Saturday, 7 September 2019

Saturday 3

[22/12/2018, 11:09 AM] venky HYD: ఓం! అభయ హస్త ప్రదర్శక గోవిందా!

నిను తలచిన వారికి తిరుమల క్షేత్రమే చిరునామా!

నిను కొలిచిన వారికి నీ తలపే ఎల్లరి వీలునామా!
నిన్ను కోరిన వారికి మోక్షమోసంగే వేంకట ధామా!

నిను సేవించిన ఆళ్వారులకు నీ నామమే మహా నామా!
ఇనకుల పురుషోత్తమ ఇక్ష్వాకుల కౌసల్య రామా!

నిను చూచిన చాలు కలుగును శాంతి బుద్ధ లామా!
నిను ఏమి చేయలేవు మొఘల్ సామ్రాజ్య ఫర్మానా!

వేం*కుభే*రాణి
22-12-2018
[31/12/2018, 10:54 PM] venky HYD: సత్య వ్రతం వరం అన్న ప్రసాదం!
నూతన గృహం పూజం సర్వ దోష హరం!
కళ్యాణం వధూవరం నిత్య నూతనం!
నిత్య పూజితం ఇష్టం కార్య సర్వ ప్రదాయకం!
పంచరత్న కధ ప్రధానం నారాయణ నిష్ఠ ప్రథమం!
[05/01, 7:44 PM] venky HYD: ముకుంద మురారి గోవింద!

కనక పోయినా యశోదకు శిశువు ఇతడు!
        సృష్టించిన బ్రహ్మకు తండ్రియును ఇతడే!

అణువు అణువులోను ఇతడు!
          బ్రహ్మాండమంతయును ఇతడే!
కుచేలుడు మిత్రుడు ఇతడు!
          అర్జునుడి స్నేహితుడు ఇతడే!

గీత గోవిందుడు ఇతడు!
          జ్ఞాన భగవద్గీతకు గురువు ఇతడే!
ప్రేమకు రూపము కృష్ణుడు ఇతడు!
          దుష్ట శిక్షణకు పరశురాముడు ఇతడే!

కరి రాజును రక్షించిన విష్ణువు ఇతడు!
          శిశుపాలుని శిక్షించిన కృష్ణుడు ఇతడే!
గోవర్ధన గిరిని ఎత్తినది ఇతడు!
          శమంతక మణుగుల బంగారాలు ఎత్తలేనిది ఇతడే!

వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
29-12-2018
Mukunda Murari Govinda!

Though not given birth, he is the child of Yashoda mai!
He is the father of Brahma, creator of the World!

He is in every atom!
He is filled all the Universe!
He never forget the friendship of poor Kuchela!
He never left alone Arjuna, his friend!

Geeta Govinda is he!
Treasure Bhagavadgeeta, he himself is Guru!
He is Brand Ambassador of love, thy Krishna!
He is Parusharama, in the forefront to punish the wrong!

He is the saviour Vishnu, for Elephant!
He is the Krishna, punisher of Sisupala.
He is the one, who lifted mountain Govardhan!
Tonnes of gold not able to lift, he is Lord Krishna!

Vem*kube*rani

Happy Saturday n weekend.
[05/01, 7:45 PM] venky HYD: ఒక్కటే బాణం ఒంటిమిట్ట రామం

ఏక పత్ని స్ధానం ఏకశిలా నగర సీతం
పోతన భాగవత బమ్మెరం ఆంధ్రా భద్రా చలం

విజయనగర సామ్రాజ్య శిల్పం రామ బాణ తీర్ధం
ఏక శిలా విగ్రహం లక్ష్మణ రామం సీతం

శ్రీ ఆంజనేయ మమేకం లక్ష్మణ సమేత రామం
హనుమ లేని ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం
వేేం*కుభే*రాణి
This temple is built before Hanuma meets Rama. That's the reason Hanuma is not in this temple.
Rama, Sita, Lakshmana all sculpted from one stone, that's the name Ontimitta. Temple architecture is of Vijayanagara samrajya style.
05-01-2019
[12/01, 6:53 AM] venky HYD: ఓ! వైకుంఠ వాసా!

మొట్టమొదట నీ తలుపులు తెరుచును సన్నిధి గొల్ల!

తేట తెలవారక ముందే నీ తలపులతో కాచిరి జనులు ఎల్లా!
తెర తీయగా రాదా అని కవులు వేచురు దశ దిశ లెల్లా!

నమ్మని వారు పృచ్ఛకులు వలె అడిగిరి ప్రశ్నలు మళ్ళా!
నారాయణ ఊరేగే నా మనసు వైకుంఠ తిరుమాఢ వీధులెల్ల!

కర్మములు క్రమమున కార్యములు వలె కరుగును పుష్కరిణిన అలా!
నీ దాసుడనైన నా పాపములు తప్పిన పిల్లాడు తిరునాళ్ళాలా!
వేం*కుభే*రాణి
Happy Saturday n Festival weekend.
12-01-2019
[13/01, 7:39 PM] venky HYD: How Poets welcome Sankranti Poushya Lakshmi

_వచ్చింది వచ్చింది సంక్రాంతి_ అన్న రాయప్రోలు సుబ్బారావు!
_విజయ సంక్రాంతి లక్ష్మి శోభిల్లు లెమ్ము_ అన్న సుధాంశు కవి!
_మొగలీపువ్వంటి మొగుణ్ణియ్యవే_ అన్న అమ్మాయిల భావాలు!
_కదలి వచ్చెను భాగ్యాల కడలి వోలె_ అన్న తుమ్మల సీతారామ మూర్తి!
_చలి గాలి చుఱుకు హెచ్చె_ అంటూ ముద్దు కృష్ణ మనోహరంగా గానం చేసే!
_చిందులు త్రొక్కు పరికిణీ చెలువు తోడ_ అన్న పింగళి కాటూరి జంట కవులు!
_కోమ్ములకు రంగులు పులిమి, గంగిరెద్దుల దొరలు_ అన్న గుఱ్ఱం జాషువా!
_జయంబులు, కత్తి గట్టిన కోడి కాలిగోరు_ అన్న జంధ్యాల పాపయ్య శాస్త్రి!

అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.
[23/01, 1:13 PM] venky HYD: ఓం! నిత్య నిర్మలా గోవిందా!

నిత్యం జాగరూకతతో ప్రతి క్షణం రెప్పలా చూసే నీకేల సుప్రభాతం, ముత్యాల హారతులు, మమ్మును మేల్కొలుపుటకేనా!

చెరుకులొ తీపి, బియ్యంలో పదార్థం నింపే నీకేల పులిహోర పరమాన్నాలు, మమ్మును ఆరోగ్య పరుచుటకేనా!
సౌభాగ్యానిచ్చే పద్మావతి నీ చెంత నుండగా నీకేల నిత్య కళ్యాణాలు స్వామి, మమ్మును ఆశీర్వదించుటకేనా!

మాకు నిత్యము శక్తి నిచ్చే అభయ హస్తము నీ దరి ఉండగా నీకేల బ్రహ్మోత్సవములు, మమ్మును ఉత్తేజ పరుచుటకేనా!
అందరికి మణులు బంగారాలు నివ్వగలిగే లక్ష్మి దేవి నీ చెంత నుండగా నీకేల ముడుపులు స్వామి, మమ్మును చదువులో ఉద్ధరించుటకేనా!

నిత్యము స్వచ్ఛముగా నుండు నీకేల శంఖు చక్ర పుష్కరిణి స్నానాలు స్వామి, మమ్మును ప్రక్షాళన చేయుటకేనా!
నీ నామమే రాగము, మంత్రము, నీకేల స్వామి ఇన్ని కవితలు, ఇన్నిన్ని మంత్రాలు మమ్మును ఉత్సాహ పరుచుటకేనా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
19-1-19
[26/01, 7:32 AM] venky HYD: ఓం! తృణావర్త పాప హర గోవిందా!

దుర్వాస ముని శాపమే విష్ణు భక్తుడు సహస్రాక్షుడు తృణావర్తుడు గా మారే!

కంస రాజు ఆజ్ఞ మేరకు సుడిగాలి రూపంలా తృణావర్తుడు మారే!
యశోద కిందికి దింపెను కృష్ణుడిని సిద్ధి గరిమ సాధనతో బరువుగా మారే!

