[25/02, 10:39 AM] venky HYD: Recent fire accidents n Pulwana attack
ముక్కంటివా మూడు కన్నులు మూసుకొంటివా!
విస్పొటనముచే సరిహద్దున రక్షకులనే భక్షించితివా!
మూడో కన్ను తెరిచి బడబాగ్ని కార్చిచ్చు పెట్టితివా!
మనో నేత్రము తెరిపించి మానవత్వం వికసింపవయ్య!
[26/02, 3:06 PM] venky HYD: https://sharechat.com/post/ J73D1xW?referrer=whatsappShare
శివుడు, మూడవ కన్ను తెరిచి ఆజ్ఞాపించి
ఇంద్రుడు వాయు సేనను తరలించి
సైన్యం అగ్ని రుచి చూపించి
మా వంతు ఈశ్వర దరి చేర్పించి
క్షమించడం దేవుని వంతు!
Praying Lord Shiva to give good birth at least in next birth.
[27/02, 6:51 PM] venky HYD: గంగమ్మ తల్లి హాయిగా పారే
గోదావరమ్మ గల గలా పారే
కృష్ణమ్మ ఉరకలు వేసి పారే
రైతన్నకు నీళ్లెన్నో మిగిలి పోయే
[03/03, 6:47 PM] venky HYD: అందరికి శివరాత్రి శుభాకాంక్షలు
మన శైలి మల్లన్న శ్రీశైల శివన్న కావాలా సాక్షి
గణపతి భ్రమరాంబిక మల్లికార్జునేశ్వరా!
పంచ భూతాలను తిప్పేటి రాజ రాజన్నకు
కోడే దూడలను తిప్పడం వేములవాడ రాజ రాజేశ్వరా!
నూటొక్క లింగాల కీసర రామలింగేశ్వరా!
వాయువునే ఆయువుగా ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వరా!
లేపాక్షి బసవయ్య రంకేసి రావయ్య శ్రీ వీరభద్రేశ్వరా!
యాగంటి బసవన్న పెద్దగై రావయ్య శ్రీ ఉమామహేశ్వరా!
గుడిమల్లం అపస్మారపై శివా శ్రీ పరుశ రామేశ్వరా!
నవ నందులు వెలిసిన నంద్యాల శ్రీ మహా నందీశ్వరా!
కోటప్పకొండ ఆనందవల్లి త్రికూట శ్రీ కోటేశ్వరా!
గుహలోని శివ నామమే కపిల తీర్ధ శ్రీ కపిలేశ్వరా!
కొమరవోలు మల్లన్న ఐనవోలు మల్లన్న దేవరగట్ట మల్లన్న!
నీవు లేని ఊరు చూపించగలవా శివా శ్రీ లింగేశ్వరా!
వేం*కుభే*రాణి
[04/03, 7:13 PM] venky HYD: శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టేనా, మరి
ఎవరి ఆజ్ఞతో ఇన్నిన్ని కిరాతకాలు జరుగునో, సరి
అర్జునుడికి కిరాతకుడై అస్త్రములు ఇచ్చి గురువు, విరి
మానవులు పాశువులై కిరాతకమే ఆయుధములు చేసిరి
పరమ శివుడు ఆజ్ఞాపించాడు, ఆది శంకరులు చెప్పగా ఈ జ్యోతిర్లింగ ద్వాదశం నే రచించాను.
Venkatesh K E:
షోడశ కళల అభయ ప్రదాత లింగం!
చంద్ర ప్రతిష్ఠిత పార్థివ జ్యోతిర్లింగం!
మృత్యుంజయ మహా మంత్ర లింగం!
సౌరాష్ట్రే సోమనాథ జ్యోతిర్లింగం!!
ఆచంద్రతారార్క కీర్తి అభయప్రదాత లింగం!
రుద్ర గణాధిపత్య శక్తి లింగం!
చంద్రావతి మల్లెపూల నిత్య లింగం!
శ్రీశైలస్యే మల్లికార్జున జ్యోతిర్లింగం!!
పూర్ణాయుర్దాయ అభయ ప్రదాత లింగం!
రుద్ర యాగ కుండ మహా సిద్ధి లింగం!
రత్నమాల దూషణ రాక్షస వందిత లింగం!
ఉజ్జయినే మహాంకాళేశ్వర జ్యోతిర్లింగం!
ప్రణవ నాద ప్రదాయక ప్రాణాయ లింగం!
వింధ్య స్తాపిత ఓంకార యంత్ర లింగం!
ॐ ఆకారా మాంధాత ద్వీప లింగం!
మామ్లేశ్వరే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం!!
సర్వ రోగ నివారక బాబా లింగం!
రావణ ఆఃశిర త్యాగ ఫల ఆత్మలింగం!
ఏక వింశతి దేవం; నిధనం చితాభూమి లింగం!
పరలే వైద్యనాతేశ్వర జ్యోతిర్లింగం!!
భక్త జన రక్షక మట్టి లింగం!
కామరూప సుదక్షిణ రాజు రక్షణ లింగం!
కర్కటి పుత్ర భీమరాక్షస సంహార లింగం!
డాకిన్యే భీమ శంకర జ్యోతిర్లింగం!!
బ్రహ్మ హత్య పాప వినాశక లింగం!
రామ లింగేశ్వరం సీత సైకత లింగం!
కైలాస లింగం హనుమదీశ్వర లింగం!
సేతుబంధే రామ లింగేశ్వర జ్యోతిర్లింగం!!
దీన భక్త జన భాందవ లింగం!
దారుక హతః సర్ప జ్వాలా లింగం!
సుప్రియుడు రక్షక నాగ మణియే లింగం!
దారుకవనే నాగ లింగేశ్వర జ్యోతిర్లింగం!!
సృష్టి రక్షక ప్రదాత లయ లింగం!
శూలాగ్రాన కాపాడిన కాశీ లింగం!
అఘోర జన్మరహిత మణికర్ణిక లింగం!
అన్నపూర్ణే కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం!!
గోహత్య మహా పాతక వినాశక లింగం!
శూర్పణఖ నాసికా లక్ష్మణ ఖండ: లింగం
దర్భపోచ అవుదూడ హతః గోదావరి పునీతలింగం!
గౌతమితటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం!!
కైవల్య మోక్ష ప్రదాత రుద్ర లింగం!
యమునొత్రి గంగొత్రి జల పావన లింగం!
గర్భావాస నరక విమోచన కైవల్య లింగం!
హిమాలయే కేదారేశ్వర జ్యోతిర్లింగం!!
సద్గుణ శీల సంపత్తి ప్రదాత లింగం!
సుదేహ దుష్టకార్యాన్ని క్షమించిన లింగం!
అహల్య భాయి హోల్కర్ పునః నిర్మిత లింగం!
శివాలయే ఘృష్ణ లింగేశ్వర జ్యోతిర్లింగం!!
ద్వాదశ జ్యోతిర్లింగ స్మరనే
సప్త జన్మ పాప హరణే!
సర్వ జ్యోతిర్లింగ దర్శనే
ఇష్ట కార్య సాధనే
అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
వేం*కుభే*రాణి
No comments:
Post a Comment