For new songs. Writing lyrics is my hobby. Can give 'wedding card invitation' starting with all letters of your name.
Wednesday, 2 March 2022
Saturday 2021
[2/1/2021, 7:41 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
ఏడు కొండలు తిరిగి తిరిగి గోవిందా చుట్టు
మొక్కలు మొక్కుబడి తీర్చ లేనివి వేయకు ఒట్టు
నెవరికి తెలుసు తిరుమల దర్శనాల గుట్టు
నీ దర్శనము కనురెప్ప తెరచినంత కని కట్టు
వడలు జిలేబిలు దొరకవు ప్రసాదములు ఎట్లా పట్టు
మానవుని సేవలో మాధవుని భక్తి కని పెట్టు
నిత్య కళ్యాణ వేళ పరవశాన జోడీ కట్టు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
2/1/21
[9/1/2021, 8:09 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
భోగ నిద్ర వీడి లెమ్ము యోగ నిద్రలో ఉన్న స్వామిని దర్శించి మనసున వేసుకొమ్ము తిరు స్వామి ముద్ర!
మబ్బు తెరలు తొలగి గబ్బును శుభ్రముగా చేసికొని స్వామి దర్శనము అబ్బురముగా డబ్బులు లేకున్నా!
మంచు తెమ్మెరలు తొలగించు కంచు కంఠముతో గోవిందా యంచు గాంచుము స్వామిని పాపములు కరిగించ!
పాశురములు సుప్రభాతమై నీలోని అసురుని నశింప ఆతురముగా వేంచేయు స్వామికి కరములు జోడించ!
మాలను కట్టి వేసి మనసు కుసుమాల వనమాలి రక్షించు హృదయ తోటమాలి పాల కడలి వాసా శ్రీనివాస!
మార్గశిర యందు మోక్ష మార్గమును వెదక ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార ఉత్తమ మార్గమందు నడచి స్వామిని చేర!
కలి చలిని చంపి మలి విడత దర్శనము చేయ లోకాల పాలించు స్వామి కలియుగ వైకుంఠ వాసా ఓ! వేంకటేశా!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
9/1/21
[16/1/2021, 8:11 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
నా దారిలో ప్రతి అడుగు నీ వైపు!
నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే!
నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగు!
నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణకు!
నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే!
నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే!
నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
16/1/21
[23/1/2021, 8:50 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
నీ నుదురు చూసి నుదటి రాత మార్చుకుందా మనుకుంటే గోవింద నామములడ్డుగా!
నీ గడ్డం పట్టుకొని బతిమాలు కుందా మనుకుంటే గునపం దెబ్బ పచ్చ కర్పూరములడ్డుగా!
నీ మనసు నైనా స్థానం సంపాదించు దామనుకుంటే అమ్మ పద్మావతి ఉండగా!
నిన్నే కోరి నీకే విన్నపములు వినిపిద్దామంటే అంతరాలయ మంత్రాల మధ్యగా!
కష్టపడి వచ్చి కాసేపుండి నిను దీక్షగా చూద్దామనుకుంటే నుద్యోగులు తోయగా!
నీ దర్శనమైనా నిజముగా చూద్దామనుకుంటే వజ్ర వైఢూర్యాభరణములు అడ్డుగా!
నీకై పాటలు రాసి ప్రచురితము చేయిద్దా మనుకుంటే అన్నమయ్యలు శ్రావ్యంగ పాడగా!
వేం*కుభే*రాణి
23/1/21
[30/1/2021, 9:21 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
గోవింద అని పిలువగానే రాతలు మార్చి నీవున్నావు కష్టములకు అడ్డుగా
పాపములు మోసి నిలువెల్లా గాయాలై శిలవైనావు మనుషులకు అడ్డుగా
నీ మనసునున్నట్లే కదా స్వామి అమ్మ పద్మావతి మనసులో మేముండగా
తళుకులలో కాంతులలో కాస్తైనా చూడచ్చనేమో అని దీపము లుండగా
స్వాములు లోక కళ్యాణార్థమై పూజలు చేస్తారుగా, స్వామి అందులో నేనుండగా
క్షణమైనా దర్శనము దొరికినది వెనుక వేలాది మంది భక్తులు వేచి ఉన్నారుగా
ప్రచురితము కాకపోయినా స్వామి నీ కవితలు నలుగురు మెచ్చెదురుగా
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
30/1/21
[6/2/2021, 8:32 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
పగటివేళ జగత్తుకు వెలుగు
నిచ్చు సూర్యుడివయ్య
త్యాగరాజులకు నీవు
పాటల చుక్కానివయ్య
సాయం వేళ నీవు మా
ఇంట చిరు దీపమయ్య
రాతిరి వేళ నీవు
చల్లని చంద్రుడివయ్య
అవసరాల వేళ నీవు
లక్ష్మి కాంతుడవయ్య
కష్టాలు కాచు వేళ నీవు పాపములు
హరించు ఈశ్వరుడివయ్య
అన్ని వేళలో స్వామి
మాకు హారతి నీవయ్య
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
6/2/21
[13/2/2021, 8:04 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
ఓ స్వామి ప్రేమనే పంచుతున్నా
ప్రేమకు బదులుగా ప్రేమ అందడం లేదు
ఓ స్వామి చిరునవ్వు చిందిస్తున్నా
నవ్వుకు బదులుగా చిరునవ్వు అందడం లేదు
ఓ స్వామి సంతోషమే ఇస్తున్నా
సంతోషం బదులుగా ఆనందం అందడం లేదు
ఓ స్వామి భక్తినే పెంచుతున్నా
భక్తికి బదులుగా దైవత్వం సాక్షాత్కరించడం లేదు
ఓ స్వామి మంచినే చేస్తున్నా
మంచికి బదులుగా మంచితనం దొరకడం లేదు
ఓ స్వామి సౌభాతృత్వం పెంచుతున్నా
సౌభాతృత్వం బదులుగా స్నేహం దొరకడం లేదు
ఓ స్వామి తీపినే పంచుతున్నా
తీపికి బదులుగా తియ్యదనం చేరడం లేదు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
13/2/21
[20/2/2021, 7:57 AM] venky HYD: తిరుమల లో రథసప్తమి బ్రహ్మోత్సవాలు.
అల్లదిగో ఆకాశాన ఓ సూర్యుడు!
అల్లల్లదిగో ఊరేగే సూర్యప్రభ వాహనములో తిరుమలేశుడు!
అల్లదిగో ఆకాశాన సప్తాశ్వరథారూడుడు!
అల్లల్లదిగో శేష వాహనము పైన సప్త గిరి శ్రీనివాసుడు!
అల్లదిగో ఆకాశాన దివ్య ప్రకాశ భాస్కరుడు!
అల్లల్లదిగో వజ్రాల కిరీటములో మెరిసే గరుడ వాహన వేంకటేశ్వరుడు!
అల్లదిగో ఆకాశాన ఆంజనేయ గురువు!
అల్లల్లదిగో భక్తి తన్మయత్వంతో హనుమ వాహనములో ఊరేగుచున్న రామ రమణుడు!
అల్లదిగో ఆకాశాన సూర్య నారాయణుడు!
అల్లల్లదిగో కామధేనువులా ఆశీర్వదించు కల్పవృక్ష వాహనములో శ్రీమన్నారాయణుడు!
అల్లదిగో ఆకాశాన సర్వ శక్తి మయుడు!
అల్లల్లదిగో సర్వ భూపాల వాహనం పైన ఏడేడు లోకాల అధి నాయకుడు!
అల్లదిగో ఆకాశాన శ్రీ ప్రభాకరుడు!
అల్లల్లదిగో చంద్రప్రభ వాహనం పైన జాబిలి కురిపించు కన్నుల శ్రీ పద్మాకరుడు!
వేం*కుభే*రాణి
అందరికి రథసప్తమి శుభాకాంక్షలు!
20/2/21
[20/2/2021, 7:58 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
ఒక్కొక్క అడుగు వేసి
వేయి అడుగులు దాటి నీ దర్శనము!
రెండు కనులు మూసి
వేయి పడగల పెద్దశేషు వాహన నిదర్శనం!
మూడు పూటలా మోసి
ముక్కోటి దేవతల బ్రహ్మోత్సవ దర్శనం!
నాలుగు కాలాల కీర్తి
వేయి నామాలు నీ భక్తి నిదర్శనం!
పంచ భూతములు ఆపి
ధ్యాన ధ్యాసను నిలిపి నీ దర్శనం!
షడ్రుచుల వంటలు చేసి
వేలాది భక్తులకు ప్రసాదాలు నిదర్శనం!
ఏడుకొండలు దాటి
మోక్షమీ ఎనిమిదవ కొండ వైకుంఠ దర్శనం!
వేం*కుభే*రాణి
21/2/21
[27/2/2021, 8:06 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
పదము పదము లోన పద్మావతి స్వామి
ప్రతి పదము లోన నా స్వామి
నిండు కుండ తొణకునట్లు గుండె నిండా భక్తి నీకు స్వామి
వృత్తము నెచట అంతమవనట్లు నా వృత్తి నీకు భక్తి స్వామి
పౌర్ణమి చంద్రుడు వెండి వాకిలి కాంతులీని బంగారు వాకిలి దాటె
పూర్ణ కుంభము హిరణ్మయము బంగారు గోపురము మెరిసే
గోళమంత నీ భక్తులతో నిండిన ఆకాశము చంద్రుడి వెన్నెలలో
నివృత్తి చేసుకుంటిని స్వచ్ఛమైన మాఘపౌర్ణమి చంద్రుడిలా
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
27/2/21
[6/3/2021, 7:31 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ?
పరీక్ష లో బాధ పెట్టువాడవు నీవే
నెగ్గించి విజయం లో అడుగు పెట్టించువాడవు నీవే స్వామి!
కష్టములో మొక్కించుకొను వాడవు నీవే
కష్టములు కడతేర్చి మొక్కులు తీర్పువాడవు నీవే స్వామి!
ధనములు విరివిగా నిచ్చు వాడవు నీవే
కోరి గొంతుకు మణి హారములు చేయించుకొను వాడవు నీవే స్వామి!
సుఖములు నిచ్చు వాడవు నీవే
రక్తి కట్టించి సుఖములు దాటి మోక్షమొసగు వాడవు నీవే స్వామి!
అక్షరములు కూర్చువాడవు నీవు
కీర్తనలు రాయించి పాడించుకొని మురిసి పోయెడి వాడవు నీవే స్వామి!
గింజలు సృష్టించువాడవు నీవే
పలు రకముల ప్రసాదములు చేయించుకొని పంచువాడవు నీవే స్వామి!
భక్తి లోన భుక్తి నిచ్చువాడవు నీవే
భక్తుల భక్తికి మెచ్చి సాక్షాత్కరించి దర్శనము నోచువాడవు నీవే స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
6/3=2 1
[13/3/2021, 1:51 PM] venky HYD: ఓం! నమో వేంకటేషాయ!
మూడు నామాలు పెట్టుకున్న నిన్ను
బొట్టు పెట్టి పిలువాలంటే వేయి నామాలు కదా స్వామి!
మూడు దండలు వేసుకున్న నిన్ను
చేతులెత్తి మొక్కాలంటే కోటి దండాలు కదా స్వామి!
త్రివిధ భక్తి పూజలతో నిన్ను
కొలవాలంటే కోట్ల ముడుపులు కదా స్వామి
అడుగడుగు దండాలు నీకు
నడవాలంటే వేయి పడగల పెద్దశేషు వాహనము కదా స్వామి!
ఒక్క దేవేరి ఉన్న నీకు
తలనీలాలు సమర్పించు వేల వేల జనులు రోజుకు నీకు స్వామి
నీ దర్శనముకై వేంచేసిన మాకు
ముక్కోటి దేవతలు నిదర్శనం బ్రహ్మోత్సవాలు కదా స్వామి
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
13/3/21
[20/3/2021, 7:25 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
భాగ్యమే కదా భాగ్యనగర వాసులకు మన మిని తిరుమల దేవాలయము
జూబ్లీ కొండలందు కమల చెరువు సమీపాన నిర్మించిన చిరు తిరు దేవాలయము
తిరుమలకు వెళ్లి నట్లుంటుదట నిచట దర్శనము చేసుకున్న శ్రీ వేంకటేశ్వరుని
అందరు పోలేరు ప్రతిసారీ తిరుమలకని కట్టించిరి తితిదే వారు మిని తిరుపతిని
రెండు సంవత్సరములైనది నేటికి రెండింతలైనది తెలిసిన ఆనందము
తిరుమలను అచ్చు గుద్దినట్లు ఉండునట మహిమ కాక ఇంకేమిటి స్వామి
గుడి గోపురము తీర్థకట్ట వీధి తెచ్చి పెట్టి నట్లు దోచి మనసు తప్పక దర్శించవలె!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
2 years completed for Sri Venkateswara temple@ road no 92, Jubilee hills, HYD. Yesterday conducted Brahmovatsavam, today Chakrasnanam.
Temple is built as it like in Tirumala, so it's called mini Tirumala.
20/3/21
[27/3/2021, 6:38 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
నీ దర్శనపు వరుసలలో భక్తి పారవశ్యమున మునిగి మనసు తప్పి పోవునట్లు పిల్లలు తప్పిపోతారు తల్లుల నుండి.
తప్పలేదు నాథుడు హెచ్చరించ తిరు వేంకటనాథుడు తండ్రుల మనసు తట్టి లేపిన చూడ పిల్లల గాభరగా
భక్తిలో పడిన సంసారమున మొక్కిన మొక్కులు మరచిపోయి అందరి మనసు దోచిన రూపు దొంగలు తస్కరించి
వడలు అప్పాలు జిలేబీలు దోసెలు దొరకవు అందరికి, లభించిన (లడ్డు) దాని తోనే తృప్తిపడమని
తిరుమలలో చెప్పులు పోతాయి ఎందుకంటే స్వామి వైకుంఠం దిగి కాలు పెట్టిన తిరుమాడ వీధులలో నీ అడుగు పెట్టమని
కొందరు డబ్బులిచ్చి మోసపోతారు స్వామి దర్శనానికి భక్తియే స్వామి కిచ్చు రుసుమని తెలియక
కొందరికి అన్ని పోయి కట్టు బట్టలే మిగులుతాయి తిరుమలలో, స్వామి చెప్పకనే చెప్పినాడు ధన కనక వస్తు బంధాలు ఏవి నీతో రావని
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
27/3/21
[3/4/2021, 7:11 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
అచ్యుతప్రేక్ష సంధ్యవేళ సంధ్యావందన సమయానా గాలి తాకిడికి సముద్రంలో నావ ఊగిపోతూంది
పూర్ణ ప్రజ్ఞులు తన ఉత్తరీయాన్నీ తీసి గాలిలో ఊపుతూ గాలిని నియంత్రించారు
తిరస్కరించే ఆచార్య నావలోని సంపదను, ఇమ్మనే పవిత్ర గోపి చందనపు రాశిని
నావ యజమానికి తెలియదు చందనము, రుక్మిణీ మాత పూజించి అర్చించిన కృష్ణుడు
గోపి చందనపు ముద్దను శుద్ధి చేసి కృష్ణ విగ్రహమును పవిత్ర జలాలతో శుభ్రపరిచే మధ్వాచార్యులు
చల్ల కవ్వంతో ఉన్న బాలకృష్ణ విగ్రహమే ఉడిపిలో ప్రతిష్ఠితమై నేటికి పూజలందుకొను
రెండు నెలలకు ఒక శిష్యుడు ఆలయ కైంకర్యాలు, ఇప్పుడు రెండు సంవత్సరాలకు మార్చే వాది రాజుల వారు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
03/04/21
[24/4/2021, 12:20 PM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
ఏ దిక్కు లేని వారికి నీవే దిక్కు
ముందు వెనుక లేని వారికి అన్నియు నీవే స్వామి
ఎప్పుడైన ఒకటి తక్కువైన నీవే అప్పిచ్చు దిక్కు
నాలుగు దిక్కులు ఆకాశము భూమి మూసిన నాడు ఏడో దిక్కు నీవే స్వామి
అష్ట దిక్కులు మూసిన నాడు నీవే మాకు దిక్కు
సంసార సముద్రంలో ఉత్తర ప్రత్యుత్తర తెలియని స్థితిలో నీవే చుక్కాని స్వామి
దారులన్ని మూసుకుని దిక్కు తోచని నాడు నీ నామాలే అన్యధా శరణం నాస్తిః
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
10/4/21
[24/4/2021, 12:21 PM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
గోవిందా అని పిలిచితిని
అందరు గోవింద అనిరి
స్వామి నీ మాట కలుపుము
నీ కాలు మోపిన నేల
నేను తాకి హత్తుకొని
నా హృదయమునకు
ప్రతి దారి లోన నా వెంట
నడుచు నా స్వామి ఇంట
బయట కద నాకు పంట
తులసి మాల నీకు
ప్రతి దినము సాకు
మోక్షమొసగు మాకు
మేల్ చాట్ ఉత్తరీయం
మహా పుణ్యం శేషవస్త్రం
లభించిన చాలు ఘనం
అలంకార ప్రియుడవు
పద్మావతి ప్రియ సఖుడవు
కోరికలు లేని వాడవు
పాపము హరించు స్వామి
అరిషడ్వర్గాలు నరుకు స్వామి
కష్టాలను తొలగించు స్వామి
వేం*కుభే*రాణి
Happy Saturday and stay safe Sunday ya Monday.
24/4/21
[1/5/2021, 8:31 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
పద్మావతి పాపిడి దువ్విందండి
శ్రీనివాస నీ కొరకు పాపిడి బిళ్ళ
పద్మావతి తిలకము దిద్దిందండి
వేంకటేశా నీ కొరకు కళ్యాణ తిలకము
పద్మావతి బుగ్గన మెరుపద్దిందండి
బాలాజీ నీ కొరకు బుగ్గన పెళ్ళి చుక్క
పద్మావతి కంటికి కాటుక పెట్టిందండి
కమలనాభ నీ చూపులలో దారవ్వలాని
పద్మావతి నడుముకు వడ్డాణం పెట్టిందండి
స్వామి నీ గుండెల నడుమ ప్రాణమవ్వాలని
పద్మావతి చేతికి గాజులు తొడిగిందండి
గోవిందా నీ కొరకు పాణి గ్రహణము
పద్మావతి కాలికి గజ్జెలు కట్టిందండి
ఏడడుగులు నీ తోటి నడవటానికి
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
1/5/21
[8/5/2021, 3:21 PM] venky HYD: ఓం! నమో విమాన వేంకటేశాయనమః
పూర్వం 15వ శతాబ్దంలో యాత్రికులు
ఏ కారణము నైన దర్శనం దొరకనిచో
విమాన వేంకటేశ్వరుని చూసి వెళ్లేవారు
ఆనంద నిలయం మీద ఉత్తర దిశగా
గోపురం పైన వెండి తోరణములో
విమాన వేంకటేశ్వరుని నిలయ స్థానం
శ్రీ రప్పాయని వైఖానస అర్చకులు స్వామి నగలు
దొంగతనం వలన సాళువ నరసింహరాయలు తొలగించి నారు
కొడుకు చిన్న వాడు, కాబట్టి వ్యాసరాయలు బాధ్యత
వైఖానస పారంపర్యాచార అర్చకుడి
స్థానం ఖాళి, వ్యాసరాయలు మధ్వసాధువు
పుష్కరం పాటు అర్చక బాధ్యతలు చేసారు
మధ్వపండితులు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు
వేద పారాయణం ఎప్పుడు జరిగినా వ్యాసరాయల కాలం
నుండి విమాన వేంకటేశ్వరుని ఎదుట
విమాన వేంకటేశ్వరుని ముందు కూర్చుని వేంకటాచల
మాహాత్మ్యం, శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణ చేయడం,
సర్వమూల గ్రంథ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది
1982లో ఆనందనిలయ బంగారు పూత పూస్తున్నప్పుడు
విమాన వేంకటేశ్వరుని గుర్తు పట్టడానికి
వెండి మకర తోరణం, బాణం గుర్తు పెట్టినారు
వేం*కుభే*రాణి
8/5/21
[15/5/2021, 1:03 PM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
తిరుపతి గోవింద రాజులు ధనము కొలిచి కొలిచి అలసి సేరు తలకింద పెట్టుకొని సేద తీరుతున్నాడు.
వేంకటేశ్వర స్వామి కళ్యణమప్పు వడ్డి కట్టడానికి కుబేరునకు కొలిచి పిలిచి ఇస్తున్నారు.
మొదట బహు దొడ్డ గాలి గోపురం తలయెత్తి దర్శింప లోపల పురాతన గోపుర రామాయణ భాగవత గాథ శిల్పాలతో అలరారును.
శేషసాయి పై దక్షిణ దిశగా తలపెట్టి పడుకుని చతుర్భుజ శంఖ చక్రాది ఆయుధములతో నాభికమల బ్రహ్మతో కీరిటముతో దర్శనమిస్తారు గోవింద రాజుల వారు.
అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. దక్షిణ దిశన రుక్మిణీ సత్యభామ సహా పార్థసారథి మందిరము.
వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైఖానస పద్ధతిలో.
గుడి ముందు పెద్ద కోనేరు, చూట్టూ నాలుగు వైపులా విశాలమైన మెట్లు పక్కనే ఆలయ వాస్తు మ్యూజియం దర్శించవచ్చు. అభిషేకాలుండవు విగ్రహము మట్టిది కనుక.
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
15/4/21
[22/5/2021, 8:12 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
పూట పూటకు నివేదనకు కొత్త కుండలు లేవు కాని
నీకై స్వామి విస్తరి ఒకటి వేసితిని!
రత్న ఖచిత సింహాసనము లేదు కాని
నీకై మనసులోన భక్తితో పీఠము వేసితిని!
వేదమంత్రాలతో వెయ్యిన్నెనిమిది నామాలు చెప్పలేను
కాని ఆర్తితో గోవింద గోవిందా అని పిలిచితిని!
పంచభక్ష్య పరమాన్నాలు చేయలేను కాని
తియ్యని జ్ఞాపకాలతో పాయసము వండితిని!
లడ్డు వడ జిలేబీ నెయ్యి దోశ పణ్యారాలు లేవు కాని
నీకై స్వామి పప్పు పులిహోర బూరెలు చేసితిని!
చల్లని గాలి వీచ వింజామరలు లేవు కాని
మెల్లగా విసనకర్రతో చల్లగ వీచితిని!
ఊరేగించ వాహనాలు బ్రహ్మోత్సవాలు లేవు కాని
కాలినడకన మెట్లెక్కి భుజముమీద మోయ వచ్చితిని!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
22/5/21
[29/5/2021, 7:12 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
నిన్ను కలిసి భక్తి ఎంత ఉందో చెబుదామని అనుకున్నా స్వామి!
మొదటి సారి ఎపుడు చూశానో గుర్తు లేదు నాకు స్వామి!
జ్ఞాపకాలలో ఉంచుకుందామనుకుంటే మరచి పోలేదు స్వామి!
కొండ దిగి నీవు వచ్చిన ఆధారు అడుగుదురు జనులు స్వామి!
హనుమంతుడు అంజనాద్రిన జనించిన ఆధారాలు స్వామి
ఎల్లవేళల అన్ని బాధలను తీర్పినావు కదయ్య స్వామి!
ఒట్టు పెట్టుకొన్నాను స్వామి నీ భక్తి నిక వీడనని స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
29/5/21
[5/6/2021, 7:37 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
ఇసుకంత భక్తిని ఉడుతలా మేసినట్లు చూపనా!
గుండెలో రాముని చూపినట్లు ప్రపంచానికి చూపనా!
నీ హారతి లోన భూమి నీ చుట్టు తిరుగునని చూపనా!
ఆర్ద్రతతో అగ్గి రాజేసి దీపం వెలిగించి చూపనా!
భక్తి దీపాలతో నీ మందిరము అలంకరించి చూపనా!
కోయిల చిలుక పలుకులు పాడగా సుప్రభాతం చూపనా!
కనురెప్పలు మూసినంత నీ దివ్య రూపము చూపనా!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
5/6/21
[12/6/2021, 10:01 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయా!
నా మాట నీకు విన్నపము స్వామి!
మా కీర్తన నీకు మేలుకొలుపు స్వామి!
మా పాట నీకు ప్రాణమేను స్వామి!
నా కవిత నీకు లాలి పాట స్వామి!
నీ నామము వల్లించుట శుభమేను స్వామి!
నీ మంత్రములు బాజా భజంత్రీలు స్వామి!
కాని
నీ పలుకే శాసనం మాకు స్వామి!
వేం*కుబే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
12/6/21
[19/6/2021, 7:11 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయ!
మార్గమెంత దూరమైన
అడుగు అడుగు లోన నీ తోడు స్వామి!
పలుకెంత కఠినమైన
పదము పదము లోన నీ కీర్తన స్వామి!
కష్టమెంత భారమైన
బరువు బరువు లోన నీ అభయం స్వామి!
భక్తి ఎంత పరీక్ష ఐన
నామం నామము పలుక మధురమే స్వామి!
జీవితమెంత పాశాణమైన
మలుపు మలుపు లోన నీ మహిమ స్వామి!
ఎదుగుదల ఎంత ఎత్తైన
మెట్టు మెట్టు పైన నీ బొట్టు స్వామి!
ప్రశ్నలెంత జటిలమైన
మౌనమే యోగిలా సమాధానము స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
19/6/21
[26/6/2021, 8:10 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
నా దేవుడని ఎంచుకున్నాను స్వామి
నన్ను నీ భక్తుడిగా తీర్చిదిద్దు స్వామి!
నీ నామమే వింటు గడుపుతున్నాను స్వామి
కష్టాలు తీర్చ నా మొర వినుము స్వామి!
నిదురలోను మేల్కొలుపు నీ దర్శనపు జ్ఞాపకాలే స్వామి
సుందర రూపము మరచిపోదు మదిలో స్థిరము స్వామి!
చిత్రమే సుందరమవును స్వామి నీ వుంటే
జీవితము సరిపోదు నీదు నిజ చిత్రములు గీయన స్వామి!
మనిషి ప్రపంచాన్ని జయించాలని ఆశపడు తున్నాడు స్వామి
వడ్డించు స్వామి నా వాడైన నాదంటు వేరే ఎందుకు స్వామి!
నీకై వెదికాను స్వామి కొండల్లో గుట్టల్లో
నా మది నిండి అంతటా ఉన్నావు స్వామి!
బాధలెన్ని దాచుచున్నావు తండ్రి భక్తుల కోర్కెలు తీర్చి తీర్చి
అమ్మ పద్మావతి ఒడిలో సేదదీరుము స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
26/6/21
[3/7/2021, 6:45 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
మాలను అల్లి నట్లు స్వామి నీ
కీర్తనలోని పదాలు అల్లన!
గొలుసు లోని బంధాలు వలె
పద బంధములు అల్లన!
వంతెన లోని స్తంభాలవలె పద
బంధాల నడుమ వారథి కట్టన!
లడ్డు లోని బూందీల వలె పాకముతో
ఒక్కటైనట్లు నామం చెప్పన!
సముద్రం లోని బిందువుల
అనుబంధంలా మంత్రం జల్లన!
కొమ్మ కున్న ఆకులవలె ఒక్కటై
వింజామరలై నీ సేవలో వీచన!
సంగీతం లోని సప్తస్వరాలు రాగ
మిళితమైనట్లు ఒక్కటిగా పాడన!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
3*7=21
[10/7/2021, 7:44 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
నుదుట నీ నామమే ధరించి తరించాము స్వామి
పుత్ర పౌత్రాదులకు నీ నామమేను స్వామి!
కనులు రెండు చాలవు వెయ్యి నామాలు కల స్వామి
మంచినే ఎన్నుకునే చూపు నిచ్చి నావు స్వామి!
నోరు నొవ్వంగ నుడివినాము నీ కీర్తనలే స్వామి
ఐదు వేల్లు నోటికి పోయేటట్లు చేసినావు స్వామి!
భుజములు రెండు నీ పల్లకి మోయ ప్రయత్నమే స్వామి
వెయ్యి గజముల శక్తి నీ భక్తి మెచ్చి ఇచ్చినావు స్వామి!
పొట్టచేత పట్టుకొని వచ్చిన నీ భక్తులం స్వామి
తల్లి ఒడిలా సేద తీర్చి రక్షించారు స్వామి!
చెయ్యి పట్టుకొని నన్ను నడిపించావు స్వామి
ఆసరాగా అభయమిచ్చి తోడు నడిచారు స్వామి!
కాలితో తన్నినావు పాపములన్నిటిని స్వామి
అడుగు వేసి మోక్షమార్గ గమ్యానికి చేర్చినావు స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
10-7=2+1
[17/7/2021, 7:42 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
పాటలోని మాధుర్యం నీవు స్వామి!
పదము లోని పరమార్థము నీవే స్వామి!
కళాకారులలోని నాట్యం నీవు స్వామి!
పాదము లోని పుణ్యము నీవే స్వామి!
కూలీల పనిలోని శక్తి నీవు స్వామి!
జగత్తుకు వెలుగు నీవే స్వామి!
పసిపాప చిరునవ్వు నీవు స్వామి!
కంటి పాప చూపు నీవే స్వామి!
జీవితంలోని సంతోషం నీవు స్వామి!
సంతోషము లోని చప్పట్లు నీవే స్వామి!
మనసులోని వేగం నీవు స్వామి!
వేగము లోని మాయవు నీవే స్వామి!
ఆకాశంలోని మేఘం నీవు స్వామి!
మేఘము లోని వర్షము నీవే స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
17/7/21
[31/7/2021, 7:42 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
అడగవేంటి స్వామి! ఏమయింది అని?
అన్ని తీరుస్తుంటే అవసరమేముంది స్వామి!
పిలువ వేంటి స్వామి! ఒకసారైనా కళ్యాణానికి?
అమ్మ పద్మావతి పెళ్ళికి పిల్లలమనా స్వామి!
చూడవేంటి స్వామి! నా బాధలను?
బాధ పెట్టి కర్మలు తీర్చు వాడవు నీవే కదా స్వామి!
రావేంటి స్వామి మా ఇంటికి! సేవలందుకొనుటకు?
మనసున పీఠమేసినావు ఇంకేమి కావాలి స్వామి!
బతుకు లోకి తొంగి చూడవేంటి స్వామి?
సుడిగుండాలన్ని దాటించావు కదా ఇంకేమి స్వామి!
నా కవితలను వినవేంటి స్వామి?
రాయలేదా తీయగా నీ నామములా స్వామి!
కోరినాను గొంతెమ్మ కోర్కెలని నవ్వుతారా స్వామి?
నవ్వని నవ్వి మనసు పంట పండని స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
24/7/21
[31/7/2021, 7:43 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
తిరుమల యన్నంతనే స్వామి నీ పై భక్తి ముసురు!
కోరినంతమట్టుకు నివ్వుము స్వామి వరముల వాన!
కాపాడు బతుకు అలజడి సృష్టించు ప్రకంపనలు!
జీవితపు యాత్రను స్వామి నావలా చేరదాటి వరద!
స్వామి నీవు భవ దాటించు సంసార సుడిగుండం!
కష్టములన్ని దాటి స్వామి అలా చేరిన ఒడ్డున అలలు!
అమ్మ పద్మావతిలా మమతలో మమ్ము ముంచెత్తుము స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
Social distancing with men only, not with God.
Sanitize yourself always with Bhakti.
Mask yourself with shield of _varamu_ of God.
31/7/21
[7/8/2021, 7:19 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
పూలు పళ్లన్ని తెచ్చాను నీకై రావా మా స్వామి!
నీవే దిక్కని నిక నీవే శరణంటితి అంతర్యామి!
కష్టాలలో నీకు చేస్తారు స్వామి మొక్కుల హామి!
తీర్చలేక మళ్లి మళ్లి చేస్తారు స్వామి నీ స్మరామి!
కళ్యాణమాడినావు అని పద్మావతి నాతి చరామి!
నే మొక్కెద స్వామి పాపములను కొట్టు తరిమి!
అన్ని పనులయందు నీవే సఫలం యద్యత్కరోమి!
వేం*కుభే*రాణి
7/8/21
[14/8/2021, 10:57 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
శ్రీ వారి ఘంటానాదం
ఘంటానాదం తో స్వామికి నైవేద్యమును నివేదించడం తిరుమల సంప్రదాయం!
ఘంటామండపం లోని దక్షిణానున్న రెండు పెద్ద ఘంటలను స్వామి నైవేద్య సమయాన మ్రోగిస్తారు!
పరమ భక్తుడైన చంద్రగిరి రాజు స్వామి ఆరగింపైతే గాని తాను భోజనం ముట్టేవారు కాదు!
చంద్రగిరి దుర్గాధిపతి మాధవ దాసర్ అను శేఖర మల్లన్న 1417లో ఘంటామండపం నిర్మించారు!
తిరుమల గుడిలోని పెద్ద ఘంటలు మ్రోగిన బయట ఉన్న ఘంట ద్వారా మ్రోగి శబ్దతరంగాల ద్వారా చంద్రగిరి కోటపై ఉన్న బంగారు ఘంటను తాకి మోగేది!
చంద్రగిరి రాజు ఈ ఏర్పాటు చేసుకున్నారు, స్వామి ఆరగింపు తెలుసుకోవడానికి!
నేటికి ఎందరో భక్తులు ఘంటానాదం విన్న తరువాత వారు భుజిస్తారు!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
14/8/21
[21/8/2021, 7:06 AM] venky HYD: ఓం నమో! వేంకటేషాయనమః
వెంగమాంబ చిత్తూరు జిల్లా లోని వాయల్పాడు దగ్గర తరిగొండ గ్రామం!
తరిగొండ లక్ష్మి నరసింహ స్వామి ఆరాధకురాలు వెంగమాంబ!
చిన్నప్పుడు భర్తను పోగొట్టుకుని స్వామినే పతిగా భావించి ధ్యానించుచు నుండెను!
శేషాచల కొండలలో తపస్సు చేసి జ్ఞానమార్జించెను. సరస్వతి దేవి కటాక్షము పొందెను!
ఎన్నెన్నో శతకములు రచనలు చేసి తరియించెను తరిగొండ వెంగమాంబ!
పుట్టిన మాతృభూమికి చరిత్రలో మరిచిపోలేని పేరు, నిత్య అన్నము తిరుమలలో మాతృ మూర్తి!
పద్యములు చదివి ముత్యములనిచ్చి హారతి చేసి, నేటికి వెంగమాంబ, ముత్యాల హారతి లేనిదే శయనించడు స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
21/8/12
[28/8/2021, 8:09 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
శిలా తోరణం, తిరుమల
తిరుమల కొండయే కోవెల
శిలా తోరణం ప్రవేశ ద్వారం!
నీటి ధార మిక్కిలి రాపిడి
సహజసిద్ధ వాకిలి ఏర్పడే!
ధ్రువ భేరం ఎత్తు సమానం
తోరణం శిల స్వామి వరం!
శంఖు చక్ర నాగు శేష
రూప శిల ఖనిజ విశేష!
శ్రీ వారి పాదాలు మొదట తాకి
రెండవ పాదం నిచట మోపి!
లక్షల యేళ్ళ నాటికి సాక్ష్యము
రక్ష నేటికి మేటిది మోక్షము!
రెండు పర్వత శ్రేణులు కలిసే
సర్వ మంగళ తోరణం శుభమే!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
Shila Thoranam is natural arch formed by confluence of types of rocks. Due to erosion, arch is formed.
28/8/21
[4/9/2021, 7:28 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
చక్ర తీర్థం
ముక్కోటి ఏకాదశిన ప్రత్యేక పూజలు నిచట
చక్రత్తాల్వార్, నరసింహ స్వామి కి
పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ!
వరాహ పురాణం ప్రకారం తిరుమలలో ముఖ్య సప్త తీర్థాలలో ఒకటి!
అధర్మంతో విసుగెత్తి భక్తుడు పద్మనాభుడు పన్నెండు ఏళ్లు తపస్సు చేసెనిచట!
తపస్సుకు మెచ్చి స్వామి సుదర్శన చక్రాన్ని పంపి అధర్మాన్ని అంతమొందించినాడు!
ఇంకా, బ్రహ్మ తపస్సుకై స్థలం చూస్తుంటే
విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపెనట!
చక్రం కొండను తొలిచి బ్రహ్మ తపస్సు చేయుటకు అనుకూలంగా చేసెను!
చక్ర తీర్థమున స్నానమాచరించిన మోక్షము లభించును, కనీసం నీళ్లైన తలమీద జల్లుకోవాలి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
4/9/21
[11/9/2021, 7:12 AM] venky HYD: ఓం! నమో వేంకటేషాయనమః
గొల్ల మండపం
రామమ్మ ఇచ్చే పాలు మజ్జిగ యాత్రికులకు
నిత్యము జ్ఞాపకము గొల్ల మండపం!
పాలు వెన్న తెచ్చిచ్చి పెరిగిన వారికి
గొల్ల మండపం నిచ్చితివా స్వామి!
గోవులు కాచేవారు నీ ఆలయం
కాచునట్లు చేసితివా స్వామి!
పగుళ్లు లేని గట్టి బంధం సాక్ష్యం
తరతరాలకు నిలిచిన స్వామి!
నేను కాచితి శ్రీవారి సేవలో భాగంగా
గుడి ఎదుట వేచితిని జ్ఞాన భిక్షకై స్వామి!
నాట్య ప్రదర్శనలిచట రమ్యము
నిదర్శనం ఈ గొల్ల మండపం స్వామి!
ధృడమైన భక్తి బంధం ఉన్నంతవరకు
శక్తి తగ్గదు ఏనాటికి స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
11/9/21
[25/9/2021, 8:00 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
ఉరుకుంద నర్సింహ (ఈరణ్ణ) స్వామి
816 ఆటవెలది
చిన్న కట్టగాను చిన్నప్పుడుండేను
కట్ట చుట్టు తిరిగి గట్టు మొక్కె
దపుడు సేద తీర్చ దాపరికం లేదు
రావి చెట్టు క్రింద రాజు లాగ
817 ఆటవెలది
వంట కట్టెలెట్టి వండేదపుడు మడి
తోటి స్నానమేను తోపులాట
వున్న జరిగి దారి వొదిరి ముందుకు వచ్చు
భక్తులు మరిచేను భావమెక్కి
818 ఆటవెలది
పెద్ద గోపురములు పెరిగేను క్షేత్రము
స్వస్థలము ఘనతలు స్వార్థ మాయె
నేడు హంగులేను నేటివిటే తగ్గె
తాకలేము స్వామి తన్మయంబు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
18/9/21
[25/9/2021, 8:00 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
తిరుచానూరు వెళ్లనిదే తిరుమల యాత్ర ముగిసి నట్లు కాదన్న పెద్దల మాట!
గోవింద రాజ స్వామి, వరాహ స్వామి దర్శించి వేంకటేశ్వరుడిని దర్శించవలె!
కరివేపాకుకై వచ్చిన పద్మావతి శిలగా మారె అచటనే తిరుచానూరు దేవాలయం!
కార్తీక శుక్ల పక్ష పంచమి తిరుచానూరులో శ్రీ పాంచరాత్రగమశాస్త్ర సంప్రదాయ బ్రహ్మోత్సవాలు!
తిరుమల నుండి తులసి పసుపు పట్టుపీతాంబరాలు ప్రసాదాలు తిరుపతి వీధులలో తిప్పి తిరుచానూరుకు తెస్తారు!
జ్యేష్ఠ పూర్ణిమన పంచాహ్నికం (5 రోజులు) తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు!
పద్మావతి దేవి పద్మపీఠంపై చేత పద్మాలు ధరించి పద్మాసనంలో మనకు దర్శనమిస్తుంది!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
25/9/21
[2/10/2021, 4:05 PM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
నాయకుడై బాటలు వేసినట్లు దిద్దినాను స్వామి!
నా మాటలు పాటలుగా రాయనివ్వు స్వామి!
ఆకాశాన్నై తారలు లాగ రాస్తాను స్వామి!
నా పాటను దివ్యముగా పాడనివ్వు స్వామి!
మేఘమై ఏ రీతిన రాయను స్వామి!
నా గీతిని దివ్యముగా చేయనివ్వు స్వామి!
కోయిలనై సంగీత సప్త స్వరాలు నింపినాను స్వామి!
నా కవితను మంగళము చేయనివ్వు స్వామి!
ప్రాణములై ఊపిరిలు నింపినాను స్వామి!
నా ఊహలు ఊయలలూగనివ్వు స్వామి!
రారాజులై దాతల వరము వలె రాసితిని స్వామి!
నా రాతలు సువర్ణములై నిలువనివ్వు స్వామి!
అమ్మనై సౌఖ్యములు చూసి అల్లినాను స్వామి!
నా వాక్యములు అర్థవంతములవని స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
2/10/21
[9/10/2021, 7:26 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
మంగళసూత్రమొక్కటే మగనాలికి కట్టేది
అంగవించే మీది పనులు అన్నియు విభునివే
తలుచుకుంటే తలపు లోన నీవు స్వామి
తలవకున్నను మదిలో ఎప్పుడు నీవే స్వామి
మొక్కిన నను రక్షించువు నీవు స్వామి
మొక్కకున్నను రక్షింతువు మక్కువతో స్వామి
విన్నపములు రాసినా చేరునా నీ దరి స్వామి
అలయనేల స్వామి తప్పక తేల్చుతావు పాల మీగడలా
మేధావియైన నీ గర్భవాసమే స్వామి
పొట్టలో అక్షరం లేకున్న విడిది అక్కడే స్వామి
కోట్లకు పడగలెత్తినా నీ నీడనే స్వామి
పూటకు తిండి లేకున్న నీ పడగ కింద స్వామి
కొలువులెంత పెద్దవైన నేమి స్వామి
నీ కొలువు లోనింత చోటు మేలిమి స్వామి
After listening to Annamayya Keerthana "Mangalasutramokkate" by Garimella Baalkrishna garu.
Happy Saturday n stay safe Sunday ya Monday.
9/10/2021
[16/10/2021, 7:57 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
ఎంత వేదాలు వెతికినా నీ పురాణమే గదా స్వామి!
ఎంతెంత సంసార మీదిన నీ నామమే మోక్ష సారము స్వామి!
ఎన్ని వ్యవహారములైన నీ సిరి లక్ష్మి కొరకే కదా స్వామి!
ఎన్ని శ్రీ వారి మెట్లెక్కినా నీ దివ్య దర్శనము కొరకే కదా స్వామి!
ఎన్ని తరాలు వచ్చినా సంతానానికి నీ నామమే కదా స్వామి!
ఎన్ని తంటాలు పడినా సుఖమయ జీవనం కొరకే కదా స్వామి!
శ్రీ వేంకటేశ్వరుడు నిల దైవము వైకుంఠమే తిరుమల కద స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
16-10-2021
[23/10/2021, 8:33 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
'పాప వినాశనం"
స్వామి పాదముల క్రింద వచ్చునంట పాప వినాశము
స్నానమాచరించిచట కడిగి పోవు సర్వ పాపములు
నీరు నిల్వ చేసి నిర్మలమైన తిరుమలలో త్రాగురిచట
సాలగ్రామ దానమిచట పోవునా నీవు చేసిన పాపములు
ఆత్మ శుద్ది కలుగు సుందర కొండాకోనలు చూడనిచట
మనసుకు ఉల్లాసము కలుగు రమణీయ ప్రకృతిచట
వర్ష శీతాకాలమిచట రాక బహూ మంచి కాలము
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
23-10-2021
[30/10/2021, 7:09 AM] venky HYD: ఓం నమో వేంకటేశాయనమః
ఎన్ని రకాల లడ్డూలున్న తిరుమల శ్రీవారి లడ్డు ప్రపంచంలో సర్వ శ్రేష్ఠం
350 ఏళ్ల క్రితం బియ్యం పిండి బెల్లం తో చేసి స్వామికి నివేదించే లడ్డూ మనోహరం
ఆగమశాస్త్ర ప్రకారం వేళవేళకు రకరకాల నైవేద్యాలు చేసి స్వామికి నివేదిస్తారు
రోజుకు లక్ష లడ్డూలు తయారు చేయగలదు స్వామి వారి వంటశాల 'పోటు'
పూర్వకాలంలో తిరుప్పొంగం, నేడు అప్పం, వడ, అత్తిరసం, మనోహర పడి
నిల్వ కలిగినది వడ, అందుకే అందరి మక్కువ. 1803లో తొలి సారిగా ప్రసాదాల విక్రయం
1940లో తిరుపతి లడ్డుగా స్థిరపడి, 2001లో సవరించిన పడితర దిట్టం
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
30-10-2021
[7/11/2021, 9:07 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
నిన్ను చూడ వచ్చెదరు దేశవిదేశాల నుండి, లోకపరలోకముల నుండి,
మరి నీవెవ్వరిని చూడ నెటు వెళ్లుదువు స్వామి!
నిన్ను చూడ వేచి యుందురు గంటలు రోజుల తరబడి,
మరి నీవెవ్వరికై వేచి చూచెదవు స్వామి!
నీకై వేడిగా తయారు చేసి రుచికర పాకములెన్నో ఆగమ శాస్త్ర ప్రకారం నివేదించెదరు,
మరి నీవెవ్వరికి ఏమి నివేదించెదవు స్వామి!
బ్రహ్మాది దేవతలకు, ఆగర్భ శ్రీమంతులకు నీ దర్శనము ఎనలేని సంతోషము నిచ్చును,
మరి నీకెవ్వరి దర్శనము హర్షమౌను స్వామి!
ఆపదలో ఉన్న వారినెల్లను నీవు రక్షించెదవు మకరి నుండి ద్రౌపది వరకు రక్షకుడందరి పాలికి,
మరి నీ రక్షణ చూచువారు ఎవ్వరు స్వామి
జీవులెల్లరికిని తల్లి తండ్రి లాగ అన్నియు ఇచ్చువాడవు,
మరి నీకు చెల్లునా ఒక దాత చెప్పగ ఋజువేది
నీవు లేని చోటంటు లేదు, నీ లోనే సర్వ లోకములు కలవు,
మరి నువ్వుండే నివాసము ఏది స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
06-11-2021
[13/11/2021, 8:30 AM] venky HYD: Lords reply to last Saturday questions.
ఓం! నమో వేంకటేశాయనమః
నేను వెళ్లెద భక్తుల కష్టాలు తీర్చ ప్రశ్న ధార తొలగించ!
నిజమైన భక్తుడి కొరకు వేచి చూచెదను నేను బిడ్డ!
వెంగమాంబలా భక్తులకు రుచికర భోజనము నివేదించెదను!
ప్రియ పద్మావతి దర్శనము మనః కమలము వికసించును!
నా బాకి తీర్చ ముడుపులు, దెబ్బకు కురులిచ్చు భక్తులే రక్షణ!
దాత ఒక ప్రక్రియ, కర్త కర్మ క్రియ అన్నియు నేనే!
నేను లోకమంతా ఎక్కడో కాదు నీ మనసునందే ఉంటాను!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
13-11-2021
[20/11/2021, 7:40 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
పాపపు పాదాలు తొక్కిన మెట్లను కడుగుటకా ఇంతటి వర్షం!
ఘాట్ రొడ్డు గట్టిగా ఉన్నవా అని పరీక్షించుటకా కొండ చరియలు విరిగి పడుచున్నవి!
కరుడుగట్టిన అక్రమాలు రూపుమాపుటకా ఇంతటి తుఫానులు!
కలియుగం అంతం అని చూపుటకా ఇంతటి విధ్వంస ప్రళయాలు!
పాప వినాశనం లోన ఎన్నో యేండ్లుగా నిల్వ చేసిన నీటిని బయటికి పంపుటకా కట్టలు తెంచుకుని వస్తున్నవి!
ఏడు కొండలమీద చెత్త నంతా బయటికి పంపుటకా కుండ పోత వర్షములు!
తిరుమల ఏడు కొండలు ఇంకాస్త అందంగా కనపడుటకా లేని జలపాతాలు!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
20-11-2021
[27/11/2021, 8:01 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
తిరుమలేశుడే ఇంటికి తిరిగి రావలెననేమో ఇంతటి తిరు వర్షాలు!
భగవంతుడే భవ్యముగా భువికి వచ్చును కాబోలు ఇంతటి వరదలు!
ధర్మపు బావుట ఎగరవేయడానికా అధర్మంను తొక్కి స్వామి మనకు సెలవిచ్చినది!
కోరిన వరములు కళ్లు మూసి ఇచ్చుట ఆపుటకా ఇంతటి గండ్లను కొట్టినది!
మానవాళి పాపములు తీసికొని శిలగా మరిక ఆపుటకా కట్లను తెంచివేయునట్లు చేసినది!
వచ్చింది మా ఇంటికి ఐఐటి తిరుపతి కూడా చదువుల దీవెనలందించ!
వేంకటేషుడే వేగిరముగా వేడుక చూడ దిగునో ఇంతటి భీభత్సము!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
27-11-2021
[4/12/2021, 8:12 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
ఏ ఆగమ శాస్త్రం తప్పిందని ఘాట్ రోడ్డు విరిగినది!
ఏ ధర్మం తప్పినదని కొండలు విరిగినవి తిరుమలలో!
ఢిల్లీ హేళ, తిరుపతి ఐఐటీ ఉంది ఉదయ వేళ!
రాళ్లు రప్పలూ స్పందించి తిరగబడే మొరాయించి!
మనిషికేల చీమ కుట్టినట్లు లేదు ధర్మము గురించి!
డబ్బులో జ్ఞానమో నీ దరి చేర్చును స్వామి మరి భక్తి!
దరి దర్శనము కరువాయె ఊరేగింపులు లేక మోక్ష దారి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
4-12-2021
[11/12/2021, 8:18 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
మెట్టు మెట్టుకి బొట్టు పెట్టి
మొక్కులెన్నో తీర్చుకొను వారెందరో!
అడుగు అడుగుకి దండం పెట్టి
ఇష్టములెన్నో తీర్చుకొను వారెందరో!
నెంచి పెంచుకున్న కురులను ఇచ్చి
కోరికలెన్నో తీర్చుకొను వారెందరో!
నిలువు నగలను నీకు ఇచ్చి
పతి ప్రాణం నిలుపుకునే వారెందరో!
వజ్రపు కిరీటములు చేయించి
ధనలక్ష్మి నింట నిలుపు వారెందరో!
తులాభారం చేయించి నీకు ఇచ్చి
ఘన చరిత్ర నిలుపు వారెందరో!
పద్య గద్యములు రచించి
ఆర్ధ్రతతో పాడిన అన్నమయ్య లెందరో!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
11-12-2021
[18/12/2021, 8:35 AM] venky HYD: ఓం! నమో వేంకటేశాయనమః
నా స్వామి రైతై సేద్యం చేస్తే ఎలాగ ఉంటుందో, నా ఈ అక్షర సేద్యం ద్వారా తెలుపుచున్నాను.
అడుగు వేసి భూమి పైన ఎన్నుకునే మంచి క్షేత్రం!
అన్న నాగలి తోటి దున్ని దాగి వున్న పురుగులకు మోక్షం!
భక్తి బీజములు నాటి ఆకాశ గంగ పోసి నారు పెంచె!
ఇంటింటికి ప్రేమ పంచినట్లు నారు క్షేత్రమంత నాటే!
అభయ హస్తముతో చెడు గడ్డిని మృదువుగా తీసివేసె!
దగ్గరుండి కన్నబిడ్డల వలె రక్షణనిచ్చి పెంచి పోషించే!
అరిషడ్వర్గాలను నందకం కోసి నట్లు, కాపు కోసి కూర్చె!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
18-12-2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment