవులే గొడవలకు

శ్రీకారం

మనిషి విచక్షణ కోల్పోతున్న

నైజం

రాజ్యాలు కూలిపోయాయి

ప్రాణ నష్టము జరుగుతుంది

ఆస్థి నష్టము కలుగుతుంది

కుటుంబాలు కూలిపోతు న్నాయి

బంధాలు తెగిపోతు న్నాయి

ఎందరో భార్య భర్తలు విడి పోతున్నారు

నరము లేని నాలుక వలన

నరకము చూపిస్తున్నారు

విచ్చల విడి గా ప్రవర్తిస్తున్నాను

కొంపలు కూలుతున్నాయి

పచ్చి గడ్డి భగ్గుమంటోంది

మనుషులు విరుగుతున్నాయి

మనుషులు దూర మవుతున్నారు

ప్రేమను ద్వేషం గా మార్చు తుంది

కలహాలకు కారణం అవుతుంది

ముందు ముసి ముసి నవ్వులు

వెనుక మసి చేసే మాటలు.

06/10/20, 11:30 am - +91 99639 15004: మల్లినాథ సూరి కళాపీఠం yp

సప్తవర్ణాల సింగిడి 

అంశము. గోడలకు చెవులుంటే 

నిర్వహణ. సంధ్య రెడ్డి గారు. 

రచన. ఆవలకొండ అన్నపూర్ణ. 

ఊరు శ్రీకాళహస్తి, చిత్తూరు 


కొత్త కోడలు కొడుకు తో ఏమి మాట్లాడి తన వశం చేసుకొంటుందో అని ఆరాటపడి అత్తగారు తన చెవులను గోడకు వేలాడదీస్తుంది. 


సత్యభామ చెలికత్తె రుక్మిణి ఇంటిగోడకు చెవులు పెట్టి, పారిజాతాపహరణానికి దారితీసి, శ్రీ కృష్ణుడు అంతటివానిని చిక్కుల పడవేసింది. 


జైలు గోడలకే చెవులుంటే ఎందరి అమాయకుల జీవిత కధలు విని కన్నీరు కార్చేదో కదా. 


వృద్ధాశ్రమాలు గోడలకే చెవులుంటే అలసి సొలసి పోయిన పండు దేహాల వ్యధలు విని సొమ్మసిల్లి పోయేవో. 



వసతి గృహాల గది గోడలకు చెవులుంటే ఎన్ని పసి హృదయాలు వసి వాడిపోతున్నాయో, ఎన్ని కర్కశ దేహాలకు బలి అవుతున్నాయో విని కంటికి మింటికి ఏడ్చేవి. 


ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అంటారు. అదినిజమేనావిన్నచేవి చెప్పినమాటలు నోరు చెప్పగలిగిననాడు దేనినైనా బాగుచేయగలం.

06/10/20, 11:44 am - +91 96185 97139: పల్లవి 

గోడకు చెవులుంటాయి

అవి మన మాటలు వింటాయి

పరుగు పరుగున పది మందికి

చేరు స్థాయి "గోడ"

1.చ

మన లోనే కోతలు తెస్తాయి.

మన మను కొన్నది ఇతరులు

చేస్తారు.

వారి గొప్పను చాటు కొంటారు

మన మంచిని "అవహేళ"చేస్తారు "గోడ"

 2.చ

  గోడ చెవుల మాటల చేత

 రాజ్యల లో కలతలు" రేగి

నాయి" తారు మారు అయి

నాయి దీనికి "తార్కణం"

శ్రీ రామాయణ ఘట్టము.గో"

3 చ

నాడు "మంధర" సృష్టించిన 

చెలిమ "జలపాత మైనాది"

శ్రీరామ చంద్రుడు "సీత"

లక్మణ సమేతంగా "అడవు"

వెంట తిరిగినారు అది "త్రేతాయుగం"నాటిమాట"గో"

3.చ

 ఇది కలియుగం 

 గోడ చెవులు మాటలతో

మంటలు రేపే యుగం

గోరంతలు కొండతగ"

జేసేయుగం ప్రక్కల

వారి వినేనైజం" గో"

4.చ

మంచి మాటలు వినండి

ఇతరుల గోడ చెవులమా

టలు వినకండి

ఇతరులు కొంపలు"గూల్చకండి"

5.చ

మంచి పనులకు "ఆదిగా"

పిలవండి "ప్రత్యక్షంగా"

మాట్లాడండి.

మన వారికి "మనగ్రామానికి"

మన రాష్ట్రానికి మన దేశానికి

ఉపయోగించు మాటలు చెప్పండి"గో"

06/10/20, 11:45 am - +91 96185 97139: మల్లినాథ సూరి కళాపీఠము 

ఏడుపాయల సప్త వర్ణాల సింగిడి 

అంశం :గోడకు చెవులుంటే"

నిర్వహణ :దృశ్య కవి చక్రవర్తి 

మరియు సంధ్యా రెడ్డి గారు 

గేయ ప్రక్రియ : గోడకు చెవులుంటాయి.

జోశ్యుల ప్రభాశాస్ర్తీ మైసూరు.

రచన డి.విజయకుమార్ శర్మ 

కొమురం భీం. ఆసిఫాబాద్ "

06/10/20, 12:01 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ  శ్రీమతి సంధ్యారెడ్డి గారు

అంశం   గోడకు చెవులుంటె

శీర్షిక.   గూడాచారులు

పేరు  పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు  జిల్లా కరీంనగర్

తేది 06/10/2020 మంగళవారం


రహస్యపు సమాచారమేదైనా ఎరిగినచో

గూఢాచారులే కదా రాజునకు చేర్చేది

పలుకరింపు మాటలతో విషయ సేకరణ చేసేది

గోడచేవులు గల గూఢాచారులే


సీతమ్మను అడవులకు పంపినది

శ్రీ కృష్ణతులాభారం జరిగినది

కంసుని మృత్యువు రేపల్లెలో కలడని తెలిసినది

గోడచెవులు గల గూడాచారుల వల్లనే


కలింగ యుద్దానంతరం

గూడాచారి వ్వవస్థను పటిష్టం చేసి

అంఖండ భారతావనిని ఏలిన

అశోక చక్రవర్తి చరిత్రలో నిలిచే


శాలివాహనుడే గాని రుద్రమదేవియే గాని

ప్రజల కష్టసుఖాల నెరిగి పాలించిరి

యుగాంతం వరకు భారత చరిత్రలో నిలిచిరి

పటిష్టమైన గూడాచారి వ్వవస్థ వల్లనే



హామి పత్రం

ఈ రచన నా సొంత రచన

మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని సవినయంగా మనవి చేసుకుంటున్నాను

🙏🙏🙏🙏

06/10/20, 12:29 pm - +91 91779 95195: మల్లినాధా సూరి కళాపీఠం y p

సప్త ప్రక్రియల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి

గారి నేతృత్వo

అంశం:గోడలకు చెవులు

శీర్షిక: చాటు మాటలు

నిర్వహణ:సంధ్య రెడ్డి

పేరు:రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

*********************

గోడలకు చెవులుంటే

గొడవలకు రహదారి సుగమం......

మనుషుల మధ్య సంబంధాలను,ప్రేమను 

విడదీ స్తుంది....

రామాయణ మహాభారత

కాలంలో .......

మంథర,కైకేయి,శకుని వీళ్ళందరికీ 

గోడకు చెవులు  వేలాడే.......


అత్త కోడళ్ళ మధ్యన కయ్యాలు

తోడికోడళ్ళు మధ్యన గొడవలు

భార్య భర్తల మధ్య నపోట్లా ట..

వీటికి కారణం గోడకు చెవులు


దేవలోకంలో నారదుడు

నారాయణ నారాయణ

అని అంటూనే దేవుళ్ళ మధ్యన

గొడవలు రేపే...........


ఈ కలికాలంలో మరీను

నోట్లో నువ్వుల గింజ కూడా నానదు మనుషులకు.

విషయం చెరవేసెంత వరకు

నిద్ర పట్టదు............


గొడవల వల్ల రాజ్యాలు 

రక్తసిక్త మయ్యాయి

కొంపలు కూలి పోయాయి

వ్యవస్థ అస్త వ్యస్త మయింది.....


పనిలేని పంకజం లాంటి వారు ఉన్నన్ని రోజులు 

ఈ గొడవలకు అంతం ఉండదు............


పుక్కింటి పురాణాలు

కాకమ్మ కథలు

కల్పిత కథలు ఇవిన్నయు

నూరి పోసినన్నాల్లు

గోడకు చెవులుంటాయి......

**********************

06/10/20, 12:31 pm - +1 (737) 205-9936: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

సప్త వర్ణ సింగిడి

*06/10/2020*

*అంశం:గోడకు చెవులుంటే*

నిర్వహణ:శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

*డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*


శీర్షిక.

------------------------------

*వినే గోడలూ ఉంటాయి*

-------------------------------


గోడల్లోకి చెవులు దూర్చేసి

ఏదో వినాలన్న ఆరాటం

పక్కింటి సోదే కావాలి

చూపులు ఎప్పుడూ ఎదుటివారివైపే!!


గోడకున్న చెవుల వల్లనే కదా

పారిజాత వృక్షం నేలకొచ్చింది!!


ఒక వేలు మనను చూపితే

మూడువేళ్ళు ఎదుటి వాళ్ళవైపే

ఆ ఇంగిత జ్ఞానం లేక

పక్కింట్లో విషయాలపై ఆసక్తి !!


చూసేవారికేమో ఉత్సాహం

వినేవారికి పరమానందం

కొంపలు కూలుతాయి

సంసారాలు ఛిద్రమౌతాయి!!


పక్కింటి మీద మోజు

చాడీలతో కాలక్షేపం

దుర్మార్గపు అలవాటు

చేయకు ఈ పొరబాటు!!


గోడకు  ఆనిస్తున్న వీనులు 

వీటికి దూరంగా ఉంటే మేలు!!

06/10/20, 12:37 pm - +91 6304 728 329: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి గారి సారథ్యంలో..

06/10/2020

అంశం: గోడకు చెవులుంటే

నిర్వహణ: శ్రీమతి సంధ్యా రెడ్డి గారు 

శీర్షిక; ఆనందాలు ఆవిరిచేయొద్దు


గోడకు చెవులుంటే

నోటికి కాళ్ళు వస్తయి

ఊహలకు రెక్కలొస్తయి

ఇంటిగుట్టు రట్టయి

రచ్చకట్ట నెలవవుతుంది

కుటుంబం వీధిన పడుతుంది

ఆలుమగలు అల్లరి పాలవుతరు

కాపాడవలసిన విలువలు

చిలువలు పలువలై ఊరేగుతయి

అలకలు చిలకలవలె వచ్చి

పిలకలు పట్టుకునే స్థాయికి చేరుతుంది

మనసులు మసకబారుతయి

బంధాలు బలహీనపడుతయి

కుటుంబవ్యవస్థ కుంటుబడుతుంది

అంతర్గత కుమ్ములాటలతో

సమాజం సమస్యల వలయమవుతుంది

గోడలకు చెవులుంటే

ముఖాలపై నవ్వులు మాయమవుతయి

వివాదాలతో,విచారం తిష్ఠవేస్తుంది

ద్వేషాగ్ని ప్రజ్వరిల్లుతుంది.

అందుకే.....

గోడకు చెవులు మొలవనివ్వద్దు!

ఆనందాలు ఆవిరి కానీయొద్దు

అనుబంధాలు చెదరనివ్వద్దు!!



       మల్లెఖేడి రామోజీ 

       అచ్చంపేట 

       6304728329

06/10/20, 12:51 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- గోడకుచెవులుంటే

నిర్వాహకులు:-  శ్రీమతి సంధ్యారెడ్డిగారు పేరు:-పండ్రువాడసింగరాజు

 శర్మ

తేదీ :-06/10/20 మంగళ వారం

శీర్షిక:- చాటుమాటురహస్య వ్యవహారాలు

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- వచన కవిత

ఫోన్ నెంబర్9177833212

6305309093

**************************************************


గుట్టుగా చేసేది రహస్యంగా వ్యవహరించ బడేవి మనసులోని మాటలు రట్టు చేసే గుట్టు చేస్తేనే గోడకు చెవులుంటాయి



ఊహలకందనిది హృదయం తరంగంలో ఉన్న విషయ అవగాహన  మనము  తెలిపే విషయాలు మనకన్నా ముందు తెలిపితే ఆ విషయము  గోడకు చెవులు ఉన్నట్లే



గోడకు చెవులేకాదు కళ్ళు ముక్కు నోరు ఉంటే

ప్రపంచం తారుమారై తలకిందులు అవుతుంది జీవితం



మేలిముసుగులో  ఉంటూ  చాటుమాటు వ్యవహారాలు చక్కబెట్టి గుట్టు  రట్టు

చేసి   శ్రీరంగ నీతులు చెప్పే

పెత్తందారుల వెనక ఉండే  గోడమీద పిల్లిలా గోడకు చెవులు కదా

  ***********************************************

06/10/20, 12:55 pm - +91 98497 88108: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి సారథ్యంలో

నిర్వహణ:శ్రీమతి సంధ్యారెడ్డి గారు

అంశం:గోడలకు చెవులుంటే

శీర్షిక:రహస్య గుడాచారులు

రచన:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం


గోడలకు చెవులుంటే

గుస గుసలకు తావేముంది

నిజాలకు చోటేముంది

గుట్టు రట్టవును

రచ్చ రచ్చగును

ఊహాగానాలు విశ్వ మంతా వ్యాపించు

వినీలాకాశంలో స్వైర్య విహారం చేయు

మనుషుల మధ్య రగడ పుట్టించు

మది యందు గుబులు రెట్టించు

గోడకు చెవులుంటే..

అనేకానేక అనర్ధాలకు

అపోహలకు అడ్డా అగును

అచెంచల విశ్వాసం వీడిపోవును

ఉన్నది కాదు

గోడ ఊసులే నిజమగును

కన్నది కాక అన్నదే వాస్తవమగును

గుంభనంగా ఉండే బంధాలు బజారుకెక్కు

హృదయాలు అలజడులతో ఊగిసలాడు

ఆధారభిమానాలు ఆవిరైపోవు

సత్సంబంధాలు పెచ్చులుడిపోవు

అందరి మదిలో,ఎదలో

చులకన భావం ఏర్పడును


గోడలకు చెవులుంటే..

ఊహాగానాలకు ఉరట

పుకార్లకు  షికార్లు చేరు

విశ్లేషణలకు విశ్రాంతి

సమీక్షలకు శాశ్వత ప్రశాంతి

సత్య అసత్యాలు నిజానిర్ధారణ దేవుడెరుగు

విశ్వ మంతా కంటి నిండా తిండి,నిద్రలేక

చాపకింద నీరులా

ఉప్పెనలా ముంచెత్తును


*******************

06/10/20, 1:00 pm - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP

నిర్వహణ:సంధ్యా రెడ్డి. 

అంశము:గోడలకే చెవులంటే

శీర్షిక: అతుక్కుపోయే బల్లులు. 

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292


నిత్య అదే ఆలోచన

ఏ ఇంటిలో ఏమి జరిగిపోతుందోననే ఆలోచన

నిద్రాహారాలు అవసరం లేదు. 

గోడలకు చెవులు

లుంటే అతుక్కుపోయే బల్లులు వారు. 

గుసగుసలే వారి జీవనాధారము. 

కాపురములో చిచ్చు పెట్టు శునకానందము.

తామ వరకు వస్తే గాని అనుభవం కాని

అత్మానందము. 

పంచభూతాల నుండి రక్షణ నిచ్చే గోడకు

చెవులయ్యారు

జగతిని విషపూరితం

చేస్తారు. 

ఎదుట వారి బాధలో

ఆనందము

వెతుకుతారు.

చివరికి తమ జీవితం శూన్యముగా

మార్చుకుంటారు. 

చరిత్రలో గోడమీద పిల్లులై మిగులుతారు.

06/10/20, 1:19 pm - +91 94412 07947: 9441207947

మల్లినాథసూరి కళా పీఠం YP 

మంగళవారం 06.10.2020

అంశం.గోడకు చెవులుంటే

నిర్వహణ. శ్రీమతి సంధ్యా రెడ్డి గారు 

=====================

సీ.    1

గొప్యమైనది ఏది?గోడల నునుపులు

దాపరికము ఏమి?దాచుటేమి?

గోడకే చెవియున్న గొడవయింకేమిటి

కొంపగూలునె యట్టి గోప్యములును

అడుగునడుగువేయ తడబాటు యెందుకు 

ఉన్నదేదోజెప్పి యుద్ధరించు

వెనుక చాటునుమాట వెనువెంట పనులన్ని

గుసగుస లేకుండ కూర్చరాద?

తే.గీ.   

తాళ చెవియుండు గోడకు మేళములకు

తాళమేదీయ కనబడు తళుకులెన్నొ

గోడ చెవులును వినియోగ కూర్మిజేయ

కట్టు కథలును యెన్నెన్నొ పట్ట వచ్చు

ఆ.వె.    2

తాటిచెట్టుకింద ద్రవమును త్రాగిన

పాలు ననరు కల్లు ఫక్కు మంద్రు

గోడ చెవినిలాగి గోప్యమ్ము బ్రదికించు 

నీదు జీవనమ్ము సేదతీరు

ఆ.వె.    3

బొంకు నేర్చియుండి బొంగరం కాబోకు

బ్రదుకు నేర్చియుండు పరవశించు

నమ్మకమ్ము యెపుడు నగుబాటు కారాదు

గోడ చెవులు వింటె గుల్లయగునె

              @@@@@@@@@

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

06/10/20, 1:43 pm - +91 95502 58262: మల్లి నాధసూరి కళాపీఠం yp

6-10-2020

అంశం:గోడకు చెవులుంటే

నిర్వహణ: సంధ్యారెడ్డి

 రచన:శైలజ రాంపల్లి

 గోడకు చెవులుంటాయ!

.................................

.

గోడకు చెవులుంటే కుటుంబాలు 

కూలిపోవు !

యుద్ధాలు జరగవు

గొడకే చెవులుంటే

పొంచివున్న  ప్రమాదాలు ముందే

తెలియవా!

గొడకే చెవులుంటే చాడీలు వినుడు ఎందుకు  !

గొడకే చెవులుంటే రహస్యాలు దాగుతాయా !

గొడకే చెవులుంటే గూఢచారులెందుకు !

గొడకు చెవులుంటాయన్న 

బ్రమనే ఇన్ని భయాలను 

రేకెత్తిస్తుంటే !

నిజంగా గోడకు చెవులుంటే రణరంగమే కదా !

కుటుంబ కలహాలు తారాస్థాయికి

చేరవా !

రహస్య మన్నదే లేక శత్రు భయం పెరుగదా ! 

ఉహకే ఇంత శక్తి ఉంటే నిజానికి

ఇంకెంత శక్తి ఉంటుంది!

గోడకు చెవులంటయనే ఊహ చాలు మనం జాగ్రర్తగా ఉండడానికి !

06/10/20, 2:03 pm - +91 72072 89424: శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి సారథ్యంలో

నిర్వహణ:శ్రీమతి సంధ్యారెడ్డి గారు

అంశం:గోడలకు చెవులుంటే

శీర్షిక: ష్!....గుసగుస...

రచన:అవేరా 

ఊరు:హైదరాబాద్ 

****

గోడలకు చెవులుంటే యమ గుసగుసలాడుకుంటాయి.

నిజాలన్నీ నగ్నంగా నిలుస్తాయి.

అబద్దాలు మనుగడని వెతుక్కుంటాయి.

ఆరడుగుల గోతిలో దాక్కుంటాయి 

అవినీతి బాగోతాలు చూసి బావురుమంటాయి.

స్మార్ట్ ఫోన్ అసంబద్ద టిక్కు టక్కులాయాసా

న్ని చూసి యిటుకికిలించి మరీ నవ్వుకుంటాయి.


నాలుగు గోడల మాటలు నాలుగు స్తంభాలాటలాడతాయి.

పడగ్గదిలో కూడా పరువాల పందిరిఫై మౌన ముద్రలెయ్యాలి

సరసాల భాషకు సరికొత్త కోడ్ భాష వాడుకోవాలి.

  

భూషణం వాగ్భూషణం మంత్రాన్ని జిహ్వకు వెళ్లాడదీయాలి.

బుల్లితెర బాగోతాన్ని చూసి కొప్పున వేలెట్టి గోక్కుంటాయి.


వార్తల్లోని హింసను విని వ్యాకులపడతాయి 

నట్టింట అత్యాచారాన్ని అడ్డుకోలేక బావురుమంటాయి 

గృహ హింస ఆక్రందనలను  వినలేక చెవులు మూసుకుంటాయి.


గాసిప్పుల అవసరం లేని సిప్పుల దుమారాలు  లేస్తుంటాయి. 

రహస్యమంతనాలన్నీ గదుల గోడలు దాటి 

ఎడారి ఇసుకలో జరుగుతాయేమో !


అక్కడమాత్రం అధికంగా నిశ్శబ్దం తాండవిస్తుంటుంది 

చెవులున్నా చెరగని ఆధ్యాత్మికత ఆవహిస్తుంది 

మాదే కదా మరి అదృష్టం 

అని గుండె గుద్దుకుంటాయి పూజగది గోడలు.

****అవేరా ****

06/10/20, 2:04 pm - P Gireesh: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి సారథ్యంలో

నిర్వహణ:శ్రీమతి సంధ్యారెడ్డి గారు

అంశం:గోడలకు చెవులుంటే

శీర్షిక: వాస్తవం తెలుసుకో

రచన: పొట్నూరు గిరీష్

ఊరు: రావులవలస, శ్రీకాకుళం


కనబడని గాలి ఎలా మన మనుగడకు కారణమన్నది ఎంత వాస్తవమో, కనబడని కరోనా జీవి ఎలా మన జగతి బతుకు అయోమయానికి కారణమన్నది ఎంత నిజమో, గోడకు కనబడని చెవులుంటాయి అవి కూడా వింటాయి అన్నది అంతే నిజం.


అందుకే


భార్యాభర్తల ముచ్చట్లు పడక గదికే పరిమితమవ్వాలి.


అత్తాకోడళ్ళ కీచులాటలు వంటగదికే పరిమితమవ్వాలి.


నీ యింట పనిమనిషికైనా నీ యింటి గుట్టు తెలియనివ్వకు.


ఈ గదిలోని మాటలు నాల్గు గోడలు దాటి పక్క గదికైనా వినబడకూడదు.


బంధాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. 


నీకు ఏదైనా మాట వినబడిందా అది మూడోవ్యక్తికి ఊదేముందు వాస్తవమేంటో తెలుసుకొని మసులుకో.


ఈరోజుల్లో అయితే గోడకు చెవులు పెరిగాయి. పక్కింట్లో దగ్గు వినబడితే చాలు. పక్కింటోడుకి కరోనా సోకిందని ఉన్నదీ లేనిదీ వాస్తవాలు తెలుసుకోకుండా ఊరంతా పాకడానికి కారణమౌతావు.

06/10/20, 2:05 pm - +91 94404 74143: మల్లినాధసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

కవిత సంఖ్య:15

అంశము -గోడలకు చెవులుంటాయి

రచన  చిల్క అరుంధతి

తేదీ -06-10-2020

నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు



మది  వినిపించే భావాలకు

పులకించిన మన హృదయం

వీనులకు విందైన రీతిలో

పసందుగా వినిపించును


ఎదుటి వారి కళ్ళల్లో 

ఆనందం కనిపించును 

మన మనసు పరవశించి ఊసుబోని కబుర్లన్నీ చేర్చు


తోటి వారి బాధ మనకు

తీరని దాహార్తి రేపు

తొలకరి కి మేఘం వర్షించి నట్లు

మనసు తీపి కబుర్లు చెప్పు


మన మనసుల ఊసులన్నీ 

ఏకరువు పెట్టగానే

గోడకున్న చెవులన్ని

మనసు విప్పి మాట వినును


మన ఇతిహాస పురాణాల 

కధలన్నీ వింటుంటే 

గోడకి కాదు చెవులే కాదు 

కళ్ళు కూడా ఉన్నాయనిపిస్తుంది


మంచి కన్నా చెడు వార్తలు 

మైలు దాటి  మోసుకెళ్ళి

మన పరుగులు తీయును

గోడకున్న చెవులే కదా.


సమాజంలో అవినీతి 

పాటించే ప్రభుద్రోహులు

నిల్వ లేరు కలకాలం 

నిండు జగతి గెల్వలేరు.


నిజం ఎంత నిష్టురమైనా

నిలకడలో  తెలుస్తుంది

కాల గమన చక్రంలో

గోడలే సాక్షి భూతాలు.

06/10/20, 2:08 pm - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 043, ది: 06.10.2020. మంగళవారం.

అంశం: గోడకు చెవులుంటేను

శీర్షిక: గోప్యముగ మాట్లాడు

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీమతి సంధ్యారెడ్డి గార్లు.

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: ఆధునిక పద్యం 


సీసమాలిక

"""""""""""""""

భువనానపుట్టిన జీవరాశులకెల్ల

     మాట్లాడెశక్తుంది మనిషికేను

మదిలోనిభావాలు కదిలించిపలుకుతూ

     వినిపించెజనులెల్ల విపులముగను

గుప్తవిషయములు గుట్టుగానుంచాలి

     వెల్లడించవలదు నెల్లవేళ

నోరుజారినవేళ నూరుకోరెవ్వరు

     మాటలాడవలెను మంచిగాను

పరులయంశాలను పంచుకోకెన్నడు

     పరనిందజేయకు పాపమగును

అమ్మలక్కలుజేరి యందరిగోలలు

     చెవిలోనగొణుకుతూ చెప్పుకొనెను

గుసగుసలాడుతూ గుట్టుగామాటాడి

     నొసలతోగేలించె నుర్విజనులు

గోడకుచెవులుండు గోప్యంగమాట్లాడు

     బయటకెళ్ళినమాట భయముపెంచు


తే.గీ.

పక్కవారిగొడవలను పంచుకొనుచు

నిందచేస్తేను యెన్నడు నిలువలేవు

మానవత్వముతోనుంటె మనుగడుండు

తెలుసుకొని నడుచుకొనాలి తెలివితోడ


👆ఈ పద్యకవిత నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

06/10/20, 2:33 pm - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: గోడలకు చెవులుంటే

ప్రక్రియ: వచన కవిత

నిర్వహణ:  శ్రీమతి. సంధ్యా రెడ్డి గారు

రచన: పేరం సంధ్యారాణి, నిజామాబాద్

తేదీ: 06 -10 - 2020


గోడలకు చెవులుంటే

చాఢీలకు మాటలు రావు

వెన్నుపోటు మాటలు వెనుక ఉండవు

అబద్ధాలు అడగంటిపోవు

గుస గుస లకు ఊసేలేదు

నక్కి నక్కి వినే పని లేదు

మాటలకు అడ్డుకట్టబడును

నాలుక హద్దుల్లో ఉండు

విచక్షణ ఎరిగి నడుచుకొనును

చాటు మాటు వ్యవహారాల

చోటు మారిపోగా

దోపిడి దొంగతనాల ప్రసక్తే లేదు

వెనుక ముందు ఒకే మాట ఉండు

మాటకున్న శక్తి పెరిగి

విలువలు బంధాలు పెరుగు

కల్లాకపటం లేని

వెన్నెల వంటి మనసగు

గోడకు చెవులుంటే

గొడవలకు కాలం చెల్లు

06/10/20, 2:35 pm - +91 98499 29226: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల

ప్రక్రియ.  కవనసకినం 

అంశం  గోడకు చెవులుంటే 

శీర్షిక   గుట్టు గట్టు మీద 

రచన.        దార. స్నేహలత

నిర్వహణ   శ్రీమతి సంధ్యా రెడ్డి  గారు 

తేదీ.          06.10.2020


గోడకు చెవులుంటే  నోళ్లు చాటలగును 

రహస్యమగ  నున్న ముచ్చట చాటలోని 

బియ్యము  గాలికి విసిరినట్లగును 

గుట్టు గట్టు మీదకు  చేరును 


ఊరు వాడా కోడై కూసి కూసి 

సత్యాసత్యాలు యెరుగకనే 

ఎంగిలి విస్తరాకు మల్లె  ఎగబడుదురు  

అంచలంచెలుగా తూలనాడెదరు 


నాలుగు గోడల మధ్యటి  గోప్యము 

నలుగురికి తెలిసేట్లు రట్టు చేసేను 

అసూయగ చెవులున్న గోడలు 

అడుగడుగున వెంబడించును 


ఒంటరిగా నాలుగు గోడల మధ్య

ఆర్తనాదాల ఆడపిల్లలెందరో 

మౌన రోదనల  బాధితులెందరో 

మృత్యువు చేరువనెందరో 


చెవులున్నా ఆగోడలు ఆగ్రహించవు 

ఆక్రోశించినా అధికారం అడ్డుపడును 

అమానుషాన్ని హరిస్తుంది ధనదాహం 

సత్యమను ఆవేదనను కప్పిపెట్టును 


అంకుశమైన  ఆశ్రువులు గోడదాటినా 

అప్రజాస్వామిక రాజ్యాన ఆవిరవుతున్నవిలే 

నిర్దాక్షిణ్యంగా అతివ వెతలు ఎండమావులోలే 

 శంఖారావపు గోడలు ధర్మదేవత కళ్ళు తెరిపించునెపుడో

06/10/20, 2:45 pm - +91 80197 36254: మళ్లినాథ్ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగడి

6/10/2020

అంశం :గోడలకే చెవులుంటే

నిర్వాహణ : దృశ్య కవి చక్రవర్తి,మరియు సంధ్యారెడ్డి గారు

పేరు :క. శైలజా శ్రీనివాస్ 

ఊరు :విజయవాడ 

       గోడ ---గందరగోళం 

     -----------------

గోడకు చెవులుంటే కొంత మందికి 

మహాసరదా....

"గోడకు ఉండేను చెవులు 

వారే వారే మేధావులు 

కనిపించని పిల్లులు 

మాటలతో కుట్టే నల్లులు "

 ఏమి వినకపొతే 

తిన్నది అరగదు..... 

కొంతమందికి తిండే ఎక్కదు 

ఏందో ఈ రచ్చ అర్ధం కాని వైనం 

అపార్ధాల తోటి పయనం 

మనకెందుకులే అనుకుంటే 

వుండదు గోల..... 

అలా అనుకుంటే కాలక్షేపాలెలా... 

ఇంటింటికో రామాయణం 

ప్రతి ఇంటికో ప్రమాణం /ప్రయాణం 

తెచ్చేరు విన్నాక తిప్పలు 

ఆడవారినోట్లో నువ్వు గింజ దాగదు 

అనే ధర్మరాజు మాటలను తూచా 

తప్పకుండా గోడ పక్క నుంచి వింటారు 

వీళ్ళ అసాధ్యం కూల కాకి లాగా 

కబుర్లు చేరవేస్తారు l

వుండదు పనీపాటా, తమదాకా వస్తే 

ఏముందమ్మా అందరింట్లోనూ వున్నదే 

కొత్తగా ఏమి వుంటుంది అని బుగ్గలు 

నొక్కుకునేరు.. 

రామాయణం లో మందరలు వున్నంత కాలం 

కొన్ని కొన్ని లోక కల్యాణాలు జరుగుతాయి 

కాని కొంపలు కూర్చే పని పెట్టుకున్న వారు 

ఉన్నంత కాలం కొంపలు కూలతాయి.. 

కారణ జన్మలు వారైతే కల్మష జనులు వీరు.. 

తస్మాత్ జాగ్రత్త సుమా వీరితో... 

ఎవరేమి చెప్పిన నమ్మకం మన వారిపైన 

పోకొట్టుకోరాదు... మంచి చెడుల విశ్లేషణ 

జరగాలి... అది ఏ విషయంలో నైనా... 

⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️

శైలజా శ్రీనివాస్ ✍️

06/10/20, 2:53 pm - +91 94934 35649: మల్లి నాధ సూరి కళాపీఠం yp 

సప్త వర్ణాల సింగిడి 

తే 6.10.2020.

అంశం. దృశ్య కవిత.. 

నిర్వహణ. శ్రీమతి సంధ్యా రెడ్డి గారు. 


పేరు. సి.హెచ్. వెంకట లక్ష్మి 

విజయనగరం.. 

        💐💐💐

గోడకు చెవులుంటే... 


అర్థం అవుతోందా ఏమవుతుందో 

బొమ్మ దద్దరిల్లుతుంది బాబాయ్.. 


ఆడ మగ తేడా లేదు గోడకు 

చెవులు ఆన్చి పొరుగు 

సంగతులు ఊరంతా 

చేర వేయటం కొందరకో వెర్రి . 

మన గుట్టు కూడా యిలానే 

గది దాటి పొక్కుతుంది కదా 

యితరుల గుట్టు రట్టుచేస్తూ

 చెడు కర్మ మోస్తమని తెలియద


మంచి జరిగితే పర్వాలేదు 

ఏదైనా హానీ జరిగి జీవితంలో 

వెలుగులు దూరం అయితే.. 

ఎవరిపాపం వారిదని కొందరు 

మాత్రమే ఊరుకోవచ్చు కాని 

కొంచం అటు యిటు అంతే 


ఆట ఆగేదె ,మోత మొగేదే..

పాప పుణ్యాల లెక్క తప్పదు 

గుట్టు రట్టవక తప్పదు

గాయ పడిన గుండెల దెబ్బకి 

బొమ్మ దద్దరిల్లక తప్పదు... 

.

06/10/20, 3:04 pm - +91 84668 50674: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

అంశం : గోడకు చెవులుంటే (దృశ్య కవిత)

రచన : ఎడ్ల లక్ష్మి

శీర్షిక : గాలి కంటే వేగంగా విస్తరిస్తుందా వాక్కు

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి

తేది : 6.10.2020

""""""""""""""""""""""""""""""""""""""""""""""


మనిషి నోటినుండి వెలువడే మాట

మదిలో మెదిలే కోటి వరాల మూట

మాట మంచిదైతే చూట్టూ చుట్టాలే

కరుకు తనముతో కొరివి  మంటలే

నాలుగు గోడల నడుమ ఎప్పుడు కూడ

నోటిలోని నాలుక నానదు ఆడదు

ఎదుట ఎవరో ఒకరు ఉంటేనే గాని

కలిసి పలుకును ఆ రెండు పెదవులు

అందుకే అంటారు ఒక మాట ఏమని?

పెదవి దాటిన మాట ఆగకుండా

పృథ్వి దాటి పోతుందని

అంటే గోడకు చెవులున్నట్టా లేనట్టా

విలువైన వాక్కు పారేసుకుంటే

దాన్ని పట్టుకుని పంచిపెట్టుటకు 

ఎందరెందరో ఎక్కడెక్కడికో

కళ్ళు చూడక ముందే 

చెవులు వినక ముందే

రహస్యమంతా రచ్చ రచ్చ

దానికి ఒక చిన్న సామెత పెద్దల నోట

అరవ నేర్చిన నోరు ఆగదని

తిరుగ నేర్చిన కాళ్ళు ఆగవని

ఈ రెండు జోడెడ్ల వోలె ఉంటే

వాటిని ఆపేది ఎవరు ఇక అప్పుడు

గోడకు చెవులే కాదు కాళ్ళు కూడా

గాలి కంటే వేగంగా విస్తరిస్తోంది ఆ మాట


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

06/10/20, 3:04 pm - Madugula Narayana Murthy: This message was deleted

06/10/20, 3:06 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

అంశం: గోడలకు చెవులుంటాయి

శీర్షిక: జీవితం 

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 06.10.2020 


బంగారు పళ్లానికైనా గోడదాపు అవసరం 

గోడలేకపోతే ఇల్లెక్కడ ఉంటుంది 

ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్లవుతుంది 

రోగం బయట పెట్టాలి సంసారం గుట్టుగా చేయాలి 

నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు రచ్చ చేయరాదు 

గోడమీద పిల్లివలె జీవించరాదు 

ఇంట్లో పులి వీధిలో పిల్లిలా ఉండరాదు 

పనీ పాటా లేని అమ్మలక్కలకు పక్కింటి కలహాలే విందు భోజనం 

అందుకే గోడలకు చెవులుంటాయి 

వీధిలో విషయాలు గొడవలు పరమానందం 

ఇద్దరి వ్యక్తుల కుమ్ములాట కన్నులపండుగ 

పక్కవాడికి కష్టం కలిగితే బ్రహ్మానందమే 

నేటి సమాజంలో స్వార్ధం పెరిగి 

అసూయా ద్వేషాలు పెచ్చుమీరి 

పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు 

ఇంట్లో విషయాలు గట్టిగా మాట్లాడరాదు 

గుట్టుగా ఉంచే సంసారాన్ని చెప్పుడు మాటలతో రచ్చకీడ్చుకుంటున్నారు 

కైక మాదిరి 

గోడకు ఆవల ఉన్నవారు మరి మందరలే 

సంస్కారవంతమైన మాట మనిషికి ఆభరణం 

మంచి వాక్కు సరస్వతీ కృప వల్ల కలుగును 

మంచిమాటలు కవి కలం నుండి జాలువారును 

చెడు మాటలు పలికావో కకావికలం జీవనం 

గోడే కదా మన ఇష్టం అనుకుంటే పతనం 

కదలని వస్తువులు కూడా మనసుంటుందని గ్రహించావో జీవితం సుమనోహరం

06/10/20, 3:19 pm - Madugula Narayana Murthy: *శ్రీ గురుభ్యో నమః*

 *అందరికి నమస్కారం*🌹

              *మల్లినాధసూరికళాపీఠం*

       *సప్తవర్ణాల సింగిడి*

           *ఏడు పాయల*

      🌸 *మంగళ వారం*🌸


               *06.10.2020*

              *దృశ్యకవిత*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  *గోడకు చెవులుంటే*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా*



                *నిర్వహణ*

                *శ్రీమతిసంధ్యారెడ్డి*


 *అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో*🙏🙏


   *మల్లినాథసూరి కళాపీఠం*

            *ఏడుపాయల*


1. *కందము*

కూడనియాలోచనలకు

మూడినచెడుకర్మఫలముమోసపు రవముల్

తోడగు చాడీ గుణములు

గోడకు చెవులుండి వినును గుసగుసలైనన్!!

2. *కందము*

చేడియ లింటికి చేటయి

చీడలుగా మారి చెట్టు చేమల క్షయమున్

పాడిని నాశము చేయుట

గోడకుచెవులుండుటనగ కొంపలు మునుగున్!!

3. *కందము*

మోడయి గొడ్రా ల్లెల్లను

తోడుగతనయింటిదొంగ దోపిడి కొరకున్

గోడకు చెవులై గుట్టును

కోడైకూసినవిధమునగోతులుదీయున్!!

4. *కందము*

గోడకు చెవులుగ

సేవకు

వాడుకలో కలిసి యుండు పనిపిల్లలుగా

పాడగ కష్టసుఖమ్ముల

వాడలలోచెప్పిచెప్పి పాడగుపరువున్!!


5. *కందము*

కోడెలు దూడలు ప్రణయము

లాడినప్రతివివరముగనునాకులుకొమ్మల్

తేడావచ్చినకాకులు

కూడినపలుకాబోడబోవు గోడకు చెవులై!!



🌸🖊️✒️🤝🌹✒️💐

06/10/20, 3:27 pm - Trivikrama Sharma: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ:: దృశ్య కవిత

నిర్వహణ:  శ్రీమతి సంధ్యారెడ్డి గారు

పేరు:  త్రివిక్రమ శర్మ

ఊరు:.  సిద్దిపేట

శీర్షిక:. మనిషి కన్నా గోడలే నయం

**********************

నాలుగు గోడలు నాలుగు దిక్కుల నుండి మనిషిని ఒంటరిని చేస్తాయి

నలుగురు మనుషులు మనిషికి సభ్యత నేర్పిస్తారు

ప్రతి మనిషికి ప్రపంచంతో సంబంధంఏర్పరచేవిచెవులే

ఆ చెవులతో విన్న విజ్ఞానం పదిమందికిపంచేదికొందరైతే

ఆ చెవులను మార్పిడి యంత్రాలుగా మార్చి

ఎదుటివారి మనసులను విషపూరితం చేసేవారు మరి కొందరు

మనిషి నవరస నటనా సార్వభౌముడు అందుకే తాను విన్నవి కళాత్మకంగా జోడించికయ్యాలుపుట్టిస్తాడు

గోడలకు చెవులుంటాయి  అనడంలోకొత్తేమీకాదు

మనిషిలోని స్వార్థం

మనిషిలోని దుర్బుద్ధి చెలరేగినప్పుడల్లా గోడకు చెవులు పుట్టుకొస్తూనే ఉంటాయి

ఎదుటివారికొట్లాటలనుండి ఆ చెవులు శ్రవణానందాన్ని ఆస్వాదిస్తాయి

ఇంగితం మరిచిన ప్రతి మనిషి చెవులు గోడకు చెవి లాంటివే కదా

నిజంగా గోడకుచెవులుoడి భయంకరమైన నిజాలను అవి బయట పెడుతూ ఉంటే ఎన్నికలహాలో ఎన్ని దారుణాలోమరిన్నివిప్లవాలో

గోడకు చెవులుంటే ప్రతి ఇల్లు రణరంగమే

ప్రతి వీధి సమరాంగణమే

నమ్మకాలు నడిబజారులో వేలం వేయబడతాయి

కాపురాలు అంగడి సరుకులా బట్టబయల వుతాయి


అయినా ఒకటి మాత్రం నిజం

చెవులు ఉన్న మనిషి  సాటివారికి దుర్బుద్ధితో చేసే

 కీడు కన్నా గోడకు చెవులున్నా పెద్ద నష్టం జరగదేమో


_____________________

నా స్వీయ రచన

06/10/20, 3:30 pm - +91 80196 34764: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల 

అంశం  ..గోడకు చెవులుంటే      

నిర్వహణ   శ్రీమతి సంధ్యా రెడ్డి

మరింగంటి..పద్మావతి

భద్రాచలం


రహస్యాలు  పెదవి దాటిన

ధాన్యం తూరుపార

పట్టినట్లు చెల్లాచెదురుగా

పృథ్వి అంతాపాకి పోయి

ఇదిగో తోక అంటే 

అదిగో పులిలా

అబద్దాలను నిజం 

చేసేది గోడకు చెవులతోనే

ఊరంతా ఆనోటా, ఈనోటా

సత్యాసత్యాలు యెరుగక

కాకులు ఎంగిలి కోసం 

ఆరాటపడినట్లు కల్లని

నిజంగా తూలనాడుట

గోడకు చెవుల వలనే కదా

అసూయగ చెవులున్న 

వెన్నంటి వెంబడించును

అతివల మనోభావాలు

అర్దం చేసుకోని ఇరుగు

పొరుగు అమ్మలక్కలు

పక్కింటి విషయాలు

పనీపాటా  వదిలి

చెవులు కొరుక్కునేది

గోడలకు  చెవులు

నిక్కరించుట తోనే కద

పురాణాలలో కలహభోజుడు

సత్కార్యము లకు తోడ్పడితే 

నేటి కలి కాలంలో  గోడకు 

చెవులతో కుటుంబాల

మద్య చిచ్చులాటలతో

విడిపోయే బంధాలెన్నో

అనతికాలంలోనే నుండి

జరిగే దుష్ప్రభావాలు

వీటి తోనే కదా..🙏

06/10/20, 3:34 pm - S Laxmi Rajaiah: మల్లినాథసూరి కళాపీఠం YP 

మంగళవారం- దృశ్యకవిత.   6/10 

అంశము: గోడకు చెవులుంటాయి 

నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు 

                 పద్యములు 

తే: పరుల హితమును గోరెడి పలుకు 

లైన 

కుటిల మనసుతో కూడిన కుట్రలైన 

గోప్యమున నున్న మేలగు,కుఢ్యములకు 

చెవులవున్నట్లు మెలగుట శ్రేష్ఠమగును 


కొన్ని తెల్పిన మేలగు కొన్ని కొన్ని 

దాచియుంచిన శుభమగు ధరణి  

యందు 

సీత పై నింద మనసును చిదిమి వేసె 

శూర్పణఖ ప్రేమతో క్రుంగె దర్ప మణగి 


దుష్టదుర్యోధనుడు చేసె ద్రోహచింత 

పొక్కనీయక కట్టించె లక్క యిల్లు 

గోప్యమున నుంచి రన్నియు కుట్ర పన్ని 

అతిరహస్యము బయలగు టద్భు 

తంబు 


చేయబోయెడి మంచిని చెరచు వారు 

చుట్టు గుమిగూడి యుందురు గుట్టు 

దెలియ 

పెదవి దాటిన మాటలు పృథివి దాటు 

నేర్పు కావలె కార్యముల్ నిర్వ హింప  


పరుల చెవిబడకుండగా ప్రతిభ తోడ 

సల్పు ఘనకార్యముల కార్య సాధకుండు 

కంటబడకుండ చెవియొగ్గి గాంచు 

వారు 

చెరుపు చుందురు కాపురాల్  చెనటు

లగుచు 


            శ్రీరామోజు లక్ష్మీరాజయ్య 

            సిర్పూర్ కాగజ్ నగర్.

06/10/20, 3:35 pm - +91 73308 85931: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్త వర్ణముల సింగిడి

అమర కుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

తేది:7-10-2020 మంగళవారం

రచన:పిడపర్తి అనితాగిరి

నిర్వహణ శ్రీమతి సంద్యారెడ్డి గారు

అంశం:గోడకు చెవులుటే

శీర్షిక: గోడ మీద బల్లి

********************


గోడకు చెవులు ఉంటే

ఆది మానవుని జీవన యానంలో ఎన్నో అపోహలకు  అనర్థాలకు దారితీస్తోంది.రామాయలోమందర మాటలు చివరకు రావణుడి వినాశనానికి దారి తీసే

ఇద్దరు మనుషులు 

కలిసి ఉనప్పుడు మూడో 

వ్యక్తికి అనుకో కుండానే 

గోడ మీద బల్లిలా చెవులు అతుక్కుంటాయి

బల్లి  శకునం సూచిస్తుంది 

అదే మానవుని జీవన యానంలో అలజడి సృష్టిస్తోంది అక్కడ 

ఏమి జరుగుతుందో

తన గురించి ఏం మట్లాడు

కుంటున్నారో..యని వినడానికి ప్రయత్నం చేస్తాడు అదె మూడో 

వ్యక్తి వారిద్దరిదృష్టిలో తనకు తెలియకుండానే చులకనయిపోతాడు


పిడపర్తి అనితాగిరి

సిద్దిపేట

06/10/20, 3:49 pm - Velide Prasad Sharma: అంశం: *గోడలకే చెవులుంటే*

నిర్వహణ:సంధ్యారెడ్డిగారు

రచన:వెలిదె ప్రసాదశర్మ

ప్రక్రియ:పద్యం

కం!

గోడకు చెవులవి యెప్పుడు

వీడని బంధమ్మువోలె వెల్గును భువిలో

జాడల కన్గొన తరమే?

జోడుగ మన కొంపముంచు జోరుగ నీడై!

కం!

పెద్దగ పల్కిన వలదని

యొద్దికగా యాలుమగల యొకయింతగగన్

ముద్దుగ గుసగుస లాడగ

గుద్దుల యాటంచునె విను గోడల చెవులున్!

కం!

ముసిముసి నగవుల నన్నియు

గుసగుస మాటాడు తరిన గుట్టుగ కనుచున్

కసికసి చూపుల దాటితొ

రసరస చేయును పగకొని రా గోడ చెవిన్!

కం!

శబ్దము బయటకు పొక్కదు

శబ్దము విన్పించ దింక శక్తిగ నెపుడున్!

అబ్దము పైబడి యందరు

లబ్దియు పొందిరి ముకురము లక్షణ మమరన్!(సౌండ్ ఫ్రూఫ్అద్దాలు వాడుతున్నారు)

06/10/20, 4:16 pm - +91 73969 55116: మల్లినాథ సూరి కళాపీఠం yp

సుధా మైథిలి N. ch.

గుంటూరు

అంశం:దృశ్యకవిత

నిర్వహణ:సంధ్యా రెడ్డి గారు

-----//---------///-----------//----

గోడలకే చెవులుంటే..


కుమిలి కృశించునేమో ..

పిల్లలు ఆలపించే ఆరున్నొక్క రాగాలు

వినలేక..

 చెవులలో దూది కుక్కుకునేందుకు 

సరిపడా దొరకక..

 

సిగ్గుల మొగ్గై పిల్లిమొగ్గలు వేయునేమో..

ఆలుమగలు సరస సంభాషణలు వినలేక..


భిత్తి బిత్తరపోయి..

మరో గోడకేసి తలను వ్రక్కలు చేసుకొనునేమో..

ఇంట్లో జరిగే అత్తాకోడళ్ళ రగడలు వినలేక..


రక్తము ఏరులై పారునేమో..

ఇరుగమ్మ పొరుగమ్మలు చెప్పుకునే చాడీలు వినలేక 

వాటిని కక్కేందుకు వీలులేక..


సతమతమై పోవునేమో..

ఊసరవెల్లిలా  మారిపోయే రాజకీయ నాయకుల

గుట్టు రట్టు చేయలేక..

ఎన్నెన్నో రహస్యాలు దాచుకొనలేక..


ఉప్పొంగిపోవునేమో..

ముష్కరులు

చేసే దాడులను తెలుసుకుని..

దేశానికీ ఉపకరించగలుగుతున్నందుకు..


గోడలకే చెవులుఉంటే..

మౌనమే గతి ఏమో మానవులకు..

ఏకాంతమే శరణ్యమౌ చివరకు..

06/10/20, 4:22 pm - +91 79818 14784: సప్త వర్ణముల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠంyp

అమరకల దృశ్యకవి సారధ్యంలో

నిర్వహణ: సంద్యారెడ్డి  6-10-2020

రచన: కట్టెకోల చిన నరసయ్య

ఊరు: బోదులబండ జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

అంశం: గోడలకు చెవులుంటే 

శీర్షిక: బాధను పంచుకున్నాను



గుండె బరువెక్కింది

బరువెక్కిన గుండె వేధిస్తుంది

వేధిస్తున్న గుండె వాదిస్తుంది

వాదిస్తున్న గుండె రోదిస్తుంది

నరాలు తెగే ఉత్కంఠత 

బాధను ఎవరితోనైనా పంచుకోవాలి

ఆత్మీయులను

ఆలింగనం చేసుకోవాలి

బరువెక్కిన హృదయ వేదనను

తక్షణమే దించేసుకోవాలి

ఆవేశం-ఆవేదన అనాలోచితం

ఎవరో ఒకరు కావాలి

ఏదో ఒకటి చేయాలి

మనసు

రాకెట్ వేగాన్ని మించి పోయింది

రెక్కలు కట్టుకున్న ఆలోచనలు

గగనతలంలో చక్కర్లు కొడుతున్నయి

పడుకున్న మంచం

భూగోళాన్ని చుట్టేస్తుంది

జరిగిన అన్యాయం

కురుక్షేత్రాన్ని మరిపిస్తుంది

ఓపిక నశించింది

చెప్పకూడని వాళ్లతో

బాధను పంచుకున్నాను

కైకేయికి మంధర తోడైనట్టు

శకుని కౌరవులను దొరికించుకున్నట్లు.....

06/10/20, 4:23 pm - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : దృశ్యకవిత 

శీర్షిక : గోడకు చెవులుంటే 

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : సంద్యారెడ్డి 


అంతర్గత రహస్యాలు పరులహస్తం చేరవేయ నిగూడకర్తలే గోడచేవులు

నాలుగ్గోడల మధ్య  మాట్లాడుతూనే 

నలుగురు జాగ్రత్తమ్మ గోడకు చెవులుంటాయంటూ చెప్పుకోవడం పరిపాటేగా 

గోడకు చెవులున్నాయే లేదోగాని 

సమాచారాలన్నీ నేడు బహిరంగరహాస్యాలే

విశ్వమంతా అంతర్జాలమయమయ్యాక 

సందుగొందుల్లోను మూడోకన్ను వచ్చాక 

రహస్యమెక్కడ 

రచనాంగమెక్కడ 

అంతా బట్టబయలేగా 

పరుగులు పెడుతున్న ప్రపంచంలో 

నాలుగుగోడల మధ్య జరిగే కాపురాలు నడిరోడ్డుపైకి వస్తుంటే 

గోడలెందుకు 

గోడకు చెవులెందుకు

చెడు వినవద్దన్న మాట చెవిన పెట్టక పొగ 

చెవినే గోడకు తగిలించే వక్రబుద్ధి చెడుపు చేయునుగా 

గోడ చెవుల తంత్రం బలమైన రాజ్యాలనే బానిసలుగా మార్చేగా 

ఎన్నో కుటుంబాల నేలకూల్చెగా 

ఇతిహాసాల పురాణాల చరితలు 

గోడచెవుల కుతంత్రాలకు సాక్ష్యాలేగా 

నిష్కల్మష మనస్సులుండి 

లోకసమస్త సుఖినోభవంతనే భావనులుంటే 

గోడలెందుకు గోడకు చెవులెందుకు 

భారతీయ కుటుంబజీవన విధానం 

అజరామరం 

కష్టాల్లోని మనుజులకు ఆపన్నహస్తం ఇవ్వాలనే తలపు 

మస్తిష్కంలో భీజం వేస్తే 

పొట్టకు పట్టెడన్నం లేకున్నా పరువునిలుపుకున 

నాలుగు గోడలకే పరిమితమయ్యే 

ఆత్మాభిమాన జగత్తు గోడలకు  చెవులు పెట్టు 

కష్టాలు తీర్చ కుడిచేయిదానం ఎడమచేయికి తెలియనీకు 

గుప్తదానం చేయ గోడకు చెవులు పెట్టు 

గుట్టురట్టు చేయ గోడలెందుకు గోడకు చెవులెందుకు

గోడలు వద్దు 

గోడకు చెవులు వద్దు 

గొడవలు లేని జీవనమే ముద్దు 

హద్దులు దాటని ఏ రహస్యమైన 

అతి మధురమే 

గుప్పిట మూసివుంటే రహస్యం 

తెరిస్తే అంతా అడ్డదిడ్డ రేఖలే తప్ప

వున్నదంతా శూన్యమే


హామీ : నా స్వంత రచన

06/10/20, 4:27 pm - +91 96523 71742: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:గోడకు చెవులుంటే

నిర్వహణ:సంధ్యారెడ్డిగారు

రచన:దుడుగు నాగలత



నరములేని నాలుక

యెన్నో మాటలు బహిర్గతంచేయు

రహస్యాలనైనా రహస్యముగుంచక

పక్కవారి చెవులు కొరుకుచుండు

ఇంటిలోని గుట్టు గోప్యంగ మాట్లాడగ

గోడకున్న చెవులు  గుట్టురట్టు

పక్కవారి మంచి కండ్లనిప్పులుపోయు

చెడుజరిగితేను సంబరాలు

ఎప్పుడేది జరుగునోయని

గోడకు చెవులానించేరు పక్కవారు

ఒక్కచెవినపడ్డ చాలు మాటలన్ని

తెలుసు ప్రపంచానికి చెవులుమారి

మంచిచెడులెప్పుడు కుటుంబము మధ్యనున్న

గోడకుచెవులేయెందుకు పట్టుకొచ్చు

ఇంటివిషయాలెపుడు

పంచబోకు ఇతరులకు

అప్పుడే అందరికి మేలుజరుగు

06/10/20, 4:43 pm - +91 99125 40101: 🚩మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల🚩

 🌈సప్తవర్ణాల సింగిడి🌈

అంశం: గోడకే  చెవులుంటె

నిర్వహణ శ్రీమతి సంధ్య రెడ్డి గారు మరియు స్వర్ణ సమత గారు

రచన: గాండ్ల వీరమణి

శీర్షిక : గుట్టు రట్టు చేయును 

****************************


గోడకు చెవులెక్కడివి 

దుర్మార్గుల చేష్టలివి 

తెలుసుకోర ఓ నరుడా 

కొంప గూల్చే  పనులివి


గోడలకే చెవులుంటే 

ప్రతీ మాట వినుచుంటే 

తెలుసుకోర ఓ నరుడా 

భయమౌ కరోనకంటే


గోడకు చెవులుంటాయని 

గుసగుసలను వింటాయని 

తెలుసుకోర ఓ నరుడా 

గుట్టు రట్టు చేస్తాయని


గోడకు చెవి పెట్టు వారు 

చీడపురుగు లాంటివారు 

తెలుసుకోర ఓ నరుడా 

బంధాలను విడదీస్తరు.


గోడ దాపునుంటారు 

గోప్యంగా వింటారు 

తెలుసుకోర ఓ నరుడా 

గొడవలు సృష్టిస్తారు


గోడమీది పిల్లులు 

గొంతుకోసె నల్లులు 

మరుజన్మము నందువీరె  

గోడ ప్రాకె బల్లులు.


గాండ్ల వీరమణి...... ✍🚩

06/10/20, 4:50 pm - +91 98850 66235: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి.

అంశం; దృశ్య కవిత

నిర్వహణ: సంధ్యారెడ్డి

రచయిత :కొప్పుల ప్రసాద్. నంద్యాల

శీర్షిక: నోటి మాట..


మాట్లాడిన మాటలు

మరో మనిషి బహిర్గతం చేస్తే

గోప్యంగా దాచిన మాటలు

నలుగురుకీ చేయగలిగితే

గోడల మధ్య సంభాషణ

గొడదాటి పైట పడితే

రహస్యాలన్నీ బట్టబయలు అయితే

అగచాట్లు తప్పవు మనిషికి

ప్రతి మనిషిలోనూ లోపం

ఎదుటివారి మాటలు వినాలని

ఇద్దరు వ్యక్తుల సంభాషణ

మూడో వ్యక్తికి కడుపుమంట

నా గురించే నేనేమో నని అనుమానం

అతని మనస్సు వేద వర్ణనాతీతం

నిజంగా గోడలు వినగలిగితే

మనిషి మాట్లాడగలడా

తనలోనే తాను వేదన పడుతు

మాటను దాచలేక మదనపడును

ఒంటరి వ్యక్తికి

తీరని వ్యధ కలిగినప్పుడు

నలుగురిలో చెప్పుకో నప్పుడు

నాలుగు గోడల మధ్య

ఆవేదన వెలిబుచ్చి

తనలో తాను అనుభూతిని పొందుతారు

అన్నిటికంటే వేగం

నోటి మాటే కదా

ఆ మాటనే అదుపులో ఉంచి

నిజాయితీగా మాట్లాడగలిగితే

ఎక్కడ మాట్లాడుకున్నా

మనిషికి భయం ఉండదు కదా


కొప్పుల ప్రసాద్

నంద్యాల

06/10/20, 4:52 pm - +91 98496 14898: శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

నేటి అంశం; దృశ్య కవిత‌‌‌ (గోడకుచెవులుంటే)

నిర్వహణ: సంధ్యా రెడ్డి

రచన; యక్కంటి పద్మావతి, పొన్నూరు.

చరవాణి;9849614898


గుట్టూ మట్టూ తోనే కమ్మని కాపురం

చిన్ని చిన్ని కలతలు కాపురాల సహజం

ఓరిమి వహిస్తే కలతలు మటుమాయం

భేషజాలకు పోయి,వాదనలకు దిగితే 

ప్రతివాళ్ళు మనవాదనపై మనసు నిలుపు

పొరుగువారి ముచ్చటరచ్చకెక్కిన 

శ్రవణపేయం ఎందరికో...

అచ్చట వారు మన వాదనలను పూర్తిగావినకపోయినా....

అచ్చట మాత్రం అవధానశేఖరులై 

వారిచ్చతోస్వేచ్చగా పూరించి

ఊరించి ఊరించి పొరుగు వారితో పంచుకొని

ఆజ్యమందించి వాయువేగమ్మున 

రెక్కలు పుంజుకొని  ఏ దిశలో తిరుగుదురో!

ఏ మలుపు తిప్పెదరో!

ప్రక్కవాడిబాధ కొందరికి విందు

 వాదనలో సాధ్యాసాధ్యాలు పక్కనబెట్టి

సర్దుబాటు ను గుర్తెరిగి కోపమును ఓర్చిన

ఇల్లు స్వర్గం సీమ కాదా!

ఇటుకల పేర్పుతో నుండు గోడైనా శబ్ధాని కంపించినట్లు

గోప్యత లేని కాపురం కకావికలగు

ఓరిమి ఆభరణమైతే గోడలకు చెవులుండవు.

06/10/20, 5:02 pm - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠం yp*

            ఏడుపాయల 

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో......

            సప్తవర్ణములసింగిడి 

06/10/2020:మంగళవారం 

              దృశ్యకవిత 

అంశం: *గోడకు చెవులుంటే*

నిర్వహణ:శ్రీమతి సంధ్యారెడ్డిగారు 

రచన:జె.పద్మావతి 

మహబూబ్ నగర్ 

శీర్షిక: *కుడ్యఘోష*

***********************************

పెద్దల అదుపూ ఆజ్ఞలు అక్ఖరలేని అనుబంధాలు

వృద్ధుల పట్ల బాధ్యతనెరుగని వృధా జీవితాలు

పిల్లలకు ప్రేమనుపంచలేని హాస్టల్ చదువులు

మరుగున పడిపోయినవి

సాంప్రదాయపు ఆహార రుచులు

బామ్మ కథల నీతులెరుగని బాలబాలికలు

తాతయ్య మీసాలతో ఆటాడలేని

పిల్లల ముద్దుల అల్లర్లు

అత్తగారి అదుపాజ్ఞలను ఛేదించిన కోడళ్ళు.

నాన్నకు విలువీయక వెలుపలికి త్రోసే కొడుకులు

తోడూ నీడగా ఉంటూ 

ఇంటిగుట్టు కాపాడలేని తోటికోడళ్ళు

ఆత్మీయత కోల్పోయిన అన్దమ్ములు

పుట్టింటిప్రేమకు నోచుకోలేని ఆడపడచులు

వెరసి ..............

స్వార్థపూరిత, కల్మషభరిత కాపురాలలోనిండుతనం లేదు. నిజాయితీకి ఇసుమంతైనా చోటులేదు.

అవసరాలకు మాత్రమే నేస్తాలు

ఆపదలో ఆదుకోలేని ఆడంబరపు వాక్కులు

నమ్మకం లేనివాగ్దానాలు.

మోస ద్వేషాలకు మూలకారణాలు

గుసగుసలతో సాగే లావాదేవీలు

సమాజాన ప్రబలిన సంఘ విద్రోహక చర్యలు

సమూలంగా నశిస్తున్నాయి మానవ విలువలు

వినాశకాలానికే ఈ విపరీత బుద్ధులు.

నానాటికీ వినిపిస్తూనే వుంటాయి నేరచరితలు

గోడలకే చెవులుంటే గోలచేసి ఆపగలిగేవేమో!

మరి నోరు లేక,చెవులను

మూసుకొన చేతులూ లేక,

దుశ్చర్యలను ఆపనూలేక 

అడ్డంగా కూలిపోయే కుడ్యఘోష!

వినవేమయ్యా పరమేశా!

కలికల్మష నాశనము చేసేదెపుడయ్యా చిన్మయా!!(భగవంతుడా!)

06/10/20, 5:05 pm - +91 94906 73544: మల్లినాథ సూరి కళా పీఠం

 సప్తవర్ణాల సింగిడి 

అంశం:: గోడకు చెవులు లుంటే

 నిర్వహణ:: సంధ్య రెడ్డి గారు

 ప్రక్రియ:: గేయం

 రచన::యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డి



 గోడకు చెవులు ఉంటే ప్రమాదాలు ఎన్నో 

రహస్య మన్నది లేక గుట్టు రట్టు అవ్వొచ్చు

 యుద్ధాలు జరుగవచ్చు కుటుంబాలు కూలవచ్చు

 అనుబంధం ఆప్యాయత పెచ్చులూడి పోవచ్చు

     :: గోడకు:


 

చిన్న పెద్ద  విషయాలు విశ్వమంత వ్యాపించు 

సత్య అసత్యాల కు నిర్ధారణ జరగకుండు 

హృదయాల  అలజడులు ఊహల కందకుండు

  అనర్ధాలు అపార్ధాలు ఉప్పెనలా ముంచెత్తును

    ::: గోడకు:::




 మేలిముసుగులో ఉంటూ పెత్తనాలు చేయొచ్చు

 నీతులెన్నో చెప్పుకుంటూ వివాదాలు పెట్టొచ్చు

 అత్త కోడళ్ళ మధ్య భార్య భర్తల మధ్య

 మనిషికి మనిషికి మధ్య గొడవ లెన్నో జరగవచ్చు

   ::: గోడకు::




 మందర  మాటలకు రాముడడవిపాలయ్యే

 పారిజాత అపహరణకు కృష్ణునికే చిక్కులోచ్చే

 దేవతలకు తప్పలేదు దుర్మార్గపు చాడీలు

 కలియుగ నారదులెందరో మారాలి ఇకనైనా

      :::గోడకు:;



యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డి🙏

06/10/20, 5:07 pm - +91 94906 73544: <Media omitted>

06/10/20, 5:10 pm - +91 94410 66604: అంశం: గోడకు చెవులుంటే..

శీర్షిక:మనసు మాట

******************

మనిషి మాట మనసువినదు

ఆట మాత్రం చదరంగంలా ఆడుతూ గోడ నీడ పలుకు

శరము యదలో గుచ్చిపోవ

గుటక వేసెమనిషి నిగ్గు తేల్చ


చేతిలోనున్న ఇంద్రజాలం అంతర్జాలమై ఆడుకొనుచు

ఆటవస్తువోలే డొమ్మరాట

డమరుకమై ..

గగ్గోలు పెట్టె గొంతు లోని

ధ్వని తరంగమై గోడకూల్చ

గుడ్డిలోని గూడు కూడుమరచి 

కటకటాల కత్తి బట్టి బరకజూసే


కోడిపందెమైన మాట  మనసు దూరి  ప్రాణాలు తీయ జాడవెతికి దారిన పోయే దానయ్య చూసి పిలిచి చెప్ప


తక్కెడల బ్రతుకులై తంబోళాట

ఆడే తిరిగి తిరిగి చేరు నీ నోటిమాట నీకడకు నాలుగు 

పదములు కాస్త వేయిపదాలై


డమరుఖము మోగించి నలు

దిక్కుల మర్మమేమిటని ప్రశ్నించే చేతిలోని గీతాలు రాతలు మార్చి నోటచేరి నడివీధిలో నాట్యం చేయు


*********************

డా.ఐ.సంధ్య

సికింద్రాబాద్

06/10/20, 5:16 pm - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ దృశ్య కవిత

అంశం గోడలకు చెవులుంటే

నిర్వహణ శ్రీమతి సంధ్యారెడ్డి గారు

శీర్షిక  కలా నిజమా ఇది

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 06.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 53


గోడలకు చెవులుంటే  జీవితము గందరగోళమే

మంచి చెడుల గురించి మాటలు ఆడాలంటేను గుండెల్లో వణుకు

గుట్టులన్ని కూడాను రట్టు అగును

రహస్యాలన్నవి దాచే రోజులిక ఉండవు

రహస్యాలను కడుపులో దాచుకోలేక జనులు సతమతమయ్యేరు 

గోడలకు చెవులుంటే రోజుకు ఎన్నెన్ని గొడవలో మరి

నరము లేనట్టి నాలుక వినదు,చూడదు కాని వాగుతుంది 

అన్నది ఒక్కటి అయితే అననివి లక్ష చెపుతుంది

గోడలకు చెవులాన్చి గుట్టుగా ఉన్న కాపురాలు కూలదోసే

అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలు కట్టే

అత్తాకోడళ్ల మధ్య ఆరని మంటలు రేపు

ఉమ్మడి కుటుంబాల్లో ఒకరిపై ఒకరికి కక్షలు నూరు

భార్యాభర్తల మధ్య ఉన్న లోగుట్టులు బయటకు పొక్కు

చాటు మాటు మాటలుకిక సెలవులు ఇవ్వాల్సిందే మరి

గోడకు చెవులొచ్చె మనిషికి కష్టాలొచ్చె

గోడలకు చెవులొస్తే ఎన్నెన్ని తిప్పలో మనిషికి బాగా తెలిసే

నోరు అదుపులో పెట్టుకొని  బ్రతకడం నేర్చే

06/10/20, 5:23 pm - +91 99595 11321: మల్లినాథ సూరి కళాపీఠం వారి సప్త వర్ణ సింగిడీ 

అంశం. గోడకు చెవులుంటే.... 

నిర్వహణ. Smt. సంధ్యా రెడ్డి గారు 


మనలో చాలామంది కి ఉంటుంది ఈ బలహీనత, 

ఇతరులు మాట్లాడుకుంటుంటే చెవి రిక్కించి వినటం,

అది మనకు సంబంధం ఉన్నా లేకపోయినా, 

అది ఒక రకమైన మానసిక బలహీనత, రుగ్మత , 

ఓ కన్ను వేసి ఉంచమన్నట్టు, వీళ్ళు ఎప్పుడూ, 

ప్రక్క వారి సంభాషణ పై ఒక చెవ్వు వేసి ఉంచుతారు

అంతే కాదు తాము విన్నదానికి చిలవలు పలవలు, 

కల్పించి కరోనా కన్నా వేగంగా వ్యాప్తి చేస్తారు వీళ్ళు, 

దాని వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేకున్నా అస్సలు వాళ్లకు జరిగే హాని, అపాయం ఎక్కువ, 

అంతే కాదు మంచి విషయాలకన్నా చెడునే ఎక్కువ, ప్రచారం చేస్తారు... 


అందుకే మనం మన స్వవిషయాలు, కుటుంబ విషయాలు మాట్లాడు కొనేముందు ఎవరన్నా వింటున్నారేమో గమనించి ఒక సారి చుట్టూ పరికించి మాట్లాడు కోవటం మంచిది, ఎందుకంటే 

గోడలకు చెవులుంటాయి, తస్మాత్ జాగ్రత్త !!!!!!!


ఇది నా స్వంత రచన, 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 9959511321...

06/10/20, 5:27 pm - +91 93014 21243: మల్లినాధ సూరి కళా పీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

అమరు కుల దృశ్య కవి గారి ఆధ్వర్యం లో

నిర్వహణ - శ్రీమతి సంధ్యా రెడ్డి

రచన - తెలికిచెర్ల విజయలక్ష్మి

6-10-2020




గోడలకు చేవులుంటే 

గుట్టు బయట పెడతాయి 

పక్క వారి విషయాలు

అందరికీ పంచుతాయి

మంచితనం నశించి

కుటుంబ కలహాలు కలుగుతాయి


నాలుగు గోడల మధ్య జరిగే 

మాటలు కోటలు దాటినా 

పర్లేదు కాని గోడ  చెవిలో పడ్డాయో కొంప కొల్లేరే 


ఎన్ని అంతర్ నేత్రాలు వున్నా!  

గోడ చెవులు చేసే చెడుపులు 

చెప్పుకుంటే సిగ్గు, సిగ్గుచేటు


పిల్ల  అరగక వాంతులు చేసుకుంటోందని అమ్మ ఆరాటం గా అమ్మమ్మకు చెప్పిన మాటలు,


మరు నిమిషంలో కొత్త రూపు దిద్దు కొని  ఆత్రంగా అవతలకు పరుగులు, ఆలోచనకే అసహ్యంగా  మాటలు 

విందులు చేసుకుంటే 

జీవితాలు బలి అవుతాయి కదా... 


టైమ్ వస్తుంది తాట తీస్తుంది 

తప్పుడు మాటలకు తడకలు 

తొందరగా అల్లుకున్న 

నిజం మంటలో నిశ్చయంగా 

తగలబడటం తప్పదుగా..

06/10/20, 5:33 pm - +91 93813 61384: 💐మల్లినాథసూరి కళాపీఠము💐

సప్తవర్ణముల సింగిడి


పేరు:చంద్రకళ. దీకొండ

ఊరు:మల్కాజిగిరి

అంశం:చిత్ర కవిత

ప్రక్రియ:వచనం

నిర్వహణ:శ్రీమతి సంధ్యారెడ్డి గారు

తేదీ:6/10/2020


శీర్షిక:సంస్కారం

🌷🌷🌷🌷


గోడకు చెవులుంటే...

మూగ హృదయాల గుసగుసల ప్రణయరాగాలతో వీనులవిందు...

మౌన వేదనల రోదనలతో 

కర్ణ కఠోర నాదవిషాదం...!


గోడకు చెవులుంటే...

మూడో కంటికి తెలియని అతి రహస్యం బట్టబయలు...

ఇరువురి నడుమ జరిగే రహస్య మంతనాల విడుదల...!!


గోడకు చెవులుంటే...

అర్థభాగం వినపడి 

అపార్థాలు కలుగు...

అంతరంగపు స్వగతాలతో అపోహలు పెరుగు...!!!


గోడకు చెవులుంటే...

ఇరువురి నడుమ సఖ్యత చెడు...

పచ్చని సంసారాన 

చిచ్చులు రేగు...!!!!


గోడకు చెవులుంటే...

జరుగబోయే నేరాలు 

ఘోరాలు మాయు...

సమాచార సత్వర చేరవేతతో...

దారుణ మారణ 

కాండలు ఆగు...!!!!!


గోడకు చెవులుంటే...

కొంత మంచి జరుగవచ్చు...

ఎంతో చెడు జరుగవచ్చు...

ఏది జరిగినా...

మనిషి సంస్కారాన్ని బట్టి...

ఎంచుకున్న మార్గాన్ని బట్టే...!!!!!!!!

*****************************

చంద్రకళ. దీకొండ

06/10/20, 5:36 pm - +91 94932 73114: 9493273114

మల్లినాథ సూరి కళాపీఠం పేరు.. కొణిజేటి. రాధిక 

ఊరు రాయదుర్గం

 అంశం ... గోడకు చెవులుంటే నిర్వహణ సంధ్యారెడ్డి గారు


గోడకు చెవులుంటే అనర్థాలే... దండయాత్రలకు మూలాలే... అపార్థాలకు బీజాలే... రహస్యాలు దాగక నిత్యం ఇళ్లన్నీ రణ క్షేత్రాలుగా మారేవేమో ...

అల్లకల్లోలాలతో దుమారాల వర్షమే కురిసేదేమో...

 మాటల యుద్ధాలే.. గందరగోళాలే...

నాలుగు గోడల నడుమ జరిగే అరాచకాలను బట్టబయలు చేసేవేమో...

 రహస్యాల గుట్టురట్టు చేసి, నేర చరితుల్ని బయట ప్రపంచానికి చాటేవేమో...

  ఒకరిపై మరొకరు 

ఎత్తిపోసుకు పథకాలు.. విమర్శనాస్త్రాలు..

 చాడీల బాగోతం..

 పితుర్ల మహాభారతాలు...

పోట్లాటలకు మూలాలయ్యే వేమో...

మనతోపాటు ప్రతి ఉషోదయాన సుప్రభాత లతోపాటు, కష్టనష్టాలనూ వినేవేమో...

 ఒంటరి తనానికి ఆలంబన అయ్యేవేమో...

గోడకి చెవులు మంచిచెడుల సమాహారమే...

మనుషుల వింత పోకడలు స్వార్థము, అతి తెలివితేటలను విని, చెవులు లేకుంటే బాగుండేదేమో అనుకుంటుంది, ఇది మాత్రం నిజం.

06/10/20, 5:37 pm - +91 6305 884 791: మల్లినాథ సూరి కళా పీఠం yp

సప్తవర్ణ సింగిడి

అంశం: గోడలకే చేవులుంటే

నిర్వహణ:  సంధ్యరెడ్డి గారు

పేరు: శ్రీదేవి చింతపట్ల

=============

గోడలకే చెవులుంటే..

కోడలిని దుర్భాషలాడుతూన్న  అత్తమామలను అసహ్యించుకునే దేమో.. తనూ ఆడదే నని మరచిన అత్తను చూసి ఆడదానికి ఆడదే శత్రువు అన్నమాటనిజమే అనుకునేది.


అత్తింట కూతురు సుఖము నడిగిన మామను కోడలు కూడా ఒక ఇంటి కూతురే కదా అని నిలదీయడానికి తనకు నోరుంటే బాగుండు ననుకునే ది


ఎదుటి మనిషి నెత్తు నోర్వక మనిషి పలికే ఈసు మాటలు,


అమ్మలక్కల చెవి కొరుకుడు,

కుట్ర కుతంత్రాల కూటములు విని భరించలేక మూసుకొనుచేతులు లేక


సత్యాసత్యాలను నిర్ధారణ చేయలేక

స్పందింప లేని తన జడత్వానికి సిగ్గుపడి...


ఈ స్వార్థ,మూర్ఖ, నీచ, మానవునకు రక్షణగా నేనుండనని

దబీ మని కూలునేమో!🙏🙏

06/10/20, 5:38 pm - +91 99595 24585: *మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల*

 *సప్తవర్ణాల సింగిడి*

*అంశం: గోడకే  చెవులుంటె*

*నిర్వహణ శ్రీమతి సంధ్య రెడ్డి గారు మరియు స్వర్ణ సమత గారు*

*రచన: కోణం పర్శరాములు*

*సిద్దిపేట బాలసాహిత్య కవి*

*శీర్షిక : గుట్టు రట్టు*

*తేది : 06-10-2020*

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

గోడకు చెవులుంటే.....

గోప్యాలన్ని బట్టబయలు

రహస్యాలు అన్ని రసాభస

మాటల గుప్త నిధులన్నీ

కళేబరాళ్ళా బయల్ప డతాయి

మందుపాతరల్లే మారణ హోమం సృష్టిస్తాయి!


గోడకు చెవులుంటే......

అత్తకోడళ్ళ మద్య గత్తర

లేపుతది

వియ్యంకుల మద్య విద్వాంసాల సృష్టించును

తోటి కోడల్ల మద్య తగవులు రేపుతుంది

ఇంటి గుట్టు రచ్చ రచ్చ వుతుంది 

భార్యాభర్తల బాగోతాలు

బట్టబయలు అవుతాయి!


గోడలకు చెవులుంటే.....

దొంగోనికి తాలంచెవి

ఇచ్చినట్లే

ఇంట ఓడి బయట ఓడి

ఇబ్బందులు ఎన్నెన్నో

రాక్షసత్వం రాజ్య మేలుతోంది

ప్రతిఇంటిలో రణరంగం

కురుక్షేత్రమే

అణుబాంబులు లేని 

మాటల విస్పోటనాలు

ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెవులు

కొరుకుడు ఎక్కువౌతుంది!


గోడలకే చెవులుంటే.......

అబద్ధపు ఆరోపణలు ఆట

కట్టడవుతుంది

చీకటి ఛీత్కారాలకు తెర

పడుతుంది

అసత్య ఆరోపణల

దురాగతాలు బట్టబయలు

కుట్రలు కుతంత్రాల రెక్కలు

తెగిపోతాయి

తప్పుడు మాటల తుప్పు

వదిలిపోతుంది !


కోణం పర్శరాములు

సిద్దిపేట,9959524585

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

06/10/20, 5:42 pm - +91 96038 56152: మల్లినాథసూరికళాపీఠం yp 

       (సప్తవర్ణాల సింగిడి)

అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి అధ్యక్ష పర్యవేక్షణలో... 

*శ్రీమతి సంధ్యారెడ్డి* గారి నిర్వహణలో.. 

నేటి అంశం: (దృశ్యకవిత)

*గోడలకు చెవులుంటే*


రచన:- *వి'త్రయ'శర్మ*

^^^^^^ <<<<^>>>>^^^^^


శీర్షిక :- *తస్మాత్ జాగ్రత..*

******     ######    *******

గుబులు మేఘాలు కమ్ముకున్నాయి.. 

గుట్టుగా ఉండాల్సిన అభిమానాలన్నీ..

 గోప్యత మరచి బహిరంగ రహస్యాలయ్యాయి.. 

ఎలా.. జరిగిందో అర్ధంకాని ప్రశ్నకు ఎదురయ్యే సమాధానం 

*గోడలకూ చెవులుంటాయ్*

 మనిషిలోని మహోన్నత లక్షణం తనకన్నా ఎదుటివాడి అవసరాలగురించో.. ఆలోచనలగురించో తెలుసుకోవడం.. 

యిదిప్రత్యక్షం గానో  పరోక్షంగానో అయినా  శునకానందమే... వినిఊరుకోలేని మనిషి.. తనదైనరీతిలో లేనిదిఉన్నట్టు.. ఉన్నది లేనట్టూ.. కల్పితాల కార్ఖానాలో.. 

అనర్ధాల,  అపార్ధాల 

అసంగతాలనెన్నింటినో తెలివిగా సృష్టిస్తాడు.. 

కొంపలు కూలిపోయినా.. 

తను చల్లగా ఉంటేచాలు అనుకునే దౌర్భాగ్యబుద్ధే.. గోడలకు చెవులుంటాయనే నానుడి లోని పరమార్ధం.. 

అయినదానికీ.. కానిదానికీ.. మధ్య అపోహలను సృష్టిస్తూ.. 

ఎన్నో అనర్ధాలహేతువే గోడలకు చెవులుంటాయ్. 

రహస్యాన్ని బహిరంగ పరిచే ఓర్పు చూపినా.. సాధ్యాసాధ్యాలు తెలీనీక..  సహనాన్ని కూడా సామీప్యతలోకి చేరనీయని అడ్డుగోడలు నిన్ననుసరిస్తూనే ఉంటాయ్.. తస్మాత్ జాగ్రత్త. 

*****

*విత్రయ శర్మ*

06/10/20, 5:44 pm - +968 9638 9684: <Media omitted>

06/10/20, 5:44 pm - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 6-10- 2020

అంశం : గోడకు చెవులుంటే? 

శీర్షిక ; ఆభేద్య మైన గోడ!

నిర్వహణ:అమరకుల దృశ్య కవిగారు

సంధ్యారెడ్డి గారు


పల్లవి:

గొడవెందుకు గోడలారా 

మీకు లేదు కర్ణ బాధ

వినలేరు విచిత్రాల

గుసగుసల విషపొగలు!


చరణం:1

విన్నవిషయములకు జోడించు 

విశేషణాల హంగులు

'అట' లన్ని ఖచ్చితమై

 'ఔను'లన్న ముద్రవేసి

వీధి వీధి లన్ని తిరిగి 

చెవులు కొరికి వేడుకలే 

చేసుకొందురు........

//గోడవెందుకు//


చరణం2

పొరుగు ఇంటి పరువు బాధ

గోతికాడ నక్కలా పొంచి వినుచు,

పరువులేని మనుషులంతా

ప్రచారభేరి మ్రోగించి,

చిలువలన్నీ పలువలుగా

చేసి చెప్పి చిందులేయుదురు ......//గోడవెందుకు//


చరణం3//

నిజములన్ని నిప్పులై,

అభేద్యమైన గోడలై,

కాలమిచ్చు తీర్పుజూసి

గోడమీద పిల్లుల వలె

కాలిన మోము లన్నీ

కనిపించ నీయకుండా

మీ గోడచాటే దాచుకొందురు ...

// గొడవెందుకు//

ఈ గేయం నా స్వంతము.. ఈ సమూహము కొరకే వ్రాసితిని.

06/10/20, 5:49 pm - Anjali Indluri: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

O6.10.2020 మంగళవారం

దృశ్యకవిత : గోడలకు చెవులుంటే

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి గారు


 *రచన : అంజలి ఇండ్లూరి* 

ప్రక్రియ : వచన కవిత

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


గోడలకు చెవులుంటే.....

ఎల్లలెరుగవు రహస్యాలు

నాలుకలపై కత్తులు మొలిపించి

కళ్ళతోనే నిప్పులు కురిపిస్తూ

రాతి చేష్టల నడక నేర్చి

మేకవన్నె పులిరూపం ధరించి

అమాయకత్వం తొడుగు తొడిగి

పదునెక్కిన మాటలకు

తియ్యని తేనెలూటలద్దుతూ

రెక్కలొచ్చిన వేగులవలె

దుర్భేద్యమైన కోట గోడలను

సైతం బద్దలు కొట్టుకుంటూ

చేరవలసిన చోటుకే చేరి

కూల్చబడిన రాజ్యాలెన్నో

కాఠిన్యానికి చిక్కిన రాముళ్ళెందరో

అగ్నిపునీతలు కాని సీతలెందరో

అనుమానపు పొగలు కమ్మి

కూలిపోయిన కాపురాలెన్నో

అబద్దాల సాక్ష్యాల నీడలో

రాలిపోయిన ప్రాణా లెన్నో

నివురు గప్పిన నిజాలలో

వీడిపోయినా బంధాలెన్నో

చూపులు చెప్పే వక్రభాష్యాలకు

నెత్తురు చిందించకుండా

చితికి పోయిన గుండెలెన్నో

మందర బుద్దుల జనారణ్యంలో 

కొందరికిది మృష్ఠాన్న భోజనమే

నాగరికత వెర్రి తలపులలో

నలిగిపోతున్న జీవితాలెన్నో

సాంకేతిక పురోగమన కాలంలో

గోడలకు చెవులే కాదు

కళ్ళూ ఉన్నాయి సి.సి. ల రూపంలో

అంతెందుకు అందమైన సుందరి

చరవాణి కాదుగా రహస్య వాణి

బాహ్య అంతర్గత వాణిని

బట్టబయలు చేసే బాణియేగా

ఉద్వేగాలకు వేయకుంటే ఆనకట్ట

రహస్యాలకు ఉండదిక అడ్డుకట్ట


✍️ అంజలి ఇండ్లూరి

       మదనపల్లె

       చిత్తూరు జిల్లా

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

06/10/20, 5:51 pm - +91 98495 90087: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-సంధ్యారెడ్డిగారు.

తేదీ:-06.10.2020

అంశం:-గోడకు చెవులుంటే. 

పేరు:-ఓ. రాంచందర్ రావు

ఊరు:-జనగామ జిల్లా

చరవాణి:-9849590087


భారతీయ జీవనవిధానం, సంకేతాత్మకం, సందేశాత్మకము. 

ముఖ్యంగా జీవాత్మ పరమాత్మ

గుణాత్మకం. మనఃకారకం. ఒక

రధచోదకుడురధాన్ని, ఎలాజాగ

రూకతతోనడుపుతాడో, మనిషి

నిఅతనిమనుస్సునడిపిస్తూవుంటుంది.అందుకేప్రతిపనిని

నీ మనస్సాక్షి ద్వారాచేయండని

నిర్దేశించారు. సాహిత్యం, సమాజం, జీవితంఇవిఒకదాని

పైఒకటిఆధారపడికొనసాగుతాయి. జాతీయాలు, పలుకు బడులు, నుడికారాలు, సామెతలు మనంఆచరించేప్రతి

పనికి దర్పణం. అదే సాహిత్యం లో ప్రతిబింబింస్తుంది. మన విషయాలు, బహిర్గతం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మెలగాలో, అవతలి వ్యక్తితో

ఎలామసలాలోచెప్పటానికేఈ

సామెత ఉపయోగిస్తారు. ఒక విషయం ఇద్దరు వ్యక్తులమద్య

జరిగింది అనుకుంటాంకాని,

ఇప్పటిభాషలోచెప్పాలంటే, వైర్

లెస్ ద్వారా నిమిషాల్లో అది

అందరికీచేరుతుందని దీని భావము. ఒకవిషయం, ఒకరి

ద్వారా ఇంకొకరికి, ఆవిషయం, 

చిలువలుపలువలై, ఉన్నదానికి

ఎన్నో కొత్తవిచేరిఇద్దరిమద్య

పొరపచ్చాలు, మనస్పర్థలు

సృష్టించేవరకువెళుతుంది. 

మనిషికి, సామాజిక స్పృహ, 

సామాజిక దృక్పథంతో, మెలగాలనే సంకేతం. కమ్యూనికేషన్ గ్యాబ్ వల్లఎన్ని

ఉపద్రవాలు వస్తాయో తెలుస్తుంది.ఇలామనిషిప్రతినడవడికి మనిషి మనుగడకు

ఇవి చాలా ముఖ్యమైన మార్గదర్శకాలు.

06/10/20, 5:52 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 06.10.2020

అంశం : గోడకు చెవులుంటాయ్ (దృశ్యకవిత)

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీమతి సంధ్యారెడ్డి

శీర్షిక : చెవులు! 


తే. గీ. 

గోడకు చెవులున్నను మేలు కుళ్ళు, కపట

బుధ్ధి, మనుజుల నడతయు బోధపడును,

తెలివిగ మనగవచ్చును, దిశయు తెలియు,

బయట పడగ నాపదనుండి వరమె యగును! 


తే. గీ. 

ముందుగ తెలిసియుండిన మాయదారి

వ్యాధి దెచ్చు సూక్ష్మ క్రిమిని ప్రారదోలి

సుఖముగను వసియించగ చోటు లభ్య

మవును గోడకుఁ చెవులున్న యద్భుతముగ! 


తే. గీ. 

జగతియందున నిత్యము జరుగు వివిధ 

సంఘటనలన్నియూ రహస్యముగఁ యెవరొ

యుప్పు మోయగ వెలుగునకొచ్చి యుండు

కాకపోయిన విధ్వంసకాండ మిగులుఁ! 


తే. గీ. 

చరితఁ తరచి చూడగ నెన్ని స్వార్థశక్తు

లాటలను యితిహాసములమరములగు

మేటి తార్కాణములకిలఁ సాటి వచ్చె

కుఢ్యములకు చెవులుకల్గి గొప్ప మిగిలె! 


తే. గీ. 

మనము గెలువగవలెనన్న మనమునందు

మాట పరులయెదుట యేల చాటవలయు

చెవులు గోడలకే యుండు చేటుకలుగుఁ

వేగులందరు శత్రువుల్ వెతలు కలుగు! 


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

06/10/20, 6:18 pm - +91 93913 41029: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

O6.10.2020 మంగళవారం

దృశ్యకవిత : గోడలకు చెవులుంటే

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

 *రచన : సుజాత తిమ్మన 

ప్రక్రియ : వచన కవిత

శీర్షిక : వేళ్ళాడే చెవులు

*******

గోడలతో కట్టుకున్నదే ఇల్లు 

పక్కవాళ్ళ చెవులన్నీ గోడలకుంటే 

ఇక రక్షణేది ఆ ఇంటి గౌరవానికి ?


కష్టాలను, కన్నీళ్లను 

గోడల మధ్యన బంధించి 

పెదాలకు వెన్నపూసుకుని 

పైకి నవ్వుతూ తిరుగుతుంటే 

ఓర్చలేని ఇరుగుపొరుగు 

చూపులకు పాదరసం రాసి 

అవతల ఇంటిలోకొదులుతారు

చెవులను ఫెవికాల్ లో ముంచి గోడలకతికిస్తారు 


చూడనిది చూసినట్టు 

విననిది విన్నట్టు 

కాకులై 'కావు ...కావు ..'

అంటూ మోసుకెళ్తారు 

అసందర్భపు వార్తలను 

'ఒహో ! ...అవునా..'

విన్నవారి విస్మయాలు 


అక్కడినుంచి మరోచోటుకి 

మరో కాకులగుంపు ..

 

ఇలా గోడలకు చెవులనంటించే 

మనస్తత్వం ఉన్నవాళ్లు 

త్రాచుపాము కంటే విషపూరితులు 


బంధాలు తెగిపోవటానికి,

కుటుంబాలు కూలిపోవడానికి 

కారణభూతులు ఇటువంటివారే ..


గోడలెంత పటిష్టం గా కట్టుకున్నా 

అదృశ్యపు చెవులెప్పుడూ 

గోడలకు వేల్లాడుతూనే 

ఉంటాయని మరువద్దు!

*****

సుజాత తిమ్మన 

హైదరాబాదు .

06/10/20, 6:30 pm - +91 91006 34635: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవిత అమరకులగారు

అంశం: గోడకు చేవులుంటే

నిర్వహణ:సంద్యారెడ్డి

శీర్షిక: దృష్యకవిత

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 6 Oct  2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------


గోడకు చెవులుంటాయి 

గుసగుసలతో గుబులుల్లేపుతాయి

 

గాలి నోటికంది అర్థాలు మారీ

తానెన్నో సంగతులు చూసినట్టు

గుట్టు రట్టుచేస్తేతేతప్ప 

కడుపుబ్బరం తీరదు కొందరికి


ఇంటి గుట్టు లంకకు చేటనీ 

మహా బలశాలి రావణుడే బలయ్యాడు

పైరుకు చెదలుపట్టి పంట నాశనం చేసినట్టు

సుప్పనాతులెందరో చూరు పట్టుక వెళ్ళాడతారు


పెదవి దాటితే ప్రుద్వి దాటునని

మూడు ముచ్చట్ల వాళ్లకు 

ఇద్దరి ముచ్చటకు మూడోడు చెవులు జేరేసి

సొంత పని మానుకుని మనసు కళ్ళు నిలేసీ


వాటికి రెక్కలు చేర్చి వీదివాడ రచ్చజేసీ

అందుకే అన్నారు

బావి చెరువు నోరు మూయొచ్చుగాని

మనిషి నోరు మూయలేమని 


పచ్చని సంసారాలు భగ్గున మండిస్తారు

పచ్చని గడ్డికి నిప్పెట్టీ పిడికెడు బూడిదగా మారుస్తారు

వైతరుణి నది ఈదినట్టు వీళ్ల 

నోటి నుండి బయట పడాలంటే 

వీరు లోకులు కాదు పలుగాకులు

లోకుల నోటిని లోకేశుడు కూడా

మూయలే డనేది నిజం

06/10/20, 6:33 pm - +91 70130 06795: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశం: గోడకు చెవులుంటాయి

నిర్వహణ: సంధ్య రెడ్డిగారు

రచన: వసంతలక్ష్మణ్

నిజామాబాద్

~~~~~~~~~~~~~~~~

శీర్షిక: ఆలోచించి మాట్లాడు

~~~~~~~~~~~~~~~~


నోటితో మాట్లాడి నొసటి తో

వెక్కిరించే సమాజం లో ఉన్నాము

అందుకే ఎదుటి వారి తో మాట్లాడే 

ముందు ఆలోచించి మాట్లాడడం

అలవర్చుకోదగిన కళ


వియ్యాల వారు మంచివారని 

ఇంటి గుట్టు 

బయటపెట్టకూడదని తెలుగు సామెత లో  మన పూర్వీకులు   ఎంత నిగూడార్థం 

దాచి ఉంచారో అర్థం చేసుకున్నావాళ్ళకి 

అర్ధమయి నంత రహస్యం.

పిడికిలి మూసి 

ఉంచితే అందులో ఏముందో చూడాలనే  ఎదుటి వారినీ ఆతృతలోనే 

ఉంచాలి  

విప్పితే బ్రతుకు బండారం బయటపడ్డట్లే.

చెడును చెవిలో చెప్పు

మంచిని పది 

మందిలో చెప్పు 

అనేది పెద్దవారి మాట

కానీ ఇంగితం మరిచి 

గోడకు చేవి ఆనించే 

మనసులకు మంచైనా చెడైనా 

విపరీతార్థాలు తీసే వారితో 

తస్మాత్ జాగ్రత!

06/10/20, 6:45 pm - Balluri Uma Devi: <Media omitted>

06/10/20, 6:46 pm - Balluri Uma Devi: 6/10/20

 మల్లినాథ సూరికళాపీఠం

అంశం : దృశ్యకవిత 

నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు

పేరు: డా. బల్లూరి ఉమాదేవి

శీర్షిక గోడకు చెవులుంటే

ప్రక్రియ: పద్యములు


ఆ.వె:గోడకుండు చెవులు కూల్చును కొంపలు

   గుట్టు నెపుడు నివియు రట్టు చేసి

   చిలువలు పలువగ  చేసి పచ్చని కాపు

    రములు నాశనమొనరంగ చేయు.


ఆ.వె:గోడకు చెవులుండు కూడదు పోరను

     పెద్ద లాడు మాట పేర్మి తోడ

     నాలకించ కలుగు నవనిలో మేలని

    హితవు పలికె తల్లి సుతకు తాను.


ఆ.వె:పెద్ద యుద్ధములును విశ్వ ముందు జరిగె

    గోడ చెవుల వలన కువలయాన

   నమ్మినట్టి వారె నయవంచనము చేయ

   నిట్టి స్థితియు కలుగు నెచట నైన.


ఆ.వె:ఎవరు లేరటంచు నేదేదొ మాట్లాడ

     గోడ చెవుల వలన గోల  చేయు

    నదియె నింటి లోన యగ్నిని రగిలించ

    మంట హెచ్చు చుండు మదిని నెపుడు


ఆ.వె:జనుల మధ్య నెపుడు జగడము లుదయింప

    కారణమగుచుండు కనగ నివియె 

    గోతి చెంత నున్న గుంట నక్కల వలె

     చేటు కూర్చుచుండ చింత హెచ్చు

06/10/20, 6:52 pm - +91 91774 94235: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

O6.10.2020 మంగళవారం

దృశ్యకవిత : గోడలకు చెవులుంటే

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

 *రచన : కాల్వ రాజయ్య 

ఊరు;బస్వాపూర్,సిద్దిపేట. 

ప్రక్రియ : వచన కవిత

*************************


గోడకు చెవులుంటే ఘోరాలు జరిగేవి.

మనిషి వలే మాయమాటలు జెప్పి మనసు చెదరగొట్టేవి. 

గుసగుస మాటలతో గుండెలవిసిపోయేలా ఏడిపించేవి.


కాని ఇప్పుడేమన్న తక్కువ జరుగుతున్నాయా, 

గోప్యంగున్న మాటలు వినాలని  గోడపక్కకు చెవ్వారిచ్చి విని ,

ఈ మాయదారి మనుషులు ఆత్మీయుల మద్య చిచ్చుబెడుతున్నారు. 

చాట్ల తౌడును పోసి కుక్కల కోట్లాట బెట్టిచ్చినట్లు 

వాళ్ళది వీళ్ళకు వీళ్ళది వాళ్ళకు జెప్పి విలువ దీపిస్తున్నరు.


ఈ పాడు మనుషులు చేయబట్టే 

ఈ గోడకు చెవులుంటయనే జాతీయం పుట్టింది. 

మలినమైన మానవుల కన్న మట్టి గోడలే నయం 

రహస్య మాటలెన్ని విన్న రానివ్వవు గోడదాటి.

 

*మరి* *మనుషులేగా* *మారాలి*

06/10/20, 6:52 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

ఏడుపాయలు- 06-10-2020

సప్తవర్ణముల 🌈 సింగిడి

రచన: ప్రొద్దుటూరి వనజారెడ్డి

ఊరు: చందానగర్

అంశం: దృశ్యకవిత

శీర్షక: గోడకు చెవులుంటే

         9866249789

నిర్వహణ: శ్రీ దృశ్యకవిశ్వరులు,

శ్రీమతి సంధ్యారెడ్డి గారలు

————————————

భూమ్మీద జన్మించిన జీవరాసులలో మాట్లాడే శక్తి

మనిషి సొంతమని, మధిలో

విషయాలు మంచిగా పలుకుతూ, గుప్త విషయాన్ని

గుట్టుగా దాస్తూ నలుగురితో

కష్టసుఖాలను పంచితే జీవితం పూలబాటౌను


పదుగురు కలిసి మాట్లాడేప్పుడు గోడకు చెవులుంటాని మరువక ఆచి తూచి మాట్లడుతూ పలువురి తోడ

కలిసి అడుగులేయ జీవితం

ఆనందమౌను


గోడకు చెవులుండుట వలన

ఎన్నో అపోహలకు దారి తీయు “పెదవి దాటితే పృథివి దాటు” అన్నట్లు రామాయణంలో మందర మాటలు, రావణ సంహారానికి

దారితీస్తే, లంక గుట్టును భయట పెట్టిన విభీషణుని

మాటలుతో లంకకు చేటువచ్చె


చెప్పుడు మాటల నిండు

గర్భిణియైన సీత అరణ్య వాసాన అష్టకష్టాలనుభవించె 


పనీపాట లేని అమ్మలక్కలు,

అత్తకోడళ్ళు,తోడికోడళ్ళమధ్య చిచ్చు పెట్టే మాటలతో ఇల్లు ముక్కలై బంధాలు బలహీనమౌను 


గోడకు చెవులుండుటతో అనుమానాలు తేటతెల్లమై

అరమరికలు తొలగు సుమీ...

————————————

ఈ రచన నా స్వంతం

————————————

06/10/20, 6:53 pm - +91 94404 72254: మల్లినాధసూరి 

కళా పీఠం ఏడుపాయల

సప్తవర్ణాల 🌈సింగిడి

పేరు....వెంకటేశ్వర్లు లింగుట్ల

ఊరు...తిరుపతి

అంశం: గోడకు చెవులుంటే...

శీర్షిక.... మనిషినైజం..

నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు

తేది..06.10.2020.


పక్కవాడి సన్నాయినొక్కులు వినాలన్న దుగ్ధ

మిక్కిలి ఆసక్తిగొలిపే మనిషి స్వభావానికే మచ్చ

చెక్కిలిపై చేయివేసి మరీ చోద్యం వినడానికీ

చక్కటి అవకాశానికై ఎదురుచూస్తూ ఉంటాము...


దిగజారిన మనస్తత్వాన్ని ఎగదోస్తూ వెక్కిరింతలా

పగవాడికీ లేని చిత్తాన్ని పక్కదారులు మళ్లించే

దొంగచాటు నక్కినక్కి పరుల పరాచికాల్ని వినే

చొంగకార్చి వినోదించే వికృతమైన చేష్టల అలవాటై..


చిదంబర రహస్యమైనా ఆచితూచి మాట్లాడాలి

వదంతుల్లా వ్యాపించి గందరగోళాన్ని సృష్టించేదే

వాదనలైనా వేదనలైనా స్వరం తగ్గించి జాగ్రత్తలతో

పదేపదే వెన్నంటే నీడలను గమనించి సాగాలి.....


మౌనం మేలన్న మనసును అదుపులో ఉంచుకొని

మాననీయ లక్షణాల్ని సొంతం చేసుకోవాలి 

మనది కాని దానిపై శ్రద్ధ మంచిదికాదన్న సూక్తిని

మనిషి మరవకూడదు తోటి వారిని గౌరవిద్దాము...


చెవులు రిక్కించి విన్న విషయాలే నీలివార్తలై వ్యాప్తి

పావులు కదిపే నోటిమాటకు విలువ కట్టి ఎగతాళిగా

తావులకు విస్తరించి భయానకంగా మారి అంతటా

అవమానాలపాలై మనిషి నైజాన్ని నిలువునా చీల్చేను


వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

06/10/20, 6:54 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశం:గోడకు చెవులుంటే

శీర్షిక;జాగ్రత్త

నిర్వహణ:శ్రీమతి సంద్యారెడ్డి గారు


గోడకుచెవులున్న గోప్యంగ మాటలు

బలుక నాలుమగలు బాధతోడ

బట్టబయలుజేయు పాపమేభువిలోన

పదుగురందుజూడ పలచనగును


చెలిమిచేయగానె చిత్త మందునమాట

చెప్పగానెజనుల చెంతజేరె

గోడకున్నచెవులె గోప్యాన్ని విప్పును

పదుగురందుజూడ పాపమేగ


సుఖముగానుబ్రతుక చూసియునోర్వక

కండ్లమంటతనము కడుపుమంట

నోర్వలేని మనసు నొప్పించుమాటతో

గోడకున్నచెవులు గొడవదెచ్చు


ఆలుమగలు మాట యత్తచె విలొవేసి

గోడవలనుదెచ్చు గడలిలోన

పలకనట్టిమాట పలికినట్లుగచెప్పె

గోడకున్నచెవులు గొడవదెచ్చు


పరులుజెప్పగానె పరవశముగవిని

మమతసన్నగిల్లు మనసునందు

చెప్పినట్టిమాట చేటుకు మూలంబు

గోడకున్నచెవులు గొడవదెచ్చు


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

06/10/20, 7:08 pm - +91 98664 35831: మల్లినాథసూరి కళాపీఠం, ఏడుపాయల. 

శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో 

సప్తవర్ణముల సింగిడి - వచన కవిత 

06-10-2020 మంగళవారం 

అంశం :  దృశ్య కవిత 

శీర్షిక : " గోడకు చెవులుంటే "

నిర్వహణ : గౌll సంధ్యా రెడ్డి గారు 

రచన :  వీ. యం. నాగ రాజ, మదనపల్లె. 

**********************************


గోడకు   చెవులుంటే   గొళ్ళెము లేనట్టే 

పెదవి దాటితే పృథివి దాటినట్టే మాట

ఇంటి గుట్టు  వ్యాధి రట్టు  మనుగడకు

ఎవరి చెవిలో వేయ రాదో తెలుసుకదా


కుడిచేతి పని ఎడమ చేతికి  చూపొద్దు

పెదవులు చెవులు  ఒక్కటైతే యుద్ధమే

కళ్ళ సైగలతోనే కనికట్టు చేసెయ్యొచ్చు

భార్యా భర్తలు  పడక గదికే  పరిమితం

వెలుగు  లేకున్నా సవ్వడి ఉండ రాదు


గోడలు మాటలాడవు కాని  వింటాయి 

దాయాదుల్ని దగ్గరచేస్తాయి క్రోధాలతో

శ్రవణయంత్రాలతో పనేమి వృద్దులకైన

గారడి వారిని మించిపోతాయి గమ్మత్తై 

 

పెదవుల మధ్య మాట సందు వదిలితే

మైక్రోఫోన్ చిప్స్ గుట్టు పసి గట్టేస్తాయి

గోడకు చెవులు మైక్ సెట్లూ ఉంటాయి

వాల్యూమ్ జీరో లోనే ఉండాలెప్పుడూ 


అతి  గోప్యం  రహస్యం బట్ట బైలైనట్టు

మరీ  ఛాదస్తం మొదలు కే  చేటన్నట్టు

అజాతశత్రువు ధర్మరాజు కాకపోయిన

పరిస్థితినిబట్టి మసలుకోవాలి మించక 

పట్టు విడుపు ఉండాలి మనిషిఅన్నాక

.......................................................

నమస్కారములతో 

V. M. నాగ రాజ, మదనపల్లె.

06/10/20, 7:09 pm - +91 89852 34741: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

6/10/20

అంశం....గోడకు చెవులుంటే

ప్రక్రియ....వచన కవిత (దృశ్య) 

నిర్వహణ ..... సంధ్యా రెడ్డి గారు

రచన...‌‌కొండ్లె శ్రీనివాస్

ములుగు

""""""""""""""""""""""""""""""""""""

చీకటి బాగోతాలు రహస్య ఒప్పందాలు

అడ్డూ అదుపూ లేని ఆగడాలకు పథకం రచన

దోచినదంతా దాచేది నాలుగు గోడల మధ్యే


ఎవరూ చూస్త లేరు ఎవరూ వింటలేరన్న ధీమాతో...

గుట్టు చప్పుడు కాకుండా చేసే పనులు

అంతర్గత కళహాలు, ఆస్తి వివాదాలు

తమలో తామే కుమిలి పోయేవి

శుభ,అశుభాలు, అకృత్యాలు....


బయటికి పొక్కకుండా నలిగేవి

కొన్నయితే వింత వింతగా....

భర్తను చావబాది బయటి ప్రపంచానికి భర్తపై నిందలు

భార్యను నిత్య వేధింపులతో చంపుకుతిని భార్యను దోషిగా....


ఇలా ఎన్నో ఎన్నెన్నో....

నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) గనుక రాకుంటే కొన్ని సాక్షాలు ప్రశ్నార్థకమే...


**గోడకు చెవులుంటే మనిషి వింత వింత ప్రవర్తన చూసి కుప్పకూలి పోయేది**

06/10/20, 7:11 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 6.10.2020

అంశం. గోడకుచెవులుంటే

శీర్షిక: గోడగోడు

నిర్వహణ. అమరకుల.,సంథ్యగారు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.



గోడకు చెవులుంటే గొడవకు దారుందికీలు తొలిగే వీలుంది

పడకటింటి గోడైతే ఆలుమగల

గుసగుసరుసరుసలగుసాయింపుల

అలకలకులుకులపలుకువిని‌పరవశించి సిగ్గులమొగ్గౌతుంది

పక్కింటి గోడైతే పంచాయితి పెట్టు

కోటగోడైతే‌రాజుల‌వీరత్వ కథలు

వింటుంది తాజ్మహల్‌గోడైతే

నరకబడ్డ కూలీలఘోషవినుంటుంది

అకృత్యం అన్యాయాల‌వ్యథలకు

సాక్షీభూతమౌతుంది

అసెంబ్లీగోడైతేమంత్రులసామంతుల

కేటుగాళ్ళ దగారాజకియం‌వింటుంది

పార్లమెంటుకు గోడతే ప్రజాస్వామ్య

పేరుతో జరిగే పేచీ మాటలు విరిగిన మైకులు తూటాలు శబ్ధాలు ‌వింటుంది గుడిగోడైతే ఆర్తితో,భక్తితో

వేడికోలు దొంగభక్తుల అంతులేని

కోరికలు  సుప్రభాతగీతాలు. ప్రవచనాలు.ఆఫీసులగోడైతే లంచాలకంచాలశబ్ధాలు

మంత్రుళిళ్ళగోడలైతే కుంభకోణాల

లంబకోణ కబ్జాల లజ్జావిహీన ముచ్చట్లు  వృద్ధాశ్రమం గోడలతే

పుత్రశత్రులు చేసిన వంచనలకథలు

బడిగోడైతే పంతుళ్లు పాఠాలు, పిల్లలు వినకుండా పెట్టే టార్చర్లు

మాష్టార్ల కష్టాలు విని కన్నీరౌతుంది


వైద్యలయాలగోడైతే రోగులబాధలు

కన్నీటిగాథలు

ఒక్కోగోడ‌కు ఒక్కో కథ వినివినీ

నవ్వుతుంది ఏడుస్తుంది మురుస్తుందివేదనపడి‌కుమిలి

రగిలిపొగిలిపగిలినలిగికూలుతుంది

06/10/20, 7:18 pm - +91 99596 94948: మల్లినాధ సూరి కళాపీఠం

నిర్వహణ : శ్రీమతి సంధ్యారెడ్డి గారు.

పేరు : శాఖా శ్రీలక్ష్మీ

ఊరు : రాజపూడి

అంశం : గోడకు చెవులుంటే...? 

....................................

తన గురించి తనకంటే

పక్కింటి వైపే ధ్యాసంతా

పుకార్ల పైనే మనసంతా

గోడకు చెవిని ఆనించి

ఆసక్తి గా స్వశక్తితో 

నరం లేని నాలుక సృష్టి కర్త యై

విహర్త గా మారి విజృంభిస్తూ

పత్తేదారు ఉద్యోగాలు చేస్తూ

అనంత కాలంలో నిరంతరం ప్రక్రియ.

మనసనే తెల్ల కాగితంపై

కవి ఊహకందని కథలు వ్రాసేస్తూ

చిత్రకారుడికి తెలియని పిచ్చి గీతలు గీసేస్తూ

ఎదుట జీవితాల నుదుటి వ్రాతలు చేరిపేసి

సరి క్రొత్త పిచ్చి గీతలు గీసేస్తుంటే

కొన్ని జీవితాలకు పద పద మంటూ

ఆపదలు ఉచ్చులో  పడిపోతాయి.

తాత్కాలికమైన నిజం "వెల్ల" మాటున

కొన్ని దినాలు దాక్కుంటుంది 

గోడకు చెవులుంటే 

వేసిన" వెల్ల "వెక్కిళ్లు పెడుతుంది

ఇటుకలు  ఏడుస్తాయి

సిమెంట్ కరిగిపోతుంది.

సైకతం కపోతమై ఎగిరిపోతుంది.

అబద్దాల గోడ 

ఆక్షేపణ పాలై కూలిపోతుంది.

నివురు గప్పిన నిజం కణ కణ మంటూ

వెలుగులు విరజిమ్ముతూ 

స్వచ్ఛమైన పుత్తడిలా ప్రకాశిస్తుంది.


.

06/10/20, 7:19 pm - +91 99087 41535: 🚩శ్రీ మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయలు🚩

🌈 సప్త వర్ణముల సింగిడి🌈

పేరు:M.భవాని శర్మ 

ఊరు:జమ్మికుంట 

అంశం: గోడకు చెవులు ఉంటే

శీర్షిక: తస్మాత్ జాగ్రత్త

నిర్వహణ: శ్రీమతి సంధ్య రెడ్డి గారు



గోడకు చెవులు కాదు!


చెవిలో కూడా అ గోడలు కడతారు.


కలహ ప్రియులు!


గోరంతను కొండంత లుగా చేసి కుటుంబాలలో కలహాలు సృష్టించడం వారి లక్ష్యం.


గోడ దాపున ఉండి గోతులు ఎన్నో తీస్తారు.


పచ్చని సంసారం లో చిచ్చు లేపు తుంటారు.


జాగ్రత్త సుమా!


గోడలు ఇసుక సిమెంటు ఇటుక తో కడతారు.


చెవులకు ఏ ఖర్చు అక్కర్లేదు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు గుసగుసల 

ముచ్చట్లకు చెవులకే గోడ లు కడతారు.


తస్మాత్ జాగ్రత్త!

   

            ___🌹🌹🌹___

06/10/20, 7:33 pm - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

మంగళవారం 06.10.2020

అంశం:గోడకు చెవులుంటే

నిర్వహణ:శ్రీమతి సంధ్యారెడ్డి గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*

ప్రక్రియ:వచనం


గోడకు చెవులుంటే

గోడంతా వివరిస్తూ

మదిలోని బాధలను 

మానవులకు చెప్పలేక

మాటరాని గోడకు

మనసారా విన్నవించి

యెదభారం దించుకోవచ్చు.


గోడకు చెవులుంటే

గోతికాడ నక్కల్లాంటి

మనుషుల మోసపూరితమాటలకు,

ముందు ఒక లాగ, వెనక ఒక లాగ

ముచ్చటించేవారి మూతివిరుపులకు

మతితప్పిపోయేవి.


గోడకు చెవులుంటే

ఆకలితో అలమటించేవారి

ఆకలి కేకలు విని

ఆవేదనతో అశ్రువులు కార్చేవి.

06/10/20, 7:42 pm - +91 99599 31323: [6/10 19:05] M Kavitha: నాలుగు గదుల నా గుండెకు చెవులు ఉంటే బాగుండు....

ప్రతి ఎదను పలకరిస్తూ.....

జ్ఞాపకాల అలలను

 మో సుకెళ్తూ........

ఆనందపు నదీ తీరాల్లో కలసి ముత్యాల ఏరుకుని....

మువ్వ మువ్వలో గవ్వల సందడి చేయగా....

ఏ మనసులో ఏ మాయ

 దాగుం దో.....

కంటి రెప్ప కు జవాబు చెప్పని కాలాలు ఉన్నాయో....

తలరాతలు తలచుకుని దుఖించే దురాశలు ఉన్నవో...

ధర్మాన్ని వెతుకుతూ కాలంతో పయనించే ఆశలు ఉన్నాయో...

కాటిన్యం వెనుక దాగిన ప్రేమ స్వప్నాలు ఉన్నవో...

కనబడని గాయాలు...

వినబడని  ఏడ్పులు....

కంటికి కనబడని మేఘాల కన్నీళ్లు మెరుపులు ....

మట్టిని తాకని మానవత్వపు చుక్కలు....

వెట్టి చాకిరి జీవిత గాథలు....

బానిస బ్రతుకుల సంకెళ్ళ సవ్వడిని....

అసూయ అహంకార అవివేకం....

పగలబడి నవ్వే వేటకారాలు...

పరవశించే ఆనందాలు....

అంతులేని కథ లు...

ఈర్ష్య పడే కన్నులు....

పిరికితనం ఆలోచనలు....

ప్రేమించే హృదయాలు....

కవ్వించే అందాలు...

నా మనసు గెలిచే సంకేతాలు....

ఎన్నో నింగి చుక్కలు లెక్కలేనన్ని కోరికలు వినాలి....

మట్టిలో లెక్కపెట్టని ఇసుక తెరలు చుట్టి రావాలని....

ప్రతి మనిషిలో మంచిని వెతికే ప్రయత్నాలు....

బ్రతికి ఉన్న పరమాత్మ పలికే నివేదనలు విననా ....

మరణించిన ఆత్మ పలికే వేదనలు వినానా ...

అంతారంగాల సమాహారం ఆస్వాదించి చెవులు రిక్కించి విననా ప్రతి ఎద పలుకులు.....



దృశ్య కవిత

గోడలకు చెవులు ఉంటే

6/10/2020

సంద్యారెడ్డి గారు



కవిత సీటీ పల్లీ

06/10/20, 7:45 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

అంశం...దృశ్యకవిత

శీర్షిక ...  *చెవులున్న గోడ స్వగతం*

రచన...యం.టి.స్వర్ణలత

నిర్వాహణ...శ్రీమతి సంధ్యారెడ్డిగారు

తేదీ...06.10.2020



ఎందకీ గోడ కూలిపోయింది...

నిక్షేపంగా ఉన్నది ఎందుకు కుప్పకూలింది

అని నాగురించి ఆలోచించారా ఎవరైనా

ఏమి ఈ మానవుల ధైర్యం...

చెవులు లేవుకదా...వినలేననుకున్నారు

ఎన్నెన్ని గుసగుసలు కుట్రలు కుతంత్రాలు

ఎత్తుకు పై ఎత్తులు జిత్తులమారి మాటలు

వినీ వినీ విసుగెత్తిపోయా


ఈ చెవితొ విని ఆచెవితో వదిలేయమంటూ

ప్రతీ చెవినీ చేరవేసే విషయాలు...

మానవుల చాదస్తం కానీ...

పెదవి దాటిన మాట పృధివి దాటదా


ఒకటా రెండా...

భార్యాభర్తల సరససల్లాపాల మొదలు

కుటుంబ కలహాలు కుఠిల రాజకీయాలు

మనిషి ముందో మాట వెనకో మాట

మనసునో మాట పైకో మాట

రంగులు మార్చటంలో ఊసరవెల్లితో పోటీ

ఇదేనా మానవ నైజం


హతవిధీ!ఈ మాటలు నేను వినలేను

చేతులు లేవుగా చెవులు మూసుకోను

ఆ మాటల తూటాలకు....

పడుతున్నాయి చెవులకు తూట్లు

అందుకే తెలుపుతూనే ఉన్నా నా నిరసన

అదేనండీ గోడలో పగుళ్ళ రూపంలో...

పట్టించుకునే నాధుడే లేకపోయే

అందుకే భరించలేక  అడ్డంగా కూలిపోయా

06/10/20, 7:50 pm - +91 97017 52618: మల్లినాథసూరి కళాపీఠం, ఏడుపాయల. 

శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో 

సప్తవర్ణముల సింగిడి - వచన కవిత 

అంశం :  దృశ్య కవిత 

శీర్షిక : " గోడకు చెవులుంటే "

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి గారు 

---------------------------------------

*రచన   :  మంచికట్ల శ్రీనివాస్* 

*ప్రక్రియ : వచనము* 

*శీర్షిక    : ష్ .! ష్ ...!  రహస్యం!*   

----------------------------------------


ష్ .! ష్ ...!  రహస్యం!   


ఆ రాణి  ప్రేమ పురాణం 

ఈ రాజు  దోపిడీ విధానం!


నాలుగు గోడల మధ్య 

నరక యాతనపడి 

వెలుగుచూడని 

కథలెన్నో! వ్యథలెన్నో ! 


వావి వరసలు విడచి మరచి 

విలాసాలతో కులాసాలు 

వైభోగాలెన్నో! వైధవ్యాలెన్నో!


సవరణలు సంస్కరణలు 

దౌర్జన్యాలు దుర్మార్గాలు 

ఎన్నో మట్టికొట్టుకుపోయాయి 

ఆ గోడల సాక్షిగా...!


గోడలకు చెవులే కాదూ... 

కళ్లూ ఉంటే... తరాలనుండి జరుగుతున్న 

తంతులెన్నో వింతలెన్నో విప్పార్చి చూసేవి! 


చెవులతో విన్నదేదో చెప్పాలన్నట్లుగా 

ఆ శిథిల గోడలు నోళ్లు  తెరుచుకొని

నా వైపు చూసేవి .. 

జరిగినవి  తప్పని చెప్పడానికి ! 


కానీ.. 

అవి మూగ నోళ్లు! 

మాట్లాడలేవు వినడమే వాటి వంతు! 

అన్నీ తెలిసిన నేను ఏమి చేయని మనిషిని!

06/10/20, 8:00 pm - +91 98851 60029: మల్లినాథ సూరికళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

06.10.2020 మంగళవారం 

పేరు: వేంకట కృష్ణ ప్రగడ

ఊరు: విశాఖపట్నం 

ఫోన్ నెం: 9885160029

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి 

అంశం : గోడకు చెవులుంటే ( దృశ్య కవిత )


శీర్షిక : ఆట


గాలికి గొంతుంది

నేలకు ఉసురుంది

నిప్పుకు ఉనికుంది

నీటికి కదలిక ఉంది 

గగనానికి నిట్టూర్పుంది


పంచ భూతాలు 

పంచలేనిది గోడ

చిత్రం

ఆ గోడకు చెవులున్నాయి ... ?


ఇద్దరి మధ్య 

హద్దులు చూపే గోడ

అనుబంధాల ఆనందం 

అంధత్వం చేసే గోడ


కలిసుండే కుటుంబాలకు

కలతలు నేర్పే గోడ

కని పెంచిన పిల్లల మదిలో 

కనిపించని గోడ


గుండే లేని మూగ గోడకు

మనసేడ ఉండేది 

మాటే రాని మట్టి రూపుకు 

చెవులెట్లా మొలిచేది


అనుమానం మనుషులు 

అవకరం మనసులు 

ఆడుకొనే మోసపు ఆట

గోడ చాటు దొంగాట  

అదే ఈ గోడకు చెవులాట ...


         ... ✍ "కృష్ణ"  కలం

06/10/20, 8:02 pm - +91 94904 19198: 06-10-2020:-మంగళవారం:

శ్రీమల్లినాథసూరికళాపీఠం:ఏడుపాయల:సప్తవర్ణములసింగిడి:శ్రీఅమర

కులదృశ్యచక్రవర్తిగారిసారథ్యం;:

అంశం:-దృశ్యకవిత.

నిర్వహణ:-శ్రీమతిసంధ్యరెడ్డిగారు.

రచన:-ఈశ్వర్ బత్తుల.

ప్రక్రియ:-పద్యములు.

శీర్షిక:-గోడకు చెవులుంటే..!

###################₹₹.

కంద:-

గోడకుచెవులుండినచో

నీడకుమనసుండుగుట్టు

నిట్టులరట్టున్

వీడకపొరుగునవారికి

కీడునుతలపెట్టినూర కుండునుశిలగన్.!


కంద:-

పొరుగునజరుగువిషయముల

నిరుకునబెట్టగనొరవడి నిగలిగియుండున్

సరసమునగుసగుసలువిని

విరసంబగుతగవులాట     వీక్షితిగోడన్!


కంద:-

ఇంటిరహస్యముతెలపక

వంటింటికిపరిమితంబు

వదరకనుండిన్

తంటలురావికపొరుగున

కంటికిదూరమగునేర   కర్మములంటన్.!


కంద:-

గోడకుచెవులానించుచు

చీడపురుగులవలెవిషయమును

జీకుచునుండున్

కీడునుతలపెట్టునెపుడు

గోడకుచెవులున్నచోతగవులొచ్చు

నిలన్.!


###ధన్యవాదములుమేడం##

       ఈశ్వర్ బత్తుల

మదనపల్లి.చిత్తూరు.జిల్లా

🙏🙏🙏🙏🙏🙏

06/10/20, 8:10 pm - +91 98663 31887: *మల్లినాథసూరి కళాపీఠం* (ఏడుపాయల)

_శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో_ 

సప్తవర్ణముల సింగిడి.

వచన కవిత 

అంశం: దృశ్య కవిత 

శీర్షిక: *గోడకు చెవులుంటే*

నిర్వహణ: గౌ. సంధ్యా రెడ్డి గారు 

రచన: గంగాధర్ చింతల 

జగిత్యాల.

**** *** *** ** *** *** ****

గోడలకు చెవులుంటాయ్..

తలుపులకు కళ్ళుంటాయ్..

నోటికే తలుపు తాళం ఏది లేదు..

మనసులో కోరికలుంటాయ్..

మనిషికి ఎన్నో ఆశలుంటాయ్..

మంచి చెడు గ్రహించేందుకు మానవత్వముంది.

మదిలోని రహస్యాలు బంధిస్తే సమస్యే లేదు..

మరుగుకు మెరుగులు పెడితేనే జనాలకు ఆకర్షణ..

అదృశ్యాలకు ఆత్రమెక్కువా బయటకు రావాలని..

సదృశ్యాలకు స్పష్టతెక్కువ బహిర్గతమవ్వాలని..

రహస్యం గుట్టుగా ఉంటేనే పట్టూ..

విషయమై వ్యక్తిని మారితే విస్ఫోటనం..

గుండె గూడు దాటిన మర్మం గదిలో మాటగా మారినా..

గోడలకు గల చెవులు చేరి సంచలనమవ్వక తప్పదు.

గదిలోని రహస్యమైనా గోడల చెవులు చేరే ప్రమాదం లేకపోదు.

**** *** *** ** *** *** ****

ఇది నా స్వీయరచన..

06/10/20, 8:14 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో..

సప్తవర్ణాల సింగిడి.

దృశ్యకవిత:గోడలకు చెవులుంటే.

నిర్వహణ :సంథ్యా రెడ్డిగారు.

పేరు :తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.


శీర్షిక *గోడలువింటున్నాయ్.*

*************************

ఇరుగింటి ఎల్లమ్మ...

పొరుగింటి పుల్లమ్మ...

అంతా ఇరుగు పొరుగు వారే..

అంతా మనమేలు కోరువారే..

అయితేనేం....

ఇంటి గుట్టంతా.బట్టబయలే

గోడలకున్న చెవులు వింటాయ్.

చెవులు రిక్కరించి వింటాయి..

అక్కడి చెవులు ఇక్కడికీ..

ఇక్కడి చెవులు అక్కడికీ..

పరుగెడుతుంటాయ్.

మన గుట్టు రట్టుచేస్తుంటాయ్.

మనమంటే గిట్టనివాళ్ళు..

మనవిషయాలను వీక్షిస్తూ..

మన సంగతులను ..

బట్టబయలు చేస్తుంటారు..

మనలను వీధిపాలు చేస్తారు.

కష్టాలు కన్నీళ్ళను కురిపిస్తే..

గోడలకు అతుక్కున్న చెవులు..

గొడవలను సృష్టిస్తాయి..

ఓ నేస్తమా...తస్మాత్ జాగ్రత్త.

*గోడలకున్న చెవులు వింటున్నాయ్.!*

*************************

ధన్యవాదాలు..!🙏🙏

06/10/20, 8:14 pm - +91 94400 00427: *శుభసాయంతనము*💐💐


🚩 *శ్రీమల్లినాథసూరి కళాపీఠం - ఏడుపాయల*🚩

         *సప్త వర్ణాల సింగిడి*

*తేదీ 06-10-2020, మంగళ వారం*

*దృశ్యకవిత:-గోడకు చెవులుంటే*

*నిర్వహణ:-శ్రీమతి సంధ్యారెడ్డి గారు*

                --------****-------

            *(ప్రక్రియ:-పద్యకవిత)*


చెవులుండిన గోడలకును

వివిధ గృహవిషయము లవ్వి వెలికిన్ దెలియున్

భువిని రహస్యము దాగదు

పవనము వలె వీచి మనకు పరువును దీయున్..1


పలుకుటకును బిగ్గఱగను

కలవరపడియెల్ల జనులు కడు గుస గుసలన్

మెలకువ ననుచును గడిపిన

కలుష ధ్వని తగ్గి పోవు గద మంచిదిలే...2


మాటల తాకిడి తగ్గగ,

దీటగు మౌనమ్ము వలన ధీశ క్తియె, తా

వాటముగా వృద్ధియగును

చేటగు ప్రల్లదము లాగి చేవయు పెరుగున్..3


మన మాటలు విను గోడలు

మనమున నవ్వులు విరియగ, మనుజులు పరులన్

మునుకొని యెదురుగ పొగడుచు

వెనుకను దూషింతురనుచు విస్మయ మందున్..4


సోదరి సంధ్యమ్మ కర్ణము

నే దలచెను కుడ్యమునకు నిలనుండు నటుల్

వాదము లాడగ నోరును

లేదాయెను మంచిదియదిలే యని దలతున్..5


🌹🌹శేషకుమార్ 🙏🙏

06/10/20, 8:14 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో..

సప్తవర్ణాల సింగిడి.

దృశ్యకవిత:గోడలకు చెవులుంటే.

నిర్వహణ :సంథ్యా రెడ్డిగారు.

పేరు :తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.


శీర్షిక *గోడలువింటున్నాయ్.*

*************************

ఇరుగింటి ఎల్లమ్మ...

పొరుగింటి పుల్లమ్మ...

అంతా ఇరుగు పొరుగు వారే..

అంతా మనమేలు కోరువారే..

అయితేనేం....

ఇంటి గుట్టంతా.బట్టబయలే

గోడలకున్న చెవులు వింటాయ్.

చెవులు రిక్కరించి వింటాయి..

అక్కడి చెవులు ఇక్కడికీ..

ఇక్కడి చెవులు అక్కడికీ..

పరుగెడుతుంటాయ్.

మన గుట్టు రట్టుచేస్తుంటాయ్.

మనమంటే గిట్టనివాళ్ళు..

మనవిషయాలను వీక్షిస్తూ..

మన సంగతులను ..

బట్టబయలు చేస్తుంటారు..

మనలను వీధిపాలు చేస్తారు.

కష్టాలు కన్నీళ్ళను కురిపిస్తే..

గోడలకు అతుక్కున్న చెవులు..

గొడవలను సృష్టిస్తాయి..

ఓ నేస్తమా...తస్మాత్ జాగ్రత్త.

*గోడలకున్న చెవులు వింటున్నాయ్.!*

*************************

ధన్యవాదాలు..!🙏🙏

06/10/20, 8:15 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

అమరకుల దృశ్యకవిగారి సారథ్యంలో..

సప్తవర్ణాల సింగిడి.

దృశ్యకవిత:గోడలకు చెవులుంటే.

నిర్వహణ :సంథ్యా రెడ్డిగారు.

పేరు :తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.


శీర్షిక *గోడలువింటున్నాయ్.*

*************************

ఇరుగింటి ఎల్లమ్మ...

పొరుగింటి పుల్లమ్మ...

అంతా ఇరుగు పొరుగు వారే..

అంతా మనమేలు కోరువారే..

అయితేనేం....

ఇంటి గుట్టంతా.బట్టబయలే

గోడలకున్న చెవులు వింటాయ్.

చెవులు రిక్కరించి వింటాయి..

అక్కడి చెవులు ఇక్కడికీ..

ఇక్కడి చెవులు అక్కడికీ..

పరుగెడుతుంటాయ్.

మన గుట్టు రట్టుచేస్తుంటాయ్.

మనమంటే గిట్టనివాళ్ళు..

మనవిషయాలను వీక్షిస్తూ..

మన సంగతులను ..

బట్టబయలు చేస్తుంటారు..

మనలను వీధిపాలు చేస్తారు.

కష్టాలు కన్నీళ్ళను కురిపిస్తే..

గోడలకు అతుక్కున్న చెవులు..

గొడవలను సృష్టిస్తాయి..

ఓ నేస్తమా...తస్మాత్ జాగ్రత్త.

*గోడలకున్న చెవులు వింటున్నాయ్.!*

*************************

ధన్యవాదాలు..!🙏🙏

06/10/20, 8:22 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు.. శ్రీమతి సంధ్య రెడ్డి గారు

6.10.2020 

అంశం.. గోడకు చెవులుంటే

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్

ప్రక్రియ.. దృశ్య కవిత


గోడకు చెవులుంటే కళ్ళులేని కబోదులమై ఇల్లే సాగరమై మనసే రంగుల లోకమై

సూటిపోటి మాటల సుడిగుండాలలో

కొట్టుకుంటూ మనసు మమతలే 


కెరటాలై ఎగిసిపడిన వేళ అంతరంగము

సాలెగూడులో చిక్కుకున్న చిన్ని పురుగు వలె కొట్టుమిట్టాడుతూ జీవితమే చెప్పుడు మాటలకు లోనై న విషాద గీతిక లెన్నో!


మాటల మాటున దాగిన అంతర్యుద్ధానికి

కత్తులు  కటార్లు మందీ మార్బలం లేని 

మాటల విల్లంబులు  చూపుల బాణాలే దూసుకుపోయి మనసు ముక్కలయి 


అగాధ మయ్యే ఇల్లే రణరంగమై  

నిశ్శబ్ద యుద్ధం రాజ్యమేలుతూ 

మనుషులేమో గోడకు అతుక్కుపోయే

కాలమేమో విషము జిమ్మీ  ఆటాడే బొమ్మలను జేసే...


హామీ పత్రం... ఇది నా స్వీయ రచన

06/10/20, 8:22 pm - +91 89859 20620: అంశం.... దృశ్యక విత

నిర్వహణ,. శ్రీమతి సంద్యారెడ్డి గారు

రచన... మల్లారెడ్డి రామకృష్ణ

శీర్షిక... గోడకు చేవులుంటే


గోడకు చేవులుం టే

ఇల్లు అల్ల కల్లోలం అవుతుంది

మాటలు షికారు చేస్తాయి

మంచివాడు తనకు తెలీకుండానే

చెడ్డ వాడుగా మారిపోతాడు

వినరాని మాటలు విన్న గోడ

మరో గోడకు చెప్పుకొని

భోరున విలపిస్తుంది

ఇంట... బయట.. ఎక్కడైనా

తప్పుడు మాట పెదవి దాటరాదు

దాటితే పృథ్వి దాటి వాయుగుండం గా మారి జీవితమనే చెట్టును

పెకిలించి వేస్తుంది!

గోడకు చెవులుంటే... అక్కడే మూగబో వాలి... అంతే కాని

తలుపులను దాటించితే.... అంతా

అల్ల కల్లోలమే... అందుకే

మానవ! గోడకు చెవులుంటా యి

మాటను తూలకు సుమా!

06/10/20, 8:23 pm - Sadayya: *మల్లినాథ సూరి కళాపీఠం-ఏడుపాయల*

*సప్త ప్రక్రియల సింగిడి*

*దృశ్యకవిత:గోడలకు చెవులుంటే*

నిర్వహణ:  *సంధ్యా రెడ్డిగారు*

రచన: *డాక్టర్ అడిగొప్పుల*

శీర్షిక: *గోడచెవులు-యుద్ధాలు సృష్టిస్తాయి*


⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


*గోడకే చెవులుంటె గోప్యమంతా బయలు*

*గొడవలకు జగమంత గొడుగులే పట్టునిక*


*గోడ చెవులే కూల్చు పైడి సంసారాల*

*గోడ చెవులే పేల్చు తోడు-సంబంధాల*


*గోడ చెవులే విరుచు కుటిలముగ మనసులను*

*గోడ చెవులే చెరచు గుణవంతుని నడతను*


*గోడ చెవులే కదా! కౌసల్య రామున్ని*

*కాన లోనికి పంపి కష్టాల ముంచినది*


*గోడ చెవులే కదా! గోపాల కృష్ణున్ని*

*పారిజాతము దెచ్చి పాతింపజేసినది*


*గోడ చెవులే తవ్వు గోతులను,లోతులను*

*గోడ చెవులే నవ్వు కోరికలు తీరగా...*

06/10/20, 8:25 pm - +91 82475 55837: *మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల*

 *సప్తవర్ణాల సింగిడి*

*అంశం: గోడకే  చెవులుంటె*

*నిర్వహణ శ్రీమతి సంధ్య రెడ్డి , స్వర్ణ సమత గార్లు*

*రచన: యలగందుల.సుచరిత*

*శీర్షిక : *కుడ్యబలం*

*తేది : 06-10-2020*


విడిపోయిన మనసుల మర్మం తెలుపుతుంది


కలిసున్న జీవితాల కల్లభావనలు

తెలుపుతుంది


అమ్మాబిడ్డల అనురాగం అమూల్యతను తెలుపుతుంది


అత్తాకోడళ్ళ గిల్లికజ్జాల అసలుగుట్టు తెలుపుతుంది


కుట్రలను కుతంత్రాలను అంతం చేసేస్తుంది


ఉబుసుపోని వారి చెవులకు ఆనందం రెట్టింపు చేస్తుంది


శబ్థతరంగాలకు ఒక ఆకృతినిచ్చి అర్థాలు వెతుకుతుంది


వికృతమనస్కుల హృదిలోని దురాగాతాలను బట్టబయలు చేస్తుంది.


అబలల అణిచివేతకు అంతులేని ఆగడాలచిట్టా బయట పెట్టెస్తుంది

06/10/20, 8:33 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం : గోడలకు చెవులు (దృశ్య కవిత) 

నిర్వహణ : శ్రీమతి సంధ్యారెడ్డి గారు  

తేదీ : 06.10.2020  

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్

**************************************************

మనుసు లోతుల్లో కదిలే దొకటి 

నాలుకపై కదలాడే దొకటి 

గుండె గోడల నడుమ ఆలోచన ఒకటి 

ఆచరణలో వ్యక్తమయ్యే దొకటి 

ఆలోచన ఆచరణల అంతరాలలో

మాయాజాలం తెలియదులే 

నవ్వుతేనె పెదవులకు పులుముకుని 

నమ్మకంగా పలికే మాటల సుమాలను విసురుతూ 

నాలుగు గోడల నడుమ నడిపే రణతంత్రాలు, కుతంత్రాలు ఎన్నో 

వృత్తి రీత్యా పెద్దరికాన్ని పైనవేసుకుని 

తన నీడకు సైతం తాను చేసే పని చెప్పలేక 

గుండెలోపలే సత్యాన్ని సమాధి చేసుకునే సమాలోచనలెన్నో 

తట్టుకోలేని బాధను ఒంటరిగా 

గదిలోని నాలుగు గోడల నడుమ 

తలగడలో దాచుకున్న తరుణి వ్యధలెన్నో

ఎన్ని చెప్పీ చెప్ప గూడని 

వినీ వినగూడని మాటలను 

తన గుండెలోతుల్లో పదిలంగా దాచుకుందో 

ఆ గదిలోని గోడ 

తన చెవుల పడ్డ సత్యాన్ని వెలికక్కలేక 

ఎన్నిసార్లు తన గుండెకు పడ్డ నెత్తుటి చారికలు తడుముకుందో 

ఎన్నిసార్లు తన మనసుకు సర్ది చెప్పుకుందో

మౌనమే భాషగా మూగబోయింది 

చెవిటి దానిలా చిత్తరువయింది    

**************************************************

06/10/20, 8:34 pm - +91 98482 90901: మల్లినాథసూరి కళాపీఠం  YP

సప్తవర్ణాల సింగిడి

అంశం:-గోడలకు చెవులుంటే

నిర్వహణ :- శ్రీమతీ సంధ్యా రెడ్డి గారు

కవి పేరు :- సిహెచ్.వి.శేషాచారి

కలం పేరు:- ధనిష్ఠ

శీర్షిక :- 

*గోడలకు చెవులుంటే కొంప కొల్లేరు ( తస్మాత్ జాగ్రత్త*)

""""''''''''''''''''''''""""''''''''''''""""""""""""''''''''''''''

మామూలు మంధర చాడీ మాటలతో

రామాయణం కథా తీరుతెన్నులు మారిపోయె

మహా భారతాన శకుని చాడీలతో 

కురువంశం నిర్వంశమయ్యే

బాల కృష్ణునిపై గోపికల చాడీల మాటల

భాగవత రక్తి సుధల ఓలలాడె

దేశ దేశాల రహస్యాల 

గూఢచర్యం వల్ల గుట్టు రట్టవుతుంది

యుద్ధాలకు ఉసిగొల్పుతాయి

అందుకే గోడకు చెవులే ఉంటే

జనమంతా నోరు దగ్గర పెట్టుకొని

జాగరూకులై మెలగరూ!

నారదుని పారిజాత పుష్పానుగతమైన ఘట్టం

చిలికి చిలికి గాలి వానై

శ్రీ కృష్ణతులాభార హేతువై ఉత్కృష్ట ఘట్టానికి కేంద్ర బిందువై రక్తికట్టింది

అత్తారింట్ల ఆడబిడ్డల తోటికోడళ్ళ చాడీలు

నవ దంపతుల కొంప కొల్లేరుకు

దారితీయు

దంపతుల మధ్య మూడవ వాడీజోక్యం 

విడాకులతో విడిపోయే దుస్థితి దాపురించు

చిన్నయసూరి మిత్రభేదం గాథ

పింగళక సంజీవక ప్రాణ మిత్రులు 

కరటక దమనక లేనిపోని చాడీల 

దుష్ట కుటిలత్వం సంజీవక ప్రాణహాని హేతుభూతమైంది

శ్రీకృష్ణదేవరాయలికితిమ్మరసుపై చాడీలు

తిమ్మరుసు కండ్లు పోయే దుర్భరస్థితి కల్పించింది

కొంతమందికి ఇతరులపై చాడీలచెప్పి కొంపలార్చుట

ప్రథమావధిగా పెట్టుకుంటారు

సారంగధరునిపై పినతల్లి చాడీలు అతని మరణశిక్షకు

దారితీసె

నిజానికి చెవులు లేని గోడలు

ఈ ఇళాతళాన ఎక్కడ

కానరావనుకుంటా

చుట్టపుచూపుగా వచ్చిన

బంధువులయిన రాబందులు

కొందరు కొంపలార్చే ముచ్చట్లతో పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారు

అలనాడు స్వాతంత్ర్యోద్యమాన

గోతికాడ నక్కల గోడచెవులవారితోనే

భారతదేశం స్వేచ్చ కోల్పోయి

బానిసత్వం అనుభవించిందీ

గోడ చెవుల దాష్టీకం వల్ల

ఎందరో త్యాగధనులైన వీరులను కోల్పోయాము

ఇలాంటి నీచుల వల్ల భారత

స్వాతంత్య్రం రావటానికి

వందేళ్ళ కాలం పట్టి

సర్వస్వం కోల్పోయాం

మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమాననక్సల్అణచివేతలో

కోవర్టులు మాయా నివేదికలు

గోడ చెవుల వాటాన్ని చూపించాయనక తప్పదు

జగతిన ఎందెందు చూచిన

అందందున గోడచెవులమాటల

ఘోషలేని ప్రాంతం ఉండదనుట కల్ల 

అందున మరి ఈ కలి కాలాన

ఏమంటారు...

                      *ధనిష్ఠ*

           *సిహెచ్.వి.శేషాచారి*

06/10/20, 8:36 pm - +91 98494 54340: మల్లినాథ సూరికళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

06.10.2020 మంగళవారం 


పేరు : జ్యోతిరాణి 

ఊరు :హుజురాబాద్

నిర్వహణ : శ్రీమతి సంధ్యా రెడ్డి 

అంశం : గోడకు చెవులుంటే ( దృశ్య కవిత )


శీర్షిక : ఆ గోడకు చెవులున్నాయి 

**************************************


గోడలకు చెవులుంటే

నాలుగు గోడల మధ్య తీపిచేదు ,

అనుభవాలు 

నడి వీధి కొచ్చేవి ..


ప్రేమ,ప్రణయ అత్తరు 

సువాసనలు అపహాస్య మయ్యేవి ..


స్వేచ్ఛగా ఎగరలేక 

మాయదారి లోకాన 

మనలేక కార్చే కన్నీరు 

పరిహాసమయ్యేవి ..


గోడకు చెవులాంచి 

గొడవలెన్నో సృష్టించి 

గోతులు తవ్వుతూ

బతికేస్తుంటారు 

కొందరు సమాజానికి 

భారంగా ..


అటువంటి వారికి 

ఉందాము దూరంగా ..


నోరు అదుపులో 

ఉంచుకుంటూ 

మాట పొదుపుగా 

మార్చుకుంటూ  

బ్రతికేద్దాం గౌరవంగా ..


 🌹బ్రహ్మకలం 🌹

06/10/20, 8:40 pm - +91 98499 52158: శ్రీ మల్లినాథ కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి yp

అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆధ్వర్యంలో

అంశం:గోడలకు చెవులుంటే

నిర్వహణ:శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

శీర్షిక:నానుడి నిజమే కదా.

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్

తేదీ:6/10/2020

 


పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగుతూ ఎవరు చూస్తాలేరు

అనుకుందటా .

సూర్య చంద్రులే పంచభూతాలు సాక్షాలు గా నిలిచి ధర్మాన్ని రక్షిస్తున్నాయి.

ఓ గురువు గారు తన శిష్యులకు ఒక తల ఒక అరటి పండు ఇచ్చి తినమన్నాడాట

అందరు తలాఒక వైపుకు వెళ్లి

చెట్టు చాటుగా,పుట్ట చాటుగా,గదిలో కెళ్లి తలుపు మూసి,కళ్ళుమూసుకుని,ఎవరికి వారే ఎవరు చూడకుండా తినడానికి నానరకాల తంటాలు పడి తిన్నారు వచ్చి గురువు గారి ముందు కూర్చున్నారు.

రాము మాత్రం ఆ అరటి పండును చేతిలో పెట్టుకుని కూర్చున్నాడు 

గురువు గారితో అందరూ మేము ఎవరు చూడకుండా తిన్నామని వారి ఎలా తిన్నారో

కూడా చెప్పారు.

రాము చేతిలో పండు చూసి నువ్వెందుకు తినలేకపోయావని అడిగారు.

గురువు గారు .

మన్నించండి గురువు గారు

నేను తినలేక పోయాను సృష్టి లో ఎవరు లేని ప్రదేశమంటూ లేదని ఎలా తిన్నా అది దొంగ తిండేనని తినలేదని చెప్పాడు.


గురువుగారు ప్రయోగ పూ ర్వకంగా శిష్యులందరికి తప్పు చేయడం ఎంత ఆవివేకమే

సృష్టి ప్రాణసమ్మెలితం అంతట

వ్యాపించి ఉన్న కనిపించని ఛైతన్యం ప్రభోధించారు..

06/10/20, 8:45 pm - +91 99519 14867: మల్లినాథసూరికళాపీఠం yp

ఏడుపాయలు. 

సప్తవర్ణసింగిడి. 


నిర్వహణ : శ్రీమతి సంధ్యారెడ్డి గారు. 

అంశం : గోడకు చెవులుంటే... 


పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

నాగర్ కర్నూల్. 


శీర్షిక : కాకి కూతలు. 


నిశబ్ధంగా 

అబద్దాలకోరు

విన్నది విన్నట్టుగా కాక

నరంలేని నాలుకతో 

మాయమాటలతో 

మూటలు కట్టి 

కోటలు కట్టేస్తారు 

కూతలు కోస్తూ... 


గోడలకు చెవులు 

నిక్కపొడుచుకొని 

ఇరుగు పొరుగు వారి 

ఇంటి గుట్టంతా 

ఇట్టే బయట పెట్టి 

ఇంట్లో వున్న  విషయం 

బజారుకి ఇడ్చి 

ఇజ్జతి హీనం తీస్తారు. 


గిట్టని వారు కట్టగట్టుకోని 

వొట్టిమాటలు కట్టిపెట్టోయ్ 

గట్టిమేలు తలపెట్టోయ్ 

అన్నట్లు కాక 

కాకి కూతలా 

కోతలు కోస్తారు

గోడలకు చెవులుంటే అన్నట్లు. 


పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

9951914867.

06/10/20, 8:48 pm - +91 95536 34842: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

అంశం:- గోడకు చెవులుంటే

నిర్వహణ:- శ్రీమతి సంధ్యా రెడ్డి గారు

రచన:- సుకన్య వేదం

ఊరు:- కర్నూలు


గోడకు చెవులుంటే...

రహస్యాలన్నీ బట్టబయలు...

తన వారితో కూడా మాట్లాడలేని భయం...

మనసులోని మర్మాన్ని విప్పలేని వైనం...

ఎన్ని కొంపలు కూల్చేస్తాయో...

ఎందరి జీవితాలను బలి చేస్తాయో...

ఎన్ని యుద్ధాలకు కారణమవుతాయో...

ఎన్నెన్ని ఉపద్రవాలు తెచ్చి పెడతాయో...

పెదవి దాటిన మాట పృథివి దాటుతుందట‌...

నోటిని అదుపులో ఉంచుకో...

పొరపాటుగానైనా పరుషంగా మాట్లాడకు...

నీవారి రూపంలోనే పరులుంటారని మరువకు...

నీ నీడను కూడా ఎప్పటికీ నమ్మకు...

రహస్య మంతనాలెన్నో ముప్పు తెచ్చి పెడతాయి...

శత్రువుల చెవిన బడి రచ్చకెక్కిస్తాయి...

జాగ్రత్త పడకపోయావో 

లోకం కోడై కూస్తుంది...

నలుగురి నోటిలో నిను నానుస్తుంది...

తస్మాత్ జాగ్రత్త...!జాగ్రత్త...! జాగ్రత్త...!!

06/10/20, 8:48 pm - +91 79891 76526: మల్లినాథసూరి కళా పీఠం 

సప్తవర్ణముల సింగిడి

అంశం: గోడకు చెవులు ఉంటే

ప్రక్రియ: వచన కవిత

నిర్వహణ: సంధ్య  గారు


తేది:6-10-2020

శీర్షిక: విశ్వ శ్రవణం


            *కవిత*


గోడకి చెవులు ఉంటే రహస్యాలకు కాళ్లు వచ్చి ముఖ్య సంగతులు వినువీధులలో విహరించు


రహస్య సమావేశాలకు 

ఆంతరంగిక ఆలోచనలకు

కళ్లెం పడును

చీకటి సామ్రాజ్యవాదుల మంతనాలు బయట పడు

మనలో పడే అంతర్మధనం బహిర్గత పడి మనసు

 తేలిక పడు


ఎంతోమంది రహస్యజీవితాలు

ఘనకార్యాలు ప్రపంచానికి తెలియని వింతలు విశేషాలు శాస్త్ర సాంకేతిక అంశాలు బహిర్గతమవుతాయి


రచన: 

తాడిగడప సుబ్బారావు

కలం పేరు: రసజ్ఞ వాగ్దేవి

పెద్దాపురం 

తూర్పుగోదావరి

జిల్లా


హామిపత్రం:

ఈ కవిత నా సృజన అని దేనికి అనుకరణ కాదని

ఈ కవిత ఏ సమూహానికి గాని ప్రచురణకుగాని  పంపలేదని తెలియజేస్తున్నాను

06/10/20, 8:49 pm - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీమతి సంధ్యారెడ్డి గారు 

పేరు… ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :06-10-2020

అంశం : గోడకు చెవులుంటే 

శీర్షిక : గోడకు చెవులుంటాయా ?ఉంటే ..


మనిషికి తన చెవులపై నమ్మకము లేక 

తన నమ్మకమునే తాను నమ్మ లేక 

ఎదుటివారు నమ్మకముగా తనకు చెప్పింది 

అంతే నమ్మకముతో తాను విని వదిలివేయలేక 

మోసి మోసి అలసిసొలసీ అనుమానపు 

విష బీజాలను నాటి పెంచుకున్నదే ఈ తోక 


ప్రేమ యను ఇటుకరాళ్ళను పేర్చి 

నమ్మకమను సిమెంటు ను కలిపి 

త్యాగమను నీరును తడుపుకుంటూ 

సర్దుకునే పునాది రాళ్ళపై నిర్మించేదే గోడ 


గోడకు చెవులున్నాయంటే నిర్మాణ లోపమా ?

లొసుగులతో కట్టుకున్న లోపాయకారి ప్రేమా ?

ఆత్మను మోసగించుకుంటూ గడిపే బ్రతుకా ?

ముళ్ళ కత్తులను ఒరలో దాచుకున్న బంధమా ?


మారాలి అది రక్షణ నిచ్చే దుర్భేద్యమైన కోట గా 

పెనవేసుకోవాలి వివాహబంధాలతో ప్రేమ మేడ గా 

నిగ్గుతేల్చాలి పరిస్థితుల పరీక్షల్లో అగ్ని పునీతగా 


గోడకే చెవులుంటే దుర్జనులెవరో సుజనులెవరో 

అరక్షణం లో వాటినమర్చిన నాయకులకు చూపించి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు త్రాగించి ...వెంటాడి వెంటాడి వేదించునేమో 

మనసులోని మాలిన్యాలను కడిగి కడిగీ 

మంచి ముత్యాలమనుషులుగా సానబెట్టునేమో 

మోసపు ముసుగులోని కాఠిన్యహృదయులను 

బండారాన్ని బయటబెట్టి మంచి రాజ్యానికి వజ్రకవచమై నిలుచునేమో ..


హామీ పత్రం : ఇది నా స్వీయ వచన కవిత.ఈ సమూహము కొరకే వ్రాసితిని .

06/10/20, 8:58 pm - +91 98868 24003: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్త వర్ణముల సింగిడి

అంశం : గోడలకు చెవులు


కనీవినీ ఎరుగని మాయలు జరుగుతున్న ఈ కలికాలంలో, ధర్మం ఒక పాదం మీదే నడుస్తున్న ఈ మోహపు జగత్తులో, అరిషడ్వర్గాలు రాజ్యమేలుతున్న ఈ అవకతవకల ప్రపంచంలో

ఏ ఇంద్రజాలానికో రెక్కలు వచ్చి ప్రతి గోడకూ చెవులను అమర్చితే ఎంత బాగుండును?!

ఏళ్ళ తరబడి కోర్టు తీర్పునకై వేచి చూడనవసరం కనుమరుగై నేరాలన్నీ  బయటపడతాయనే భయంతో సంశయంతో చిటికెలో మాయమై అందరిలోనూ మంచితనం వెల్లివిరిసి విశ్వకళ్యాణం నిత్యతోరణమై సకల జనులు సుఖముగ నుందురు కదా.

06/10/20, 8:58 pm - +91 94940 47938: మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమర కుల దృశ్య కవి వారి ఆధ్వర్యంలో

నిర్వహణ :శ్రీమతి సంధ్య రెడ్డి గారు

పేరు: నెల్లుట్ల సునీత

ఊరు :ఖమ్మం

అంశము: గోడకు చెవులుంటే

కవిత శీర్షిక: జరజాగ్రత్త

******************"********

గోడు చెప్పుకుందామని

గూడు లో చేరి

గోడకు చెవులుం టె

ఇంక చేసేదేముంది

ఇంటికి గోడలు రక్షణ కవచం

అని

కంటికి రెప్పలా కాపు కాచి

కనిపించని కుట్రల వెనక గోడల కి చెవులు

మదిలో భావాలు చెప్పుకోలేక

ఎదలో బాధలను భరిస్తూ

కష్టాల కొలిమిలో కాలుతున్న

స్వేచ్ఛగా బాధ కూడా పంచుకోలేని పరిస్థితి


వెక్కిరింతలు వెటకారాలు మూతి విరుపులు

హేళన లు అవమానాలు

కష్టపడి మంచిగా బ్రతికితే ద్వేషాలు ఏడుపులు

మనమేం చేయాలి అని ఆలోచించకుండా

ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచనలే

గోడలకు చెవులతో అతికిస్తారు


ఇంటి గుట్టు బయట రచ్చ

ఆప్యాయతలు పంచి నట్టే ఉంటూ

వెన్నుపోటు పొడిచే స్వార్థం మనుషుల

ఆలోచనలు.


ఒక్క దానికి రెండు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తాయి

ఒక చెవిన పడితే వేయి చెవులలో పడ్డట్టే

చులకనగా చూస్తూ వివక్షతకు గురి చేస్తూ.

ఊరంతా డప్పు చాటింపు లు

జీవితాంతం నటిస్తూనే ఉంటారు

షికార్లు వెనక పుకార్లు వస్తుంటాయి గోడలకు చెవులుంటే

అందుకే జర జాగ్రత్తగా ఉందాం!!

06/10/20, 8:58 pm - +91 97049 83682: మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణాల సింగిడి

అంశం:గోడకు చెవులుంటే

నిర్వాహణ:శ్రీమతి సంధ్యారెడ్డి గారు

రచన:వై.తిరుపతయ్య

తేదీ:06-10-2020

శీర్షిక:సత్యం దాగదు


**********************

ఏ మూలన ఏమి దాగిన

ఏ అంతరంగంలో దాగిన

ఎన్నిమంత్రతంత్రాలు పన్నిన

ఎవరు చూడరులే అనుకున్న

ఎంతదూరం తప్పించుకవెళ్లిన

ఎన్ని కట్టుబాట్లు చేసినా

ఎప్పటికప్పుడు త్రిసంధ్యలు

రాత్రిపగలు,కాలం,యమ

ధర్మరాజు,పంచభూతాలు

ధర్మదేవత,సత్యం ఇవన్నీ

రికార్డ్ చేసి వింటూంటాయి

ఎన్ని పన్నాగలు పన్నిన

ఎవరు చూడలేదనుకున్న

ఎవరు వినలేదు కదా అనుకున్న అంతరాత్మనే 

తుదకు తెలుపుతుంది

ఏది ఎప్పుడు దాగదు

కాలమే నిర్ణయిస్తుంది.

06/10/20, 9:00 pm - +91 91821 30329: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం!గోడకు చెవులుంటే

(దృశ్య కవిత)

నిర్వహణ!శ్రీమతి సంధ్యారె

డ్డి గారు

రచన!జి.రామమోహన్రెడ్డి


గోడకు చెవులుంటే

గొడవలకు కొదువుండదు


సమస్యను నాలుగు గోడల మధ్యే పరష్కరించాలి


వ్యాధి  రట్టు 

సంసారం గుట్టు 


వ్యాధిని రట్టు చేయాలి

వ్యాధికి తగ్గ ఔషధం తో

వ్యాధిని నయం చేయవచ్చు


సాగరానికి ఆటు పోట్లు తప్పవు

సంసారంలో  ఎన్నో ఒడు

దుడుకులు రాక మానవు


సమస్యలకు  పరిష్కారమా

ర్గం అన్వేషించి

నాలుగు గోడల మధ్యే నిర్ణ

యం తీసుకోవాలి

యింటి సమస్యలు యింటి

వరకే పరిమితం కావాలి

సంసార గుట్టు పది మందికి

తెలిస్తే

అలుసై హేళనకు గురికాక

తప్పదు

అందుకే గోడకు చెవులుం

టాయి జరభద్రమంటారు

పెద్దలు

06/10/20, 9:02 pm - +91 99891 91521: *శ్రీ గురుబ్యో నమః*      *మల్లినాథసూరికళాపీఠం*


💥🌈 *సప్తవర్ణముల సింగిడి*  🌹🌷


 *మంగళవారం06.10.2020*


*నేటి అంశం: దృశ్య కవిత*


*గోడకు చెవులుంటే*


*నిర్వహణ.శ్రీమతి సంధ్యారెడ్డి*


              *ఫలితాలు*


★★★★★★★★★★★★

        *విశిష్ట దృశ్యకవనాలు*

★★★★★★★★★★★★

శేష కుమార్ గారు

అమరకుల దృశ్యకవిగారు

వెలిదే ప్రసాద్ శర్మ గారు

మంచికట్ల శ్రీనివాస్ గారు

దాస్యం మాధవి గారు

B వెంకటకవి గారు

నరసింహ మూర్తి చింతాడ గారు

మాడుగుల నారాయణ మూర్తి గారు

తులసి రామానుజా చార్యులు గారు

బల్లూరి ఉమాదేవిగారు

ఈశ్వర్ బత్తుల గారు

డా అడిగొప్పుల సదయ్య గారు

మోతే రాజ్ కుమార్ గారు

డా నాయకంటి నరసింహ శర్మగారు

ఆవేరా గారు

విజయ గోలి గారు

సుకన్య వేదం గారు

V సంధ్యారాణి గారు

కాళంరాజు వేణుగోపాల్ గారు

బక్క బాబురావు గారు

నీరాజా దేవి గుడి గారు

వెంకటేశ్వర్లు లింగట్ల గారు

అంజలి ఇండ్లూరి గారు

శ్రీ రామోజు లక్ష్మీ రాజయ్య గారు

డా కోవెల శ్రీనివాస చార్య గారు 

త్రివిక్రమ శర్మ గారు

సుధా మైథిలి గారు

కొప్పుల ప్రసాద్ గారు

చంద్రకళ ధీకొండ గారు

విత్రయశర్మ గారు

VM నాగరాజు గారు

స్వర్ణలత గారు

యలగందుల సుచరిత గారు

CHV శేషాచారి గారి

ప్రియదర్శిని కాట్నవల్లి గారు


■■■■■■■■■■■■■■


 *ప్రత్యేక దృశ్యకవితలు


■■■■■■■■■■■■■■


స్వర్ణ సమత గారు

మొహమ్మద్ షకీల్ జాఫరీ గారు

రాజపేట రామబ్రహ్మం గారు

అరుణ చయనం గారు

ఉదయశ్రీ ప్రభాకర్ గారు

కామవరం ఇట్లూరి వెంకటేష్ గారు

పేకెటి శైలజ గారు

B సుధాకర్ గారు

డా సూర్యదేవర రాధారాణి గారు

భరద్వాజ రావినూతల గారు

ప్రభాశాస్త్రి గారు

ఆవలకొండ అన్నపూర్ణ గారు

పబ్బ జ్యోతిలక్ష్మి గారు

రుక్మిణి శేఖర్ గారు

డా చీదేళ్ల సీతాలక్ష్మి గారు

మల్లెఖేడి రామోజీ గారు

గాజుల భారతీ శ్రీనివాస్ గారు

చిల్క అరుంధతి గారు

దార స్నేహాలత గారు

శైలజా శ్రీనివాస్ గారు

CH వెంకట లక్ష్మీ గారు

ఎడ్ల లక్ష్మీ గారు

K రాధిక గారు

లలితా రెడ్డి గారు

సంధ్యా ఐ గారు

యేల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డి గారు

J పద్మావతి గారు

యక్కంటి పద్మావతి గారు

గాండ్ల వీరమణి గారు

శిరిశీనహాల శ్రీనివాస మూర్తి గారు

కట్టెకోల చిన నర్సయ్య గారు

ఓ రామ్ చందర్ రావ్ గారు

సుజాత తిమ్మాన గారు

బందు విజయ కుమారి గారు

వసంత లక్ష్మణ్ గారు

ప్రొద్దుటూరి వనజా రెడ్డి గారు

Kondle శ్రీనివాస్ గారు

శాఖా శ్రీలక్ష్మి గారు

రావుల మాధవీలత గారు

వెంకట కృష్ణ ప్రగడ గారు

తాతోలు దుర్గాచారి గారు

నల్లేల మాలిక గారు

మల్లారెడ్డి రామకృష్ణ గారు

సిరిపురపు శ్రీనివాస్ గారు

జ్యోతిరాణి గారు

నెల్లుట్ల సునితగారు


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

     *ప్రశంస దృశ్య కవనాలు

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


పేరం సంధ్యారాణి గారు

యడవల్లి శైలజ గారు

D విజయకుమార్ శర్మగారు

P సింగరాజ శర్మ గారు

బోర భారతీ దేవి గారు

శైలజ రాంపల్లి గారు

పొట్నూరి గిరీష్ గారు

గోల్తీ పద్మావతి గారు

మరింగంటి పద్మావతి గారు

పిడపర్తి అనితాగిరి గారు

ముడుంబై శేషఫణి గారు

దుడుగు నాగలత గారు

గాంగేయ శాస్త్రిగారు

తెలికి చెర్ల విజయలక్ష్మిగారు

శ్రీదేవి చింతపల్లి గారు

కోణం పర్శ రాములుగారు

M భవాని శర్మ గారు

కవిత సిటీపల్లి గారు

కాల్వరాజయ్య గారు

కల్వకొలను పద్మకుమారి గారు

గంగాధర్ చింతల గారు

తాడిగడప సుబ్బారావు గారు

పోలె వెంకటయ్యగారు

ముద్దు వెంకటలక్ష్మి గారు

Y తిరుపతయ్య గారు

G రామ్ రామ్ మోహన్ రెడ్డి గారు



నేటి *దృశ్యకవిత* లో దృశ్యానికి అనునయించి రాసిన కవిమిత్రులకు *ప్రతిక్షణం సమీక్షలు చేస్తూ అందరిని ఉత్తేజపరుస్తూ నాకు సహకరించిన కవిమిత్రుల కు హృదయపూర్వక నమస్సులు* 🙏🤝🚩💐

 

【 *నాకు ఈ అవకాశం కల్పించిన గురుసమానులు,నాకు మార్గదర్శకులు మా అన్నయ్యకు సదా కృతజ్ఞలతో శ్రీమతి సంధ్యారెడ్డి* 】🙏🙏🙏💐🚩


*మొత్తం 108 మంది తమ రచనలు పంపారు.💐💐👏👏

06/10/20, 9:07 pm - Telugu Kavivara: <Media omitted>

06/10/20, 9:07 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-160/2🌈💥*

                       *$$* 

             *శివుడైనా 

*ఢమరుకము నఖ శిఖము నిప్పుల కణం*

*సతిని బలిచేసిన తరుణం శివుడి త్రినేత్రం*

*భగ్గుమనెనే దిగంతం దక్షుడిపై మహా రౌద్రం*

*ప్రచండుడయె దక్ష ప్రజాపతి అగ్రహో దగ్రం*

                          *@@*

                *అమరకుల ⚡ చమక్⚡*

06/10/20, 9:07 pm - Telugu Kavivara changed this group's settings to allow only admins to send messages to this group

06/10/20, 9:15 pm - Velide Prasad Sharma: *అభినందనలు108సెంచరీ*

(రాసిన కవులందరికీ...నిర్వాహకులకునూ)

కం!

ఇంతటి వేగము తోడుత

వంతుగ తగు ఫలితములను వాసిగ దెలిపెన్

చెంతన నూటాయెన్మిది

యంతటి కవివరుల సంఖ్యయద్భుత మమ్మా!

కం!

అభినందనలమ్మా యిక

శుభకాంక్షలు మీకునేడు శోభను కూర్చెన్

శుభదినమయెకద నేడిట

సభయలరించెనుకదమ్మ సంధ్యారెడ్డీ!(గణం కోసం ఏక వచనం వాడినాను.ఏమనుకోవద్దు.)

వెలిదె ప్రసాదశర్మ

06/10/20, 9:16 pm - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

06/10/20, 9:29 pm - B Venkat Kavi: *జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ*



దేవ దేవుడే దీప్తుడు దేనియందు

జటము వాయువై గంగమ్మ నాట్యమాడ

కనుల దృశ్యమై కనువిందు కళల తోడ

పరమ పార్వతి పసందు పాణివలెను


అమరకులదృశ్యకవిగాన నమరినారు

అందచందము నుండగా నందునలర

బుధ్ధి కుశలత నుండెను బుధుడుగాన

చమకు నింద్రమై చాపము చంద్రవలెను


శూల ధారియై పార్వతి శుభముగొల్ప

చిత్ర చైత్రమై చిద్రూప చిందులేయ

పంచ భూతాలు నుప్పొంగె పరమ శక్తి

ఆది పురుషుడు నాదియుమాతగాన


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*అమరకుల దృశ్యకవి చక్రవర్తికి సర్వ శుభాకాంక్షలు*


*మాయందరిహృదయాలయానందమకరందచందననీరాజనాలు*


*బి. వెంకట్ కవి*


💥💥💥🌹💥💥💥

06/10/20, 9:32 pm - +91 96038 56152: ఆ ఢమరుకనాదములే 

ఘన వ్యాకరణ సూత్రాలయి..


అమరభాష కాయువులై 

బీజాక్షర సానువులై..

 

జగతి సుగతి కాంక్షించే మాహేశ్వర సూత్రములై...


 కైలాసనాథుడాడిన తాండవ పదఘట్టనలవి.. 

పరమశివా.. జగదీశా.. 

పాహి పాహి పరమేశా.. 

అనుగ్రహించ వేగరారా..

ఆనందతాండవశ్శివా.. 

***   *విత్రయశర్మ*


(మీ చమక్కు ఇచ్చిన మహత్తు ఇదీ..)

06/10/20, 9:46 pm - +91 97017 52618: *అభినందనలు* 

👏👏👏💐💐💐

*108  ప్రత్యేకత* 

*108 * సంఖ్య ప్రాచీన భారతీయులకు చాల పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో 108 సంఖ్యకు మనము  ప్రాముఖ్యతనిచ్చాము .దేవునికి/దేవతలకి మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర తులసి/రుద్రాక్షలు గల పవిత్ర జపమాలలను గణిస్తూ జపం చేస్తాము.108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో గల హిందువులే కాదు, భౌద్ధులు, జైనులు, సిక్కులు వంటి వారు కూడా గుర్తించారు. 

(ఇప్పుడు  క్రిష్టియన్స్ కూడా ప్లాస్టిక్, రేడియం జపమాలలు స్టైల్ గా  మొదలెట్టారు) 

*మనిషి*  తనలోని దైవత్వం గ్రహించడానికి ఆత్మ *108* మెట్లు దాటాలని పూర్వీకుల నమ్మకం.

బారతీయ జ్యోతిష్యంలో 12రాశులు, 9గ్రహాలు ఉంటాయి. 12ని 9తో హెచ్చవేస్తే 108.సంఖ్య శాస్త్రం ప్రకారం 108లో 18కి యజ అనే పేరు. దేనిని తిరగవేస్తే ''జయ'' అని వస్తుంది. ఈపేరుతోనే మహాభారతం లిఖించబడింది. కాలక్రమంలో ''జయ'' అనే ఇతిహసాన్ని పెంచడం వలన ''మహాభారతం'' అనే పేరుతొ ప్రసిద్ది చెందింది.

ఇంతటి వైశిష్ట్యం గల 108సంఖ్య ఎంతో దివ్యమైనది. ఇది సృష్టికర్తకు, సృష్టి అనుసంధానం కలిగించేది. అందుకే ఋషులు, పురాణములు, వేదములు, భారతీయ సంస్కృతి 108సంఖ్యకు పవిత్రత ఇస్తున్నది.

ఇలా చెప్పుకుంటూ పోతే *108 *  ఒక అద్భుత విశేష సంఖ్య. 


*అటువంటి అద్భుతమైన కవన సంఖ్య 108 సాధించిన నిర్వాహకులు శ్రీమతి సంధ్యారెడ్డి గారికి అభినందనలు* 


-------------------

*మంచికట్ల శ్రీనివాస్*

06/10/20, 9:55 pm - +91 94902 35017: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల 

అంశం: గోడకు చెవులున్నాయి...


గోడలకు కనిపించని 

చెవులున్నాయి

మన గుసగుసలన్నీ వింటున్నాయి

ఈర్ష్యాసూయలతో

కుళ్లు కుతంత్రాలతో

చెడుఆలోచనలను చేస్తూ

గోతులు తవ్వెందుకు

సిద్ధమవుతున్నాయి


గోడలకు చెవులున్నాయి

తన పనులు వదిలేసుకుని

పక్కవాడి పనులపై 

ఆరా తీస్తూ... 

వాని సమస్యలకు 

మనసులో

ఆనందపడుతున్నాయి.



గోడలకు చెవు లున్నాయి

ఇరుగు పొరుగు వృద్ధి చూసి 

మసలిపోతూ

నక్కవినయాలు చూపుతూ

పైకెంతో ప్రేమను

నటిస్తున్నా యి


చెవులుందాల్సింది

గోడలకు కాదు....

మనసుకు....

సాటి మనిషి బాధను

వినేందుకు....

మనిషిగా స్పందించేందుకు



బి.స్వప్న

హైదరాబాద్

06/10/20, 10:48 pm - venky HYD: 27 నక్షత్రములు 4 దిక్కులు/స్థానాలు 27×4=108


భూమి నుండి సూర్యుని దూరం సూర్యుని వ్యాసానికి 108 సార్లు

06/10/20, 11:09 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

07/10/20, 5:43 am - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల. సప్తవర్ణాల సింగిడి

అంశం.అర్థనారీశ్వరం

నిర్వహణ.బ్రహ్మశ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు

రఛన. డానాయకంటి నరసింహ శర్మ.


అమేయుడు ,అజేయుడు అనాద్యంతరూపుడు ,

మృడానీపతీశుడు అర్ధాంగరూపుడు , భూతనాథుడు భర్గుడు ,

 భస్మోద్ధూళిత విగ్రహుడు,

 పరేతభూమీ నిలయుడు, నాగాభరణుడు, 

ఉడురాజ శేఖరుడు , 

గజరాజ త్వక్ వసనుడు ,

నిటాలాక్షుడు నిటలలోచనుడు

ప్రమథ గణాభిసేవితుడు ,

సురధునీ కళత్రుడు ,

కాలకంధరుడు ,స్థాణుడు ,

ధూర్జటి ,వ్యుప్తకేశుడు ,

దిగంబరుడు , 

నిరంజనుని ,సతతం స్మరిస్తూ జపిస్తూ.



డానాయకంటి నరసింహ శర్మ

07/10/20, 5:55 am - +91 80089 26969: ✍️మల్లినాథ సూరి కళాపీఠం yp

ప్రక్రియ:: వచనం

అంశం :: అర్ధనారీశ్వరం(తాత్వికత)

నిర్వహణ:: శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు.

రచన::  దాస్యం మాధవి.

తేదీ:: 7/10/2020


అర్థం కాని తత్వం కాదు అర్ధనారీశ్వరం

అపార్థాల మడుగులో మునిగితేలు

మనసుకది విడ్డూరం

తత్వశాస్త్రం అనుసరించు వారికది ఆశావాదం...


సమయ సమపాలనకు 

ఒకపాలు ఒద్దిక సహన అలంకరణ నిర్మలత్వం సౌందర్యం 

మరువైపు సామర్థ్యం నిష్కాపట్యము

సౌష్టవ స్పర్థాహ్వానము

ఆరాధన ఆడంబరం నిశ్చలం శౌర్యం..


వల్లకాని వేళల్లో వంతుపాడని విధి ఆటలకు

వరుస కాని వ్యక్తిత్వం విరోధి కాలమగును...

నీలోని వ్యవహారిక భిన్నత్వాన్ని శంఖించకు మనిషీ...

అణువణువూ కాచి 

బ్రోచే శివుపార్వతులది అర్థనారీశ్వరం

అంతరాత్మ సాక్షిగా

అమ్మలా లాలించే నీ మనసు

నాన్నలా హెచ్చరించే నీ బుద్ధి

నీలోని అర్థనారీశ్వరమే...


సంయమనం నెలకొల్పుకునుట అర్ధనారీశ్వర తత్వసిద్ధాంతం...

సామరస్యం నిలపెట్టుకునుట నీ కర్మం ధర్మం...


దాస్యం మాధవి...

07/10/20, 5:23 am - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

07/10/20, 6:16 am - Bakka Babu Rao: సప్త వర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం....తాత్వికం ..అర్ధనారీశ్వరం

నిర్వాహణ...వెలిదే ప్రసాద శర్మ గారు

రచన..  బక్కబాబురావు

ప్రక్రియ.....వచనకవిత


ప్రకృతియే శక్తికి ప్రతీకయై

అర్ధనారీశ్వర తత్వమై

చీకటి వెలుగుల సమతుల్యతతతో

స్త్రీ పురుషుల జీవన సూత్రమై


దంపతుల మధ్య బాంధవ్యాన్ని

అంతర్లీనంగా బోధించే తత్వమై

సృష్టికర్తకే దివ్య దర్శనమిచ్చి

అర్ధనారీశ్వరుడవై వెలుగొంద గ


పుష్పమందు పరిమళం చంద్రుడిలో వెన్నెల

సూర్యునిలో దివ్య తేజస్సులా

శక్తి స్వరూపుడైన పరమశివుడు

సృష్టి లయ కారకుడై నిలిచే


కుడిబాగమున పురుష ప్రకృతి

ఎడమవైపున స్త్రీ ప్రకృతి

వధూవరుల వివాహ క్రతువు లో

అర్ధనారీశ్వర తత్వమే మూల మయ్యే


పతిలో పరమేశ్వరుడి రూపం

సతిలోపార్వతి దేవి తేజం

భోధించేదే అర్ధనారీశ్వర తత్వం

సృష్టి కర్త తపో దీక్షకు కరుణించి


స్త్రీ జనోత్పత్తికై ఆదిశక్తిని

అర్ధ భాగము నుండి వేరు చేసే

చరా చరా సృష్టిలో దాక్షాయని గా

ప్రజాపతి దక్షుని పుత్రికగా జనన మోందే


సమాజానికి శక్తి స్వరూపులై

ఆది దంపతులు ఆరాధ్య దైవమై

అర్ధనారేశ్వరులై వెలుగొంద గా

ఆశీస్సులతో దీవించిరి జగంమందున


బక్కబాబురావు

07/10/20, 6:27 am - +91 93014 21243: మల్లినాధ సూరి కళా పీఠం

ఏడుపాయల

తాత్వికాంశం అర్ధనారీశ్వర

నిర్వహణ - వెలిదెప్రసాద్ శర్మ

ప్రక్రియ - వచనం

రచన  - తెలికిచర్ల విజయలక్ష్మి

తేదీ - 7-10-2020


ఏడ నించొచ్చింది, ఎందుకొచ్చిందో

పొమ్మన్నా పోదే శివా!

ఎవరూ రమ్మనలేదు, అందరూ పొమ్మన్న పోదేమి శివా!


తిండి తినలేకున్నాము,పండ లే కున్నాము, పొమ్మన్న పొదేమి శివా!


తల్లి చావు చూడలేదు, పిల్ల పురుడు పొయ్య నే లేదు ఈ కరోనా పొమ్మన్న పోదేమి శివా!


పట్టెడన్నం లేని పేదవాడి ని వదలదు, రాజ్యాలు ఏలేటి రాజుని వదలదు పొమ్మన్న పోదేమి శివా!


నీకు, నాకు భేదం లేదు, ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికి ఎరుక, ఈ కరోనా పొమ్మన్నా పోదేమి శివా!


ఎన్ని ప్రాణాలు తీస్తుందో, ఎప్పు డు వెళుతుందో నీకు ఎరుకయితే చెప్పవా శివా!


శివుడి ఆజ్ఞ లేకున్న చీమైనా కుట్టదంటారే, మరి ఈ కరోనా పురుగు ని పొమ్మని చెప్ప రాదే శివా!


మా మాట నే, నీ మాట గా పొమ్మని ఈ కరోనా ని పో పొమ్మని ఇక నైనా చెప్పవా శివా!

07/10/20, 7:18 am - Velide Prasad Sharma: సప్తవర్ణాల సింగిడి

*మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

                             *బుధవారం..తాత్వికాంశం*    

                 (7-10-2020 )

*********************************

                  *అర్ధనారీశ్వరం*

**********************************

ముఖ్య పర్యవేక్షణ: *అమరకుల దృశ్యకవిచక్రవర్తి గారు*


నిర్వహణ:వెలిదె ప్రసాదశర్మ


పద్యం...గేయం..వచనకవిత...ఏదేని *ఒక ప్రక్రియలో 20వాక్యాలకు మించకుండా* మంచి పదజాలం భావంతో *ఆకర్షణీయముగా* రచన చేయండి.


*ఉదయం 6గంటల నుండి రాత్రి *9గంటల  లోగా రచనలు పంపవచ్చు.*

(తప్పైనా ఒప్పైనా ఫరవాలేదు.ప్రయత్నం ముఖ్యం.)


*అందరూ రాయండి.అందులో మీరే ముందుండండి.*


*అందరి రచనలు రికార్డు చేయబడుచున్నవి.*


         💐*****************💐

07/10/20, 7:18 am - Velide Prasad Sharma: <Media omitted>

07/10/20, 8:04 am - +91 79818 14784: సప్త వర్ణముల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠంyp

అమరకల దృశ్యకవి సారధ్యంలో

నిర్వహణ: వెలిదెప్రసాద్  7-10-2020

రచన: కట్టెకోల చిన నరసయ్య

ఊరు: బోదులబండ జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

అంశం: అర్ధనారీశ్వరం 

శీర్షిక: లోక కళ్యాణం!



నీవు సగం నేను సగం

ఒకటైన మనిద్దరం అందరికీ ఆదర్శమయం!

నేల సగం నింగి సగం

ఒకటైన ప్రకృతి ప్రాణికోటి మయం!

రేయి సగం పగలు సగం

ఒకటైన భూగోళం భూపరిభ్రమణ మయం!

ఉరుములు సగం మెరుపులు సగం

ఒక్కటైన వర్షం ప్రాణాధారమయం!

వాగు వంకలు సగం నదీనదాలు సగం

ఒక్కటైన సముద్రం సంపదలకు నిలయం!

రైతు సగం పశువు సగం

ఒక్కటైన పంట ప్రాణికి ఆహార మయం!

ఆకలి సగం దప్పిక సగం

ఒక్కటైన పోరాటం జీవ మనుగడ మయం!

ప్రశ్న సగం సమాధానం సగం

ఒక్కటైన సమాజం నైతిక విలువలమయం!

పార్వతి సగం! పరమేశ్వరుడు సగం!

అర్ధనారీశ్వర పరమార్థం! లోకకళ్యాణ మయం!!

07/10/20, 8:18 am - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

07-10-2020 బుధవారం

పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

అంశం: తాత్వికాంశం

శీర్షిక: అర్ధనారీశ్వరా (56) 

నిర్వహణ : వెలిదె ప్రసాద శర్మ


ఆటవెలది 1

ఇంటి పనులు చేసి కేగి ఆఫీసుకు

వంట పనులు తీర్చి వాహనంబు

నెక్కి పద్మ, వ్యూహ నే రీతిగా తోలి

అర్ధనారి మణులు ఆహ లింగ


ఆటవెలది 2

అంట్లు తోమివేసి ఆఫీసుతో పాటు

కసువు నూడ్చి మాపుగాల గాడి

నెక్కి చాకిరేవు నే రీతిగ నుతికి

అర్ధనారి గనులు ఆహ దుర్గ


ఆటవెలది 3

నింగి నంత నుదురు నీదియే ఈశ్వరా

గంగ మతలబైన కనులు నిప్పు

నేల మీద చావు నెపములు ఊపిరా

లీలలర్థమవుట లిప్తకాల


ఆటవెలది 4

నివురు కప్పినట్లు నీదు మాయా శివ

నిప్పు ఎగసి నట్లు నిజము ఛాయ

అగ్ని లింగ తిరువ అరుణాచలేశ్వరా

అహము వీడి కలిసి అర్ధనారి

 వెం*కుభే*రాణి

07/10/20, 8:18 am - venky HYD: <Media omitted>

07/10/20, 8:31 am - +91 98491 54432: ఆటవెలదులందు అర్ధనారీశ్వరతత్వ వేంకటేష్ గారు బాగుంది అభినందనలు 👍🌺👌🌸👏💐మోతె రాజ్ కుమార్ (చిట్టి రాణి)

07/10/20, 8:32 am - Bakka Babu Rao: అర్ధనారీశ్వర తత్వాన్ని ఆట వెలదులతో.చక్కగాభివర్ణించారు నింగినంత నుదురు నిదియే ఈశ్వరా

వెంకటేష్ గారు

అభినందనలు

🌻🌺🌷🌹🙏🏻👌

బక్కబాబురావు

07/10/20, 8:33 am - +91 97040 78022: శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం

సప్త వర్ణాల సింగిడి 7/10/2020

అంశం-: తాత్వికము. అర్ధనారీశ్వరము

నిర్వహణ-: శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు

రచన-:విజయ గోలి

ప్రక్రియ-వచన కవిత

శీర్షిక -:ఆదిదంపతులు


శివుడు లేని శక్తి లేదు

శక్తి లేక శివుడు లేడు

శివ శక్తి స్వరూపమే

అర్ధ నారీశ్వరం


ఆలుమగల అన్యరూపం

ఒకరికొకరు ఏకమైన

ప్రకృతి పురుషుల

సృష్టి గతుల గమకములే

అర్ధ నారీశ్వరం


అంబ అంటే అఖిలమే..

అయ్య అంటే ఆది అంతము 

అర్ధమిచ్చి అర్ధాంగిగ

అతివ విలువను అధిక పరిచిన

ఆదిదేవుని పూర్ణ రూపం

అర్ధ నారీశ్వరం 


తనువు సగము తరుణికిచ్చి

తత్వమరయగ చేసెను

నీవు నేనను భేదమొదిలి

మనది మనమను బాటయే

అర్ధ నారీశ్వరం


సంసారమందున 

సగము సగము సంపూర్ణ మంటే

సాగిపోవును సంబరంగ

తత్వమెరిగితె తపన తీర్చును..

అర్ధ నారీశ్వరం

07/10/20, 8:44 am - Velide Prasad Sharma: *అలర్ట్...అలర్ట్...అలర్ట్..అలర్ట్*

ఈ రోజు అంశం: *అర్థనారీశ్వరం*

మీరు రాసే ప్రతి రచననూ *అర్థనారీశ్వరునకే అంకితం చేయబడును.*

అధిక మాసం ఇది.భగవంతుని మాసం. *ఈ నెలలో చేసే మంచిపనులన్నీ భగవంతునకే అర్పితం చేయాలి*.దాని వలన మనకు నిత్య సంతోషాలు..అభీష్టం నెరవేరగలదని పెద్దలంతా చెబుతారు.కాబట్టి మల్లినాథసూరి పీఠం ద్వారా ఈ నెలలో  *మనం చేసే కవన క్రతువు మనకు మంచి ఫలితాన్ని ఇవ్వగలదు.* ఇది అరుదైన అవకాశం.కనుక

ఈ రోజు రాయకుండా ఎవరూ ఉండకండి.చిన్న రచన అయినా సరే అంశంపై రాయండి. *భవానీ శంకరునకు అర్పితం చేయబడుతుంది.*

...వెలిదె ప్రసాదశర్మ

07/10/20, 8:47 am - venky HYD: ధన్యవాదములు

07/10/20, 8:47 am - venky HYD: ధన్యవాదములు

07/10/20, 10:14 am - +91 98850 66235: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి..


అంశం: అర్థనారీశ్వర

నిర్వహణ: వెలిదె ప్రసాద్

రచయిత; కొప్పుల ప్రసాద్ నంద్యాల

శీర్షిక: జీవనయానం సూత్రం


చీకటి వెలుగుల సమతుల్య సంగమం

చీకటి వెలుగులు స్త్రీ పురుషులకు సమానం

ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం

ఒకరి చీకటిలో ఒకరు సేదతీరడం

మానవ జీవన సూత్రం

పరస్పరం ప్రేమానురాగాలు

దంపతుల మధ్య బాంధవ్యల అనురాగాలు

అంతర్లీనంగా అర్ధనారీశ్వర తత్వం

ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ

సాగర సాగర ముందుకు సాగుతూ

భార్యా భర్తల బంధం బలోపేతం చేస్తూ

ఆలుమగల అనురాగానికి ప్రతీకలై

పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వం అర్థం చేసుకుంటు

జీవనయాత్ర సాగించాలి..

తనువు రెండు ఒకటే అయినా

ఆత్మలు ఏకమై

భూమ్మీద భార్యాభర్తలుగా అవతరిస్తారు

జీవన యాత్ర కొనసాగిస్తారు

ఆదర్శ దాంపత్యం కొనసాగిస్తారు..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

07/10/20, 10:22 am - +91 97013 48693: @ఇల్లూరు వెంకటేష్



సరళంగా చందస్సు లో

పద్యాలు అద్భుతః

🌻🌻👏👏👏👏🌻🌻

07/10/20, 10:23 am - +91 98679 29589: *సప్తవర్ణముల సింగిడి*

 *మల్లినాధసూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*తాత్విక అంశం: అర్ధనారీశ్వరం*

*శీర్షిక: చీకటి వెలుగుల సమతుల్య సంగమం*

*ప్రక్రియ: వచనం*

*నిర్వహణ: శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు*

*తేదీ 07/10/2020 బుధవారం*

*మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట్ర* 

         9867929589

Email : shakiljafari@gmail.com

""""""""''''''""""""""'"""''"''''''"""""""""""''''""""""""""

ఒక నాణెంనకు చిత్తు బొత్తులా

ప్రతి పురుషుడిలో స్త్రీ దాగి ఉంది ఆదిశక్తి రూపమై...


మన హృదయం లోని ప్రేమ - కరుణలు స్త్రీ మమత రూపాలే, మదిలో మెదిలే దయా గూడా దాని స్వరూపమే...


వెలుగు లో మనల్ని నింపివేసే దినం,

అంధకారంలో సేద తీర్చి రిక్తం చేసే రాత్రి,

అర్ధ, అర్ధ భాగాల్లో పంచబడ్డ మన జీవితం అర్ధనారీశ్వర తత్వానికి ఆధారం...


చీకటి వెలుగులు స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి, ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం ఇదే జీవన సూత్రం...


ఈ సూత్రమే హిందూ జీవన విధానంలో చెప్పబడ్డ అర్ధనారీశ్వర తత్వం....


 'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' 

(జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు) అని వాళ్లను పూజించడటం హిందూ ధర్మ మాన్యత...


*మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

*మంచర్, పూణే, మహారాష్ట్ర*

07/10/20, 10:35 am - +91 96523 71742: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:అర్థనారీశ్వరతత్త్వం

నిర్వహణ:వెలిదె ప్రసాద్ శర్మగారు

రచన:దుడుగు నాగలత


నీవోసగం నేనోసగం

ఒక్కటైతేనే అది అర్థనారీశ్వరతత్త్వం

శివడు శక్తి కలిస్తేనే శివశక్తి

పుట్టింటిపై అభిమానంతో వెళ్ళిన సతికి

అవమానం ఎదురైనప్పుడు

వెక్కిరించలేదు ఆ పరమేశ్వరుడు

ఆమె అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు

భక్తుల కష్టాలకు విచరితుడై

హాలాహలాన్ని మింగినపుడు

భర్తకంఠాన్ని నొక్కిపట్టి

విషాన్ని అక్కడేఆపేసింది కాత్యాయని

భార్యాభర్తలు చూచుటకు ఇద్దరు

వారి మనసులు మమేకం

భర్త తొందరపడితే భార్య ఆపాలి

భార్య తప్పుచేస్తే భర్తసరిదిద్ధాలి

ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండటమే

అర్థనారీశ్వరతత్త్వం

ఒకరి ఆలోచనలు ఒకరు

ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకుంటూ

జీవితకాలం కలిసిఉండటమే

అర్థనారీశ్వరతత్త్వం

07/10/20, 10:47 am - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

తేదీ -07-10-2020

అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -అర్ధనారీశ్వరం

రచన -చయనం అరుణాశర్మ

నిర్వహణ -శ్రీ వెలిదె ప్రసాద శర్మ

శీర్షిక -అర్ధనారీశ్వర తత్వం


ఆది దంపతుల ఆనందయోగం

జగన్మాతా పితరుల జగన్మోహన

రూపం 

అర్ధనారీశ్వరం

విశ్వసృష్టికి భాష్యం

విధాత అకుంఠిత దీక్షా తపఃఫలం

సతీ పతుల అనురాగ సంగమానికి

సంకేతం

అర్ధనారీశ్వరమే అఖిలజగం

చీకటివెలుగుల సమతుల్య

సమ్మిళితం

హైందవ సంస్కృతి జీవనసూత్రం

సకలం శివ శక్తిమయమై

అలరారు ఆలుమగల అన్యోన్యం

ఒకరిలో ఒకరు సగమై

ఒకరే ఒకరికి జగమై

చెరిసగమై రసజగమేలే

గౌరీ శంకర శృంగం

జాబిలి వెన్నెల జత కలిసినట్లు

పూలలో తావిలా పులకించినట్లు

పాలూనీళ్ళలా పాలు పంచుకొని

వీడని సుమ గంధమై

జన్మ జన్మలకు విడలేని

వివాహ బంధమై

ప్రకృతి పురుషుల ప్రణయమై

జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడమే

అర్ధనారీశ్వర తత్వం

07/10/20, 10:57 am - +91 98662 03795: 🚩శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో 🙏

బుధ వారం 

తాత్వికాంశం  07/10/20 

ప్రక్రియ- వచనం  

నిర్వహణ -శ్రీవెలిదె ప్రసాదశర్మ   గారు 

అంశం -అర్ధనారీశ్వరం 

శీర్షిక-ఆదర్శనానికి చిరునామా ..!

ఆణువణువు నిండిన అంతర్యామి -

భార్యకు అర్ధభాగం ఇచ్చి నిలుపుకున్నస్వామి -

ప్రకృతి పురుషుల ఏకత్వం --

సహజసృష్టికి కాదా మూలం -

నింగీనేలా సగం సగం ఈప్రకృతిలో -

అర్ధభాగాలుకలవనిదే లేదు భూగోళం -

ఆలుమగల అన్యోన్యతా రూపం -

సర్వజనులకు అది ఆదర్శప్రాయం -

భార్యాభర్తల దాంపత్యానికి -

కట్టుకున్నదాన్ని కష్టనష్టాల విడవరాదన్న సూక్తికి మూలం -

అఖిల జగతినేలే దేవుడాయన -

సకల జనులబ్రోచే  తల్లి ఆమె -

భేదం  కానరాదు ఎవరికి -

తండ్రిపై ఆగ్రహించిఆహుతి అయిపోయిన అర్ధాంగి

విరహాలభరించలేని స్వామి - 

తనువున అర్ధభాగమిచ్చి పక్కనే ఉంచుకున్నాడు పరమేశ్వరుడు ఈదేవిని  -

క్షణకాలపు ఎడబాటుబాయని వారి జంట -

అందరికి కన్నులపంట -

ఆదిభిక్షువు ఆస్వామి -

శ్మశానాల కాపురాలు -

అయినా విడవలేదు భార్యప్రేమలు -

నాతిచరామి అన్న మంత్రానికి ఓ రూపం వారు -

ఆణువణువూ బ్రోచికాచే పార్వతీ పరమేశ్వరులు -

ఆదిదంపతులుగా వెలుగొందే వీరు -

జగమెరిగిన వారికి చిరునామాలు -

ఒకరికొకరుతోడై-

ఒకరికొకరు నీడై -

నోర్లు వేరైనా  మాటకొక్కటిగా -

కళ్ళురెండైనా  చూపు ఒకటిగా -

శరీరాలువేరైనా ఆత్మఒకటిగా -

నడిచే అర్ధనారీశ్వరం -

జగతికి ఆదర్శప్రాయం -

అభినందనీయం -

 ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల(RB)🖋️

కొత్తపట్నం 

9866203795

07/10/20, 11:22 am - venky HYD: ధన్యవాదములు

07/10/20, 11:39 am - +91 73969 55116: మల్లినాథ సూరి కళాపీఠం yp

డా. సుధా మైథిలి

అంశం:అర్ధనారీశ్వరం

నిర్వహణ:శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు

--------------------

ఇరువురొకటై


ధర్మార్ధ కామమోక్షములనతిక్రమించని

దంపతులు అన్యోన్యతకు ప్రతీకయై..

పతిలో పరమేశ్వరుని దర్శించు సాధ్వియై..

పత్నిలో పార్వతిని దర్శించు ఉత్తముడిగా..

ఆలుమగలన్న ఇరుదేహులే కానీ..

ఏక మనస్కులన్న తీరుగా 

వాగర్ధముల వలే ఏకమౌతూ..


చీకటి వెలుగుల సంగమమై ఒకరికి ఒకరై..

ఒకరిలో మరొకరు సేద తీరుతూ..

కలిమిలేములను కష్టసుఖాలను 

కలిసి పంచుకుంటూ..

పరస్పర ప్రేమ బాంధవ్యాలను పెనవేస్తూ..

త్రికరణ శుద్ధిగా మెలుగుతూ..

అంతర్యామి తో మమేకమవ్వడమే అర్ధనారీశ్వరతత్త్వ అంతరార్ధం..

07/10/20, 11:53 am - +91 98495 90087: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:శ్రీ వెలిదెప్రసాద్ శర్మ

                గారు. 

తేదీ:-07.10.2020

అంశం:-అర్థనారీశ్వరతత్వం

            (పురాణం) 

పేరు:- ఓ. రాంచందర్ రావు

ఊరు:-జనగామ జిల్లా

చరవాణి:-9849590087


వాగార్ధసంప్రౌక్తౌవాగార్ధప్రతిపత్తయే, జగజగతఃపితఃరౌవందే

పార్వతీ పరమేశ్వరౌ.

శబ్దమునకు, అర్ధమునకువిడదీ

యరానిసంబంధంఎలానో, అలాగే పార్వతీ పరమేశ్వరుల

సంబంధంకూడాఅంతే.ఆది, అంతములేనివాడు,ఆదిశంకరు

డు, భోళాశంకరుడు, అడిగిందే

తడువు, శత్రువైనా, మితృడైనా  

దానవుడైనా, మానవుడైనా

ఎవ్వరైనాలేదనకుండావరములుఇవ్వడమే ఆయనపని.అర్ధ

నారీశ్వరతత్వం, భిన్నత్వంలో, 

ఏకత్వమేప్రధానం. నాన్నలోసగ

మే అమ్మ, శరీరాలువేరు, ఆత్మ

ఒక్కటే. పృకృతీ, పురుషులకల

యిక. అధ్యైతసిద్దాంతం.నిజాని

కి రెండూకాదు ఒక్కటే అని అర్థము. ఆకాశంలో సగం, అర్ధ

భాగం. ప్రతి మగవాడివిజయం

వెనుక ఒక స్త్రీ ఉంటారనే విషయమై ఈభావన.

'సర్వమంగళమాంగల్యేశివేసర్వార్ధసాథికే ఒకేదేవినారాయణి

నమోస్తుతే.' స్త్రీలందరి సౌభాగ్యంకాపాడేసాక్షాత్తుఆశివంకరికి, తనమాంగల్యంపై

ఎంతోనమ్మకం,శివునిపైఅపార

మైన ప్రేమానురాగాలు. అందుకే

సముద్ర మధనంలో,హాలాహల

ముఉథ్బవించినప్పుడు, అందరిమొరఆలకించడానికి, 

సమస్త లోకాలనుకాపాడడానికి,

శివుడుహాలహలభక్షనకుఒప్పకుంటే, అంతే గుంభనంగా

పార్వతిఒప్పకుంది.శివంఅంటే

శుభమని, మంగళప్రధమని, 

సంపదఅని,ఇలా ఎన్నో అర్ధాలు. నిరంజనుడు, నిరాకారుడు, జగత్తంతాగోళాకా

రమని, లింగాకారమని, ఇలా ఎన్నో తత్వాలకుమూలరూపం

అర్ధనారీశ్వరతత్వం.లౌకికంగా

సంసారం అనే వాహనానికి భార్య భర్తలిరువురు,రెండుచక్రా

లలాంటివారు.సంయనంతోభవ

సాగారాన్నిదాటితరించాలని

దీనిలోనిఆంతర్యము.

07/10/20, 11:55 am - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*07/10/2020*

*తాత్వికత*

*అంశం:అర్థ నారీశ్వ ర తత్వం*

*నిర్వహణ:శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


*అర్థ నారీ శ్వర తత్వం*


పార్వతి పరమేశ్వరులు ఆదిదంపతులు

స్థితి లయకారకు లు, విశ్వ సృష్టికి మూలం

సూర్యుడు_సూర్య రష్మి

శశి__ శరశ్చంద్రిక వలె

సమ్మిళిత భావనకు ప్రతీక

అన్యోన్యత కు __అనురాగానికి

సంకేతం

శివుడు__శక్తి

భక్తి__ముక్తి

సంగమం_హృదయంగమము

ప్రమోదము__ప్రమథ గణ ము

ప్రకృతి__పురుషుడు

సతి పతుల బంధానికి

వారే ఆదర్శం

స్త్రీ నీ గౌరవించాల నే భావన

అంతర్లీ నమై ఉంది

ఒకే ఆత్మగా జీవించాలని చెప్పడం

పరస్పర అవగాహన కు

అర్థనారీశ్వర తత్వము

అద్భుత_అమోఘ అస్తిత్వానికి

నాంది.

07/10/20, 12:01 pm - +91 98492 43908: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల

బి.సుధాకర్

అంశం..అర్థనారీశ్వరం

నిర్వాహణ.. ప్రసాద్ శర్మ


మనసులు కలిసి మనిషిగ మెలుగుచు

ఒకరికి ఒకరని పాలు నీళ్ల మాదిరైతే

చెప్పేదేముంది జీవితం హద్దులేని

పయనంలా సాగిపోవు


త్యాగాల కోవెలలో పూసే కుసుమం

భానుడి కిరణాలను తాకగానే తన్మయిస్తు

ముసిముసి నవ్వుల మురిపెంతో

పరిమళాలు పంచుతు పరవశించు


తాళికట్టగానే తలవంచిన తరుణి

ఎగతాళిలేని సంసార బంధంలో

అర్థ భాగమై అర్థాంగిగా అవతారమెత్తు

అన్నీ పంచుకొని అర్ధనారీశ్వర రూపమై వెలుగు


ఆదర్శ జంటగా శివ పార్వతీ జంట

అన్యోన్య దంపతుల ఆనంద జీవితం

శక్తి యుక్తుల సమ్మేళనంతో

భక్తి మార్గము చూపు అరధనారీశ్వరం

07/10/20, 12:01 pm - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

బుధవారం 07.10.2020

తాత్వికాంశం:అర్ధనారీశ్వరం

నిర్వహణ:శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*

ప్రక్రియ:ఇష్టపది


పార్వతీ వల్లభుడు

           పాపాల హరియించు

కైలాసనాథుండు

           కైవల్య పథమిచ్చు

భూతగణ నాయకుడు

           భోళా శంకరుడే

గరళాన్ని మింగెనే

            గంగమ్మ వల్లభుడు

మన్మధుని మసిచేసి

            మహిమలెన్నో చూపె

కన్నప్పను కాచిన

           కరుణాంతరంగుండు

మంజునాథుని తలపు

          మార్కండేయ పిలుపు

అద్వైత రూపుడే

          అర్ధనారీశ్వరుడు

నటరాజ స్వామిని

          నమశ్శివాయంటూ

మనసుతో కొలవండి

          మహిలో మహేశ్వరుని

07/10/20, 12:05 pm - +91 98663 31887: *మల్లినాధసూరి కళాపీఠం*

(ఏడుపాయల)

_సప్తవర్ణాల సింగిడి_

తేదీ -07-10-2020

*_అమరకులదృశ్యకవి_* ఆధ్వర్యంలో..

అంశము: అర్ధనారీశ్వరం

నిర్వహణ: శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు..

రచన: గంగాధర్ చింతల ఊరు: జగిత్యాల.

**** *** *** ** *** *** ****

అన్నీ నేనేనని అంటావు..

నీలో గౌరమ్మకు సగమిచ్చావు.

సృష్టి యావత్తు నాదంటావు..

శూన్యంలోనే నీవుంటావు.

శ్మశాన నివాసం చేస్తుంటావు..

పాపఖర్మలు చూస్తుంటావు.

ఆదిశక్తి ఆ అమ్మ వారితో..

యోగనిద్రలో కూర్చుంటావు.

నడిశిరస్సున గంగమ్మ నెత్తుకొని..

నీటిచుక్క కై పరితపించేవు.

భక్తిగ చేసే జలాభిషేకంతో

తన్మయత్వం పొందేవు.

కఠోర తపస్సు చేసినగాని

కనికరించవు మహదేవా.!

చారెడు నీళ్ళు తలపై పోస్తే

పుట్టెడు వరములనిచ్చేవు.

విశ్వకాంతియగు నెలవంకని

నీదు సిగన ధరియించేవు..

భక్తితో నీ ముంగిట చిరుదీపం

పెడితే కోటి కాంతులను ఒసగేవు..

ఏమిటో ఏమో ఈ పరమార్థం..

ఎంతకు వీడని మోహపు తంత్రం. 

ఆలుమగలలో మీరుంటారు..

ఆదిదంపతులని కీర్తించ బడేరు.

నిత్యభక్తులు నీ శరణు కోరితే

నిఖిల పరిక్షలు పెట్టేవు.

కిరాతకుడు యగు కన్నప్ప పెట్టిన..

మాంస నైవేద్యమును మెచ్చావు..

భోళా శంకర భోళ మననస్కుడ

ఈ జగమంతా నీ శరణమే.. 

ఏక దేహమై ఈ జగమంతా..

సృష్టి కి లయం నకు కారకులు.

**** *** *** ** *** *** ****

ఇది నా స్వీయరచన అని హామీ ఇస్తున్నా..

07/10/20, 12:09 pm - +91 95502 58262: మల్లి నాధ సూరి కళాపీఠం yp

7-10-2020

అంశం: పురాణం 

అర్దనారీశ్వర తత్వం

నిర్వహణ:వెలిదే ప్రసాద్ శర్మ 

రచన: శైలజ రాంపల్లి

  మహిమాన్విత తత్వం (గేయం)

.................................

"ప్రకృతి పురుషుడు సగం సగం!

సృష్టి ధర్మమము సంపూర్ణం !

శక్తి మయం! శివ శక్తి మయం !

ఆద్యంతం శక్తి మయం శివ శక్తి మయం "

      "ప్రకృతి"

  లయము తోని జనించు శక్తి !

  శక్తి తోనే లయమని తెలుసా!

  ఒకటి తోఒకటి వీడిలేనిది

  ప్రకృతి పురుషుడు సమం 

 శివ పార్వతులు సమం సమం 

 అర్దనారీశ్వర తత్వం అదేకదా

 అక్షర సత్యం !

   నీది నాదను వాదన లేదు 

చెరి సగమను మహిమాన్విత తత్వం ! 

మమత సమతల మాంగల్య బంధం !  

జగతిలో వెలుగు పవిత్ర బంధం !

      "ప్రకృతి"

07/10/20, 12:14 pm - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : తాత్వికాంశం 

శీర్షిక : అర్ధ నారీశ్వరం

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : వెలిదే ప్రసాద్ శర్మ 


నింగిలో సగం 

నెలలో సగం 

కష్టంలో భాగం సుఖంలో భాగస్వామ్యం 

ప్రకృతి లేని విశ్వమెక్కడ 

స్త్రీలేని బాంధవ్యమెక్కడ 

సంసారసాగరంలో తెరచాప నావ 

తెరచాపలేని నావ దిక్కులేనట్లే 

నావ లేని తెరచాపకు పరమార్థమేది

రెండు తోడయితేనే నావ తీరంచేరు

అదే ఆలుమొగల తత్వం 

అర్ధనారీశ్వరం 


మానవ జీవనవిధానం మహోన్నతం 

వేదాలు వక్కాణించిన అక్షరసత్యం 

జాతులు రెండేగా 

ఆడ మొగలే తప్ప ఇంకేముంది 

సృష్టి రహస్యాలు జీవన మార్గాలు   

సతిస్థానం పతిఎదలోనే 

పతికొలువుండేది సతిమదిలోనే 

సృష్టి కదలికకు శివుని ఆఙ్ఞయే ఆధారముగా


తలపై గంగమ్మ 

అర్ధభాగం పార్వతమ్మ 

అదే కదా శివతత్వం 

అర్థనారీశ్వర భాగస్వామ్యం 

లక్ష్మీనారాయణ స్వరూపం 

వాణిబ్రహ్మల అన్యోన్యం 

అదేకదా ఆలుమగలకు ఆదర్శం 

భార్యభర్తలంటేనే అన్యోన్యసర్దుబాటు 

ఒకరికొకరు చేదోడై 

ఒకరికి మరొకరు బాసటై 

ఒకరు మరొకరికి అనురాగ సంపదైతే 

అదే కదా భారతీయ సంస్కృతి 

అదే కదా వేదాలు చెప్పిన కుటుంబనీతి 

జగత్తుకు అందించిన సంసారపరిణితి 


వివాహంతో ఒక్కటయ్యే బంధం 

శతవసంతాలు పరిమళించే సుమం 

మేనులు వేరైనా మనసులు ఒకటే 

ఆలింగనపు మమకారం అర్ధనారీశ్వరమే

సంతతి స్థిరపడేవరకు పంచుకొందురు కష్టనష్టాలు 

కన్నీళ్ళచ్చిన చంద్రమతి మాంగల్యమే 

రెక్కలొచ్చిన పక్షులు స్వేచ్ఛవిహాంగాలైతే 

ముదిమివయస్సులో ఒకరికొకరే

ఆలంబన 


అనురాగపుమమకారాలు వలపుహోమంలో సమిదెలైతే 

నెమరువేసుకునే భాద్యతల స్మృతులు చక్కరకేళిలే 

అర్థనారీశ్వర తత్వానికి అసలైన వేదిక అదే కదా 

మాంగళ్యబంధానికి బందీ అయితేనే 

జీవనగమనానికి పూలదారి 

శారీరక కలయికే అనుకుంటే జీవననావపయనం కల్లోలకడలే 

అర్ధనారీతత్వానికి నగుబాటే


హామీ : నా స్వంత రచన

07/10/20, 12:15 pm - +91 80197 36254: 🚩శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో 🙏

బుధ వారం 🚩

తాత్వికాంశం  07/10/20 

ప్రక్రియ- వచనం  

నిర్వహణ -శ్రీవెలిదె ప్రసాదశర్మ   గారు 

అంశం -అర్ధనారీశ్వరం 

శీర్షిక-సర్ధుకుంటే అంతా హాయి... !

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

వసుదైక కుటుంబానికి మూలం 

చూడ చక్కని కుటుంబం 

జగతిలో పవిత్ర బంధం 

భార్యా భర్తల బంధం 

చక్కనైన మూర్తిమత్వం 

ఒకరినొకరు అర్ధం

 చేసుకోవటమే మూలం 

అర్ధం చేసుకునే తత్త్వం 

అర్ధనారీశ్వర తత్త్వం 

ఎవరూ ఎక్కువ కాదు 

ఎవరూ తక్కువ కాదు 

ఒకరికి ఒకరై ఒకరిలోఒకరై 

ప్రేమకు మారుపేరుగా 

తలపుల తపనగా 

తప్పొపప్పులు ఎత్తి 

చూపించుకోకుండా 

అణుకువ తో అనురాగంలో 

పాలు తేనె లా కలసిపోయి 

ఆప్యాయతల ఆత్మీయుల 

సమాహార మాలిక 

మురిపాల ప్రేమ కానుక 

పవిత్ర బంధం అదే భార్యాభర్తల 

సంబంధం..... అణువంత 

శక్తికివిశ్వమంత 

తేజము తోడైతే.... 

ఆసంసారంలో సరిగమలు 

జగమంత కుటుంబానికి 

ఆదిదంపతులు మాతాపితరులు 

అదే అర్ధనారీశ్వర తత్త్వం 

లయకారుడు శక్తిరూపిణి 

శక్తి లేనిదే నిస్సత్తువ జగానికి 

శివం శక్తిమయం 

ప్రేమ విశ్వమయం 

    

శైలజా శ్రీనివాస్ ✍️

07/10/20, 12:22 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- అర్ధనారీశ్వర తత్వం ( తాత్వికత) 

నిర్వా హకులు శ్రీ వెలిదిప్రసాద్ శర్మ గారు పేరు:-పండ్రువాడసింగరాజు

 శర్మ

తేదీ :-07/10/20 బుధవారం

శీర్షిక:- దేహం పంచిన దేవదేవుడు

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- వచన కవిత

ఫోన్ నెంబర్9177833212

6305309093

**************************************************

శ్రీమతికి అర్ధ భాగం ఇచ్చి త్రి లోక పూజ్యుడిగా త్రినేత్రుడు

అమిత శక్తి పరుడు అద్వైతమూర్తి అర్ధనారీశ్వరుడు

బోలా శంకరుడు కోరిన వరములు నొసగు  కైలాసవాసి


ముక్తి మార్గపు   త్రోవా చూపించు గంగాధర  నాగభూషణ నటేెశ  నిరహంకారా  నందీశ్వరా పాహిమాం ప్రభూ అర్ధనారీశ్వరా


చితాభస్మం అలంకారము చిన్మయ రూపము చిద్విలాసం

ఫణిభూషణా జాగు చెయ్యకు

వేగము రారా పార్వతినాధా


లయకారక  రుద్రాక్షదారి జ్ఞాన చక్షువులను పాహిమాం పంచభూతేశ్వరా   కరిచర్మ దారి  కావగ రారా కైలాసవాస....

***********************************************

07/10/20, 12:25 pm - +91 95422 99500: This message was deleted

07/10/20, 12:28 pm - Madugula Narayana Murthy: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

07-10-2020 బుధవారం

పేరు: 

*మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా*

అంశం: తాత్వికాంశం

శీర్షిక: అర్ధనారీశ్వర 

నిర్వహణ : వెలిదె ప్రసాద శర్మ


*చంపకమాల*.

తనువులువేరునై మనసుదంపతులొక్కటిమూలహేతువై

పనులనుచేయువేళగృహబాధ్యతనిర్వహణమ్ముతోడుతన్

ధనమును భద్రమౌ విధిగ దాచుచువృద్ధినిచేయునప్పుడున్

తనమనవార్నిగౌరవముధర్మమునాదరమొప్పలోకమున్


*ఉత్పలమాల*

పిల్లలపెంపకమ్ముహృదిప్రేలపంచగముక్తకంఠమై

యల్లరిచేష్టలన్ గని నియంత్రణచేయుచుమంచినేర్పగన్

చల్లనిమాటలన్ తగినజాగృతితోవ్యవహారమందునన్

తల్లియుతండ్రినేకముగ దక్షతనుండుటవెల్గునీడలౌ!!

*కందము*

వాగర్థమ్ములరీతిగ

భోగముతోరోగమైనపుణ్యములైనన్

యోగముకష్టముసుఖముల

త్యాగమునేశివునితనువుతత్వముసుఖమౌ!!

*ఉత్పలమాల*

నాలుకలోనవాణిగదనాల్గుముఖమ్ములధాతనేకమై

పాలకుడైనశ్రీహరికివైభవమైహృదిలక్ష్మినిల్వగన్

తోలునుజుట్టుశంకరుడుతోడగతానిడనర్ధదేహమున్

జోడగపార్వతీసతికి జోతలుజోడువినోదక్రీడకున్


*తేటగీతి*

అర్ధనారీశ్వరులజంటలాదినుండి

స్వార్ధమునువీడిపరులకుభాగమిచ్చి

రక్షసంసారబంధాలలక్ష్యమగుచు

కలిసిసహవాసముండుటేగర్వమనిరి!!

07/10/20, 12:38 pm - +1 (737) 205-9936: సప్తవర్ణాల సింగిడి

మళ్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల...

7/10/2020

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

అంశం.. తాత్వికత అర్ధనారీశ్వరము..

శీర్షిక..విడదీయని బంధం

-------------------------------

ప్రకృతి పురుషుడు సృష్టికి మూలం

ఆత్మ పరమాత్మ దృష్టికి సమం!!


ప్రతి వ్యక్తిలో వుండే శక్తి అమ్మవారు

అమ్మ అయ్య కలసిన రూపం ఒకటే

స్త్రీపురుష భేదం వున్నా ఆత్మ ఒకటే

అర్ధనారీశ్వర తత్వం అదే!!



గుండె కాయ స్త్రీ తత్వం

కుడి భుజం పౌరుషం

శబ్దార్థముల వలె

చంద్రుడు వెన్నెల వలె

సూర్యుడు తేజస్ వలె

జ్యోతి ప్రకాశం వలె

పూవు తావి వలె

ఒకటినొకటి కలిసి వుండే 

ఆత్మ పరమాత్మ  

అదే అదే ఈశ్వరతత్వం

అర్ధ నారీశ్వర తత్వం!!


భార్యాభర్తల అనురాగానికి

ఆలుమగల అనుబంధానికి

విడదీయని ఆత్మీయతకు

ఆది దంపతులు శివపార్వతులు

ఆదర్శం !!


జగత్తుకు తల్లిదండ్రులు

సృష్టి స్థితి లయకారులు

సకల ప్రాణికోటి జీవదాతలు!!


ఈశ్వరః సర్వభూతానామ్

శివ శివాని

లక్ష్మీ నారాయణులు

ఆత్మలందు వసించే పరమాత్మ

అంతా నీవే అంతటా నీవే!


శంక తీర్చు వాడు శంకరుండు

శివము కూర్చు వాడు శివుండు

కష్టాన్ని కంఠంలో దాచాలని చెప్పిన వాడు గరళకంఠుడు

స్త్రీ శరీరంలో సగం అని చూపిన వాడు అర్ధనారీశ్వరుడు!!


నమః శివాయ 

నమః పార్వతీ పతయే....

07/10/20, 1:00 pm - +91 91779 95195: మల్లినాధా సూరి కళాపీఠం y p

సప్త ప్రక్రియల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి

గారి నేతృత్వo

తాత్వికాంశం

అంశం:అర్థ నారీశ్వరం

శీర్షిక: సగం-సగం

నిర్వహణ:శ్రీ వెలిధే ప్రసాద్ శర్మ గారు

పేరు:రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

*********************

నీలో సగం-నాలో సగం

అదే అర్ధనారీశ్వర తత్త్వం

సగం సగం శరీరాలుఒక్కటై 

జగాన ఏలే శివపార్వతులు


జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు🙏


మాతాపితరులు గా సృష్టిలో

భార్యాభర్తల బంధానికి ప్రతీకలు

అన్యోన్య దాంపత్యానికి ఆదర్శ జంటగా

మాంగల్య బలం కి మంగళ రూపులుగా


కష్టం లో సగం సుఖం లో సగం

నీలో సగం నాలో సగం అంటూ

లయకారుడు గా ఏలే బోలా శంకరు డా


శివుడి శక్తి తో కలిగే ను ముక్తి

ఆత్మ ఒక్కటే శరీరాలు వేరు

ఆలుమగలు గా అందమైన జంట గా

అందరికీ ఆదర్శప్రాయంగా


సర్వం శక్తిమయం

సర్వం శివమయం

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమోస్తుతే.....


అంటూ గౌరీదేవికి......

సగ భాగం

నీ శరీరంలో చోటు ఇచ్చిన వాడవు........


త్రైలోక్య సంచారి..........

తి నేత్ర కారు డా.............

బ్రహ్మ కుసరస్వతి గా

విష్ణుకు లక్ష్మీ గా

శివుడికి పార్వతిగా

అన్నింట్లో అర్ధనారీశ్వరులు లాగా............


జగములోని భార్యాభర్తల 

అనుబంధానికి ప్రతీకగా

ఈ అర్థనారీశ్వరులు...

********************

07/10/20, 1:02 pm - +91 91006 34635: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి అమర కుల గారు

అంశము, అర్ధ నారీశ్వరం

తాత్వికత

నిర్వహన, వెలిదె ప్రసా ద్ శర్మ గారు

శీర్షిక, జీవన సత్యం

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 7అక్టోబర్్2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------



అఖిల జగతికి మూలం

అర్ధనారీశ్వర తత్వం


అంతర్ తత్వమే ఆనందం

గొంతులో విషం లలాటం లోఅగ్నికన్ను 

మెడలోవిషనాగులుపులిచర్మం ధారణం

వైరాగ్య విభూదిరేకలతాత్వికత 



తనరూపంతో తెలిపాడు

పాపంబోలా శంకరుడు కదా

అరటిపండు వొలిచినోట్లో పెట్టినట్టు 

విశ్వంలోనివిశాలత్వం ఎరిగించినాడు



ప్రారబ్దరూపేనాజన్మని సతిపతిసుతులుబంధాలన్ని

జీవితముఅణువణువుతడుముతు

సంసార జంజాటనంలో 



తెలిసి తెలియనిజ్ఞానంతో 

ఆశలరెక్కలకుకోరికలగుర్రాలకట్టి

మళ్లీ మళ్లీఈరాపిడిలో మడార్లాడుతాం



మంచిమానవత్వమే

 భగవత్ తత్వము అది 

ఎరిగిన సదాసర్వేశ్వరుని

 సంరక్షణమే

07/10/20, 1:04 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశం.అర్థనారీశ్వరం 

శీర్షిక. ఆలుమగలు

నిర్వహణ. వెలెదె ప్రసార శర్మ గారు 

             పాట 

🌸🌸🌸🌸🌸🌸🌸

          పల్లవి 

🌸🌸🌸🌸🌸🌸🌸

ఆ.ఆ.ఆ.ఆ.ఆ..ఆ..

చీకటి వెలగుల అనుబందం 

జీవితమే ఆలుమగల బందము 

ఆ నందన వనిలో నిలిచేను 

మనసే పూదోటగ వెల్గేను . 

ఆ.ఆ.ఆ.ఆ.ఆ.....

              చరణం. 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మనసుతో పంచెను 

మమతనే నిలిపేను 

పిల్లల ప్రేమతో అల్లేనూ 

మనసే పురివిచ్చుటలో నిలిచేను. 

ఒక్కటే జీవితం ఒక్కటే బాట అనుకునీ 

ఆనందాలే పంచుకొనీ. 

జీవితమే ఆనందం. 

మధుర జీవన హృదయ నిలయం 

ఆ.ఆ.ఆ.ఆ ఆ ఆ....

        చరణం 

🌸🌸🌸🌸🌸🌸

నీవూ నేనూ ఒకటనీ 

మనసూ మనసూ పంచుకొనీ 

ఇంటిని కోవెల అనుకుంటే. 

ఆది దంపతులే మీరయి 

బృందావనమే నిలిచింది. 

మమతల కోవెల వెలిసింది. 

సకల దేవతలే మీ యింట 

మీ పిల్లల రూపుతో నిలిచింది.

ఆ.ఆ ఆ ఆ ఆ ఆ ఆ.......

07/10/20, 1:50 pm - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 044, ది: 07.10.2020. బుధవారం.

అంశం: అర్ధనారీశ్వరం

శీర్షిక: జగతఃపితరౌవందే

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీ వెలిదె ప్రసాదశర్మ గార్లు.

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: ఆధునిక పద్యం 


సీసమాలిక

"""""""""""""""

ప్రకృతిశక్తులకెల్ల ప్రతినిధిగానున్న

     పార్వతిపతియైన పరమశివుడు

సృష్టిస్థితిలయము కష్టించిజేయుచూ

     లోకాన్నిరక్షించె శంకరుండు

అపఘానభార్యకు దాపలిభాగాన

     సగమిచ్చిముక్కంటి సంతసించె

సతియంటెతనువున సగభాగమేనని

     జడదారిలోకంకు చాటిజెప్పె

రవిసోములవనికి రక్షగానుంచెను

     అమ్మనాన్నలవలే నాదరించి

కైలాసనాధుడే కలియుగమందున

     కన్నవానివలెను కావలుండె

కోరినవరమిచ్చె కొంగుబంగారమే 

     కొండంతదేవుడీ తాండవయ్య

కష్టములన్నియూ కలసివచ్చినగాని

     ఇష్టంగసాగాలి యిష్టసఖితొ

ఎల్లలోకాలేలె ఈశ్వరుండైనను

     భరియించిజూపెను బాధలన్ని

సంసారబంధాన్ని చక్కగాజాటిన

     ఆదిదంపతులయా మేదినందు


తే.గీ.

యోగనిద్రలోనున్నట్టి యోగిభవుడు

లింగరూపానజూసెడి జంగమయ్య

సర్వలోకాలనేలెడి చంద్రమౌళి

అర్ధనారీశ్వరుండేను యవనిపైన.


👆ఈ పద్యకవిత నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

07/10/20, 2:17 pm - +91 96185 97139: మల్లినాథ సూరి కళాపీఠము 

ఏడుపాయల సప్త వర్ణాల సింగిడి "

పేరు . డిల్లి విజయకుమార్ శర్మ 

జిల్లా : కుమురంభీంజిల్లా 

అంశం : అర్థనారీశ్వరం.

శీర్షిక :  అర్థనారీశ్వరా !

ప్రక్రియ : గేయం

నిర్వహణ : వెలిదె ప్రసాద్ శర్మ గారు 

*************************

పల్లవి 

అర్థనారీశ్వరా! 

మమ్ముల బ్రోవ రా !

అవని మీద జరుగుతున్న

అకృత్యాలాపరా ! అ"

చరణం 1

నాడు అంభుదిలో వెలసిన

హలాహలము"ను మ్రింగిన 

నావు " లోకాల రక్షించినావు

ఋగ్వేదం "నిను కీర్తించి నాది.అర్ధ"

2.చరణం

"గంగ" ను శిరమున"ధరియించి

నావు " గౌరమ్మ"కు అర్థాసనమించినావు"

అర్ధనారీశ్వరుడుగ వెలుగొందినావు.

అందరి ఆపద దీర్చినావు .అర్థ"

3. కేదారములో "కేదారీశ్వరుడుగ"

వారణాసిలో "వివేశ్వరుడవు"

శ్రీ శైలం లో మల్లి కార్జునుడవు"

"వేములవాడలో "శ్రీ రాజ రాజేశ్వరుడవు" అర్థ"

4.చరణం

రామావతారాణ "ఆంజనేయుడుగ"

సంజీవిని దెచ్చి లక్ష్మణ"మూర్చను దీర్చినావు 

రామ,రావణ యుద్దానికి "ఆది"

గా నిలచినావు. 

పరమ"యెగులు నిను "గురువు " గా దలచి నారు "అర్థ"

చరణం 5.

చంద్ర వంకను "ధరియించినావు"

నాగ సర్పమును కంఠమున

దాల్చినావు

డమరుకం" చేభూని "రౌద్ర తాండవం" జేసినావు 

ముక్కంటి గా త్రిశూల ధారి గా

పేరు గాంచి నావు. అర్థ"

6.చరణం

నాడు కనప్ప " నిను కొలచినాడు

బిల్వర్చన చేసినాడు

సాలెపురుగు సర్ప"హస్తి కి

మోక్ష మలచినావు. 

లో " కారకుడు నీవు

నేటి ఘోరకలిని"ఆపగ

దిగిరావా !

07/10/20, 2:58 pm - +91 94404 72254: సప్త వర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం....తాత్వికం ..అర్ధనారీశ్వరం

నిర్వాహణ...వెలిదే ప్రసాద శర్మ గారు

తేదీ...07.10.2020

రచన.. వెంకటేశ్వర్లు లింగుట్ల

ప్రక్రియ.....వచనకవిత

శీర్షిక......... ఆదర్శమూర్తులై...


ప్రకృతిలో స్త్రీ పురుష కలయిక

సృష్టి సమాగమమై అర్థనారీశ్వర తత్వమై

సంసారబంధాల జీవనయానం

చెరిసగమై సరిగమల సరాగ అనురాగమై

తరగని ఆత్మీయతల్ని ముడిపెట్టి

మానవజన్మకు విధాతలై 

ప్రతిసృష్టికి మూలమై విరాజిల్లే....


కుడిఎడమల స్త్రీపురుష భాగస్వామ్యమై

స్నేహతత్వం పెంపొందిస్తూ

లయకారుని లీలామృతమై

పార్వతీవితో తేజోవంతమై ఆదిదంపతులుగా

సర్వజనులకు ఆదర్శమూర్తులై...


జీవన్మరణాలలో ఇరువురి 

మానసిక బంధమే ఆఖరుమజిలీ వరకూ

సాగుతూ ఏకత్వమే మమేకమై

భార్యాభర్తల ఆంతర్యాలలో వెన్నెలలై

కాపురంలో వెలుగులు చిందే 

ఆడామగల ఔన్యత్యానికి శిఖరాగ్రమై...


వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

07/10/20, 3:13 pm - +91 94412 07947: 9441207947

మల్లినాథసూరి కళా పీఠం YP 

బుధవారం 07.10.2020

అంశము. అర్థనారీశ్వర స్తుతి 

ప్రక్రియ. దండకము

నిర్వహణ.బ్రహ్మశ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు విశిష్ట కవివరేణ్యులు 

====================

శ్రీమన్మహాదేవ! శంభూ దయార్ద్ర స్వభావా!జగజ్జాల సంస్తుత్య

సత్యం శివం సుందరం నామ భావద్యుతీ!సర్వ శక్త్యాత్మకా!

సర్వ భూతేశ్వరా!శీత శైలేంద్ర పుత్రీ సమేతార్థ నారీశ్వరా!

నీ సుతుల్ స్కంధ విఘ్నాధి పాకల్పితానంద ! కేళీసమాకృష్ణ

చిత్తాంబుజా! నీదు భక్తాళియందెంత ప్రేమార్ద్రమో నీదు

చిత్తమ్ము వర్ణింపగన్ శక్యమే? నిత్య వాత్సల్య వీక్షామృతాసార

సర్వేశ్వరా!నీకు మాచిత్త నీరేజపీఠిన్ ప్రతిష్ఠల్ శివా!నీకు

చేమోడ్పు మృత్యుంజయా! నీకు సంస్తోత్ర పాఠమ్ము శర్వా!

మృడా!నీకు మ్రొక్కుల్ పినాకీ నమోవాకముల్ త్ర్యంబకా!

నీదివ్య దాక్షిణ్య వాగర్థ సంపృక్త ! రూపేణ సంయుక్త!

హే యర్థనారీశ్వరా! నమస్తే నమస్తే నమః

                         @@@@@@@@@@@@@

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

07/10/20, 3:29 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

సప్తవర్ణాల సింగిడి.

అంశం.:అర్థనారీశ్వరం.

నిర్వహణ :వెలిదె ప్రసాద్ శర్మ గారు.

పేరు : తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.

శీర్షిక: *ఆలుమగలదాంపత్యం*

*************************

ఆది దంపతులే అర్థనారీశ్వరం.

పార్వతీపరమేశ్వరులే ..

ఆదర్శ దాంపత్యానికి చిహ్నం..

ఆలు మగల అనురాగబంధం

విడదీయరానికళ్యాణసుగంధం

స్త్రీ లాలిత్యం,పురుషాధిత్యం..

కలసినదే అర్థనారీశ్వర తత్వం

వెన్నెల చల్లదనము..

సూర్యుని వెచ్చదనము.. కలిసినదే అర్థనారీశ్వర తత్వం.

కలిమిలేములు,కష్టసుఖాలను.

కలగలిపే భార్యాభర్తలబంధం..

ప్రకృతి సిద్ధమైన..సహజమైన.

సృష్టి కార్యంజరిగేదేవిధివిలాసం

నింగి నేల ఒకటైనా..

తనువు మనసులు ఏకమైనా..

జగమంతా అర్థనారీశ్వరమే..

మానవమనుగడకు.జీవాధారం

ప్రాణికోటికి ప్రాణాధారం..

జీవపరిణామానికిమూలాధారం

స్త్రీ పురుష సంగమజీవనమే.

ఆదర్శ దాంపత్యమే

ఆదినుండీ..జగతికి మనుగడ.

ఆలు మగల వైవాహిక బంధమే

భవితకు *అర్థ నారీశ్వరము.*

*************************ధన్యవాదాలు.! 🙏🙏

07/10/20, 3:31 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి🌈

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ  శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు

అంశం  అర్థనారీశ్వర తాత్వికాంశం

శీర్షిక   ఆదిదంపతులు

పేరు   పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు.  జిల్లా కరీంనగర్

తేది.  07/10/2020 బుధవారం


సృష్టికి మూలం ప్రకృతి పురుషులే

అంబయే అనురాగానికి ప్రతీకైతే

భవుడే ముక్తికి మార్గ నిర్ధేశితుడు

జగదాంబ సమేత సదానందుడం


భోళా శంకరుడు భక్త వల్లభుడు

పార్వతీ మనోనాధుడు పరమేశ్వరుడు

అన్నపూర్ణను అవనిపై నిలిన జఢధారి

విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు


తనువున సగభాగం సతికిచ్చి

సమానత్వంను జగతికి చాటి

సతిపతుల సమన్వయమే నిత్వమని

నిరాడంబరాన్ని చాటిన నిత్యానందుడు


దుష్ట శిక్షలోను శిష్ట రక్షణలోను

సకల లోక రక్షణార్థమై వెలిసిన

నిత్యమై సత్యమై జగమును కావగ

జగన్మాత సమేతుడైన జగదానందకరుడు


అద్వితీయ అమోఘ ఆనంద కరం

కమనీయ రూపలావణ్య మయం

కనులార కాంచుటయే మహద్భాగ్యం

ఆది దంపతుల అర్థనారీశ్వర తత్వం


హామి పత్రం

ఇ రచన నా సొంత రచన

07/10/20, 3:40 pm - +91 94415 44806: వేలేటి శైలజ సిద్దిపేట


స్త్రీలో పురుషత్వం

పురుషునిలో స్త్రీత్వం

వెరసి అర్ధనారీశ్వర తత్త్వం

స్త్రీ పురుష సమానత్వానికి ప్రతిరూపం

పరస్పర గౌరవానికి పట్టుకొమ్మ

సకల జీవరాశికి ఆదర్శం

అర్ధనారీశ్వరడే జగత్తుకు మూలం



*ఇది నా స్వీయరచన

07/10/20, 3:43 pm - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

7.10.2020

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

 వెలిదె ప్రసాద్ శర్మ గారి పర్యవేక్షణలో

అంశం:తాత్వికాంశం - అర్ధనారీశ్వరం

డా.సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880

ప్రక్రియ: వచనం

శీర్షిక:సౌహార్దం(మైత్రి)


ప్రకృతి పురుషుడూ చెరో  సగమని

అతని వాక్కుకి -ఆమె అర్ధమని

పరమేశ్వరా నీవే అరభాగముని ఇచ్చి

అనువైన దారిని అతిసులువుగా చూపి

ఆది దేవా మాకు పదిలముగ ఉంచావు

చీకటి వెలుతురులా సుఖదుఃఖాలు

పగలు రేయిలా కష్టనష్టాలు 

అన్నిటిని చెరిసగము పంచుకోవాలని

సంసార సాగరమున ఆటుపోట్లన్నిటిని

ఎదురీదు సమయమున ఒకరికొకరు ఆసరాగ

తప్పొప్పులను సరిదిద్దుతుంటూనె గమనం

కన్నీటి కడగండ్లసంద్రాన్ని సులువుగా దాటాలి

సృష్టికి మూలం మీ ఇద్దరేనని తెలిసి

తనువులు వేరైనా...మాటొకటె చూపెకటె

ఆలోచనొకటె అవలోకనొకటె ఆచరణొకటిగా

అర్ధేశసఖుడు విడమరచి వివరింప

ముక్కంటివాల్గంటి కూడి చూపించె

సౌహార్దమే సౌహిత్యమని

సాఫల్యమే గమ్యముగ సార్ధకతనొంద

సుగమమార్గమీరీతి 

చూపినావా ఓ సత్కృతా!


ఇది నా స్వంత రచన

07/10/20, 4:02 pm - +91 84668 50674: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

అంశం : అర్ధనారీశ్వరం

రచన : ఎడ్ల లక్ష్మి

శీర్షిక : సహచరిని

నిర్వహణ : వెలిదె ప్రసాద శర్మ గారు

తేది : 7.102020

*****************************


అన్నింటిలో సగ బాగం అర్ధాంగి

ఏమిటి సృష్టి అంతా వింతగా

శివపార్వతులు అర్ధనారీశ్వరులు

ప్రతి జంట అలా ఉంటే  ఎలా

ఇవి శివ లీలలు అంటారేమో

అతని తలపై గంగా ఎందుకో మరి

మేనులో సగభాగం పార్వతి

అందుకే అంటారు శివ మహేశ్వర్లని 

సీతా రాముల జంట చూడ ముచ్చటంటా

ఎవరి మాటో విని పంపినాడు

రాముడు సీతా దేవిని అడవికి

ఇది రామాయణం అంటారేమో

నాడు రాముని అర్ధాంగి బాధ అది

      (కళియుగ ఆడపిల్ల )

కన్నవారినొదిలి కోటి ఆశలతో

కట్టుకున్న వాడితో ఏడడుగులు నడిచి

మెట్టినింటికి చేరును ఆ ఇంటి దేవతగా

పతి సేవలో ఆమే పాదదాసి

అలుపు సొలుపు ఎరుగని ఆమె చేతులు

మరయంత్రాలు అంతేకాదు

భరువునెంతో మోస్తూ వంశం పెంచే

 వటవృక్షము కొమ్మలు రెమ్మల వలే

కలకలాడే కాంతి మూర్తి ఆమె భర్తలో సగభాగం 

అప్పుడు సహచరినితో అర్ధనారీశ్వరుడు అతడు


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

07/10/20, 4:16 pm - +91 94940 47938: మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమ ర కుల దృశ్య కవిగారి నేతృత్వంలో

అంశం : అర్ధనారీశ్వరం

నిర్వహణ డాక్టర్  సుధా మైథిలి శ్రీ వెళిదే ప్రసాద్ శర్మ గారు

కవిత శీర్షిక: చితాభస్మం

పేరు నెల్లుట్ల సునీత

కలం పేరు శ్రీరామ

ఊరు ఖమ్మం

___________________


పార్వతీపతి శివయ్య

ఏమని పొగిడే ది ఎంత అని వెడే ది మహాదేవ


పార్వతి మాత కు అర్ధ భాగం ఇచ్చి

అర్ధనారీశ్వరుడు అని లోకానికి

ఆదర్శ దాంపత్యాన్ని చా టావు


విశ్వ మానవాళి కోసం

సముద్ర మథనం న కాలకూట విషాన్ని

నీ గరళ మందు దాచి అమృతాన్ని అందించిన త్యాగ గుణం

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం


గంగమ్మను ఇంద్రలోకం నుండి

భగీరథుని తపస్సుకు పవిత్ర జలం అందించి సమస్త ప్రాణకోటి ప్రాణభిక్ష పెట్టిన ఓ మహాదేవ


కోరికల్ని భస్మంతో పోల్చుతూ దేహ లేపనం చేసుకుని పరవశించి భక్తుల కోర్కెలు తీర్చే దయామయు డవు

కోరిన వెంటనే ఆలిని ఇచ్చి ధర్మగుణం చాటుకున్న బోలా శంకరు డవు


నీ మాయ లేనిదే చీమైనా కుట్టదు శివ అంతా నీ మాయ సృష్టి

పులి వస్త్రం ధరించి నాగాభరణం వేసుకొని   బస్మం పూసుకుని స్మశానం ఇల్లు అనీ చివరి మజిలీ కాటి వరకు అని గొప్ప సందేశం ఇచ్చిన ఆదర్శమూర్తి వి


నీది నాది ఏది వెంట రాదు పాపపుణ్యాలు తప్ప నిరాడంబరత

చాటిన మా శివయ్యావు

ఆగ్రహం వస్తే రుద్ర రూపుడై ప్రయత్నం చేస్తావు

మానవులుగా ఈ భూమండలంలో మేము చేసే పాపాలను హరించి నీ మూడో నేత్రం తెరిచి చితాభస్మం చెయ్యి

ఎంతైనా కలియుగం కదా శివ

కశ్యప మహాముని వంశస్థుల కదా

పాహిమాం పాహిమాం రక్షమా రక్షమాం

హర హర మహాదేవ శంభో శంకర!

07/10/20, 4:23 pm - +91 99595 11321: మల్లినాథ సూరి కళాపీఠం వారి సప్త వర్ణసింగిడి, 

అంశం. అర్ధ నారీశ్వరం   తాత్వికాంశం, 

నిర్వహణ. Smt. సంధ్యా రెడ్డి గారు. 


అర్ధనారీశ్వరం కేవలం ఒక రూపం కాదు అది ఒక తత్త్వం, ఈ తత్త్వం నుంచే అర్ధాంగి అనే పదం పుట్టింది. సమస్త సృష్టి కి మూలం ఆదిదంపతులైన 

పార్వతీ పరమేశ్వరులే... 


విష్ణువు లక్ష్మీ దేవిని తన హృదయంలో నిలుపు కున్నాడు, పరమేశ్వరుడు తన తనువు లో అర్ధ భాగం ఇచ్చాడు, ఇదే భారతీయ వివాహ వ్యవస్థ 

లోని వైశిష్ట్యం, 


అలా వివాహ వ్యవస్థ ద్వారా ఒక్కటైన స్త్రీ పురుషుల 

కలయిక యే ఈ సృష్టి కి మూలం. 

మగవాని జీవితంలో ఆతని అర్ధాంగి పాత్ర ఎంతటి విశిష్టమైనదో తెలియ చెప్పేదే ఈ అర్ధ నారీశ్వర తత్త్వం. మన వివాహ వ్యవస్థలో అర్ధనారీశ్వర తత్త్వం నిబిడీకృతమైంది. మగువ తన యొక్క ఉనికిని, తన జీవితాన్ని మగవానికి అంకితం చేస్తూ 

మగవాణ్ణి జీవితంలో ముందుకు నడిపిస్తుంది, అగ్నిసాక్షి గా ఇరువురూ ఒకటయ్యాక, 

ఇదే అర్ధనారీశ్వర తత్వ రహస్యం, వైశిష్ట్యం..... 


ఇది నా స్వంత రచన, 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 9959511321

07/10/20, 4:33 pm - +91 98868 24003: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్త వర్ణముల సింగిడి

తేదీ : 07-102020

అంశం : తాత్త్విక అంశం (అర్ధనారీశ్వరం)

శ్రీ అమరకుల కవి గారి ఆధ్వర్యంలో

నిర్వహణ : బ్రహ్మశ్రీ వెలిదె ప్రసాదశర్మ గారు

పేరు :  ఆకొండి ( ముద్దు) వెంకటలక్ష్మి

ఊరు  : బెంగళూరు

ప్రక్రియ :  వచన కవిత


భావావేశ సందోహం భావనామృత సంయోగం ఇరు ప్రవృత్తుల సమాగమం ;


వీనుల విందైన శబ్దలాస్యం మనస్సునలరించు అర్థగౌరవం రెండూ సమ్మిళితమైన ఆత్మానందకర  లయ విన్యాసం ;


మురిపములొలికించు వాత్సల్యం, గరిమగఱపు

గాంభీర్యం కలగలిసిన జననీ జనకుల అనురాగం ;

 

అవినాభావ సంబంధ నిర్వచనం,

సతీపతుల సామరస్య పూర్వక నిత్యనూతన దాంపత్య జీవన ప్రతిబింబం, ఆది దంపతుల అర్ధనారీశ్వర కమనీయ స్వరూపం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

07/10/20, 4:35 pm - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP

నిర్వహణ:వెలిదె ప్రసాద్ శర్మ గారు

అంశము:అర్థనారీశ్వరతత్వం

శీర్షిక:జగతికి ఆదర్శం

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292



పకృతి పురుషుల సంగమం 

సృష్టి స్థితి లయ కారకం

చీకటి వెలుగుల సమతుల్య సంగమం

ప్రేమానురాగాల దాంపత్య బాంధవ్యం

అంతర్లీనంగా ఆది దంపతులు బోధించే తత్వం. 

స్త్రీ పురుషులు సమానతను జగతికి అందించే అక్షర సత్యం.

వేద వేదాంగాల సారం

విదాత  సృష్టి  మూలాధారం.

కుడి ఎడమల భాగస్వామ్యం

జడదారి మాయాజాలం.

శివ శక్తి సమ్మేళనం

మాతాపితురులై జగత్త్రక్షకం 

దేహాన్ని పంచుకుని

అర్థనారీశ్వరులై చూపే దాంపత్య జీవిత సారం

అదే అదే ఆది దంపతుల  ఆత్మీయ తత్వం

సకల సృష్టి కి మూలాధారం.

07/10/20, 4:39 pm - +91 94404 74143: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 16, ది: 07.10.2020. బుధవారం.

అంశం: అర్ధనారీశ్వరం

శీర్షిక: ఆది దంపతులు

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీ వెలిదె ప్రసాదశర్మ గార్లు.

కవిపేరు: చిల్క అరుంధతి

నిజామాబాద్

ప్రక్రియ: తేటగీతి


విశ్వ సృష్టికి మూలము విశ్వనాధ

మాత పార్వతి తల్లిగా మమత పంచ

అర్ధనారీశ్వరులయిరి యవనిలోన

ప్రకృతి పురుషుడుగా నిల ప్రాపు గాంచె


కుడి  యెడమల సంఘమమయి కోరి నిల్వ

ఆది దంపతులైనారు  మేది నందు

సృష్టి స్థితి లయములకును సృష్టి మీరు

కోరి నట్టి వరమొసగె కోడెకారు


సర్వ లోకాల నేలేటి చంద్రమౌళి

జడల ధారియై నేలెను జగము నంత

అర్ధ భాగాన వెలసిన యాదిశక్తి

అమ్మ గానేలె యింపుగా యాత్మలోన  .


భస్మమే తనువున దాల్చె పసిడి లాగ

నిలిచె కైలాస గిరులనే యిల్లు చేసి

విషపు నాగులె మెడలోన వింత నిలిపె

చేరి నిలిచెను ముక్కంటి కోరినంత


జగము నంతయు యేలేటి జంగమయ్య

ముజ్జగంబుల ముక్కంటి మూల పురుష

గరళకంఠుడా ఈశ్వరా గంగధరుడ

నంది వాహన గౌరీశ నాద వినుత


ఇది నా సొంత రచన    ✍️✍️

07/10/20, 4:40 pm - +91 94417 71955: మల్లినాథసూరి కళాపీఠం YP

తాత్విక అంశం... అర్థనారీశ్వరం 

శీర్షిక... పరమేశ్వర తత్త్వం 

పేరు... ముడుంబై శేషఫణి 

ఊరు... వరంగల్ అర్బన్ 

సంఖ్య... 253

నిర్వహణ... ప్రసాద్ శర్మ గారు. 

తేది... 7-10-2020.

.................. 

వాక్కు, అర్థమై నిల్చి 

ప్రకృతి పురుషులై 

అన్నింటా సగభాగమై 

జగమంతా నిండిన తత్త్వం 

అర్థనారీశ్వరం 


వేoకటేశ్వరుడు వక్షస్థలమున

ఉభయ దేవేరీలను నిల్పుకున్న 

ఆదిభిక్షువు భోళాశంకరుడు 

తన శరీరాన సతికొసగె సగభాగం 


ఆలుమగలు సంసారరథ చక్రాలై 

కష్టసుఖాలలో తోడునీడగా నిల్చి 

తనువులు రెండైనా ఒకే ఆత్మగా 

ఒడిదుడుకులు తట్టుకొని ఒక్కటై నిల్చి 

ఒకరి విజయం వెనుక మరొకరుండి 

పరమేశ్వర తత్వాన్ని తెలుసుకొని 

తెలివిగా మసలుకొని బ్రతుకంతా ఒక్కటిగా 

అనురాగ తరంగాలలో తేలియాడిన 

ఇలలో ఆదర్శమై నిల్చు అర్థనారీశ్వర తత్త్వం.

07/10/20, 4:48 pm - +91 73308 85931: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్య కవి గారి పర్యవేక్షణలో

తేదీ 7- 10 -2020 బుధవారం

అంశం:తాత్వికం

నిర్వహణ: వెలిదె ప్రసాద శర్మ గారు

రచన: పిడపర్తి అనితా గిరి

ప్రక్రియ; వచన కవిత

శీర్షిక:పురాణ ఇతిహాసాలు

..............................


శివపార్వతులు వారు

అర్ధనారీశ్వరులంట

శ్రీ సీతారాముల అంట

అవనిలోన ఆదర్శ 

దంపతులు అంట

రుక్మిణి వల్లభు ఢంట

రాధాకృష్ణు లంటా

పురాణ ఇతిహాసాలు 

పాతివ్రత్యం గురించి మనకు 

నేర్పిన విషయాలు

అవని పైన అతివపుట్టినిల్లు

వదిలి మెట్టినిల్లు చేరి

తన మగనిలొ సగ భాగమై 

సంసార బాధ్యతలు 

విశ్రాంతి అనేది నెరుంగక తన కుటుంబంకోసంఅహర్నిలు ఆరాటపడుతుంది

కూతురుగా అక్కగాచెల్లిగా అమ్మగా కోడలిగా అత్తగా 

అన్నిటిలో సహనగా 

తన పాత్ర సద్వినియోగం

చేసుకున్న సహనశీలిఆమె.


పిడపర్తి అనితా గిరి 

సిద్దిపేట

07/10/20, 4:57 pm - +91 80081 25819: మల్లినాథసూరి కళాపీఠం-సప్తవర్ణా సింగిడి.

శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో. 

తాత్వికాంశం:అర్థనారీశ్వరం. 

నిర్వహణ:శ్రీవెలిదె ప్రసాద్ శర్మ కవివర్యులు. 

శీర్షిక:అది దంపతులు. 

ప్రక్రియ:వచన ప్రక్రియ. 

రచన:శ్రీమతి చాట్ల:పుష్పలత-జగదీశ్వర్. 

ఊరు:సదాశివపేట,సంగారెడ్డి జిల్లా. 


అది దంపతులై సర్వలోకాలన్నింటికి 

అమ్మనాన్నలు జగత్తులన్నింటికి. 

ఆలుమగలా అనుబంధనికి 

అన్యోన్యతను చేకూర్చిరీ ఎప్పటికి. 

ఒకరికి ఒకరై ఒకే తనువున ముడిపడి 

మోక్షమొసంగే విశ్వ సృష్టికి 

తోడు నీడై అంతరార్థ-ఆత్మస్వరూపం తెలిపిరి విశ్వమంతా,

శివా-శక్తి అర్థనారీశ్వరులై శక్తి స్వరూపులు.

శివపర్వాతులై మాంగళ్య బంధానికి 

మారుపేరుగా-ప్రేమకు ప్రతికగానిలిచిరి.

ఉమామహేశ్వరులై చిదానంద 

రహస్యం తెలిపిరి. 

సృష్టి స్థితి లయకరులై-

శక్తి యుక్తి తేజోమూర్తులు. 

భక్తులకు మూక్తి మార్గం చూపంగా కష్టసుఖాలలో వెన్నంటుడిరి. 

అర్థిగా పిలిచేనా అమ్మనాన్నలైరి అర్థనారీశ్వరులు. 

తనవులు వేరైనా తలంపులు ఒక్కటే 

ఆత్మలు ఒక్కటై పరమార్థం తెలిపిరి.

పరమాత్మస్వరూపులు ఆలుమగలుగా 

అనంతలోకాలకు మాతపితలు

జగములను ఎలంగా.

అందమైనా ఆదర్శ జంటగా పర్వాతీపరమేశులు. 

అఖిలా లోకాలలో అది దంపతులు పూజలందుకోన్నంగా 

అర్థనారీశ్వర స్వరూపం మానవజన్మకు మార్గదర్శకత్వం.

🙏🏻ధన్యవాదాలు🙏🏻.

07/10/20, 4:58 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీ వెలిదే ప్రసాద శర్మ గారు

అంశం: అర్ధనారీశ్వరం

శీర్షిక: శివ లీలలు

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 07.10.2020 


ఆట కదరా శివా 

పాట కదరా శివా 

నీ లీలలే మాకు 

పాట కదరా శివా


జన్మ జన్మల దుఃఖాన్ని బాపితివయ్యా 

దేవముని గణమంతా  సేవితురయ్యా 

రావణుని దర్పాన్ని అణచినావయ్యా

ముని గణాలు నిను కొలిచినారయ్యా  

                            !!ఆట!! 

సతీ సౌభాగ్యాన్ని ఇచ్చావు స్వామి 

ఉగ్రరూపమును నీవు దాల్చినావయ్యా 

దక్షుని మదమును అణచితివయ్యా 

సకల ఐశ్వర్యానికి నీవే మూలకారణమయ్యా

                                  !!ఆట!! 

కంఠాన విషాన్ని దాచినావయ్యా 

పులితోలు నీవు తొడిగినావయ్యా 

విభూదితో నింపి శరీరాన్నంతా

సర్పాలే నీకు ఆభరణాలయ్యే 

                                  !!ఆట!! 

వాక్కును అర్ధాలు ఒకటిగానుండు

పార్వతీ పరమేశ్వర తత్వమదియేగా 

అందుకే నిను కొలిచే భాగ్యాన్ని పొందేము 

నిత్య పూజలు నీవు అందుకోవయ్యా

                                  !!ఆట!! 

లింగోద్భవంలో గొప్పోడివయ్యావు 

అఖిల దేవతలకు ఆదిగురువువు నీవు 

జలాభిషేకంలో దోషాలు తొలగిస్తావు 

కొలిస్తే భోళాశంకరుడివై వరాలనిస్తావు 

                                  !!ఆట!! 

నీ పూజలే మాకు శక్తినిస్తాయి 

నీ గానమే మాకు ఆయువిస్తుంది 

నీ భజనయే మాకు ప్రాణశక్తి 

అందుకే మా పూజలందుకోవయ్యా 

                                  !!ఆట!!

07/10/20, 5:00 pm - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 7-10- 2020

అంశం : అర్ధ నారీశ్వరం తాత్వికాంశం

శీర్షిక ; వాంఛితార్ధం

నిర్వహణ:అమరకుల దృశ్య కవిగారు

వెలిదె ప్రసాద్ శర్మగారు

……….


ప్రకృతి పురుషుల ప్రధమాకృతి,

జీవాత్మ పరమాత్మల ఏకత్వము,

సృష్టి స్థితుల సుందర రూపమే

అర్ధనారీశ్వరం!


సగభాగం సతీదేవి,సగభాగం

సాంబశివుడు  ఏకమైన

సహజీవన సారాంశ రూపమే

అర్ధనారీశ్వరం!


మనిషిలో,మమతలో 

సుఖం లో దుఃఖం లో 

నీలో అర్థమై,

నీవే నేను నేనే నీవన్న భావనకు

నిలువెత్తు రూపమే అర్ధనారీశ్వరం!


యోగము భోగము ఒకేచోట నిబిడీకృతమై

వామర్థమే వాంఛితార్ధమై

నిరంతర ఆనంద తాండవమే 

అర్ధనారీశ్వరం!


గృహస్థాశ్రమాన్ని గురుతర బాధ్యతగా స్వీకరించి,అన్యోన్య దాంపత్యానికి

ఆదిపురుషుని  అవతార రూపమే

అర్ధనారీశ్వరమై, 

నిరంతర సృష్టి జీవనానికి

శ్రీకారం చుట్టిన సుందర తత్వమే అర్ధనారీశ్వర రూపం!


ఈ కవిత నా స్వంతము..ఈ సమూహము కొరకే వ్రాసితిని.

07/10/20, 5:09 pm - P Gireesh: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

అంశం : అర్ధనారీశ్వరం

రచన : పొట్నూరు గిరీష్

శీర్షిక : ఓ శివయ్యా

నిర్వహణ : వెలిదె ప్రసాద శర్మ గారు

తేది : 07.10.2020


ఓ శివయ్యా


కైలాసవాసా

శ్రీశైలనివాసా

పార్వతీ వల్లభా


గంగను తలపై దరియించి గంగాధరుడివైనావు. స్మశానమే నీ స్థిర నివాసమంటావు.


శివ పార్వతులుగా ఆదిదంపతులై దంపతులు అంటే ఇలా ఉండాలని చాటి చెప్పినారు.


క్షీరసాగర మధనంలో అమృతానికి ముందుగా వచ్చిన హాలాహలంను ఏమి చేయాలో తోచక గరళాన్ని మింగలేక కక్కలేక కంఠంలో నిలుపుకుని 

గరళకంఠుడివైనావు.


మెడలో నాగసర్పం ధరియించి, త్రిశూల ధారివై ముల్లోకాలు పాలించావు.


గౌరమ్మ కి తనువులో సగభాగమిచ్చి, 

అర్ధనారీశ్వరుడివై

భర్త భార్యలో సగమనీ

భార్య భర్తలో సగమనీ

ప్రకృతీ పురుషుల కలయిక అని నిరూపించి సృష్టి రహస్యాన్ని తెలియజేశావు.

07/10/20, 5:14 pm - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీ వెలిదె ప్రసాద శర్మ 

పేరు… డా.ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :07-10-2020

అంశం : అర్ధనారీశ్వర తత్వం (తాత్వికాంశం)

శీర్షిక :.. అద్వైతం 


1.తేటగీతి 

ప్రకృతి పురుషుల సంగమ పరిమళంబు 

అర్ధ నారీశ్వరమతము నర్ధ మిదియె 

జనుల కవగత మగుటకు సత్వరమగు 

సూక్ష్మ తత్త్వంబిదనితెల్పె శూలపాణి 


2.తేటగీతి 

ఒక్కరుగ కనబడెదరు నుదయము నిశి 

దు:ఖములును నానందము తొలియు తుదియు 

కనబ డుటలోన వేర్వేరు కానిరువురు 

ముద్రిత మగుసుహృధ్భావ ములను నింపు 


3.తేటగీతి 

శివుడు పార్వతి రూపవిశేషములవి 

భిన్నములుగానె నుండును భేధములను 

గలిగిననువారు నద్వైత కారులేను 

శివుడు శక్తి మిళితమైన సృష్టి యిదియె 


4.తేటగీతి 

విడి విడిగనుంటె వారిని విరిచి నట్టు 

సగము గానెనుండెదరు నసంగతముగ 

జడపదార్ధ  చైతన్యము చక్రమోలె 

భ్రమణ చెందడమేనది పార్వతీశ 


5.తేటగీతి 

రాత్రి పగలు కలిసిన పూర్ణమొక రోజు 

స్త్రీ పురుషుల కలయికనె సృష్టి యగును 

రెండు లేకుండ నొకటితో రిత్త వోవు 

సమము దృష్టి కోణము దీని సార మిదియె 


హామీ పత్రం:ఇది నా స్వీయ పద్యకవిత ఈ సమూహము కొరకు వ్రాసినది

07/10/20, 5:14 pm - +91 89852 34741: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

7/10/20

అంశం....అర్ద నిరీశ్వర ( తాత్విక) 

ప్రక్రియ....వచన కవిత

నిర్వహణ....వెలిదె ప్రసాద్ శర్మ

రచన .‌‌....కొండ్లె శ్రీనివాస్

ములుగు

"""""""""""""""""""""""""""""""""""

పరమశివుని పరివారం

జగతికి ఆదర్శం, ఆధారం

ఒకరికి ఒకరు బలమీ ఆదిదంపతులు

సగభాగం గౌరమ్మ

శిగభాగం గంగమ్మ


ఒకసారి తలచినంతనే మన బ్రతుకులు పదిలం

అమ్మ తనకు సగభాగం కాగా

ఏమీ చేయలేరు హాలాహలం


**ఒకరిని విడిచిఒకరు ఉండరు...**

**తనకూ ఆపద వచ్చినది  సతి దేవి దూరమైన...దక్షుడి యాగంలో....**


మన కొరకై బాధను మరచి ...

ఇద్దరు భార్యలున్నా ఎవరిని ఎక్కడ ఉంచాలోఉంచి

నిరాడంబరంగా....

అడగకుండానే వరాలిస్తూ

చెంబెడు నీళ్లు పోస్తే చాలు

పొంగే బోళాశంకరుడు

నిరంతరం మనపైనే ద్యాస తో

అన్నపూర్ణ గా .... అమ్మ ను పంపి 

ఆకలితీర్చి శక్తి ని ప్రసాదించి

దాహార్తిని తీర్చడానికై గంగమ్మను పంపి

వ్యవసాయానికి తన వాహనమైన ఎద్దును పంపి

విఘ్నాలు బాపుటకు వినాయకుని...

మమకారం పంచగ....కుమార స్వామి ని....

**పరమశివుని పరివారమంతా జగతిని కాపాడేందుకే....**

**

07/10/20, 5:20 pm - S Laxmi Rajaiah: మల్లినాథసూరి కళాపీఠం -YP 

బుధవారము : తాత్వికత.  7/10 

అంశము: అర్ధనారీశ్వరము 

నిర్వహణ:వెలిదె ప్రసాద శర్మగారు 

               వచన కవిత 


సృష్టి యంటేనే స్త్రీపురుష సమ్మేళనము 

ఈ జగమంతా అర్ధనారీశ్వరమే గదా 

పార్వతీపరమేశ్వరుల రూపము దెల్పు 

అర్ధనారీశ్వర తత్వంబు అమరియుండి 


ప్రకృతిపురుషుల కలయిక ప్రపంచ మంత 

కానరాదెచట ఉభయులు లేని జంటలు

ఆదిశక్తి శివునిలో సగమై యీప్సితముల 

తీర్చి భక్తుల గాచుట పరమ సుఖము 


లక్ష్మీనారాయణులు శివపార్వతులు 

సరస్వతీ బ్రహ్మలు శచీదేవేంద్రులు 

సురలూ నరులూ సుదతులతో నే 

ఉన్నారు

స్త్రీపురుషులు సృష్టికి ప్రతిరూపాలు 


శూలపాణి త్రినేత్రుడు గంగాధరుడు 

లయకారుడై సృష్టి సమతుల్యతను 

కాపాడు 

విష్ణువు సర్వాంతర్యామియై పాషించు 

జగతి

విధాత సృష్టి కార్యములో నిమగ్నుడై 

యుండు  


అమ్మసరస్వతి జ్ఞానము నందజేయు 

మాత శ్రీదేవి సిరులిచ్చి బ్రోచుచుండు 

తల్లి భవాని శక్తినిడి రక్షించు చుండు 

అందుకే అమ్మవార్లు అర్ధాంగులైరి 

 

విష్ణు హృదయాబ్జమందున లక్ష్మి 

వెలుగు 

శివుని యర్ధదేహమ్మునభవాని వెలుగు 

బ్రహ్మనోట నివాసమై వాగ్దేవి యమరు 

ఒకరికొకరు విధేయులై ఒప్పు చుంద్రు 


            శ్రీరామోజు లక్ష్మీరాజయ్య 

            సిర్పూర్ కాగజ్ నగర్.

07/10/20, 5:23 pm - +91 73493 92037: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగడి

7-10-2020

నిర్వాహణ :శ్రీదృశ్య కవులు,శ్రీ డా.సుధా మైథిలిగారు, శ్రీ ప్రసాదు శర్మగారు.

అంశం : అర్ధనారీశ్వర

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

       ఓంకార అర్ధనారీశ్వర.....!

    -------------------------------------

సృష్టి ఆరంభ మానసిక బాధ

బ్రహ్మలో సృష్టి జరగలేదన్న చింత

అందుకే,సృష్టి ప్రగతి రూపమే అర్ధనారీశ్వర

స్త్రీ జనోత్పతిలో బ్రహ్మ విఫలమాయె

అపుడు ఆకాశవాణి మైధుని సృష్టించమనె

శివాజ్ఞలేనిదే స్త్రీ జన్మ కష్టమని తెల్సి

బ్రహ్మ కఠోర తపస్సు ఆచరించి మహాదేవుని వరముపొందె

ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపమున

సృష్టి వృద్ధి వర్ధిల్లుట ముఖ్యమని

పరమానందుడై తన శరీరనుండి

ఉమాదేవిని వేరుచేయ పరాశక్తి అమ్మగా

అవతరించి ప్రజోత్పత్తి సృష్టి విస్తరించె

ఆమె,సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమ స్థానిమాత!

చరచరా వర్ధనార్ధమే దక్షుని కూతురై జన్మించె

శివుని వివాహము చేసుకొనె

శివుని తథాస్తు భృగిటి శక్తితో

బ్రహ్మ అభీష్టము నెరవేర్చే

స్త్రీ సృష్టిగా 

సాగి పరమేశ్వరుని మహిమతో

నిర్విఘ్నంగా సృష్టి చేసి లోక కళ్యాణము కల్గె

ఆ....శివశక్తి పరస్పరభిన్నులై సృష్టికి ఆధారం

పుష్పంలో గంధం,చంద్రునిలో  వెన్నెల,సూర్యుని తేజం

స్వభావ సిద్ధిశక్తిలా శివునిలో "ఇకార"శక్తి అయ్యె!

అలనాటి శువుని రూపమే పరిణామ శక్తి తత్వం

జగత్తులో నామరూపాలతో వ్యక్తి బలమాయె

ఇలా,ఆదిదంపతులై శివపార్వతుల సంయోగమే

ఈ లోకము

అధికమాస అసంక్రాంతి మాస

ఇది శుభల కాలానికి విరుద్ధము

అందుకే, సకల పూజలతో 

సర్వమంగళ ప్రదరూపమే పార్వతి తన శరీరం నిలుపుకొనెనని

పూజలు,సత్యనారాయణవ్రతం చేసిన

శుభములు కల్గి అశుభాలు తొలగును!

07/10/20, 5:29 pm - +91 98497 88108: సప్తవర్ణాల సింగిడి yp

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి సారథ్యంలో

నిర్వహణ: శ్రీ వెలిదే ప్రసాదశర్మ గారు

తాత్వికాంశం:అర్దనారీశ్వరం

శీర్షిక:ఆది దంపతులు

పేరు:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం


ప్రేమ స్వరూపుడు

త్రిమూర్తులలో ఒకరైన లయకారుడు

శివుడు

ఆదిదేవుడు

ఎప్పుడైతే శివుడు

శక్తి యుక్తుడౌతాడో

కార్య నిరతుడౌతాడు

శివ-శక్తి ల సామరస్య మే

అర్థనారీశ్వరతత్వం

శివుడు తన దేహం

అర్ధభాగం పార్వతీదేవి సొంతం

భార్యను సమానంగా

భావించి,ప్రేమించి

తనలో అర్ధభాగం

ఇచ్చిన ప్రేమ స్వరూపుడు మహాశివుడు

నువ్వు, నేను వేరు కాదని

చెరిసగం అంటూ

బాధలు,బంధాలు

సమనమంటూ

సమస్త లోకాలకు

నిలిచారు ఆది దంపతులు

పార్వతి పరమేశ్వరుడు

శివ పార్వతుల జంట

అందరికీ కన్నుల పంట

వెయ్యి నోముల పంట

ఆద్యంతాలు లేనివాడు

అతిశయించువాడు

రూపాతీతుడు

ఆనంద నందనుడు

అది శంకరుడు

అర్థనారీశ్వరతత్వం

విశ్వ సృష్టికి వెలుగు కిరణం

నిఘాడంగా మిలితమైన నిజసంకేతం

అద్వైతరూపం

ఆనందాతి క్షేత్రం

ఆది దంపతుల

అర్థనారీశ్వరత్వం


****************

07/10/20, 5:38 pm - +91 93913 41029: మల్లినాథసూరి కళాపీఠం-సప్తవర్ణా సింగిడి.

శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో. 

తాత్వికాంశం:అర్థనారీశ్వరం. 

నిర్వహణ:శ్రీవెలిదె ప్రసాద్ శర్మ కవివర్యులు. 

శీర్షిక: ఆలుమగలు

ప్రక్రియ:వచన ప్రక్రియ. 

రచన: సుజాత తిమ్మన 

*******

సంపెంగపూవుల రంగుతో 

మెరిసిపోయే అమ్మ ఒకవైపు ..

కర్పూరపు వర్ణంతో 

తళ తళ లాడుతూ అయ్య ఓవైపు 

కలిసి ఏక శరీరమై కనిపించే 

శివపార్వతుల రూపమే 

అర్ధనారీశ్వరం !


వెలుగు వెనక చీకటి 

చీకటిని దాస్తూ వెలుగు లా

భార్యా భర్త 

ఒకరికొసం ఒకరు 

ఒకరిలో ఒకరు ..

సృష్టి దర్మం ఇది 


విశ్వంలోని కోటనుకోట్ల 

జీవరాశులకు లేని నియమాలు 

మనుషులకు ఉన్నాయంటే 

ఒక చక్రబంధంలో ..

నడిపించి ఉన్నత గతులు పొందేందుకే 


మనసా ..వాచా ..కర్మణా 

ఏర్పడిన వివాహబంధం తో 

రెండుజీవితాలు ఒక్కటయే 

ఆలుమొగలే  అర్ధనారీశ్వరం !

******

సుజాత తిమ్మన. 

హైదరాబాదు.

07/10/20, 5:41 pm - +91 90961 63962: మల్లినాథసూరి కళాపీఠం 

అంశం..తాత్వికత..అర్ధనారీశ్వరం

నిర్వహణ..సుధామైథిలిగారు.వి.పి.శర్మ గారు

అంజయ్యగౌడ్

సీ..

పురహరుడెప్పుడు !పులితోలు గట్టును

      పట్టు వస్త్రము గట్టు !పార్వతమ్మ


నగవాసుని కెలమి! నగలయ్యె పాములు


బంగారు సొమ్ములు భామ బెట్టె


నీలకంఠునికేమొ నిలువెల్ల బూడిద

   గౌరమ్మ మేనెల్ల గంధ మద్దె


శీతాద్రి సుతకేమొ !సింహవాహన మాయె

        సాధు జంతువుపైన ,! స్వామి దిరుగు

తే.గీ  సప్త పాది


బిక్ష మడుగును శివుడెప్డు బిడియ పడక


అన్నమిడు సర్వవేళల అన్నపూర్ణ


వల్ల కాడులో హరునిదౌ వసతి గృహము


మేడ లోపల తానుండు మేనక సుత


ఇన్ని భేదములున్నను మన్ననగను

ఇద్దరొకటిగ నుందురు నెల్ల వేల

లర్ద నారీశ్వరులతత్వ మరయ నిదియె

07/10/20, 5:42 pm - L Gayatri: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

బుధవారం,7/10/2020

తాత్వికాంశం

*అర్దనారీశ్వరం*

నిర్వహణ : వెలిదె ప్రసాద శర్మ గారు

రచన : ల్యాదాల గాయత్రి

ప్రక్రియ : వచనకవిత


శివుడే భవుడు హరుడు లయకారుడు

అర్థాంగిని వామభాగమున నిలిపిన 

సుమనోహరుడు..


ప్రకృతి పురుషులే పరిపూర్ణత్వపు

ప్రతీకలనీ..

ముల్లోకములకు విశదపరచెను

పరమేశ్వరుడు..


శివతాండవము లాస్యముతోనే

నటరాజు మూర్తీభవించుననీ..

భోళాశంకరుని సేవయె సతి

సౌభాగ్యమనీ..


అర్థనారీశ్వరుని తత్వమే 

ఆదిదంపతులు నిర్దేశించిన

అపురూప అనుబంధం..

మానవ జనజీవన సుమధుర

మమతల గంధం..


ఆ రీతిన అనవరతము

మనగలిగిన

జన్మసాఫల్యమౌ నిదె 

జగమెరిగిన సత్యము.

07/10/20, 5:43 pm - +91 99639 15004: మల్లినాథ సూరి కళాపీఠం yp

ప్రక్రియ. తాత్వికత 

అంశము. అర్ధ నారీశ్వరం 

నిర్వహణ. వెలేదే ప్రసాద్ శర్మగారు. 


రచన. ఆవలకొండ అన్నపూర్ణ 

ఊరు. శ్రీకాళహస్తి చిత్తూరు 


అర్ధ నారీశ్వర ఆదుకోవయ్యా భవ బంధాలనుండి చేదుకోవయ్య

అన్నీ వున్నపుడు అందరువున్నారు 

ఏమి లేనినాడు ఎవరు కానరారు. "అర్ధ నారీశ్వర "


ఇలలో సౌఖ్యాలు మబ్బుతునకలు 

చుట్టాలు పక్కలు ఎండమావులు. 

తెలుసుకోలేక పోయనయ్య. 

నీవు భార్యకు శరీరము అర్ధ భాగమిచ్చి లోకాలకు ఆదర్శవంతుడవు అయ్యావయ్యా "అర్ధ నారీశ్వర "

ఉన్న లేకున్నా నీ పాదాలే శరణమని తెలుసుకున్నాను. ఇహ పర సాధకుడవు నీ వయ్యా 

నిడారంబ జీవనమే నీకు ఇష్టం మ య్య 

మాకు అలాంటి స్థితి కలిగించవయ్య. 


మేము ఇద్దరం మాకు ఇద్దరుఅంటూ కుటుంబ నియంత్రణ పాటించి అందరికి ఆదర్శవంతముగా నిలిచితివయ్యా. వెండి కొండలో వెలసితివి చల్లని చూపులు మాపై ప్రసరించవయ్య 

అందుకోమా ప్రణామాలమాల చూపించు మాపై నీ కరుణాల హేల.

07/10/20, 5:57 pm - +91 95422 99500: <Media omitted>

07/10/20, 5:58 pm - +91 70130 06795: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశం: అర్ధనారీశ్వర తత్వం

నిర్వహణ: ప్రసాద్ గారు

రచన: వసంత లక్ష్మణ్

నిజామాబాద్


శీర్షిక: అవనిలొన వెలిసే

~~~~~~~~~~~~~~~


 విశ్వమంతటికి ఆదిదంపతులై

సహధర్మచారిని గా సతీదేవి వామ బాగాన నిలిచి నిఖిలేశ్వరున్ని

వామదేవునిగా నిలిపిన రూపమే అర్ధనారీశ్వర తత్వం .....

బ్రహ్మ సరస్వతమ్మను తన నాలుకపై ధరిస్తే 

నారాయణుడు  శ్రీలక్ష్మమ్మను

తన హృదయమందు వసింపచేసాడు....

శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే 

అనే భావం ఓ వైపు 

భార్య భర్త ల బంధం అంటే 

కష్టం లోనూ సుఖం లోనూ

ఒకరికి ఒకరై తోడునీడగా

నిలవాలనే భావం ఓ వైపు

 గా తన  తనువున సతికి

సగ బాగమిచ్చి ఆదర్శమూర్తిగా

అవతరించే అర్ధనారీశ్వరుడు....

ప్రకృతి పురుషుడు

వాక్కు భావం 

కన్ను చూపు  వేరుకానట్లు

ఆది దంపతులు 

వెలసే అవనిలోన 

జనులనుద్దరింపగా.



.............................................

07/10/20, 6:01 pm - +91 94902 35017: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల

అంశం: తాత్వికత- అర్ధనారీశ్వర తత్వం 

శీర్షిక: అద్వైతం



నువ్వు నేను సగం సగం 

మన ఇద్దరి కలయిక సంపూర్ణం


చీకటి లేనిదే వెలుగుకు విలువ లేదు 

వెలుగు తర్వాత వచ్చే చీకటి హాయి నిచ్చు

ఈ చీకటి వెలుగులతోనే కదా రోజు పూర్తి అయ్యేది


కష్టానికి అంతం సుఖమని తెలుసు 

మరి ఆ కష్టాల కొలిమిలో కాలి తేనే కదా 

సుఖపు మహత్వాన్ని గ్రహించేది 

ఈ కష్టసుఖాల చక్రంతోనేకదా 

జీవితపు బండి నడిచేది 


పదం లేనిది అర్థం లేదు అర్థం లేని పదం ఎప్పుడూ వ్యర్థముగ నిలుచు 

ఈ శబ్దార్థాల కలయికతోనే కదా 

కావ్యం అజరామర మయ్యేది


ప్రకృతి లేనిదే పురుషుడు 

లేడు 

పురుషుడు లేని ప్రకృతి ఒంటరిగా మిగులు

ఈ ఇరువురి సంగమం తోనే కదా లో

కానికి పరిపూర్ణత వచ్చేది


తరచి చూస్తే లోకాన కనిపించే తాత్వికత ఇదేనట

ద్వైతంగా కనిపించే అద్వైతపు సారమట


బి.స్వప్న

హైదరాబాద్

07/10/20, 6:01 pm - Balluri Uma Devi: <Media omitted>

07/10/20, 6:01 pm - Balluri Uma Devi: మల్లినాథ సూరికళాపీఠం

అంశం తాత్వికత

నిర్వహణ: శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు   

పేరు: డా. బల్లూరి ఉమాదేవి

శీర్షిక: అర్ధనారీశ్వరం

ప్రక్రియ: ఆదర్శదాంపత్యము


ఆ.వె: శివము కూర్చు చుండు శివపార్వతు ల రూపు

     వేరు వేరు కాదు వీరిరువురు 

    నొక్క రూపు తోడ నుర్వి కాదర్శమై

     నిలిచి యుందు రెదను నెమ్మి తోడ


ఆ.వె:ప్రకృతి పురుషు లనగ పతియు సతి యనెడి

      భావనములు నింపి వాసి గాను

     నందరికిని దెలుపు నర్ధనారీశ్వర 

      తత్వ మిదియె గనుడు ధరణి యందు


ఆ.వె: అంబ శాంతతయును  నయ్య  రూపంబును

    నంత రంగ మందు ననవరతము

     నరసి భక్తి తోడ నారాధనము చేయ

       నాలు మగల బంధ మదియె భువిని


ఆ.వె: ఆలుమగల మధ్య నంతరములు లేక 

     జీవితమ్ము గడుప చింత లేక

    నదియె గనుడు నవని నర్ధనారీశ్వర

     తత్వ మందు రెల్ల తత్త్వవిదులు



ఆ.వె: శక్తియే శివుడిగ శంకరుండు సతిగ   

     నొకరికొకరుగాను నుత్సుకతన

      తాండవమ్ము చేసి తన్మయతను బొంది  

       దారి దివ్వె లైరి దంపతులకు


ఆ.వె: వాక్కు నర్థము వలె పతిసతు లెప్పుడు 

    కలసి యుండు టౌను కాపురమ్ము

    నది ప్రతీక యౌగ నర్ధనారీశ్వర    

    తత్వమున కటండ్రు దక్షు లిలను

07/10/20, 6:03 pm - Trivikrama Sharma: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ: తాత్వికాంశం

నిర్వహణ:  శ్రీ ప్రసాద్ శర్మ గారు

పేరు;   త్రివిక్రమ శర్మ

ఊరు:.  సిద్దిపేట

శీర్షిక: ఆదర్శ దాంపత్యం అర్ధనారీశ్వరమే


***********"***********

ప్రకృతి పురుషుల కలయికనే కదా పవిత్ర సృష్టికి మూలాధారం

ఆలుమగలప్రేమానుబంధం అనంత సృష్టికి ఆధారం

ప్రకృతి లేనిదే పురుషుడు లేడు

పురుషుడు లేకపోతే ప్రకృతికి పూర్ణత్వం రాదు 

ప్రకృతి పురుషుల పవిత్ర విడదీయలేని,జీవాత్మ పరమాత్మ సంబంధం

ఆత్మలేని శరీరం వ్యర్థం

శరీరం లేని ఆత్మ ఉనికి నిరర్థకం 

సృష్టి నిరంతర కవనానికి

వీరిద్దరే ఆధారం

తనువులు తలుపులు ఏకమై

మనసులు మమతలు మమేకమై

శ్వాసలు ధ్యాసలు తదే కమై

భాష ఒకటై భావమొకటై మాటఒకటైమంత్రమొకటై

పలికే రెండు హృదయాల స్పందన ఒకటై

చూసేనయనాలలక్ష్యమొకటై

నడిచేపాదాలగమ్యమొకటై

నీవు నేను మనమై

విడదీయరాని తనువై

కనుపాపలో కదిలే ప్రతిబింబమై.

ఉచ్ఛ్వాస నిశ్వాసలోపీల్చే ప్రాణ వాయువై

కళ్ళల్లో కదలాడే అనంత భావాలను మనసుతో చదివే విశారదులై

మనసులో పొంగే ప్రేమ భావనలు చూపులతోనే గ్రహించే. మనో మాంత్రికులై

మాటలకందని మంత్రాల భాష్యం తెలుపలేని మనసుకు అందని ఊహాతీతమైన ప్రేమైక సామ్రాజ్య దంపతీ మూర్తులెవరైనా

అర్ధనారీశ్వర స్వరూపులే

ఆదర్శ పుణ్యదంపతులే

ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల నుండి

అర్ధనారీశ్వర తత్వ మెరిగి

ఇరువురొకటై...

లోకాన వెలిగే పుణ్య దంపతులారా ఈశ్వరుని సాక్షిగా అర్పింతు మీకిదే సాష్టాంగ నమస్కారం


**********************

నా స్వీయ రచన

07/10/20, 6:24 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 07.10.2020

అంశం : అర్థనారీశ్వరం! 

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీ ప్రసాద్ శర్మ గారు 


శీర్షిక : శబ్దార్థములు! 


తే. గీ. 

సృజనఁ జేసెనీశ్వరుడిలఁ చిత్రముగను

జంటఁ శబ్దార్థములవోలె సర్దుకొనుచుఁ! 

విడిచియుండవు నెపుడును విడిగ, కలసి

యున్న సొంపుగా భాసిల్లు నుత్తమముగఁ! 


తే. గీ. 

పరిణయంబున మిథునంబుఈ పచ్చనైన

మంటపమునందు చేయు ప్రమాణమందు

మదినఁ ధర్మార్థకామము మోక్షములలొ

అర్థభాగమనుచుఁ చేతి నందుకొనును! 


తే. గీ. 

అన్నిటను సగభాగమగుచు హరుడు

పార్వతి, హరి శ్రీలక్ష్ములు, బ్రహ్మ భార

తియును భువనాండలోకాలఁ దివ్య లీలఁ

పూజలందిరి పురుష స్త్రీ పొడయులేక! 


తే. గీ. 

దంపతులిరువురును చేయు ధర్మ పుణ్య 

కార్యముల ఫలితంబులున్ కలసిపంచు

కొనుటయే చివరి వరకు! కోరి తెచ్చు

కొన్న బ్రతుకు చెరిసగమౌ కూర్మి గలిగి! 


తే. గీ. 

ఒక్క మాటయు, మనసున యొక్క క్రియగ

నడచు బంధము చిరకాల నగవు నిలుచు

నర్థనారీశ్వరమునకే యర్థముండు

హాయిగా సాగు జీవన మమరమగుచుఁ! 


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

07/10/20, 6:50 pm - +91 98499 29226: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల

ప్రక్రియ. వచనం 

అంశం   అర్ద నారీశ్వర తత్త్వం 

శీర్షిక   శివతత్వం 

రచన.        దార. స్నేహలత

నిర్వహణ   శ్రీ వెలిదె  ప్రసాద శర్మ  గారు 

తేదీ.          07.10.2020


అర్థనారీశ్వర తత్వం మహాశివతత్వం 

ఆంతర్యము అర్ధము చేసుకొనుటకు 

శివతత్వ మార్గమే ఆపద్ధర్మం  

మనసా వాచా సమ భాగం 

భౌతిక రూపానా సగభాగం 

ఆచరణ రూపమే అర్ధనారీశ్వరం 

నాడునే నాథుడి  ఆదిదంపతుల 

అర్ధభాగము లోకకల్యాణార్థం 

నాటికీ నేటికీ ఆలుమగల ఐక్యత్వం 

ఆది శంకర అర్ధనారీశ్వరతత్త్వం 


గణపతి జన్మ ఆవిర్భావమున 

ద్వారకాపలాగా యున్న గణపతి

శిరస్సును  ఖండించిన శివుడు 

పార్వతి బాధను తగ్గించుటకు 

గజేంద్రుని తలను అతికించి 

సతి ముఖమున సంతోషము 

గాంచించి సంతసించుటయే 

పతిధర్మమని ప్రబోధించుటయే 

సర్వకాల ఆదర్శ దాంపత్యం 

శివశంకర తత్వ అర్ధనారీశ్వరం

07/10/20, 6:53 pm - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి 

అంశం .అర్థనారీశ్వరం

నిర్వహణ.బ్రహ్మశ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు

రచన.డా.నాయకంటి నరసింహ శర్మ


అద్వైతామృతవర్షితం అర్థనారీశ్వర తత్త్వం

రస సంయోగం మృడానీశివుల హృదయాదయ యోగం 

తితీర్షా రిరంసల సమవాకమే అర్థనారీశ్వరం

అణ్వాది బ్రహ్మాండ సంకీర్ణ మె 

అర్థనారీశ్వరం

ఆనందాద్వైతమే జీవకోటి తంతువుల అచ్ఛేద్యమైన లక్షణమే అర్థనారీశ్వరం

అహోరాత్రాలూ కష్టసుఖాలూ

సదసద్వివేకమూ 

అస్తినాస్తియనే విచిక్సా అర్థనారీశ్వరం

స్థూల సూక్ష్మ దేహవివేచనకు మూలమే అర్థనారీశ్వరం

నిరంతర జననమరణ ప్రక్రియ కు ఆద్యమే అర్థనారీశ్వరం 

వాగర్థముల సాదృశ్యం అర్థనారీశ్వరం 

భూనభస్సుల ప్రతిబింబం 

శీతోష్ణముల తారతమ్యం

ఆనందవిషాదాలకు స్ఫురణ అర్థనారీశ్వరం 


డా నాయకంటి నరసింహ శర్మ

07/10/20, 7:08 pm - +91 98482 90901: మల్లినాథసూరి కళాపీఠం  YP

సప్తవర్ణాల సింగిడి

తేది :- 07-10-2020

అంశం:- తాత్వికాంశం - అర్థ నారీశ్వరం

నిర్వహణ :- శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు

కవి పేరు :- సీహెచ్ వి.శేషాచారి

కలం పేరు :- ధనిష్ఠ

శీర్షిక :- *సమస్త విశ్వ రహస్యం - అర్థ నారీశ్వరం*

:::::::::::::::::::::;::::::::::::::::::;::

అర్థనారీశ్వర తత్వం విశ్వానికి

అద్భుత మార్గ నిర్దేశనం

గౌరీ శివుల జంట ఆదర్శ జంట

ఆది దంపతుల జంట


ప్రకృతీ పురుషుల ప్రణవ స్వరూపం

స్త్రీ పురుషుల సంయోగ స్వరూపం సృష్టి రహస్యం

పగలు రాత్రి సగంసగం కలిసి  అహ్నం

నదీనదాలు కలసిన బిందు సింధువుల మీళనం సాగరం


పాడిపంటల కలయిక రైతన్న శ్రమైక స్వరూపం వ్యవసాయం

బీజ క్షేత్ర సంయోగ స్వరూపం 

మొక్కలు తరు సిరుల వనశోభ


సంసార జీవితాన ఆలుమగల

బంధాన అర్ధనారీశ్వరతత్వం

వైధిక ధర్మమై అజరామరంగ

మంధాకినీ ప్రేమ వాహినియై

సాగుచున్నది


కష్టం సుఖం గెలుపు ఓటమి

పాపం పుణ్యం ఆదాయం వ్యయం మంచి చెడు

నింగి నేల సృష్టి స్థితి


ప్రాణం దేహం ఆత్మ పరమాత్మ

వాక్కు అర్థం కలసిజగతిమాతా పితరులుపార్వతీపరమేశ్వరులు

లక్ష్మీనారాయణులువాణీబ్రహ్మలు

త్రికాల స్వరూపులైశుభంకరత్వాన ప్రజ్వలిస్తున్నారు


ఉరుము మెరుపుల ఫలితం వర్షం

ఆకలిదప్పులఆరాటపోరాటం జీవితం

ఆశనిరాశల దోబూచులాట

నిరంతర జీవన సంగ్రామం

                      *ధనిష్ఠ*

           *సిహెచ్.వి.శేషాచారి*

07/10/20, 7:12 pm - +91 99087 41535: 🚩 మళ్లీ నాద సూరి కళాపీఠం ఏడుపాయల🚩

🌈 సప్తవర్ణాల సింగిడి🌈

అంశం: శివోహం

నిర్వహణ: శ్రీ ప్రసాద్ శర్మ గారు

పేరు:M.భవాని శర్మ 

ఊరు:జమ్మికుంట 

శీర్షిక: అర్ధనారీశ్వరం



నారీశ్వరం అర్ధనారీశ్వరం జగములనేలే జగదీశ్వర

ఆదియు నీవే అంతము నీవే సతి వెంట పతి పతి వెంట సతి ఆది దంపతులకు ఆదర్శం.


 కమనీయం రమణీయం


శివోహం. శివోహం. శివోహం


ఆట కదరా శివ ఆటగదరా శివ ఈశ్వర సర్వేశ్వర.


త్రినేత్ర ధారి మీ అన్యోన్య దాంపత్య మే జగతికి ఆదర్శం.


ఆదియు నీవే..... హరి పుండరీకాక్ష.


స్మశాన మే నీ నివాసం వ్యాగ్రబరాదారి నాగ భరణ మే నీ అలంకారం.


చితాభస్మంమే అభిషేకం నీ అలంకారం.



విభూది ఉదకం వీటితో నీ అభిషేకం.



సంతోషివి అయ్యా అల్ప సంతోషివి అయ్యా శివ శివ శివ......🙏🙏🙏


          ___🌹🌹___

07/10/20, 7:14 pm - +91 91774 94235: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశం: అర్ధనారీశ్వర తత్వం

నిర్వహణ: ప్రసాద్ గారు

రచన: కాల్వ రాజయ్య 

ఊరు ;బస్వాపూర్ ,సిద్దిపేట .


శీర్షిక: బంధం 

~~~~~~~~~~~~~~~

అమావాస్య చీకటి లాంటి అయ్య

అమృతమంటి వెన్నెల కురిపిచే అమ్మ 

కలుసుకొని వారు కాపురము చేయంగా 

ఏ నాడు అనలేదు అయ్యతో అమ్మ 

నీరూపు చీకటి మయంగుందని

అరమరకలు లేని వారి ప్రేమ బంధమే 

అర్థనారీశ్వర తత్త్వం.


ఆటుపోటులవలే అవస్థలెన్ని వచ్చినా కాపురంలో,

కలసి ఎదుర్కోవడమే తప్ప కలహించుకోవడం తెలువదు.

భార్య భర్త లెపుడు బాధ్యతగా మేదలడమేతప్ప,

వదంతులు విని వాదులాడుకోవడం తెలువదు 

కూటికి లేకపోయినా కూడుండుడే కాని 

కాపురం బరువని కాదనుట లేదు 

అందుకే అది అర్థనారీశ్వర తత్త్వం.


భార్య భర్తలు వేరు వేరు కాదు 

రెండు తనువులు కలిస్తేనే కాపురం 

ఆదిదంపతులైన శివపార్వతుల రూపమే 

అర్థనారీశ్వర తత్త్వం

ఆది దంపతులే కాదు అవనిలోనున్న 

సతిపతులందరూ అర్ధనారిశ్వరులే 

వివాహాబంధంతో 

ఆలుమగలైనపుడే 

అర్థనారీశ్వరులయ్యారు.

07/10/20, 7:20 pm - +91 96428 92848: మల్లినాథసూరి కళాపీఠం

అంశం:అర్దనారీశ్వరం

పేరు:జల్లిపల్లి బ్రహ్మం

ప్రక్రియ:వచనం

నిర్వహణ:వెలిదె ప్రసాద శర్మ గారు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


పదార్థం శక్తి కలిస్తేనే పరమార్థం తెలుస్తుంది

ప్రకృతి వెనకాల పరమేశ్వర తత్త్వమే నిలుస్తుంది

ద్వైతమెప్పుడైనా భ్రాంతే

అద్వైతమే మనిషికి శాంతి

ఇద్దరు ఒకటై కనిపించేదదే అసలైన క్రాంతి

పదం ఒకరు

అర్థం మరొకరు

రెండుగా ఉన్న పరమపధం పరమార్థం ఒక్కటే

చీకటి వెలుగులు కలిస్తేనే ఒక దినం

అమ్మ అయ్యలు కలిస్తేనే జగతికి బలం

అమ్మయ్య.....రహస్యం తెలుసు కున్నాను

ప్రకృతి పరమేశ్వరుల అద్వైతాన్ని అనభూతి చెందాను

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

07/10/20, 7:21 pm - +91 94907 32454: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణముల సింగిడి 


పేరు :సుభాషిణి వెగ్గలం 

ఊరు :కరీంనగర్ 

నిర్వాహకులు :శ్రీ వెలిదె ప్రసాదశర్మ గారు 

అంశం :అర్థ నారీశ్వరం



లోకాలనేలే ఆదిదైవం

ఆదిశక్తి ని ఇముడ్చుకున్న 

అర్థనారీశ్వరం

సృష్టికారుడికే 

నారీ సృష్టి చేయ

వరమొసగ విచ్చేసిన

అర్థనారీశ్వర రూపం


ప్రకృతి పురుషులే

సృష్టికి మారు రూపులని

ఆలు మగల అన్యోన్యతని

లోకాలకు తెలయజెప్ప

ఒకరి లో ఒకరై

అర్థనారీశ్వర తత్వ్తాన్ని 

చాటి చెప్పిన 

పార్వతీ పరమేశ్వరం


ఆదర్శ 

7-10-2020

07/10/20, 7:23 pm - +91 97046 99726: This message was deleted

07/10/20, 7:23 pm - +91 94902 35017: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల

అంశం: తాత్వికత- అర్ధనారీశ్వర తత్వం 

శీర్షిక: అద్వైతం



నువ్వు నేను సగం సగం 

మన ఇద్దరి కలయిక సంపూర్ణం


చీకటి లేనిదే వెలుగుకు విలువ లేదు 

వెలుగు తర్వాత వచ్చే చీకటి హాయి నిచ్చు

ఈ చీకటి వెలుగులతోనే కదా రోజు పూర్తి అయ్యేది


కష్టానికి అంతం సుఖమని తెలుసు 

మరి ఆ కష్టాల కొలిమిలో కాలి తేనే కదా 

సుఖపు మహత్వాన్ని గ్రహించేది 

ఈ కష్టసుఖాల చక్రంతోనేకదా 

జీవితపు బండి నడిచేది 


పదం లేనిది అర్థం లేదు అర్థం లేని పదం ఎప్పుడూ వ్యర్థముగ నిలుచు 

ఈ శబ్దార్థాల కలయికతోనే కదా 

కావ్యం అజరామర మయ్యేది


ప్రకృతి లేనిదే పురుషుడు 

లేడు 

పురుషుడు లేని ప్రకృతి ఒంటరిగా మిగులు

ఈ ఇరువురి సంగమం తోనే కదా లో

కానికి పరిపూర్ణత వచ్చేది


తరచి చూస్తే లోకాన కనిపించే తాత్వికత ఇదేనట

ద్వైతంగా కనిపించే అద్వైతపు సారమట


బి.స్వప్న

హైదరాబాద్

07/10/20, 7:24 pm - +91 94934 35649: శ్రీమల్లి నాధ సూరి కళా పీఠం yp 

సప్త వర్ణాల సింగిడి 

అంశం. అర్ధ నారీస్వర తత్వం.. 

నిర్వాహకులు. వెలిది ప్రసాద్ శర్మ గారు. 

తే. 7.10.2020.

శీర్షిక.. ఆటకాదురా శివ.. 


పేరు. సి.హెచ్. వి. లక్ష్మి 

విజయనగరం.. 


అమ్మని  అర్థ భాగం చేసుకున్న 

ఏకైక అయ్యావు నీవేనయ్యా... 

కోరికలు తీర్చు కొంటె జంగమాయ్య 

తప్పులే చేసామొ,ఒప్పులే చేసామో 

అంతా నీచిలిపి చిత్రాల వల్లనేగా 


బంధాలు దూరం,బ్రతుకులు భారం 

భయంతో బ్రతికేటి జీవితాలయ్యా  

ఏనోము నోచినా, ఏ పూజ చేసిన 

కరుణ లేక కఠిన శిలవయ్యావు 

కానరాని పురుగు కబలించి వేస్తోంది 


కన్నోరు లేరు,కట్టుకున్నోరు రారు

      కడుపున పుట్టిన వారేరి తండ్రి 

మోతలు లేవు, దహనమే లేదు 

చెత్త బండిలోనే అంతిమయాత్ర 

చివరి యాత్రకు వచ్చు 

ఆనలుగురెవారో  అంతు చిక్కని 

ఆటలే ఆడుతున్నావు .. 


కాలకూటాన్ని  గరళమున దాచి 

గంగ గర్వమణచి సిగలో ఉంచి

దక్షయజ్ఞము ద్వసం చేసిన రుద్రయ్య 

కరుణ లేని ఖర్మ   కాష్టానికి రమ్మంటే    

     దయలేని దేముడా దండాలునీకు 


ఆట కాదురా శివ ఆట ఆపరా 

ఆడ లేక ఆరిపోతున్నాము 

ఆపరా శివ... ఆపు యిక ఆట    

  అల్లాడు తున్నాం  వేదనలతో

 వేసారి పోయాము....

07/10/20, 7:27 pm - +91 99124 90552: *శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*07/10/2020 బుధవారం*

*అంశం : తాత్వికాంశం (అర్ధనారీశ్వరం)*

*నిర్వాహకులు : వెలిదే ప్రసాద శర్మ గారు*

*రచన : బంగారు కల్పగురి*

*ప్రక్రియ : వచనం*

*శీర్షిక : దాంపత్యసూత్రం*


లోకాల కాచగా గరళాన్ని గొంతులో

ఉంచి గరళకంఠుడయ్యావు

నీలకంఠుడయ్యావు ఐననేమి...

￰తనువెల్లా సతికిచ్చినా

తలపై సవితి నెత్తుకుని

మాయమ్మకు తనువెల్ల కోపతాపాలేమిగిల్చావు...


తలపైన తారాకాంతుణ్ణి

తపనతో తిష్టించుకుంటే...

అయ్యగారి అనుంగుడంచు

అనువంత చింతలేక గణపయ్య

బొజ్జకే మతిలేని  ముప్పుతెచ్చే...


భోలాశంకరునని భోళాగా వరాలిచ్చి శంకరుడే కింకరుడవుతాడని

తెలియలేని యమకింకరులనే చేశావు...


అగ్నిగోళమే అక్షుగా ఉన్ననేమి

అందాలవిందు చేయు మన్మధుణ్ణి మాడ్చావు...

ఉన్నకళ్ళుకూడా సమాధిస్థితి

అని మూసుకుని...


లోకమన్నావు, పరులన్నావు

చివరకి రాక్షసులకు కూడా

దయచూపి యెదనపెట్టుకున్నావు...


ఆపాటి అలనాపాలనకి

ఆలిసుతులు నోచుకోరు

అదేమీ కర్మరా ఆత్మస్వరూపా...???


తమరుచెసి ఇరుక్కున్న

ఇక్కటలన్నింటిలోంచి..

లోకమాత జగన్మాత తనస్థాయినే

మరచే శక్తియుక్తినీ మరచే...

ఐనోళ్ళ బతిమిలాడి అక్కున చేర్చుకునే...


ఎన్ని ఒనర్చినను అమ్మలగన్న

అమ్మ నీ భక్తికి రక్తికి అనురక్తీకై

మురిసెనే...ముల్లోకాలకే

ముక్తినొసగు మూలపుటమ్మ...


శివయ్యా ఏందయ్యా

ఈదయలేని స్త్రీ సృష్టి???

అమ్మా... అని కడుపారా

పొగిలి కుమిలి ఆక్రోశిద్దాం

అనుకుంటే ఆ అమ్మే కిం అనక

నీ కరుణకే కాచుకునే...


నాటికీ నేటికీ అమ్మకి అందరికి

నాథుడివి అనాథనాథుడివి...

ఒక్కసారి కళ్లుతెరచి

కరుణామృతము కురుపించు...


అడగందే అమ్మైనా పెట్టదని

నోరారా పిలుద్దామంటే...

స్వామేనేనంటూ తేడాలేక

సగముమేనా గిరిజయై

పగలురేయి ఒదిగుండే...

07/10/20, 7:30 pm - +91 99599 31323: మల్లి నాథ సూరి కళా పీఠం ఏడుపాయల

అమరాకుల దృశ్య కవి

అర్థనారీశ్వర



కవిత

సీటీ పల్లీ

7/10/2020



ఊరురు ఉంటావు.... ఊపిరై నడుస్తావు ఊరేగే గుండెలో....

కాటి లో ఉంటావు.... కాలమై నడుస్తావు కదిలే అడుగులో....


గౌరీ నాలో సగం అంటావు ....గంగను నెత్తిన పెట్టుకుంటావు.....కురిసే మంచు కొండల్లో.....


సత్యం నేను అంటావు....నిత్యం నీలో వెలిగే జ్యోతి నేనే అంటావు మెరిసే దేహంలో.......


భక్తి నేనే అంటావు..

ముక్తి కోరే మార్గం నేనై ఉంటా నంటవు దైవ చింతనలో.....


 గెలుపు నేనే అంటావు....ఓటమి మలుపు నేనే అంటావు నడిచే దారిలో....


ఆలుమగలు ప్రేమకు చిహ్నం  మేమే అంటావు

అది దంపతుల దాంపత్య జీవితం గుర్తులు మేమే అంటావు వివాహ బంధం లో.....


అర్థం నేనే అంటావు....భావం లో బంది నేనే అంటావు రాసే అక్షరంలో....


ఆత్మ నేనే అంటావు..పరమాత్మ స్వరూపం నేనే అంటావు ఇచ్చే జన్మలో.....


ప్రకృతి నాలో సౌందర్యం అంటావు..... ఆ ప్రకృతి కాంతకు ప్రాణం నేనే అంటావు జీవించే శ్వాసలో.....


తనువు నేనే అంటావు..... ఆ తనువులు స్పందించే హృదయం నేనే అంటావు పీల్చే గాలిలొ...


బంధువు నేనే అంటావు....ఆపద్భాందవుడు నేనే అంటావు నీతో ఉండే 

తోడులో....


అమావాస్య చీకటి నేనే అంటావు.... ఆ చీకటి వెనుక వెన్నెల వెలుగు నేనే అంటావు ఆ పగలు రాత్రి లో.....


సృష్టి నేనే అంటావు..... ఆ సృష్టిని నడిపే లయకారుడు నేనే అంటావు ఈ విశ్వంలో.....

07/10/20, 7:30 pm - +91 94904 19198: 07-10-2020:-బుధవారం:

శ్రీమల్లినాథసూరికళాపీఠం.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి.శ్రీఅమరకులదృశ్యచక్రవర్తిగారిసారథ్యం.

అంశం:-తాత్త్వికం.

నిర్వహణ:-శ్రీవెలిదెప్రసాదశర్మగారు.

రచన:-ఈశ్వర్ బత్తుల.

ప్రక్రియ:-వచనం:-

శీర్షిక:-అర్ధనారీశ్వరం.

####################

జగతిలోత్రిమూర్తులవతారసృ‌ష్ఠి

అద్భుతమైన పరిణామక్రమము..!

శ్రీమహావిష్ణువుశ్రీలక్ష్మీసమేతుడై.!

బ్రహ్మ సరస్వతీదేవి సమేతుడై..!పరమేశ్వరుడుపార్వతీపతి యై.!

ముల్లోకాలనేలేమూలదంపతులైరి.


శ్రీమహావిష్ణువుతనసతియైనలక్ష్మీ

దేవికి తనహృదయమందుచోటిస్తే!

బ్రహ్మదేవుడు తన భార్య వాగ్దేవికి

తన నాలుకమీద స్థానమిచ్చాడు.

పరమేశ్వరుడుపార్వతీదేవికేకంగా

తనశరీరమందర్ద భాగాన్నిచ్చాడు.!

అందుకే.!ఆర్ధనారీశ్వరుడయ్యాడు


ఏజీవిసృష్ఠికీిస్త్రీపురుషత్వమేగా.!

సరిసగంకృషిఫలితమేప్రత్యుత్పత్తి

మానవుడుసంసారంసాగించుటకై

స్త్రీపురుషభాగస్వామ్యపుతోడ్పాటే

ఒకరిలోనొకరైసాగేనుసంసారరథం!

ఐతే..!ప్రస్తుతవిషయానికొస్తే..!


"అర్థనరిశ్వర" సంస్కృతార్థం.

అర్థనారావరయనేది హిందూవుల

దేవుళ్ళశిపార్వతులమిశ్రమరూపం.

ఈరూపం కుడిసగం శివరూపం..!

ఎడమసమరూపం పార్వతీదేవి.!

అర్థనరిశ్వరం..విశ్వముయొక్క

స్త్రపురుషశక్తుల సంశ్లేషణము..!

ప్రకృతిస్వరూపం..పార్వతీదేవి..!

ఆప్రకృతిని నడీపించేస్థితిలయల

కారకుడు పరమేశ్వరుడు...!

పార్వతీపరమేశ్వరుల సమ్మిళిత

స్వరూపమే...అర్థనారీశ్వరము..!


ఐతేమనహిందూసాంప్రదాయాల

సనాతనధర్మంప్రకారంసమాజంలో

పితృస్వామ్యాధికారంలోమాతృ

ప్రభావం స్వల్పంగా వుండేది..!

ఈ ఆదిపత్యంసమం జేయడానికి

దైవాంశవాస్తవస్వరూపాలను..

లో కానికితెలియజేయడానికి

చిత్రీకరించినదేయీయర్థనారీశ్వరం

వాస్తవానికిభార్యభర్తల సమశ్రమ

ఫలితమేగదా ప్రతిసృష్ఠియే ఒక్కరి

వల్లనోప్రతిసృష్ఠిజరుగుటదుర్లభం.!

ఐతే...!

నవనాగరిక ప్రపంచం స్త్రీసమాన

తత్త్వం కోరుకుంటోందిసమాజంలో

అలాగేశ్రమవిభజనచేసుకొంటోంది

హక్కులనుసాధిస్తోందిపురుషులకు

సమానంగా.....స్త్రీ!..        దైవతత్త్వంలో

నున్నదీ.....ఇదే కదా..!?


పురాణాల్లోకెళితే.!మనసమాజం పితృస్వామ్యపరమైనది.కొన్ని      యుగాలు గడిచింది .....!    శ్రీరామచంద్రుడు,పరశురాముడు

వీళ్ళంతా తండ్రి ఆజ్ఞను శిరసావ

వహించినవారే!..కాని..!

శివతత్త్వమే మనకుతెలుపుతుంది

అర్థనారీశ్వరమే...పురుషునిలో

స్త్రీ..సగభాగమని,స్త్రీలో.సగభాగం

పురుషుడిని....!

భగవంతుడు మనకు తెలిపే....

సంగీత నృత్య సాంస్కృతిక వినోద

భరిత భక్తితత్త్వమే యీ.దివ్యమైన

అర్థనారీశ్వర స్వరూపం...!


###ధన్యవాదాలుసార్##

          ఈశ్వర్ బత్తుల

మదనపల్లి.చిత్తూరు.జిల్లా.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏

07/10/20, 7:32 pm - +91 94400 00427: *శుభసాయంతనము*💐💐


🚩 *శ్రీమల్లినాథసూరి కళాపీఠం- ఏడుపాయల*🚩

*సప్త వర్ణాల సింగిడి*

*తేదీ.07-10-2020, బుధవారం*

*అంశము:-అర్ధనారీశ్వరం*

*(ఈ అంశపై గేయం/కవిత/పద్యం ఏదో ఒక విభాగంలో 20 పంక్తుల రచన)*

*నిర్వహణ:-విశిష్ట కవివర్యులు శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు*

               ------****------

         *(ప్రక్రియ:-పద్య కవిత)*


🕉️ *అర్ధ నారీశ్వరాయ నమః!* 🌷🙏


ఒకప్రక్క నురగము లొకప్రక్క కనకాభ-

 రణములే రమ్యమై రహి చెలంగు

నొకచెంప చితిభస్మ మొకచెంప చందన-

  చర్చలే చెలువొంది సాగుచుండు

నొకవైపు పులిచర్మ మొకవైపు చీనాంబ-

 రముల సొగసుకట్టు రాణకెక్కు

నొకచంక షణ్ముఖు డొకచంక గణపతి

  చేరి చిందుల నాడ సౌరు లెగయు


సిగను గంగయు శశిగొన చెరి సగముగ

బూది కుంకుమ లర్ధముల్ బొట్టు పూర్తి

జేయ, నమరిన పార్వతీ శివులెపుడును

జగతి నర్ధ నారీశ్వరుల్ జయము జయము....1


మగడును భార్య లిద్దరు స-

  మానులు జీవన యాత్రలో సదా

జిగిబిగి యల్లికై దనర

   క్షేమము దక్కునటంచు దెల్పగన్

సగముగ పూరుషంబమరి

   చానయొ నర్ధము గాగ నిల్చుచున్

జగమున కాదిదంపతులు

   సాక్ష్యమొసంగగ రూపునందిరే....2


యుక్తియే యొకవంక శక్తి వేరొక వంక

   యుగళము కాదయ్య యొకటియెనగు

తాండవ మొకటైన తరుణలాస్యమొకటి

  వేరెట్లు నర్తన విషయ మొకటె

బలిమి యొకటియైన లలితమొక్కటియగు

  రెండు కలసియుండ నిండుదనము

యోచనమ్మొక్కటి యాచరణ యొకటి

  కార్యసిద్ధికి రెండు కలువ వలయు


నర్ధనారీశ తత్త్వ మీ యఖిల జగతి

కిని యుదాహరణ మగుచు ఘనముగాగ

శివుడు సతియు మమేకమై స్త్రీపురుషులు

తామొకటిగ జీవింప నాదర్శ మిడిరి....3


🌹🌹 శేషకుమార్ 🙏🙏

07/10/20, 7:40 pm - +91 99597 71228: డా॥ బండారి సుజాత

అంశం :అర్థనారీశ్వరం

నిర్వహణ: వెలిదె ప్రసాద శర్మగారు

తేది: 07-10-2020


జగతికి వెలుగులు, పార్వతీ పరమేశ్వరులవంటి పతీ పత్నులు


 దేహంలో సగభాగమిచ్చిన మహేశ్వరుడు సతీ పతులు సమానమని ,ఒకరికొకరు తోడు నీడై ఉండడమే జీవిత పరమార్థమన్న భావన నందించిన పరమేశ్వరుడు


అన్యోన్య దాంపత్యం తో మమతానురాగాలు కలిగి పలువురికి మార్గ దర్శకమవ్వాలి దంపతులు 


కలిమి లేములు కావడి కుండలను భరిస్తూ ,నిత్య వసంతాల బతుకు పయనమే నిండైన జీవితమన్న ఆది దంపతులు



స్త్రీ ,పురుషులు సమానమన్న  భావనే పరమార్ధమై, చులకన చూపులను వదలమని , సతిపతుల సఖ్యతే లోక కళ్యాణమన్న అర్ధనారీశ్వరుడు



సృష్టి, స్థితి ,లయ కారులు బంధాలు అనుబంధాలకు విలువనిచ్చి ఒకరికొకరు తోడు నీడగా బతకడమే బతుకు పయనమన్న అర్ధనారీశ్వరం

07/10/20, 7:44 pm - +91 93941 71299: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల 

పేరు: యడవల్లి శైలజ కలంపేరు ప్రేమ్ 

ఊరు: పాండురంగాపురం ,జిల్లా ఖమ్మం 

అంశం: తాత్వికాంశం 

శీర్షిక: ఆట కదరా శివ ఆట కదరా 


జీవితమే ఒక నాటక రంగం

అందులో మనం పావులం

ఆడించేది పాడించేది శివుడు 

ఆకారంలేని దేవుడు.....

అయినా బోలెడు వరాలొసగె

భోళాశంకరుడే ...

సిగన చందురుని నెత్తిన గంగను 

శరీరంలో సగభాగం పార్వతిని

ధరించిన సుందరాంగుడు....

గరళంలో  గొంతును నింపుకుని 

ముఖంలో మూడవకన్ను ధరించి

పులితోలు కప్పుకున్న కరుణానిధి ..

ఈ ఆటలో గెలుపు ఓటములు 

విధి లిఖించెను ఏనాడో 

కొన్ని దారులు చూపెను ఏనాడో 

కష్టపడి విజయం పొందాలి 

కష్టపడి విజయం సాధించాలి .....

అంతా ఆ భగవంతుని ఆట

07/10/20, 7:50 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశం:అర్ధనారీశ్వర తత్త్వం

శీర్షిక;అంత శివమయం

నిర్వహణ:శ్రీ వెలిదె ప్రసాద‌ శర్మ గారు

ప్రక్రియ:గేయం


చిత్తమున శివనామమే

చింతలు బాపునుగా

శివయజ్ఞలేనిదే చీమైన‌

కదలదు

                   /చిత్తమున/

స్మశనామే‌ నివాసం 

పన్నగులే యాభరణం

విభూతె విశ్వమున విస్తరింపను జేసె

తుదకుచేరుమనిషి బూడిదై

పోవని

                     /చిత్తమున/

అర్ధభాగమునందున 

పార్వతిని నిల్పితాను

భూలోకమందున శివతత్త్వమును దెల్పి

పడతికిచ్చెనుఘనత త్రిశూలధారుడు

                      /చిత్తమున/

జంతుచర్మమును గట్టి

జగమునేలె శివుడు

విభూతి పూసుకొని సగభాగమందున

పార్వతిని నిలిపేను

అర్ధనారీశ్వరు

                 /చిత్తమున/


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

07/10/20, 7:56 pm - Anjali Indluri: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

07.10.2020 బుధవారం

తాత్వికం : అర్ధనారీశ్వర తత్త్వం

నిర్వహణ : గురువర్యులు శ్రీవెలిదె ప్రసాద శర్మగారు


 *రచన : అంజలి ఇండ్లూరి* 

 *ప్రక్రియ : వచన కవిత* 


########################

 

జననమరణాలకతీతమైనట్టిది ఆ శివం

కాలానికి వశముకానట్టిది ఆ శివతత్త్వం

పార్వతీ పరమేశ్వరుల ఆ అర్ధనారీశ్వరం

ప్రకృతి  కార్యార్థమైనట్టి సృష్టి  రహస్యం


ప్రజోత్పత్తికై బ్రహ్మ సృష్టించెను ఓ మానసం

సంకల్పదీక్షలో బ్రహ్మకది సఫలం కాని ఫలం

ఈశ్వర తపస్సుచే తను పొందెను స్త్రీతత్త్వం

పరిణామతత్త్వానికదే స్త్రీ పురుష సమాగమం


దృశ్యమానమై దేదీప్యమైనట్టి అమ్మతత్త్వం

శివతతత్త్వములోన ఆ తత్త్వం నిబిడీకృతం

ఇరుమానసాలు ఏకమైనదే స్త్రీపురుషతత్త్వం

అండపిండ బ్రహ్మాండానికి అదే ఆదిమూలం


శివం నుండీ విడదీయబడిన నారీతత్త్వం

శివశక్తిచేత చరించు భౌతికమై నిరంతరం

ఆదిపరాశక్తియే మూర్తీభవించిన ఆ స్త్రీరూపం

అందుకే సకలశాస్త్రభాండాగారం భరతఖండం


నశించే ప్రకృతిలో చలించే జీవమే శక్తితత్త్వం

అదే అర్ధనారీశ్వర పరమ తత్త్వ రహస్యం

అనన్యఅన్యోన్య దాంపత్యానికదే ఆదిపర్వం

జీవ పునఃసృష్టి కార్యానికి అదే సత్యతత్త్వం


✍️అంజలి ఇండ్లూరి

       మదనపల్లె

      చిత్తూరు జిల్లా


########################

07/10/20, 7:59 pm - +91 92989 56585: <Media omitted>

07/10/20, 8:00 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీ వెలిదే ప్రసాద శర్మ గారు

అంశం: అర్ధనారీశ్వరం

శీర్షిక: శివ లీలలు

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 07.10.2020 


ఆట కదరా శివా 

పాట కదరా శివా 

నీ లీలలే మాకు 

పాట కదరా శివా


జన్మ జన్మల దుఃఖాన్ని బాపితివయ్యా 

దేవముని గణమంతా  సేవితురయ్యా 

రావణుని దర్పాన్ని అణచినావయ్యా

ముని గణాలు నిను కొలిచినారయ్యా  

                            !!ఆట!! 

సతీ సౌభాగ్యాన్ని ఇచ్చావు స్వామి 

ఉగ్రరూపమును నీవు దాల్చినావయ్యా 

దక్షుని మదమును అణచితివయ్యా 

సకల ఐశ్వర్యానికి నీవే మూలకారణమయ్యా

                                  !!ఆట!! 

కంఠాన విషాన్ని దాచినావయ్యా 

పులితోలు నీవు తొడిగినావయ్యా 

విభూదితో నింపి శరీరాన్నంతా

సర్పాలే నీకు ఆభరణాలయ్యే 

                                  !!ఆట!! 

వాక్కును అర్ధాలు ఒకటిగానుండు

పార్వతీ పరమేశ్వర తత్వమదియేగా 

అందుకే నిను కొలిచే భాగ్యాన్ని పొందేము 

నిత్య పూజలు నీవు అందుకోవయ్యా

                                  !!ఆట!! 

లింగోద్భవంలో గొప్పోడివయ్యావు 

అఖిల దేవతలకు ఆదిగురువువు నీవు 

జలాభిషేకంలో దోషాలు తొలగిస్తావు 

కొలిస్తే భోళాశంకరుడివై వరాలనిస్తావు 

                                  !!ఆట!! 

నీ పూజలే మాకు శక్తినిస్తాయి 

నీ గానమే మాకు ఆయువిస్తుంది 

నీ భజనయే మాకు ప్రాణశక్తి 

అందుకే మా పూజలందుకోవయ్యా 

                                  !!ఆట!!

07/10/20, 8:01 pm - +91 94906 73544: మల్లినాథ సూరి కళా పీఠం

 ఏడుపాయల 

అంశం:: అర్ధనారీశ్వర తత్వం

 రచన::యెల్లు. అనురాధ రాజేశ్వర్రెడ్డి 

నిర్వహణ:: ప్రసాద్ శర్మ గారు

 ప్రక్రియ ::గేయం



 మనసులు మమతలు మమేకమై

 శ్వాసలు ధ్యాసలు తదేక మై

 ప్రకృతి పురుషుల కలయిక

 పవిత్ర సృష్టికి మూలాధారం



 ముల్లోకాలను విశద పరిచే విశిష్ట సృష్టి 

ఆదిదంపతుల అపురూప అనుబంధం

 మానవ జన జీవన మమతల గంధం

 జన్మ సాఫల్యం జగమెరిగిన సత్యం




 వెలుగు వెనక చీకటి

 చీకటి వెనుక వెలుగుల

 చక్రబంధంలో భార్యాభర్తలు

 మనసా వాచా కర్మణ అర్థనాఈశ్వరం



 ప్రేమ స్వరూపం లయకారత్వం

 అద్వైతం ఆది రూపం

 ఆనంద క్షేత్రం వెలుగు కిరణం

 1000 నోముల అర్ధనారీశ్వరం


యెల్లు.అనురాధ రాజేశ్వర్ రెడ్డి

07/10/20, 8:02 pm - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠం yp*

          ఏడుపాయల 

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో......

           సప్తవర్ణసింగిడి 

తేది:07/10/2020 బుధవారం 

             తాత్వికాంశం 

*అంశం: అర్ధనారీశ్వరం*

నిర్వహణ:శ్రీ వెలిదె ప్రసాద్ శర్మగారు 

రచన:జె.పద్మావతి 

మహబూబ్ నగర్ 

శీర్షిక: *ఐక్యతా చిహ్నం*

*************************************

ఒక సమత,ఒక మమత

ఒక నాదం,ఒక లయ

సృష్టి రహస్యమును తెలిపేది

స్థితికి కారకమని బోధించేది

లయాత్మక జీవనమును చూపేది

అర్ధ నారీశ్వర తత్వము

ప్రకృతీ పురుషుల సంయోగమే భువనమునకు ఆధారము 

ఆకృతులు వేరైనాశరీరములు వేరైనా

దాంపత్య జీవితానమనసులు మాత్రం 

ఏకమేనని ఋజువుచేయు సూత్రం

ఉమా శంకరుల ఐక్యతా రూపం

ఆత్మ ,పరమాత్మ  ఒకటేనని

జీవం, దేహం ఒకటేనని

చీకటి,వెలుగులు సమమని

కష్టమూ,సుఖమూ సమమని

సంసార సౌధానికి ఆలూమగలే

ధృఢమైన స్థంభాలుగా నిలుస్తారని

మానవ మనుగడకు చూపే మార్గం

అర్ధ నారీశ్వర తత్వం.

07/10/20, 8:02 pm - +91 98496 14898: శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

నేటి అంశం;అర్థనారీశ్వర తత్వం

నిర్వహణ;శ్రీ వెలిదె ప్రసాద్ శర్మగారు

తేదీ;07-10-2020(బుధవారం)

రచన; యక్కంటి పద్మావతి, పొన్నూరు.

శీర్షిక;భక్తమందారుడు.

ఎంత చిత్రాతిచిత్రంనీ రూపం

ఎంత బోళాతనం నీ హృదయం

ఎంత సుందరం అర్థనారీశ్వరం

ఆది దంపతుల  అనుగ్రహమే కడుపావనం

సతీ దేవి పై అవ్యాజమైన ప్రేమ తో వీరభద్ర రూపం

శైలతనయగా హిమజ జనించుటయే పుణ్యవశం

సగభాగమిచ్చిసతి విలువ తెలిపిన ఘనతనీదేనయ్యా

అష్టైశ్వరదాయిని ప్రక్కనుండీవిభూతిదాల్ఛేస్వామి నీవయ్యా

గంగను దాల్చి గరళముమ్రింగిన స్వామినీ వయ్యా

హిమవన్నగసంచార విష పన్నగ హారా!

ఆలుమగల అనురాగ ప్రతినిధులు మీరయ్యా

నీదు అనుగ్రహమే మోక్షదాయకం

అమందానంద చిన్మయ రూపా!

శివతత్వచింతానమృతధార లోనన్నుతరించనీవా?

ఆ ప్రణవనాదం ఎంతమధురమో

ఆ చల్లని వీక్షణం

సదా సదా నీ నామస్మరణం చేయుదును

కావవా! శివా!

07/10/20, 8:05 pm - +91 98499 52158: మల్లినాథ సూరికళా పీఠం

సప్తవర్ణముల సింగిడి

శ్రీఅమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆధ్వర్యంలో.

అంశం:అర్ధనారీశ్వరం

నిర్వహణ:బ్రహ్మశ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు.

శీర్షిక:ఆదిదంపతులు

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్.


అర్ధాంగి అర్ధమై కలిసున్న శ్రీమంతుడర్ధనారీశ్వరా...

ఆదిదంపతులుగా లోకోక్తి

సొంతంగా అపరేశ్వరా...


సృష్టిసాకార శున్యంలో ఆనంద 

విభూతని చూపిన విశ్వేశ్వర..

కలిమిలేముల్లో కడవరకు

తోడుండి ఆదర్శ అమరేశ్వర...


సతిపతుల జంటకు సృతిగతిని

సూచనవు సోమేశ్వరా.. 

భర్యాభర్తలు ప్రకృతికి  హితులని బ్రమలను బాపిన

వైద్యనాథ..


కర్మలను కోపతాపాలను

కూరిమితో వివరించిన గౌరీశివా...

సమతల అమరిక తో సన్నిహిత సంబంధమే కైలాసంగా మల్లీశ్వరా...



నీవేకదా జగలనేలే జగదీశా.

పంచాక్షరీమంత్ర పరమేశ్వర ఓంకారరూప పవిత్రమైన ప్రేమకు నిదర్శనం

ప్రణవస్వరూప పర్వతిపరమేశ్వరా....

07/10/20, 8:07 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 7,10.2020

అంశం. అర్థనారీశ్వర

శీర్షిక: గౌరార్థశరీరా

నిర్వహణ. బ్రహ్మశ్రీ‌వెలిదె.ప్రసాదశర్మగారు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.


ఆద్యంతం రహితం.సర్వశక్తి

సమన్వితం వాగర్థ ప్రతిపత్తయే‌దేవీ

సర్వలక్షణ .సుసంస్తుతే 

విలాసహాసమాన సంజోజ్వలా 

జ్వలానేత్ర త్రిలోచనా త్రగుణాత్మక

నిలయానటనస్వన‌నటీనటనాయక

కామాక్షీహాసరజితవర్ణవిలసత్‌

ప్రియా దివ్వభవ్య అర్థనారీశరీరధారీ రజతాచల‌విహారీదాక్షాయనీసహిత,విశ్వేశ్వరా

విశాలనీలోత్పలా లోచనాసర్వహితా

ప్రపంచసృష్టివదనా వామభాగ తాటంకయుగళీభూతతనూసమేక్షాయా దివ్యచర్మాబర,అరథవిభూతి

ధరాయా వామభాగసర్వశ్రేష్ఠవిశిష్ట

అంబశ్యామలకుంతలధరాయా

కస్తూరితిలకార్థధరాయాఅర్థశేషపన్నగకంఠధరాయానవరత్నప్రతిఫణ

భాస్కర్తటీవిలసితాయ.పాదాబ్జరాజ

ఝణత్కంకణనూపురాయసౌందర్యలహరీదక్షిణామూర్తయఅర్ధదేహకమాక్షీరూపధరాయ.నమోశంకర

పార్వతీశోభితాఅర్థనారీశ్వరాదయాళూశక్తి సమన్వతా.సర్వజనహితా 

సనాథమావిశ్వంభరాకృపాళోదయన్ బ్రోవుమా కృపన్

07/10/20, 8:09 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 7,10.2020

అంశం. అర్థనారీశ్వర

శీర్షిక: గౌరార్థశరీరా

నిర్వహణ. బ్రహ్మశ్రీ‌వెలిదె.ప్రసాదశర్మగారు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.


ఆద్యంతం రహితం.సర్వశక్తి

సమన్వితం వాగర్థ ప్రతిపత్తయే‌దేవీ

సర్వలక్షణ .సుసంస్తుతే 

విలాసహాసమాన సంజోజ్వలా 

జ్వలానేత్ర త్రిలోచనా త్రగుణాత్మక

నిలయానటనస్వన‌నటీనటనాయక

కామాక్షీహాసరజితవర్ణవిలసత్‌

ప్రియా దివ్వభవ్య అర్థనారీశరీరధారీ రజతాచల‌విహారీదాక్షాయనీసహిత,విశ్వేశ్వరా

విశాలనీలోత్పలా లోచనాసర్వహితా

ప్రపంచసృష్టివదనావామభాగౌరీ.సదనా తాటంకయుగళీభూతతనూసమేక్షాయా దివ్యచర్మాబర,అరథవిభూతి

ధరాయా వామభాగసర్వశ్రేష్ఠవిశిష్ట

అంబశ్యామలకుంతలధరాయా

కస్తూరితిలకార్థధరాయాఅర్థశేషపన్నగకంఠధరాయానవరత్నప్రతిఫణ

భాస్కర్తటీవిలసితాయ.పాదాబ్జరాజ

ఝణత్కంకణనూపురాయసౌందర్యలహరీదక్షిణామూర్తయఅర్ధదేహకమాక్షీరూపధరాయ.నమోశంకర

పార్వతీశోభితాఅర్థనారీశ్వరాదయాళూశక్తి సమన్వతా.సర్వజనహితా 

సనాథమావిశ్వంభరాకృపాళోదయన్ బ్రోవుమా కృపన్

07/10/20, 8:15 pm - +91 94932 73114: 9493273114

మల్లినాథ సూరి కళా పీఠం పేరు.కొణిజేటి. రాధిక 

ఊరు రాయదుర్గం 

అంశం అర్ధనారీశ్వర తత్వం నిర్వహణ.. వెలిదె ప్రసాద శర్మ గారు


కష్టనష్టాలను కడతేర్చే,

 నీ నామస్మరణే మాకు భోగభాగ్యాలు...

బోళా శంకరుడివై వరాల వర్షం కురిపించే అర్ధనారీశ్వర తత్వం జగతికి ఆదర్శం...

 ఆలుమగల అనురాగానికి ప్రతీకలై నిలచి...

లయకారుడివై,

 వైరాగ్య భావనలకు మూల బీజాలు నాటిన ఉమా శంకరా...

 జీవితమంటే చీకటి వెలుగుల సంగమమని...

 దాంపత్యం అంటే ఆలుమగల అన్యోన్యత అని లోకానికి చాటి చెప్పిన పరమేశ్వరా...

అనుసరణీయదగిన అర్ధనారీశ్వర తత్వం ఆచరిస్తే, విడాకులన్న పదమే లోకంలో వినిపించదు కదా శివా...

స్మశానమే ఆవాసమైనా సంతోషంగా లేరా...

  బూడిదనే పూసుకున్న అష్ట ఐశ్వర్యాలతో తులతూగ లేదా...

అరమరికలు లేక, అర్థం చేసుకుంటే,

 మీ అర్థనారీశ్వర తత్వం అవగతం చేసుకుంటే ఇలలో ఆనందాల హరివిల్లులు విర బూయవా...

07/10/20, 8:29 pm - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ తాత్వికాంశం

అంశం అర్ధనారీశ్వరo

నిర్వహణ శ్రీ వెలిదెప్రసాదుశర్మ గారు

శీర్షిక  పార్వతీపరమేశ్వరతత్వము

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 07.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 54


పార్వతమ్మ లోకాన్నే కాపు కాచేటి కల్పవల్లి

శివయ్య ప్రపంచాన్నే  పరిపాలించే తండ్రి

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు

తల్లిదండ్రులిరువురు ఉంటేనే పిల్లలకు భవిష్యత్తు

నాణేనికి బొమ్మ బొరుసులు ప్రధానం

లోకానికి పార్వతీ పరమేశ్వరుల ప్రధానం

భార్యాభర్తల సంగమం భావితరానికి ఆదర్శం

పగలు,రాత్రి కలిస్తేనే రోజవుతుంది

పార్వతీపరమేశ్వరతత్వము ఉన్నదే లోకకళ్యాణార్ధము

శక్తిస్వరూపిని పార్వతమ్మ

శక్తిస్వరూపుడు శివయ్య

రెండు శక్తిలు కలిస్తేనే సృష్టికి ఆరంభ అంత్యాలు ఉంటాయి

చీకటి వెలుగుల సంఘమము మనిషి జీవితం

అమ్మ సాయము లేనిదే అయ్య అడుగు ముందుకు వేయలేడు

అయ్య ఆజ్ఞ లేనిదే అమ్మ చిన్నపని కూడా చేయలేదు

శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అలాంటిది మరి అమ్మ ఏమి చేయగలదు

కష్ట,సుఖాల కలగలపు మనిషి జీవితం

అయ్య కష్ట పడి వచ్చినప్పుడు అమ్మ సాయమే అమృతపు ధార అవుతుంది

ఆలుమగల అనురాగానికి ఆదిదంపతులే

ఆదర్శం

సృష్టి రహస్యాల సారమే పార్వతీపరమేశ్వరతత్వము

అర్ధనారీశ్వర తత్వమును పూర్తిగా అర్ధము చేసుకొను మనిషి ఇంకా పుట్టలేదు

లోకానికే తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు

వారి నామస్మరణ చేస్తూ జీవితాన్ని గడపటమే మనకి ఉత్తమమం

07/10/20, 8:31 pm - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: అర్ధ నారీశ్వరం

ప్రక్రియ: వచన కవిత

నిర్వహణ:  శ్రీ. వెలిదె ప్రసాద్ శర్మ గారు

రచన: పేరం సంధ్యారాణి, నిజామాబాద్

తేదీ: 07 -10 - 2020


అర్దనారీశ్వర తత్వం

అరమరికలు లేని ప్రేమతత్వం

పార్వతి పరమేశ్వరుల ప్రణయ తత్వం

అఖిల లోకాలకు నిదర్శనం

ఆదిదంపతులే ఆదర్శం

అఖిల దేవతాకృతి ఆదిదేవుడు

సకల శక్తి ప్రదాయిని పార్వతి

డమరుక ప్రభంజనాల 

ప్రదోష నర్తనాల వేళ

ఆనంద తాండవాల

అద్భుతలాస్యాల విన్యాసాల

వెండికొండ అగును విశ్వవేదిక

విడదీయరాని అమర ప్రేమయై

సర్వమంగళ వరమై

 సాంబశివుని అర్థశరీరమై

 పార్వతీ పరమేశ్వరులు  

చెరిసగమై లోకానికి చాటిచెప్పే

ఆలుమగల ప్రేమానురాగం

 అర్దనారీశ్వరుల అసలు తత్వం

సృష్టాదికివీరే  కారణభూతమని

శివశక్తుల కలయికే ఈ ప్రకృతి

సృష్టి స్థితిలయలకు వీరే ఆకృతి

07/10/20, 8:32 pm - +91 99595 24585: *సప్త వర్ణాల సింగిడి*

*మల్లి నాథసూరి కళాపీఠం*

*ఏడు పాయల*

*అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో*

*అంశం....తాత్వికం ..అర్ధనారీశ్వరం*

*నిర్వాహణ...వెలిదే ప్రసాద శర్మ గారు*

*రచన : కోణం పర్శరాములు*

*సిద్దిపేట బాలసాహిత్య కవి*

*శీర్షిక : ఇల్లాలు*

*తేది : 06-10-2020*

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

ఆమె.......

గృహ సీమకు మహారాణి

గృహాన్ని గుడిగా మలచి

పూజలు చేస్తుంది

సైనికులు దేశం కోసం బార్డర్లో

గస్తీ కాచినట్లు

ఆమె ఇంటి రక్షణ కోసం

నిరంతరం శ్రమిస్తుంది


ఆమె......

ఇంటిలో జీతంలేని

ఉద్యోగిని

లేకుంటే భర్త ఉద్యోగానికి 

సద్దిమూట లేకుండా ఎలా

వెల్తాడు

పిల్లలు ఉదయం లేవగానే

బడికి వెళ్ళడానికి ఎలా రెడీ

అవుతారు

ఆమె పొయ్యి ముట్టించనిదే

మన కడుపు నిండదు

చేదోడు వాదోడుగా చేయూత

అందించే కార్యశీలి


ఆమె.......

ఉద్యోగ నిర్వహణలో

ధైర్యశాలి

 జంకు గొంకు లేకుండా

విధినిర్వహణలో కార్యశీలి

ఎలా అవుతుంది

ఆమే శాంతిస్తే శాంతమూర్తి

ఆమే కోపమొస్తే అపర కాళీ


ఆమె........

ఇంటిని చక్క దిద్దే

అందమైన ఇల్లాలు

ఆమె ఉద్యోగ నిర్వహణలో

కర్తవ్యశీలి

ఆమె ఆ ఇంటిని దేవాలయం

చేసే పూజారి

ఆమె రోగాలబారి నుండి

కాపాడే వైద్యురాలు

ఆమె ఆ ఇంటికి కార్మికురాలు

ఆమె ఎక్కడ గౌరవింప బడుతుందో

అక్కడ తథాస్తు దేవతలు

సంచరిస్తారు


కోణం పర్శరాములు

సిద్దిపేట,9959524585

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

07/10/20, 8:34 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణముల 🌈 సింగిడి

ఏడుపాయలు- 07-10-2020

పేరు: ప్రొద్దుటూరి వనజారెడ్డి

ఊరు: చందానగర్

అంశం: అర్ధనారీశ్వరం

తాత్వికాంశం

             9866249789

నిర్వహణ: శ్రీమతి సంధ్యారెడ్డి గారు

————————————

శివుని అర్ధనారీశ్వర రూపం వెనక అసలు రహస్యం 

“ఇన్ యాంగ్ “ అంటే చీకటి

వెలుగుల సమతుల్య సంగమం

చీకటి వెలుగులు ఇద్దరిలో ఉంటాయి 

ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం, ఒకరి చీకటిలో

ఒకరు సేద తీరటం 


హిందూ జీవన విధానంలో 

అర్ధనారీశ్వర తత్వంగా చెప్పే

పరస్పర ప్రేమాప్యాయయతలు

ప్రపంచం పుట్టినప్పటి నుండి

ఉన్నటువంటివె


“వాగర్థావి సంపృక్తౌ,

వాగర్థప్రతిపత్తయే, 

జగతః పితరౌ, వందే

పార్వతీ పరమేశ్వరౌ”


ఈ ఆది దంపతులిద్దరూ దేహాన్ని పంచుకొని అర్థమారీశ్వరావతారంలో కనిపించే శివుడు

అమె కు తన ధేహంలో  సగభాగమివ్వడమే  భారతీయ

వివాహ వ్యవస్థతమలో వైశిష్ట్యం 


మగువ తన శక్తియుక్తి

కలిమిలేములలో,

కష్టసుఖాలందు  మగవాడికి తోడునీడై ఉండడమే అర్ధనారీశ్వర తత్వం

————————————

ఈ రచన నా స్వంతం

————————————

07/10/20, 8:40 pm - +91 99486 53223: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల , సప్తవర్ణాల సింగిడి అంశం :తాత్వికత అర్ధనారీశ్వర తత్వం పేరు: మచ్చ అను రాధ .

ఊరు  :సిద్దిపేట నిర్వహణ  :శ్రీ వెలిదే ప్రసాద్  శర్మ గారు.


 సీసమాలిక పద్యం


భార్య భర్తలనగ బంధము గొప్పది 

మనసులు కలిసిన  మహిని గొప్ప ,


మాట మాట కలిపి మనుగడ సాగించ 

యానందమే లేదు నంతకన్నా ,


అన్యోన్య దాంపత్యమనగానే గుర్తొచ్చు

శివ పార్వతుల జంట శీఘ్రముగను ,


 అర్ధ భాగమిచ్చి అర్ధనారీశ్వర 

యని పేరు గాంచిరి  యద్భుతమ్ము ,


ఇలలోన దంపతులిద్దరి దీవించు  ఆదిదంపతులనియు హాయి నొంద ,


భార్యకు స్థానము బాగుగా నిచ్చియు

త్రిమూర్తులు కలిసి తెలిపినారు ,


మనుషులు తెలుసుకొని మనుగడ సాగించ

జన్మసార్థకమౌను జగతి నందు , 


వారి పేరు నిలిచు వంశమునందున

ఇల్లాలి సౌఖ్యము యింటి వెలుగు. 


           తేటగీతి


స్త్రీలు పురుషులు సమము రా జీవితమున  ,

బండి చక్రాల విధము బతుకు లోన  ,

భేద భావము లేకున్న ప్రేమ హెచ్చు ,

అహము వీడిన కలుగు హాయి యెంతొ.

🙏🙏

07/10/20, 8:48 pm - +91 99519 14867: మల్లినాథసూరికళాపీఠం yp

ఏడుపాయలు. 

సప్తవర్ణసింగిడి. 


నిర్వహణ : శ్రీ  వెలిదే ప్రసాదేశర్మ గారు. 

అంశం : (తాత్వికాంశం )

అర్ధనారీశం. 


పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

నాగర్ కర్నూల్. 


శీర్షిక :  ముక్కొటి  దేవతలు. 


ఇరువురి శరీరాలు 

ఓకే దేహంలో అమరిక. 


ఉమా శంకర 

అవగహన అవగతమైతే 

దాపత్యం అన్యోన్యత 

తత్వం అద్భుతం. 


మనుషులు వేరైన 

మనసులు ఓకే రీతి 

పొందికై  ఒకరికొకరం 

కలిసి ఉండడమే 

అర్థనారీశం. 


భార్య భర్తలు 

ఒకే పాత్రలో 

ఒకటై  జీవితమనే 

నటనలో శివపార్వతులాగా 

కలిసి మెలసి 

కాపురముంటే 

తధాస్తు అంటు 

ముక్కోటి దేవతలు 

దీవిస్తారు. 


పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

9951914867.

07/10/20, 8:50 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు.. వెలిదే ప్రసాద్ శర్మ

7.10.2020 

అంశం.. అర్ధనారీశ్వర తత్వం

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్

ప్రక్రియ.. గేయం


పల్లవి..శివ శక్తి స్వరూపులై సృష్టికి

మూలం మీరేనయ్యా..

అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక లై

అన్యోన్య దాంపత్యానికి సంకేతాలై

ఇలలోని జంటలకు ఆదర్శవంతులై

జగతికి తల్లిదండ్రులు మీరేనయ్యా

ఉమామహేశ్వరా.. శ్రీ రాజరాజేశ్వరా!


1. చరణం..  

లయకారునివి నీవై జగన్మాత 

శక్తి స్వరూపిణి యై  లోకాలనేలే

ఆత్మ బంధువులై కృపా సాగరాన

బంధాలు వేసే జంట ప్రేమలకు

ఇద్దరు కాని ఒకరి రూపమే...//ఉమా//


2.చరణం

అర్ధనారీశ్వర తత్వం అద్భుతమై

నీలో సగ భాగం అర్ధాంగియై

అమ్మ జగన్మాత ప్రకృతి అయి

అండగా ఉండే తండ్రి మహాదేవుడు 

పురుషుడై ఆడించేది నీవైతే

శాసించేది అమ్మై లోకాలనేలే   ఆదిదంపతులు మీరేనయ్యా // ఉమా//


హామీ పత్రం ...ఇది నా స్వీయ రచన

07/10/20, 8:52 pm - +91 94410 66604: శీర్షిక:నారీ సంధించే శరం

*********************

ఆది అంతం అర్థనారీశ్వరః

పంచభూతాల సారం ఇంతియద 

సామరస్యాల సూత్రమేమంగళమై

మదిని ఏలే తత్వమే చదరంగమై ఏలే అర్థనారీశ్వర మే  ఈ తనువు

అర్థం పరమార్థం పంచమవేదమై పాపపుణ్యాలను తూలనచేసి సరిచేసే నరునిలోని  నరంలేనినాలుక సంధించే శరాల అర్థాలను అంధకార అజ్ఞాననతిమిరాలను తొలిగించే సూక్ష్మ దృష్టి అందించే కాలభైరవతత్వవేదమే కాలజ్ఞానమై పంచాక్షరిమంత్రమై నరులచూపుల్లో నారీతత్వమే అర్థమై మొగుడి మనసును ఏలే అని ఒక నారీతత్వమే అర్థమై పోదా..ఇహపరసుఖాల పంచభూతాలసారమిదే...

*********************

డా.ఐ.సంధ్య

సికింద్రాబాద్

07/10/20, 8:54 pm - +91 94407 10501: 🚩🌈*మల్లినాథ సూరి కళాపీఠం - 🌈 సప్త వర్ణముల సింగిడి 🌈*

పేరు       : తుమ్మ జనార్ధన్, (జాన్)

తేదీ        : బుధవారం-తాత్వికత  07-10-2020

అంశం    : అర్ధనారీశ్వరం

నిర్వాహణ: శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు 

ప్రక్రియ    : వచనం


*శీర్షిక :  అంతా అర్ధనారీశ్వరం*


శ్రుతిలోన నడయాడు నరుడు నారీ

కృతిలోన నర్తించు నాదయోగీ 

ధృతిలోన లాస్యమౌ శక్తిధారీ

మృతిలోన మౌనమే ఆదియోగీ.


అహరహం తపియించు అమరజీవి

అరుణమై తరియించు అల్పజీవి

అడుగడుగు అద్భుతం చేరవేమీ

అంధుడై అడవి జీవింతువేమీ.


అర్థ కామాలలో అర్ధమెదీ

ఇహలోక సుఖములో మోక్షమేదీ

పరమపావనమౌ పయనమేదీ

ఇహపరం ఒకటిగా జీవించవేమీ.


అంతటా ఉందిగా పరమేశ్వరం

అన్నిటా కనిపించు శక్తిస్వరూపం

ఆపేయ్యి ఇక అర్థ-నరీశ్వరం

అంతటా దర్శించు అర్ధనారీశ్వరం.

07/10/20, 8:55 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

అంశం...తాత్వికాంశం అర్ధనారీశ్వరం

శీర్షిక....ఒకరిలో ఒకరై

పేరు...యం.టి.స్వర్ణలత

తేదీ...07.10.2020

నిర్వాహణ...శ్రీ వెలిదె ప్రసాదశర్మ గారు



సృష్టియందు స్త్రీ పురుషులు సమానమని

తెలిపేందుకు ఏర్పడిన తత్వం...

అర్ధనారీశ్వార తత్వం

విరుద్ధ స్వరూపాలు ఏకమై...

జీవించాలని ఒకరికొకరు లోకమై


అష్ట ఐశ్వర్యాలు ఉన్న శక్తి స్వరూపిణి

ఏమి లేని బిచ్చగాడైన శివుడిలో సగభాగమై

అవసరాలు తీర్చే ఆలిగా అన్నింటా...

తోడై ఎందులోనూ తనకు సాటి కాని

శివుడి యందు చేరింది...


భార్యాభర్తలు...

ఒకరి వెలుగుతో మరొకరు నిండిపోతూ

ఒకరి చీకటిలో మరొకరు సేద తీరుతూ

ఒకరికోసం ఒకరై నిలిచేదే...

అర్ధనారీశ్వార తత్వం


పువ్వును వీడని సుగంధంలా

చంద్రున్ని వీడని వెన్నెలలా

సూర్యున్ని వీడని తేజస్సులా

స్వభావ సిద్ధమై...

ఒకరిలో ఒకరు ఒదిగి పోవడమే

శివుడు శక్తిల అర్ధనారీశ్వార తత్వం


శ్రీకృష్ణునికి సత్యభామలా... 

అర్ధాంగి సహకారంతోనే విజయాలు

సాధించగలరని సూచించేదే

అర్ధనారీశ్వార తత్వం

లోక కళ్యాణార్ధమై విరాజిల్లుతుంది

07/10/20, 8:56 pm - Sadayya: <Media omitted>

07/10/20, 8:56 pm - +91 98494 54340: *శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*07/10/2020 బుధవారం*

*అంశం : తాత్వికాంశం (అర్ధనారీశ్వరం)*

నిర్వాహకులు : వెలిదే ప్రసాద శర్మ గారు

రచన : జ్యోతిరాణి 

ప్రక్రియ : వచనం

శీర్షిక : అర్థనారీశ్వరులు 

************************************

ప్రకృతి పురుషుల అనుసంధానం లేకుండా 

సృష్టి లేదు 


సృష్టికి మూలం 

ఈ జగతికి ఆధారం 

అనురాగ బంధమే కదా

 

స్త్రీ  పురుషుల ఇరు మనస్సులు  

పరిమళిస్తేనే కదా క్రొత్త

ఆవిష్కరణలు రూపులద్దుకునేవి


క్రొంగొత్త వనాలు కుసుమాలై 

పరిమళం వెదజల్లేవి 


భార్య భర్తల అన్యోన్య దాంపత్య జీవనమే కదా 


విశ్వమానవ వికాసానికి 

మూలాధారం 


అందుకే కదా ...


ఈశ్వరుడు తనలో 

పార్వతిని ఐక్యం 

చేసుకుని 

అర్థ నారీశ్వరుడుగా 

ఈ ముల్లోకాలకు 

అధిపతియై 

వెలుగొందుతున్నాడు ...


గరళాన్ని మింగినా

భోళాగా ఉండమని 

ప్రణయమైనా,ప్రళయమైనా సమంగా సాగమని 

చాటేదే


ఇదే (అర్థనారీశ్వర తత్వం)


🌹బ్రహ్మకలం🌹

07/10/20, 8:57 pm - +91 97049 83682: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

అంశం:అర్దనారీశ్వరం

నిర్వాహణ:శ్రీ వెలిదే ప్రాసాద్ శర్మగారు

రచన:వై.తిరుపతయ్య

శీర్షిక:జగథ్ రక్షకులు

తేదీ:7-10-2020


–-------------- ---------------------

లోకరక్షణకై కైలాసం నుండి

కాశీలో వెలిసిన అంబ 

పర్వతీదేవియే అన్నపూర్ణమ్మ

జగతలోక కళ్యాణార్థం కొరకు

ఆ ఈశ్వరుడే హలాహలాన్ని

మ్రింగిన గరలకంఠుడు శివుడు

సృష్టిలో అందరికోసమై వీరి ఆజ్ఞవల్లేఅన్నిపుట్టుతాయి

జగత్తు అంత అర్థనారీశ్వరులే

అందరిలో సగభాగాలు

ఎవరేమాడిగిన తప్పక ఇచ్చువాడు ఆ లింగమయ్య.

ఏవిధంబుగ చూసిన ఒక

మారు పార్వతి మరోమారు

శివుడుగా దర్శనమిస్తారు.

స్ట్రీ పురుషులు అంతే ఇరువురు సరి సమానమే

సాక్షాత్ శివ పార్వతులే

ఇరు సమానమైనప్పుడు

ఆయన సృష్టించిన మానవులు

అంత అర్థనారీశ్వర స్వరూపమే

అన్ని శక్తులు,అన్ని రూపాలు 

శివపార్వతులలో ఉన్నట్టు

స్త్రీ పురుషులలో అన్ని సామార్త్యాలు సమానమే

07/10/20, 8:59 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం : తాత్త్వికాంశం (అర్ధనారీశ్వరం)   

తేదీ : 07.10.2020 

నిర్వహణ : శ్రీ వెలిదే ప్రసాద శర్మ  

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్ 

***************************************************

వాగర్దావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే 

జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ 

వాక్కు తండ్రి అర్ధం అమ్మ 

అయ్య జడం అమ్మ చలనం 

ఆ రెండూ కలిసిన స్వరూపం అర్ధనారీశ్వరం 

ఈవంక మేను హిమనగం 

ఆవంక మేను కాలమేఘం 

ఈవంక మేనిపై చితాభస్మం  

ఆవంక  మేనిపై అంగరాగాలు 

ఈవంక తలపైన చంద్రరేఖ 

ఆవంక  తలపైన సూర్యమణి

ఈవంక నుదిటిపై విభూది రేఖ   

ఆవంక  నుదిటిపై కుంకుమ రేఖ 

ఈవంక కనులు అర్ధనిమీలితాలు 

ఆవంక కనులు ఆనందార్ణవాలు 

ఈవంక మెడలోన కాలసర్ప హారాలు   

ఆవంక మెడలోన నవరత్నఖచిత హారాలు  

ఈవంక మెడక్రింద హాలాహాల మచ్చ 

ఆవంక మెడక్రింద శ్రీగంధ లేపనమ్ము  

ఈవంక గజచర్మ వసనమ్ము   

ఆవంక పట్టు పీతాంబరమ్ము  

ఈవంక చేతిలో త్రిశూల ఢమరుకమ్ము   

ఆవంక వరాలు కురిపించే అభయముద్ర  

ప్రకృతీపురుష ఏకస్వరూపము ఈ జగతి 

అర్ధనారీశ్వరమ్ము ఆ అంతః స్వరూపము 

స్త్రీపురుష అభేదమ్ము

సృష్టి అణువణువులో వ్యక్తము 

***************************************************

07/10/20, 9:00 pm - +91 91821 30329: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం!అర్ధనారీశ్వరం

నిర్వహణ!శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు

రచన!జి.రామమోహన్రెడ్డి


శివపార్వతులే అర్ధనారీశ్వ

ర అవతారం

ఆది దంపతులే ఆదర్శ దాం

పత్యానికి నిదర్శనం

చీకటి వెలుగుల సమతుల్య

సంగమం

చీకటి,వెలుగు స్త్రీ,పురుషు

లిద్దరిలో

ఒకరు వెలుగులో వుంటే

ఒకరు చీకటిలో సేద తీరడం

యిదే అర్ధనారీశ్వర తత్వం


భార్య భర్త అన్యోన్య సాంగ

త్యమే అర్ధనారీశ్వరం

పరష్పరం దంపతుల మధ్య

బాంధవ్యం

ఆలు మగలు తోడుగ నీడగ

ఒకరి కోసం ఒకరుగా--  

ప్రేమాభిమానాన్ని పంచు కోవాలి

భర్త మాటను భార్య గౌరవిం

చాలి

భార్య మాటకు భర్త విలువ

నివ్వాలి

అడ్డంకులు ఆపదలెదురైనా

యిద్దరు ఓర్పుతో నేర్పుతో

ఎదుర్కొనాలి

అనుమానాలను విడనా

డాలి

నమ్మకాన్ని పెంచుకోవాలి

ఆలోచనలు ఆచరణలు ఒకటిగా చేయాలి

కర్మలలోను కార్యముల లోను

నిర్ణయాల లోను,నిర్మాణా

త్మక విషయాల లోను

అర్ధనారీశ్వరులుగా మెలగా

లి


ఆలు మగలంటేనే --ఆప్యాయత అనురాగం

భార్య భర్త  అంటేనే -- ఆత్మ

పరమాత్మ

సతి పతి అంటేనే -- మనసు

మమత

07/10/20, 9:02 pm - +91 94913 52126: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు.. వెలిదే ప్రసాద్ శర్మ

7.10.2020 

అంశం.. అర్ధనారీశ్వర తత్వం

పేరు.. డా.భారతి మీసాల

ఊరు... రాజాం,శ్రీకాకుళం


అమ్మవారి సర్వస్వం అయ్యవారి సొంతం

అయ్యవారి జీవితం అమ్మవారి మిళితం

అమ్మవారి చిరునవ్వు అయ్యవారి ఆనందం

విడివిడిగా ఊహించని లోకానికి ఆదిదంపతులు

వీరిరువురు కలిసిచూపే కరుణే మన జీవితం

ఆదిదేవుడు,ఆదిపరాశక్తి ఆనందరూపమే అర్ధనారీశ్వరం

ఒకరి కోసం ఒకరి జీవితం అనే పరమార్ధమే అర్ధనారీశ్వరతత్వం

చీకటి వెలుగుల సంగమమే శివపరమేశ్వరితత్వం

ఒకరిలో ఒకరు సేదతీరడమే శివకామేశ్వరితత్వం

ఆదిదంపతులు జగత్తుకంతటికి తల్లిదండ్రులు

పార్వతి పరమేశ్వరుల మోక్షయసుగుడు మూర్తులు

కాటిలో విహరిస్తూ కాపాలంతో తిరిగే మహేశ్వరుడును

సౌభాగ్యంగా భావించే శివాని గొంతులో విషముతో చేతిలో త్రిశూలంతోనున్న గరళకంఠుని గాంచి లోకసంరక్షణ ప్రతినిది అని తలిచిన పార్వతి తలపై గంగతో కంటిలో మంటతోనున్న త్రినేత్రుడిని పాపాలు రూపుమాపునని అంబికఅంతరంగం

బుసలుకొట్టే పాములు అట్టలు కట్టే జాడలున్న చంద్రశేఖరుడిని

చేసి ముక్తిని కలిగించు మూర్తిఅనిభావించే భవాని విభూతి రేఖలు ఢమరుకనాధములతో పులితోలు కప్పుకున్న సాంబశివునిని చూసి మానవలోకమునకు కలిగించు మోక్షమని మురిసెను ఉమామహేశ్వరి

ఇదే అర్ధనరీశ్వరతత్వం

హామీ పత్రం ...ఇది నా స్వీయ రచన

07/10/20, 9:05 pm - +91 94913 52126: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు.. వెలిదే ప్రసాద్ శర్మ

7.10.2020 

అంశం.. అర్ధనారీశ్వర తత్వం

పేరు.. డా.భారతి మీసాల

ఊరు... రాజాం,శ్రీకాకుళం


అమ్మవారి సర్వస్వం అయ్యవారి సొంతం

అయ్యవారి జీవితం అమ్మవారి మిళితం

అమ్మవారి చిరునవ్వు అయ్యవారి ఆనందం

విడివిడిగా ఊహించని లోకానికి ఆదిదంపతులు

వీరిరువురు కలిసిచూపే కరుణే మన జీవితం

ఆదిదేవుడు,ఆదిపరాశక్తి ఆనందరూపమే అర్ధనారీశ్వరం

ఒకరి కోసం ఒకరి జీవితం అనే పరమార్ధమే అర్ధనారీశ్వరతత్వం

చీకటి వెలుగుల సంగమమే శివపరమేశ్వరితత్వం

ఒకరిలో ఒకరు సేదతీరడమే శివకామేశ్వరితత్వం

ఆదిదంపతులు జగత్తుకంతటికి తల్లిదండ్రులు

పార్వతి పరమేశ్వరుల మోక్షయోసుగుడు మూర్తులు

కాటిలో విహరిస్తూ కాపాలంతో తిరిగే మహేశ్వరుడును

సౌభాగ్యంగా భావించే శివాని

గొంతులో విషముతో చేతిలో త్రిశూలంతోనున్న గరళకంఠుని గాంచి లోకసంరక్షణ ప్రతినిధి అని తలిచిన పార్వతి 

తలపై గంగతో కంటిలో మంటతోనున్న త్రినేత్రుడిని పాపాలు రూపుమాపునని అంబికఅంతరంగం

బుసలుకొట్టే పాములు అట్టలు కట్టే జాడలున్న చంద్రశేఖరుడిని

చూసి ముక్తిని కలిగించు మూర్తిఅనిభావించే భవాని

విభూతి రేఖలు ఢమరుకనాధములతో పులితోలు కప్పుకున్న సాంబశివునిని చూసి మానవలోకమునకు కలిగించు మోక్షమని మురిసెను ఉమామహేశ్వరి

ఇదే అర్ధనారీశ్వరతత్వం

హామీ పత్రం ...ఇది నా స్వీయ రచన

07/10/20, 9:06 pm - Telugu Kavivara changed this group's settings to allow only admins to send messages to this group

07/10/20, 9:10 pm - Telugu Kavivara: <Media omitted>

07/10/20, 9:10 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-162🌈💥*

                       *$$* 

*అసహాయ శూరతే సొంతం-162*

                         *$$*

*అసాధ్యమదియే అడుగేయనంతదనుకే*

*'అ'ని అదిమి పట్టగ సాధ్యమే స్వంతమౌ*

*కంటికానని లక్ష్యం కాలికి దూరమవబోదు*

*సమరశీలి సాధనశూరుడే ఏకలవ్యుడిలా*

                          *@@*

            *అమరకుల ⚡ చమక్⚡*

07/10/20, 10:35 pm - Velide Prasad Sharma: మల్లినాథసూరి కళాపీఠం.. ఏడుపాయల

            సప్తవర్ణాల సింగిడి

           *బుధవారం..తాత్వికాంశం*

                 అర్థనారీశ్వరం

అమరకులదృశ్యకవి చక్రవర్తి గారి ముఖ్య పర్యవేక్షణలో నిర్వహించిన నేటి అంశంలో కవులందరూ చక్కని రచనలు చేసినారు.తాత్వికత..భక్తి మేళవింపుతో సాగిన ఈ నాటి రచనలు అర్థనారీశ్వరునికి మన పీఠం తరపున అందరూ బాగుండాలని పూర్వపు జీవన వైభవం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంకితం ఇవ్వనైనది.లోక కళ్యాణార్థం చేసిన రచనలయినందున అందరినీ విజేతలుగా ప్రకటించుచున్నాము.

*భాగస్వాములైన కవివరులు*

డా.భారతి మీసాల గారు

వై.తిరుపతయ్య గారు

జ్యోతిరాణి గారు

డా.ఆడిగొప్పుల గారు

యం.టి.స్వర్ణ లత గారు

తుమ్మజనార్ధన్ గారు

డా.ఐ.సంధ్యగారు

నల్లెల మాలిక గారు

పోలె వెంకటయ్య గారు

మచ్చ అనూరాద గారు

ప్రొద్దుటూరి వనజారెడ్డిగారు

బక్క బాబురావు గారు

కోణం పరశరాములు గారు

పేరం సంధ్యారాణి గారు

లలితారెడ్డిగారు

కొణిజేటో రాధిక గారు

కల్వకొలను పద్మకుమారి గారుయాంసాని లక్ష్మీరాజేందర్ గారు

యక్కంటి పద్మావతిగారు

జె.పద్మావతి గారు

యెల్లం ఆనూరాదా గారు

గొల్తి పద్మావతి గారు

అంజలి ఇండ్లూరి గారు

మోతే రాజకుమార్ గారు

యడవల్లో శైలజ గారు

బండారో సుజాత గారు

విశిష్టకవి శేషకుమార్ గారు

ఈశ్వర్ బత్తులగారు

ఎం.కవిత గారు

బంగారు కల్పగురి గారు

సో.హెచ్ వి లక్ష్మిగారు

బి.స్వప్న గారు

వెగ్గలం సుభాషిణి గారు

జల్లపల్లి బ్రహ్మం గారు

కాల్వ రాజయ్య గారు

ఎం.భవాని శర్మ గారు

సి.హెచ్.శేషాచారిగారు

నాయకంటో నరసింహశర్మ గారు

దార స్నేహలత గారు

తులసి రామానుజాచొర్యులం గారు

మల్లోజు త్రివిక్రమ శర్మ గారు

విశిష్టకవి డా.బల్లూరి ఉమాదేవి గారు

బి.స్వప్న గారు

వసంత లక్ష్మణ్ గారు

బైంసా సంధ్యారాణి గారు

ఆవలకొండ అన్నపూర్ణ గారు

ల్యాదల్ల గాయత్రిగారు

అవధాని విశిష్టకవి బండికాడి అంజయ్య గౌడ్ గారు

తోమ్మన సుజాత గారు

గాజుల భారతి గారు

జోష్యుల ప్రభాశాస్త్రిగారు

 విశిష్టకవి శ్రీరామోజు లక్ష్మీరాజయ్య గారు

కొండ్లె శ్రీనివాస్ గారు

డా.ప్రియదర్శిణి గారు

పొట్నూరి గిరీష్ గారు

గుడి నీరజాదేవి గారం

గొల్తో పద్మావతి గారు

చాట్ల పుష్పలత గారు

పిడపర్తి అనితాగిరి గారు

ముడుంబై శేషఫణి గారు

చిల్క అరుంధతి గారు

బోర భారతీ దేవో గారు

ముద్దు వెంకటలక్ష్మిగారు

చెరుకుపల్లో గాంగేయ గారు

నెల్లుట్ల సునీత గారు

ఎడ్ల లక్ష్మి గారు మౄదక్ జిల్లా మొల్ల బిరుదాంకితులు

సూర్యదేవర రాధా రాణి గారు

 వేలేటి శైలజ సిద్ధిపేట గారు

పబ్బ జ్యోతి లక్ష్మిగారు

తాతోలు దుర్గాచారి గారు

విశిష్టకవి డా.కోవెల శ్రీనివాసాచార్యులం గారు

లింగుట్ల వెంకటేశ్వర్లు గారు

డిల్లో విజయకుమార్ గారు

చోంతాడ నరసింహమూర్తిగారు

బందు విజరకుమారిగారు

రుక్మిణీశేఖర్ గారు

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి గారు

విశిష్టకవి ఆవధాని మాడుగుల నారాయణ మూర్తిగారు

పండ్రువాడ సింగరాజు గారు

శైలజాశ్రీనివాస్ గారు

శిరిశినహళ్ శ్రీనివాస్ మూర్తిగారు

దుడుగు నాగలత గారు

రాంపల్లి శైలజ గారు

ఛింతల గంగాధర్ గారు

రావుల మాధవీలథ గారు

బి.సుధాకర్ గారు

స్వర్ణ సమత గారు

ఓ.రాంచందర్ గారు

డా.సుధామైథిలిగారు 

రావినూతల భరద్వాజ గారు

చయనం అరుణా శర్మ గారు

మహ్మద్ షకీల్ జాఫరీ గారు

కొప్పుల ప్రసాద్ గారు

గోలి విజయ గారు

వెంకి హైదరాబాద్ గారు

కట్టెకోల చిననర్సయ్య గారు

తెలికి చర్ల విజయలక్ష్మి గారు

బక్క బాబన్న

దాస్యం మాధవిగారు

నాయకంటి నరసింహ శర్మ గారు

 

నాకు పూర్తిగా సహకరిస్తూ అందరి రచనలపై చక్కని సమీక్ష చేసిన కవివరులందరూ ఉన్నారు.వారి సమీక్షలను కూడా అర్థనారీశ్వరునికి అంకితం చెయనైనది. 

ఇంకా ఎవరి నైనా మరచిపోతే వారిని వారి రచనలను పరమ శివుడు గుర్తుపెట్టుకొని అంకితం చేసుకోగలడని నమ్ముతున్నాను.

కరోనా భయం నుండి అందరం మామూలు జీవితం సుఖంగా సంతోషంగా ఆరోగ్యవంతంగా ఇక నుండి గడపాలని అర్థనారీశ్వరుని ప్రార్థిస్తూ నమస్సులతో...అభినందనలతో...

             సమర్పణ

పీఠం తరపున

వెలిదె ప్రసాదశర్మ

07/10/20, 10:35 pm - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

08/10/20, 7:58 am - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

08-10-2020 గురువారం

పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

అంశం: గజల్

శీర్షిక: బాలు ఇక లేడే (57) 

నిర్వహణ : తగిరంచ నరసింహారెడ్డి


సుస్వరము కూర్చగలరా ఎవ్వరైనా బాలు ఇక లేడే

ఈశ్వరము పొందగలరా ఎవ్వరైనా బాలు ఇక లేడే! 


అక్షరము విలువ పెంచగలరా ఎవ్వరైనా సప్త జన్మ

శిష్యు తప్పులెంచ గలరా ఎంతైనా బాలు ఇక లేడే! 


పాటలు ప్రాణం పోయగలరా ఎవ్వరైనా ఏక తాళ

పంచమం వరము మళ్లి రా కొంతైనా బాలు ఇక లేడే! 


సంగీతం చూడగలరా ఎవ్వరైనా స్వర్గారోహణ

ఆభరణ శంకరాభరణ నిలువైనా బాలు ఇక లేడే! 


షడ్యమ చేర్చగలరా ఎవ్వరైనా సంగీత సామ్రాజ్య

విశ్వపిత శ్రీపతి పండిత 'రాణై'నా బాలు ఇక లేడే!

వేం*కుభే*రాణి

08/10/20, 8:12 am - Tagirancha Narasimha Reddy: *మల్లినాథ సూరి కళాపీఠం* 

*సప్తవర్ణముల సింగిడి* 

నేటి ప్రక్రియ: గజల్ లాహిరి

నిర్వహణ: తగిరంచ నర్సింహారెడ్డి 


గజల్ లోని భావవ్యక్తీకరణలో చమత్కారం ముఖ్యం...గజల్ లో వస్తువు ముఖ్యంగా ప్రేమ, విరహం , తాత్వికత ఉంటుంది...


*గజల్ వచన కవితలా ఒకే విషయం మీద ఉండదు.*


*రెండు మిశ్రాలు దేనికదే స్వతంత్రంగా ఉంటూ భావైక్యత కలిగి ఉంటాయి.*


*ఒక గజల్‌ లో ఒకసారి వాడిన పదం మరొకసారి రాకుండా చూసుకోవడం గజల్‌ సౌందర్యానికి 

తప్పనిసరి అన్న సీనియర్ల మాటను మనసులో ఉంచుకోవాలి.*


*చమత్కారం గజల్ కు ప్రాణం.*

08/10/20, 8:17 am - Tagirancha Narasimha Reddy: ప్రేమబంధం తెంచుతుంటే, అతుకుటెట్లో తెలియలేదే 

మృత్యువంటే ప్రీతి కలిగెను; బ్రతుకుటెట్లో  తెలియలేదే 


గుండెలోపలి పొరలు చీల్చుతు చిరునవ్వుతో చంపుతావే

మదిలో చోటు ఇవ్వనంటే; ఉండుటెట్లో తెలియలేదే!  


పూటపూటకు మనసు విరిచే గాయమెంతగ  చేసినావే ; 

దు:ఖమెంతగ పొంగిపొరెలెనొ; ఆపుటెట్లో  తెలియలేదే 


ప్రేమకర్థం చెప్పమంటే మౌనశిలవై మిగిలిపోతివి 

కరుణచూపని రాతిమనసే; కరుగుటెట్లో తెలియలేదే 


జన్మ జన్మకు నీవు మాత్రమె నా బంధమని తలిచినానే

గొంతునిండా విషము పోస్తివి; పలుకుటెట్లో  తెలియలేదే!


"తగిరంచ"కొక హృదయముందని తెలుసుకోవేం నీదేననీ?!

కాదు పొమ్మని కాల్చుతున్నవు... గెలుచుటెట్లో తెలియలేదే!!

08/10/20, 8:36 am - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

గురువారం 08.10.2020

అంశం:గజల్ లాహిరి

నిర్వహణ:శ్రీ తగిరంచ నరసింహారెడ్డి గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*

శీర్షిక:వంటలు చేయాలి


మినుములను  నూరేసి  గారెలే  చేయాలి

కొబ్బరిని  కూరేసి  బూరెలే  చేయాలి


అతిథులకు  వేడిగా  భోజనం పెట్టగా

నాలుకకు  రుచియైన  కూరలే  చేయాలి


అప్పడం  వేయించి పాపడం పెడుతూనె

పప్పులకు  తోడుగా  చారులే చేయాలి


మధురమౌ  రుచితోటి  మనసునే  దోచేటి

అమృతాన్ని  తలపించు  అరిసెలే  చేయాలి


కరకరా  నమలగా  కమ్మగా  కరిగేటి

తీరైన  సకినాల  వరుసలే  చేయాలి

08/10/20, 9:00 am - +91 97040 78022: శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం     ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవి గారి పర్యవేక్షణ 

సప్తవర్ణాల సింగిడి 8/10/2020

అంశం-: గజల్ లాహిరి

నిర్వహణ-: శ్రీ తగిరంచ నరసింహా రెడ్డిగారు

రచన -: విజయ గోలి


గజల్ విజయ గోలి


నీతలపున *మోహన మై విరిసెనులే దరహాసం.         

నీవలపుల  *కళ్యాణి (యై) గ మెరిసెనులే దరహాసం


ఉషోదయపు రంగులలో రవళించిన *భూపాలం

హిమచందన తుషారాలు చిలికెనులే దరహాసం


సాగివచ్చు ఆమనికై స్వాగతాల * కీరవాణి

రామచిలుక పలుకులలో ఒలికెనులే దరహాసం


సందెవేళ   సన్నజాజి నవ్వులలో * హిందోళం

జడగంటల జావళీలొ కులికెనులే దరహాసం


రేయంతా రాయంచల రసఝరిలో * నీలాంబరి

“విజయా “లతో  *హంసధ్వని పాడెనులే దరహాసం

08/10/20, 9:23 am - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -గజల్ లాహిరి

నిర్వహణ -శ్రీ తగిరంచ నరసింహారెడ్డి గారు

రచన -చయనం అరుణా శర్మ


కమలములే కొలనులోన విరిసినవీ

ఎందుకనో

కిరణములే సరిగమలుగ విరిసినవీ

ఎందుకనో


మేఘములే రాగాలుగ వినువీధిన

కదిలెనులే

చినుకులతో చిరుజల్లులు కురిసినవీ

ఎందుకనో


వెన్నెలలో కలువలన్ని విరబూసెను

అందముగా

చలువరేని కళలుచూసి మురిసినవీ

ఎందుకనో


తేనెలతో విందులనే చేసెనుగా

ఆ గళమే

పరవశాన పున్నములే పిలిచినవీ

ఎందుకనో


పులకించే మనసుంటే ఈ జగమే

ఊయలయే

భావములే అరుణమై పలికినవీ

ఎందుకనో

08/10/20, 10:29 am - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

అంశం: గజల్ లాహిరి

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, తగిరంచ నరసింహారెడ్డి గార్లు.

రచనసంఖ్య: 045, తేది: 08.10.2020. గురువారం

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: గజల్ లాహిరి


ఆకశాన పక్షులన్ని ఎగిరెనులే అందంగా

కొమ్మమీద కోయిలమ్మ కూసెనులే అందంగా


పచ్చనైన వనంలోన పరుగుపెట్టె జింకపిల్ల

చెంగుమంటు పొదలలోకి

ఉరికెనులే అందంగా


బండరాళ్ళు తీసుకొచ్చి ఉలిదెబ్బతొ శిల్పాలను

శిల్పులెంత నేర్పుగాను చెక్కెనులే అందంగా


గలగలమని నీటితోటి పారుతున్న ఏటిలోన

సర్రుమంటు చేపపిల్ల ఈదెనులే అందంగా


పిక్కపైకి చీరగట్టి వాలుజడను తిప్పుకుంటు

అందమైన సుందరాంగి నడిచెనులే అందంగా


కొప్పులోన పూలుబెట్టి బావిలోకి వంగివంగి

చేదతోటి మంచినీళ్ళు తోడెనులే అందంగా


పక్కనుండి నడుస్తున్న యువకుల్లో "నరసింహం"

తుంటరోళ్ళు కొంటెగాను చూసెనులే అందంగా


👆ఈ గజల్  నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

08/10/20, 10:34 am - +91 92989 56585: <Media omitted>

08/10/20, 11:14 am - +91 99631 30856: This message was deleted

08/10/20, 11:33 am - +91 98679 29589: *సప్తవర్ణముల సింగిడి*

 *మల్లినాధ సూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం: గజల్ లాహిరీ*

*ప్రక్రియ: గజల్*

*నిర్వహణ:  శ్రీ తగిరంచ నర్సింహ రెడ్డి గారు*

*తేదీ 08/10/2020 గురువారం*

*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట* 

            9867929589

"""""''"""""''"""'""""''''''"""""""""""""""""""'"""

నీ ప్రేమపు భారములో అణిగి పోయా,

నా గుండె ముక్కలయ్యీ విరిగి పోయా ౹


తేనెలాంటి తియ్యని నీ మాట వింటూ,

మంచులా మనసు కరిగి కరిగి పోయా ౹


నీటిపైన వ్రాసినట్టి వ్రాత లాగా,

ఒకే ఒక తరంగములో చెరిగి పోయా ౹


నీ శరీరపు మల్లెపూల సుగంధములో, 

నా అస్తిత్వాన్నీ ముంచి మునిగి పోయా ౹


నీ మనసుతో మనసు కల్పీ నేను 'మొ. ష.',

ప్రేమ, కర్తవ్యంబులోన నలిగి పోయా ౹


*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

     *మంచర్, పూణే, మహారాష్ట*

08/10/20, 11:43 am - +91 99088 09407: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

పేరు:గీతాశ్రీ

ప్రక్రియ:గజల్ లాహిరి

నిర్వహణ:శ్రీ తగిరంచ నర్సింహా రెడ్డి గారు

____________________________

నువ్వెళ్ళే దారేదో నడవాలని ఉన్నదీ

పద్మాలగు నీపదములు తాకాలని ఉన్నదీ


కొప్పులోన తురుముకున్న మల్లెమాల విరులచేరి

పరిమళమై ప్రియంగానె చేరాలని ఉన్నదీ


జొన్నచేల పరవాలనె పరుచుకున్న సొగసరివో

నినుపొగడే కావ్యములా మారాలని ఉన్నదీ


కనికట్టుల వయ్యారం చీరకట్టు సింగారికి

చిన్నబోతె రాచిలుకలు నవ్వాలని ఉన్నదీ


నీచేతుల గాజులసడి గుండెతలుపు తడుతుంటే

మనసాగక చెలిమికొరకు ఓడాలని ఉన్నదీ


ఎదవెన్నెల పరుచుకుంది స్వప్నాలలొ సఖియవులె

మూసిఉన్న రెప్పలనిను కాచాలని  ఉన్నదీ


మనసుచూసె లోకమంత నీరూపమె తలపించగ

స్వర్గసీమ నువ్వేనని చెప్పాలని ఉన్నదీ


   🍃 *గీతాశ్రీ స్వర్గం*🍃

08/10/20, 12:13 pm - Velide Prasad Sharma: గజల్ వంటకాలు బాగున్నాయి . 5555 మీటరులో రాశారు.చేయాలి...అనే పదం అంతటా వచ్చింది.ఓకే.దానికి ముందు ప్రాస పదంబూరెలే..కూరలే..వరుసలే..అరిసెలే..ఇవీ ఓకే.గజలులో చివరి వాక్యాలలో ఎక్కడైనా కవిపేరు రావాలి.అదొక్కటి చూడండి.

అభినందనలు.

వెలిదె ప్రసాదశర్మ

08/10/20, 12:37 pm - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*గజల్ లాహిరి*

*నిర్వహణ:తగిరంచనరసింహారెడ్డీ గారు*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


విరుల తావి గుబాళింపు

గుండెలోన నిలిపితివే

కలువపూవు కమనీయ ము

కంటిలోన నిలిపితివే


మనసులోని మధురిమ నే

కులుకు లోన నిలిపితివే

ఎదలయలో సరిగమలను

గొంతులో న నిలిపితివే


కనుపాప లో కాంతినంత

నగవులోన నిలిపి తివే

బుగ్గలోన సిగ్గునంత

మోములోన నిలిపితివే


మొగ్గలోన సొగసు నంత

తనువులో న నిలిపితివే

మదిలోనీ భావమంత

బాసలోన నిలిపితివే!!


*ప్రయత్నం మాత్రమే*🙏🙏

08/10/20, 1:32 pm - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠం yp*

           ఏడుపాయల 

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో......

             🌈సప్తవర్ణములసింగిడి 

08/10/2020 గురువారం

    🌊గజల్ లాహిరి

నిర్వహణ:శ్రీ తగిరంచనర్సింహారెడ్డిగారు 

రచన:జె.పద్మావతి 

మహబూబ్ నగర్ 

*************************************

వీనులకే విందుచేసె పసందైన మధుగీతం

మాటలకే అగుపించే హుషారైన మధుగీతం 


ఊహలకే అందనిదీ కన్నులకే కాననిదీ

మాటునుండి మాయచేసె పరాకైన మధుగీతం 


మదిలోపలి భావాలనె పదిలంగా పోగుచేసి

పాడిందిలె ఈఅధరం మధురమైన మధుగీతం 


వసంతాన కోకిలలే వీణమీటి పాడినట్ఠు

చిత్తమునే దోచినదే కావ్యమైన మధుగీతం


పల్లవించె పాటలన్ని పరిమళాలె పద్మానికి

దాసులనే చేసిందే శ్రావ్యమైన మధుగీతం

08/10/20, 1:56 pm - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

ప్రక్రియ: గజల్ లాహిరి

నిర్వహణ:  శ్రీ. తగిరంచ నరసింహారెడ్డి గారు

రచన: పేరం సంధ్యారాణి, నిజామాబాద్

తేదీ: 08 - 10 - 2020


అరుణోదయ అందములను

 చూసినంత మనసుమురియు

 కొలనులోన కమలభామ

కాంచినంత మనసుమురియు


ప్రకృతికాంత హరితవర్ణ

సొబగులెంతొ సేదతీర్చు

అరవిరిసిన అందములను

తలచినంత మనసుమురియు


గగనవీధి తారమణుల

సయ్యాటల నడుమనున్న

జాబిలమ్మ సుధలనుమది

గ్రోలినంత మనసుమురియు


విరహాగ్నిచె రగలిపోయె

ఒంటరైనా చెలికానికి

మధురమైన చెలిపలుకులు

వినినంతా మనసుమురియు


మునిమాపటి వేళయందు 

పడమటింటి సంధ్యరాగ

సౌందర్యపు రమణీయత

చూసినంత మనసుమురియు

08/10/20, 2:16 pm - S Laxmi Rajaiah: మల్లినాథసూరి కళాపీఠం YP 

గురువారం: గజల్ లాహిరీ.    8/10 

నిర్వహణ: తగిరంచ నరసింహా రెడ్డిగారు 

                     గజల్ 


ఆశే బలి పశువును జేసి ఆడించు 

సోదరా 

బుద్ధిమాంద్యమందు నిల్పీ పీడించును  

సోదరా 


ఏకాకివి కావునీవూ సమాజానా ఒకడివి 

స్వార్థ కూపమునను నెట్టీ క్రీడించును 

సోదరా 


విడిబడితే పడిపోదువు ఆలోచన 

లాపకుమా 

ద్వేషాగ్నినీ రగిలించీ వేదించును 

సోదరా 


ఎంతచెట్టూకంతగాలీ ధైర్యముతో 

అడుగుడూ 

దోపిడీకీ తలఒగ్గని వాదించును 

సోదరా 


పూలబాట పరచుటకై శ్రీరామోజు 

కవితలూ 

ప్రజానీకం మురిసిపోయి దీవించును 

సోదరా 


             శ్రీరామోజు లక్ష్మీ రాజయ్య 

             సిర్పూర్ కాగజ్ నగర్.

08/10/20, 2:25 pm - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP

నిర్వహణ:తగిరంచ నరసింహ రెడ్డి గారు

ప్రక్రియ:గజల్

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292


అందమైన కలువపూలు

కొలనులోనవిరిసినాయి.

మోజుపడీతీయబోతే

చేతిలోనజారినాయి


రంగురంగువిహంగాలు

మబ్బుల్లో విహరించే

సప్తవర్ణ రంగులతో

మనసులోన మురిసినాయి. 



విరబూసే పూలలోని

పరిమళాలువ్యాపించి

మనసంతా దోచుకుంటూ

మత్తులోనముంచినాయి.


జామురాత్రిజాబిలమ్మ

వెన్నెలంత వెదజల్లి

తారకలే జోలపాడి

నింగిలోన మెరిసినాయి.


వనమంతా విరగకాసే

పళ్లతోను పరువంగా

ఈభారతి కందాలని

నోటిలోన నిండినాయి

08/10/20, 2:32 pm - +91 94404 74143: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 17, ది: 08.10.2020. గురువారం.

అంశం: గజల్ ప్రక్రియ

శీర్షిక: అభిసారిక

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీ తగిరించ నరసింహా రెడ్డి గార్లు.

కవిపేరు: చిల్క అరుంధతి

నిజామాబాద్


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


నీ ఊహల  ఊసులలో నా మనసే 

మురిసెనుగా

నీ తపనల తాకిడిలో *నాతనువే* మురిసెనుగా


జ్ఞాపకాల దొంతరలో నన్ను నేను

మైమరిచా

నీహృదయపు లోగిలిలో *నాపరువే* మురిసెనుగా


కడలియంచు  వరకునేను

అభిసారికనై వేచా

మమతలన్ని పంచుకుంటు

*నాబతుకే*

మురిసెనుగా


ఎన్నడోయి మన కలయిక ఎందుకోయి ఈ విరహం

కలకాలం కలిసుందం  *నాకనులే*

మురిసెనుగా


ఈ భావన వీచికలే మది దోచిన తారకలై

అనుక్షణం నీ ధ్యాసతొ *నాకులుకే* మురిసెనుగా.


ఇది నా సొంత రచన.✍️✍️✍️

08/10/20, 2:32 pm - +91 80197 36254: 🚩మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి🚩

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -గజల్ లాహిరి🎶

ది :08/10/20.

నిర్వహణ -శ్రీ తగిరంచ నరసింహారెడ్డి గారు

పేరు :కె. శైలజా శ్రీనివాస్ 

********************

గుండెలోన ఆనందం వికసించెలె ఈ వేళలొ 

మనసులోని భావములే వినిపించెలెఈవేళలొ 


పలుకులోని అందములే హాయినేను కూర్చెనులె 

ముదముతోడ మదిమదిని కదిలించలె   ఈ వేళలొ 


భావములో మెళకువలన్నీ చక్కగాను కుదిరెనులే 

క్రొoగొత్తగ  తోచిననూ మురిపించెలె ఈ వేళలొ


భాషలోన మధురిమలే మురిపెముగా పలికెలే  

తేనెలాంటి భావనతో అగుపించెలె  ఈ వేళలొ 


అమ్మమాట  తీరుగాను నాకెంతో తోచెనులే 

కోకిలమ్మ  పటలాగ  అనిపించెలె   ఈ వేళలొ 


**********************************

08/10/20, 3:12 pm - +91 94415 44806: వేలేటి శైలజ సిద్దిపేట



జీవితమొక పూలతేరు పదిలముగా నడుపుకో

రకరకాల సువాసనల సుగంధాలు తేలిపో


జీవితమొక రహదారి

గమ్యాలను ఎంచుకో

సుదూరమైనతీరాలను

సునాయసముగ చేరుకో


జీవతమొక రణరంగము

ధీరతతో సాగిపో

శాంతి ప్రేమ శస్త్రాలను

ఆయుధముగ మార్చుకో


జీవితమొక పాఠశాల

విజ్ఞానము పెంచుకో

వినయ విధేయతలతోడ

హృదయాలను గెల్చుకో


జీవితమొక అదృష్టము

దాన్నిచూచి మురిసిపో

నవజీవన మధురిమలను తుదిదాకా దాచుకో




*ఇది నా స్వీయరచన

08/10/20, 3:12 pm - +91 94413 57400: This message was deleted

08/10/20, 3:20 pm - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : గజల్ సాహిత్యం 

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : తగిరించ నర్సింహారెడ్డి 


మదనరాణి వలపువలను                                                    నామదిలో పరిచెనుగా అప్పుడే  

మదినిగెలిచి మరువనియని                                              కలలరాణి వలచెనుగా అప్పుడే 


తలుపుచాటు నయనాలతొ                                              వలపురాణి దొంగచూపు చూడగా                                                                           నడకతప్పి కిందపడితె  

వగలరాణి నవ్వెనుగా అప్పుడే 


మక్కచేను కాపలకై 

తోటలోకి సందెవేళ నేనుపోతె 

మంచెక్కిన మనోహరిణి                                         హొయలపోతు పిలిచెనుగా అప్పుడే 


గట్లుతెంచి వరిచేనుకు 

సాగునీటిని అందిస్తుంటె  

పైటజార్చి పారేనీటిని 

చిలకరించి కలిసెనుగా అప్పుడే 


చీకటివేళ  కచ్చరమెక్కి 

గుడిసెవైపు వస్తుంటే 

నివాసునితొ మమేకమై                                              మధురవాణి నడిచెనుగా అప్పుడే


హామీ : నా స్వంత రచన

08/10/20, 3:59 pm - +91 94413 57400: సప్తవర్ణాల సింగిడి

అంశం.గజల్ లాహిరి.

నిర్వహణ.శ్రీ తగిరంచ నరసింహ రెడ్డి గారు

రచన.డా.నాయకంటి నరసింహ శర్మ


సరసుడనని పలికినచెలి  కలలజడితొ  కనుగలిపెను శశివదనా

ఎదయెదలయ కదలెతనలొ మదినిపరచి తెలిపెను  శశివదనా


మదనునివలె ననుగనిచెలి చిరునగవుతొ కనుసైగతొ పిలువగనే

తరలినడచి ఒడలుమరచి దిగులువిడువ కనుకలిపెను శశివదనా


అమవసనిశి వనములచని ప్రియవదనపు అరుణిమలను గనగా 

తనువులలర ప్రణయసుధల ఝరులుకురియ   హౄదిచూపెను శశివదనా


 నడిరాతిరి జడివానలొ తనచెంతకు ననురమ్మని పిలువగా

చలికాడను తనతోడను మమకార మధువు చూపెను శశివదనా


మకరందపు చిరునవ్వతొ తనకౌగిట  అభిసారిక ననుజేర్చగ

అనురాగము నయగారము ప్రియమందగ వ్యథబాపెను శశివదనా

08/10/20, 4:19 pm - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

8.10.2020

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

తగిరంచ నర్సింహారెడ్డి గారి పర్యవేక్షణలో

అంశం: గజల్ ప్రక్రియ: స్వేచ్ఛాకవిత

డా . సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880


నీ హృదయపు వాకిటనే 

                               రాకకొరకు వేచానే

ప్రేమమీర  విసిరేనీ  

                        చూపుకొరకు  వేచానే


వెన్నెలమ్మ జల్లులోన 

                    తడిసినాను రేయంతా

ఇంద్రధనువు నెక్కివచ్చు 

                           ప్రేమకొరకు వేచానే


కనులుతెరిచి ఉంచినేను

                         వెదికినాను దారంతా

సడిచేయక నిలిచినేను 

                          మాటకొరకు వేచానే


కలవరపడి ప్రతినిమిషము 

                           చూసినాను పగలంతా

నిశిరాతిరి సాగిలబడి 

                      నిదురకొరకు  వేచానే


తొలిజామున నిదురలేచి 

                        కలవరపడి పలుకులేక

విసిగిపోయి వేసారీ 

                        నీడకొరకు వేచానే


పనికిరాని రాగమిదని 

                        తలచితలచి రోసిల్లీ

పయనమైన వేళలోన 

                        పిలుపుకొరకు వేచానే


అలవికాని వేదనతో 

                    పొరలిపొరలి వగచినాను

అందనంత దూరానికి 

                        దారికొరకు  వేచానే



              

ఇది నా స్వంత రచన

08/10/20, 4:20 pm - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -గజల్ లాహిరి

నిర్వహణ -శ్రీ తగిరంచ నరసింహారెడ్డి గారు

రచన -చయనం అరుణా శర్మ


కమలములే కొలనులోన విరిసినవీ

ఎందుకనో

కిరణములే సరిగమలుగ మెరిసినవీ

ఎందుకనో


మేఘములే రాగాలుగ వినువీధిన

కదిలెనులే

చినుకులతో చిరుజల్లులు కురిసినవీ

ఎందుకనో


వెన్నెలలో కలువలన్ని విరబూసెను

అందముగా

చలువరేని కళలుచూసి మురిసినవీ

ఎందుకనో


తేనెలతో విందులనే చేసెనుగా

ఆ గళమే

పరవశాన పున్నములే పిలిచినవీ

ఎందుకనో


పులకించే మనసుంటే ఈ జగమే

ఊయలయే

భావములే అరుణమై పలికినవీ

ఎందుకనో

08/10/20, 4:21 pm - +91 98499 29226: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల

ప్రక్రియ.      గజల్లాహిరి  

రచన.        దార. స్నేహలత

నిర్వహణ. శ్రీ తగిరంచ. నరసింహా రెడ్డి గారు 

తేదీ.          08.10.2020


 హిమబిందువు  మెరువంగా  కావ్యముగా  రావేలా

 సింధూరపు  తిలకముగా  శ్రావ్యముగా  రావేలా 


 కాటుకనే  పెట్టంగా  కనుపాపలు నాట్యమాడె 

 దరహాసము చిగురించగ  హాస్యముగా  రావేలా 


చెవికమ్మలు  సరిచేయగ  సరిగమపద  రాగమేల 

నాకురులా   కొప్పుగాను  సవ్యముగా  రావేలా 


గాజుల్లో  మణిపూసలు  రంగులతో  మురవంగా 

మెడఒంపున  నయాగరా లాస్యముగా  రావేలా 


అందియలా సవ్వడులే  ఊసులనే  తెలిపెనులే 

 లతాంగికై గజలుతోనె  రమ్యముగా  రావేలా

08/10/20, 4:22 pm - Velide Prasad Sharma: గజల్ లాహిరి తేదీ:8.10.2020

నిర్వహణ:తగిరంచ నరసింహారెడ్డి గారు

రచన:వెలిదె ప్రసాదశర్మ

పైరగాలి వచ్చి నన్ను తాకిందే రారమ్మని

పైట పరచి నాకోసం  చూసిందే రారమ్మని!


ఎదలోపలి నాప్రేమను చూచిందో ఏమోలే

మనసులోన నిల్పిచూప దలచిందే రారమ్మని!


ఒక్కపూట తినకుండా ఉండలేని నా చిన్నది

నాకోసం ఉపవాసం  చేసిందే రారమ్మని!


ఏమంత్రం పనిచేయక ఏతంత్రం తోచకనే

ప్రేమచూపు బాణాలే వేసిందే రారమ్మని!


మాటరాని చిన్నదాని మనసు చూచి మెచ్చానే

 ప్రసాదయ్య సొగసు గుణం చూసిందే రారమ్మని!

08/10/20, 4:33 pm - +91 73493 92037: మళ్లినాధ సూరి పీఠము ఏడు పాయల

సప్తవర్ణాల సింగడి

నిర్వాహణ :తగిరించ నరసింహ రెడ్డిగారు

అంశం :గజల్ లహరి

9-10-2020

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

తోటలో సీతాకోకచిలుకలు

అందాలు  ముచ్చటాయె

పట్టుకొన ప్రయాసపడ

టక్కుమని చెదిరిపోయి

మది కలవరమాయె.


వివిధ రంగుల రెక్కల

విరులుచేరి విహరించి

తొండముతో తేనీయలు

జుర్రి తుర్రుమని ఎగిరె.


అందాల సంగీతలు

తంతువులై రాగము

లహరులై మెల్లగా

రగిలె ప్రేమ సారికలు


కొమ్మకొమ్మకు కోటి

కోటి పువ్వులు విరిసి

ప్రకృతి పరవశించ

మది పులకరించె


ఆహాహా కవిపవియై

ఆనందడోలికల కలం

సౌందర్యాల ప్రభలి

ముచ్చట్ల కవిత్వం వెలిసె.

08/10/20, 4:46 pm - +91 94404 72254: సప్త వర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం....తాత్వికం ..అర్ధనారీశ్వరం

నిర్వాహణ...శ్రీ తగిరించ నరసింహరెడ్డి గారు

రచన.. వెంకటేశ్వర్లు లింగుట్ల

తేదీ...08.10.2020

ప్రక్రియ.....గజల్


ప్రేమాలయాన ఇరువురుము  జతకలసి ఎప్పటికైన

ఆంతర్యాలను గెలుచుటకు నిలవలేమా  ఎప్పటికైన!


కులమతాలు అడ్డుకున్నను మనసులను ఏకముచేసి

మానవత్వము మనుగడలో గెలవలేమా ఎప్పటికైన!


ఆశయాలకు ఊపిరులూది జీవితములో స్థిరపడేలా

నిర్ణయాలకు కట్టుబడుతూ బతకలేమా ఎప్పటికైన!


కాలమహిమ అంతస్థులకు కొలమానము లెక్కించడం

సమాజమున పీడనలను సాధించలేమా ఎప్పటికైన!


నేటిప్రేమలు ఫలవంతము అవడానికి మనోధైర్యం

కూడగడితే   మనువాడగ   కలవలేమా ఎప్పటికైన!


వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

08/10/20, 4:49 pm - +91 98482 90901: *‍మల్లినాధసూరికళాపీఠంYP సప్త వర్ణాల సింగిడి*

శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం:- గజల్ లాహిరి

తేది:-08-10-2020 భృగువాసరం

నిర్వహణ- శ్రీ తగిరంచ నరసింహా రెడ్డి గారు

కవి పేరు:- సిహెచ్.వి.శేషాచారి

కలం పేరు :- సివిఎస్

౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮

నన్నునేనుకవిగాచిత్రించుకుంటాను

స్వర్గాన్నినాఇంటికీతెప్పించుకుంటాను

ఎంత సిరి ఉంది నీకని ఏమిటీ వేర్రి ప్రశ్న


ఉన్న సన్నిధి ఒకటే ప్రేమ బంధం

తలపులో నింపుకుంటాను

అడ్డు అదుపులేని కోరికలను మూలముతో పెరికివేస్తాను

మానసిక ప్రశాంతతను సమృద్ధిగా

పదిల పరచుకుంటాను


జీవనాడులను పలికించగలిగె

పాట పాడగలిగితె

ఆనందపు అంచులను

ముద్దాడుకుంటాను


నింగి నేల ఏకంచేసే దిశలన్ని ఏకమయ్యె

ఆవేశం మొత్తం సమర్పించుకుంటాను

అసలు ప్రేమను ఓ సివిఎస్

ఆపలేరెవరు

స్నేహపు పలుకుల ప్రేమను నింపుకుంటాను.

                    *సివిఎస్*

           *సిహెచ్.వి.శేషాచారి*

08/10/20, 5:18 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణముల 🌈 సింగిడి

ఏడుపాయలు, 08-10-2020

పేరు: ప్రొద్దుటూరి వనజారెడ్డి

ఊరు: చందానగర్

అంశం: గజల్ లాహిరి

నిర్వహణ: శ్రీ తగిరంచ

నర్సింహారెడ్డి

         9866249789

————————————

మాఘమాస వేళలోన మనసు విప్పి పలికెనులే

మనసులున్న మాటలన్ని

గుసగుసలే చెప్పెనులే


అసురసంధ్య వేళలోన మల్లెలన్ని విరిసెనులే

మగువలంత జడలలో 

మల్లెలన్ని తురిమెనులే


చెట్టుమీద కోయిలమ్మ కుహూకుహూ కూసెనులే

వర్షానికి మయూరాలు

పురులువిప్పి ఆడెనులే


పురుషులంత మగువలతో

ఊసులన్ని  చెప్పెనులే

ఆలుమగలు అంతకలిసి

మమతలన్ని పంచెనులే


ఆకసమున హరివిల్లులు రంగులన్ని పరిసెనులే

పిల్లలంత కలిసిజేరి    ఆటపాట ఆడెనులే

————————————

ఈ రచన నా స్వంతం

————————————

08/10/20, 5:21 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీ తగిరంచ నరసింహారెడ్డి గారు

అంశం: గజల్ లాహిరి

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 08.10.2020 


మనసును బట్టే కనిపిస్తాడు మనిషని అన్నాను 

నేనది కాదని అన్నాను నువ్వది  ఔనని అన్నావు 


రైలుబండిలో బిచ్చగాడొకడు పాటపాడుతుంటే 

నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను 


గుణాత్మకంగా శిష్యులు విద్యను అభ్యసిస్తూ ఉంటే

నువ్వది జ్ఞానం అన్నావు నేనది జీవితమన్నాను 


గొప్పలకోసం శుభకార్యాలకు అప్పులు చేస్తుంటే 

నువ్వది హోదా అన్నావు నేనది మోసం అన్నాను 


కళాత్మకంగా సెల్ ఫోనులో విలువలు చెబుతుంటే 

నువ్వది వినోదమన్నావు నేనది ప్రమాదమన్నాను 


దేశంకోసం పోరాడోకడు ప్రాణాలర్పిస్తే 

నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను 


గజల్ ధ్యాసలో కాలం నాకు తెలియలేదు అంటే 

నువ్వది రోగం అన్నావు నేనది యోగం అన్నాను

08/10/20, 5:24 pm - Trivikrama Sharma: మళ్ళి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ గజల్ లాహిరి

పేరు:   త్రివిక్రమ శర్మ

ఊరు: సిద్దిపేట

_____________________


పావన గంగా నదిలా కదిలే  దేశం

పవిత్ర గౌతమి హృదిలా మెదిలే  దేశం


కాశీ నగరపు భక్తితొ వెలిగే దీపం

హిమనగ ప్రభలను ఎదపై నిలిపే దేశo


జగతికి ధర్మము నేర్పిన పావన ధరణీ

పడతిని మాతగ సర్వద చూసే దేశం


నడిచే దైవం రాముడు ఏలిన రాజ్యం

హింసను వదిలి అహింస నడిచే దేశం


 పచ్చని శోభల వెలిగే సుందర నిలయం

మెండుగ సిరులను   జనులకు పంచే దేశం


మతాల సారం ఒకటని తెలిపిన ధర్మం

వేదపు నాదం నిత్యం పలికే దేశం


 దండిగ కవులను కలిగిన శారద క్షేత్రం

విక్రము మదిలో భావం పొంగే దేశం


_____________________

నా స్వీయ రచన

08/10/20, 5:34 pm - +91 97049 83682: మల్లినాథసూరి కళాపీఠం Y P

సప్తవర్ణాల సింగిడి

అంశం:గజల్ సాహిత్యం

రచన:వై.తిరుపతయ్య

నిర్వాహణ:టి. నర్సింహారెడ్డి

తేదీ:8-10-2020

************************

చెలియ పిలుపు కొఱకునేను

పడిగాపులు కాయగా ఉహలోకి

వచ్చినన్ను ఉయాలలోన

ఊగిపోతు రమ్మని పిలిచె


బిడియ చూపులతో కన్నెర్రజేసి

మౌనంతో మటాడుతూ కులికే

కమ్మని రాగాలతో పాడుతూ

నామదిని తాకమని పిలిచె


ఓరకంట చూపులతో చూస్తూ

గారడి మాటలతో వలవేస్తూ

చిరుగాలి వీస్తున్న శుభవేళ

నీ యదను మీటమని పిలిచే


చిరుజల్లుల తాకిడికి నామేను

పులకించగా నీకౌగిట కోరింది

దేవయాని వంటి నీ అందం

నన్ను కమ్మగారమ్మని పిలిచే


కమ్మని ఈహాయ్ వెన్నెలలో

జంటపక్షుల విహారంలా

వయసు మరచి తిరగాలని

ఇక తోడుండాలని పిలిచే

08/10/20, 5:35 pm - +91 99486 53223: మల్లినాథ సూరి కళా పీఠం 

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి  గారి ఆధ్వర్యం లో 

అంశం :గజల్ లాహిరి 

నిర్వహణ :శ్రీ తగిరంచ నరసింహ రెడ్డి గారు

పేరు  : మచ్చ అనురాధ 

ఊరు :సిద్దిపేట


 బంధము వేసెను మనసులు కలిపెను మమతలుపెరుగును


 బ్రతికే గడుచును కష్టసుఖాలలొ వలపులు పెరుగును


 1.నాది నాదని స్వార్థము నిండెను సంసారమ్మున సతమతమవుదురు సాధన చేయగ తలపులు పెరుగును


 2.పిల్లల వృద్ధికి పెద్దలు నిత్యము ఆలోచనలే 

సంపద పైనే  ధ్యాసా మొత్తము కలతలు పెరుగును


  3. తల్లిదండ్రులు త్యాగం ఎంతో  బిడ్డల పెంపులొ

జీవితమంతా పోరే మిగులును మెరుపులు పెరుగును 


  4..సంతోషముగా బ్రతుకులు సాగవు జగతిన యెవరికి చివరికి చింతలు తప్పవు మనిషికి బాధలు పెరుగును.


🙏🙏

08/10/20, 5:39 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశము. గజల్ లాహిరి 

నిర్వహణ. తగిరించ నరసింహారెడ్డి గారు 


పడుచుదనము నీలోనే మెరుపులోన నిలిచెను 

అందమేదొ మురిసినట్టు  వలపులోన నిలిచెను 


సుందరాంగి చూపుతోని ఉరకలెంతో వేయుచూ 

తడిమబ్బుల కెరటంలా మదిలోన నిలిచెను. 


తెల్లతెల్ల చీరతోని ఊపులెన్నొ వొలకబోసి 

నడియాడే నడకతోని జీవతాన నిలిచెను. 


రామచిలుక అందమెంతో మురిపించిన రాగాలు 

వెన్నెలలో దాగియున్న  నవ్వులోన నిలిచెను. 


చెక్కిలియే చెమ్మగిల్లి సొగసుతనము వికసించేను 

రారాజుయె పిలువగానే  ఈజగమున నిలిచెను. 


తళుకుతార రూపాలే  వికసించీ జోరుగయ్యి 

పరిమళపు వయ్యారము ప్రియలాలన  నిలిచెను

08/10/20, 5:43 pm - +91 93941 71299: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల 

పేరు: యడవల్లి శైలజ కలంపేరు ప్రేమ్ 

ఊరు: పాండురంగాపురం, జిల్లా ఖమ్మం 

అంశం: గజల్ ప్రక్రియ 

నిర్వాహకులు: అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారు 



వానచినుకు కురిసింది మనసు పరవశించెలె

మొక్క చిగురులు తొడిగింది చూడవోయి నడిచి 


వయసు తళుకు మంటుంది మల్లెపూవు విరిసెలె

వెదజల్లు పరిమళమునె పీల్చవోయి   నిలిచి 

ఆపదల కెరటాలె వచ్చి వచ్చి తాకెనులె

తరిమి తరిమి కొట్టవోయి ధైర్యంగా నిలిచి 


నువ్వు నడిచె దారిలో ముళ్ళ చెట్టు మొలెచెలె

కలతచెందక నడవవోయి శక్తితో నిలిచి




హమీ పత్రం 

ఈ గజల్ నా స్వంత రచన దేనికి అనుకరణ అనువాదం కాదు.

08/10/20, 5:45 pm - +1 (737) 205-9936: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణముల 🌈 సింగిడి

ఏడుపాయలు, 08-10-2020

*పేరు: డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*

*అంశం: గజల్ లాహిరి*

నిర్వహణ: శ్రీ తగిరంచ

నర్సింహారెడ్డి..

--------------------------


కోయిల పాడే పాటా మధురం

మయూరి ఆడే ఆటా మధురం!!


పచ్చని చెట్లూ  చక్కగా ఎదిగీ

పూలతొ నిండిన తోటా మధురం!!


మట్టిని ఒంటికి పూస్తూ రాస్తూ

ఆడే పిల్లల చోటా మధురం!!


ధాన్యము పోసి చెరుగుతు ఉంటే

దరువులు వేసే చాటా మధురం!!


అప్పటి ఊసులు దాచీ మురిసీ

మెరిసీ పోయే కోటా మధురం!!

----------------------------------------

*డా.చీదెళ్ళ సీతాలక్ష్మి.*

08/10/20, 5:49 pm - Velide Prasad Sharma: మాత్రలు సరిచూడాలి.మీది 4444మాత్రల మీటరుతో ఉందని భావించాను.ఆ రకంగా మీరు సవరించండి.రెండు వాక్యాలు మీవి సవరిస్తున్నా చూడండి.


మనసులు|కలిసిన|మమతలు|పెరుగును|


బ్రతుకున |నిండగు|వలపులు|పెరుగును|


ఇందులో ప్రతి వాక్యంలో 4పదాలున్నాయి.

చివరి పదం...పెరుగును

దీనికి ముందు ప్రాస పదం

మమతలు

వలపులు

మిగిలినవన్నీ ఇలా గీత పెట్టుకుని సరిచేయండి.

మీరు రాసినవన్నీ కరక్టే.కాని మాత్రలకు అనుగుణంగా కొద్దిగ మార్చాను అంతే.ఇక రాసి పంపండో ఇదే ఉదాహరణతో..

వెలిదె ప్రసాదశర్మ

08/10/20, 5:58 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 08.10.2020

అంశం : గజల్! 

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీ నరసింహారెడ్డి గారు 


ఎన్ని వసంతాలు వచ్చివెళ్ళిపోయె లేదు మార్పు!

పచ్చనైన ప్రకృతి మెరిసే వెలుగులున్న కాదు మార్పు! 


కాలమంత బండిచక్రమల్లె తిరిగి క్రాంతిమాట

కానరాక ముసుగు చాటు కదలికున్న వలదు మార్పు! 


ముసుగుతన్ని నిదురపోయి చేతగాని కలలుకంటు

మాటలన్న మరచిపోవు మనుషులున్న రాదు మార్పు! 


కొత్త భావనలను కలుపుకొనుచు పాతనెపుడు విడక

ముందుకెళ్ళు జనులు కలిసి నడతురపుడు చెడదు మార్పు! 


మనసు వూసు తెలిసి బతుక మానవత్వ పరిమళంబు

లోకమంత పంచిపెట్టు తులసి యెదలొ కలదు మార్పు! 


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

08/10/20, 6:14 pm - +91 94904 19198: 08-10-2020:-గురువారం:

శ్రీమల్లినాథసూరికళాపీఠం.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి.శ్రీఅమర

కులదృశ్యచక్రవర్తిగారి సారథ్యం.:

అంశం:-గజల్ లాహిరి.

నిర్వహణ:-శ్రీతగిరంచనరసింహారెడ్డి

                 గారు.

రచన:-ఈశ్వర్ బత్తుల.

###################

నిన్ను జూచి నంత నేను

నిలవ జాల కుందునా !

కరుణ జూప వేల జాణ

పలుక  జాల కుందునా.!


ఎదను తాకిన నీవు నన్ను

ఎదురు గాను చూస్తున్న

మదిని తాక తార మెరిసె

మరువ జాల కుందునా !


దొండ పండు లాంటి పెదవి

దరికి జేరి దీయునా

మథుర భాషణమున మాట

కలప జాల కుండునా. !


హంస లాగా నీదు నడక

హొయలు లొలుకు చూడగా

రంభ కూడ సాటి రాదు

తలప జాల కుండునా !


ప్రేమ చిలుక జంట వోలె

ఈశు దరికి జరగగా

మనసు పెంచు కోగ రాణి

కలువ జాల కుందునా. !


##ధన్యవాదములు సార్##

          ఈశ్వర్ బత్తుల

మదనపల్లి.చిత్తూరు.జిల్లా.🙏🙏🙏🙏🙏🙏

08/10/20, 6:15 pm - Tagirancha Narasimha Reddy: మత్లాలో

08/10/20, 6:39 pm - +91 91779 95195: మల్లినాధా సూరి కళాపీఠం y p

సప్త ప్రక్రియల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి

గారి నేతృత్వo

అంశం: గజల్ లాహిరి

శీర్షిక: భళే భళే

నిర్వహణ:శ్రీ తగిరంచ నరసింహారెడ్డి

పేరు:రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

*********************

నేను పాడే పాట భళే భళే

నేను ఆడే ఆట భళే భళే


పనులు అంటే నాకు ఇష్టం

నేను పని చేయడం భళే భళే


కావ్యాల oటే నాకిష్టం

నేను కవిత రాయడం భళే భళే


నటన అంటే నాకు ఇష్టం

నేను నటించడం భళే భళే


పుస్తకాలంటే నాకిష్టం

నేను చదవడం భళే భళే


తినడం అంటే చాలా ఇష్టం

నేను వంట చేయడం భళే

భళే

నాకు నృత్యం అంటే  ఇష్టం

నేను నాట్యం చేయడం భళే భళే

********************

08/10/20, 6:49 pm - +91 73493 92037: మళ్లినాథ సూరి కళా పీఠము

ఏడుపాయలు

సప్తవర్ణాల సింగడి

నిర్వాహణ :తగిరంచ నరసింహా రెడ్డి,శ్రీ.దృశ్య కవులు

అంశం :గజల్ లహరి

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

 

చిట్టి పొట్టి చిన్న బుజ్జాయి

ముద్దు ముచ్చట మూటకదరా!

కిలకిల చిరునవ్వు బుజ్జాయి

ఇంటికి బంగారు బొమ్మకదరా!

గోరుముద్దలు తినే బుజ్జాయి

అమ్మకు గారాబాల మూటకదారా!

కమ్మని తియ్యని అల్లరి బుజ్జాయి

మువ్వల సందడి ముద్దేకదరా!

తాత నానమ్మల కూచిబుజ్జాయి

ఇంటిలోపల పసిడి చిందులేకదరా!

08/10/20, 6:59 pm - +91 99639 15004: మల్లినాథ సూరి కళాపీఠం 

సప్త వర్ణాల సింగిడి

గజల్ లహరి 

నిర్వహణ తగిరంచ నరసింహ రెడ్డి 

రచన. ఆవలకొండ అన్నపూర్ణ. 

ఊరు. శ్రీకాళహస్తి చిత్తూరు 


అమ్మ నాన్న లు దేవతలురా 

వారు లేనివారు వ్యర్థులురా. 

అణకువ ఆభరణమురా 

ఇల్లాలే ఇంటికి వెలుగురా. 


నీడ ఇవ్వని చెట్టు వ్యర్ధము

పండలేని కాయ నష్టము రా 

ఇల్లంటే ఓ పూల పొదరిల్లు. 


అంధకారంలో వెలుగు దీపం 

అందరికి దారి చూపును  

బతుకు ఫై ఆశ రేపును. 

పది మందికి మేలు చేయును.

08/10/20, 7:03 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశం:గజల్ లాహరి

నిర్వహణ:శ్రీ తగిరంచ నర్సింహరెడ్డి గారు


మాటలోని తీపిదనం

మురిపించెను మనసులోన

నీరూపమె కానరాక

విలపించెను మనసులోన


నీరులేక పంటలన్నీ 

ఎండిపోయె నాటిరోజు

చెరువులన్ని నింపినేడు

మురిపించెను మనసులోన


తిండిలేక ఆకలితో

నింద్రించగ కళనందున

నీరూపము కనిపించగ

వికసించెను మనసులోన


ఆందమైన నీమోమును

చూడగానె కవితలతో

వీణలాగ నాధముతో

కనిపించెను మనసులోన


సూర్యకాంతి ఉదయ

మందుమనసులోన

చూడగానె కనుబొమ్మల

మధ్యనున్న నీబోట్టని అగుపించెను మనసులోన


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

08/10/20, 7:11 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశము. గజల్ లాహిరి 

నిర్వహణ. తగిరించ నరసింహారెడ్డి గారు 


పడుచుదనము నీలోనే మెరుపులోన నిలిచెను 

అందమేదొ మురిసినట్టు  మనసులోన నిలిపెను 


సుందరాంగి చూపుతోని ఉరకలెంతో వేయుచూ 

తడిమబ్బుల కెరటంలా మదిలోన నిలిచెను. 


తెల్లతెల్ల చీరతోని ఊపులెన్నొ వొలకబోసి 

నడియాడే నడకతోని జీవతాన నిలిచెను. 


రామచిలుక అందమెంతో మురిపించిన రాగాలు 

వెన్నెలలో దాగియున్న  నవ్వులోన నిలిచెను. 


చెక్కిలియే చెమ్మగిల్లి సొగసుతనము వికసించేను 

రారాజుయె పిలువగానే  ఈజగమున నిలిచెను. 


తళుకుతార రూపాలే  వికసించీ జోరుగయ్యి 

పరిమళపు సంధ్యా రాగపు  ప్రియజాన నిలిచెను

08/10/20, 7:12 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి🌈

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ శ్రీ తగిరంచ నర్సింహారెడ్డి గారు

అంశం. గజల్ లాహరి

పేరు  పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు.  జిల్లా కరీంనగర్


మనసున పాడే పాటే మధురం

వయసున ఆడే ఆటే మధురం


పచ్చని చేలలో పూచే పూలతొ

రంగుల చిలకల తోటే మధురం


కుసుమపు పరిమళ వాసన వీచికలు

వెదజల్లె సుమధుర చోటే మధురం


ధాన్యపు సిరులే ధరణిలొ పండగ

మల్లలొ పడతుల నాటే మధురం


పచ్చని పైరులు పుడమిన మెరువగ

వెలుగులు నిండిన చోటే మధురం



హామి పత్రం

ఈ రచన నా సొంత రచన

మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని సవినయంగా మనవి చేసుకుంటున్నాను

🙏🙏🙏🙏

08/10/20, 7:22 pm - +91 94906 73544: మల్లినాథ సూరి కళా పీఠం

 ఏడుపాయల 

నిర్వహణ ::నరసింహా రెడ్డి గారు

 అంశం:: గజల్ 

రచన::యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డి 




మాట వరుస కలుపు కుంటు

 మనసు  మనసు గెలుసుకుంటు

 

చలో అంటు కలుపు కుంటు

 అమ్మ  మనసు తెలుసు  కుంటు


 సిరులు నొసగు సిద్ధి పేట

 మరువ కుండ తలసు కుంటు


 బతుకు గతులు నెర్చు  కుంటు

 ముందు  కెలుతు  గెలుసు కుంటు

08/10/20, 7:27 pm - +91 98499 52158: మల్లినాథ సూరికళాపీఠం,ఏడు పాయల.

సప్తవర్ణముల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో.

అంశం:గజల్ లహరి

నిర్వహణ:శ్రీ తగిరంచ నరసింహా రెడ్డి గారు.

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్.


మనుషులే మమతలను

 మరిచెను ఎందుకో

ధనముతో దిగజారిన

 దారుణము ఎందుకో.


విలువలే విడనాడగ 

మానవత తరిగెనులే

వలవలలు విలవిలలు

విపరితము పెరిగెనులే.


 మానవునిగ జనియించుట

పుణ్యమని తెలుసుకో

జనమరణ నాటకమును

జ్ఞానముతో ఎదురుకో.


పితురులను తులనాడుట

ఫ్యాషను  ఐ ఈనాడు

ఋణమును  తీరుచుటకు

తరుణమును వెదుకుకో.


మనసుంటే  మనసుకున్న

ముసుగును తొలగించు

మురిపేముతో అందరిని

మహర్షిలా   ఆదరించు

08/10/20, 7:29 pm - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 8-10- 2020

అంశం : గజల్ లహరి

నిర్వహణ:అమరకుల దృశ్య కవిగారు

తగిరించ నరసింహ రెడ్డి గారు


నాకన్నుల  వెలుగులుగా జారగలవ వెన్నెలమ్మ

నేలమీద తారకవై మెరవగలవ  వెన్నెలమ్మ!


మత్తెక్కిన చూపులతో మధువునంత గ్రోలుచుండ

తుమ్మెదవై నాచుట్టునె తిరగగలవ వెన్నెలమ్మ!


మరులుగొల్పు మమతలన్ని గాలులలో కలసిపోగ

మేఘమువై మోహమంత కురవగలవ వెన్నెలమ్మ!


తలపులతో తగవులేసి వలపులన్ని దాచుకొనగ

వసంతమై మధువనిగా విరియగలవ వెన్నెలమ్మ!


అరవిరిసిన పూదోటన ఆమనియే అడుగువేయ

నీరజాల సోయగమై నిలవగలవ వెన్నెలమ్మ!


ఈ గజల్ నా స్వంతము..ఈ సమూహము కొరకే వ్రాసితిని.

08/10/20, 7:31 pm - +91 94902 35017: మళ్లీనా థ సూరి కళా పీఠం

ఏడుపాయల

అంశం: గజల్ లాహిరి


పెదవిపై నవ్వులా పూసింది నీవుగా

వే వేల వీణియలు మీటింది నీవుగా


ఆమనిలా నా బ్రతుకు తోటలో ఏతెంచి

మల్లియల సుగంధం నింపింది నీవుగా


సరిగమల రాగాలు ఝరులుగా ఉరికాయి

మదితాకు గీతాలు పాడింది నీవుగా


జగతితో పనిలేని జీవిగా బ్రతికాను

నాలోని మౌనాలు తడిమింది నీవుగా


ఆశలేని జీవితం శుష్కమై సాగగా

అందాల స్వప్నాలు చూపింది నీవుగా


బి.స్వప్న

హైదరాబాద్

08/10/20, 7:35 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు.. తగిరంచ నరసింహ రెడ్డి

8.10.2020 

అంశం.. గజల్లాహిరి

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్


పుడమితల్లి  పులకరించి మురిసెనులే మనోహరా

ఆటవెలది పరవశించి ఆడెనులే మనోహరా


పూగుత్తులు నీకొరకై   విరిసెనులే తపిస్తూ

ప్రియురాలె మైమరచి పిలిచెనులే 

మనోహరా


మయూరమ్మ పురివిప్పుతు చేసెనులే నాట్యములె

కోయిలమ్మ  రాగమెత్తి పాడెనులే మనోహరా


వాలుకనుల వయ్యారీ పరిచెనులే కాంక్షలన్ని 

మత్తుగొలిపె మాటలన్ని జల్లెనులే మనోహరా


అనురాగపు ఆశలెన్నో మోసెనులే సైగలతో

మాధుర్యపు మాలికలెన్నో వేసెనులే మనోహరా 

 

హామీ పత్రం... ఇది నా స్వీయ రచన

08/10/20, 7:43 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ... గజల్

అంశం...గజల్ లాహిరి

పేరు...యం.టి.స్వర్ణలత

నిర్వాహణ... శ్రీ తగిరంచ నరసింహారెడ్డిగారు

తేదీ...08.10.2020



నీకోసం మనసంతా అరుస్తుంది లోలోపల

తపించేటి అనురాగం పిలుస్తుంది లోలోపల


కనులముందు లేవంటూ కలవరాన్ని దాచేస్తూ  

నిరంతరం నామనసే తలుస్తుంది లోలోపల


కవ్వింతలు కలహాలూ ఎన్నున్నా మనమధ్యన

నువ్వేనా ప్రాణమనీ తెలుస్తుంది లోలోపల


మదినిండిన ఆనందం వెన్నెలగా కురియంగా

తనువంతా పరవశంతొ మరుస్తుంది లోలోపల


స్వర్ణమయిగ నిన్నేనా హృదయంలో దాచేస్తూ

పులకిస్తూ తన్మయంగ మురుస్తుంది లోలోపల

08/10/20, 7:48 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీ తగిరంచ నరసింహారెడ్డి గారు

అంశం: గజల్ లాహిరి

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 08.10.2020


ప్రకృతి పారవస్యములో సర్వప్రాణి కోలాహలం 

వాగులవంకల నీటిదారులలో పుడమి సస్యశ్యామలం


గలగలపారే నదీనదాలు భక్తితోను గాంచేది ఎన్నడో 

మబ్బునిచూసిన నెమలినడకతో నాట్యమాడేది ఎప్పుడో


కలసిరాని కాలాన మబ్బులతెర తొగెను ఎన్నడో

కాలంచేసిన చేదుగాయమై పాటగ పాడేది ఎప్పుడో


పచ్చనిచెట్లే ప్రగతికి మెట్లని గమనించేది ఎన్నడో

రైతుల వెతలను వాపుటకై కాలం మారేది ఎప్పుడో 


కులమత వైషమ్యాలను విడిచి ఒకటిగ సాగేది ఎన్నడో

బాషా ద్వేషాలను విడుచుటకై పోరేది ఎప్పుడో 


అరాచకాలు అన్యాయాలను తొలగించాలని గో-ప-వ 

స్త్రీలపై అకృత్యచేష్టలకు ముగింపుకై కదిలేది ఎన్నడో

08/10/20, 7:51 pm - +91 94410 66604: మల్లినాథసూరి ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

అరకుల దృశ్య కవి గారి పర్యవేక్షణలో

గజల్ లాహిరి...

*****************


పలుకులన్ని పొడిబారిన బతుకునాది మృధువరా...

చీకటితో దీపమెట్టె మనసు నాది మృధువరా...


ఏటిలోని నీటిలోకి దారినాది మృధువరా...

పలుకు చాలు శోదించే నటననాది మృధువరా..


మూగబోయి చూసేటీ నడకనాది మృధువరా..

దారి కాచి కూర్చున్నా కడలినాది మృధువరా..


చెప్పలేని భావాలకు   పోరునాది మృధువరా..

కఠినంతో జారిపోయె గుణంనాది మృధువరా...


సందెచిమ్మె తొలి వెలుగుల

గూడు నాది మృధువరా...

బతుకంతా వేతలైన రేయినాది మృధువరా....

    

************************

డా.ఐ.సంధ్య

సికింద్రాబాద్

08/10/20, 7:53 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- గజల్ హరి

నిర్వా హకులు శ్రీ  తగిరంచి నరసింహారావు గారు పేరు:-పండ్రువాడసింగరాజు

 శర్మ

తేదీ :-08/10/20 గురువారం

శీర్షిక:- శ్రమల జీవి

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- వచన కవిత

ఫోన్ నెంబర్9177833212

6305309093

**************************************************

అలుపెరగని నిరంతరశ్రమ రోజుగడవని  రోజుకూలీలు

ఆకాశాన్నితాకే  మండుతున్న ధర  దినచర్యమార్పులు



తరగని రోగాలు  రాబడి మించినఖర్చులు

పస్తులు ఉపవాసాలు


చిన్నారి పిల్లలు  తీర్చలేని  ఆశలు  భయకంపితులై  మనోభావాలు


తీర్చేవారు ఎవరని ఎదురుచూపులు

కారుస్తున్న కన్నీళ్లు  దయ లేని దేవుళ్ళు


ఇంకా ఎన్నాళ్ళు ఈరోగాలు

దినదినం ఆర్తనాదాలు

**********************************************

08/10/20, 7:59 pm - +91 96038 56152: <Media omitted>

08/10/20, 8:22 pm - +91 94934 35649: మల్లి నాధ సూరి కళా పీఠం yp 

సప్త వర్ణాల సింగిడి 

ప్రక్రియ. గజల్ లాహిరి 

నిర్వహణ. తగిరించ. నరసింహారెడ్డి గారు 

పేరు.  సి.హెచ్.వెంకట లక్ష్మి 

విజయనగరం 


శీర్షిక. ఆహా... .



నులి వెచ్చని చల్లదనం 

గిలి  గింతల  కమ్మదనం 

చిరు గాలిల గుమ్మదనం 


పిల్ల తెమ్మర ఆరాటము 

పైట  చాటున పోరాటము 

కొత్త  దనమున ఆనందము 


సంధ్య చిలకల మురిపాలు 

చిగురు తొడిగిన పదనిసలు

వెన్నెల వేళల్లో    చంద్రికలు 


ఆత్మ  రహస్య వేధనలో 

దేముని దయకై శోధనలు 

దైవపు లీలలు తలరాతలు

08/10/20, 8:35 pm - +91 98664 35831: *మల్లినాథసూరి కళాపీఠం, ఏడుపాయల.*

*శ్రీ అమరకుల దృశ్యకవిగారి నేతృత్వంలో* 

*సప్తవర్ణముల సింగిడి*

*08-10--2020 గురువారం*  

*అంశం : గజల్ లాహిరి*  

*నిర్వహణ: శ్రీ తగిరంచ నర్సింహ రెడ్డి గారు* 

*రచన : వీ. యం. నాగ రాజ, మదనపల్లె.*

*************************************


మనసెరిగిన నాచెలియను..

                             తెలుసుకోని వచ్చేస్తా!

ఒకసారీ  జవరాలిని..

                             తలచుకోని వచ్చేస్తా! 


కోరికతో మనసూగిన.. 

                             నాప్రేమను తెలిపేసీ 

నేకోరిన నాభామను.. .

                             కలుసుకోని  వచ్చేస్తా!  


నాతోడూ నడచివచ్చు  

                             ఏడడుగుల బంధాలను 

కలగంటూ నాసఖియను                

                             వలచుకోని వచ్చేస్తా ! 


పరువంతో పలకరించు ..

                             నామదిలో వూహించే 

నేతలచిన ప్రియురాలిని..

                             గెలుచుకోని వచ్చేస్తా!


రాజాగా నేమురిసీ..

                             పరిణయమే ఆడేటీ                     

నేనచ్చిన రాకుమారిని..

                             పిలుచుకోని వచ్చేస్తా!

............................................................... 

నమస్కారములతో 

V. M. నాగ రాజ, మదనపల్లె.

08/10/20, 8:37 pm - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీ తగిరంచ నర్సింహారావు గారు 

పేరు… ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :08-10-2020

అంశం :గజల్ లాహిరి 

శీర్షిక :..ఎదురుచూసె 


భానుకిరణ జల్లులకై జడములవీ 

ఎదురుచూసె 

నే వినుటకు అమృతముగల పలుకులవీ 

ఎదురుచూసె 


శశికిరణపు హిమవర్షను అందుకొనెను కలువనయని 

చిరునగవుల   నా వెన్నెల  కన్నులవీ 

ఎదురు చూసె 


విరులునవ్వె తనువులంత కునులుజేసి 

తుమ్మెదకై 

జాలువారె  నా సొగసుకు పెదవులవీ 

ఎదురుచూసె 


సందడించె మబ్బులసడి  వినుటలోన నెమళులన్ని 

నా నడకల  హొయలుజూడ  అడుగులవీ 

ఎదురుచూసె 


జారవిడుచు తొలి కిరణము సంద్రమంత 

అర్ణవమై 

పరిఢవిల్లు ప్రియదర్శిని తపనలవీ 

ఎదురుచూసె 


హామీపత్రం :ఈ గజల్ నా స్వీయరచన ఈ సమూహము కొరకే వ్రాసితిని

08/10/20, 8:41 pm - +91 6304 728 329: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి గారి సారథ్యంలో. 

08/10/2020

అంశం; గజల్ లాహిరి 

నిర్వహణ: తగిరంచ నర్సింహారెడ్డి గారు 



ప్రతిమనిషీ ఒక పాఠమె తెలుసుకునే మనసుంటే

ప్రతి ఓటమి ఒక పాఠమె గెలవాలనె మనసుంటే


ఎంతఎత్తు ఎదిగిననూ నేలమీద నడవాలని

ప్రతిమనిషీ ఈ విషయం తెలుసుకునే మనసుంటే


చిరుచీకటి లేనినాడు వెలుగుకువిలువెక్కడిది

కష్టమెనక సుఖముందని ఎరుకచేసె మనసుంటే


వయసేమో ఆగకుండ ప్రవాహమై వస్తున్నది 

ఏమిచేయ ఈమాత్రం తెలియలేని మనసుంటే


కాలమెపుడు కఠినమైన పరీక్షలే పెడుతుందీ

ప్రతీ విషయం జాగ్రత్తగ గ్రహించనీ మనసుంటే


అనుబంధపు ప్రేమయెంతొ తెలుసుకొనుము రామోజీ 

ఆనందపు జీవితమే తెలుసుకునే మనసుంటే


        మల్లెఖేడి రామోజీ 

        అచ్చంపేట 

        6304728329

08/10/20, 8:46 pm - L Gayatri: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

గజల్ లాహిరి

8/10/2020,గురువారం

నిర్వహణ : తగిరంచ నరసింహారెడ్డి గారు

రచన : ల్యాదాల గాయత్రి


మంచుపూల సోయగమే

 వెతుకుతావు ఎందుకనీ

మల్లెతావి మధురమంటె

 నవ్వుతావు ఎందుకనీ


యవ్వనపూ పొంగులోన

మైమరచీ దానవుడై

చిరుమొగ్గల నలిపేసీ

మగ్గుతావు ఎందుకనీ


పెనవేసిన బంధాలను

తుంచేసీ సంబరాన

జీవితంలొ సుఖాలనూ

 వెతుకుతావు ఎందుకనీ


కోరికలే గుర్రాలై 

పరుగులెత్త ఆపలేక 

భీరువులా బాధలోన

మునుగుతావు ఎందుకనీ


అనుక్షణం ఎదురయ్యే

సమస్యలకు జడిసిపోయి

నీరసంగ బతుకునావ

నడుపుతావు ఎందుకనీ..!!

08/10/20, 8:55 pm - +91 96038 56152: <Media omitted>

08/10/20, 8:56 pm - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ గజల్ లాహిరి

అంశం ఇష్టమైనది

నిర్వహణ శ్రీ తరిగించ నరసింహారెడ్డి  గారు

శీర్షిక  శ్రీమతికి ఓ బహుమతి

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 08.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 55


ప్రియమైన శ్రీమతికి తెచ్చాను బహుమతిగ

అందముగ బొమ్మలను ఇచ్చాను 

బహుమతిగ


వాలుజడ చూసినా నామనసు మల్లెలను

ఏరిమరి దండగా గుచ్చాను బహుమతిగ


బోసిగా ఉన్నట్టి మెడలోన వేయుటకు

ముత్యాల దండలను కూర్చాను బహుమతిగ


బంగారు మేనికిని సరిజోడు అయినట్టి

మెరిసేటి చీరనూ కొన్నాను బహుమతిగ


నాజూకు చేతులకు సొగసైన ముత్యాల

గాజులను మురిపెముగ వేశాను బహుమతిగ

08/10/20, 8:58 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం : గజల్ 

నిర్వహణ..శ్రీ తగిరంచ నర్శింహారెడ్డి గారు

తేదీ : 08.10.2020  

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్ 

*********************************************

మనసు పొరల లోన దాగి ఉంది నీవె

మదిని పొదను చేసి నెలవు ఉంది  నీవె 


మాట పాట చేసి చెవుల నింపి నావె

కలను బొమ్మ  గీసి కొలువు ఉంది నీవె 


తియ్య నైన మాట చేటు తెచ్చు నేమొ

నిజం తెలిసి మసిలె సులువు ఉంది నీవె 


ఎదల లోన ఏమి దాగి ఉందొ సఖీ 

కనుల భాష తోటి పలుకు తోంది నీవె  


కవిత రాసి నీకై  కబురు పంపి నాను

శ్రీని వాసు కనుల కొలువు ఉంది నీవె 

*********************************************

08/10/20, 8:59 pm - +91 98868 24003: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్త వర్ణముల సింగిడి

తేదీ 08-10-2020

శ్రీ అమరకుల కవి గారి ఆధ్వర్యంలో


అంశం : గజల్ లాహిరి

పేరు ముద్దు వెంకటలక్ష్మి

సతతము కొమ్మల్లోనే   మధుర గానము చేయుచు దాగుడుమూతలాడు కోయిలా! ఎదురుగ నిలిచావే! నేడు!


గాన చైతన్య వాహిని

కనుల ముందు కదలాడి హృదయమునానందపు నావలో పయనింపజేసె;


ఏమి నా భాగ్యమీవేళ

కుహు కుహూమనుచున్న కోయిల గానకళా దృశ్యము

నా మనోనేత్రమందు శాశ్వత ముద్ర వేసె.

08/10/20, 9:03 pm - Sadayya: మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల

సప్త ప్రక్రియల సింగిడి

ప్రక్రియ: గజల్ 

నిర్వహణ: శ్రీ తగిరంచ నర్సింహారెడ్డి

రచన:డా॥అడిగొప్పుల సదయ్య(మహతీ)


⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️


శ్రీకృష్ణ నాదృష్టి చెదరకుండునుగాక,

అన్య వస్తువుపైకి మరలుకుండునుగాక,


క్షణమైన నీపాద కమలముల ననురక్తి

చూపనీ పాపులను చూడకుందునుగాక,


శ్రావ్య బంధంబులౌ కావ్యముల నీ గాథ

విడిచి నన్యంబునే వినకుందునూగాక,


విశ్వనాథా! నిన్ను విశ్వసింపని జనుల

తలపోసి తిలయంత తలచకుందునుగాక,


ప్రతి జన్మ యందునను సతము నీ పదసేవ

మాధవా! ముకుందా! మరవకుందునుగాక!

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

08/10/20, 9:06 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

08/10/20, 9:11 pm - Telugu Kavivara: <Media omitted>

08/10/20, 9:11 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-162🌈💥*

                       *$$* 

      *పండిపోతాను కడకు-162*

                       *$$*

*మొదలై చిగురై నింగిలోకి ఎదుగ కోరి*

*మొలకై ఆకై శాఖై పచ్చంగా ప్రాకి నవ్వి*

*హరితంగా అడవిగ అంతటా పవనమై*

*అలసిసొలసి కడకు పండి వాలిపోతినే*

                          *@@*

            *అమరకుల ⚡ చమక్⚡*

08/10/20, 9:18 pm - L Gayatri: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

గజల్ లాహిరి

8/10/2020,గురువారం

నిర్వహణ : తగిరంచ నరసింహారెడ్డి గారు

రచన : ల్యాదాల గాయత్రి


మంచుపూల సోయగమే

 వెతుకుతావు ఎందుకనీ

మల్లెతావి మధురమంటె

 నవ్వుతావు ఎందుకనీ


యవ్వనపూ పొంగులోన

మైమరచీ దానవుడై

చిరుమొగ్గల నలిపేసీ

మగ్గుతావు ఎందుకనీ


పెనవేసిన బంధాలను

తుంచేసీ సంబరాన

జీవితంలొ సుఖాలనూ

 చెరుపుతావు ఎందుకనీ


కోరికలే గుర్రాలై 

పరుగులెత్త ఆపలేక 

భీరువులా బాధలోన

మునుగుతావు ఎందుకనీ


అనుక్షణం ఎదురయ్యే

సమస్యలకు జడిసిపోయి

నీరసంగ బతుకునావ

నడుపుతావు ఎందుకనీ..!!

08/10/20, 9:19 pm - L Gayatri: సవరణతో..

08/10/20, 9:32 pm - Telugu Kavivara: <Media omitted>

08/10/20, 9:36 pm - Telugu Kavivara: *అమరకుల ☝🏽 స్వర సందేశం*

08/10/20, 9:45 pm - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

08/10/20, 9:49 pm - Trivikrama Sharma: ఎప్పటికప్పుడు నూతన ప్రక్రియలకు నాంది పలుకుతూ ఈ సమూహాన్ని నిత్యనూతనం చేస్తూ కవులను అనుక్షణం ప్రోత్సహిస్తూ గాయకులను ఇంకా ప్రతిభ కల వారందరికీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు అందరినీ నడిపిస్తూ సర్వ సైన్యాధ్యక్షుడు  సమూహాన్ని విజయతీరాలకు తీసుకొని వెళ్తున్నటువంటి ప్రధాన సారథి గారికి అమరుల గారికి అలాగే మీ ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న వస్తున్నటువంటి సారథి లందరికీ చాలా మంచి వేదిక ద్వారా తమ ప్రతిభను మరింత పదును పెడుతున్నటువంటి మిత్రులందరికీ అనుక్షణం ప్రోత్సహిస్తున్న నిర్వాహక బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🏿🙏🏿🙏🏿👌🏿👌🏿👌🏿💐💐💐

08/10/20, 10:03 pm - L Gayatri: <Media omitted>

08/10/20, 10:05 pm - +91 94413 57400: ఒక్క మాట లో చెప్పాలంటే కవులు కవనంలో స్వేచ్ఛావిహారం చేయడానికి అవకాశం ఇవ్వడం అమరకుల గారు చేసిన చేస్తున్న ప్రయత్నం  ,ఎందరో కవులు నూతన లోకంలోకి అడుగు పెట్టడానికి దోహదపడుతుంది .

ఇన్నాళ్ళకు ఆలోచించి ఆలోచించి  మొహమాటం తో కాకుండా నాదైన శైలిలో .

ఒక్క అక్షరం పెరగకుండా తరగకుండా ఆనందంగా వెలిబుచ్చిన అభిప్రాయం 

కవులారా !! ఈ అవకాన్ని  అదిమి పట్టుకొండి


డానాయకంటి నరసింహ శర్మ

08/10/20, 10:12 pm - Telugu Kavivara: <Media omitted>

08/10/20, 11:07 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

09/10/20, 4:52 am - Telugu Kavivara added Bavandla Madhu, +91 80993 05303, +91 85004 24004, +91 86886 20478, +91 90307 15504, +91 90525 22062, +91 92472 86668, +91 95151 24300, +91 95422 36764, +91 95732 74818, +91 97034 83648, +91 98489 60090, +91 98669 72689, +91 99122 33739, +91 99596 26316 and +91 99633 97912

09/10/20, 4:57 am - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

09/10/20, 4:57 am - +91 80089 26969: ✍️మల్లినాథ సూరి కళాపీఠం yp

ప్రక్రియ::పాట

అంశం :: ఇచ్చికాంశం

నిర్వహణ:: శ్రీ మతి ల్యాదల గాయత్రి గారు , శ్రీమతి హరిరమణ గారు , శ్రీమతి గంగ్వాకర్ కవిత కులకర్ణి గారు.

రచన::  దాస్యం మాధవి.

తేదీ:: 9/10/2020



చెలీ చెలీ ఇక చాలించవే

నీ కవ్వింతల ఈ దోబూచులే


నిను చూడక నే శిలనయ్యానే

నిను చేరక నేనిక శిథిలాన్నే


నా వలపు గెలిచి

మనసు దోచి 

వగచావెందుకనే

నాలో వలపుల చిలికి

ప్రేమే విచ్చగ

నను విడిచావెందుకనే


కదిలే కలలా చేరి 

తుల్లింతై చిగురించి

వణికే పెదవై కనుపాపల్లో చేరి

కవ్వించావె


నాతో నిన్నే ఊహించి చెక్కిళ్ళ మురిసానే

నీ ఊహల జల్లుల నే తడిసి విరబూసానే

నాతో నువ్వేలేక నా మతి నా పై నవ్వేనే

నువ్వే లేక నన్నే లోకం విడిపోయెనే


                               ।। చెలీ చెలీ।।


నా కనుల కలలన నువు పొంగి 

మదినిండి

మురిపించావే

ఇక నేనే నీవని నమ్మానే

నిను వగచానే

ప్రేమను కురిపానే


నా వలపు దోచి నీ మనసు దాచి 

పరుగులు ఎక్కడికే

నీ అడుగుల సడికి అలసిన మనస్సే 

అలుకన కులికేనే



కదిలే కలలే  నను గిల్లి

నీ మదిలోన దాగాయే

నువు లేవంటు నా హృది తుల్లి

నను ఒంటరిని చేసే

నా మదిలో నువు కదలగ

మతిపోయెనే

నీకై వెదుకగ నా యెదలో నేలేనే

నా మదిలో నువు కదలగ

మతిపోయెనే

నీకై వెదుకగ నా యెదలో నేలేనే

                                      ।। చెలీ చెలీ।।


మళ్లీ మళ్లీ మాయలు చేసి నన్నే వగచి

మరీ మరీ నను వేధించకె నన్నే విడచి

మళ్లీ మళ్లీ మాయలు చేసి నన్నే వగచి

మరీ మరీ నను వేధించకె నన్నే విడచి


నా కనుల కలలన నువు పొంగి 

మదినిండి

మురిపించావే

ఇక నేనే నీవని నమ్మానే

నిను వగచానే

ప్రేమను కురిపానే


నా వలపు దోచి నీ మనసు దాచి 

పరుగులు ఎక్కడికే

నీ అడుగుల సడికి అలసిన మనస్సే 

అలుకన కులికేనే।        ।। చెలీ చెలీ।।


దాస్యం మాధవి.....

09/10/20, 5:13 am - +91 90961 63962: మల్లినాథసూరి కళాపీఠం

ఐచ్ఛికాంశము


భూతిలకవృత్తగర్భ సీసము

   శ్రీ హరి స్తుతి

సీ..

 శ్రీకరమాధవ శ్రీధరా మముజేర రమ్మని వేడెదా రార కృష్ణ

హేకరుణాకర హేరమా హృద యేశ

కావర మంగళా దేవదేవ

హేకమలాక్షుడ హేజనార్ధన యీశ్వరేశ్వర యవ్యయా విశ్వశోభ

సాకర కేశవ సర్వతోముఖ శౌరి

నిన్ను భజించెదా నిగమవినుత

గీ..

కైటబారి కపిల వరకారణాంగ యో

పుండరీక వరద పుణ్యపురుష వినుత

పక్షి గమన దేవ పరమ పావన హరి

బ్రహ్మ జనక విబుధ పాపరహిత  శరణు


: భూతిలకవృత్తము

భ భ ర స జ జ గ 12 అక్షరం యతి


శ్రీకర మాధవ శ్రీధరా మముజేర రమ్మని వేడెదా 

హేకరుణాకర హేరమా హృద యేశ కావర మంగళా

హేకమలాక్షుడ హేజనార్ధన యీశ్వరేశ్వర యవ్యయా 

సాకర కేశవ సర్వతోముఖ శౌరి

నిన్ను భజించెదా


 ఆ.వె

కైటబారి కపిల వరకారణాంగ యో

పుండరీక వరద పుణ్య పురుష

పక్షి గమన దేవ పరమపావన హరి

బ్రహ్మ జనక విబుధ పాపరహిత


అంజయ్యగౌడ్

09/10/20, 5:14 am - Telugu Kavivara: <Media omitted>

09/10/20, 5:15 am - Telugu Kavivara: గుండె సవ్వడి కానీకు అలజడి

••••••••••••○○○••••••••••••


హృదయాన్ని విత్తనంగా వేసా మొక్కవ్వాలనీ

బతుకు కాలపు ఆశలని ఎరువుగా వెదజల్లా

ఏరువాక కోరికలని నీ మదిలో నాగేటి చాళ్లుగ

ఆరుగాలం అంతా శ్రమతో సేద్యం చేసే దీక్షతో


ఎడారి వంటి దారిలో నీవొక ఒయాసిస్సు వుయే

కోరికల డోలికలలో దాహార్తి తీర్చవా ఖర్జూరమై

ఎండమావి లా మారిపోతే నే నాగజెముడవనా

యుగాలుగా దగా పాలయ్యేదిఈ హృదయమే


హృదయ వీణ తంత్రులు గరికలై వ్రేళ్ళు వేస్తాయి

పుపుస ధమనులు నీరింకెడి నదీ పాయలు ఔను

పుపుస సిరలు ప్రయాస పడెడి అడవి తుప్పలౌ

ఎంత మాయావి కదా బ్రహ్మ మదికి ఏదకు లింకేసే


                           ••••••○○○•••••• అమరకుల దృశ్యకవి  మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

09/10/20, 5:34 am - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి

నిర్వహణ.సోదర్యః త్రయం

రచన.డానాయకంటి నరసింహ శర్మ 

అంశం.ఏదో తెలియని లోకంలో ..


నాదైన లోకంలోకి వెళ్ళాను

అక్కడ అన్నీ రంగుల మయం సప్తస్వరాల సప్తసముద్రాల సప్తవర్ణాల సమ్మేళనం 

ఆనందాంబుధిలో మృదుపద మంజీర మంజరుల ఝరీవిరులసరులతో సురతరువులతో స్వర ,స్వర్ణ పర్ణ సంకీర్ణం

లలన యొకతె తన క్రీగంటితో సైగతో ఆహ్వానించగా ఆమె మరునారాచములాంటి సుభృవుల తావుల క్రేవుల రేవులలో పూవులనేరుకొంటి

ఆ మచ్చకంటితో అచ్చెరువుగ మచ్చిక జేసుక ఇచ్చకములాడితి

ఆ లలామ ఆలేమ లేత బింబాధరముల తొణుకు మరందముపై తమితో వాలు తేటులను జూచితి 

కంబుకంఠి యా లతాంగి కమ్మని కలరవాన్ని వింటి 

సింహేంద్ర మధ్యమ ఆ శాతోదరి  నర్తనా నయగారాలలో మందారాలనే  ఆఘ్రాణించితి

అలినీలకుంతల ఆ  కుంభపయోధరి మందగమనాన్ని వసంతాగమనంలోని పంచమస్వనంతో మేళవించితి

ఆ మృదు పల్లవ పాణి 

ఈమని పై కమ్మని కాంభోజి రాగాన్ని మీటుచుండగా  హృదిలో సుమశర ఘాతము ననుభవించితి

సైకతవేదికపై నేనట 

 పర్ణ వేశ్మములో తానిట

రాకాశశాంకుని చందన శీకరములలో మజ్జనము గావించితిమి 

 ఇదంతా ఓ వనాంతరసీమలో 

ఆ అలినీలకుంతల చెలిమని ఆస్వాదించి రసానుభూతి 



అంతలో కుక్కుటంబు కొక్కోరోకో యనగా దిగ్గున లేచితి



ఇది అంతయు మగత నిదురలో రచించిన సుప్తచైతన్యరచన

డా నాయకంటి నరసింహ శర్మ

09/10/20, 5:42 am - +91 96038 56152: శ్రీ మల్లినాథ సూరి కళాపీఠం YP    (సప్తవర్ణాల సింగిడి)

*అమరకులదృశ్య కవి చక్రవర్తి గారిపర్యవేక్షణలో*

నిర్వహణ:-

*శ్రీమతి ల్యదాల గాయత్రి*

*శ్రీమతి హరి రమణ* & *శ్రీమతి గంగ్వార్ కవిత*

గారలు 

అంశం :-  

*ఐచ్ఛికాంశం- స్వేచ్చా కవిత్వం*

               (భావగీతం)

రచన &గానం:- 

               *విత్రయ శర్మ*


శీర్షిక :- *వెన్నెలా రావే*!!

×±±±×•••••ו••••±±±±×

*వెన్నెలా రావే.. సిరివెన్నెలారావే.. 

నీలిగగనపు దారులందూ.. 

మబ్బుతెరలా తేరుపైనా 

రావె.. రావే వెన్నెలా.. 


కాస్త ముసిరిన కారుమబ్బుకి 

కనికరము లేకున్నది.. 

రాత్రి కురిసిన తుహినమూ నను తాకి చిటపట మన్నది 

చుక్కలన్నీ చుట్టుముట్టి ముచ్చటించే వేళలోన.. 

ఏటితళుకుల తరగలన్నీ 

తపన పడుతూ వున్నవి.. 

నీరాకకై చూస్తున్నవి.. 

   ||రావె.. రావే.. వెన్నెలా..||

కొండాకోనల తిరుగులాడీ.. 

అండదండా కానరాక.. 

వెదురు పొదలా హృదయ స్వరమై 

సరిగమలు మధురిమ తానెయై 

చూడు చూడది పిల్లగాలి వేణువై మురిపించె  నదిగో.. 

       ||వెన్నెలా రావే...!!    

          సిరివెన్నెలారావే ||

ప్రాణసఖి!!నా త్రయీ రూపము నిలచినిది నాహృదయ మందున 

కల్లకపటము తెలియని ఆనంద సౌరభ వీవనల్లే 

ఊర్పులౌ.. నిట్టూర్పు సెగలను చల్లబరిచే వెన్నెలా.. 

||వెన్నెలారావే... సిరివెన్నెలారావే... ||

****     *విత్రయ శర్మ*

           (09/10/2020)

09/10/20, 5:42 am - +91 96038 56152: <Media omitted>

09/10/20, 6:03 am - +91 89852 34741: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

9/10/20

అంశం.... ఐశ్చికాంశం

**శీర్షిక....మనవాడే నిర్దయుడైతే.....**

ప్రక్రియ..‌...వచన కవిత

నిర్వహణ....హరి రమణ గారు,ల్యాదల గాయత్రి గారు,గాంగ్వార్ కవిత గార్లు

రచన....కొండ్లె శ్రీనివాస్

ములుగు

""""""""""""""""""""""""""""""""

విలువలకు తిలోదకాలు

వివాదాలకుస్వాగతాలు

బాధ్యత లు బరువైనట్టుగ

బంధాలను వెలివేసి. ...

దాటవేతమాటలతో

నక్కవినయనటనలతో

ఆటలాడుకుంటాడు

అమాయకుల జీవితాలతో....


ఆస్తులెన్ని తనకున్నా

పస్తులున్న వాడిని చూసి

సాయపడే హృదయం లేక...

ఎదుటివారి గోడువినడు

మాటవరుసకైనా నేనున్నానని..

ధైర్యమీయడు

ఎవరేమనుకుంటేనేం

నేనే ఎదుగాలని అంతా నాకే కావాలని


సొంతవారితో పంతానికి పోయి

ఎంత కైనా దిగజారి....

నమ్మితే నట్టేట ముంచుతాడు

**నీతులు బోధిస్తాడు ఆచరణ మారుస్తాడు**

09/10/20, 6:13 am - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 046, ది: 09.10.2020. శుక్రవారం.

అంశం: ఐచ్ఛికాంశం (సప్తగిరులు)

శీర్షిక: సప్తగిరులచరిత

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీమతి హరిరమణ, కవితకులకర్ణి గాయత్రి గార్లు.

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: ఆధునిక పద్యం 


సీసమాలిక

"""""""""""""""

సప్తగిరులగూర్చి చక్కగాచెప్పెద

     వినితరించవలెను విజ్ఞులార

ఆనందశిఖరాన్ని యాదిశేషుడుజుట్టి

     "శేషాద్రి" గిరిగాను చేరువయ్యె

నీలాలుయర్పించి "నీలాద్రి" గనిలచె

     కలియుగదైవంబు గరుణజేత

వైనతేయుండును వైకుంఠమునువీడి

     "గరుడాద్రి" గభువిన గడుపుచుండె

అంజనాదేవికి యభయమిచ్చెనుసామి

     "అంజనాద్రి" గనామె యవతరించె

వృషభాసురునితుంచి వృషపతిజెప్పెను

     "వృషభాద్రి" గానుండు వసుధపైన

నారాయణమహర్షి ఘోరతపంబుచే

     "నారాయణాద్రి" గా స్థిరముగుండె

కలియుగదైవము కరుణజూపగవచ్చి

     వేంకన్న వెలసిన "వేంకటాద్రి"

ఆకాశమందేల యందమైనగిరులు

     పచ్చనిచెట్లతో పరిఢవిల్లె

బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండముగజేసి

     కొండపైనిండుగా కొలువుదీర్చె


తే.గీ.

ఏడుకొండలవాడిని వేడుకొనెద

కష్టములుదీర్చి మమ్మల్ని కనికరించి

ఆపదలుతొలగించి మమ్మాదుకొనుము

ఏడులోకాలనేలేటి వాడునీవు


👆ఈ పద్యకవిత నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

09/10/20, 6:43 am - B Venkat Kavi: <Media omitted>

09/10/20, 6:43 am - B Venkat Kavi: మల్లినాథसूరికళాపీఠం,ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం

నిర్వహణ: 

*ల్యాదల గాయత్రిగారు, హరిరమణగారు, గంగ్వార్ కవితగారు*


రచన:  *బి. వెంకట్ కవి*


*గురుకులం గుర్తొచ్చింది*

--------------------------------------

  మా గురుకులం గుర్తొంచింది.      

 మా గురుకులం ఏడుస్తోంది.

మీరింకా రారా అని పిలుస్తోంది....పిలిచింది వెళ్ళాము.

  ప్రకృతి రమణీయతలో కోతులు

గేటుతెరవగానే అదో కొత్త లోకం..


గురుకులాన్ని భద్రంగా కాపాడే 

కాపలాదారుడు 

ఎందుకో భయం భయంగా కనపడుతున్నడూ...


ఎండిపోయిన మొక్కలు

మరల  చిగురించినవి

ఆకులతో,పువ్వులతో

కోతులు, రకరకాల విహంగాలు,నెమళ్ళు,

గూడు కట్టుకున్న పక్షులు

స్వాగతం పలుకుతున్నవి...


నాయెత్తు పెరిగిన గడ్డిపూలు,

గుణుగు,తంగెడిపూలు,

सीతాకోకచిలుకలు, గోరెంకలు

అన్నింటిని చూడగానే

నా మనसु ఆనందపరవళ్ళతో

ఉప్పొంగిపోయింది.


 ముదనష్టపు రోగం ముంచుతూనే ఉంది

మూగబోయిన గొంతుని

సవరించుకుని గురుకుల విద్యాలయం మరల రమ్మంటే

చూద్దామని పోయాను.


గురుకులం ఎండాకాలమంతా

 ఎండిపోయింది.

వర్షాకాలమంతా తడిसिंది.

ఏపుగా గడ్డంతా పెరిగింది

బుసలుకొట్టే సర్పాలకు

గురుకులం ఆలవాళమైంది.

దానిమ్మచెట్లకు కాయలు

విరగకాसिనవి.

నిమ్మచెట్లన్ని కాయలతో

కళకళాడుతున్నవి

కోతులరాజ్యమైపోయింది

గురుకులం


మేము,మా విద్యార్థినులము పెట్టిన

పూలమొక్కలను చూచాము

పుట్టినరోజులను జరుపుకుంటున్న విద్యార్థినులు

నాటిన పూలమొక్కలకు

మేము నీళ్ళు పోయకపోయినా

వానదేవుడూ కరుణించి,

తన వర్షముతో పూలమొక్కలను తడుపుతూనే ఉన్నాడు

నేనైతే వాటిని, పరిశీలించి

ముద్దాడాను.

నేను ఎప్పుడూ ఇష్టపడే

నేను ఎప్పుడూ కూర్చుండే

పెద్దరావి చెట్టుపైకి

రకరకాల రంగుల పక్షులు

వచ్చి చేరినవి.

కిచకిచరావాలతో ప్రకృతి

ఆవరణమంతా ఆహ్లాదమును

సంతరించుకొంది.


ఇన్నాళ్లు నిశ్చేష్టమైపోయిన

గురుకుల ఆవరణమంతా 

ఒక్కసారిగా తేరుకుని

యథా రాగం పాడుతోంది...


దుమ్ము ధూళి తో నిండిన

బెంచీలు, కుర్చీలు లేచి

సలాం కొట్టి, అలిగి

అక్కడే కూలబడిపోయాయి....


ఆరు నెలల క్రితం

విడిపోయిన గురువులు

కంటనీరు పెడుతూ 

ప్రతీ ఒక్కరితో మమేకమై

మురిసిపోతున్నరు...


చాన్నాళ్ల తర్వాత కలిసిన

మా మిత్రురాళ్ళతో కలుద్దామని

దగ్గరకు చేరబోతే 

వద్దంటూ వారిస్తే, బోరున 

విలపిస్తూ నిలబడిపోయాం


షేక్ హ్యండ్ లు లేవు

మొహం గుర్తు పడతలేము

మొహంనిండా మాस्कुలు

ధరించడంవల్ల మొహాలు

గుర్తుపట్టక నీవెవరు?

అనే ప్రశ్నతో మిత్రం అనే

పదం దూరమైపోయింది


దూరం దూరంగా నిల్చుని

కష్టాలబాధలు చెప్పుకుంటుంటే

ఏడ్పు వచ్చింది.

అడుగడుగునా కరోనాకాలం

గుర్తుకువచ్చి,శానిటైజర్ ను

చేతులకు రుద్దుకొని

రికార్డుబుక్ లో సంతకం చేశాము.

పాతరోజులు గుర్తుకు వచ్చి

పాతరోజులే బాగున్నాయి

కొత్తరోజులు బాగాలేవని

సంభాషణచతురతతో

మాట్లాడుకుంటునే

డిజిటల్ గురూ తరగతుల

పిల్లలకు సమూహాలను

తయారుచేశాము.


మా ఎడబాటుని ఓర్చుకోని

నల్లబల్ల ఒక్కసారిగా

కుప్పకూలి కడుపులో

బాధను కక్కుతున్నది...


హాజరుపట్టికలను క్రొత్తవాటిని

తయారు చేశాము

డిజిటల్ గురూ తరతుల

హాజరును నమోదుచేశాము.

టచ్ ఫోన్ ద్వారా బాలికలకు

సమాచారాన్ని చేరవేర్చి

డిజిటల్ గురూ తరగతులను

శ్రధ్ధతో వినుమని శాసనం జేశాము.


మామూలురోజులు ఎప్పుడో

మామూలు తరగతులు ఎప్పుడో

కరోనా పూర్తిగా ఎప్పుడు

మాయమవుతుందో

మాయదారి కరోనా తన

మాయతో ఇంకా మాయనే

చేయుచున్నది.

జీవితం మాయతోనే ...

కాలమంతా మాయతోనే..

మన జీవితానికి, జీవనానికి

మంచిరోజులు ఎప్పుడో

వేచి చూడాలి.


✍బి. వెంకట్ కవి ✍


🍥🍥🍥💥🍥🍥🍥

09/10/20, 6:43 am - +91 81062 04412: *మల్లినాథ సూరి కళాపీఠం YP*

*అంశం :: ఐచ్చికాంశం*

*నిర్వహణ:: శ్రీమతి  గాయత్రి గారు *, *హరిరమణ గారు మరియు కవిత గారు.*

*తేదీ:: 09/10/2020*

*శీర్షిక::కలాం నీవే మాకు స్ఫూర్తి*

*ప్రక్రియ:: పాట*

*******************


భారతీయ కిరణమా... నీకు వందనం...

భరతజాతి కవచమా....నీకు వందనం...!!2!!

అబ్దుల్ కలామా... చేస్తున్నాం వందనం...

నీ త్యాగాలకు చేస్తున్నాం...

శిరసు వంచి ప్రణామం...!!2!!

                                         !!భారతీయ!!


చిరునవ్వుల వరమై...

చిగురాశలు మొలిపించి...!!2!!

చిన్నారుల హృదయంలో...శాశ్వతంగా నిలిచావు...

అణు క్షిపణుల ప్రయోగించి

మిస్సైల్ మ్యాన్ గా నిలిచి...!!2!!

భారతీయ కీర్తిపతాక 

రెపరెప లాడించావు....

నిరుపమాన సేవలకు చేస్తున్నాం....వందనం

                                                        !!2!!

ఘన కీర్తులు చాటించ స్వీకరించు ప్రణామం.

                                         !!భారతీయ!!


ఇంతింతై వటుడింతై...

దిగ్ దిగంతాల వ్యాపితమై...!!2!!

పేపర్ బాయ్ గా మొదలై...

రాష్ట్రపతిగా నిలిచినావు...

ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ....

సాటి మనసుల గెలుచుకుంటూ!!2!!

చెదిరిపోని స్థాయిలో

స్థిర యశస్సు సాదించావు...

నీ గొప్ప మనసుకు చేస్తున్నాం...వందనం....

                                                       !!2!!

సాటి లేని నీ కృషికి స్వీకరించు ప్రణామం...

                                         !!భారతీయ!!


భారమైన బాధ్యతలను

అవలీలగా మోసేస్తూ....!!2!!

పట్టుదలతో శ్రమించి

విజయాన్ని పొందావు..

కులమతాల కతీతంగా

విశ్వమానవ శ్రేయస్సే లక్ష్యంగా

అలుపెరగని పోరాటం చేసి...!!2!!

బతుకు జ్యోతులు వెలిగించావు...

నీ అఖుంటిత దీక్షకు చేస్తున్నాం వందనం...

                                                       !!2!!

భారతీయ రత్నమా స్వీకరించు ప్రణామం...

                                         !!భారతీయ!!


****************************

*(అక్టోబర్ 15 అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్బంగా... ఈ పాట)*

****************************                                                  

*కాళంరాజు.వేణుగోపాల్*

*మార్కాపురం. ప్రకాశం 8106204412*

09/10/20, 6:46 am - +91 93941 71299: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల 

పేరు: యడవల్లి శైలజ కలంపేరు ప్రేమ్ 

ఊరు: పాండురంగాపురం ,జిల్లా ఖమ్మం 

అంశం: మీ రచన మీ ఇష్టం 

నిర్వాహకులు: అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారు 



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల

మా తల్లి బతుకమ్మ ఉయ్యాల 


గుమ్మడి పూలతో ఉయ్యాల 

చేరి కొలిచేము ఉయ్యాల 

మందారపూలతో ఉయ్యాల 

మంచిగా ఆడేము ఉయ్యాల 


" బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల 

  మా తల్లి బతుకమ్మ ఉయ్యాల "


   తంగేడుపూలతో ఉయ్యాల 

   చీరకట్టుల్లాగే ఉయ్యాల 

  తంతులు పేరుస్తూ ఉయ్యాల 

  తప్పెట్లు తాళాలతోఉయ్యాల 


" బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల 

మా తల్లి బతుకమ్మ ఉయ్యాల "


 ఆడవాళ్ళు కూడి ఉయ్యాల 

కష్టాలు కన్నీళ్ళను ఉయ్యాల 

కలబోసుకుంటూ ఉయ్యాల 

కలిసి ఆడేరమ్మ ఉయ్యాల 


" బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల 

   మా తల్లి బతుకమ్మ ఉయ్యాల "


  ఆత్మ విశ్వాసం బతుకమ్మ  ఉయ్యాల 

   ఆత్మగౌరవపు ప్రతీకవమ్మ ఉయ్యాల 

    విజయాలు అందించు ఉయ్యాల 

    రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉయ్యాల 

 

" బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల 

  మా తల్లి బతుకమ్మ ఉయ్యాల

09/10/20, 6:48 am - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీమతి ల్యాదాల గాయత్రి గారు 

శ్రీమతి కవితగారు ,శ్రీమతి హరిరమణగారు 

పేరు… ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :09-10-2020

అంశం :స్వేచ్ఛాకవనము 

శీర్షిక :..కాలజ్ఞానము 



కాలమే కలతలను కర్పూరములా కరిగించి 

అమ్మయై తన ఒడిలో నిద్రపుచ్చుననీ 

సమయమే సమ్యమనంతో వేలుపట్టుకుని బాధ్యతలను నాన్నయై నడిపించుననీ 

గడియారమే ప్రాణశిల్పముగా చెక్కుతూ 

గురువై గురితప్పని పౌరునిగా మలుచుననీ 

విధియే వివేకచూపునిచ్చే దైవమై 

విరించి వేణువై విశ్లేషణ నేర్పుననీ 


చిన్ననాడు చిరుగుతొడిగిన చందమామ కధలే 

చిన్మయ ముద్రలై నడిపించుననీ 

మన మంచి చెడులే తిరిగే బొంగురమై 

మనల్ని  పలుకరించుననీ 

కాలమే కమనీయ కావ్యమై 

కనులముందు మనలను నిలుపుననీ 

బలహీనమైనవి పరిస్థితులే యగును 

కాని మనిషి కాదనీ 


బద్దకమనే జడము బరువై మనిషిని 

బలహీనపరుచుననీ 

కష్టాల కొలిమిలోనే కాంచనమనసులు 

కాంతి లీనుననీ 

శ్రమయే శరణమనీ అదే స్నేహతావియై 

శ్రావ్య గీతమగుననీ 

రంగమేదైనా రాజలా శాసిస్తూ 

మనలను  దీవించుననీ 

కనిపించని కాలము అరచేతిలో జారిపోయే నీటిలా కదులుననీ 

మనకు వయసును ఆపాదిస్తూ అన్నింటా మిళితమై కాలజ్ఞానమును బోధించుననీ 

మనిషి తెలుసుకుంటేనే నందనవనజీవనానికి 

పరిపక్వతనొందును 


హామీ పత్రం :ఇది నా స్వీయ కవనము ఈ సమూహము కొరకే వ్రాసితిని 

✍️ప్రియదర్శిని

09/10/20, 7:22 am - Tagirancha Narasimha Reddy: మల్లినాథసూరి కళాపీఠం 

అంశం: ఐచ్చికాంశం 

నిర్వహణ: ముగ్గురమ్మలు 

రచన: తగిరంచ నర్సింహారెడ్డి 

ప్రక్రియ: రుబాయీలు


మంచేదో, చెడేదో,  మనిషికోమాట చెబుతూనే ఉంటారు 

ముంచడమో, నిలిపడమో, ఎవరేదేదో చేస్తూనే ఉంటారు 

మనలాగే మనమెపుడూ బ్రతకాలంటే కష్టమేనోయ్ ఇలలోన;

పూటకొక పుల్లవెట్టి కయ్యాలదారులు తీస్తూనే ఉంటారు.


కొలమానం కొలబద్దలోనే ఉంటుందంటే కష్టమే 

బహుమానం వస్తువులోనే తెలుస్తుందంటే  కష్టమే 

మనసులోతు మమకారవిలువ లెక్కించామనుకుంటె కల్ల;

పైపై మెరుపులకు లోకం గులామై నడుస్తుంటే కష్టమే;

09/10/20, 8:04 am - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

9-10-2020 శుక్రవారం

కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

అంశం: స్వేచ్ఛా కవనం -  ఐచ్ఛికం

శీర్షిక: మిక్చర్ (58) 

నిర్వహణ: ల్యాదాల గాయత్రి, హరి రమణ, గంగ్వార్ కవితా కులకర్ణి


ఆటవెలది 1

ఒకరినొకరు వీడి నుండ చంద్ర కమల

నీళ్లనొదలి ఓడ నీదలేదు

నిన్ను మరచి నేను నిలువ లేనే లేను

నేల విడిచి బండి నడవలేదు


ఆటవెలది 2

ముసుగు వేసుకున్న ముదిమి అందం తగ్గ

లేదు! నాపగలరు లెవ్వరైన

మాటలాడకుండ మగువ! నోటికి వేయు

తాళము! ముసుగేమి తాపగలదు!


ఆటవెలది 3

కవులు మెచ్చిరెల్ల కవితలు మెండని

కడకు భాష రాని కరుకు వారు

మెచ్చి రికను వేచి ఇల్లాలు మెప్పుకు

నోచుకోని కవిత నోముపంట


ఆటవెలది 4

సరళ భాషలోన సరసముగా రాస్త

ఆటవెలది లోన పాట పాడ్త

జానపదము లోన జనరంజకంగాను

జనుల మదిని దోచి చక్కగాను


వేం*కుభే*రాణి

09/10/20, 8:06 am - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠం yp*

            ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో.......

       🌈 *సప్తవర్ణములసింగిడి*

తేదీ:09/10/2020 శుక్రవారం

స్వేచ్ఛాకవిత:ఐచ్ఛికాంశం

నిర్వహణ:శ్రీమతి ల్యాదాలగాయత్రి గారు, శ్రీమతి హరిరమణగారు, శ్రీమతి గంగ్వార్ కవిత గారు 

రచన:జె.పద్మావతి 

మహబూబ్ నగర్ 

శీర్షిక: *పైశాచిక ప్రాబల్యం*

*************************************

సమాజ సరళికి సార్థక్యం లోపించిన వేళ

సహజీవికి సానుభూతి లోపించినవేళ

సంఘవిద్రోహక చర్యలు ప్రబలిన వేళ

సంస్కృతులకు తిలోదకాలు ఇచ్చిన వేళ


మానవత్వాన్ని మంటగలిపిన మనుగడకు లేదర్థం

మృగాళ్ళమారణహోమంలో మంచితనంమృగ్యం

వావీ వరుసలకు పడుతోంది పటిష్ఠమైన తాళం 

కర్కశాల కడలిలో కొట్టుకుపోతోంది కన్యల కాలం


మతిహీనులమహిలో మమతలౌతున్నాయి హీనం

మా నవజీవనం నాణ్యతలేకఅవుతున్నది హేయం

వికారపు సుడిలో చిక్కినది వైవస్వత మనువు.

కాలవైపరీత్యానికి కళ్ళెమేయలేదు కామధేనువు


కనికరంలేని ఓ మనిషీ!.....


కనిపించనిదేవుళ్ళనెందుకు మ్రొక్కేవు?

కని పెంచిన వారినెందుకు విస్మరించేవు?

పైశాచిక ప్రాబల్యాన్ని మార్చలేడు ఏభృగువు.

ఎందుకంటే...ఇది హత్యాచారాలఋతువు!!

09/10/20, 8:29 am - Sadayya: *మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల*

*సప్త ప్రక్రియల సింగిడి*

*ప్రక్రియ: ఐచ్ఛికం-ఇష్టపది*

*శీర్షిక: ఐచ్ఛికం-ముకుందమాల-4*

నిర్వహణ: *ల్యాదాల గాయత్రి,హరిరమణ,గంగ్వార్కర్ కవిత గారలు*


రచన: *డాక్టర్ అడిగొప్పుల*


➿➿➿➿➿➿➿➿➿➿➿


*నీ చరణ ద్వంద్వమును నేను కీర్తించనుర!*

*ద్వంద్వాది సుఖములను తప్పించమని కోరి,*


*నీ పాద పాద్మాల నే గొలువలేనురా!*

*నరక బాధలనుండి నన్ను తప్పించమని,*


*నీ నామ కీర్తనలు నే జేయలేనురా!*

*కోమలాంగుల సుఖము కోసరము కోర్కెతో,*


*ఎడద కోవెల నిలిచి ఎల్ల భావములలో*

*నీ తలపు వచ్చేట్లు నివసించమని సతము*


*నీపాద జలజముల నేను పూజించెదను*

*గోవింద! ముకుందా! కువలయానందా!!*

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

4.

నాహం వందే తవ చరణయో ర్ద్వంద్వ మద్వంద్వ హేతోః

కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుమ్ ,

రమ్యా రామా మృదుతనులతా నందనే నా పి రంతుం

భావే భావే హృదయభవనే భావయేయం భవంతమ్ .


---ముకుంద మాల(కులశేఖరాళ్వార్ )

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

09/10/20, 8:33 am - Madugula Narayana Murthy: ✍️మల్లినాథ సూరి కళాపీఠం yp

ప్రక్రియ::పాట

అంశం :: ఇచ్చికాంశం

నిర్వహణ:: శ్రీ మతి ల్యాదల గాయత్రి గారు , శ్రీమతి హరిరమణ గారు , శ్రీమతి గంగ్వాకర్ కవిత కులకర్ణి గారు.

రచన::  *మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా*

తేదీ:: 9/10/2020

*అంశం*ఏదీబూతుకాదు


1. *కందము*

బూతులుకావేవీమన

జాతికి సంవృద్ధినిచ్చు సంగమ క్రియలున్

చేతనమై ధర్మమ్ముల

నీతిగ సంసార సుఖము నేస్తము ధరలో!!


2. *కందము*

బంగారు బాతు గుడ్డగు

శృంగారము స్వేచ్ఛ పేర చిదిపిన కీడై

భంగము మానము ప్రాణము

చెంగున తనువెగిసి పడిన చేటగు సతమున్


3. *కందము*

సరసము నొక కళగావలె

వరముగ మన దృష్టి యున్న వర్ధిలు గుణమున్

పరసతి తల్లిగ చెల్లిగ

వరుసల రక్షించ పుడమి వైభవమొందున్!!

4. *కందము*

పిడికిలి లోపలి వస్తువు

గడపను దాటంగలేని కార్యపు గుట్టున్

తడబడకుండని మనమును

బిడియములో నడతజనుల ప్రేమల గురుతౌ!!


5. *కందము*

శృంగారము బంగారమె

సంగడిలో సంగతుల్ని సంస్కృతి పరిధిన్

ముంగిలి వర్చసు పదిలము

నంగడిలో సరకుగాదు నదుపుననున్నన్!!

6. *కందము*

ఋతువులు,కాలము ప్రాణులు

క్రతువులుగా ఫలములిచ్చు గౌరవమొప్పన్

యతులిత చతురత మతిమతి ,

నుతులను రతి పొందగలదు నొవ్వని నడకే!!

7. *కందము*

హితులౌ పెద్దల సూక్తుల

నతిశయమౌ మంచినెంచుటానందముతో

సతిసుత పోషణకై పరి

మితులను పాటించినపుడు మేలగు బ్రతుకున్!!

09/10/20, 8:43 am - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము ఇష్ట కవిత

రచన -చయనం అరుణాశర్మ

నిర్వహణ -ల్యాదల గాయత్రి

కవితా కులకర్ణి, హరిరమణ

శీర్షిక-పులకించెను ప్రకృతి పరవశమై


పొన్నలు పూచిన వెన్నెలలో

వెన్నెల కాచిన తిన్నెలలో

అరవిచ్చిన కలువల కన్నులతో

మనసిచ్చిన మాధవదేవునికై

వేచెను రాధిక విరహిణియై


పచ్చని పచ్చిక దారులలో

వినవచ్చిన వెన్నుని మృదు పదముల చడివిని

పూచెను పుడమి విరివనియై

వేచెను బృందావని ఆమనియై


సిరిచందనమలదిన వదనముతో

అరవిందములంటి కన్నులతో

సుమగంధపు పరిమళ లాలనలా

మకరందపు తేటల మాధురిలా

వచ్చెను మురళీమోహనుడు


సుందర వదనుని చూడగనే

అందరి డెందములూగెనులే

నచ్చిన తన ప్రియ వారలకై

యదునందనుడూదెను వేణువును


వినిపించిన నెచ్చెలు గానముతో

పులకించెను ప్రకృతి పరవశమై

ఆ మెత్తని మత్తుల లాహిరిలో

గమ్మత్తుగ జగమూగెను రసధునియై


చయనం అరుణాశర్మ

చెన్నై

09/10/20, 8:48 am - +91 98850 66235: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి.

అంశం: ఇష్ట కవిత

నిర్వహణ: ల్యాదల గాయత్రి,

హరి రమణ గారు,గంగ్యాకర్ కవిత గారు

రచయిత : కొప్పుల ప్రసాద్ ,నంద్యాల

*శీర్షిక:కవి... అంటే...!!*


పదం పదం కలిపి

భావాల పూదోటలు పండించి

ఆస్వాదించే సువాసనలు కల్పించి

రసిక హృదయ వికసింప చేస్తూ...


ఉపమానాల విన్యాసాలతో

ఉత్ప్రేక్ష ల ఆలోచనలకు

స్వభవొక్తుల అందాలు వికసించి

అక్షరాల శబ్దార్థాలతో విన్యాసం చేస్తూ..


అక్షరాల కూర్పులో

సాహిత్యకారులు నేర్పుతో

గిజిగాడి అల్లికలు అల్లి నట్లు

జిగిబిగి సాహిత్య శోభలు సృష్టిస్తూ..


భూమి నుంచి మొలక

తల్లి నుండి బిడ్డ

రావడం అద్భుతమై తే

కవి కలం కూడా  అంతే...


మాటకు సొగసు

భావానికి అలంకారం

భాషకు అందలం

కల్పించే వాడే కవి....


ప్రాణములేని వస్తువుకు

అక్షరాలతో ప్రాణం పోసి

శాశ్వత కీర్తిని తెచ్చి

చరిత్రలో నిలిచే వాడే..!!


వికృత రూపాలకు

అక్షర రూపం కల్పించి

అందముగా తీర్చిదిద్ది

ఒక ప్రత్యేకతను నిలిపిన వాడే...


*కొప్పుల ప్రసాద్*

*నంద్యాల*

09/10/20, 8:54 am - +91 93984 24819: మల్లినాథసూరి కళాపీఠం YP,

సప్తవర్ణాల సింగిడి,

ఐచ్చికాంశం-స్వేచ్చాకవిత్వం,

9-10-2020-శుక్రవారం,

శీర్షిక:ప్రక్షాళన జరగందే...,

ప్రక్రియ:వచన కవిత,

పేరు:రాజుపేట రామబ్రహ్మం,

ఫోన్ నం:9398424819,

ఊరు:మిర్యాలగూడ,

నిర్వాహకులు:శ్రీమతులు.

                 ల్యాదాల గాయత్రి గారు

                  హరి రమణ గారు

                  గాంగ్వార్ కవిత గారు.

               ----------------

09/10/20, 8:54 am - +91 93984 24819: ప్రక్షాళన జరగాలి...


మాడిచచ్చేది మధ్యతరగతి ప్రజలేకదా

మరో వెనిజులా లాగమారితే జరిగేది

ఎదురైన ఎరకు ఆశ పడితేనే గదా

గిలగిలా కొట్టుకొని ప్రాణం విడిచేది

గాలం వేసినోడు ఉండేది ఒడ్డునే కదా

అందుకేగా వాడు క్షేమంగా ఉండేది

నీతి నిజాయితి కొరవడినందుకే గదా

ఉచితం కోసం ఊసరవెల్లిగ మారేది

గోతికాడినక్కలా చూస్తున్నందుకే కదా

తాయిలం తాంబూలం పనిచేస్తున్నది

లక్షాధికారికీ రేషన్ కార్డున్నందుకేగదా

మితిమీరిన సంక్షేమం దారి తప్పేది

రాయితీలకు తలవంచినందుకే కదా

శిస్తులపేర శిరోభారం అవుతున్నది

ముక్కల వాసనకు మరిగితేనే గదా

పైవాడి భారీ బొక్కసం నిండుతున్నది

మందుకు బానిసగా చిక్కితేనే గదా

పీఠంపై కూర్చొని పాలన సాగించేది

భవిష్యత్తుపై పరిశోధన జరిపితేగదా

బ్రతికే లోచన మెరుపులా మెరిసేది

దూరపుచూపు దగ్గరవుతేనే గదా

శాశ్వత ప్రయోజనం సమకూరేది.

-------------ధన్యవాదములతో,

                     రామబ్రహ్మం.

09/10/20, 8:56 am - +91 93966 10766: మల్లి నాథ సూరి కళాపీఠం yp... ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్య కవి చక్రవర్తుల ఆధ్వర్యంలో

సప్త వర్ణముల సింగిడి

తేది:09/10/2020

అంశము: ఇష్ట కవిత

నిర్వహణ:ల్యాదల గాయత్రి కవితా కులకర్ణి ,హరి రమణ గారు

రచన:డా.ఆలూరి విల్సన్


కవితా శీర్షిక :    "సాహిత్య వనం'

                                                                                                                                            మానవ  సంబంధాల సమాహారం సాహిత్యం

జీవన ప్రతి ఫలాల సమాజ రూపం సాహిత్యం

మెరుగైన సమాజ ఉన్నత స్థానం సాహిత్యం

అనుదిన పోరాట జీవన గమనం సాహిత్యం

స్వీయానుభవాల సమన్వయమే సాహిత్యం

భావ పరిణామాల కృశీవల సాహిత్యం

సంఘర్షణల కవితా రూపమే సాహిత్యం

జీవితానుభవాల ఇతివృత్తమే సాహిత్యం

వర్తమాన జీవన విశ్లేషణ మార్గదర్శి సాహిత్యం

మానవజగత్తున నూతన సాదృశ్యం సాహిత్యం

చైతన్య స్రవంతి

దిశానిర్థేశ సమన్వయం సాహిత్యం

సమాజ సరళీకరణకు దోహదమైనది సాహిత్యం

సాంఘిక అసమానతల తొలగించు సాహిత్యం

మానవ సమానత్వాన్ని చాటునది సాహిత్యం

సమైక్యతకు స్నేహానికి చిరునామా సాహిత్యం

సమాజోద్ధరణకు కావాలి మెరుగైన సాహిత్యం

సంస్కృతి  సంప్రదాయాల నిలయం సాహిత్యం

భావ పటిమల  ఆలోచనా సమాహారం సాహిత్యం

నవ జీవన చైతన్య మార్గదర్శి సాహిత్యం

ప్రజాజీవన నందన వనం  సాహిత్యం

09/10/20, 9:00 am - +91 98679 29589: *సప్తవర్ణముల సింగిడి*

 *శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం, ఏడుపాయల* 

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశం: *ఐచ్ఛిక రచన: *

*శీర్షిక: జాగరుకతయే రామరక్ష*

*ప్రక్రియ: వచన కవిత*

*నిర్వహణ: ల్యాదాల గాయత్రి గారు, హరిరమణ గారు, మరియు గంగ్వార్ కవిత కులకర్ణి గారు*

*తేదీ 09/10/2020*

*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట* 

*e-mail: shakiljafari@gmail.com

           9867929589


"""""''"""""'"""'"""""'''''''"'"''''''''''''''""""""""""""""''''''''""""


చావు, బ్రతుకుల రణరంగములో అప్రమత్తత నిషిద్ధము...


జాగరుకతయే రామరక్ష ఇదే ప్రపంచ ఇతిహాసము...


మేల్కోవాలి కాపాడుకోవడానికి ఈ జగత్తులో మన అస్తిత్వాన్ని...


మన పిల్లల మెదల్లో నాటుకుపోతున్న శత్రువుల పథకాలను పరిశీలించాలి ఫలించక ముందే...


వ్యసనాల రాక్షస పంజానుండి యువ తరాన్ని విడిపించి రక్షించుకోవాలి...


కూలగొట్టాలి శాపిత కుల - మతాల గోడల్ని 'వసుధైవ కుటుంబకపు' అఘాతంతో... 


జత పర్చుకున్న ఇతిహాసపు అనుభవ పుటాల్ని మరోసారి తిరిగి వేయాలి మన దేశాన్ని బానిస సంకెళ్ళనుండి కాపాడటానికి...


శ్వాసించే రక్త మాంసపు ప్రతి శరీరములో గుండె నిండా నింపాలి దేశప్రేమపు ఊపిరి, మానవత్వపు ప్రాణవాయువు...


*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ* 

   *మంచర్, పూణే, మహారాష్ట*

09/10/20, 9:01 am - +91 94911 12108: మల్లినాధసూరికళాపీఠంYP

అమరకులదృశ్యకవిచక్రవర్తి గారు

అంశము... ఐచ్ఛికము

నిర్వహణ....కవిత్రయము

శీర్షిక... వనదుర్గ

రచన...పల్లప్రోలు విజయరామిరెడ్డి

ప్రక్రియ... పద్యము



కన్నులారనిన్ను గాంచికొలుతునమ్మ

నిన్నువదలిబ్రదుకు నిలువలేదు

కామితార్థదాయి కన్నబిడ్డలవోలె

దయనుజూపుతల్లి ధాత్రియందు !! 


పావన సుందరరూపా!

సేవలు మాచేత నందు చిన్మయరూపా

భావింపగ జీవంబుల

గావగనిల వెలసినావు గౌరీ!జననీ !!


కన్నులారనిన్ను గాంచికొలుతునమ్మ

నిన్నువదలిబ్రదుకు నిలువలేదు

కామితార్థదాయి కన్నబిడ్డలవోలె

దయనుజూపుతల్లి ధాత్రియందు !! 


వివిధపుష్పమాలాలంకృత వరదాయి

సుజనసుమనవిహారిణి సుందరాక్షి

శోభనాంగి, సుస్మితముఖీ,శూలపాణి

నిత్యనూతనరూపిణీ నిన్నుగొలుతు !!


అభయహస్తదాయి శుభకరీశర్వాణి

వేదసార కలిత వేదమాత

సామవేదగాన సంచరితాత్మిక

సుకవికీర్తితాత్మ శుభములిమ్ము !!


       

శ్వేతవర్ణశోభ మాతరో దుర్గమ్మ

యీతిబాధలడచయిలనువెలసె

నేడుపాయలందు నెల్లరగావగ

భయముదొలగజేసి జయమునొసగు!!

               🙏🙏🙏

09/10/20, 9:52 am - Bakka Babu Rao: సప్తవర్ణాల సింగిడి

మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం....ఐచ్చికం

నిర్వాహణ   మాతా త్రయం

రచన ...బక్కబాబురావు

ప్రక్రియ ....వచనకవిత



మళ్లినాథుని కళాపీఠము

మహామహులకు నిలయము

సాహితీ మహా విద్యాలయము

మెదస్సును పెంచే ఆలయము


అమరకుల దృశ్యకవి ఆత్మీయత

అనుభవాన్ని పెంచే గురువర్యులు

సమూహము మహాసాగరమై

సాహితీ భేరి నిత్యం మ్రోగించే


సప్త వర్ణాల సింగిడి యై

సప్త ప్రక్రియలను మూలమై

సాహితీ సేవలో సాటి లేరేవరు

అద్భుతమే సృష్టించే అమరకుల


సోదరి మణుల ఆత్మీయత

సోదరుల సహృదయత

నిరంతరం కోన సాగుతున్నది

కొలిచెలిమే మళ్ళీ నాథ కళా పీటమై


మహామహోపద్యాయ కళాపీఠమై

మహా సాహితీ యజ్ఞం తో

సమసమాజానికి అండగా

చైతన్య స్ఫూర్తి నింపుతుంది


ప్రోత్సవాహ బలము దృఢ సంకల్పమై

కొనసాగుతుంది నిరంతరం

గమ్యానికి దారి చూపుతూ

ఏడు పాయల దుర్గమ్మదీవెనలతో


చల్లగచూసే మాయమ్మ

ఆశీస్సులీయగా రావమ్మా

సంకల్పాన్ని నెరవేర్చగా

సమూహాన్ని దీవించగా



బక్కబాబురావు

09/10/20, 10:05 am - +91 97040 78022: <Media omitted>

09/10/20, 10:09 am - +91 96185 97139: మల్లి నాథ సూరి కళాపీఠము 

ఏడుపాయల సప్త వర్ణాల సింగిడి 

నిర్వహణ :శ్రీ మతి ల్యాదల గాయత్రి గారు, శ్రీ మతి హరి రమణ గారు శ్రీమతి గంగ్వార్ కవిత కులకర్ణీ గారు. 

రచన: డిల్లి విజయకుమార్ శర్మ 

*************************

అమ్మ ముగ్గురమ్మల పూలపుటమ్మ

నీ సకల దేవీ దేవతా స్వరుపినివి

నాడు త్రిమూర్తులు" నీ భయంకరమైన రూపాన్ని

చూడ లేక పోయినారు "అమ్మ"

నీవు లేక జగతి లేదు. 

నాడు త్రిమూర్తుల ఆయుధాలచే"

త్రి మాతల శక్తి చేత 

మహిశాసురుని సంహరించి

నావు "ఆ  లోక కఠకుని

యమపురి"కంపినావు

లోకంలో దశ రూపాలు గా

ధరణి యందు వెలసి నిత్యం

పూజ లందు కొంటునావు.

ఆది శక్తి గా  భరతఖండాన"

వివినామాలతో విరాజిల్లు"

తున్నావు.అమ్మ"

అమ్మ "శారదా"మాతగా

అఖండ" పూజ లందు కుంటున్నావు"

నాడు "రక్త బీజుని"

అంతం చేసినట్టు గా

నేటి "కరోనా రక్కసిని"

పారద్రోలి" సర్వమానవాళికి"

శాంతిని "ప్రసాదించు తల్లీ"

09/10/20, 10:20 am - +91 73493 92037: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగడి

అంశం : ఇచ్చికాశం

నిర్వాహణ :ల్యాద్యాల గాయాత్రిగారు,హరిరమణగారు,దృశ్య కవిగారు.

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

        దొంగ కలలు

      -------------------

కన్నెపిల్ల మనసు కలలు

హరివిల్లుల వింపచి విరులు

మదిలో రేపు మధురభావాల సవ్వడులు

గుడిగంటల దివ్యస్వర తీపి కోరికల కలలు

పట్టుకుచ్చుల పల్లకి మ్రోతలు

చెలికాడి చిరునవ్వుల సరసాలు

నిదురపోని వెన్నెల పున్నమి గిలికింతలు

వయ్యారి భామ సయ్యటల ఒయ్యాటలు

కలవరింతలు పులకరించు వయసు కలలు

కన్నెవయసు వరించి తపించు సెగలు లేపు

ప్రేమపాఠాలు నేర్పు కవితామృతాలు

ఎంతో అందమైన నీరెండలు విరబూసిన

ఎండమావులు దుంపత్రెంచు ముందుముందు

అన్నిటికన్నా అందరికన్నా యోవనాన్ని

అవధులు లేని వాడి వేడిగాజేసి వేధించు

కమ్మనిభావలు మురిపించి    కొంపకూల్చు కల్లలు

బుసలుకొట్టు పనికిరాని బురద పాములు

నమ్మకుమా!వాటికి బలికాకుమా ఓ....నేస్తమా!

09/10/20, 10:24 am - +1 (737) 205-9936: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల...

9/10/2020

*పేరు. డా.చీదెళ్ళ సీతాలక్ష్మి*

అంశం ..ఐచ్ఛికాంశము

నిర్వహణ..1.ల్యాదాల గాయత్రీ        దేవి గారు

2.హరి రమణ గారు

3.గంగ్వార్కర్ కవిత గారు.

శీర్షిక..


*కవితాశీర్షిక..ఆచారమే ఆభరణం*


*ప్రక్రియ..పద్యం*


-----------------------


ఆ.వె

పవిత్ర ఆయుధమ్ము పరమాత్మకును నేడు

గుంపులుగును ఉన్న ముంపు వచ్చు

ఇల్లు వీడి రాగ ఇంగితమెరుగక

కాల సర్ప మయ్యి కాటు వేయు!!


ఆ.వె..

పెద్ద వారు చెప్ప పెడచెవి పెట్టకు

కాళ్ళు చేతులెపుడు కడగమనుచు

ఇంటి తిండి తినగ నికట్టులుండవు

తుంపరపడకుండ తుండు పెట్టు!!


ఆ.వె..

సంస్కరణలు చేయ సంస్కారమును తగ్గె

ఆదరణయు శుద్ధ ఆభరణము

కొత్త దనము ఎంత కోరుకున్నను గాని

పాత యెపుడు కూడ రోత కాదు!!


ఆ.వె.

స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమాయెను నీరు

ప్రకృతి వేసె శిక్ష ప్రగతి కోర

చేతులెత్తి మొక్కు చేరదది కరోన

శుభ్రముగను ఉండి చూఫు మనిషి!!

09/10/20, 10:27 am - +91 98662 03795: 🚩మల్లినాధసూరి‌కళాపీఠం ఏడుపాయల🙏 🌈సప్తవర్ణాల సింగిడి 🌈🙏

ప్రక్రియ-ఐచ్చికం

పేరుఃభరద్వాజ

ఊరు-కొత్తపట్నం

నిర్వహణ-గాయత్రి గారు

అంశం-ప్రకృతివ్యవసాయం -మనజీవనం 

శీర్షిక- *అంతకంటే* *ఏమికావాలి* 🌹

భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

9866203795

ప్రకాశంజిల్లా 

నేలను నమ్ముకున్నవాడు రైతు 

వ్యవసాయం అతని జీవనం-

లాభనష్టాలు తోబీరీజు వేసే పనికి అతడు దూరం -

కాలం కదలికలు ,ఋతువుల ఆగమనాలు తో -

తనకు ప్రకృతి నేర్పిన విద్యను -

అసంకల్పితంగా చేయటం లక్ష్యం-

అరఎకరాయినా వందెకరాలున్నా సమానమే అతడికి -

చూసుకోవటంలో తేడారాదెప్పటికీ- 

ఎరువులను దూరంగాపెట్టి -

పురుగుమందులువాడకుండా -

కలుపు తీయకుండా కత్రి రింపులేకుండా  -

ఆధునీకయంత్రాలు వాడకుండా -

సేంద్రీయాయెరువులే   వేస్తూ -

తీరికపాటున చేసే వ్యవసాయం -

రైతుల కెంతో చేస్తుంది సాయం -

 జపనీస్ రైతు,తత్వవేత్త అయిన మసనోబుఫుకువచ్చిన ఒకఆలోచన 

 ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం ఇది -

"సహజ వ్యవసాయ విధానం"అనిపిలవబడే ఇది -

రైతులకెంతో తీరికయిస్తుంది మరి 

ప్రకృతి వ్యవసాయం చేసి నాడు  పోతన -

కాపుబిడ్డ పుస్తకం రాసిన రైతుబిడ్డ సాయిరెడ్డి -

రైతులపాలిట కల్పవృక్షాలు విజ్ఞానదర్శకాలు -

పురుగుమందులువాడే రీతులకు జీవంపోసి -

ఊపిరాడనీ రైతుకు విశ్రాంతి నిచ్చి- 

పోషకవిలువలున్న పంటలతో జనారోగ్యాలుపెంచే -

ఈవ్యవసాయం అందరికి ఆమోదయోగ్యం -

సదాహర్షనీయం కదా ...!

ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల🖊️

09/10/20, 10:51 am - +91 93984 24819: మళ్లినాథసూరి కళాపీఠం YP,

సప్తవర్ణాల సింగిడి,

ఐచ్చికాంశం -స్వేచ్చాకవిత్వం,

2వ,కవిత:తపాలా దినోత్సవం,

పేరు:రాజుపేట రామబ్రహ్మం,

ఫోన్ నం:9398424819,

నిర్వాహకులు: శ్రీమతులు

                       గాయత్రి గారు,

                       హరి రమణగారు,

                       కవిత గారు.

                    -----------

గొంతు దాటిందాకా కుమ్మేస్తివి

నోరొక్కటే ఉందని మింగేస్తివి

జీర్ణమవొద్దని అన్నీ వదిలేస్తివి

పోస్టుమ్యాన్ భారం పెంచేస్తివి

ఇల్లిల్లు తిరిగేలా పని చెప్తివి

చదివేపనికూడా తనదేనంటివి

సైకిలొక్కటే నీకు తోడుందటివి

ప్రమోషనేదీ రాదు పొమ్మంటివి

నువ్వేమో కదలక కూర్చుంటివి

నీ వద్దకే అందరినిలా రప్పిస్తివి

ఖాళీ కడుపైనా కిమ్మనకుంటివి

రోజంతా నోరు తెరిచే ఉంటివి

ఉన్నవి భద్రంగ దాచుకుంటివి

బంధాలు కలిసే కృషి చేస్తుంటివి

జన్మదినం నీక్కూడా ఉందంటివి

జాబులే తప్ప కానుకలొద్దంటివి

అందుకే తీపిగుర్తులే అందుకుంటివి.

09/10/20, 10:54 am - +91 98492 43908: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల

బి.సుధాకర్ , సిద్దిపేట


శీర్షిక.. త్యాగ శీలి 


తల్లి ఋణం తీర్చుకునే

తనయునిగా ముందుండు

సరిహద్దుల రక్షణకై ప్రాణాలను

లెక్కచేయక శతృవును పారదోలు


విశ్వాసపు కవచంతో

వీరుడై ముందడగువేయు

ధైర్యాన్ని అస్త్రంగా మలచుకొని

శతృవు గుండెల్లో నిదురపోవు


కన్నవారు, ఉన్న ఊరు అన్ని వదిలి

దేశమాత రక్షణకై త్యాగముతో

మృత్యువుకే  సవాలై నిలబడి

సమరభూమిలో శంఖమూదు


మంచుకొండలైనా లెక్కచేయక

ముంచుకొస్తున్న మరణాన్ని

కంటిచూపుతో కంచెవేసి

ఊపిరినే బంకును చేసుకొను నిలబడు


నీతికి నిలువుటద్దము జవాను

అవినీతికి రగిలిపోయే అగ్నిపర్వతము

మౌనానికి తపోధనులై దేశమాతను

తలచుకొంటు తనువునే అర్పించే 

అమరజీవి సైనికుడు.

09/10/20, 10:55 am - +91 99631 30856: <Media omitted>

09/10/20, 10:55 am - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*స్వేచ్ఛా కవిత_(ఇష్ట కవిత)*

*నిర్వహణ:శ్రీమతి ల్యాధాల గాయత్రి గారు &శ్రీమతి కవిత గంగ్వార్ కర్ గారు& శ్రీమతి హరి రమణ గారు*

*శీర్షిక:కలము_కాలము*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


    *కలము_కాలము*


కలము_కాలము ఆగవు

మదిలోని భావాలతో సాగే కలము

ప్రకృతి ఒడిలో_సృష్టిలో సాగే

కాలము

ఆగమన్న ఆగవు

హృది సమంద్రపు బొట్టు

సిరా చుక్క గా మారి

కవన మౌతుంది

కన్నీటి ధా రాలు చెక్కిలి నీ

స్పృశించి అక్షర రూపం దాల్చి

కవన మౌతుంది

హృదిలోని ఘోష,

శోష గా మారి పాళీ నుండి

జాలు వారిన విశిష్ట అక్షర కేళి

మృదు మధుర భావనల

హోలి

సుషు మ్న ము నుండి జాగృతావ స్థలోకి కదిలిన జ్ఞాపకాల దొంతరలు 

నా కవితకు ఆకార మయ్యాయి

శ్రీకారం చుట్టాలను కున్న 

ప్రతి సారి 

నా కలం కదల నని మొండి కేస్తే

కాలమే కలాన్ని కదిలించింది

ఏంటో ఈ కాలానికి _కలాని కి

ఉన్న అవినావ బంధము

హృదయ కుహరం లో దాగిన

భావ సంపద అంతా ఇంతా

కాదు ,

అనంతము

అద్భుత రచనలకు సహకరించిన కాలానికి

కలము ఉత్తేజముతో_ఉల్లాసము తో

ఉత్సాహముతో ఉరకలు వేస్తుం ది,

భావ స్ఫురణకు అమోఘ అవకాశము వచ్చింది

భావ అభివ్యక్తి కరణ కు

ఓ రూపం అక్షర విన్యాసం చేస్తుంది,

శబ్ద సొగసు తో సౌ గం ధి క,

సౌమ్య సౌరభం సమీరం తో

పయనిస్తోంది

మస్తిష్కం లో నీ తలపులకు

తరుణం ఆసన్న మైంది

ఆమని కోయిల అయి

ఆవేదనలో నాద స్వరం 

సరిగమలు పలుకుతోంది

పదముల పద నిసలు

గుసగుస లై గుండె గూటిలో గువ్వల సవ్వడి చేస్తుంటే

నా కలము లోని అక్షర గుబాళింపు విహంగ యా నం

చేయాలని పరి తపిస్తోంది,

ప్రభాత ఉషస్సు తో 

నాలో ఏదో తెలియని తమస్సు

దూరమైన భావన కలుగుతుంది,

కలము _కాలము అన్ని టికి

జవాబు దారి అని అర్థం అయింది,

సుతి మెత్తని సుకుమార అక్షరము

అస్త్రమై అందరినీ మేల్కొలుపు

తుంది,

సమాజానికి సమాధానము అవుతుంది,

సానుకూలతకు,సామరస్యానికి

సరైన బాట వేస్తుంది,

కరములోని కలము కాలము ను అనుణయి స్తూ సాగుతుంది,

విధి రాత రాయ డా నికో

నుదుటి రాత మార్చడాని కో

కాలము తో కదిలిన కలము

కవన మై నన్ను పావనము

చేస్తుంది.

09/10/20, 10:58 am - +91 92471 70800 left

09/10/20, 11:30 am - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ వచన కవిత

అంశం స్వేచ్చా కవితాంశము 

నిర్వహణ శ్రీమతి లాద్యాల గాయిత్రి  గారు,శ్రీ హరి రమణ గారు

శీర్షిక  సంపూర్ణ ఆహారం గుడ్డు

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 09.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 56


మనిషికి సంపూర్ణ ఆహారం గుడ్డు

రోజుకో గుడ్డు తిని,ఆరోగ్యాన్ని పెంచుకోవాలి

పసిపిల్లలకు ఉడకబెట్టిన గుడ్డు రోజు కొకటి ఇవ్వండి 

పిల్లల బుద్దిని  మెండుగా పెంచండి

కండ బలానికి టానిక్ గుడ్డు

గుండె బలానికి గమ్మత్తు అయిన ఔషధం గుడ్డు

గర్భిణీలందరూ నవమాసాలు గుడ్డుని తినండి

ఆరోగ్యమైనటువంటి నవజాతశిశువుకు జన్మనివ్వండి

బాలింతలయిన తల్లులందరూ గుడ్డును తినండి

అమృతము వంటి పాలను బిడ్డకి అందివ్వండి

వృద్ధులకు రోజుకో గుడ్డుని తినిపించండి

ఎముకల పటుత్వాన్ని పెంచండి

అన్ని వయస్సుల వారికి ఆరోగ్యాన్నిచ్చే అమృతపు ఆహారం గుడ్డు

మందుబాబులకు నoచుకోవడానికి కావాలి గుడ్డు

ఎగ్ బజ్జీలు మన ఇంట్లో బుజ్జిగాళ్లకు ఇష్టము

నోరూరించే ఎగ్ నూడిల్స్ నరులు లొట్టలేసుకు తింటారు

క్షణాల్లో నోటికి రుచినిచ్చు ఆమ్లెట్ ని లొట్టలేసుకు తినరా జనులు

పొద్దుపొద్దున్న బ్రెడ్ తో గుడ్డు బాలలకి ఇష్టము

ఎగ్ రోల్స్ ని తిను యవ్వనముగా ఉండు

పోషకాల గనిర మన గుడ్డు

విటమిన్ల సొత్తురా మన గుడ్డు

గుండెకి భద్రము గుడ్డు

గుడ్డుని రోజూ తినండి హాస్పటల్ కి దూరముగా ఉండండి

సమస్యలు రానివ్వని సమతుల ఆహారము గుడ్డు

09/10/20, 11:47 am - +91 94413 57400: అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారూ


నవనవోన్మేష శాలినీ ప్రతిభామతా అన్నట్లు కొత్త కొత్త 

ఆలంకారిక ప్రయోగాలతో

కవిత వర్ణనీయంగా అల్లారు


ఖర్జూరం నాగజెముడూ 

ఎంత ఆరోగ్య కరమో 


హృదయ వీణాతంత్రులు గరికలై వేళ్ళు వేస్తాయి

శరీర ధర్మశాస్త్రము ఇందులో 

ఇమిడ్చారు 

పుపుస ధమనులు నీరింకెడి నదీపాయలు 

చక్కగా ఇందులో దృష్టాంతము అలంకార యుతంగా 

వెనువెంటనే సిరలను గడ్డి తుప్పలతో పోల్చి  బింబ ప్రతిబింబం సాదృశ్యం కలిగించారు


డా నాయకంటి నరసింహ శర్మ

09/10/20, 12:00 pm - +91 91006 34635: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి అమర కుల గారు

అంశము, స్వెచ్చాకవిత

నిర్వహన, లాద్యాలా గాయత్రి, హరి రమణ,కవిత,గా ర్లు

శీర్షిక, జీవన పోరాటం, (నాప్రాణమే)

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 9అక్టోబర్్2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------



బాలక్రీడల వయసులో బాలునిగన్నావు 

ఇల్లాలిగామారి ఇల్లుదిద్ది నావూ


పతిసహవాసంపరిపూర్ణ మొందక

పద్దెనిమిదో ఏటపసుపు కుంకాలు బాసి

యవ్వనపొంగు నెడమార్చి

పవిటపై దోపినువ్వుకాశల్లు బూసి



పుట్టిల్లు జేరిపూనికతోజేరి

 పుడమి సేవనమే జీవనమని

అన్నదమ్ములుతల్లి నీతోడు నిలువ

సంసారపగ్గాన్నిసమర్దతతోపట్టి



సోదరికి జీవనదరివయ్యి

తనుగన్న పిల్లలకు తల్లి వైనావు 

పరిధి ఎరుగని సేవ 

పరి పరి విధముల ప్రభవించినావు



ఇరుగుపొరుగు కూడా 

ఇంగువ తీరయి తలలో నాలుకలామసలినావు

పరుల పంచను వీడి

పతి గొన్న

భూమి సుతుతోడచేరి 



ఆడిపాడిన అమ్మమ్మగారి ఊరులో 

ఓర్మితోనిల్చి కష్ఠా లొడిచి పట్టి

కాణాచి వై కరుణగలిగి

ఆసాములసాకే భూసామివై

అలరారినావు

బేల తనమునకేనీవు 

ధైర్య స్పూ ర్తివైనావు



**నానమ్మ కు అంకితం**

09/10/20, 12:02 pm - +91 86886 20478: మల్లినాథసూరికళా పీఠం

అమరకుల దృశ్యకవి సారధ్యంలో

అంశం. స్వేచ్చా కవితాంశం

శీర్షిక: ధరణిఘోష

నిర్వహణా : శ్రీమతి ల్యాదల గాయత్రి

హరిరమణ గార్లు

పేరు: బాస మంజుల

ఊరు: మెట్ పల్లి



అవని పై అణువంత ఖాళీలేకుండా

జనాభా విస్పోటనం జరుగుతుంటే

దేశాభివృద్ధికి ఆటంకం

ఆహారధాన్య కొరత, పేదరికం, నిరుద్యోగం, 

ఉండనీడ కరువై, వసతులు లేక

బ్రతుకే పోరాటమయి

మనిషిమనుగడే ప్రశ్నార్ధక మవుతోంది

మనిషి స్వార్ధంతో

ఆకాశహార్మ్యాల నిర్మితి కొరకై

చెట్టుపుట్ట చదునుజేసి

కాంక్రిట్జంగిల్ గా మార్చి

జంతు,పక్షి జాతులఉనికే నిర్వర్యం చేస్తే

ప్రకృతి ప్రకోపించి కరోనాలాంటి జబ్బులతో

వినాశం సృష్టిస్తోంది.

అందుకే

ప్రకృతిని సంరక్షిస్తూ,

అధిక జనాభానరికట్టి

పరిమిత

 వనరులుపయోగించి ధరిత్రి ఘోష తగ్గించి

సుఖమయ జీవనయానం కొనసాగించు......

09/10/20, 12:43 pm - +91 6304 728 329: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి గారి సారథ్యంలో..

09/10/2020

అంశం; స్వేచ్ఛా కవిత్వం 

నిర్వహణ: శ్రీమతి ల్యాదల గాయత్రి గారు 

               శ్రీమతి హరిరమణ గారు 

               శ్రీమతి గంగ్వార్ కవితా కులకర్ణి గారు 


శీర్షిక: " మానవ కులం "


కులం కులం అంటారు

కూరిమి విడదీస్తారు

కులాల కుత్సితాలను

మతాల మౌఢ్యాలను

చొరనీకు నీ జీవితంలో

కులతత్వం అంటారు

కొట్లాటలు పెంచుతారు

మతతత్వం అంటారు

మారణ హోమం చేస్తారు

రాజకీయ నాయకులే

రాబందులవులయినప్పుడు

కులం విలువ పెరిగిపోయి

కూలిపోవు రాజ్యమంత

కులతత్వం పడగనీడ

కుత్సితులు సేదదీరి

సమాజాన్ని విడదీసి

సమాధులే కడుతున్నారు

అంతా ఒకటే కులమని

మంచికి కాముకులమని

అందరము భావుకులమని

మాదంతా మానవకులమని

తలచినంతలోనే

మానవత్వమే పరిఢవిల్లును

మానవుడే మహనీయుడగును...


       మల్లెఖేడి రామోజీ 

       అచ్చంపేట

       6304728329

09/10/20, 12:51 pm - Velide Prasad Sharma: అంశం:అమ్మతనం

నిర్వహణ:ల్యాదల్ల గాయత్రి గారు..హరిరమణ గారుకవిత గంగ్వార్ గారు

రచన:వెలిదె ప్రసాదశర్మ

(ఆటవెలది ఆశు పద్యాల మాల)

ఆ.వె.

పుట్టినంత పడును పుట్టెడు కష్టాలె

యాడుపిల్లయనిరి యకట యంచు!

కొడుకు లేక పోయె కుదురుక నాకింక

కర్మ కర్మ యనుట కాంచుమయ్య!

ఆ.వె.

కొడుకు పైన ప్రేమ కూర్చుచు నంతనే

యాడపిల్ల నెవరునడుగ బోరె!

పైసలడిగినంత పట్టితిట్టుదురయ్య

పాప మనెడి వారు పలుక లేరె!


ముద్దు ముచ్చటలిక మురిపెములు లేవయ్యె

ముదిత బతుకు నందు ముదము లేదె!

చిరుత ప్రాయమందె చిట్టిది యింటిలో

పనుల జేయు చుండు పడును పాట్లు!


చదువు లంత మాత్ర మందును సతతమ్ము

చారు సుగుణ శీలి చతుర మతియె!

కష్టకడలి నీదు కమ్మదనమునింపి

తల్లిదండ్రి మదిన తనరు చుండు!


పెళ్ళి చేయునంత ప్రీతిగ యచ్చోట

కష్ట పడుచు నుండు కమిలి పోయి!

భర్త యత్తమామ భవ్యంపుటింటిలో

దీపమిడునె యెపుడు దివ్యముగను!


తనదు జీవితంబు తనరెడి యపురూప

సంతు కొరకు చూచు సర్వముడిగి!

అన్ని మరచి పోయియద్భుత సంతునే

చూచి సంతసించు చుక్కవోలె!


అమ్మతనములోని యనురాగ బంధమున్

తెలియు తల్లియైన తీయగాను!

కష్టమంత మరచి కమనీయతను పంచు

అమ్మ తనమె మిన్న యనెదరంత!


అమ్మ తనము కొరకె యంతటి పాటులున్

పడిన లలన బ్రతుకు పావనంబు!

మనసు నందు ప్రేమ మాన్యమై యొప్పగన్

మాతృమూర్తి యార్థి మహిన నిలిచె!

09/10/20, 12:54 pm - +91 93014 21243: మల్లినధా సూరి కళా పీఠం

ఏడుపాయల

అంశం - ఇష్టకవిత

నిర్వాహకులు - అమరకుల దృశ్య కవిగారు

రచన - తెలికిచర్ల విజయలక్ష్మి

తేదీ - 9-10-2020


అమ్మ కాబట్టి...


అమ్మ అమృత మూర్తి దయామయి, అమ్మ కను సన్నలలో పెరిగి పెద్దయిన పిల్లలు


మంచి చదువులు, పిల్లలు, మనవలు ఆనందంగా  వున్నారు అంతా


పిల్లలు చిన్నవాళ్ళప్పుడు ఏ అవసరం పడినా అమ్మని పిలుచుకొనే వారు

 

మనవలని పిల్లల కన్నా గారాబంగా పెంచింది అమ్మ


మనవరాలికి చిన్న నొప్పి వస్తె విల విల లాడింది

మనవడి కాలికి ఎదురుదెబ్బ తగిలితే కంగారు పడింది


వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు కలిగినంత లో చీర సారే పెట్టి పంపింది


మనవలు పెద్దయ్యేరు బోసినవ్వులతో మనవలు పెళ్లిళ్లు చూసింది

మనవలకి పిల్లలు పుడితే మురిసిపోయింది


ఇన్ని సంతోషాలతో తన ఆరోగ్యం క్షీణిస్తోంది అన్న సంగతి గుర్తువచ్చింది


అమ్మా నా అవసరానికి రండమ్మా, అని ఫోన్ లు చేసింది అందరికీ


అలాగే అమ్మా వీలు చూసుకొని వస్తామని ఒకరు, 

కొంచం నిదానంగా వస్తామని  మరొకరు,


ఏమి కాదు ధైర్యం గా వుండమని అందరూ కలిసి చెప్పేరు ఫోన్ లోనే


అలా నెలలు గడిచేయి వాళ్ళు అమ్మ దగ్గరకు వెళ్లనే లేదు


అమ్మ అనంత లోకాలకు వెళ్లిపోయింది వాళ్ళని ఈ పిచ్చి తల్లి క్షమిస్తుందా? 


క్షమిస్తుంది తప్పకుండా! ఎందుకంటే అమ్మ కాబట్టి.

09/10/20, 1:09 pm - +91 94412 07947: 9441207947

మల్లినాథసూరి కళా పీఠం YP 

శుక్రవారం 9.10.2020

అంశం. ఐచ్చికాంశం 

           రోడ్డు ప్రమాదాలు 

నిర్వహణ.శ్రీమతి గాయత్రీదేవి శ్రీమతి హరిరమణ శ్రీమతి కవిత

               గారలు

=======================

ఆ.వె.    1

సడకు ఎంతగానొ చదునుగాయున్నను

మత్తుమందుదేలి నడుపరాదు

నడుమ బోర్డులున్న నాకేమి కాదులే?

బ్రేకు వేసుకొందు బేషరతుగ 

తే.గీ.    2

పోటినొందక చిత్తాన దాటవలెను

డివయిడరులను పల్టీలు ఢీకొనంగ

ఎందరెందరో మరణాన్ని నొంది నారు

తుదకు వాహనాలెన్నియో తుక్కుగాగ

తే.గీ.    3

బయటవెళ్ళినవారలు భద్రముగను 

తిరిగి వస్తారొ?రారేమి? నెరుగలేము

సడకు సూచిక పాటించి నడుపవలెను

పెను ప్రమాదాల బారియు వీగిపోవు

తే.గీ.    4

వాహనమ్మును నడపాలి పదిలముగను 

వేగమునునింక తగ్గించి వేడుకగను 

నిల్పు వాహనాలింకను నేర్పుతోడ 

తగిన విధమున దాటాలి దారిలోన

తే.గీ.    5

కునుకుయనునది రాకుండ వినుచునుండు

వివిధ పాటల గానమ్ము వీనులలర

నడుమనడుమన తేనీరు తడుపుకుంటు

గమ్య ప్రాంతమ్ము చేరాలి కౌతుకమున

              @@@@@@@@@@@

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

09/10/20, 1:15 pm - +91 94413 57400: నేలవిడిచి బండి నడవదు 

నీళ్ల నొదిలి నావలేనట్లుగా 

ప్రేయసీప్రియుల అవినాభావమైన బంధం 

 హృదయ సంబంధాలు 

ఒకింత శృంగారానికి చేరువలో

ఇల్లూరు వెంకటేష్ గారు ్


డా నాయకంటి నరసింహ శర్మ

09/10/20, 1:19 pm - +91 94940 47938: మల్లినాథ కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమర కుల దృశ్య కవి గారి నేతృత్వంలో

అంశం : ఐచ్చికాశం

నిర్వహణ: శ్రీమతి గాయత్రి దేవి శ్రీమతి హరి రమణ శ్రీమతి కవిత గారు లు

రచన :నెల్లుట్ల సునీత

ఖమ్మం

"""""""""""""""""""""

*పాట: బంగారు బతుకమ్మ*


*పల్లవి:_*


*ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నాడు*

*తెలుగింటి ముంగిట్లో*

 *అందంగా వచ్చింది బతుకమ్మ*

____________________________

*చరణం 1*

___________

అధికార పేరుతో తెలంగాణపండుగ

వేడుక అయి నిలిచింది బతుకమ్మ

సంబురాలన్ని అంబరాన్నంటీ  పడుతులు జరుపుకొను బతుకమ్మ

 

*అనుపల్లవి:_ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నాడు*

________________________________

*చరణం 2*

___________

నవాబు చరితలో ఆకృత్యాలను పెరిగి

తట్టుకోలేక ఆత్మహత్యలు 

జరుగ వారిని తలుచుకుంటూ

అమ్మ బతుకు మంటూ  దీవించ వచ్చింది బతుకమ్మ


*అనుపల్లవి:_ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నాడు*

__________________________

*చరణం:_3*

___________

తొమ్మిది రోజులు తీరొక్క పేరుతో నైవేద్యామిచ్చేరు బతుకమ్మ

 తొమ్మిది రకాల పూలు తెచ్చేరు

 పేర్మి తో  పెర్చేరు బతుకమ్మ అందంగా పెర్చేరు  బతుకమ్మ

తంగేడు తామర గునుగు గుమ్మడి పూలు  చేమంతి బంతుల రంగురంగుల పూలు రమ్యంగా పేర్చే రు బతుకమ్మ

అందంగా పేర్చేరు  బతుకమ్మ


*అనుపల్లవి:_అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నాడు*

______________________________

*చరణం ;_4*

____________

పసుపు గౌరమ్మను కొలిచేరు మగువలు

పట్టు చీరలు కట్టి పడతులం దరు చేరి బంగారు బతుకమ్మ శిరస్సు న మోసేరు

చెరువు దగ్గర చేరి బతుకమ్మ ఆటలు ఆడే రు  బతుకమ్మ

కలుషితమైన నీటి కుంట చెరువులు   ఔషధాల   పూల  నిమజ్జనంము చేయ శుభ్రపరచుదు నీవు బతుకమ్మ

జానపదుల తల్లి బతుకమ్మ

బతుకునిచ్చే తల్లి బతుకమ్మ


==========================

09/10/20, 1:21 pm - +91 80197 36254: 🚩సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి🚩

ప్రక్రియ వచన కవిత

అంశం స్వేచ్చా కవితాంశము 

నిర్వహణ శ్రీమతి లాద్యాల గాయిత్రి  గారు,శ్రీ హరి రమణ గారు

అంశం :ప్రపంచ తపాలా దినోత్సవం 

శీర్షిక :ఆత్మ బంధువు 

పేరు :కె. శైలజా శ్రీనివాస్ 

ఊరు :విజయవాడ 

తేది 09.10.2020

***************

తర తరాలుగా జీవన స్రవంతి తో మమేకం 

స్త్రీ పురుష బేధం లేకుండా చూసిరి మమకారం 

చిన్న పెద్ద తేడా లేకుండయ్యారు అభిమానులు 

"తోక లేని పిట్ట గా అందరికి ఇది సుపరిచితం 

కులాసా కబుర్లకు యిదేకదా సంకేతం 

ప్రపంచ వ్యాప్తంగా సందేశాన్ని సౌకర్యంగా 

పంపించునట్టి పెద్ద దైన యంత్రాంగము... 

నేడుసమాచార రంగంలోవచ్చాయిపెనుమార్పులు  

ఐనాదీనిస్థానం మాత్రం అయ్యింది సుస్థిరం 

పావురాల ద్వారా ప్రారంభమైన దీని ప్రయాణం 

ఈ మెయిల్ లా దూసుకెళుతున్నది నేడు

ఈ వ్యవస్థ కీర్తి దిగంతం.. 

ఉత్తరాలకే కాక పలు సేవల్లోపొందింది ప్రాధాన్యం  

దేశంలోనే అతి పెద్ద వ్యవస్థగాను తోచిన వైనం 

ఉపాధి హామీ పధకంలోనూ దీనికే కలదు ప్రాధాన్యం 

పొదుపు పథకాలకు దీనికిపెట్టింది పేరు 

ఉత్తమ ప్రశంసలతో చూపెచక్కని పని తీరు

రైల్వే టిక్కెట్ల దగ్గర నుండి అనేక దరఖాస్తు 

ఫారాలను అందిస్తున్న ప్రత్యేక మైన వ్యవస్థ 

సుప్రసిద్ధ మైనట్టిది సురక్షితమైనదిఈ వ్యవస్థ 

మనందరి ఆత్మ బంధువు ఈతపాలా వ్యవస్థ... 


కె. శైలజా శ్రీనివాస్ ✍️

09/10/20, 1:27 pm - venky HYD: ధన్యవాదములు

09/10/20, 1:31 pm - +91 98668 99622: మల్లి నాథసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

అమరకుల వారి ఆధ్వర్యంలో

తేది : 09 - 10 - 2020💐

రచన.తౌట రామాంజనేయులు

**********************

దేశభక్తి పద్యాలు

----------

పుణ్య వశము చేత పుట్టితి నీ నేల

మాతృభూమి సేవ మరువలేను

జన్మసార్థకంబు జనహితమ్మున గల్గు

ప్రణుతి జేతు నిన్ను భారతాంబ!


వేదవిద్యలన్ని వెలసినవీనేల

వీరగాథలెన్నొ వినుతి కెక్కె

త్యాగధనుల స్ఫూర్తి తరియింపజేయగ

ప్రణుతి జేతు నిన్ను భారతాంబ!


గీత పుట్టె నిచట, గీర్వాణి నడయాడె

నంధకారమంత నంతరించె

మతములన్ని తెలుపు మానవత్వ మొకటె

ప్రణుతి జేతు నిన్ను భారతాంబ!


రాముడేలినట్టి రసరమ్య రాజ్యమ్ము

ప్రగతి శీలి యతడు ప్రభువుగాను

ధర్మమార్గమొకటె ధరణిని నెలకొల్పె

ప్రణుతి జేతు నిన్ను భారతాంబ !

09/10/20, 2:07 pm - P Gireesh: మల్లి నాథసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

అమరకుల వారి ఆధ్వర్యంలో

తేది : 09 - 10 - 2020💐

రచన. పొట్నూరు గిరీష్

నిర్వహణ: కవయిత్రి త్రయం

అంశం: ఐశ్చిక అంశం

శీర్షిక: హరి దుకాణంలో పసి పిల్లలు

**********************

హరిబాబు కొత్త దుకాణం తెరిచెనంట

గిరిబాబు కి ఆహ్వానమొచ్చెనంట


ఆహ్వాన అంగీకారంతో దుకాణానికి వెళ్లి గణేశుడికి మొదట నమస్కరించి, హరిబాబు ను ఆశీర్వదించి అమ్మా, ఆలికి జడ క్లిప్పులు కొనెనంట.


తిరుగుప్రయాణానికి సిద్దమయ్యేనంట. అక్కడ గిరిని చూసిన పసి హృదయాలు వారి మోములో చిరునవ్వులతో ఎదురొచ్చి మాస్టారు మాస్టారు ఇక్కడేమి ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేసి పలకరించెనంట.


గిరిబాబు సంతోషానికి అవధులు లేవు. ఆ పసి మనసుల సంతోషానికి కారణమేమిటని గిరిబాబు అడగగా జగన్ మామ పుస్తకాలు, బట్టలు, బ్యాగు, బెల్టు, బూట్లు ఇచ్చినాడని చెప్పి చూపి మురిసి  పోయారు. వారి సంతోషాన్ని చూసిన గిరి ఆనందంగా తిరుగు ప్రయాణమై తన ఇంటికి వెడలినాడు.


ఈరోజు ఉదయం జరిగిన సంఘటన ను మీకు తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

09/10/20, 2:09 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశము. ఐచ్చికాంశం 

శీర్షిక.  వాణి నా జీవన బాణి 

సీ.

వాణినాజీవన బాణివై మధురమై 

                 వికసించినందమై పలుకులల్లి 

హృదయమందున నిల్చి హాసిని మంజుల 

                  రాగాలునిల్పిన రాగమయ్యి 

నిత్యపారాయణ నిండుగా నిలిపిన 

                 శారదనారద సకలమయ్యి 

దవళవస్త్ర భరణి దరహాస రూపిణి 

                    కళ్యాణి దాయిని కమలరాణి 

ఆ.

సత్య సూక్తి నిలిపి సంపద నిచ్చిన 

చదువు లోన నిలిచి సద్గుణాంగి 

పదము కొలువు నీవు పద్మజా రాజివై 

కావ్య రాజ్య సుధవు కాంతులిరిసి. 

తే.

సర్వ తేజస్సు నిలిపిన సంబురముగ 

కవిత బిందువు లయ్యెను కాంచినావు 

జగతి ధారలో రమ్యమై జాగృతిచ్చి 

మాట యుక్తివై వెలుగుతూ మనసునింపె. 

ఆ.

మాట లోన యుక్తి మేటిగా నిలిచెను 

మధుర వాక్కు నీవు మంజులముగ 

సర్వ దేవతలకు సుమధుర భావాలు 

కొల్చి నారు తల్లి కొలువు తీర.

09/10/20, 2:15 pm - +91 98497 88108: మల్లినాథసూరి కళాపీఠం,ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అరకుల దృశ్యకవి చక్రవర్తి గారి సారథ్యంలో

నిర్వహణ: శ్రీమతి లాద్యాల గాయత్రి గారు,శ్రీమతి హరిరమణ గౌ,శ్రీమతి కవిత కులకర్ణి గారు

రచన:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం

అంశం:రాత్రి

శీర్షిక: అపురూపం-అవసరం



కనులకు విశ్రాంతి నిస్తూ..

కలలను  ఆహ్వానిస్తూ

అలసిన దేహాలకు

ఉరటనిస్తూ

మనసులను దగ్గరిచేస్తూ

రోజంతా జరిగిన

తప్పొప్పులను బేరీజ్ వేస్తూ

రోజంతా కష్టించిన

డబ్బులు లెక్కలువేస్తూ

మరుసటిరోజు పనులకు

ప్రణాళికలు వేస్తూ

ఆలు, మగల

లాలింపులకు,తాళింపులకు

బుజ్జగింపులకు,బతిమీలాటలకు

స్థానమిస్తూ

నిండు పున్నమి చంద్రుడి వెన్నెల హాయిలో

పురివిప్పిన మయూరంలా విహరిస్తూ

అరవిరిసిన మందారంలా వికసిస్తూ

  మరకలగా

  నలుపు

  మంచిదే

యాంత్రిక జీవనానికి

స్పీడ్ బ్రేక్ వేస్తూ

మనస్సులోని కాసింతైన మకీలీని కడిగేస్తూ

మనుషులను ఏకం చేస్తూ

దూరపు తావులను

దగ్గరిచేస్తూ

బంధాలకు వారదివేస్తూ

సుఖ,సంతోష సాగరాలలో ఓలలాడిస్తూ

సమస్త విశ్వం

మంత్రమేసినట్లు

మౌనం వహిస్తూ

అపురూపమైన దృశ్య కావ్యం

అద్భుతమైన మహా అధ్యాయం

భావాల కుంచెతో

ఎదపై చిత్రించే

స్నిగ్ధముగా నవ్వే..

ముగ్ధ కావ్యం..రాత్రి

శుభరాత్రి..సుందరరాత్రి...!!!



🌷🌷🌷🌷🌷🌷

09/10/20, 2:28 pm - +91 94400 00427: *చిన్న సవరణను గమనింప మనవి*


శిలలు ద్రవించి యేడ్చినవి

   జీర్ణము లైనవి తుంగభద్ర లో

పలిగుడి గోపురమ్ములు స-

   భాస్థలు లైనవి కొండమ్రుచ్చు గుం-

పులకుచ రిత్రలో మునిగి

  పోయిన దాంధ్ర వసుంధరాధిపో-

జ్జ్వల విజయ ప్రతాభ రభ-

  సంబొక స్వప్న కథా విశేషమై


*పై పద్యము "హంపీ క్షేత్రము" -  కావ్యము* లోనిది. గ్రంథకర్తలు కీ.శే. కొడాలి వేంకట సుబ్బారావు గారు& కామరాజుగడ్డ శివయోగానంద రావు గారలు.( శేష శాస్త్రిగారు కాదని మనవి)🙏🙏శేషకుమార్👇👇

09/10/20, 2:28 pm - +91 94400 00427: <Media omitted>

09/10/20, 2:28 pm - +91 94400 00427: <Media omitted>

09/10/20, 2:32 pm - +91 98494 54340: మల్లి నాథసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

అమరకుల వారి ఆధ్వర్యంలో

తేది : 09 - 10 - 2020💐

రచన. జ్యోతిరాణి

నిర్వహణ: కవయిత్రి త్రయం

అంశం: ఐశ్చిక అంశం

శీర్షిక: అతడు -- ఆమె

*************************************

🌸 *అతడు-ఆమె* 🌸


ఆమె అక్షరమై అడుగులు వేస్తోంది..


అతడు వాక్యమై 

వెంటపడ్డాడు.

వ్యాసంలా మార్చివేసాడు


తేనె పలుకుల తుంపరలకు,

మనసుపడి మనువాడి


 మెట్టింట అడుగెట్టి

తనువు తాకట్టు పెట్టి

తనను తానే మరిచింది 

ఆమె

 

తానే స్వరమని,సర్వస్వమని

నమ్మిన ఆమెను 


అంతులేని అగాథంలో నెట్టి

అంధకారంతో పూడ్చేసాడు అతను


పుట్టింటి వారు సైతం

గుర్తించలేనంతగా


ఆమె ఐసోలేషన్ లో ఉండి

గుండె గదుల్లో గాలిస్తోంది

కన్నపేగులకై 

అమ్మగా


రెప్ప కింద ఉప్పెన 

ఉప్పొంగుతోంది

 ఉధృతిగా


చీకట్లను చీల్చుకుంట

కోలుకుంది మెల్లగా


వెతలన్నీ మరిచిపోయి

వెలుగుతోంది జ్యోతిగా !!


🌹బ్రహ్మకలం🌹

09/10/20, 2:33 pm - +91 89859 20620: రచన... మల్లారెడ్డి రామకృష్ణ

నిర్వహణ... కవయిత్రి త్రయం

అంశం.. ఐచ్చకం

శీర్షిక... స్వగతం

ఉదయం సంధ్యారా గాన

కోయిల కుహుకుహు రాగాలు

రాగ రంజిత మైన ప్రకృతిని చూసి

పులకించి.. మురిసి.. మైమరిచి

తన్మయత్వంతో విహరిస్తున్న వేళ

పిల్ల తిమ్మెరలు మేనును తాకుతున్న వేళ

ఎదలో నా ప్రేమామయి పలుకులు

చిరుజల్లులు గా తాకుతున్న వేళ

ఎటు చూసినా నా చెలి సౌందర్యం

ప్రకృతిలో మేళవించిన వేళ

ఇంత అందమైన ప్రకృతిలో నా చెలి

నా సరసునుo టె.... సరసమే కదా

అని నా మనసు ఉవ్విళ్ళూరిన వేళ

తాదాత్మ్యం చెందిన నా మది భావాలు

మేఘాల్లో కలిసి నా చెలికి చేరుస్తున్నవేల

నా జీవితమంతా ఉల్లసమే కదా!

నా చెలి చెంతనుంటే నాకు

మధుర క్షణాలే కదా!

09/10/20, 2:34 pm - +91 79818 14784: సప్త వర్ణముల సింగిడి

మల్లినాథ సూరి కళా పీఠంYP

అమరకుల దృశ్యకవి సారధ్యంలో

నిర్వహణ: ల్యాదాల గాయత్రి హరిరమణ గంగ్వార్ కవిత తేది: 9-10-2020

రచన: కట్టెకోల చిన నరసయ్య

ఊరు: బోదులబండ జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

ఐచ్ఛికాంశం: స్వేచ్ఛాకవిత్వం

శీర్షిక: త్రిరాజ్యం!



త్రిమూర్తులు!

లోక కళ్యాణం

లోకానికో మూర్తి!


త్రినేత్రం!

శుభకరం

మూడో కన్ను తెరిస్తే ఉపద్రవం!


త్రిశంకు స్వర్గం!

స్వర్గంపై స్వర్గం

అటు ఇటు కానిదో స్వర్గం?


త్రికాలం!

కాలచక్రం పరుగు

కాలానికో పాలన!


త్రివేణీ సంగమం!

పరుగులతో నదుల కలయిక

సముద్రంలో కలిసేందుకు ఆరాటం


త్రిభుజం!

భుజం భుజం కలయిక

భూమికి ఆధారమైన భుజాలు


త్రిదళాలు!

పాలనా సౌలభ్యం

సైన్యానికో అధిపతి!


త్రిసభ్య కమిటీ!

నలుగుతున్న సమస్యలు

పరిష్కారం కోసం పడిగాపులు?


త్రివర్ణం పతాకం!

జాతీయ జండా

గగనతలంలో

రెపరెపలాడుతున్న భరత జాతి కీర్తి!


మూడు రాజధానులు

రగులుతున్న రాజకీయ రగడ

రాజధానికో ముఖ్యమంత్రి!

09/10/20, 2:37 pm - +91 92472 86668 left

09/10/20, 2:43 pm - +91 94934 35649: మల్లి నాధ సూరి కళా పీఠం yp 

సప్త వర్ణాల సింగిడి. 

అంశం. ఐచ్ఛికము

ప్రక్రియ. వచన కవిత. 

నిర్వహణ. శ్రీమతి లాద్యాల గాయత్రి గారు, శ్రీ హరి రమణ గారు 


పేరు. సి. హెచ్. వెంకట లక్ష్మి 

విజయనగరం. 


శీర్షిక. కుల రక్కసి పొలికేకలు... 



చితికిన ఆశల శిఖరాలపైకి  

ఎగబాకిన అహంకారం 

కల్లు తాగిన కోతిలా 

శివాలెత్తి చిందేస్తుంటే.... 


విరిగిన కెరటాలపై నిలిచిన 

బ్రతుకు నావ నిలవలేక 

బ్రతకడానికి డిస్కోలు చేస్తోంది... 


అసమానతలకు పెద్ద పీట  వేసి 

అసత్య అస్త్రములను సంధిస్తూ 

ప్రగతి గీతికల ఆలాపనలు 

ఎవరికి మాయ చేయటానికో.... 


పరవళ్లు తొక్కుతూ పారుతున్న 

శ్వేదములో కుల రక్కసి 

కొట్టుకుపోతూ పెడుతున్న పోలికేకలు.... వినపడేరోజు 

దగ్గరలోనే వస్తుంది...

09/10/20, 2:47 pm - +91 70130 06795: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల. వారి ఆధ్వర్యంలో

అంశం: స్వేచ్చా కవిత

నిర్వహణ: గాయత్రి గారు కవిత గారు

హరిప్రియ మేడం గార్లు

రచన: వసంతలక్ష్మణ్

నిజామాబాద్


శీర్షిక : భారతీయ వీర వనితలు

~~~~~~~~~~~~~~~


భారతీయ మహిళా  ఋగ్వేద కాలం నుండి అత్యున్నత గౌరవ పీఠిక 

*నాగనిక**శాతవాహనుల సామ్రాజ్యంలో గొప్ప యవనిక

*కుమారదేవి** గుప్తుల పాలనలో మేటి రాజ్యపాలిక

బుందేల్ ఖండ్ ను పాలించిన*దుర్గావతి* 

బహదూర్ షా ను  ఓడించిన *కర్ణావతి*

అరవీర భయంకరి, వీర వనిత

*ఝాన్సి రాణి*

*రాణి రుద్రమ* కాకతీయ సామ్రగ్ని 

*గణపాంబ**మధురను ఏలిన తెలుగు రాణి

*చాంద్ బీబి**భిజాపూర్ రాణి

*నుర్జాహాన్* మొఘల్ రాణి

మరాఠీ రాణి *అహల్య బాయి* 

కచ్ఛర్ మహారాణి* చంద్రప్రభ*

 *రజియాసుల్తానా* ఢిల్లీ రాజ్య పాలిక 

*మంగమ్మ  నాగమ్మ  మాంచాల చానమ్మ*


ఆదునికులలో ఆద్యులు 

భారత మొదటి మహిళా ప్రధాని*ఇందిరాాంధీ*

గానకోకిల *సరోజినీ*

*దుర్గాబాయి దేశ్ ముఖ్*

*జ్యోతిబాయిపూలే*

ఎందరో విరవనితలు అందరికీ వందనాలు.

09/10/20, 2:49 pm - +91 99595 11321: మల్లినాథ సూరి కళాపీఠం, సప్త వర్ణ సింగిడీ, 

అంశం. ఐచ్ఛికాంశం. 

శీర్షిక. భక్తి గీతం, ఓం సాయి... పాహిమాంసాయి, 

నిర్వహణ. అమరకుల దృశ్య కవి గారి ఆథ్వర్యం లో. 

                   ఓం సాయి.. పాహిమాం సాయి 


ఓం సాయి , ఓం సాయి, ఓ షిర్డీ సాయి, 

పాహిమాం సాయి, మా సాయి,  ద్వారకామాయి.. 


తలచిన చాలును ఆర్తి తో నిన్ను, 

దుర్లభ కార్యములు సఫలము లగును, 

కొలిచిన చాలును భక్తి తో నిన్ను, 

ఆదుకొందువు, ఆపదల నుంచి మమ్ము.... 


ముక్తికి నీవే సూత్రధారివి, 

జీవన్ముక్తి కి నీవే సరియగు దారి, 

శక్తికి నీవే ఆధారమూ, 

ఆత్మశక్తి కి నీవే ఆలంబనము....


గురువు దైవం నీవే సాయి, 

తల్లి వి తండ్రి వి నీవే నోయీ. 

బరువు బాధ్యత నీదే సాయి, 

మము దరి చేర్చు సద్గురువు నీవేనోయి...


హామీ. ఇది నా స్వంత రచన, దేనికి అనుకరణ కాదు 

రచన. చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 9959511321.

09/10/20, 2:50 pm - +91 80196 34764: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి

09/10/2020

అంశం; స్వేచ్ఛా కవిత్వం 

నిర్వహణ: శ్రీమతి ల్యాదల గాయత్రి గారు 

శ్రీమతి హరిరమణ గారు 

శ్రీమతి గంగ్వార్ కవితా కులకర్ణి గారు 

మరింగంటి పద్మావతి

భద్రాచలం



బంగరుతల్లి భారతమ్మ

ముద్దుబిడ్డలం.. 

భరతావనిలోభిన్నత్వంలో ఏకత్వమై వెలిగే 

భారతీయులం... 

కులాల గమ్మత్తు లో కొట్టుకునే

నిరుద్యోగ విద్యార్థులం.. 

అగ్రశ్రేణి ఉత్తీర్ణత తో 

అగ్రకుల బాటసారులం... 

రిజర్వేషన్ మత్తులో

ఊగిసలాడి గిరగిరతిరిగే 

బొంగరాలం... 

తినడానికి తిండి లేని

అగ్రజాతి మాది... 

వరుణ, వాయు, సూర్య చంద్ర

నిలయమైన మా గూడు

నిత్యశోభతో వెలుగు.. 

మా జీవితాలు మాత్రమే

అగమ్యగోచరాలు... 

భరతమాతా !నీ బిడ్డలపై 

ఎందుకు ఈ వివక్ష.. 

ప్రతిభాపాటవాలు అందరి

సొత్తు, మరెందుకు?  మమ్ము

అణగద్రొక్కుచున్న ఈ పాలకులు... 

మేము స్వేచ్ఛావిహంగానికేగి

డెబ్బది సంవత్సరములు దాటిననూ  ఇన్ని వర్గబేధములు... 

పేదసాదలపై కరుణ జూపి

నీ బిడ్డలను అక్కున జేర్చుమాతా..

09/10/20, 2:51 pm - +91 94404 74143: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 18, ది: 09.10.2020. శుక్రవారం.

అంశం: ఐచ్చికాంశం

శీర్షిక: స్నేహలత

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు గారు.

కవిపేరు: చిల్క అరుంధతి

నిజామాబాద్


నాలో చిగురించిన స్నేహం తీగలాగ పెనవేసుకుంది

విరి  తేనియలు కురిపిస్తూ మనసును అల్లుకుంది

ఎదలో మమతల మాటున దాగి రాగాలు తీస్తుంది  

గిలిగింతలు పెట్టి జ్ఞాపకాల లోగిలిలో పరుగులు పెట్టింది

ఆత్మీయ భావన కురిపిస్తు ఆలంబన  నిచ్చింది

మమతల రాగాలు  కురిపించి మరులొలికించింది

ఊహలతొ గుసగుసలాడి  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

అలసిన మనసుకు చేయూత నిచ్చి ఊరడిస్తుంది

కలిగిన గుండె గాయాల్ని మాన్పించే మంచి ఔషధ మవుతుంది

కన్న ప్రేమ కన్న మిన్నగా చనువు నిచ్చి కాపడుతుంది

 అందుకే స్నేహానికన్న మిన్న లోకాన లేదని స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం అని జీవిత సత్యాన్ని  ప్రభోదిస్తుంది

09/10/20, 2:56 pm - +91 98660 68240: మళ్లినాథ కళాపీఠం

సప్తవర్ణ సింగిడి

నిర్వహణ గాయత్రి హరి రమణ కవిత గారు

స్వేచ్చా సాహిత్య ము

పద్య ప్రక్రియ

రచన వై.నాగరంగయ్య

తాడిపత్రి


ఆ.వే.

పుట్టి చావ వలెను పుడమి పులకరించ

చితిని చేర్చి నపుడు శివుడు మెచ్చ

మంచి తనము తల్లి మరిమరీ దుఃఖించ

జన్మ ధన్య మౌర జగతి లోన ll


తే.గీ.

భక్తి గల్గిన వారికి భాగ్య లక్ష్మి

ధనము ధాన్యము లిచ్చును ధరణి లోన

విశ్వ శించిన వారికి విజయ ముండు

అట్టి తల్లిని దలచెదన్ ఆర్తి తోన l l


ఆ.వె

బ్రతికి నపుడు నామ భజనలు చేయంగ

చచ్చునపుడు దైవ సాయమందు

పుడమి లోన చాల పుణ్యంబు చేసినా

జన్మ ధన్య మౌను జగతి లోన l l

09/10/20, 3:13 pm - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP 

నిర్వహణ:హరి రమణ లాద్యాలగాయిత్రి, కవిత గార్లు

మినీకవిత

అంశం:ఆన్లైన్ చదువులు

శీర్షిక: తప్పని తిప్పలు

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292


బడి తలుపులు మూతలు

గురువుల గుండెకు తూట్లు

మూలపడినపుస్తకాలమూటలు 

విద్యార్థులకుఅన్లైన్ క్లాసులు

సిగ్నల్ కోసం తిరగని రూట్లు

పేద విద్యార్థులకు అందని ద్రాక్షలు

వినిపించని ఆకలి కేకలు 

ఫీజుకట్టలేకఅగచాట్లు. 

కరోనాపెట్టినకన్నీటిపరీక్షలు

కనికరంలేనిగ్రహపాట్లు

తల్లిదండ్రులకుతీరనివ్యతలు 

తలతాకట్టుపెట్టకతప్పని తిప్పలు.

09/10/20, 3:34 pm - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : ఇష్టకవిత 

శీర్షిక : మహమ్మారి పోవాలి 

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : గాయత్రి హరీరమణ కవిత 


ప్రేమామృత 

బంధుత్వాలు

బలమైన మహమ్మారి

కబంద హస్తాల్లో 

నలిగి పోతున్నాయి 

ఎవరికెవరు ఈ లోకంలో 

కవి వాక్కులకు అద్దం 

పడుతున్నాయి 

మంది మార్బలమున్నా 

అధికారిక అంత్యక్రియల్లా 

అంత్యేష్టి అనాధగా 

మారుతోంది 

ఆనందాన్ని పంచె 

అంతర్జాలం 

ఇంట్లోనే 

స్మశాన వైరాగ్యాన్ని 

పంచుతోంది 

రక్త సంబంధీకులు 

కష్టాల్లో వున్నా 

కనికరాన్ని 

గడపలోపే ఉంచుతోంది 

ఈ రోజు గడిస్తే చాలు 

నేను 

నా కుటుంబం 

బాగుంటే చాలన్న 

స్వార్థాన్ని 

బలీయం చేస్తోంది 

పాపపు రోగం 

ప్రపంచాన్ని 

అతలాకుతలం చేస్తుంటే 

బాంధవ్యం 

బతుకు జీవుడా 

అంటోంది 

బయటి ప్రపంచాన్ని 

చూడక 

గిరి గీసుకున్న జగత్తులో

భారంగా బతుకుతున్న 

బందీకాన జీవితం 

ఇంకెన్నాళ్లో 

పక్కింటోడిని దైర్యంగా 

పలకరించాలేని 

దుర్భర జీవితం 

ఇంకెన్నాళ్లు 

ముసుగుల్లో బంది అయిన

బతుకులు 

స్వేచ్ఛ పొందితినే కదా 

బంధుత్వాలు కలిసేది 

ముసుగు పోవాలంటే 

ఇంకెన్నాళ్లు

చిన్నోళ్ల ఆటపాటలు 

కలలుగా మారిపోతూ 

బడుల గేటులు తాళాలతో నవ్వుతుంటే 

మరిచిపోని బాల్యాన్ని 

మరువకుండా చేసిన 

మహమ్మారి కరాళ నృత్యం 

ఇంకెన్నాళ్లో

మహమ్మారి పోవాలి 

లోక కళ్యాణం జరగాలి


హామీ : నా స్వంత రచన

09/10/20, 3:42 pm - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

శుక్రవారం 09.10.2020

ఇచ్చికాంశం

నిర్వహణ:శ్రీ ల్యాదాల గాయత్రి గారు,హరి రమణ గారు, గంగ్వార్ కవిత గారు.

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*

శీర్షిక:గుడ్డు తో లాభాలు

ప్రక్రియ:మణిపూసలు



గుడ్డును తింటే బలము

శక్తినే పొందగలము

దాంతో ప్రాప్తించును

సంపూర్ణ ఆరోగ్యము


గుడ్డులో ప్రోటీనులు

అందులోని విటమునులు

రోజూ తినటం వల్ల

కలుగు ప్రయోజనాలు


రోజూ గుడ్డు తినండి

ఆరోగ్యం పొందండి

వ్యాధులకు దూరంగా

హాయిగ జీవించండి


ఉడకబెట్టి తినవచ్చు

ఆమ్లెట్టు చేయవచ్చు

గుడ్డును ఎన్నెన్నో

రకాలుగ వండవచ్చు


నూడుల్స్ లో వేసెదరు

బిర్యానీ చేసెదరు

బ్రెడ్, కేకులలో కూడా

గుడ్డులనే వాడెదరు


పిల్లలకు ఇవ్వాలి

పెద్దలకు పెట్టాలి

వయోభేదం లేకుండ

ప్రతిఒక్కరు తినాలి

09/10/20, 3:50 pm - +91 96763 05949: మల్లినాథ సూరి కళాపీఠం

సప్తవర్ణాల సింగిడి


*గంగాపురం శ్రీనివాస్*


నిర్వహణ: అమరకుల, కవిత్రయం


తేదీ: 09.10.2020


అంశం: ఐచ్చికాంశం

""""""""""""""""""""""""""""""""""

*హరిత హారం ( పాట )*

     

""'''''''''''''''"""""""""""'"'''"''"''''""''''''

పల్లవి:

నవ మాసములు మోయకున్నను

నవరస ఫలములు ఇచ్చెదను

పేగు తెంచుకు పుట్టకున్నను

కడుపున బెట్టుకు చూసెదను //నవ//


చరణం: 1

చుట్టు కంచెను కట్టి పెంచిన

ఉయ్యాలలూపి జోకొట్టెదను

పాడి ఎరువును పాదులో వేసిన

పాడెగ మారి మోసెదను. // నవ //


చరణం: 2

కడివెడు నీళ్ళు మరువక పోసిన

కడవరకు మీ తోడుండెదను 

తనివి తీరా తరువులు పెంచిన

కరువును మాయం చేసెదను // నవ //


చరణం: 3

రహదారుల వెంబడి వరుసగ నాటిన

బాటసారులకు హాయి నిచ్చెదను 

బడిలో గుడిలో బాగుగ నాటిన 

ప్రాణవాయువునందించెదను // నవ //


చరణం: 4

హరితహారము నవనికి వేసిన 

అహ్లాదము నేనందించెదను 

ఆయురారోగ్యములను పెంచి

ఆనందము మీకందించెదను // నవ //



                  *...గంగశ్రీ*

         *గంగాపురం శ్రీనివాస్*

                   *సిద్దిపేట*

                9676305949

09/10/20, 3:51 pm - +91 91821 30329: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం!స్వేచ్ఛా కవిత్వం

వచన కవిత! నిద్ర(నిదుర)

నిర్వహణ!శ్రీమతి ల్యాదల

గాయత్రి గారు,హరి రమణ

గారు గంగ్వార్ కవితా కుల

కర్ణి గారు

రచన!జి.రామమోహన్రెడ్డి


మనిషికి "నిదుర " దేవుడిచ్చి

న  ఒక వరం

నిశ్శబ్దంతో కూడిన నిదుర

రోగ నిరోధక శక్తినిపెంపొం

దించు

నిదుర దేహాన్ని అచేతనా స్థి

తికి చేర్చి

సంపూర్ణ ఆయురారోగ్యము

నిచ్చు

నాడీ వ్యవస్థను సజావుగా

వుంచి

రక్తప్రసరణకు తోడ్పాటు నం

దించి

శరీర అలసటను తొలగించు


ఆకలి రుచి ఎరుగదు

నిదుర చోటెరగదు

ఆహారం లేక పోయినా వుం

డవచ్చు

నిదుర లేకుండా ఉండలేం

కడుపుకు తిండి

కంటికి నిదుర వుంటే

అనారోగ్య సమస్యలు దరికి

చేరవు

నిదురే అమ్మలా ఆదరించేది

నిదురే నాన్నలాగా ఓదార్చేది

నిదుర యందే సకలమును మరచి

నిదుర యందు ఒరిగి పోతాం

అలసిన ప్రాణానికి ఆశ్రయం

నిదుర

అరమరికలు లేకుండా అక్కు

న చేర్చు కొనేది నిదుర


కోడి నిద్ర క్షణమైన చాలు

మెదడుకు మేలు జరుగు

కుంభకర్ణుని నిదుర ఆరోగ్య

మునకు హానికరం

ఊర్మిళా దేవి నిదుర ఊబకాయమునకు పునాది

కపట నాటక సూత్ర ధారి నిద్ర కర్తవ్యానికి కంకణం

లాంటిది శుభ సంకేతం

పశుపక్ష్యాదులకు ఉపచమ

నం నిదుర

అమ్మ ఒడిలో ఎంతసుఖమో

గాఢ నిదుర కూడ అంత సుఖం....

09/10/20, 4:02 pm - +91 94404 72254: మల్లినాధసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల  🌈సింగిడి

అమరకులదృశ్యకవిగారి ఆధ్వర్యంలో

ప్రక్రియ: వచన కవిత

నిర్వహణ:

అంశం ....ఐచ్ఛిక కవిత

శీర్షిక..💐ప్రియవచనం💐

*పేరు...వెంకటేశ్వర్లు లింగుట్ల

తేదీ : 09/10/2020


తీయగా మాటలకు కరుగని ఎద ఉంటుందా

తేనెలొలుకు పలుకులే తొలివలపుల

తలపులు తెరచి మైమరచి వేణుగానంలా!


లోతట్టు భావాలకు అనుగుణమై వచించిన

ఆకట్టుకోగల ప్రియవచనాలు ప్రవచనాలై

కనికట్టుమాయ మది ఊయలే జోలపాటలా!


అవకాశవాదుల అంతరాల్లో విషం నింపి

అమృతబిందువుల్లా  చిమ్మి నమ్మించి 

అలవోకగా పబ్బం గడుపుకొనే భజనపాటలా!


అలసిన మనసుకు నాలుగు మాటలతో

అనునయింపు ఆత్మానందాన్ని కలిగించే

అనుబంధాలతో ముడిపడ్డ ప్రేమానురాగంలా!


వినసొంపైన మధురభాషణం మంత్రముగ్ధమే

మనసుకు మనిషికీ అందమైన భూషణమే

తన్మయత్వంతో ఊగిసలాడు విన్న నాగస్వరంలా!


మాట జారితే మనిషికి విలువేముంది

మరలా వెనకకు తీసుకున్నా ఆపని అనర్థమే

శృతిమించని మాట మీటించే వీణియనాదంలా!



వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

09/10/20, 4:05 pm - Trivikrama Sharma: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్తవర్ణాల 

సింగిడి

 నిర్వహణ:  గాయత్రి కవిత హరి రమణ గార్లు

పేరు:.  త్రివిక్రమ శర్మ

ఊరు:.  సిద్దిపేట

శీర్షిక;  గర్భశోకం


**********************

ఉదయపు నడకలో హుషారుగా నడుస్తున్నాను

నా ప్రతి అడుగులో ప్రకృతిని పలకరిస్తూ పులకరిస్తూ

పసిడి వన్నెలతో కోతకొచ్చిన పంటచేలు ఒకవైపు

తెల్ల బంగారాన్ని ఒళ్లంతా సింగారిo చుకొన్న పత్తి చేను మరోవైపు

భూమికి కాపుకాస్తున్నట్టు విరగ కాసిన కందిచేను ఇటువైపు

మధురమైన మామిడి పండ్లను ఇచ్చే మావి పూత మరోవైపు

నా అడుగు అడుగు లో ప్రకృతి సౌందర్యం నా ప్రతి శ్వాస లో ప్రభాత సుమగంధం

ప్రకృతి నాతో కలిసి నడుస్తోందా నేను ప్రకృతిలో కలిసిపోతున్నా

నాకూ ప్రకృతికి విడదీయరాని ఆత్మ బంధం

తీరొక్కపంటచేల కోటొక్క

 అందాలతో

నా అడుగు అడుగునూ ఆస్వాదిస్తూ నడుస్తున్న వేళ

పచ్చ పచ్చని తీవేలను ఖండించినట్లు

ప్రకృతి సోయగాల పచ్చల హారాన్ని తుంచేసినట్లు

వింతశోభలతో మెరిసిపోతూ తలుక్కున నన్నాకర్షించిందొక  భూ ఖండిక

తలనీలాలు సమర్పించిన భక్తుడి  గుండులా నున్నగా మెరుస్తూ

ఒక్క గడ్డిపోచయినా లేకుండా ఒళ్లంతాగీకిo చుకొని...

పచ్చని చెట్ల పద ఘంటికలు లేక

తీయని భ్రమరాలఝు o కారాలు లేక

నాలుగెకరాల పచ్చని పంట భూమిని నాలుగు వందల ట్రాక్టర్ల  మొరంతో నింపేశారు

పచ్చని పంటలనొసగే భూమాత గర్భాన్ని వెంచర్ల పేరుతో చిదిమేశారు

అభివృద్ధి ముసుగులో పంట పొలాలన్నీ వెంచర్లు గా మార్చేశారు

ధన రాకాసులు నన్ను చెరబట్టి ఏళ్లతరబడి పడావు భూమిగా మిగిల్చారు

ఎప్పుడో కట్టుకునే ఇళ్ల కోసం ఏళ్ల తరబడి నాకు ఎడారి వాసం

ఎందుకు నాకీ గర్భశోకం

పుడమితల్లి వేసిన ప్రశ్నలతో నా నడక ఆగిపోయింది

నా హృదయం అల్లకల్లోలమైంది

ప్రకృతికి మానవుడు చేస్తున్న గాయాల్ని చూసి

నా కన్నీటి బిందువులు నేల తల్లి పాదాలు ని తాకాయి

09/10/20, 4:24 pm - +91 99891 91521 added +91 81792 93424 and +91 94409 15974

09/10/20, 4:25 pm - +91 99891 91521 removed +91 81792 93424

09/10/20, 4:31 pm - +91 96523 71742: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:ఇష్టకవిత

కవితాశీర్షిక:అక్షరమే ఆయుధం

నిర్వహణ:కవిత్రయం

రచన:దుడుగు నాగలత


మనసులోని భావాలను

మధురమైన జ్ఞాపకాలను

తెలియపరిచే మార్గమే అక్షరమాల

అక్షరమనే ఆయుధంలో

చేవపదాల సారము నింపి

అద్భుతమైన పదబంధాలతో

అమోఘమైన భావసంపదతో

మదిలోన భావసారాన్ని

అందమైన కవితగా మలచగా

విరబూసిన రచన

అక్షర పరిమళాల్ని వెదజల్లుతుంది

మన జీవనమార్గంలో

మనతో మమేకమయ్యేది అక్షరం.

పుట్టుకతో మాతృభాష ద్వారా విన్న

చిన్న చిన్న పలుకులు నేర్చిన

బాలగేయాలు పాడినా

మనకు తెలియకుండానే అక్షరసంపదను పెంచుకుంటాం.

నేటి మన కవితలు

లోకానికి తెలియపరిచే

మార్గమే అక్షరం

అవి లిఖితమైతే

చిరకాలం నిలిచి ఉండేను

అక్షరజ్ఞానం మన మేథస్సుకు సూచిక.

09/10/20, 4:47 pm - +91 98851 60029: మల్లినాథ సూరికళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

09.10.2020 శుక్రవారం 

పేరు: వేంకట కృష్ణ ప్రగడ

ఊరు: విశాఖపట్నం 

ఫోన్ నెం: 9885160029

నిర్వహణ : కవయిత్ర త్రయం

అంశం : ఐచ్చికాంశం - స్వేచ్ఛా కవిత


శీర్షిక : నేర్చుకొన్నా


నేర్చుకొన్నా నే నేర్చుకొన్నా

ప్రకృతిని చూసి 

నేను ఎన్నో నేర్చుకొన్నా ...


క్రేంకారంతో, నాట్యం చేసే నెమలిని

పరవశింప చేసిన ప్రకృతి 

అందుకు సాక్ష్యంగా నిలిచింది

అది చూసి 

 ప్రకృతి ఒడి  ఓంకారంలో 

ఒదిగి ఓ ఆనందం నేర్చుకొన్నా ...


కపోతం ఆసాంతం

శాంతికి చిహ్నంగా నిలిచి

మనః శాంతికి  మార్గం చూపింది 

అక్కడ 

నాలో కనపడని క్రాంతితో

శాంతి మార్గం నే నేర్చుకున్నా ...


పూల కోమలం, విరిసే పరిమళం

రంగుల వరుసలు 

అవి చూసి పొంగిన మనసులు

మాలో స్వార్ధం లేదని చూపాయి  

మనసున స్వార్ధ బుద్ధిని సాగనంపి

నిస్వార్ధ చింతన నే నేర్చుకొన్నా ...


పువ్వు పువ్వున గ్రోలిన మకరందం

పున్నమి వరకు పట్టునే పూరి

అమవస వరకూ ఆరగించాలని

ఆనను పూని

అలా ఆస్వాదించే, తేనీగను చూసి

నిగ్రహానికి తనే విగ్రహమని తెలిసి

నే మనోనిగ్రహం సమగ్రంగా నేర్చుకొన్నా ...


బారుల చీమలు, మారవు దారులు

శ్రమ శిక్షణ క్రమశిక్షణలకు 

ప్రత్యక్ష సాక్ష్యంగా వాటిని వీక్షించి

వేరే శిక్షణ లేకున్నా, ఎంతైనా వింతైనా 

క్రమ క్రమంగా అక్షర సత్యాలను 

కొంతైనా ఆ శిక్షణలను నే నేర్చుకొన్నా ...


నీరును విడిచి పాలను తాగే

హంసను చూసి 

సోహం అర్ధం సోదించకనే నా సాకారమై

అద్వైతం అర్ధం 

ఆపై ఆ పరమార్ధం నే నేర్చుకొన్నా ....


                       ... ✍ "కృష్ణ"  కలం

09/10/20, 4:48 pm - +91 99597 71228: డా॥ బండారి సుజాత

అంశం: ఐచ్ఛిక కవిత

శీర్షిక : స్నేహ బాంధవి

నిర్వహణ : హరి రమణ గారు

తేది: 09-10-2020



ప్రకృతికి ప్రాణం పోసినట్టు   పసిడి బుగ్గల  పలకరింపులతో ముత్యాల నవ్వులతో ,ముసి ముసి నవ్వుల పదనిసలతో సొట్ట బుగ్గల సోయగాల ఆడపిల్లలే ఆనందానికి హరివిల్లు


పట్టు పట్టిందా వదలని శ్రమతో తన్ను తాను నిరూపించుకొంటు ఇంటిల్లిపాదికి సేవలందిస్తూ,  మనసుకు సాంత్వన నందించే  మహిళ ,మకుటంలేని మహారాణి


ముగ్గుల్లో మొగ్గలా

చదువుల్లో సరస్వతిలా పనులలో శ్రామికురాలుగా స్నేహాన్ని పంచే మిత్రురాలుగా కష్టసుఖాలలో వెన్నంటి ఉండే నీడలా, జీవితాలలో వెలుగులు నింపే అతివ భవితకు చేయూతనిచ్చే బాంధవి


ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఇంటిల్లి పాదికి తలలో నాలుకై ,తన్ను తాను సవరించుకుంటూ ,రేపటి పౌరుల తీర్చి దిద్దే అమ్మ


నీకేం తెలుసు ? అన్నా కుడా నిండు జాబిలిలా నవ్వుతూ ఎంత సంపాదించినా ....

ఏటీఎం ఎరుగని  మహిళా ఆర్థికవేత్త

ఇంటింటికి ఇలవేల్పు స్త్రీనే కదా!

09/10/20, 4:49 pm - +91 70364 26008: మల్లినాథ సూరి కళా పీఠం

సప్తవర్ణాల సింగిడి

ఏడుపాయల

అంశం: ఐచ్చికాంశం

నిర్వహణ: శ్రీమతి గాయత్రి గారు హరి రమణ గారు కవిత గారు

రచన;జెగ్గారి నిర్మల

శీర్షిక: గేయం (రైతు)



రైతన్న నీ బతుకు గోసన్న

పగలనక రాత్రనక పనిజేసేవన్న

పనికి తగిన ఫలిత మేదన్న

మోసపుచ్చు పరులు నిన్నన్న

                                 " రైతన్న"


పొద్దు పొద్దున లేచి నీ వన్న

పొలముకు  వెళ్ళేవు రైతన్న

ఖాళి కడుపు తోటి నీవన్న

కాయ కష్టము జేసే రైతన్న

              ‌.           "రైతన్న"


పొలము దుక్కి దున్ని నీవన్న

విత్తనాలే సేవు నీవు రైతన్న

చినుకు జల్లు కొరకు నీవన్న

నింగి వైపు జూసేవు  రైతన్న


                                 "రైతన్న"

రానిచో వర్షాలు నీవన్న

రందిలో పడతావు రైతన్న

పంట నష్ట  మొస్తే నీవన్న

ప్రాణంబె వదిలేవు రైతన్న

                           రైతన్న"

09/10/20, 4:55 pm - +91 96666 88370: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణాల సింగిడి

పేరు-అనూశ్రీ గౌరోజు

ఊరు -గోదావరిఖని

అంశం--స్వేచ్ఛాకవిత

శీర్షిక--అలుపెరుగని పయనం

"""""""""""""""""""""""""""""""""

అక్షరాల తోటలో అందమైన విరులు

కవన సేద్యానికై తరలిన

కవి వరులు


మస్తిష్కాన్ని మధించి

అక్షరం అక్షరం చెర్చి

భావాల సుగంధాలు అద్ది

తెల్లని కాగితాని పలు భావవర్ణాలతో

అందంగా అలంకరించి 

మురిసే చిరుకుసుమాలు..


పచ్చనైన సాహితీ వనాన

కొత్తచిగురులతో సరికొత్త ఆలోచనలతో వినూత్నరీతిన వికసింపగా..


ఓర్వజాలని కంటి వీక్షణలెన్నో

అడుగడుగునా అడ్డుపడుతూ ఆగిపొమ్మంటే...

పచ్చని ఎడారిలా విలపిస్తోంది కవిగళం.


పుస్తకనేస్తాల ఒడిలో హాయినా నడక నేర్చుకున్న కలం

అల్పమైన తత్వాలను దాటలేక

యంత్రికంగా మనుగడ  సాగించలేక

పరుగెడుతోంది అలుపేలేక

ఎడారిలాంటి ఆలోచనల్లో పచ్చదనం కోసం..!


           అనూశ్రీ గౌరోజు

09/10/20, 5:01 pm - +91 93813 61384: 💐మల్లినాథసూరి కళాపీఠము💐సప్తవర్ణముల సింగిడి


పేరు:చంద్రకళ. దీకొండ

ఊరు:మల్కాజిగిరి

నిర్వహణ:శ్రీమతి హరిరమణ, శ్రీమతి ల్యాదాల గాయత్రి మరియు 

శ్రీమతి కవిత గార్లు

అంశం:ఐచ్ఛికాంశం

ప్రక్రియ:వచనం


సైకిల్ పై సంచీధారి

🌷🌷🌷🌷🌷


వీథి చివరన...

ఆ సైకిల్ గంట గణగణ శబ్దం...

వెనువెంటనే వినవచ్చే"పోస్ట్"

అన్న కేక వింటే చాలు...!


కిటికీ చాటున కళ్ళల్లో 

 కోటి ఆశల అంకురాలు...

వాకిట్లో వేచివున్న హృదయాలలో సంతోషాల చిగురింతలు...!!


మనీ ఆర్డర్ అందుకున్న నిరుద్యోగి ముఖంలో కొత్త కాంతులు...

టెలిగ్రామ్ అందుకున్న చిరుద్యోగి గుండెల్లో గుబులు...!!!


దేశాంతరం వెళ్లిన తనయుని క్షేమ సమాచారం అందుకున్న తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు...

వల్లభుని ప్రేమలేఖ అందుకున్న ఆషాఢపు పెళ్లికూతురి వదనంలో నునుసిగ్గుల పరవశాల దొంతరలు...!!!!


ప్రేమకావ్యాలు,చారిత్రక సత్యాలు...

అనుబంధాలు,స్నేహబంధాలు...

ఆనందాలు,ఆవేదనలు...

విరహాలు,శుభవార్తలు...

అభినందనలు,అశుభాలు...

మరెన్నో పొదువుకున్న అక్షర లేఖలను...

అన్నిటినీ ఆ సంచీలో మోస్తూ...

ఎండకి ఎండుతూ...

 వానకి తడుస్తూ...

ఇల్లిల్లూ,వీథి వీథి తిరుగుతూ...

చిరునవ్వుతో అందరికీ అందిస్తూ...

అందుకొన్న వారి మోములో చిరునవ్వులు పూయిస్తూ...

అందరికీ ఆప్తబంధువైన...

నాటి తరం చిరుద్యోగి...

తపాలా బంట్రోతు...!!!!!!!!

*****************************

చంద్రకళ. దీకొండ

మల్కాజిగిరి,

9/10/2020

09/10/20, 5:01 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు.. కవిత గారు 

హరి రమణ గారు గాయత్రి గారు

9.10.2020 

అంశం..   ఐచ్ఛికాంశం

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్

శీర్షిక...కొత్త బాట


కొత్త బాటన పడి పాత బాటను మరిచి

శిల్క నవ్వుల సిత్రాల మోజులో పడి

పాప భీతి లేక పరిగలేరుకుంటు

వికార చేష్టలు వెర్రితలలు వేస్తూ

ఆవిరైతున్నాయి ఆచారపలవాట్లు 

శిథిలమైతున్నాయి శిల్పకళలు..!


మాయామైతున్నాయి మానవతా

విలువలు గంగిరెద్దులాట గంగలోకలిసే ఒగ్గుకథలన్నీ ఒడ్డుకూ జేరే

నాట్య రీతులన్నీ నాశనమైపోయే

తాగినా మైకంలో తప్పటడుగులు 

వేస్తూ దారితప్పిన యువత

బందీలపాలాయే..!


కులవృతులన్నీ  కునుకుతీస్తూండే  

వెలుగుకండ్లలోన కారుమబ్బులొచ్చే

గుడ్దికొంగలయ్యి బతుకు ఆగమయ్యే

మనసు మమత పోయి మాయలోకమొచ్చే

చిమ్మంజీకటాయే మాతృభాషంతా!


పరాయి భాషకు పట్టంగట్టి..

పారిపోతున్నారు పొరుగు దేశానికి

మారుతున్నది లోకం కొత్త పోకడలను

చేరి కాపు కాసే చేను కంచె మేసినట్లు

ఉరుకుతున్నది మంచి ఊరెళ్ళిపోతూ 

రాను రానంటుంది రాతి మనసులలోకి.!


హామీ పత్రం... ఇది నా స్వీయ రచన

09/10/20, 5:05 pm - +91 99124 90552: *శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*09/10/2020 శుక్రవారం*

*అంశం : ఇష్టకవిత*

*నిర్వాహకులు : ల్యాదల గాయత్రి గారు,  కవితా కులకర్ణి గారు, హరిరమణ  గారు*

*రచన : బంగారు కల్పగురి*

*ప్రక్రియ : వచనం*

*శీర్షిక : మాయకిని*


అవును నాకు కోపం రాదు

ఎందుకంటే ఏమో మరి...

కోపం రావాలంటే కొన్ని

అర్హతలు ఉండాలేమో ఏమో కదా...

ఎవరేమి అన్నా ఎలా

ఉపయోగించుకుని ఆడుకుంటున్నారో 

తెలిసినా కోపం రాదు నాకు...


బాధేస్తుంది నా అనుకొన్న

నా పంచప్రాణాలే కాలనాగుల్లా...

కసితీరా కాటేస్తుంటే కళ్లల్లో కన్నీరు

నీరైపోయి ఇంకిపోయి రక్తం కారిన

అనుభూతి మనసుని తొలుస్తుంటే...

అమ్మలకన్న అమ్మని కూడా

ఏమీ అడగలేని నిస్సహాయురాలినై

నిస్తేజం నిండిన గాజుగోళాల్లాంటి కళ్ళతో

నిర్వేదంగా నిర్లిప్తంగా చూస్తూన్నా...


ఎన్నిసార్లు ఎంతటివారైనా

పరిదులుదాటి పరిహసించినా...

నిస్సహాయ స్థితిలో సుడిగాలిలో

చిక్కుకున్న చిట్టి చిగురు మొక్కలా

నిలువెల్లా వణకిపోతున్నా...

నివురులో కప్పిన నిప్పులా

నే మౌనంగానే ఉండిపోతున్నా...


చూపుల చురకత్తుల్ని మాలిమి

పేరుతో మేనులో దించుతున్నా...

మాటలనే తూటాల్లా మలచి

మది ముక్కచెక్కలయ్యేలా

సూటిగానే విసురుతున్నా...


నన్ను కాదని నాకే అండగా ఉన్నారని

అనుకోటంలోనే ఆనందం వెతుక్కుంటు

మహోన్నత అంతరంగినిలా మనసుకి

ముసుగేసుకుని మరీ మసులుకుంటున్నా...


అందుకే నాకు నేనంటే

చాలా చాలా చాలా ఇష్టం...

బహుశా ఇదేనేమో పరిణతి అంటే...

ఆహ్హాహ్హా... ఐతే ఆ పరిణతిలో

నాకు పరిమితే లేదు మరి...


సరదాగా గాలి కబుర్లు చెవి

పగిలేలా ఎన్నైనా చెబుతా కానీ...

కాలక్షేపానికి నిజ జీవితాల్లోకి

కక్కుర్తిగా తొంగి చూసి లోతుపాతుల్ని

లోటుపాట్లని కనుక్కొని సంబరం

చేసుకోటం తెలీని పిచిదాన్ని...


మరి దేవుడు ఏం తక్కువ

పెట్టాడో నాకు...

ఎదుటివారి గురంచి

ఎం ఐనా తెలిసినా...

ఒక్క మాటకూడా చేదుగా చెడుగా

అనలేని మాయామర్మం తెలీని

అమాయక మాయకురాలిని...

09/10/20, 5:06 pm - +91 94410 66604: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్య కవి గారి పర్యవేక్షణలో

అంశం : ఇష్ట కవిత

శీర్షిక :మనసు వేట

 నిర్వహణ:శ్రీమతి ల్యాదలగాయత్రీ 

గంగ్వార్ కవిత  ,హరిరమణ గార్లు

రచన :డా.ఐ.సంధ్య

***************

*మనసు వేట*


కాలుతున్న వాసన చూసి 

స్మశానమని అనుకున్నా..

అది మనసని తెలిసి అవాక్కయ్యాను..


ఆడుతుంది అహంకారమే

అవిటితనం దానికాభరణం

వగలుపోతూ వల్లకాడుచూపి

పూలపాన్పుఇదే అని నమ్మబలికే


గతిలేని గుంటనక్క నక్కినక్కి

చూడా చతికిలబడ్డ మార్జాలం

పంజవేయ కదిలే కాలం కాటేస్తే

కలువ శరమై గుచ్చదా..


ఏమిలేని ఆకు ఎగిరెగిరి పడితే

అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి

చూసిచేయి అందుకున్న మనసు ఆనందం  ఆభరణమై సాగే..


చూడలేని ఈర్ష్య లు ఊసురని 

పోవా..కాలికున్న మట్టెలన్ని

పుడమిని చూసి మురిసెనే

మూసిన చేతిలో ఊసులెన్నో

ఊరించి చూడు ఊడిగం చేయ


గతిలేని గుంటనక్క నక్కినక్కి

చూడా చతికిలబడ్డ మార్జాలం

పంజవేయ కదిలే కాలం కాటేస్తే

కలువ శరమై గుచ్చదా..


ఏమిలేని ఆకు ఎగిరెగిరి పడితే

అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి

చూసిచేయి అందుకున్న మనసు ఆనందం  ఆభరణమై సాగే..


చూడలేని ఈర్ష్య లు ఊసురని 

పోవా..కాలికున్న మట్టెలన్ని

పుడమిని చూసి మురిసెనే

మూసిన చేతిలో ఊసులెన్నో

ఊరించి చూడు ఊడిగం చేయ


అవిటితనం తనువుకనుకున్నా..

మనసుకని తెలిసి స్పృహ తప్పా..


తాటాకు పుస్తకాలు ఎన్ని చదివినా బుర్రలో లేని బుద్ది 

బూడిదైచేరా..చూడబోతే చుట్టాలు చాకిరిచేయవచ్చే



అడుక్కుతినే బిచ్చగాడు

గిన్నెశబ్దం చేసే గిరగిరా రొట్టెముక్క గిన్నెలోకి జారే

జాతి లేని నీతి కథలు ఎన్ని సొగసులు అల్లిన మనసును ఏలే కథలు ఆత్మకై చూసే


తృప్తిలేని కూడు రోకలిచూసే

దంచలేని చేతులు జారజూసే

రేపటి ఆశలవెంట సిరినువ్వైతే

రాజులేని బంటు రీతి కోటదాటే

*************************

సికింద్రాబాద్

09/10/20, 5:18 pm - +91 97048 65816: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:ఐచ్చికం

శీర్షిక:రైతు ఆత్మ గౌరవం


పల్లవి:

సుక్క పొద్దు యాల్ల లేసి 

సూర్యుడెల్లి నంక వచ్చె

--రైతు నీకు సాటి ఎవరయ్యా

ఈ లోకానికి తిండి పెట్టె అన్నదాతవయా/సుక్క/

1 చరణం:

నీవు నాగలి పట్టుకుంటే

భూమి తల్లి మురియు నెంతో 

--కాడికెద్దుల గట్టగానే

మేడియెంతో మురిసెగదయ్యా/సుక్క/

2చరణం:

ఉరుము ఉరుమి చెఱువు నిండగ

పంటలకు కొదువుండబోదని

--రాత్రి పగలు కష్టముజేసి 

రతనాలను పండించావు/సుక్క/

3చరణం:

వడ్లనన్ని రాసులు బోసి 

బస్తాలల్లో నింపినావు

--పట్నమెల్లిఅమ్ము కోస్తనని 

బయలుదేరి పోయావయ్యా/సుక్క/

4చరణం:

దళారీల చేతికిచిక్కక

ధాన్యాన్ని అమ్మేయాలిక

--మెండుగా లాభాలు రాగా 

దండిగా బతుకెల్లా దీస్తివి/సుక్క/


పేరు:వరుకోలు లక్ష్మయ్య

సెల్ :9704865816.

సిద్దిపేట జిల్లా

09/10/20, 5:32 pm - +91 97013 48693: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

నిర్వహణ:ల్యాదాల గాయత్రి గారు,హరిరమణ గారు, గంగ్వార్ కవిత గారు


*గదాధర్ అరిగెల*

శీర్షిక: ప్రేమాక్షర ఝరి


పదే పదే తలచు కుంటాను...!

కనులు మూసి నీ చిత్రాన్ని తలిస్తే చాలు ....గంగ ఉరకలేసినట్లు మయూరం నాట్యమాడినట్లు

వికసించిన కలువలు తొంగి చూసినట్లు

ప్రేమ పరిమళ సుగంధ పవనాలు 

నన్ను తాకుతాయి....!


ఎవరికి చెప్పగలను నా కవన సిరీ

ఇది ఇలా ఉందేమిటీ అని....!

ఏదో తెలియని భావానికి నేను వశమైన వేళ సమయం తెలియకుండా అక్షరం నన్ను పలుకరిస్తుంది.....!

కవనాభిషేకం చెయ్యవా నీ సుందరికి అని అడుగుతుంది....!


దైవమిచ్చిన అక్షర సిరితో

నేనో భాగ్యవంతుడినన్న ఆనందంతో

నా హృదయ స్పందనకు సాహిత్య సౌరభాల విత్తులు చల్లుతాను...!

మొలకెత్తిన అభిమాన అప్సరసారమ్య రూపంలో నీవు కుందనపు బొమ్మలా

ముగ్దమనోహరివై అలా ఒదిగిపోతావు...!


నేను ఓ క్షణం మౌనంగా ఆర్తిగా

అపురూపంగా వాత్సల్య పూర్వకంగా మనో నేత్రంతో తన్మయత్వం పొందుతాను....!

చాలదా ఈ జన్మకు నీతో ఇలా బతికేందుకు


కనులు సన్నటి వెచ్చటి కన్నీటి‌ని చెమర్చుతాయి

మనసు దూది పింజలా  తేలిక అవుతుంది

జీవం పోసుకున్న అక్షరాలు నాకు ఊపిరిగా మారతాయి...!

ఇది నా హృదయ స్పందన సిరి ఓ కవన సిరి

నాకు మాత్రమే సొంతమైన ప్రేమ ఝరి...!


🌻🌻🙏🙏🙏🌻🌻

09/10/20, 5:32 pm - +91 84668 50674: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

నిర్వహణ : శ్రీమతి

ల్యాదాల గాయిత్రి గారు

శ్రీమతి  హరిమణ గారు.

శ్రీమతి కవిత గారు

అంశం : అందకుండా ఉంటావు ఇష్ట కవిత

రచన ఎడ్ల లక్ష్మి 

శీర్షిక :ఆటలాడిస్తావు

ప్రక్రియ :  ( గేయం )

తేది : 9.10.2020

"""""""""""""""""""""""""""""""""""""""""""""""""


కోవెలలో కొలువు తీరి స్వామీ

ఇలలో మాతో ఆడుకుంటావేమీ


ఆకాశమవనీ నీదే అంటావు

మాకందకుండ నీ ఉంటావు

భువి మీద మేమున్నాము

భక్తితో నిన్నే కొలుస్తున్నాము //కోవెలలో//


ఏమి చిత్ర మయ్య ఇది స్వామీ

ఆగమాగయే మా మదిన నేమీ

కళ్ళు మూసుకుంటే చాలు స్వామీ

మా ముందే నిలబడి ఉంటావు //కోవెలలో//


కనులు తెరిచి చూస్తే మాకు

కనబడకుండా పోతావెందుకు

నీ కొరకై మేమొస్తుంటే మాకు

ఆ దారి కూడా చూప వెందుకు //కోవెలలో//


మహిలో మట్టీని తీసి తడిపి 

ముద్దగ చేసి ప్రతిమలుగా దిద్ది 

చేసిన బొమ్మలకు ప్రాణం పోసి

అవణి మీద ఆటలాడిస్తావు నీవు //కోవెలలో//


మేముచేసిన నేరమేమి స్వామీ

మా మొర వినగ రావేమి స్వామీ

మా తప్పులు మన్నించి వొప్పుగ భావించి

ముక్తి మార్గము చూపుము స్వామీ //కోవెలలో//


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

09/10/20, 5:32 pm - +91 84668 50674: <Media omitted>

09/10/20, 5:33 pm - +91 98663 31887: *మల్లినాథసూరికళాపీఠం* (ఏడుపాయల)

_శ్రీఅమరకుల దృశ్యకవి చక్రవర్తుల ఆధ్వర్యంలో_..

*సప్తవర్ణముల సింగిడి*

తేదీ:09/10/2020 శుక్రవారం

స్వేచ్ఛాకవిత: ఐచ్ఛికాంశం

నిర్వహణ: శ్రీమతి ల్యాదాల గాయత్రి గారు, శ్రీమతి హరిరమణ గారు, శ్రీమతి గంగ్వార్ కవిత గారు 

రచన: గంగాధర్ చింతల

ఊరు: జగిత్యాల.

శీర్షిక: *నీ జ్ఞాపకాలు*

**** *** *** ** *** *** ****

మనిషినైతే మిగిలున్నా..

మనసంతా నీ చుట్టే భ్రమిస్తుంది..

వదిలేసి వెళ్ళాను అనుకుంటున్నావేమో..

ఒంటరిని చేసానని భ్రమ పడుతున్నావా..

నీతో గడచిన కొన్ని జ్ఞాపకాలు చాలవా.!

ఒక జీవితకాలం బతికేయడానికి.

నా మస్తిష్కంలో నీ ఆలోచనల పరంపర కొనసాగుతునే ఉంటాయ్..

నాలోని ఆశలు ప్రతిక్షణం నిన్ను స్పృశిస్తూనే ఉంటాయ్..

ఎడబాటు బాధల గాయాల వ్యథ కూడా నీ తలంపే..

కాలం గాయాలు మాన్పిన మిగిలిన గురుతులు నిన్ను మరచి పోనియ్యవు..

నర్మగర్భంగా నీవు చేసిన  తిరస్కార ప్రయత్నాలు..

నీకు నాకు నడుమ ఎంత అంతరం సృష్టించినా..

నీ మేని పరిమళాలు వీచే వాయువులో నాకు ఉచ్ఛ్వాసే..

నా కన్నుల్లో నిలచిన నీ చిరు దరహాసపు మోము..

కొసరి కొసరి తినిపించిన నీ చేతి గోరుముద్దలు..

నీ అలక, చిరు కోపం అన్ని కలగలిసిన నీ రూపం..

నా గుండెలో నిండి ఉన్న నీ జ్ఞాపకాలే ఈ ప్రాణం.

నీ సహచర్యం నేను మరువలేని ఓ మధుర కావ్యం.

అందుకే నువ్వంటే నాకు ఇప్పటికి ఎప్పటికీ ఇష్టం.

**** *** *** ** *** *** ****

ఇది నా స్వీయరచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా.

09/10/20, 5:40 pm - +91 94932 10293: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి 

అంశం... ఇష్ట కవిత 

శీర్షిక.. గోమాత.... 

నిర్వహణ... ముగ్గురమ్మలు... 

 పేరు....చిలకమర్రి విజయలక్ష్మి..

************************

సకల దేవతా నిలయము

మన ఇంటి లోని గోమాత 

ముక్కోటి దేవతలు 

ముచ్చటగా నెలకొందురు 

మన  గోమాతలోన.. 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు

మన గోమాత దేహమే దేవాలయము...


ముగ్గురమ్మలకు

ముచ్చటైన నిలయమే మన గోమాత హృదయం

చల్లని తల్లి.. 

పిల్లల పాలిట కల్పవల్లి

గోమాత శరీరమే ఒక ఔషధ ఆలయము


తన క్షీర  దారలతో..

ఈ జగాన్ని  కాపాడే అమృతవల్లి

నందీశ్వరుడి ని కన్న

నవనీత మనసున్న 

మన గోమాత... 


కాడెద్దులను కని 

రైతన్నలను కాపాడే 

కష్టజీవి...... 

వేసిన గుప్పెడు గడ్డితిని 

అమృతాన్ని మనకందించే 

సుధామయి..... 


సకల రుగ్మతలకు 

మన గోమాత  

అందించును.. 

సకల ఔషదాలు 

ఒకదన్వంతరియై..... 

మనకు ఆరోగ్యాన్నిచ్చును 


ఆనాటి రేపల్లె  లోని కృష్ణయ్య 

గోవులను కాసి  గోపాలకుడయ్యాడు ... 

గోవుకు మాతృ ప్రేమ ఎక్కువ.. 

తన లేగదూడను చూసుకొని 

మురిసిపోయే  ఆతల్లి 

మనలనందరిని  కాపాడే 

ఆ  కామదేనువు... 

ఆ గోమాతను రక్షించుకొందాం 

దుర్మార్గుల  నుండి కాపాడుకొందాం.. 

సకల దేవతా నిలయాన్ని 

మన ఇంటిలో  నిలుపుకొందాం

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

***************************

చిలకమర్రి విజయలక్ష్మి

ఇటిక్యాల..

09/10/20, 5:47 pm - S Laxmi Rajaiah: మల్లినాథసూరి కళాపీఠం YP 

శుక్రవారం: ఐచ్ఛికాంశములు  9/10 

అంశము:  విచిత్రం 

ప్రక్రియ :  గేయం 

నిర్వహణ: కవయిత్రి త్రయం


పల్లవి: ఏమిటయ్య వైచిత్ర్యం ఎందుకయ్య వ్యత్యాసం.    (ఏ) 


కోయిలగొంతులో కోటికోటి రాగాలు 

అవిటి జీవి బ్రతుకులో అవే ఆర్తనాదాలు 

ఎండినమ్రోడులో ఎగిసిపడే చివుళ్ళూ

పండిన పైరుల్లో బోధపడని తెగుళ్ళూ 


భాగ్యశాలి ఒంటికిడుదు భారమైన 

రోగాలు 

నిరుపేద యింటికెపుడు దరిజేరని 

భోగాలు 

పండిత ప్రకాండులను పీడించును 

లేమీ

పాండిత్యహీనులకు పట్టుబడును 

కలిమీ       (ఏ) 


కండపుష్టి గలవానికి కారుణ్యం కరువు 

తిండిలేని ద్రిమ్మరికి ప్రేమ కల్పతరువు 

పెట్టాలని ఉన్నయింట పెట్టుటకేముంది 

ఇవ్వాలని ఉన్నచేత యిచ్చుటకేముంది 


ఆస్తిపాస్తులున్నచోట అధికారాలెందుకు 

సదాచార ధరణిపైన దురాచార  

మెందుకు ?

పురుడు పోసుకునేముందు పురిటి 

నొప్పు లెందుకు ?

ఆప్యాయత లేనిచోట అంగబలా 

లెందుకు?       (ఏ) 


          శ్రీరామోజు లక్ష్మీరాజయ్య 

          సిర్పూర్ కాగజ్ నగర్ .

09/10/20, 5:53 pm - +91 98495 90087: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-కవయిత్రీత్రయం.

అంశం:-స్వేచ్ఛాకవిత.

తేదీ:-09.10.2020

అంతర్జాతీయ తపాలా దినోత్సవం. 

పేరు:-ఓ.రాంచందర్ రావు

ఊరు:-జనగామ జిల్లా

చరవాణి:-9849590087


ప్రతి సంవత్సరం అక్టోబరు 09

వతేదీని అంతర్జాతీయ తపాలా

దినోత్సవం జరుపుకుంటారు. 

తోకలేనిపిట్టతొంబఆమడవెళ్లుతుందని ఒకపొడుపుకధ. 

జననంనుంచి మరణందాకా మనిషిజీవితంతోమమేకమైనది

తపాలా వ్యవస్థ. ఎర్రడబ్బా, 

పోస్టమెన్లేవిఊరునుఊహించడంకష్టంపోస్టమెన్లేనిఊరును

ఊహించడంకష్టం.పోతనామాత్యుడుపద్యంచెప్పినట్లు, నీవే

తల్లివితండ్రివి,నీవేగురుడవు 

సఖుడవుఅన్నట్లుగాఒకప్పుడు

పోస్టమెన్ఊరిజనాలకుసర్వస్వం.ఎటువంటివిషయాలనైనా

ప్రపంచం నలుమూలల నుంచి

అతిచవకగా చేరవేస్తుంది

తపాలా వ్యవస్థ. అదిఖేదంగాని

మోదంగానిఉత్తరంద్వారానే

తెలిసేవి.దీనిమీదజోకులు, కార్టూన్లు, కవిత్వంకూడా

పుంఖానుపుంఖాలుగావెలువడ్డాయి. ఉద్యోగం అపాయింట్ మెంట్, ఆరోజుల్లో పొట్టకూటికై

వలసవెళ్లిన,బొగ్గుబావిబొంబాయి, దుబాయి వలస కార్మికుల

క్షేమసమాచారము, మనియార్డ

ర్లు, సైన్యములపనిచేసే

ఉద్యోగుల సమాచారము, అది

ఇదిఅనిఏలఏదైనాఅదేపెద్దదిక్కు. 1600వసంవత్సరములో

మొదలై, ఇంతింతైవటుడింతై

అన్నచందంగా,ఈరోజు బహుముఖీనమైన రూపాలను

సంతరించుకుంది. అంతర్జాల

వ్యవస్థ అభివృద్ధి చెందినాక

ఉత్తరమలువ్రాసేపద్దతిదాదాపుగామరుగునపడిపోయింది. కానిమిగతాసేవలుయధాతగంగా నడుస్తున్నవి. ఏదిఏమైనా

అదిఒకమథురఙ్ఞాపకం.

09/10/20, 5:53 pm - +91 94902 35017: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి

స్వేచ్ఛ కవిత

శీర్షిక:  నిశ్శబ్ద గీతిక


ఏటి గలగలల్లా ధ్వనించే 

నా మాటల సవ్వడిని వినగలిగే మీరు.... 

నా గుండెచప్పుళ్ళను వినలేరు 

నా అంతరంగాన్ని ఒడిసి పట్టలేరు 

నాలోని శూన్యాన్ని గ్రహించలేరు 

అర్థం కాని సమస్యగా...

జవాబు లేని ప్రశ్నగా...

మిగిలిన  నన్ను తెలుసుకోవడం 

గగన కుసుమమే.... 

నా ఆశలు... ఆలోచనలు... 

ఊహలు... ఊసులు... 

నాకు మాత్రమే పరిమితం  

నా దుఃఖపు సామ్రాజ్యానికి  

మహారాజ్నిని నేను... 

అందమైన నవ్వు వెనక విషాదాన్ని 

కంటి మెరుపుల అంచున నైరాశ్యాన్ని హృదయాంతరాళాల్లో బడబానలాన్ని 

గొంతులో దుఃఖపు సునామీని దాచేస్తూ...

సంతోషాలను పంచుతూ 

ముందుకు కదిలిపోతున్న... 

సడిలేని చీకటి రాత్రుల్లో... 

నాలో నేను మసలుకుంటూ 

నాలో నన్ను దాచుకుంటూ 

కొత్తగా మలచుకుంటూ 

అడుగులు ముందుకు వేస్తున్న....

నిశబ్ద గీతికలా సాగిపోతున్న ....


బి.స్వప్న

హైదరాబాద్

09/10/20, 6:02 pm - +91 95422 36764: మల్లినాధసూరికళాపీఠంYP

అమరకులదృశ్యకవిచక్రవర్తి గారి ఆధ్వర్యంలో...

అంశము : ఐచ్ఛికము

నిర్వహణ:కవిత్రయము

రచన: నాశబోయిన నరసింహ

ప్రక్రియ: వచన కవిత


శీర్షిక: లక్ష్మణుని త్యాగం

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

సుమిత్ర దశరథుల కవల సంతానమై  

ఆదిశేషుని అంశతో అవతరించెనతడు

అరణ్యవాసాన రాముని రక్షణ కవచమై 

అన్నదమ్ముల ఆదర్శ అన్యోన్యత చాటిన 

సుందర చైతన్య స్వరూపుడు లక్ష్మణుడు 


అన్నరామునియందు అమిత భక్తిపరుడు 

సీతచెల్లెలు ఊర్మిళ పరిణయమాడేనతడు 

ఏమీ కోరని మహాత్యాగ స్వభావుడితడు

కుటుంబ బాధ్యతెరిగిన కరుణామయుడు                                     

సౌమ్యలక్షణ సాహసవీర సద్గుణలక్ష్మణుడు 


పడతి ఊర్మిళకు పదిలంచెప్పి పద్నాలుగేళ్ళు

జానకీ రాములను జననీ జనకులుగా తలచి 

వనవాసమంతయు సోదర సహవాసం తోటి 

కలసి అలసి కష్టాలకడలిఅలల కెదురీదినోడు

విపత్కర కాలంలో నిర్భయ ఆపద్బాంధవుడు


ఓర్పుతో ఒకింతనేర్పుగల సహనశీలుడు 

బాధ్యతలకు భరోసానిచ్చిన కార్యదక్షుడు 

సకల వేదసారం సర్వ మానవులకాదర్శం 

రామ కథామృతం రసరమ్య మాధుర్యం.

         ✒️నాన

09/10/20, 6:03 pm - +91 72072 89424: రచన అవేరా

07/10/2020

శీర్షిక :శిధిలాలలో... నేను


కాల గమనంలో  కాంతి తప్పిన శిధిలాన్ని నేను ....

నీ ధ్యాసలో మతి తప్పిన మరణాన్ని నేను....

జ్ఞాపకాల వొడిలో జారిపడిన శిశిరాన్ని నేను...

శ్రుతి లేని రాగాన పల్లవించిన అపశ్రుతిని నేను...

తుఫాను తాకిడిలో చుక్కాని లేని నావను నేను...

సుడిగాలి వొడిలోన గతి తప్పిన విహంగాన్ని నేను.....

నీ తోడు వీడి పాడుతున్న  విరహ గీతాన్ని నేను...

ఆశల పల్లకీ విరిగిన చెదిరిన స్వప్నాన్ని నేను...

కలల తీరంలో ఒంటరి  సైకత శిల్పాన్ని నేను...

వడగాలి తాకిడిలో కరిగి పోతున్న కర్పూర శిల్పాన్ని నేను..

నిన్ను మేనుపై మోస్తున్న ఆధారాన్ని నేను...

మిన్ను దుప్పటిని కప్పుకు విరుగుతున్న వెన్నును నేను...

జ్వరంతో కరిగి పోతున్న మంచును నేను...

స్వరంలో భావాన్ని పలుకలేని మౌనాన్ని నేను...

మౌన నిట్టూర్పుల్లో కదల లేని శిధిల శిల్పాన్ని నేను...

నేను....

ఓరిమికి ఒంటరి ఉదాహరణాన్ని 

జలప్రళయంలో మునిగబోతున్న  పుట్టిని....

****అవేరా ****

09/10/20, 6:11 pm - +91 94907 32454: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

సప్తవర్ణముల సింగిడి 


పేరు :సుభాషిణి వెగ్గలం 

ఊరు :కరీంనగర్ 

అంశం : ఐచ్ఛికం 

ప్రక్రియ :వచనం

శీర్షిక :ఫాస్ట్ ఫుడ్ లోకం


🍔🧀🍞🍜🥤🧃🍝


ఇదేం మాయ లోకం.. బాబూ.. 

ఎంత సేపూ.. 

పిజ్జాలు బర్గర్ల గొడవే.. 

చేయి కలిసి కలిమి కుదిరినా

పట్టలేని ఆనందమొచ్చినా  

వంట శాలకు సెలవే

రెస్టారెంట్లకు పరుగులే

బిర్యానీలతో నోరుతిరగని పేర్ల కర్రీలతో బహు పసందే.. 

జేబులు ఖాళీయైనా ఒళ్లు గుళ్ళైనా

డోంట్ కేర్ ఆనవాయితీ లే


స్నేహం కుదిరితే.. 

గప్ చుప్ లు.. కట్ లెట్లు.. 

ప్రేమ కుదిరితే.. 

హిమ క్రిములు శీతల పానీయాల  

షేరింగ్ లు.. 


బుడతలు నోరు తెరిస్తే.. 

నూడుల్స్.. మంచూరియా లు.. 

పఫ్ లు.. సమోసాలు.. చిప్స్.. 

పండ్లు ఫలాల ఆరగింపంటే

ఛీత్కారాలే ప్రతి ఇంటా.. 

పోషకాల ఆహారాన్ని వదిలిపెట్టి

తెలిసి తెలిసి 

జబ్బులు కొని తెచ్చుకోవడమే.. 


ఎప్పటికి వచ్చేనో ఇక మార్పు

ఏ నాటికి కలుగునో కనువిప్పు 

బయటి ఆహారం వద్దు

ఇంటి ఆహారమే ముద్దని 

ఎప్పటికి అవగతమయ్యేనో లోకానికి


ఆదర్శ 

9-10-2020

09/10/20, 6:24 pm - +91 91779 95195: మల్లినాధా సూరి కళాపీఠం y p

సప్త ప్రక్రియల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి

గారి నేతృత్వo

అంశం: స్వేచ్ఛ

శీర్షిక: బాపు బొమ్మల

నిర్వహణ: గాయత్రి గారు

హరి రమణగారు

కవిత గారు

పేరు:రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

********************

రవి వర్మ కుంచెవో

రవి వర్మ తీసిన చిత్రం లా

అపరంజి బొమ్మలా

ఎదలో దాగిన ఊహాసుందరి వా

కలల కాత్యాయని వో

జలపాతాల లో జారే

జాజి కొమ్మవో

ఆశల సౌధమనివో

కొండ కోనల్లో కోమలాంగివో

మేను పులకరింతలు మేఘ మాలవో

పూవులోని మకరందానివో

కడలిలో మునక లేసిన

మీనాక్షి ఓ

అందరూ మెచ్చే అందాల సుకుమారివో 

అందాల రాక్షసి వో

అపరంజి బొమ్మ ఓ

కలల బాపుబొమ్మ వో....

********************

09/10/20, 6:25 pm - +91 79891 76526: మల్లినాథసూరి కళా పీఠం 

సప్తవర్ణముల సింగిడి

అంశం: ఐచ్చిక అంశం

పోస్ట్ మాన్

ప్రక్రియ: వచన కవిత

నిర్వహణ: కవిత్రయం


తేది:9-10-2020

శీర్షిక: అలుపెరుగని సమాచార యోధుడు


            *కవిత*


ఎప్పుడు తరచుగా 

కనిపించే వ్యక్తి 

ఉద్యోగ నియామక పత్రం శుభమైన అశుభమైన తెచ్చి పోస్ట్ అనే పిలిచేవాడు


ప్రస్తుతం ఏమయ్యాడు

మంచి చెడు సంతోషం బాధ ఏదైనా మన బంధువుల గా పంచుకోవడమే తెలుసు అతగాడికి


ఎందరు అతని కోసం ఎదురు చూసే వేళ

అందరినీ ఆప్యాయంగా పలకరించే వేళ

ఉద్యోగపు నియామకపు ఉత్తరం అందుకున్న నిరుద్యోగి ముఖంలో ఆనందం హేల


దూర ప్రాంతాలకు తరలి వెళ్లిన పిల్లల క్షేమ సమాచారం అందుకున్న తల్లిదండ్రుల మోములో సంతోషం

కురిసిన వేళ

ప్రేయసి ప్రియులు ప్రేమ లేఖ అందుకున్న వేళ

సమాచారం ఏదైనా అభిమానంగా తెచ్చి చేతికి ఇచ్చే వేళ


ఎండైనా వానైనా లెక్కచేయకుండా ఇంటింటికి వీధి వీధి కి తిరుగుతూ

అందరికీ చిరునవ్వుతో అందిస్తూ అందరికీ ఆప్తమిత్రుడైన పోస్ట్ మాన్ కు

అక్షర అభినందనలు


రచన: 

తాడిగడప సుబ్బారావు

కలం పేరు: రసజ్ఞ వాగ్దేవి

పెద్దాపురం 

తూర్పుగోదావరి

జిల్లా


హామిపత్రం:

ఈ కవిత నా సృజన అని దేనికి అనుకరణ కాదని

ఈ కవిత ఏ సమూహానికి గాని ప్రచురణకుగాని  పంపలేదని తెలియజేస్తున్నాను

09/10/20, 6:29 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి🌈

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ  కవయిత్రీత్రయం

అంశం.  స్వేచ్చా కవిత‌‌‌

శీర్షిక. పల్లె అందాలు

పేరు   పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు  జిల్లా కరీంనగర్

తేది 09/10/2020 


అదొక అందమైన చిన్న పల్లేటూరు

చుట్టూ ఆహ్లాదకర ప్రకృతి రమణీతయే

ఆకుపచ్చ వర్ణ శోభితంగా వెలుగుతూ

పక్షుల కిలకిల రావాలతో

చిలుకమ్మల ముద్దుపలుకులతో కోయిలల కమ్మని రాగాలతో

రమణీయ కమణీయతతో విరాజిల్లుతోంది


ఒకపక్క లతలతో అల్లుకున్న

గుబురు సోయగపు పొదలు

పొదల మాటున దాగిన చెవుల పిల్లులు

ఆ దాపున వున్న బారి తరువులు

వాటి నీడలోచల్లని గాలికి సేద తీరే

పశువులు,కోమ్మల పైన పక్షులు


సుగంధ భరిత పరిమళాలు వెదజల్లే

కుసుమాల చెట్లెన్నో కనువిందు జేస్తాయి

రంగుల పూలు పలు రకాల వెన్నెలతో

కాంతులీనుతూ సొగసుగా నున్నాయి

పురివిప్పి నాట్యమాడే నెమళ్ళ విన్యాలు

కంటికి మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి


పొలాల్లో ఏపుగా పెరిగిన వరిపైరు

చేలల్లో సద్దిగంపలను  నెత్తినేత్తుకొని

ఒయ్యారపు నడక సాగించే పడతులు

సుందరంగా విరబూసిన కమళాలతో

నిండు గంగాళమైన తటాకపు అందాలు

అలల సవ్వడితో అలరారుతున్నది


ఊరి ప్రక్కనున్న గుట్టకు గల

సీతా పలకం రేగు అల్లనేరేడు చింత

చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది

ఆ దాపున ఉన్న మామిడి నీలగిరి

చెట్ల తోటలు చక్కని వనాలను తలపిస్తున్నవి


ఇది మా పాఠశాలకు వెళ్ళే దారిలో నున్న పల్లె

అందాల సోయగం


హామి పత్రం

ఈ రచన నా సొంత రచన

🙏🙏🙏

09/10/20, 6:30 pm - +91 94929 88836: మల్లినాధసూరికళాపీఠంYP

అమరకులదృశ్యకవిచక్రవర్తి గారు

అంశము... ఐచ్ఛికము

నిర్వహణ....కవిత్రయము

శీర్షిక...నది మదిలో 

రచన...జి.ఎల్.ఎన్. శాస్త్రి.

ప్రక్రియ... వచనం

*****************************

ఎన్ని సుడిగుండాలున్నా 

సూఫీ సంగీతం వినిపిస్తూనే ఉంటుంది

ఎన్నెన్నో  వేదనలున్నా గోదారిలా..

వేదాలు వల్లిస్తూనే ఉంటుంది,

గుండెనిండా బరువున్నా..

నిండుమనసుతో సస్యశ్యామలం  చేస్తుంది.

గర్భాన్ని కాలుష్యం చేస్తున్నా 

మౌనoగా ప్రవహిస్తూ..

తన కర్తవ్యం తాను నిర్వహిస్తుంది.

అమ్మలాగే ఓసారి కోపడుతుంది,ఓసారి గర్జిస్తుంది,

మరోసారి లాలిస్తుంది,

అన్నిటికీ తానున్నానని చేను వెన్నుతడుతుంది,

నాగరికతకు మూలమైన తనను మరచి

అనాగరీకుడై కలుషితం చేస్తున్న మానవుడ్ని.చూసి..

తాను నిశ్శబ్దoగా రోదిస్తూ,

కన్నీటినికూడా పన్నీరుగా మార్చి.

పొలాలను తడిపి, రైతు హలాలను నడిపి,

అన్నార్తుల ఆకలి తీరుస్తుంది నదీమతల్లి కదూ!. ఆమె గంగ,యమున,సంగమ కల్పవల్లి.

**************************

09/10/20, 6:31 pm - +91 99088 09407: *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

సప్త వర్ణముల సింగిడి

అంశం:ఐచ్చికం

శీర్షిక:ఆత్మీయతా పరిమళాలు

నిర్వహణ:శ్రీ మతి ల్యాదాల గాయత్రి గారు, హరిరమణ గారు, గంగ్వార్ కవితగారు

___________________________

ఓ మనిషి...!

ఎంత ఎత్తుకు ఎదిగావన్నది కాదు

ఎందరిలో నీవొదిగావన్నది కావాలి 

వేలకోట్లు పోగేసానని పైలమనుకుంటున్నావ్

చివరియాత్రలో నీతోకలిసిరావని తెలుసుకోలేకున్నావ్

పలుకుబడే బలమనుకుంటు

పసిడిగిన్నెలో భుజిస్తూ

పులకరింతల గాలి పొసగని అద్దాలమేడలో

గాజు బొమ్మవై జీవిస్తున్నావ్


నీ దేహము ఆవిరయ్యేలోపే

గుండె భారాన్ని దించే

ఒయాసిస్ వంటి ఒక్కరైనా ఉన్నారేమో 

వెనక్కి మరలి చూసుకుంటు ఉండు

అర్థంలేని ప్రశ్నగా

ప్రాణంలేని శిలలా

ఇంకా ఒంటరి పరుగుఎన్నాళ్ళని?


మనసుకు పట్టే మకిలిని

దూరంగ తవ్విపోస్తూ..

అనురాగపు పందిళ్ళకు

ఆత్మీయతా పరిమళాలనద్దుతూ..

చిద్విలాసపు పువ్వులను

చెక్కిలిపై పూయిస్తూ ఉంటే


ఇక విరితావుల వనమై...

జీవనసదనమంతా నందనవనంగా వికసించక పోదా....!!



    *🍃గీతాశ్రీ స్వర్గం🍃*

09/10/20, 6:31 pm - +91 94417 71955: మల్లినాథసూరి కళాపీఠం YP

అంశం.. స్వేచ్ఛాకవిత శీర్షిక..  జ్ఞానజ్యోతులు 

పేరు... ముడుంబై శేషఫణి 

ఊరు... వరంగల్ అర్బన్ 

సంఖ్య... 254

నిర్వాహకులు... గాయత్రి గారు, హరిరమణ గారు, కవిత గారు. 

తేది... 9-10-2029.

.................... 

దీపం లక్ష్మికి ప్రతిరూపమై 

దీపజ్యోతి పరబ్రహ్మమై 

తిమిరమును తొలగించి 

వెలుగునందించు దీపకాంతులు 


ప్రమిదలో వత్తివేసి 

చమురుతో వెలిగించు దీపాలు 

చీకటిని చీల్చే 

వెలుగుపూల కాంతులు 


భగవత్ సన్నిధానమున 

నిత్యం కోవెలలో వెలిగే దీపాలు 

మంచితనానికి మారురూపులు 

మనిషి మదిలోని 

కల్మషాన్ని కడిగే జ్ఞానజ్యోతులు 


భగవదార్చనకై దేవళమునకేగి 

నిర్మల మనసుతో 

ఆత్మనివేదన జేసిన 

కొండంత వెలుగునిచ్చి 

అండగా నిల్చు కోవెలదీపాలు.

09/10/20, 6:33 pm - +91 77807 62701: మల్లినాథసూరి కళాపీఠం*

*సప్తవర్ణముల సింగిడి*

*ఏడుపాయల*

ప్రక్రియ.వచనకవిత(స్వేచ్చాఅంశం)

శీర్షిక : దోసిట పట్టుకో

రచన : వినీలదుర్గ

తేదీ: 09/10/20


ఏరుతూ పోతే ఏదీమిగలదు

కవ్వించే కష్టకాలాన్ని

నారతీసి తొక్కిలాగాలి

అప్పుడే వెలుతురు నీదవుతుంది....!!


ఓడిపోయానని గుదిబండలా

మారితే ఎవరికి నష్టం

ని బతుకు నీకే సొంతం

సాగదీసినా,విరగ్గొట్టినా,పూలు పూయించినా

తోటమాలివి నీవే నని తెలుసుకో....!!


నేటి నిర్లక్ష్యం రేపటి కష్టానికి

సోపానం

నేటి చైతన్యం రేపటి ఉదయాలకు స్వాగతం....!!


ఎగిరిపడకురా నీవేమీ 

శిలాశాసనం కాదు

ఏదో ఒకరోజు ఊపిరి గాలిలోనే

ఆరొజు చేతకానివాడిగా మిగలక

సమయాన్ని దోసిట పట్టుకో....!!



                                🌹వినీల🌹

09/10/20, 6:37 pm - +91 79899 16640: మల్లి నాథ సూరి కళా పీఠం

కారటు

లక్ష్మి మదన్

✉️✉️✉️✉️✉️✉️✉️✉️✉️

ఊరికి వోయినోల్లు కారటేస్తే

ఉభయ కుశలం తెలిసేది


కారటు ఒక్కల్లు రాస్తుంటే

గీ ముచ్చట రాయి అని

గా ముచ్చట మర్షినవ్ అని

అందిచ్చే ఇంటోల్లు పక్క నించి


ఇరికిచ్చి ఇరికిచ్చి సంగతులు

ఇగురంగా రాసి మల్ల చదివి

ఎర్ర డబ్బాల ఏసి రావాలె

ఇగ ఎదురు చూసుడు మొదలు

జవాబు కారటు వొచ్చే దాకా


కారటు ముట్టి నోళ్ళ సంబరం

ఇంతా అంతా కాదు మరి

ఒక్కళ్లు చదువుతుంటే..

సుట్టు ముట్టి అందరు వినాలే

అక్కడున్న మనిషి ఎదురుంగ ఉన్నట్టు


అత్త గారింటికి బిడ్డను సాగ దోలి

ఆకిట్ల దిక్కు మొకం బెట్టే అమ్మ బాపు

సైకిలేక్కి వొచ్చే పోస్ట్ మామ కోసం

ఇగో కార టొచ్చింది అని గంట గొట్టంగనే

ఉర్కుడే ఒక్క జంగల

గా పోస్ట్ మనిషి మేన మామ లెక్క


బిడ్డ అత్త సాటుకు రాసిన కార టు చదివి

కండ్లల్ల నీల్లు వెట్టి కుదార్థం చేశుకునుడు

సుట్టాల నడుమ దోస్త్ లెక్క కారటు

గా రోజులే మంచి గుండె..

గిపుడు చిటుక్కు పటుక్కు ఫోన్లు

09/10/20, 6:38 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

అమరకుల దృశ్యకవి సారథ్యంలో..

అంశం :స్వేచ్ఛా కవితాంశము.

నిర్వహణ : గాయత్రిగారు, హరిరమణగారు,కవితగారు.

కవి పేరు.:తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.


కవితా శీర్షిక: *అనంత కాల గమనంలో..*

*************************ఈ అనంత కాల గమనంలో..

దూరమెంతో తెలియని పయనంలో..

నీవారెవరూ...

చివరకు నీ తోడెవరూ..

ఏదో కావాలని ఆరాటం...

ఎంతో ఎదగాలని పోరాటం..

ఏది నిత్యం...

ఏది సత్యం..

ఏది పాపం ..

ఏది శాపం...

తెలియనిదేదో కావాలని ..

నిత్యం...శోధన చేసావు..

అనునిత్యం సాధన చేసావు.

 బతుకు బాటలో..

ఆశయాల తోటలో..

ఆకాంక్షల పల్లకి నెక్కావు..

అగాధపు అంచులు తాకావు.

ఆనందశిఖరాలధిరోహించావు

కాలం కరిగి..

కాయం తరిగి...

నిరాశ..నిట్టూర్పుల పర్వంలో..

నిన్ను నీవే ప్రశ్నించుకో..

నీవారెవరని..

నీ తోడెవరనీ...!

************************

ధన్యవాదాలు.!🙏🙏

09/10/20, 6:39 pm - +91 99596 94948: మల్లినాధ సూరి కళాపీఠం

స్వేచ్చా కవిత.

నిర్వహణ : గాయత్రి గారు, హరి రమణ గారు, కవిత గారు.

పేరు : మంచాల శ్రీలక్ష్మీ

ఊరు : రాజపూడి.

అంశం : బతుకు పుస్తకం

..........................................

మా జానెడు పొట్టలో

మెతుకు కోసం బతుకు పుస్తకం రచిస్తుంటే 

మన్ను కప్పిన కాళ్ళనిండా 

ముళ్ళు పాళీలు గుచ్చుకుని

రక్తం సిరా ఎంత కారిందో....

కడుపు నిండిన

మా చిరునవ్వులు చూసి

మొదటి శ్రేణి లో గెలుపొందిన 

విద్యార్థిలా నవ్వేవాడు నాన్న.


వెతలు ఎన్ని పడ్డా, కలత పడ్డ మనసు నొదిలి

మాఅక్షర జ్ఞానం కోసం బడి 

బతుకు మార్చుతుందనే విశ్వాసం తో

అర్థమున్న తెల్ల కాగితాల భోజనం పెడుతూ

వ్యర్థమవుతున్న పచ్చకాగితాలు ఋణంగా మారుతుంటే

ఉన్నత చదువులు

ఉన్నంతలో చదువుగా మార్చుకోమంటూ

ధన వంతులకే వంత పాడే

కళాశాలల్లో మేటియైన నేటి చదువులు.


ఇక పై నాపైచదువులు సాగవని

నా చెంపలపై జారిన అశ్రువులను చూసి

సముద్రం లో టోర్నడో వచ్చినప్పుడు

పైకెగసి పడే ఏక సుడిగుండమైన అలలా

నాన్న కళ్ళలో అశ్రువులు.

ఉన్నత శ్రేణిలో నున్న నన్ను

ఉన్నతంగా చూడాలనే అభిలాష.

పట్టుదలతో పరుగు తీసాడు .

రణం లాంటి ఋణంకోసం...

ఎంతైనా... మనసెరిగిన నాన్న కదా..

09/10/20, 6:41 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 09.10.2020

అంశం : స్వేచ్ఛాకవనం!

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీమతి కవిత, శ్రీమతి హరిరమణ,

శ్రీమతి గాయత్రి 


శీర్షిక : వంచన! 


తే. గీ. 

నమ్మకముతోడ వాక్కులన్ నయముఁజూపి

చిరునగవులు పూయించుచు చితఁబాపు

పెద్దలవలె చెలాయించు పెత్తనంబు

చివర వంచనఁ జేసియే చిత్తగించు!


తే. గీ. 

స్నేహభావంబు చూపుచు చిక్కని వగు

మాటలను కలుపుకొనుచు మమతకలిగి

యున్నయట్లుఁ నటించుచు తిన్న యింటి

వాసములను లెక్కించు వంచకుడయి!


తే. గీ. 

పదుగురు నడిచెడు బాటఁ పరుగులెత్తి

సకల జనుల దీనత్వముఁ చక్కదిద్దు

వాని వలె తీయని పలుకుల్ పలికి, తాను

చల్లగఁ ఘనకీర్తి గడించు స్వార్థపరుడు! 


తే. గీ. 

మనిషి బంధబాంధవ్యాలు, మానవత్వ

మహిమఁ, విలువలనెల్లను మరచి పోయి 

రాక్షసత్వంబు పూనిన రక్కసునిగఁ

వావి వరసలు మరచెను వంచకుడయి! 


తే. గీ. 

కష్టసమయమందు తనను కనికరించి

యాదుకొనిన మహాత్ముని నార్తియందు

పేర్మితో ముచ్చటించక విసుగుకొనెడు

ఘన కృతఘ్నత కలిగెడు ఖలుడె కపటి! 


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

09/10/20, 6:42 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశము;అభీష్టము

అంశం:కలియుగ దైవం

నిర్వహణ:గాయత్రి గారు

హరిరమణగారు కవితగారు

ప్రక్రియ:గేయం


పుట్టినింటినుండి మేట్టినిళ్ళు జేరి

అమ్మవైతివమ్మ మాయమ్మ

కోరికన్నవమ్మ మాయమ్మ

                   /పుట్టినింటి/

చిన్నినోట అమ్మ‌ పిలుకోసము గర్భమందుబిడ్డ

కాళ్ళతొతన్నిన బాధనోర్చుకొని జన్మనిచ్చినావు 

చల్లనిమాయమ్మలాలపోసినావు

ఏజన్మబంధమో నీకడుపున పుట్టితినేనమ్మ

కడచూపు కైన కానకుండా నేను దేశమెళ్ళితినమ్మ

కరోనా కట్టెసెనమ్మ

                   /పుట్టినింటి/

పురిటినొప్పిరాగ బిడ్డ జన్మకై నోర్చుకుంటివమ్మా

నాకుజన్మనిచ్చి స్ప్రహ కొల్పోయి మరలబ్రతినావు

బుడిబుడియడుగులు వేయంగా మురిసిపోయిందమ్మ

నాన్నతో పోట్లాడి కిర్రు చెప్పులుదెచ్చి ఉపవాసమున్నదీ

చెప్పులేసి చూసి నిడివి నన్ను జూసి నవ్వింది మాయమ్మ

దేవతై నిలిచింది

                      /పుట్టినింటి/

తానుతినకపోతె పాలురావనిచల్దియన్నమునందు 

గంజ నీళ్ళుపోసి కడుపునింపుకొని పాలనిచ్చె నమ్మి

ఏడచవగానె పరుగు పరుగునచ్చినెత్తిపాలనిచ్చె 

నిద్రపోవజూసి జిష్షితాకునని నుప్పుతిప్పివేసే

నూదంపొగనువేసి నుయ్యాలనూపుతూ 

మాయమ్మ నన్ను బ్రతికించె

                    /పుట్టినింటి/


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

09/10/20, 6:42 pm - +91 98491 54432: <Media omitted>

09/10/20, 6:44 pm - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

9.10.2020

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

 ల్యాదల గాయత్రి గారు

హరి రమణగారు

గంగ్వార్ కవితగార్ల పర్యవేక్షణలో

అంశం:ఐచ్ఛికం

డా . సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880


శీర్షిక: ఆలస్యం ఖరీదు


ట్రింగ్...... ట్రింగ్

వీనులకు విందుగా ... ఒక్క ఉదుటున

కిటికీ దగ్గరకు

కాఖీ బట్టలు, జారిపోయే కళ్ళద్దాలు

చేతిలో ఉత్తరాల దొంతరలు

చెవి వెనక కలము.. ముఖము మీద నవ్వు

తపాలా రామయ్య పక్కింటి తలుపు దగ్గర

తరువాత ఇక్కడికే అవున ఈరోజు తప్పక

ఇచ్చిన గడువు దాటిపోయింది

లేఖ రాలేదు... తనూ రాలేదు

ఈరోజు తప్పక వస్తుంది... తప్పక

మదిలో మొలకెత్తి చెంపలకు పాకిన నవ్వు

                   పెదాల చివర మెరుస్తుంటే

తనువంతా తడబడి చిరువణుకు

కనుదోయిలో ఆశల ప్రమిదల వెలుగు

హృది అంతా అలవికాని ఆనందపు జిలుగు

ఏమీ కనిపించని, వినిపించని స్థితి...

కొన్ని క్షణాలే అయినాఎంత పులకింత


చటుక్కున ప్రస్తుతానికివచ్చా....

ఏడీ రామయ్య ?కోటి ఆశల పల్లకీని మోసుకొచ్చిన ఆ ఆత్మీయుడెక్కడ?

అదేమిటి?

రెండిళ్ళు దాటి దూరంగా ..ఎంతో దూరములో

అంటే .... ఈ రోజు కూడా... ఈరోజు కూడా

మతి పోయినట్లు.. గుండె లయ తప్పినట్లు..

శ్వాస ఆగినట్లు... అడుగులేయలేనట్లు

కుప్ప కూలిపోయేట్లు.... కూలిపోయి


రేపయ్యింది.....ఉదయం...

అతనొచ్చాడు...........ఆమె లేదు


ఆశల సంద్రంలో ఊగితూగి అలసి ఆగిపోయి

నిరాశ నిస్పృహ చుట్టిముట్టి మునిగిపోయి

రాలేదని రాడని నిలువునా క్రుంగిపోయి..ఆమె


చెప్పకుండా వచ్చి ఆశ్చర్యపరచి ఆనందములో

ముంచెత్తుదామని .....చిగురొత్తే ఆశల చిరుజల్లులతడుస్తూ వచ్చిన అతను..నిశ్చేష్ట।

 

మధ్యాహ్నం:


గుమ్మములో.. కన్నీళ్ళతో...ఉద్వేగాన్ని ఆపుకుంటూ రామయ్య 

 చేతిలో ఆమెకు అతను రాసిన లేఖ.


ఇది నా స్వంత రచన

09/10/20, 6:47 pm - +91 98496 14898: శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

నేటి అంశం; ఇష్ట కవిత

తేదీ;09-10-2020(శుక్రవారం)

రచన; యక్కంటి పద్మావతి, పొన్నూరు.


శీర్షిక;మహానటుడు


సామర్ల వంశభూషణుడు

తెలుగుచిత్రసీమ ను మురిపించిన రారాజు

 చిత్రగమ్మత్తులకు  నేపాలమాంత్రికమే విస్మయం

ఘటోత్కచుడు గా ప్రతి తెలుగువానిహృదిలోశాశ్వతం

హిరణ్యకశిపునిగా ఆయనకు సాటి వచ్చువారున్నారా?

రాజరాజనరేంద్రునిగా మంత్రముగ్ధులనుచేసిన తీరుఅమరం అమరం

రారాజుగా నభూతోనభవిష్యతి

కీచకునిగా విశ్వఖ్యాతి

అభిషేకించిన ప్రతి వెన్నెల కిరణం

ప్రతి వర్షపు చుక్క, ప్రతి తుషార బిందువు పునీతమే

సన్నుతించిన ప్రతిఅక్షరం సత్యసుందరమే

చుట్టుతిరిగిన గాలి పరిమళమద్దుకున్నదే

ఆ మాటల మూటలమలుపుల నటవైదుష్యం

పెదాలపైనే నిలబడి మురిపించిన తీరులెన్నో

వరించిన బహుమతులెన్నో

అల్లికలల్లిన సన్మాన పారిజాతాలెన్నో

మరుపురాక, మరువలేక  నీ కై తారవై వస్తావని ఎదురు చూపులెన్నో

దృశ్వకావ్యాలకు నీ రూపమే చిరునామా

అక్బర్ పాదుషా గా అద్భుతః

ఆతని గంభీరమధురవాచకానికై 

ప్రతిహృదయం పరవశం

09/10/20, 6:48 pm - +91 94913 52126: *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

సప్త వర్ణముల సింగిడి

అంశం:ఐచ్చికం

నిర్వహణ:శ్రీ మతి ల్యాదాల గాయత్రి గారు, హరిరమణ గారు, గంగ్వార్ కవితగారు

______________________


శీర్షిక:వలసపచ్చుల-ఆవేదన


వలస పచ్చులు


ఉపాధికైఊరుకానిఊరులో


తనవారు అంటూ తోడులేని చోటనా


పొట్ట చేత పట్టుకుని


కుటుంబంతో కొందరు


ఒంటరిగా మరికొందరు


తల్లి కోసం,ఆలికోసం,బిడ్డలకోసం,


నలుగురాళ్ళు సంపాందిదామని


పగలనక రేయిఅనక


రోడ్లుపై నిద్రిస్తూ,


గుడిసెలలో జీవిస్తూ


పండగలకో పబ్బానికో


యాత్రలకై ఎడాదికో


కన్నవాళ్ళను కట్టుకున్నవారినిచూసి


సొంత ఊరిలో సంతోషంగా గడపాలని


ఎప్పుడెప్పుడు ఊరులో

ఉగాది సంబరాలలో నాఅన్నవాళ్ళతో

 జురుపుకుందామని


తాపత్రయపడుతున్న తరుణంలో


కరోనా వచ్చి-కలలును మింగి


కన్నీరును,కలతను మిగిల్చి


మన అన్నవారి దరికి చేరుతమో లేమో


ఆఖరి చూపుకు నోచుకుంటామో లేమో ఏమోనని


మదన పడుతూ


తిండి తిప్పలు లేక,


 నిద్రాహారాలు రాక


నలిగినగుడ్డలతో నానావస్థలు పడుతూ అన్నామో రామచంద్రప్రభు అంటూ అలమటిస్తూ 


తమలో తామే అంతరంగ ఆవేదనకుగురి అయ్యేలా చేసింది ఈ కోవిడ్ మహ్మారి


డా.భారతి మీసాల

ఊరు,: రాజాం ,శ్రీకాకుళం

09/10/20, 6:49 pm - +91 85228 99458: *మల్లినాధ సూరి కళాపీఠం*

స్వేచ్చా కవిత.

నిర్వహణ : గాయత్రి గారు, హరి రమణ గారు, కవిత గారు.

పేరు : *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

ఊరు : *విశాఖపట్నం*

అంశం : *మనిషితనం మొలకెత్తింది*


కరుడుగట్టిన మనసురాతిని చీల్చుకొంటూ మానవతావిత్తనమేదో అంకురించి మనిషిని మనీషిగా ఆవిష్కృతం చేసింది,

కదనం మొదలయ్యాక మనిషిమనిషిలో అంతర్మధనం మొదలయ్యింది,

మనిషితనం మొలకెత్తింది

మృత్యుకౌగిట నిలబడ్డాక,

పోగొట్టుకొన్నదేమిటో పోగుజేసుకొన్నదేమిటో తేటతెల్లమయ్యింది 

కలికాలపు రోగం కబళించాక,

బందీఖానా మొదలయ్యాకే బంధాల విలువ తెలిసొచ్చింది ,

నాలుగు గోడల భోదివృక్షం తక్షణ కర్తవ్యం స్ఫురింపచేసింది,

స్వార్ధపు కబంధహస్తాలను పెకలించుకు

సాయంచేసే చేతులు విస్తారంగా ముందుకు వస్తున్నాయి,

మనుషుల మధ్యనే దూరం

మనసుల మధ్యన తరగని మమకారం

చేతులు మాత్రమే కలపము

చేయూతకు ముందుంటాము

మేమంతా మనుషుల్లా మారిపోయాం

మనసున్న మనుషుల్లా,

మా దేశం సౌభాగ్యం ఇక నిస్సంశయం

నా దేశానికి ఏమీ కాదు

ప్రతీ ఒక్కరూ మానవతావాదులే

ఎటు చూసినా సాయం చేసే చేతులే,

ఏ మాయరోగం మమ్మల్ని మట్టు

పట్టలేదు‌,

మానవాళి మనుగడ పునాదులిక కదలనే కదలవు,

అదిగో గెలుపురాగం, రేయిమాటున దాగివున్న ఉషోదయకిరణం ఉదయించే తరుణం అదిగో,

అందరమూ ఒకటై మహమ్మారికి

మరణశాసనం రాస్తున్నాం 

మహిని వీడి పోవాలని,

ఆపద ఘడియలు అంతరించేవరకూ

అప్రమత్తతే మా ప్రతి అడుగు,

కన్నీటి మేఘం వెలిసిపోతుంది

కలికాలపు రోగానికి ఖచ్చితంగా తెరపడుతుంది,

ఎడతెగని మా మనోనిబ్బరం ముందు

ఓటమి పలాయనం చిత్తగిస్తుంది,

ఘనమైన మా సంకల్పం ముందు

విజయమెలాగూ మోకరిల్లుతుంది,

మడమ త్రిప్పని మా కర్తవ్యధీక్షముందు 

లక్ష్యం కాంతిరేఖై సాక్షాత్కరిస్తుంది.


*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

09/10/20, 6:57 pm - +91 91774 94235: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడుపాయల.

అమరకుల దృశ్యకవి సారథ్యంలో..

అంశం :స్వేచ్ఛా కవితాంశము.

నిర్వహణ : గాయత్రిగారు, హరిరమణగారు,కవితగారు.

కవి పేరు.కాల్వ రాజయ్య 

ఊరు :బస్వాపూర్,సిద్దిపేట. 


శీర్షిక:గంగ శాంతనుల వివాహం 

.

.1 ఆటవెలది 


శాంతనుడను రాజు చనియెను వేటకు 

జంపె మృగము లెన్నొ యింపుగాను 

శ్రమను మరువ రాజు 

చల్లగాలి కొరకును 

చెట్టు నీడ కేగి సేద ధీరె 


2 ఆ  వె 


గంగ తీరమందు గనిపించె నొక యింతి 

చూడ ముచ్చటేసె  సుందరాంగి 

మనసు పడెను రాజు మానవ కన్యని 

పెళ్ళి మాట దీసె  ప్రేమ తోడ 


3 ఆ  వె 

మనువు జేసు కుంటె మాటొకటిమ్మనె 

కార్య మెట్టి దైన కాదననని 

మగువ యందు రాజు మనసునిడవ లేక 

అడ్డు జెప్ప ననియు యాజ్ఞ లిచ్చె


4 ఆ  వె 


.ప్రేమ జెందిరివురు ప్రేయసి ప్రియులైరి 

ఒకరినొకరు గలిసె ఒడలు మరచి 

గంగ శాంతనులది కల్యాణ మట్టుల 

చేసుకొనియు వారు  జేరె నగరి

09/10/20, 6:59 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

అంశం...ఐచ్ఛికాంశం

ప్రక్రియ... వచనం

శీర్షిక... నీటి బిందువులు

పేరు...యం.టి.స్వర్ణలత

నిర్వాహణ...గాయత్రిగారు...హరిరమణ గారు..కవిత గారు



నింగి నుండి జారితే అవి వర్షపు చినుకులు

కంటి నుండి జారితే కన్నీటి బిందువులు


చినుకులుగా రాలితే వర్షపు జల్లులు

ఉదృతంగా రాలితే కరిసే జడివాన


ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లితే ఆనందబాష్పాలు

బాధతో సుడులు తిరుగుతూ కారితే కన్నీరు


వాగులు వంకలు నిండి వరదలై పారుతూ

అంతిమంగా సముద్రాన్ని చేరుతుంది వర్షపునీరు


హృదయాంతరాల నుండి ఉబికి వస్తూ

చెంపల వాకిట జారుతూ ఊరట నిస్తుంది కన్నీరు


గుండెల నిండిన ఆనందం పరవళ్ళు తొక్కి

పంచుకున్నప్పుడు జారేది ఆనందపు పన్నీరు


నదిలోది నీరే సముద్రంలోనిదీ నీరే అయినా

నదినీరు మంచినీరైంది సాగరాన ఉప్పునీరైంది


నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్ళే అయినా

అవి ఆనందం విషాదాలకు ఆనవాళ్ళు


అన్నింటినీ కరిగించుకునే సార్వత్రిక ద్రావణి నీరు

అందుకే ఆనందాన్ని బాధలను సైతం కరిగిస్తుంది

09/10/20, 7:00 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- ఐచ్ఛికం

నిర్వా హకులు : లాధ్యల గాయత్రి , హరిరమణ, కవిత గారు పేరు:-పండ్రువాడసింగరాజు

 శర్మ

తేదీ :-09/10/20 శుక్రవారం

శీర్షిక:- పెళ్లిళ్లుపందిరిలు

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- వచన కవిత

ఫోన్ నెంబర్9177833212

6305309093

*************************************************

పెళ్ళి చూపులతో మొదలై నూతన వధూవరులు గృహప్రవేశం వరకు జరిగేతంతూ మగ పిల్లల వారి వంతు ఆడపిల్ల వారి వంతు నడిమింటి బంధువుల సందడులు



ఊరేగింపులు, భోజనాలు బాజాలు ,వేదమంత్రాలు, సప్తపదులు పచ్చనిపందిళ్లు, బంగారాలు, సింగారాలు, అడుగడుగునహడావిల్లు తలంబ్రాలు అప్పగింతలు


నక్షత్ర దర్శనాలు  వేదిక ప్రదక్షణలు బంధువుల ఆశీర్వాదములు కలకాలం దాంపత్య అన్యోన్యత కొరకు సాగే జీవిత నౌక. ....

************************************

09/10/20, 7:08 pm - +91 99595 24585: *మల్లినాథసూరి కళాపీఠంyp*

*సప్తవర్ణాల సింగిడి*

*అంశం...ఐచ్ఛికాంశం*

*ప్రక్రియ... గేయం*

*శీర్షిక... కంగారు కరోనా*

*పేరు : కోణం పర్శరాములు*

*సిద్దిపేట బాలసాహిత్య కవి*

*నిర్వాహణ...గాయత్రిగారు...హరిరమణ* *గారు..కవిత గారు*

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

వూహాన్ లో పుట్టింది

ఉర్వినంత జుట్టింది

ఊరువాడ తిరుగుతుంది

ఉగ్రరూపం దాల్చింది !


దగ్గినోళ్ళ తుమ్మినోళ్ళ

తుంపిర్లు పడుతుంటె

పక్కనున్న వాళ్ళమీద

వాలుతుంది రక్కసి !


గొంతులోన మంట వెట్టి

ఊపిరి తిత్తుల జొచ్చి

శ్వాస ఆడకుండా జేసి

చంపుతుంది కరోనా !


బయట కెళ్ళి పోవద్దు

బలాదూర్ తిరుగొద్దు

కరోనా మహమ్మారి

కాటుకు గురికావద్దు !


సామాజిక దూరముతో

ఇంటి లోనె ఉందాము

శానిటైజర్ పూసుకొని

చేతులైతె కడుగుదాం !


గబ్బిలాల రోగమురా

గత్తర లేపిందిరా

మందులేని రోగమురా

మహమ్మారి వైరస్ రా !


వైద్య దేవుళ్ళారా

వందనాలు మీకు

పోలీసు అన్నలారా

సాటి లేరు మీకెవరు !


విద్యుత్తు ఉద్యోగులారా

మీకు చేస్తున్నాం ప్రమాణాలు

పారిశుద్ధ్య కార్మికులకు

పాదాభివందనాలు!


నర్సులారా, ఆరోగ్య కార్యకర్తలరా, గ్రామ సేవకులారా మీకందరికి

పెడుతున్నాం దండాలు!


రాజకీయ నాయకులు

ప్రగతి ప్రజా సేవకులు

అనుక్షణం సమాజాన్ని

చేస్తుండ్రూ జాగృతం !


కోణం పర్శరాములు

సిద్దిపేట బాలసాహిత్య కవి

చరవాణి:9959524585

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

09/10/20, 7:11 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 10.2020

అంశం. ఐచ్ఛికం

శీర్షిక:.ప్రవరాన్విత 

నిర్వహణ.గాయత్రి,హరిరమణ,

కవితగారు

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ.


.           ప్రవరాన్విత


మనసు మరోలోకంలో‌విహంగ

వీక్షణలో నీ‌ సాక్షత్కారం.సాకారమై

నా మనోప్రాకారంలో సంచరిస్తూ

చలిస్తూ నన్ను కదిలించి నా.స్వప్న

సౌధంలో సుందరసింహాసనమధిష్టించి

నన్ను శాసిస్తున్న నువ్వు ప్రతి

పువ్వులో ‌పరిమళమై పరవశమై

విలసద్ మల్లికాహారతల్పమై

అభంగతరంగ‌మృదంగ నాదమై

ప్రాతః కాలంపఠిత‌వేద‌సూక్త‌ప్రోక్త

శృతిజనితమై ప్రాగ్ధిశవేదికా‌సంజనిత

సంప్రాప్తికాఅరుణారుణమయూఖమై‌ఒప్పారిఅరవిరిసిఎరుపెక్కినసిగ్గుల‌పూమొగ్గవై లేకెంజాయి‌శింజాణవై

తుషార హారాల‌ కైదండవై నన్ను

ఎడబాయక నాశ్వాసవై‌.సంగీత

సాహిత్యసమలంకృతా కావ్యమై

నన్నలరించి కవ్వించి నవ్వించి

అలరించి‌ నీ విలాసముచెప్పకనే

చిద్వలాసము‌చేసి తటిల్లతలా

తృటిలో మాయమై తలపుతటాక

మనోకమలమైన నాయికా ‌నీ వెవరు?

09/10/20, 7:11 pm - +91 73969 55116: మల్లినాథ సూరి కళాపీఠం yp

డా. N. ch.సుధా మైథిలి

గుంటూరు

అంశం:ఐచ్ఛికం

నిర్వహణ:కవయిత్రి త్రయం

*************

వినాశకాలే..


మారుతున్న జీవన గతులు.. 

మితిమీరుతున్న విదేశీ పోకడలు.. 

ఆకాశంలో విహంగాలకన్నా... 

ఉపగ్రహాలే ఎక్కువై తిరిగేస్తూ.. 

భూమిలోని సారాన్ని ఏతమేసి తోడేస్తూ.. 

ఉర్విలోని ఊపిరులను ఆనవాళ్లు లేకుండా ఊడ్చేస్తూ..

మిన్నుని, మన్నుని  నిలువెల్లా దోచేస్తూ.. 

పుడమిలోని అణువణువునూ పనిగట్టుకుని నుసిమేస్తూ..  

విజయగర్వాన్ని తలకెక్కించుకుని.. 

వినాశ కాలే విపరీత బుద్ధి: అన్న చందమున..

విజ్ఞానాన్ని వికాశానికి కాక.. 

వినాశనానికి వినియోగిస్తూ..

 ప్రకృతిని ప్రమోదoగా కాక..

 ప్రమాదంగా వాడేస్తున్న వేళ..

ప్రళయమవ్వదా జగతి..

సందేహమవ్వదా మానవుని ప్రశాంత ఉనికి..

09/10/20, 7:14 pm - Balluri Uma Devi: <Media omitted>

09/10/20, 7:14 pm - Balluri Uma Devi: 9/10//20


మల్లి నాథ సూరి కళాపీఠం

పేరు:డా.బల్లూరి ఉమాదేవి

అంశము:ఐచ్ఛికము

నిర్వహణ:శ్రీమతి ల్యాదాల గాయత్రి

          .శ్రీమతిహరి రమణ

        .      శ్రీమతి కవిత గారు

శీర్షిక:*గ్రామదేవత*

ప్రక్రియ:పద్యములు



తే.గీ:పరశు రాముని తల్లియౌ పడతి రేణు 

     కమ్మ గ్రామదేవత యయ్యె నవని యందు

       కోరి కొలిచెడి  జనులకు కూర్మి తోడ

       వరము లొసగుచు కాపాడు పదిలముగను.


ఆ.వె:లలిత కాళి దుర్గ లక్ష్మి మహేశ్వరీ

         యనెడు పేర్ల తోడ నవనియందు

       అమ్మతల్లి గానె యర్చింప బడుమాత

         జానపదుల కెల్ల జనని గాదె.


ఆ.వె:ఎల్లరకును నమ్మ యెల్లమ్మ యనుపేర

        వాసి కెక్కె తాను వసుధ యందు

       జనుల బాధ దీర్చి సంతోష మొసగంగ

         నాదిశక్తి యనగ నవతరించె


ఆ.వె:సకల జనుల కాచు జమదగ్ని యిల్లాలు

       గ్రామ ప్రజల పైన కరుణచూపు

       కరము మోడ్చి కొలువ కామితార్థ మొసగు

       తల్లి రేణుకమ్మ ధరణి యందు.

09/10/20, 7:16 pm - +91 83093 96951: *************************

మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-కవయిత్రీత్రయం.

అంశం:-స్వేచ్ఛాకవిత.

తేదీ:-09.10.2020 

పేరు:- దంత రాజు విజయలక్ష్మి

ఊరు:- కరీంనగర్

చరవాణి:-8309396951




* శ్రీ వెంకటేశ్వర ప్రశస్తి*


ఆది మధ్యంతంబు లెరుగని ఆత్మబంధు

కలియుగంబున భక్తుల  గాచుటకును

సప్తగిరులను సుస్థిరము జేసుకొనుచు

ఇలను వెలసితివయ్య! తిరుమ శ్రీనివాసా!!


సుందరమ్మగు నీ రూపు జూచినపుడే

అనిర్వచన మానంద మంకురించి

నంద గోవిందనామాలు బల్కునట్టి

భక్తవరులను గాచు "  కారుణ్య శక్తి " నీవే!!


ఆపద మొక్కుల వాడుగ ఆదరిస్తూ

నిత్యసత్యంబు భక్తుల జూపుకొనుచు

స్వామి స్వామంచు సన్నుతి జేయువార్కి

భక్తసులభుడు  " వెంకన్న  " మహితయశుడు!!


అణువు అణువు న నిలిచిన " మణవి " నీవే

నింగి నేలను నెలకొన్న " భృంగి" నీవే

సప్తగిరుల్లో వెలసిన " శక్తి " నీవే

పాపహరుడవు  " పావన మూర్తి "నీవే!!


నిన్ను నమ్మి నియతితో  "  కొండ " జేరు

భక్త వరులకు కోర్కెలు తీర్చు కొనుచు

కొంగుబంగారమై పుడమిన వెలసినావా!

సకల గుణ ధామ తిరుమల భక్త పోష!!


†*******************

09/10/20, 7:18 pm - +91 99639 15004: మల్లి నాధ సూరి కళాపీఠం yp

సప్తవర్ణముల సింగిడి. 


ప్రక్రియ. ఐచ్చిక అంశము 

నిర్వహణము. కవయిత్రి త్రయము. 


రచన. ఆవలకొండ అన్నపూర్ణ ఊరు. శ్రీకాళహస్త్రి చిత్తూరు. 


శీర్షిక. ఇంత గొప్పదానివే. 


ఇంత గొప్పదానివే చిత్తూరు జిల్లా, నీవెంత గొప్పదానివే 

ఏడు కొండల వేంకన్న, 

కాళహస్తి శివయ్య, కాణిపాకం గణపయ్య నీచెంతనే వున్నారు.



విశ్వ కవి రవీంద్రునిచే జాతీయ గీతం రాయించుకొన్నావు. 

తత్వ వేత్త జిడ్డు కృష్ణమూర్తి. 

నీ ముద్దు బిడ్డ. 

సినీరంగనా ఓ వెలుగు వెలిగిన చిత్తూరు నాగయ్య నీ గారాల బిడ్డ. ఎంత గొప్పదానివే "


కళాశాలలు, విశ్వ విద్యాలయాలకు కొదువలేదు. 


మామిడి పండ్లకు మంచి తనానికి అంతే లేదు. 


నయాగరా జలపాతంలా తలకోన కిరీటం నీకున్నది. హార్సిలీ హిల్స్ నందన వనాలు పూల జడలావున్నది. 

అటు కుప్పం ఇటు కాళహస్తుల నడుమ నీవున్నావు "ఇంత గొప్ప దానివే "


అన్నీ వున్నాయన్న అహం నీలో లేనేలేదు. 

ఎవరు వచ్చిన కన్న తల్లిలా ఆదరిస్తావు, నెచ్చలిలా ప్రేమిస్తావు, సకల కళల సమాహారమే నీవు. 

బేషజామన్నది నీకు ఎన్నడు లేదు. మానవత్వాన్ని మించినది వేరేది లేదని అందరు చక్క. గా ఉండాలని కోరుకొంటావు.. ఎంత చక్కని దానివో ".

09/10/20, 7:23 pm - +91 97017 52618: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

అమరకుల దృశ్య కవి గారి పర్యవేక్షణలో

అంశం : ఇష్ట కవిత


నిర్వహణ:శ్రీమతి ల్యాదలగాయత్రీ 

             గంగ్వార్ కవిత,

              హరిరమణ గార్లు

----------------------------------------

*రచన            : మంచికట్ల శ్రీనివాస్* 

ప్రక్రియ           : వచనం

*శీర్షిక             : నా జీవితమే అవధానం!* 

  ---------------------------------

కెవ్వుకేక తో మొదలైన జీవితం

అమ్మ నవ్వును ఆస్వాదిస్తూ 

అమ్మ మాటలు అమ్మ లాలన పాలనలో 

నే చేసితి నొక్క అవధానం!

 

పలక బలపముతోటి పయనిస్తి బడిలోకి 

గురువుజెప్పినవి  గుర్తుండేందుకు

చేసితి మరో అవధానం!

 

చదువు పూర్తయ్యాక 

గ్రాసముకై వెదుకులాటలో 

అద్భుత ఏకాగ్రతతో చేసితి 

గెలువటానికి మరో అష్టావధానం!


జీవితములో గెలిచానని సంబరమో 

అన్నీ సాధించాననే గర్వమో!

వైవాహిక బంధంతో 

కుటుంబ నావను లాగే క్రమంలో

చేసితి మరో అవధానము!

 

నడి యీడు కొచ్చాక 

పిల్లల పెళ్ళిసంబంధాల వేటలో

చేయాల్సొచ్చింది మరో అష్టావధానం!

ఇక... 

వృద్ధాప్యం వచ్చాక 

రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతే...

నేనూ.. మా ముసలావిడతో

చేస్తున్నాను మరో అవధానము!


ఎన్ని అవధానాలు చేసినా...

జీవితమనే పయనంలో జీవచ్ఛవమే అంత్యం 

అదీ ఒక అవధానము రూపంలో ..!

09/10/20, 7:32 pm - +91 99599 31323: మల్లి నాథ సూరి కళా పీఠం ఏడుపాయల



సప్త వర్ణాల సింగిడి

అంశం.... ఐచ్చికం


కవిత సీటీ పల్లీ

9/10/2020


ఏ నీడ లేని చెట్టు అందరినీ ఆదరించే కల్పతరువు.....


ఏ ఆశలు లేని మేఘం అందరి ఆశలు పండించే సిరుల వాన.....


ఏ కలలు లేని నీరు అందరి ఆకలి తీర్చే అమృతం.....


ఏ బంధం లేని గాలి అందరి గుండెలో నీల్చే చిరు ప్రాణం.....


నేను మనిషికి మనుగడ నేర్పిన  మ్రానును .....


స్వార్థ చింతన లేని మానవత్వాన్ని నేను....


వనమై .... మీలో మనమై...

కలిసి సాగే మీ జీవిత హరిత హారాల పయనం నేను.....

09/10/20, 7:33 pm - +91 93913 41029: మల్లినాథసూరి కళాపీఠం*

*సప్తవర్ణముల సింగిడి*

*ఏడుపాయల*

ప్రక్రియ.వచనకవిత(స్వేచ్చాఅంశం)

శీర్షిక : నీకు నీవే సాక్షిగా

రచన : సుజాత తిమ్మన 

తేదీ: 09/10/20


*******

శూన్యం అంటే ఏమి లేదు 

అనుకుంటాము కానీ ..

ఆ శూన్యంలోనే మనకి 

మనం పరిచయం అవుతాము 


ఎంత ప్రేమని పంచుతున్నామో 

ఎంతగా నటిస్తున్నామో ...

మనసుతో బ్రతుకుతున్నామా...

రంగుపూసుకుని తిరుగుతున్నామా 

అన్నీ తెలియజేసేది శూన్యమే ..


సాక్షిగా మారిన అత్మ కు 

సమాధానం చెప్పుకుందుకైనా 

ఇబ్బందులకు ఓర్చి 

అంటిన మాలిన్యాన్ని కడిగేస్తే 

మనిషిగా నైనా మిగిలుతాము 


లోకచింతనలో అన్నీ 

పొందుతున్నా,మనుకుంటే 

కర్మఫలం వెంటాడి వేధిస్తుంది 

ఇహంలో పరం గూర్చి 

ఆలోచన చేస్తూ ..

జన్మానికి  సార్థకత చేసుకోవాలి !

******

సుజాత తిమ్మన. 

హైదరాబాదు.

09/10/20, 7:36 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశము;అభీష్టము

అంశం:కలియుగ దైవం

నిర్వహణ:గాయత్రి గారు

హరిరమణగారు కవితగారు

ప్రక్రియ:గేయం


పుట్టినింటినుండి మేట్టినిళ్ళు జేరి

అమ్మవైతివమ్మ మాయమ్మ

కోరికన్నవమ్మ మాయమ్మ

                   /పుట్టినింటి/

చిన్నినోట అమ్మ‌ పిలుకోసము గర్భమందుబిడ్డ

కాళ్ళతొతన్నిన బాధనోర్చుకొని జన్మనిచ్చినావు 

చల్లనిమాయమ్మలాలపోసినావు

ఏజన్మబంధమో నీకడుపున పుట్టితినేనమ్మ

కడచూపు కైన కానకుండా నేను దేశమెళ్ళితినమ్మ

కరోనా కట్టెసెనమ్మ

                   /పుట్టినింటి/

పురిటినొప్పిరాగ బిడ్డ జన్మకై నోర్చుకుంటివమ్మా

నాకుజన్మనిచ్చి స్ప్రహ కొల్పోయి మరలబ్రతినావు

బుడిబుడియడుగులు వేయంగా మురిసిపోయిందమ్మ

నాన్నతో పోట్లాడి కిర్రు చెప్పులుదెచ్చి ఉపవాసమున్నదీ

చెప్పులేసి చూసి నిడివి నన్ను జూసి నవ్వింది మాయమ్మ

దేవతై నిలిచింది

                      /పుట్టినింటి/

తానుతినకపోతె పాలురావనిచల్దియన్నమునందు 

గంజ నీళ్ళుపోసి కడుపునింపుకొని పాలనిచ్చె నమ్మి

ఏడచవగానె పరుగు పరుగునచ్చినెత్తిపాలనిచ్చె 

నిద్రపోవజూసి జిష్షితాకునని నుప్పుతిప్పివేసే

నూదంపొగనువేసి నుయ్యాలనూపుతూ 

మాయమ్మ నన్ను బ్రతికించె

                    /పుట్టినింటి/


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

09/10/20, 7:36 pm - +91 98491 54432: <Media omitted>

09/10/20, 7:36 pm - Anjali Indluri: 🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

O9.10.2020 శుక్రవారం

అంశం : స్వేచ్ఛా కవిత్వం

నిర్వహణ: హరి రమణ గారు

                గంగ్వార్ కవిత కులకర్ణిగారు

                 ల్యాదాల గాయత్రి గారు


రచన : *అంజలి ఇండ్లూరి* 

ప్రక్రియ : వచన కవిత

 *శీర్షిక: ఒకే ఒక్క ప్రశంస* 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ఒక్క ప్రశంస ఒకే ఒక్క ప్రశంస

నిష్కల్మషమైన మస్తిష్కము నుండీ

జాలువారిన నిష్కపట ప్రశంస

ఇచ్చిచూడు ఒక్కసారి ఒక్క ప్రశంస

మనసు పొరలను ఛేదిస్తూ

మెరుపు రవళులను కురిపిస్తూ

చీకటి కోణాలను చీల్చుకుంటూ

చేసే చేతలకు సత్తువనిస్తూ

న్యూనతాభావాన్ని ఎండగడుతూ

ఆశలకు శ్వాసలందిస్తూ

ఆత్మవిశ్వాసానికి  ఉాతమిస్తూ

చైతన్యానికి ప్రేరకమవుతూ

నూతన పథాలను అన్వేషిస్తూ

నిత్యం మానసాన్ని వికసింపజేస్తూ

నమ్మకాల బాట నడిపిస్తూ

తపన ఆతృతలకు ఆధ్యమవుతూ

అంతరంగాన్ని చిగురింపజేస్తూ

నూతనోత్తేజానికి నాంది పలుకుతూ

విశ్వాసపు కాంతిరేఖలలో

ఎగసిపడే కడలి తరంగమై

ఊరకలెత్తించే జ్ఞాన తురంగమై

విస్ఫోటనం కలిగిస్తూ లోలోన

ఉబికివచ్చును సృజన పైపైకి 

వెల్లువగును నిత్యం శక్తిసామర్థ్యాలు

ఇచ్చిచూడు ఒక్కసారి ఒక్క ప్రశంస

పొందిచూడు ఆ అందమైన అనుభూతిని

విజయబావుటా ఎగరేస్తూ

అభిమానవర్షం కురిపిస్తూ

కాంతులు నిండిన కళ్ళను మెరిపిస్తూ 

కృతజ్ఞతలతో చేతులను జోడిస్తూ

నీ హృదయాన్ని అంతా తడుముతూ

మనసును ప్రశాంతతో తడుపుతూ

నీ ప్రశంసల సంకీర్తనల స్తుతులలో

వెలిగిపోవు ఒక జీవితం

నిలిచియుండు కలకాలం


✍️అంజలి ఇండ్లూరి

    మదనపల్లె

     చిత్తూరు జిల్లా

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

09/10/20, 7:37 pm - +91 98489 96559: గిరి సప్తకముపైన సిరితోడ నెలవైన

 వరదాయకా వేంకటేశా

సురనాయకా శ్రీనివాసా

కరుణాలవాల కరి భక్త లోల 

కరుణించ మమ్మేల రావేల ఈ వేళ


భృగు మౌని కోపమే

ఎగయంగ శ్రీ లక్ష్మి

 వైకుంఠమే వీడి రాగా

మహలక్ష్మి శోధనే

జగమందు సాగగా

వల్మీకమే విడిదిగాగ

గోపాలకుని కోపమే గోపాల

నీ పాల పెనుగాయమే

పాపాయివైనావులే వకుళ 

ప్రాపులో నీ మాయలే

పద్మావతీ హృదయ పద్మాన విలసిల్లి

కల్యాణ మూర్తివైనావు జగత్

కల్యాణమొనరించినావు


అలివేలి మంగతో

అలివేణి పద్మతో

శిల రూపమై వెలిసినావు

తలపులో పలుకులో

పులకించు భక్తులను

కలిదైవమై గాచినావు

గుండె గుండెన నామమే గోవింద

చండాడు మా పాపమే

అణువణువు నీరూపమే తిరుమలే

ఇలలోని వైకుంఠమే

నీవేయి రూపాలు వేవేల నామాలు

నీలీల ఒక్కటవ్వంగా

కలిదైవమై వైభవంగా


     అమరవాది రాజశేఖర శర్మ

09/10/20, 7:37 pm - +91 98489 96559: <Media omitted>

09/10/20, 7:38 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణముల 🌈 సింగిడి

ఏడుపాయలు, 09-10-2020

పేరు: ప్రొద్దుటూరి వనజారెడ్డి

ఊరు: చందానగర్

అంశం: స్వేచ్ఛాంశం

వచన కవిత

శిర్షక: వీర వనిత కమలాదేవి

          9866249789

నిర్వహణ: శ్రీమతి గాయత్రి గారు, శ్రీ హరిరమణ గారు

————————————

క్రియాశీల రాజకీయ ప్రస్థానంలో

ఎన్నో కీర్తి శిఖరాలనధిరోహించిన 

ధీర వనిత

అనువనువునా ధైర్యాన్ని నింపుకున్న యోధురాలుగా

మహిళల జీవితాల్లో ఉషోదయం కోసం ప్రముఖ

ఉద్యమమై నిలిచిన ధీశాలి


అక్షరాలు మట్టిమనుషుల బ్రతుకుల్లో ఆసుధాలౌతాయని

చదువు నేర్పే


పాలకులు బలవంతంగా మూసిన బడులను కొలనుపాక

జైన మందిరంలో  తిరిగి ప్రారంభించి, చదువుతో పాటు

మహిళలకు సామాజిక అవగాహన, ఆత్మవిశ్వాసం 

నేర్పటంతో ఎన్నో కళ్ళు మెరిసి, 

ధైర్యం మొగ్గతొడిగె


“మహిళా ఆత్మరక్షణ శిబిరంలో” సైనిక శిక్షణ పొంది

స్వీయ రక్షణ కోసం కారం, రోకలి

బండల్ని ఆయుధాలుగా ఎలా ఉపయొగించాలో నేర్చుకొని

భర్తతో పాటు అనేక పోరాటాల్లో

ముందు నిలిచిన ధీరురాలు


సమాజంలో సుకుమారత్వం,

లాలిత్యం అనే భావజాలాన్ని

చేధించి గరిటే తిప్పే చేతులతో

గన్నులు పట్టి తూటాల పూలమాలలతో పల్లె పల్లెను

అలంకరించె


పుట్టిన కొడుకుకు ‘విప్లవం’అని

పేరు పెట్టి చుట్టాల దగ్గర వదిలి

కధనరంగాని కేగిన సాహసి, 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నజ్వాల


కాకతీయ విశ్వవిద్యాలయం

ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి

గౌరవించె


కమలా దేవి మరణించినా కాని

తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వల్లో బ్రతికే ఉంది

————————————

ఈ రచన నా స్వంతం

————————————

09/10/20, 7:51 pm - +91 94906 73544: మల్లినాథ సూరి కళా పీఠం

 ఏడుపాయల 

అంశం:: ఐచ్ఛికం

 నిర్వహణ ::స్నేహలత గారు

 రచన ::యెల్లు.అనురాధ రాజేశ్వర్రెడ్డి 




         ::గేయం ::




పిల్లల చిరునవ్వుల దరహాసం మోము

 కోవెలలో కొలువు తీరే దైవము తీరు

 గంగ ఉరకలు వేసి నట్లు తొంగిచూసే పరుగు

 ఆటపాట మయూరం నాట్య మోలే ఉండు 


     ::పిల్లల::



 అలుపెరుగని ఆనందం అపురూపం వాత్సల్యం

 మొలకెత్తే అభిమానం ముగ్ధ మనోహర రూపం

 అక్షర సిరి సంపదలతో సాహిత్య సౌరభాలు

 తన్మయత్వం పొందే విడనాడని స్నేహాలు


    :: పిల్లలు::



 వికసించే కలువ లోలే జ్ఞానమెంతో విల్లు విరిసే

 నిండు జాబిలిలా నవ్వుతూ ఎదిగి పోయె

 వెలుగులు వెన్నంటే ఉంటే చదువుల్లో సరస్వతులు

 ముత్యాల నవ్వులతో నిండు జాబిల్లి లు


    :: పిల్లలు:;



 క్రమశిక్షణ సాక్ష్యంగా అద్భుత భవిష్యత్తు కొరకు 

అడుగడుగు ప్రతి అడుగు హుషారుతో వేసుకుంటూ

 మధురమైన జీవితాన్ని బంగారు మయం చేస్తూ

 జీవిత సత్యాన్ని నేర్చి మమతలతో బ్రతుకుతారు

      

:; పిల్లలు::



యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డి

09/10/20, 7:52 pm - +91 99519 14867: మల్లినాథసూరికళాపీఠం yp

ఏడుపాయలు. 

సప్తవర్ణసింగిడి. 


నిర్వహణ : శ్రీమతి ల్యదలగాయత్రి  

గాoగ్వార్ కవిత  

హరిరమణ గారు. 


అంశం : ఇష్టకవిత 

పక్రియ : వచన కవిత


పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

నాగర్ కర్నూల్. 


శీర్షిక :  వేగుచుక్క 


వాళ్ళుకు  చెత్త చెలిమి 

వారివి మెత్తని మనసులు 

రోడ్లపై గుంతలను 

గమ్మత్తుగా సర్జరీ చేసే డాక్టర్లు. 


వీరి బతుకులు 

అతుకుల బొంతలు 

విళ్లు లేకుంటే రహదారులు 

చెత్తకుప్పల తోరణాలు. 


విళ్ల ఇళ్లు వాకిల్లు మాత్రం 

పొక్కులుడిన గోడలు 

విళ్ల చేతులు పడకుంటే 

నగరం కుక్కలు చించిన విస్తరి. 


వీళ్ళ గుండెకవాటాలు 

రోగాల పుట్టలు 

వాళ్ళే మున్సిపాలిటీ సఫాయిలు 

సూర్యునికన్న ముందేలేచే 

వేగుచుక్కలు. 




పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

9951914867.

09/10/20, 7:53 pm - +91 95536 34842: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

ప్రక్రియ:- ఐచ్ఛికాంశం

నిర్వహణ:- శ్రీమతి ల్యాదల గాయత్రి, శ్రీమతి హరి రమణ, శ్రీమతి గంగ్వార్ కవిత గారు.

రచన:- సుకన్య వేదం

ఊరు:- కర్నూలు

కవితాంశం:- పూల చెట్టు


పూల చెట్టు:-

***********

తానో పూల చెట్టు...

చారెడు నీళ్ళు పోస్తే

దోసెడు పూలనిస్తుంది...


సుమధుర సుగంధాలను 

గాలితో జతకట్టి అందిస్తుంది...


వ్యాకులత నిండిన హృదికి

తీపి జ్ఞాపకాలను అద్ది...

సంతోషపు సంబరాలను అందిస్తుంది...


ఘంటసాల పుష్ప విలాపానికి

ఊతమిచ్చి అందరి చేతా పొగడబడింది...


పాదులు తీసి పసిపిల్లలా చూసుకుంటే...

పొత్తిళ్ళలోని పాపాయిలా... 

నవ్వులన్నీ పువ్వులుగా విరబూస్తుంది...


సరైన పోషణ లేకపోతే...

చీడపీడలు తనని పట్టి పీడిస్తే...

కన్నీటితో ఆకుల్ని రాల్చి శిశిరాన్ని తలపిస్తుంది...


వసంతాన పచ్చ పచ్చని చిగురాకులేస్తూ...

అందమైన అమ్మాయిలా చూపుల్ని ఆకర్షిస్తుంది...


తాను పూసే పూవులను దేవతార్చనకై...

దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన వీరుల పార్థివ దేహాలపై...


జవరాండ్ల తలలోన మురిసే పూలచెండ్లుగా...

తనకు జన్మనిచ్చిన భూమాతకు అత్యంత భక్తితో... 


వర్షంలా కురిపిస్తూ

మైమరచిపోతుందే కానీ...

ఏనాడూ బాధపడని త్యాగశీలి ఆ పూల చెట్టు...!!

09/10/20, 7:54 pm - +91 94906 73544: <Media omitted>

09/10/20, 7:54 pm - +91 72072 89424: శ్రీ మల్లినాథసూరి 

శీర్షిక :ముంపులో పట్నం 

(టీవీ లో కరెంటు వార్తలు చూసి రాసింది )

అవేరా 

9/10/2020


పరుగు మరిచి ఈదుతున్న కారుకేం ఎరుక 

గంగమ్మకు కోపమెందుకొచ్చిందో? 


పడకేసిన మోటారు వాహనాలకేం తెలుసు 

దొంగ తివాచీలు పరచిన నాలాల సంగతి 


అయిన వాళ్ళకోసం కనురెప్పల గవాక్షంలో 

వేళ్ళాడుతున్న మనసులకేం తెలుసు 

దారి మరిచి దారులను ముంచేసిన గంగమ్మ పద్మవ్యూహం


సొమ్ములు వరదలా పారుతూనే ఉంటాయి బడ్జెట్ కాగితాల్లో 

వరద మాత్రం మొండికేస్తుంది...

****అవేరా ***

09/10/20, 8:00 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : గాయత్రిగారు,  హరిరమణగారు

అంశం: స్వేచ్చాకవిత 

శీర్షిక : మాతృభాషకు వందనము 

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 09.10.2020


పల్లవి: 

మాతృభాషకు వందనము

తల్లిబాషకు చందనము

కవితలై ఉప్పొంగగా

కళాక్షేత్రమై సాగెనట


చరణం - 1

ఒకరికేమో కవితగా

మరి ఒకరికేమో పాటగా

గజల్ లాహిరి బాటగా

సాగెనుక్రతువు ఆటగా

                             !!మాతృ!!

చరణం - 2 

జానపదుల జావళీలతో

ఎంకిపాటల మధురగానముతో

కవన కవుల గళంలోన

సాగిపోయెను అజంతభాష

                              !!మాతృ!!

చరణం - 3 

రాజుకైనా పేదకైనా

కులమేదైనా మతమేదైనా

నీది నాదనే బేధం లేక 

నిత్య నూతనమే కళాపీఠము

                             !!మాతృ!!

చరణం - 4 

పద్య గాన మధురిమలతో

కవితలల్లెను కళామతల్లులు

కవనరచనలే శారథ హారం

కళాపీఠమున దుర్గవిహారం

                             !!మాతృ!! 

చరణం - 5 

కళలే మనిషికి ఆధారం 

కవితే మనసుకు ఆహ్లాదం 

భాషే మనిషికి ఆరోప్రాణం

భారతి నుదుటన అక్షరతిలకం 

                             !!మాతృ!!

09/10/20, 8:04 pm - +91 94400 00427: *శుభసాయంతనము*💐💐


🚩 *శ్రీమల్లినాథసూరి కళాపీఠం - ఏడుపాయల*🚩

         *సప్త వర్ణాల సింగిడి*

*తేదీ 09-10-2020, శుక్రవారం*

*ఐచ్ఛికాంశం:-శిల్పకళ*

*నిర్వహణ:-శ్రీమతి హరి రమణ గారు&ఇతర ప్రముఖులు*

                --------****-------

           *(ప్రక్రియ:- పద్యకవిత)*


శిలలకు రూపమివ్వగనె

  శిల్పములై రస రమ్య మూర్తులై

యిలకును నేరుగన్ దిగిన

   యింపగు సొంపుల యప్సరాళులై

వెలసి రసోధృతిన్ వరలి

   వేడుక గూరుచు నంతకంతకున్

కలవుర దేవళమ్ములను

  కమ్ర మనోహర సత్కళాకృతుల్...1


ఉలికిని గల్గుశక్తి యన

  నూహకు నందగరాదు, భూమిపై

నలువను బోలు రీతులను

  నాణ్యముగా శిలలన్ని జెక్కుచున్

సలలిత సుందరాకృతుల

  సంపద నందగ జేసి శిల్పులే

నిలిపిరి చూచు కన్నులకు

  నిండుగ గల్గగ హర్షమున్ భళీ...2

(నలువ=బ్రహ్మదేవుడు)


గొలుసుల దీర్చిరే శిలల

  గొప్పగ గన్పడ లోహతుల్యమై

నిలిపిరి స్థంభమున్ దిగువ

   నేలను దాకని రీతి నేర్పునన్

కలవలె గానిపించునవి

  కౌశల మద్దియె యెంత చిత్రమో

తలపగ శిల్పనిర్మితియె

   తథ్యము యోగవిశేష కృత్యమౌ...3

(*గొలుసులు "బేళూరు,హళేబీడు"లలో,వ్రేలాడు స్థంభమును"లేపాక్షి"లో చూడవచ్చు)


లలితము గాగ చెక్కినవి

  రమ్య సురూప విశిష్ట శిల్పముల్

ఖలులు విదేశ దుర్మతుల

   కర్కశ బుద్ధికి నాశమాయెనే

వెలవెల బోయెనే గుడులు

  వేనకు వేలుగ దాడులందు, త-

త్ఫలితము గాగ సత్కళయె

  పాడుగ బోయె విలాప హేతువై...4


చెలువము నింపి శిల్పముల

  జెక్కిన వారలు వారి పోషకుల్

కలసిరి కాలగర్భమున

   కాని విశేషుల కీర్తి నిత్యమై

వెలయును వేలయేండ్లయిన

   విశ్వము నందున మాసిపోదులే

కొలదిగ నుండు శిల్పులకు

  కొంత సహాయమునైన జేయుడీ....5


(తమ సమీక్షలో "హంపీక్షేత్రము"ను గుర్తు చేసిన

డా.నాయకంటి నరసింహశర్మ గారికి ధన్యవాదములు)


🌹🌹 శేషకుమార్ 🙏🙏

09/10/20, 8:08 pm - +91 98499 29226: మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

 సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో 

అంశము : స్వేచ్ఛా కవిత్వం 

శీర్షిక  :  ఉత్తరం 

నిర్వహణ  : శ్రీమతి ల్యాదాల గాయత్రి గారు  

                   శ్రీమతి హరి రమణ గారు      

                   శ్రీమతి కవిత గారు 

 పేరు: దార.  స్నేహలత

ఊరు  : గోదావరిఖని

 జిల్లా : పెద్దపల్లి 

చరవాణి : 9849929226

తేది  : 09.10.2020


ఉత్తరం వచ్చిందని కబురు 

తెచ్చెను కాళ్ళకు  పరుగులు

గబుక్కున  కడపదాటిన చేతులు 


గుండె లోతుల్లో నుండి 

ఉబికివచ్చె  కళ్ళల్లోకి  నీళ్లు 

బుగ్గలపై జలజలా పారే క్షణాలు 


తెరుచుదామని చూడబోతే లేఖపై 

చిరునవ్వుతో తెరువుము చూడగానే 

ఆనందంతో విప్పారును ఆధారాలు 


చదవాలనే ఉత్సాహం 

ఎదురుగా ఉన్నట్లు ఊహించడం 

మనసును తాకిన ఆత్మీయ స్పర్శ


ఉభయకుశలోపరి ప్రశ్నలు

జాబుకు జతయ్యే ప్రతి జవాబులు 

నిస్సంకోచపు ప్రాయశ్చిత్త మనోభావాలు 


స్నేహితులు  దూరమైనా 

ఎడబాటు భారమైనా 

మనోల్లేఖన దోస్తానమే ఒక్క లేఖ రాసినా 


తెలియని వారి ఉత్తరం  స్నేహం 

ప్రత్యుత్తరాలతో  కలం స్నేహం 

కలిపెను తోకలేని ఉత్తరం 


నలుగురికి పంచలేనివి 

లేఖ ద్వారా పంచుకొన్నవి 

ప్రియమధుర భావనలు 


ఇప్పటికీ దాసుకున్న  ఉత్తరాలు 

తెరిచినప్పుడల్లా మెదులు యెదన 

అమృత ధారల ఆనంద భాష్పాలు 


ఉత్తరం రాయడం చదవడం 

మనోల్లాసకర ఉపయుక్త ఔషధమే 

అందరినీ అలరించిన నాటి ఉత్తరం

09/10/20, 8:19 pm - +91 97049 83682: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

అంశం:స్వేచ్చా కవిత

నిర్వాహణ:శ్రీమతి లాద్యాల గాయత్రి,కవిత,హరిరమన గార్లు

రచన:వై.తిరుపతయ్య

శీర్షిక:కష్ట జీవితం

తేదీ:09-10-2020


************************

నాటి చదువుకోసం పడ్డ

కష్టాలు నేడు గుర్తొస్తుంటే

జీర్ణించుకోలేని జీవితం

మరణమేనా ఇక శరణ్యం.


పేరుకే  ప్రయివేటులెక్చరర్లు

ప్రయివేటు ఉపాధ్యాయులు

విలువలేని ఉన్నతవిద్యలు

కొలువులేని అనాదబతుకులు


ఆనాడే పదిలో చాదువాపుంటే

ఈనాడుమన బతుకే బాగుండు

కూలిపోతే నాలుగు వందలు

ఇంతకన్నా హీనమా చదువులు


పేరుకే మనకుడిగ్రీలు,పీజీలు

మనబతుకేమో పేజీలుపేజీలు

ఎవడు మారుస్తారు తలరాత

ఎవరు తెరుస్తారు తుదిరాత


ఇండ్లులేని గురువులెందరో

కానీ జ్ఞానమున్న నిరుద్యోగులు

లక్షలల్లో కదలలేక చస్తున్నారు

ఎవరికి పడుతోంది గురుగోస


రోజు నాలుగు వందల కూలి

పడని లెక్చరర్ కు ఎందుకు

రెంటే ఎల్లని బతుకెందుకు

రోడ్డుమీద పడే స్థితిఎందుకు


ఈ గురుబోధనకంటే ఏ కూలో

నాలో మేలు ఏవత్తిడిలేని

ప్రశాంత జీవితం బుక్కెడు

బువ్వైనా దొరుకుతుదకు..

09/10/20, 8:21 pm - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 9 -10- 2020

అంశం : ఐచ్ఛికం

శీర్షిక;  ప్రకృతి-పార్వతి

నిర్వహణ: అమరకుల దృశ్యకవి గారు

గాయిత్రిగారు,హరి రమణ గారు,కవిత గారు.


నవనవోన్మేశ శాలినియై

ఆరు ఋతువులలో

నయనానoదకరముగా మారే

సుందర ప్రకృతి యొక్క అనుభూతి,

అపర్ణా దేవి చేసే అనురాగ తాండవమే!


రేయికి రంగులు పూస్తూ, 

ఆశలకు ఆయువు పోస్తూ,

వసంతానికి వారధి కడుతూ,

ఋతువు కో రాగాన్ని తీస్తూ

రుద్రాణి గా మారి ఋజువు చేస్తుంది!


ఆరు ఋతువుల అంబరాన్ని చుట్టి

మూడు కాలాల రవికను తొడిగి

ముగురమ్మల మూలపుటమ్మ గా,

ముజ్జగములను తన కాలి గజ్జెలుగా

చేసుకొని అందెల రవళులతో 

పార్వతి దేవిజేసే ఆనంద తాండవమే 

ప్రకృతి గా భాసిస్తున్నదేమో!


ఈ కవిత నా స్వంతము..ఈ సమూహము కొరకే వ్రాసితిని.

09/10/20, 8:24 pm - +91 80081 25819: మల్లినాథసూరి కళాపీఠం.సప్తవర్ణా సింగిడి.

శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో.ఐచ్ఛికాంశం:మని'షి. 

నిర్వహణ:ల్యాదాల గాయత్రి హరి రమణ.గంగ్వార్ కవిత గార్లు.

శీర్షిక:మానవత్వం. 

ప్రక్రియ:వచన ప్రక్రియ. 

రచన:శ్రీమతి చాట్ల:పుష్పలత-జగదీశ్వర్. 

ఊరు:సదాశివపేట.సంగారెడ్డి జిల్లా. 


ఓ మనవుడా! 

ఏది నిజం ఏది అబద్ధం. 

తెలియక జీవిస్తున్నావా? అన్ని తెలిసి తప్పుటడుగులా

ప్రయాణం చేస్తున్నవా? 

ఎదిఎమైనా మని'షిలో మానవత్వం మరువకు. 

మర మనిషి కంటే హీనమైన జీవనం చేయకు. 

మని ఉంటే చాలు నాకేం ఎవరితో అనీ 

ప్రలోభాలకులోనై విరవిగాకు. 

మనిషి లేనిదే మని ఎక్కుడిది 

మనిషి సృష్టించిన మనీ 

మానవత్వం కంటే విలువైనది కాదనీ 

మనిషి అవసరాలకు అనువైనది మనీ అనీ నిగూడార్థం గమనించుకో 

కరుడుగట్టిన హృదయపోరలో స్వార్థనీ విడమరిచి కరుణ జాలితో 

హృదిభావనలను సరితూగూ. 

బ్రతికి ఉన్నానళ్ళే హగు ఆర్భాటాలు. 

ఈ రంగంలలోకంలో హంగులహోయలులు. 

జీవనయాత్రలో చివరకు మిగిలేది 

మనిషి మానవత్వమే అనీ గుర్తుంచుకో. 

మహిలో మనస్సు వున్న 

మానవుడిగా గుర్తింపు తెచ్చుకో. 

🙏🏻ధన్యవాదాలు🙏🏻

09/10/20, 8:27 pm - +91 98499 52158: శ్రీమల్లినాథ సూరికళాపీఠం

సప్తవర్ణముల సింగిడి yp

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో.

అంశం:ఐచ్ఛికం

శీర్షిక:శ్రీవనదుర్గమ్మా.

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్

నిర్వహణ:శ్రీ మతి లాద్యాల గాయత్రి గారు,శ్రీ హరి రమణ గారు.


శ్రీయుత కవులకు 

కల్పతరువుగా

సప్తవర్ణముల

సరికొత్త ప్రక్రియలతో


ఎదుపాయల 

క్షేత్రంలో వెలసిన

భక్తుల పాలిట

కొంగు బంగారము నీవమ్మా.


నీను కొలుచుటకు

నీను తలుచుటకు

నీను పిలుచుటకు

కవన శక్తిని ఇవమ్మా.



ఆదిపరాశక్తికి

వన దుర్గమ్మకు

సుమధుర సుందర

సువర్ణ శోభితం గా


వాగ్దేవి వరమున

వివిధ కలములు

అక్షరాలతో అల్లిన

నిత్యా హారతి దిగో


సతతము నిరతము

సూత్ర ధారిగా

మంగళ ప్రదమగు

వరములనొసఁగుము


లక్షణముగ 

అక్షరమాలను

దీక్షతో కూర్చితిమి

రక్షించమ్మా దుర్గమ్మా..



ఎరుగక చేసిన 

తప్పులు ఒప్పులు

తుళ్ళినచో బిడ్డల వలే

మెల్లగమమ్ముమందలించుము.



పిల్లలుగా నీఒడిజేరితిమి

దయతో కృపతో

ఆలన పాలన తో

నీ లీలగా నడిపించమ్మదుర్గమ్మా

09/10/20, 8:30 pm - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: ఐచ్ఛికాంశం

ప్రక్రియ: వచన కవిత

శీర్షిక: నాతో మీకేం టంటా

నిర్వహణ; శ్రీమతి. హరి రమణ, గాయత్రి, కవిత గార్లు

రచన: పేరం సంధ్యారాణి నిజామాబాద్


నాతో మీకేంటంటా

నా ఇష్టం నాదేనంటా

జాబిలితో స్నేహం చేస్తా

తారలతో దోబూచులాడుతా

తొలకరి వాన చినుకునవుతా

మట్టి పరిమళాల గూభాలింపునవుతా

నాతో మీకేంటంటా

నా ఇష్టం నాదేనంటా

హరివిల్లుతో ఉయ్యాలలూగుతా

ఇంద్రధనస్సు చీరలాకడుతా

కొలను నందలి తామరనవుతా

తామరాకుపై నీటి బిందువునవుతా


               "  నాతో మీకేంటంటా"

రంగురంగులసీతాకోక చిలుకనవుతా

విరులలో మకరందం నాదే నంట

చిన్ని కృష్ణుడు అల్లరినవుతా

చిలిపి పనులు చిన్నదాన్నవుతా

                     నాతో మీకేంటంటా"


గున్న మామిడి పూతనవుతా

గండు తుమ్మెద పాటనవుతా

చిలుక పలుకులు పలికే చిలుకనవుతా

పలుకు తేనెల మొలకనవుతా

ఎంకి పాటల సొగసునవుతా

ఎదలోతుల ప్రణయాన్నవుతా

                       

                       నాతో మీకేంటంటా"

 నాదస్వరం పలికిస్తా

నాగిని లా నాట్యం చేస్తా

అందమైన లోకాల విహరిస్తా

అప్సరసలతో సేవలు చేయిస్తా

 వీరివీరి గుమ్మడి నేనెవరినంటా

మీరెవరో నాకు తెలియదంటా

నాతో మీకేంటంటా

 నాఇష్టం నాదేనంటా

09/10/20, 8:36 pm - +91 99486 53223: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి .

 అంశం :ఐచ్ఛికం

 నిర్వహణ :శ్రీమతి హరి రమణ గారు, శ్రీమతి గాయత్రి గారు , శ్రీమతి కవిత గారు . 

పేరు :మచ్చ అనురాధ 

ఊరు :సిద్దిపేట. 

                          

       గురువు


1.

అవనియందు  సొంత మాలరారగను లేము, 

పెద్ద వారి దయలు పేర్మిలేక

విడువరాదు గురుని గడి గడియైన  మదిలోన

మేధ శక్తి పెరిగి మేలు  గల్గు.


2

 గుణములెన్నొ  దెలుపు గురుమూర్తి మనకిల 

రూఢీగాను  దెల్పు  ఋషుల  మహిమ 

గురువు గాదె గొప్ప ధరలోన  పూజ్యుండు 

వారి పాద.మెపుడు దారి  జూపు.


3.

గురుని  పూజ జేయ గుణవంతులౌదురు 

మనల  తీర్చిదిద్దె మాన్యుడతడు

ఒజ్జ వద్ద విద్య నొది గియు నేర్వాలి 

గుట్టు దెలియు విద్య  గురుని వల్ల.

4.

 గురువు మనసులోన గూడుకట్టుకొనుము 

అడిగి ప్రశ్న లేయ నన్ని దెలియు 

శ్రద్ధ గలిగి యున్న సర్వంబు నబ్బును 

కష్టమనక   ముందు కాలు వేయు .

5 .

మదిని దోచుకొనును మంచి పద్యంబులే

నిహము నందు ప్రజకు  నీతి నేర్పు

పద్య భావ సుధలు పరిఢవిల్లును గాదె!

వెలుగు జిలుగు లెన్నొ తెలుగు నందు.


🙏🙏

09/10/20, 8:43 pm - +91 99897 65095: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: ఐచ్ఛికాంశం

ప్రక్రియ: వచన కవిత

శీర్షిక: దేశం బాకీ పడింది

నిర్వహణ; శ్రీమతి. హరి రమణ, గాయత్రి, కవిత గార్లు

రచన: నల్లు రమేష్, నెల్లూరు జిల్లా


 బుల్లెట్ వేగానికి 

 మా గాలివాటు గమనానికి 

 సామ్యం కుదరడం లేదు 


 రాళ్లు రప్పలు తగిలి 

 రక్తమోడుతుంది హృదయం 

 బస్తీలో రోజాలం కాము మేం 

 తండాలో తురాయి పువ్వులం 

 చీమలు దూరని చిట్టడవికి చిరునామాలం


 రాకెట్లు దూసుకెళ్తున్నా 

 రయ్యి రయ్యి శబ్దాలు పల్లవించే

 రహదారులు చూడనోళ్ళం 

 రోజూ డోలీలో ప్రాణ దీపాలు మోస్తున్నాం


 బస్తీకి బాటలుపరిచినా 

 దగా పడడం తప్ప 

 దండుకోవడం తెలియనోళ్ళం 


 మేలు జాతులు సృష్టించే మేధావులారా 

 మీ ప్రయోగశాలకు మా బతుకులు తరలించండి 

 మా శ్వాసలు రిపేర్ చేసి 

 ఆరోగ్యం అతికితే చాలు 

 కొండ దేవతకు సంబరాలు చేసుకుంటాం


 ఐదేళ్ల అభివృద్ధి పత్రంలో 

 మా నడకల లెక్కలు రాసుకోండి

 అర్ధాంతరంగా దారులు హత్యలు చేసిన

 దేహాల దైన్యాన్ని పోగేసుకోండి 

 దేశం మాకు బాకీ పడింది 

 వడ్డీలు కట్టక్కర్లేదు 

 కొన ఊపిరిలో కొత్త ఆశలు 

 బతికించండి చాలు.

                       

                                 నల్లు రమేష్

09/10/20, 8:51 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం. ఐచ్చికాంశం (తెలుగు అక్షరాలు)

నిర్వహణ  : శ్రీమతి ల్యాదాల గాయత్రి గారు  

                   శ్రీమతి హరి రమణ గారు      

                   శ్రీమతి కవిత గారు 

తేదీ :09.10.2020  

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్ 

************************************************

ఆకాశంలో నక్షత్రాల్లా 

అక్కడ అక్కడ విసిరేసినట్లున్న అక్షరాలను 

భావనా దారంతో మాల అల్లి 

శారద మెడలో వెయ్యాలని తాపత్రయం 

అక్షరంతో అక్షరం జత చేరట్లేదు 

భావం ఎలా పల్లవిస్తుంది 

కలం ముందు పెద్ద ప్రశ్న గుర్తు 

పాళీనే విరిగిందో, గుండె చిరిగిందో 

తెల్ల కాగితం నిండా సిరా మరకలు 

సమాధి నుంచి బయటపడ్డ యోగిలా 

కనులు తెరిచి కలయ చూచి 

మనో ఫలకం లోని చిత్రానికి 

అక్షర రూప మివ్వాలని ఆర్భాటం

కోసిన అక్షరాలు బుట్టలో పడనిదే 

తిరిగి యెగిరి ఆ కొమ్మలకే అతుక్కుంటున్నాయి 

తమ మధ్య పరభాషా సాహచర్యాన్ని 

భరించలేకో, నిరసించలేకో 

నిర్వీర్యమై, నిస్తేజమై 

జవసత్వాలుడిగిన జీవంలా  

చతికిలపడ్డ అక్షరాలను చూసి 

కళ్ళు కారుమేఘమై వర్షించాయి 

ఏ గుండెలోతుల్లో మెలికబడ్డ భావానికి ప్రసవమైందో

తెలుగు వెలుగు ముంగిట పరుచుకుని 

అక్షర సంయోగ జనిత పదకేళికి 

సమయం ఆసన్నమైంది 

రంగస్థలం సిద్ధమైంది 

తెల్ల కాగితంపై చెక్కుకున్న నా తెలుగు అక్షరాలు  

శిలాక్షరాలుగా కలకాలం నిలిచిపోతున్నాయి 

************************************************

09/10/20, 8:52 pm - +91 94407 10501: *మల్లినాథసూరి కళాపీఠం - సప్త వర్ణముల సింగిడి*

పేరు       : తుమ్మ జనార్దన్

తేదీ        : 09-10-2020

అంశం     : శుక్రవారం – ఐచ్ఛికాంశం

నిర్వహణ : నిర్వహణ :శ్రీమతి హరి రమణ, శ్రీమతి గాయత్రి, శ్రీమతి కవిత గార్లు

ప్రక్రియ     : వచనం

---------------------------------------------

*శీర్షిక : బాలు – నీవు బతికేవున్నావు*


మర్యాదకు మన్ననలద్దిన వివేకచూడమనివి

తీయని పాటల స్ఫూర్తిని పంచే మనసున్న మహారాజువి


నీ పాటల మాధుర్యం మీ మాటల లాలిత్యం

మము వీడని సంగీతం సరళమైన సాన్నిహిత్యం


నను పాడిస్తున్నావు, నరనరాన వున్నావు

నీకు చావులేదయ్యా, నీవు అమరుడవయ్యా


బాల సుబ్రమణ్యానివి 

సంగీతాగ్రగణ్యానివి

మమతల మా గమ్యానివి

సుస్వర సౌజన్యానివి

అద్భుత స్వర గానానివి

అతిరథ మహారథ గాత్రదానానివి


నీవు బ్రతికే వున్నావు

ప్రతి గొంతులో ప్రతిధ్వనిస్తున్నావు

నీకు చావులేదయ్యా, 

నీవు అమరుడవయ్యా.

09/10/20, 8:56 pm - +91 73308 85931: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల yp సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

తేదీ: 9-10-2020 శుక్రవారం

అంశం: ఐచ్ఛికాంశం

నిర్వహణ: శ్రీమతి హరి రమణ గారు గాయత్రి గారు కవిత గారు

రచన: అనితా గిరి

ప్రక్రియ: బాల గేయం

శీర్షిక: బామ్మ కథలు

*****************

రాజు రమ్యా రారండి

అల్లరి మీరు మానండి

చెప్పిన మాటలు వినండి

బుద్ధిగా మీరు వుండండి


ఎవరొచ్చారో చూడండి

బామ్మ తాత వచ్చారు

బందర్ లడ్డు తెచ్చారు

రాజు రమ్యలకు ఇచ్చారు


అన్నా చెల్లి ఆడారు

అరుగుల మీద ఆడారు

అమ్మా నాన్నా చూసారు

ఎంతగానో మురి సారు


బామ్మ దగ్గర చేరారు

కథలు చెప్పమని అడిగారు

బామ్మ కథలు చెప్పింది

నీతి కథలు చెప్పింది


బుద్ధిగా వారు విన్నారు

హాయిగా నిద్రించారు



పిడపర్తి అనితా గిరి సిద్దిపేట

09/10/20, 8:57 pm - +91 6305 884 791: మల్లినాథ సూరి కళా పీఠం

సప్తవర్ణాల సింగిడి

అమర కుల వారి ఆధ్వర్యంలో

అంశం: ఐచ్ఛికం

నిర్వహణ: శ్రీమతి లఘు గాయత్రీ గారు, శ్రీమతి హరి రమణ గారు

శీర్షిక: నా మధుర స్మృతులు

పేరు: శ్రీదేవి చింతపట్ల

లేచింది మొదలు అడుగడుగున

మధుర స్మృతులు

బాల్య స్మృతులు


వేకువనే

వాకిలిచూడ ...

నేను నేనని వంతులు వేసుకుని వాకిలి ఊడ్చి పేడ కల్లాపి చల్లి సుద్ధ ముగ్గులు పెట్టిన చల్లని జ్ఞాపకం


స్నానానికి గీజర్ స్విచ్ వేయ.....

చింత చెట్టు కింద కట్టెల పొయ్యి మీద కొప్పెర లో మరుగుతున్న వేడినీళ్ళ జ్ఞాపకం


స్నానాల గదిలో సబ్బును చూచిన...

అమ్మమ్మ చేసిన గట్టి పిండి జ్ఞాపకం


వంట చేయ వంట ఇంటికి వెళ్లగా...

కట్టెల పొయ్యి మీద రాము లక, తోట బెండకాయ, వంకాయ ,చిక్కుడు, కరివేపాకులతో ఘుమ ఘుమ లాడే తాతమ్మ చేసిన పప్పు చారు జ్ఞాపకం


ఉరుకుల పరుగులతో హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని స్కూటీ ఎక్కగానే..

ఎడ్ల బండిలో కూర్చొని వాగు దాటి నానమ్మ గారి ఇంటికి వెళ్ళిన జ్ఞాపకం


వాహనాల రణగొణ ధ్వని లో పడి వెళ్ళి పాఠశాల భవనాన్ని చూడగానే...

జల జల పారే సెలయేరు సమీపాన మాబడి గంటలు ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో మోదుగాకు లో పెట్టి ఇచ్చిన మధ్యాహ్న దొడ్డు రవ్వ ఉప్మా రుచి

ఇంటికి వచ్చి ఎత్తి పెట్టడానికి వీలు లేని డబల్ కాట్ మంచాలు చూడగానే...

చిన్ననాడు ఆరుబయట అక్కచెల్లెళ్ల మనందరం తెల్లటి దుప్పటి పరిచిన పరుపుల మీద రాలిన చింతాకుల మధ్యలో చల్లగాలికి కథలు చెప్పుకుంటూ నిద్రలోకి జారిన జ్ఞాపకం


నా ఈ బాల్య మధుర స్మృతులే ఉరుకుల పరుగుల జీవితంలో విసుగు చెందకుండా చెరగని చిరునవ్వు నన్ను ముందుకు నడిపిస్తున్న ఇంధనం

           🙏🙏


.

09/10/20, 8:59 pm - +91 98868 24003: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సప్త వర్ణముల సింగిడి

తేదీ : 09-10-2020

అంశం  : ఐచ్ఛికాంశం

శ్రీ అమరకుల కవి గారి ఆధ్వర్యంలో

నిర్వహణ : గాయత్రి, హరిరమణ, గంగ్వార్ గార్లు


పేరు : ముద్దు వెంకటలక్ష్మి

కవిత సంఖ్య :  5️⃣

(60 కవితల పి డి ఎఫ్ కోసం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ వ్రాస్తున్న కవితల సంఖ్య)

కవితా శీర్షిక. : *మనోజీవనసౌరభాలు*


అమ్మ ఒడిలో కూర్చొని

బొమ్మలలోనే లోకాన్ని

అవలోకించిన వయస్సులో

బొమ్మల రామాయణ

భారత భాగవతాలు

అంతరంగ కుడ్యాలపై

కదలాడే చిత్రాలై

నా జీవనశైలీ పథాలలో

సౌరభాలను వెదజల్లుతున్నాయి;


అక్షర జ్ఞానం పంచతంత్రాన్ని

చదివించి బతుకు బాటలో

నైతిక సుమగంధాల తివాచీ

పఱిచిఉంచింది ;


పఠనాసక్తి ' వైతాళికు ' లను

దర్శింపజేసి,

భావకవిత్వపుటుద్యానవనంలో,

అభ్యుదయ కవిత్వపు దారులలోవిహరింపజేసి

నా మనోప్రపంచవీధులలో

మృదు మధుర భావాల

యోచనా పరిమళాల

సుమాలను వెదజల్లింది ;


పట్టుకున్న ప్రతి పుస్తకం

ఒక సుమధుర స్మృతియై

కుసుమసుగంధ వల్లరియై

నా మనోజీవనలహరులలో

సౌరభాలు విరజిమ్మతుంది.

09/10/20, 9:01 pm - +91 6305 884 791: మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

అమర కుల వారి ఆధ్వర్యంలో

అంశం: ఐచ్ఛికం

నిర్వహణ: శ్రీమతి ల్యాగలగాయత్రీ గారు, శ్రీమతి హరి రమణ గారు

శీర్షిక: నా మధుర స్మృతులు

పేరు: శ్రీదేవిచింతపట్ల

============  లేచింది మొదలు అడుగడుగున

మధుర స్మృతులు

బాల్య స్మృతులు


వేకువనే

వాకిలిచూడ ...

నేను నేనని వంతులు వేసుకుని వాకిలి ఊడ్చి పేడ కల్లాపి చల్లి సుద్ధ ముగ్గులు పెట్టిన చల్లని జ్ఞాపకం


స్నానానికి గీజర్ స్విచ్ వేయ.....

చింత చెట్టు కింద కట్టెల పొయ్యి మీద కొప్పెర లో మరుగుతున్న వేడినీళ్ళ జ్ఞాపకం


స్నానాల గదిలో సబ్బును చూచిన...

అమ్మమ్మ చేసిన గట్టి పిండి జ్ఞాపకం


వంట చేయ వంట ఇంటికి వెళ్లగా...

కట్టెల పొయ్యి మీద రాము లక, తోట బెండకాయ, వంకాయ ,చిక్కుడు, కరివేపాకులతో ఘుమ ఘుమ లాడే తాతమ్మ చేసిన పప్పు చారు జ్ఞాపకం


ఉరుకుల పరుగులతో హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని స్కూటీ ఎక్కగానే..

ఎడ్ల బండిలో కూర్చొని వాగు దాటి నానమ్మ గారి ఇంటికి వెళ్ళిన జ్ఞాపకం


వాహనాల రణగొణ ధ్వని లో పడి వెళ్ళి పాఠశాల భవనాన్ని చూడగానే...

జల జల పారే సెలయేరు సమీపాన మాబడి గంటలు ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో మోదుగాకు లో పెట్టి ఇచ్చిన మధ్యాహ్న దొడ్డు రవ్వ ఉప్మా రుచి

ఇంటికి వచ్చి ఎత్తి పెట్టడానికి వీలు లేని డబల్ కాట్ మంచాలు చూడగానే...

చిన్ననాడు ఆరుబయట అక్కచెల్లెళ్ల మనందరం తెల్లటి దుప్పటి పరిచిన పరుపుల మీద రాలిన చింతాకుల మధ్యలో చల్లగాలికి కథలు చెప్పుకుంటూ నిద్రలోకి జారిన జ్ఞాపకం


నా ఈ బాల్య మధుర స్మృతులే ఉరుకుల పరుగుల జీవితంలో విసుగు చెందకుండా చెరగని చిరునవ్వు నన్ను ముందుకు నడిపిస్తున్న ఇంధనం

           🙏🙏


.

09/10/20, 9:03 pm - +91 99665 59567: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్తవర్ణాల 

సింగిడి

 నిర్వహణ:  గాయత్రి కవిత హరి రమణ గార్లు

పేరు:.  విజయలక్ష్మీనాగరాజ్

ఊరు:.  హుజురాబాద్

శీర్షిక: తెలుసుకో...!


**********************


అంతరిక్షం అణువణువునా నిండిన చిక్కటి చీకటి లాంటి నిశ్శబ్దం...

ఏదో మార్మికతను నర్మగర్భంగా బోధిస్తోంది...


విశ్వవ్యాప్తమైన నీ ఉనికిని అద్దమై చూపుతూ...

నిన్ను నీవు తెలుసుకోమంటోంది.


అంతులేని దుఃఖమో..అనిర్వచనీయమైన ఆనందమో....


నీ ప్రమేయం లేకుండా నిన్ను కదల్చడానికి నీవేమీ గడ్డిపరకవు కావు.

వేనవేల తుఫానులకు ఎదురొడ్డినిల్చిన మేరునగధీరుడవు.


మనసనే మాయలో పడకుండా...

బలహీన పరిచే క్షణాలకు తర్పణం వదులుతూ...


 ఆశయాల సాధనలో పక్షి కంటిని మాత్రమే చూస్తూ  విజయపు బాటలో సాగిపో...

ప్రపంచమే నీకు సాగిలపడే కాలం నీకై ఎదురుచూస్తోంది.

09/10/20, 9:05 pm - Telugu Kavivara changed this group's settings to allow only admins to send messages to this group

09/10/20, 9:14 pm - L Gayatri: *🚩మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల🚩*


*🌈 సప్తవర్ణముల సింగిడి 🌈*


 *🌹శుక్రవారం, 9/10/2020

*ఐచ్ఛికాంశం - స్వేచ్ఛా కవిత్వం*


       *కవితాంశం మీ ఇష్టం*

          *ప్రక్రియ మీ ఇష్టం*


    *💥   నిర్వహణ   💥*


  అమరకుల దృశ్య కవి నేతృత్వంలో..


         ల్యాదాల గాయత్రి

              హరి రమణ

             గంగ్వార్ కవిత


*వనదుర్గామాత గళసీమలో సమవర్ణమాలను అలంకరించిన కవివరేణ్యులు*


*వచన కవిత*

1.డా.నాయకంటి నరసింహ శర్మ గారు

2.కొండ్లె శ్రీనివాస్ గారు

3.బి.వెంకట్ కవి గారు

4.ప్రియదర్శిని కాట్నపల్లి గారు

5.జె.పద్మావతి గారు

6.చయనం అరుణా శర్మ గారు

7.కొప్పుల ప్రసాద్ గారు

8.రాజుపేట రామబ్రహ్మం గారు

9.డా.ఆలూరి విల్సన్ గారు

10.మొహమ్మద్ షకీల్ జాఫరీ గారు

11.బక్క బాబురావు గారు

12.ఢిల్లి విజయ్ కుమార్ శర్మ గారు

13.ప్రభాశాస్త్రి జోశ్యుల గారు

14.భరద్వాజ రావినూతల గారు

15.బి.సుధాకర్ గారు

16.లలితారెడ్డి గారు

17.బాస మంజుల గారు

18.మల్లెఖేడి రామోజీ గారు

19.తెలికిచర్ల విజయలక్ష్మి గారు

20.కె.శైలజా శ్రీనివాస్ గారు

21.పొట్నూరు గిరీష్ గారు

22.గాజుల భారతీ శ్రీనివాస్ గారు

23.మంచికట్ల శ్రీనివాస్ గారు

24.జ్యోతిరాణి గారు

25.మల్లారెడ్డి రామకృష్ణ గారు

26.కట్టెకోల చిన నర్సయ్య గారు

27.సి.హెచ్.వెంకటలక్ష్మి గారు

28.వసంత లక్ష్మణ్ గారు

29.మరింగంటి పద్మావతి గారు

30.చిల్క అరుంధతి గారు

31.బోర భారతీదేవి గారు

32.శిరశినహాళ్ శ్రీనివాసమూర్తి గారు

33.జి.రామ్ మోహన్ రెడ్డి గారు

34.వెంకటేశ్వర్లు లింగుట్ల గారు

35.త్రివిక్రమ శర్మ గారు

36.దుడుగు నాగలత గారు

37.వేంకట కృష్ణ ప్రగడ గారు

38.డా.బండారు సుజాత గారు

39.అనూశ్రీ గౌరోజు గారు

40.చంద్రకళ దీకొండ గారు

41.నల్లెల్ల మాలిక గారు

42.బంగారు కల్పగురి గారు

43.డా.ఐ.సంధ్య గారు

44.అరిగెల గదాధర్ గారు

45.గంగాధర్ చింతల గారు

46.చిలకమర్రి విజయలక్ష్మి గారు

47.ఓ.రాంచందర్ రావు గారు

48.బి.స్వప్న గారు

49.నాశబోయిన నరసింహ గారు

50.అవేరా గారు

51.సుభాషిణి వెగ్గలం గారు

52.రుక్మిణి శేఖర్ గారు

53.తాడిగడప సుబ్బారావు గారు

54.పబ్బ జ్యోతిలక్ష్మి గారు

55.జి.ఎల్.ఎన్. శాస్త్రి గారు

56.గీతాశ్రీ స్వర్గం గారు

57.ముడుంబై శేషఫణి గారు

58.వినీల దుర్గ గారు

59.లక్ష్మిమదన్ గారు

60.తాతోలు దుర్గాచారి గారు

61.మంచాల శ్రీలక్ష్మి గారు

62.డా.సూర్యదేవర రాధారాణి గారు

63.యక్కంటి పద్మావతి గారు

64.డా.భారతి మీసాల గారు

65.సాలిపల్లి మంగామణి గారు

66.యం.టి.స్వర్ణలత గారు

67.పండ్రువాడ సింగరాజు శర్మ గారు

68.డా.కల్వకొలను పద్మకుమారి గారు

69.డా.ఎన్.సి.హెచ్.సుధా మైథిలి గారు

70.దంతరాజు విజయలక్ష్మి గారు

71.ఆవలకొండ అన్నపూర్ణ గారు

72.తుమ్మ జనార్దన్ గారు

73.నీరజాదేవి గుడి గారు

74.కవిత సిటీపల్లి గారు

75.సుజాత తిమ్మన గారు

76.అంజలి ఇండ్లూరి గారు

77.అమరవాది రాజశేఖర శర్మ గారు

78.ప్రొద్దుటూరి వనజా రెడ్డి గారు

79.పోలె వెంకటయ్య గారు

80.సుకన్య వేదం గారు

81.దార స్నేహలత గారు

82.వై.తిరుపతయ్య గారు

83.చాట్ల పుష్పలత జగదీశ్వర్ గారు

84.యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు

85.పేరం సంధ్యారాణి గారు

86.నల్లు రమేష్ గారు

87.సిరిపురపు శ్రీనివాస్ గారు

88.శ్రీదేవి చింతపట్ల గారు

89.ముద్దు వెంకటలక్ష్మి గారు

90.విజయలక్షీ నాగరాజ్ గారు


*పద్యం*

1.అంజయ్య గౌడ్ గారు

2.నరసింహమూర్తి చింతాడ గారు

3.కామవరం ఇల్లూరు వెంకటేశ్ గారు

4.మాడుగుల నారాయణమూర్తి గారు 

5.పల్లప్రోలు విజయరామిరెడ్డి గారు

6.డా.చీదెళ్ళ సీతాలక్ష్మి గారు

7.వెలిదె ప్రసాద శర్మ గారు

8.డా.కోవెల శ్రీనివాసాచార్య గారు

9.తౌట రామాంజనేయులు గారు

10.వి.సంధ్యారాణి గారు

11.వై.నాగరంగయ్య గారు

12.తులసీ రామానుజాచార్యులు గారు

13.కాల్వ రాజయ్య గారు

14.డా.బల్లూరి ఉమాదేవి గారు

15.శేషకుమార్ గారు

16.మచ్చ అనురాధ గారు


*గేయం*

1.దాస్యం మాధవి గారు

2.విత్రయశర్మ గారు

3.కాళంరాజు వేణుగోపాల్ గారు

4.బందు విజయకుమారి గారు

5.నెల్లుట్ల సునీత గారు

6.చెరుకుపల్లి గాంగేయశాస్త్రి గారు

7.గంగాపురం శ్రీనివాస్ గారు

8.జెగ్గారి నిర్మల గారు

9.వరుకోలు లక్ష్మయ్య గారు

10.ఎడ్ల లక్ష్మీ గారు

11.శ్రీరామోజు లక్ష్మీ రాజయ్య గారు

12.మోతె రాజ్ కుమార్ గారు

13.కోణం పర్శరాములు గారు

14.యెల్లు అనురాధా రాజేశ్వర్ రెడ్డి గారు

15.గొల్తి పద్మావతి గారు


*ఉయ్యాల పాట*

1.యడవల్లి శైలజ గారు


*రుబాయిలు*

1.తగిరంచ నరసింహారెడ్డి గారు


*ఇష్టపదులు*

1.డా.అడిగొప్పుల సదయ్య గారు


*దృశ్యకవిత*

1.విజయగోలి గారు

2.స్వర్ణ సమత గారు


*మణిపూసలు*

1.రావుల మాధవీలత గారు


*బాలగేయం*

1.అనితా గిరి గారు


తొమ్మిది విభిన్న ప్రక్రియలలో 128+1=1️⃣2️⃣9️⃣ వైవిధ్యభరిత సుమమాలను దుర్గామాత గళసీమన అలంకరించుటకు యధోచితంగా సహకరించిన కవివరేణ్యులందరికీ అభివందనాలు.

        వందలాది స్పందనా ,ప్రతిస్పందనల  ఆత్మీయ ,సహృదయ కవివరులతో కళాపీఠం కలకలలాడినది.వారందరికీ అక్షరాభివందనాలు.

         ఈ సువర్ణావకాశాన్ని అందించిన శ్రీ అమరకుల దృశ్య కవి గారికి నమస్కృతులు..


           ల్యాదాల గాయత్రి

                హరి రమణ

               గంగ్వార్ కవిత

                  🙏🙏🙏

09/10/20, 9:27 pm - Telugu Kavivara: <Media omitted>

09/10/20, 9:27 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-163🌈💥*

                       *$$* 

      *ఆరుగాలం కష్టం-163*

                       *$$*

*బ్రహ్మ గీతగీసి పంపించిన బ్రతుకుడు ఆట*

*జానెడు పొట్టకోసం జాగిలముల వలె వేట*

*పొద్దస్తమానం పల్లెల జనం పనుల కోసమే*

*పొట్టనింప కొందరు తిన్నదరుగ మరెందరో*

                          *@@*

            *అమరకుల ⚡ చమక్⚡*

09/10/20, 9:30 pm - B Venkat Kavi: రోజువారికూలి రోజంతచాకిరి

జానపొట్టకొరకు జనము వెళ్ళ

 శ్రమిని చెమట తోను శాంతినిపొందక

శ్రామికునికి కూడ శాంతిలేక


*బి. వెంకట్ కవి*

09/10/20, 9:31 pm - Telugu Kavivara changed this group's settings to allow all participants to send messages to this group

09/10/20, 10:10 pm - +91 84668 50674: అలుపు సొలుపు మరిచి హాయిగా కూలీలు

పాడుకుంటువారు పనులు చేస్తు

పొద్దు తోడ పరుగు ముద్దుగా తీయుచు

బాధలేమి లేని బ్రతుకు తెరువు


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

09/10/20, 10:31 pm - Velide Prasad Sharma: *అద్భుతం..అభినందనలమ్మా*

(ఇప్పటివరకు ఎవరూ సాధించ లేదు)

129..చివరి అంకె...9...గురువు

1+2+9=12౼..1+2=3...బుధుడు

సీ!

వనదుర్గ  రూపమ్మె నవదుర్గ యైతీరె

   ముగ్గురమ్మలవోలె ముదము గూర్చె!

ముగ్గురమ్మల కొల్వు ముఖ్య నిర్వహణలో

    హాయిగొల్పెను నేడు నమర కులకు!

మల్లినాథుని పీఠ మహిమయొ యేమియో

   కవుల రచన సంఖ్య కమ్మగమరె!

స్వేచ్ఛకవితలోన స్వీయరచనలెన్నొ

   భిన్నప్రక్రియలోన బేషుగమరె

ఆ.వె.

సంతసంబు గలిగె సద్గుణ శీలురౌ

రమణ కవిత ల్యాదల లిట

చేయు సందడంత చిరునవ్వు లొలికించె

వందనములు గొనుమ వర్ధిలుమిక!

     వెలిదె ప్రసాదశర్మ

09/10/20, 10:58 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

09/10/20, 10:59 pm - +91 94400 00427: 👏👏👌👌


వ్రాయుచు ఫాలమున్ నరుని

  బ్రహ్మయె పంపగ నాడ లోకమున్

హాయిక జాగిలం బగుచు

  నాతడు వేటను పూని యాడడే

రేయి బవళ్ళు గ్రామజను

  లే పనులందగ ప్రాకులాడుచున్

హాయి భుజింప కొందరన

  యన్నము జీర్ణము జేయ నెందరో


🌹🌹 శేషకుమార్ 🙏🙏

09/10/20, 11:08 pm - Velide Prasad Sharma: *సమీక్షకులకు ప్రత్యేక అభినందనలు*

అనుక్షణం ఉత్తేజ పరచినసమీక్షకులందరికీ అభినందనలు.మీరు చేసే సమీక్షలోని వాక్యాలకూర్పు పదజాలం..భావం ఆకర్షణీయతను గమనిస్తున్నాను.చాలా సంతోషంగా ఉంది.రోజూ ఇలానే సహ రచయితల రచనలు ఎప్పటికప్పుడు చదవండి.బాగనిపించిన విషయాన్ని ప్రశంసించండి.మనసు విశాలం కాగలదు.సహనం ఓపిక అలవడి రచనలో మెరుగుదల పెరుగుదల పెంపొందును.మరొకసారి అభినందనలు.

వెలిదె ప్రసాదశర్మ

09/10/20, 11:16 pm - B Venkat Kavi: *💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP*


 *సప్తవర్ణముల 🌈 సింగిడి*

  *అమరకుల ఆధ్వర్యంలో* 


*. అంశం: పురాణం , 10.10.2020 శనివారం*


*నిర్వహణ : బి వెంకట్ కవి*


నేటి అంశం : 

====================


*రామాయణం రసామృతకావ్యమ్*


*(సంపూర్ణరామాయణంపై..)*

====================


*ఉదయం6⃣ నుండి రాత్రి 9⃣ గంటలవరకు*


⏰ *పేర్లు నమోదు కావాలంటే రాత్రి 8.30 గంటలలోపు కవితలను పంపాలి*

----------------------------------------

🏵️ *వికీపీడియా, యూ ట్యూబ్ వీడియోలు, సంపూర్ణరామాయణం చలనచిత్రం*


*బి. వెంకట్ కవియొక్క కంఠధ్వని*


*మీ కవితారచనకు తోడ్పాటునివ్వగలవు*


🍥 *సంపూర్ణరామాయణంపై కవితలను ఆవిష్కరించండి*


💥 *శ్రీమద్రామాయణం భారతీయ संस्कृతి,హైందవ సంప్రదాయానికి నిలువుటద్దం*


🌹 *ఆదికవియై ఆదికావ్యమును రచించారు వాల్మీకీమహర్షి*


🏵  *కవికోకిల వలెను శ్లోకాలను ఆలపించినకవి  వాల్మీకిమహర్షి*


🍂 *సప్త కాండాలుగలకావ్యమ్*


🍃 *24  వేల శ్లోకాలుగల అమృతపానం ఈ మహాకావ్యమ్*


🌻 *‌మాతృదేవోభవ!,పితృదేవోభవ!, ఆచార్య దేవోభవ!, అతిథిదేవోభవ!.అన్న ఆర్యోక్తులకు ఆదర్శం ఈ కావ్యం*


🦨 *ఉడుతాభక్తి ఉరకల సహకారం ఈ కావ్యం*


🐴 *అశ్వమేధయాగ ఫలప్రదం ఈ రామాయణమ్*


🦋🌳 *ప్రకృతిరమణీయదృశ్యం ఈ కావ్యమ్*


🏹 *రామబాణానికి తిరుగులేదు*


🥥🍒 *శబరిభక్తికి ప్రతిభక్తి*


🐒 *వానరसेనతో మిత్రత్వం, జటాయువుని మిత్రప్రేమ*.


🛕 *ఎన్నియుగాలు మారినా, ఎన్ని తరాలు మారిన తరగని భాతృప్రేమకు తార్కాణం ఈ శ్రీమద్రామాయణమ్.*


*ఇలా ఎన్నో ఎన్నెన్నో...*


🌾 *సుమధుర మైన వర్ణనతో పద్యమైన , వచనమైన, గేయమైన సరే ఏదైన ఒకటిని ఆవిష్కరించండి.*


 *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం.*


💥💥💥🦋🏹💐💥💥

10/10/20, 5:22 am - B Venkat Kavi changed this group's settings to allow all participants to send messages to this group

10/10/20, 6:00 am - B Venkat Kavi: *💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP*


 *సప్తవర్ణముల 🌈 సింగిడి*

  *అమరకుల ఆధ్వర్యంలో* 


*. అంశం: పురాణం , 10.10.2020 శనివారం*


*నిర్వహణ : బి వెంకట్ కవి*


నేటి అంశం : 

====================


*రామాయణం రసామృతకావ్యమ్*


*(సంపూర్ణరామాయణంపై..)*

====================


*ఉదయం6⃣ నుండి రాత్రి 9⃣ గంటలవరకు*


⏰ *పేర్లు నమోదు కావాలంటే రాత్రి 8.30 గంటలలోపు కవితలను పంపాలి*

----------------------------------------

🏵️ *వికీపీడియా, యూ ట్యూబ్ వీడియోలు, సంపూర్ణరామాయణం చలనచిత్రం*


*బి. వెంకట్ కవియొక్క కంఠధ్వని*


*మీ కవితారచనకు తోడ్పాటునివ్వగలవు*


🍥 *సంపూర్ణరామాయణంపై కవితలను ఆవిష్కరించండి*


💥 *శ్రీమద్రామాయణం భారతీయ संस्कृతి,హైందవ సంప్రదాయానికి నిలువుటద్దం*


🌹 *ఆదికవియై ఆదికావ్యమును రచించారు వాల్మీకీమహర్షి*


🏵  *కవికోకిల వలెను శ్లోకాలను ఆలపించినకవి  వాల్మీకిమహర్షి*


🍂 *సప్త కాండాలుగలకావ్యమ్*


🍃 *24  వేల శ్లోకాలుగల అమృతపానం ఈ మహాకావ్యమ్*


🌻 *‌మాతృదేవోభవ!,పితృదేవోభవ!, ఆచార్య దేవోభవ!, అతిథిదేవోభవ!.అన్న ఆర్యోక్తులకు ఆదర్శం ఈ కావ్యం*


🦨 *ఉడుతాభక్తి ఉరకల సహకారం ఈ కావ్యం*


🐴 *అశ్వమేధయాగ ఫలప్రదం ఈ రామాయణమ్*


🦋🌳 *ప్రకృతిరమణీయదృశ్యం ఈ కావ్యమ్*


🏹 *రామబాణానికి తిరుగులేదు*


🥥🍒 *శబరిభక్తికి ప్రతిభక్తి*


🐒 *వానరसेనతో మిత్రత్వం, జటాయువుని మిత్రప్రేమ*.


🛕 *ఎన్నియుగాలు మారినా, ఎన్ని తరాలు మారిన తరగని భాతృప్రేమకు తార్కాణం ఈ శ్రీమద్రామాయణమ్.*


*ఇలా ఎన్నో ఎన్నెన్నో...*


🌾 *సుమధుర మైన వర్ణనతో పద్యమైన , వచనమైన, గేయమైన సరే ఏదైన ఒకటిని ఆవిష్కరించండి.*


 *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం.*


💥💥💥🦋🏹💐💥💥

10/10/20, 7:36 am - Bakka Babu Rao: సప్తవర్ణాల సింగిడి

మల్లి నాథసూరి కళాపీఠం

ఏడు పాయల

అమరకుల దృశ్యకవి ఆధ్వర్యంలో

అంశం...పురాణం...రామాయణం రసామృత కావ్యం

నిర్వాహణ...బి.వెంకట్ గారు

రచన...బక్కబాబురావు

నివాసం...సికింద్రాబాద్

మొబైల్..9299300913

తెలంగాణ 


రామాయణ రసామృత కావ్యం అవనిలో

ఆది కావ్యం గా వాల్మీకి విరచితమై

భారతీయ సంస్కృతికి నిదర్శనమై

హిందు ధర్మానికి ప్రతీకయై నిలిచే


సంస్కృతి నడవడి నమ్మకము

తండ్రి కొడుకులాభందానికి సంకేతమై

భార్య భర్తల అనురాగానికి ప్రతీకయై

మిత్రుల మైత్రికి మారు పేరుగా


 ప్రజల సత్సంబందాలకు మూలమై

ఆదర్శ జీవనానికి మార్గమై

శ్రీ రామ నామమే సకల పాప హారణమై

భక్తి తత్వానికి బీజమయ్యే


రామపంచాక్షరి అష్టాక్షరి  మంత్ర సారం

రామాయణ మహా కావ్యం ఏడూ కాండములుగా

బాల కాండమందు రామ జననం బాల్యం

గురు యాగ పరిరక్షణ


అయోధ్య కాండమున వనవాసమేతెంచే

అరణ్య కాండమున సీతాపహరణం 

కిష్కింద కాండమునసీతాన్వేషన0

సుగ్రీవ హనుమంతుల స్నేహ బంధమై


సుందరకాండమున లంకాదహనమయ్యే

సీతమ్మ జాడ అశోక వనమున

యుద్ధ కాండమున రావణ సంహారం జరిపి

ఉత్తర కాండమున లవ కుశుల వృత్తాతమున



రామ నామము తలుపగ

కష్టములు తీరి గమ్యమై వెలుగ

ఆదర్శ మూర్తి యై నిలిచే అవనిలో

రామ చరితము దివ్యమై


పరమ శివుడిని పూజించి పునీతుడయ్యే

అడుగడుగునా రామ లింగేశ్వర తీర్థ లెన్నో

నిత్య పూజలందు కొంటున్న 

కీసర రామ లింగేశ్వర క్షేత్రమే సాక్షి


బక్కబాబురావు

10/10/20, 7:46 am - +91 99631 30856: *మల్లి నాథ సూరి కళాపీఠం*

*ఏడుపాయల*

*సప్త వర్ణ సింగిడి*

*విశేష తేది:10/10/2020*

*పురాణం:రామాయణ రసామృత కావ్యము*

*నిర్వహణ:విశిష్ట కవి B.వేంకట కవి శ్రేష్ఠులు*

*స్వర్ణ సమత*

*నిజామాబాద్*

9963130856


*ముందుగా మీరు ప్రతి వారం మికీ పీడియా,యూ ట్యూబ్ వీడియోలు,మధురమైన,వీనుల విందైన, మదికి పొందైన

మీ కంఠ ధ్వనిని వినిపించి

రచనలకు కావాల్సిన సమాచారాన్ని ఎంతో శ్రమ కోర్చి మాకు అందిస్తున్నందుకు

మీకు సహస్ర అభివంద న

ధన్యవాదాలు*


*రామాయణం రసామృత కావ్యము*


అమ్మానాన్నల అనురాగం,

పుత్రుల అభిమానం,

అన్నదమ్ముల అనుబంధం,

భార్యా భర్తల సంబంధము,

గురుభక్తి_ శిష్యాను రక్తి,

స్నేహ ఫలం_ ధర్మ బలం,

వినయం తో ఒదగడం,

విధేయతతో ఎదగడం,

జీవ కారుణ్య భావన,

ప్రకృతి లాలన,

ఇలా, జీవిత పార్శ్వాల న్నేంటినో,

పట్టి చూపిస్తుంది రామాయణం,

తమసా నది పసిపాప నవ్వు లా,

పచ్చని ప్రకృతి శోభతో

మనసుకు హత్తుకునే విధంగా ఉంది,

తమసా నది లో స్నాన మాచరించి వస్తున్న వాల్మీకి కి

ఓ దృశ్యం కంట బడింది,

*క్రౌంచ పక్షుల జంట అన్యో న్యంగా ఉన్నవి*

క్రూర బాణం తో మగ పక్షిని

నేల కూల్చాడు వేటగాడు,

*హృదయ విదారక దృశ్యం*

వాల్మీకి మనసును క్షోభకు గురి చేసింది,

*శోకం నుండి శ్లోకం పుట్టింది*

*మానిషాద ప్రతి ష్టాం త్వ*

*మగమః శాశ్వతీః సమాః!*

*యత్ క్రౌంచ మిథు నా దేకమ్*

*అవధీః కామ మోహిత మ్!!*

నారదుని ఆగమన ము

వీరుడు,ధీరుడు,అసూయలేని వాడు,

ధర్మం తెలిసిన వాడు,ఆపదలు

చుట్టు ముట్టిన తొణకని వాడు,

మాట తప్పని వాడు,

సకల ప్రాణులకు మేలు చేసే వాడు,

ఎవరైనా ఉన్నారా?

ఉన్నార నీ చెప్పి,

రామాయణ గాథను సంక్షిప్తంగా

వాల్మీకి కి వినిపించారు,

నారదుల వారు,

*త్రిలోక కంఠకుడు రాక్షస రాజు

రావణ బ్రహ్మ ను వధించడానికి,

విష్ణుమూర్తి అవతరణ జరగాలి*

దశరథ పుత్రునిగా రాముని 

జననము ఎలా?

ఋష్య శృంగుని ఆధ్వర్యం లో

*పుత్ర కామేష్టి క్రతువు*

జరపడం జరిగింది,

నాలుగు వేదాల వలె

కౌసల్యకు శ్రీరాముడు,

కైకేయికి భరతుడు,

సుమిత్ర కు లక్ష్మణ శత్రఘ్నులు

కల్గారు.

దశరథుని కుల గురువు వశిష్టుడు,

రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నలు గురువు విశ్వా మిత్రుడు,

*వేద శాస్త్రాలు అభ్యసించి*

*ధనుర్విద్య లో నైపుణ్యం*

సంపాదించి,

విజ్ఞాన ఖనులయ్యారు,

యాగ రక్షణ కు వెంట పెట్టుకొని

వెళ్లి ,

వారికి *బల* *అతిబల*

విద్యలను ఉపదేశించాడు,

తాటకి సంహరణ,

*మారీ చుని శీతేషు వు*

మావవా శ్త్ర ప్రయోగము తో

నూరు యోజనాలు పంపడం,

మిథిలా నగరానికి పయనం,

సీతా స్వయం వరం,

*శివ ధనువు*

ఎక్కుపెట్టి ఫెళఫెళ ధ్వనులతో

విరిగింది,

సీతారాముల కల్యాణం,

మంథర ప్రవేశం,

కైకేయి వరాలు,

రాముని అరణ్య వాసం,

ఖర దూషణ త్రిశరులు

పధ్నాలుగు వేల మంది మరణం,

*బంగారు లేడి వృత్తాంతము*

*కబందుని వధ*

కిష్కింధకు పయనం

*వాలి సంహర ణము*

సుగ్రీవ మై త్రి,

ఆంజనేయుని పరిచయం

రామ రావణ యుద్ధం

*రావణ సంహారం*

*అయోధ్యలో శ్రీరాముని పట్టాభి షే క మహోత్సవం*

10/10/20, 7:47 am - +91 81219 80430: <Media omitted>

10/10/20, 8:24 am - B Venkat Kavi: <Media omitted>

10/10/20, 9:24 am - +91 94934 51815: మల్లినాథ సూరి  కళాపీఠం ఏడుపాయలు

అమరకుల దృశ్య కవి ఆధ్వర్యంలో

అంశం: పురాణం (శ్రీ రామాయణ రసామృత కావ్యం). 10/10/2020

ప్రక్రియ: వచన కవిత

శీర్షిక: ఆదర్శనీయం రామాయణం

నిర్వహణ; శ్రీ. బి.వెంకట కవి గారు

రచన: పేరం సంధ్యారాణి నిజామాబాద్


శ్రీ రామాయణం జీవనపారాయణం

మధురసుధాక్షరాల మానవీయ విలువల

కలగలిసిన అమృతరాగాల రసరమ్యభావాల కవికోకిల వాల్మీకి విరచిత ఆదికావ్యం

సకలగుణాభి రాముని, సమర వీరుని ,

సాయుజ్యకారకుని దివ్య చరితను

 శత శ్లోకములతో నారదుడు సంక్షిప్తంగా వినిపించే పరమానందభరితుడయెను

తమసా నది సమీపాన

వాల్మీకి  క్రౌంచపక్షుల విరహాన్ని వీక్షించి

అనుష్టుప్ చందములో మానిషాది శ్లోకం

మదితలుపులు తెరుచుకుని

బయటకు తరలె రామాయణ పుణ్యశ్రవణఫలము తోడై నిలవగా

బ్రహ్మదేవుని ఆజ్ఞమేర 

ఇరువైనాలుగువేల శ్లోకాలతో ,

 6 కాండలతో  అత్యంత రమణీయ 

రామాయణ కావ్యం కలము నుండి జాలువారే

రామో విగ్రహవాన్ ధర్మం మని

మారీచునిచే కీర్తింపబడే

రామాయణం జీవనపారాయణమై

సకలవేదసారమై, సద్గుణగనియై

తల్లిదండ్రుల భక్తి, అన్నదమ్ముల అనుబంధం,

భార్య భర్తల అనురాగం, గురు శిష్యుల సంబంధం, స్నేహధర్మం, దూత లక్షణం,

ధర్మ రక్షణ,కారుణ్య భావనలతో

ఆదర్శ , ఆచరణీయ గ్రంథమై

అవని లో వెలసిన అమృతభాండము

తరులు గిరులు నదులు ఉన్నంత దాకా 

రామాయణ ప్రశస్తి నిలిచి ఉండును ఆచంద్రార్కపర్యంతం ఆదర్శకావ్యమై

అలరారుతూ మనిషిని మనీషిగా మలచే

మహనీయ మానవీయ మధురరసా కావ్యం శ్రీమద్రామాయణమేయగును

10/10/20, 10:17 am - +91 94940 47938: మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింధూ శ్రీ అమర కుల దృశ్యకవిగారి  ఆధ్వర్యంలో


అంశం: పురాణం రామాయణం రసామృత కావ్యం

నిర్వహణ: బి. వెంకట గారు

రచన: నెల్లుట్ల సునీత

కలం పేరు: శ్రీరామ

ఖమ్మం



చెప్పుకుంటే రామాయణం

తరచి చూస్తే అణువణువూ ప్రేమమయము!

మనిషి మనిషిని ప్రేమించమనే మానవీయ కోణం!

నర వానర పశుపక్షాదులలో  కానవచ్చే దయాగుణం!


తండ్రి మాటకు తల్లి వల్లమాలిన ప్రేమకు

సతి సాహచర్యానికి సోదరుని సవర్యలకు!


మంచిదారిలో నడిచిన వారికి అగ్నిపరీక్షలు

చెడుదారులు తొక్కిన వారీకి అంతిమ గడియలు!


కవితా  శిఖ రామాయణం

కల్పవృక్షము కావ్య వైభవము!

తాత్విక భావాలకు సాహితీ ప్రతిభ

పద్య కావ్యాలతో విశిష్టతకు నిదర్శనం!


 సాహిత్య ప్రక్రియలను భిన్న దృక్పదాలు!

ఆధునిక సాహిత్యం మయి వాసికెక్కింది!

నూతన కల్పములు కల్పవృక్షము

పాత్రపోషణ ఫర డ విల్లంగ!


మై చిత్రములతో వర్ణించి

స్వతంత్ర కావ్య తత్వమును సమకూర్చా

తెలుగు భాషలోని సొగసు గడుసుదనం

రామాయణ కల్పవృక్షం ఉదహరించే!


భాష సొగసును తనివితీరా ఆస్వాదించవచ్చు!

కమనీయ కావ్యంబు రామాయణ కల్పవృక్షము!

పలుకుబళ్లను యధాతధంగా పద్యాలతో పలికించే!

వాడుక భాషలోని వాక్య విన్యాసాన్ని చేసి


అహల్యా శాప విమోచన ఘట్టము

అశ్వమేధ సమయములో దశరథుని విశ్వామిత్రుని ఆహ్వానించుట!

శివ ధనుర్భంగము మారీచ వధ వంటి ఘటనలతో కథనం నుండి గణనీయంగా మార్చివేసే!


వాలి వధ సీత అగ్ని ప్రవేశం వంటి ధర్మ సందేహం పద మనిపించే  నూతనమైన మెలకువలతో కవి తీర్చిదిద్దే!

దుష్ట పాత్రల చిత్రణలో కూడా కొత్తదనం ఎంత ఉట్టిపడే!

ఆధ్యాత్మికత జోడించి విశిష్టంగా మేళవించిన తెలుగుతనం రామాయణ కల్పవృక్షం కావ్య!

*******************************

హామీ పత్రం

ఇది నా స్వీయ రచన

10/10/20, 10:19 am - +91 98850 66235: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి...

అంశం: పురాణం రామాయణ రసామృత కావ్యం

నిర్వహణ: బి. వెంకట గారు

రచయిత : కొప్పుల ప్రసాద్, నంద్యాల

శీర్షిక:ఆదర్శనీయం 


ఆది కావ్యమై 

             భారతీయ మై

బహుజనులకు ఆదర్శమై  

               రామాయణమే రమణీయమై

జీవకోటికి తారకమంత్రమై 

                   అన్నదమ్ముల అపురూపమై

సీతని ఆదర్శ వనితై

      రాముడే ఆదర్శపురుషుడై

అన్నదమ్ములకు రామలక్ష్మణులై

         అవనిపై నా నలుగురు అన్నదమ్ములై

తండ్రి మాటకు విలువ ఇచ్చిన వారై

         విశ్వానికి అంతా నిదర్శమై

తల్లి మాటలకు విలువై

       తండ్రి మాటకు ప్రాణమై

ఇచ్చిన మాటకు జీవమై   

       రామాయణమే నిలయమై

కుటుంబాలకే ఆదర్శమై

        భావితరాలకు నిదర్శనమై

భర్త మాటకు విలువై

        స్త్రీ రత్నాలకి ఆదర్శమై

సృష్టి ఉన్నంత వరకు సీతారాములే ఆదర్శమై

         భారతీయ జీవనానికి నిదర్శనాలై

పర స్త్రీ లకు వ్యామోహ మై

            వంశమే నాశనం సర్వనాశనమై

చెడుకు దూరమై మంచికి దగ్గరై

       నీతికి నిలయమై దైవానికి దగ్గరై

  రామాయణం మనకు ఆదర్శం

         రాముడే మనకు ఆదర్శనీయం     

యుగాలు మారినా నా ధర్మాలు తప్పిన

       మారని మంత్రం తారక మంత్రమే


✍ కొప్పుల ప్రసాద్ 

నంద్యాల

10/10/20, 10:25 am - +91 98679 29589: *సప్తవర్ణముల సింగిడి*

*మల్లినాధ సూరి కళాపీఠం, ఏడుపాయల*

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశము: *రామాయణం రసామృతకావ్యమ్*

*(సంపూర్ణరామాయణంపై...)*

*శీర్షిక: శ్రీరామునికి నా వందనాలు*

*ప్రక్రియ: వచనం*

*నిర్వహణ:  శ్రీ బి. వెంకట్ కవి గారు*

*తేదీ 10/10/2020 శనివారం*

*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ*

*ఊరు: మంచర్, పూణే, మహారాష్ట*

         9867929589

  email: shakiljafari@gmail.com

"""""''"""""''"""'""""''''''"""""""""""""""""""'"''"""""""

సంస్కృతము లో ఆదికవి వాల్మీకి మహాముని రచన రామాయణము, భారతీయ వాఙ్మయములో ఆదికావ్యము...


జాతి, ధర్మ, కుల, మత భేదాలు మరిచి అందరూ అభ్యసించాల్సిన సప్త కాండాల గ్రంథము రామాయణము...


చరిత్ర, సంస్కృతులు, విచార - ఆచారణాలు

కుటుంబం - సమాజాల నీతి నియమాలు రామాయణంలో...


తండ్రీ - కొడుకుల, అన్న - తమ్ముల, భార్య - భర్తల మరియు స్నేహితుల మధ్య సంబంధ బాంధవ్యాల తీరుతెన్నులు రామాయణంలో...


ప్రభుత్వ, శాసకుల ప్రజల పట్ల కర్తవ్యాలు, రాజుల - ప్రజల మధ్య సంబంధాల నియమాలు రామాయణంలో...


జ్ఞ్యాన - శాస్త్రాలు, కర్మ సిద్ధాంతం, సాహస - శౌర్యాలు, భక్తి వివరాలు రామాయణంలో...


ఇరువది నాల్గు వేల శ్లోకాల్లో ఇమిడ్చ బడ్డ భారత జీవన పద్ధతి అమోఘం, ఆచరణ యోగ్యం...  


రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు) ఇలాంటి శ్రీరామునికి నా వందనాలు...


*రచన: మొహమ్మద్ షకీల్ జాఫరీ*

  *మంచర్, పూణే, మహారాష్ట*

10/10/20, 10:32 am - +91 94413 57400: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

అంశం.రామకథా స్మరణం

నిర్వహణ.శ్రీ మాన్ బి.వేంకట కవిగారు

రచన.డా నాయకంటి నరసింహ శర్మ


సగర కాకుత్సాది ఇనకులాన్వయమందు

సత్యసంధులు ధర్మనిష్ఠులు మనోనిగ్రహులు జనించిన ఇనకులాన్వయమందు కౌసల్య సుమిత్ర కైకేయీ సహిత 

దశరథ భూజాని  సల్పిన పుత్రకామేష్ఠి యాగఫలంగా

సాకేత పురి భూషణులు రామలక్ష్మణులు భరతశతృఘ్నలు జనియించగ

గాధినంధనుని యాగ రక్షణ నెపముతో తాటకీ వధ

మిథిలాధిపతి పిలుపున శివ ధనువునలీలగా విరిచి వైదేహి ని ధర్మ విగ్రహుడు రాముడు చేపట్టె

లక్ష్మణ భరతశతృఘ్నలు క్రమంగా ఊర్మిళా మాండవీ శృతకీర్తులను పరిణయమాడిరి

భరతుని రాజ్య పట్టము థాశరథీ వనవాసము 

మారీచసుబాహులు విరాథకవచుల భంజనము

సీతాపహరణము 

వాలీ సంహరణము 

వాయుతనయుని లంకా ప్రవేశం

రామరావణ సంగ్రామం 

రావణ కుంభకర్ణాది దనుజ జీవ హరణము  విభీషణలంకా రాజ్యాభిషిక్తం

భూజాత అయోనిజ అనల ప్రవేశము రమ్యగుణ ధాముడు రవికుల సోముడు రాముని ప్రాజ్య అయోధ్య సామ్రాజ్యాభిషేకం 

జానకి వనచారణం కుశలవ జననం ప్రాచేతసుడు వాల్మీకి రామకథా శ్రవణం  లవకుశ సాకేతాపురి పట్టాభిషేకం

రామావతార  పరిసమాప్తం


డా నాయకంటి నరసింహ శర్మ

10/10/20, 10:44 am - +91 99639 15004: మల్లినాథసూరి కళాపీఠం yp. 

సప్త వర్ణముల సింగిడి 

ప్రక్రియ. పురాణం. 

అంశం. రామాయణం. 


వాల్మీకిరామాయణంఆదికావ్యం. భారతీయులఅపురూపకావ్యం. 

వాల్మీకిఅంతరంగవేదననుండి జనియించిన అమర కావ్యము. 


ధర్మార్ధ కామోక్షములు 

మానవుని ఉత్తమ గతులకు దారి చూపిన కావ్యం. 

రామాయణములో చెప్పని ధర్మము, విశ్లేషించని విషయం లేదు, తరచి తరచి చిత్రించిన 

మానవ స్వభావము. 


రామాయణం నిత్య పారాయణం, పిపీలికమునుండి, పర బ్రహ్మ ము వరకు, ఆవిష్కరించినాగ్రంధం. 


చెట్టు పుట్టలు, రాయి రప్పలు పశు పక్ష్యాదులు, రాజులు రమణులు, బంధాలు అనుబంధాలు. దుష్టులు. సజ్జనులు. అవమానాలు ఆందోళనలు సృష్టి సమస్తాన్ని 

అద్దము పట్టిన మహోన్నత కావ్యరాజము. 


లోకోత్తర పురుషోత్తముడు రాముని భవ్య చరితను, సీతమ్మ దివ్య చరితను లోకానికి చాటిన కవి శ్రేష్ఠుడు వాల్మీకి. 

మనిషి అన్నవాడు ఎలా ఉండాలో, రామునికి ద్వారా, ఎలావుండకూడదో రావణుని ద్వారా లోకానికి ఎరుక పరచాడు.. సమస్త కుటుంబజీవనం ఇలా గే ఉండాలి అని శాసించాడు. 


రామాయణం నిత్య పారాయణం.. వాల్మీకి అందించిన రామాయణం లోకాలకు అందించిన పరమ పద ముక్తి సోపానం. 

రామ యన ము నిత్య పారాయణం.

10/10/20, 10:44 am - +91 99639 15004: 👍🏻ఆవలకొండ అన్నపూర్ణ 

ఊరు శ్రీకాళహస్తి చిత్తూరు 

9963915004

10/10/20, 10:51 am - Telugu Kavivara: Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/KLaIoeqzavkDEnS7US1Bqu



పది రోజుల్లో ఒక అంశం పై మేమిచ్చిన పుస్తకం పై సమీక్ష వ్యాసం రాసి ప్రశంసా పత్రం తో పాటు త్వరలో జరిగే సమ్మేళనం లో సన్మానం పొందండి


*మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల*

10/10/20, 11:07 am - +91 96523 71742: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

అంశం:రామాయణం

నిర్వహణ:వెంకట్ గారు

రచన:దుడుగు నాగలత


వాల్మీకిచే విరచితమైన ఆదికావ్యం

హిందూధర్మములచరిత్ర,సంస్కృతిని

పవిత్రముగా తెలిపిన ఆదర్శజీవనం

సంబంధ బాంధవ్యముల అనుబంధాలను

మానవీయవిలువలను మహత్తరంగా

తెలిపెను రామాయణపుణ్యచరితం

పితృవాక్యపాలనలో రామరాజ్యం

విలసిల్లెను ప్రజలకు భాగ్యసీమయై

మోక్షమార్గానికి దారిచూపునదిధర్మం

ఆ ధర్మపరిరక్షణకు నిలువెత్తునిదర్శనం రాముడు

సకలవేదాల సారమే రామాయణం

పరస్త్రీని కాంక్షించటం స్వీయనాశనానికి మార్గమని తెలుపును

శివధనుస్సువిరచి సీతనుపెండ్లాడి

ఏకపత్నీవ్రతుడయ్యె జానకీరాముడు

శబరిఇచ్చిన ఎంగిలిపండ్లను తిని

భక్తికి విలువనిచ్చిన భగవంతుడు

రామనామము జపముచేసిన

సకలపాపములు తొలగును

ఆయన జీవితాన్ని ఆదర్శముగ తీసుకున్న

మనిషి మహామనిషిగా మారును

శ్రీరామచరితం శిరసానమామి

10/10/20, 11:10 am - B Venkat Kavi: మల్లినాథసూరి కళాపీఠం yp. 

సప్త వర్ణముల సింగిడి 

ప్రక్రియ. పురాణం. 

అంశం. రామాయణం. 


వాల్మీకిరామాయణంఆదికావ్యం. భారతీయులఅపురూపకావ్యం. 

వాల్మీకిఅంతరంగవేదననుండి జనియించిన అమర కావ్యము. 


ధర్మార్ధ కామోక్షములు 

మానవుని ఉత్తమ గతులకు దారి చూపిన కావ్యం. 

రామాయణములో చెప్పని ధర్మము, విశ్లేషించని విషయం లేదు, తరచి తరచి చిత్రించిన 

మానవ స్వభావము. 


రామాయణం నిత్య పారాయణం, పిపీలికమునుండి, పర బ్రహ్మ ము వరకు, ఆవిష్కరించినాగ్రంధం. 


చెట్టు పుట్టలు, రాయి రప్పలు పశు పక్ష్యాదులు, రాజులు రమణులు, బంధాలు అనుబంధాలు. దుష్టులు. సజ్జనులు. అవమానాలు ఆందోళనలు సృష్టి సమస్తాన్ని 

అద్దము పట్టిన మహోన్నత కావ్యరాజము. 


లోకోత్తర పురుషోత్తముడు రాముని భవ్య చరితను, సీతమ్మ దివ్య చరితను లోకానికి చాటిన కవి శ్రేష్ఠుడు వాల్మీకి. 

మనిషి అన్నవాడు ఎలా ఉండాలో, రామునికి ద్వారా, ఎలావుండకూడదో రావణుని ద్వారా లోకానికి ఎరుక పరచాడు.. సమస్త కుటుంబజీవనం ఇలా గే ఉండాలి అని శాసించాడు. 


రామాయణం నిత్య పారాయణం.. వాల్మీకి అందించిన రామాయణం లోకాలకు అందించిన పరమ పద ముక్తి సోపానం. 

రామ యన ము నిత్య పారాయణం.

10/10/20, 11:52 am - +91 97040 78022: శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి 10/10/2020

అంశం -:పురాణం. రామాయణం...

నిర్వహణ-:శ్రీ బి వెంకట కవి గారు

రచన -:విజయ గోలి

ప్రక్రియ -:వచనం

ముందుగా పవిత్ర రామాయణం పురాణము అంశముగా  

రాముని తలచుకునే విధముగా చేసిన వెంకట కవిగారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏🏻🙏🏻ఎంత వ్రాసినా తరగనిది రామాయణ సౌందర్యం..వివరించాలని చిన్న ప్రయత్నము ...ఆదరించ గలరు🙏🏻🙏🏻

మానిషాదమే మహిమాన్వితమై

వాల్మీకి ఘంటమున ఆదికావ్యముగ

రామాయణ మహాకావ్యమైనది..

పుత్రకామేష్టితో వరపుత్రుల పొందెను దశరధ రాజు..

కౌసల్య సుమిత్ర కైకేయిలకు ..రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను 

మురెపము తీరగ ముద్దుగ సాకెను.సద్గుణాభిరాముడన్న

అందరి మదినిలచిన అనురాగదీపము..పరంధాముడన్న

పంచప్రాణములే.. ఆ మహరాజుకు ...అన్నదమ్ముల ఆత్మీయ బంధమే రాముడు.. సీతమ్మకు సిరుల సింధూరం  ...అయోధ్య ప్రజల ఆశల సౌధము.శ్రీ రాముడు సకలగుణాభిరాముడే...సర్వస్వం...మహోన్నతుని చరితయే రామాయణం..నారాయణుడే నరుడిగ పుట్టి..నరుడికి బ్రతుకు విలువలు తెలిపిన నారాయణ రామాయణం..తండ్రి మాట తప్పనివాడు..చెలిమికి చెలికానిగ ..ధర్మము తప్పని రామబాణమై...ఒకమాటగ ఒక పత్నిగ జీవిత హద్దులు తెలిపన జానకి రాముని కధనం..సర్వమతముల హితమైనది రామాయణము...కాని వేళల రామనామమే రక్షఅని తెలిపే..

దేవుడైనా ..మానవుడి కష్టాల కడగండ్ల నడిచినవాడు..అదిఏమి ఇదిఏమి అడుగడుగున రాముడే ఆదర్శమన్నది రామాయణం .దినదినము రాముని స్మరణున్నచాలు..భౌతిక బంధాల బాధ్యతల బంధమే రామాయణం... కళ్యాణరాముడు భక్తికే బందీగ హనుమనే చూపెను..కమనీయధాముడు..కరుణాపయోనిధి ..భారతమున ప్రతితల్లి ప్రతి తండ్రి కొడుకుగా కోరేది రాముని..ప్రతి తమ్ముడు కోరేది అన్నగా కొలువైన రాముని..ప్రతి పడతి పతిగ కోరేది సీతాపతిని..అంతేమి ఇంతేమి అన్నింట రామునే దేవునిగ చూపిన రామాయణమే మనపారాయణం..భూమి ఆకాశములున్నంతవరకు...నిత్యమై వెలుగు..శ్రీరామ ఆదర్శ రామాయణం..🙏🏻🙏🏻🙏🏻🙏🏻

10/10/20, 12:06 pm - +91 99595 11321: మల్లినాథ సూరి కళాపీఠం వారి సప్తవర్ణసింగిడి, 

అంశం. పౌరాణికం, రామాయణం 

శీర్షిక. సుందరకాండ 

హనుమంతుడు చెట్టుపైనించి సీతమ్మ ముంగిట నిలిచి  శ్రీ రాముని వర్ణించిన వైనం. 


సుందర సుమధుర మందస్మిత 

వదనారవిందుడు.. రామచంద్రుడు.... 


చరణం 1.

ఎనిమిది అడుగుల దీర్ఘ కాయుడు, 

అనిలో అరివీర బలాఢ్యుడు, 

కలువల బోలెడు కన్నుల వాడు, 

నారవలువలు ధరించి యున్నవాడు... 


చరణం 2.

అన్నకు తగిన తమ్ముడు వాడు, 

సర్వ సద్గుణ సమన్వితుడు, 

లక్ష్మణ నామధేయుడు వాడు, 

అన్నివేళలా అన్నకు తోడు... 


చరణం 3.

నిన్ను గానక కానల వెదుకుచు, 

చేరిరి వారు కిష్కింధా పురికి, 

కిష్కింధకు రాజు సుగ్రీవుడు, 

ఆతని మంత్రి ని నే హనుమంతుడ...


చరణం 4.

ఒకటే మాట ఒకటే బాణం, 

నీవే నమ్మా ఆయన ప్రాణం, 

నమ్ముము తల్లీ నాదు వాక్కును, 

రమ్ము ! చేర్చెద నా స్వామి అక్కునే.......


రచన. చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి, 9959511321

10/10/20, 12:13 pm - venky HYD: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి

10-10-2020 శనివారం

పేరు: కామవరం ఇల్లూరు వేంకటేష్ 9666032047

ఆదోని/హైదరాబాద్

అంశం: రామాయణం రసామృత కావ్యం

శీర్షిక: పురాణం (58) 

నిర్వహణ : బి. వెంకట కవి 


ఆటవెలది 1

రామ కావ్యము రసరమ్య భరితమున

సీత నామము కలిసినది జ్ఞాన

లక్ష్మణన్న సేవల కొని యాడుదురుగ

హనుమ భక్తి ముందు రాదు శక్తి


ఆటవెలది 2

రామ బాణమందు రావణ ప్రాణమే 

సీత మానవపతి శ్రీజ దేవి

కైక మాట కోరికై వన వాసము

వెళ్లి రాక్షసులను వెడలగొట్టి


ఆటవెలది 3

తండ్రి మాట నిచ్చె తనయుడు తీర్చంగ

అన్న బాట పట్టె ఆత్మ జుడును

విల్లు నెత్తి పెట్టి విరిచిన రాముడు

సీత పెండ్లి యాడె శ్రీ రఘు పతి


ఆటవెలది 4

ఏమి చేయవలెను ఏరి నేర్చుకొనుము

పాటములను నేర్పు పద్ధతితెలు

సుకునురండి రామ సూర్యవంశ తిలక

మాట మనిషి విలువ మంగళకర

వేం*కుభే*రాణి

10/10/20, 12:15 pm - B Venkat Kavi: <Media omitted>

10/10/20, 12:15 pm - Madugula Narayana Murthy: *💥🚩మల్లినాథసూరి కళాపీఠం YP*

*సప్తవర్ణముల 🌈 సింగిడి*

  *అమరకుల ఆధ్వర్యంలో* 

*. అంశం: పురాణం , 10.10.2020 శనివారం*


*నిర్వహణ : బి వెంకట్ కవి*

నేటి అంశం : 

=

*రామాయణం రసామృతకావ్యమ్*


*(మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా*

రామోవిగ్రహవానుధర్మమనుసామ్రాజ్యమ్ముసంపూర్ణమై

ధామమ్మైవెలుగొందుజాతికనుసంధానమ్ము హిందూత్వమై

శ్రీమాతృత్వముసీతరూపముసంశ్రేయమ్మువిష్ణుత్వమై

ధీమాయేయితిహాసభారతముసందీప్తించువిశ్వమ్మునన్!!


మనిషినిమార్చుచేయుగలమాటయెజ్ఞానవికాసకావవ్యమై

వనమునబోయవాడునొకవాజ్మయసృష్టిగకిమూలమైభువిన్

కనివినియెంచలేనిఘనకార్యమునాదికవీశ్వరుండున్

తనివినితీర వ్రాసెగద దాశరథీహితకారిగాథలన్!!


కౌశికుయాగమ్ము కౌశలుడైరక్ష

చేసిచంపెదనుజ చేతలన్ని

శివధనుర్భంగమునవలీలజరిపెను

సీతమ్మ మనువుతో క్షేమమరయ


మంథర దాసియై మాతృత్వప్రేమల

కైకేయపలుకుల కాలమహిమ


తండ్రిమాటనుగాచి ధర్మపునడకతో

దైవమ్ము నరునిగాసేవజేసె


నొకమాటనొకభార్యనొకశరమునానయై

రామావతారమైరాజ్యమేలె

దుష్టరావణుక్రూరదురితనహంకార

భావమేసీతమ్మచెరనుబట్ట

విలపించెతలపువవిధినాటకముజూచి

సుగ్రీవుసచివునిసోపతిగిరి


ఋష్యమూక తలము రేనికాశ్రయమయ్య

వాలినిహతమార్చె జాలివిడిచి

ఆంజనేయుడిశ్రమమాసేతువారధి

స్వర్ణపురికిజేరెసమరశౌరి

లంకలోపోరాడిరావణాసురునిపై

విజయ దుందుభి మ్రోగి

వేల్పునయ్యె

*తేటగీతి*

అట్టి రామచంద్రునికథహాయినిచ్చి

నరులకునరనరాలలోనాటుకొనియె

అమ్మసీతమహనుమంతుడాదుకొనుచు

భార తీయుల సంస్కృతిపరిఢవిల్లె!!

10/10/20, 12:18 pm - B Venkat Kavi: *వెంకటేశ్ గారు వందనాలు*

*రామకావ్యము రసరమ్య భరితమున*

*అభినందనలు*

💐💐💐💐🏹🏹🏹🏹💐💐💐💐💐💐💐

10/10/20, 12:21 pm - venky HYD: ఆర్యా


ఒక నిమిషం నిడివి గల పాటకు ఎంత కష్టం పడతాం మేము. 


మీరు సుదీర్ఘమైన 30 నిమిషాలైనా హాయిగా ఉంటుంది ఆడియో


మీ కృషికి ప్రత్యేక అభినందనలు

10/10/20, 12:22 pm - venky HYD: ధన్యవాదములు

10/10/20, 12:25 pm - B Venkat Kavi: ధన్యవాదాలు సర్ 

👏👏👏

10/10/20, 12:29 pm - +91 90961 63962: మల్లినాథసూరి కళాపీఠం

అంశం.. రామాయణం

అంజయ్య గౌడ్

సీసమాలిక


ధర్మమున్ స్థాపింప దశరథ సుతునిగ

కౌసల్య గర్భాన క్ష్మాతలమున

వైకుంఠుడేవచ్చి వాసిగడించగ

శ్రీ రాముడైబుట్టి  చెన్నుమీర

దానవాలినిజంపి తపసి యాగము గాచి

శివుని విల్లు విరిచి సీతనుగొని

జనకుని యాజ్ఞచే వనవాస మునకేగి

సీతను గోల్పోయి చిన్నబోయి

శబరిని గాచియు సౌమిత్రి తోగూడి

కిష్కింధకేగియు కీర్తి శాలి

వానరపతియైన బాను కుమారుడు

సుగ్రీవ మైత్రిచే సురుచిరముగ

యాంజనేయునివల్ల నవనిజ జాడెర్గి

లంకపై దండెత్తి రావణుడిని

వధియించి సీతతో పట్టాభి షిక్తుడై

రాజ్యపాలన జేసి రమ్యము గను

గీ..

కన్న బిడ్డలవలె ప్రజన్ గాచి నాడు

మాన్య రఘురామచంద్రుడీ మహితలంబు

అట్టిధన్యాత్ము చరితమున్నాది కవియు

వ్రాయ రామాయణంబుగా వాసికెక్కె

10/10/20, 12:56 pm - +91 96185 97139: మల్లినాథ సూరి కళాపీఠము 

ఏడుపాయల సప్త వర్ణాల 

సింగిడి 

పురాణం : రామాయణ రసామృత కావ్యము

నిర్వహణ విశిష్ట కవి బి వెంకట్ గారు 

రచన డి.విజయకుమార్ శర్మ. 

************************

పల్లవి :

రామాయణము

ఇది రస రమ్య కావ్యము

మాన జీవనానికి ఆలంభము

1.చ

అయేధ్య నగరికి రాజు

దశరథ మహరాజు

మువ్వురు భార్య లు

వారు "కౌసల్య "సౌమిత్ర"

కైకేయి"రా"

2.

ఆ రాజు సంతానము లేక

పరిత పించు చుండెను

ఋషుల "మునుల"

రావించినాడు

తన తన అల్లుడు ఋష్యశృంగుని"

ముందుచుకున్నాడు

యజ్ఞ ము జేసినాడు"రా

3.చ

యజ్ఞ నుండి ఒక దివ్యపురుషుడు"

ప్రత్యక్ష మైనాడు

పాయభాండమును

మువ్వురు రాణులు"

కౌసల్య "సౌమిత్ర "

కైకేయి అంద జేసినాడు

వారలు "పాయసము"

సేవించినారు" రా"

4. చ

కొన్ని రోజులకు "రాణుల"

కుమారులు కలిగినా రు

వారే "రామ లక్ష్మల "భరత

శత్రజ్ఞలు"

థశరథుని" ఆనందానికి

అవధులు లేవు "రా"

చ.

మంచి విద్యను"

గురువుల కడ

అభ్యసించినారు

యువకులు గా మారినారు.

వివాహము" చేభూని నారు

ఇంతలో విశ్వామిత్రుడు

అరుదెంచినాడు "యజ్ఞ రక్షణ"

కు "రామ లక్ష్మలను"

పంపుమని అడిగినాడు"

వశిష్ఠుడు" థశరథరాజుకు"

నచ్చ జెప్పిపంపించినాడు"రా"

5.

యుగానికి రక్షణ నిలచి

సఫలం జేసినారు

అటునుంచి ప్రయాణం

సాగిచినారు

మిథిలానగముచేరి

శివధనస్సును"

విరిచినాడు

సీతను చెప్పట్టినాడు

అయోధ్య నగరము"

చేరినాడు"

కొంత కాలానికి

తండ్రి ఆజ్ఞా మేరకు

లక్ష్మణ "సీత సమేతంగా

అడవుల జేరినాడు

ఋషుల "మునుల

సంరక్షణ జేసినాడు"రా

రావణాసురుడు

సీత నపహ రించి నాడు

శ్రీరాము వ్యథచెందినాడు"

ఆంజనేయుని "సుగీవుని"

ద్వారా సీతమ్మ జాడను

కనుగోన్నాడు రా"

రాముని తో వచియించినాడు

నలుడు నీలుడు"అబ్ది కి

వారది కట్టినారు"

వానర సైన్యముతో వెళ్లి 

నారు"

*రామ "లక్మణులు*

 రావణాసురునితో

యుద్ద జేసినారు

విజయమునందినారు"

తిరిగి"

సీతాదేవి"అగ్ని"

పరీక్ష తో "

*అయేధ్య * నగరము

జేరినారు"

అచటి ప్రజలు ఆనందించినారు"

కొంతకాలానికి

మరళ "సీతమ్మ " ను

అడవి పంపినారు

చాకలి నిందెతో

అచట "లవకుశులు"

జన్మించినారు"

వాల్మీకి "రచించిన "

రామాయణం "అయ్యో ధ్య "

నగరిలో పారాయణం"

జేసినారు"

శ్రీరాము"త్రండి"గా

గుర్తించినారు"

తల్లి "వాల్మీకి "ఆశ్రమంలో

ఉన్నదని తెలిపినారు"

సీతమ్మ"లవ"కుశులను"

శ్రీ రామునికి అప్పగించినాది"

భూమిలోని వెళ్లి నాది

శ్రీరామడు" లవ"కుశు"

లకు రాజ్యం"అప్పగించినాడు"

తన అవతారమును"

ముగించి "వైకుంఠ "మును

జేరినారు"

ఇది "సంక్షిప్త సంపూర్ణ రామాయణం" రా"

10/10/20, 12:56 pm - +91 98492 43908: మల్లి నాథసూరి కళాపీఠం ఏడుపాయల

బి.సుధాకర్

శీర్షిక.. రామాయణ కల్పవృక్షం

నిర్వాహణ..వెంకట్ గారు


కాలం పరుగులో మరుగైపోతున్న ఇతిహాసాలెన్నో మరచి పోతున్న మనిషి

ఆధునిక పోకడలతో ఆగమైపోతు

ఆరాటం పెంచుకుంటు భక్తి తుంచుతున్నాడు


ఆదర్శ జీవితానికి బ్రాండ్ అంబాసిడర్

ఆనాటి విలువలే నేటి సమాజపు పునాదులు

మాటకు కట్టుబడి కఠోర జీవితాన్నిగడిపి 

దుష్ట శిక్షణకై శిష్టుడై వెలిగిన రామచంద్రుడు


తులసీ రామాయణం వెలసెను కలకాలం

మంచిని తెలిపే మహాకావ్య మది

మనిషిని మార్చే మహత్తర శక్తి రూపం

ఎన్నో సర్గాలతో రాముని కీర్తించిన 

ఆది గ్రంథము రామ చరితం


రెండక్షరాల రొమ పదం ఎన్నో భావాల సంగమమం 

ఆపదలో ఆదుకొనే మహాశక్తుల ఆయుధం

పాప పుణ్యాల పయణానికి దిక్సూచి 

రామ కావ్యమే తరతరాలకు  విలువల కోవెల

రేపటి చీకటిని తొలగించే వెలుగు కిరణం

10/10/20, 12:56 pm - +91 98491 54432: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు:మోతె రాజ్ కుమార్

కలంపేరు:చిట్టిరాణి

ఊరు:భీమారం వరంగల్ అర్బన్

చరవాణి9849154432

అంశం:పురాణం రామాయణం

శీర్షిక:లోకానికాదర్శం

నిర్వహణ:శ్రీ బి వెంకటకవి గారు

ప్రక్రియ:గేయం


సకల పాప హరణ జేయ

రామనామం 

జయములనిచ్చె రామా

యణం

/సకల పాప /

బాల్యమందున యాగరక్షణ

చేసె తాటకిని సంహరించి

హరివిల్లు విరిచి సీతను పెండ్లాడి

తండ్రి మాటకు నెదురు చెప్పక 

అడవులకేగిన ఆదర్శమూర్తి

సీతా లక్ష్మణ తోడు నిలువుగా

                   /సకల పాప /

శూర్పణక చెప్పుడు మాటతో

జంగమరూపము దాలిచ్చి 

రావణ

సీతనులంకు చేర్చె సమ

యం

ఆభరణాలు తీసివేయగా

హనుమచేతిలో పడగ చూచి

రామునికీవార్త తెలిసె నిలలో

                   /సకల పాప /

సూక్ష్మ రూపం దాల్చి హనుమ

సంధ్రముదాటి సీతను జూసి

రామముద్రిక చూపించ గనె

సంతసమొంది కషల

ములడిగె

శిరోరత్నము రాముని కిమ్మని చెప్పె

లంకను కాల్చి రాముని చేరె

                  /సకల పాప /

సంధ్రముపైన వారధి కట్టి 

వానర సైన్యం లంకుచేరి

కుంభకర్ణాదుల దునిమి

విభీషణుడు చెప్పు రాక్షస

రాజును కూల్చె

సీతను రమ్మని సందియ

పడగ

అగ్ని ప్రవేశం చేసెను సీత

                /సకల పాప /

అయోద్యచేరి రాజ్యంచేయ

ప్రజలంత సుఖశాంతితోడ

నవ్వగనుండ సీతమ్మ

నడవికి

పంపెనునంత చెడుమాట వినగా

లవకుశులను బొందె జానకీ

రణమేచేయ తండ్రిని చెప్పి

భూమాత ఒడిచేరె సీతా

                /సకల పాప /

భక్తికి ముక్తికి రామకావ్యం

మార్గదర్శక మై నిలిచె మహిన

అన్నదమ్ముల అనుబంధం

భార్యభర్తల అనురాగ సుధలు

తండ్రి మాట జవదా

టకుండ

జగతిని నిలిచె రసరమ్య కావ్యం

                  /సకల పాప /


మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

10/10/20, 1:00 pm - +91 98491 54432: రామ కావ్యం రసరమ్య భరితమని ఆటవెలదులందు చక్కగా నుడివినారు వెంకటేష్ గారు బాగుంది అభినందనలు 🌹👏🌺👍🌷👌🌸మోతె రాజ్ కుమార్ (చిట్టిరాణి)

10/10/20, 1:11 pm - Bakka Babu Rao: తండ్రి మాట నిచ్చే తనయుడు తీర్చంగ

అణా బాట పట్టే ఆత్మజుడును

🌸🌹🌺🌻👌🌷

అభినందనలు

బక్కబాబురావు

10/10/20, 1:25 pm - +91 91006 34635: .మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

దృశ్య కవి అమర కుల గారు

అంశము, రామాయణం రసామృత కావ్యం

నిర్వహన, వెంకట్ గారు

శీర్షిక, జీవామృతం

----------------------------     

కలం: విహారి;

పేరు: బందు విజయ కుమారి;

చరవాణి: 9100634635;

Date : 10అక్టోబర్్2020;

ఊరు: హైదరాబాద్;

--------------------------


ఇ నకులాన్వయ ద శరతనయా

అభయహస్తా సత్య ధర్మ నిష్ఠ గరిష్ట 

రామాయణం నిత్య పారాయణం 

అందరికీ ఆచరణ మోధ్యం రామాయణ రసామృతం అనురాగ భావామృతం అనుబంధాల ప్రేమ ఆనందాల సీమ 

మానవ విలువలకు మహి మాన్వితమైన వలువలు కట్టిన రామ చరితం అజరామరం విశ్వామిత్రుడు రామలక్ష్మణుల తోడ్కొని బల అతిబలవిద్యధారణం చేశా డు 

మిదిలాఆ నగర రాజపుత్రి జనక సుత 

సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తి తో 

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కల్యాణశోభ వెల్లివిరిసి

రాజ్యమంతానిత్య శోభాయమానంగా వెలిగేను తండ్రి మాటకు కట్టుబడి  అమ్మకు తన ప్రేమపెట్టుబడి సహోదరులకు ఆచరణ ఆదర్శము

జనవాసులకు రామరాజ్యం రామపాదం పునీతం పూజ్యనీయం

ఒకతే సతి,ఒకటే బాణం,ఒకటే మాట సశ్చీలతకుప్రతిరూపం 


సతీ పతులదాంపత్యానికి అనురాగ ఆదర్శాలప్రేమ వెల్లువల నిలయం

 క్రౌంచ పక్షులశోకమే 

రామాయణ శ్లోకశ్రీకారమై వాల్మీకి చేతవిరచిత మయింది 

ధర్మాధర్మ జీవన్ముక్తి సాద నం

తండ్రి ఆనతికి కట్టుబడి అరణ్యవాస మేగేను

ఋష్య వాటిక ధార్మిక దర్శనం 

పర్ణశాల జీవితం ప్రకృతి శోబావిలాసం

అన్యోన్య మానసిక వుల్లాసం

 దుష్టరావణ సీతాపహరణం శబరి భక్తికి విచలిత మైన శక్తి ఆనం దామోదం

వాలి,సుగ్రీవ పోరాటం వాలిని వధించి సుగ్రీవుడు పట్టం గట్టి న రామశౌర్యం

అపరిమిత భక్తాగ్రేసరుడు హనుమ సహకారంతో 

రావణ సంహారము చేసి అగ్ని ప్రవేశం తో తిరిగి తిరిగిఅయోధ్య ప్రవేశం 

రాజ్య పట్టాభిషేకము వైభవోపేత ము కళ్ళు రెండు చాలని ఇల వైకుంఠం

రాముడు అందించిన ముత్యాల హారం 

హనుమగొని

ఆరామ సాక్షాత్కారం కోసం 

ఒక్కోముత్యాన్నికొరికి చూసినా 

భక్తాగ్ర న్యుడుహనుమ

 తన గుండె చీల్చి రామ దర్శనము గావించినభక్త శ్రేణి

ఆ వైభవం తరాలు యుగాలెన్ని మారిన 

సజీవ ధార అమృత సారం రసరమ్య రామాయణం నిత్య పారాయణం రామాన్ననామంజీవన్ముక్తికి సోపానం

10/10/20, 1:32 pm - venky HYD: ధన్యవాదములు

10/10/20, 1:32 pm - venky HYD: ధన్యవాదములు

10/10/20, 1:33 pm - +91 94409 15974 left

10/10/20, 1:58 pm - +91 99631 30856: *కామవ రం ఇల్లూ రు వెంకటేష్

గారు వందనములు*

*విల్లు నెత్తి పెట్టీ విరిచిన రాముడు*

*మాట మనిషి విలువ మంగళ కరమ్*👏💐👏💐👏💐👏

మీ భావనా పటిమ భావ నా పటిమ అభివ్యక్తం మీ విశ్లేషణ వివరణ వర్ణన విపులంగా వివరించారు మీకు ప్రశంస నీయ అభినందనలు సర్

మీ పద్య రాజ మాలికలు బాగు న్నాయి.🙏🙏

10/10/20, 2:03 pm - +91 99499 21331: మల్లినాథసూరికళాపీఠం ఏడు పాయల

సప్తవర్ణాల సింగిడి

పేరు : తులసీ రామానుజాచార్యులు, ఖమ్మం, 9949921331

తేదీ  : 10.10.2020

అంశం : రామాయణము

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్యకవి, శ్రీ వెంకట్ గారు 


శీర్షిక : రాముని కథ! 


తే. గీ. 

రాముని కథను వాల్మీకి రసమయమగు

కావ్య కన్యకగఁ తలచి భవ్య  సుధలఁ

మధురభక్తితోఁ  రచియించె మాన్యుడగుచు

వసుధ వర్ధిల్లెడు వరకుఁ పరిఢవిల్లు! 


తే. గీ. 

దశరథతనయునిగఁ భువిఁ దయకు నిలయు

డగుచు భవమునొందినయట్టి యనితరమగు

సకల శుభలక్షణుండయి జగమునందు

వెలసె మహనీయ మోహన ప్రియుడు రామ! 


తే. గీ. 

ధర్మ మార్గంబుఁ వీడక, తండ్రి యాజ్ఞ

నుఁ జవదాటక, సత్యమునుఁ వ్రతముగను

పూని, యేకపత్నీ సీతఁ పొదవుకొనుచుఁ, 

వనమునందున వసియించె వరముగాను! 


తే. గీ. 

భండనమునఁ కోదండపు బాణ రుచిని

చూపి పాప పంకిలమునుఁ శుద్ధిఁ జేసి 

కర్కశ స్వభావముఁగల రక్కసుల మనసు

నందు సాధు స్వభావంబు నమరు నటుల!


తే. గీ. 

అన్నదమ్ముల, మిత్రుల ఆత్మ తత్త్వ

బోధ యనురాగ సీమగా పులకరించు, 

పరుల సతిని వాంఛించెడు పాపుల కిలఁ

వంశము వినాశమగునని వగచుటేల

యనుచుఁ రామాయణము చెప్పె యద్భుతముగఁ! 


( ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు  వ్రాసితి.)

10/10/20, 2:37 pm - +91 80197 36254: 🚩మల్లినాథ సూరి కళాపీఠము 

ఏడుపాయల సప్త వర్ణాల 

సింగిడి 🚩

పురాణం : రామాయణ రసామృత కావ్యము

నిర్వహణ విశిష్ట కవి బి వెంకట్ గారు 

పేరు :కె. శైలజా శ్రీనివాస్ 

************************

ఆదర్శ  పురుషుడై  లోకానికి  అగుపిస్తూ 

ఆర్త జన   రక్షకుడు గా  పేరుపొందెను 

దశరధ తనయుడు శ్రీరఘు రాముడు 


శ్రీరామచంద్ర మూర్తిగా శోభిస్తూనే 

సీతాపతిగా జనహితు డయ్యెను 

శ్రీరామ స్మరణం నిజభక్తి కి సోపానం 


అచంచల భక్తి సామ్రాజ్యంలో 

ఉడుతను సైతం చేర్చినావు 

భక్త సులభుడు శ్రీరామచంద్ర మూర్తి 


పదునాలుగు సంవత్సరములు కానల కేగి 

పితృ వాక్య పరిపాలన చేసినావు 

మహిమాన్వితుడవు శ్రీరఘు రామ 


అమ్మ సీతమ్మ మనోభిష్టుడవై 

పాతివ్రత్య మహిమ అమ్మతో చూపించి నావు 

ఏక పత్నీ వ్రత ధర్మం శ్రీరామ సూక్తి 


లోక రక్షకుడిగా కీర్తి గడిస్తూ 

ఆసేతు హిమాచలం ఆచంద్ర తారార్కoవెలిగావు 

మానవ రూపం దాల్చిన శ్రీ మహావిషు అవతారం 


 ఒకటే బాణం ఒకటే భార్య 

శ్రీరామ నామం చిరస్మరణీయం 

సకలపాప నివారణం, శ్రీరామ చరితం       


శైలజా శ్రీనివాస్ ✍️

10/10/20, 2:43 pm - +91 94407 86224: మల్లినాథ సూరి కళాపీఠం YP 

       సప్తవర్ణాల సింగిడి 

అంశం : పురాణం 

శీర్షిక :రామాయణ రసామృత కావ్యం 

పేరు : శిరశినహాళ్ శ్రీనివాస మూర్తి 

           మోర్తాడ్ నిజామాబాదు 

           9440786224

నిర్వహణ : బి వెంకట కవి 


సీతారాముల చరితం 

నిత్యనూతన సమ్మోహితం 

నిత్య శ్రావణమైన కొత్త వైభవం 

మది పులకరించే తన్మయత్వం 

దశరథనందనుడిగా హరి ఆవిర్భావం 

లక్ష్మణభరతశత్రజ్ఞులుగా శేష శంఖచక్రాలు 

మహోన్నత అవతారం 

రాక్షససంహారమే కారణభూతం 

హారవతారాల్లో మానవజన్మగా రాముని జననం 

మానవ కష్టాలే అనుభవించిన వైనం

వశిష్ఠగురుకులానా అస్త్రశస్త్ర అక్షరజ్ఞానం 

విశ్వామిత్రుని వెంట పయనమై రాక్షస సంహారం 

పరమపూజ్య పాదంసోకి అహల్యశాపవిమోచనం 

జనకునికొలువున శివధనుర్బంగం 

పరుశరామ గర్వభంగం 

భుజాత సీతమ్మతో పరిణయం 

నలుగురు సోదరీమణుల అయోధ్య ప్రవేశం 

నింగినంటిన పరిణయోత్సవసంబురం 

రామపట్టాభిషేకానికి కుదిరే మూహూర్తం 

మందర కుతంత్రంతొ వనవాసప్రవేశం 

లక్ష్మణ సహిత సీతారామచంద్రుల పద్నాలుగేళ్ల అరణ్యవాసం

పుత్రవియోగంతో దశరథశకం సమాప్తం 

సర్వసమక్షంలో భరతునిచె పాదుకపట్టాభిషేకం 

రాక్షససంహారం చేస్తూనే వనవాసం 

శూర్పణఖ ప్రవేశంతో అసలు గట్టమారంభం 

సీతమ్మకు స్వర్ణజింక వ్యామోహం 

మారీచునివదతో జానకి అపహరణం 

అడ్డుకున్న జటాయువుకు రెక్కలవైపల్యం 

అశోకవనానికి సీతను చేర్చిన రావణనైజం 

సీతాన్వేషణలో సుగ్రీవ హనుమ పరిచయం 

వాలివదతో సుగ్రీవ పట్టాభిషేకం 

కడలిని లంఘించి లంకను దహించి 

జానకమ్మ సమాచారం రామునికి చేరవేసిన అంజనీపుత్రుని సాహసం  

నలనీలులతో కడలిపై లంకకు వారధి నిర్మాణం 

ఫలించని అంగధరాయబారం 

ప్రారంభమైన రామరావణ సంగ్రామం 

రామబాణంతో రావణ శాపవిమోచనం 

లంకకు విభీషణుడి పట్టాభిషేకం 

సీతామాత అగ్నిప్రవేశం 

పుష్పకవిమానంలో అయోధ్య పయనం 

వైభవంగా రామపట్టాభిషేకం

అనాచితా వాక్కులతో సీతాపరిత్యాగం 

వాల్మీకి ఆశ్రమంలో లవకుశజననం 

అశ్వమేధయాగంతో లవకుశ రామ సంగ్రామం 

భూమాత ఒడిలోకి చేరిని సీతమ్మ వైనం 

అవతార సమాప్తితో రాముని హరివాసం 

ఆద్యంతం మనోహరదృశ్యకావ్యం రామాయణం


హామీ : నా స్వంత రచన

10/10/20, 3:01 pm - +91 95422 99500: సప్త వర్ణాల సింగిడి 

మల్లి నాథసూరి కళాపీఠం 

పేరు వి సంధ్యా రాణి 

ఊరు భైంసా 

జిల్లా నిర్మల్ 

అంశము. పురాణం 

రామాయణం రసామృత కావ్యం 

నిర్వహణ. బి.వెంకట్ గారు 

            పాట 

🌸🌸🌸🌸🌸🌸

           పల్లవి

🌸🌸🌸🌸🌸🌸

రామ నామమే ఎంతో మధురము 

అది జగతిలోన వెలిగిన నిండు కావ్యము 

రోజు కొక్కసారైన రామ రామ అనిన 

జీవితమే ధన్యమయి పరమార్థం పొందును . 

        చరణం. 

🌸🌸🌸🌸🌸  

తండ్రి మాట జవదాటని రాముడతడు 

ఏకపత్నియైగా నిలిచె నతడు 

రాజ్యమేలు రామరాజు అయ్యె నితడు 

లవకుశుని తండ్రిగా నిలిచె నితడు 

రామ నామ అంటేనే పాపాలు బాపి

పరంధాముడు అయ్యాడు జగతిలోన ఇతడు. 

      చరణం. 

🌸🌸🌸🌸🌸

శ్రీరామ నామమింటే కష్టాలు బోయి 

మదిలోన నిలిచిన రాముడితఢు 

సర్వకార్యాలందు తానయ్యి నిలిచాడు 

జగదేకవీరుడు జయ జయ రాముడు  (అందుకే)

(రామ రామ అనరా సోదరా పాపాలు బోవు సోదరా 

మనసార అనరా సోదరా 

మదిలోన నిలపరా రామనామం (2)

10/10/20, 3:01 pm - +91 95422 99500: <Media omitted>

10/10/20, 3:01 pm - +91 73493 92037: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల

దృశ్య కవి అమరకుల చక్రవర్తి

నిర్వాహణ : వెంకట్ కవిగారు

అంశం : రామాయణ రసామృత కావ్యం

       రామ రసభరితం

     -------------------------

శత శ్లోకి వాల్మీకి రామాయణం

బాల అయోధ్య సుందర ఉత్తరకాండ

అంతరార్ధమే మొల్ల రామాయణ రహస్యా నిధి

కళ్యాణరామ ఆదర్శం యువతరానికి

అచ్చతెలుగు భాషా రమణీయం

రామచరితమానస సుందరకాండ పూజనీయము

శ్రీరామ పట్టాభిషేకం ఒక యోగ వాశిష్ఠసారం

హిందూధర్మ చరిత్ర సంస్కృతి ఆచార అనితరం

దివసంప్రతి కీర్ణానాం ఆహార అర్ధ పతత్రిణం

తండ్రి -కొడుకు భార్య-భర్త అన్న-దమ్ముల యజమాని-సేవక

భక్త-భగవంత రాజు-ప్రజల సంబంధ బాంధవ్యమది

ప్రామాణికం అంగర్గతత్వ భావాల పురాణము

రామరామేతి మధురం మధురాక్షరం

సీతారామ చరితం ఆంజనేయభరితం

సకల పాపహరం మోక్షప్రదని రమంతే సర్వజనాః

ధర్మ అర్ధ కామమోక్ష పురుషార్ధగమ్య మోక్షం

ఏకపత్నివ్రత పురుష నీతి సూక్తిదాయకం

ఇక్షాకు రామశక్తి సంకల్ప ఇంద్రియ జయధామ

తింటే పటికిబెల్లం తిన్న రుచి రామాయణం

రావణ సంహార్ధమే మానవజన్మ  రామావతారం

దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం లేని

రావణకు నరవానరులచేత మరణం తధ్యం

బల అతిబలచే తాటకి వధ, అహల్య శాపవిమోచనం

సీతారాముడు లక్ష్మితో విష్ణువై ప్రకాశించెను

ప్రయాతు సీతారామ గుణమ్రాడ గుణాచ్ఛాపి పీతి ర్ధూ యోభ్య వర్ణత!

10/10/20, 3:07 pm - Telugu Kavivara added +91 80197 83424, +91 81066 97713 and +91 99510 77486

10/10/20, 3:19 pm - +91 97046 99726: సప్తవర్ణాల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల YP

అమరకుల దృశ్యకవి

ప్రక్రియ వచన కవిత

అంశం రామాయణం రసామృత కావ్యం సంపూర్ణ రామాయణం  పురాణం 

నిర్వహణ శ్రీ బి.వెంకట్ గారు

శీర్షిక  మనిషిని సంస్కరించగల కావ్యం రామాయణం

పేరు లలితారెడ్డి 

శ్రీకాకుళం

తేది 10.10.2020

ఫోన్ నెంబర్ 9704699726 

కవిత సంఖ్య 57


మానవుల గుండెల్లో ఎప్పటికి చెరగని కథ రామాయణం

అమ్మానాన్నల అనురాగాన్ని చూపించే ఆదికావ్యమిది

పుత్రవాత్సల్యానికి ప్రతీకగా నిలిచే పారాయణ గ్రంథమిది

అరమరికలు లేని అన్నదమ్ముల అనుబంధానికి ఆదర్శమైనది

ఆలుమగల ప్రేమానుబంధముతో అజరామరమైన కావ్యమిది

గురుభక్తికి తార్కాణం

శిష్యానురక్తిని అందించిన కావ్యం

మంచి స్నేహితులు కలిగి ఉండాలని చెప్పిన మిత్రకావ్యం

ధర్మ బలానికి ఆదికావ్యం 

వినయ విధేయతలను పంచే విషయ పరిజ్ఞాన వేదిక

జీవకారుణ్య భావాన్ని నేర్పించిన రామాయణం

రామాయణములో ప్రతి చిన్నపాత్ర ఓ పెద్ద సందేశాన్ని అందిస్తుంది

ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మహోన్నతుడు కాగలడని నిరూపించిన గ్రంథం రామాయణం

మానవ రూపములో రాముడు ఆచరించి చూపించిన ఆచరణ గ్రంథం రామాయణం

జీవిత పార్శ్వాలను ఎన్నింటినో పట్టి చూపించు జీవనాడి రామాయణం

రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో నభవిష్యతి

10/10/20, 3:43 pm - +91 83740 84741: మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము -రామాయణం రసామృత

కావ్యం

నిర్వహణ -శ్రీ బి.వెంకట్ కవిగారు

రచన -చయనం అరుణా శర్మ

శీర్షిక -జీవన పారాయణం


రామాయణం రమణీయ కావ్యం

ఆదికవి వాల్మీకి విరచితం

జగదానందకారకం జగదభిరాముని

దివ్య చరితం


కౌసల్యాసతి ప్రియసుతుడై

పుత్రకామేష్ఠి యాగ ఫలముగా

దశరధ నందనుడై

శ్రీ రాముని జననం

లక్ష్మణ భరత శత్రుఘ్నులు

సొదరులై జనియించె

నీలమేఘ మోహనం 

ఆ దివ్యరూపం

విద్యలభ్యసించె

విలువిద్యా ప్రావీణ్యత పొందె

తాటకిని వధియించి

తపసి యాగముగాచె

రాతిని నాతిగ జేసి అహల్యకు

శాప విమోచన చేసె

శివునివిల్లును విరిచి సీతను

 పెండ్లియాడె

సీతారాముల కళ్యాణం కడు

రమణీయం

తండ్రి మాటను తలదాల్చి సీతా

లక్ష్మణ సమేతుడై వనవాసమేగె

సీతారాముల అన్యోన్యం అందరికీ ఆదర్శం

భరతుని సోదర ప్రేమకు నిదర్శనం పాదుకా పట్టాభిషేకం

దుష్టరాక్షస పన్నాగం బంగరు జింక

ప్రహసనం

దశకంఠుని మాయా మోహవిలాసం

సీతాపహరణం

సతీవియోగం సర్వసాధారణ మానవునిలా దుఃఖితవదనం

పరసతిపై వ్యామోహం రావణ 

పతనానికి ఆరంభం

హనుమ ఎదలో భక్తితత్వం

రమ్యమైన రామనామం

వాలిని నిర్జించెను సుగ్రీవుని

మైత్రీ బంధం కోసం

జటాయువు మరణం పక్షీంద్రుని

భక్తి పరాయణత్వం

లంకాదహనం బహు సుందరఘట్టం

హనుమంతుని లీలా వైభవం

శబరి ఎంగిలి తిన్నట్టి అభయప్రదం

సేతుబంధనం అపూర్వం

ఉడుత భక్తికి మెచ్చిన ఔదార్యం

దుష్ట రావణ సంహారం

ధర్మాన్ని నిలిపిన రామావతారం

తరతరాలకు యుగయుగాలకు

తరగని నిధియై

జీవనవికాస పెన్నిధియై

ధర్మనిరతికి దార్శనికతయై

హైందవ సంస్కృతికి ప్రతీకయై

నిలిచిన రామాయణ కావ్యం

సదా అనుసరణీయం

పలు ప్రక్రియలలో

పద్య గద్య కావ్య గేయ పరిమళమై

అలరించి జగజ్జగేయమానంగా

హిందూ తత్వాన్ని ప్రజ్వలింపజేసిన

మహోద్గ్రంధం రామాయణం

మన నిత్య పారాయణం

10/10/20, 3:47 pm - +91 81062 04412: *సప్తవర్ణముల సింగిడి*

*మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల*

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశము: *రామాయణం రసామృతకావ్యమ్*

*నిర్వహణ:  శ్రీ బి. వెంకట్ కవి గారు*

*తేదీ 10/10/2020 శనివారం*

*శీర్షిక: దివ్య చరితం*

 *ప్రక్రియ: వచనం*

*****************************

ఆజానుబాహుడై అభయహస్తమిచ్చి

అనురాగ భావామృతం కురిపించి

అనుబంధాలకు పెద్దపీట వేసాడు...

శ్రీరాముడై....


ఆదర్శ పురుషుడై అవనిని పాలించి         పరమపావనమూర్తిగా తండ్రి మాట మన్నించి

రాజ్యాన్ని త్యాగం చేసి కానలకేగాడు 

దశరథ రాముడై... 


ఆదర్శ దంపతులై జగతికి వెలుగు నింపి అభయహస్తమిచ్చి సత్యధర్మాలను నిలబెట్టి మానవీయ విలువలకు పెద్దపీట వేశాడు రఘురాముడై... 


శబరి భక్తికి మెచ్చి కైవల్యం ప్రసాదించి...

మాన్యుడై పాదధూళితో రాయినాడది చేసి...  

జగతిన చిరస్థాయిగా వెలుగొందాడు జగదభిరాముడై...


ఏకపత్నీవ్రతుడై సీతమ్మని రక్షించి...

లంకాధీశుడి గర్వభంగం చేసేసి...

ధర్మాన్ని నాలుగుపాదాల నిలబెట్టాడు కోదండరాముడై..


మానవత్వానికి మారుపేరుగా...

త్యాగధనానికి నిలువెత్తురూపంగా...

ఇలలో వెలసినాడు దేవదేవుడిగా... శ్రీరామచంద్రమూర్తియై..


****************************                                                  

*కాళంరాజు.వేణుగోపాల్*

*మార్కాపురం. ప్రకాశం 8106204412*

10/10/20, 3:51 pm - S Laxmi Rajaiah: పల్లవి: రామాయణము మానవాదర్శ 

కావ్యము 

వాల్మీకి విరచితము కల్మషాప హర 

ణము.       (రా) 


జానకీరాముడు అవతారపురుషునిగా 

దుష్టశిక్షణార్థమై ధర్మపరిరక్షణకై 

ధరణిపైకి దిగివచ్చిన ధర్మావతారుడు 

దనుజులదునుమాడిన లోకైక వీరుడు 


తాటకసుబాహులను గూల్చి నట్టి 

యోధుడు 

విశ్వామిత్రుని యజ్ఞము గాచు పరా 

క్రముడు 

అహల్యశాపవిముక్తికి అడుగిడిన 

దయాళువు 

శివధనుస్సు ఛేదించి సీతను చేప 

ట్టినాడు     (రా) 


తండ్రియాజ్ఞ తలదాల్చిన తనయుడు 

శ్రీరాముడు  

అరణ్యజీవితానికి అడుగు వేసినాడు 

పడతి సీత సౌమిత్రితొ పయనమైన 

వాడు 

కబంధాది రాక్షసులను కడతేర్చినవాడు 


అత్రీఅనసూయలను ఆదరించిన 

వాడు 

మునుల బ్రోచి అసురులను కూల్చి 

వేసినాడు 

ఖరదూషణ రాక్షసులను కాలరాసి 

నాడు 

శూర్పణఖా ప్రేమనూ త్రోసిపుచ్చినాడు 


సీతాపహరణముతో సుగ్రీవుని చేరి 

నాడు 

వాలిని వధియించి సుగ్రీవుని బ్రోచి 

నాడు 

సీతాన్వేషణకై హనుమలంక కేగినాడు 

లంకకాల్చి సీతజాడ తెల్పినాడు  

మారుతి       (రా )


వానరసైన్యముతో వారధి నిర్మించినాడు 

లంకజేరి దాశరథీకూల్చె రావణాసురుని 

లంకకు రాజయ్యాడు సోదర విభీష 

ణుడు 

అయోధ్యకు వెడలినాడు సీతా సౌమి 

త్రితో.       (రా) 


తండ్రీకొడుకులునూ భార్యాభర్తలను 

జులును 

యజమాని సేవకులును రాజూ మరి 

ప్రజలును 

భగవంతుడు భక్తుడును మిత్ర సంప 

ర్కములును 

ప్రవర్తించు తీరు దెల్పు పావన రామా 

యణమది.      (రా) 


          శ్రీరామోజు లక్ష్మీరాజయ్య 

          సిర్పూర్ కాగజ్ నగర్.

10/10/20, 3:52 pm - venky HYD: ధన్యవాదములు

10/10/20, 4:05 pm - +91 92909 46292: మల్లినాథ సూరి కళాపీఠంYP

నిర్వహణ:వెంకట్ కవి గారు

అంశము:రామాయణం

శీర్షిక:అదర్శపురుషుని కథ

రచన:బోర భారతీదేవి విశాఖపట్నం

9290946292



వాల్మీకి మహర్షి చేతిలో మలుపు తిరిగే కథ

అయోధ్య పురిలో దశరథుని ఇంట జనియించి సూర్యవంశ కీర్తి చాటి చెప్పే కథ

చిన్నతనంలోనే

అసమాన ప్రతిభతో  గురువు యజ్ఞానికి తోడు నిలిచే కథ

తండ్రి అడుజాడల్లో నడిపించే తనయుని కథ

ఇహపర సుఖములను ఒసగే  కథ

అన్నదమ్ముల ఆప్యాయతలకు అర్థం పట్టే కథ

భార్యా భర్తల అనురాగానికి ప్రతీకగా నిలిచే కథ

లోకాభిరాముడు సర్వ లోకైక పూజ్యుడైన  శీరామచంద్రుని కథ. 

శివధనస్సు విరిచి సీత మనసును గెలిచి

యుగయుగములకు ఆదర్శనీయమైన కథ

లోకైక మాత   సహనశీలి, సద్గుణ సంపన్నురాలు భర్త అడుగు జాడల్లో నడిచే అవనిజ సీతమ్మ కథ. 

మందర మాటలు

చెవికెక్కించుకొని కోపంతో రగిలిపోయిన కైక కథ

పర స్త్రీ వ్యామోహం పతనానికి నాంది పలికిన కథ. 

కుప్పిగంతుల కోతిలో హనుమరూపం చూపి అనంత శక్తి దాగి ఉందనీ తెలిపే కథ

ఇంటి గుట్టు లంకకు చేటని చాటి చెప్పే కథ

ప్రజల మాట పట్టం కట్టే శ్రీరామ చంద్రుని కథ

ఒకటే బాణం ఒకటే మాటని సందేశం అందించే రఘురామునికథ.

10/10/20, 4:07 pm - +91 80745 36383: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు..  

10.10.2020 

అంశం.. రామాయణం రసామృత కావ్యం రసభరితం  

పేరు.. నల్లెల్ల మాలిక

ఊరు... వరంగల్ అర్బన్

ప్రక్రియ ...తాత్వికత

శీర్షిక...ఆదికావ్యం రామాయణం


మానవ జీవన మూల్యాలకు మణి దర్పణం రామాయణం..చరాచ జగత్తున్నంత మేర రామాయణం భాసిల్లును శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న రామాయణాన్ని

సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించాడు

మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ ప్రపంచ  సాహిత్యంలోనే రామాయణం ఆదికావ్యంగా ప్రశస్తి గాంచినది!


అమ్మానాన్నల అనురాగం 

పుత్రుల అభిమానం  అన్నదమ్ముల ..

అనుబంధం భార్యాభర్తల సంబంధం

గురు భక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం 

ధర్మ బలం వినయంతో ఒదగడం 

వివేకంతో ఎదగడం జీవ కారుణ్య 

భావన ప్రకృతి లాలన వంటి

జీవిత పార్శ్వాలను ఎన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం !


రామాయణం  ఆచరణ గ్రంధము 

సీతారాముల వంటి ఆదర్శ నాయికా నాయకుల చరిత్ర ....

రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః ....

అనే గొప్ప మాటలను మారీచుని  నోటినుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం  మంచి మనిషిగా ఎలా 

ఎదగ గలుగుతాడో నేర్పేది చిన్న చిన్న పాత్రల ద్వారా అనల్ప సందేశాన్నిస్తుంది!

 

రామాయణం ! పౌలస్త్య వధ !

సీతయాశ్చరితం మహత్! మూడు నామాలతో పిలువబడే రామ 

రస భరితమైన రసామృత కావ్యమే రామాయణం  ప్రపంచంలో విద్యార్థి లోకానికి  క్రమశిక్షణను నేర్పేది ఒక రామాయణమే...!


హామీ పత్రం.. ఇది నా స్వీయ రచన

10/10/20, 4:14 pm - +91 94934 35649: మల్లినాధ సూరి కళా పీఠం yp 

సప్త వర్ణాల సింగిడి 

అంశం. పురాణం 


శీర్షిక... రస రమ్యo 


పేరు. సి.హెచ్. వెంకట లక్ష్మి 

విజయనగరం 


నిర్వహణ. బి.వెంకట కవిగారు. 




వినుడు వినుడు రామాయణము 

వీనుల విందుగను...

పుత్రకామెష్ష్టిలో పరమాన్న ప్రాప్తికి   

     జన్మించిన కౌశల్యా సుతుడు 

 ఘన కాంతులు చిందించు  

నీల మేఘ శ్యాముడు 

సాకేత రాముడు లోకాభిరాముడు 


సురుల రక్షించ నసురుల శిక్షిoచ 

       జనియించిన పరబ్రహ్మ రూపం 

     శ్రీరాముడు శ్రీ రఘువీరుడు 


సీతమ్మ పాలిట చింతామణి 

శ్రీ మోహన రూపం అపురూపం 

విందుల మరిగిన వేడుకల రూపం 

సొగసైన సాకేతపుర దాముడు 

కరుణానిధి అయిన భక్త ప్రేముడు 


పురుషులకు పురుషుడు 

రఘుకుల పురుషోత్తముడు 

ఆజానుబాహుడు అరవిందనేత్రుడు

ధర్మం తప్పని ఘన పారిజాతము 

రామ చంద్రుడు రఘుకుల తిలకుడు


శ్రీ రామచరిత గానము నిత్య 

ఆరోగ్య దాయకం, ఆద్యoతము 

ఆనంద దాయకం సుందర కావ్యం 

ముక్తి ప్రధాయకము...

10/10/20, 4:26 pm - +91 93014 21243: మల్లినాధ సూరి కళా పీఠం

ఏడుపాయల

అంశం - పురాణం

నిర్వాహకులు - వెంకట కవి

రచన - తెలికిచర్ల విజయలక్ష్మి

తేదీ - 10.10.2020


ప్రతీ తల్లి తండ్రులు రాముడు లాంటి కొడుకు కావాలని


ప్రతీ భార్యా తన భర్త రామచంద్రుడు లా వుండాలని


అన్న అంటే రాముడి లా వుండాలని ప్రతీ ఒక్కరూ కోరుకునే 


రఘుకుల వంశీయుడయిన దశరథ నందనుని నామ మంత్రాన్ని ఏమని పొగిడెదను


నా జన్మ కు సాఫల్యత ను ఇచ్చే మంత్రం రామ రామేతి మంత్రం.


నీవు నేను అను భేదము లేని మంత్రం రామ రామేతి మంత్రం 


జనన మరణాల దుఃఖాలను దూరం చేసే మంత్రం రామ రామేతి మంత్రం


నా లోని రాగ ద్వేషాలను దూరం చేసే మంత్రం రామ రా మేతి మంత్రం


ప్రణవమను ఓంకార నాద బ్రహ్మ మంత్రమే రామ రామేతి మంత్రం


మనసును స్థిరముగా నిలుప గలిగెడి మంత్రమే రామ రామేతి మంత్రం


రామ తత్వము ఎరుగు వారికి ముక్తి తత్వము ప్రసాదించే మంత్రం రామ రామేతి మంత్రం


బ్రహ్మా విష్ణు మహేశ్వరుల కు ప్రియ మయినది రామ రామేతి మంత్రం


సర్వ మతముల లో ని తత్వ సారమే రామ రామేతి మంత్రం


సృష్టి స్థితి లయ కారణంబగు సూక్ష్మ రూపమే రామ రామేతి మంత్రం


శ్రీ రామ చంద్రుని మనసా వాచా కర్మణా  స్మరిస్తున్నాను


శ్రీ రామ చంద్రుని కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను


శ్రీ రామ చంద్రుని సకల చరాచర ప్రాణ కోటిని రక్షించమని  శరణు వేడు కొంటున్నాను.

10/10/20, 4:33 pm - +91 94929 88836: మల్లినాథ సూరి కళాపీఠంYP

నిర్వహణ:వెంకట్ కవి గారు

అంశము:రామాయణం

శీర్షిక: రామాయణం జీవన పారాయణం

రచన: జి.ఎల్.ఎన్.శాస్త్రి

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

దశరధుని  ప్రేమను చూపు రామాయణం 

కౌసల్య ప్రేమను పంచు రామాయణం 

విశ్వామిత్రుని గౌరవం పెంచు రామాయణం

మంధర మాయమాటలు విన్పించు రామాయణం

కైకైయి కుత్సికము తెలుపు రామాయణం

రామయ్య శక్తి  చూపు రామాయణం

సీతమ్మ.భర్త ప్రేమను గుర్తించు రామాయణం

లక్ష్మణుని భాతృ ప్రేమను పంచు రామాయణం

మారీచుని మత్సరం  తెలుపు రామాయణం

శూర్పణఖ చుప్పనాతితనము చూపించు రామాయణం

సుగ్రీవు స్నేహ మాధుర్యం నింపు రామాయణం

ఆంజనేయుడి ఆభయమ్ము వివరించురామాయణం

వానర శక్తి నిరూపించు రామాయణం,

ఉడుత భక్తి చూపించు రామాయణం

సముధ్రుడి అల్పబుద్ధి చూపించు రామాయణం

లంఖిణి గర్వమణుచు రామాయణం

లంక వైభవము చూపు రామాయణం

విభీషణుని వివేకము తెలుపు రామాయణం

కుంభకర్ణుడి కాఠిన్యము చూపు రామాయణం

రావణుని  దుర్మార్గము అణచు రామాయణం

సన్మామార్గమునకు మార్గము రామాయణం.

చదివిన వారికి పుణ్య మొసగు రామాయణం

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

10/10/20, 4:34 pm - +91 99482 11038: మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి🌈

అమరకుల దృశ్యకవి సారద్యంలో

నిర్వహణ  శ్రీ వెంకట్ కవి గారు

అంశం  పురాణం రామాయణము

పేరు  పబ్బ జ్యోతిలక్ష్మి

ఊరు  జిల్లా  కరీంనగర్

తేది 10/10/2020


అవనిపై అద్భుతంగా వెలసిన

వాల్మీకి విరచిత రామాయణము

మానవునికి జీవన విలువలు తెలుపునది

మాధవుడే మానవుడై సాగినదీ పయనం


తల్లోదండ్రులు చూపించే వాత్సల్యం

అన్నదమ్ములు మధ్య అనుబంధం

పెద్దలపై గౌరవం పిన్నలపై మమకారం

ఆలుమగల అమోగ అనురాగం


తండ్రిమాటకై అడవులకేగిన రామయ్య

సతీ ధర్మాన్ని పాటించిన సీతమ్మ

ధర్మ ప్రతీకలు ధర్మ నిర్దేశిత మార్గదర్శకులు

జగదభి రాముడు ధశరధ రాముడు


కళ్యాణ రాముని కావ్యమే దివ్యచరితం

రామ నామమే ముక్తికి మార్గం

రామ బాణమే అధర్మ నాశనం

లోక కళ్యాణార్ధమే రామజననం


హామి పత్రం

ఈ రచన నా సొంత రచన

🙏🙏🙏

10/10/20, 4:35 pm - +91 70130 06795: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల అమరకుల వారి ఆధ్వర్యంలో

అంశం: రామాయణం రసామృత కావ్యం

నిర్వహణ : బి. వెంకట విశిష్ట కవివర్యులు

రచన:: వసంతలక్ష్మణ్

నిజామాబాద్


~~~~~~~~~~~

అంశం: రామాయణం మానవాళికి ఆదర్శం

~~~~~~~~~~~~~~~


సకల వేదాలసారాన్ని  ఉపనిషత్తుల రహస్యాల్ని రామకథ ద్వారా విశ్వానికి చాటాడు వాల్మీకి మహర్షి

రామాయణమంటేనే రామకథ...........

రాముడంటే

తండ్రి మాట జవదాటని వాడు

ఏకపత్నీ వ్రతుడు 

సకల గుణాబి రాముడు 

జనుల మాటను వేదముగా భావించిన వాడు 

జనులందరికీ ఆదర్షమై నిలిచినవాడు

అరణ్యాన్ని అయోధ్య ను సమానంగా భావించిన వాడు

ఒకే మాట 

ఒకే బాట

ఒకే బాణం అని

ధర్మ వర్తనం తో జీవించిన విజేత 

రామ కథ అంటే రామాయణం 

రామాయణం విలువల మార్గం రామాయణం  ఆదికావ్యం

జీవితాన్ని వడగట్టి సారాన్ని అందించిన జీవన కావ్యం


ఎన్ని కష్టాలు అనుభవించినా ఓటమి అంగీకరించకుండా 

దైర్యం కోల్పోకుండా 

ఒక నరుడు నారాయణుడు గా ఎలా మారవచ్చో చేప్పే కథ


రామాయణం

ఒక స్పూర్తి మంత్రం

ఒక పరిపూర్ణ వ్యక్తిత్వ సూత్రం

విలువల వాచకం

చిమ్మ చీకట్లో దీపం 

దిక్కుతోచని ప్రయాణంలో దిక్సూచి

కుటుంబపు విలువలను అనుబంధాలను అద్వితీయంగా 

విరచించిన జీవన వికాస గ్రంధ రాజం రామాయణం......



రఘువంశ పురుషోత్తముడయిన 

రాముడు

ఒక గురువులా 

ఒక కొడుకులా

ఒక భర్తలా

ఒక అన్నలా

ఒక స్నేహితుడిలా

ఒక శిష్యుడి లా

ఒకరాజులా

ఒక ధర్మవర్తనుడి  లా ఎపుడు మానవాళికి ఆదర్శం....!

10/10/20, 4:38 pm - +91 98668 99622: This message was deleted

10/10/20, 4:40 pm - +91 98499 52158: మల్లినాథ కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి yp

అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యంలో.

అంశం:పురాణం..రామాయణం రసామృత కావ్యం.

నిర్వహణ:బి.వెంకట్ గారు

శీర్షిక:ఆది కావ్యం.

రచన:యాంసాని.లక్ష్మీరాజేందర్

తేదీ:10/10/2020.


అత్యంత ప్రశస్తమైనది 

వాల్మీకి విరచితం

శ్రీసీతారాముల రమణీయ,

ఆదర్శ,పవిత్ర గాధ.

రాముని వంటి పుత్రుడు

లక్ష్మణుని వంటి తమ్ముడు

సీత వంటి భార్య

ప్రతి పాత్రలో ధర్మం ఉంది

పాదుకలే రాజ్యమేలిన రాజ్యం

సఖల సౌఖ్యలను వదులుకొని

అరణ్యవాసం ఆనందం గా అనుభవించిన అజానుబాహుడు.

మానవునిగా కౌసల్య దశరథుల ప్రియతనయుడు.

సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే.

లంకాధిపతి రావణుడు గొప్ప శివభక్తుడు

అనేక విధాలుగా ఘోర తపస్సు చేసి మరణమనేది  యక్ష,కిన్నెర,కంపురుష, దేవ,దానవుల వలన సంభవించకుండా వరం పొంది

అతని ఆగడాలకు హద్దులలేకుండా లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు.

శివ అంశ గా హనుమంతుడు

విష్ణు అంశ గా శ్రీ రాముడు భువి పై జన్మించి 

రావణవధ  గావించి లోకారక్షణ చేస్తారు.

స్త్రీ వ్యామోహం చే ఎంత గొప్ప బలశాలి ఐనా పతనం తప్పదనే సత్యాన్ని చెబుతుంది.

వాల్మీకి అతిఅద్బుతమైన రసామృతం రామాయణం

ప్రతి మనిషికి జీవన పారాయణం ఇదే సఖల

జీవులకు సుగుణ తరుణోపాయం.

శ్రీ రామ నామ స్మరణం

ఇహసుఖ పరమోక్ష పవిత్ర గ్రంధం.

భారతీయుల ఆరాధ్య దైవంగా

ప్రతి ఏడాది శ్రీ రామ నవమి

వైభవంగా జరుపుతారు.

ఆరు కాండలతో ఇరవైనాలుగు వేల శ్లోకాలతో  కవి వాల్మీకి గారి

ఆదికావ్యంగా విరాజిల్లుతుంది.

10/10/20, 4:49 pm - +91 73308 85931: మల్లినాథసూరి కళాపీఠం YP ఏడుపాయల సప్తవర్ణముల సింగిడి

తేదీ: 10 :10 :2020 శనివారం

నిర్వహణ: బి వెంకట్ కవి గారు 

అంశం: రామాయణం రసామృతకావ్యమ్

ప్రక్రియ: వచనం

రచన: పిడపర్తి అనితాగిరి

శీర్షిక: లోకాభిరాముడు

*******************

ఇక్ష్వాకుల వంశజుండు 

లోకాభిరాముడు దశరథుని 

పుత్రుడు ముల్లోకాలకాదర్శ

ప్రాయుడు.విశ్వామిత్ర మహర్షి దశరథుడిని అడిగి యాగ రక్షణార్థం రామలక్ష్మణులను తీసుకొనిపోయె, వారు రాక్షస సంహారం చేయగా విశ్వామిత్రులవారు లోకకల్యాణార్థం 

యాగమును పూర్తిచేసిరి,

జనకమహారాజు పుత్రిక స్వయంవరంను  ప్రకటించారని తెలిసిన విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులను వెంట పెట్టుకొని మిథిలా నగరం చేరిరి

శివధనస్సు పెళ్ళున విరిచి రాముడు సీతను ఓరకంట చూసి

అందాల ఆ జానకిని పరిణయమాడినాడు.

కైక కోరిన కోరిక లోకకల్యాణార్థం అని రాముడు భావించి ఆమె 

మాటకై అయోధ్య కిరీటాన్ని వదులుకున్న భూలోక  దేవుడు ఆరాముడు నారచీరలు ధరించి సీతా రాములు లక్ష్మణుడు తోడురాగా 14 ఏండ్ల వనవాసమునకు  తరలివెళ్లిరి తండ్రి మాటకు  కట్టుబడి. 

బంగారు వర్ణంలోనున్న

మాయ లేడిని చూసి మయిమరిచి సీత కోరె రాముడిని లేడిని తెమ్మని, మాయవి రావణుడు సీతను మోసపుచ్చి ఆకాశమార్గానా సముద్రం దాటి లంకా నగరిలో అశోకవనమున నుంచె. అంజనీ 

పుత్రుడు అతిబలవంతుడు

హనుమంతుడు 

సీత జాడ రాముడికి తెలియపరిచె విశ్వకర్మ పుత్రుడు నలుడు వారధి

నిర్మించెను.వానరుల సహాయంతో లంకకు చేరి యుద్ధం ప్రకటించే, రామ రావణ యుద్ధం భీకరంగా జరిగినది రాముడు తన బాణముతో రావణుడుని హతమార్చాడు.సీత అగ్ని ప్రవేశం చేసి రాముడి వెంటవెడలె. అయోధ్య వాసులు వారు సీతారాములకు జేజేలు పలికినారు. రంగ రంగ వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగినది.


పిడపర్తి అనితాగిరి 

సిద్దిపేట

10/10/20, 4:50 pm - +91 97017 52618: మల్లినాధసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

శ్రీ అమరకులదృశ్యకవి ఆధ్వర్యంలో

అంశము - రామాయణం రసామృత

కావ్యం

నిర్వహణ -శ్రీ బి.వెంకట్ కవిగారు

**************************************

*రచన     -మంచికట్ల శ్రీనివాస్* 

శీర్షిక    - *ముక్తికి శక్తికి ధర్మమార్గమ్*

*************************************

రామాయణం మహాకావ్యం 

రామస్య  అయనం రామాయణం! 

అయనం రామనామ ఆధారం! 


గిరులు తరులు ఝరులు ధరలో ఉన్నంతకాలం 

నరజీవం తరలినంతకాలం చదివి విని చూసి 

తరించడానికి రామాయణం రసరమ్యకావ్యమే! 

సంపూర్ణ రామాయణ పఠనం 

పతనం సర్వలోక  జ్వరం! 


పరమాత్మే నరుడై ధర్మపరుడై 

పితృవాక్య తత్పరుడై 

చరుడై వన సంచరుడై వానర హితుడై 

జనహృదయుడై జగన్మోహితుడై 

నరుడుగా నరోత్తముడుగా 

సర్వోత్తముడుగా శబరీ చిత్తమందు 

వెలిగిన రాముడే అంతిమము అచ్యుతానందుడు    

అవతార సమాప్తిలో ఎక్కడా తానేంటో గొప్పలు చెప్పనివాడు

పరుడు నరుడై అవతరించి అవనికి ఆదర్శమై నిలచినాడు

*అందుకే రామాయణం.....*  

ఆదికావ్యము..  అజరామరము..  ఆదర్శము..

మానవ ధర్మమును అనంత మానవాళి ఆర్తిని తీర్చి 

అచ్యుతుని పాదసన్నిధికి చేర్చే అద్భుత సాధనము

అదే మానవ ముక్తికి విముక్తికి శక్తికి ధర్మమార్గమ్!

10/10/20, 4:53 pm - +91 91821 30329: మల్లినాథసూరి కళాపీఠ0

సప్తవర్ణముల సింగిడి

అంశం!రామాయణం రసామృత కావ్యం

నిర్వహణ! శ్రీ బి.వెంకటకవి

గారు

రచన!జి.రామమోహన్రెడ్డి


ఆదికవి వాల్మీకి ప్రసాదితం

రామాయణం

రామాయణం సీతారాముల

పుణ్య చరితం

రామాయణ కావ్యం ఆదరణీ

యం,పూజనీయం

ఇక్ష్వాకు వంశం నందు జని

యించిన శ్రీరామచంద్రుడు

సముద్రమంత గాంభీర్యం 

హిమవత్పర్వతమంత ధైర్య

ము గలిగిన సాక్షాత్ శ్రీమహా

విష్ణువు అంశే శ్రీరాముడు.

శ్రీ మహాలక్ష్మే సీతగా,

ఆదిశేషుడు లక్ష్మణునిగా

శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా భూలోకము

న అవతరించి ధర్మనిరతిని

లోకానికి తెలియజేసిన 

పుణ్యమూర్తులు.


రామచంద్రుడు

బాల్యమునే విశ్వామిత్రుని

తో ప్రయాణం చెసి

తాటకిని హతమార్చి

యాగసంరక్షణ చేసే 

ఖరదూషణాది రాక్షసుల చంపి

వాలిని కూల్చి ,జలరాశి గర్వం అణచి

సేతువునుదాటి రావణుని

కుంభకర్ణుని మొదలగు వీరు

లను త్రుంచి వేసి

విభీషణుని లంకకు రాజును

చేసిన ధర్మ ప్రభువు శ్రీ రామ

చంద్రుడు

రామాయణం లోని ప్రతి పాత్ర మానవజీవనానికి ప్రతిబింబాలు

నడవడికలు - నమ్మకాలు

తండ్రికొడుకులు - అన్నదమ్ములు

భార్యా భర్తలు,యజమాని

సేవకులు,మిత్రులు రాజు ప్రజలు,భగవంతుడు భక్తుల

సంబంధ బాంధవ్యాలను

ప్రవర్తనా నియమావళిని

పాత్రోచితంగా మలచి

ప్రపంచానికి చాటి చెప్పిన

కావ్యం రామాయణం.


రాముని వంటి దేవుడు

సీతాదేవి వంటి పతివ్రత

లక్ష్మణుని వంటి సోదరుడు

భరతుని  అనురాగం

ఆంజనేయుని సేవాతత్వం

విశ్వామిత్రుని వంటి గురువు

సుగ్రీవుని స్నేహధర్మం

విభీషణుని వంటి ప్రాణసఖు

డు

గుహుని వంటి భక్తుడు

రామాయణంలో యింకా ఎన్నో పాత్రలు మానవాళికి

దిక్చూచి లా  నిలిచి పోయే...

10/10/20, 4:56 pm - +91 98495 90087: మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల అమరకులదృశ్యకవిగారిపర్యవే క్షణలో సప్తవర్ణాలసింగిడి నిర్వహణ:-శ్రీ.బి.వెంకట్ కవి

                  గారు. 

అంశం:-పురాణం

రామాయణ కదామృతం. 

తేదీ:-10.10.2020

పేరు:-ఓ. రాంచందర్ రావు

ఊరు:-జనగామ జిల్లా

చరవాణి:-9849590087


శ్రీ రామ రామేతి రమేరామే

మనోరమేరామనామతత్యు

ల్యంరామనామవరానమే. 

ఎచ్చటరామనామనామంజపింపబడునోఅచ్చటకరువుకాటకాలుుండకసస్యశ్యామలంగాఉంటుందనిపెద్దలమాట. ఇలా ప్రతి

కార్యానికిరాముడినిఉదాహరణ

గాచూపుతారు. సాక్ష్యాత్తునారా

యణుడే నరుణిగాఅవతరించి

సామాన్యమానవునిగాజీవించి

ఎన్నో కష్టనష్టములకోర్చి,

సగటుమనిషిపడేకష్టాలనుఅనుభవించి ఎలాఆదర్శంగా,

ఉత్తమవిలువలతోజీవించాలో, 

చూపించిమానవలోకానికిఆదర్శంగానిలిచాడు.నీలిమేఘశ్యాముడు, ఆజానుభాహుడు,

సుందరాకారుడు, ఇలాఎన్నినా

మాలకైనాతగినవాడు. ఒకకొడు

కుగా,ఒకసోదరునిగా, ఒక

ఉత్తమపతిగా,ఒకఉత్తమరాజుగా, ఉత్తమ స్హేహితునిగా,ఇలా

అన్నిరకాల ధర్మాలను ఒక్కడే

సమర్ధవంతంగా నిర్వహించిన

మహామనీషి.మనుష్యలకేకాదు

జంతువులను, పశువులను, 

పక్షులను,రాక్షసులనుకూడా

అభయమిచ్చికాపాడినగోప్ప

వ్యక్తి. పాలకులుఎవరిపక్షాన

ఉండాలో, తనలాగే భార్యను

కోల్పోయినవ్యక్కికి , బాసటగా

ఒకభిల్లునికి, ఒకనిషాదునికి, 

ఒకవనకన్యకు, ఒకవానరానికి, 

ఇలాఆపన్నార్ధులకు, అభయ

హస్తనిచ్చికాపాడినవ్యక్తి. తను

ప్రాణమటువంటిఇల్లాలినికూడా

ఒక సామాన్య మానవునిసందే

హనివృత్తికైత్యజించినగొప్ప

త్యాగధనుడు.రావణుడునిసంహరించివచ్చినాక,తల్లి కౌసల్య

రావణుడునిచంపివచ్చావాఅంటే, రాముడుఒకగొప్పశిభక్తుడు, 

చతుర్వేదపారంగతుడు, అష్టైశ్వర్యాలున్నవాడు, తన అహంకారము మూలంగా నేల

కొరిగాడు,అనిచెప్పాడేతప్ప, 

నేనుసంహరించలేదుఅనితెప్పినవినమృశీలి.యుగాలుదాటినా, ఆయనగురించిచెబుతు

న్నారంటె,ఆయనఎంతటిఉత్తముడోఅర్ధంచేసుకోవచ్చు.ప్రతి

మవిషిఆయనఅడుగుజాడలో

నడిస్తే అది రామరాజ్యమేఅవు

తుంది. కౌసల్యా,దశరాత్మజుడు

జనకాత్మజ, కైకేయితనయుడు 

సమత్రానందనులు,ఛత్రఛామరములు, పట్ట,పవనతనయుడు

పాదాలుపట్ట,ఆరామపరివారముఎల్లప్పడు, మనమనంబు

లందు పట్టాభిషిక్తునిగా కొలువై

ఉండి ఆశీస్సులుఇవ్వలసినది

గామనసారాప్రార్ధిస్తూమంగళ

మగుగాక.

10/10/20, 5:05 pm - B Venkat Kavi: *మీ రచనలు లెక్కలోనికి రాగలవు*


*రోజు వ్రాయాలంటే ఇబ్బందినే.కాని వ్రాయండి*


*ఈరోజు అంశం  పై ఎక్కవ రచనలు రావాలి*


*రామాయణం తెలియనివారుండరుగదా*


అందుకే నేడు 

*రామాయణం రसाమృతకావ్యం*


*కాలం పరుగెడుతుంది.కాని* *మనము కవితావిష్కరణకోసం*

*పరుగెత్తాలి*


*ఆ ఏముందిలే అనుకున్నామా*

*బద్ధకం మన వెంబడే* *ఉంటుంది.ఇంకా సమయం ఉందిలే అనుకున్నామా సమయం అయిపోతూనే ఉంటుంది.*

*అందువల్ల ఇప్పుడే చైతన్యం కావాలి*


కవితావిష్కరణకు రడీ కావాలి


*రచనలను వ్రాయండి.ఈ సమూహానికి పంపండి*

10/10/20, 5:05 pm - +91 94415 44806: వేలేటి శైలజ



ప్రకృతి నియమాల ప్రతిరూపం రామాయణం

స్త్రీత్వాన్నికి ప్రతీక జానకి

పురుషత్వానికి ప్రతిబింబం రాముడు

జానకిరాముల చుట్టూ అల్లుకున్న ఆదర్ష ప్రపంచమే రామాయణం

వాల్మీకి హృదంతరాల పెల్లుబికినకరుణామృత రసధార రామాయణం

మా,(లక్ష్మీ)విషాదుల(నారాయణుడు) విశాల జీవన ప్రవాహఝరి రామాయణం

యుగాలుయుగధర్మాలు మారినా రామాయణ ధర్మం ఒక్కటే అది సహజసిద్ద మానసిక పరిపక్వత

మనస్సాక్షి చెప్పే ఆత్మవేదం రామాయణం

నీతిగా నియమబద్ధంగా మనిషిలా బ్రతకాలంటే

రామాయణసారగ్రహణ

శక్తీ మనసుకు పట్టాలి



*ఇది నా స్వీయరచన

10/10/20, 5:07 pm - +968 9638 9684: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

పేరు… నీరజాదేవి గుడి,మస్కట్

ఫోన్: 00968 96389684

తేది : 10-10- 2020

అంశం : రామాయణo రసాత్మక కావ్యం

శీర్షిక;  రామచరిత (ఆటవెలది పద్యములు)

నిర్వహణ: అమరకుల దృశ్యకవి గారు

బి.వెంకట్ కవి గారు


           రామ చరిత


ఆ.వె1

రాముడన్న మాట రమణీయ కావ్యమై

రాజ్య మేలె మహిన రామ గాథ

యుగము లెన్ని యున్న యుగపురుషుడితండె

ధర్మ స్థాపకుండు ధరణి మీద


ఆ.వె//

మమత కన్న నిచ్చు మాటకే విలువిచ్చి

మాట విలువ పెంచె మానధనుడు

ఏక పత్ని వ్రతము నింపుగా నొనరించి

పెద్ద పీఠ వేసె పెండ్లి కిలన!


ఆ.వె//

గురువు గొప్ప దనము గుర్తెరింగినవాడు

విద్యలెన్నొ నేర్చె వినయ శీలి

ఏక బాణ మందె నెక్కుపెట్టెటి వాడు

రామ బాణ మొకటె రణము నందు!


ఆ.వె//

అన్న దమ్ము లనెడి యపురూప బంధము

ఆచరించి జూపె యవని మీద

ఆలి యనెడి మర్ధ మడుగేసి జెప్పెను

అడవు లందు నిలచి యతివ సీత!


ఆ.వె//

రామ బంటు లేని రామాయణములేదు

గాడ్పు చూలి లేక గాధ లేదు

దాశరథియె మనకు దారి చూపించెను

బంటు రీతి గొలిచి భాగ్య మొంద!


ఆ.వె//

ఉచ్చరింప లేని నుత్కృష్ట మంత్రాలు

ఎన్ని ఉన్న గాని నేమి ఫలము?

పామరుండు గూడ బలుక గలుగునట్టి

రామ మంత్ర రవమె రక్ష మనకు!


ఈ పద్యములు నా స్వంతము.

10/10/20, 5:07 pm - B Venkat Kavi: <Media omitted>

10/10/20, 5:07 pm - +91 84668 50674: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల సప్తవర్ణ సింగిడి

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

నిర్వహణ : బి వెంకట కవి గారు

అంశం : రామాయణ రసామృత కావ్యం

రచన : ఎడ్ల లక్ష్మి

శీర్షిక :  సీతారామ,లక్ష్మణుల వనవాసం

ప్రక్రియ : గేయ కవిత

తేది : 10.9.2020

"""""""""""""""""""""""""""""""""""""""""""""""""


తండ్రి మాట జవదాటనంటూ

తరలి పోవుచుండగ రాముడు

వెంట వెడలిరి సీతా లక్ష్మణులు

తల్లిదండ్రులు తల్లడిల్లు చుండిరి


ఊరి ప్రజలు కంటనీరు బెట్టీ

వారు కూడా వెంట వస్తమనగా

భరతునికీ తోడు నీడగ నిలిచి

భద్రముగా చూడండి మీరనీ


అందరికి నచ్చజెప్పి రాముడు

అమ్మ నాన్నల పాదాలకు మ్రొక్కి

అయోధ్య నుండి బయలుదేరి

ఊరు దాటి చేరినారు అడవిలోకి


పచ్చని లతలతో పర్ణశాల కట్టినారు

కాయగడ్డలు తింటూ కాలం గడుపుతూ

సీతా రాముడు హాయిగా సేదతీరగా

వచ్చె నచటికి బంగారు మాయలేడి


సీతమ్మ లేడిని కోరగా రాముడెల్లినాడు

మాయ అరుపులు విని లక్ష్మణుడెల్లగ 

రావణుడొచ్చి భికక్షమడుగ సీత గీత దాటగ

భువిని పెకిలించి సీతనపహరించె రావణుడు


ఎడ్ల లక్ష్మి

సిద్దిపేట

10/10/20, 5:07 pm - +91 84668 50674: <Media omitted>

10/10/20, 5:07 pm - +91 98668 99622: *సప్తవర్ణముల సింగిడి*

*మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల*

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు*

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*అంశము: *రామాయణం రసామృతకావ్యమ్*

*నిర్వహణ:  శ్రీ బి. వెంకట్ కవి గారు*

*తేదీ 10/10/2020 శనివారం*

*రచన* : *తౌట రామాంజనేయులు*

***********************

తేటగీతి పద్యాలు :-


1.ధర్మమార్గమ్ము నెలకొల్పి ధరణిపైన

మనిషి నడవడి దెలిపిన మహితమూర్తి

మానవత్వము గలిగిన మానధనుడు

రమ్య గుణధామ ! శ్రీ రామ! రామ! రామ!


2.పుణ్య వశమున నీప్రేమ పుడమి పైన

భాగ్యమును గల్గె నాకును భవ్యముగను

నన్ను కరుణించి బ్రోచేటి నాథుడీవె

రమ్య గుణధామ ! శ్రీ రామ ! రామ ! రామ !


3.తేనె లూరేటి నీనామ తీపియెంతొ

నిత్య నూతన సాక్షర సత్యమిదియె

మనసు పులకించి తన్మయ మగుచునుండె

రమ్య గుణధామ ! శ్రీ రామ ! రామ ! రామ !

10/10/20, 5:08 pm - +91 6281 051 344: శ్రీ మళ్లినాథసూరి కళాపీఠంYP

సప్తవర్ణముల సింగిడి

శనివారం 10.10.2020

పురాణ అంశం:శ్రీ రామాయణ రసామృత కావ్యం

నిర్వహణ:శ్రీ బి.వెంకట్ కవి గారు

----------------------------------------

*రచన:రావుల మాధవీలత*

ప్రక్రియ:ఇష్టపది


శ్రీ హరే ఇలలోన

     శ్రీ రాముడైనాడు

దశరథుని కొడుకుగా

     ధరణిలో ఉదయించె

విశ్వామిత్రునాజ్ఞ

      విరిచె శివధనుస్సుని

జనకుని కూతురైన

      జానకిని పెళ్లాడె

తండ్రి మాటకోసం

      తరలెను వనవాసం

అడవిలో రావణుడు

      అపహరించె సీతను

ఆంజనేయుని తోడ

       ఆచూకి తెలుసుకొని

వానరులతో కలిసి

       వారధిని నిర్మించి

రాముడే వెడలెనట

       రావణుని చంపెనట

ఆదర్శపురుషుడే

        ఆ రామచంద్రుడట

రాముని చరితం మన

        రామాయణమాయెను

10/10/20, 5:26 pm - +91 94932 10293: మల్లినాథ సూరి కళా పీఠం

ఏడుపాయల... 

సప్తవర్ణ సింగిడి.. 

అంశం... రామాయణం . 

శీర్షిక.. ఆదికావ్యం

నిర్వాహకులు.....

అమరకులదృశ్యకవి   బి.  వెంకట్ గారు


పేరు.. చిలకమర్రి విజయలక్ష్మి 

ఊరు.. ఇటిక్యాల

********************


శ్రీమద్రామయణము

మానవాళికి లభించిన ఒక పరమ 

పవిత్ర కావ్యము

సర్వ సంశయములను పారద్రోలి 

పవిత్ర మార్గములను  సూచించిన

ఒక మహా ఆదికావ్యం...

రామాయణము ఒక ఉపనిషత్తు వేద సారము....

మన భారతీయ పవిత్ర గ్రంథం రామాయణం...

దీనిని లోకమును ఆవిష్కరింప జేసి ప్రజానీకానికి అందజేసిన

ఆదికవి మహర్షి వాల్మీకి....

ఈ రామాయణము సర్వోత్కృష్టమైన మహాకావ్యము...


దుష్ట సంహారం కోసం శ్రీమన్నారాయణుడే స్వయముగా

ఈ భూలోకమున  ఆవిర్భవించి...

తన లీలా విశేషములను మనకు చెప్పే నిమిత్తం......

ఒక మానవుడిగా

కోసలదేశ దశరథ మహారాజుకు

పుత్రకామేష్టి యాగం వలన

కౌసల్య మాత గర్భమున జన్మించి.... 

శేషావతారం లక్ష్మణుడిగా

శంఖ చక్రములను భరత శత్రుఘ్నులుగా

తనతో పాటు రప్పించి ఈ లోకాన్ని

పవిత్రమైన భూమి గా మార్చిన మన రఘురాముడు....


విశ్వామిత్ర యాగ రక్షణ కై

లక్ష్మణ్ తో గుడి

మారీచ సుబాహు తాటకి లను  వదించి...

మహర్షి విశ్వామిత్ర కృపకు పాత్రుడై

ఎన్నో వరాలు పొందిన...

శ్రీరామచంద్రుడు....


శాపగ్రస్తగా శిలగా మారిన అహల్యను తన పాద స్పర్శచే

స్త్రీ మూర్తి గా మార్చిన

మన రామయ్య తండ్రి...


శివధనుర్భంగము కావించి

జనకమహారాజు పుత్రిక

జానకి ని కళ్యాణమాడిన 

కళ్యాణ రాముడు.....


కైకేయి వరాలు  వలన తండ్రి మాట

జవ దాటక 

తన సతి సీత తో పాటు

సోదరుడు లక్ష్మణుడితో కలిసి

కారడవుల లో 

నివాసం ఏర్పరచుకొని రాక్షసులందరినీ హతమార్చిన

మన కోదండ రాముడు....


మాయావి రావణుడు సీతమ్మ ను  అపహరించుకొని

లంకలో అశోకవనంలో దాచిన

రావణున్ని సంహరింప

పరమభక్తుడైన హనుమంతునితో 

సుగ్రీవునితో మైత్రి చేసుకొని...

సీతాన్వేషణకై

హనుమంతుని లంకకు పంపించి

శోకతప్త హృదయంతో ఉన్న మన శ్రీరామచంద్రుడు.....


తన కోసం నిరీక్షిస్తున్న శబరిమాత ను అనుగ్రహించి

ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తిని

ఆమె భక్తికి మెచ్చి

ఆమెకు  మోక్షము ప్రసాదించిన మన మోక్ష రాముడు.....


హనుమంతుడు లంకా ప్రవేశం చేసి

సీతమ్మ తల్లిని దర్శించుకుని

రావణ గర్వముమదించి  

లంకా దహనం చేసి

శ్రీరామచంద్రుని చేరుకొన్న మన ఆంజనేయుడు...

సముద్రంపై వారధి నిర్మించి....

వానర సైన్యంతో మన శ్రీరామచంద్రుడు

మహా మహా వానరవీరులు అందరిని తీసుకొని

లంకా ప్రవేశం  చేసి...

రావణ సంహారము చేసి సీతమ్మని తీసుకొని...

అయోధ్యకు బయలుదేరిన మన అయోధ్య రాముడు...


శ్రీరామచంద్రుడు 

ఒక మానవోత్తముడు   

సోదర ప్రేమకు నిదర్శనం

తండ్రి మాట జవదాటనివాడు 

ప్రజల మాటకి విలువనిచ్చే వాడు సీతమ్మ తల్లిని అపురూపంగా 

చూసుకొని 

సీతారాముడు ఒక్కరే అని చాటి చెప్పిన సీతారాముడు... 

ఆ వైకుంఠ రాముడు శ్రీరామచంద్రుడు గా

ఈ భూలోకంలో జన్మించి

ఒక మానవుడు ఎలా ఉండాలి  రాజ్యపాలన ఎలా చేయాలి...

దుష్టులకు  ఎలాంటి శిక్ష వేయాలి అని...

తాను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి

మన మానవులు  ఆదర్శవంతులు గా ఉండాలని

తాను మానవుడిగాజన్మించి 

మనకు ఆదర్శప్రాయం గా ఉన్న  

శ్రీ రామచంద్ర ప్రభువు 

రామాయణ మహా కావ్యం గురించి ఎంత రాసినా తక్కువే...


ఈరోజు పునర్వసు నక్షత్రం..

రామచంద్రుని జన్మనక్షత్రం

ఈరోజు రామాయణం గురించి

నాలుగు వాక్యాలు రాయడం

నా  అదృష్టంగా భావిస్తున్నాను.. 

ఆ శ్రీరామచంద్రుని కరుణాకటాక్షాలు మనందరిపై వుండాలని  శ్రీ సీతారాములను వేడుకొందాం.... 🙏

********************

చిలకమర్రి విజయలక్ష్మి 

ఇటిక్యాల

10/10/20, 5:28 pm - Anjali Indluri: 🚩 మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

అమరకుల దృశ్యకవి నేతృత్వంలో

10.10.2020 శనివారం

పురాణం : సంపూర్ణ రామాయణము

నిర్వహణ : విశిష్టకవి వర్యులు బి.వెంకట్ కవి గారు


 *రచన: అంజలి ఇండ్లూరి* 

ప్రక్రియ : వచన కవిత

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 


ఎప్పుడెక్కడెక్కడ ధర్మాచరణ తగ్గుతుందో

అప్పుడక్కడక్కడ భగవంతుడవతరిస్తాడు

పుట్టుక లేని వాడు సకల జీవాధీశ్వరుడైనా 

ఆయా యుగాలను ఉద్ధరిస్తూనే ఉంటాడు

అలా త్రేతాయుగమునెత్తినదే శ్రీరామావతారం

ఇక్ష్వాకువంశదాశరథి కౌసల్యలజ్యేష్టపుత్రుడు

బలము యశస్సు సంపద జ్ఞానము కీర్తి

వైరాగ్యవైభవాల దివ్యరూపుడు శ్రీరాముడు

లక్ష్మణభరత తృఘ్నలకు అన్నయైనదేవుడు

గురువునాజ్ఞమీరక యజ్ఞయాగాదులుచేయు

క్రతువులకు రాక్షసపీడను తొలగించినవాడు

శివధనుస్సునువిరిచి  జానకి మనసుగెలిచి

పెండ్లియాడిన పరిపూర్ణుడు శ్రీరామచంద్రుడు

పితృవాక్పరిపాలనకై కానలకేగిన సౌశీల్యుడు

సత్యధర్మపాలనకు విశ్వాస ఆదర్శ ప్రాయుడు

పవిత్ర జీవనానికి శ్రీరాముడు సమున్నుతుడు

కష్టాలలోకూడా నిగ్రహాన్నినింపుకున్న విగ్రహం

సకలజీవకోటికి ఆధారభూతమైనవాడు

ఆంజనేయుని భక్తికి ప్రియ వరమైనవాడు

ఒకేమాట ఒకేబాణం అన్న సత్యవ్రతుడు

లంకజేరి రావణాసురుడిని వధించి

సతిసీతమ్మను కాపాడుకున్న ఏకపత్నీవ్రతుడు

లవకుశులను పుత్రులుగా పొందినవాడు

భారతీయ జీవన మూలాలకు ఆదిపురుషుడు

శోకంనుండీ శ్లోకాన్నివల్లించిన వాల్మీకిమహర్షి 

రామాయణకావ్యం జీవనానికి నాంది ప్రస్థానం

సామాజిక  కుటుంబ విలువలకు నైతిక వేదిక

రామధర్మాలను ఆచరించు వారికి అందును

రామ నామామృతదివ్యలీలా జీవనానందం


✍️అంజలి ఇండ్లూరి

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

10/10/20, 5:30 pm - +91 97049 83682: మల్లి నాథసూరికళాపీఠంY P

శ్రీఅమరకులగారి సారథ్యంలో

సప్తవర్ణాలసింగిడి

అంశం:రామాయణం రసామృత కావ్యం

రచన:వై.తిరుపతయ్య

నిర్వాహణ:బి. వెంకట్ గారు

శీర్షిక:మోక్షమార్గానికి ద్వారం

తేదీ:10-10-2020


*************************

*కాండము అంటే తీయని చేరకుగడా అని అర్థం అంటే రామాయణం అంతకన్నా మధురమైన కావ్యం*

భారతీయులకు శిరోదార్యమైన

గ్రంథం  రామాయణకావ్యం.

చిన్న,పెద్దఅందరిముక్తి మార్గానికిరామాయణం ఒక మంచి గ్రంథం.

*బాలకాండలో* అశ్వమేథయాగం మొదలు శ్రీ హారి అదిశేష శంకచక్రాలు రాంచంద్రునితో పాటు భువిలో జనియించే...

రామలక్ష్మణులు తాటకి మీద తొలియుద్ధంఅహల్య శాపవిమోచనం,సీతారాముల కల్యాణం..

*అయోద్యకాండలో*

మందర దుర్భోద అనేది నీచుల మాటలు ఎంతటి మంచివారినైన మారుస్తాయి అనేది, శ్రీరాముడు తండ్రి మాటను జవాదాటకుండా ఉన్నతీరు,భరతుడు చేసిన పాద పూజ ఇవన్నీ మానవాళి చదివి నేర్చాల్సినవి...

*అరణ్యకాండలో*

సకలభోగాలే కాదు కటికనేలమీదకూడా బతకాలని నేర్చుకోవాలి.పక్షిసహితం సీతమ్మను విడిపించుటకు చేసినప్రాణత్యాగం ఘననీయం

*కిష్కింద కాండంలో*

వానర సహితం సీతమ్ము కోసం చేసిన అన్వేషణ,హనుమ వాయుబలంతో సముద్రం

దాటడం మంత్రబలం విశేషం

*సుందర కాండం*

చూసిరమ్మనగా కాల్చివచ్చిన హనుమంతుడు సీతమ్మకు హనుమ నిజరూపం చూపటం.

*యుద్ధకాండంలో*

ఉడుత తో మొదలు వానరసైన్యం అంతాభక్తితో

సేతు నిర్మాణం అనణ్యం

లోకాపనింద లేకుండా సీతమ్మ అగ్నిప్రవేశం....

*ఉత్తరకాండలో*

 లోకాపనిందలు దుర్వార్తలు సహితం ఆలుమొగల జీవితాని  విడగొడుతాయి అని..ఇలా రామాయణంలోని

 ప్రతి కాండం రసామృతమే..

10/10/20, 5:32 pm - +91 94404 74143: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 18, ది: 10.10.2020. శనివారం.

అంశం: రామాయణం రసామృత కావ్యం

శీర్షిక: రామకథా సారము.

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీ బి.వెంకట కవి గారు.

కవిపేరు: చిల్క అరుంధతి

నిజామాబాద్

సీసమాలిక


అంతరంగమందు యాత్మ

రామునిలీల

ఆది కావ్యముగాను యవని నిలిచె


తారక మంత్రమై ధరణిని పాలించె

అన్నదమ్ముల బంధమాత్మలోను


ఆదర్శ పురుషుడు యవని సీతమ్మకు

ధర్మాత్ముడయ్యెను ధరణిలోన


ఇక్ష్వాకు వంశపు యినకుల బింబము

తండ్రిమాటకొరకు తలను వంచె


గురువులందరికిల గురుతైన శిష్యుడై

మార్గమే చూపెను మహిని జనుల


రావణాసురుతోను రణరంగమేచేసి

తల్లిసీతమ్మను తాను తెచ్చె


భరత శత్రుజ్ఞుల బంధమే నిల్పగా

అగ్రజుడై నిల్చె యన్ని వేళ


భవ్యమైనట్టిది  దివ్యమైనట్టిది

రామకథనిలలో రాజ్యమేలె


ఆటవెలది


కన్నవారిమాట విన్న రామునికథ

అన్నదమ్ములన్న మిన్న కథయె

భార్యభర్తల యనుబంధ కావ్యమనగా

సర్వ లక్షణముల సారమిదియె.

10/10/20, 5:44 pm - +91 98662 49789: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణముల 🌈 సింగిడి

ఏడుపాయలు, 10-10-2020

పేరు : ప్రొద్దుటూరి వనజారెడ్డి

ఊరు: చందానగర్

అంశం: పురాణం

శీర్షిక: రామాయణం

నిర్వహణ: దృశ్యకవి అమరకుల, బి. వెంకట్ కవి గారలు 

————————————

“కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం

ఆరూహ్య కవితాశాఖం

వందే వాల్మీకి కోరిలం”


రామాయణ కథను వాల్మీకి రస రమ్యంగా కావ్యకన్యగా

తలచి మధుర భక్తితో రచించి

ఆది కవిగా కీర్తి పొందె


రామావతారానికి ఉన్న ప్రఖ్యాతి వేరే అవతారానికి

లేదు మనిషిలాగా పుట్టి

మనిషిలాగ బతికి గురువును సేవించి తండ్రిని గౌరవించె 


రాముడు సర్వగుణ సంపన్నుడు

ఏలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకని వాడు

ధర్మం తెలిసినవాడు

ఆశ్రయించిన వారిని ఆదుకునే నాడు 

మాటతప్పని వాడు

సకల ప్రాణులకు

మేలుచేసే వాడు

వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు

పదహారు గుణాల సంపూర్ణ

మానవుడు


అమ్మానాన్నల అనురాగం,

అన్నదమ్ముల అభిమానం

గురుభక్తి, శిష్యానురక్తి,స్నేహ ఫలం,

ధర్మ గుణం

వినయం తో ఒదగటం

ఉత్తమ ధర్మాల ఆచరణ

ఇలా జీవిత పార్శ్యాల నెన్నింటినో పట్టి చూపించె రామాయణం


రాముడు పితృ వాక్పాలకుడు

ఏకపత్నీ వ్రతుడు కమలాళాక్షుడు

పూర్ణ చంద్ర వదనుడు

దాక్షిణ్యశాలి

బుద్దిలో బృహస్పతి

కీర్తికి దేవేంద్రుడు


“రామో విగ్రహవాన్ ధర్మః

సత్యధర్మ పరాక్రమః”

రామునివంటి ఆదర్శమూర్తి,

రామాయణం వంటి ఆదర్శ

కావ్యం ‘నభూతో నభవిష్యతి!’

మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది

————————————

ఈ రచన నా స్వంతం

————————————

10/10/20, 5:46 pm - +91 6304 728 329: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

అమరకుల దృశ్యకవి గారి సారథ్యంలో. 

10/10/2020

పురాణం

అంశం: రామాయణం 

నిర్వహణ; శ్రీ  బి వెంకట్ కవి గారు 

శీర్షిక: మనోహర  నిత్య పారాయణం 


క్రౌంచ పక్షుల జంట

నిషాదుడి వేటుకు నేలకొరిగేనంట

బోయవాడి హృదయం కరిగినోటివెంట

అప్రయత్నంగా శ్లోకము జాలువారేనంట

శోకంలోన శ్లోకంపుట్టి

ఆశ్లోకమే రసరమ్య కావ్యమై

మానవ దుఃఖాగ్నిని చల్లార్చెడి

అమృత రస ధారలు కురిపించే

రామాయణ కావ్యమై పరిణమించేనంట

రామాయణ కావ్యము

రాగ రంజితమయ్యే దివ్య ధామము

రామాయణ పఠనము

ముక్తిని ప్రసాదించే దివ్య సాధనము

పుణ్య  చరితుల దివ్య సాకేతము

భార్యా భర్తల బంధాన్ని

మహోన్నత పరిచిన దివ్య  చరిత

అన్నదమ్ముల ఆత్మీయతలు 

అల్లుకున్న చిక్కని ప్రేమ పందిరి

రాజు సేవకుల బంధాలు 

రంజిల్లిన మధుర కావ్యం

అజరామర   స్నేహానికి 

అమృతత్వాన్ని కల్పించిన అమృతభాండం

తండ్రి తనయుల బంధానికి

తావి అద్దిన మహాకావ్యం

ధర్మానికి నెలవై

అధర్మాన్ని అంతం చేసి

మానవ విలువలను మహోన్నతం చేసి

భారతీయ సంస్కృతిని 

ప్రపంచవ్యాప్తం చేసి

లోక కళ్యాణం కొరకు

పాటుపడే ఏకైక కావ్యం రామాయణం !

మానవులందరికీ  నిత్య పారాయణం!!


           మల్లెఖేడి రామోజీ 

           అచ్చంపేట 

           6304728329

10/10/20, 5:55 pm - +91 73493 92037: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల

దృశ్య కవి అమరకుల చక్రవర్తి

నిర్వాహణ : వెంకట్ కవిగారు

అంశం : రామాయణ రసామృత కావ్యం

ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.

       రామ రసభరితం

     -------------------------

శత శ్లోకి వాల్మీకి రామాయణం

బాల అయోధ్య సుందర ఉత్తరకాండ

అంతరార్ధమే మొల్ల రామాయణ రహస్యా నిధి

కళ్యాణరామ ఆదర్శం యువతరానికి

అచ్చతెలుగు భాషా రమణీయం

రామచరితమానస సుందరకాండ పూజనీయము

శ్రీరామ పట్టాభిషేకం ఒక యోగ వాశిష్ఠసారం

హిందూధర్మ చరిత్ర సంస్కృతి ఆచార అనితరం

దివసంప్రతి కీర్ణానాం ఆహార అర్ధ పతత్రిణం

తండ్రి -కొడుకు భార్య-భర్త అన్న-దమ్ముల యజమాని-సేవక

భక్త-భగవంత రాజు-ప్రజల సంబంధ బాంధవ్యమది

ప్రామాణికం అంగర్గతత్వ భావాల పురాణము

రామరామేతి మధురం మధురాక్షరం

సీతారామ చరితం ఆంజనేయభరితం

సకల పాపహరం మోక్షప్రదని రమంతే సర్వజనాః

ధర్మ అర్ధ కామమోక్ష పురుషార్ధగమ్య మోక్షం

ఏకపత్నివ్రత పురుష నీతి సూక్తిదాయకం

ఇక్షాకు రామశక్తి సంకల్ప ఇంద్రియ జయధామ

తింటే పటికిబెల్లం తిన్న రుచి రామాయణం

రావణ సంహార్ధమే మానవజన్మ  రామావతారం

దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం లేని

రావణకు నరవానరులచేత మరణం తధ్యం

బల అతిబలచే తాటకి వధ, అహల్య శాపవిమోచనం

సీతారాముడు లక్ష్మితో విష్ణువై ప్రకాశించెను

ప్రయాతు సీతారామ గుణమ్రాడ గుణాచ్ఛాపి పీతి ర్ధూ యోభ్య వర్ణత!

10/10/20, 6:01 pm - Narsimha Murthy: మల్లినాథసూరికళాపీఠము, ఏడుపాయల.

🌈సప్తవర్ణాల సింగిడి🌈

రచనసంఖ్య: 047, ది: 10.10.2020. శనివారం.

అంశం: రామాయణం (పురాణం)

శీర్షిక: సంపూర్ణరామాయణం

నిర్వాహక కవులు: సర్వశ్రీ. అమరకుల కవివర్యులు, శ్రీ బి. వేంకట్ కవి గార్లు.

కవిపేరు: నరసింహమూర్తి చింతాడ

ఊరు: ఏలూరు, ప.గో.జిల్లా.

ప్రక్రియ: ఆధునిక పద్యం 


సీసమాలిక

"""""""""""""""

రామచరితమన్న రసరమ్యకావ్యంబు

     కన్నవిన్ననుగాని కలుగుముక్తి

రామాయణచరిత రక్తితోరాసిన

     వాల్మీకి ఘనుడయ్యె వసుధలోన

కౌశికయాగాన్ని కావలిగాసిరి

     విద్యలునేర్చిన విజ్ఞుడితడు

జనకునికూతురు జానకీదేవిని

     ప్రేమతోరామయ్య పెండ్లియాడె

తండ్రిమాటవినెడి తనయుడీరామన్న

     కోసలనువిడిచి కోనకెళ్ళె

మునులెల్లదీవించె మునివేషధారుల్ని

     పర్నశాలకువీరు పయనమయ్యె

సూర్పణకేతెంచె సూర్యవంశులదాపు

     సౌమిత్రి ముకుగోసె శరముతోటి

పగబూని లంకేసు పంపించె మారీచు

     బంగారులేడిగా భ్రమనుగొల్పి

కోసులుపయనించె కోదండరాముడు

     మారీచునిపథకం మాయతోటి

లక్ష్మణావెళ్ళంటు లచ్చిపంపినపుడు

     గీతదాటొద్దని గీతగీసె

మునివేషధారియై ముష్కరరావణ్డు

     మాధ్వినిగొనిపోయె మాయపన్ని

అన్నదమ్ములువచ్చి యడవంతగాలించి

     కిష్కింధరాజుతో క్రియనుజరిపె

వానరరాజంపె వానరసైన్యాన్ని

     సీతనువెతకండి శీఘ్రముగను

హనుమంతుడెళ్ళెను యంగుళీయకముతో

     లంకిణింజంపుతూ లంకకెళ్ళి

సీతమ్మనుగలిసె శ్రీహనుమంతుడు

     శ్రీరామునికిజెప్పె సీతజాడ

వారధికట్టిరి వానరసైన్యము

     లంకనుజేరెను లక్షణంగ

దశకంఠునివధించె దాశరధిసుతులు

     శ్రీరామచంద్రుండు సీతజేరె

     

తే.గీ.

ధర్మమార్గముజూపెను ధరణిపైన

మానవత్వంబుబెంచెను మహినియందు

యుగపురుషునిగాధ పలికె యుగయుగాన

రామతారక మంత్రమే రక్షమనకు


👆ఈ పద్యకవిత నాస్వీయరచన.. చి.న.మూర్తి. 9441751120.

10/10/20, 6:01 pm - Balluri Uma Devi: 1010/20

మల్లినాథ సూరికళాపీఠం

అంశం :పురాణం 

నిర్వహణ: శ్రీ బి.వెంకట్ కవి గారు

పేరు: డా. బల్లూరి ఉమాదేవి

శీర్షిక:: రామాయణం

ప్రక్రియ: పద్యములు


 షోడశ కళలతో విరా జిల్లు శ్రీరామచంద్రునకు షోడశ పద్యాలతో అక్షరార్చన


1ఆ.వె:భూమి భార మణచ భువిని          అవతరించె 

       దశరథునకు తాను తనయుడగుచు

     ముగ్గురమ్మలకును ముద్దుల బిడ్డడై

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


2ఆ.వె:శిష్ట జనుల గావ శ్రీరామచంద్రుడై

       చైత్ర శుద్ధ మందు జననమొందె

     ముదము పొందు చుండ పురజను లెల్లరు

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


3ఆ.వె:గాది సుతుని తోడ కానల కేగితా

       నస్త్ర విద్య లరసి యసురవరుల

     బాల్యమందె కూల్చి ప్రఖ్యాతి నొందిన

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


4ఆ.వె:రామ నామ మహిమ రాయిగా మారిన

       యింతియా యహల్య  యెరుక పరచె

    శరణు కోరినంత వరము లొసగుచుండు

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


5ఆ.వె:శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడ

     మెచ్చి రెల్ల సురలు మేటి గాను 

     పూల వాన కురియ పుడమి పులకరించె

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


6ఆ.వె:పరశురాము డడ్డు పడగ మార్గము నందు

      వినయశీలి యగుచు విష్ణుధనువు 

       వంచ మెచ్చి మునియు వాసిగా వనికేగె

       రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


7ఆ.వె:తండ్రి మాట మేర దాశరథియు తాను 

       కాన కేగి నాడు కాంత తోడ

      భ్రాత వెంటరాగా పరమోత్సుకత తోడ

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


8ఆ.వె: వలచి వచ్చె నంట వనిత రూపము తోడ

     చుప్పనాతి యైన శూర్పనఖ యు

     ముక్కు చెవులు కోసి మునియుచు సౌమిత్రి

     రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర



9ఆ.వె:పసిడి జింకనుగని వసుధిజ వాంఛించ

        కోర్కె తీర్చ నేగె  కూర్మి తోడ

      రావణుండు వచ్చి రమణిని గొంపోయె

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


10 ఆ.వె:అభయ మొసగి నాడు నర్క సుతునకట

     వాలిని వధియించి వాసిగాను 

     ప్రభువు గాను చేసె వానరులకునెల్ల

     రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


11ఆ.వె:ఆంజని సుతు కొసగె నంగుళీయకమును

     నంద చేసె హనుమ నతివ కపుడె

     రామబంటు గానె రాణ కెక్కెను తాను

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


12ఆ.వె:సీత వార్త నరసి చిత్తమున మురిసి

      శరధి బంధనమ్ము చక్క గాను 

   చేసి కపుల తోడ సింధువు దాటిన

    రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


13ఆ.వె:అసురవరు డటంచు నావల నెట్టక

    శిష్టుడనుచు నెంచి  శీఘ్రగతిన

     నాదరణము చూపె నావిభీషణు పైన

    రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


14ఆ.వె:దశశిరు దునుమాడి ధరణిజతో పాటు

      పుష్పకమ్ము నందు పురిని చేరి 

    సంతసమ్ము గూర్చెజనుల మనము లందు

      రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర


15ఉ.మా


నమ్మితి మానసమ్మునను నన్నిక బ్రోచెడి భారమీ దెగా

కమ్మగనాదునాల్కపయిగంతులువేయగ నీదు  నామమే

నెమ్మి ని చూపుచున్ సతము నీదయ నీగతినెల్ల  వేళలన్

జిమ్ముచు నుండ వేడితిని సేవలు గైకొని కావ రమ్మికన్.



16. అంగనలెల్లచేరుచును హారతులెత్తుచు  మంగళమ్మనన్

చెంగట సీతతో సతము శ్రీలనొసంగగ రమ్ము రాఘవా

నంగము వంచి మ్రొక్కెదను నార్త పరాయణ ఆలసింపకన్

 సంగ సుఖమ్ములిచ్చుచును సత్వరమాశిసు లంద  చేయుమా

10/10/20, 6:01 pm - Balluri Uma Devi: <Media omitted>

10/10/20, 6:03 pm - P Gireesh: మల్లినాధసూరికళాపీఠం

ఏడుపాయలు

సప్తవర్ణముల సింగిడి

పేరు: పొట్నూరు గిరీష్

ఊరు: రావులవలస, శ్రీకాకుళం

చరవాణి 8500580848

అంశం:రామాయణం రసామృత కావ్యం

శీర్షిక: రామాయణం

నిర్వహణ:శ్రీ బి వెంకటకవి గారు

ప్రక్రియ:వచనం


వాల్మీకి తమసానదీస్నానం చేసి తిరిగొస్తుండగా పక్షి జంటలో ఒక పక్షిని చంపిన బోయివాడిని ఎక్కువకాలం బ్రతకడని శపించిన వాల్మీకిని చూసిన నారదమునీంద్రుడు రామకథను శ్లోక రూపంలో చెప్పమనగా అది రామాయణమై రసామృత కావ్యమై మానవాళికి ఎంతో సందేశాన్ని అందించింది.


దేవతలు, రాక్షసుల వలన చావు లేకుండా వరం పొందిన రావణాసురడి గర్వం అణచివేయడానికి శ్రీ మహావిష్ణువు మహా శక్తులన్నీ పాయసంగా మారీనాయి. పిల్లలు లేని దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగంలో యజ్ఞపురుషుడిచే అందుకున్న బంగారు పాత్రలోని పాయసాన్ని కౌసల్యకు సగభాగం, కైకేయికి సగభాగం ఇచ్చినాడు. వారిరువురు సుమిత్రకు చెరిసగం ఇచ్చినారు. దశరధుని ముగ్గురి భార్యలకు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించినారు.


తండ్రికి, అన్నదమ్ములకు పెద్దవాడు రాముడంటే అమిత ప్రేమ. జనక మహారాజుకి దొరికిన పాప సీతాదేవిగా, స్వయంవరంలో జనక మహారాజు వద్దనున్న శివధనస్సును ఎక్కుపెట్టిన రామునికి సీతాదేవి భార్యైనది.


భర్త అంటే రాముడిలా

భార్య అంటే సీతలా

కొడుకంటే తండ్రిమాట జవదాటని రాముడిలా

అన్నదమ్ములంటే దశరధుని కునారులులా

ఉండాలని రామాయణ కావ్య తాత్పర్యం.


రామాయణాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే అంతా రామమయం.


శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష

10/10/20, 6:12 pm - Trivikrama Sharma: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల సప్తవర్ణాల సింగిడి

ప్రక్రియ పురాణం

నిర్వహణ శ్రీ వెంకట కవి గారు

అంశం రామాయణం రసరమ్య కావ్యం

పేరు త్రివిక్రమ శర్మ

ఊరు: సిద్దిపేట

శీర్షిక:.  రామ మార్గమే శిరోధార్యం

**********************

పుత్రకామేష్టియజ్ఞఫలమున ఇలపైవెలసెనునారాయణుడు

శంఖ చక్ర గదలను సోదరులుగా భువిపై వెలిసెను నారాయణుడు

రామ జననం నుండి , రామ నిర్యాణం వరకు అడుగు అడుగు నడుస్తున్న ధర్మ దేవత ప్రతిరూపమే


చక్రవర్తి పీఠంపై కూర్చోవల సిన రాముడు తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేశాడు

మహారాణిలాసేవలoదుకునే సీత భర్త కోసం  వనాల బాట పట్టింది

సోదరుడే దైవంగా భావించే లక్ష్మణుడు అన్నతో కలిసి కఠోర అరణ్యవాసం చేశాడు

తల్లి వరాన్ని దిక్కరించి రాజ్య పదవిని తిరస్కరించి పాదుకలని దైవంగా భావించి రాజ్యపాలన చేసి పునీతుడైనాడు భరతుడు

పుత్ర ధర్మం కోసం అరణ్యవాసం చేసి 

మిత్ర ధర్మం కోసం వాలిని సంహరించి

క్షాత్ర ధర్మం కోసం రాక్షసులను చంపి

పతి ధర్మం కోసం రావణుని సంహరించి

రాజ ధర్మం కోసం సీతను పరిత్యజించి

క్షమా ధర్మం కోసం అహల్యనుద్ధరించెను రాముడు

పతివ్రతా ధర్మం కోసం సీతమ్మ తల్లి .అరణ్యవాసం.అగ్ని ప్రవేశం చేసి..వనవాసం చేసింది

బ్రాత్రు ధర్మం కోసం లక్ష్మణుడు భార్యకు దూరమై నిద్రాహారాలకు దూరమై నాడు

భార్య ఇచ్చిన వరoకోసం తనకు తానే బలయ్యాడు దశరథుడు

ప్రభువును పూజించడమే పరమావధిగా జీవితాన్ని అర్పించిన హనుమంతుడు

ప్రజా రాజ్య సంరక్షణకోసం అన్నను ఎదిరించిన విభీషణుడు

సీతమ్మరక్షణకోసంప్రాణత్యాగం చేసిన జటాయువు

రామాయణం ప్రతి పాత్రలో ధర్మ నిరతి.. ప్రతి సన్నివేశంలో. రసానుభూతి

రామాయణం వ్యక్తిగత సుఖాల కన్నా సామాజిక ధర్మం గొప్పదని చాటి చెప్తుంది

రామో విగ్రహవాన్ ధర్మః

యుగయుగాలయినా

రామధర్మమేఅనుసరణీయం నేటి తరానికి..మరే తరానికైనా మరే యుగానికైనా.. రామ మార్గమే శిరో దార్యం


**********************

నా స్వీయ రచన

10/10/20, 6:26 pm - +91 91778 33212: శ్రీ మల్లి నాద సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి ఏడుపాయలు

శ్రీ అమర కుల దృశ్య కవిచక్రవర్తి చక్రవర్తి గారి సారథ్యంలో


అంశం:- రామాయణం రసామృత కావ్యం( పురాణం) 

నిర్వా హకులు:- బి వెంకట కవి గారు పేరు:-పండ్రువాడసింగరాజు

 శర్మ

తేదీ :-10/10/20 శనివారం

శీర్షిక:- శ్రీ రామాయణ చరితం

 ఊరు   :-ధవలేశ్వరం

కలం పేరు:- బ్రహ్మశ్రీ

ప్రక్రియ:- వచన కవిత

ఫోన్ నెంబర్9177833212

6305309093

*************************************************

జంట పక్షుల విహంగం లో కిరాతక వాల్మీకి పక్షిని వధించి సోకించే పక్షి శ్లోకం గ్రహించి రచించి వాల్మీకి రామాయణం. 

పుత్రకామేష్టి యాగం  జరిపించే దశరథ మహారాజు   జన్మించే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు . 


 రహస్య నిధి తండ్రి ప్రేమ అన్నదమ్ముల వాత్సల్యం మైత్రి స్నేహం పాలన భార్యాభర్తల అనురాగం  

గుప్త నిధి రామాయణం



జనకమహారాజుకి భూగర్భమున ప్రాప్తి చెందింది జగన్మాత ,సీత ,శత సహస్ర కలబోత, దేవత, శివుని విల్లు ఇంటి నందు ఇల్లు ఊడుస్తూ ఉండగా ఒంటి చేతితో జరిపి ఇల్లు ఊడ్చే అది చూసిన జనకమహారాజు స్వయంవరం ప్రకటించే


శ్రీరామచంద్రమూర్తి  విశ్వామిత్ర

. ప్రియ శిష్యుడు సకల శాస్త్ర ఇతిహాస పురాణ గ్రంథాలు సకల విద్యలు కోవిదుడు శ్రీరాముడు జనకమహారాజు రాజ్యానికి విశ్వామిత్రుడి వెంట వెళ్ళసాగే


శివుని విల్లు విరిచి సీతను పరిణయమాడిన శ్రీరాముడు తండ్రి మాటకు అడవుల్లోకి వెళ్లి తమ్మునికి భరతునుకి పాదుకలు నొసగి పాదుకల రాజ్యాన్ని ఏలే


మారీచుడు బంగారు లేడి లా జగన్మాత సీతకు కనిపించి లేడి కావాలని అర్ధించే  రామునిని లేడి కొరకు రాముడు అడవికి వెళ్ళగా రాక్షస రాజు నిష్ఠా గరిష్టుడు దశకంఠుడు సీతను అపహరించి


దశకంఠుని వాదించే సీతకు అగ్నిపరీక్ష గావించి విభీషణునకు పట్టాభిషేకం గావించి అయోధ్యకు మహారాజుగా పరిపాలన గావించేసే లోకోద్దారకుడు శ్రీరామచంద్రుడు  


చతుర్విధ పురుషార్థములను రాముని శరణొందిన కలుగు జయము  కలుగువిజయము కలుగు సుఖము కలుగుమోక్ష ఫలము తొలుగు దుఃఖము ఇది నిక్కము. ........... 

**********

10/10/20, 6:29 pm - +91 94906 73544: మల్లినాథ సూరి కళా పీఠం

 ఏడుపాయల

 నిర్వహణ:: వెంకట్ గారు

 శీర్షిక:: రామాయణం

 

ప్రక్రియ:: గేయం

 రచన::యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డి



 దశరథనందన శ్రీరామ

 శంఖ చక్రధారి ఓ రామ

 అవతార పురుష శ్రీరామ

 ఆపద్బాంధవ మా రామ


   :: దశరథ::



 సీతాపతిగా జనహితుడు

 పితృవాక్య పరిపాలకుడు

 ఏక పత్ని వ్రతుడతడు

 ధర్మ నిష్ఠ గరిష్టుడు

 అన్న మాటనే ఆదిమూలము

 భరత లక్ష్మణ శత్రుఘ్నులు కు

 దుష్టశిక్షణ శిష్ట రక్షణ

 సద్గుణ రాముని కర్తవ్యం


    :: దశరథ ::


సార్వభౌమునిగా దేశ ప్రజలు

 స్వాగతాలు పలికే

 రాజ్యమేల మని పితృ దేవులు

 ఆజ్ఞ జారీ చేయ

 రాజమకుటమే   రాకకు

 ఎదురుచూస్తూ ఉండా

 సామ్రాజ్య లక్ష్మియే  రామ స్పర్శకు

 పరవశించి పోగా


     :: దశరథ::


కైక మాటలే దారుణం

 కారడవి పాలు చేయడం

 తాటకి వధతో మొదలుకావడం

 రావణునితో అంతమవ్వడం

 నర రాక్షస శాప విమోచన

 పుణ్యకార్యాల శ్రీకారం

 రామావతార కర్తవ్యం

 రసరమ్య శ్లోక ఆదికావ్యం


     :: దశరధ::


యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట

10/10/20, 6:31 pm - Sadayya: 🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

*మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల*

*సప్త ప్రక్రియల సింగిడి*

ప్రక్రియ: *పురాణం-రామాయణం రసామృతమ్*

నిర్వహణ: *శ్రీ బి వేంకటకవి గారు*


రచన: *డాక్టర్ అడిగొప్పుల*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*ధర్మంపు మూర్తియై, ధరణీజ భర్తయై*

*దశరథుని పట్టియై,దశముఖుని జెట్టియై*


*సొగసులో శిఖరమై,సుగుణాలవాలమై,*

*సాకేత రాయుడై, లోకమే నాకమై*


*లక్ష్మణుడె ఛత్రమై,లక్ష్మియే మొత్తమై*

*భరతుడే దాసుడై,మారుతియె భక్తుడై*


*వెలిసె నారాయణుడు, వలచె భూప్రజలెల్ల*

*మహతి చెప్పెను రామ మంత్రమే తారకము*


*ఆదర్శ జీవనము నందించ లోకముకు*

*మునివేష ధారియై వనమునకు తానరిగె*


*పతి విడిచి మనలేని పడతి జానకి కూడ*

*మునిపత్నియై భర్త వెనుక కానలకేగె*


*ఆదర్శ దంపతుల కందించ సేవలను*

*సౌమిత్రి వెంటేగె సౌభాగ్యమని తలచి*


*సమ పాళ్ళతో కొలిచి సరి గీచె పాత్రలను*

*వాల్మీకి కవిరాజు వసుధ జన హితముకై*

⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

10/10/20, 6:31 pm - B Venkat Kavi: *మీ రచనలు లెక్కలోనికి రాగలవు*


*రోజు వ్రాయాలంటే ఇబ్బందినే.కాని వ్రాయండి*


*ఈరోజు అంశం  పై ఎక్కవ రచనలు రావాలి*


*రామాయణం తెలియనివారుండరుగదా*


అందుకే నేడు 

*రామాయణం రसाమృతకావ్యం*


*కాలం పరుగెడుతుంది.కాని* *మనము కవితావిష్కరణకోసం*

*పరుగెత్తాలి*


*ఆ ఏముందిలే అనుకున్నామా*

*బద్ధకం మన వెంబడే* *ఉంటుంది.ఇంకా సమయం ఉందిలే అనుకున్నామా సమయం అయిపోతూనే ఉంటుంది.*

*అందువల్ల ఇప్పుడే చైతన్యం కావాలి*


కవితావిష్కరణకు రడీ కావాలి


*రచనలను వ్రాయండి.ఈ సమూహానికి పంపండి*

10/10/20, 6:31 pm - +91 94911 12108: మల్లినాథసూరి కళాపీఠం YP

అమరకుల దృశ్య కవి గారి ఆధ్వర్యంలో

నిర్వహణ : బి వెంకట కవి గారు

అంశం : రామాయణ రసామృత కావ్యం

రచన : పల్లప్రోలు విజయరామిరెడ్డి

శీర్షిక :   శ్రీ రామకథ

ప్రక్రియ : పద్యము


              సీసమాలిక

              **********

శీరాముచరితము శ్రీలుగురియజేయు

చదివిన విన్నను   ముదము గూర్చు


పుత్రకామేష్ఠిని     పుత్రులగోరిజే

య దశరథుడవని ముదముతోడ


నలువురుపుత్రుల ననయముబొందెను

శాస్త్రవిద్యల వారు చక్కనేర్చె


నస్త్రవిద్యలునేర్చెనడవియందునవారు

తాటకాదులగూల్చె  తనదునేర్పు


శివధనుర్భంగము జేయ సీతవరించె

కళ్యాణరాముడై  ఘనతగాంచె


తండ్రిమాటనిలుప తాపయనంబయ్యి

వనవాసమున్జేసి    వాసికెక్కె


నాలికోర్కెనుదీర్చ నమ్ముతో తాజంపె

మాయలేడినపుడు మర్మమెరిగి


దశకంఠుడేతెంచి    దశరథుకోడలి

నపహరించెను మాయ నడవియందు


సీతజాడదెలియ  న్చింతజేసిరివారు

జాడదెలియలేక  జాలిపడిరి


హనుమంతుడేతెంచి యానందముప్పొంగ

మైత్రికూర్చెనపుడు మహిమదెలిసి


వాలినికూల్చియు వానరముఖ్యుడ

జేసి సుగ్రీవుని   చింతదీర్చె


సీతజాడదెలిసి చిరజీవినేర్పున

మోదముగూర్చెను బాధదీర్చి


వానరసాయము న్వారధిగట్టెను

రావణుజంపెను రాఘవుండు


ధర్మమయ్యెనుజగతిని దాశరథియె

యన్నదమ్ముల కాదర్శ మయ్యెవారు

మిత్రభావమునందున మించినారు

పుత్రుడనభువిరాముడె పుడమియందు !!

                   🌏🙏🙏🙏🌏

10/10/20, 6:31 pm - +91 94906 73544: <Media omitted>

10/10/20, 6:38 pm - +91 94904 19198: 10-10-2020:-శనివారము.

శ్రీమల్లినాథసూరికళాపీఠం.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి.శ్రీఅమర కులదృశ్యకవిచక్రవర్తిగిరి సారథ్యం:

అంశం:-పురాణం

నిర్వహణ:- శ్రీ బి.వెంకట్ కవిగారు.

రచన:-ఈశ్వర్ బత్తుల.

ప్రక్రియ:-వచనకవిత.

శీర్షిక:-రామాయాణంరసామృతకావ్యం..!

#########₹₹₹₹#######

రామాయణం రసామృతకావ్యమై

రంజిల్లె ఇలలోన రామభక్తులకు.!

ఆరుకాండములుగానలలారే

బాలకాండయోధ్యకాండరణ్యకాండ

 కిష్కిందకాండసుందరకాండయు,

యుద్ధకాండముగపరిశుద్ధమాయె

వాల్మీకి గంటముందు ఘనతకెక్కె

ఇరువదినాల్గుశ్లోకాల ఇలలోన

విలసిల్లె వేదరామాయణ గాథ!


త్రేతద్వాపరయుగసంధికాలంబు

నవతరించెను రావణుడు లంకా

ధీశుడైన శివభక్తపరాయణుడు..!

ఆర్యులనణగదొక్కి,సాధుపుంగవు

లనుసంహరింప,అసురాధీశుడై..!

భయకంపితులైరి దేవతలు సైతం.!

నవగ్రహాలన్నిటినినణగదొక్కాడు.

ఇంద్రాదష్ఠదేవతలరచేతనుంచాడు

మదోన్మత్తుడైమహినతిరుగులేని

మానవులకు ముప్పుతిప్పలుపెట్టి

మారణహోమాన్నిసాగించగా...!

మునులు,దేవతలు వైకుంఠమున

కేగిమొరవినిపించగ దామోదరుడు

మాటాడకనూరకుండిన.... బ్రహ్మ.

దేవతలారా.!మునులారా..!మానవ

జీవనోద్ధరణకుమాధవుడుమహిన

మానవుడైజన్మించబోతున్నాడు.!

రామావతారమున రామునికితోడై

జాంబవంతునియవతారమెత్తెదను

యనియూరడించి పంపెను.


భారతాన్నిపాలించిరిసూర్యవంశ

రాజులెందరో..హరాశ్చంద్ర,దిలీపు,

రఘునాథమహారాజులెందరో..!

యావంశాంకురమే..!దశరథుడు.

సరయూనదీతీరానవెలిసెనయోధ్య

దానికిప్రభువుదశరథమహారాజు.

ఆయనకు మువ్వురు భార్యలు.

కౌసల్యా,సుమిత్ర,కైకేయిముచ్చటగ

పరితపిస్తున్నాడుకొన్నేళ్ళుగసంతా

నప్రాప్తికై..!అశ్వమేథ యాగాలు,

పుత్రకామేష్ఠియాగంబులుగావించి,

ఫలితానకల్గిరి నల్గురుకొమరులు.

కౌసల్యగర్భానకమలనిభుడుతారక

రాముడైజన్మించె,సుమిత్రకువాసుకి

లక్ష్మణుడిగానుకైకేయిగర్భానశంఖు

చక్రాదులు భరథశతృఘ్నులుగాను

కవలలై ఉద్భవించిరి యర్విలోన..!


విద్యనభ్యసించిరివశిష్ఠ,విశ్వామిత్ర

నాశ్రమమున నుత్తమశిష్యులై.

యజ్ఞాలు కాపాడతాటకిరాక్షసుల

సంహరించి,సజ్జనులనుకాపాడిరి.


మిథిలకు రాజు జనకమహారాజు

వరముకొరకుహలముబట్టెపొలము

దున్నగపసిపాపలాదొరికెనాగేటి

సాలునవజాతశిశువునందముగ

పెరిగిపెద్దాయెశివునివిల్లుకదిలించే

శూరురాలై,యదిగాంచి జనకుడు

స్వయంవరముబ్రకటించెయవనిలో

రావణుడు బంగపడెశివునిల్లెత్తగ

రాముడెత్తిశివునివిల్లువిరవగా...!

సీతరామునివరించెసమ్మోహనంగ

యదిగాంచిరావణుడుకక్షగట్టెను

సీతావ్యామోహమున...!


అయోద్యకొచ్చెరాముడుసీతతోడ

రాజ్యకాంక్షతోడకైకకుఠిలబుద్ధిజేత

కోరె రాముని నడవికిపంప..అంత

రాముడుపితృవాక్యపరిపాలకుడై

కానలకేగేసీతతోడపదునాలుగేండ్లు

అన్నతోడుగవెళ్ళెయాలక్ష్మణుడూ.

అదనుజూచియారావణుడుమాయ

లేడిగమారీచుని,సీతకోరికమేర

దానివెంబడించదారితప్పెరాముడు

అన్నజాడకేగెయాలక్ష్మణుడు అది

గని రావణుడు సీతనపహరించే..

వానరసాయంబునవాయుపుత్రుని

జేత యాసీతజాడనుగనిరాముడు

లంకకువారధిగట్టెవానరాదులతోడ

సాగరంబునుదాటి సంగ్రామంబున

దశకంఠునిదనుమాడె దాశరథీ..!


అయోధ్యకేగె యాసతి సీతతోడ

పట్టాభిషక్తుడైపరవశించువేళ

పరమనిందొచ్చెపట్టమహిషిసీతకు

నిందారోపణలకుతాళలేకరాముడు

నేలతల్లికూతురునుకానలకుపంపె

కానలలోనకలిగెకష్ఠాలుచూలాలికి

వాల్మీకి రక్షణనందు వనములోన

కొలువులకు కాన్పునిచ్చె జానకి.!

విద్యలభ్యసించిరి,ఆశ్రమవాసులై.

 రామునియశ్వమేధయిగంబు

నడ్డగించినెదిరించిరిరామలక్ష్మణా

దులనుయస్త్రశస్త్రములకుధీటుగ

విస్మయత్వముజెందిరి వీరు తమ

తనయులని ఆయుధంబులును

త్యజించిరిరామడేతమతండ్రియని

వినయంబుతోడవినుతిజేయ సీత

భీతిచెందియాదృశ్యముగాంచి..!

అమ్మ ఒడిజేరెసీత అవనిలోకి..!

భార్యలేనిజీవితంభారమయ్యె..!

అవతారముచాలించెశ్రీరాముడు.!

సంపూర్ణమాయె ..రామకథ..!

సజ్జనులకు వీనుల విందు గాను..!


#ధన్యవాదములుసార్#

     ఈశ్వర్ బత్తుల

10/10/20, 6:41 pm - +91 94904 19198: 10-10-2020:-శనివారము.

శ్రీమల్లినాథసూరికళాపీఠం.ఏడుపాయల.సప్తవర్ణములసింగిడి.శ్రీఅమర కులదృశ్యకవిచక్రవర్తిగిరి సారథ్యం:

అంశం:-పురాణం

నిర్వహణ:- శ్రీ బి.వెంకట్ కవిగారు.

రచన:-ఈశ్వర్ బత్తుల.

ప్రక్రియ:-వచనకవిత.

శీర్షిక:-రామాయాణంరసామృతకావ్యం..!

#########₹₹₹₹#######

రామాయణం రసామృతకావ్యమై

రంజిల్లె ఇలలోన రామభక్తులకు.!

ఆరుకాండములుగానలలారే

బాలకాండయోధ్యకాండరణ్యకాండ

 కిష్కిందకాండసుందరకాండయు,

యుద్ధకాండముగపరిశుద్ధమాయె

వాల్మీకి గంటముందు ఘనతకెక్కె

ఇరువదినాల్గుశ్లోకాల ఇలలోన

విలసిల్లె వేదరామాయణ గాథ!


త్రేతద్వాపరయుగసంధికాలంబు

నవతరించెను రావణుడు లంకా

ధీశుడైన శివభక్తపరాయణుడు..!

ఆర్యులనణగదొక్కి,సాధుపుంగవు

లనుసంహరింప,అసురాధీశుడై..!

భయకంపితులైరి దేవతలు సైతం.!

నవగ్రహాలన్నిటినినణగదొక్కాడు.

ఇంద్రాదష్ఠదేవతలరచేతనుంచాడు

మదోన్మత్తుడైమహినతిరుగులేని

మానవులకు ముప్పుతిప్పలుపెట్టి

మారణహోమాన్నిసాగించగా...!

మునులు,దేవతలు వైకుంఠమున

కేగిమొరవినిపించగ దామోదరుడు

మాటాడకనూరకుండిన.... బ్రహ్మ.

దేవతలారా.!మునులారా..!మానవ

జీవనోద్ధరణకుమాధవుడుమహిన

మానవుడైజన్మించబోతున్నాడు.!

రామావతారమున రామునికితోడై

జాంబవంతునియవతారమెత్తెదను

యనియూరడించి పంపెను.


భారతాన్నిపాలించిరిసూర్యవంశ

రాజులెందరో..హరాశ్చంద్ర,దిలీపు,

రఘునాథమహారాజులెందరో..!

యావంశాంకురమే..!దశరథుడు.

సరయూనదీతీరానవెలిసెనయోధ్య

దానికిప్రభువుదశరథమహారాజు.

ఆయనకు మువ్వురు భార్యలు.

కౌసల్యా,సుమిత్ర,కైకేయిముచ్చటగ

పరితపిస్తున్నాడుకొన్నేళ్ళుగసంతా

నప్రాప్తికై..!అశ్వమేథ యాగాలు,

పుత్రకామేష్ఠియాగంబులుగావించి,

ఫలితానకల్గిరి నల్గురుకొమరులు.

కౌసల్యగర్భానకమలనిభుడుతారక

రాముడైజన్మించె,సుమిత్రకువాసుకి

లక్ష్మణుడిగానుకైకేయిగర్భానశంఖు

చక్రాదులు భరథశతృఘ్నులుగాను

కవలలై ఉద్భవించిరి యర్విలోన..!


విద్యనభ్యసించిరివశిష్ఠ,విశ్వామిత్ర

నాశ్రమమున నుత్తమశిష్యులై.

యజ్ఞాలు కాపాడతాటకిరాక్షసుల

సంహరించి,సజ్జనులనుకాపాడిరి.


మిథిలకు రాజు జనకమహారాజు

వరముకొరకుహలముబట్టెపొలము

దున్నగపసిపాపలాదొరికెనాగేటి

సాలునవజాతశిశువునందముగ

పెరిగిపెద్దాయెశివునివిల్లుకదిలించే

శూరురాలై,యదిగాంచి జనకుడు

స్వయంవరముబ్రకటించెయవనిలో

రావణుడు బంగపడెశివునిల్లెత్తగ

రాముడెత్తిశివునివిల్లువిరవగా...!

సీతరామునివరించెసమ్మోహనంగ

యదిగాంచిరావణుడుకక్షగట్టెను

సీతావ్యామోహమున...!


అయోద్యకొచ్చెరాముడుసీతతోడ

రాజ్యకాంక్షతోడకైకకుఠిలబుద్ధిజేత

కోరె రాముని నడవికిపంప..అంత

రాముడుపితృవాక్యపరిపాలకుడై

కానలకేగేసీతతోడపదునాలుగేండ్లు

అన్నతోడుగవెళ్ళెయాలక్ష్మణుడూ.

అదనుజూచియారావణుడుమాయ

లేడిగమారీచుని,సీతకోరికమేర

దానివెంబడించదారితప్పెరాముడు

అన్నజాడకేగెయాలక్ష్మణుడు అది

గని రావణుడు సీతనపహరించే..

వానరసాయంబునవాయుపుత్రుని

జేత యాసీతజాడనుగనిరాముడు

లంకకువారధిగట్టెవానరాదులతోడ

సాగరంబునుదాటి సంగ్రామంబున

దశకంఠునిదనుమాడె దాశరథీ..!


అయోధ్యకేగె యాసతి సీతతోడ

పట్టాభిషక్తుడైపరవశించువేళ

పరమనిందొచ్చెపట్టమహిషిసీతకు

నిందారోపణలకుతాళలేకరాముడు

నేలతల్లికూతురునుకానలకుపంపె

కానలలోనకలిగెకష్ఠాలుచూలాలికి

వాల్మీకి రక్షణనందు వనములోన

కొలువులకు కాన్పునిచ్చె జానకి.!

విద్యలభ్యసించిరి,ఆశ్రమవాసులై.

 రామునియశ్వమేధయిగంబు

నడ్డగించినెదిరించిరిరామలక్ష్మణా

దులనుయస్త్రశస్త్రములకుధీటుగ

విస్మయత్వముజెందిరి వీరు తమ

తనయులని ఆయుధంబులును

త్యజించిరిరామడేతమతండ్రియని

వినయంబుతోడవినుతిజేయ సీత

భీతిచెందియాదృశ్యముగాంచి..!

అమ్మ ఒడిజేరెసీత అవనిలోకి..!

భార్యలేనిజీవితంభారమయ్యె..!

అవతారముచాలించెశ్రీరాముడు.!

సంపూర్ణమాయె ..రామకథ..!

సజ్జనులకు వీనుల విందు గాను..!


##ధన్యవాదములుసార్##

        ‌ఈశ్వర్ బత్తుల🙏🙏🙏🙏🙏

10/10/20, 6:51 pm - +91 94412 07947: 9441207947

మల్లినాథసూరి కళా పీఠం YP 

శనివారం 10.10.2020

అంశం. శ్రీ రామతత్త్వము

నిర్వహణ.బ్రహ్మశ్రీ బి వెంకట్ విశిష్ట కవివరేణ్యులు గారు 

=======================

కం.    1

రామా!రఘువంశజలధి!

సోమా! సురపతియునీవె శోభిత నామా!

ధామా!దనుజవిమర్దన

భౌమా!శ్రీ సార్వభౌమ!ప్రణవస్వరూపా!

తే.గీ.    2

ఎపుడు నేవేళ రాముని యపుడు బిల్వ 

తీర్చు కష్టాలు వెతలును తిమిరములును 

భవ్య!కారుణ్య పురుషార్థ!పరమపురుష!

నాదు పోషణ భారమ్ము నీది కాదె 

తే.గీ.    3

నూరు మందియు బ్రహ్మలు పోరుజేయ

నూరు మందియు రుద్రులు పోరుజేయ

నూరు మందియు నింద్రులు పోరుజేయ 

రాము గెల్వగ నెవ్వరు రారు సాటి

తే.గీ.    4

అతడె బ్రహ్మాండ సమవర్తి !యాదిమూర్తి!

రాజరాజుయు రాజేంద్ర రమ్యమూర్తి!

జానకీశుడు!లక్ష్మణ చక్రవర్తి!

హనుమ సుత్రామ వందిత ప్రణుతమూర్తి!

తే.గీ.    5

భక్తి రామాయణమ్మును పఠన జేయ

ముక్తి పొందుదు రంతట పుణ్య ఫలము

ఇహము పరమును సిద్ధించు నెల్ల యెడల

రామ కార్యము నెరవేరు రామకృపను

                 @@@@@@@@

-డా.కోవెల శ్రీనివాసాచార్య నిర్మల్

10/10/20, 6:53 pm - B Venkat Kavi: <Media omitted>

10/10/20, 6:55 pm - B Venkat Kavi: దయతో వినండి☝️

10/10/20, 6:56 pm - +91 91779 95195: మల్లినాధా సూరి కళాపీఠం y p

సప్త ప్రక్రియల సింగిడి

శ్రీ అమరకుల దృశ్య కవి

గారి నేతృత్వo

అంశం: రామాయణ రసామృత కావ్యం

శీర్షిక: అమృత కావ్యం

నిర్వహణ: శ్రీ బి వెంకట్ గారు

పేరు:రుక్మిణి శేఖర్

ఊరు:బాన్సువాడ

********************

క్రౌంచ పక్షుల జంట

కిరాతుని చేతిలో నేలకొరి గెను..........

వాల్మీకి హృదయం కరిగి

నోటి వెంట శ్లోకము జారె

శోకంలో ఒక శ్లోకం పుట్టే


ఆ బాధతో సప్త కాండాల రసరమ్యమైన ఆదికావ్యం

రామాయణం ఉద్భవించెను గా.....


24 వేల శ్లోకాలతో కూడిన అమృత కావ్యం......

ఈ అమృత కావ్యమే ఆదికావ్యమయ్యే.............

పుత్రకామేష్టి యాగంతో దశరథనందులు జననం..

వశిష్టుడి గురుకులంలో అక్షర నీరాజనం...........

విశ్వామిత్రునితో మిథిలా నగర ప్రవేశం.......

జనకమహారాజు జానకితో స్వయంవరం...............

పుత్ర వాత్సల్యానికి ప్రతీక..

అన్నదమ్ముల అనుబంధం..

భార్యాభర్తల అనురాగవ ల్లరి....

కైకేయి వాక్కుతో వనవాసం

....

రావణుడు సీతను అపహరించుట.........

వాలిసుగ్రీవుల తో స్నేహం..

ఆంజనేయుడునీ  హృదిలో నిలుపు కొనుట........

రామ సేతు కు వానర సైన్యం ఉడతా భక్తితోసహకారం.....

శబరి ఎంగిలి పండ్లను ఆరగించే.....

గు హుడి పడవలో కాలు మోపడం.......

రామ రావణ యుద్ధం....

రావణ బ్రహ్మ ను సంహరించే......

తిరిగి అయోధ్య చేరడం

సీతారామ రాకతో అయోధ్యలో సంబరాలు..

రాముడి పట్టాభిషేకం...

చాకలి వా డి మాటలకు అనుమానంతో మళ్ళీ వనవాసం.......

ఆ వాల్మీకి వనములో లవకుశ జననం....

సీత కోసం రాముడు పడే ఆవేదన.......

చివరికి భూమిజ భూమాత ఒడిలోకి అదృశ్యం............

రసరమ్యకావ్యమైన ఈ రామాయణం లో శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు గా అవనిలో అవతరించే.........

**********************

10/10/20, 6:57 pm - +91 94417 71955: మల్లినాథసూరి కళాపీఠం YP

పురాణం అంశం... రామాయణం రసామృత కావ్యం 

శీర్షిక... శ్రీరామ పావనచరితం 

పేరు... ముడుంబై శేషఫణి 

ఊరు... వరంగల్ అర్బన్ 

సంఖ్య... 255

నిర్వహణ... వెంకట్ కవి గారు. 

..................  

ఇక్ష్వాకువంశ ఇనకులతిలకుని జననం 

లోకపూజితం, పరమపావనం 

దశరథరాజు పుత్రకామేష్టి యాగఫలం 

రామలక్ష్మణ భరతశత్రఘ్నుల జననం 

నయనానందకరం, శుభప్రదం 


సకల గుణాభిరాముడు శ్రీరాముడు 

విద్య నేర్చె వశిష్ఠుని వద్ద 

యాగరక్షణకు విశ్వామిత్రుని వెంటచని 

బల అతిబల విద్యలు నేర్చి 

తాటక వధ గావించి 

అహల్యకు శాపవిముక్తి గావించిన పావనచరితం 

జనకుని విల్లు విరిచి 

పడతి జానకిని 

పరిణయమాడిన శుభతరుణం 

ఒకేమాట, ఒకటే బాణం 

ఒకే పత్ని యని చాటిన చరితం 


పితృవాక్య పరిపాలన చేయ

నీడవోలె లక్ష్మణుడు తోడై రాగా 

కాంతను గూడి వెళ్ళే కారడవులకు 

గుహుని అనుగ్రహించి పడవనెక్కి 

భరతుని కోర్కెపై పాదుకలొసగి 

విరాధుని విముక్తిజేసి 

శూర్పణఖ మాయలకు లొంగని 

పరమ పుణ్య రామచరితం 


దుష్టరావణ పన్నాగంతో 

బంగారుజింకగ మారిన మారీచుని 

ఒకే బాణంతో హతమార్చిన వైనం 


యతిరూపాన ఏతెంచి 

సీతాపహరణం చేసిన రావణుని 

సుగ్రీవునితో మైత్రి సల్పి 

వాలిని వధించి 

వానరసేనతో వారధికట్టి 

హనుమదంగదాదుల గూడి 

లంకను చేరి రావణుని కూల్చి 

అగ్నిపునీత అయోనిజతో 

అయోధ్యకు చేరి 

పట్టాభిషిక్తుడైన రాముని పుణ్యచరితం.

10/10/20, 6:59 pm - +91 94404 72254: సప్తవర్ణముల సింగిడి

*మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల

*వ్యవస్ధాపకులు, పర్యవేక్షకులు

*శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు

*అంశము: రామాయణం రసామృతకావ్యమ్

*నిర్వహణ:  శ్రీ బి. వెంకట్ కవి గారు

*తేదీ 10.10.2020 

*శీర్షిక: అనుబంధాల చరితం

 *ప్రక్రియ: వచనం

*****************************


మహాకావ్యం..పుణ్యచరితం..విశిష్ట గ్రంథం

వాల్మీకి రామాయణం..నిత్యపారాయణం

ఎదను పిండేసే కరుణ రసాత్మక కావ్యం

మనసును ఉత్తేజపరచే ధీరోధాత్తకథనం...


మనోశాస్త్ర విజ్ఞాన భాండాగారం..రామాయణం

మహామహుల మన్ననల పొందిన గర్వకారణం

కుటుంబ..స్నేహ..బార్యాభర్తలు..బంధాలన్నీ

కలబోత పోసిన సుగంధపరిమళాలు వెదజల్లే

అనుబంధాల చరితం...మహా గ్రంథరాజము....


ఆనాటి ధర్మవిచక్షణ..దుష్టశిక్షణ.. శిష్టరక్షణగా

అవతరించిన పాపపుణ్యముల సమతుల్యతను

విశిష్టత విరచిత నేటికీ ఆదర్శమైన పారాయణమే...

అడవుల్లో సంచరించిన శ్రీసీతారామలక్ష్మణులు

అష్టకష్టాలనోర్చి ఎందరికో ఆదర్శమైన వ్యక్తిత్వాలు


సంప్రదాయాలు..సంస్కృతులు..న్యాయాలు..

నియమాలు..ధర్మాధర్మాల వివరణాత్మక చరితం

నరుడే నారాయణుడిగా అవతారమే శ్రీరాముడు

మానవజీవితపు లోతుపాతులను విశదీకరణ కు

ఆదిమూలచరితం..అమూల్యమైన కవనము..


భక్తిమార్గాన్ని సూచించి రక్తిని ముక్తిని కలిగించే

పుణ్యమానసచరితము భక్తిపారాయణాతత్వము

హిందూసంప్రదాయాలకు అద్దం పట్టిన దైవచరితం...


వెంకటేశ్వర్లు లింగుట్ల

తిరుపతి.

10/10/20, 7:04 pm - +91 95502 58262: మల్లి నాధ సూరి కళాపీఠం yp

10-10-2020

అంశం:రామాయణ రసామృత కావ్యం 

రచన:శైలజ రాంపల్లి 

రామా దయరాదురా కీర్తన

నిర్వహణ:B. వెంకట్ కవి

"ఏలా దయ రాదురా రామ నీకెలా దయ రాదురా "

ఏలా దయరాదే నీకు నీ దాసులమైన మామీద ఏలా దయరాదురా మొరాలకించ

ఏలా దయ రాదురా  "

     "ఎలా దయ"

శరణాగతత్రాణ బిరుదంకితుడవు గాదా కరుణించి మమ్మెలు కాపాడ

వేల !

జాగు చేయకుమింక జానకీ రామ

నీ చరణములే శరణము మాకు

కరుణించి కాపాడు కారుణ్య రామా!

   "ఏలా  దయ "

10/10/20, 7:14 pm - +91 95420 10502: *మల్లినాథసూరికళాపీఠం yp*

           ఏడుపాయల 

శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తుల ఆధ్వర్యంలో....

          సప్తవర్ణములసింగిడి 

      10/10/2020 శనివారం

             *పురాణం*

అంశం: *రామాయణ రసామృతకావ్యం*

(సంపూర్ణ  రామాయణం పై)

నిర్వహణ:శ్రీ బి.వెంకట్ కవి గారు

రచన జె.పద్మావతి 

మహబూబ్ నగర్

శీర్షిక: *అమృతతుల్యం ఆదర్శజీవనం*

************************************

ధర్మార్థ కామ మోక్షములే పురుషార్థములు

మహాత్ములకు మోక్షసాధనే జీవనగమ్యం

ఆదర్శజీవనమే అమృత తుల్యం.

ఆదర్శజీవనానికి ప్రామాణం రామాయణం

రామాయణ కావ్యం నవరసభరితం

సప్తకాండముల సలక్షణ కావ్యం

వాల్మీకిరామాయణం నరులకు వరప్రసాదం

పుత్రకామేష్ఠి యాగ ఫలితం

రామలక్ష్మణ భరతశతృఘ్న జననం

అన్న దమ్ముల ఆదర్శానికి దర్పణం

యాగరక్షణార్థం విశ్వామితృనితో పయనం

గురుభక్తికి నిదర్శనం ఆపయనం.

సీతాస్వయంవరం,శివధనుర్భంగం, సీతారాముల కళ్యాణం

లోకకళ్యాణకారకం, ఆలూమగల అనురాగానికి సాక్షాత్కారం

మందరదుర్బోధ,కైకవరం,సీతారామలక్ష్మణ వనవాసం

కుత్సితాలకు తప్పని అగచాట్లని సందేశం

శూర్పనఖావమానము,రావణ దుర్బుద్ధి,సీతాపహరణము

వినాశకాలమునకు విపరీతబుద్ధియన్న సంకేతం

మిత్రధర్మానికి తార్కాణాలు

కొంతైనా కొండంతేనని తెలిపేది ఉడతాభక్తి

భక్తి ప్రాధాన్యతను చాటేది శబరిఎంగలిపళ్ళ సేవనం.

రామసుగ్రవమైత్రి,వాలివధ,హనుమద్భక్తి

భగవంతుని లీలగా అవగతం

సముద్రలంఘనం,లంకాదహనం,సీతమ్మజాడ 

స్వామి సేవాపరాయణతకు నిదర్శనం

దుర్మార్గానికి పరాకాష్ట రావణ సంహారం

నిజాయితీనిప్పులాంటిదని,

నిప్పును నిప్పు దహించలేదని

సుస్పష్టం సీత అగ్ని ప్రవేశం.

ధర్మాసనం ధర్మానికే ప్రాప్తమన్నది శ్రీరామ పట్టాభిషేకం

లక్షణకరమైనది లవకుశ జననం

అవతార సమాప్తికి సూచితం అవనిజ అవనిప్రవేశం.

ఒకేబాణమూ,ఒకటేమాట,ఒక్కభార్యకే రామునిప్రేమ

అందుకే ధన్యమైనది రామరాజ్యాన పుట్టిన మానవజన్మ

10/10/20, 7:22 pm - +91 99592 18880: మల్లినాధసూరి కళాపీఠము

సప్తవర్ణాల సింగిడి

10.10.2020

శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యములో

  శ్రీ బి. వేంకటకవి గారి పర్యవేక్షణలో

అంశం:పురాణం( రామాయణం)

డా . సూర్యదేవర రాధారాణి

హైదరాబాదు

9959218880


శీర్షిక: ధారణం


నిత్యపారాయణం

చెయ్యి రామాయణం

అవును కదా సర్వ పాప హరణం

దశరధమహారాజుకి శ్రీరాముడు ప్రాణం

అతనిని వదిలి ఉండలేడొక్క క్షణం

విశ్వామిత్రుడు కోరె యాగరక్షణం

విధిలేక పంపె రాముని , తోడుగ లక్ష్మణ

మారీచు సుభాహుల వధించె రామబాణం

నిర్విఘ్నముగా యాగము అయ్యె సంపూర్ణం


నాగేటిచాలున దొరికిన బిడ్డకు సీత గా

                           జనకుడు నామకరణం

శివధనస్సును విరిచిన రామునితో

                                   సీతదేవి కళ్యాణం

శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్త ఘోషణం

                        ప్రతి గుమ్మానికి కట్టె తోరణం

కైకేయి పట్టుదలన సీతారామలక్ష్మణులు

                                          వెడలె అరణ్యం

గుహుడు ప్రేమ మీర రామ సమూహానికి

                                       ఉత్తారణం               

శూర్పణఖ ముక్కుచెవులు కోసె 

                           శిక్షకు ఉదాహరణం

పర్ణశాలలో ఉంటూ సీత చూసి కోరె

                                          స్వర్ణ ఏణం

సీత కోర్కె మన్నించి రాముడు వెడలె

                      తెచ్చెదనని ఇచ్చి ప్రమాణం

కపట రావణుడు ముని రూపాన వచ్చి

                               చేసె సీతను హరణం

జానకిను వెదుకుతూ చూసె 

                          జటాయువు మరణం

 హనుమంతుని కలవడం

                 మారుతి రామబంటుగ ప్రమాణం

వాలి సుగ్రీవుల యుద్ధము - వాలిని

                              వధించె రామబాణం

       సీతను వెదక హనుమ వెడలె దక్షిణం 

        జలధి లంఘించి చేరె లంకా పట్టణం

        అమ్మను చూసె అశోకవనాన 

                            చేసె రామబాధ వక్కణం

         వారధి నిర్మించె సుగ్రీవ సేనల కారణం

                    రామరావణ సేనల భీకర రణం

 రామునిచేత బ్రహ్మాస్త్రముతో రావణుని                  

                                              నిష్క్రమణం

 పదునాలుగు సంవత్సరాల

                             వనవాసదీక్ష సంపూర్ణం

చేరె అయోధ్యకు  అయ్యె పట్టాభిషేకం

                               పురసేవకే కట్టె కంకణం

రామకధ విన్నా కన్నా వచించినా

                             దొరుకునెంతో పుణ్యం

రామ చరణం రామచరణం

అదే మాకు అన్ని వేళలా శరణం



ఇది నా స్వంత రచన

10/10/20, 7:22 pm - +1 (737) 205-9936: మళ్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

10/10/2020

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

అంశం..రామాయణ రసామృత కావ్యం

నిర్వహణ..బి.వెంకట్ గారు

శీర్షిక..రామాయణం నవరస భరితం..

-----------------------------------


ఆదికవి వాల్మీకి అందించిన రామాయణం అందరికీ ఆదర్శం

మానవకోటికి మార్గదర్శనం

జీవన విలువలు నేర్పు గ్రంథం


శోకం నుండి శ్లోకమై వచ్చె

బోయవాడు బోధియై ఇల వెలసె

నవరస భరితమైన

రామాయణ మహాకావ్య మందించి

మానవాళికి ధర్మమార్గము తెలిపె!!


పుత్రకామేష్టి చేయగా కలిగెను

సంతానము దశరథ మహారాజుకు

కౌసల్యకు శ్రీరాముడు 

కైకేయికి భరతుడు

సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు

వారి ఆటపాట అంతా  బాలకాండ!


విశ్వామిత్రునితో అడవులకేగి

యాగ సంరక్షణ చేయుచు

తాటకిని తుంచిన రాముడు

స్వయంవరములో శివుని విల్లును

ఎక్కుపెట్టి సీతను వివాహమాడెను


ఆనందంగా అయోధ్యలో కాలం 

గడుస్తుండగా కాల వైపరీత్యం

మంధర మాటలు విన్న కైకేయి

దశరథుడిచ్చిన నాటి మాటకు

కోరే వరములు రెండు కైకేయి

రాముని వనవాసం 

భరతునికి పట్టాభిషేకం

తండ్రి మాటకై కానలకేగే రాముడు

ఇది అయోధ్యా కాండం!!


నార చీరకట్టి నరుడైన నారాయణుడు

సీతా లక్ష్మణ సమేతంగా 

వనవాసం చేయుచు

మారీచుడు బంగారు జింకగ రాగ

సీతమ్మ రాముని తెమ్మని వేడుకోగ 

రాముడు వెళ్లే తదుపరి లక్ష్మణుడు

గీత దాటవద్దని చెప్పి గీసి వెళ్ల

మాయావి రావణుడు వచ్చి

సీతమ్మను ఎత్తుకొని వెళ్లెను 

అరణ్య కాండ ఆగమాగము

కర్మబధము తప్పించుకోలేరెవరు!!


సీతజాడ కొఱకు వెదుకుచు

రామలక్ష్మణులు సుగ్రీవుని చెంత చేరి వారి సహాయం కోరడం

వాలిని చెట్టు చాటున చంపడం

నరునికి వానరులకు మధ్య మైత్రి

కిష్కింధ కాండ!!


సీతమ్మ జాడ కొఱకు

సముద్రాన్ని లంఘించి లంక చేరి

అశోకవనంలో సీతమ్మను చూసి

రావణుని నీచ భాషణం విని వేదన

నిజరూపం చూపిన హనుమ   లంకా దహనం 

సుందరమైన విగ్రహ దర్శనం

సుందర దర్శనం సుందరాకాండ!!


రామ రావణ యుద్ధం

నారాయణుని చేతిలో రాక్షస సంహారం

ధర్మ రక్షణ దుష్ట శిక్షణ

యుద్ధకాండ!!


సీతాయణం ..వనవాసం

వాల్మీకి సంరక్షణలో సీతమ్మ

లవకుశ జననం

ఆది దంపతులు ఆదర్శప్రాయులు

సీతారాముల జంట 

ఇలకే తలమానికం

రామాయణ కావ్యం 

భారతీయ సంస్కృతికి ఆనవాలు

జీవితాలకు మార్గదర్శనం

భార్యాభర్తల అనురాగం

తల్లిదండ్రుల పై గౌరవం

ఒకే మాట ఒకే బాట

ఒకే బాణం ఒకే సతి

సాటి రారెవ్వరు సీతారాములకు

శ్రీ రామ చరితం అజరామరం!!

10/10/20, 7:26 pm - +91 93913 41029: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు..  

10.10.2020 

అంశం.. రామాయణం రసామృత కావ్యం రసభరితం  

పేరు.. సుజాత తిమ్మన 

ఊరు... హైదరాబాదు 

ప్రక్రియ ...తాత్వికత

శీర్షిక... శ్రీ రామాయణం 



********

నారాయణుడే నరుడిగా అవతరించినే 

దశరథుని పుత్రుడై ..కౌసల్య తనయుడై ..

లక్ష్మణ , భరత, శత్రుజ్ఞులకు అనుజుడై ..


విశ్వామిత్ర యాగముకాచి ..

స్వయంవరాన శివధనుసునే 

ఎక్కుపెట్టి, చేప్పట్టేనే జానకి మాతను ..


ముద్దుల సతి కైకేయి వరములడగగా 

మౌనముదాల్చిన తండ్రి మాటకై 

వనవాసముకేగె శ్రీరామచంద్రుడు ..

వెంట సతి సీతమ్మ , తమ్ముడు లక్ష్మన్నరాగా ..


నదిని దాటించ గుహుని నావ పావనమయ్యే 

మోహించి వచ్చిన సూర్పణఖ శిక్షార్హురాలయ్యె 

చెల్లెలికి జరిగిన పరాభవం పై ఉగ్రుడైన రావణుడు 

మాయలేడి నాటకం మారీచునిచే ఆడించి 

సాధువేషమున సీతమ్మను చెరపట్టుకుపోయే 


సీతా వియోగములో రామయ్య కోన కోన తిరుగుతుండ హనుమ ఎదురు పడి 

చేకొనిపోయే సుగ్రీవాదుల చెంతకు ..

మైత్రిసంధి చేసుకుని సుగ్రీవువితో ..

సీతజాడ తెలుసుకొమ్మని హనుమను పంపే 


సాగరాన్ని దాటుకొని లంకనుచేరి 

అశోకవనమున సీతను కనుగొనే హనుమ 

రాముని బంటునని ఉంగరము చూప 

సంతసించిన సాధ్విమణి చూడామణినిచ్చే తన గుర్తుగా 


కోతి అని హేళణ చేసిన రావణునికి 

బుద్ధిచెప్పను లంకను కాల్చెను మారుతి ..


రివ్వురివ్వున రామునిచేరి సిత జాడతెలిపి 

చూడామణిని ఇచ్చిన హనుమను ప్రెమగా హత్తుకొనే  రాముడు 


వానరసైన్యముతో వారధి కట్టి లంకనుచేరి 

యుద్ధభేరి మ్రోగించే సుగ్రీవాదులు 

అధర్మము ఎన్నటికీ నిలబడదని రుజువు చేస్తూ 

ఒక్కరొక్కరుగా నేలకొరిగిరి రాక్షస రాజులందరూ 

చివరి శ్వాసలో రాముడే శ్రీమహావిష్ణువుని ఎరింగి 

కైమోడ్చి నమస్కరించి నేలకొరిగే దశఖంఠుడు 


అపవాదును బాపుటకై అగ్ని పరిక్షనొసఁగ 

సీత పునీతయి భాసిల్లె ...


పూర్తయిన వనవాసముతో పుష్పకమందున 

అయోధ్యకేగిరి సీతారాములు లక్ష్మణ సమేతముగా ...


శ్రీరామ పట్టాభిషేకము జగతికి ఆనందాయకము 

వాల్మీకి విరచిత శ్రీరామాయణ మహాకావ్యం 

భారతీయిలకు, అమృతతుల్యంగా లభించిన వరం !!

******

సుజాత తిమ్మన 

హైదరాబాదు.

10/10/20, 7:36 pm - +91 80196 34764: మల్లినాథసూరి కళా పీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

శనివారం 10.10.2020

అంశం. రామాయణం

శీర్షిక.. శ్రీ రాముడు

నిర్వహణ.బ్రహ్మశ్రీ బి వెంకట్ విశిష్ట కవివరేణ్యులు గారు 

మరింగంటి పద్మావతి భద్రాచలం


మన్మధ స్వరూపా రామ చంద్రా! 


అయోధ్య వాసి వై 


అందరి బంధువై


సాకేత రాముడు వై


రామాయణ రసామృతుడవై


కిష్కిందప్రేమాన్వితుడవై


సుగ్రీవాభిమానివై


రారాజుగా రాక్షససంహారి వై


వీరాధి వీరుడ వై


ధర్మ పరిపాలనాపరుడవై


ప్రజా వాక్కు శిరసావి యై 


లలిత సుకుమారుడ వై 


దశరథకుమారుడు వై


రామాయణామృతాదారివై


వాల్మీకి రామాయణ రచనాంగకర్తవై


రామ రామ యనే రమ్యగీతికుడవై


భద్రగిరీశుడవై


ఏకపత్నీ వ్రతుడవై


పాపములను పారద్రోలి


భక్తులను కాపాడరామా! 


సీతమ్మను తోడ వెలిసి


గోదారమ్మ పరవళ్ళుమద్య


పర్ణశాల సోయగాలతో


నిత్యనూతన శోభతో 

వెలిగే భద్రగిరీశా ! 


కోటి ప్రణామములు🙏🙏

10/10/20, 7:43 pm - +91 99486 53223: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల .

సప్తవర్ణాల సింగిడి

అంశం :పురాణం 

నిర్వహణ  :శ్రీ అమరకుల దృశ్యకవి గారు , శ్రీ బి . వెంకట గారు

శీర్షిక: రామాయణానికి నాంది 

పేరు :మచ్చ అనురాధ 

ఊరు: సిద్దిపేట.


 సీసమాలిక పద్యం


 క్రౌంచ పక్షుల జంట కనువిందు జేయుచు 

కొమ్మపై ముచ్చట్ల కులుకులెన్నొ ,


వాల్మీకి  జూచుచు పరవశ  మొందగ

 వేటాడె పక్షిని వేటగాడు  ,


మగ పక్షి కూలెను మానవ వేటుకు

నేలకూలెనదియు   నెత్తు రొడ్డి  ,


విలవిలలాడుతు వేదన జెందుతు

 ప్రాణాలు విడువగ బాధజెంది ,


యెడబాటు జెం దియు  నేడ్చుచు

తల్లడిల్లెను పక్షి తట్టు కొనక ,


 కరుణరసము జాలు  కట్టలు దెంచెను

వెంటనే శ్లోకము వెలువడింది ,


రామాయణమునకు రమ్యమై నిలిచింది

మానిషాద మనుచు మనసునందు ,


అనుష్టుపు ఛందస్సు నాదేశ మును బ్రహ్మ

 శ్రీరామ చరితను శీఘ్రముగను ,


      తేటగీతి 


రచన జేయునీవని జెప్పె రమ్యముగను ,

 నారదుడు స్పష్టముగ దెల్ప నాంది పలికె ,

 రామకథవివరించగ  లలితముగను ,

 ఆదికవిగాను పేరొందె  యవని యందు.


🙏🙏

10/10/20, 7:47 pm - +91 99088 09407: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

పేరు:గీతాశ్రీ స్వర్గం

ప్రక్రియ:పురాణం

అంశం:శ్రీ రామాయణం

నిర్వహణ:శ్రీ బి. వెంకట్ కవి గారు

___________________________


మహర్షి వాల్మీకి విరచితం రామాయణం..

దుష్ట శిక్షణ శిష్టరక్షణకై

సాక్షాత్ భగవంతుడే మానవరూపుడై అవతారమెత్తిన శ్రీరాముని చరితం...


కర్తవ్యపాలకుడైన రాజు

ధనమానప్రాణాలను తృణంగా భావించి

ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి

ధర్మాన్ని నాలుగుపాదాలపై నడిపించిన ఆదర్శరాజ్యం రామరాజ్యం..


కేవలం తండ్రిమాటపాలనకై సత్యాసత్యాన్వేషణల యోచన మాని

మాతాపితరులపై గల గౌరవాభిమానాలు చాటుతున్న పద్నాలుగేళ్ళ వనవాసం


ఎన్నికష్టాలెదురైనా ఓర్పునేర్పు ప్రదర్శించి

ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అనే ఉత్తమవిలువలను ఆచరించి,పురుషార్థాలను జయించిన ఆదర్శమూర్తి ప్రబోధగీతం


పతియే దైవమని అంతఃపుర సుఖభోగాలను తృణప్రాయంగా త్యజించిన 

సాధ్వి సీతాదేవి సహచర్యం


అగ్రజుని అడుగుజాడలనే    జీవితంగా భావించిన

లక్ష్మణుని భాతృప్రేమ...

అన్నదమ్ములు భరతశత్రఘ్నులు చాటిన  అచంచల అభిమానము


అణువణువులో రామనామామృతాన్ని నింపుకున్న హనుమంతుని అశేషమైనభక్తి

స్వామిపేరు తలచినంతనే   అఖండబలశాలిగా మారే రామభక్తిలో దాగిన శక్తిసామర్థ్యం


వైదేహిజాడలో

ప్రాణాలనడ్డేసిన...

వసుదైకకుటుంబ భక్తిభావం... వారధినిర్మాణంలో వానరసేనను అందించిన సుగ్రీవుని స్నేహహస్తం...


ఇలా ఎన్నెన్నో పాత్రలు  ఏదో ఒకఆంతర్యం

ఏ పాత్రను గమనించిన

పరోపకారం, స్నేహం, ప్రేమా, గురుభక్తి గౌరవాభిమానాలు, ఆత్మీయతానుబంధాలు ప్రతిబింబించే శ్రేష్టమైన కావ్యం 


ప్రతీ మానవుడు విని వచియించి తరించవలసిన సుందర కావ్యం...

పురాణశాస్త్రాలలో ఆచంద్రతారార్కమై నిలిచిపోయిన ఉద్గ్రంథం...రామాయణం


 జై శ్రీ రామ్🙏🏻🙏🏻🚩

10/10/20, 7:47 pm - +91 99595 24585: *మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల* *సప్తవర్ణాల సింగిడి*

*ప్రక్రియ పురాణం*

*నిర్వహణ శ్రీ వెంకట కవి గారు*

*అంశం :  రసరమ్య కావ్యం*

*రామాయణం*

*పేరు : కోణం పర్శరాములు*

*ఊరు: సిద్దిపేట*

*శీర్షిక:.  రామ కథా రమ్యం*

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

రామ కథా రసరమ్యం

రామకథా అమృత తుల్యం

రామకథా వేదనా భరితం

రామకథా ప్రేమసుధ భరితం!


పితృవాక్య పాలన

కొడుకులపై తండ్రిప్రేమ

అన్నాతమ్ముల అనుబంధం

పతి భక్తి సతి భక్తి

పిన తల్లుల వాశ్చల్యం!


జనక మహారాజు

మమకారం

కౌశల్యా సుమిత్ర కైకేయి

అమ్మల అనురాగాలు

దశరథ మహారాజు పుత్ర

వాశ్చల్యం

శ్రీ రామ లక్ష్మణ భరత శత్రజ్న అన్నాతమ్ముల అనుబంధాలు!


రామ లక్ష్మణ గురుభక్తి

శిష్యులపై ప్రేమానురాగం

హనుమంతుని రామభక్తి

గరుత్మంతుని స్నేహభక్తి

సీతమ్మ పతివ్రతా శిరోమణి


ప్రజారంజక పాలనకు

ప్రతిరూపం

విశ్వామిత్ర మహర్షి తపస్సు

జనకరాజు సీతమ్మ కు 

స్వయం వరం 

అయోధ్య నగర ప్రజల

అపురూప ప్రేమా భిమానాలు

కష్టకాలంలో ఎలా మనో నిగ్రహం ఉండాలో

తెలియజేసిన కావ్యం

సీతారాముల కళ్యాణం

సీతాపహరణం రావణ

సీతమ్మ అశోకవన కష్టాలు

సుగ్రీవుని చెలిమి

వానరుల వారధి నిర్మాణం

రామరావణ యుద్ధం

సీతమ్మ అగ్ని ప్రవేశం

రామాయణ మహాకావ్యం

విన్నవారికి విష్ణు లోకాలు

చదివిన వారికి స్వర్గలోకాల

ప్రవేశం

పాడిన వాళ్ళకు పాపవినాశనం!


కోణం పర్శరాములు

సిద్దిపేట,9959524585

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

10/10/20, 7:47 pm - +91 73969 55116: మల్లినాథ సూరి కళాపీఠం yp

సుధా మైథిలి

అంశం:పురాణం

నిర్వహణ:బి. వెంకట్ గారు

10.10.2020

--------------

రత్న రాజo



అమ్మ నాన్నల అనురాగమైనా.. 

ఆలుమగల అన్యోన్యతయినా..

అన్నదమ్ముల అనుబంధమయినా.

గురు శిష్యుల అనురక్తయినా..

స్నేహ మకరంద మాధుర్య ఆస్వాదనయినా..

జీవ కారుణ్య భావనా సుగంధమయినా..

ప్రకృతి లాలనయినా..

పలు జీవిత పార్శ్వాలకు ప్రతీక యై

పారాయణ గ్రంథమే కాక

ఆచారణీయమౌ ఇతిహాస రాజమై..

ప్రకాశిస్తూ..

ధర్మబలపు మహిమేమిటో..

వినయమెంత ఘనమైనదో..

సత్యపాలనెంత మేలయినదో..

చాటిచెప్తూ..

ఉత్తమ ధర్మాచరణ ద్వారా..

మనిషి మనీషిగా ఎలా అవతరించగలడో..సందేశమిస్తూ

మూర్తీభవించిన ధర్మానికి ఆలంబనయై..

సత్యధర్మ స్వరూపమై..

న భూతో న భవిష్యత్ గా

సమున్నత సమాజ నిర్మాణమే సంకల్పంగా

సృజించిన కావ్య కల్ప తరువుయై..

ఆదికావ్యమై..

సీతాయా: చరితం మహితం.. అని కీర్తింపబడుతూ.

మానవ జీవిత సంస్కరణే ధ్యేయంగా ప్రభవించిన

అమృత కావ్యం. రామాయణం..

10/10/20, 7:48 pm - +91 79818 14784: సప్త వర్ణముల సింగిడి

మల్లినాథసూరి కళాపీఠంyp

అమరకల దృశ్యకవి సారధ్యంలో

నిర్వహణ: బి వెంకట్ కవి  10-10-2020

రచన: కట్టెకోల చిన నరసయ్య

ఊరు: బోదులబండ జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

అంశం: రామాయణం రసామృతకావ్యం 

శీర్షిక: కరుణ రసమయం 



 రామాయణం

 కరుణ రస మయం

 భక్తులకు పరవశమై పవిత్ర గ్రంథం

 సర్వ శృతులను ప్రతిబింబించే గ్రంథం

 లోకంలో ప్రసిద్ధమైన గ్రంథం

 రామకథను వినిపించిన గానం

 సీతారాముల కథను  ఆలపించిన గానం

 లవకుశల గానం రమ్యమైన గానం

 రామాయణం

 వర్ణించతగిన సర్వ వస్తు సామగ్రి

నవమికి అలంకరించిన అవని 

ప్రతి ఏటా

రాములోరి పెళ్లి రంగ రంగ వైభవం

10/10/20, 8:05 pm - L Gayatri: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

శనివారం ,10/10/2020

అంశం : పురాణం

నిర్వహణ : బి.వెంకట్ కవి గారు

రచన : ల్యాదాల గాయత్రి

ప్రక్రియ : గేయం


పల్లవి :

రామాయణ గాథ రమ్యమౌ చరిత

వాల్మీకి విరచిత దివ్యమౌ పుణ్యకథ


చరణం : 1

దశరథుని గారాల తనయుడే రామయ్య

జనకమహారాజు ప్రియసుత జానకమ్మ

శివధనుర్భంగముతొ ఏకమైన జంట

సీతారాముల కళ్యాణమే కన్నులపంట


చరణం : 2

పితృవాక్యపాలకుడే శ్రీరాముడు

ఏకపత్నీ వ్రతుడు జనహితుడు

ఏడుమల్లెలెత్తుగ ఎదిగిన సీతమ్మ

పతిసేవలోన పయనమాయె కానలకు


చరణం : 3

దశకంఠుని పరస్త్రీ వ్యామోహము

లోకమాత సీతను చెరపట్టెను

హనుమ స్వామిభక్తితో రాముడేతెంచెను

దుష్టశిక్షణతో లోకకళ్యాణమాయెను

10/10/20, 8:06 pm - +91 91774 94235: మల్లినాథ సూరి కళా పీఠం

సప్త వర్ణముల సింగిడి

నిర్వాహకులు..  

10.10.2020 

అంశం.. రామాయణం రసామృత కావ్యం రసభరితం  

పేరు..కాల్వ రాజయ్య 

ఊరు...బస్వాపూర్,సిద్దిపేట 

ప్రక్రియ ..పద్యం

శీర్షిక... రామకథ


1 ఆ వె 

బాదరాయనుండు  భాసిల్లె కావ్యంబు 

దార్శనికము గాను ధరణి యందు 

రాసి పేరు గాంచె రామాయణంబును

ఆదికావ్య మదియు హాయి నింపు 


 2ఆ వె 

తండ్రి మాట పైన తరలెను వనమందు 

ఆజ్ఞ మీరకుండ నాలితోడ

కష్ట మనక రామ కానలన్ని దిరిగి 

ధర్మ మార్గ మునకు దారి జూపె 


3ఆ వె

అత్త మామలాజ్ఞ నాది మరవకుండ 

సేవజేసె తల్లి పావనామె 

భర్త మార్గ మెంచి బాధలెన్నోపడే

సత్య వంతురాలు సాధ్వి సీత


4ఆ వె

రామకథవిన్న  రంజిల్లు మనసంత

జీవితాశయంబు జీర్ణమౌను 

పుణ్య మెంతొ గలుగు పురజను లంతకు 

సర్వశుభము కలిగి కర్మ తొలుగు

10/10/20, 8:07 pm - +91 96763 05949: మళ్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి

10/10/2020


*గంగాపురం శ్రీనివాస్*


అంశం..రామాయణ రసామృత కావ్యం

నిర్వహణ..బి.వెంకట్ గారు


*జీవన పారాయణం*


రామాయణం కేవలం

పారాయణ కావ్యమే కాదు

ఆచరణీయ జీవనయానం


పుత్ర వాత్సల్యతకు పుత్రకామేష్టి

అన్నదమ్ముల అనుబంధానికి ఆలవాలం

గురుశిష్య పరంపరల గురుకులం

తాటకి సంహార వీర యౌవనం

శివుడు కలిపిన చూపుల బాణం

వైభోగ సంకేతం సీతారాముల కళ్యాణం


పితృ వాక్య పాలనకు వనవాసం

ప్రకృతి ఒడిలోకి ఆహ్వానం

నార చీరల ధారణ అశాశ్వతకు దర్పణం


స్వామి భక్తికి నిదర్శనం హనుమద్రూపం

శక్తి సామర్ధ్య సాధన సాగర లంఘనం

పెద్దల పట్ల అణుకువ సూక్ష్మ రూప ధారణ

అహంకారానికి మారు పేరు దశకంఠుడు

గంజాయి తోటలో తులసి మొక్క వీభీషణ

విజయానికి మారుపేరు రామబాణం

సంబరాలకు ఆరంభం పట్టాభిషేకం

సుపరిపాలనకు గీటురాయి రామరాజ్యం


రామాయణం కేవలం

పారాయణ కావ్యమే కాదు

ఆచరణీయ జీవనయానం



       ....గంగాపురం శ్రీనివాస్

10/10/20, 8:16 pm - +91 98497 72512: మల్లినాథసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

అంశం....పురాణాలు(రామాయణ మహాకావ్యం)

శీర్షిక...ఏక కవిత రామాయణం

పేరు...యం.టి.స్వర్ణలత

నిర్వాహణ.... శ్రీవెంకట్ కవి గారు

తేదీ...10.10.2020



దశవతారాలలో ఒకటైన రామావతారం

భగవంతుడే మానవుడై అవతరించిన వైనం

దశరథుడి పుత్రకామేష్ఠి యాగఫలమున

కౌసల్య నందనుడై జన్మించినా

కైకేయి ముద్దుల తనయుడిగా ఎదిగి

శివధనస్సు నెత్తి సీతను పెళ్ళాడి

మందర మంత్రాంగముతో...

కైకమ్మ తండ్రిని కోరిన వరముల ఫలితంగా

తండ్రి మాట జవదాటని పుత్రుడై

కదలినాడు వనవాసం చేయ

పతిని అనుసరించి పయనమైంది సీతమ్మ

అన్న అడుగుజాడలను అనుసరించె సౌమిత్రి

పతి ఎడబాటుతో దీర్ఘనిద్రకుపక్రమించె ఊర్మిళ


అరణ్యమందు అందాల పర్ణశాల

అన్నావదినల సేవలో  లక్ష్మణుడు

అందాల నీలమేఘశ్యాముడైన

శ్రీరాముని మోహించిన శూర్పనఖ...

నేను ఏకపత్నీ వ్రతుడిని... 

నా తమ్ముడిని వరించమంటూ తెల్ప

లక్ష్మణుడి చేరిన శూర్పనఖను

ముక్కు చెవులు కోసి పంపంగా

అన్నగారైన రావణుడిని చేరి

సీత అందచందాలను వర్ణించి చెప్పి

అన్నలో సీతపై మోహాన్ని రేపి

రామరావణ యుద్ధానికి తెరతీసె


రామ లక్ష్మణ రక్షణలో ఉన్న సీతను

అపహరించలేక...

మాయా లేడిగా మారీచుని పంపగా

బంగారు లేడి అందాలుగని సీత

ఆ లేడి కావాలంటూ  శ్రీరామున్ని కోరగా

లక్ష్మణుని కాపలాగా ఉంచి...

లేడిని వేటాడుతూ వెళ్ళె రఘురాముడు

రామ బాణం దాటికి కుప్పకూలిన లేడి

హా..సీతా...హా లక్ష్మణాయంటూ నెరకొరగ

కీడు శంకించిన సీత...

రాముని జాడకై లక్ష్మణుని వెళ్ళమని కోరగా

ఏది ఏమైనా దాటకూడదంటూ...

గీసె లక్ష్మణుడు రక్షణరేఖ లక్ష్మణరేఖగా...


అదను చూసిన రావణుడు అపహరించె సీతను

హనుమ సుగ్రీవుల సాయంతో...

జరిగె రావణ సంహారం

అగ్ని ప్రవేశం చేసిన భూజాత సీతను గైకొని

అయోధ్యకేగగా...

అంగరంగవైభవంగా జరిగె శ్రీరామ పట్టాభిషేకం

10/10/20, 8:21 pm - +91 81794 22421: శ్రీ మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల 

🌈సప్తవర్ణ సింగిడి

నిర్వహణ: శ్రీ అమరకుల దృశ్యకవిగారు

                శ్రీ బి .వెంకట్ గారు 

పేరు… డా.ప్రియదర్శిని కాట్నపల్లి 

తేది :10-10-2020

అంశం :సంపూర్ణ రామయణం 



రామ రామ అని నీ నామము పలికిన 

శుకపికముల చిగురుమోవి మధురం మధురం 


తుషార వాయువుల రాగ నాదములతో ఊపి ఊపి బాలరాముని మోసి పవళింపజేసి పరవశించినట్టి ఊయల ఊయల 


విశ్వామిత్రుని ఆజ్ఞతో 

శ్రీ రాముని కరములు తాకెను విల్లు .పెళ పెళ ధ్వనితో నేలకొరిగిన శివుధనువు ధనువు 


ఆ విన్యాసము తిలకించి మురిసిన 

రామచక్కని సీత మోమున మెరిసిన 

నవ్వులే నవ్వులే 


తండ్రి మాటజవదాటని నందనుని పదునాలుగు లోకాలనేలు ప్రభువు త్రేతాయుగమున గడిపిన పదునాలుగు వసంతాలఅరణ్య వాసమంతా తనువునంటి పెట్టుకున్న నార చీరలు చీరలు 


రాముని పాదకమలములు తగిలి జడముగ పడియున్న కఠిన రాయి అహల్యగ మారిన శిల శిల 


గంగా నదిని దాటించిన నిషాద రాజు 

గుహుని పడవ పడవ 


లక్ష్మణుని చేత ఖండింపబడిన కామపిశాచి 

శూర్పనఖ ముక్కు చెవులు ముక్కు చెవులు 


హా..లక్ష్మణ యని ఎలుగెత్తి అరిచినా 

రాముని తలుచుకుంటూ అతని శరము చేత ప్రాణాలు ఒదిలిన మారీచుని తనువు తనువు


సీతమ్మ కబురునందించ పోయే ప్రాణాలను ఆపుకుని చకోరమై వేచిఉన్న 

జటాయువు ప్రాణములు ప్రాణములు 


శబరి తొలిచి ఇచ్చిన ఎంగిలి ఫలములు 

రాముని కెంజాయ పెదవులను తాకి ధన్యత క్రాంతి ని పొందినట్టి బదరీ ఫలములు ఫలములు 


కబంధుడు తెల్పిన ఆచూకిననుసరించి  వెళ్ళిన రామునితో చేసిన సుగ్రీవుని మైత్రి మైత్రి 


శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను ఆర్తితో 

చూచిన హనుమకనులు కనులు 


సహృదయ త్రిజటకు సీతకు శుభసూచకముగా తాను గనిన కల కల 


గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్న రాముని దూత జన్మము జన్మము 


"రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషించిన యుద్దము యుద్దము 


ధర్మనిరతిని లోకానికి నిరూపించి సీతను పునీతురాలిని జేసిన అగ్ని అగ్ని 

యముని పిలుపు మేరకు రాముని అవతార సమాప్తికి దోహదము అయ్యిన సరయూ

నది నదియేను 


మోక్షాన్ని పొందడానికి ఆచరించవలె ధర్మం.

అర్ధమును కామమును జయించే రామాయణ 

ధర్మముధర్మము 


హామీపత్రం :ఈ కవిత నాస్వీయము .ఈ సమూహము కొరకే వ్రాసితిని

10/10/20, 8:22 pm - +91 95536 34842: మల్లినాథసూరి కళాపీఠం

ఏడుపాయల

సప్త వర్ణాల సింగిడి-తాత్వికత

అంశం:- రామాయణం

నిర్వహణ:-శ్రీ బి. వెంకట్ కవిగారు

రచన:- సుకన్య వేదం

ఊరు:- కర్నూలు


వాల్మీకి బాధా తప్త హృదయం నుండి ఆవిర్భవించిన ఆదికావ్యం...

ఇరవై నాలుగు వేల శ్లోకాలు గల మహేతిహాసం...

పుత్రకామేష్టి యాగ ఫలమీ రామాయణం...

దశరథ నందనులచే అన్నదమ్ముల ఆత్మీయతనూ...

శ్రీరాముని ద్వారా ఏక పత్నీ వ్రత విధానమును...

సీతా మహాసాధ్వి చే పాతివ్రత్య ధర్మమునూ తెలిపిన చారిత్రక గాథ...

ప్రతి కుటుంబంలోనూ అనుసరించవలసిన ధర్మసూత్రాలెన్నో ఇందులో...

తండ్రి మాట జవదాటని తనయుడు రఘురాముడు...

అన్నను అనుసరించే వినయశీలి లక్ష్మణుడు...

అన్న పాదుకలనే ఏలికగా ఎంచి పరిపాలన సాగించిన ధర్మాత్ముడు భరతుడు...

అన్నదమ్ముల పట్ల ఐక్యత గలవాడు శత్రుఘ్నుడు...

పసితనంలోనే విశ్వామిత్రుని అనుసరించి దుష్టులను దునుమాడిన వీరగాథ...

కానలకేగమన్న కైకమ్మ మాటకు ఎదురాడక శిరసావహించిన స్థితప్రజ్ఞత...

వారధి నిర్మించడంలో ఉడుత సాయం...

రావణ సంహారంలో వానర సేన సాయం తీసుకోవడం 

రాయిగా మారిన అహల్యను నాతిగా మార్చిన రామునికి కష్టమా ఆపనులు..

వారికి భాగస్వామ్యమిచ్చి పుణ్యాన్ని ప్రసాదించడం తప్ప...

శబరి ఎంగిలి తిన్న రాముడెంత ఉదారుడో...

రాముని దర్శించిన ఆ శబరిదెంత భాగ్యమో...

రామ పాదాలు మోపిన ఆ గుహుని పడవ ఎంత పుణ్యం చేసుకుందో...

సీతమ్మ అగ్ని ప్రవేశ ఘట్టం జనుల నమ్మకం కొరకే కాదా...

అశోకవనంలో సీతా మాత చూపిన ధైర్యం తెగువా ప్రతి ఆపదలోనున్న మహిళకూ అనుసరణీయమే కదా...

మాతా పితరుల పట్ల లవకుశుల ప్రేమాభిమానాలు...

పెద్దలు పట్ల గౌరవమర్యాదలూ...

పిన్నల యెడల ప్రేమానురాగాలు...

మానవత్వం... రాజనీతిజ్ఞత...

ఒక్కటేమిటి...

అన్ని రకాల ధర్మాలనూ చక్కగా పొందుపరచిన నాణ్యత గల పేటిక ఈ రామాయణం...

ఇది ఆద్యంతం ఆదర్శనీయం...ఆచరణీయం...

అందుకే అన్నారు కాబోలు "రామో విగ్రహవాన్ ధర్మః" అని...!!

10/10/20, 8:26 pm - +91 98499 29226: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

ఏడుపాయల

అంశం    పురాణం 

              రామాయణం 

ప్రక్రియ.      వచనము 

రచన.        దార. స్నేహలత

నిర్వహణ. శ్రీ  బి. వెంకట్ కవి గారు 

తేదీ.          .10.2020


 భారతీయ వాఙ్మయములో ఆదికావ్యం రామాయణం

 ఆదికవి వాల్మీకి దేవనాగరి అను సంస్కృత భాషలో రచించిన మహాకావ్యము ఇరువది నాలుగు వేయిల 

శ్లోకములు ఏడు కాండములుగా శతకోటి అక్షరములు 

సీతారాముల పుణ్యచరిత జగతికి ఆదర్శ జీవనము 

రామ నామము మోక్ష ప్రదం సకల పాప హరము ఆంజనేయుని భక్తి భరితం సర్వులకు భక్తి ప్రబోధం 

మోక్షము పొందడమే జీవితము యొక్క గమ్యం 

ధర్మాచరణకు అర్థమును కామమును జయించడం  

సత్య వాక్కు తండ్రి మాట జవదాటక పోవడం 

ఏక పత్నీ వ్రతుడై శ్రీ రాముడు ఆదర్శ పురుషుడు 

జీవనపర్యంతమును ఏడు కాండములుగా 

మధురాతి మధురమై చెరకుగడలుగ యుండి 

ఒక్కో కాండము నందు ఉపభాగములు సర్గలు 

బాల కాండము  యందున  డెబ్బది ఏడు సర్గలు 

రామ జననం  శక్తియుక్తులు విశ్వామిత్రునితో 

ప్రయాణం యాగ పరిరక్షణ స్వయం వరం 

సీతారాముల కళ్యాణం జగద్గిదికి లోకకల్యాణం 

అయోధ్యకాండము నూరునుపంతొమ్మిది సర్గలు 

కైకేయి కోరికన సీతారాముల వనవాస వ్రతము 

అరణ్య కాండము డెబ్బది ఐదు  సర్గలు 

మునిజన సందర్శన రాక్షస సంహారం 

శుర్పనఖ భంగము సీతాపహరణము 

కిష్కింద కాండము అరువది ఏడు సర్గలు 

హనుమంతుడు సుగ్రీవుని స్నేహము గూర్చి

వాలి వధ సీతాన్వేషణ ఆరంభము 

సుందర కాండము అరువది ఎనిమిది సర్గలు 

హనుమా సాగరమును లంఘించుట 

లంకా దహనము సీత జాడను శ్రీ రామునికి 

తెలియజేయుట ఇందలి ఇతి వృత్తములు 

యుద్ధకాండము  యందు గల నూరును ముప్పదితొమ్మిది సర్గలు సాగరమునకు 

వారధి నిర్మించుట  రావణ సంహారం 

సీత అగ్నిప్రవేశం అయోధ్యకు రాముని  రాక 

పట్టాభిషేక మహోత్సవము రామరాజ్యము 

ఉత్తర కాండము సీతాదేవి అడవులకు పంపుట 

కుశ లవ ల పుట్టుక సీత భూమిలో కలిసిపోవుట 

రామావతార సమాప్తితో రామాయణం ముగుస్తుంది 

ధర్మం  నాలుగు పాదాలపై నడిచిన రామరాజ్యము 

నేటికీ  ఎప్పటికీ విశ్వ జగతికి ఆదర్శము విన్ననూ కన్ననూ కడు రమణీయము

10/10/20, 8:28 pm - +91 94902 35017: మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల

అంశం పురాణం

శీర్షిక సీతాకల్యాణం


ధరణీసుతయైన సీతమ్మ

జనకునియింటను కూతురై పుట్టింది

మారు చూడనట్టి రూపలావణ్యముల తోడ

వృద్ధి పొందింది

పండు వెన్నెలలు కురిపించు ఇందువదన తాను

కలువ కన్నులు కలిగిన కొమ్మ ఆమె 

చిలుక పలుకుల చిన్నెలతో

గజగమనగా తిరుగాడు చున్నది

బాలప్రాయమున చెలులతో ఆడుతూ అవలీలగా శివుని విల్లుతానెత్తే

అది చూసి జనకుడు ఆశ్చర్యమును పొందే

ఈ సీతను ఎవరికిత్తునని

ఆలోచన చేసే

పశుపతి చాపంబు పడగొట్టు వీరునికి

సుదతి సీతనిచ్చెదనని

స్వయంవరం ప్రకటించె

అతివ సీతను పొందగా

భూపాలులంతా ఆశగా వచ్చిరీ

శివధనస్సు నెవ్వరూ పట్టలేక

ఉసూరుమంటూ మరలి పోయిరి

అదిగో వచ్చినాడు అప్పుడే రఘువంశతిలకుడు!

జగములనేలెటి జగదభిరాముడు

విల్లు చేతబట్టి గుణ

ధ్వనులు చేయుచు

విరిచె  శివుని చాపము

సీత మనసు గెల్వగ....

హర్షించిరి సురులు

వర్షించిరి కుసుమాక్షతలు

సంతసించెను జనకుడు

కబురంపెను దశరథ మహారాజునకు

వేడుకతో ఏతెంచిరి 

అయోధ్య వాసులు

వియ్యమొంద మిథిలా నగరానికి...

శుభ దినమది

మీనలగ్నమున నిశ్చయించిరి

వివాహ ముహూర్తం

నవమన్మధుని మించె

శ్రీరాముని సౌందర్యం

అందాలభరిణ సీతకు

భువిన సాటి లేరెవ్వరు

కన్నుల పండుగగా సాగే పెండ్లి వేడుక 

కన్నవారి పుణ్యాల పంటగా

ముత్యాల తలంబ్రాలు

నీలమణులుగా....

రామునిపై మెరిసేను

కెంపులుగా సీత దోసిట మురిసేను 

మంగళ హారతులిచ్చి

దీవించిరి

పెద్ద ముత్తయిదువలు

ఇష్టమృష్టాన్నాలతో

విందు లారగించిరి జనులందరు...

సీతా కళ్యాణ వైభోగమిది

చదివినవారికి నిత్యకళ్యాణం కలిగించును నిజమిది



బి.స్వప్న

హైదరాబాద్

10/10/20, 8:30 pm - +91 94932 73114: 9493273114

మల్లినాథ సూరి కళా పీఠం పేరు. కొణిజేటి .రాధిక 

ఊరు రాయదుర్గం

 అంశం శ్రీరామ పావన చరితం నిర్వహణ.. వెంకట కవి గారు


రామాయణ మహా కావ్యం రసరమ్యం...

 మోక్షాన్ని ప్రసాదించే ముక్తిమార్గం..

 రామ రామ స్మరణే సర్వపాపహరణం...

 కట్టే కొట్టే తెచ్చే మూడు ముక్కలలో చెప్పే రామాయణ గాథను జనులంతా అనుసరణీయదగిన

 ఆచంద్రతారార్కమైన ఆధ్యాత్మిక గ్రంథం...

 దశరథ మహారాజు పుత్రవాత్సల్యం...

 శ్రీ రాముడి సౌశీల్యం... సీతాదేవి పాతివ్రత్య బలం.. ఆంజనేయ భక్తి తత్పరత... రావణుడు గొప్ప  శివ భక్తి తత్పరత...

మండోదరి భర్త పట్ల గౌరవ భావం...

 నాటికీ నేటికీ ఎప్పటికీ జనుల గుండెల్లో నిలిచిన కావ్యం...

నైతికతకు పురుడు పోసి,. సమాజ అభ్యున్నతికి ఆదికావ్యం వాల్మీకి విరచితం రాముడు జననం,

 సీతా కళ్యాణం,

 లవకుశల జననం

తలచిన తలపే  అలౌకిక అనుభూతిని మిగిల్చే ఆధ్యాత్మిక కావ్యం...

10/10/20, 8:31 pm - +91 80081 25819: మల్లినాథసూరి కళాపీఠం-సప్తవర్ణా సింగిడి.

శ్రీఅమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో. 

పురాణాంశం:రామయణం. 

శీర్షిక:మోక్షమార్గం ముక్తిదాయకం. 

నిర్వహణ:శ్రీ బి వెంకట్ కవి గారు. 

ప్రక్రియ:వచన ప్రక్రియ. 

రచన:శ్రీమతి:చాట్ల:పుష్పలత-జగదీశ్వర్. 

ఊరు:సదాశివపేట,సంగారెడ్డి జిల్లా. 


శ్రీరామచరితం సీతదేవిపవిత్రమంత్రం. 

అన్నదమ్ములఐక్యమత్యం అందరికి ఆదర్శపాత్రం. 

హనుమంతుని భక్తిహృదయరసం. 

సదా సన్మార్గం మరువని మహిలో 

శ్రీమహావిష్ణువుని మరో అవతారం. 

యుగపురుషునిగా మహిమణ్వితచరితం. 

శ్రీరామరసరమ్య రామయణం-జానకిదేవి సదా శ్రీరామప్రేమ కావ్యం. 

శివధనస్సును విరిచి సీతను పరిణయమడిన 

శ్రీరఘునందుని ఘణమైన కీర్తిప్రదాయం. 

ముగ్గురమ్మలా ముద్దులా రామచంద్రుడు 

తండ్రిమాటజవాదాటనీ దశరథతనుయుడిగా శ్రీరామ జననం. 

రసరమ్యనరామయణం కన్నవిన్నానుచాలు జన్మధన్యం. 

వాల్మీకిమహర్షికి వరించినారామయణ లిఖితం.అదికావ్యం ఇతిహసమై ఇలలో దొరికిన అదృష్టం. 

వేదవేదాలలో సంరక్షణ తారకమంత్రం. 

ఆలుమగలా అనురాగనికి ఒకేమాట ఒకేబాణం ఒకేసతి అనీ లోకాలకు కనువిప్పు కల్గించినాప్రేమాయణం. 

కష్టసుఖాలలో అడవులాగడిపినా చెర'గని' ప్రేమబంధం. మయలేడినిజూసి మోసపోయినజానకిదేవి లక్ష్మణరేఖదాటి సీతదేవిపడేనుకష్టం.రావణబ్రహ్మ సీతనుఅపహరించినా ఆధర్మ బుద్ధికి తగినగుణపాఠం నేర్పినధర్మమార్గం. 

సీతన్వేషణ సతిపతులా అనుబంధానికి పరిక్షపెట్టినకాలం. 

హనుమంతునీరామభక్తితో లంకదహనం 

శ్రీరామవారథి అంతా విజయం. 

అగ్నిపరిక్షపెట్టిన చెరగని బంగారుతల్లి పవిత్రపతివ్రత్యం. పవిత్రమాతగా లోకాలకుతెలిపినా నిజసాక్ష్యం. 

లవకుశలులా జననం సీతమ్మతల్లికి సంబురం. 

దుష్టశిక్షణ శిష్ఠరక్షణగావించి అయోధ్యపురమునా పట్టాభిషేకుడాయేను శ్రీరామచంద్రమూర్తి. 

భూమతఒడిలో మరళసేదతీరంగా ఐక్యమైయేను జననీ జనకమ్మ-వైకుంఠనిలయానికి పయణమయేను 

సీతలేని ప్రయ�

10/10/20, 8:33 pm - +91 98499 29226: "కంఠధ్వని"  స్పందన :

  శ్రీ మల్లినాథ సూరి కళా పీఠం ఏడుపాయల 

సప్తవర్ణాల సింగిడి 

నేటి అంశము పురాణము యందు నేటి అంశం 

*రామాయణము *గురించి అముల్యమైన ఆమోఘమైన శ్రీ  రాముని చరితమును 

  తెలుగు భాషా మాధుర్యంతో సుస్పష్టంగా ఓర్పుతో 

నేర్పుగా  మీ కంఠ స్వరాన వినినంతనే  మా కనులు వీక్షిణము  గావించిన  భావన కనులలో కదిలినది  

ధన్యులమైతిమి.🙏🙏

విశిష్ట కవి బి. వెంకట్ కవి గారికి ధన్యవాదములు.

 సప్తవర్ణ సింగిడి సారథి గౌరవ మాన్యశ్రీ 

శ్రీ అమరకుల దృశ్య చక్రవర్తి గారికి కృతజ్ఞతలు. 

       @ దార. స్నేహలత, గోదావరిఖని @

10/10/20, 8:35 pm - +91 98497 88108: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి yp

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి సారథ్యంలో

నిర్వహణ: వెంకట్ కవిగారు

అంశం:రామాయణం రాసామృత కావ్యం ( పురాణం)

రచన:గాజుల భారతి శ్రీనివాస్

ఊరు:ఖమ్మం

శీర్షిక:సంపూర్ణ రామాయణం


రామనామం సకల పాప హారణం

ఆదర్శ జీవనమునకు ప్రమాణం

రామాయణం నిత్య పారాయణం

సప్తకాండాలు కల కావ్యం

రఘుకులనందన రత్న దీపం

శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తు ల్యం రామనాధం వరాననే

భక్తికి,ముక్తికి రామాయణం

ప్రకృతి రమణీయ దృశ్యకావ్యం

రామాయణం రాసామృత కావ్యం

జగతిన నిలిచే రసరమ్య కావ్యం

ఎన్ని యుగాలు,తరాలు మారినా

బాతృప్రేమకు తార్కాణం

ఒక మాట,ఒక భార్య

భారతీయ సంస్కృతి

సాంప్రదాయానికి నిలువుటద్దం

శ్రీరామ బ్రహ్మస్రం

కోటి సూర్యుల ప్రకాశం

తండ్రిమాట జవదాటని ఆదర్శమూర్త్,ఆర్యపుత్రుడు,,లోక కర్త

ఉత్తమ జ్ఞాని రామచంద్రుడు

సీతాదేవి పునీత అని

జగమంతా ఎరగాలని

అగ్ని ప్రవేశాన్ని

మౌనంగా వీక్షించిన

ఉత్తమోతుడు

శ్రీ మాద్రా రామాయణం కన్నా,విన్నా

రమణీయం..కమనీయం..

అంతకు మించి ఆచరణీయమం


****************

10/10/20, 8:35 pm - +91 99519 14867: మల్లినాథసూరికళాపీఠం yp

ఏడుపాయలు. 

సప్తవర్ణసింగిడి. 


నిర్వహణ : శ్రీ బి. వెంకట్ కవి గారు. 


అంశం : (పురాణం )

రామాయణ రసామృత కావ్యం. 

పక్రియ : వచన కవిత


పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

నాగర్ కర్నూల్. 


శీర్షిక :సూర్యవంశ చరిత్ర . 


జీవిత పోరాటంలో 

కులవృత్తి కార్యంలో 

కుటుంబపోషణలో 

ఆహార అన్వేషణలో సాగగా 

చెట్టు పైన క్రౌంచ పక్షుల జంట 

విరహపు వలపులో విహరిస్తుంటే 

బాణనైపుణ్య లక్ష్యంతో 

ఒకే వెటుకు మగపక్షి 

 నేల కోరగగా ఆడ పక్షి 

కన్నీరు మున్నీరై విలపించగా 

ఆ దృశాన్నీ చూసి బోయవాడి 

హృదయం ద్రవించి

తన నోటి మాట కవితై 

శోకంలో శ్లోకం  ఉద్భవించి

శ్రీ సూర్యవంశ చరిత్రను 

శ్రీ రామాయణ గాథగా 

సంస్కృతంలో ఆదికావ్యగా 

విరించి రచించిన విపంచి 

మన ఆది మహాకవి వాల్మీకి మహర్షి. 


రామాయణ కథలో 

వైరుధ్యం వైవిధ్యం ఒసగును 

శ్రీరామచంద్రుడు మానమాత్రుడు 

దైవాంశసం భూతుడు 

తల్లిదండ్రుల ఆజ్ఞమీరానివాడు 

ఏకపత్నివ్రతుడు. 

రాముడి పరిపాలన దక్షత 

ప్రజల  రక్షణ. 

అరణ్యవాసంతో సహవాసం 

రాముని చరిత్ర రాయడం 

చదవడం వినడం 

ప్రతి ఒక్కరి  జన్మసుకృతం. 


 పోలె వెంకటయ్య 

చెదురుపల్లి 

9951914867.

10/10/20, 8:35 pm - +91 94913 52126: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

శనివారం ,10/10/2020

అంశం : పురాణం

*రామాయణం రసామృతకావ్యమ్*

నిర్వహణ : బి.వెంకట్ కవి గారు

రచన : డా.భారతి మీసాల

ప్రక్రియ : వచనం 


సూర్యవంశ తిలకుడు సుందరరూపుడు

సద్గుణాల రాశీభూతుడు శ్రీరాముని చరితే రామాయణం

మహాపూలమాలలో సర్వోత్కష్టమైన పారిజాత సుమమే రామాయణం

భారతీయ వాగ్మయము నందు ఆది కావ్యమే రామాయణం

భారతీయ సంస్కృతికి కండపుష్టిని,గుండెబలాన్ని

నిండుదనాన్ని సమకూర్చిన మనోహరమైన కావ్యం రామాయణం 

భారతీయ సంస్కృతిని శారీరక మీమాసంగా చిత్రించునది రామాయణం 

సనాతన ధర్మానికి మూలస్తంభం రామాయణం ఐహికసుఖాల పొందే అపూర్వ గ్రంధం రామాయణం

ఎన్ని దృక్కోణాలలో ప్రవచించినా రసజ్ఞులకు 

ఎదో నవ్యత గోచరించేదే రామాయణం 

వాల్మీకి విరచిత రామాయణంను ఎన్ని తీరులో రాసినా

 ఎన్ని మార్లు విన్నా 

ఎన్ని సార్లు చదివినా

 పునరుక్తి దోషం లేనిది రామాయణం 

నిసర్గరమణీయతతో నిత్యనూతనంగా సాక్షాత్కరిస్తుంది రామాయణం

జనకుని కుమార్తె జానకీ 

రఘుకులనందుని రాముని అన్యోన్య దాంపత్యమే ఆదర్శము

సుపరిపాలనను అందిచిన శ్రీరామరాజ్యమే  లోకానికి ఆదర్శము 

సప్తకాండలతో లోకానికి ఆదర్శoగా నిలిచిన ఆదికావ్యం అజరామరం  

రామగాధా పారాయణం సకలపాపహరణం

10/10/20, 8:37 pm - +91 98662 03334: మల్లినాథసూరి కళాపీఠం

సప్తవర్ణముల సింగిడి

అంశం : పురాణం : 

రామాయణం రసామృత కావ్యం

నిర్వహణ : శ్రీ బి.వెంకటకవి. 

పేరు : సిరిపురపు శ్రీనివాసు, హైదరాబాద్ 

తేదీ : 10.10.2020 

***************************************************

భక్తి వృక్షంపైన ఎక్కి సాధనా పల్లవములు తిని 

వాల్మీకి కోకిల చేసిన మధుర గానం రామాయణ రసామృత కావ్యం  

రామో విగ్రహవాన్ ధర్మః 

రాముడు ధర్మ స్వరూపుడు 

రామాయణమంతా ధర్మమయం 

పుత్రధర్మం, శిష్యధర్మం, బ్రాతృధర్మం, పతిధర్మం, రాజధర్మం, 

స్నేహధర్మం, ఆశ్రమధర్మం, రాజనీతి, రణనీతి

అన్ని ధర్మాలకు ఆలవాలం రామాయణం 

దుష్టశిక్షణ శిష్టరక్షణ భగవంతుని ధర్మం 


పౌలస్త్య సూతి వేదవేదాంగములనభ్యసించియు 

తన ధర్మమును వీడి రాక్షసత్వము నెరప 

సురుల రక్షించి మేదిని ధర్మస్థాపన జేయ 

సంతతికి వగచు దశరధుని పుత్రకామేష్టి ఫలమై 

శ్రీవిష్ణువు అవతరించే ధరణి 

శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న రూపుడై

కులగురువు వశిష్టు శుశ్రూష చేసి విద్యగరసే

లోకక్షేమముఁగోరు విశ్వామిత్రు వెనువెంటజని 

తాటక, మారీచ, సుబాహుల దండించి 

యజ్ఞ రక్షణ చేసే శిష్యధర్మంబు పాటించి 

కౌశికుని వెంటజని మిథిలానగరమునకు 

నాగేటిచాలున దొరికిన జనకరాజర్షి ఆత్మజ  

సీతను చేపట్టే శివధనుర్బంగమొనర్చి

పరశురాము గర్వము ఖర్వమొనర్చి 

కళ్యాణరాముడై అయోధ్యకేతెంచే సకలజనమనోభిరాముడై 

వార్ధక్యం మోయలేని భారమవ్వ 

రాజతిలకము రామునికి దిద్ద మనసుపడి 

జనపదుల, మంత్రుల రావించి నిర్ణయముజేయు 

దశరధుని మనసెరిగి మంధర 

పాలవంటి కైక మనుసు కలిచివేసే

దేవాసురసంగ్రామ ప్రాప్తిత రెండు వరములను గోరి 

శ్రీరాము కాననములకంపి, భరతు పట్టాభిషిక్తుజేయ గోరె 

పుత్రధర్మము పాటించి తండ్రి ఇచ్చిన మాట ఔదాల్చి 

నారచీరలుగట్టి, జడలు ముడివైచి సీతాలక్ష్మణ సహితుడై  

మౌనిధర్మము పాటించి దాశరధి బయలువెడలె

రామ వియోగము పరితపించి పరితపించి నృపతి 

నాటి శ్రావణకుమారుని తల్లిదండ్రుల శాపము 

నేడు శరాఘాతమై నన్ను నిహతుని చేయుచున్నవని దలచి 

రామా రామా యనుచు విగతజీవుడయ్యె దశరదుండు

గంగదాత యత్నించు రామవిభుని కనుగొని 

నిషాదరాజు గుహుడు మైత్రిమీర ఆతిధ్యమిచ్చె

గంగదాటి దండకారణ్యవాటిని జొచ్చి 

అగస్త్య, సుతీక్షణాది మౌనుల దర్శించి సేవించే 

పంచవటిని జేరి తపోదీక్ష నెరప 

కాముకయి చరించు కామరూపిణి సూర్పణఖ

నల్లనిమేని వాని జూచి మోహించ 

ప్రహసించి లక్ష్మణునికడకు పంపే రామయ్య 

అటునిటు తిరిగి అవమానమునెంచి 

ఘోరరూపమును దాల్చి సీతను మ్రింగబోయే రాక్షసి 

సరుగున పరుగుపెట్టి దాని ముక్కుచెవులను కోసే సౌమిత్రి 

ఆమె పంపిన వచ్ఛేడి ఖరదూషణాదుల గూల్చె దాశరధి 

తల్లిచేసిన నాకంటనీబోకు నీదు రాజ్యం నీవేలమంచి 

పాదములుపట్టి రోదించు భరతుని ఓదార్చి 

తనకు మారు పాదుకలను ఇచ్చే ధరణినేల

చెల్లి చెప్పిన చాడీలు మదిన తలచి 

మారీచు బంగారులేడి జేసి మాయపన్ని 

సీతను అపహరించే రావణుడు సన్యాసి రూపుడై 

అడ్డువచ్చిన జటాయువు రెక్కలు తెగనరికి 

లంకకు కొనితెచ్చే అమ్మ జానకిని కామసర్పద్రష్టుడై 

ఆశ్రమ వాటికలోన సీతను కానక 

కన్నీరు మున్నీరుగా విలపించి కౌసల్యాయాత్మజుండు 

చెట్టూపుట్టలా, కొండాకోనల వెదుకులాడే సీతకోసమై 

కబంధు హస్తముల చిక్కి శస్త్రమున ఛేదించి 

శబరికి దర్శనమొసగి ఆమె ఎంగిలి ఫలముల భుజించి 

కిష్కింద కేతెంచి సుగ్రీవునింగాంచి 

అగ్నిసాక్షిగా స్నేహధర్మమును పాటించి 

వాలిని తెగటార్చి కిష్కింద రాజునింజేయ 

అంట సుగ్రీవుండు వానర, భల్లూకముల దండురావించి 

అమ్మసీతను ధరణీయంతట వెదుకపంప

పవనసుతుడు సహస్రయోజన పర్యంత వారాశినిందాటి 

లంకను జేరి లంఖిణి నిర్జించి లంకలో జొచ్చి 

శింశుపావృక్ష ఛాయలోనున్న భూజాతనుంగాంచి 

ఆనందముప్పొంగ శ్రీరాము ముద్రికన్నిచ్చి 

చూడామణిని ఆనవాలుగా పొంది 

అశోకవనమును శోకవనముగా మార్చి 

అక్షయకుమారాది దైత్యులను ద్రుంచి 

రావణుని దర్శించి ధర్మము బోధించి 

చూచి రమ్మన్న కాల్చి వచ్చిన ప్రతీతి వెలయ 

తన తోకకు పెట్టిన అగ్గితోడ లంకను బుగ్గిచేసి 

శ్రీరామునిం జేరి చూచితి సీతననుచు క్షేమము దెల్పి 

వానరాదులగూడి వారధి నిర్మించి 

వారాశి దాటి లంకనే జేరి 

శరణన్న వైరి తమ్ముడు విభీషణుని బ్రోచి 

రావణకుంభకర్ణాది రాక్షసుల గూల్చి 

భువనైకమాత, భూజాత, సీతను చెర విడిపించి 

లోకాపవాదు మది నెంచి 

దరిజేరబోవు తరుణి శీలపరీక్షనుకోర

అగ్నిప్రవేశంజేసి పునీతయై నిలిచే అమ్మ 

సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకమును అధిరోహించి 

అయోధ్య కేతెంచి ఆనందముప్పొంగ 

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి 

అనుచు ఆనందాశ్రువులు రాల్చి అయోధ్యకు మొక్కి 

పట్టాభిషక్తుడయ్యె రామయ్య 

రామరాజ్యమను నానుడి నిలిచిపోవ

పదనొకండు వేల వత్సరములు భువినిపాలించే 

శ్రీరామభద్రుండు సర్వజనమనోభిరాముడై  

***************************************************

10/10/20, 8:37 pm - +91 98663 31887: *మల్లినాథ సూరి కళాపీఠం*

(ఏడుపాయల)

_సప్తవర్ణాల సింగిడి_

నిర్వహణ; శ్రీ అమరకుల దృశ్యచక్రవర్తి గారి నిర్వాహణలో..

అంశం: రామాయణం రసామృత కావ్యం.

నిర్వహణ : బి వెంకట్ కవి 

పేరు: గంగాధర్ చింతల

ఊరు: జగిత్యాల 

**** *** *** ** *** *** ****

సృష్టికే మహత్తర ప్రేమతత్వాన్ని తెలిపిన అద్భుత కావ్యం..

విశ్వానికి కుటుంబ బంధాల ప్రాశస్త్యం తెలియ చేసిన చరితం..

యుగయుగాలకు కూడా కనీవినీ ఎరుగని పవిత్ర ప్రేమకథనం..

అన్యూన్యమైన దాంపత్య జీవన విధానమంటే ఏమిటో  తెలిపిన ధర్మం..

భక్తితో పెట్టే ఎంగిలి ఫలమైన  పరమాత్మునికి నైవేద్యమని చెప్పే సత్యం..

నారాయణుడు నరునిగా భువికి విచ్చేసి మానవాళికి జీవన సత్యం తెలిపిన మహత్యం..

అధర్మం వల్ల ఎంతటివారైనా అదఃపాతాళం పడిపోక తప్పదని చెప్పిన మహత్యం..

పితృవాక్య పరిపాలన - అనిర్వచనీయమైన సోదర వాత్సల్యం..

ఒకే మాట ఒకే బాణం ఒకతే సతి అనే ఏక పత్నివత్యమనే జీవనమందించిన మహాకార్యం..

కిరాతకుడినే మహాకవిగా మలచి మహత్ గ్రంథాన్ని రచింపబడిన వరం..

సీతారాముల ఆదర్శ ప్రేమను సమాజానికి అందించిన మహాద్బాగ్యం..

ధర్మ రక్షణార్థం పంచభూతాలు సైతం పురుషోత్తమునికి అండగా నిలిచిన వైనం..

అద్భుత రామరాజ్య స్థాపన స్వర్ణయుగ పరిపాలన..

వానర నర నారాయణులు ఏకమై దానవత్వం పై ధర్మయద్దం లో విజయం సాధించిన పుణ్య చరితం..

లోకానికే ఆదర్శం నా శ్రీసీతారాముల చరితం శ్రీమద్రామాయణం.

**** *** *** ** *** *** ****

ఇది నా స్వంత రచన హామీ ఇస్తున్నా..

10/10/20, 8:41 pm - +91 96428 92848: మల్లినాథసూరి కళాపీఠం

అంశం:పురాణం

పేరు:జల్లిపల్లి బ్రహ్మం

శీర్షిక:ఆది కావ్యం

ప్రక్రియ:వచనం

నిర్వహణ:బి.వెంకట్ గారు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


మనిషి ఉన్నంత కాలం 

మనగలగే కావ్యం

మనిషిని మనీషిగా తీర్చిదిద్దే కావ్యం

కవికోకిల కవితి శాఖలనెక్కి అందంగా ఆలపించిన ఆది కావ్యం

ధర్మానికి పట్టాభిషేకం చేయించిన కావ్యం

మంచితనం లేని గొప్పతనం మట్టిపాలేనని నిరూపించిన కావ్యం

అన్నదమ్ముల అనుబంధాన్ని అందలమెక్కించింది అయోధ్య


అన్నదమ్ముల మనస్పర్థల మారణహోమాన్ని మన ముందునిలిపింది కిష్కింద


స్వార్థం తోనే సర్వనాశనమైంది లంక

కష్టాలలో నీడలాగ కదలి వచ్చిన జానకి దివ్యకథ

మర్యాద పురుషోత్తముని మహిమాన్వితమైన కథ

సకల సద్గుణాలకు రూపమిచ్చిన సరసమైన గాధ

10/10/20, 8:42 pm - +91 98496 14898: శ్రీ మల్లి నాథ సూరి కళాపీఠం

ఏడుపాయల

సప్తవర్ణముల సింగిడి

నేటి అంశం;రామాయణం రసరమ్యం

నిర్వహణ;బి.వెంకట్.

తేదీ:10-10-2020(శనివారం)

రచన; యక్కంటి పద్మావతి, పొన్నూరు.


ధర్మాలలో మరువరాని రామాయణసారం

చరితలలో రసరమ్యమైనది రామాయణం కావ్యం

వాల్మీకి విరచితం లోక ప్రసిద్ధం బహుసుందరం

ఆలుమగల అన్యోన్యత,అన్నదమ్ముల అనుబంధాల గుణాడ్యత

తండ్రిమాటకై తనయులశిరోధార్యత

ప్రజారంజక పాలనా ప్రాధాన్యత

గురుమాట కు విలువలు విధానం

రామాన్ విగ్రహవాన్ శ్రేయం

పంచవటీ సుందరతీరం

రామనిగ్రహం లక్ష్మణ నిష్కల్మషమైన సేవనం

సుగ్రీవ మైత్రి,ఆంజనేయుని భక్తితత్వం

సీతాన్వేషణ ఘట్టం

వానర బంధనం విభీషణ నీతివిధానం

బహుసుందరం లోకమే రామమయం.

చదివినా తలచినా పూజించినా పుణ్యఫలం

10/10/20, 8:45 pm - +91 94410 66604: వేదోరామాయణః

***************

వేదంలా వివరించిన కావ్యం

జీవం మానవకళ్యాణార్థం

చదివే పంచమవేదం

సృష్టి స్థితి లయ కారాలకు శ్రీకారం చుట్టి శృతిచేసిమనసును నడతతోనడకను నేర్పించే

సుందరకావ్యం 


తండ్రిమాటేవేదమైఅడువులను సహితం పూలవనాలుగా ఆస్వాదించిన కరుణరసాహృదయం కాలం చేతిలో రాజైనా భంటైనా బలిపశువులే ఆత్మస్థైర్యాన్ని

చేతపట్టి ఆలిని సహితం 

సురక్షితంగా  ధర్మమార్గాన్ని వదలక క్షత్రియ ధర్మాన్ని ఆచరించి కళ్యాణరాముడై రాజ్యమేలిన గుణదబి రాముడు  సతిపై పరులనిందని

పడనీయని అమృతమూర్తి


సత్యపాలనే పావనమని

సంసార సాగరంలో కన్నీళ్ళు 

దోసిలి పట్టి దాహం తీర్చుకున్న

రఘురాముడితడే..ప్రతిఇంటి

రామాయణంలో ఆలిని హృదిలో నిలపమని  పరులు

నిందించే కుసంస్కారం అలవర్చుకోరాదని తెలిపిన 

సీతారాముడితడే.. అయోధ్య ను ఏలిన లవకుశులతండ్రితడే


*************************

డా.ఐ.సంధ్య

సికింద్రాబాద్

10/10/20, 8:46 pm - K Padma Kumari: మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల

తేది. 10.2020

అంశం. రామాయణం.రసాత్మకం

శీర్షిక: ధర్మనిర్మాణం

నిర్వహణ. 

పేరు.డా// కల్వకొలనుపద్మకుమారి

నల్లగొండ


.సకలలోకవైభవసనాథమురామకథ

బృహత్రరకావ్యరసనిర్భరము వాల్మీకి‌గిరి‌సంభూతమానరామ

యణీ పునీత గంగాప్రవాహమే

మహావిష్ణువే‌ భువిచేర తానెంతరని

రామరసగంగా‌రమయణీయమై ప్రవహించె సుగుణధాముని రామునిసద్గుణముచాటగ పావనియై దశరథయాగ ఫలమై

జనించెశేషగదాశంఖములు సొదరులై‌సేవింప.మానవరూపము

ధరించెలీలామానుషరూపుడు

రామోవిగ్రహవాన్ ధర్మమై

పితృవాక్యపాలనాదక్ష సోదర

ప్రేమానురక్త అడవిలోనే.అయోధ్య

అనుకున్నమనో నిబ్బరమూర్తి.

గుహుని ప్రేమఆదరంబునస్వీకరించి

శబరిఎంగిలినారగించిన‌భక్తపాలకుడై

సుగ్రీవమైత్రీబంధలక్షకుడైనమిత్రరక్షా

హనుమభక్తిని‌మెచ్చిఆదరించి

ఏకపత్నవ్రతనిష్టడై‌సంద్రసేతువు

నిర్మించి.విభీషణుశరణరక్షచేసి

పలుసార్లురావణునిహెచ్చరించిన

సహనమూర్తి.రాజధర్మంబుపాటించి

దశకంఠు దునుమాడిన.వీరపురుష

సత్యవ్రత ఏ ఆశకులొంగని‌జానకి పతిభక్తిపాలనా

అర్థాంగిని.సమాదరింప

ప్రజాపాలనాదక్షాఈసులేక శౌర్యగర్వంబులేక.మానవజాతికి

హైందవ నీతినేర్పిన‌రామాయణం

మనజీవన పారాయణం నిత్యకృత్యం.ఆచంద్రతారార్కం

10/10/20, 8:49 pm - +91 94400 00427: *శుభసాయంతనము*💐💐


🚩 *శ్రీమల్లినాథసూరి కళాపీఠం- ఏడుపాయల*🚩

*సప్త వర్ణాల సింగిడి*

*తేదీ 10-10-2020, శనివారం*

*అంశం:-శ్రీమద్రామాయణము*

(ఈ అంశపై గేయం/కవిత/పద్యం ఏదో ఒక విభాగంలో రచనలు)*

*నిర్వహణ:-శ్రీ బి.వెంకట్ కవి గారు*

                 -------***-------

            *(ప్రక్రియ - పద్యకవిత)*


🕉️ *శ్రీ రామాయ నమః!*🌷🙏


తాపసి మానసమ్ము పరి-

   తాపము నొందగ నిచ్చినట్టి యా

శాపము శ్లోకమై వెలసె

  సంస్కృత కావ్యము రామ గాథగాన్

పాపి నిషాదుడాయె నొక

  పావన కార్య నిమిత్త మాత్రుడే-

రూపున వాగ్వధూటి తన

  రూప విలాసము జూపునో గదా....1


పితరుని వాక్య పాలనకు

  వేదన జెందక రామచంద్రుడే

సతియును లక్ష్మణార్యుడును

   చక్కగ రా, వని కేగినాడయా

వెతవడి కైకపట్టి యిక

  వేడిన గానియు గద్దెనెక్కకన్

సతతము మాటపై నిలచి

  సన్నుతి కెక్కెను పుణ్యమూర్తియై...2


వాలిని గూల్చి రాజ్యమిడె,

   భ్రాతకు స్నేహితుడైన హేతువున్;

పాలకుడైన గర్వితుని

  వధ్యుని జేయుట న్యాయమే గదా

యాలిని గూర్చి బాధపడి

  యశ్రువులన్ విడె ప్రేమ మూర్తియై

మేలుగ పోర నండజము

  మిన్నగ దాని నుతించె మాన్యుడై...3

(అండజము=పక్షి,జటాయువు)


వనచరు డాతడే యనెడి

  భావన జేయక ప్రీతి తోడుతన్

హనమను కౌగలించుకొని

  యాప్తుని రీతిని యాదరించె,నా

దనుజుడు రావణుం డలయ

   తాను వధింపక రేపు రమ్మనెన్

కనుగొన రామభద్రుడన

  కట్టుబడెన్ రణ నీతి కెప్పుడున్...4

(రావణుండలయ=రావణుడు అలసిపోగా)


శరణని వేడినట్టి ఘన-

   శత్రువు నైనను గారవించి యే-

మరకను లంక యేలికగ

  మాన్యత నిల్పుచు కీర్తిగాంచెనే

మరువక జన్మభూమి సుర-

  మాన్యము కన్నను గొప్పదౌననెన్

పరమపవిత్ర మానవుడు

  భారత జాతికి వేల్పు రాముడే...5


గిరులున దీనదమ్ములవి

   క్షీణము గాగను నిల్చు కాలమున్

ధరణిని రామకావ్యమది

  తప్పక యుండును కావ్యరాజమై

ధరణిజ సీతయే జనని

 తండ్రియె రాముడు లోకమంతటన్

స్థిరమగు కీరితిన్ వడసి

   తేజము గాంచును రామ గాథలున్..6


నడువుము రామచంద్రువలె

  నమ్ముము సత్యము ధర్మముల్ సదా;

విడువుము రావణస్తుతులు

  భీకర మాతని దుష్ట భావనల్

పుడమిని శ్రేష్ఠ మానవుని

  పోలిక జెప్పగ విష్ణుమూర్తి రా-

ముడగుచు పుట్టె సత్యముగ

  మోక్షమొసంగగ జీవకోటికిన్..7

   

🌹🌹 శేషకుమార్ 🙏🙏

10/10/20, 8:56 pm - +91 89852 34741: మల్లి నాథ సూరి కళాపీఠం ఏడుపాయల

10/10/20

 అంశం.... రామాయణం రసరమ్య కావ్యం( పురాణ) 

ప్రక్రియ...వచన కవిత

నిర్వహణ....బి.వెంకట్ కవి గారు

రచన....కొండ్లె శ్రీనివాస్

ములుగు

""""""""""""""""""""""""""""""""""

 **అందరి రామచంద్రుని చరితను**

**సుందరంగా మలచిన...**

**ఏడు కాండల కరుణామృతమే**

**పరమపావన గ్రంధం మన రామాయణం**


 **భారతావని జన బాధలు బాపి**

**ధర్మాచరణ కు మార్గం చూపే**

**మహిమాన్విత మణి మకుటం**

**ఆధ్యాత్మిక బాటలకు ఇది శకటం**


**మనో మలినము బాపి ...విలువలు తెలిపి**

**వెలుగులు పంచే ఆభరణం*

**ఎదుగుదలకు సోపానం **

**పునీతము చేసే నవనీతం**


**జగతిని చక్కబెట్టి,అసుర జాతిని మట్టుబెట్టి ..**

**దుష్ట గుణములు బాపి,నియమ నిష్టలు తెలిపెడి**

*"*రామాయణం చేతబట్టిన వాడు**

**సృష్టి లోన నష్టపోడు నరుడెవ్వడు ** 


**సబ్బండ వర్ణాల నైరాశ్యం బాపెడి**

**ఉద్దండ పండితుల భాష్యాలు తో**

**వందలాది గ్రంధాలు ఇల సందడులు జేసే..**

**నవ్యకాంతుల రామాయణ రసరమ్య కావ్యముండగా...**

**ముందు తరములకిక రందులేల**

10/10/20, 8:57 pm - Velide Prasad Sharma: *రామాయణం మహాభాగ్యం*

                (ఆశుపద్యాల మాలిక)

పరమేశ్వర వరపుత్రక

కరిముఖమును కల్గినట్టి కమ్మనిదేవా!

వరమొసగుము సరిబ్రోవగ

విరచించెద రామకథను వేకువ తోడన్!..1


గౌరీ శంకర!వేడెద

శౌరీ నిను మనసులోన శక్తిగ నిల్పిన్

రౌరవ రోగపు బాధల

గౌరవముగ బాపుమయ్య కరుణించుడికన్!..2


శ్రీనరసింహుడ!వేల్పుగ

మా నర నరమునడయాడిమాన్యత నొప్పన్

కానగ శక్తిని యొసగుమ

ఆ నరహరి రాముగూర్చి హాయిదెల్పన్!..3


అమ్మా శారద మాతా

కమ్మగ నానాల్కపైన కదలుచు నికపై

కమ్మని రాముని చరితను

దమ్మున సరిరాయబూన దక్షత నిమ్మా!..4


పండితులెల్లరు కనగనె

వెండిగ నేనింక వ్రాయ విధిగా దలతున్

గండము దాటగ కవివర!

నిండగు మీ మనసుతోడ నిడుదీవెనలున్!..5


వినయమ శాంతము  కరుణయు

ననయము సరిగాచం గుణము నమ్మిక కలిగిన్

కనివిని యెరుగని శౌర్యమె

ధనముగ మరికల్గినట్టి దక్షుడు రామున్!..6


రాముని చరితను విన్నను

రాముని కథలు విరచించ రమ్యమెయౌనున్

రాముని నామము మధురము

రాముని నేదలచినింక వ్రాసెద కథయున్!..7


అదియొక నయోధ్య పురముర!

నదియౌ సరయూతటినిల నడయాడినదిన్

బుదులకు యోధులు నేరికి

యెదిరించగ నలవికానియింపగు నెలవున్!..8


ఇనకుల వంశజులందున

ఘనతర శుభపేరుగాంచె ఘటికులెయగుచున్

కనుమిక దశరథ విభునిట

మనెనాతడుయోధుడౌచు మంగళమూర్తిన్!..9


ఇచ్చిన మాటలదప్పరు

మెచ్చిన ఘనవరములొసగి మేలునె జేయున్

వచ్చిన వారలకొసగెడి

కచ్చిత శుభ దాన సుగుణ కమ్మని రాజున్!..10


రాజుకు మువ్వురు రాణులు

మోజుల మురిపెంబుదీర్చు ముదముగయెపుడున్

జాజుల మల్లెల మనసున

రాజుకు మరిసంతు లేని రౌరవ బాధన్!..11


దీర్చగ దలచిరి విబుధులు

చర్చల శుభవిషయమది చయ్యన దెల్పెన్

అర్చన యాగము సేయగ

ఖర్చుకు వెనుకాడకుండ కదలెను నాడున్!..12


కామేష్ఠియాగ ఫలమున

కామితమదితీరగోరి కమ్మగ ఋషులున్

రామంబుగ దీవెనొసగ

క్షేమంబుగ కల్గె సంతు క్షితివల్లభుకున్!..13


కోసల రాణికి రాముడు

యాసతికిని చెల్లెలైన యాయిర్వురకున్

గోసలు తీరగ బుట్టిరి

శ్వాసగ లక్ష్మణ భరతుడు శత్రఘ్నుడునున్!..14


మోదమునందిరి దశరథు

మోదమునందంగ మనిరి ముదముగ రాణిన్

మోదము నందె నయోధ్యయు

మోదముతో గాచె రాము ముఖ్యముగపుడున్!..15


రాముని యల్లరి మాన్పగ

గోముగ నాయద్దమందు గుర్తుగ చంద్రున్

కామితమైజూపగనే

రాముడు మరిసంతసించె రమ్యపు మోమున్!..16


దశరథు చెంతకు నొకపరి

విశదము చేబూని వచ్చె విశ్వామిత్రున్

వశమును చేయుము రాముని

దశరథ!నేగొనుచు వెళుదు దబ్బున వనమున్!..17


హా!విశ్వామిత్ర ఋషీ!

హే!వర గురువర్యవినను హీనుడ నేనున్!

ఆ వరమున గనితిని కద

నా వరముల రామునిటుల హా!గోరితిరే!.18


అనవిని ఋషివరు నుడివిరి

కనుమో దశరథ!రాముని

ఘన శౌర్యుడతండు!రామ!ఘనగుణశాలిన్

వినుమిక వెరువకు మికపై

చనగను నావెంటపంపు చతురత నొప్పన్!..19


అంతటి విశ్వామిత్రుడె

వింతగ నారాముగోర వేదనయేలన్

కంతుని రూపము శౌర్యము

కాంతును నేనంపి రాము కమ్మగ ఋషితో!..20


అనుకొని మాటను నిల్పగ

గొనకొని వెడలుమయ్య గుబులేయుండన్

వనమున కరుగుము రామా!

వినయముగా మసలుకొమ్ము వెడనడ ఋషితో!..21


అనియెడి పల్కుల వినుచునె

కనుసైగలతోడ రాము కదిలెను మునితో

తనవెంటనెలక్ష్మణుడట

యనుసారియెయయ్యెజూడ నలరుచు నపుడున్!..22

విశ్వామిత్రుడునత్తరి

విశ్వాసము మనసునిండ వెలుగొందగనే

నశ్వరమౌ జీవితమున 

ఆశ్వాసము రాముడయ్యె నంతట చనుచున్!..23


వెడనడె రాముడు లక్ష్మణు

వెడలుచు మరివినుచునుండె విపులవిషయమున్

కడువడి జెప్పెడి మునివరు

విడువక సరిగొల్చుచుండి విధిగా.నేర్చెన్!..24


గురువుల మాటను మీరక

పరువుగ సరి విద్యలన్ని పట్టుచు నిల్పెన్

విరివిగ వినయము  తోడుత

మరువక సరిగొల్చె రాము మాన్యుడెయగుచున్!..25


రాముని భక్తికి యుక్తికి

సోముని శుభమనసుతోడ సూక్ష్మపు విద్యన్

కామిత మొప్పగ జెప్పెను

శ్రామిక ఘనమూర్తియగుచు శ్రావ్యముగపుడున్!..26


రామా!పూర్తయె విద్యలు

నామానసమది ముదంబునందినదయ్యా!

రామా!దివ్యాస్త్రము గొను

మా!మాయాసురను దునుము మాకది తుష్టిన్!.27


అన విని రాముడు చిత్తము

యని గొనెనికయస్త్రములపుడార్థిగ నడచిన్

మునివర!గురువర! యానతి

యనుదినముగదాల్తునేను యశమును బెంచిన్!..28


రాముని మాటల మహిమను

గోముగ మరివినిన మునియు గూర్చొనె తపమున్

నేమము దప్పక రాముడు

ఆ ముని యాగము నుగాచె నసురుల !దునిమిన్!.29


సంతసమందిరి యందరు

సంతసమందిరి మునులును సత్వరమపుడున్

సంతసమోరామా!యిక

సంతసమగు శుభము నీకు సద్గుణ శీలా!..30


అనుచునె దీవెనలొసగిరి

ఘనముగ నా చిరుత ప్రాయ ఘనగుణ రామున్

వనమున శౌర్యము జూపగ

చనిరిక యందరపుడు వడి జనకుని పురమున్!..31


పురమున జనకుడు బాధగ

కరమును జోడించి నుడివె కర్ణముజేరన్!

వరముగ పుట్టిన సీతకు

వరుడిల కనిపించడయ్యె వర ముని!యనగన్!32


జనకుడ!వగచకు నీవిక

కనుమిక మా రామునిపుడె కమ్మని వాడున్

చనుమిక దేవర మందిర

ఘనమగు శివదనువు దెచ్చి ఘనముగ జూపన్!33


మునివర పల్కుల దాల్చుచు

జనకుడు మరిజూపె ధనువు జానకి తోడన్

కనుమిక రామా!కావుమ!

చనుమిక యీదనువునెత్త చయ్యన రమ్మా!34


అను పల్కులవిని రాముడు

ముని పాదము మ్రొక్కినంత ముదముగ సీతన్

కనుచునె ధనువును దడిమెను

మనమున శివ స్మరణదాల్చి మరియిటుపల్కెన్!..35


అయ్యా!జనకుడ!వినుమా!

చయ్యన మరిదీనియెత్త చచ్చును తునకై

ముయ్యుడు మీనోళ్ళిక మరి

యియ్యనువున యెత్తుదేను ఈశ్వర దనువున్!..36


పల్కిన మోమును జూచిరి

యుల్కక పల్కక నిలుచుని యునికిని మరచెన్

కల్కియొ మాయయొ తెలియక

కుల్కుల సీతమ్మ జూచె కుదురుగ రామున్!..37


ఒకచూపు సీత ముఖము

నొకచూపును రాజులందునొక్కొక్కరిపై

నొకచూపు గురువు పాదము

నొకయించుక దనువుజూచెనోర్వక రామున్!..38


చీపురు పుల్లగ దలచుచు

నూపురమును వంచియెత్తె నుత్సాహముతో

యోపక దనువును వంచుచు

నాపక యాయల్లె త్రాడు నటకట్టెనికన్!..39


గుట్టగ ఘనతర మ్రానుగ

పట్టగ పదియారుకోట్ల భటులట.లేపన్

పట్టున లేవనిదనియెడు

తట్పుగ బలమంత నొకడె తనరగ గలిగెన్!..40


అనుకొనుచుండగ రాముడు

గొనకొనియాదనువునంత గురివెట్టంగన్

వినగను లేని స్వనమున

కనుగొన.లేనట్టివిధము ఘణముగ విరిగెన్!..41


విరిగిన దనువును జూడగ

విరిగెను పరరాజుశౌర్య వెలుగులెయన్నిన్

విరిగెను అనితర భావన

పెరిగెను శుభకీర్తి రాము ప్రియమునె గూర్చెన్!..42


జనకుని మానస మంతయు

కనివినియెరుగని విధంపు కమ్మని తుష్టిన్

తన మది బాధల బాయగ

మునివర శుభకృపన రాము మోహము నిండెన్!..43


సీతా దేవీ మనసున

నీతావున కొలువుదీరె నేర్పుల తోడన్

శ్రీతాండవ శుభముఖమున

సీతయు మరివెల్గెనంత శ్రీరామునితో!44


జనకుడు సంతస మందెను

వినయముగా నుడివె నిటుల వెల్గిన మనసై

అనఘా!మునివర! గురువర!

ఘనముగ మాసీత నిత్తు ఘనరామునకున్!45


విషయము బనిచెద నంతట

విషయము మరిదెల్పుదేను వెంటనె యిపుడున్

విషయము దశరథ రాజుకు

విషయములో పనిగ మిగులు గూతుల నిడిదెన్!46


దశరథ కొమరుల పెండిలి

దశదిశలన మ్రోగుచుండ ధరణిన వేడ్కన్

దిశనాయక సురవర తతి

దశమీ మునుముందు తిథిన దప్పక జేతున్!47


మాటలు వినుచునె సెలవనె

తేటగ మరిపల్కి రంత తీయగ నపుడున్

చేటిక లేదిక రాదని

దీటుగ మరిపల్కివెడలె ధీశాలురునై!..48


దశరథుడంతట బనచెను

వశిష్ట మునివర సుమంత్ర పరివారములన్!

విశదము చేసిరి పెండిలి

విశిష్ట సుముహూర్తమింక వెంటనె దెలుపన్!..49


అందరి సమ్మత మేర్పడ

కందువ శుభమాటతోడ కమ్మని నవమిన్

విందుగ పెండిలి యనిరిక

చందన తాంబూలమొసగి చరితార్థులయెన్!..50


వరుడిగ రాముని గూర్చిరి

వర వధువుగ సీతనంత వడివడి తీర్చిన్

పరువము నయోధ్య సాగెను

గరువము మొలకెత్త పెళ్ళి ఘనముగ జరిగెన్!..51.


సిగ్గుల మొగ్గయె సీతయు

నెగ్గులు మరిపల్కనట్టి నేమపు రామున్

దిగ్గున చూడగ చాలదు

సిగ్గున ముఖ పద్మమింక సిరిమల్లెయయెన్!..52


శయనపు పాన్పున రాముడు

నయనము లాసీతవంక నటసారించన్

చయమగు పూచెండులనే

రయమున నా సీత విసిరె రసికత నొప్పన్!..53


బండలు పైపై బడినను

కొండలు మరి విరిగిపడిన కుదురుగ నుండున్

వెండిగ పూబంతిపడగ

దండిగ యారాము మేను ధర కందెను హా!..54


కందిన మేనును దడుమగ

విందుగ రసకేళిదూరె వెంటనె రామున్

రందియు రబసలు లేక ని

రందిగ సాగెమురిపాలు రాజసమొప్పన్!..55


కోకిల దాగెను స్వరమున

కోకల మరిజూచి చిలుక కుదురుగ నమరెన్

శోకములన్నియు పారెను

పాకము లోపడిన విధము పట్టెను సీతన్!..56


సీతారాముల పరిణయ

మంతటి శుభతీపి గుర్తు మాన్యత నొప్పెన్

మాతలు దశరథ తోడుత

వంతుగ తమ బాధ్యతలను వడి నొసగనటన్!57


పల్కిరి పరివారముతో

పల్కిరి ప్రజలయభిమతము వాసిగ గొనుచున్

పల్కిరి శుభముహూర్తము

పల్కిరి పట్టాభిషేక వార్తను గోరిన్!58


అందరి మనసున నొకరే

యందరియభిమతంబుగూడ యతడే యైనన్

విందుగ ప్రజలే నుడివిరి

కందువ మాటలన రాము కమ్మని పేరున్!..59


ఆహాయేమది నామము

లోహో నాజన్మమింక లోపము లేకన్

ఆహా!కమ్మగ సాగెను

ఓహో మా రామచంద్రునూహించగనే!..60


అనుకొనియూహాలోకము

కునుకుల మరిదీయుచున్న కుదురగు వేళన్

అనుకొననివి సంఘటనలు

వినలేమిక నాడు జరిగె విధియాటగనే!..61


కమ్మని గుణముల రాణీ 

రమ్మని పిలిచెను దశరథుని రయమున గృహమున్

క్రమ్మిన మాయల పొరలనె

దమ్మున యాయల్కపాన్పు దబ్బునయెక్కెన్!..62


మంచికి మారగు పేరని

యెంచెదరందరును కైకనింటిలిపాదిన్

పంచెను ప్రేమను రాముకు

నెంచెను తనకొడుకెయంచు నేర్పునయెపుడున్!..63


తనదగు భరతుని కంటెను

తనరగ శుభ ప్రేమనిడిన తరుణీయామే

యొనరగ పట్టమం గట్టుట

కనజూడని కోపమింక కమ్మినదకటా!..64


తల్లికి మారుగ తోడుగ

యుల్లములో నిల్చివచ్చెనుదతీ చెలియై

మెల్లగ తప్పుడు గుణమునె

చల్లగ యాకైకకింక చక్కగ జెప్పెన్!..65


మందర మాటలెతీయని

విందయెనాకొకకపుడు విధివంచనగన్

చందనముఖబింబములో

రందియు చొరబడెనుకద రాజిలకుండన్!66


రాజుకు ప్రాణము కైకయె

రాజుయు తనయుద్ధమందు రథమున గొనగన్

రాజుకు జయమగు రీతిన

రాజకు వెన్వెన్క రథము రక్తము చిందెన్!67


చిందిన రక్తము కైకది

ముందుగ తన కేయి వ్రేలు ముదముగ జొనిపెన్

సందున చక్రము తిరుగగ

విందుగ రక్తంబు చిందె వెడనడ రణమున్!..68


కైకయె లేనిచొ విజయము

లేకనె మరి యోడిపోవు లీలగ యపుడున్

కైకయె కారణమంచును

కైకకు రెండైన వరము కమ్మగయొసగెన్!..69


ఇయ్యది వరముల నికపై

నెయ్యది సమయంబుగోర నేర్పున నిత్తున్

చయ్యన విజయపు గుర్తుగ

నొయ్యక మరిగొనుము కైక యూహూయనకన్!..70


నవ్వుచు సరెయనె కైకయు

పువ్వుల శుభ ప్రేమ పంచి పుష్టియు నింపెన్

కవ్వము చిల్కిన వైనము

నొవ్వగ యా కైక నేడు నోర్వదె రామున్!..71


చెప్పుడు మాటలె చేటగు

చెప్పుడు మాటలను వినుచు చెడెగా కైకే

చెప్పకు తప్పనరెవరును

చెప్పగ యాకైక నేడు చేరెను పాన్పున్!..72


అడుగులు తడబడ కడువడి

నడచెను దశరథుడు నాడు నమ్మిన భార్యన్

వడివడిగ నడిగె నేమని

బుడిబుడి మాట నుడివెనిక బుద్దిగ కైకా!..73


రాజా!వరముల నిమ్మా

నీ జాననెయడుగుచుంటి నిజముగ నేడున్

బాజాలనెయాపుమిక

యేజాగును లేక భరతు డికపై రాజున్!..74


రాముడెయుండగ భరతుడు

గీమున కూర్చుండి నన్ను గేలియె చేయున్

కామిత ఫలముగ నికపై

రామునియాయరణ్యమంపు రయమున నిపుడున్!..75


కోర్కెల వినగనె బాధల

కూర్కొనియాదశరథుండు కూలెను హా..హా..

ఊర్కొని యుండక నుడివిన

కోర్కెలె యాకైక నిటుల కొంపల ముంచెన్!..76


రామా రామా రామా

రామానినువీడలేను రామా నిన్నున్

రామా రామా రామా

రామా నువులేనిచోట రౌరవమయ్యా!..77


కూలిన దశరథు గానక

మాలిన తనకొమరుపైని మాన్యపు ప్రేమన్

వాలిన చూపుల తోడుత

లాలిత హృది పతిని వీడె లలనా కైకన్!..78


తెలిసెను విషయము రాముకు

వలచిన ఘన రాజ పట్ట వరమున పోయెన్

తలచెను కర్తవ్యమునే

మలయుచు మరిసిద్దమైన మాన్యుడె రామున్!..79


వెడలెద సీతా యడవికి

వెడలుము మీయాత్మ నెలవువిధిగాయిపుడున్

బిడియము వలదిక లేమా

నడచెద నేకాననమున నా ధర్మముగన్!..81


అనవిని సీతయు పలికెను

మనవిని నేసేతునయ్య!మన్నించయ్యా!

కనగా నాపతి దేవుని

ధనమగు నాకాననములె దక్కును నాకున్!..82


కాదనకయ్యా! వచ్చెద!

కాదనక పిలువుమయ్య కమ్మగయిపుడున్

వేదన సంథసమన్నియు

చోదకమగు నీదు నీడ చూడగ నిమ్మా!..83


ప్రేమగ వల్కిన పడతిని

నేమముగా సమ్మతించె నీతిగ యపుడున్

క్షేమము పతిమది నీడనె

రామమెయైతీరు సతికి రాముని తోడున్!..84


అంతనె లక్ష్మణు డత్తరి

వింతగ నాతెరువుజూచి విధిగా నుడివెన్

వంతుగ సేవకుడగుచునె

తంతుగ నేవత్తునయ్య తరుమకు రామా!..85


ఊర్మిల యయోధ్రనుండును

కూర్మిగ యాపడకపైన కుదురుగ యికపై

పేర్మిని జూపగ రామా

శర్మగ యాశీసులొసగి శౌరిగ నడువన్!..86


పలుకుల తీయని మధురిమ

విలువల శ్రీరాము మదికి వెలుగేయయ్యెన్

కలువల కాంతలు మాతలు

మలయుచు యనుమతినిపొంద మరలెను రామున్!..87


నానా లక్ష్మణ వినుమా!

నీనామమె రామరామ నేర్పున మనమున్

నానాటికి వినిపించగ

నానా!శుభ సేవజేయ  నడువుము నయమున్!..88


రాముని చోటునయోధ్యయె

రాముడు నడయాడునంత రయముగ తిరుగున్

రాముడె మనకిక దిక్కయా

రాముని విడనాడియుండ రౌరవ బ్రతుకున్!


అమ్మయె సీతర నాని

కమ్మనియానాన్న కరుణా మూర్తిన్

దమ్మున కనుమది రాముగ

చిమ్మెడియా ప్రేమలోన చిరజీవియెయౌ!..89


ఎవరిట పల్కెదరయ్యా

యెవరిల తనకొడుకునిటుల యింతగ పంపున్

ఎవరిది త్యాగపం గుణమయ

కవనము కమనీయమౌను కనగ సుమిత్రన్!.90


మాటలు లేవిక యత్తరి

మాటలు మరిపల్కనట్టి మాన్యత నీడన్

తేటగ కౌసల్యను గని

నీటుగ ప్రణమిల్లిరంత నేర్పుల తోడన్!..91


పొంగెను జలధులు నత్తరి

పొంగెను దుఃఖంబులగుచు పొసగక పడగన్

క్రుంగెను ప్రజలిట మనసున

భంగమెయౌ పర్వమంత బంగారముగన్!..92


మౌనమె దాల్చెను రాముడు

మౌనమె యారాముజూచి మూర్చిలెనకటా

మౌనమె యేరాగమమ్మో

మౌనిగ యా రాము సాగె మానిని తోడన్!..93


పట్టుల వస్త్రము లేవిక

కట్టిరి యానారచీర కమనీయముగన్

నెట్టిరి ప్రక్కకు నగలను

చట్టున యాకాలినడక చకచక సాగెన్!..94


వెలవెల బోయెనయోధ్యయు

వెలవెలబోయినవి రాజ వరప్రాంగణమున్

విలవిల లాడెను రాణులు

వలవలయేడ్చిరి రాము వనమున కరుగన్!..95


గుసగుస లన్నియు తెలియగ

రుసరుసలాడంగ వచ్చె రోదన తోడన్

విసవిస చనియెను భరతుడు

నసగిస లేకుండ రాము నడచిన బాటన్!..96


అన్నా!రామా!ఘోరము

కన్నానేనింటివద్ద కఠినముగుంటిన్

విన్నా!నీ యీ నిర్ణయ

మన్నా!మరివద్దు నాకుమాన్యత కాదున్!97


నీవే తండ్రివి యన్నియు

నీవే మాదిక్కుమొక్కు నేర్పులెయన్నిన్

నీవిట యుండగ నోపను

నీవే మాపాలకుడవు !నిజమది రామా!98


రమ్మిక యయోధ్య పాలికి

దమ్మున యారాజువగుచు ధరణినియేలిన్

కమ్మగ బ్రోవుము ప్రజలను

నెమ్మనమున గొల్తునింక నీతిగ రామా!..99


అనియెడి పల్కుల భరతుని

కనినంతనె నొక్కచూపు కమ్మగజూచెన్

వినదగు మాటలు కావవి

చనుమిక ఓ భరత రాజ! చయ్యనయిపుడున్!..100


ధైర్యము నీవే నీవే

శౌర్యము మరిజూప వలయు శక్తిగ నిపుడున్

క్రౌర్యము వేదన వలదయ

మౌర్యులు మొదలైన రాజ  మార్గమె గనుమా!!..101


ఆడిన మాటల దప్పుట

వేడిన యాచకులకు నిడ విధిగా లేకన్

మాడగ జూచుట యేలనొ

చూడగనిది ధర్మమౌనె చూడర భరతా!..102


తండ్రిగ ఇచ్చిన మాటను

తండ్రిగ నేచేయుచుంటి ధర్మముగిపుడున్

తండ్రిగ జెప్పెద వినుమా

తండ్రిగ నీవుండుమయోధ్య తళతళమౄరువన్!..103


అన్నా!యెటులని వెడలెద

అన్నవునీవైనచెప్పువన్నా లక్ష్మా!

అన్ననెయొప్పించుమిలన

చన్నగ మరివలయు నింక చతురత నొప్పన్!..104


భరతా!నికమరి పల్కకు

వరముగ నేనుడువుచుంటి వడివెడలంగన్

కరుణతొ నొసగెద నీకై

భరియించగపాదుకలివి  భాగ్యము తోడన్!..105


భాగ్యమెయన్నా!చాలిక

భాగ్యముగా నీదుపాద పాదుక లిడుటన్

యోగ్యత నీదేయనుకొని

భాగ్యముగా నీదుగుర్తు భరియించెదగా!..106


దశరథు కర్మల జేయుచు

వశమగు కర్మేంద్రియాల వాసిని గనుచున్

విశదము చేయుచు భరతుని

నిశిజాడలురాకమునుపె నేర్పునబంపెన్!..107


సీతారాములు లక్ష్మణు

లాతావున వెడలుఛుండె లలితముగపుడున్

తాతా దశరథులటగని

తీతువు పిట్టగుచుకూసె తీరని వెదతో!..108.

       సశేషం....
































































                 *రామాయణం మహాభాగ్యం*

                (ఆశుపద్యాల మాలిక)

పరమేశ్వర వరపుత్రక

కరిముఖమును కల్గినట్టి కమ్మనిదేవా!

వరమొసగుము సరిబ్రోవగ

విరచించెద రామకథను వేకువ తోడన్!..1


గౌరీ శంకర!వేడెద

శౌరీ నిను మనసులోన శక్తిగ నిల్పిన్

రౌరవ రోగపు బాధల

గౌరవముగ బాపుమయ్య కరుణించుడికన్!..2


శ్రీనరసింహుడ!వేల్పుగ

మా నర నరమునడయాడిమాన్యత నొప్పన్

కానగ శక్తిని యొసగుమ

ఆ నరహరి రాముగూర్చి హాయిదెల్పన్!..3


అమ్మా శారద మాతా

కమ్మగ నానాల్కపైన కదలుచు నికపై

కమ్మని రాముని చరితను

దమ్మున సరిరాయబూన దక్షత నిమ్మా!..4


పండితులెల్లరు కనగనె

వెండిగ నేనింక వ్రాయ విధిగా దలతున్

గండము దాటగ కవివర!

నిండగు మీ మనసుతోడ నిడుదీవెనలున్!..5


వినయమ శాంతము  కరుణయు

ననయము సరిగాచం గుణము నమ్మిక కలిగిన్

కనివిని యెరుగని శౌర్యమె

ధనముగ మరికల్గినట్టి దక్షుడు రామున్!..6


రాముని చరితను విన్నను

రాముని కథలు విరచించ రమ్యమెయౌనున్

రాముని నామము మధురము

రాముని నేదలచినింక వ్రాసెద కథయున్!..7


అదియొక నయోధ్య పురముర!

నదియౌ సరయూతటినిల నడయాడినదిన్

బుదులకు యోధులు నేరికి

యెదిరించగ నలవికానియింపగు నెలవున్!..8


ఇనకుల వంశజులందున

ఘనతర శుభపేరుగాంచె ఘటికులెయగుచున్

కనుమిక దశరథ విభునిట

మనెనాతడుయోధుడౌచు మంగళమూర్తిన్!..9


ఇచ్చిన మాటలదప్పరు

మెచ్చిన ఘనవరములొసగి మేలునె జేయున్

వచ్చిన వారలకొసగెడి

కచ్చిత శుభ దాన సుగుణ కమ్మని రాజున్!..10


రాజుకు మువ్వురు రాణులు

మోజుల మురిపెంబుదీర్చు ముదముగయెపుడున్

జాజుల మల్లెల మనసున

రాజుకు మరిసంతు లేని రౌరవ బాధన్!..11


దీర్చగ దలచిరి విబుధులు

చర్చల శుభవిషయమది చయ్యన దెల్పెన్

అర్చన యాగము సేయగ

ఖర్చుకు వెనుకాడకుండ కదలెను నాడున్!..12


కామేష్ఠియాగ ఫలమున

కామితమదితీరగోరి కమ్మగ ఋషులున్

రామంబుగ దీవెనొసగ

క్షేమంబుగ కల్గె సంతు క్షితివల్లభుకున్!..13


కోసల రాణికి రాముడు

యాసతికిని చెల్లెలైన యాయిర్వురకున్

గోసలు తీరగ బుట్టిరి

శ్వాసగ లక్ష్మణ భరతుడు శత్రఘ్నుడునున్!..14


మోదమునందిరి దశరథు

మోదమునందంగ మనిరి ముదముగ రాణిన్

మోదము నందె నయోధ్యయు

మోదముతో గాచె రాము ముఖ్యముగపుడున్!..15


రాముని యల్లరి మాన్పగ

గోముగ నాయద్దమందు గుర్తుగ చంద్రున్

కామితమైజూపగనే

రాముడు మరిసంతసించె రమ్యపు మోమున్!..16


దశరథు చెంతకు నొకపరి

విశదము చేబూని వచ్చె విశ్వామిత్రున్

వశమును చేయుము రాముని

దశరథ!నేగొనుచు వెళుదు దబ్బున వనమున్!..17


హా!విశ్వామిత్ర ఋషీ!

హే!వర గురువర్యవినను హీనుడ నేనున్!

ఆ వరమున గనితిని కద

నా వరముల రామునిటుల హా!గోరితిరే!.18


అనవిని ఋషివరు నుడివిరి

కనుమో దశరథ!రాముని

ఘన శౌర్యుడతండు!రామ!ఘనగుణశాలిన్

వినుమిక వెరువకు మికపై

చనగను నావెంటపంపు చతురత నొప్పన్!..19


అంతటి విశ్వామిత్రుడె

వింతగ నారాముగోర వేదనయేలన్

కంతుని రూపము శౌర్యము

కాంతును నేనంపి రాము కమ్మగ ఋషితో!..20


అనుకొని మాటను నిల్పగ

గొనకొని వెడలుమయ్య గుబులేయుండన్

వనమున కరుగుము రామా!

వినయముగా మసలుకొమ్ము వెడనడ ఋషితో!..21


అనియెడి పల్కుల వినుచునె

కనుసైగలతోడ రాము కదిలెను మునితో

తనవెంటనెలక్ష్మణుడట

యనుసారియెయయ్యెజూడ నలరుచు నపుడున్!..22

విశ్వామిత్రుడునత్తరి

విశ్వాసము మనసునిండ వెలుగొందగనే

నశ్వరమౌ జీవితమున 

ఆశ్వాసము రాముడయ్యె నంతట చనుచున్!..23


వెడనడె రాముడు లక్ష్మణు

వెడలుచు మరివినుచునుండె విపులవిషయమున్

కడువడి జెప్పెడి మునివరు

విడువక సరిగొల్చుచుండి విధిగా.నేర్చెన్!..24


గురువుల మాటను మీరక

పరువుగ సరి విద్యలన్ని పట్టుచు నిల్పెన్

విరివిగ వినయము  తోడుత

మరువక సరిగొల్చె రాము మాన్యుడెయగుచున్!..25


రాముని భక్తికి యుక్తికి

సోముని శుభమనసుతోడ సూక్ష్మపు విద్యన్

కామిత మొప్పగ జెప్పెను

శ్రామిక ఘనమూర్తియగుచు శ్రావ్యముగపుడున్!..26


రామా!పూర్తయె విద్యలు

నామానసమది ముదంబునందినదయ్యా!

రామా!దివ్యాస్త్రము గొను

మా!మాయాసురను దునుము మాకది తుష్టిన్!.27


అన విని రాముడు చిత్తము

యని గొనెనికయస్త్రములపుడార్థిగ నడచిన్

మునివర!గురువర! యానతి

యనుదినముగదాల్తునేను యశమును బెంచిన్!..28


రాముని మాటల మహిమను

గోముగ మరివినిన మునియు గూర్చొనె తపమున్

నేమము దప్పక రాముడు

ఆ ముని యాగము నుగాచె నసురుల !దునిమిన్!.29


సంతసమందిరి యందరు

సంతసమందిరి మునులును సత్వరమపుడున్

సంతసమోరామా!యిక

సంతసమగు శుభము నీకు సద్గుణ శీలా!..30


అనుచునె దీవెనలొసగిరి

ఘనముగ నా చిరుత ప్రాయ ఘనగుణ రామున్

వనమున శౌర్యము జూపగ

చనిరిక యందరపుడు వడి జనకుని పురమున్!..31


పురమున జనకుడు బాధగ

కరమును జోడించి నుడివె కర్ణముజేరన్!

వరముగ పుట్టిన సీతకు

వరుడిల కనిపించడయ్యె వర ముని!యనగన్!32


జనకుడ!వగచకు నీవిక

కనుమిక మా రామునిపుడె కమ్మని వాడున్

చనుమిక దేవర మందిర

ఘనమగు శివదనువు దెచ్చి ఘనముగ జూపన్!33


మునివర పల్కుల దాల్చుచు

జనకుడు మరిజూపె ధనువు జానకి తోడన్

కనుమిక రామా!కావుమ!

చనుమిక యీదనువునెత్త చయ్యన రమ్మా!34


అను పల్కులవిని రాముడు

ముని పాదము మ్రొక్కినంత ముదముగ సీతన్

కనుచునె ధనువును దడిమెను

మనమున శివ స్మరణదాల్చి మరియిటుపల్కెన్!..35


అయ్యా!జనకుడ!వినుమా!

చయ్యన మరిదీనియెత్త చచ్చును తునకై

ముయ్యుడు మీనోళ్ళిక మరి

యియ్యనువున యెత్తుదేను ఈశ్వర దనువున్!..36


పల్కిన మోమును జూచిరి

యుల్కక పల్కక నిలుచుని యునికిని మరచెన్

కల్కియొ మాయయొ తెలియక

కుల్కుల సీతమ్మ జూచె కుదురుగ రామున్!..37


ఒకచూపు సీత ముఖము

నొకచూపును రాజులందునొక్కొక్కరిపై

నొకచూపు గురువు పాదము

నొకయించుక దనువుజూచెనోర్వక రామున్!..38


చీపురు పుల్లగ దలచుచు

నూపురమును వంచియెత్తె నుత్సాహముతో

యోపక దనువును వంచుచు

నాపక యాయల్లె త్రాడు నటకట్టెనికన్!..39


గుట్టగ ఘనతర మ్రానుగ

పట్టగ పదియారుకోట్ల భటులట.లేపన్

పట్టున లేవనిదనియెడు

తట్పుగ బలమంత నొకడె తనరగ గలిగెన్!..40


అనుకొనుచుండగ రాముడు

గొనకొనియాదనువునంత గురివెట్టంగన్

వినగను లేని స్వనమున

కనుగొన.లేనట్టివిధము ఘణముగ విరిగెన్!..41


విరిగిన దనువును జూడగ

విరిగెను పరరాజుశౌర్య వెలుగులెయన్నిన్

విరిగెను అనితర భావన

పెరిగెను శుభకీర్తి రాము ప్రియమునె గూర్చెన్!..42


జనకుని మానస మంతయు

కనివినియెరుగని విధంపు కమ్మని తుష్టిన్

తన మది బాధల బాయగ

మునివర శుభకృపన రాము మోహము నిండెన్!..43


సీతా దేవీ మనసున

నీతావున కొలువుదీరె నేర్పుల తోడన్

శ్రీతాండవ శుభముఖమున

సీతయు మరివెల్గెనంత శ్రీరామునితో!44


జనకుడు సంతస మందెను

వినయముగా నుడివె నిటుల వెల్గిన మనసై

అనఘా!మునివర! గురువర!

ఘనముగ మాసీత నిత్తు ఘనరామునకున్!45


విషయము బనిచెద నంతట

విషయము మరిదెల్పుదేను వెంటనె యిపుడున్

విషయము దశరథ రాజుకు

విషయములో పనిగ మిగులు గూతుల నిడిదెన్!46


దశరథ కొమరుల పెండిలి

దశదిశలన మ్రోగుచుండ ధరణిన వేడ్కన్

దిశనాయక సురవర తతి

దశమీ మునుముందు తిథిన దప్పక జేతున్!47


మాటలు వినుచునె సెలవనె

తేటగ మరిపల్కి రంత తీయగ నపుడున్

చేటిక లేదిక రాదని

దీటుగ మరిపల్కివెడలె ధీశాలురునై!..48


దశరథుడంతట బనచెను

వశిష్ట మునివర సుమంత్ర పరివారములన్!

విశదము చేసిరి పెండిలి

విశిష్ట సుముహూర్తమింక వెంటనె దెలుపన్!..49


అందరి సమ్మత మేర్పడ

కందువ శుభమాటతోడ కమ్మని నవమిన్

విందుగ పెండిలి యనిరిక

చందన తాంబూలమొసగి చరితార్థులయెన్!..50


వరుడిగ రాముని గూర్చిరి

వర వధువుగ సీతనంత వడివడి తీర్చిన్

పరువము నయోధ్య సాగెను

గరువము మొలకెత్త పెళ్ళి ఘనముగ జరిగెన్!..51.


సిగ్గుల మొగ్గయె సీతయు

నెగ్గులు మరిపల్కనట్టి నేమపు రామున్

దిగ్గున చూడగ చాలదు

సిగ్గున ముఖ పద్మమింక సిరిమల్లెయయెన్!..52


శయనపు పాన్పున రాముడు

నయనము లాసీతవంక నటసారించన్

చయమగు పూచెండులనే

రయమున నా సీత విసిరె రసికత నొప్పన్!..53


బండలు పైపై బడినను

కొండలు మరి విరిగిపడిన కుదురుగ నుండున్

వెండిగ పూబంతిపడగ

దండిగ యారాము మేను ధర కందెను హా!..54


కందిన మేనును దడుమగ

విందుగ రసకేళిదూరె వెంటనె రామున్

రందియు రబసలు లేక ని

రందిగ సాగెమురిపాలు రాజసమొప్పన్!..55


కోకిల దాగెను స్వరమున

కోకల మరిజూచి చిలుక కుదురుగ నమరెన్

శోకములన్నియు పారెను

పాకము లోపడిన విధము పట్టెను సీతన్!..56


సీతారాముల పరిణయ

మంతటి శుభతీపి గుర్తు మాన్యత నొప్పెన్

మాతలు దశరథ తోడుత

వంతుగ తమ బాధ్యతలను వడి నొసగనటన్!57


పల్కిరి పరివారముతో

పల్కిరి ప్రజలయభిమతము వాసిగ గొనుచున్

పల్కిరి శుభముహూర్తము

పల్కిరి పట్టాభిషేక వార్తను గోరిన్!58


అందరి మనసున నొకరే

యందరియభిమతంబుగూడ యతడే యైనన్

విందుగ ప్రజలే నుడివిరి

కందువ మాటలన రాము కమ్మని పేరున్!..59


ఆహాయేమది నామము

లోహో నాజన్మమింక లోపము లేకన్

ఆహా!కమ్మగ సాగెను

ఓహో మా రామచంద్రునూహించగనే!..60


అనుకొనియూహాలోకము

కునుకుల మరిదీయుచున్న కుదురగు వేళన్

అనుకొననివి సంఘటనలు

వినలేమిక నాడు జరిగె విధియాటగనే!..61


కమ్మని గుణముల రాణీ 

రమ్మని పిలిచెను దశరథుని రయమున గృహమున్

క్రమ్మిన మాయల పొరలనె

దమ్మున యాయల్కపాన్పు దబ్బునయెక్కెన్!..62


మంచికి మారగు పేరని

యెంచెదరందరును కైకనింటిలిపాదిన్

పంచెను ప్రేమను రాముకు

నెంచెను తనకొడుకెయంచు నేర్పునయెపుడున్!..63


తనదగు భరతుని కంటెను

తనరగ శుభ ప్రేమనిడిన తరుణీయామే

యొనరగ పట్టమం గట్టుట

కనజూడని కోపమింక కమ్మినదకటా!..64


తల్లికి మారుగ తోడుగ

యుల్లములో నిల్చివచ్చెనుదతీ చెలియై

మెల్లగ తప్పుడు గుణమునె

చల్లగ యాకైకకింక చక్కగ జెప్పెన్!..65


మందర మాటలెతీయని

విందయెనాకొకకపుడు విధివంచనగన్

చందనముఖబింబములో

రందియు చొరబడెనుకద రాజిలకుండన్!66


రాజుకు ప్రాణము కైకయె

రాజుయు తనయుద్ధమందు రథమున గొనగన్

రాజుకు జయమగు రీతిన

రాజకు వెన్వెన్క రథము రక్తము చిందెన్!67


చిందిన రక్తము కైకది

ముందుగ తన కేయి వ్రేలు ముదముగ జొనిపెన్

సందున చక్రము తిరుగగ

విందుగ రక్తంబు చిందె వెడనడ రణమున్!..68


కైకయె లేనిచొ విజయము

లేకనె మరి యోడిపోవు లీలగ యపుడున్

కైకయె కారణమంచును

కైకకు రెండైన వరము కమ్మగయొసగెన్!..69


ఇయ్యది వరముల నికపై

నెయ్యది సమయంబుగోర నేర్పున నిత్తున్

చయ్యన విజయపు గుర్తుగ

నొయ్యక మరిగొనుము కైక యూహూయనకన్!..70


నవ్వుచు సరెయనె కైకయు

పువ్వుల శుభ ప్రేమ పంచి పుష్టియు నింపెన్

కవ్వము చిల్కిన వైనము

నొవ్వగ యా కైక నేడు నోర్వదె రామున్!..71


చెప్పుడు మాటలె చేటగు

చెప్పుడు మాటలను వినుచు చెడెగా కైకే

చెప్పకు తప్పనరెవరును

చెప్పగ యాకైక నేడు చేరెను పాన్పున్!..72


అడుగులు తడబడ కడువడి

నడచెను దశరథుడు నాడు నమ్మిన భార్యన్

వడివడిగ నడిగె నేమని

బుడిబుడి మాట నుడివెనిక బుద్దిగ కైకా!..73


రాజా!వరముల నిమ్మా

నీ జాననెయడుగుచుంటి నిజముగ నేడున్

బాజాలనెయాపుమిక

యేజాగును లేక భరతు డికపై రాజున్!..74


రాముడెయుండగ భరతుడు

గీమున కూర్చుండి నన్ను గేలియె చేయున్

కామిత ఫలముగ నికపై

రామునియాయరణ్యమంపు రయమున నిపుడున్!..75


కోర్కెల వినగనె బాధల

కూర్కొనియాదశరథుండు కూలెను హా..హా..

ఊర్కొని యుండక నుడివిన

కోర్కెలె యాకైక నిటుల కొంపల ముంచెన్!..76


రామా రామా రామా

రామానినువీడలేను రామా నిన్నున్

రామా రామా రామా

రామా నువులేనిచోట రౌరవమయ్యా!..77


కూలిన దశరథు గానక

మాలిన తనకొమరుపైని మాన్యపు ప్రేమన్

వాలిన చూపుల తోడుత

లాలిత హృది పతిని వీడె లలనా కైకన్!..78


తెలిసెను విషయము రాముకు

వలచిన ఘన రాజ పట్ట వరమున పోయెన్

తలచెను కర్తవ్యమునే

మలయుచు మరిసిద్దమైన మాన్యుడె రామున్!..79


వెడలెద సీతా యడవికి

వెడలుము మీయాత్మ నెలవువిధిగాయిపుడున్

బిడియము వలదిక లేమా

నడచెద నేకాననమున నా ధర్మముగన్!..81


అనవిని సీతయు పలికెను

మనవిని నేసేతునయ్య!మన్నించయ్యా!

కనగా నాపతి దేవుని

ధనమగు నాకాననములె దక్కును నాకున్!..82


కాదనకయ్యా! వచ్చెద!

కాదనక పిలువుమయ్య కమ్మగయిపుడున్

వేదన సంథసమన్నియు

చోదకమగు నీదు నీడ చూడగ నిమ్మా!..83


ప్రేమగ వల్కిన పడతిని

నేమముగా సమ్మతించె నీతిగ యపుడున్

క్షేమము పతిమది నీడనె

రామమెయైతీరు సతికి రాముని తోడున్!..84


అంతనె లక్ష్మణు డత్తరి

వింతగ నాతెరువుజూచి విధిగా నుడివెన్

వంతుగ సేవకుడగుచునె

తంతుగ నేవత్తునయ్య తరుమకు రామా!..85


ఊర్మిల యయోధ్రనుండును

కూర్మిగ యాపడకపైన కుదురుగ యికపై

పేర్మిని జూపగ రామా

శర్మగ యాశీసులొసగి శౌరిగ నడువన్!..86


పలుకుల తీయని మధురిమ

విలువల శ్రీరాము మదికి వెలుగేయయ్యెన్

కలువల కాంతలు మాతలు

మలయుచు యనుమతినిపొంద మరలెను రామున్!..87


నానా లక్ష్మణ వినుమా!

నీనామమె రామరామ నేర్పున మనమున్

నానాటికి వినిపించగ

నానా!శుభ సేవజేయ  నడువుము నయమున్!..88


రాముని చోటునయోధ్యయె

రాముడు నడయాడునంత రయముగ తిరుగున్

రాముడె మనకిక దిక్కయా

రాముని విడనాడియుండ రౌరవ బ్రతుకున్!


అమ్మయె సీతర నాని

కమ్మనియానాన్న కరుణా మూర్తిన్

దమ్మున కనుమది రాముగ

చిమ్మెడియా ప్రేమలోన చిరజీవియెయౌ!..89


ఎవరిట పల్కెదరయ్యా

యెవరిల తనకొడుకునిటుల యింతగ పంపున్

ఎవరిది త్యాగపం గుణమయ

కవనము కమనీయమౌను కనగ సుమిత్రన్!.90


మాటలు లేవిక యత్తరి

మాటలు మరిపల్కనట్టి మాన్యత నీడన్

తేటగ కౌసల్యను గని

నీటుగ ప్రణమిల్లిరంత నేర్పుల తోడన్!..91


పొంగెను జలధులు నత్తరి

పొంగెను దుఃఖంబులగుచు పొసగక పడగన్

క్రుంగెను ప్రజలిట మనసున

భంగమెయౌ పర్వమంత బంగారముగన్!..92


మౌనమె దాల్చెను రాముడు

మౌనమె యారాముజూచి మూర్చిలెనకటా

మౌనమె యేరాగమమ్మో

మౌనిగ యా రాము సాగె మానిని తోడన్!..93


పట్టుల వస్త్రము లేవిక

కట్టిరి యానారచీర కమనీయముగన్

నెట్టిరి ప్రక్కకు నగలను

చట్టున యాకాలినడక చకచక సాగెన్!..94


వెలవెల బోయెనయోధ్యయు

వెలవెలబోయినవి రాజ వరప్రాంగణమున్

విలవిల లాడెను రాణులు

వలవలయేడ్చిరి రాము వనమున కరుగన్!..95


గుసగుస లన్నియు తెలియగ

రుసరుసలాడంగ వచ్చె రోదన తోడన్

విసవిస చనియెను భరతుడు

నసగిస లేకుండ రాము నడచిన బాటన్!..96


అన్నా!రామా!ఘోరము

కన్నానేనింటివద్ద కఠినముగుంటిన్

విన్నా!నీ యీ నిర్ణయ

మన్నా!మరివద్దు నాకుమాన్యత కాదున్!97


నీవే తండ్రివి యన్నియు

నీవే మాదిక్కుమొక్కు నేర్పులెయన్నిన్

నీవిట యుండగ నోపను

నీవే మాపాలకుడవు !నిజమది రామా!98


రమ్మిక యయోధ్య పాలికి

దమ్మున యారాజువగుచు ధరణినియేలిన్

కమ్మగ బ్రోవుము ప్రజలను

నెమ్మనమున గొల్తునింక నీతిగ రామా!..99


అనియెడి పల్కుల భరతుని

కనినంతనె నొక్కచూపు కమ్మగజూచెన్

వినదగు మాటలు కావవి

చనుమిక ఓ భరత రాజ! చయ్యనయిపుడున్!..100


ధైర్యము నీవే నీవే

శౌర్యము మరిజూప వలయు శక్తిగ నిపుడున్

క్రౌర్యము వేదన వలదయ

మౌర్యులు మొదలైన రాజ  మార్గమె గనుమా!!..101


ఆడిన మాటల దప్పుట

వేడిన యాచకులకు నిడ విధిగా లేకన్

మాడగ జూచుట యేలనొ

చూడగనిది ధర్మమౌనె చూడర భరతా!..102


తండ్రిగ ఇచ్చిన మాటను

తండ్రిగ నేచేయుచుంటి ధర్మముగిపుడున్

తండ్రిగ జెప్పెద వినుమా

తండ్రిగ నీవుండుమయోధ్య తళతళమౄరువన్!..103


అన్నా!యెటులని వెడలెద

అన్నవునీవైనచెప్పువన్నా లక్ష్మా!

అన్ననెయొప్పించుమిలన

చన్నగ మరివలయు నింక చతురత నొప్పన్!..104


భరతా!నికమరి పల్కకు

వరముగ నేనుడువుచుంటి వడివెడలంగన్

కరుణతొ నొసగెద నీకై

భరియించగపాదుకలివి  భాగ్యము తోడన్!..105


భాగ్యమెయన్నా!చాలిక

భాగ్యముగా నీదుపాద పాదుక లిడుటన్

యోగ్యత నీదేయనుకొని

భాగ్యముగా నీదుగుర్తు భరియించెదగా!..106


దశరథు కర్మల జేయుచు

వశమగు కర్మేంద్రియాల వాసిని గనుచున్

విశదము చేయుచు భరతుని

నిశిజాడలురాకమునుపె నేర్పునబంపెన్!..107


సీతారాములు లక్ష్మణు

లాతావున వెడలుఛుండె లలితముగపుడున్

తాతా దశరథులటగని

తీతువు పిట్టగుచుకూసె తీరని వెదతో!..108.

       సశేషం....

10/10/20, 9:00 pm - Velide Prasad Sharma: *కవివరులకు నమస్సులు!*

వనదుర్గ అమ్మవారి కృపన వెంకటకవీ్వరులు అంశం ఇవ్వటం ముఖ్య ప్రేరణగా నిలవటం మూలాన ఆనుకోకుండా ఈ రోజు *3.45కు కూర్చుని 7.45* వరకు *108* కంద పద్యాలు లేవకుండా *ఏకధాటిగ* వ్రాసినాను.గతంలో శతకం రాయాలంటే నెలకు పైగా సమయం పట్టేది కుదరకపోయేది.ఈ మధ్ర నాకేమైందో అర్థం కావటం లేదు.మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో నిల్పుకొని రాయటం మొదలు పెట్టినాను.అమ్మవారే నడిపిస్తోంది నన్ను.నా ప్రతిభ ఏమాత్రం లేదని మనవి చేస్తున్నాను.

మల్లినాథసూరి పీఠంలో చేరటం వల్ల రోజూ రాయటం అలవాటైంది.అందరి రచనలు చదివి కామెంటు పెడుతుండటం వలన అందరి రచనల ప్రభావం నామీద పడింది.కాబట్టి అందరి భాగస్వామ్యం ఉందని భావిస్తూ మీయందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతూ నిత్య విద్యార్థినైన నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను.

ఆ కళ్యాణ రాముడు అందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ ఆ శ్రీరామచంద్రునకు ఈ రామాయణ పద్యాలను అంకితం చేస్తున్నాను ఈ వెదిక నుండి మీయందరి సమక్షంలో..నమస్సులతో..

మీ

వెలిదె ప్రసాదశర్మ

10/10/20, 9:00 pm - +91 92989 56585: శ్రీ మల్లినాథ  సూరి కళాపీఠం ఏడుపాయల

సప్త వర్ణముల సింగిడి

శ్రీ అమరకుల దృశ్యకవి చక్రవర్తి గారి ఆశీస్సులతో

నిర్వహణ : శ్రీ అమరకుల దృశ్య కవి గారు, వెంకట్ గారు 

అంశం: రామాయణ రసామృత కావ్యం

శీర్షిక : రామాయణం

పేరు : గొల్తి పద్మావతి

ఊరు : తాడేపల్లిగూడెం

జిల్లా : పశ్చిమగోదావరి

చరవాణి : 9298956585

తేది : 10.10.2020 


శోకం నుండి శ్లోకం పుట్టి రామచరితమయ్యే 

వాల్మీకి బ్రహ్మదేవుని ఆదేశంతో శ్రీకారం చుట్టే 

అయోధ్య రాజు దశరథుడు 

సంతానం కోసం పుత్రకామేష్టి యాగ ఫలంతో 

రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు పుత్రులు పొందే 

విశ్వామిత్రునికి ఉత్తమ శిష్యులు వారే 

మారీచ సుభాహులు యజ్ఞ భంగం చేసే 

రాముని తనవెంట పంపమని విశ్వామిత్రుడు కోరే 

మారీచ సుభాహులను సంహరించి యజ్ఞము పూర్తి చేయించే 

యజ్ఞం పూర్తి చేసి మిధిలానగరం చేరి జనకుని సభలో శివ ధనస్సు విరచి సీతను పెండ్లాడే 

అయోధ్య రాముని పట్టాభిషేకమని తనని తాను అలంకరించుకునె 

కైక దాసి మందర కళ్ళల్లో నిప్పులు పోసుకొనె

కైకకు దశరధుడిచ్చిన వరాలు కోరమని మందర చెప్పె 

భరతునికి పట్టాభిషేకం,  పదునాలుగేండ్ల రామ వనవాసం కోరే  కైక రామునికి చెప్పగా రాముడు అరణ్యవాసమునకు వెడలే 

దశరథుడు కృంగిపోయి మంచాన పడె

నేరేడు కర్రలతో కుటీరమేర్పరచుకుని చిత్రకూటమునుండే 

మరుసటిరోజు వార్త దశరధుని చేరి గుండె చల్లబడి మరణించే 

జరిగిన విషయం తెలిసి భరతుడు ఆన్నని కలిసి తండ్రి మరణవార్త తెలిపి రాజ్యమునకు రమ్మని చెప్పగా ఇచ్చినమాట తప్పకూడదనగా ఆయన గుర్తుగా పాదుకలిమ్మనె  

శ్రీరాముని చూసి సూర్పణక మోహించే 

లక్ష్మణుడు అన్న ఆజ్ఞ మేరకు ముక్కు చెవులు కోసె 

రావణునికి శోకిస్తూ సీత విషయం చెప్పె 

మారీచుని మాయలేడీగా పంపె 

రాముడు సీత కోరిన లేడికై పరుగుతీసే  

లక్ష్మణుడు అన్న ఆర్తనాదంతో గీత దాటొద్దని వెళ్లే 

రావణుడు భిక్షకై వచ్చి సీతను అపహరించె 

జఠాయువు అడ్డగించి మరణించే 

సీతను వెదకడంలో వానరులనాశ్రయించే 

వారధికి వానరులు సిద్ధమయ్యే 

హనుమంతుడు సీత జాడకై సముద్రాన్ని లంఘించే 

సీత జాడ రాముడికి తెలిపే 

రావణునిపై యుద్దానికి సిద్ధమయ్యే 

రావణుని తమ్ముడు విభీషణుని సహాయంతో రావణుని వధించె 

సీతతో కలిసి అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడయ్యే 

పరస్త్రీ వ్యామోహంతో, చెప్పుడు మాటలతో రాజ్యంతో పాటు సమస్తాన్ని పోగొట్టుకున్న రావణుడు.

ధర్మం తప్పక, తండ్రి మాట జవదాటని రాముడు సర్వ సుగుణ సంపన్నుడయ్యే.

స్నేహాఫలం, ధర్మఫలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్యం, ప్రకృతి లాలన మనిషి ఉన్నంతకాలం ఉంటుంది

10/10/20, 9:01 pm - +91 98482 90901: మల్లినాథసూరి కళాపీఠం YP

సప్తవర్ణాల సింగిడి

నిర్వహణ :- శ్రీ బి.వెంకట్ కవి గారు 

అమరకుల దృశ్యకవి గారి నేతృత్వంలో

తేది :-10-10-2020

అంశం :- పురాణం మంద వాసరం

రామాయణం రసామృతకావ్యమమ

(సంపూర్ణ రామాయణంపై)

కవి పేరు :- సిహెచ్.వి.శేషాచారి

కలం పేరు:- ధనిష్ట

ఊరు:- హన్మకొండ,వరంగల్ అర్బన్ జిల్లా

శీర్షిక :-  *పతిత పావనుడు రాఘవుడు*

౨౨౨౨౨౨౨౨౨౨౨౨౨౨

*రామో విగహవాన్ ధర్మః*

ధర్మమే రూపుదాల్చిన మానవత రామునితత్వం

పంచమ స్వర వాఙ్మయమై

బ్రహ్మ కల్పితమై నారద ప్రోక్తమై

రామ రామ అను మధురస్వన

తారకమంత్ర మనసును రక్తిగట్టించే మధురాక్షర సమన్విత *పౌలస్త్య వధ*

*సీతాయాశ్చరితంగా*

నుడువబడు *శ్రీమద్రామాయణం* రాముడు నడిచిన మార్గంగా

ప్రస్తుతినందిన కరుణరస సుందరకావ్యంగా అహరహ పారాయణ అనుసంధాన

సప్తకాండ పర్యంత 'గాయత్రీమంత్ర బీజాక్షర ప్రతిష్టాత్మకంగా ఇరువైనాల్గు వేల శ్లోకాల  

ఇక్షురస మధురసానుగుణ్య ఇనకులవంశ సీతారాఘవులచరిత 

వినసొంపుగా

 బోయవాని వ్రేటుకు గాయపడిన

క్రౌంచ పక్షుల శోకాన్ని శ్లోకంగా

ఆదికవి వాల్మీకీ కృతమై 

విశ్వజనీనమై అజరామరంగా

త్రేతాయుగంనుండీ ఈనాటివరకు అప్రతిహతంగా

హిందువుల నిత్య పారాయణ

గ్రంథంగా  జగన్నుతంగా వెలుగొందుతున్నది

శ్రవణ కుమార మాతాపితరుల

శాపం వరంగా పరిణమించి

పుత్రకామేష్టియుతమై

చిరకాల వాంఛ చిగురులేసి

రామలక్ష్మణభరతశతృజ్ఞుల

కౌసల్య సుమిత్ర కైకేయి గర్భాలయంబుల పొందె 

దశరథుడు అమదానంద

బ్రహ్మానంద భరితుడై

కులగురువు బ్రహ్మర్షి వశిష్ట ముని శిష్యరికమున విద్యల గరిపిరి పుత్రులు నలుగురు

బ్రహ్మర్షి విశ్వామిత్ర యాగ రక్షణ నెపమున రామలక్మణులకు అతిబల విద్యలనందించె

జనకమహరాజచే సీతాస్వయంవరమున కౌశికు ఆనతి శ్రీరాముడు

శివ ధనుర్భంగంగావించి

సీతను పెండ్లీయాడె 

తన దమ్ముల లక్ష్మణభరతశత్రుఘ్నుల గూడి

ఊర్మిళమాంఢవిశృతకీర్తులతోడ

పరిణయము గావించిరి దశరథ మహారాజు పరివార సహితుడై

కాగల శ్రీరామ పట్టాభిషేకం

కైక వరాన భగ్నమై పదునాలుగేండ్లు

అరణ్య వాసమునకై

పితృవాక్య పరిపాలన కర్తవ్య పరాయణుడై సీతాలక్ష్మణులతోడ కాననలమునకేగె కోదండపాణి

అపురూప ఘట్టమైన పాదుకా పట్టాభిషేక మున

భరతుడు పదునాలుగేండ్లు

కోసల దేశపు పరిపాలన సలిపె

గుహుని మిత్రత్వాన నదిని దాటి రామచంద్రుడు దండకారణ్యాన తిరుగాడుచు

చిత్రకూటమున పర్ణశాల నివేశనమయ్యే

వివిధ ముని సమూహమును రక్షించుచు భద్రాద్రి రాముడై

అసురుల దునుమాడె దాశరథి

రాక్షస మాయన మాయలేడి కల్పిత గాథన సీతమ్మ అపహరింపబడే

హనుమ శోధనమున సాదింపబడిన సీతమ్మ దర్శనము

వానరసేన సహాయమున

వారధి దాటి దశకంఠు దునుమాడె రామచంద్రుడు

సమస్తలోకము హర్షించగ

పట్టాభిషిక్తుడై ప్రజానురంజకంగా

పరిపాలించె ఏకపత్నీప్రత

రామచంద్రుడు

ఒకటే బాణం ఒకతే సతియని కొనియాడబడె పావనచరితుడు రాఘవుడు

                         ధనిష్ఠ

                 సిహెచ్.వి.శేషాచారి

10/10/20, 9:02 pm - +91 96763 57648: మల్లినాథ సూరి కళాపీఠం.

ఏడు పాయల.

శ్రీ అమరకుల గారి సారథ్యంలో

సప్తవర్ణాల సింగిడి.

అంశం: రామాయణం రసామృత కావ్యం.

నిర్వహణ:బి.వెంకట్ కవిగారు.

కవిగారు :తాతోలు దుర్గాచారి.

ఊరు : భద్రాచలం.


శీర్షిక : *రామ కథా సుధ*

************************

శ్రీ మహా విష్ణువు దుష్టశిక్షణ..శిష్ట రక్షణ..ధర్మ సంరక్షణ కొరకు భూలోకమున త్రేతాయుగమున అవతరించిన   అవతారమే..శ్రీ రామావతారం.

మానవుడుగా..పురుషోత్తముడుగా..సకల సుగుణాభి రాముడుగా అలరించిన ఆదర్శ రాముని వృత్తాంతమే *రామాయణము.*

మానవుడే ధర్మాచరణముతో

సద్గుణ సంపన్నుడుగా ..స్థిత ప్రజ్గ్నుడుగా..ఎలా జీవించాడో తెలిపేకథే రామకథ.       ధర్మంతో..ఆడిన మాట తప్పకుండా..ఆశ్రయం కోరి వచ్చిన వారిని ఆదరించే వాడు

సకల జీవ రాశికీ మేలు చేసేవాడు.పితృ వాక్పరిపాల కుడు..ఉత్తమ గుణ సంపన్నుడు శ్రీరాముడు.

అన్నదమ్ముల అనురాగానికీ..

మాతా పితల వాత్సల్యానికి.

ఆలు మగల అనుబంధానికీ..

పురుషోత్తముడుగా ధీరత్వానికీ ప్రతీకగా నిలిచిన వాడు రాముడు.

మనిషిగా మానవోత్తముడుగా జగతిన వెలిగిన సర్వోత్తముడు శ్రీరామచంద్రుడు.

****************/********ధన్యవాదాలు.🙏🙏

10/10/20, 9:05 pm - B Venkat Kavi changed this group's settings to allow only admins to send messages to this group

10/10/20, 9:09 pm - Telugu Kavivara: <Media omitted>

10/10/20, 9:09 pm - Telugu Kavivara: *💥🌈ఇంద్రచాపము-164🌈💥*

                       *$$* 

         *చకోరమునై-164*

                         *$$*

*నీకై నిరీక్షణ నీవెరుగని ఈ తరుణములో*

*నిబిడీకృత నిశ్శబ్దంన తహతహల తపన*

*పరాకున పరాయితనం నీ మనోచక్షువున*

*నీ సాంగత్య మహిమెరుగని ఓ అహల్యవే*


                          *@@*

            *అమరకుల ⚡ చమక్⚡*

10/10/20, 9:40 pm - B Venkat Kavi: *ఈ రోజు కూడా శతకపద్యాలు పూర్తి చేसिన ఆర్యులు, కళాపీఠం విశిష్ఠకవి, నిత్య వ్యాఖ్యానవతంస, ఏకకాలశతకపద్యశ్రేష్ఠ బిరుదాంకితులు వెలిదె ప్రसा దు శర్మగారికీ వందననీరాజనాలు*


*అభినందనచందనాలు*


💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


*బి.వెంకట్ కవి*

10/10/20, 9:52 pm - B Venkat Kavi: 🚩🍥 *సప్తవర్ణముల సింగిడి*

  *అమరకులదృశ్యకవిఆధ్వర్యంలో* 

*పురాణం , 10.10.2.2020 శనివారం*


*నిర్వహణ : బి వెంకట్ కవి*


నేటి అంశం : 

====================


*రామాయణం రसाమృతకావ్యమ్*


==================

*అందరికి శుభాభినందనలు*


సర్వశ్రీ

🎊🎊🎊🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐💐💐

*కొండంత అండ*


🍥 *అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారు*

*👍 సంధ్యారెడ్డిగారు*


*సమీక్షకవిశ్రేష్ఠులు*

---------------------------------

మోతె రాజ్ కుమార్ గారు

బక్కబాబూరావుగారు

स्वర్ణసమతగారు

డా. నాయకంటి నరसिंహశర్మగారు


*ధ్వనిపై సమీక్ష కవివరేణ్యులు*

------------------------------------

మోతె రాజ్ కుమార్ గారు

మాడుగుల నారాయణమూర్తిగారు

బక్క బాబూరావుగారు

డా. కోవెల శ్రీనివాसाచార్యులుగారు

అంజలి ఇండ్లూరిగారు

स्वర్ణసమతగారు

హరిప్రియగారు

జోషి పద్మావతిగారు

డా. బల్లూరి ఉమాదేవిగారు

మొహమ్మద్ షకీల్ జాఫరీగారు

అరుణశర్మ చయనం గారు

భారతిగారు

సంధ్యారాణిగారు

రాంమోహన్ రెడ్డి గారు

ల్యాదల గాయత్రిగారు

దారस्नेహలతగారు


*పద్య ఉత్తమ రామాయణంకవులు*

-----------------------------------

*వెలిదె ప్రसाద్ శర్మగారు(108)పద్యాలు*

శేషకుమార్ గారు

అవధాని మాడుగుల నారాయణమూర్తిగారు

అవధాని అంజయ్యగౌడ్ గారు

తులसि రామానుజాచార్యులు గారు

డా. కోవెల శ్రీనివాसाచార్యగారు

కామవరం ఇల్లూరు వెంకటేశ్ గారు

నీరజాదేవిగుడిగారు

తౌట రామాంజనేయులుగారు

చిల్క అరుంధతిగారు

నరसिंహ్మమూర్తి చింతాడగారు

డా.బల్లూరి ఉమాదేవిగారు

పల్లప్రోలు విజయరామిరెడ్డిగారు

మచ్చ అనురాధగారు

కాల్వ రాజయ్యగారు


*ఉత్తమ గేయ రామాయణం కవులు*

********************

మోతె రాజ్ కుమార్ గారు

శ్రీరామోజు లక్ష్మీరాజయ్యగారు

వి. సంధ్యారాణి గారు

చెరుకుపల్లి గాంగేయశాस्रि గారు

ఢిల్లీ విజయకుమార్ శర్మగారు

ఎడ్ల లక్ష్మీగారు

యెల్లు అనురాధ రాజేశ్వర్ రెడ్డిగారు

ల్యాదాల గాయత్రి గారు


*వచన ఉత్తమ రామాయణం కవులు*

------------------------------------

మంచికట్ల శ్రీనివాस् గారు

చయనం అరుణశర్మగారు

బక్క బాబూరావుగారు

గీతాశ్రీ स्वర్గం గారు

అంజలి ఇండ్లూరిగారు

డా.అడిగొప్పుల సదయ్యగారు

स्वర్ణసమతగారు

నెల్లుట్ల सुనీతగారు

కొప్పుల ప్రसाద్ గారు

మొహమ్మద్ షకీల్ జాఫరీగారు

డా. నాయకంటి నరसिंహ్మాశర్మగారు

దుడుగు నాగలతగారు

విజయగోల్తిగారు

బంధు విజయ కుమారిగారు

శిరశినహాళ్ శ్రీనివాసమూర్తిగారు

లలితారెడ్డిగారు

కాళంరాజు వేణుగోపాల్ గారు

బోర భారతీదేవిగారు

ప్రభాశాस्रि జ్యోష్యుల గారు

నల్లెల మాలికగారు

सि హెచ్ వెంకటలక్ష్మీగారు

తెలికిచర్ల విజయలక్ష్మీగారు

పబ్బ విజయలక్ష్మీగారు

వసంతలక్ష్మణ్ గారు

యాంसाని లక్ష్మీరాజేందర్ గారు

పిడమర్తి అనితాగిరిగారు

జి రామమోహన్ రెడ్డిగారు

ఓ రామచందర్ రావు గారు

రావుల మాధవీలతగారు

చిలకమర్రి విజయలక్ష్మీగారు

వై.తిరుపతయ్యగారు

ప్రొద్దుటూరి వనజారెడ్డిగారు

మల్లెఖేడి రామోజీగారు

పొట్నూర్ గిరీష్ గారు

త్రివిక్రమశర్మగారు

పండ్రువాడ सिंగరాజుగారు

ఈశ్వర్ బత్తులగారు

రుక్మణీశేఖర్ గారు

ముడుంబై శేషఫణిగారు

వెంకటేశ్వర్లు లింగుట్లగారు

జ్యోషి పద్మావతిగారు

జె. పద్మావతిగారు

డా .सूర్యదేవర రాధారాణిగారు

డా.చీదెళ్ళ सीతాలక్ష్మీగారు

सुజాత తిమ్మనగారు

కోణం పర్శరాములు గారు

యం టి.स्वర్ణలతగారు

డా.ప్రియదర్శిని కాట్నపల్లిగారు

सुకన్యవేదం గారు

దార स्नेహలతగారు

బి. स्वప్నగారు

డా .భారతిమీसाలగారు

చాట్ల పుష్పలతగారు

सिరిపురం శ్రీనివాसु గారు

గంగధర్ చింతలగారు

सि హెచ్ వి. శేషాచారిగారు


*ప్రశంస రామాయణం కవులు*

------------------------------------


బి.सुధాకర్ గారు

శైలజా శ్రీనివాस् గారు

వేలేటీ శైలజగారు

శైలజరాపల్లిగారు

మరింగంటి పద్మావతిగారు

सुధామైథిలీగారు

కట్టెకోల చిననరసయ్యగారు

గంగాపురం శ్రీనివాस् గారు

కొణిజేటి రాధికగారు

గాజుల భాలతి శ్రీనివాस् గారు

పోలె వెంకటయ్య గారు

జల్లిపల్లి బ్రహ్మం గారు

యక్కంటి పద్మావతిగారు

డా.కల్వకొలను పద్మకుమారి గారు

డా. ఐ.సంధ్యగారు

కొండ్లె శ్రీనివాस् గారు

గొల్తి పద్మావతిగారు

తాతోలు దుర్గాచారి గారు

6305884791


నేటి అంశంలో 9⃣8⃣కవనాలను ఆవిష్కరించిన

కవులెల్లరకు సర్వాభినందనలు.


*అమరకుల దృశ్యకవి చక్రవర్తిగారికి* *వందననీరాజనాలు* *ధన్యవాదసమర్పణలు*


*నాతోపాటు సమీక్షలను అందించిన కవివర్యులకు ధన్యవాదాలు*


 *మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం.*


💥💥💥🌹💥💥💥

10/10/20, 10:05 pm - Telugu Kavivara removed +91 94401 74050

10/10/20, 10:06 pm - Telugu Kavivara removed +91 98496 01934

10/10/20, 10:06 pm - Telugu Kavivara removed +91 94925 60562

10/10/20, 10:07 pm - Telugu Kavivara removed Vijaya Sree

10/10/20, 10:07 pm - Telugu Kavivara removed +91 99124 51319

10/10/20, 10:07 pm - Telugu Kavivara removed Sahasra Kavi

10/10/20, 10:07 pm - Telugu Kavivara removed +91 94915 62006

10/10/20, 10:08 pm - Telugu Kavivara removed +91 98666 87134

10/10/20, 10:09 pm - Telugu Kavivara removed +91 99087 33389

10/10/20, 10:09 pm - Telugu Kavivara removed +91 98667 57278

10/10/20, 10:09 pm - Telugu Kavivara removed +91 93983 30214

10/10/20, 10:09 pm - Telugu Kavivara removed +91 81848 54708

10/10/20, 10:09 pm - Telugu Kavivara removed Janardhan Kudikala

10/10/20, 10:10 pm - Telugu Kavivara removed +91 80198 96883

10/10/20, 10:11 pm - B Venkat Kavi changed this group's settings to allow all participants to send messages to this group

10/10/20, 10:11 pm - Telugu Kavivara: *💥🚩రాసే వారికి అవకాశం కోసం నిశబ్ద కవులను వేరే సమూహంలోకి మారుస్తున్న*

10/10/20, 10:12 pm - venky HYD: <Media omitted>

10/10/20, 10:12 pm - Telugu Kavivara removed +91 80084 91994

10/10/20, 10:12 pm - Telugu Kavivara removed +91 98494 46027

10/10/20, 10:13 pm - Telugu Kavivara removed +91 98496 43368

10/10/20, 10:13 pm - +91 99639 15004: ఆవలకొండ అన్నపూర్ణ. ఈ రోజు రచన లో నాపేరు రాలేదు. మాస్టరుగారు

10/10/20, 10:13 pm - +91 97017 52618: *రామాయణము*  సకలవేదసారము, సర్వమానవులకూ ఆదర్శము. నాటికీ నేటికీ సర్వకాలాల్లోని మానవులకందరికీ రామాయణం లోని పాత్రలు ఆదర్శమై ఉంటున్నాయి. ఋగ్వేదము రామునిగా రూపుదాల్చగా, యజుర్వేదము లక్ష్మణునిగానూ, సామవేద భరతుని గానూ, అథర్వణవేదము శత్రుఘ్నునిగానూ రూపుదాల్చాయి. అందుకే రామాయణం సకలవేద సారమైంది.

అటువంటి రామాయణ కావ్యాన్ని సంపూర్ణ రసరమ్యకావ్యం పూర్ణత్వాన్ని సఫలీకృతం చేసి  పునీతులను చేసిన *శ్రీ వెంకట్ కవి* గారికి ధన్యవాదములు అభినందనలు.మీ నిరంతర స్పందనా పర్యవేక్షణకు ప్రత్యేక అభినందనలు.

👏👏👏💐💐💐

*దృశ్యకవి చక్రవర్తి అమరకుల గారి అకుంఠిత దీక్షా పరిశ్రమ అద్భుత విజయాలు సాధిస్తోంది* . 👏👏👏💐💐💐


*అద్భుత ప్రోత్సాహంతో మేడం సంధ్యారెడ్డి గారి నిరంతర ప్రేరణకు సర్వదా అభినందనలు*  👏👏👏💐💐💐


*మల్లిన మల్లీ   108  పద్యమాల తోరణమల్లిన  వెలిదె ప్రసాదశర్మ గారికి అభినందన మేళా మాలలు*  👏👏👏💐💐💐

---------------------------

*మంచికట్ల శ్రీనివాస్*  🙏💐💐

10/10/20, 10:16 pm - venky HYD: 

98 అంటే

నవ రసాలు నిండి

అష్ట దిగ్గజాలు పండి

10/10/20, 10:17 pm - +91 98679 29589: వందనాలండీ,

హృదయపూర్వక శుభాకాంక్షలు ఆర్యా🌹🌺💐🙏

10/10/20, 10:18 pm - +91 99631 30856: *పెద్దలు,గురు తుల్యు లు*

వెలిదె ప్రసాద్ శర్మ గారికి వందనములు,

ఒక్క రోజు లో 108 ఆట వెలదు లతో పద్య రాజ మాలికలు, తోరణం గా మలిచి

మన కళాపీఠం నకు ఓ నవ్య కాంతి నీ చేకూర్చారు, మీకు

*శతాధిక అభినందనలు*

👏👏👌👌👍👍💐💐🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment