Saturday, 9 March 2019

Womens day

[08/03/17, 12:55 PM] venky HYD: 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఆది గురువు అఆలు నేర్పిన మాతృ మూర్తి సరస్వతి దేవివి నువ్వు! 
మొదటి Bank పైసా పైసా కూడ బెట్టిన పొదుపు లక్ష్మివి నువ్వు! 
ముందుండే సైనికుడిలా ఎల్ల వేళలా తోడు నీడలా ఉండే శక్తివి నువ్వు!

మంత్రములకు మూలము గాయత్రీ దేవి నువ్వు! 
తంత్రములకు మూలము మహా కాళి నువ్వు! 
యంత్రములకు మూలము మహా లక్ష్మి నువ్వు! 

Wishes to all Girls n Women, who worked and working for sustainability of mankind.

8/3/2018, 9:10 AM] venky HYD: 
For all Men, keep Woman happy. You n your family happy. Society n World will be happy.

యత్ర నారీ సంతోషమే
తత్ర లోక ఆనందమే!

అమ్మ నీ కోసం నాన్నతో ఫైట్ చేస్తుంది!
అక్క నీ కోసం ఇతరులతో ఫైట్ చేస్తుంది!
చెల్లి నీ కోసం తనతో ఫైట్ చేస్తుంది!
భార్య నీ కోసం నీతోనే ఫైట్ చేస్తుంది!

Happy WOMEN'S DAY.

[8/3/2017, 10:55 PM] venky HYD: 
*W*ishes to all Women
*O*f World worked for
*M*ankind welfare 
*E*ndlessly, effortlessly
*N*urturing human beings.  

*HAPPY WOMEN'S DAY*
[8/3/2017, 3:38 PM] venky HYD:
 కను రెప్పై నిను కాచుకోనా!
ఇంటి గడపై నిను కాపాడుకోనా!
గుండె చప్పుడై నీతో ఉండి పోనా!

ప్రేమ తో ప్రేమ కు!
*HAPPY BIRTHDAY*

మొగలి పువ్వు లాంటి మొగుడినైతా, ప్రేమించవా !

పనస పండు లాంటి పిల్లాడినైతా, లాలించవా !

9-3-19
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ఆది గురువు అఆలు నేర్పిన మాతృ మూర్తి సరస్వతి దేవివి నువ్వు!
మొదటి Bank పైసా పైసా కూడ బెట్టిన పొదుపు లక్ష్మివి నువ్వు!
ముందుండే సైనికుడిలా ఎల్ల వేళలా తోడు నీడలా ఉండే శక్తివి నువ్వు!

మంత్రములకు మూలము గాయత్రీ దేవి నువ్వు!
తంత్రములకు మూలము మహా కాళి నువ్వు!
యంత్రములకు మూలము మహా లక్ష్మి నువ్వు!

Wishes to all Girls n Women, who worked and working for sustainability of mankind.

8/3/2020
Almost all poets and singers written about Sisters, Mother, etc., who are part n parcel of our family. So I tried about relations who comes from other family but own us. 

కోడలు కుడికాలి పాదధూళి 
ఇంట లక్ష్మి దేవి కూడా మేటి! 

వదినమ్మ సీతలా ఉండి తల్లి 
తండ్రి గుర్తుకు రారు ఏ పాటి! 

మరదలు నోట బావా పిలుపు
బారుల బంగారము సరి సాటి! 

అత్తమ్మ చేతిలోని మాటలిక
పెరిగిన సంస్కారం పెద్ద పాటి! 

Happy International Women's Day wishes.


[03/03/21, 10:34 PM] venky HYD: 
యుద్ధ భూమి చెంత సాహసమును నిచ్చితివయ్య 
స్త్రీల కేల ఇంత ధైర్యములును నిచ్చితివయ్య! 

వంటింటి కుందేలు కాదు విమానాల రాణి
మగువకేల వింత ఓపికకును నిచ్చితివయ్య! 

బలమైన బంధము చేత బంగారు కుటుంబం
ముగ్ధ లేల నింత అందలమును నిచ్చితివయ్య! 

ప్రతి అమ్మయు థెరిసా ప్రతి అక్క నివేదితలా
భూమి తల్లి కింత సేవకులును నిచ్చితివయ్య

తండ్రి గర్వము ఇంతివి పతి ఆత్మ విశ్వాసం
కొడుకు ధైర్యము నంతటి మనసును నిచ్చితివయ్య
[06/03/21 10:40 PM] venky HYD: 
ఎన్ని సెంట్లు కొట్టుకున్న నేమి
నీ వ్యక్తిత్వపు పరిమళాల ముందు

ఎంత మంద మేకప్ వేసుకున్న నేమి
నీ పెదవుల చిరునవ్వు ముందు

ఎన్ని ఆభరణాలు పెట్టుకున్న నేమి
నీ మాటల భూషణాల ముందు

ఎన్ని హొయలున్న నేమి
నీ మంచి నడవడిక ముందు

ఎన్నెన్ని పాటలు పాడిన నేమి
నీ మెట్టెల సవ్వడుల ముందు

ఓ నారి! నీవు స్వయముగానే అందమైన దానివి, ముస్తాబైన మనసు మరింత శోభనిస్తుంది. 
International Women's Day wishes to all.
[07/03/21, 10:04 AM] venky HYD: 
ఇంటినే కాదు విమానము దారిలో పెట్టగల నాటి బ్యూటి!
వ్యక్తిత్వ పరిమళాల ముందు అందమైన మనసు దాటి బ్యూటి! 
అష్టావధానాలు చేయు పండితులు కన్న మిన్న సంసార
సంతాన ఉద్యోగ భాద్యత నెరవేర్చుని ఘనాపాటి బ్యూటి!
[08/03/21 10:38 AM] venky HYD: 
బంధనాల సంకెళ్లను తెంచు
బంధాల సంఖ్యను పెంచు

కుటుంబంలో స్వేచ్ఛగా ఉండు
ఎగరాటానికి రెక్కలు ఇవ్వు

Monday, 4 March 2019

Shiva Lord

[25/02, 10:39 AM] venky HYD: Recent fire accidents n Pulwana attack

ముక్కంటివా మూడు కన్నులు మూసుకొంటివా! 
విస్పొటనముచే సరిహద్దున రక్షకులనే భక్షించితివా! 
మూడో కన్ను తెరిచి బడబాగ్ని కార్చిచ్చు పెట్టితివా! 
మనో నేత్రము తెరిపించి మానవత్వం వికసింపవయ్య!
శివుడు, మూడవ కన్ను తెరిచి ఆజ్ఞాపించి
ఇంద్రుడు వాయు సేనను తరలించి
సైన్యం అగ్ని రుచి చూపించి
మా వంతు ఈశ్వర దరి చేర్పించి

క్షమించడం దేవుని వంతు! 

Praying Lord Shiva to give good birth at least in next birth.
[27/02, 6:51 PM] venky HYD: గంగమ్మ తల్లి హాయిగా పారే
గోదావరమ్మ గల గలా పారే
కృష్ణమ్మ ఉరకలు వేసి పారే
రైతన్నకు నీళ్లెన్నో మిగిలి పోయే
[03/03, 6:47 PM] venky HYD: అందరికి శివరాత్రి శుభాకాంక్షలు

మన శైలి మల్లన్న శ్రీశైల శివన్న కావాలా సాక్షి 
గణపతి భ్రమరాంబిక మల్లికార్జునేశ్వరా! 

పంచ భూతాలను తిప్పేటి రాజ రాజన్నకు
కోడే దూడలను తిప్పడం వేములవాడ రాజ రాజేశ్వరా! 

నూటొక్క లింగాల కీసర రామలింగేశ్వరా! 
వాయువునే ఆయువుగా ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వరా! 

లేపాక్షి బసవయ్య రంకేసి రావయ్య శ్రీ వీరభద్రేశ్వరా! 
యాగంటి బసవన్న పెద్దగై రావయ్య శ్రీ ఉమామహేశ్వరా! 

గుడిమల్లం అపస్మారపై శివా శ్రీ పరుశ రామేశ్వరా! 
నవ నందులు వెలిసిన నంద్యాల శ్రీ మహా నందీశ్వరా! 

కోటప్పకొండ ఆనందవల్లి త్రికూట శ్రీ కోటేశ్వరా! 
గుహలోని శివ నామమే కపిల తీర్ధ శ్రీ కపిలేశ్వరా! 

కొమరవోలు మల్లన్న ఐనవోలు మల్లన్న దేవరగట్ట మల్లన్న! 
నీవు లేని ఊరు చూపించగలవా శివా శ్రీ లింగేశ్వరా! 
వేం*కుభే*రాణి
[04/03, 7:13 PM] venky HYD: శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టేనా, మరి
ఎవరి ఆజ్ఞతో ఇన్నిన్ని కిరాతకాలు జరుగునో, సరి
అర్జునుడికి కిరాతకుడై అస్త్రములు ఇచ్చి గురువు, విరి
మానవులు పాశువులై కిరాతకమే ఆయుధములు చేసిరి
 
 
పరమ శివుడు ఆజ్ఞాపించాడు, ఆది శంకరులు చెప్పగా ఈ జ్యోతిర్లింగ ద్వాదశం నే రచించాను.

Venkatesh K E:

షోడశ కళల అభయ ప్రదాత లింగం!
చంద్ర ప్రతిష్ఠిత పార్థివ జ్యోతిర్లింగం!
మృత్యుంజయ మహా మంత్ర లింగం!
సౌరాష్ట్రే సోమనాథ జ్యోతిర్లింగం!!

ఆచంద్రతారార్క కీర్తి అభయప్రదాత లింగం!
రుద్ర గణాధిపత్య శక్తి లింగం!
చంద్రావతి మల్లెపూల నిత్య లింగం!
శ్రీశైలస్యే మల్లికార్జున జ్యోతిర్లింగం!!

పూర్ణాయుర్దాయ అభయ ప్రదాత లింగం!
రుద్ర యాగ కుండ మహా సిద్ధి లింగం!
రత్నమాల దూషణ రాక్షస వందిత లింగం!
ఉజ్జయినే మహాంకాళేశ్వర జ్యోతిర్లింగం!

ప్రణవ నాద ప్రదాయక ప్రాణాయ లింగం!
వింధ్య స్తాపిత ఓంకార యంత్ర లింగం!
ॐ ఆకారా మాంధాత ద్వీప లింగం!
మామ్లేశ్వరే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం!!

సర్వ రోగ నివారక బాబా లింగం!
రావణ ఆఃశిర త్యాగ ఫల ఆత్మలింగం!
ఏక వింశతి దేవం; నిధనం చితాభూమి లింగం!
పరలే వైద్యనాతేశ్వర జ్యోతిర్లింగం!!

భక్త జన రక్షక మట్టి లింగం!
కామరూప సుదక్షిణ రాజు రక్షణ లింగం!
కర్కటి పుత్ర భీమరాక్షస సంహార లింగం!
డాకిన్యే భీమ శంకర జ్యోతిర్లింగం!!

బ్రహ్మ హత్య పాప వినాశక లింగం!
రామ లింగేశ్వరం సీత సైకత లింగం!
కైలాస లింగం హనుమదీశ్వర లింగం!
సేతుబంధే రామ లింగేశ్వర జ్యోతిర్లింగం!!

దీన భక్త జన భాందవ లింగం!
దారుక హతః సర్ప జ్వాలా లింగం!
సుప్రియుడు రక్షక నాగ మణియే లింగం!
దారుకవనే నాగ లింగేశ్వర జ్యోతిర్లింగం!!

సృష్టి రక్షక ప్రదాత లయ లింగం!
శూలాగ్రాన కాపాడిన కాశీ లింగం!
అఘోర జన్మరహిత మణికర్ణిక లింగం!
అన్నపూర్ణే కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం!!

గోహత్య మహా పాతక వినాశక లింగం!
శూర్పణఖ నాసికా లక్ష్మణ ఖండ: లింగం
దర్భపోచ అవుదూడ హతః గోదావరి పునీతలింగం!
గౌతమితటే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం!!

కైవల్య మోక్ష ప్రదాత రుద్ర లింగం!
యమునొత్రి గంగొత్రి జల పావన లింగం!
గర్భావాస నరక విమోచన కైవల్య లింగం!
హిమాలయే కేదారేశ్వర జ్యోతిర్లింగం!!

సద్గుణ శీల సంపత్తి ప్రదాత లింగం!
సుదేహ దుష్టకార్యాన్ని క్షమించిన లింగం!
అహల్య భాయి హోల్కర్ పునః నిర్మిత లింగం!
శివాలయే ఘృష్ణ లింగేశ్వర జ్యోతిర్లింగం!!

        ద్వాదశ జ్యోతిర్లింగ స్మరనే
        సప్త జన్మ పాప హరణే!
       సర్వ జ్యోతిర్లింగ దర్శనే
         ఇష్ట కార్య సాధనే

అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
        వేం*కుభే*రాణి