Friday, 8 June 2018

Munnar trip

ఎలా మొదలు పెట్టాలో తెలియదు.  ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్. కోచి మున్నార్ తేక్కడి అలెప్పి.

గాడ్స్ ఓన్ కంట్రీ అని ఉరకే రాలేదు ఆ పేరు కేరళకు. కోచికు ట్రైన్ లేదా విమానం ద్వారా వెళ్ళవచ్చు. ముందుగా ప్యాకేజీ తీసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఎంత మంది ఉన్నామో దానికి తగినట్లుగా వెహికల్ వచ్చేస్తుంది కరెక్ట్ టైమ్ కి విమానాశ్రయానికి. 

అక్కడ నుంచి మున్నార్ కు వెళ్ళె దారిలో మనము జలపాతలను, మేఘాలతో కప్పిన కొండలు, పచ్చటి లోయలు, ఎత్తైన చెట్లు చూడవచ్చు. మేఘాలు కొండలను ఎక్కి నట్లుంది, జలపాతాలు రా రమ్మని, ఆ చెట్లు దారికి ఇరువైపులా తోరణాలు కట్టి స్వాగతం పలుకుతుంది.

      Munnar

మేఘాలు కొండలను ఎక్కి నట్టున్నాదే
పచ్చని చెట్ల తోరణాలు అడుగడుగునా ఉన్నట్లు ఉన్నదే!
మలుపులు వయ్యారంగా సైగలు చేస్తున్నట్లు ఉన్నదే!
జలపాతాలు కవ్వించి కౌగిట చేరమన్నట్లు ఉన్నదే!


మున్నార్ కు దగ్గరగా వచ్చినప్పుడు తేయాకు తోటలు కొండల అంచు వరకు, ఒక ప్యాట్రన్ లో ఉండి కనువిందు చేస్తాయి. ప్రతి కొండ ఒక కాన్వాస్ లా, ఒక పేంటర్

కొచ్చి నుండి మున్నార్ కు వచ్చిన తర్వాత, కొన్ని మలుపులు లోయలో తిరిగిన తర్వాత వచ్చింది మా రిసార్ట్స్. చలికాలం చెలి కన్న చల్లగా ఉంది వాతావరణం. తొందరగా వేడి వేడి రోటీలు తిని దుప్పటి కప్పుకుని పడుకున్నాము. విచిత్రమో మాయో ఏసీ కాదు కదా ఫాను కూడా లేదు. దీని బట్టి చూస్తే సంవత్సరంలో 365 రోజులు చల్లగానే ఉంటుంది.

Munnar trip

కొండలపై తేయాకు తివాచీలు పరిచినట్లు ఉన్నదే!
రాజ రవి వర్మ పచ్చటి కుంచెతో చిత్రాన్ని గీసినట్లు ఉన్నదే!
పాత కొండల ముడతలు కొత్త రోడ్లతో బ్లష్ చే‌సినట్లు ఉన్నదే!
హైదరాబాద్ ఎండలు తప్పే మున్నార్ లోను ట్రాఫిక్ తప్పలేదే!

మరుసటి రోజు ఉదయం లేచి కిటికీ లో చూస్తే కొండ మాయమై మేఘాలతో కప్పబడి ఉంది. ఉదయం 8-00 అయినా కూడా ఎండ రాలేదు. రిసార్ట్స్ వాళ్ళు ఇచ్చిన Buffet breakfast లాగించి, లోయలో నుంచి పైకి వచ్చి Dream land adventure Park కు వెళ్లి