Sunday, 12 May 2019

Amma

[12/05, 2:04 PM] venky HYD:
అమ్మకి మించిన దైవము లేదు
ఆలికి మించిన బంధము లేదు
గురువుకి మించిన జ్ఞానము లేదు
కవులకు మించిన కలము లేదు

[12/05, 2:05 PM] venky HYD:
అమ్మ నీవమ్మా మా యమ్మ నీవేనమ్మా మాఅమ్మా

నే ఊంగా ఉంగా అంటే ఓలమ్మో నీవు ప్రపంచమే గెలిచినట్టున్నాదే!
నవ మాసాలు మోసావు భారమైన
వికారాలు ఎన్ని ఉన్న తిన్నావు పులుపులే
విహారాలు అన్ని మానేసావు పిలుపులు ఎన్ని ఉన్న
నడకలో ఇబ్బందులే ఉన్న మంచి నడతలే నేర్పావు

అమ్మ నీవమ్మా మా యమ్మ నీవేనమ్మా మాఅమ్మా

[12/05, 2:07 PM] venky HYD:
మాతృదేవోభవ అని పెద్ద పీట వేసారు తల్లికి మన పూర్వీకులు!
తల్లికి మించిన దైవం ఉన్నదా అన్నారు మన పెద్దలు అమ్మని!
అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, అన్నారు సిరివెన్నెల!
నవమాసాలే కాదు నవపదుల వరకు మోసేది అమ్మే!
Wishes on Mother's day to who are already and those who are yet to be.

[12/05, 2:15 PM] venky HYD:
అమ్మ ప్రేమ ఎంతంటే

మొదటి సారి నన్నెత్తుకున్నపుడు అమ్మ మనసులోని ఆనందమంత

మొదటి సారి నేను అమ్మ అన్నపుడు అమ్మ మొములోని ఆశ్చర్యమంత

మొదటి సారి నేను బడికి వెళ్ళి నపుడు అమ్మ పడ్డ కంగారంత

మొదటి సారి అమ్మ చేతి మొట్టికాయ తిన్న తీయదనమంత
       వేం*కుభే*రాణి
Happy Mother's Day in advance.

[12/05, 2:16 PM] venky HYD:
అమ్మేరా నీ తొలి గురువు
అమ్మేరా నీ ప్రియ నేస్తం
అమ్మేరా నీ ఇష్ట దైవం
అమ్మేరా సర్వము సర్వస్వం
అమ్మ అమ్మేరా బిడ్డ.
              వేం*కుభే*రాణి
Wishes on Happy Mother's Day.


[12/05, 2:17 PM] venky HYD:
అమ్మ చేతి వగ్గాని ఎంత చక్కని
మిర్చి పుగ్యాలతొ ఎంచక్కగా
సద్దన్నం అయినా పచ్చడి పొడులతొ
పరమాన్నం అయినా దద్దొజనం అయినా

అమ్మ అమ్మేరా బిడ్డ.
Happy Mother's Day in advance.

[12/05, 2:20 PM] venky HYD:
తల్లి ప్రేమను మరపించే ఇల్లాలి వాత్సల్యము ఉంటే వీడినా ఆ తల్లి సంతోషిస్తుంది!
మైమరపించే అందం కోసం Parentsని వీడితే పిల్లలు కూడా హర్షించరు!

Make every day Happy Mothers day.

Mother [24-04-2030]
నవ మాసాలు మోసే నను కన్న తల్లి!
నవ పదుల వయసైనా మోసే నను కన్న భూమి తల్లి!
నవ రసాలు నా జీవితంలో నిండుగా మోసే నా తెలుగు తల్లి!
నవ ధాన్యాలు పండించి జీవజలం నా ఆరోగ్యం మోసే కృష్ణా గోదావరి తల్లి!

[17/09 07-24] Happy birthday amma 
అమ్మను మించిన దైవము ఇలలో ఉన్నదా! 
అమ్మను మించిన కావ్యము కవిలో ఉన్నదా!

బువ్వన చిలుకును అమృత ధారలు నిండుగా
కష్టము తెలుపదు ఎవ్వరు మహిలో ఉన్నదా!

అన్నియు తానై నిలబడు గోడలు అడ్డుగా
ఓడలు బండ్లై విరిగిన మదిలో ఉన్నదా!
 
డేగలు వచ్చిన రక్షణ ఇచ్చును నీడగా
హాయిగ పిల్లలు శిక్షణ బడిలో ఉన్నదా!

పూజలు చేయును అందరి క్షేమము కోరగా
దేవత నీవని తెలిసిన గుడిలో ఉన్నదా!

త్యాగము అన్నది అణువున మేనులొ మెండుగా
అయినను తానే చెప్పదు 'రాణి'లో ఉన్నదా!
[9/5/2021, 8:23 AM] venky HYD: రుబాయిలు 18 నా దగ్గర అమ్మ ఉన్నది! జగతిలోన నన్ను కన్నది! చూచినావ ఇంత ప్రేమను కరుణ మమత నిండి విన్నది! రుబాయిలు 19 అమ్మను కని నాన్న కిచ్చిన అమ్మమ్మ ఎంత గొప్పదో! చెల్లిని కని నాకు సంతోషాన్నిచ్చి అమ్మ గొప్పదో! ఇంటిల్లిపాదినీ సమంగా చూసుకుంటూ ముందుకు కళలను వెనక్కి నెట్టిన అమ్మ మరింకెంత గొప్పదో! రుబాయిలు 20 జీవులెల్ల అమ్మ ప్రేమను చవిచూడరా! ప్రతి మనిషిలోని అమ్మను నీవు చూడరా! దైవము కాంచుట యోగులకే కష్టము మరి కళ్ళెదుట అమ్మ దైవ అదృష్టం కదరా! వేం*కుభే*రాణి [9/5/2021, 1:55 PM] venky HYD: కామవరం ఇల్లూరు వేంకటేష్ శీర్షిక: అమ్మ 111 ఇష్టపది అమ్మ ప్రేమను చూడ ఆభరణము యింటికి జీవులెల్ల అమ్మకు చేయవలె సేవలను ప్రతి మనిషిలో నీవు ప్రతిమ అమ్మను చూడు దేవుళ్లకు దొరకని దివ్యత్వం మాతయు కాంచుటెంత దైవము కష్టము యోగులకే కళ్ళెదుట అమ్మయే కదరా అదృష్టమ్ము దివిలో దేవుడు మరి భువిలో తల్లి కదా తానుండలేకనంత సృష్టించెను అమ్మ 10-09-2021 చీకటిలో వెలుగై వెలుగులో తేజమై తేజంలో సూర్యుడై అమ్మ నీవు మాకు తోడు నీడై దాహంలో చినుకై చినుకులో మేఘమై మేఘంలో వర్షమై అమ్మ అన్ని వేళలా నీవు ఆసరా ఎండలో నీడనై వానలో గొడుగువై కష్టంలో తోడువై అమ్మ నీవు ఎల్లప్పుడు మాకు ప్రేమవై [11/02, 10:49 PM] venky HYD: అమ్మ చేతి ముద్ద నాన్న ప్రేమంత కద్దు అమ్మ చేతి ముద్ద నొప్పులన్ని రద్దు అమ్మ చేతి ముద్ద బిర్యాని కూడ వద్దు అమ్మ చేతి ముద్ద అమృతమే హద్దు [15/02, 8:30 AM] venky HYD: తానంత ఉండలేనని అమ్మను సృష్టించెను, పెద్దల నుడి. దేవుని దగ్గరకు చేరి సృష్టించెను శూన్యము నాలో ముడి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదనేది ఉన్న నానుడి. అడిగినా ఆగకుండ వెళ్లి పోయే అమ్మ, మనలను వీడి. నన్నెవరు ఏమనే వారు కాదు, నువ్వంటే భయపడి. ఎదురొడ్డి నిలబడతా నిన్నెవరైనా అంటే మౌనం వీడి. 18-02-2022 ఓం! నమో వేంకటేశాయనమః శ్వాస చేరి గాంధర్వ మాయె మౌనం వీడి మంత్రం ఆయె పలుకు కూడి జపం ఆయె క్షణాలు జారి జ్ఞాపకమాయె నడక మారి కాలమాయె నవ్వులు పూసి పూవులాయె పిలుపు బాణి పాటలాయె వేం*కుభే*రాణి 19-02-2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘ మాస, బహుళ పక్షం, తిథి తదియ. అమ్మకు అంజలి, నీ పాదములకు కుసుమాంజలి, ఈ గీతాంజలి. 26-06-2022 మా అమ్మ మళ్లీ కూతురుగా పుడతాను అంటే మళ్లీ కూతుర్ని కనాలి! ఇంటిలో లక్ష్మి కళ కళగా ఉండాలంటే కూతుర్ని కనాలి! పండుగలు జరపాలంటే కూతుర్ని కనాలి! పేరంటాలు వ్రతాలు జరగాలని అంటే కూతుర్ని కనాలి! పెంచిన అమ్మను పెంచాలని అనుకుంటే కూతుర్ని కనాలి! వంశపు విలువలు పెరగాలను కుంటే కూతుర్ని కనాలి! తల్లి దగ్గర నేర్చుకొనేది మిగిలి ఉంటే కూతుర్ని కనాలి! ముచ్చట్లు మురిపాలు తీరాలంటే కూతుర్ని కనాలి! మానవాళి మనుగడ తరించాలంటే కూతుర్ని కనాలి! వేం*కుభే*రాణి Happy Daughters day wishes to all 06/05/23 కాలుపై లాల పోసినావు పీఠమై కాలికి మొక్కినా తీరదు ఋణము పాలు పోసి పూజించినా తక్కువే తన రక్తం పాలుగా చేసి పెంచిన తల్లి దిష్టి తీసి నజర్ హటావ్ కన్నెర్రజేసి ఉపవాసం ఉండి మొక్కులు తీర్పి వండిన కష్టము మర్చే మేం తినగా అమ్మ అను పిలుపుకే మురిసి పో.. పేగులన్నియు కదిలినా మురిసెనే కడుపున తన్నిన కుదుపు కదిలి వికటించి వాంతులైనా తినెనే పెనవేసుకున్న బంధం ఆకలి తల్చి 10/05/23 జాబిలిని చూపి తినిపించిన తల్లి తారవై చేరినావు నింగిన జాలి లేక కవి కాదు, మునుపెన్నడూ పాడని తల్లి మధురమైన లాలిపాట పాడి హాయిగా పరమాత్మకే తల్లి కావాలని భువికేగి ఋషులు పుణ్య పురుషులు తపస్సు చేయ గంగలో మునిగినా రాదురా అంత పుణ్యము అమ్మకు సేవచేయు అదృష్టం పూర్వజన్మ సుకృతమ్ 12/05/23 అమ్మకో రోజు కావాలా ప్రతి రోజు అమ్మదే కదరా అమ్మ లేకపోతే గడవదే రోజు అమ్మ ఉంటే ప్రతి రోజు పండుగే!