Thursday, 24 August 2023

Adoni Tour

Urukunda Must visit place, when we come to Adoni. తన పల్లకి కదలకపోతే రాఘవేంద్ర స్వామి కూడా వచ్చి దర్శించినారు. Lot of changes (since 2 years) taken place in Urukunda. Centuries ago Eranna, devotee of Lord Narasimha used to meditate under the Peepal tree. 40 years back, we used to make ప్రదక్షిణ around the tree. Now it's a scene far off. మూడు గడపల దూరం పెరిగి మూడు నామాలు గుర్తుకు వచ్చాయి.
తరువాత కొన్ని సంవత్సరాలకు పెరిగిన భక్తులతో పాటు అవధులు పెరిగాయి. చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేయలేక పోయాం. చిన్న ప్రహరిలో వెళ్లి కట్ట దగ్గర పూజ చేయించుకొని వెళ్లే వాళ్లం. కరోనా పుణ్యమా అని కరుణించు మా ఇంటి ఇలవేల్పుకు మధ్యన ఇంకొ గడప (ప్రహరి బయట నుండి) దర్శనము చేసుకున్నాము. నేడు అదే దర్శనము రు! 100 ఇస్తే గాని దొరకదు.
25, 10 రుపాయల దర్శనము ఇంకొ గడప దూరము పెరిగింది, నేడు అదిగో అల్లదిగో అన్నట్లు
పెద్ద గాలి గోపురాలు వచ్చినాయి భక్తునికి భగవంతునికి అంతరము కూడా. అంతరంగమున చూడ
రణమండల ఆంజనేయ స్వామి
ఆదోనిలో ఎక్కడ నుండి చూచినా కనపడుతుంది రణమండల కొండ మొదట కొండ కింద శ్రీ వేంకటేశ్వరుని ఆలయం, విశాలమైన ప్రాంగణం కొద్దిగా మలుపు దగ్గర వీరభద్ర స్వామి ఆలయం,తరువాత మంగరాయ ఆంజనేయ స్వామి (మఠము ఉన్నది, సంవత్సరీకాలు జరుపుతారు ఇచట) ఇంకొ మలుపు,కొద్దిగా పైకి రామజల చెరువు కట్ట ఆంజనేయ స్వామిని దర్శించాము.
ఇంకాస్త కొండ పైకి వెళితే స్వయంభూ ఆది పూజ్య మహా గణపతి దర్శనము
తరువాత కొద్ది దూరంలో Music pillars (you can see స రి గ మ ప ద ని స pillars in Suchindram, near Kanyakumari) శిథిలమైనా వినిపిస్తాయి చెవి ఆనించి మీటితే.
ఆకాశంలో సూర్యుని చుట్టూ హరివిల్లు
సమయానుభావం వల్ల జైన మందిరం చూడలేక పోయాము. ఇంకాస్త వెళితే కొండ ప్రారంభం రాఘవేంద్ర స్వామి పాదుకలను మొక్కి, ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్లాము.
మధ్యలో మునీశ్వరాలయం ఇంకాస్త మెట్లెక్కితే సంతాన ఆంజనేయ స్వామి నిలబడి చిన్న గణపతి ఆశీర్వదించ
ఇక్కడ హనుమంతునికి పై కప్పు లేదు కాని విగ్రహము కప్పెంత పెద్ద వెండి ఆంజనేయ స్వామి (తొడుగు లాంటిది). పవనపుత్రుని ఆశీర్వాదము దొరికింది కాని నిజరూపం కనపడలేదు
వగ్గాణి వేడి పుగ్యాలు తిని ఆత్మారాముడిని శాంతించాము
పాత కోట ఆయుధగారాలున్నాయి శివ మారుతి విగ్రహము వేణుగోపాలస్వామి మందిరం