Wednesday, 8 March 2023

Saturday 2022

*ఓం* మొదట ఓంకారం మంత్ర బీజాక్షరం *నమో* మనో తొలుత సుప్రభాత సేవం *వేం* పాపము చేయు భక్తులు ముందుగా *కట* నాశనము చేయుటకు ముందుంటావు *ఈ* ఈశ్వర కృప ఉంటుంది మొదట *శా* శాత్తు మొరాయ్ మొదటి పండుగ *య* యజ్ఞమున మొదటి నివేదన నీకు స్వామి Happy Saturday n happy New year 2022 01-01-2022 08/01/22, 10:30 am - venky HYD: ఓ స్వామి నీకు గంధం అద్దబోతే నీ సుగంధం అబ్బెనె!! తిరు నామం దిద్దబోతే బతుకు వచ్చెనే! పూల మాల వేయబోతే నీ పరిమళం తాకెనె! ఓ స్వామి!! అర్చన చేయబోతే తులసి పావనమాయెనే! అభిషేకం చేయబోతే గంగకు స్వచ్ఛతనబ్బెనే! ఓ స్వామి! కాసుల పేరు పెడదామంటే నగలకు నీ మెరుపు తాకెనే! అద్దంలో నిను చూపిద్దామంటే అద్దమే మురిసెనే! ఓ స్వామి! 08-01-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాస శుక్ల పక్ష షష్టి తిథి 15/01/22, 8:56 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః శ్రద్ధగా తిరు నామం దిద్దుదామంటె వేయి నామాలు ప్రతి ఇంటిలో బతుకుగా పెరిగెనే నీ నామాలకు! ఆకాశ గంగ తెచ్చి అభిషేకం చేద్దామంటే స్వచ్ఛతనబ్బెనే పాప వినాశనం నీటి బిందువులకు! చందనపు కర్ర అరగదీసి గంధం అద్దుదామంటే సుగంధం అబ్బెనె గంధమునకు! ఉద్యానవనమునకు వెళ్లి తాజా పూలను కోసి మాల వేద్దామంటే పరిమళం తాకెనె పువ్వులకు! అణ్ణన్ తోటలో తులసి దళం ఏరి ఏరి తీసికొని అర్చన చేద్దామంటే పావనమబ్బెనే తులసి మాలకు! మేలిమి బంగారు మెరిసేటి వజ్రాలు గనుల నుండి తెచ్చి ఆభరణాలు చేద్దామంటే మెరుపు తాకెనె నగలకు! అద్దాల మండపంలో దశదిశలా నీ రూపు చూచి మురిసిపోదామంటే మురిసెనే భక్తి తాకి అద్దాలకు! వేం*కుభే*రాణి 15-01-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాస, శుక్ల పక్ష, తిథి త్రయోదశి 22/01/22, 8:05 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః నా లోన నీవు గలవు స్వామి! నీ లోన నేను కలనా స్వామి! ఆత్మ యందు నీవే అంతర్యామి! అనంతమందు నీవే సర్వాంతర్యామి! నా కనుల ముందు నీ రూపము స్వామి! నీ కనుల ముందు విశ్వమే రూపము కదు స్వామి! పచ్చని తోరణం నిత్యము ఋణము స్వామి! వేం*కుభే*రాణి 22-01-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాస, బహుళ పక్ష, తిథి చవితి. 22/01/22, 4:50 pm - You changed this group's icon 29/01/22, 11:47 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః చదువుల తల్లి మనకు అక్షరమిచ్చి మళ్లి మామకు సాక్షాత్కరించ కీర్తనలివ్వుటకే! పంచ అక్షరములు ఢమరుక నాదమున వచ్చి బావకు స్వరముల కొరకు అధరమున నిల్చి! సప్తస్వరాలు వేద సారాంశములన్ని నీ నామములే శ్రీ వేంకటేశాయనమః సప్త సాగరాల మథనం నీ నామములే! కలము పట్టి గణపతి నేర్పించే మనకు రాయమని మేనమామకు పద్య గద్యములే! గలగల మని లక్ష్మీ దేవి మనకు సంపదలనిచ్చే తిరిగి శ్రీ వారికి సేవలు చేసేందుకే! ఆంజనేయుడు పవన వేగమున యిచ్చే మనకు రక్షణ, ధర్మమును రక్షించుటకే! నేను రాసె ప్రతి అక్షరం చేరాలి మంత్రమై సప్త గిరులకే నేను రాసె ప్రతి కవిత చేరాలి కీర్తనలై సహస్రశేష వాహనునికే! వేం*కుభే*రాణి శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాస, బహుళ పక్ష, తిథి ద్వాదశి! 05/02/22, 8:35 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః అమ్మా పాటలోని వాత్సల్య రాగం నీ కీర్తనలే చేల పాటలోని పల్లె భావం నీ కీర్తనలే! కోయిలమ్మ కూహు కుహూ లే నీకు రాగములు వెన్నెల కాసిన కొండ కోనలు అడవి నీకు రాగములు! కొండలలో ప్రతి స్వరము ప్రతిధ్వనిలా తిరిగి తిరిగి గోవింద గోవిందా అని నీ నామములే! కొలనులో చేరు గలగలలు అణ్ణన్ తవ్విన చెరువులోని మత్స్య మండూకాల పిలుపులు పాటలోని పల్లవులే! పసి పిల్లల నవ్వుల కేరింతలు నీ పాదములు తాకి బోసి నవ్వులు ఒలకబొసి ఏరిన రత్నాల హారములే! మంచు కురిసి హిమాలయ సరాగాలు జారె ముత్యాల సరాగాలు స్వర్గం వదిలి చేరె తిరుమల! నీలాకాశం పంపిన మేఘాలు చిలికెను అమృత ధారలు శూన్యమే అనన్యమై నీ భక్తి దిగి రాదా వైకుంఠమై! వేం*కుభే*రాణి శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాస, శుక్ల పక్ష, వసంత పంచమి! K. E. Venkatesh ని వదిలి తిరుమల వేంకటేశ్వరుని చేరిన అమ్మ పద్మావతమ్మకు అంకితం! 05-02-2022 12/02/22, 9:07 am - venky HYD: ఓం! నమో రామానుజాయనమ! తల్లి కంటే ఎక్కువ ఓర్పు తోటి 18 మార్లు గురువు చెప్పినట్లు నేర్చుకున్నారు! జననికి పిల్లలందరు సమానమైనట్లు దైవానుగ్రహమునకు అందరోక్కటేనని చెప్పిన ఆచార్యులు! మాత లాగ ఇంటిని తీర్చ ఆగమ శాసనాలు రచించి దిశానిర్దేశం చేసిన మహానీయుడవు! అమ్మవై దేశమంతటా తిరిగి విశిష్టాద్వైతం భోధించి దైవత్వము నిలిపిన దైవజనుడు! మాతృమూర్తివైనావు వేయేళ్ల క్రిందటే మద మాత్సర్యాలు వదిలి మనందరికీ మార్గము చూపి! ఆది గురువు తల్లిలా విడమరచి చెప్పినట్లు వేదాలను సుళువుగా చేసిన భాష్యకారుడు! ప్రకృతి తల్లి, జీవాత్మ, పరమాత్మ, సంఘ క్షేమము కోరిన అమ్మలా రామానుజాచార్యులు! వేం*కుభే*రాణి 12-02-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాస, శుక్ల పక్ష, ఏకాదశి! రామానుజాచార్యులు, అమ్మతో కలిపి, సహస్రాబ్ది ఉత్సవాల సందర్భమున. 19/02/22, 10:35 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః శ్వాస చేరి గాంధర్వ మాయె మౌనం వీడి మంత్రం ఆయె పలుకు కూడి జపం ఆయె క్షణాలు జారి జ్ఞాపకమాయె నడక మారి కాలమాయె నవ్వులు పూసి పూవులాయె పిలుపు బాణి పాటలాయె వేం*కుభే*రాణి 19-02-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘ మాస, బహుళ పక్షం, తిథి తదియ. అమ్మకు అంజలి, నీ పాదములకు కుసుమాంజలి, ఈ గీతాంజలి. 26/02/22, 10:10 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగినది శనివారం! శ్రీనివాసుడు పద్మావతిని హృదయములో నిలిపినది శనివారం! శ్రీనివాసుని మొదటి ఆలయ ప్రవేశం శనివారం! భక్తులు మొట్టమొదట దర్శించినది శనివారమే! శ్రీ సుదర్శన చక్రము ఉద్భవించింది శనివారమే! నీ భక్తుల జోలికి పోనని శనీశ్వరుడు మాటయిచ్చినది శనివారమే! తొండమాన్ చక్రవర్తికి ఆలయ నిర్మాణ ఆజ్ఞ ఇచ్చినది శనివారమే! 26-02-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాస, బహుళ పక్షం, తిథి దశమి. అందుకే శనివారం అంటే శ్రీనివాసునికి మనకు అంత ప్రీతికరమైన రోజు. 05/03/22, 8:04 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః గోవిందా అని శరణంటే మన్నించు నా స్వామి కంటే లేరు దొరలు! ఆపదలొచ్చిన వేళ శ్రీనివాసుని కంటే కాచు వారు లేరు కొత్వాలు! మనసును దోచు స్థితిలోన గోపికలు నా స్వామి కంటే లేరు దొంగలు! జగత్తు మాయాజాలంలో పడి మునుగు వారిని ఒడ్డుకు చేర్చు నా స్వామి కంటే లేరు నావికులు! బహురూప సంసార ఛాయల నుండి వెలుగు నిచ్చు నా స్వామి కంటే లేరు సూర్యులు! చేటులేని వరములు, చెడని వైకుంఠ మిచ్చి బాపు నా స్వామి కంటే లేరు దైవజనులు! భక్తులెల్లరిని తగినంత సమానముగా దీవించు నా స్వామి కంటే లేరు మాతుహూ! 05-03-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాస, శుక్ల పక్ష, తదియ. 12/03/22, 7:36 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః తిరుమల సాలకట్ల తెప్పోత్సవాలు చాలా ప్రాచీనం నుండి జరుగు ఉత్సవాలు! సాళువ నరసింహరాయలు కట్టె *నీరాళి మండపం* పుష్కరిణి మధ్యన 1468లో! తాళ్ళపాక అన్నమయ్య కీర్తించె తెప్పోత్సవాల వేడుక తిలకించి బహూ రమ్యముగా! వేల యేళ్ళు తపస్సు చేస్తున్న మునులతో వృక్షములను పోల్చె నాలుగు వేదములు తటాక ఒడ్డులను! సప్త గంగల తీర్థములను పుష్కరిణి నీటిలో చూచె, ఐదు రోజుల తెప్పోత్సవం! తొలి రోజు రామ సీత లక్ష్మణ హనుమ సమేత ఊరేగె తెప్పపై మరు దినం రుక్మిణీ కృష్ణులు మూడు చుట్లు! మూడో రోజు శ్రీ వేంకటేశ్వర దేవేరి 3 చుట్లు, 4వ రోజు 5, ఐదో రోజు 7 చుట్లు విహరించే మన కటాక్షమునకు! 12-03-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాస, శుక్ల పక్ష, తిథి నవమి. అందరికి తిరుమల సాలకట్ల తెప్పోత్సవాల శుభాకాంక్షలు. 19/03/22, 7:36 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః తెప్పోత్సవం తిలకించిన అన్నమయ్య, పుష్కరిణి పరిసరాల వర్ణన మీరే కనండి. కోనేటి తల్లి అని సంభోధించి జలము జీవాధారమని తెలిపె! ధర్మ అర్థ కామ మోక్షములు పుష్కరిణి సోపానాలుగా అధిరోహించె! పుష్కరిణి నాలుగు దరులు (ఒడ్డు) నాలుగు వేదములతో పూజించే! జలమును సప్త సాగరాలతో లోతును కూర్మావాతారముతో పోల్చె! జంతుజాలములు యక్ష కిన్నెరలతో, పుష్కరిణి అలలను గంగానదిలో వీచె! ఒడ్డున మేడలలో ఊర్థ్వలోకాలను రప్పించె, వృక్షములన మునులను తలపించె! శ్రీ వేంకటేశ్వరుడే పుణ్య తీర్థ స్నానం వైకుంఠ ద్వారము కనిపించె! 19-03-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాస, కృష్ణ పక్ష, తిథి పాడ్యమి. Happy Saturday n stay safe Sunday ya Monday. 26/03/22, 7:45 am - venky HYD: పంచ నారసింహ క్షేత్రం, యాదగిరి గుట్ట యాదఋషి తపః ఫలమే నృసింహ స్వామి స్వయంభువై వెలిసెనిచట! యాదరుషి విభిన్న రూపాలు కోరగా పంచ నారసింహునిగా, తపస్సు చేసిన గుహయందు మనకు దర్శనం! యోగానంద, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ రూప దర్శనం గుహాలయంలో! నడుమ సన్నని రేఖ సర్పాకృతియే జ్వాలా నరసింహ స్వామి దర్శనం! క్షేత్రపాలకాంజనేయ గుడికి తూర్పున కొండ బిలమున గండభేరుండ నరసింహ స్వామి కొలువు! కొండ శాంతం ఐదవ నారసింహ, దేదీప్యమాన ఉగ్ర కాంతుల అభౌతిక రూప యాదగిరి గుట్ట! గుహాలయం సర్వశ్రేష్ట శీతల చంద్ర కృష్ణశిల మహాలయం రూపుదిద్దుకున్నది మన కోసం! 26-03-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాస, కృష్ణ పక్ష, తిథి నవమి. Happy Saturday n stay safe Sunday ya Monday 02/04/22, 10:44 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః హల్లులు నలభైలు ఉన్నా అచ్చులు లేనిదే పలుకలేనట్లు అక్షరాలు నీ నామాంకితమే కదా! పదాలు లక్షలున్న స్వామి నిను పొగడని పదాలు పదాలేనా కదలిక లేని బండ రాళ్ళు కదా! శబ్దాలు చిన్నవైన పెద్దవైన స్వామి ఇంపుగ నీతో మాటలాడిన రూప స్వరములు కదా! స్వరములు ఏడున్నా నిను కీర్తించ స్థానములు యాడున్నా స్వామి ఎన్నెన్ని రాగములో కదా! భావనలు మనిషి అంతరంగములో ఎన్నున్నా స్వామి నీ చింత సర్వంతర్యామి కదా! శృతుల గతులు ఎన్ని మలుపులు తిరిగినా స్వామి, నిను చేరవచ్చు నదియే కదా గానముల ఛందస్సులో ఎన్ని అతిశయోక్తులు ఉన్నా స్వామి, నీ అలంకారములే కదా! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాస, శుక్ల పక్ష, తిథి పాడ్యమి. ఉగాది పండుగ శుభాకాంక్షలు. Happy Ugadi to all. 09/04/22, 8:19 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః బాబోయ్ ఎంతందము స్వామి నీ చెంపల మేలిమి నునుపుల *తళుకు తళుకు* కదా! అయ్యహో ఎంత గంధము స్వామి విరగబూసిన పూవుల సుగంధం *చమకు చమకు* కదా! ప్రియమో ఎంత మధురము స్వామి తొలి దర్శనం భూమికి తాకిన తల్లి *చినుకు చినుకు* కదా! రారోయ్ తండోపతండాలుగా కొండలేడు ఎక్కి తిరుమాడ వీధులలో *జనకు జనకు* కదా! అమ్మోయ్ ఎంత తాపము స్వామి నీ చల్లని చూపుల కనురెప్పలు తెరిచినా *కనకు కనకు* కదా! గాత్రమో ఎంత మాధుర్యము స్వామి త్యాగయ్య అన్నమయ్య పాటల భక్తి వరద హస్తము *మనకు మనకు* కదా! వామ్మోవ్ ఎంత వెలుగు స్వామి సాయంకాల కాంతులు తహతహలు దారి చూప *మినుకు మినుకు* కదా వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాస, శుక్ల పక్ష,, తిథి అష్టమి. 16/04/22, 6:49 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః రాయినై పోయాను నిను చూచి రాతనే మర్చి! శిలనై పోయాను మౌనముగా నిను చూచి ఉలినే మర్చి! అక్షరాలెన్నున్నా నీ భక్తితో అల్లినాను కవితా మధురిమలా! నీ చూపులే నన్ను ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుగా! మూడు తలుపులేల అడ్డము ముడుపులు రాలేనా దాటి! ఆకలేమి లేదు కాని మౌనముగా నీ ధ్యానమే స్వామి! మాయలోన ఏమో ఎక్కడికెళ్లిందో తెలియదు నా మనసు! జరిగింది నీ వల్లే అని తెలిసినా కలియుగ మాయ అంతమో! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర, వసంత ఋతువు, చైత్ర మాస, పౌర్ణమి, ఆంజనేయాయనమః 23/04/22, 6:29 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః నిమిషమే ఐనా నీ దర్శనము చాలు మళ్లి మళ్లి నాకు దర్శనము కావలె! నూరేళ్లు చాలవు నిను కీర్తింప కీర్తి పొంద మళ్లి జన్మలు కావలె! తలరాతలన్ని ఉహలే నీ ముందర నీ నీడలో బతకడం కావలె! ఘన చరితలు గలవు నీ జీవితమే ఈ జీవితంలో నిలబడ మన పేరు కావలె! జనమందరిలో వలదన్న గుంపు దర్శనము ఏకాంత సేవయన్న మనకొక విలువ కావలె! నీ రూప బింబమని ఎన్నెన్ని దర్శనాలు ఒకసారి చూడ అద్దాల మండపాలు కావలె! తెల్లారి ఐనా, రాత్రి చుక్కలైనా రాలు దేవతలకైనా సూరీడు కావలె! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర, వసంత ఋతువు, చైత్ర మాస, కృష్ణ పక్ష, తిథి అష్టమి 30/04/22, 7:46 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః యజ్ఞమంటే కాదు ఆజ్యమే యజ్ఞమంటే దేవతలకు భోజ్యమే జీతమిచ్చు బాసుకు భజనలే, మరి వానలిచ్చి ఆహార వరుణుడికి, అష్టదిక్పాలకుల్, పంచ భూతాలకు యజ్ఞమే కర్త క్రియ కర్మ త్రిమూర్తులకు! కాలుష్య నివారణ హోమ ధునిలో కర్తవ్య కైంకర్య మనిషి ధ్వనిలో! యజ్ఞమంటే కాదు విత్తన దహనం మేఘాలకు విత్తు యజ్ఞ ఆచరణం! నిత్యాగ్ని హోత్రము చేసెడి వారు పూర్వీకులు నెలకొకటి రెండు సార్లైనా చేద్దాం మనము! సులభమే అగ్ని హోత్రము చేయ గణపతి లక్ష్మి, నవగ్రహ, ఇష్ట దేవతా, అగ్నికి పూర్ణాహుతి! వేం*కుభే*రాణి శ్రీ శుబకృత్ నామ సంవత్సర, వసంత ఋతువు, చైత్ర మాస తిథి అమావాస్య. 07/05/22, 10:26 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః చీరకట్టు లోన వెళ్లు పట్టు చీర వచ్చినట్లు పంచకట్టు లోన వెళ్లు కంచి పీఠమెచ్చినట్లు బొట్టు పెట్టుకొని వెళ్లు కంచె నాట్లు వేసినట్లు తిరుమలలో చెప్పులిడిచి వెళ్లు వరముల అప్పు తీర్చినట్లు తిరు దండం పెట్టుకుంటు వెళ్లు విజయపు మాలలు వచ్చినట్లు వెంటబెట్టుకుని వెళ్లు మెట్టు మెట్టు ఎక్కునట్లు మడి కట్టుకుని వెళ్లు గోవింద గోవిందుడే వచ్చినట్లు వేం*కుభే*రాణి How one has to visit Lord in Tirumala. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాస, శుక్ల పక్ష తిథి షష్ఠి. 14/05/22, 7:26 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః Tirumala Agarbatties అన్నమయ్య కీర్తనల సువాసనల గుబాళింపు భళా *తందనాన* నీ అడుగుల నడిచిన నేల సౌదముల పూజకు *దివ్య పాద* కరుణామయుడు కారుణ్య మూర్తి నొసగు మాకు *అభయ హస్త* ఆలోచనలు చేసి దూర దృష్టి పూల పరిమళముల *దివ్య దృష్టి* వాడిన పూలకు పరిమళాలు అద్ది తయారు చేయ *దివ్య సృష్టి* దర్శన్ ఇంటర్నేషనల్ వారు తితిదే కలిసి గీసిన *ఆకృష్టి* తిరుమల ఆలయాల పూలన్ని సేకరించి తయారు చేసిరి *తుష్టి* వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాస శుక్ల పక్ష, తిథి త్రయోదశి. నృసింహ జయంతి శుభాకాంక్షలు. 28/05/22, 7:18 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః నింగినంటిన ధ్రువ భేరం గెలుపు మెరుపులు వరం నీ రూపం స్వామి! జనులంతా వచ్చినారు తుమ్మెదలై తిరునాళ్ళు నిత్యము కదా స్వామి! ముత్యపు వానలు లంకెబిందెలు నీ చిన్ని దరహాసములో స్వామి! చందమామ వెన్నెలలు మబ్బుల మేఘాలు నీ నీడలో స్వామి! మల్లెల వానలు ముద్దబంతుల పరుగులు నీ ఆహార్యం కదా స్వామి! పసుపు కొమ్మలు నూరి పూయువేళ సిగ్గు దొంతరలు నీ బుగ్గన స్వామి! తెలుగు మాట చాలదు ఎంకి పాట సరిపోదు నిను కీర్తించ స్వామి! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాస, కృష్ణ పక్ష, తిథి షష్ఠి. 21-05-2022 28/05/22, 7:19 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః గగనమే నీ దర్శనము క్షణమే దివ్య వీక్షణం! అపురూపము తిరుమల ప్రయాణము వైకుంఠపురము దివ్య ధామము! సూదూరము చేరు పరిమళము గైకొనిన ప్రసాద మధురము జ్ఞాపకము యాత్రల పరమార్థము సార్థకము నామ స్మరణము పాదము మోపిన సన్నిధానము పావనము శ్రీ హరి నివాసము కటాక్షము శేషాచలము బ్రహ్మమయము లక్ష్మి నిజవాసము మూలధనము అభయము దేవతలకు వరము సాదనము సంకీర్తనల గానము వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణ పక్ష తిథి త్రయోదశి 04/06/22, 7:30 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః నీ పాదము వెంటే పాండురంగా నా వెనుకాముందు విష్ణుదేవా కరమున రేఖలు నీవే కమలాక్షా నరమున స్మరణలు నారాయణా నా వినికిడిలో నీవే విఠ్ఠల దేవా పుణ్యము నీవే హరి పుండరీకాక్షా నా వీక్షణలు నీకై వేంకటేషా వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష తిథి పంచమి. 11/06/22, 6:33 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః కందం 1138 తిరుమల దేవా యివ్వగ వరములు రావా కరములు వైకుంఠాయా స్వరములు జోడించేనిక వరుసగ రాసే కలమున వాడక నుండున్ కందం 1139 భక్తుల పాలిట దైవము ముక్తికి నీవేను దివ్యము వరములివ్వా యుక్తిని చూపగ రావా శక్తి ప్రసాదించు స్వామి శౌర్య ప్రదాతా కందం 1140 వేంకట రమణుడు స్వామే సంకట హరణుడు విమోక సంపదలిచ్చున్ బింకద రాణికి భర్తయు సంకుచితము వలదు మోక్ష సాంగత్యములన్ కందం 1142 రెక్కలు కట్టుకు గరుడుడు చక్కని సేవలను చేయ చాచిన వీపున్ చుక్కలు నిండిన నింగిన చెక్కిన చిత్రంబు చూడ చేరిన స్వామే వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సర, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష తిథి నిర్జల ఏకాదశి 18/06/22, 8:00 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః కందం 1161 నామము హరియే సకలము ధామము సురులకు మునులకు థాత్రిన మనకే పామర పండితులకును ప్ర ణామము కైవల్య పాద నామ స్మరణమే కందం 1162 తిరుమల పుణ్య ఫలం భవ గరిమల మంత్రముల స్వామి కాగడెలుతురే వరముల వీధిన వచ్చున్ సరిలేరు నరులు సురులకు శాశ్వత కీర్తీ వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష తిథి పంచమి 25/06/22, 8:13 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః కందం 1172 కందము రాయుట పూనిన గంధము పూయుట మురిసితి కాంతిని చూడన్ సుందరుడివి నీవే గజ మందలు సేవలను చేయ మంగళమాయే కందం 1173 మర్మము తెలిసే వడ్డన ధర్మము సత్యము తెలుపుట ధ్యానము చేయన్ కర్మపు ఫలమే వచ్చును చర్మము సరిపోదు వొలచి జన్మకు మోక్షా కందం 1174 గోవిందుడు భవ మనసా రా విందుకు స్వామినింక రమ్మని పిలువా గా వందనమే మన మది లో వుండును హాయిగా పలువిధంబులుగా. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష తిథి ద్వాదశి. 02/07/22, 7:17 am - venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః పొర్లు దండాలు పెట్టినారు భక్తులు కడుపు తిప్పినా ఆగరు తల తిరిగినా! రాత్రంతా మేల్కొంటారు సుప్రభాత భక్తులు నిదుర వచ్చినా ఆపుకుంటారు కష్టమైనా! ఎండ వేడైనా తట్టుకుంటారు అడుగు భక్తులు మొక్కులు తీరుస్తారు కాలెంత కాలినా! ఎక్కుతారు కాలి నడక భక్తులు వెనుకకు వెళ్లరు కీళ్లెంత నొప్పి పెట్టినా! ప్రతి మెట్టుకు బొట్టు పెడతారు భక్తులు బరువంతా మోసి నడుము వంగకపోయినా! అన్నపానాలు మాను సాధారణ భక్తులు కాలకృత్యాలు మాని వేచు ఎంత సేపైనా! పలుకుబడి వాడు పెద్ద భక్తులు డబ్బు పరపతి ఖర్చు పెడుతారు ఎంతైనా! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాస శుక్ల పక్ష తిథి తదియ. 09/07/22, 8:02 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః కుడి ఎడమల కాంతలు లేరు మనసున ఉన్న పద్మావతి ఒక్కటే! నింగి కాదు నీది నేల కాదు అణువంత నీకు బ్రహ్మాండము ఒక్కటే! తోమిన పళ్యాలు నీకు పెట్టలేరు ప్రసాద మాధుర్యాల రుచి ఒక్కటే! ముడుపు నీలాలు నీకు చేరవు కర్మ ఫలముల లక్ష్మి ఒక్కటే! పూల సుగంధములు శాశ్వతము కావు అన్ని కలిసి మళ్లి తిరిగి ధూపము ఒక్కటే! సర్వ దర్శనములు ఇప్పుడు సుళువుగా లేవు రాజు పేద తిరుమాడ దర్శనము ఒక్కటే! ఈ భాష ఆ భాషల తేడా లేదు విభిన్న ప్రాంతాల వారి భక్తి ఒక్కటే! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాస శుక్ల పక్ష తిథి దశమి. 16/07/22, 10:45 pm - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః జ్యేష్టాభిషేక మహోత్సవం జ్యేష్టాభిషేకాన ఇష్ట సఖుల తోటి వచ్చినారు స్వామి అమ్మవార్లు! మొదట సంపంగి ప్రాకారాన వేంచేసి స్నపన తిరుమంజనము తోడ శుద్ధి చేసి! అభిదేయక అభిషేకము చేసి సంరక్షణ ఉత్సవ మూర్తుల మనకు రక్షణ నిచ్చు స్వామికి! స్తపతి చేయు సవరణలు కవచమునకు కుభేరా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము! మొదటి రోజు మెరిసే వజ్రపు కవచమున పుర వీధులలో స్వామి మనకు తారలా కనపడు! రెండవ రోజు మురిసే ముత్తంగి కవచమున చిరునవ్వు చూడ ముత్యములేరినట్లు! ఆఖరి రోజున స్వర్ణ కవచమున దేదిప్యమాన ఉండును ఈ కవచము సంవత్సరముంతా! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయన ప్రారంభం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాస కృష్ణ పక్ష తిథి తదియ. 23/07/22, 8:37 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః ఎటు సింగారించుటమ్మ ఈ స్వామిని! ఎటు సింగారించుటమ్మ ఈ స్వామిని! చందమామ జాబిలి రూపు *చంద్రవందిత* పతికి చంద్రవంక లేల. మెరుపు వన్నెలున్న *పద్మావతి* పతికి మెరియు వజ్రములేల. ముత్యపు చిరునవ్వులు చిందించు *లక్ష్మీ* పతికి ముత్య పగడములేల. మందారవర్ణ *హేమవర్ణిత* పతికి కెంపులు మణులేల. జయించిన *జగన్మాత* పతికి బంగారు జంధ్య స్వర్ణ ఖడ్గములేల. శాంత నిలయ దేవి ఆనంద పతి శంఖుచక్రధరుడికి సింగారమేల. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్షము తిథి దశమి. 30/07/22, 6:44 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః ఎన్నో నోములు నోచాము స్వామి నీ పునః దర్శనము దొరుకు! పదవా పరపతా ఏముంది స్వామి సదా నీ దర్శనము దొరుకు! సినిమా ఆటా ఏమంత పరుగు నీకు లఘు దర్శనము దొరుకు! రాగమా రచనా ఏమంత స్వరము గోవింద సుప్రభాత దర్శనము దొరుకు! సిరులా గిరులా ఏమంత లక్ష్మి మాన్యపు దాసోహము దొరుకు! వరమా నీ తరమా ఏమంత కరముల అభయము కలుగు! కలనా ఇలనా ఏ ఘడియనైన శ్రీ వేంకటేశ్వరా మనకు కలుగు! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష తిథి విదియ. 06/08/22, 7:23 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః తిరుమలలో సేవలు వేసవి నుండి ఉపశమనం వానలు నుండి రక్షణ, నడక దారిలో పైకప్పు! ఎటు చూసినా శ్రీ వారి సేవకుల సహాయమేను! సర్వ జనుల దాహార్తి తీర్పు, శుద్ధి చేసి స్వచ్ఛమైన చల్లని నీటిని ఎల్ల వేళలా అందించే జలప్రసాద కేంద్రాలు! వృద్ధులు దివ్యాంగులు, బిడ్డ తల్లులకు ప్రత్యేక వరుసలు అల్పాహారాలు, చక్రాల కుర్చీలు, బ్యాటరీ కార్లు! నడిచి వెళ్లు భక్తుల లగేజీ తిరుమలకు పంపడం, దారిలో ఉద్యానవనాలు, ఆళ్వారులు, హరిదాసుల విగ్రహాలు మనసుకు ఆహ్లాదం! తిరుమాడ వీధులలో పాదరక్షలు లేని కాళ్లకు ఎండ వేడి నుండి రక్ష తెల్లని పేయింట్లు మ్యాట్లని ఏర్పరిచారు! తరిగొండ వెంగమాంబ మనకు తిరుమలలో కాశి అన్నపూర్ణ, కమ్మని భోజనము రమ్మని పిలిచినట్లు! సేవ చిన్న పదమే కాని మనిషిని మహనీయుని చేస్తుంది. గడించిన డబ్బు వారితో వెళ్లదు కాని సేవ తరతరాలు నిలుస్తుంది. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష తిథి నవమి. 13/08/22, 7:24 pm - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః ఎక్కెను ఏడుకొండలు తోడుంటే పక్కన గక్కిన గరుడ వలె తక్కినవన్ని పక్కన పెట్టి మనసు రివ్వున ఎగిరే! నదిలోన మలుపులు యదలోన కలలు నీ తలుపులు చేరువరకు నీ తలపులు! జతగానే వస్తారు భక్తులు వరుసలు మారి తప్పిపోయి కోనేరు వద్ద కూడి కథలుగా చెప్పి తమ వ్యధలను! ఈ తరమే కాదు ఏ తరమైనా మంచి తరుణం దర్శనము లభిస్తే దేవుని కరుణను వీడరెవ్వరు! ఆకాశమంత అవకాశం శ్రీనివాసా మానవ భాష కంటి బాసలు పాశములై నీ దర్శనము! గోవింద అని పిలువవచ్చు ఎవరినైనా, పిలుపు గోవింద విన్న గెలుపు ప్రతి అడుగులో! దర్శనము ఆనందం నీ రూపం ప్రతి దీపంలో శాంతం పద్మావతి నయనం వీక్షణం! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస కృష్ణ పక్షము తిధి విదియ. 20/08/22, 7:31 am - venky HYD: You deleted this message 20/08/22, 7:39 am - venky HYD: తిరుమలలో శ్రీ కృష్ణ జయంతి తిరుమామణి ఘంటామండపంలో ఒకవైపు కృష్ణయ్యకు ఇంకొక వైపు ఉగ్రశ్రీనివాస మూర్తికి తిరుమంజనం చేస్తారు! ద్వాదశ మంత్ర బీజాక్షరాలు *ఓం నమో భగవతే వాసుదేవాయ* సూచికగా ద్వాదశ తిరువారాధనం చుట్టు తెరలు కట్టి ఏకాంతంలో! అలంకారాలు చేసి నైవేద్యాలు, కర్పూర హారతి జియ్యంగార్ల తులసి అర్చన కుంకుమాక్షతలు కృష్ణయ్యకు, శఠారి మర్యాదలు అర్చకులకు! కృష్ణావతార ఘట్టమైన భగవద్గీత తృతీయాధ్యాయము పురాణ శ్రవణం, భక్తులిచ్చిన రూపాయిలతో రూపాయి హారతి చేస్తారు! తెల్లవారుజామున సేవలు తరువాత కృష్ణునికి నువ్వుల నూనెతో తలంటు *తైలకాపు సమర్పణ* మిగిలిన తైలము భక్తులకు పంచుతారు! పురిటి తైలాన్ని భక్తులు తలంటుకుని అభ్యంగన స్నానము చేస్తారు. ఛత్రఛామరాలతో ఊరేగించి దోశ చక్కెర పొంగలి నివేదించి కర్పూర హారతి ఇస్తారు. తిరుమలలో ఉట్ల ఉత్సవం సన్నిధి వీధిలో బేడి ఆంజనేయస్వామి దగ్గర జియ్యంగారు మఠం మైసూరు సత్రం దగ్గర యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస కృష్ణ పక్షము తిథి నవమి. 27/08/22, 7:55 am - venky HYD: ఓం నమో వేంకటేశాయనమః శ్రీ వరాహ జయంతి (30-08-2022) ఎఱ్ఱన రాసిన నృసింహ పురాణంలో *మహార్ణవోదక* అని వర్ణించే ఆనాడు. పోతన భాగవత తృతీయ స్కంధంలో *విశ్వంభరోద్దర* అనె యజ్ఞ సాక్షిగా. శ్రీ కృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యదలో *మహాభ్రవీధిజన* అని నొనర్చే. ధరణిదేవుల రామయమంత్రి ప్రబంధంలో అద్భుత స్తుతిచే బంధించి *శ్రీ వరాహ స్వామి* తాళ్ళపాక అన్నమయ్య తన సంకీర్తనలలో శ్రావ్యంగా పాడెనిక *భూమి వుద్దరించితివి* అని. *పుడమిని బ్రోచిన నారాయణా* అంటు ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు కవుల రచనలను మన ముందుకు తెచ్చె. *యజ్ఞ మూలక లోకోద్దర వరాహ స్వామి* అని నేను సంబోధిస్తూ మీ ముందుకు వచ్చితిని. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస పోలాల అమావాస్య 03/09/22, 7:01 am - venky HYD: శ్రీ వెంకటేశ్వరాయనమః *భక్తి* తెలిస్తే మోక్షం తెలియకున్న బంధం! *భక్తుడు* భయమేది స్వామి అభయమున్న! *ప్రసాదము* దొరికిన వారికి ఆరోగ్యం, దొరకకున్న ఔషదం (లంకణం)! *ఉపవాసము* ఉన్న వారికి తీపి ఒకటే చేదు ఒకటే! *యోగికి* బంధుగణములెవ్వరు శత్రువులు ఎవ్వరు! *బాటసారి* సుఖమును దాటి దుఃఖమును జయించిన ఒకటే! శ్రీ వేంకటేశ్వరుని చిత్తములోనున్న వారికి ఈ దారేది ఆ దారేది! అన్నమయ్య సంకీర్తన లోని భావము. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష సప్తమి. 10/09/22, 7:32 am - venky HYD: తిరుమలలో కుమారాధార తీర్థం వరాహ పురాణం వామన మార్కండేయ పద్మ పురాణాలు కుమారాధార తీర్థ వైభవాన్ని మహిమను కొనియాడాయి! తారకాసుర వధ బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగి పోవుటకు 12 ఏండ్లు శ్రీ వేంకటేశుని తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్న కుమారస్వామి! మాఘమాసం మఖానక్షత్ర యుక్త పూర్ణిమ తిథిన స్వామి అనుగ్రహించిన రోజు కుమారాధార పర్వదిన తీర్థ ముక్కోటి! జంట ప్రాజెక్టులు కుమారాధార పసుపుధార తిరుమల యాత్రికులకు నీటి కొరతను తీర్చి ప్రాణధారలుగా నిలిచె! నిత్యహోమాదులకు వెళ్లి దారి తప్పిన వృద్ధ బ్రాహ్మణుడు శ్రీ వేంకటేశ్వరుడే వచ్చి తీర్థమున స్నానం చేయించి కుమార రూపమిచ్చినందున 'కుమారాధార' అని! "కుమార కల్ప సేన్యాయనమః" అని శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామవళి స్తోత్రంలో "కుమారధారికవాస స్కందాభీష్ట ప్రదాయనమః" అని! శిలాబిలం లోకి నిచ్చెనలు గుండా దిగి తూర్పు దిశన సమ్మోహిత జలపాతం తీర్థ స్నానం సకల పాపహరణం సర్వాభీష్టదాయకం ఆయురారోగ్య ప్రదాతం! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస పౌర్ణమి. 17/09/22, 7:28 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః కడప రాయుడు తిరుమల బంగారు గడపకు తొలి గడప దేవుని కడప! తిరుమల వరాహ క్షేత్రమైతే పుణ్య క్షేత్రం కడప హనుమత్ క్షేత్రం! రాముడు హనుమను ప్రతిష్ఠించే, కృపాచార్యుడు ప్రతిష్ఠించెను శ్రీనివాసుని! నేలపైన అన్నమయ్య కడపరాయ కొండపైన క్షేత్రయ్య తిరుమల రాయ! కడపలోన బల్లులు తాకితే దోషాలు పోతాయి, తిరుమల వెళ్లితే అన్ని దోషాలు పోతాయి! సువిశాల ప్రాంగణం దేవుని గడప విశాల హృదయం తిరుమల వెండి దేవుడు! తిరుమలకు వెళ్లలేని వారు కడప వేంకటేశ్వరుని దర్శిస్తే చాలు! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణ పక్ష తిథి సప్తమి. 24/09/22, 7:17 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయమమః లక్ష్మి పూజలు *శుద్ధలక్ష్మి* పూజ - క్రిమి కీటకాలను దాటుకుని వచ్చిన పంటను శుద్ధి చేయడం - సంక్రాంతి పూజ. ఆషాడ శుద్ధ ఏకాదశి, ప్రాపంచిక విషయములను కొద్ది కొద్దిగా వదలడానికి *మోక్ష లక్ష్మి పూజ* ఎదుటి వారి మనసులను జయించడానికి చేసె వ్రతము *జయ లక్ష్మి పూజ* మనసున కోరికలను వరాలుగా సిద్ధించడానికి శ్రావణ రెండవ శుక్రవారం *వరలక్ష్మి పూజ* ఆశ్వయుజ మాస మూలా నక్షత్రయుక్త విద్యాభివృద్ధికి సరస్వతి *విద్యా లక్ష్మి పూజ* చెడుపై మంచి గెలుపును సంబరాలు జరపడానికి దసరా *విజయ లక్ష్మి పూజ* ధన కనక వస్తు వాహనాలను గెలవడానికి దీపావళి నాడు చేసె పూజ *శ్రీ లక్ష్మీ పూజ* పారాణి రాసుకుని ఇంటికి వచ్చిన *గృహలక్ష్మి* కి విలువనివ్వు *శుభలక్ష్మి* వచ్చును. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణ పక్ష తిథి చతుర్దశి. 01/10/22, 7:14 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః తిరుమలలో నిత్య సేవలు ముందుగా స్వామి ఎదపైన నిద్రిస్తున్న లక్ష్మి దేవిని మేల్కొలిపి శ్రీనివాసుని మేల్కొలుపుతారు అర్చక స్వాములు - సుప్రభాతం! గత రోజు పూలు అలంకరణలు తీసికొని సంపంగి ప్రదక్షిణ పూలబావిలో శుద్ధి పురుష సూక్తం వింటూ భోగ శ్రీనివాస మూర్తి పాలు పసుపు చందనం గంధపు నీటితో అభిషేకం చేయించు కుంటారు! మన చుట్టు బంధాలను అల్లి నట్లు దారంతో అల్లిన పూలమాల సేవ తోమాలసేవ! తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాస మూర్తికి లెక్కలు విన్నవిస్తారు! బ్రహ్మాండ పురాణంలో వేయి నామాల అర్చన అనంతరం మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మి సహస్రనామాల తర్వాత నక్షత్ర కర్పూర హారతి ఇస్తారు! తిరుమామణి గంటల నడుమ స్వామి వారికి పులిహోర పొంగలి దద్ధ్యోజనం చక్కెర పొంగలి లడ్డు వడ అప్పాలు దోశ పోళి మొదటి గంట నైవేద్యం! వరాహ పురాణం లోని అష్టోత్తర శతనామార్చనతో మధ్యాహ్న పూజలు మొదలు లక్ష్మి నామార్చన పిదప రెండో గంట నైవేద్యం అన్న ప్రసాదాలు తాంబూలం కర్పూర హారతి! ఏ కాంత లేని ఏకాంత పవళింపు సేవ భోగ శ్రీనివాస మూర్తికి ఉయ్యాల! పాలు పళ్లు బాదాము, తాళ్ళపాక లాలి వెంగమాంబ ముత్యాల హారతితో ముగియును రోజు! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తిథి షష్ఠి. 08/10/22, 8:27 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః తిరుమలలో ప్రత్యేక సేవలు నిత్య సేవలు గురించి గతవారం రాశాను. ఈ వారం కొన్ని ప్రత్యేక సేవలు గురించి చెబుతాను. విశేష పూజ సోమవారం, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన గురువారం సడలింపు, పూలంగి సేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకము జరిపిస్తారు. డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నియు ఉత్సవ మూర్తులకు జరిపిస్తారు. సడలింపు - గురువారం ప్రాతఃకాల పూజ తరువాత ఆభరణములను పక్కన పెట్టి, కర్పూర నామాన్ని తగ్గిస్తారు. స్వామి కనులు భక్తులకు కనిపిస్తాయి. 24 మూరలు పట్టుయంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయం కడతారు. స్వర్ణ పాదాలు హస్తము శంఖ చక్రం కర్ణాభరణాలు స్వర్ణ సాలగ్రామ హారాలు మాత్రమే ధరించి భక్తులకు దర్శనమిస్తారు. స్వామి వారిని రకరకాల పూల మాలలతో అలంకరించి తరించడమే పూలంగి సేవ. ప్రతి గురువారం నైవేద్య సమయంలో 450కిలోల అన్నప్రసాదం లడ్డు వడ దోసె పాయసం జిలేబీ పిండి వంటలు నివేదిస్తారు. వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తిథి చతుర్దశి. 15/10/22, 7:17 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః యశోదమ్మకు నీవు కన్నమానికము రాధమ్మకు నీవు తల మాణికము సత్యభామకు వీర మాణిక్యము ద్రౌపదికి వస్త్రముల కాణికము పద్మావతికి కళ్యాణ సౌభాగ్యము వెంగమాంబకు తరి సర్వమును భక్తులందరికి వర మాణిక్యము వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష తిథి షష్ఠి. 22/10/22, 6:56 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః తిరుమలలో దీపావళి తిరుమల వార్షిక ఉత్సవాలలో "దీపావళి ఆస్థానం' ప్రధానమైనది. దీపావళి ఆస్థానం బంగారు వాకిలి ముందున్న ఘంటామండపంలో జరుగును! బ్రహ్మోత్సవాలకు ఆనంద నిలయం నుండి బయటకు వెళ్లి రంగనాయక మండపంలో ఉంటున్న స్వామి ఘంటామండపంలోకి వస్తారు! బంగారు వాకిలి ముందు సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారుకు అభిముఖముగా, విష్వక్సేనుల వారు ఎడమ ప్రక్కన దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు! లోపలున్న మూలమూర్తికి కొలువులో ఉన్న స్వామికి రెండవ అర్చన చేసి, గమేకార్లు తెచ్చిన ఆస్థాన ప్రసాదాలు నివేదిస్తారు! జియ్యంగారు తెచ్చిన ఆరు పట్టు వస్త్రాలను అర్చకులు కిరీటానికి, ఖడ్గానికి ఉత్తరీయంగాను ఆది తోమాలగాను సమర్పించి, కొలువులో ఉన్న స్వామికి మరియు విష్వక్సేనుల వారికి సమర్పిస్తారు! స్వామి వారికి సేనాధిపతికి అక్షతారోపణం జరిపి, విష్వక్సేనులకు అర్చకులకు శఠారి మర్యాదలు జరుపుతారు. స్వామి దానమిచ్చిన బియ్యం దక్షిణ తీసికొని "నిత్యైశ్వర్యభవ" అని ఆశీర్వదిస్తారు! జియ్యంగారు తొలుత అధికారులకు పిదప స్థానీయులకు హారతి చందన శఠారి మర్యాదలు ఇస్తారు, తర్వాత ప్రసాదిస్తారు! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష తిథి ద్వాదశి. 29/10/22, 8:14 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః సెలవు దొరికిన ఎగిరి వచ్చు భక్తులకు గరుడ వాహనం హుందాగా ఉండాలని కోరు భక్తులకు గజ వాహనం సర్వ లోకాధిపతికి సర్వభూపాల వాహనం వజ్రములా మెరవాలనే భక్తులకు ముత్యపు పందిరి వాహనం జీవితంలో గర్జించి నడవాలను భక్తులకు సింహ వాహనం సిగ్గుపడు పెళ్ళి పడుచులకు హంస వాహనం ఆకర్షించు భక్తులకు స్వామి మోహినీ అవతారోత్సహం స్వల్పమైన కష్టపడని భక్తులకు కల్పవృక్ష వాహనం జానకి రామ భక్తులకు హనుమద్వాహనం వెలుగు నింపే భక్తులకు సూర్య చంద్ర ప్రభ వాహనం వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాస శుక్ల పక్ష తిథి పంచమి 05/11/22, 7:53 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః శ్రీ మణవాళ మహాముని శాత్తుమొఱ రామానుజులు లాగ 200 ఏళ్ల తర్వాత శ్రీ వైష్ణవం విలసిల్లడానికి మహత్తర కృషి చేసిన వైష్ణవ రత్నం శ్రీ మణవాళ మహామునులు! గురువు తిరువాయ్ మొళి పిళ్ళై భగవద్రామానుజలకు ఆలయం కట్టించే భాద్యతలకు భక్తి శ్రద్ధలకు "యతీంద్రప్రవణ" బిరుదునిచ్చారు! రామానుజుల వారిని కీర్తిస్తూ "యతి రాజు వింశతి' అనే స్త్రోత్రం రచించినాడు. గురువు ఆదేశం మేరకు రామానుజుల శ్రీభాష్యం, ఆళ్వారుల నాలాయిర దివ్యప్రబంధం, వైష్ణవ గ్రంథాల్ని క్షుణ్ణంగా చదివి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేసినారు. అసమాన నిర్వహణ దక్షతతో, తన శిష్య బృందం మరియు కొందరి సహాయ సహకారాలతో శ్రీ రంగ క్షేత్రానికి పూర్వ వైభవం తెచ్చారు మహాముని. నిత్య ఆరాధనలు, ఉత్సవాలను పునరుద్ధరించి వైష్ణవులకు నాయకుడయ్యారు. నమ్మాళ్వారుల తిరువాయ్ మొళి ఆధారంగా 'తిరువాయ్ మొళి నూట్రన్దాది' రచించారు. 'ఆర్తిప్రబంధం'లో లౌకిక బంధాల్లో తాను ఇరుక్కొని కష్టపడే వేదనను అర్థవంతంగా వర్ణించారాయన. శ్రీ రంగనాథస్వామి 'ముప్పత్తాయిరప్పడి'ని వ్యాఖ్యాన ప్రవచనాన్ని ఆపకుండ కొనసాగించాలని, తాను వినడానికి ఆశిస్తునినట్లు తెలిపారు. ప్రవచనం శాత్తుమొఱ సమయంలో ఒక తనియన్ చెప్పి అంతర్ధానమయ్యారు. అభిరామ వరాదీశ, యతీంద్రప్రవణులు, వరయోగి, రామానుజ పొన్నడి, సౌమ్య జామాతృముని, సుందర జామాతృముని, పెరియ జీయర్, విశద వాక్ శిఖామణి పేర్లు వచ్చాయి! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస శుక్ల పక్ష తిథి ద్వాదశి. 12/11/22, 8:39 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః తిరుక్కండియూర్ 108 దివ్య దేశాలలో ఒకటి. తంజావూరు సమీపాన స్వామి 'హరశాప విమోచన పెరుమాళ్', కమలవల్లి తాయారు వెలిసిన క్షేత్రం 'తిరుక్కండియూర్'. నరసింహ మూర్తి, చక్రత్తాళ్వార్, గరుత్మంతుడు, ఆండాళ్ ప్రత్యేక సన్నిధులిచట. శివుడు 'తిరుక్కండియూర్'లో స్వామిని సేవించి, గదతో త్రవ్వగా వచ్చిన నీటి ప్రవాహంలో స్నానమాచరించి బ్రహ్మ హత్యా దోషమును తొలగించుకున్నాడు. స్వర్ణాభరణపహరణ పాప చింతనతో స్వామిని వేడుకొనగా, స్వామి తామర పుష్పముతో స్పృశించి, పుష్కరిణి ఏర్పరచి, స్నానమాచరించి, పాపాన్ని తొలగించుకోమని బలిచక్రవర్తికి చెప్పెను. అతని పేరిట బలి తీర్థం. కపిల మహర్షి ఐశ్వర్యాన్ని లాక్కొని, పర స్త్రీ వ్యామోహంలో భార్యను ఆరోగ్యము పోయి కుష్ఠు రోగ పీడితుడైన కపిల మహర్షి అల్లుడు, 'తిరుక్కండియూర్' పద్మ తీర్థంలో స్నానము చేసి వ్యాధిని నయం చేసుకున్నాడు. మగధదేశ పండితులు కాలవర్మ గర్వం చేత అందరిని పోగొట్టు కొని, వ్యాధినపడి, పలు జన్మ లెత్తి బాధపడి, పుణ్య విశేషం చేత 'తిరుక్కండియూర్' క్షేత్రం లోని 'కపాల మోక్ష తీర్థ' సమీపాన నివసించి మోక్షం పొందారు. 'తిరుక్కండియూర్' క్షేత్రం లోని పుణ్య నదిలో, పుష్కరిణిలలో స్నానం చేసి 'హరశాప విమోచన పెరుమాళ్'ను సేవించి ఎందరో సద్గతి పొందారు. వైఖానస ఆగమం ప్రకారము పూజలు జరిగే క్షేత్రం. తిరుమంగై ఆళ్వార్లు ఈ దివ్య దేశాన్ని ఎంతగానో కీర్తించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాస కృష్ణ పక్ష, తిథి చవితి/పంచమి. 19/11/22, 9:54 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః కొత్త జంటల మొదటి యాత్ర, ప్రేమ *తీపి* పరిమళమును పంచగా మధురమే! స్వామి నీకై వేచి వున్న సమయమే *పులుపు* లాగ ఇష్టమే, కాని ఆగలేము! స్వామి *ఉప్పు* తిని ఎండన కొండలు ఎక్కి చెమటలు చిందించు శ్రమ కూడా భక్తిలే! మొక్కులు మరిచిన భక్తులకు *కారము* చూపించి గుర్తుచేసి తీర్ఛమన్నట్లు! తప్పి పోయి వస్తువులు మనుషులు, మళ్లి కలిసి *చేదు* జ్ఞాపకాలను తొలగించి మురిపించ! స్వామి నీ దర్శనము కలిగిన ఒక క్షణం *వగరు* చప్పరించిన అనుభూతి! *షడ్రుచుల* సమ్మేళనమే స్వామి నీ తిరుమల యాత్ర మాకు! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాస కృష్ణ పక్ష తిథి దశమి/ఏకాదశి. 26/11/22, 8:34 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః *పంచమీ తీర్థ మహోత్సవం* భృగు మహర్షి పాదము చే వేరైరి లక్ష్మి నారాయణులు! భువి పై పాదము మోపి పద్మావతి శ్రీనివాసులు ఒక్కటైరి! తిరుమలలో పెండ్లి కొడుకు శ్రీనివాసుడు సుందరంగా! తిరుచానూరులో పెండ్లి కూతురు పద్మావతి దివ్యముగా! పసుపు పట్టు వస్త్రాలు పంపెను వేంకటేశుడు! మురిసి కళ్లకద్దుకొని కట్టుకొనెను అలిమేల్మంగ! ఊరేగించి తిరుచానూరు తిరువీధుల్లో చేరిరి దేవాలయం! చక్రత్తాళ్వార్ పద్మసరోవరము, పంచమితీర్థ మండపానికి! జియ్యంగార్లు స్నపన సామగ్రి అందించ అర్చకులు స్నపనము చేసిరి! శ్రీసూక్తం పురుష సూక్తం, పంచ సూక్తములు, తైత్తిరీయ నారాయణ ఉపనిషత్తులు గానం చేసిరి! అర్చకులు చక్రత్తాళ్వార్ ను పద్మసరోవరంలో చక్ర స్నానం, భక్తులందరూ చేస్తారు! శ్రీ వారి తులసి, పసుపు భక్తులకు పంచిపెడతారు అర్చకులు! గుంగుండ్ర మండపంలో అమ్మవారిని విశేష వస్త్రాభరణాలతో, పుష్పాలతో అలంకరించి నైవేద్యము! ఆస్థానం జరిపి ఊరేగింపుతో దేవాలయం చేరుతారు! శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష తిథి తదియ. 03/12/22, 8:15 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః భగవంతునిని మనలను కలుపు వంతెన భక్తియే! భక్తి లోని పలు విధములు దేవుని చేరుటకు నిచ్చెన! పూసలు ఎక్కడున్నా విలువ తగ్గనీయని సరము! వివిధ రకములైన పూలను ఒక్కటిగా కట్టేయు దండ! పాటలో గమకాలు స్వర స్థాన సరాగాల తాళము! అక్షరము లన్ని చేరి ఫలవంతమైన భావన నిచ్చు కవిత! క్రమ శిక్షణ కూడి వెంట వెంట దర్శనము వరుస! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష తిథి ఏకాదశి, గీతా జయంతి. 10/12/22, 8:24 pm - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః రాధ కృష్ణులు కలిసి అవతరించిరి బెంగాలు లోని నవద్వీపమున విశ్వంభర మిశ్రా ముగ్ధ మనోహర కీర్తనల గానం వైవిధ్య నృత్యం వైష్ణవానికి కొత్త ఉత్సాహానిచ్చింది అచింత్య భేద అభేద తత్వ వేదాంతిక తత్వానికి ప్రధాన ప్రతిపాదకులు మహాప్రభూ హరేకృష్ణ మహామంత్ర జపాన్ని ప్రాచుర్యం చేసిరి ఎనిమిది భక్తి ప్రార్థనలు "శిక్షాష్టకం" రచించిరి అష్ట గోస్వాములు ప్రథమ శిష్యులైరి గౌరంగ, గౌరా అని నిమాయి అని పిలుస్తారు కృష్ణదాసు కవిరాజు రాసిన 'చైతన్య చరితామృతం' బృందావన దాసు యొక్క 'చైతన్య భాగవతం' బెంగాలివి ఒక్క బెంగాల్ లోనే కాదు విశ్వమంతా వ్యాపించెను హరేకృష్ణ ఉద్యమం లాగ మనసుకు శాంతి, కడుపుకు తిండి వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తిథి తదియ. 17/12/22, 7:46 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః అలకలేల స్వామి పద్మావతి దేవి చలువ కనులనైనా చూడవా స్వామి ముఖమున పసుపు రాసి మెరిసే ముత్యపు చిరునవ్వు నీకై మురిసే కోపమింక చాలించు స్వామి ప్రియ అలమేల్మంగ పైన పద్మమై విరిసే తీర్చును లక్ష్మిదేవియై నీవిచ్చిన అభయముల వరములెన్నెన్నో సిరులకు యజమానురాలైనను సేవలు చేయ వచ్చెను నీకై స్వామి పంచభక్ష్య పరమాన్నాలు చేయించి తెచ్చెను కదా ధద్యోజనములెన్నో తీసివేయు కరివేపాకుకై ఏల రభస స్వామి శాంతచిత్తుడై చేరుమయ్య వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తిధి నవమి. 24/12/22, 6:51 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః పదములు తామే పాడగ రాగ కన్నులు తామే నిలువుగ చూడ కరముల తామే తాళము వేయ నడకలు తామే నాట్యము చేయ పువ్వులు తామే హారము కట్టా కొండలు తామే తోరణము కాగా మనసులు నీలో మమేకమై పోగా వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తిథి పాడ్యమి 31/12/22, 8:05 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః భక్తులను స్వీకరించి స్వాగతించడంలో భూదేవికున్నంత ఓర్పు మీకు స్వామి! ఏడుకొండల పైన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఆకాశమల్లె విశాల హృదయము స్వామి! శ్రేయులకు వెన్న కరుగు వెచ్చదనం స్వామి శత్రువులకు నిలువున కాల్చె దావాగ్ని కార్చిచ్చువే! ఏ భక్తుని అవసరం ఎలాంటిదో స్వామి అలాగే దీవిస్తావు, నీరు నిండు పాత్ర ఆకారములా! ఎందరో వాగ్గేయకారులు, గీతకారులకు మదిలో తలపులో శ్వాసలా నీ నామమే స్వామి! ఏ స్పర్శకు అందని ఏ భావంకు దొరకని పంచభూతాలు కలిసి పుట్టిన ప్రతి మనిషికి ప్రత్యేకం! పంచభూతాలను మించి మంచి మనసు స్వామి గోవిందా అని పిలిచినా పలికిదెవు కదా స్వామి! వేం*కుభే*రాణి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తిథి నవమి.

No comments:

Post a Comment