For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Thursday, 24 April 2025
Saturday 2024 upto March 2025
06/01/24, 8:41 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
ఇంకా తెలవారక ముందే స్వామి దర్శనానికి వేళవుతుందే
మేఘాలన్ని జరిగి సూర్యుని కోసము మరి ఎదురు చూచే!
పశుపక్షాదులన్ని ఆశతో భారముగా మేల్కొనెనే స్వామికి
దొంగలు అలిసి నిదురపోయిరే కంగారు లేదోయి మనకి!
కత్తి కన్నా కలము గొప్పది సంతకం గీసిన వారి స్తాయి
నీ అభయహస్తము ఆశీర్వదించమని అడుగుటే కదా!
అందాల లోకం వేచివుంది మందార కుసుమాలు పూసి
క్షణమేదైనా భాగ్యము కలుగుతుందని శ్రీనివాసుడిది!
బాసలే ఎద లోని ఆశలుగా పరిణతి చెంది వేచెనో
రమణుని రమణీయ దర్శనమేదని విరమించక!
భవసాగరమీది అనుభవైక నైవేద్యము వడ్డించి
కవ్వము చిలికిన కవనము కావ్యమై వేచివుండే!
తేట తెలుగు తెలవారిందే తెలుగు లోన తియ్యగా
శ్రీ వేంకటేశ్వరుడా ముద్దబంతి పువ్వులా పద్మావతి విరిసి!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తిథి దశమి.
13/01/24, 9:53 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
ఆండాళ్ యన్న భక్తికి నిధి ప్రతినిధి పెన్నిధి
పెరియార్ కు పంపిన వేసుకున్న మాలలు!
నీలాదేవి యన్న విష్ణువు ఇచ్ఛా శక్తియే కదా
అగ్ని సూర్య చంద్ర సంబంధ కృష్ణ గోపికయే!
బీబి నాంచారమ్మ కురిపించిన ప్రేమ రాగం
తనకు తాను సమర్పించి ఐక్యతామోక్షం పొంది!
వెంగమాంబ స్వామియే సర్వస్వమని తరించి
ముత్యాల హారతి నేటికి అందిస్తు తిరుమలలో!
ఎందరు భక్తితో సమర్పించుకున్నా
అందరు లక్ష్మి అవతార మూర్తులు ఒక్కటేనని!
చిన్నమ్మి యన్న పెద్ద పద్మావతియే కదా స్వామి
చిట్టెమ్మ అని పిలిచినా పలుకు అలివేల్మంగా!
తిరు వేంకటేశ్వరుడా ఎంత మంది ప్రేమ భక్తులున్నా
చిరునవ్వు చిందించు పద్మావతి ఒక్కటే పరిణయ పత్ని!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తిథి విదియ/తదియ
20/01/24, 8:29 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
ఒక రాగం ఒక మంత్రం ఒక ప్రేమ ఒక క్షేత్రం
ఒక్కటే దైవము నీవు స్వామి కలియుగాన! (1)
దశావతారాల మోక్షము నీ దర్శనము లోన
కలుగును స్వామి పదింతలై పాదము చూడగ! (10)
వందలాది పూజలు నిత్యము నీకు స్వామి
నివేదనలు నైవేద్యాలు ఎన్నెన్ని స్వామి! (100)
వేయి నామాలు స్వామి, గోవింద అన్న చాలు
చేయి ఎత్తి దీవిస్తారు ఎక్కడ నుండైనా! (1000)
లక్షలాది భక్తులు ప్రతి దినము వస్తారు స్వామి
మోక్షము కోరి మెట్టు మెట్టుకు నామం స్వామి! (100000)
కోటి సూర్యకాంతులు నీ తేజస్సు స్వామి
ముక్కోటి దేవతలు వేచిరి వైకుంఠ ద్వారమున! (10000000)
అనంతము శ్రీ వేంకటేశ్వరుడవు నీవు స్వామి
నిరంతర శక్తి స్వరూప పద్మావతి సమేత! ( _INFINITE_ )
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తిథి దశమి.
27/01/24, 7:28 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
శ్రీకారం వచ్చింది సుమూహుర్తము పెట్టినట్లు
శుభమస్తు అని దీవించగ ఎదురుకోలు వచ్చినట్లు!
వేల నయనాలు చాలవు ఉపనయన వేళ
కమలనయుని చూడ అందరి కళ్ల దృష్టి నీ మీద!
కాశీ క్షేత్ర పాలనకు వెళ్లే ముందు కాళ్లు
కడిగి ఆకాశరాజు కన్యనిచ్చు తోడుగా వెళ్లు!
వజ్ర వైఢూర్యాల బాసింగము కట్టి మురిసితి
స్వామి, గజరాజులా వేచి చూసితి పెళ్లి సవారిలో!
సిగ్గులొలుకు అలిమేల్మంగ తల పైకెత్తలేదు
మాంగల్యం కట్టు వేళ స్వామి నీవు జడ పైకెత్తలేవు!
ముత్యాల తలంబ్రాలు మాకు అక్షింతలే
ఏడు అడుగులు వేసినట్లు సప్తగిరులు నడిచెనులే!
తిరు వేంకటేశ్వరుడా కళ్యాణంలో నిత్యము
విరిగెనో ఇంద్రధనుస్సులు పద్మావతి నిట్టూర్పులలో!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష తిథి విదియ
03/02/24, 6:50 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
ప్రతి పదములో నిండెను నీ భావము
ప్రతి అక్షరము పలికెను నీ నామము!
ప్రతి ఉదయము శ్రీకార సుప్రభాతములే
ప్రతి హృదయము నిండెను సంబరములే!
ప్రతి పువ్వులు స్వామి నీ పాదములకే
ప్రతి నవ్వులు చిగురించేను దర్శనములో!
ప్రతి బంధము పెట్టుకొనెను నీ నామమే
ప్రతి తరంలో నీ నామమొకటుండునె!
ప్రతి చినుకు వేచెను లాల పోయాలని
ప్రతి కలకు సాకారం అభయ హస్తములో!
ప్రతి ధాన్యము నైవేద్యము కావాలనే
ప్రతి రత్నము కిరీటంలో ఈకలానే!
ప్రీతి శ్రీ వేంకటేశ్వరుడా పాద స్పర్శ చాలునో
ప్రతి గీతిక పద్మావతి పాద చరణములకే!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష తిథి అష్టమి.
10/02/24, 8:39 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
చంద్రుడు తిరిగేను నీ గుడి చుట్టు ప్రదక్షిణగా
వెన్నెల తివాచీ పరిచె తిరుమాడ వీధులలో!
సూర్యుడు నిత్యము కాచెను సుప్రభాతమున
కిరణములు నమస్కరించి మిన్నంటి పొద్దు పొడిచె!
ఆకాశం గొడుగులా నీడనిచ్చి సేదతీర్చి
లాలించి సాంత్వన పరిచి హాయిగా మరిచి!
నక్షత్రాలు వచ్చి తాకెను పాదాలను పూలగా
రంగవల్లులై పూలజల్లులై మెరిసి మురిసె!
ఉల్కలు హారతికి తిరుమలకు వేగిరమే వచ్చెను
పల్లవించు తాళములా సరిగమల పదనిసలా!
గ్రహాలన్ని నిలిచే దివ్యముగా మంచి శకునముకై
పంటచేలు పెరిగినట్లు మామిడి చెట్టు పూసి నట్లు!
శ్రీ వేంకటేశ్వరుడా సమస్త లోకాల నాథుడా
పూల తోటలో విహరించి పద్మావతి అనురాగం పంచి!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష తిథి పాడ్యమి
17/02/24, 11:23 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
క్షణము క్షణము నిన్నే కోరు కణము కణము
సెకనుకో సారి తలచి తలచి మైమరచితిని స్వామి!
నిమిషమైనా ఆగలేను గాలి లేక నిలువా
గడియ గడియకు గోవిందా యదలో ముద్రలా!
గంట గంటకు పూజలు నిత్య నైవేద్యాలు
పూట పూటకు కొత్త పాత్రలో నివేదనలు!
రోజు రోజుకు పచ్చ తోరణాలు నిత్య కళ్యాణాలు
పద్మావతే కాని రోజు ప్రేమగా చూడు వయ్యారాలు!
ప్రత్యేక వారపు పూజలు గురు నిజ స్వరూపము
శుక్రవార అభిషేకాలు ప్రతి మాస శ్రావణ మాఘాలు!
సంవత్సరానికి సరిపడా ఆనందం బ్రహ్మోత్సవాలు
పుష్కరం వేచియుండవసరం లేదు కుంభ మేళాలకు!
యుగయుగాల దేవుడు కలియుగ శ్రీ వేంకటేశ్వరుడా
ఏ కాలమైన మనకు అభయమిచ్చి కాపాడుతాడు!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకోృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష తిథి అష్టమి/నవమి
24/02/24, 7:40 am - venky HYD: కవి: కామవరం ఇల్లూరు వేంకటేష్
ఊరు: హైదరాబాదు
శీర్షిక: & (కవితారూపం) ఐచ్ఛికం (భక్తి గీతం నీటి వనరులతో)
కవిత:
ఓం నమో వేంకటేశాయనమః
స్వయంగా లక్ష్మీ దేవి బావి కట్టె బంగారు
తొండమాను, స్వామి వంటకాలలో వాడుక!
నదిలా నడకల హొయలు లయల గజములు
సిరులు నిండి వెన్నెల కురిసిన లాలనలు!
జలపాతమై పరుగులు ఉగ్రరూపము దాల్చి
ముంచెత్తి ఆనంద పరవళ్ళు పారవశ్యమైనట్లు!
చెరువులాగ నిలబడు నా స్వామి నిశ్చలముగా
అలుగు దాటి భక్తి పారవశ్యము పారినట్లు!
పుష్కరిణిలా ఔషదయుక్తము కోనేటి రాయుడా
చక్ర స్నానము తోడ అజ్ఞానము తొలగి పోవా!
తీర్థాల జల నిలకడ వసంతమైన శిశిరమైన
గ్రీష్మ తాపమైనా వర్ష ఋతువైనా నిత్యము!
తిరు వేంకటేశ్వరుడా అనంతసాగర భక్తిలో
జీవితాన దాటగలమా పద్మావతి మమతతో!
వేం*కుభే*రాణి
*24-02-2024*
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష తిథి పౌర్ణమి.
02/03/24, 7:29 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
చందమామ వచ్చి దీపము పెట్టి
పంచదార చిలకలొచ్చి ప్రసాదం పెట్టి!
సందెకాడ సూర్యచంద్రుల పలకరింపు మీకు
జంధ్యముతో త్రిసంధ్యలు స్వామి నీకు!
విందు నిత్యము కళ్యాణమన్న తప్పదు
పసందు కదా ప్రతి నైవేద్యము జీడిపప్పుది!
ఖండాంతరాల ఖ్యాతి వెదజల్లినట్లు
అఖండ భక్తి భావము పరవశించినటిలు!
ప్రాణము లేచి వచ్చును దర్శనమన్న
నిస్త్రాణము తీరిపోవు ప్రసాదమవ్న!
గంధము పూసి చందము చూడగా
సుగంధం జల్లి అందము పాడగా!
నీరు తిరు వేంకటేశ్వరుడా ప్రతి పదము ప్రాస
నిప్పు నింగి నేల గాలి అలమేల్మంగ వరుస!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష షష్ఠి/సప్తమి
09/03/24, 8:37 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
కొండ పాయలు ఏడ్చెనో వాన వచ్చి జలపాతాలై
జలుబు చేస్తుందని ధూపపు సుగంధ వాసనల వసంతాలు!
లోకమే నడిచి వస్తుంది స్వామి నీ సన్నిధికి పరుగున
కోరితే గెంతులేసి రాదా కోతులైనా చెయ్యి కట్టుకొని!
పాత తరపు వైఖానస సంప్రదాయాలు పాటిస్తూ నేటికి
కొత్త పుంతలు తొక్కుతున్న నవీన సదుపాయాలు అందిస్తు నేటికి!
సప్తస్వరాల 'సరిగమపదని'సలు చుట్టి చుట్టి వచ్చాయి
అన్నన్ సుప్రభాతం నుండి వెంగమాంబ ముత్యాల హారతి వరకు!
మామ రాజు అంత ఎత్తు ఏడుకొండల మీది శిఖరము
చుట్టాలతో వచ్చి చూసెళ్లిపోతారు, నిత్యం ఉండేదెవరు స్వామి!
రాగాలు సాగాలి నిరంతరము జనులు మునిగి తేలాలి
అనురాగాలు అలలై ఏడుకొండలు తడవాలి భక్తితో!
తిరు వేంకటేశ్వరుడా జగత్తుకి తెలుసు మహత్తు
అన్నమయ్య త్యాగయ్యలున్నారు అదృష్టవశాత్తు తెలుపుటకు!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష తిథి చతుర్దశి.
16/03/24, 7:05 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
ఎన్ని ముసుగులో అడ్డము భక్తి త్రోవలో, మరి
వెనక్కి తిరగని పరుగుల కుర్రాళ్లకే అవకాశం!
ఉన్న కొంత సమయమైనా స్వామి నీ పై ధ్యాస
లోకం లేని సమస్యలన్ని నెత్తినించి వదిలేసి!
వ్రాసిన ప్రతి పాట లేఖను పంపి అర్జి పెట్టినట్లు
ఒక్క పాట చాలుగా తలంపులో మౌనముగా!
అద్దంలో బింబం బంధించ తరమా స్వామి
భక్తుల మనసున ఆర్తి ఆపతరమా మిద్దెలలో!
గోవింద అను మాటతో భక్తి ప్రారంభం
బంధు మిత్రులతో తిరుమల చేరిన సంతోషం!
ప్రకృతి తన సొగసును తాకి పరచినట్టు
ఆకాశము చేతిని చాపి పందిరి వేసినట్టు!
శ్రీ వేంకటేశ్వరుడా వెయ్యేండ్ల తపమాచరించ
వచ్చెను కమలమున పద్మావతి తిరుచానూరు!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస శుక్ల పక్ష తిథి సప్తమి.
23/03/24, 7:45 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
ఎన్ని ముసుగులో అడ్డము భక్తి త్రోవలో, మరి
వెనక్కి తిరగని పరుగుల కుర్రాళ్లకే అవకాశం!
ఉన్న కొంత సమయమైనా స్వామి నీ పై ధ్యాస
లోకం లేని సమస్యలన్ని నెత్తినించి వదిలేసి!
వ్రాసిన ప్రతి పాట లేఖను పంపి అర్జి పెట్టినట్లు
ఒక్క పాట చాలుగా తలంపులో మౌనముగా!
అద్దంలో బింబం బంధించ తరమా స్వామి
భక్తుల మనసున ఆర్తి ఆపతరమా మిద్దెలలో!
గోవింద అను మాటతో భక్తి ప్రారంభం
బంధు మిత్రులతో తిరుమల చేరిన సంతోషం!
ప్రకృతి తన సొగసును తాకి పరచినట్టు
ఆకాశము చేతిని చాపి పందిరి వేసినట్టు!
శ్రీ వేంకటేశ్వరుడా వెయ్యేండ్ల తపమాచరించ
వచ్చెను కమలమున పద్మావతి తిరుచానూరు!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస శుక్ల పక్ష తిథి చతుర్దశి.
30/03/24, 7:05 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
చిలుకమ్మ పలుకులే వయ్యారి కులుకులై
నడిచిన నాట్యములే సయ్యాట విరుపులు!
పిచుకమ్మ కిచకిచలు ఓయమ్మ సంగీతమై
గువ్వపిట్ట గుండె నిండా పిలిచే స్వామిని!
కోయిల కూత ఎంకి పాట మైమరచి హాయిగా
ఇలను వైకుంఠము చేయు స్వామికి తీయగా!
హంసను పంపే బ్రహ్మ, పాదములు మోయ
బ్రహ్మోత్సవంలో వాహనమై నిస్వార్థ సేవలో!
గరుడ మోయు తిరుమల కొండను భద్రంగా,
రక్షించు సైనికుడిలా భక్తితో ఆళ్వార్ ఖ్యాతి!
నెమలికి నేర్పిన నడకలు స్వామి పాదము
కాలము దాటి నామము చదివి సాధనము!
శ్రీ వెంకటేశ్వరుడా ఎగిరే పక్షుల మనసును
గెలిచి ఎరిగిన ఋషులై మెలగ పద్మముగ!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస కృష్ణ పక్ష తిధి పంచమి.
06/04/24, 7:08 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
చిలుకమ్మ గడుసుగా పాట పాడుతుంటే
పాడిన మాట మళ్లి మళ్లి పల్లవేస్తుంటే!
తేనెటీగలు కట్టు తేనెను పూల మకరందం గ్రోలి
గ్రోలి మధువుని అభిషేకమున వాలి!
తూనీగ రెక్కల ఝంకారం నాదం సంగీతమే
సంగీతమే వానలై కురువగా స్వామి!
హంస వాహన బ్రహ్మ కడిగిన పాదముల తన్మయత్వ
తన్మయత్వముతో పంపె తన వాహన బ్రహ్మోత్సవాలకు!
గరుడ వాహనమన్న వైకుంఠ వాసునికి ప్రియము
ప్రియము జనులకు మరింత తరలి వచ్చెదరు!
గువ్వపిట్టలు గూడు కట్టి పిల్లలను పెంచినట్లు
పెంచిన పసి మనసులా చిరునవ్వుల కిచకిచలు!
శ్రీ వేంకటేశ్వరుడా ఎగిరే పక్షులు గెలిచే మనసు
మనసు గెలుచుకొని కమలోద్భవి స్వర్ణమై!
వేం*కుభే*రాణి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస కృష్ణ పక్ష తిథి త్రయోదశి.
13/04/24, 7:16 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
మనసేమో ఒప్పుకోదు ఒక్కసారి దర్శనానికి
ఎంత కష్టమో తెలియదు మళ్లీ దర్శనానికి!
గరుడ సేవయన్న ఎంత అదృష్టమో కదా
పౌర్ణమి నాడు మాడవీధుల్లో దర్శనమే!
జనులే స్వయంగా కర్పూర హారతులిచ్చి
స్వాగత కుసుమాలు సర్వభూపాలుడికి!
స్వామియే వచ్చును జనుల వద్దకు మరి
వయ్యారంగా పల్లకిపై బోయలు మోయ!
గరుడుని రెక్కలు తరించే స్వామిని మోసి
వరుడు వచ్చినట్లు కర తురగముల తోడ!
చంద్రుడు కురిపించు వెన్నెల పుష్పములు
తివాచీలు పరిచినట్లు ఊరేగింపు దారిలో!
శ్రీ వేంకటేశ్వరుని గంభీర రాజసము చూడ
పద్మావతి మురిసిపోవు మెరియు పతికి!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం
వసంత ఋతువు చైత్ర మాస శుక్ల పక్ష
తిథి పంచమి.
20/04/24, 7:50 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
అడుగడుగునా హారతులు స్వామికి
ప్రతి పున్నమి నాడు గరుడ సేవలో!
జియ్యంగార్లు అడుగులు వేసిరి మెల్లగా
పూజారులు వంతపాడిరి వెంట వచ్చుచు!
పున్నమి చంద్రుడిని చూసి మనసు పొంగె
ఆడుచు పాడుచు తిరుమల వీధులలో!
కలశము మోస్తు కోలాటం కొందరు
అలంకరించుకొని ఆడుతు కొందరు!
నాట్యము చేస్తూ నడక సాగిస్తూ
వాయిద్యాలు డప్పులు మరికొందరు!
కాగడాల వెలుతురులో ఊరేగింపు
నక్షత్ర హారతి తోడ ముగింపు!
శ్రీ వేంకటేశ్వరుడా గరుడ సేవయన్న
ఎంత ఇష్టమో స్వామికి ప్రియ సైనికుడు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం
వసంత ఋతువు చైత్ర మాస శుక్ల పక్ష
తిథి ద్వాదశి.
27/04/24, 7:09 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
కోవెల నుండి వచ్చిన స్వామిని చూడ
గూడు నుంచి వచ్చిన సీతాకోకచిలుకలా!
వచ్చిన భక్తులు ముందుగా కూర్చోడానికి
సైనికుడిలా యుద్ధము చేసి గెలిచినట్లు!
పౌర్ణమిన గరుడ సేవలో స్వామిని చూడ
మోమున చిరునవ్వు చిన్న పిల్లాడి లాగ!
హారతిచ్చి స్వాగతం పలికిరి కొత్త అల్లుడు
ఇంటికి వచ్చినంత సంబరపడి ముచ్చటగా!
బోయలు మోయ హోయలు వయ్యారంగా
గజము నేర్చుకున్నదా గమనము చూడగా!
గరుడుని పైన స్వామి ఊరేగింపు చూసి
రౌతు నేర్చుకొనవలె గుఱ్ఱపు స్వారిని!
శ్రీ వేంకటేశ్వరుడా లోకాలను స్వారీచేయ
వైకుంఠం దిగి కలియుగ పావనమునకై!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాస కృష్ణ పక్ష తిథి తదియ/చవితి.
04/05/24, 6:48 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
శీర్షిక: గరుడ సేవ (3)
తెర తీయగా రావాయంటు భక్తజనులు
వేచియున్నారు తిరుమాడ వీధులలో!
హారతి చేసి సాయంకాల వేళ ఆరంభమ్
ప్రతి పౌర్ణమిన గరుడ సేవ తరించగా!
బంగారు గోపురము మెరిసే వెన్నెల తిని
తిరుమల పొట్ట నిండెను భక్తి ఆలకించి!
గోపురం పైన సరస్వతి దేవి వేచి చూసె
ఆకాశాన పూర్ణ చంద్రుడు గరుడారూఢె!
గరుడ సేవలో వైనతేయుడుని చూడ
తిరునామములు ధరించి పూజారులు!
ధ్రువ భేరము చిన్నదైన శోభాయమానం
భక్తితో నిండి పెద్దదైనదా గరుడాళ్వారు!
శ్రీ వేంకటేశ్వరుడా ఎన్నో జన్మల పుణ్యం
శ్రీ మహాలక్ష్మి పద్మావతి తల్లిగా దొరకగా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాస కృష్ణ పక్ష తిథి ఏకాదశి.
11/05/24, 7:53 am - venky HYD: ఓం నమో వైనతేయానమః
అన్నమయ్య కీర్తనలు ఆలాపనలు వింటు
గోపికల కోలాటాలు నృత్యాలను కంటు!
వింజామరలు వీస్తే వస్తున్న చల్లని గాలి
ఛత్రం పట్టుకున్న పూజారులు నీడ కింద!
అందరికి కౌస్తుభ మణిహారాల పైన చూపు
స్వామి నీ చల్లని చూపులు అందరి పైన!
నవ తీర్థాలు కలిగిన పుష్కరిణి ఒకవైపు
నవ రత్నాలు ధరించి స్వామిని చూడండి!
కలియుగ వైకుంఠ తిరుమలకు రారండి
లీలా వైకుంఠ శోభను చూచి తరించండి!
మూలయందు తిప్పిన తిరిగిన స్వామి
మూలాధారుడు లోకాన్ని తిప్పి నట్లు!
శ్రీ వేంకటేశ్వరా నమో నమః శరణుశరణు
పద్మావతి కూడి దర్శనమే భరణు భరణు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష తిథి చవితి.
18/05/24, 6:17 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
పున్నమి యన్న మిక్కిలి ఇష్టము భక్తులకు
స్వామియే స్వయంగా వచ్చును వీధులకు!
చంద్రుని వెన్నెల ముచ్చటపడును స్వామిని
స్పర్శించి పులకించి తన్మయత్వంతో నిండి!
నక్షత్రాలు తీసికొనునో స్వామి ప్రకాశమును
గగన వీధులలో ప్రకాశించి మురిసిపోవునో!
బోయలు మోయ కులికినట్లు ఊగునో మరి
స్వామి హొయలకు వంత పాడిరో పల్లకిన!
జియ్యంగార్లు నడిచిరి ముందుగానే స్వామి
దారి పరీక్షించగా వచ్చెను లోకాలను రక్షింప!
ప్రతి నిమిషము వర్ణించిరి కళ్లకు కట్టినట్లుగా
పృచ్ఛకులు అడిగిన అవధాని వ్యాఖ్యాతలా!
నమో శ్రీనివాసా గరుడారూఢా జరుగు లోక
మెల్లా పద్మావతి తో కూడి వచ్చిన గోవిందా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష తిధి దశమి.
అందరికి వాసవి జయంతి శుభాకాంక్షలు.
25/05/24, 7:04 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
గరుడ సేవ 6
భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రముకు
శరణు కోరి వత్తురు పున్నమి గరుడ సేవకు!
పరమపద సోపాన మోక్షము వచ్చును
పావన శ్రీనివాసుని దర్శించ గరుడ సేవలో!
అఖిల జన పూజిత శ్రీ వేంకటేశ్వర నమో
అఖిలాండ నాయక ఏడేడు లోకాల రక్షకా!
కాసుల పేరును చూడు జ్ఞాన నేత్రము తోటి
ఆశ నిరాశల నుండి ముక్తి దొరుకు తప్పక!
భక్తులు కోరు సంతానం భగవంతుని సేవకే
కోరి ధనధాన్యముల్ కొండలరాయుడి సేవకు!
తొండమాను వేచె హాథీరాం తిరుమల నంబి
కైంకర్యములెన్నో చేసి తరించిన మహా భక్తులే!
శ్రీ వేంకటేశ్వరుడా సచ్చిదానంద రూప దర్శన
సర్వాంతర్యామి పద్మావతి తోడ హృదయాన!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష తిథి విదియ.
01/06/24, 6:34 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
గరుడ సేవ 7
చిన్నారులు సింహాసనమెక్కి తిరుమలేశుని దర్శనము
మెడలు వంచి మొక్కిరి తన్మయత్వంతో కరి కరములు!
దైవ స్మరణమే దివ్య కవచము సర్వదా శ్రీకరుడు
సర్వకార్య మంగళము చేయు మంగళకర స్వామి!
కాగడాల వెలుతురులో గరుడ వాహనమెక్కిన శ్రీనివాసుడు
పున్నమి వెన్నెల గంధ సుగంధ పుష్ప కైంకర్యాలు గ్రోలుతు!
ముల్లోకాలను తన చూపులో తిప్పేటి స్వామిని చూడు
మూలాధారుడు సర్వ జీవికి శ్వాస విశ్వాసము లోన!
తిరుమాడ వీధి మలుపున తిరుగుతు చూచెను క్రీగంట
కనుమరుగవును మనకు మాత్రమే, ఆవలి జనులకు దర్శనము!
గజ గమనము వీక్షించుతు గరుడ భుజములపై ఆసీనులై
వేంకటాచలమున జలథిత కమలనాథుడు నివాసమై!
శ్రీ వేంకటేశ్వరుడా సురులు మునులు కొలిచిరి నిన్నేను
చంచలమైన లక్ష్మి పద్మావతిగా స్థిరపడే హృదయమున!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష తిథి నవమి/దశమి
08/06/24, 8:21 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తోమాల సేవ-1
తిరుమల నంబి వంశస్థులు తెచ్చిరి జలమును
ఆకాశ గంగ నుంచి బ్రహ్మ ముహూర్తమునకు!
భోగ శ్రీనివాస మూర్తికి పాదములు కడిగి పాద్యమ్
చేతులు కడిగిరి వైకుంఠ అతిథికి అర్ఘ్యమ్!
శ్రీమంతునికి దంత ధావననంతర ప్రత్యూషమ్
ముల్లోకాలను నోటిలో చూపించిన స్వామికి దంతూషమ్!
భూలోకమున నడయాడిన స్వామికి అక్షేప ఉపచారాలు
సహస్ర శీర్షా పురుషః అనుచు మంగళ స్నానాలేను!
ఆచమనం స్వామిని మననం చేసుకుంటూ
నూతన వస్త్రముతో తడియార తుడిచిరి అర్చకులు!
స్వచ్ఛమైన పాలతో స్నానాలు, సర్వ శుద్ధి కొరకు
శుద్ధోదక స్నానానంతర పరదా వేసిరి అలంకరణకు!
భోగ శ్రీనివాస మూర్తికి పచ్చ కర్పూర గంధమ్
తులసి మాల వేసి ఆసీనులై పరదా తీసి దర్శనమ్!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష తిథి విదియ.
15/06/24, 7:20 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తోమాల సేవ - 2
బ్రాహ్మణ మంత్రాల నడుమ మూల మూర్తి
బంగారు పాదుకలు తీసి అభిషేకము చేసి!
తిరిగి స్వామికి కళ్లకద్దుకొని పాదుకలు తొడిగి
సంతోషము నిండెను మనసున అర్చక స్వాములకు!
సాక్షాత్తు విష్ణు రూప సాలగ్రామ పూజలు చేయ
శుద్దోదక స్నాన, ఆచమన ఉపచారాలు చేసి!
శేష వస్త్రములు గైకొని అర్చక స్వాములు
కళ్లకద్దుకొని సంతసించిరి మిగిలిన స్వాములూ!
మంత్ర స్తుతి తరువాత తులసీ దళాలతో అర్చన
మూల మూర్తి వేంకటేశ్వరునికి మొదట పూజలు!
పిమ్మట సీతా రామ లక్ష్మణులకు తులసి దళార్చన
శ్రీ కృష్ణ రుక్మిణీలకు భక్తితో అర్చన, చక్రత్తాళ్వరులకును!
విమాన వేంకటేశ్వరునికి తులసి దళాలతో పూజలు
పాద్య ఆచమన ఉపచార మంత్ర స్నానాలు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష తిథి నవమి.
22/06/24, 7:09 pm - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తోమాల సేవ - 2
దివిటీల వెలుతురులో పూల మాలల తెచ్చి
మూల మూర్తికి అలంకరించుటే తోమాల సేవ!
ఉదయాన్నే స్వామిని యోగనిద్ర నుండి
మేల్కొలిపి ఉపచారములన్నియు చేసి!
యమునాతురాయి నుండి ఏకాంగి తీసికొని
జీయరు ఆధ్వర్యంలో పూల మాలలతో!
చేగంటలు కొడుతూ శిష్యులు రాగా
మంత్రాలు చదువుతూ బ్రాహ్మణులే!
సరియగు కొలతలతో వివిధ రకాల
రంగుల పూలను మాలగా కట్టిరి!
మంగళ బుధ గురువారాలు మాత్రమే
తోమాల సేవ తిరుమలలో స్వామికి చేసెదరు!
శ్రీనివాసునికి ఇష్టమైన తులసిమాల తోటి
అలమేల్మంగ పతికి అలంకార ప్రియుడే!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష తిథి పాడ్యమి.
28/06/24, 10:40 am - venky HYD: తోమాల సేవ - 3
29/06/24, 7:57 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తోమాల సేవ - 4
నిర్ణీత కొలతలతో పూల మాలలు స్వామికి అల్లుతారు
సంఖ్యలో మార్పు ఉండదు, కాలానుగుణంగా పూలు మారవచ్చు!
మొదట మూల మూర్తి పాదాలకు ఇరువడి దండలు
ఇరు భుజములు కలుపుకొని సంతోషముతో వేలాడు దండ!
కిరీటము పైనుండి శ్రీనివాసుని నిండిన అతిపెద్ద దండ
విశ్వ విశాలమైన హృదయమునకు సూక్ష్మ దండ!
రుక్మిణి కృష్ణులకు సరిపడు పూల దండలను అలంకరించి
సీతా రామ లక్ష్మణులకు, చక్రత్తాళ్వరులకును మాలలు వేసి!
తెర వేసి ఉదయ అల్పాహార నైవేద్యమును నివేదించి
తెర తీసిన తరమా చూడ సుందర అలంకృత శ్రీనివాసుని!
పూలు పులకించి మరింత పరిమళించు స్వామికి చేరిన
సంపూర్ణత భావము మదినిండి జన్మ సార్థకత మోక్షమే!
నమో శ్రీనివాస నమో వాసుదేవ మనసు పూలు వికసించు
పద్మావతి తోడ కమలనయన కమలనాభ సేవతో మాల!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష తిథి అష్టమి/నవమి.
06/07/24, 7:27 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
మహత్తేజో మహా ఈశో మహద్భాగ్య వేంకటేశో నమోస్తుతే!
మహత్తపో శ్రీనివాసో మహా భక్తో తిరుమలవాసో!
మహద్బ్రహ్మ మహావిష్ణు మహేశ్వరో మహాకాళి సర్వరూపో!
మహావరాహో మహానామో వరమహా ప్రదాతో పురుషోత్తమో!
మహాయజ్ఞో మహాహవిః మహాక్రతు మహాఫలో మహా త్రివిక్రమో!
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః సర్వ ప్రియ దేవా!
మహా మూర్తి మహా స్వామి మహాభూతో మహానిథి వాసుదేవో!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష తిథి పాడ్యమి.
13/07/24, 7:17 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
మురిపెంను మురిపించి మురిసినావు
పిలుపును పరవశించి పిలిచినావు
మెరుపును ఉరిమించి మెరిసినావు
కమలాని కదిలించి కలిసినావు
వెలుగును వెలిగించి వెలసినావు
భక్తులకై నీవు తపించి అలసినావు
వేంకటేశ్వరా విశ్వమున ఎగసినావు
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష తిథి సప్తమి.
20/07/24, 6:58 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నం బ్రహ్మజ్ఞ్నో బ్రహ్మ కర్మో బ్రహ్మణ్యో హవ్యవాహనా!
కాలనేమి కామధేవ కృతాగమో కేశవో గోహితో గోవిందో గరుడవాహనా!
చతుర్మూర్తి చతుర్భాహో చతురాత్మ చతుర్భావో చతుర్భుజో చక్రవాహనా!
వనమాలి వాసుదేవో వైఖానససామో వల్లభో వారధిహ్య వాయువాహనా!
యజ్ఞో యజ్ఞపతి యజ్ఞాంగో యజ్ఞభృద్య యజ్ఞసాధన యజ్ఞవాహనా!
శతకీర్తిః శ్రవణకీర్తి కీర్తనప్రియో చక్రీ నిర్గుణో సువర్ణవర్ణో కీర్తివాహనా!
ధనుర్దరో ధనుర్వేదో దుష్టదండో శ్రీనివాసో దుస్స్వప్ననాశనో ధర్మవాహనా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష తిథి చతుర్దశి.
27/07/24, 8:25 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
ఉదయభానుని కిరణములు భవ భయ హరుడికి సుప్రభాతము!
నల్లని మేఘ మొకటి వచ్చి మేఘశ్యాముడికి గొడుగులా!
వాన చినుకు రాలి వరదరాజస్వామికి లాల పోసే!
చల్లని గాలి వీచి చక్రధరునికి మలయ మారుతమే!
సప్త గిరులు ఒకటిగా వచ్చి సదంజన గిరీశునికి స్థానమాయే!
శీతల శశి కిరణములు శ్రీనివాసునికి హాయిగా జోల పాడే!
ఇల వైకుంఠమున శ్రీ వేంకటేశ్వరునికి పద్మావతి తోడుగా నిలిచే!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష తిథి సప్తమి.
03/08/24, 8:36 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
కాసారయోగి వాగ్రూపమాలిక అలంకృత
పాయ్ గై ఆళ్వారు విరచిత గోకులేంద్ర!
శ్రీభూతయోగి జ్ఞానప్రదీప గుణస్వరూప
పూదత్తాళ్వార్ రూపకల్పిత గోపవంద్య!
మహాదాహ్వాయ యోగి శంఖచక్ర లక్ష్మి సహా
పేయాళ్వార్ సాక్షాత్కారిత శ్రీమంత గోపనాథ!
శ్రీ మత్పరాంకుశ సహస్రగాథ శేషాసన
నమ్మాళ్వార్ చరణ స్తుతిత గోపరత్న!
శ్రీ విష్ణుచిత్త హృదయ కమల నిత్య నివాసా
పెరియాళ్వారు రచిత దివ్యసూక్త గోవృషేంద్ర!
పాణాజ్య మహాముని ఆరాధ్య సకలరక్ష చక్రధారీ
తిరుప్పాణాళ్వార్ కీర్తిత దివ్య కృప గోపబంధు!
శ్రీ వేంకటేశ్వర పద్మావతి వల్లభ పుష్కరాక్ష
గరుడాళ్వార్ సేవిత గోవింద గోపనాథ!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష తిథి చతుర్దశి.
10/08/24, 8:23 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
నీలిరంగు నింగి నిర్మల హృదయ శ్రీనివాసునకు!
పచ్చరంగు ఉత్తరీయం పావన వేంకటేశ్వరునికి!
పసుపు రంగు ధోవతి పుణ్య రాశి పరమాత్మకు!
ఎర్ర రంగు హోత్రము యాగాల యజ్ఞేశ్వరునకు!
గులాబీ రంగు పూలు గోవుల శ్రీ గోవిందునకు!
సకల భక్తిరంగు పులుముకున్న సర్వేశ్వరునకు!
తెల్లరంగు క్షీర తేనీయ పలుకుల పద్మనాభునికి!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష తిథి షష్ఠి.
17/08/24, 7:55 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
చేరి పుదు స్థానము విద్యా ప్రాప్తికై
పుత్రుని ఉన్నత సాంకేతిక విద్యకై
కొత్త భావమొకటి భాష వ్యాప్తికై
సుధామృత జ్ఞానం విస్తరించుటకై
అవనియందు ఈశ్వరుడు నీవయ్య
శ్రీ వేంకటేశ్వర ప్రయాణ బడలిక
తీర రాసితి నాజూకైన రీతిన.
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం
వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష
తిథి త్రయోదశి
24/08/24, 7:57 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
గుంటూరు కారములా శక్తిని తెచ్చికుంటినయ్య!
ఒంగోలు గిత్తలా మోయ పల్లకి వేచితిమయ్య!
కావలి కాస్తివయ్య మము రక్షించితివయ్య!
నెల్లూరు సాగర పవనం చల్లగ వీచితిమయ్య!
వెంకటగిరి చీరలాగ వెచ్చగ ఉంచితివయ్య!
శ్రీ కాళహస్తి లోన గజవాహనం సవారినయ్య!
శ్రీ వేంకటేశ్వర పట్టి ఉంచిన దర్శనమయ్య!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస కృష్ణ పక్ష తిథి షష్ఠి.
31/08/24, 5:22 pm - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
సర్వ రోగ హరుడు ఆదిత్య ప్రచోదయ భాస్కరాయ వేంకటేశ్వర ప్రభో!
తుషార శశి కిరణముల సోమ భూషణుడు సర్వ భూపాలుడు స్వామి!
ధరణి పైన ప్రత్యక్ష కలియుగ దైవము నిత్య కళ్యాణ వేంకటేశ్వరుడు!
మంగళకరుడు నామ జపము చేసిన కుజ దోషములు సజావుగా తీర్చు!
రూపమున సౌమ్యుడు సర్వ గుణ బుధుడు ప్రణమిల్లెద పద్మావతి ప్రియ!
దేవతలకు ఋషులకు గురువు దైత్య శుక్రచార్య భాస్కరాయ త్రిలోకేశా!
రవిసుతుడు వరమిచ్చు నిను దర్శించినంత రాహు కేతువు దూరముగా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస కృష్ణ పక్ష తిథి త్రయోదశి.
(శని త్రయోదశి కావున నవగ్రహ స్తోత్రం పదాలతో)
07/09/24, 7:23 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
వారణాసి పట్టణం లోన గంగానది తీరాన బాధలన్ని మరిచిపోవు బిందు మాధవ ఆలయం!
ప్రయాగలో త్రివేణి సంగమం సమీపాన పాపాలను ప్రక్షాళణ చేయు వేణీ మాధవ ఆలయం!
పిఠాపురం లోన పాండవుల కొరకు కుంతి మాత కోరగా ప్రత్యక్షమై వరములిడి కుంతి మాధవ ఆలయం!
రామేశ్వరంలో బంగాళఖాత ఒడ్డున శ్వేత మందిరంలో పుణ్యమిచ్చు సేతు మాధవ ఆలయం!
తిరువనంతపురం పద్మనాభ ఆలయంలో దివాకర ముని కోరగా సుందర మాధవ ఆలయం!
పంచ మాధవ ఆలయాలతో పాటు దేశములో కృష్ణ ఆలయాలు ఎన్నో వెలిసినాయి!
తిరుమలలో పుష్కరిణి ఎదురుగా శ్రీ వరాహ స్వామి గుడి పక్కన రాధ సమేత కృష్ణ ఆలయం!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష తిథి వినాయక చవితి.
14/09/24, 8:01 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
సదా విముక్తి దాయకం సర్వ లోక రక్షకం
అనాయకైకనాయకం సర్వ శుభకారకం!
దుష్టరేతి భీకరం భక్తార్క సుముఖ భాస్కరం
సర్వ యుక్త పరాత్పరం భక్త శరణ నిరంతరం!
కృపాకరం వేంకటేశ్వరం క్షమాకరం ముదాకరం
నిరస్తదైత్యకుజ్ఞరం సమస్త దేవ శంకరం!
సకల పాప మార్జనం జనుల ముక్తి భాజనం
యశోద వకుళ నందనం వివిధ నైవేద్య చర్వనం!
శ్రవణ కీర్త భూషణం సకల దుఃఖ భీషణం
సకల విఘ్న వారణం శ్రీనివాసం భజె పురాణం!
అచిన్త్య రూపకాత్మజం కళ్యాణ వసంత నిరంతరం
యోగినాం హృదయ నివాసం దివ్య పాద సంతతం!
శ్రీ వేంకటేశ్వరం సదా పద్మావతి హృదయ భూషణం
నమత్సురారి నిర్జరం తం నమామి శ్రీనివాసం!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష తిథి ఏకాదశి.
21/09/24, 7:27 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
(గురువార నిజరూప దర్శనం)
వేకువజామున సుప్రభాత అర్చన పిదప దర్శనమిస్తారు స్వామి నిజరూపమున!
కమలనయనములు కనువిందు చేయ కర్పూర నామము చిన్నగా!
గురువారం మాత్రమే నేత్ర దర్శన భాగ్యము లభించు భక్తులకు!
పట్టు ధోవతియే ఆభరణము గురువారం స్వామికి!
పట్టు వస్త్రమే తలను చుట్టి కిరీటము తలపాగా!
మంచి పనులను చేసిన వారిని స్వామి చూసి కరుణిస్తాడు!
శ్రీ వేంకటేశ్వర స్వామి మనలను చూడును గురువారం!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణ పక్ష తిథి చవితి.
28/09/24, 6:53 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
స్వామి ముఖ్యాభరణాలు
విష్ణు సహస్రనామాలు చెక్కిన 1008 కాసుల సహస్రనామ హారము!
లక్ష్మిదేవి ప్రతిమలున్న 108 కాసుల చతుర్భుజ లక్ష్మిహారము!
మకరకంఠి హారము మూడుపేటల హారము మైసూరు మహారాజు బహుకరించ!
అరకిలో తూగు గరుడమేరు పచ్చ, సరితూగ మేలుజాతి రాయి దొకకదు లోకంలో!
స్వర్ణ పీతాంబరాలు చేయించిరి దేవస్థానము వారు, ఎన్నెన్నో రత్నాభరణ కవచాలు!
బంగారు సూర్యకఠారి, కరములకు నాగాభరణాలు, దస్తుబందు, పాదాల కవచాలు!
వల కటి, వరద హస్తాలు, కమ్మరపట్టి దశావతార వడ్డాణాలు, బంగారు గంటల మొలత్రాడు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణ పక్ష తిథి ఏకాదశి.
05/10/24, 7:10 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
ఐదు వేల సంవత్సరాల ఆకాశ రాజు కిరీటము, మామ బహుకరించగ!
గద్వాల మహారాణి చేసిన వజ్ర కిరీటము, పురాతత్వ శాస్త్రవేత్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో!
వేంకటేశ్వరా హ్యాచరీస్ సమర్పించిన బంగారు కిరీటము!
స్వాతంత్ర్య పూర్వము తి తి దే వారు చేయించిన వజ్ర కిరీటము!
5 కోట్లు ఖర్చు చేసి చేయించిన మరో వజ్ర కిరీటము!
గొయెంక కుటుంబం కానుకగా ఇచ్చిన మరో బంగారు కిరీటము!
21వ శతాబ్దంలో జనార్ధనుడు సమర్పించిన కోట్లు విలువ గల వజ్రాల కిరీటము!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తిథి తదియ.
12/10/24, 8:04 am - venky HYD: అందరికి దసరా శుభాకాంక్షలు🎉
ఓం నమో వేంకటేశ్వరాయనమః
బాలిక రూపమున అవతరించి బాలాజీవైనావు!
బ్రహ్మచారివై బలి చక్రవర్తికి మోక్షము నొసగినావు!
యవ్వన పురుషుడివై జవరాలు పద్మావతి పరిణయమే!
గృహస్థుగా కుటుంబం నడుపుటకు కుబేరుని సహాయం తీసుకున్నావు!
శక్తి స్వరూప దుర్గ లా అరిషడ్వర్గాలను నరికినావు!
చాముండి లా రాక్షసులను అంతమొందించినావు!
మోక్షము నొసగ కలియుగాన వేంకటేశ్వరుడివై వెలసినావు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తిథి నవమి/దశమి.
19/10/24, 7:08 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయవమః
శేష వాహనమెక్కి పెద్ద స్వామి భుజంగము పైన తిరుమాడ వీధులలో!
సూర్య ప్రభ వాహనము పైన వచ్చెను చూడరో చంద్రుడు వెన్నెల కురిపించునట్లు దీవెనలు!
ముత్యాల పందిరి కింద చూడరో స్వామి చుక్కలలో చంద్రుడి లాగ మెరిసెనో!
అల్పులకు దర్శనమివ్వ కల్పతరు వాహనం లోన అనంత వరములు ఇచ్చుటకు!
నిండు పున్నమిలా గరుడుని పైన వచ్చెను శ్రీమంతుడు హనుమంతుని పైన!
అశ్వమెక్కి వచ్చెను గజముల తోడుగా కల్కి అవతారంలా కలియుగమును పావనం చేయగా!
వైకుంఠం నుండి వచ్చిన శ్రీ వేంకటేశ్వరా నా మనసుని వాహనం చేసుకుని రావయ్య పద్మావతితో!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష తిథి విదియ/తదియ
26/10/24, 7:13 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
నిదుర రాలేదు నా కంటికి
తలలో మెదిలే ఆలోచనకు!
దర్శన తేది దగ్గరయ్యే వేళ
ప్రయాణం ఎలా సాగుతుందని!
తోడుగా ఎవరిని తీసికెళ్లాలని
పెళ్ళాం పిల్లలు చెల్లెలు మరి!
వరములు కురిపించు వరదరాజు
ఆ ధనమును ఎలా వినియోగించాలని!
కోరుకున్న వరము దక్కుతుందని
దక్కిన వరము ఎలా పంచాలని!
బంధు మిత్రులే సాక్షిగా వచ్చి
పనులు కళ్యాణం చేయుదరని!
శ్రీ వేంకటేశ్వరా పనులు నిర్విఘ్నంగా
జరుపుమని కోరు విఘ్నేశ్వరుడిని!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష తిథి దశమి.
02/11/24, 7:58 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
బిజిలి బాణాలలా ఎన్ని కాల్చినా మిగిలి పోవు నీ ఉనికి చెప్పు కథలు!
కాకరొత్తులా వెలుగులు విరజిమ్ముతాయి దివ్య కాంతులు!
రాకెట్లు లాగ జివ్వున ఎగురు కోరికలను తీర్చు స్వామి!
సహస్రనామ మాల లాగ సహస్రవాలా నిరంతర మహిమ చూపు స్వామి!
పాంబాణము లా బుస్సుమను భక్తులు, చిలుకలా ఎగురు మనసులు!
భూచక్రాలు విష్ణు చక్రాలు తిరుగు కాలము లాగ ఆగిపోవు!
శ్రీ వేంకటేశ్వరా నవ్విన ముత్యాల దీపావళి పద్మావతి చిరునవ్వుగా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస కృష్ణ పక్ష తిథి పాడ్యమి.
09/11/24, 8:07 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
పంచ మహా యజ్ఞములు
*దేవ యజ్ఞము:* స్వామి నిత్య కళ్యాణము చేయ నిత్య అగ్ని హోత్రము జరుగు వైభవంగా!
*పితృ యజ్ఞము* పితృ దేవతలు చూపిన సేవా మార్గము తిరుమలకు మరువబోరు మా మనవలు కూడా!
*భూత యజ్ఞము* సమస్త ప్రాణి కోటికి సరిపడు ఆహారము సమకూర్చు స్వామి, గోశాలలో గజ తురగ గోమాత!
*మనుష్య యజ్ఞము* అతిథి దేవోభవ! వెంగమాంబ పేరిట లక్షల జనుల ఆకలి తీర్చి పంపగా!
*బ్రహ్మ యజ్ఞము* వేద మంత్ర జప తపాదులు నిత్యము ఘోషించు తిరుమల మందిర, వేద పాఠశాల లోన!
స్వామి గోవింద నామ మననమే సర్వ జనుల జరుపు ప్రతిక్షణ యజ్ఞము కదా!
శ్రీ వేంకటేశ్వరా పద్మావతి తో కూడి తిరుపతి తిరుమల యాత్ర కూడ యజ్ఞముకు తక్కువేమి కాదు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస శుక్ల పక్ష తిథి అష్టమి.
16/11/24, 8:01 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
వైజయంతి మాల
సువాసనగల వైజయంతి విత్తనాలతో చేయించిన హారము విజయ హారము!
ధరించిన పెరుగు ఆధ్యాత్మిక భక్తి భావము, గౌరవమును పెంచు సంప్రదాయ హారము!
రక్షణ ఇచ్చి అనుకూల శక్తులను పెంచి, ఒత్తిళ్లను తగ్గించి శాంతి ప్రశాంతతను ఇచ్చు వైజయంతి మాల!
పరమాత్మతో దైవీక సంబంధాన్ని పెంపొందించే హారము వైజయంతి మాల!
ధ్యాన ప్రార్థనాధి సమయాలలో ధరించిన భగవంతుని చేరు వాహికౌను!
పరమ పవిత్రమైన వైజయంతి మాల దేవునికి అర్పించిన బహు పుణ్యము!
శ్రీ వేంకటేశ్వరా వైజయంతి మాలను బహుకరించిన భక్తులకు పద్మావతి ఆశీస్సులు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస కృష్ణ పక్ష తిథి పాడ్యమి.
23/11/24, 9:00 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
సుందర నందన వనములతో అలరారు భూదేవి వరాహ స్వామి నివాసమే వసుంధర నిలయం!
ముడుపులను కట్టి భక్తులు కోట్లు కురిపించు శ్రీ వారి హుండీ ధన కనక లక్ష్మి నిలయం!
నిత్యము షడ్రుచులను వడ్డించు తరిగొండ వెంగమాంబ భోజనాలయమే షడ్రసోపేత నిలయం!
తిరుమలలోని ఏడుకొండలు ఋషి మున జనులు వాగ్గేయకారులు తిరిగిన జప తపో నిలయం!
ప్రతి క్షణం గోవింద నామస్మరణతో మారు మ్రోగు తిరుమల పుణ్య క్షేత్రమే మనకు భక్తి నిలయం!
సౌభాగ్య కాంతులిడు మాత తిరుచానూరు అలివేల్మంగ పద్మావతి నివాసమే శాంతి నిలయం!
నిత్యాయ నిరవద్యాయ సదానంద చిదాత్ముడు శ్రీ వేంకటేశ్వరుని నివాసమే ఆనంద నిలయం!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస కృష్ణ పక్ష తిథి అష్టమి.
30/11/24, 8:29 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
ఓం *కేశవాయ* అవ్యక్త తత్వ అన్న స్వరూపా; *నారాయణ* జల తత్వ ప్రాతఃకాల పరమాన్న స్వరూపా!
ఓం *మాధవాయ* రమాదేవి పతయే భక్ష్యప్రియా మధు స్వరూపా! *గోవిందా* వేద గో భూ రక్షక ఘృతం స్వరూపా!
ఓం *విష్ణవేనమః* జ్ఞానానందాయ సర్వ గుణ సర్వోత్తమ సర్వ వ్యాప్త క్షీర నియామకా; ఓం *మధుసూదన* రాక్షస సంహారా సాత్విక రూప సుఖప్రదాయ మధురభక్ష్య విశేషకా!
ఓం *త్రివిక్రమాయ* త్రికాల త్రిసత్వ త్రిలోక త్రివిధ జీవ త్రివిధ ద్రవ్య స్వరూపా నవనీతప్రియా; *వామనాయ* అపేక్ష అభీష్ట ఫల మోక్ష కరుణాయ దధీ నియామక!
ఓం *శ్రీధరాయనమః* శబ్దవాచ్య మహాలక్ష్మి పోషణ ధారణ వక్షస్థల ముద్దపప్పు నియామక; *హృషీకేశ* ఇంద్రియ నియామక ఆనంద ప్రదాయక వాక్ తత్వ దాత ఆకుకూరల పదార్థ నియామక!
ఓం *పద్మనాభాయనమః* పద్మనాభ భక్తమనసా సూర్య ప్రకాశిత కూరగాయ పదార్థ నియామక; *దామోదర* ఉదరబంద దానశీల దైత్య దుఃఖ దయామయ పుల్లని పదార్థ నియామక!
ఘృతం = నెయ్యి
నవెన్ = వెన్న
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస తిథి చతుర్దశి.
07/12/24, 8:04 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
ఓం *సంకర్షణాయ* ప్రాపంచిక చిత్త విముక్త, వైరాగ్య భావ సిద్ధ, కరుణాయ రాజస ద్రవ్య నియామక; *వాసుదేవాయ* సర్వాంతర్యామి, సర్వశక్తిమయా వసుదేవ సుత ముక్తిదాత శుభ ద్రవ్య నియామక!
ఓం *ప్రద్యుమ్నాయ* సూర్యకాంతి యశో ధారి శ్రీహరి వర్ష ప్రదాత వడపప్పు నియామక; *అనిరుద్దాయ* అజాతశత్రు, సర్వగుణ సంపన్న వేద రక్షక జ్ఞాన ప్రదాత నల్లని ద్రవ్య నియామక!
ఓం *పురుషోత్తమమాయ* చరచరా జీవ రక్షక మహాలక్ష్మి నివాసా సుగంధ ద్రవ్య నియామక; *అధోక్షజాయ* నిత్య జ్ఞాన స్వరూపా, హనుమద్ సేవిత, నేతితో నూనెతో వేయించిన పదార్థాల నియామక!
ఓం *నారసింహాయ* మానవ సింహ ఉభయ రూప, యోగా మూర్తి గుమ్మడి వడియాల నియామక; *అచ్యుతాయ* శుద్ధ జ్ఞాన దేహాయ, సత్యసంకల్ప దోషరహితా మినుప వడ పదార్థాల నియామక!
ఓం *జనార్ధనాయ* మధు కైటక హిరణ్యాది దైత్య నాశక, సంసార దుఃఖ విమోచక, జన్మరహిత వాయు తత్వ; *ఉపేంద్రాయ* ఇంద్ర అనుజ రూప తేజో తత్వ కదళి నారీకేళ ఫల రూప!
ఓం *హరయే* భక్త పాప హరాయ, సర్వ నామ రూప తాంబూల నియామక; *కృష్ణాయ* సృష్టి స్థితి లయ కారకా పూర్ణానందాయ నీలవర్ణ దేహాయ, ఉదక నియామక!
త్రికాల సంధ్యవేళ కేశవ నామాల *వర్ణన* నిత్యము పఠించవలె; శ్రీ వేంకటేశ్వరా పద్మావతి సమేత సర్వ జగద్రక్ష అన్నియు *సమర్పణ*
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష తిథి షష్ఠి.
14/12/24, 7:55 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
గుహలోన వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడు
కొండ పైన కొండ ఏడు కొండల పైన!
అమ్మ చెప్పగా భక్తులు కొరకు వేంచేసి
కురుమూర్తి స్వామిగా మారెనిచట
దూరాభారము ఖర్చు చేయలేని
వారికి చిన్న తిరుపతిగా అమ్మాపూర్!
స్వామి భోధించె మనకు తీర్చ లేని
కోరికలు కోరవద్దని, నీ యిష్టాలకు
అప్పులు చేయవద్దని, తప్పించుకు
తిరుగవద్దని, ఋణపడి పోవలదని!
భక్తుల సౌకర్యార్థం గుహను తొలిచి
నేరుగా స్వామిని చూచుటకు వీలు
మెట్టు కట్టి మేలు చేసిరి ఎక్కుటకు
కురుమూర్తి లక్ష్మి వేంకటేశ్వరా నమో!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష తిథి చతుర్దశి.
దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు.
21/12/24, 7:30 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుపావై పాశురాలు
గోపికలార రారండి ధనుర్మాస వ్రతము చేయ;
ఆలసించక రారండి మార్గళి స్నానము చేయ!
భోగ్య విషయాలను వదిలి కృష్ణుని పూజించ;
ధనుర్మాసమంతా ఆచరించి వ్రతము చేయ!
త్రివిక్రముని వలె పెరుగు పంటలు సమృద్ధిగా
గోవులిచ్చును క్షీరము నదులు పొంగి నట్లుగా!
సుదర్శన చక్రమై వానలు పాంచజన్య గర్జనలా
శార్ జ్ఞం ధనస్సు నుండి వచ్చి శరపరంపరలు!
అవిరళంగా కురియు వానలో స్నానం చేయ
రండి గోపికలార పునీతులమవుదాం సర్వదా!
దామోదరుని తప్ప అన్య కోరికలు కోరక వ్రతం
చేయండి సంకీర్తన పవిత్ర మనస్సుతో ధ్యానం!
పాపములన్ని భస్మమౌ అగ్నిలో పడిన దూదిలా
శ్రీ వెంకటేశ్వరా తిరునామములు పద్మావతిలా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తిథి షష్ఠి.
28/12/24, 10:46 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
పూతన విషాన్ని తాగి మోక్షమిచ్చెను కదా శ్రీ కృష్ణుడు
శకటాసురుని తన్ని సరిచేసినాడు ఆ వాసుదేవుడు!
సర్వం తెలిసిన విష్ణువు కృష్ణుడై మధురకు వచ్చినాడు
రాక్షసులను చంపి మనకు కష్టాలను దూరం చేసినవాడు!
చూడరో అశ్వాసుర కేశిని, చాణూర ముష్టికాదులను చంపిన
చిలిపి కృష్ణుని వరములు కోరరో, బృందావన గోపికలార!
ఆదిశేషు పాన్పుపై పాల సముద్రము పైన యోగనిద్ర చేయు
శ్రీ మహావిష్ణువే ద్వాపరయుగాన వెన్నదొంగ కృష్ణుడాయే!
తులసి మాలలే కిరీటము కృష్ణునికి, అట్టివానివి కీర్తించరో!
తిరుపావై వరము నోచి వరములు పొందగ రారండి గోపికలార!
చాలినన్ని వరములు ఇస్తాడు ఆ నీలమేఘ శ్యాముని కొలచిన
లేగ దూడల ఎంగిలి పాలతో వెన్న చేసి తినిపించరో చిన్ని కృష్ణునికి!
కలియుగాన తిరుమల క్షేత్రమై వెలిసినాడు శ్రీ వేంకటేశ్వరుడు
కొలువరో పద్మావతి ప్రియునిని ధనుర్మాసమందు వ్రతములా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తిథి త్రయోదశి.
అందరికి శని త్రయోదశి శుభాకాంక్షలు!
04/01/25, 12:54 pm - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
శీర్షిక: లక్ష్మి నిలయం
ఇంటి సింహ ద్వార గడప లక్ష్మీ స్వరూపము - తొక్కవద్దు గడప మీద కూర్చోవద్దు, అటు ఇటు నిలబడవద్దు.
ఇంటిని శుభ్రపరచి స్నాన సంధ్యలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన లక్ష్మి ప్రసన్నవదనులై ఉంటుంది మా ఇంట!
ప్రతి శుక్రవారమైనా గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్టు అలంకరించిన లక్ష్మి దేవి సంతోషముగా ఇంట్లోకి వస్తుంది!
ఇరు సంధ్యలలో దీపారాధన చేసి, సాంబ్రాణి ధూపము వేసిన ఇంట లక్ష్మి దేవి కొలువై ఉంటుంది!
ఇంటి ఇల్లాలి చిరునవ్వు, మంచి మాటలు సౌమ్యముగా చెబుతూ, ఇల్లంతా గజ్జెల శబ్దము వినిపిస్తే మా ఇంట లక్ష్మి దేవి తాండవిస్తుంది!
తృణ ముద్రలైన జాగ్రత్తగా చూసుకును వారికి, పువ్వులను, అన్నం మెతుకులకు గౌరవ మిచ్చు వారి దరి లక్ష్మి దేవి ఉంటుంది!
శ్రీ వేంకటేశ్వరుని హృదయమున పద్మావతిగా లక్ష్మి దేవి సింహాసనము వేసుకుని కూర్చుంటుంది!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తిథి పంచమి.
11/01/25, 7:57 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
మాసాది వచ్చు భక్తులు కొందరు, సంవత్సరాది ఎందరో!
విధివశాత్తు వెళ్లలేని వారికి ప్రతి ప్రాంతమందు రెండవ తిరుపతి!
అక్షయమగు భక్తులు వేయు ముడుపులు తృతీయగా!
నలుదిక్కుల ఖ్యాతికి విఘ్నములు రాని చవితిలా!
పంచభూతాలు నీలో సాక్షిగా పద్మావతి శుభ పంచమిన!
షడ్రుచుల నైవేద్యాలు ఆరు ఋతువులలో పుష్టి షష్ఠి!
సప్తగిరుల స్వామి ఏడు రోజులు నిండుగా దివ్య సప్తమి!
అష్టమ సంతానమై గోదాదేవికి ప్రీతి తిరుపావై అష్టమి!
నవరత్న మకుటము, దివ్య ఆభరణాలకు నవమి!
దశావతారాల విష్ణువు శ్రీ వేంకటేశ్వరుని దశమి!
మోక్షమే ఉత్తరద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి!
ఉపవాసము దాటి పంచభక్ష్య భోజన మధుర ద్వాదశి!
ఆనతిచ్చిన సర్వ గ్రహములు తోడుగా శని త్రయోదశి!
కీర్తింప నిండు పున్నమి అనంత పద్మనాభుని చతుర్దశిలా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తిథి ద్వాదశి/త్రయోదశి.
18/01/25, 8:26 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమలలో సేవలు
మహా అదృష్టముంటే దొరుకు సుప్రభాత సేవ కడకు చేరి మూల మూర్తి!
తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఎంపిక లక్షల్లోకరికి!
అదృష్టముంటే దొరుకు అర్జిత సేవలు కళ్యాణోత్సవం కడు కమనీయం!
వేలల్లోకరికి ఊంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవ సేవ సరి ప్రయత్నించిన!
పుణ్యమే కదా స్వామి ఉత్సవ మూర్తులకు గుడి లోపల సేవలు చూడడం!
ఆరుబయట సహస్రదీపాలంకర సేవ, తదుపరి ప్రత్యేక దర్శనం మేలే కదా!
ఉత్సవ మూర్తుల సేనలను చూడవచ్చు వర్చువల్ గా ఇంటి నుండే హాయిగా!
తదుపరి వీలుగా తిరుమల వెళ్లి దర్శనము చేసుకోవచ్చు సుళువుగా మీరు!
భక్తికి కొండలే కరుగు, అంగ ప్రదక్షిణ చేసిన ఇంతి కంతి కరిగిపోవు!
సాధారణంగా పిల్లల కోసం చేస్తారు యువ దంపతులు! కుచ్చుల చీర/ధోతిలో చేయవలె !
శ్రీ వాణి సేవలు బహు ప్రియమైనవి, ప్రత్యేకంగా చాలా దగ్గర దర్శనము!
వయో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక సమయ దర్శనం తోపులాట లేకుండా!
అంతర్జాలం కాంతి వేగముంటే దొరుకు ప్రత్యేక దర్శనమరాణ, 3, 4 గంటలలో!
ఏమి లేకుండా చేసుకోవచ్చు వేంకటేశ్వరుని, పద్మావతమ్మ పై భారం వేసి సర్వ దర్శనము!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష తిథి పంచమి!
25/01/25, 6:40 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమల ప్రయాణము
దారిన వెళ్తూ సర్వ దర్శనము చేయు వారు కొందరు!
ఒంటరిగా వెళ్లి దర్శనము చేయువారు మరి కొందరు!
దంపతులిద్దరు కలిసి తొలి దర్శనము చేసుకుందురు!
పిల్లల కోసం అంగ ప్రదక్షిణ చేసి ఫలితం పొందుతారు!
నలుగురు కలిసి వెళ్తారు సాధారణంగా దర్శనానికై!
పిల్లలతో సహా నలుగురు కలిసి తిరుమలకు వెళ్తారు!
అన్నదమ్ముల తోబుట్టువులు కలిసి దర్శనము అరుదుగా!
మిత్రులంతా కలిసి పదుగురు ఒక్కటిగా దర్శనము!
తిరుమలలో పెళ్ళి పెట్టుకొని బంధువులతో దర్శనము!
తీర్థయాత్రలలో వందలమంది కలిసి తప్పదు దర్శనము!
శ్రీ వారి సేవకు వెళ్లి వారము రోజుల సేవ దర్శనము!
రోజుకు వేలాది జనులు దర్శనము మహా భాగ్యము!
శ్రీ వేంకటేశ్వరా గోవిందా అని మనసున దర్శనము!
మనసున నిలుపుకున్న తిరు పద్మావతి దర్శనము!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష తిథి ఏకాదశి.
01/02/25, 8:18 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
అపార్థం చేసుకుంటారు జనులు
కష్టం దేవుడిచ్చిన పరీక్ష మనకని!
కష్టాన్ని అర్థం చేసుకున్న మనిషి
అధిగమించి సాధకుడు కదరా!
దేవుడిని అర్థం చేసుకుంటివా
కష్టము కూడా సుఖమౌనురా!
కష్టమైనా సుఖమైనా ఒకటేనని
తెలుసుకున్న మహానుభావుడు!
దేవుని తెలుసుకున్న చాలు కదా
జీవన పరమార్ధం తెలుపుట కదా!
కలియుక బాధలు విచిత్రమైనవి
శ్రీ వేంకటేశ్వరా నీ చిత్రం మోక్షం!
అలమేల్మంగ వరములివ్వంగ
కరములు జోడించి మొక్కంగ!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష తిథి తదియ/చవితి
08/02/25, 3:43 pm - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
రథసప్తమి వాహనాలు
తెలవారక ముందే భక్తులు వేచిరి తిరుమాడ వీధులలో
సూర్య కిరణాలు పడి సూర్యప్రభ వాహనం మెరిసేను!
శేష వాహనంబున వచ్చెను స్వామి చూడరో మరింత
మన సారా, పాప శేషము లేకుండా చేయు స్వామిని!
నిత్య వాహన గరుడుని పైన చిద్విలాస రూపమును
చూసి తరించరో, భయ దోషాలు పోయి శాంతి దొరుకు!
భక్తిలో అగ్రగణ్యుడు హనమంత వాహనమెక్కి వచ్చు
స్వామి బలమును ప్రసరించుచున్నాడు గైకొనరో
నవతీర్థ పుష్కరిణి యందు చక్రతీర్థ స్నానము
చేసిన ఆయురారోగ్యములు ప్రసాదించును!
కల్పవృక్ష వాహనం చూడ కడుపు నిండును!
రాజులే మొక్కిరి సర్వభూపాల వాహనుడిని!
చంద్రప్రభ వాహనం చూచి పరుగులు తిరుగు
ప్రయాణం, చూడడం ఈ జన్మసార్థక శ్రీనివాస!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష తిథి భీష్మ ఏకాదశి!
15/02/25, 8:01 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
సూర్యప్రభ వాహనం
మాఘ మాస శుద్ధ సప్తమిన సూర్యప్రభ వాహనం పైన శ్రీ వేంకటేశ్వర స్వామి వచ్చెను.
తిరుమాడ వీధులలో భక్తులు తెలవారక ముందే చేరి స్వామి దర్శనం కై నిరీక్షించిరి.
గోవింద గోవిందా యంటు మైమరచి చలి మంచు చీల్చుకుని పిలుపు స్వామికి.
పడమర వీధి దాటి ఉత్తర మాడ వీధిలో ప్రవేశించగ తొలి సూర్య కిరణాలు పడెను.
ఆకాశాన సూర్యుడు ప్రకాశించగా, బంగారు సూర్యప్రభ వాహనం పైన మెరిసేను.
అన్ని వీధులు దాటి బంగారు వాకిలిలో ప్రవేశించి ముగియు సూర్యప్రభ వాహనం.
శ్రీ వేంకటేశ్వరా మా మనసే నీకు వాహనం, జగన్నాటక సూత్రధారి నమో నమః
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష తిథి తదియ.
22/02/25, 8:05 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
రథసప్తమి-శేష వాహనం
అందించారు శ్రీ వారి సేవకులు వేడి రవ్వ ఉప్మా, బాదాంపాలు గ్యాలరీలో వేచియున్న భక్తులకు!
ఆరగించి సేదదీరే లోపల చిన్న శేష వాహనంకు బందోబస్తు బిగించి, ఎక్కడివారు అక్కడ లా!
శేషాచలవాసా ఉదయసేవ ముగించి తిరుమాడ వీధులలో ఊరేగింప బయలుదేరినాడు!
స్వామిని చిన్న శేష వాహనంలో చూసిన భక్తులకు సర్వరోగములు హరించి పోవును!
పాలసముద్రం పైన శేషతల్పాన నిద్రించు శ్రీ మహావిష్ణువు కనులకు కనిపించును!
స్వయంగా హారతిచ్చు అవకాశం భక్తులకు దొరకు హారతి కళ్లకద్దుకొను అవకాశము!
శ్రీ వేంకటేశ్వర చిన్న బ్రహ్మోత్సవమే జరుగు రథసప్తమిన తిరుచానూరు మంగకును!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష తిథి నవమి/దశమి.
01/03/25, 11:12 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
రథసప్తమి - గరుడ వాహనం
సర్వజనప్రియ గరుడ వాహన సేవయే
ముచ్చటగా మూడో వాహనం రథసప్తమిన!
గరుడ వాహనం పైన స్వామిని చూచిన కన్ను
కమలమై వికసించు, సర్వ పాపములు పోయి!
అశేషమైన జనులు విశేషమైన సేవకు వస్తారు
విసుగు లేకుండా చూస్తారు ఇసుక రాలనంత జనం!
నిత్య సేవకుడు స్వామికి వాహనమే మరి
సత్య దేవుడు కలియుగ తిరుమలలో!
స్వామి దర్జా దర్పము చూడ సరిపోవు
వేయి ద్వికన్నుల ఆదిశేషుని భక్తికి!
తిరుచానూరు మంగకును చిన్న బ్రహ్మోత్సవం
తిలకించ రావా ప్రయత్నం విశ్వవసున
శ్రీ వేంకటేశ్వరా ఎన్నో జన్మల పుణ్యము
సప్త వాహన వీక్షణం సప్తగిరుల పైన!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస శుక్ల పక్ష తిథి విదియ.
08/03/25, 6:53 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
రథసప్తమి- హనుమంత వాహనం
రాముని సేవకుడైన హనుమంతుడు వచ్చే
వాహనమై, ఇష్ట వాహన గరుడ సేవ తర్వాత!
ఎండలు ఎక్కువున్నా వేచి చూస్తారు జనులు
మధ్యాహ్న వేళ రాముని చూడ వేంకటేశునిలో!
హారతి పట్టి ప్రారంభం హనుమ సేవ తిరుమల
తిరుమాడ వీధులలో హారతి పట్టిరి జనులెల్ల!
లేడిలా పరుగు పెట్టి బోయలు కరి మెల్లగా కదిలే
మేల్జాతి అశ్వ, గోవు తోడ నాట్య తాళ గాన!
బేడి ఆంజనేయునిగా దర్శనమగునట్లెదురుగా
వేంకటేశుని చూడగ ఎవ్వరి మనసుకైనా బేడీ!
కనుము హనుమ వాహన గోవింద పచ్చ పగడ
ఆభరణ దివ్య హారాలు చూడ ఎన్ని కనులు కదా!
పలుకుబడి ఉన్నచో దగ్గరగా సేవ వేంకటేశ్వరా
దూరంగా గోవిందా పలికినా పద్మావతినడుగ!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస శుక్ల పక్ష తిథి నవమి/దశమి.
15/03/25, 4:03 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
తిరుమలలో బ్రహ్మ ముహూర్తాన
అర్చకుల కౌసల్య రామా అంటు సుప్రభాతం పాడిరి
అణ్ణన్ తొలుత స్వామిని చూచి ఆశువుగా పాడెను!
భక్తులు గోవిందా అంటు సుప్రభాత సేవకు పరుగులు
దొరకని గోవిందలు తిరుమాడ వీధులలో నామాలు!
కప్పలు బెకబెక మని వదలక స్వామిని కీర్తించునట్లు
కాకి కూడా కావు కావుమని స్వామిని మేల్కొలిపిరి!
ఖాళీగా ఉన్న తిరుమాడ వీధులలో అంగప్రదక్షిణలు
స్వామి శతనామవళి పలుకుతు చాలా నిష్టతోటి!
సేవకులు స్నానాలు చేసి సిద్ధమై బయలుదేరిరంతా
కొందరు భక్తులు ప్రదక్షిణలా అటు ఇటు తిరుగుతూ!
గరిమెళ్ళ వారు అన్నమయ్య కీర్తనలు పాడుతు
బాల సుబ్రహ్మణ్య సుస్వరము ప్రత్యక్ష మేల్కొలుపు!
ఓం నమో వేంకటేశాయ మారు మ్రోగుతున్న ధ్వని
యదపై నిద్రిస్తున్న పద్మావతమ్మను మేల్కొలపగా!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస కృష్ణ పక్ష తిధి పాడ్యమి.
22/03/25, 8:18 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
రథసప్తమి-చక్ర స్నానము
నాలుగు వాహనాల అనంతరం చక్ర స్నానం
రథసప్తమి సేవలలో మధ్యన జరుగును!
తిరుమల పుష్కరిణి లో జరిగే చక్ర స్నానము
కొరకు వేలాది భక్తులు వేయి ఉంటారు కదా!
చక్రముతో పాటు మూడు సార్లు మునిగిన
తేలిపోవుదురు విజయం సాధించినట్లుగా!
ప్రతి అవతారంలో వెన్నంటి ఉండే సుదర్శనం
దుష్ట శిక్షణకు భక్త రక్షణకు స్వామి ఆయుధం!
సుదర్శన హోమం, చక్రుని అష్టకం చదివినా
కష్టాలు పోవాలంటే చక్ర దర్శనము చాలు!
చక్రత్తాళ్వర్ ను వరాహ సన్నిధిలో పూజ చేసి
పుష్కరిణిలో చక్ర స్నానము మహా పుణ్యము!
శ్రీ వేంకటేశ్వర నీవెచట ఉంటే అచట వెన్నంటి
పద్మావతి సమేత అన్నట్లు ఈ ఆళ్వార్ సేవలు!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస కృష్ణ పక్ష తిథి అష్టమి.
29/03/25, 10:55 am - venky HYD: ఓం నమో వేంకటేశ్వరాయనమః
రథసప్తమి- కల్పవృక్ష వాహనం
సూర్యుడు వేడి తగ్గించి పడమట దిక్కుకు
పయనించు వేళ కల్పవృక్ష వాహన సేవ!
చక్ర స్నానంలో మునిగి పాపాలను కడిగి
తేలికైన జనులు ఉత్సాహంగా చూడ!
అదిగో సకల చరచరానికి ఆహారమిచ్చు
ఏడుకొండల వాడు కల్పవృక్ష వాహనమున!
కోరిన తగు రీతిన ప్రసాదించు స్వామికి
కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనమై!
సమృద్ధిగా శ్రేయస్సు ఆధ్యాత్మికకు ప్రతీక
స్వామిని పోలిన కల్పవృక్షము చూడుము!
సకల ఐహిక సుఖాలను ప్రసాదించు స్వామి
బంగారు కల్పవృక్షం పైన చూచిన చాలు!
శ్రీ వేంకటేశ్వరా పద్మావతి మనసు దివ్య
సంపదలనిచ్చు కల్పవృక్షమై వచ్చెనో తరించ!
వేం*కుభే*రాణి
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాస కృష్ణ పక్ష తిథి అమావాస్య!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment