Tuesday, 16 April 2024

Vasavi Matha Vratam

ఓం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరైనమః దీపారాధన అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాంగతో పివా! యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష;పుండరీకాక్ష;పుండరీకాక్ష; ఆచమ్యా కేశవాయస్వాహ నారాయణాయస్వాహ మాధవాయస్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః right nostril ఓం మధుసూదనాయ నమః left nostril ఓం త్రివిక్రమాయ నమః mouth ఓం వామనాయ నమః ఓం శ్రీదరాయ నమః folded hands ఓం హృషికేశాయ నమః right lap ఓం పద్మనాభాయ నమః left lap ఓం దామోదరాయ నమః fore head ఓం సంకర్షణాయ నమః chin ఓం వాసుదేవాయ నమః right cheek ఓం ప్రద్యుమ్నాయ నమః left cheek ఓం అనిరుద్దాయ నమః right eye ఓం పురుషోత్తమాయ నమః left eye ఓం అధోక్షజాయ నమః right ear ఓం నారసింహాయ నమః left ear ఓం అచ్యుతాయ నమః novel ఓం జనార్ధనాయ నమః heart ఓం ఉపేంద్రాయ నమః head ఓం హరయే నమః right shoulder ఓం శ్రీ కృష్ణాయ నమః left shoulder “సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే” శుక్లాంభరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోప శాంతయే! గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారం తత్ర దేవతాహ్నివ లాంఛనం! ఆచమ్యా కేశవాయస్వాహ నారాయణాయస్వాహ మాధవాయస్వాహ ఓం గోవిందాయ నమః ఉత్తిష్టంతు భూత పిశాచ! ఏతే భూమి భారకః! ఏతేషామవిరోధేన! బ్రహ్మ కర్మ సమారభే! ఓం భూః..... సంకల్పం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా! శ్రీ కన్యకాపరమేశ్వరి ముద్దిశ్యై! శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం! శుభేశుభేన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమనస్యే! ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరుర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యే ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ వైశ్య హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్ర మాసేన క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణ పక్షే పాడ్యమి తిథౌ ... వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీ ఆత్రేయస ఋషి అర్బనానస శ్వావాశ్వేతి త్ర్యార్షేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రః సంకేత నామ ఎలిశెట్ల గోత్ర శ్రీ రాజ శ్రేష్ఠి, రాజ ముఖి దంపత ఆత్మార్పణ పూర్వీక నామ స్మరణే అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ కన్యకాపరమేశ్వరి ముద్దిశ్యై శ్రీ కన్యకాపరమేశ్వరి దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కలశ పూజ తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పైర్భ్యైశ్చ శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద స్సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః | గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి | నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు || ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన) పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి) కుడి చేతిలో తమలపాకు తీసికొని దేవి విగ్రహం పైన దేవి సర్వ జగన్మాథే యావత్పూజవసానకం తావత్త్యం ప్రీతి భావేన పీఠేస్మిన్ సన్నిధింకురు శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః స్థిరాభవ,వరదాభవ,సుముఖాభవ,సుప్రసన్నాభవ, అభిముఖాభవ స్థిరాసనం కురు నమస్కారము చేసి దేవి చెంత అక్షతలు ఉంచాలి ధ్యానం గౌరీ సువర్ణ వర్ణాభ్యాం స్వర్ణ పద్మ నివాసినీం పాశాంకుశధరాభీతి దదానం శివవల్లభాం శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కారము) ఆవాహనం అగచ్చాగచ్చా దేవి త్వం సర్వ మంగళదాయిని శ్రద్దాశక్తి సమా యక్త ధ్యాయామి పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (పూలు అక్షింతలు) సింహాసనం విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్ర పర్యంక శోభితమ్ సింహాసనమిదం దాస్యామి శుభలోచని! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః రత్న ఖచిత సింహాసనం సమర్పయామి! అర్ఘ్యం గంగాజల సమాయుక్తం సుగంధ గంధ సంయుతం గృహాణార్ఘ్యం మయాదత్తం మంగళం కురుమే శివే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాద్యం పుణ్య తీర్థం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం పాద్యంచ ప్రతిగృహ్ణతు శ్రీ కన్యకాపరమేశ్వరి నమోస్తుతే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః పాద్యయో పాద్యం సమర్పయామి! ఆచమనం సర్వతీర్థ సముద్భూతం పవిత్రం విమలం జలం గృహాణాచమనం దేవి సర్వదేవ నమస్కృతే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం గంగాజలం మయా నీతం మహాదేవసిరః స్థితం! శుద్ధోదకస్నానమిదం గృహాణ సురపూజితే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః స్నానం సమర్పయామి (తమలపాకు తో దేవి పటము పై నీళ్లు చిలకరించుము) స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి శుద్ధోదకస్నానం గంగాజలం సమానీతం సర్వతీర్థ సముద్బవం! స్నానార్థంచ గృహాణత్వం సర్వకామఫలప్రదే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి వస్త్రం దివ్యాంబరం సమానీతం విచిత్రం చోత్తరీయకం! గృహాణత్వం మయాదేవి సర్వసౌభాగ్యదాయినీ! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం కకారార్థే కాలహంత్రీ కామితార్థ ప్పదాయిని! యజ్ఞోపవీతం దేవేరి స్వీకురుప్వమయార్జితమ్! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణం తేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలః ! విభూషణాన్య మూలాని గృహాణ ఋషి పూజితే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆభరణాని సమర్పయామి గంధం శ్రీఖండ చందనం చైవ కర్పూరాగరు సంయుతం! విలేపనం సురశ్రేష్ఠి ప్రీత్యర్థం గృహ్యతాం! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః దివ్య శ్రీ చందనం ధారయామి అక్షతలు అక్షతాన్ ధవళాన్ రమ్యా హరిద్రా సంయుతాన్ శుభాన్! అనుగృహ్ణాతుమే దేవి వాంఛితార్థ ఫలప్రదే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః అక్షతాన్ సమర్పయామి హరిద్ర హరిద్రాచ మయానీత దేవి కళ్యాణ దాయిని! సౌభాగ్య వర్ధనీం నిత్యం గృహాణ శివవల్లభే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః హరిద్రాం సమర్పయామి కుంకుమ కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమ్! గృహాణేదం మహాదేవి శాంతిరస్తు సదా మమ! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః కుంకుమ సమర్పయామి పుష్పం శతపత్రైర్జాతి కుసుమైః మల్లికాది మనోహరై! కేతకీ కరవీరశ్చ అర్చయామి హరప్రియే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః పుష్పై పూజయామి అథాంగపూజ ఓం ఉమాయై నమః పాదౌ పూజయామి ఓం పార్రత్యై నమః గుల్ఫౌ పూజయామి ఓం జగన్మాత్రే నమః జంఘే పూజయామి ఓం సర్వమంగళాయై నమః జానునీ పూజయామి ఓం జగత్ప్రతిష్ఠాయై నమః ఊరూ పూజయామి ఓం మూలప్రకృతయే నమః కటిం పూజయామి ఓం శివాయై నమః నాభిం పూజయామి ఓం అంబికాయై నమః ఉదరం పూజయామి ఓం అన్నపూర్ణాయై నమః హృదయం పూజయామి ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి ఓం వరప్రదాయై నమః ముఖం పూజయామి ఓం శివ సుందర్యై నమః కర్ణద్వయం పూజయామి ఓం సుస్వరూపాయై నమః నాసికాద్వయం పూజయామి ఓం రుద్రాణ్యై నమః లలాటం పూజయామి ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః సర్వాంగాణి పూజయామి శ్రీ కన్యకాపరమేశ్వరి అష్టోత్తర శతనామవళి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం శ్రీ వాసవాంబాయై నమ: ఓం శ్రీ కన్యకాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం ఆదిశక్త్యై నమః ఓం కరుణాయై నమః ఓం దేవ్యై నమః ఓం ప్రకృతి రూపిణ్యై నమః ఓం విధాత్రేయై నమః ఓం విధ్యాయై నమః ఓం శుభాయై నమః ఓం ధర్మ స్వరూపిణ్యై నమః ఓం వైశ్య కులోద్భావాయై నమః ఓం సర్వస్తయై నమః ఓం సర్వజ్ఞయై నమః ఓం నిత్యాయై నమః ఓం త్యాగ రూపిణ్యై నమః ఓం భధ్రాయై నమః ఓం వేదావేద్యాయై నమః ఓం సర్వ పూజితాయై నమః ఓం కుసుమ పుత్రికాయై నమః ఓం కుసుమాన్ నంధీ వత్సలయై నమః ఓం శాంతాయై నమః ఓం ఘంబీరాయై నమః ఓం శుభాయై నమః ఓం సౌంధర్య హృదయయై నమః ఓం సర్వహితాయై నమః ఓం శుభప్రధాయై నమః ఓం నిత్య ముక్తాయై నమః ఓం సర్వ సౌఖ్య ప్రధాయై నమః ఓం సకల ధర్మోపాధేశాకారిణ్యై నమః ఓం పాపహరిణ్యై నమః ఓం విమలయై నమః ఓం ఉదారాయై నమః ఓం అగ్ని ప్రవేసిన్యై నమః ఓం ఆదర్శ వీరమాత్రే నమః ఓం అహింసస్వరూపిణ్యై నమః ఓం ఆర్య వైశ్యా పూజితయై నమః ఓం భక్త రక్ష తత్పరయై నమః ఓం ధుష్ట నిగ్రహయై నమః ఓం నిష్కలాయై నమః ఓం సర్వ సంపత్ ప్రధాత్రే నమః ఓం దారిధ్ర ధ్వంశిన్యై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నయై నమః ఓం లీలా మానస విగ్రహయై నమః ఓం విష్ణువర్ధన సంహారికాయై నమః ఓం సుగుణ రత్నాయై నమః ఓం సాహసో సౌంధర్య సంపన్నాయై నమః ఓం సచిదానంద స్వరూపాయై నమః ఓం విశ్వరూప ప్రదర్శిణ్యై నమః ఓం నిగమ వేదాయై నమః ఓం నిష్కమాయై నమః ఓం సర్వ సౌభాగ్య దాయిన్యై నమః ఓం ధర్మ సంస్థాపనాయై నమః ఓం నిత్య సేవితాయై నమః ఓం నిత్య మంగళాయై నమః ఓం నిత్య వైభవాయై నమః ఓం సర్వోమాధిర్ముక్తాయై నమః ఓం రాజారాజేశ్వరీయై నమః ఓం ఉమాయై నమః ఓం శివపూజ తత్పరాయై నమః ఓం పరాశక్తియై నమః ఓం భక్త కల్పకాయై నమః ఓం జ్ఞాన నిలయాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం శివాయై నమః ఓం భక్తి గమ్యాయై నమః ఓం భక్తి వశ్యాయై నమః ఓం నాధ బింధు కళా తీతాయై నమః ఓం సర్వోపద్ర నివారిన్యై నమః ఓం సర్వ స్వరూపాయై నమః ఓం సర్వ శక్తిమయ్యై నమః ఓం మహా బుధ్యై నమః ఓం మహసిద్ధ్యై నమః ఓం సహృదాయై నమః ఓం అమృతాయై నమః ఓం అనుగ్రహ ప్రధాయై నమః ఓం ఆర్యయై నమః ఓం వసు ప్రదాయై నమః ఓం కళావతాయై నమః ఓం కీర్తి వర్ధిణ్యయై నమః ఓం కీర్తిత గుణాయై నమః ఓం చిదానందాయై నమః ఓం చిదా ధారాయై నమః ఓం చిదా కారాయై నమః ఓం చిదా లయయై నమః ఓం చైతన్య రూపిణ్యై నమః ఓం యజ్ఞ రూపాయై నమః ఓం యజ్ఞఫల ప్రదాయై నమః ఓం యజ్ఞ ఫల దాయై నమః ఓం తాపత్రయ వినాశిన్యై నమః ఓం శ్రేష్టయ నమః ఓం శ్రీయుథాయ నమః ఓం నిరంజనాయా నమః ఓం ధీన వత్సలాయై నమః ఓం దయా పూర్ణాయ నమః ఓం తపో నిష్టాయ నమః ఓం గుణాతీతాయై నమః ఓం విష్ణు వర్ధన వధన్యై నమః ఓం తీర్థ రూపాయై నమః ఓం ప్రమోధ దాయిన్యై నమః ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం భగవత్యై నమః ఓం అపార సౌఖ్య దాయిన్యై నమః ఓం ఆశ్రిత వత్సలాయై నమః ఓం మహా వ్రతాయై నమః ఓం మనొరమాయై నమః ఓం సకలాబీష్ట ప్రదాయిన్యై నమః ఓం నిత్య మంగళ రూపిణ్యై నమః ఓం నిత్యోత్సవాయై నమః ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యై నమః శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం సంపూర్ణం! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపం దశాంగం గుగ్గులం ధూపం ఉత్తమం గంధ సంయుతం! తవ ప్రియార్థమానీతం గృహాణ పరమేశ్వరి! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ధూపమాఘ్రాపయామి దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నానాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్యాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరవల్లభే! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం నమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం! ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్దాచమనీయం సమర్పయామి నీరాజనం పంచవర్తి సమాయుక్తం స్వామ కర్పూర సంయుత! నీరాజన మిదందేవి గృహాణ హరవల్లభే! శ్లో ।। కైలసాచలసన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహా స్తంభోద్యన్ మణిమంటపే సురతరుప్రాంతే చ సింహసనే । ఆసీనాం సకలామరార్చితపదాం భక్తార్తివిధ్వంసినీం వందే వాసవకన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికామ్ । శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మంత్ర పుష్పం (పూలు అక్షతలు తీసికొని నిలబడి, చదివిన తరువాత దేవి పాదాల చెంత ఉంచాలి) నమస్తే వాసవీదేవి నమస్తే విశ్వపావని నమస్తే వ్రతసంబద్దే కౌమాత్రే తే నమో నమః నమస్తే భయసంహారి నమస్తే భవనాశిని నమస్తే భాగ్యదాదేవి వాసవి తే నమో నమః నమస్తే అద్భుతసంధానే నమస్తే భద్రరూపిణి నమస్తే పద్మపత్రాక్షి సుందరాంగి నమో నమః నమస్తే విబుధానందా నమస్తే భక్తరంజని నమస్తే యోగసంయుక్తే వణిక్కన్యే నమో నమః నమస్తే బుధసంసేవ్యే నమస్తే మంగళప్రదే నమస్తే శీతలాపాంగి శంకరి తే నమో నమః నమస్తే తే జగన్మాత నమస్తే కామదాయిని నమస్తే భక్తనిలయే వరదే తే నమో నమః నమస్తే సిద్దసంసేవ్యే నమస్తే చారుహాసిని నమస్తే అద్భుతకల్యాణి శర్వాణి తే నమో నమః: నమస్తే భక్తసంరక్షే దీక్షా సంబద్ధకంకణే నమస్తే సర్వకామ్యార్థ వరదే తే నమో నమః దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామార్థసంపదాన్ లభతే నాత్ర సందేహో దేహంతే ముక్తి మాన్ భవేత్ శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారము యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే! పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపాసంభవః! త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే! అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ! తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష కన్యకాపరమేశ్వరి! శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునఃపూజ శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః ఛత్రం ఆచ్ఛాదయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా నారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, మంత్రోపచార, దేవోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి క్షమా ప్రార్థన ఆవాహనం న జానామి నజానామి విసర్జనమ్! పూజాంచైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి! మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి! యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే! నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్! అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవతీ సర్వాత్మికా శ్రీ కన్యకాపరమేశ్వరి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు! శ్రీ కన్యకాపరమేశ్వరి ప్రసాదం శిరసా గృహ్ణామి (పూజాక్షతలు పుష్పములు శిరస్సు పై ఉంచుకొనవలెను) ఏతత్ ఫలం శ్రీ కన్యకాపరమేశ్వరి అర్పణమస్తు. ఉద్వాసన యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః! తాని ధర్మాణి ప్రథమాన్యాసన్! తేహనాకం మహిమానస్సచంతే! యత్రపూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ కన్యకాపరమేశ్వర్యైనమః యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం వునరాగమనాయచ. భూదేవి స్తుతి విష్ణు శక్తి సముత్పన్నే శంక వర్ణ మహితలే అనేక రత్న సంభూతే భూమి దేవి నమోస్తుతే! సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే