Wednesday, 4 September 2019

ఏక వింశతి పత్రములు వినాయక

ఏక వింశతి పత్రములు వినాయక

1. మాచిపత్రి *కళ్లకు* అద్దుకుని సమర్పించినామయ్య! 2. వాకుపత్రి ఏక *దంత* అని సమర్పించినామయ్య!
3. బిల్వపత్రి గజ *శరీరాయ* అని సమర్పించినామయ్య! 4. గరికపత్రి *లంబొదర* అని సమర్పించినామయ్య!
5. ఉమ్మెత్తపత్రి గజ *చర్మాంబర* అని సమర్పించినామయ్య! 6. బదరీపత్రి *రోగ నిరోధకా* అని సమర్పించినామయ్య!
7. ఉత్తరేణి పత్రి *ఉండ్రాళ్ల* గణపతి అని సమర్పించినామయ్య! 8. తులసి పత్రం గజ *ముఖ* అని సమర్పించినామయ్య!
9. మామిడి పత్రం *మంచి వాయువు* ఇమ్మని సమర్పించినామయ్య! 10. గన్నేరు పత్రి *విష* కీటకాల నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య!
11. విష్ణుకాంత పత్రి *జ్ఞాపకశక్తి* ఇమ్మని సమర్పించినామయ్య! 12. దానిమ్మ పత్రి *అతిసార* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య!
13. దేవదారు పత్రి *అజీర్తి* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య! 14. మరువక పత్రి *జీర్ణశక్తి* ఇమ్మని సమర్పించినామయ్య!
15. సింధూర పత్రి *ప్రసవ భాదల* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య! 16. జాజి పత్రి *వాత నొప్పుల* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య!
17. గండకీ పత్రి *మూర్చ వ్యాధి* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య! 18. జమ్మి పత్రి *కఫం* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య!
19. అశ్వత్థ పత్రి *మల బద్దకం* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య! 20. తెల్లమద్ది పత్రి *కీళ్ల నొప్పులు* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య!
21. అర్క పత్రి *చెవి పోటు* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య! అన్ని పత్రములు *చర్మ వ్యాధులు* నుండి రక్షణ ఇమ్మని సమర్పించినామయ్య!


1.మాచీపత్రం (మాచిపత్రి) :- ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
2. బృహతీ పత్రం(వాకుడాకు) : - ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది.
3. బిల్వ పత్రం( మారేడు) :- ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
4. దూర్వాయుగ్మం(గరిక) :- ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది.
5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) :- ఇది సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి.

6. బదరీ పత్రం(రేగు) :- ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.
7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) :- ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
8. తులసీ పత్రం(తులసీ) :- ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
9. చూత పత్రం( మామిడాకు) :- ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది.
10. కరవీర పత్రం( గన్నేరు) :- ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.

11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) :- ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగపడుతుంది.
12. దాడిమీ పత్రం(దానిమ్మ) :- ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
13. దేవదారు పత్రం(దేవదారు) :- ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక పత్రం(మరువం) :- ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు.
15. సింధూర పత్రం( వావిలి) :- ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

16. జాజీ పత్రం( జాజి ఆకు) :- ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
17. గండకీ పత్రం(దేవ కాంచనం) :- ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
18. శమీ పత్రం(జమ్మి ఆకు) :- ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) :- ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది.
20. అర్జున పత్రం( తెల్ల మద్ది) :- ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
21. ఆర్క పత్రం( జిల్లేడు) :- ఇది చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment