Tuesday, 14 January 2020

Saturday 2020

[31/12/2019, 11:08 PM] venky HYD: Lot of people go to Tirumala on First January n have darshan of Lord Venkateswara.

నిత్య నూతనం తోమని పళ్లెం నీకు!

నిత్య నూతనం కళ్యాణ వస్త్రములు నీకు!
నిత్య నూతనం నిత్య పూజలు నీకు!

నిత్య నూతనం బ్రహ్మోత్సవాలు ప్రతి వత్సరము!
నిత్య నూతనం భక్తుల వింత కోరికలు!
నిత్య నూతనం నవ్య ఆభరణములు నీకు!
నిత్య నూతనం నీ దర్శనము మాకు!
HAPPY NEW YEAR 2020.
[04/01, 10:29 AM] venky HYD: Seven Hills of Tirumala are not just hills for me, it's house for penances, homas, writers' paradise, Annamayya, Vengamamba, Hathiram Baba, lot have explored the hills. Krishna Devaraya wrote _Amuktamalyada_ n dedicated to Lord.

వేదములే శిలలై వెలసిన కొండ!

అన్నమయ్య పాటలకు సరిగమల అండ!
కృష్ణదేవరాయల రచనలకు మూల దండ!

కురువరత్తి నంబికి ఇచ్చిన వరముల కుండ!
వెంగమాంబ వేంకటాచల మహత్య్మం రచించి తరిగొండ!

పదివేల శేషుల పడగల మయ దివ్య పడి!
రామానుజలకు దైవ సాక్షాత్కార బ్రహ్మండ!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
04-01-2020
[11/01, 4:06 PM] venky HYD: ఓం! వస్త్రం సమర్పయామి!
అంతరీయం సమర్పయామి!
ఉత్తరీయం సమర్పయామి!

కళ్యాణ వేళ బనారస్ పట్టు చీర; చేనేత సాలగ్రామ వస్త్రం సమర్పయామి!

శుక్రవార అభిషేక ఉత్సవ వేళ వక్షఃస్తల తాయార్ల పట్టు పరికిణీలు సమర్పయామి!
ఆభరణాలు 108 సాలగ్రామ హారం ధరించిన వేళ తిరుపతి బారీ ఉల్ బాత్ ఉత్తరీయం సమర్పయామి!

నిత్య కళ్యాణం నిత్య నవ వస్త్రం నిత్య ఉత్సవం, పట్టు దుపట్టా సమర్పయామి!
కోటకొమ్మ అంచులతో గద్వాల ఏరువాడ జోడు పంచెలు సమర్పయామి!

నవరత్న ఖచిత పట్టు పీతాంబరాలు అలనాటి శ్రీ కృష్ణ దేవరాయలు సమర్పయామి!
పట్టు మేల్ చాట్ ఉత్తరీయం దాతలు, పోషకులు, ఆధ్యాత్మిక తత్పరులు శ్రీ పాద వస్త్రం సమర్పయామి!

భక్తితో దూది గజవస్త్రం ఇచ్చినా స్వీకరిస్తాడు!
భక్తితో మోవిపై చిరునవ్వు వస్త్రం ధరించినా ఆశీర్వదిస్తాడు నా స్వామి!
నాకు బ్రహ్మ వాక్కులతో ఆశీర్వదించి శేష వస్త్రం ఇచ్చినా బ్రహ్మాండం జయించేనా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
11-01-2020
18/01/20, 10:41 am - venky HYD: ఓం! భక్త వరదయే నమః

పూజలు చేయ గోగు పూవులు తెచ్చాను! 
తీయరా తలుపులు సన్నిధి గొల్ల! 

హారతి చేయ దినకర కిరణాలు తెచ్చాను! 
దర్శనము ఇవ్వరా పద్మావతి మల్ల!
కళ్యాణము చేయ గోదాదేవి మాలలు తెచ్చాను! 
దీవెనలు ఇవ్వరా లోకము ఎల్లా! 

ఆకలి తీర మధుర లడ్డూలు తెచ్చాను! 
వరములు ఇవ్వరా వకుళ చల్ల! 
దప్పిక తీర ఆకాశ గంగను తెచ్చాను! 
దరికి చేరరా ఆపద మొక్కుల! 

సాయం వేళ గోవు పాల మీగడ తెచ్చాను! 
ధనములు ఇవ్వరా పైడి తల్లా! 
పాటలు పాడగా అన్నమయ్య వచ్చాను! 
శుభములు ఇవ్వరా వేంకటేశ్వరా అలా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
18-01-2020
25/01/20, 7:33 am - venky HYD: ఓం! అభయ ప్రదాత గోవిందా! 

నీ కనులలో అందం అవనా! 

నీ కర్ణమున ఆభరణం అవనా! 
నీ కరమున అభయం అవనా! 

నీ నుదుట పైన వైష్ణవ నామం అవనా! 
నీ యద పైన ఉత్తరీయం అవనా! 

నీ పాదమున పుష్పం అవనా! 
కనీసం నీ మేడలో నీడనవనా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
25-01-2020
10/02/20, 4:37 pm - venky HYD: If Lord Venkateswara Swamy writes a song for Goddess Padmavati 

నీ పెదవిన చిరునవ్వు నేను! 
         నా మాటలలో అర్థం నీవు! 

నీ కనులలో రూపం నేను! 
          నా అందంలో భావం నీవు! 
నీ కరమున చిలుకను నేను! 
           నా అభయమున వరము నీవు! 

నీ కొప్పున ముడి నేను! 
            నా శిరసున మణి నీవు! 
నీ నుదుట కుంకుమ నేను! 
             నా అర్చనలో పూవులు నీవు! 

నీ పిలుపులో ప్రేమను నేను! 
             నా తన్మయత్వంలో గారడీ నీవు! 
నీ మనసున దైవం నేను! 
            నా  హృదయమున  లక్ష్మివి నీవు!
వేం*కుభే*రాణి
అందరికి రథ సప్తమి శుభాకాంక్షలు! 
Happy Saturday n Ratha Saptami wishes to all.
01-02-2020
10/02/20, 4:37 pm - venky HYD: ఓం! సర్వాంతర్యామియే నమః

శూన్య ఆకాశానికి తన నీలి రంగుని కొసరుగా ఇచ్చెను నా స్వామి! 

నేల భూమికి తన పాద ధూళిని కొంతగా ఇచ్చెను నా స్వామి!
కనపడని వాయువుకు తన చలనము కాసింత ఇచ్చెను నా స్వామి!

సత్య అగ్నికి తన నామమును రవ్వంత ఇచ్చెను నా స్వామి!
నిశ్చల జలమునకు తన అభయమును ఝల్లంత ఇచ్చెను నా స్వామి!

మారిపోయే ఋతువులకు తన శ్వాసను ఊపిరంత ఇచ్చెను నా స్వామి!
నిర్జీవమైన కొండలకు తన నివాసమును ఇంకింత ఇచ్చెను నా స్వామి!
వేం*కుభే*రాణి 
Happy Saturday n weekend
08-02-2020
15/02/20, 10:06 am - venky HYD: Extended last Saturday's poem. 
శూన్య ఆకాశానికి తన నీలి రంగుని కొసరుగా ఇచ్చి నా స్వామి రంగుల హరివిల్లు పూయించెను! 

నేల భూమికి తన పాద ధూళిని కొంతగా ఇచ్చి నా స్వామి పచ్చని పైరును మొలకెత్తించెను! 
కనపడని వాయువుకు తన చలనము కాసింత ఇచ్చి నా స్వామి జీవము ఉరకలెత్తించెను! 

సత్య అగ్నికి తన నామమును రవ్వంత ఇచ్చి నా స్వామి అందరి జటరాగ్ని తీర్చెను! 
నిశ్చల జలమునకు తన అభయమును ఝల్లంత ఇచ్చి నా స్వామి పాతకములు కడిగెను! 

మారిపోయే ఋతువులకు తన శ్వాసను ఊపిరంత ఇచ్చి నా స్వామి ప్రకృతికి జీవము పోసెను! 
నిర్జీవమైన కొండలకు తన నివాసమును ఇంకింత ఇచ్చి నా స్వామి ఏడుకొండలను వైకుంఠము చేసెను!
వేం"కుభే*రాణి 
Happy Saturday n weekend.
15-02-2020
29/02/20, 12:59 pm - venky HYD: ఈ రూపమై ఉన్నాడు తిరుమల వేంకటేశ్వరుడు! బ్రహ్మాండ రూపమంతయు! 

సంసార సాగరంలో పుట్టిన మాయ వేంకటేశ్వరుడు! పాల సముద్రంలో లక్ష్మీకాంతుడు! 
పంచ భూతాలకు ఆలవాలము తిరు వేంకటేశ్వరుడు! బ్రహ్మలకు మూలకందము! 

కష్టములను తీర్చు వైద్య నారాయణ శ్రీ వేంకటేశ్వరుడు! తోమాల గోవిందుడు! 
చీకటిలు కమ్ముకొన్న వేళ వెలుతురు ఇచ్చు సూర్య శ్రీ వేంకటేశ్వరుడు! దివ్య నామముల వాడు! 

ఏడు లోకముల రాయడు శ్రీ వేంకటేశ్వరుడు! ఏడు కొండల తిమ్మప్ప ఱేడు! 
ఏడేడు జన్మల పాపములు బాయు శ్రీ వేంకటేశ్వరుడు! జీవులకు చైతన్యమయుడు! 
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
22-02-2020
29/02/20, 1:00 pm - venky HYD: ఓం! సహస్రనామాధిపతి వేంకటేశాయ నమః! 

నక్షత్రాల సమూహాలు వేల కోట్లు ఉన్న సూర్యుడు ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా! 

పూవులు సంరంభములు వేల కోట్లు ఉన్న దారము ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా! 
ప్రాణులు మనుష్యులు ఎన్నెన్నో జాతులు ఉన్న శ్వాస ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా! 

దేవుళ్లు వేల కోట్లు ఉన్న దైవం భక్తి భావం ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా! 
లోకంలో ఎన్నెన్ని దేశాలు ఉన్న నీ దేవాలయం ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా! 

బందువుల మిత్రులు బంధాలు ఎన్ని ఉన్న స్నేహ భావం ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా! 
పదునాలుగు లోకములు ఉన్న ఈ భూమి ఒక్కటే! నా స్వామి ఒక్కటిలా!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
29-02-2020
07/03/20, 2:49 pm - venky HYD: ఓం! ప్రకృతి స్వరూప! శ్రీ వేంకటేశ్వరాయనమః

అమెజాన్ అడవుల లోని కార్చిచ్చుని చల్లగా చూసి నీకు నిత్యము దీపములా వెలిగించనా స్వామి! 

నల్లమల అడవుల లోని పచ్చని ఆకులను వృక్షములగా పెంచి నీకు నిత్యము పచ్చతోరణముగా కట్టనా స్వామి! 
మేరు పర్వతమును బంగారముగా కరిగించి నీకు అడుగడుగునా మెట్లుగా చేయనా స్వామి! 

ఈ ఆకాశాన్ని పట్టు పీతాంబరాలుగా అల్లి నీకు నిత్యము మేల్ చాట్ ఉత్తరీయముగా కప్పనా స్వామి! 
థార్ ఎడారి లోని ఇసుక నంతా వజ్రాలుగా చేసి నీకు నిత్య కళ్యాణములో అక్షింతలుగా పంపనా స్వామి! 

హిందూ మహాసముద్రపు నీటిని మొత్తం అమృతముగా చిలికి నీకు నిత్యము నైవేద్యముగా పంపనా స్వామి! 
సిర్రస్ స్ట్రాటస్ మేఘాలన్నింటిని పట్టు పరుపు లుగా చుట్టి నీకు నిత్యము శయన వేళ పంపనా స్వామి! 
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
07-03-2020
14/03/20, 6:50 am - venky HYD: ఓం! ఆపద్భాంధవ! శ్రీ వేంకటేశ్వరా! పాహిమాం! 

పాము చాపను చుట్టుకొని వచ్చెయ్యి నా స్వామి, తిరుమళిశై ఆళ్వార్ కణిక్కణ్ణన్ కోసం పిలిచివప్పటిలా! 

సుదర్శన చక్రాన్ని చుట్టుకొని వచ్చెయ్యి నా స్వామి, గజరాజు అన్యధా నాస్తి అని పిలిచినప్పటిలా! 
తలపాగా చుట్టుకొని వచ్చెయ్యి నా స్వామి, ఏనుగు తరిమి నప్పుడు పద్మావతి పిలిచినప్పటిలా!

చీరలు మూటలు చుట్టుకొని వచ్చెయ్యి నా స్వామి, ద్రౌపది అన్నా....... పాహిమాం అని పిలిచినప్పటిలా! 
పదునాలుగు లోకములు చుట్టుకొని వచ్చెయ్యి నా స్వామి, యశోద మన్ను తిన్న బాల కృష్ణుని అడిగి నప్పటిలా! 

పుణ్యపు రాశులు చుట్టుకొని వచ్చెయ్యి నా స్వామి, అజామిళుడు మృత్యు వేళ నారాయణ నారాయణ అని పిలిచినప్పటిలా! 
ఏడు కొండలు చుట్టుకొని వచ్చానయ్య నా స్వామి, నీ దర్శనము ఇవ్వవా, త్యాగరాజ 'తెర తీయగ రాదా' అని పాడినప్పటిలా! 
వేం*కుభే*రాణి
In this each line has a story. 
Happy Saturday n weekend
14-03-2020
15/03/20, 12:04 pm - venky HYD: IMG-20200315-WA0027.jpg (file attached)
21/03/20, 11:05 am - venky HYD: తలుపులు తెరుచుటకు సన్నిధి గొల్లకు విశ్రాంతి నిచ్చితివా స్వామి! 

గజములకు అశ్వములకు సేద తీర్చు కొమ్మని సెలవు ఇచ్చితివా స్వామి! 
బ్రాహ్మలకు ఆళ్వార్ లకు ఉపశమనము కండని మంత్రోపదేశం చేసితివా స్వామి! 

నిత్యము కొండ పైకి వచ్చే వాహనములను బ్రేక్ తీసుకొమ్మని చేయి చూపితివా స్వామి! 
వంటలో భీములంత వారికి ఉపవాసమా అన్నట్లు గరిటె తిప్పితివా స్వామి! 

కోరంకి క్రిమి బ్రహ్మేంద్ర ముని దేనికి స్వామి భయం భ్రమ! 
నీ మహిమ తెలియనిది కాదు, భక్తుల నమ్మకమే కొండ దిగి పోయింది స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay Sunday safe in house🏠🏡🏨
21-03-2020
28/03/20, 8:26 am - venky HYD: ఓం! కరొనా నాశాయః శ్రీ వేంకటేశ్వరాయ నమః

నారాయణుడు తన మెడ లోని తులసి మాలను _Stethoscope_ చేసి మనలకు వైద్యము చేయడానికి వైకుంఠం దిగి వచ్చాడు! 

వేంకటేశ్వరుడు తన మెడ లోని కఠారి సరమును _Stethoscope_ చేసి మనలకు వైద్యము చేయడానికి తిరుమల దిగి వచ్చాడు! 
నరసింహుడు ప్రహ్లాద భక్తికి మెచ్చి అహోబిలం దిగి _Stethoscope_ మెడలో వేసుకుని మనలకు వైద్యము చేయడానికి వచ్చాడు! 

భ్రమరాంబికా మల్లన్న తన మెడలో ఉన్న వాసుకిని _Stethoscope_ చేసి మనలకు వైద్యము చేయడానికి శ్రీశైలం దిగి వచ్చాడు! 
ఆంజనేయుడు తన మెడలో ఉన్న రామ దండను _Stethoscope_ చేసి మనలకు వైద్యము చేయడానికి  నెట్టేకంఠి నుంచి వచ్చాడు! 

సాయి అల్లాహ్ జీసస్ బసవ గురు జీనా బుద్ధా ఎందరో మహా పురుషులు దిగి వచ్చి _Stethoscope_ నే ఆయుధము చేసుకుని వైద్యము చేయడానికి దిగి వచ్చారు! 
అందరికి ప్రార్థన, మీకిష్టమైన దైవాన్ని రోజు 5 నిమిషాలైనా ప్రార్థన చేయండి. అంతకు మించి అందరు ఇంటి లోనే ఉండి వైద్య నారాయణులకు తోడ్పడండి! 
వేం*కుభే*రాణి
Happy Saturday n Stay home Sunday ya Monday n help Divine Doctors.
28-03-2020
15/04/20, 10:27 am - venky HYD: ఆట చిన్నాటా కాదురా పరమాత్ముని ఆటరా! 

పాట పిల్లాట కాదురా పద్మావతి పాటరా! 
నాటక వీధి నాటకము కాదురా జగన్నాథుని నాటకమురా! 

కీర్తన అర్చన కాదురా అన్నమయ్య సంకీర్తనరా! 
భక్తి రక్తి కాదురా తరిగొండ వెంగమాంబ ముక్తిరా! 

ప్రార్థన అంటే కాదురా హాథీరాం బాబ ప్రార్థన రా! 
కల నిజమా కాదురా సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారంరా! 
వేం*కుభే*రాణి
Happy Saturday n stay home stay safe Sunday ya Monday.
04-04-2020
15/04/20, 10:28 am - venky HYD: ఆకాశ వీధిలో తిరిగినా దొరకదు నీ భక్తి స్వామి! 

మాయ బజార్ లో వెతికినా దొరకదు నీ భక్తి స్వామి! 
అంగళ్లలో కొందామన్నా దొరకదు నీ భక్తి స్వామి! 

ఫ్లిప్ కార్ట్ అమెజాన్ లలో కూడా కనపడదు నీ భక్తి స్వామి! 
స్విగ్గి జమాటో లలో ఆర్డర్ ఇచ్చినా రాదు నీ భక్తి స్వామి! 

మనసులో ధ్యానముతో నీ భక్తి లభించును స్వామి! 
కేవలం నీ దర్శనము చేతనే ముక్తి లభించును స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday and stay home Sunday ya Monday
11-04-2020
18/04/20, 10:53 am - venky HYD: సిరులు ఇచ్చే పద్మావతి, శ్రీవారి చిత్రాలు! 

హాయిని ఇచ్చే ఏడు కొండలు, శ్రీవారి నివాసాలు! 
పాటలను పాడే అన్నమయ్య, శ్రీవారి రాగాలు! 

రాం బాబా పాచికలు, శ్రీవారి ఆటలు! 
కుమ్మరి దాసు మట్టి పూలు, శ్రీవారి వరాలు! 

సామవేయి పేరిందేవి కౌతుక బేరం, శ్రీవారి భోగాలు! 
బ్రహ్మ గారి ఉత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు!
వేం*కుభే*రాణి

Happy Saturday n stay home stay safe Sunday ya Monday
18-04-2020
25/04/20, 9:35 am - venky HYD: తరిమినా నీవే, మెచ్చుకుని వరమిచ్చినా నీవే! 

ఉరిమినా నీవే, పాహిమాం అభయమిచ్చినా నీవే! 
తురిమినా నీవే, తిప్పి తిప్పి దారిలో తెచ్చేదీ నీవే! 

అప్పు మీరినా నీవే, వడ్డి కాసుతో సహా తీర్చేది నీవే! 
శృతి మీరినా నీవే, అట్టి బంధంలో గెలిపించేది నీవే! 

గరిమల నీవే, సింగారములతో అలంకరించినా నీవే! 
చర మీన నీవే, వేదములను సంరక్షించిన అవతారం నీవే! 
వేం"కుభే*రాణి
Happy Saturday n stay home stay sat, Sunday ya Monday.
25-04-2020
02/05/20, 8:44 am - venky HYD: తిరుమలలో పూవులన్ని నీకే! 
పూవులలోని మకరందము నీకే! 

మకరము బారి నుండి కాపాడిన గజములు నీకే దండం! 
తిరుమలలో నా నీడ కూడా నీకే దండం! 

తిరుమలకు రావడమే పండగా! 
నీ దర్శనము దొరుకుననిన జాతర! 

తిరుమలలో ఆకాశము నీదే! 
ఆకాశ రాజు కుమార్తె పద్మావతి నీదే! 

తిరుమలలో రాగా లన్నియు నీకే! 
తిరుమలలో అన్నమయ్య సరాగాలు నీకే! 

తిరుమలలో రాజువి నువ్వే! 
శ్రీ కృష్ణ దేవరాయలకు రారాజువి నువ్వే!

తిరుమల లోని ఏడు కొండలు నీవే! 
భువైనక ఏడేడు లోకములు నీవే!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe stay home Sunday ya Monday
02-05-2020
09/05/20, 8:10 am - venky HYD: ఆలన ఏల, పాలన ఏల లోకము లాలించు పాలించు నా స్వామి ఉండగా! 

మరపు ఏల, తలపు ఏల, వస్తాడు చూస్తాడు నా స్వామి! 
చీకులేల, చింతలేల, కష్టములు దుఃఖములు దూరం చేయు నా స్వామి ఉండగా! 

మౌనమేల, రాగమేల, మనమోహనుడైన నా స్వామి ఉండగా! 
చిత్రమేల, విచిత్రమేల సాక్ష్యము జీవము సార్థకత ఇచ్చు నా స్వామి ఉండగా! 

బాధ ఏల, బందీ ఏల పుణ్యము మోక్షము ఇచ్చు నా స్వామి ఉండగా! 
పాటలేల ఆటలేల జగన్నాటక సూత్రధారి నా స్వామి ఉండగా! 
వేం"కుభే*రాణి
Happy Saturday n stay home stay sat, Sunday ya Monday.
09-05-2020
16/05/20, 8:12 am - venky HYD: Due to corona, all have stopped. Even Tirumala is also closed. But

వేంకటేశ్వరుడు నీ ఆలోచనలు యోచనలు వేరే తోచనలు లేవు! 

అలంకారాలు నిలిచి పోలేదు, సుప్రభాత సేవలు ఆగలేదు! 
తోమాల సేవలు నిలువ లేదు, నిత్య కళ్యాణాలు ఆగలేదు! 

కర్పూర చందనపు హారతులు నైవేద్య పాయసాలు జార లేదు! 
శుక్రవార అభిషేకాలే కాదు అన్ని వారాల పూజలు తప్ప లేదు! 

గడప దాటక పోయినా నీకు అన్ని జరుగుతాయి నా స్వామి! 
జనులకే అదృష్ట దర్శనము లేదు బయటికి వెళ్ల లేక! 
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
16-05-2020
23/05/20, 8:00 am - venky HYD: నింగి నిలిచే ఛత్రమై క్షాత్రమై భద్రముగా! 

నేల తడిమే నీడ తోడై సగమై వరముగా! 
నీరు నిడివి ఏకమై జీవమై చల్లగా! 

నిప్పు నివురు ప్రకాశమై వెలుగై కాంతిగా! 
నిరంతరము వీచే గాలి పవనమై పావనమై జీవముగా! 

నీవి ఆశీస్సులే మాకందరికి ప్రాణాలుగా! 
నావి పంచ ప్రాణాలు నీవేగా స్వామి ఒక్కటై ఒక్కటిగా!
Happy Saturday n weekend.
23-05-2020
30/05/20, 8:47 am - venky HYD: ఎవరు వచ్చినా ఎదురుగా ఎంత వారు నిలబడినా చిన్న వారే కదా స్వామి! 

దొంగ వచ్చినా  ఎంతటి దొరలు వచ్చినా భక్తికి నిలబడి సమానమే కదా స్వామి! 
బంటులు వచ్చిన రాజులకు రారాజు వచ్చిన నీ రాచరికాలు కదా స్వామి! 

బికారి వచ్చినా నవాబుల ఫర్మానా ఇచ్చినా నీ సేవలు ఆగవు కదా స్వామి! 
బంగారు వాకిలి నుండి వచ్చిన ఉత్తర ద్వారము నుండి వచ్చిన వ్రతాల ఆకలి కదా స్వామి! 

ప్లేగులు వచ్చిన కరొనా మహమ్మారి వచ్చిన నిత్య పూజలు నిలువవు కదా స్వామి! 
నాగులు వచ్చినా మొసళ్ళు నీ గుడిలో వచ్చినా మూయరు తలుపులు కదా స్వామి!
వేం*కుభే*రాణి

Happy Saturday n weekend. Stay protected from corona virus.
30-05-2020
06/06/20, 8:07 am - venky HYD: నీ దర్శనముకు రాని ఏ ఊరు వారైన ఉంటారా స్వామి!

నీ పాటలు పాడని గాయకులు ఎవరైనా ఉంటారా స్వామి! 
నీ ప్రసాదము రుచి చూడని జిహ్వలు ఉంటాయా స్వామి! 

నీ నామము లేని కుటుంబం ఏదైనా ఉంటుందా స్వామి! 
నీ పేరు తలవని రోజు ఒకటుంటుందా స్వామి! 

నీ ఉత్సవమును చూడని దేవుడు ఎవరైనా ఉంటారా స్వామి! 
నీ దేవాలయము లేని మండలము ఏదైనా ఉంటుందా స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n have safe weekend.
06-06-2020
13/06/20, 8:11 am - venky HYD: వీచే గాలిని గుప్పెట్లో పెట్టు కోడానికి పవన సుతుడు హనుమంతుని బేడీలు వేసి బంధీగా! 

గలగల పారే నీటిని పుష్కరిణి కపిలేశ్వర ఘోణ తీర్థాలు తిరుమల ఏడుకొండలలో బంధీగా! 

అంతులేని ఆకాశాన్ని అదుపులో పెట్టు కోడానికి పద్మావతి కళ్యాణము చేసుకుని ప్రేమ బంధీగా! 

భక్తుల మనసుకు తాళం వేసి అన్నమయ్య పాటల తాళం లో భక్తి బంధీగా! 

మనసులో బంధీ అయిన లక్ష్మిని ఈ మనుషులు అవసరాలకు వడ్డి కాసుల నీకు చక్ర బంధీగా! 

ముక్కోటి దేవతలు దివి నుండి భువికి వచ్చి నీ దర్శనము కొరకు తిరు మాఢ వీధులలో బంధీగా! 

మనసులో నిను బంధీగా చేసుకున్న భక్తులు నీ దర్శనమునకై వివిధ కంపార్టమెంట్ లలో బంధీగా!
వేం*కుభే*రాణి
Happy Saturday n safe weekend.
13-06-2020
20/06/20, 8:16 am - venky HYD: నీ దర్శనమే నాకు గమ్యం
నీ అభయమే నాకు సైన్యం
నీ తీర్థమే నాకు వైద్యం
నీ తిరుమలే నాకు మన్యం
నీ ధ్యానమే నాకు స్థైర్యం
నీ నామమే నాకు ధైర్యం
నీ కీర్తనలే నాకు వైఢూర్యం

 Happy Saturday n stay safe Sunday ya Monday
19-06-2020
03/07/20, 2:18 pm - venky HYD: 20-06-2020
03/07/20, 2:19 pm - venky HYD: మణిహారం నామాల కాసుల హారం కీర్తనల హారం తేవ పూవ! 

జీవితం లో సుడిగుండంలో తరియించి నావ! 
కడలి కష్టాలు అలల అలజడి తీర్చ రావా! 

తిరుమల దారి మలుపులులా కాకుండా చూపవా భక్తి త్రోవ! 
వైరాగ్య సంసారాల బాధల నుండి రావా నను బ్రోవ ! 
           
ఋణములు తీర్చ కళ్యాణమై పద్మావతి రాగా ఆకాశ రాజు మావ ! 
సుడిగాలి రేకెత్తే ఇహ లోకముల బాధలు నుండి రావా కావ!

Happy Saturday n stay safe weekend
27-06-2020
04/07/20, 9:28 am - venky HYD: ఓం! తిరుమల వాసా గోవిందా! 

ఆరు సార్లు తప్పినా ఆరుద్ర కార్తె వానలా నీ దర్శనము తప్పక దొరుకునులే! 

కొత్త కోడలు అత్తారింటికి దూరమైనా కూతురై నీ గడప తొక్కునులే! 
వరి నాట్లు ప్రారంభించినా నీ ప్రసాద పాయసాలకై బియ్యం వండుతారులే!

ఆషాఢ మాసానా చేతికి గోరింటాకు పెట్టు కున్నా నీ పూజలు ఆగవులే! 
ఆషాఢ మాసమున  ముహూర్తాలు లేకున్నా నీకు నిత్య కళ్యాణములు జరుగునులే!

విష్ణువు తొలి ఏకాదశి న యోగనిద్రలో ఉన్నా నీవు కంటికి రెప్పలా కాపాడుతావులే! 
జీవిత సంసారాలలో ఉండి మోక్ష మార్గము చూపు గురువు నీవేలే! 
వేం*కుభే*రాణి

Happy Saturday n stay safe.
04-07-2020
05/07/20, 8:32 am - venky HYD: Wishes to all on Guru Pournami. 

ఓ సాయి! గురువులకే గురువు నీవు సాయి! 
కసాయి లకు గురువు బాబా నీవే సాయి! 
రసోయి లోన లేమి లేకుండా నీవే సాయి!
కరుణామయి మాకు శ్రద్ధ సబూరి నీవే సాయి! 

అందరికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు!
11/07/20, 1:04 pm - venky HYD: బ్రహ్మ కడిగిన పాదము! 
పాపములకు ఒ కట బాణము! 
భక్తికి పరమాత్మ స్థానము! 
పద్మావతికి హృదయ ప్రాణము! 
దుష్టులకు శక్తి గణము! 
ఆళ్వార్లుకు పవిత్ర పురాణము! 
కేశవా తీర్చవా కాసుల ఋణము! 
వేం*కుభే*రాణి

Happy Saturday n stay safe
11-07-2020
18/07/20, 7:59 pm - venky HYD: ఏక ముఖ మనుష్యులు ఎన్ని పూజలు చేసిరి నిను కొలువగా! 

రెండు రెక్కల గరుడ ఆళ్వార్ వాహనము పైకి ఎగరగా! 
త్రికంఠి నీకు భక్తుడాయే ఆ దేవ దేవుడు కూడా మెచ్చగా! 

చతుర్ముఖ బ్రహ్మ కడిగినే నీ పాదము, ఉత్సవాలు జరుపగా! 
పంచముఖ ఆంజనేయుడు నిను విడువక వచ్చెను బంధీగా! 

ఆరు రుచులు నీకు ఆరు ఋతువుల విందుగా! 
సప్త ముఖ గిరులు నీకు ఆవాసాము కాగా! 
వేం*కుభే*రాణి

Happy Saturday n stay safe.
18-07-2020
25/07/20, 8:56 am - venky HYD: ఇనుప గొలుసులు ఆపలేవు నీ దర్శనము! 

వెండి వాకిలి దాటి నిజ పాద దర్శనము! 
పంచలోహ భేరాల అభిషేక అలంకార దర్శనము! 

బంగారు రథములో తిరుమాఢ వీధులలో ఊరేగింపు దర్శనము! 
రాగి రేకుల కీర్తనలు అన్నమయ్య భక్తి దర్శనము! 

ఇత్తడి తాంబాణిలు నీ పాదము మోసే పుణ్య దర్శనము! 
ప్లాటినం జూబిలీల ప్లాటినము అయిన దర్శనము!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe.
25-07-2020
26/07/20, 9:45 pm - venky HYD: తరిమినా మెచ్చి వర తరియించిన నీవే! 
ఉరిమినా పాహిమాం ఉరక నీవే స్వామి
తురిమినా నీవే దారిలో తెచ్చేదీ నీవే! 
అప్పు మీరినా నీవే, వడ్డి కాసుతో సహా తీర్చేది!
01/08/20, 9:46 am - venky HYD: శ్రావణ మేఘములు కురియు శ్రావ్యమైన సంగీతంలా నీకు స్వామి! 

నాగపంచమిన ఆదిశేషుడు భువిపై పుట్టలో చెట్టు కింద 
కట్టపై వెలియ పాలు పోసిరి ఎల్లా మము కాపాడమని! 

శ్రావణ శుక్రవార వేళ వరలక్ష్మి వ్రతము చేయ ఇంటింటా
సౌభాగ్యము విరియ పద్మావతి పద్మాసనం వేయ మదిలో! 

నీ అభయమే ఎల్లరకు రక్షా బంధనము నిండు పున్నమి నాడు
నారీ మణులకు నారికేళ దిన ఫలములు నొసగ శ్రీ పుష్కరిణి తీర్థంబై! 
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe
01-08-2020
08/08/20, 8:07 am - venky HYD: శ్రావణ శుద్ధ చతుర్దశి మమ్ము పావనము చేయ వరాహ జయంతిన రావయ్య వరాహమై! 

శ్రావణ పౌర్ణమిన జీర్ణ జంధ్యాలను మార్చుకోవాలని వచ్చినావు వామనుడై! 
శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి బీజాక్షరములు ఇవ్వాలని హయగ్రీవమై! 

శ్రావణ బహుళ విదియ (Aug 5) అయోధ్య లో శిలన్యాసము వచ్చినావు చిట్టి రాముడివై! 
శ్రావణ బహుళ అష్ఠమిన ఉదయించినావు నా ఇంట బుడి బుడి అడుగుల చిన్ని కృష్ణుడివై!

శ్రావణ పున్నమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రములో ప్రవేశించి రావయ్య చంద్రుడివై! 
ఓ! తిరుమల వేంకటేశ్వరా! నీ నక్షత్ర మాసమున శ్రావణ మాసమున ఆనందముగా రావయ్య మా ఇంటికి శ్రీనివాసుడివై!
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe.
08-08-2020
18/08/20, 4:13 pm - venky HYD: 🇮🇳 అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 

పద్మావతి కుంకుమ రేఖల రంగు వీరుల రక్త తిలక రంగు మన భారత దేశ వీరత్వానికి ఔన్నత్యానికి సూచికగా మెరుపు రంగు! 

గోవు పాల అభిషేకాల రంగు ఉత్తరీయం లోని తెలుపు రంగు జాతీయ జెండా లోని శాంతికి సూచికగా! 

నిత్య కళ్యాణము పచ్చ తోరణాల రంగు రైతన్నలు పండించే పచ్చని పైరు రంగు సాయం సంస్కృతిలకు సూచికగా! 

స్వామి నీ సుదర్శన చక్రమే నడుమ గంభీరంగా తిరుగుచున్న ఆశొక చక్రం 24 గంటలూ నీ అభయానికి సూచికగా! 

త్రివర్ణ పతాక జెండా రెపరెపలు గరుడుని విప్పారిన రెక్కలు భారత దేశ అణు బ్రహ్మాండ బలముకు సూచికగా!

నీ నామాలా సారాల తాడులా పెనవేసుకున్న స్వామి భక్తుడి బంధంలా జెండా తాడు సూచికగా! 

పుష్పాభిషేకాల పూల రంగు రంగులు సప్తగిరుల వర్ణములై వెదజల్లి నట్లుగా జెండా ఎగరేసి నప్పుడు స్వాతంత్ర్య పండుగన!
Happy Independence Day wishes to all. 
Happy Saturday n stay safe. 
15-08-2020
29/08/20, 8:08 am - venky HYD: కామవరం ఇల్లూరు వేంకటేష్
శీర్షిక: విఘ్నేశ్వర (27) 

రావయ్య గణేషా రావయ్య భువికి రావయ్య
కపిలాయ రాలేము కదలి ఇల రావయ్య 

ఏకదంతాయనమ ఏకంగ చేస్తామయ్య
గజకర్ణికాయా తగిన జ్ఞానము ఇవ్వువయ్య

గరంగా పులిహోర గల్లి గల్లి పంచలేమయ్య
నగరం నగరం మౌనముగా బొతుందయ్య

సాగరం బొంబాయి సాకారం ఇవ్వవయ్య
అడుగుల ఎత్తు చూడక రావయ్య

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు
29/08/20, 8:08 am - venky HYD: ఓ శ్రీనివాస ఆయురారోగ్య మిళిత ఆయుష్షు నివ్వవయ్య! 

శతాయు సూర్య కిరణం
శతాయు చంద్ర దర్శనం
శతాయు ఆనంద జీవనం
శతాయు ధాన్య విద్యం
శతాయు దైవ స్మరణం
శతాయు మిత్ర వాత్సల్యం
శతాయు పితృ వాక్యం
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe

Praying Lord Abode on Seven Hills to give all these Seven virtues along with hundred years. 
It will be rather a punishment than a boon without health
22-08-2020
29/08/20, 8:09 am - venky HYD: నీడను చూసినా భయమేసేదే
నిను మొక్కిన, నా నీడలా వెన్నంటి ఉంటివే స్వామి! 

ఏమయినా నా కవితలను ఆదరించిన స్వామి
కలనైన ఇలనైన నీ కవితలే నా ఆలోచనలు స్వామి! 

మండుటెండలొ ఎండమావిలోనూ నీవే స్వామి! 
వాన చినుకుల నడుమనూ నీవే స్వామి! 

నీ భక్తిలో ఖైదునైతినే స్వామి
బండ రాళ్ళ నడుమ మొక్క నైతినే స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday, stay safe
29-08-2020
05/09/20, 8:46 am - venky HYD: కామవరం ఇల్లూరు వేంకటేష్
శీర్షిక: వేల కవులు (39) 
ఆదోని/హైదరాబాద్

వేయి నామాలు గల వేంకటేశ్వరుడాయ
వేగిరమే శ్రీ రావేల నీవయ్య ఇక

వేవేల వేచి దేవేరి నీకయ్య వే
వేల కన్నులతోను వేచి ఉన్నానయ్య

వేచి ఉన్నామయ్య వేవిళ్ల పురుడులా
వేస్తాము తాళములు వేలకొలది కవులము! 

వేగమే పరుగు కావేరి రంగనాథా
ఇష్టపది సప్తగిరి ఇహపరము గోవింద! 
వేం*కుభే*రాణి
05-09-2020
12/09/20, 9:10 am - venky HYD: కలలో కన్న దేవుడు నీవు స్వామి కన్నుల నిండా నీ రూపమే స్వామి

హృదయములో పొంగే ప్రేమ కన్నా భక్తి అంతా నీకే స్వామి! 

వానలో పడు చినుకుల తడి కన్నా పండిన పూలన్ని నీకే స్వామి! 

నన్ను నేను నమ్మిన కంటే నీ భక్తిని నమ్మితి స్వామి

తేనె తట్టులో తేనె మధురము కన్నా నీ లడ్డు పాయసాలు తీయన నాకు స్వామి

56 అక్షరాల తెలుగు మధురిమల కన్నా నీ నామ మంత్ర వేదం నాకు మధురం స్వామి

దారులు ఎన్ని ఉన్న నీ భక్తి మార్గము నాకు పరమ పావనము స్వామి
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe
12-09-2020
19/09/20, 11:58 am - venky HYD: సూర్య చంద్రులు నీకు శంఖం చక్రం స్వామి

బుధుడు సోమరస గ్రహీత నీకు యజ్ఞం స్వామి

అంగారకుడు అంగాల ఆహార్యం నీకు స్వామి

ఆ భూమి ధరణి ఎదలో పద్మావతి నీకు స్వామి

రాక్షస శుక్రుడు బృహస్పతికి గురువు నీవు స్వామి

శనిగ్రహమును కూడా చల్లబరుచు చూపులు నీవి స్వామి

రాహు కేతులు నీకు రాగం తాళం స్వామి
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
19-09-2020
26/09/20, 10:00 am - venky HYD: ఆటవెలది 1
ఎల్ల లోకములకు ఎల్ల సంపదలను
నిచ్చిన అలివేలు నీకు, పెళ్ళి
అప్పు ఆ కుబేరు అంత ఇచ్చెను అని
నమ్మమంటె, స్వామి నాకు తెలుపు

ఆటవెలది 2
ఎల్ల లోకములకు ఎవ్వరూ శుభమంగ
ళములు ఇచ్చిరి కమల చలువ నయ
నములు నిత్యము పరిణయము నీకు ఎలాగ
నమ్మమంటె స్వామి నాకు చెప్పు

ఆటవెలది 3
ఎల్ల లోకములకు ఎట్లు ఆరోగ్యము
వచ్చు అట్టి నీకు వరులు జనులు
ఇస్తు కురులు దేవి నీలా అని వినిన
నమ్మమంటె స్వామి నాకు విడుపు

ఆటవెలది 4
ఎల్ల లోకులకును ఏరి కోరిన కోర్కె
తీరు దర్శనమున తీర్చు నీవు
మరి ముడుపులు నీకు మనుషులు ఇస్తారు
నమ్మమంటె స్వామి నాకు కాసు

ఆటవెలది 5
ఎల్ల లోకములకు ఎరుక నామము శృతి
నీదని మరి తెలిసి నీకు పాట
అన్నమయ్య కీర్తి అంతటి పాడిన
నమ్మమంటె స్వామి నాకు పాట

ఆటవెలది 6
ఎల్ల లోకములకు ఎదన నీ రూపమే
దైవమని తెలిసి అదే అవనికి
తిరుమల అని ఆనతి ఇచట కోవెల
నమ్మమంటె స్వామి నాకు గుడ్డి

ఆటవెలది 7
ఎల్ల లోకములకు నీవు అంతర్యామి
ఉనికి తెలిసి నీది ఊరు వాడ
కొండ గుట్ట ఏల కొండలు ఏడని
నమ్మమంటె స్వామి నాకు వెలితి
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
26-09-2020
03/10/20, 8:25 am - venky HYD: తిరుమల లోని పంచ భేరాలు

ఆటవెలది 1
ఎన్మిది అడుగుల తదేక సాలగ్రామ 
మూలమే విరాట్టు ముందు ఉన్న
అందురు ధ్రువబేరమంత ఖ్యాతీ సదా
వేంకటేశ్వరా నివేధ'రాణి' 

ఆటవెలది 2
నింగి గంగ తీర్థ ఏకాంత అభిషేక
అర్ఘ్య ఒకటి అరల అడుగు రజత
భోగ శ్రీనివాస భాగ్యము మూర్తికి
వేంకటేశ్వరా నివేధ'రాణి' 

ఆటవెలది (3) 
పంచలోహ ప్రతిమ పంట దర్బారులో 
కొలువు శ్రీనివాస కొలుచు మూర్తి 
పంచ అంగ శ్రవణ పంచిన వ్యయములు
వేంకటేశ్వరా నివేధ'రాణి'

ఆటవెలది (4) 
ద్వాదశినకు మాత్రమే ఉత్సవం కార్తి
కాన కూడి కైశికమున ఉగ్ర, 
శ్రీనివాస మూర్తి శ్రీదేవి భూదేవి
వేంకటేశ్వరా నివేధ'రాణి'

ఆటవెలది (5) 
కోవెల బయటందుకో భక్తి ఉత్సవ
శ్రీనివాసమూర్తి సన్నిహితము
పాల్గొనిరిక భక్తి పారును దర్శన
వేంకటేశ్వరా నివేధ'రాణి'
Happy Saturday and stay safe Sunday ya Monday
03-10-2020
10/10/20, 3:18 pm - venky HYD: ఆటవెలది 13
వదలలేను శ్రీనివాసుని నీడను
మరువలేనిది తిరు మంత్ర నామ
నా కలల్లొ కూడ నా వెంట నున్నాడు
నన్ను చేయి పట్టు నడిచి ముందు

ఆటవెలది 14
కనుల వెన్నెల మిల కమలములే రెండు
జంట వీడని ఇల జలజ పెండ్లి
కమ్మని వర నిత్య కళ్యాణ వైభవం
నిష్ట సప్తగిరులు నిహపరములు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
10-10-2020
17/10/20, 8:10 am - venky HYD: ఆటవెలది 15
విశ్వమంత కనులు వీక్షణ చేసెను
చిగురు రంగు రంగు చిత్రమాయె
సంధ్య వేళ తీసె సాయంత్ర వర్ణమై
అగ్ని శిఖలు దివ్య కాంతులైన

ఆటవెలది 16
వాకలే తిరుచ్చి వజ్రకవచ్చాద్య
పైడి భరణములను పైన నూగె
పెద్ద శేషు మీద పెరియాళు ఊరేగి
వాహనంబు నెక్కి వరములివ్వ

ఆటవెలది 17
చిన్న శేషు మీద చిరునవ్వు కురిపిస్తు
ఉదయ వేళనే తిరుమల నాధ, 
బ్రహ్మ కడిగెను పర బ్రహ్మ పాదము నేడు
హంస వాహనంబె హాయిగాను

ఆటవెలది 18
దిగిరి భువికి అంత దేవతలే కోటి
దర్శనముకు స్వామి దర్పణముల
మెరిసి తీరు వీధి మలయ మార్గమునేగి
యభయమిచ్చె నంట యల్లరికును
 వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
17-10-2020
24/10/20, 9:53 am - venky HYD: IMG-20201024-WA0022.jpg (file attached)
24-10-2020
31/10/20, 8:01 am - venky HYD: G
31/10/20, 8:05 am - venky HYD: AUD-20201031-WA0009. (file attached)
31/10/20, 8:06 am - venky HYD: ఆటవెలది 19
సింహ వాహనం రసిక రాజు సేవలు
నేకమై బయటికి నేడు రాక
ముచ్చట పడి మురిసె ముత్యపు పందిరి
కింద మూడొ నాడు కీర్తి నివ్వ

ఆటవెలది 20
కల్పవృక్షము నను కలిసి దీవించగా
బయలుదేరె స్వామి బాధ తీర్చ
సర్వజనుల శాంతి సర్వభూపాల వా
హనము మీద పాప హంతమునకు

ఆటవెలది 21
మోహ వీడ తనువు మోహిని అవతార
పల్లకీని నెక్కి పతి మురిసెను
గరుడ సేవ మెచ్చి ఘనత నొందిన పక్షి
దర్శనమున కర్మ దహన కాదె

ఆటవెలది 22
హనుమ భక్తి మెచ్చి హారిము సేవకు
వరములిచ్చి జన్మ వాహనముల
గమన మందు మేటి గజరాజు మోక్షము
కష్టములను తీర్చె కలియుగమున

ఆటవెలది 23
సూర్య ప్రభము విరిసె సుందర ప్రభువులు
వెలుగు నివ్వ వెళ్లి వీధులన్ని
వెలిగె చంద్ర ప్రభయు వెన్నెల నిచ్చుచు
మురిసి స్వామి వారి ముందు నేను

ఆటవెలది 24
చక్కనైన స్నాన చక్రము పుష్కరి
మునిగి కొంత పాపము కడిగి రిక
అశ్వ వాహనంబు అవతార కల్కిలా
గ తిరుమాడలు తిరగ కట స్వామి
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
31-10-2020
07/11/20, 11:14 am - venky HYD: ఓం! నమో! వేంకటేషాయా!

లైనులన్ని తిరిగి తిరిగి నీ వాకిట చేరితిమి! జీవుల పరమార్థం ఇదేనా స్వామి! 

నీ దర్శనమునకు నిదర్శనము ఆపడమేనా సేవా! స్వామి? 
తిరుమల ఎంత ప్రశాంతంగా ఉన్న తరమడమేనా భక్తి! స్వామి! 

కాపలా కాచితివి ఇంత లోనే ప్రసాదము ఖాళీ మాయా! స్వామి! 
లోపలికి రమ్మంటివి అంతనే తనిఖీ అడిగిన వైనం! స్వామి!

గోవిందా అనిరి భక్తులు అచటనే గొడవ పడిరి, కలియా! స్వామి!
కరములు జోడించి మొక్కిరి, చెప్పులు చేత పట్టిరి, ఇదేమి పరమార్థం స్వామి! 
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
07-11-2020
14/11/20, 7:41 am - venky HYD: ఓం! నమో! వేంకటేశాయ! 

చుక్కలన్ని తెచ్చి మాల కట్టి
     వేద్దామంటే మేఘాలన్ని అడ్డుగా

మేఘాలన్ని మెత్తటి పరుపుగా చుట్టి
      వేద్దామంటే గాలులన్ని వీచగా

చల్లని గాలి వింజామరలతో
      వీద్దామంటే వాన చుక్కలు రాలగా

జలములన్ని తెచ్చి అభిషేకాలు 
      చేద్దామంటే పుష్కరిణి బందుగా

బందైనా సందులో ఆదివరాహుని
      దర్శిద్దామంటే కంచెలు అడ్డుగా

కంచెలు అంచెలంచెలుగా దాటి నీ దరి
      వద్దామంటే ఉద్యోగులు ఆపగా

సన్నిధి చేరి పోని నెమ్మదిగా స్వామి
      చూద్దామంటే మూసిన కనురెప్ప తెరచగా
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
14-11-2020
21/11/20, 7:10 am - venky HYD: ఓం! నమో! వేంకటేశాయ! 

ఉదయ రవి కిరణం నీ పాదములు తాకెను మహా ద్వారమున తూర్పు తిరుమాఢ వీధిన

వెనుకకు పరుగెత్తి భాగ్ సవారీ ఉత్సవము పడమర తిరుమాడ వీధిన

తీర్థ కట్ట వీధులలో లడ్డు ఘుమఘుమలు ఉత్తర తిరుమాడ వీధిన

దక్షిణములు ఆపలేవు అనంతాచార్యులు భక్తి నీకు తప్పలేదు దెబ్బలు దక్షిణ తిరుమాడ వీధిన

ఆకాశరాజు మనసు మమతల పద్మావతి నిచ్చి కళ్యాణం ఆకాశ వీధిన

భూలక్ష్మి దేవి వైకుంఠం వదలి ఘోర తపస్సు చేసె భూమిన

సర్వాంతర్యామి నీవు నడకలు అన్ని దిక్కులు మాయా మోహం నింపి వచ్చె ఏ దిక్కున
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
21-11-2020
28/11/20, 8:07 am - venky HYD: Om! Namo! Venkatesaya! 
ఎన్నెన్ని ఆభరణములన్న నేమి
       భక్తి పెంచు ఒక్క నిజ దర్శనము చాలు

ఎన్ని కొండలున్న నేమి స్థానముకు 
    ఉక్తి పెంచు ఒక్క బండ చాలు

స్వాములు మంత్రములెన్ని చదివిన నేమి
    చిత్త చూపించు నామ జపన చాలు

ఎంత మంది కురులునిచ్చిన నేమి 
     శక్తి చూపించు ఒక్క జడ చాలు

ఎంత మంది ఆడు వారున్న నేమి
       రక్తి పూయించు ఒక్క ఇంతి చాలు

ఎన్నెన్ని ప్రసాదములున్న నేమి
       ఆసక్తి పంచు ఒక్క లడ్డు చాలు

ఎన్నెన్ని వాహనములున్న నేమి 
       యుక్తి మోక్ష పూరించు ఒక్క నావ చాలు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday.
28-11-2020
05/12/20, 7:37 am - venky HYD: ఓం! నమో! వేంకటేశాయ! 

ఎల్ల వేళలో నిన్నే తలచి
అన్ని వైపులా నీ రూపమే చూచితి
నా నీడలా వెన్నంటి ఉంటివే
ఇంద్రజాల మాయేదో వెంటాడిందా


బ్రహ్మ ముహూర్తాన భ్రమరాలు
కీచురాళ్ల సవ్వడి నడుమ
లేవలేక లేచి లెమ్మని ఇంతి
కురులు వింజామరలై వీచెనా

శుభోదయాన సుప్రభాత మై
వినిపించె పక్షుల కిలకిలారావాలు
హాయిగా నిదురలేచె ఉషోదయాన
నీ దర్శనము కోరె అమ్మ పద్మావతి

మిట్ట మధ్యాహ్నం ఆఫీసు పనిలో
నిధానమాయే భోజనంబు
కడుపులో ఆకలి శబ్దాలు
గట్టు మేళమల్లె నిత్య కళ్యాణము

సంధ్యవేళ ఇంటికి వస్తుంటే
బైకు రయ్ మని శబ్దాలు
సామజవర గమన మెడలో
గంటల మల్లె రిథమిక్ గా

రేయి తాంబూలం తరువాత
ముత్యాల హారతి ఘుమఘుమలు
వెంగమాంబ హారతిలా శయనవేళ
ఏకాంత సేవలా మధురముగా

నడిరేయి లోన ఉలికిపడి
భయపడి నిన్నే ధ్యానించి
నీ నామ స్మరణలో హాయిగా
నిదురపోయే చిన్న పిల్లాడిలా
వేం*కుభే*రాణి
05-12-2020
12/12/20, 6:31 am - venky HYD: ఓం! నమో! వేంకటేశాయ! 

వెలుగు నీవే
చీకటి తోలు వెలుగూ నీవే! 

నడక నీవే
నడక వెంట వచ్చు నీడా నీవే! 

నాదము నీవే
నాదము నిండిన స్వరము నీవే! 

కావ్యము నీకే
కావ్యము నిండిన కవితలు నీకే! 

అక్షరము నీకే
అక్షరము నిండిన పాట నీకే! 

పల్లవి నీదే
పల్లవి లోని తాళము నీదే! 

ప్రాసా నీదే
ప్రాస లోని యతి నీదే! 
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
12-12-2020
19/12/20, 7:48 am - venky HYD: ఓం! నమో! వేంకటేశాయ! 

ధర్మ రక్షణకై కలియుగాన
              వెలిసిన స్వామి

ధర్మము నొక పాదము రక్షించు 
              నీ పాదము స్వామి

ధర్మామాచరింప వచ్చు కష్టములను 
              తీసివేయు స్వామి

ధర్మ పాలన చేదున్నను ఫలితము 
              తీపి చేయు స్వామి

ధర్మమెంత నిష్టూరమైన బంధము 
              బలపరుచు స్వామి

ధర్మమున్న నీ చెంత కాపాడును
              కవచమై నా స్వామి

నీవు పాటించు ధర్మము, ఇతరుల 
          అధర్మము స్వామి చూడును
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe 
Sunday ya Monday.
19-12-2020
26/12/20, 6:31 am - venky HYD: ఓం! నమో! వేంకటేశాయ! 

ముత్యాల పందిరి కింద మురిపెముగా ముత్యమై మెరిసే
పద్మావతి మెడలో పావనముగా పగడమై మెరిసే

చెక్కిళ్లపై తళుక్కున మెరుపులా వజ్రమై మెరిసే
గోదాదేవి హారమున గోప్యముగా గోమేధికమై మెరిసే

కోర్కెల రెక్కలెక్కిన గరుడ పచ్చమై మెరిసే
పుణ్య పుష్కరిణిన పుష్కలముగా పుష్యరాగమై మెరిసే

ధ్రువ భేరమే నిలువెత్తు నీలమణి యై మెరిసే
తిరుమల వైభవమే వైకుంఠ వైడూర్యమై మెరిసే

శక్యము లేని భక్తి ఐక్యమై భక్తుడు మాణిక్యమై మెరిసే
నా స్వామి నవ రత్నములు కలిసిన దివ్య రత్నమై మెరిసే
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
26-12-2020
02/01/21, 7:41 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయ! 

ఏడు కొండలు తిరిగి తిరిగి గోవిందా చుట్టు

మొక్కలు మొక్కుబడి తీర్చ లేనివి వేయకు ఒట్టు

నెవరికి తెలుసు తిరుమల దర్శనాల గుట్టు

నీ దర్శనము కనురెప్ప తెరచినంత కని కట్టు

వడలు జిలేబిలు దొరకవు ప్రసాదములు ఎట్లా పట్టు

మానవుని సేవలో మాధవుని భక్తి కని పెట్టు

నిత్య కళ్యాణ వేళ పరవశాన జోడీ కట్టు
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
2/1/21
09/01/21, 8:09 am - venky HYD: ఓం! నమో వేంకటేశాయ! 

భోగ నిద్ర వీడి లెమ్ము యోగ నిద్రలో ఉన్న స్వామిని దర్శించి మనసున వేసుకొమ్ము తిరు స్వామి ముద్ర! 

మబ్బు తెరలు తొలగి గబ్బును శుభ్రముగా చేసికొని స్వామి దర్శనము అబ్బురముగా డబ్బులు లేకున్నా! 

మంచు తెమ్మెరలు తొలగించు కంచు కంఠముతో గోవిందా యంచు గాంచుము స్వామిని పాపములు కరిగించ! 

పాశురములు సుప్రభాతమై నీలోని అసురుని నశింప ఆతురముగా వేంచేయు స్వామికి కరములు జోడించ! 

మాలను కట్టి వేసి మనసు కుసుమాల వనమాలి రక్షించు హృదయ తోటమాలి పాల కడలి వాసా శ్రీనివాస! 

మార్గశిర యందు మోక్ష మార్గమును వెదక ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార ఉత్తమ మార్గమందు నడచి స్వామిని చేర! 

కలి చలిని చంపి మలి విడత దర్శనము చేయ లోకాల పాలించు స్వామి కలియుగ వైకుంఠ వాసా ఓ! వేంకటేశా! 
వేం*కుభే*రాణి
Happy Saturday n stay safe Sunday ya Monday
9/1/21

No comments:

Post a Comment