తల్లి ప్రేమను వీడ లేని పదహారు వేల గోపికా లోల కృష్ణుడు యశోదను సొమ్మసిల్లేలా చేసే!
సుడిగాలితో ఎగరేసుకున్న కృష్ణుడు బరువు పెరిగి పెరిగి తృణావర్తుడుకు భారముగా మారే!

బాల కృష్ణుడు కాళ్ల బంధంలో ఇరికించి జుట్టు పీకి తృణావర్తుడుకు ఉచ్చుగా మారే!
ఒక్క తన్ను కాలితో తన్ని మరణము పొంది తృణావర్తుడుకు శాప విమోచన కోరే!
 వేం*కుభే*రాణి

This Saturday thought of writing different, so, choosen this one.

Sahasraksha is a Vishnu devotee.
He didn't noticed Rishi Durvaasa, while dating with girls on river bank.
Rishi cursed Sahasraksha.
After begging pardon, Rishi told, after kick from Vishnu ji, you will be cured of your curse.
To get quick relief from the curse, he became rakshasa.
Upon order from kamsa, he went to Nanda vanam in the form of whirlwind.
Little Krishna becomes more weight by using _garima siddhi sadana_ so that Yashoda maa left him down.
As Krishna doesn't want to leave mother's love, he made
Little Krishna becomes heavy, he holds the hair of Trinavartha and kicks him to death.
Finally gave Moksha
Happy Saturday, Republic Day
26-01-2019
[02/02, 7:12 AM] venky HYD: ఓం!

నీవు చూసినదే పచ్చని తోరణం!

నీవు పాదము పెట్టినదే తిరుమల క్షేత్రం!
నీవు మనసు పెట్టినదే దేవాలయం!

నీకు ప్రసాదించినదే సుధామృతం!
నీ అభిషేకములే దివ్య ఔషధం!

నీ దివ్య నామములే శ్రావ్య గానం!
నీవు చేయి చూపినదే రాజ శాసనం!
వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
02-02-2019
[09/02, 7:49 AM] venky HYD: ఓం! వాక్ పతి బ్రహ్మ దాత్రే నమః

పలికి పలుకలేక కాదు నోరార పలుకరే
కలికి గళమెత్తి గంభీరంగా పాడరే
ఉలికి మనసారా హృదయముతో పోగడరే
అతికి సహస్ర నామములు నుడవరే
నడిచి నడవగా స్వామి బాటలోనే నడవరే
గతికి భక్తితో సర్వం అర్పించి కోలువరే
చిలికి ప్రేమ సుధామృతం ఇవ్వరే!
వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
09-02-2019
[11/02, 9:57 PM] venky HYD: ఓం! సూర్యనారాయణః

ఆదిత్య హృదయం సంహారణ రావణః రామం!

సూర్య అనుగ్రహ ఫలం ఆక్షయపాత్రః పాండవం!
తిరుమల రథం హిరణ్మయం చైతన్యః వేంకటేశం!

పత్ర హరితం కిరణజన్య సంయోగం క్రియః అర్క ఉత్తేజం!
ఆరోగ్య ప్రదాయకం సూర్య నమస్కారం నేత్రః సూర్యమాతృకం!

ఆరు ఋతువులు చక్రం ఆకులు సప్త అశ్వః సంవత్సరం!
సూర్య ప్రధానం గాయత్రి మంత్రం బ్రహ్మః అకాల మృత్యుహరం!
వేం*కుభే*రాణి

అందరికి రథ సప్తమి శుభాకాంక్షలు
[15/02, 10:31 AM] venky HYD: రాజరికాలు సైతం తృణ ప్రాయం!
విలువల కోసం ప్రాణాలు త్యాగం!
ఒక్కరే కాదు 108 కుటుంబాలు ఏకం!
ప్రాణ మానాలు అగ్నికి ఆజ్యం!

             🙏🏻🙏🏻🙏🏻
🌷జై వాసవి మాత 💐
🌷జై జై వాసవి మాత 💐
[16/02, 9:31 AM] venky HYD: ఓం! వాక్ పతి బ్రహ్మ దాత్రే
               శ్రీ వేంకటేశాయనమః

పలికి పలుకలేక కాదు నోరార పలుకరే
      తిరుమల మంత్రములు!
కలికి గళమెత్తి గంభీరంగా పాడరే సఖులు
       అన్నమయ్య పాటలు!
ఉలికి మనసారా హృదయముతో పొగడరే
       స్వామిని భావము లోన!
అతికి సహస్ర నామములు నుడవరే
        స్పష్టముగా గోవిందా అని!
నడిచి నడవగా స్వామి బాటలోనే నడవరే
        ధర్మము కాలి నడకన!
గతికి భక్తితో సర్వం అర్పించి కొలువరే
        నిర్మల హృదయమున!
చిలికి ప్రేమ సుధామృతం ఇవ్వరే
        పెదవుల వచనమున!
వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
16-2-2019
[23/02, 6:35 AM] venky HYD: ఓం! పద్మావతి ప్రియ గోవిందా!

కరికి భయపడి చెట్టు దరి చేరిన పద్మావతి
దరికి చేరనివ్వని చెలికత్తెలు శ్రీనివాసుడు తల
నలిగి ప్రేమలో విరిగి పగిలి తల పట్టుకొని వకుళ
తల్లికి చెప్పి ఆకాశ రాజు పిల్ల నిమ్మని
తనకి కళ్యాణం ఒనరించమని వేంకటేశ్వరుడు
చిలికి అమృతపు ప్రేమని చాటుదాం జగమంతా
ఉనికి తిరుచానూరు తిరుమలలో వెలిసి

భక్తికి దాసోహం
Happy Saturday n weekend.
23-02-2019
[02/03, 10:01 AM] venky HYD: ఓం! ఆపధ్బాందవ! అనాధ రక్షక గోవిందా!

సంపదల లక్ష్మికి కాంతుడు ఆ వేంకటరమణుడు కాక ఇంకెవరు తీర్చగలరు నీ కష్టాలను!

ఎంత పెద్ద మానైనా భూమి లోని వేరు మొదళ్లు కాక ఇంకెవరు పెంచ గలరు నిన్నంతలా!
గర్భము లోని శిశువుకు సంతోషాహారములు తల్లి కాక ఇంకెవరు తీర్చగలరు నీ ఆకలిని!

బంధాలు బందువులు ఎందరున్నా స్వార్థమెరగని స్నేహితుడు కాక ఇంకెవరు తీర్చగలరు నీ బాధలను!
దారులు ఎన్నున్నా బారులు తీరినా మనసు కాక ఇంకెవరు తీర్చగలరు నీ విరహాన్ని!

ఆజానుబాహుడైన చిన్న పాపడైన జారి పడితే భూమి తల్లి కాక ఇంకెవరు నిన్ను కాపాడగలరు!
బంగారాలు మణులు ఎన్నున్నా మట్టిలో పెరిగిన చిరు ధాన్యాలు కాక ఇంకేమి మీరు తినగలరు!

వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
02-03-2019
[04/03, 7:26 AM] venky HYD: అందరికి శివరాత్రి శుభాకాంక్షలు

మన శైలి మల్లన్న శ్రీశైల శివన్న కావాలా సాక్షి
గణపతి భ్రమరాంబిక మల్లికార్జునేశ్వరా!

పంచ భూతాలను తిప్పేటి రాజ రాజన్నకు
కోడే దూడలను తిప్పడం వేములవాడ రాజ రాజేశ్వరా!

నూటొక్క లింగాల కీసర రామలింగేశ్వరా!
వాయువునే ఆయువుగా ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వరా!

లేపాక్షి బసవయ్య రంకేసి రావయ్య శ్రీ వీరభద్రేశ్వరా!
యాగంటి బసవన్న పెద్దగై రావయ్య శ్రీ ఉమామహేశ్వరా!

గుడిమల్లం అపస్మారపై శివా శ్రీ పరుశ రామేశ్వరా!
నవ నందులు వెలిసిన నంద్యాల శ్రీ మహా నందీశ్వరా!

కోటప్పకొండ ఆనందవల్లి త్రికూట శ్రీ కోటేశ్వరా!
గుహలోని శివ నామమే కపిల తీర్ధ శ్రీ కపిలేశ్వరా!

