Saturday, 11 June 2016

Tirumala Venkanna

Earlier version of travel to Tirumala

[2/24, 11:05 AM] Venkatesh K E: 

మెట్టు మెట్టున పసుపు కుంకుమలు అలదచు 
పట్టెడు హరతుల పూవుల పూజ చేయుచు 
మెట్టు మెట్టుకు మ్రొక్కి నీదిక్కు చేరెడి 
భక్తుల జన్మల గట్టు దాటించగరావయా!


రాయిన రప్పన నిన్నె కాంచి భజియించుచు 
రాతిమీది రాతిని పేర్చి ఇల్లిమ్మని వేడుచు 
రాళ్ల తుప్పల దాటి నిన్ను చేరెడి వారి 
రాతల మార్చి చేయూత నివ్వు తిరుమలరాయా!


గోవింద గోవిందని ఎలుగెత్తి పిలుచుచు 
పిల్లపాపల నెత్తి ఊరేగింపుగా దెచ్చుచు 
ఆటల పాటల శంఖనాదాల గంటల నీకు 
వేడుక జేయు దాసులగాచు వేంకటరాయా!


కాలు లేకున్నను నడవ లేకున్నను 
భక్తియె దన్నుగ జేసి కర్రల మోకాళ్ల పాకి 
పాపలవలె పారాడె నీ నిజబంటులను బ్రొచి 
పదిలముగా నీ ఒడిలో పొదువు కొనరావయా !


Now, Present version of travel to Tirumala
21-02-2017

అడుగడుగనా మోసము చేసి
పట్టెడు హరతలు బడా నాయకులకు. 
ఎత్తుకు పై ఎత్తు వేసి భక్తులను దోచి 
మరు జన్మ వద్దు అను నట్లు చేయురయా  !

రాయిని అమ్మి రప్పను అమ్మి 
అర చేతిలో వైకుంటమును జూపి 
రాళ్ళూ రప్పలె చివరకు మిగల్చి
జనుల రాతలు మార్చి దులుపు కొనురయా !

ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును 
గోవింద చేసి, గోవిందా అని నీ దరికి వచ్చి 
పాపపు తల నీలాలు, కిరీటములు నిచ్చి 
కోనేరులో మునిగి  ప్రక్షాళన అవుదరయా ! 

సమయమున్నను విమానములో వత్తురు 
కాలు ఉన్నను కారులో వత్తురయా 
పాపలు, ముసలి ముతక వేచి  ఉన్ననూ 
స్పెషల్ దర్శనాలు చేసు కొనరయ్యా !

* * * * * * * * * * * * * * ** * ** *

అందరికి ఆనందోత్సవ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు !!

అన్నమయ్యలా శ్రీనివాసుని కీర్తనలతో భజియించరో!
బాలుడిలా  బాలాజీ లడ్డులను భుజియించరో!
వాహనములనెల్ల నెక్కి బ్రహ్హ్మోత్సవములో ఉరేగించరో!
అల్వాలురు వలె పెరుమాళ్ ను సేవించి తరియించరో!
గోదా దేవిలా భక్తితో గోవిందుని ప్రాణముగా ప్రేమిచరో!
తలా నీలాలను సమర్పించి పాపా హరుడి మొక్కులు తీర్చరో!
ఏడూ కొండలనెక్కి ఏడేడు జన్మల పుణ్య ఫలమును పొందరో!
K E Venkatesh
Andariki anadotsava brahmotsava shubhakankshalu

Annamayya la sreenivasuni keerthanalatho bhajiyincharo!
Baludila Balaji laddulanu bhujiyincharo!
Vahanumulanella nekki brahmothsavamlo uregincharo!
Alvarula vale Perumal nu sevinchi tariyincharo!
Goda devila bhaktitho Govinduni pranamuga premicharo!
Tala neelalanu samarpinchi Papaharudi mokkulanu teercharo!
Edukondalaneeki Ededu janmala Punyaphalamunu pondaro!

No comments:

Post a Comment