కొమరవోలు మల్లన్న ఐనవోలు మల్లన్న దేవరగట్ట మల్లన్న!
నీవు లేని ఊరు చూపించగలవా శివా శ్రీ లింగేశ్వరా!
వేం*కుభే*రాణి
[09/03, 11:03 AM] venky HYD: ఓం! అర్ధితార్ధాప్రదాత్రే శ్రీ వేంకటేశాయనమః

వచ్చినాడు నా స్వామి
పిల్లాడి ఏడుపు విని పరుగు పరుగున వచ్చిన తల్లిలా!

వచ్చినాడు నా స్వామి
మొసలి నుండి ఏనుగుని రక్షింప గాలి వేగముతో వచ్చిన విష్ణువులా!
వచ్చినాడు నా స్వామి
ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభము నుండి వచ్చిన నారసింహుడిలా!

వచ్చినాడు నా స్వామి
పుండరీకుడుని కొండ పైనుండి పట్టుకొనడానికి వచ్చిన విఠలునిలా!
వచ్చినాడు నా స్వామి
ద్రౌపదిని కాపాడడానికి వచ్చిన పరమాత్మ శ్రీ కృష్ణుడిలా!

వచ్చినాడు నా స్వామి
మార్కండేయుని సమవర్తి నుండి రక్షింప వచ్చిన పరమ శివుడిలా!
వచ్చినాడు నా స్వామి
భస్మాసురుడి బారి నుండి రక్షింప వచ్చిన జగన్మోహినిలా!
వేం*కుబే*రాణి
Happy Saturday n weekend
09-03-2019
[16/03, 1:40 PM] venky HYD: ఓం త్వక్త వైకుంఠ లోకాయ శ్రీ వేంకటేశాయ నమః

పద్మావతి ఆకాశ నీలి రంగు చీర కట్టు!

శ్రీనివాసుడు కనుల పద్మ నయన బొట్టు!
కరమున కరములో కళ్యాణ పెళ్ళి ఒట్టు!

బాస చేసెను వేంకటేశుడు చేయడు గుట్టు!
అరిషడ్వర్గాల రాక్షస గుణ మట్టు పెట్టు!

తోడుంటాను మెట్టు మెట్టులో ఆనచేసి గట్టు!
క్షణ క్షణానికి గోవిందా అని జేజేలు కొట్టు!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
16-03-2019


[23/03, 7:47 AM] venky HYD: ఓం!  మాయాగూఢవిమానాయ శ్రీ వేంకటేశాయనమః

అందరి లోను ఉండు ఆత్మవు నీవే కదా!

చిన్నారి గుండె కర్మలు ఎరుగదు కదా!
మరి మరి తప్పులు ఆపవు తప్పు మాదా!

స్వేచ్ఛనిస్తూ కర్మలకు కర్తను చేస్తావు కదా!
మాయను కమ్మి మనసు తెలియక చేసే కదా!

అందరు నీలోనే ఉన్న భ్రమలు ఏల కదా!
ఎన్ని చేసినా మళ్లీ ఎంచి రక్షిస్తావు నీవే కదా!
Happy Saturday n weekend.
23-03-2019
[30/03, 8:07 AM] venky HYD: ఓం!  అనంత చరణాయ శ్రీ వేంకటేశాయ నమః

దీనుడను నేను సకల జీవుల రక్షకుడవు నీవు!

నమ్మి చరణారవిందములు చేరితిని కరుణాకరుడవు నీవు!
నమ్మి మొక్కులు మ్రొక్కితి ఆపదలు తీర్చు వాడవు నీవు!

మొక్కులు చెల్లించక వడ్డికి కాసులు ఆపధ్బాందవుడవు నీవు!
చక్ర వడ్డిలు మెడలు వంచి అప్పులు తీర్చు దారి చూపు వాడవు నీవు!

ఎన్ని ఆపదలు వచ్చినా వాడవు నీవే లక్ష్మి నిచ్చు వాడవు నీవు!
హృదయ మందిరంలో ఉండునట్లు దీవించు దైవ గురు అన్నమయ్యా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
30-03-2019
[16/04, 4:56 PM] venky HYD: అందరికి వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

*తిరుమలలో ఉగాది*

ఓం! సానుస్ధాపిత తార్ క్ష్యాయ శ్రీ వేంకటేశాయ నమ:

కాలమే తానైన స్వామి కాల గమనాన్ని తన సైగతో నడిపించే స్వామి మన కొరకు ప్రాతఃకాలమున *ఉగాది ఆస్థానానికి* వేం చేస్తారు!

అర్చకుల, జియ్యంగార్లు, పండితులు, నిర్వాహకులు ఛత్ర చామర వాయిద్య వేద పఠనాలతో బంగారు బావి ప్రక్కన వంటశాల నుండి *పడి, అన్న ప్రసాదాలు* స్వామికి నివేదిస్తారు!
*పరిమళ పురి* నుండి పెద్ద జియ్యంగార్లు అరు పట్టు వస్త్రాలు గైకొని రాగా సన్నిధిగొల్ల దివిటీతో తోడుకొని రాగా అర్చకులకు ఇస్తారు!

*నిత్యైశ్వర్యభవ* అయిన స్వామి పాదాల దరి పంచాంగం మొదట స్వామి వారి జన్మ నక్షత్ర శ్రవణ నక్షత్రా విశేషాలు చెప్పిరి!
బంగారు *కొలువు పళ్లెం* లో నవనీత హారతి జరిపి కార్య నిర్వాహణాధికారికి వెన్న తాంబూలం ఇస్తారు!

మైసూరు హారతి తాళ్ళపాక హారతి తరిగొండ హారతులు ఇచ్చి *రూపాయి హారతి* ద్వారా వచ్చిన రూపాయలు ఖజానాకు జమ చేస్తారు!
సాయంకాలం తిరుమాడ వీధులలో స్వామి ఉత్సవంగా వచ్చి భక్తులకు *నూతన సంవత్సర* శుభాశీస్సులు దివ్య మంగళ దర్శనము అనుగ్రహిస్తారు!
06-04-2019
[16/04, 4:56 PM] venky HYD: ఓం!  రామాయ శ్రీ వేంకటేశాయ నమః

రామ రాజ్యం సృష్టించిన రాముడు భువి పైనున్న కోట్లాది మానవులలో ఒక్కడా స్వామి!

చిన్నప్పుడే మారీచ సుబాహు రాక్షసులను మట్టు బెట్టిన చిట్టి రాముడు మానవుడా స్వామి!
శివ ధనస్సు విరిచి లోక మాత సీతను పరిణయ మాడిన రాముడు కూడా నరుడా స్వామి!

తండ్రి ఇచ్చిన మాట కోసం రాజవాసం వదిలి అరణ్య వాసానికి వెళ్లిన రాముడు సామాన్యుడా స్వామి!
గౌతమ మహర్షి ఇల్లాలు అహల్యకు శాప విమోచన చేసిన రాముడు రాయి మానవుడు ఒక్కటేనా స్వామి!

సప్త వృక్షాలు ఒక బాణంతో కూల్చి, కేవలం వానర సైన్యంతో సముద్రాన్ని దాటి దండెత్తిన రాముడు వా మనుడు కాదా స్వామి!
అష్ట దిక్పాలకులు, నవ గ్రహాలను పాదా క్రాంతం చేసుకున్న రావణుని ఓడించిన రాముడు మాధవుడు కాదా స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
Sree Rama Navami Wishes to All.
13-04-2019
[20/04, 7:02 AM] venky HYD: ఓం! చంద్ర లావణ్య దాయినే శ్రీ వేంకటేశాయ నమః

రావోయి మా యింటికి వేద మంత్రాల మంచి మాటున్నది!

రావడానికి సూర్య చంద్ర వాహనములు సీటున్నది!
పరవశించడానికి దారి పొడుగున పూల తోటున్నది!

చిత్రాన్నం దధ్దోజనం పాయసలు రుచి రుచిగా వేడి కూడున్నది!
ఆరగించి సేద తీరడానికి గుండెన విశాలమైన చోటున్నది!

అద్దాల మండపం ముత్యాల పందిరి సేద తీరున్నది!
మబ్బుల పాల నురుగు శేష పానుపు పరుపున్నది!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
20-04-2019
[27/04, 6:58 AM] venky HYD: శ్రీ రంగనాథ శ్రీ వేంకటేశాయ నమః

ಮನಸ್ಸು ನಲ್ಲಿ ಯಿರ ನನ್ನ ರಂಗ ನಿಗೆ!

ಎಲ್ಲಾ ದುಃಖವನ್ನು ಗಳಿಸುವ ಭಂಗ ನಿಗೆ!
ಬಡತನ ಭಂಗ ಮಾಡಲು ಹಿಂಗದಂತ ನಿಗೆ!

ಅಂಗಾಂಗಾ ಸುಂದರ ರಸ ರಂಗ ನಿಗೆ!
ಶ್ರೀ ಮದಿ ಪತಿ ಅಲಿವೆಲು ಮಂಗ ನಿಗೆ!

ಎಲ್ಲ ಲೋಕ ಬಹು ಸುಂದರಾಂಗ ನಿಗೆ!
ಸಿರಿ ಹಿರಿ ದಂತ ಬಂದ ಶೃಂಗಾರ ನಿಗೆ!

ನನ್ನ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಗಳು!
Happy Saturday n weekend.
27-04-2019
[11/05, 4:45 PM] venky HYD: ఓం!  శ్రీ పుష్ప ప్రియ వేంకటేశాయ నమః

కర్మములు మర్మములు కరములు జోడించిన పోవునే!

తరములు పాపములు నామములు పలికినంత పోవునే!
కరువులు ఏకరువులు నీ దరువులో తీరి పోవునే!

భారములు వారములు నిరంతర సేవలో కరిగి పోవునే!
దైవములు పుష్పములు నీ ప్రియ కంఠ సరములై పోవునే!

కంకాళము కణములు భక్తి కణజము జీవము వచ్చునే!
వరములు నిరంతరములు భక్తుల సేవకే వచ్చునే!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
04-05-2019
[11/05, 4:45 PM] venky HYD: ఓం! విశ్వ తీర్ధాఘహారిణే శ్రీ వేంకటేశాయ నమః

వీచే గాలి వేణు నాదమై జలపాతపు గల గల తాళ ధ్వనులు!

నారద తుంబురులు నిర్మల మనస్సుతో వీణలు వాయించే గగనమున!
రత్న ఖచిత వీణను పొందే తుంబురుడు రాజు బర్హిషుడుని  స్తుతించి!

నారద ముని శాపంతో వేంకటాచల ఘోణ తీర్ధాన వేలాడే!
ఘోర తపస్సు చేసే తుంబురుడు వత్సరము శ్రీ మన్నారాయణుని!

ఫాల్గుణ మాస ఉత్తర ఫల్గుణి నక్షత్ర పౌర్ణమి ప్రత్యక్ష దైవం!
వరమొసంగె ఘోణ తీర్ధమున పాపములు పోవు స్నానముతో!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
11-05-2019
[18/05, 7:40 AM] venky HYD: కూర్మం 🐢

ఎప్పుడు తగ్గాలో తెలిసిన కూర్మం! పవన వేగం లేకున్నా  వడిగా కుందేలు🐇 కంటే ముందు!

బయట ఎంత కఠినము మనసు అంత మెత్తన! ఏనుగు పాదం సైతం ఏమి చేయని వైనం!
పర్వతం అంత భారం మీద ఉన్న నిశ్చలముగా ఉండు! అమృత ఫల సిద్ధి కి ముందే ఉండి!

తాబేలు రూప సాలగ్రామ పూజలు గర్భాలయమున!చంద్రవంశ శ్వేత చక్రవర్తికి కూర్మావతార ప్రత్యక్షం!
రామానుజ చార్యులు తీసుకొచ్చిన వైష్ణవిజం మొదలు! శైవ వైష్ణవాలు ఫరిడవిల్లే ఇక్కడ సమం సమం!

లవ కుశలు పూజించిరి విష్ణువుని, బలరాముడు బలవంతముగా దర్శించెను ఇచట! కళింగ రాజులు పోషించిరి చొడగంగ అనంతవర్మ!
విజయనగర సామ్రాజ్య రాజులు మొక్కిరి కూర్మానికి! నేటికి గజపతి రాజులు విజయనగరం ట్రస్టీగా ఉన్నారు!
Sri Kurmam Temple in Srikakulam, Gavi Ranganatha Swamy Temple in Hosadurga and Sri Kurma Varadharaja Swamy Temple in Chittor are the three prominent temples where Lord Vishnu is worshipped in the form of tortoise.

About 2km from sea shore.  About 15 km from Srikakulam is *Sri Kurmam*
వేం*కుభే*రాణి
అందరికి శ్రీ కూర్మ జయంతి శుభాకాంక్షలు!
Happy Saturday n weekend.
18-05-2019
[25/05, 8:23 AM] venky HYD: అన్నమయ్య

రోజుకో కీర్తన ఆశువుగా భక్తితో రాసిన అన్నమయ్య!

తిరుమల కొండలు లోయలు కోనలు తిరుగుచు రోజుకొక పాట!
ఎనబై ఏళ్లలో (80*365) ముప్పై వేలకు పాటలు!

ప్రతి ఒక్క పాట ఓ ఆణిముత్యం ఆ భావ సారూప్యం!
ప్రతి సందర్భానికి ప్రతి అవతారంకి ఓ కీర్తన రాసి నాడు అన్నమయ్య!

శనివారం ఒక్క పాట రాయడానికి వారమంతా కష్ట పడతాను నేను!
వజ్రాలు వైడూర్యాలు మాట దేవుడు ఎరుగు, దండలో పూసైన చాలు!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
25-05-2019
[01/06, 8:10 AM] venky HYD: ఓం! దామోదరాయ శ్రీ వేంకటేశాయ నమః

రెండు కనులు చాలవు నిను చూడ, నీ అలంకారాలు చూడ!

రెండు చెవులు చాలవు పాటలు విన, నీ కీర్తనలు విన!
రెండు చేతులు చాలవు దండాలు పెట్ట, నీకు అడుగడుగు దండాలు పెట్ట!

రెండు పాదములు చాలవు యాత్ర చేయ, నీ తిరుమల యాత్ర చేయ!
రెండు పెదవులు చాలవు నామము పలుక, నీ సహస్ర నామములు పలుక!

రెండు భుజములు చాలవు నిను మోయ, తిరుమాఢ వీధులలో నీ పల్లకి మోయ!
రెండు జన్మలు చాలవు నిను కొలచ, జన్మ జన్మల కొలచ!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
01-06-2019
[08/06, 9:49 AM] venky HYD: Devotees waiting in Hall for darshan for 12hours to 16hours. Thoughts in their minds. Expressed like this:

కరుణించవా మా స్వామి ఈ నిరీక్షణ దక్షతకే పరీక్ష పెట్టినది చాలు స్వామి!

కనిపించవా స్వామి ఎదురుగా నీ గుడి గోపురము గంటల తరబడి చూస్తూనే ఉన్న, దయ చూపవా స్వామి!
కనికరించవా స్వామి తెలియక చేసిన చిన్న తప్పులకు ఇంత నిరీక్షణ!

నీ ఆశీర్వాదం కన్నా పాలు ఫలహారాలు మాకేమి మిన్న కాదు స్వామి, దర్శన భాగ్యం కలిగించు స్వామి!
పదునాలుగు లోకములు తిరిగి రావచ్చు ఈ వేచిన సమయములో ఒక రోజైన తిరుమలలో ఉండాలనా!

ఎలుక 🐁నైనా కాకపొతిని నీ దర్శనము సందులలో దూరి, మంత్రి నైన కాక పోతిని వేరుగా దర్శనం!
పదహారు వేల గోపికలు ఉన్నారనా 16 కంపార్టుమెంట్లు, ఇది చాలదన ఇంకో వైకుంఠం కాంప్లెక్స్!
వేం*కుభే*రాణి
08-06-2019
[15/06, 7:44 AM] venky HYD: _Jyestabhishekam_ performance in Tirumala. This year 14,15,16 June.
తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం విశేషాలు!

బింబం విగ్రహం జీర్ణం అంగాంగ పునరుద్ధరణం జ్యేష్ఠాభిషేకం!

జ్యేష్ఠ మాస జ్యేష్ఠా నక్షత్ర చంద్ర యుక్త త్రయోదశి ప్రారంభః పౌర్ణమి తతః
పల్లవ రాణి సామవై పేరుందేవి వెండి విగ్రహం శ్రీ భోగాశ్రీనివాస మూర్తి! (614AD)

హోమం అనుహోమం పూర్ణాహుతి సహా అస్తహోమ పాయసాది మహా హవిస్సు నివేదన!
అష్టోత్తర శత కలశ స్నపన తిరుమంజన అర్చారూప శిరసాది పాదపర్యంతం!

శ్రీ శ్రీనివాసునికి దివ్య వైఖానస ఆగమోక్తరీత్యా వజ్ర ముత్యంగి స్వర్ణ కవచ సమర్పణ!
భక్తుల పాలిట కామధేనువై విలసిల్లి సర్వ సుఖ హేతుభూతం జ్యేష్ఠాభిషేకం!

Yearly more than 500 utsavams like _abhishekams, nitya kalyanam, snapana thirumanjanams_ idols will worn out. Every year by _Jyestabhishekam_ idol will be re-established.
All long year Idols will be covered with _swarna vajra kavacham_ during these 3 days, one can have _nija rupam_ of idol.
Happy Saturday n weekend.
15-06-2019
[22/06, 7:59 AM] venky HYD: A devotee in Tirumala, after his pilgrimage, one unable to leave. Though his heart says to stay, he can't.
Maybe due to expiry of leave, boss, office/business.

ತಿರುಮಲ ನಿಂದ ಮರಳಿ ಹೋಗಲಾರೇ; ಸ್ವಾಮಿ ನಿಂತು ಇಲ್ಲಿ ಇರಲಾರೇ!

ಸ್ವಚ್ಛವಾದ ಗಾಳಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಲಾರೇ; ಈ cityನ pollutionಗೆ ಇರಲಾರೇ!
ಗೋವಿಂದ ನಾಮ ದ್ವನಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಲಾರೇ; ಈ cityನ traffic soundಗೆ ಇರಲಾರೇ!

Bossಗೆ Boss ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗಲಾರೇ; ಈ city ನಲ್ಲಿ ಇರ boss ಕಡೆ ಇರಲಾರೇ!
ತಂಪಾದ ಪುಷ್ಕರಣಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಲಾರೇ; ಈ Townನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಗೆ ಇರಲಾರೇ!

ತಿರುಮಲ ಲಡ್ಡು ಪ್ರಸಾದಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಲಾರೇ; ಈ Townನಲ್ಲಿ ಸುಡುಗಾಡು ಸಿದ್ದನಮಠ ಇರಲಾರೇ!
ತಿರುಮಾಢ ಬೀದಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಲಾರೇ; ಈ city ನಲ್ಲಿ ಹೊಲಸಾದ ಬೀದಿ ಯಲ್ಲಿ ಇರಲಾರೇ!
ವೇಂ*ಕುಭೇ*ರಾಣಿ
Happy Saturday n weekend.
22-06-2019
[29/06, 6:42 AM] venky HYD: Lord Balaji himself went to Narayavaram, where Padmavati, daughter of Akasha Raju living.

అలిగి వచ్చిన ఆ అందాల పద్మావతి కోసం, నా స్వామి సోది సెప్తానమ్మ! సోదో! సోదెమ్మ అంటు పుర వీధులలో తిరిగినే!

ఎల్ల లోకములు ఎరిగిన నా స్వామి, ఎరుక చెప్తానమ్మ అంటు పుర వీధులలో తిరిగినే!
ఏడు కొండలకే దేవుడు నా స్వామి, కొండదేవర మీద ఆన! అంటు పుర వీధులలో తిరిగినే!

అన్ని కర్మలకు మూలము నా స్వామి, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను అంటు పుర వీధులలో తిరిగినే!
అడుగడుగు దండాలు తీసుకొనే నా స్వామి, దండాల్ దొర, దరమపెబువులు దొర అంటు పుర వీధులలో తిరిగినే!

నిత్యము సత్యము అయిన నా స్వామి, సత్తెమె సెప్తానమ్మ, మనుసులో ఉన్నదే సెప్తా అంటు పుర వీధులలో తిరిగినే!
మొక్కితే ఆపదలు తీర్చే నా స్వామి, కొండ దేవరని మొక్కుకొ నీకు మనువవుతాదే కూన అని సెలవిచ్చినే!
Happy Saturday n weekend.
29-06-2019
[06/07, 8:32 AM] venky HYD: అహం! బ్రహ్మస్మి!

నీవు ఓర్పుగా ఉంటే నేను కూర్మావతార విష్ణువుని!

నీవు పొగరనుకుంటే నేను పరశురాముడిని!
నీవు మాట నిలబెట్టు కుంటే నే రాముడిని!

నీవు మాయ చేయాలని అనుకుంటే నే కృష్ణుడిని!
నీవు షరతులు పెట్టాలని అనుకుంటే నే నృసింహుడిని!

పాదం పెట్టి అణచి వేయాలనుకుంటే నే వామనుడిని!
నీవు పాపాలు చేయాలనునుకుంటే నే వేంకటేశ్వరుడిని!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.

నీకన్న బ్రహ్మ ఎవరు లేరు సృష్టిలో, నువ్వు సాధించాలి అనుకున్నది చేసెసెయ్!

నీకు 10 కావాలనుకుంటే 12 కు గురి పెట్టెసెయ్!
06-07-2019
[13/07, 10:43 AM] venky HYD: Thoughts of Pilgrim, while climbing foot steps of Seven Hills. In this, attributed seven stages of life to Seven Hills.

కంటి గరుడుని రెక్కల వేగాన్ని కంటి మోకాళ్లపై భక్తులు పాకులాడే బాలుడిగా గరుడాద్రిన!

కంటి వృషభుడి పోరాటము కంటి భక్తులు వృషభములా పరుగులెత్తు లేగదూడలా వృషబాద్రిన!
కంటి అంజనాదేవి తపమును కంటి భక్తులు విద్యార్థులులా శ్రద్ధగా చదివి నట్లుగా అంజనాద్రిన!

కంటి నీలాంబరి దేవి భక్తితోడ సమర్పించిన భక్తులు యవ్వనమున అర్జి పత్రము నీలాద్రిన!
కంటి ఆదిశేషుడు విధి నిర్వహణ కంటి భక్తుల ఉద్యోగ విధులలో బుసలు కొట్టు శేషాద్రిన!

కంటి వైకుంఠము ఇల భారము క్రీడాద్రి కంటి భక్తుల పాపములు తీర్చు కొండ వేంకటాద్రిన!
కంటి నారాయణ మహర్షి దీక్షా దక్షతను కంటి భక్తుల మోక్ష సాక్షాత్కారం నారాయణాద్రినా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
13-07-2019
[20/07, 4:21 PM] venky HYD: One read it like Lord Balaji n Goddess Padmavati are talking to each other. As per one story, Curry leaves are missing in _sare_
In Tirumala u can not find Curry leaves.
One anecdote, daily Swamy will be coming down to Mangapuram.
In this context, discussion would have been.

అరెరె! అరె! అరెరె! ఎక్కడ నా స్వామి ప్రేమ ఓడ!

ఓలమ్మో! ఓలమ్మో! నా స్వామి స్వాగతం చెట్టు నీడ!
అబ్బ! అబ్బబా! అబ్బబ్బబా! ఉండదా భక్తి మేడ!

అయ్యయ్యో! అయ్యో! అయ్యో! కోపమా కరివేపాకు జాడ!
అబ్బబ్బ! అబ్బ! ఆ! నా స్వామి నీకేమి కాడా!

అమ్మమ్మో! ఆ! అమ్మో! నా స్వామి నీకై రాడా!
రా! రా! శ్రీ వారు! రారు మారు మారు గోపాలుడా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
20-07-2019
[27/07, 8:46 AM] venky HYD: పక్షి వాహనా గోవింద! గరుడారూడా గోవింద!

ఆ కలహంసలు స్వామి, నీ ఉత్సవములో తిరుమాడ వీధులలో నడకలు నేర్చేనా!

ఆ ఆలగద్దలు స్వామి, నీ శత్రువులలో నిప్పు గక్కి సహస్ర దీపాలు వెలిగేనా!
ఆ నెమలికూనలు స్వామి, నీ బ్రహ్మోత్సవంలో పురి విప్పి నాట్యము ఆడేనా!

ఆ కొమ్మకోయిలమ్మలు స్వామి,  నీ సుప్రభాతములో గొంతు సవరించి పాడేనా!
ఆ ఊరపిచ్చుకలు స్వామి, నీ ముత్యాల పందిరి సేవలో ముత్యాలు ఏరేనా!

ఆ జటాయువు స్వామి, నీ మార్గములలో చల్లని గాలి వీచేనా!
ఆ రామచిలకలు స్వామి, నీ పవళింపు సేవలో పద్మావతి పలుకులు పలికేనా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
27-07-2019
[03/08, 8:42 AM] venky HYD: నను కాపాడడానికి నీ కృప ఉండగా నాకు భయమేల!

పాప పరిహారార్థ నీ నామము ఉండగా నాకు భయమేల!
కోపమా శాంతమాయే నీ చిత్తము ఉండగా నాకు భయమేల!

దుర్గుణాల తర రక్షింప నీ శరణాగతి ఉండగా నాకు భయమేల!
కర్మ బంధాలు తప్పించ నీ భక్తి మార్గము ఉండగా నాకు భయమేల!

కోరి తపములు ఫలింప నీ సంకీర్తనలు ఉండగా నాకు భయమేల!
ఇహ పరములు సాధింప నీ లక్ష్మి ఉండగా నాకు భయమేల!
అన్నమయ్య సంపుటి 2 సంకీర్తన 430
Happy Saturday n weekend.
03-08-2019
[10/08, 7:23 AM] venky HYD: ఒక రాశి వారు ఒక రాయి పెట్టుకొమంటారు, ఒక రాశి వారు ఒక  రంగు బట్టలు కట్టుకొమంటారు. ద్వాదశ రాసుల వారికి సమానంగా అనుగ్రహిస్తాడు నా స్వామి!

బంగారు కొండ పైన సంకీర్తన రాసి పుణ్యపు రాశి!
ఎల్లరు చూసి కురిపించే వరాల రాశి కలియుగ దైవ రాశి!

ఆదిశేషుడు పైన కలియుగ ఆది పురుషుడు శ్రీరాసి మేష రాశి!
వేంకటేశ్వరుని లోని ఈశ్వర తత్వమే కపిలేశ్వర వృషభ రాశి!

పద్మావతి శ్రీనివాసుల నిత్య కళ్యాణమే మిథున రాశి!
అష్ట దిక్కులు స్వామి మహిమ ఎనిమిది కాళ్ల కర్కాటక రాశి!

సింహం లాంటి శక్తి ఇచ్చే స్వామియే నాకు సింహ రాశి!
ఆకాశ రాజు కుమార్తె అలి వేలు మంగ పద్మావతియే కన్నె రాశి!

పాపములను తూచి తుంచి వడ్డి కాచుటయే తులా రాశి!
విషపు మనసుల మనుషులకు అభయమిచ్చే నా స్వామి వృశ్చిక రాశి!

భృకుటి ముడిపడి శత్రువులపై బాణాలు వేసే కనుబొమలే ధనస్సు రాశి!
శ్రవణా నక్షత్ర యుక్త స్వామియే జన్మరాశి మకర రాశి!

సహస్ర కలశముల అభిషేకాల వేళ శుభాల కుంభ రాశి!
చక్ర తీర్ధాల పుష్కరిణి స్నానాల వేళ వేదాల మీన రాశి!
వేం*కుభే*రాశి
Happy Saturday n weekend.
10-08-2019
[17/08, 7:52 AM] venky HYD: శ్రీ హయగ్రీవ జయంతి (శ్రావణ పున్నమి)

దానవ హయగ్రీవుడు వర గర్వంతో యాగాలు నిలిచే దేవతలను పీడించే!

సర్వదేవతలు పూజించే విష్ణువు హయగ్రీవుడి నుండి రక్షింప!
పదివేల సంవత్సరాల యుద్ధం, వింటి నారి కొస విశ్రాంతి, తెగి తల పోయింది!

బ్రహ్మాది దేవతలు పరాశక్తిని ధ్యానింప హయ శిరస్సు అతికించి!
జ్ఞానం ఆనందం ప్రసాదించే గురు స్వరూపం హయగ్రీవం!

స్ఫటికపు నిర్మలమైన రూపం, పరాపర విద్యలకు మూలం!
శంఖం చక్రం పుస్తకం చిన్ముద్రం చతుర్భుజం, ధ్వని సకిలింపు బీజాక్షరాలు!
Happy Saturday n weekend.
In Kanchi, as Rushi, Hayagreeva taught Agastya importance of Sri Vidya and Sri Lalitha Sahasra Naamas.
17-08-2019
[18/08, 11:37 AM] venky HYD: Atti Varada Raja Swamy

నాలుగు గంటల నిరీక్షణ తర్వాత నాలుగు క్షణాల దర్శనంతో మనసు మురిసిపోయే!

నాలుగు రోజుల ప్రయాణ బడలిక నలు దిక్కుల నుండి వచ్చిన భక్తుల లో ఆవిరైపోయే!

నాలుగు దశాబ్దాల కొకసారి నాలుగు మీటర్ల బావిలో పునఃదర్శనంతో తనువు పులకించే!

నాలుగు శతాబ్దాలైనా అత్తి వరద రాజ స్వామి దర్శన అనుభూతి మిగిలిపోయే!
వేం*కుభే*రాణి
[31/08, 3:52 PM] venky HYD: చీకటి చీల్చి తలుపులు తెరిచెను సన్నిధి గొల్ల!

ప్రేమను పెంచి పాటలు పాడెను అణ్ణన్ మల్ల!
ఇష్టము పంచి సేవలు చేసెను లక్ష్మి గల్ల!

ప్రాణము ఇచ్చి వరుసలు సాగెను భక్తులు యల్ల!
మతి మరిచి యెల్లలు దాటెను మనసు కల్ల!

యవ్వనం చేర్చి కొండలు ఎక్కెను నునువు నల్ల!
దేవుడు చూచి తనువులు మోసెను భారము ఎల్ల!
వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
31-08-2019
[07/09, 8:05 AM] venky HYD: దొరలు నిను కొలిచిరి కొండదేవర అనుచు!

శైవులు నిను కొలిచిరి శివుడనుచు!
వైష్ణవులు నిను కొలిచిరి విష్ణువనుచు!

ఆళ్వార్లు నిను కొలిచిరి మాధవుడనుచు!
భక్తులు నిను కొలిచిరి ఆపధ్భాందవుడు అనుచు!

దేవతలు నిను కొలిచిరి పరబ్రహ్మ అనుచు!
కాపాలికులు నిను కొలిచిరి ఆది భైరవుడు అనుచు!
Happy Saturday n weekend
07-09-2019

[14/09, 9:40 AM] venky HYD: ఒక్కటైన ఈ భక్తుడు మనస్సుని ఒక్కటిగా నీయందు చేసి!

అత్మ పరమాత్మ రెండు నీవని, ఇహ పర సుఖాలు నిను చూసి!
ముల్లోకాలు తిరిగి త్రి సంధ్యవేళలు నిన్నే ధ్యానించి!

నాలుగు వేదముల సారమే నాలుగు పాదాల ధర్మమే నీ పాదమున!
పంచ భూతాల సాక్షిగా పంచ భక్ష్యములను నీకు తినిపించి!

ఆరు కాలాలు ఆరు ఋతువుల తిరుమల మాడవీధుల్లో నీ ఉత్సవాలు!
ఏడేడు జన్మల పుణ్యం ఏడు కొండలు దాటి నీ దర్శనం!
వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
14-09-2019
[21/09, 8:32 AM] venky HYD: ఓం! శ్రీ పద్మావతి ప్రియ గోవిందా!

సతి పద్మావతి నిను చూసి మంగపతి మురిసే శ్రీమతి!

యతులు నీకు ఇచ్చారు స్థానం ప్రాధాన్యత యతి!
గోవులు క్షీరములు ప్రసాదించే దైవ స్థితి క్షితి!

కలియుగ భక్తులు నిను పూజించే గోవిందా స్తుతి!
వెంగమాంబ పతి అని ప్రతిన బూని ఇచ్చే ముత్యాల హారతి!

ఆపదలో చిక్కు కున్న వారికి నీవే శరణాగతి!
తరతరాలు ఎన్ని వచ్చినా నీ నామమే మా సంతతి!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend
21-09-2019
[28/09, 6:57 AM] venky HYD: ఓం! సర్వ వాహన ధారా! గోవిందా!

శేషుని పానుపు పై మెరిసే వజ్రపు తళుకులలో మొదటి రోజు పెదశేష వాహనము పైన!

బ్రహ్మ వాహనము పాల స్వచ్ఛ వీణ సరస్వతి రూపులో రెండవ రోజు హంస వాహనము పైన!

రాముని పెళ్లి తలంబ్రాలు మురిపెముగా మూడో రోజు ముత్యాల పందిరి వాహనము పైన!

సర్వజనుల పాపములకు భక్తి వాహనము తిరిగే నక్షత్రాల నాలుగో రోజు సర్వభూపాల వాహనము పైన!

పక్షి రాజము విష్ణు అవతార స్వామి సదా సేవకుడైన ఐదవ రోజు గరుడ వాహనము పైన!

మత్తించిన మకర బారి నుండి కాపాడిన మత్తేభము ఆరవ రోజు గజ వాహనము పైన!

కోటి సూర్య కాంతితో వెలిగే నా స్వామికి ఏడవ రోజు సూర్య చంద్ర ప్రభల వాహనము పైన!

దుష్టులకు కల్కి స్వామి పరుగుల గుఱ్ఱపు స్వారీ ఎనిమిదో రోజు అశ్వ వాహనము పైన!

బడలిక తీర అభిషేకాలు మీర చక్ర స్నానాలు చేసి ముగియును ఆదివరాహ దర్శనము పైన!
Happy Saturday n Brahmotsavam ahead.
28-09-2019
[05/10, 7:51 AM] venky HYD: Generally, we think Laddu, Vada is prasadam in Tirumala. Lot of things like fruits, _paniyamulu_ rice items, sweet n hot, sweets, etc offered to Lord Balaji. I've tried to bring some prasadams in this poem. Still some are missing. Enjoy the delicacy.

ఓం!

మొదటి గంటకు దధ్యోదనాలు ప్రసాదాలు మంత్ర పూర్వకము ఘంటా నాదముతో నైవేద్యము!

మధ్యాహ్న గంటకు శుద్దాన్నం చెఱుపు ప్రసాదాలు పణ్యారాలు నైవేద్య భోజనము!
కళ్యాణ ఘడియకు వడలు జిలేబీలు పులిహోరలు వధూవరులకు పెళ్ళి నైవేద్యము!

కేసరిబాత్తు శీరా కదంబం అప్పం బెల్లందోసె పోళిపడి శుండలిపడి తేన్తొళపడి ప్రసాద నైవేద్యము!
తిరువీసం చక్కెర పొంగలి తళిహాలు భాష్యకార్ల సేవకు మెచ్చిచ్చిన స్వామి వారి నైవేద్యము!

రాత్రి గంటకు దోసెలు పణ్యారాలు మొళ హోర ఇతర ప్రసాదాలు నైవేద్యం!
శయన సమయము ఏకాంత సేవలో ఫలములు పాలు బాదాం జీడిపప్పులు కలకండ తాంబూలం!
Happy Saturday n weekend.
05-10-2019
[12/10, 10:22 AM] venky HYD: Lord Srinivasa told thanks and bid goodbye to each and everyone, who participated n made Brahmotsavam a grand success. I'm trying to bring few in this Saturday poem.

అడుగులతో ఆడే కొరవంజి కళాకారులకు అడుగడుగు దండాలవాడు చెప్పె పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!

బీరప్ప ఒగ్గుడొలు ఒగ్గు కథ కళాకారులకు గంభీరంగా చెప్పె పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!
తప్పెట గుళ్ల కళాకారులకు తప్పక రమ్మని తిరుమలకు, ఇప్పటికి చెప్పె పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!

ప్రత్యేక అధికార్లకు ప్రతి ఒక్కరికీ చెప్పె స్వస్థలాలకు పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!
ఉరుములు పడిన ఉరుముల నృత్యం ఆపక రంజింప జేసిన కళాకారులకు చెప్పె పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!

కష్టపడి విజయవంతం చేసిన అష్టదిక్పాలకులకు ఇష్టముగా చెప్పె పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!
బ్రహ్మాది దేవతలకు పరబ్రహ్మయే సెలవని చెప్పె పోయి రండు, వచ్చే బ్రహ్మోత్సవాలకు!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
12-10-2019
[19/10, 10:20 AM] venky HYD: After seeing Golden Chariot event Tirumala (in SVBC channel)
బంగారు మనసు గల నా స్వామికి బంగారు రథోత్సవం!

నిండు కుండ లాంటి నా స్వామికి కుంభ హారతి!
అండ పిండ బ్రహ్మాండమైన నా స్వామికి బ్రహ్మోత్సవాలు!

ఏడేడు లోకాలు ఎరిగిన నా స్వామి తిరుమాడ వీధులలో ఊరేగే!
జగన్నాటక సూత్రధారి అయిన నా స్వామికి రథ చక్రాలు తిరిగే!

పంజా విసిరే నా స్వామికి వింజామరల ఊంజల్ సేవలు!
కరి రాజును రక్షించిన నా స్వామికి అంబారిల స్వాగతాలు!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
19-10-2019


[26/10/2019, 7:03 AM] venky HYD: ఉరుములు ఉరిమినా బెదరక

చినుకులు కురిసినా చెదరక
గొడుగులు వేసుకున్న వామనులై భక్తులు

తిరుమల పెన వేసుకున్న బంధాల భక్తులు
గజములు రాజసము ఉట్టి పడేలా

అంబారీలు గమనము వెంట రాగా
కొప్పుల గోదా దేవీలూ ముందు ఆడగా
వేం*కుభే*రాణి
After watching Garuda vahana seva in SVBC Channel
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
26-10-2019
[27/10/2019, 8:09 AM] venky HYD: Kaliyuga Narakasura

నీ లోని అసురిడిని నరకరా సత్యభామ నీకై దిగి రాధ!
నీ లోని మంచిని పెంచరా ఆనందం ఎగరదా తారాజువ్వలా!

తూర్పున సూర్యుడిని వదిలి దండం నీవు చెడుకు సెలవు ఇవ్వరా!
ఉత్తరాన ఉత్తరము లేకున్నా పక్షము రోజులు సెలవివ్వరా!
దక్షిణాన దక్షిణలతో పూజలెన్నో అందుకునే లక్ష్మి రూపమివ్వరా!
పశ్చిమానా పడమర దిక్కు వాలిపోదా మంచికి రూపం అవ్వరా!

నీ లోని అసురిడిని నరకరా సత్యభామ నీకై దిగి రాధ!
నీ లోని మంచిని పెంచరా లోకమే తిరగదా భూచక్రములా!

అంధకారము పారద్రోలే జ్ఞాన జ్యోతివై వెలుగురా!
మంచిని నడిపే ఉద్యమంలో సమిధవై వెలుగురా!
నీవు నిత్య జ్ఞానాగ్ని హోత్రమై వెలుగురా!
వంట ఇంటిలో హోత్రమే అన్నపూర్ణవై నిత్యము వెలుగురా!

నీ లోని అసురిడిని నరకరా సత్యభామ నీకై దిగి రాధ!
నీ లోని మంచిని పెంచరా చిచ్చర బుడ్డివై వెలుగురా!
వేం*కుభే*రాణి
అందరికి ఈ దీపావళి సిరులు శుభములు ఇచ్చుగాక!
27-10-2019
[2/11/2019, 10:04 AM] venky HYD: ఓం! బ్రహ్మోత్సవ ఫలప్రదాయేనమః
దేవతలే దిగి వచ్చిరి వేగంగా భువికి ఏకంగా!

బ్రహ్మనే స్వయంగా ప్రారంభించే ఉత్సవం పరవశంగా!
అంగాంగము వేదముల సారము నీవే రంగా!

వైభవంగా రంగ రంగ ఆకాశ పాతాళ గంగ!
పరుగున వచ్చె పరవశంగా చిందులు వేయంగా!

కరి అడ్డును తొలగి పద్మావతి పరిణయ మాడి మంగ!
శ్రీ మహాలక్ష్మి దివి నుంచి వచ్చి స్వయంగా!
 వేం*కుభే*రాణి
Happy Saturday n weekend
02-11-2019
[9/11/2019, 8:34 AM] venky HYD: ఓం! స్వర రాగమయ గోవిందా!

స్వర తరిగొండ వెంగమాంబకు తరియించన శృతి నీవు!

అమ్మాళులకు భర్త శరణు నామమే గతి నీవు!
మది పద్మావతి దేవికి సుందర పతి నీవు!

మానవుల కష్టములకు ఫలించిన ధృతి నీవు!
చెల్లయో అన్నమయ్య లయ స్వర ఆకృతి నీవు!

అన్యథా నాస్తి ఈ దాసుడికి వరముల భృతి నీవు!
ప్రతి వారం రాసే నా పాటలకు ప్రతి నీవు!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend
09-11-2019
[16/11/2019, 9:25 AM] venky HYD: ఓం! కలియుగ వైకుంఠ స్వామి!

నీ పాదమే అంకురార్పణం!
ఆ ఆ ఆ ఆ నీ బంగారు పాదమే సర్వ కార్య వాహనం!

నీ సైగలే శుభమంత్రం!
ఆ ఆ ఆ ఆ నీ మూగ సైగలే సర్వ జనుల దర్శకం!
నీ చూపులే దివ్యవేదం!
ఆ ఆ ఆ ఆ నీ చల్లని చూపులే వెన్నెల జలపాతం!

నీ కళ్యాణమే మహా యజ్ఞం!
ఆ ఆ ఆ ఆ నీ పద్మావతి కళ్యాణమే సర్వ వేళ శుభకరం!
నీ మనసే బృందావనం!
ఆ ఆ ఆ ఆ నీ మనసే అందాల పూదోట కుసుమం!

నీ అభిషేకాలే అమృతం!
ఆ ఆ ఆ ఆ నీ అభిషేకాలే సర్వరోగ నివారణం!
నీ అభయమే ఆయుధం!
ఆ ఆ ఆ ఆ నీ అభయమే సర్వజన్మ పాప హరణం!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
16-11-2019
[23/11/2019, 7:39 AM] venky HYD: అంతయు నీవే బ్రహ్మాండ మంతయు నీవే!

ఇంతలో మాయ కష్టములు, ఉండ నీవు
చెంతగా మాయందు నిశ్చింతగా నుండగా! నీ లీలలు
వింతగా తీరునే కవ్వింతగా ఇండ్ల నుండనే!
ఎంతగా భ్రాంతిగా కడగండ్లు సమిసినే!

కాంతగా కాంతి పుంజం పిండమై ఉద్భవించే ఒక్కింతగా
ఏకాంతముగా తరిగొండ ముత్యాల హారతిగా
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
23-11-2019
[30/11/2019, 7:06 AM] venky HYD: Chariot festival is done, so that, all devotees can do _seva_ of the Lord and can have _darshan_ for more time. In Tirumala, it seems Store chariot during the reign of Sri Krishna Devaraya. Now it's kept in the Park.
 Wooden chariot got mention in Annamayya songs.
Later Silver chariot was used in procession, kept aside after Golden chariot came, which is presently used for procession during Brahmotsavam n Vasanthotsavam.

మనసు మీదగా మాటలాడక మౌనంగా ప్రార్థించే నీకే *మనో రధం* !

తనువు పులకించి హృదయ నీరాజనం వెల్లువై పరిగెత్తే *భక్తి రధం*!
శుభ నాదస్వరం, బ్రహ్మ పట్టిన యజ్ఞం నింగి నేల ఒక్కటైన వేళ *బ్రహ్మ రధం*!

శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి రధం, తొలి వేడుకలకు తలమానికమైన *రాతి రధం*!
అన్నమయ్య రచనలకు నోచుకొన్న రధం, తొలి బ్రహ్మోత్సవంలో ఊరేగిన *కొయ్య రధం*!

నవరాత్రి ఉత్సవాల ఎనిమిదవ రోజున తిరుమాడ వీధులలో ప్రదక్షిణ *వెండి రధం*!
వసంతోత్సవంలో రధరంగ డోలోత్సవంలో ఊరేగించు మేలిమి వన్నెల *బంగారు రధం*!
వేం*కుబే*రాణి
Happy Saturday n weekend.
30-11-2019
[7/12/2019, 6:31 AM] venky HYD: స్వచ్ఛమైన చిరునవ్వు గల నా స్వామికి జలాభిషేకం; గంగ జలాభిషేకం!

చంద్రుని వెన్నెలలా దీవెనలు ఇచ్చు నా స్వామికి పాలాభిషేకం; గోక్షీరాభిషేకం!
బంగారు మనస్సున్న నా స్వామికి సుగంధాభిషేకం; సర్వ సుగంధాభిషేకం!

సూర్యుని తేజమైన నా స్వామికి హరిద్రాభిషేకం; హరిద్రాచూర్ణాభిషేకం!
సద్గుణాలు కలిగిన నా స్వామికి పూలాభిషేకం; దివ్యపూలాభిషేకం!

అక్షరాలకు అర్థమిచ్చు నా స్వామికి మంత్రాభిషేకం; కర్పూర హారతి అభిషేకం!
నిత్య సత్యమైన నా స్వామికి లడ్డు వడల నైవేద్యం; నిత్య కళ్యాణాభిషేకం!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
07-12-2019
[8/12/2019, 8:01 AM] venky HYD: భగవద్గీత సారము

భవ కర్మః అనుభవ తథ్యః
భగవత్ ఏకః ఆత్మ పరమాత్మ ఏకః
ధర్మ రక్షః రక్షక ధర్మః
పద్మద జలః స్పర్శ నకః
[14/12/2019, 12:07 PM] venky HYD: Lord Venkateshwara is marrying Goddesses Padmavati. See whom I'm calling.
పెండ్లి కుమారుని అలంకరించ అప్సరసలు రారో!
దేవదేవుని కళ్యాణము తిలకించ దేవతలు రారో!

గంధము తీసుకుని గంధర్వులు రారో!
చందనము తీసుకుని చంద్రులు రారో!
అక్షింతలు తీసుకుని ఆర్య వైశ్య రైతులు రారో!
మంత్రములు చదువ వేద బ్రాహ్మలు రారో!

కళ్యాణము జరిపించ స్వయం బ్రహ్మను రారో!
వాయిద్యములు వినిపించ బాజా భజంత్రీలు తేరో!
కలువల మాలలు తీసుకుని కోయిలలు రారో!
వాహనము ఏతెంచ రెక్కల గరుడుడు రారో!

పెండ్లి వంటలు వండగా నల భీములు రారో!
పందిరి వేయగా జక్కన విశ్వకర్మలు రారో!
పెండ్లి కూతురు తీసుకుని ముత్తైదువులు రారో!
పెళ్లి ఊరేగింపులో పాడగా పేరంటాండ్లు రారో!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
14-12-2019
[21/12/2019, 7:11 AM] venky HYD: Ardent devotees like Vengamamba, Godadevi wants Lord Venkateswar as their love husband. But Lord won't turn out, due to beauty of Goddess Padmavati.
హంసల హొయలు చాలవు అలిమేల్మంగల నడకలు మునుపు!
పూవులు ఎన్నున్నా పరిమళించవు కమలాక్షి నయనాల కనవు!

మధురాలు ఏం తిన్నా రుచించవు ప్రియసఖి అధరాల తళుకు!

ముత్యాల నగలు వినవు అనఘాహి నగవు మెరుపు!
మన్మధుని బాణాలు కవ్వించవు పద్మాక్షి చూపుల చురుకు!

తలపుల వలపులు చిగురించు ధనలక్ష్మి హృదయ పిలుపు!
అద్దాల మండపాలు నిలువవు పద్మావతి చెక్కిళ్ల నునుపు!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
21-12-2019
[28/12/2019, 7:54 AM] venky HYD: I have picked up some words from songs in Paduta Teeyaga n written this poem by adding conjunctions (connecting words)

వేదం ప్రాణం నీ నాదం!

దైవం రాగం నీ వినోదం!
జీవితం నాట్యం నీకు దక్షిణం!

బృందావనం రసమయం నీ నయనం!
కళ్యాణం నిత్యం నీకు రాజసం!

వరం క్షణం నీ దర్శనం!
పద్మదం సర్వం నీవే వేంకటేశ్వరం!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
28-12-2019
[31/12/2019, 11:08 PM] venky HYD: Lot of people go to Tirumala on First January n have darshan of Lord Venkateswara.

నిత్య నూతనం తోమని పళ్లెం నీకు!

నిత్య నూతనం కళ్యాణ వస్త్రములు నీకు!
నిత్య నూతనం నిత్య పూజలు నీకు!

నిత్య నూతనం బ్రహ్మోత్సవాలు ప్రతి వత్సరము!
నిత్య నూతనం భక్తుల వింత కోరికలు!
నిత్య నూతనం నవ్య ఆభరణములు నీకు!
నిత్య నూతనం నీ దర్శనము మాకు!
HAPPY NEW YEAR 2020.

No comments:

Post a Comment